గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 59వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

59  అగ్రాహ్యముల్ విడిచి సుగ్రాహ్యముల్ గొను, సమగ్రంపుమార్గ సుగతిన్

శ్రీ గ్రామ దేవతగ నుగ్రాకృతిన్ విడిచి యీ గ్రంథమున్ గొనుమిఁకన్.

సుగ్రాహ్యమౌ కవితనగ్రేసరుండనుచు నగ్ర స్థితుల్ పొగడ నన్,

స్వగ్రాహ్యముల్ పొదిగి యీ గ్రంథమందుమిట సద్గ్రాహ్యవై నిలు, సతీ!

భావము.

ఓ సతీ మాతా! గ్రహింప రానివి విడిచిపెట్టి, గ్రహింప 

తగినవి పూర్తి సన్మార్గ సుగతితో నీవు గ్రహింపుము తల్లీ! మంగళప్రదవైన 

గ్రామ దేవతగా నీవు నీ భయంకరాకారమును విడిచిపెట్టి, ఈ నా 

గ్రంథమును ఇంక స్వీకరింపుము. మంచిగా గ్రహింపదగిన కవితలలో 

ఘనుఁడనని గొప్పవారు నన్ను పొగడునట్లుగా నీ నుండి గ్రహింపదగిన 

విషయములను ఈ నా రచనలో చొప్పించి, ఈ గ్రంథమును మంచిని 

గ్రహించు తల్లివై స్వీకరింపుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.