31, డిసెంబర్ 2024, మంగళవారం
అవధాన కళానిధి శతావధాన విద్వన్మరాళ శ్రీ ఆముదాలమరళి గారి అష్టావధానం తే.30 - 12 - 2024. నేరెళ్ళమెట్టలో. సెంట్ మార్క్స్ గ్రామర్ హైస్కూల్ లో.
0 comments
30, డిసెంబర్ 2024, సోమవారం
సంతోషక్షతయే పుంసా. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. సంతోషక్షతయే పుంసా - మాకస్మిక ధనాగమః ౹
సరసాం సేతుభేదాయ - వరషౌఘః స చ న స్థిరః ౹౹
తే.గీ. అధిక ధనమకస్మాత్తుగా నమరెనేని
యున్నసంతోషమును మాపునన్న నిజము,
కోరకుండనే వర్షంబు కుండపోత
పడినచో గట్లుతెగిగొట్టి పాడుచేయు.
భావము. అకస్మాత్తుగా మనిషికి ధనం వస్తే సంతోషం దూరం అవుతుంది.
అలాగే నిరీక్షణ చేయకుండా వచ్చే వాన ప్రవాహము చెరువు గట్టులను
పడగొడతాయి..అలాంటివి ఎప్పుడూ స్థిరం కాదు.
జైహింద్.
29, డిసెంబర్ 2024, ఆదివారం
పాతబస్తీ గోపాలకృష్ణ ఆలయంలో ఆ సాంఘిక కార్యకలాపాలు...
0 comments
భారత దేశానికి ఆ పేరు ఎంత పురాతనమైనదో మరుగునపడ్డ అసలు చరిత్ర తెలుపు వీడియో.
0 comments
పెట్టుకో నీవు బొట్టు. శుభాళికి నీకిది మెట్టు.
0 comments
పుస్తకం వనితా విత్తం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. పుస్తకం వనితా విత్తం - పర హస్తం గతం గత:
అధవా పునరా యాతి - జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:
తే.గీ. పుస్తకంబు, వనితయును, పూజ్యమైన
ధనము పరులచేతికిఁ జిక్క, తరలిపోవు
చేతులవిమారి, మరలవి చేరెనేని,
జీర్ణముగనయి, భష్ఠమై, సిధిలముగనె.
భావము. పుస్తకం, స్త్రీ , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరుల చేతిలో
పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా.
సర్వ నాశన మయిపోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ.
( స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావం ఇక్కడ గ్రహించాలి).
జైహింద్.
గజానాం మంద బుధ్ధిశ్చ. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. గజానాం మంద బుధ్ధిశ్చ - సర్పాణా మతి నిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం - త్రిభిర్లోకోపకారకమ్.
తే.గీ. ఏనుగులమందబుద్ధియు, నిలను నాగు
పాములకునతినిద్రయు, బ్రాహ్మణులకుఁ
జూడ నైక్యత లేకుంట మూడునివ్వి
లోకమునకుపకారమే, శ్రీకరుండ!
భావము. ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం,
బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !
జైహింద్.
అపి స్వర్ణ మయీ లంకా. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. అపి స్వర్ణ మయీ లంకా - న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ - స్వర్గాదపి గరీయసి.(రామాయణము)
తే.గీ. లక్ష్మణా!స్వర్ణపూర్ణమే లంక కనఁగ,
నైననున్ నాకు రుచియింప దనుపమమగు
జననియున్ జన్మ భూమియున్ సమము చూడ
స్వర్గమును మించి గొప్పవి జయనిధాన!
భావము. సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు
నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు
స్వర్గం కంటె గొప్పవి కదా !
జైహింద్.
అణుమాత్ర మనస్తస్మా. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. అణుమాత్ర మనస్తస్మా - దాశా నామ లతోద్గతాl
తస్యా నాలముపఘ్నాయ - భువనాని చతుర్దశ ll
తే.గీ. మనసు కాంచగ నణువంత మసలు దాని
యందుఁ గోరిక లత, తా నమందగతిని
యెదుగుచుండును గన చాల వెదుగు దానిఁ
గాయఁ బదునాల్గు లోకముల్,కమల నయన!
భావము. మనసు అనేది ఒక అణువంతది. ఆ మనసులో ఆశ అనే లత
పెరుగుతుంది. అది విశాలంగా అల్లుకోవడానికి పదునాలుగు లోకాలు చాలవుగదా!
జైహింద్.
ధనమార్జాయ కాకుత్స్థ. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. ధనమార్జాయ కాకుత్స్థ ! - ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి - నిర్ధనస్య మృతస్య చ.(రామాయణము)
తే.గీ. ధనమునార్జింపుమో రామ ధరణిపైన,
ధనమె మూలము జగతిలో, దానిలోనఁ
గలుగు నాంతర్యమును గను ఘనతరముగ,
ధనము లేమిచో మృతతుల్యుడనగనొప్పు.
భావము. ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతోనే
లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి.
ధనం లేని వాడు మృతునితో సమానం.
జైహింద్.
అహింసా పరమో ధర్మ:. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. అహింసా పరమో ధర్మ: - తథా2 హింసా పరం తప:
అహింసా పరమం ఙ్ఞానం - అహింసా పరమార్జనమ్.(మహాభారతం)
తే.గీ. పరమధర్మ మహింసయంచరయవలయు,
పరమ తపమహింసయే నిరుపమమది,
జ్ఞానమనగ నహింసయే కనఁగ మనము,
గొప్ప సాధనమె యహింస, కువలయమున.
భావము. అహింస గొప్ప ధర్మము. అదే గొప్ప తపము. అదే మంచి ఙ్ఞానము. అదే గొప్ప సాధనము.
జైహింద్.
సత్యమేవ జాయతే నాఽనృతః. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. సత్యమేవ జాయతే నాఽనృతః - సత్యేన పంథా వితతో దేవయానః
యేనాక్రమన్త్యృషయో హ్యప్తకామా - యత్ర తత్ సత్యస్యా పరమం నిధానమ్.
తే.గీ. సత్యమేజయించును కాదసత్యమెపుడు,
దేవమార్గము పెరుగును దీని వలన,
తీరు కోరికల్ దీనిచే, దివ్యమునులు,
దీనిచే ముక్తిఁ గనుదురు తృప్తిఁబడసి.
భావము. "సత్యం మాత్రమే విజయం సాధిస్తుంది, అసత్యం కాదు. సత్యం ద్వారా,
దైవిక మార్గం విస్తరించబడింది, దీని ద్వారా కోరికలు పూర్తిగా నెరవేరిన ఋషులు
అంతిమ సత్యం యొక్క మూలాన్ని చేరుకుంటారు."
జైహింద్.
పితా ధర్మః పితా స్వర్గః. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. పితా ధర్మః పితా స్వర్గః - పితా హి పరమం తపః |
పితరి ప్రీతిమాపన్నే - ప్రియతే సర్వదేవతాః ||
(పద్మ పురాణ శ్లోకం 1.50.9)
తే.గీ. తండ్రి ధర్మంబు, స్వర్గమున్ దండ్రి ధరను,
తండ్రి సేవయే మనలకు తపము తలఁప,
తండ్రి మన సేవలను గొని తనిసిరేని
దేవతాళియు నెంతయు తృప్తినొందు.
భావము. తండ్రియే ధర్మము, తండ్రియే స్వర్గము, తండ్రియే పరమ తపము,
ఆతడు సంతోషపడితే సర్వదేవతలు సంతుష్టులౌతారు.
జైహింద్.
28, డిసెంబర్ 2024, శనివారం
సంస్కృతమహాసమ్మేళనం. संस्कृतमहासम्मेलनम् 2024 # |
0 comments
27, డిసెంబర్ 2024, శుక్రవారం
మాజీ భాతర ప్రథాని శ్రీ మన్మోహన్ సింగ్ కన్నుమూత.
0 comments
ఓం నమశ్శివాయ.
ఇక్షోరగ్రాత్ క్రమశః . ... మేలిమిబంగారం నమ సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. ఇక్షోరగ్రాత్ క్రమశః - పర్వణి పర్వణి యథా రసవిశేషఃl
తద్వత్ సజ్జనమైత్రీ - విపరీతానాం తు విపరీతాll
(భోజప్రబన్ధః)
తే.గీ. కణుపు కణుపున తీపిని కలిగి యుండు
ఘనత పెరుగుచున్ జెరకున, ఘనులతోడ
స్నేహమట్టులే వృద్ధియౌన్, నీచ జనుల
స్నేహము విరుద్ధమిందుకు, చిద్విభాస!
భావము. "చెఱకు చివరినుంచి మొదటివరకు కణుపు కణుపునా ఎట్లు
రసవిశిష్టముగనుండునో సజ్జనులతోడి స్నేహము అట్లే క్రమవృద్ధిగనుండును.
దుర్జనులతో మైత్రి దానికి విరుద్ధముగానుండును."
జైహింద్.
26, డిసెంబర్ 2024, గురువారం
అవుసుల భానుప్రకాశ్ 'కశ్పి' ఆవిష్కరణోత్సవం.
0 comments
స్థానేష్వేవ నియోక్తవ్యా. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. స్థానేష్వేవ నియోక్తవ్యా - భృత్యా ఆభరణాని చl
న హి చూడామణిః పాదే - ప్రభవామీతి బధ్యతేll
తే.గీ. సేవకులనాభరణములఁ జింతఁ జేసి
యుండుటకు తగ్గ చోటునే యుంచవలయు,
చూడచక్కనంచెంచుచు వాడలేము
పాదములకుచూడామణిన్ పరవశించి.
భావము. సేవకులను, ఆభరణములను వారి వారి స్థానములందే ఉంచాలి.
"ఇది శ్రేష్ఠం" అని తలచి చూడామణిని పాదానికి బంధించముగదా!
అనగా ఎవరు ఏ హద్దులో ఉండదగినవారో వారిని ఆ హద్దులోనే ఉంచవలెను.
జైహింద్.
25, డిసెంబర్ 2024, బుధవారం
శ్రీ రావు పంగనామముల ఫౌండేషన్ మరియు నేషనల్ రీసోర్స డవలప్మెంట్ కోపరెటీవ్ సొసైటీ హైదరాబాదు వారి నుండి (లైఫ్ టైం ఎచ్చీవ్మెంట్ ఎవార్డ్) జీవిత సాఫల్య పురస్కారము పొందుచున్న శుభ సందర్భంలో బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మహోదయులుకు నా హృదయపూర్వక అభినందనలు.
0 comments
జైశ్రీరామ్.
జైహింద్.
24, డిసెంబర్ 2024, మంగళవారం
స్వశరీరే స్వయం జ్యోతిః . ... మేలిమి బంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. స్వశరీరే స్వయం జ్యోతిః - స్వరూపం సర్వ సాక్షిణం,
క్షీణ దోషాః ప్రపశ్యంతి - నేతరే మాయయావృతాః. (అన్నపూర్ణోపనిషత్. 4-36).
తే.గీ. దేహమందునె వెలిగెడి దివ్య మైన
సర్వసాక్షియౌ జ్యోతిని సాధు జనులు
పాపదూరులె చూతురు, పాప యుతులు
కానగాలేరు నిజమిది కమలనయన.
భావము.
తన శరీరమందే స్వయముగా ప్రకాశిస్తూ సర్వ సాక్షిగా ఉండే ఆత్మస్వరూపమును
దోషరహితులు మాత్రమే దర్శింపఁగలరు. మాయలో చిక్కినవారు దర్శింపలేరు.
జైహింద్.
శ్రీ అవుశుల భావుప్రకాశ్ గ్రంథావిష్కరణ సందర్భముగా నాకు సత్కారము.
0 comments
జైశ్రీరామ్.
సర్వం పరవశం దుఃఖం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. సర్వం పరవశం దుఃఖం - సర్వం ఆత్మవశం సుఖమ్ |
ఏతత్విద్యాత్సమానేన - లక్షణం సుఖదుఃఖయోః ||
తే.గీ. పరవశంబగు స్వధనంబు బాధపెట్టు,
మనవశంబగు మనదేను మనకు సుఖము
నిచ్చు నీవిషయంబునే నెఱుగి సుఖము
గొలుపునదినది కోరి చేయుచున్ గొనుము సుఖము.
భావము. మనదే అయినా ఇతరులు గనుక తీసుకుంటే, ఇక అది దుఃఖాన్నే
కలిగిస్తుంది. మనకు దక్కింది మాత్రమే సుఖాన్ని ఇస్తుంది. సుఖదుఃఖాలను
ఇలాగే నిర్వచించుకోవాలి. అంటే మనవద్ద లేనివాటికోసం దిగులు పడకూడదని,
ఉన్నవాటితో సంతృప్తిగా ఉండాలని భావం.
జైహింద్.
23, డిసెంబర్ 2024, సోమవారం
పుంభావ భారతీ బిరుదుప్రదానము ........ గ్రహీత చింతా రామకృష్ణారావు... ప్రదాత స్వర్ణ కంకణ-కవిగండ పెండేరపు సత్కార గ్రహీత. విద్వాన్ బ్రహ్మశ్రీ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు. ఎం.ఏ., విశ్రాంత సంస్కృతాంధ్రోపన్యాసకులు.
2 comments
జైశ్రీరామ్.
శ్రీ జగన్మాత ప్రేరణతో నేను సౌందర్యలహరిని తెలుఁగు పద్యములలోనికి అనువదించగా అది చదివి సహృదయ శిరోమణి విద్వాన్ బ్రహ్మశ్రీ చక్రాల లక్ష్మీకాంతరాజారావు మహోదయులు అత్యంత ఆనందభరితులై నాకు *పుంభావ భారతీ* బిరుదుప్రదానము చేయుచు వ్రాసిన అభినందన పంచరత్నములు.
అవధాన భారతి. సాహితీ చతురానన. ఛందో వైవిధ్యనిష్ణాత. ఛందస్సవ్యసాచి.
స్వర్ణ కంకణ-కవిగండ పెండేరపు సత్కార గ్రహీత.
విద్వాన్ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు. ఎం.ఏ.,
విశ్రాంత సంస్కృతాంధ్రోపన్యాసకులు.
పుంభావ భారతీ బిరుదుప్రదానము చేయుచు పంచరత్నములు.
కం. చింతా యను పద భావమె
చింతించుట యగును, మీరు చిత్తమునందున్
సంతతము చింత చేయుచు,
సంతసమున కావ్యమల్లు శక్తుండయితే.
కం. ఎన్నని వ్రాయుదురయ్యా!
ఎన్నగ మీ ప్రాయ మెంత? యెసగెడు చిత్తం
బున్నట్టి శక్తి సంపద
లున్నట్టి శరీర బలము లునికిన్ గనుమా!
కం. పద్దెములెన్నివిధంబులొ
యద్దెస మీ గమనముండు, నాలోచనముల్
తద్దిశ మెరయున్ గావ్యం
బొద్దికతో వ్రాయబోదురొక్క క్షణానన్.
కం. పుంభావ భారతీ యని
సంబోధనతోడ మిమ్ము చక్కగఁబిలుతున్
బింబోష్ఠివాణి ఘనధీ
సంబంధయుతుండవౌట సత్కవివర్యా!
కం. సొంపగునీ బిరుదమ్మున్
సొంపుగ నే నిచ్చుచుంటి సుందరమతితో
న్నింపుగ నను మన్నించుచు
కెంపుల మీ బిరుదపంక్తికిన్ జతనిడుడీ!
చక్రాల లక్ష్మీకాంతరాజారావు
19 . 10 . 2024.
సహృదయశిరోమణియైన బ్రహ్మశ్రీ చక్రాల లక్ష్మీకాంత రాజారావు గారి అవ్యాజానురగమునకు ఏవిధముగనూ ఋణము తీర్చుకోలేనివాఁడను. వారికి ధన్యవాదములు తెలియఁజేసుకొనుచున్నాను పాదాభివందనములర్పించుకొనుచున్నాను.
జైహింద్.
ఉత్థానేన జయేత్తన్ద్రీం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. ఉత్థానేన జయేత్తన్ద్రీం - వితర్కం నిశ్చయాజ్జయేత్|
మౌనేన బహుభాష్యం చ - శౌర్యేణ చ భయం త్యజేత్||
(మహాభారతమ్)
తే.గీ. యత్న మున సోమరితనంబు నణచవచ్చు,
శాస్త్ర నిశ్చయము వితర్క జయమొసంగు,
మౌనముననతివాగుడు మాయమగును,
శౌర్యమున పిరికితనము చక్కఁ బాయు.
భావము. ప్రయత్నం వలన సోమరితనాన్ని , శాస్త్రనిశ్చయం వలన
విపరీతతర్కాన్ని , మౌనం వలన అతివాగుడును , శౌర్యం వలన భయాన్ని
విడిచిపెట్టాలి.
జైహింద్.
22, డిసెంబర్ 2024, ఆదివారం
పురాణాల్లో ఉండే ప్రస్తుత నగరాలు.
0 comments
జైశ్రీరామ్.
1. అంగ రాజ్యం - కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).
2. అశోకవనం (9-311-వ.) - సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక
3. ఆయోధ్య (9-266-క.) - శ్రీరాముని జన్మస్థలం, - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.
4. కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).
5. కారుష రాజ్యము - దంతవక్రుని రాజ్యం, (9-722-వ.) - దాంతియ జిల్లా, మధ్యప్రదేశ్.
6. కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన (10.1-1639-ఉ.) స్థలం - గిర్నార్, గుజరాత్.
7. కిష్కింద - ఆంజనేయ పర్వతం, హనుమంతుడి జన్మస్థలం, (2) సుగ్రీవుని రాజ్యం, (3) ఋష్యమూక పర్వతం (9-271-వ. - తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర, కర్ణాటక
8. కుండినపురము - రుక్మిణిదేవి జన్మస్థలం, విదర్భ ముఖ్యపట్టణము, (10.1-1687-చ.) - కుండినపుర, మహరాష్ట్ర
9. కుంతి - పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు - గ్వాలియర్.
10. కుచేలుడు (10.2-965-సీ.) నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్.
11. కోసలదేశం(9-362-ఆ.) - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం
12. ఖాండవవనము / ఇంద్రప్రస్థము - పాండవుల రాజధాని, (1-361-క.) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.
13. గంగాసాగర్,- కపిల మహర్షి ఆశ్రమం, శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం. గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది (9-231-మ.), వెస్ట్ బెంగాల్
14. గంగోత్రి - భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం (9-230-వ.), ఉత్తరాఖండ్
15. చిత్రకూటం (9-267-క.) - సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.
16. చేది రాజ్యము - శిశుపాలుని రాజ్యం, (10.1-1697-ఉ.) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.
17. జనమేజయుడు సర్పయాగం (12-26-వ.) చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.
18. జరాసంధ్ కీ ఆఖరా జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్. (10.2-718-వ.)
19. దండకారణ్యం (9-268-ఉ.) - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.
20. ద్వారక - శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరము (10.1-1615-వ.) - ద్వారక,గుజరాత్.
21. నిషాద రాజ్యం (10.2-348-ఉ.) నల మహారాజు రాజ్యం - గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్.
22. నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం, ఆంధ్రప్రదేశ్.
23. నైమిశారణ్యం (1-39-వ.) వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు, పురాణాలు బోధించిన ప్రాంతం - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.
24. పంచవటి - శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం (9-269-సీ.) - నాసిక్, మహరాష్ట్ర.
25. పాంచాల దేశం - ద్రుపద మహారాజు రాజ్యం, (1-365-సీ.) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.
26. పాండవుల, లాక్షగృహ (3-14-క.) దహనం- వర్నాల్, హస్తినాపూర్.
27. ప్రతిష్టానపురము (9-32-వ.) పురూరవుని రాజధాని -ఝున్సి, అలహాబాద్.
28. ప్రభాస తీర్థం (11-87-సీ.) - శ్రీ కృష్ణ భగవానుడు అవతార పరిసమాప్తి జరిపిన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.
29. ప్రాగ్జ్యోతిష్యం - నరకాసురుని రాజధాని (10.2-156-వ.) - తేజ్ పూర్, అస్సాం.
30. మత్స్య దేశం (1-243-వ.) విరాట మహారాజు రాజ్యం -ఆల్వార్, గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్.
31. మద్ర దేశం - పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు, (3-62-మ.) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.
32. మధుర - కంసుని రాజధాని, (10.1-18-వ.) -మధుర, ఉత్తర్ ప్రదేశ్.
33. మహావిష్ణువు గజేంద్రుడిని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం (8-42-మ.) - గజేంద్ర ధామ్, దేవ్ ధాం, మానససరోవరము దగ్గరలో, నేపాల్.
34. మహీష్మతి పురము (9-434-క.) - కార్తవీర్యార్జునుని రాజధాని -మహేశ్వర్, మధ్యప్రదేశ్
35. మహేంద్రము (5.2-55-వ.) అను పర్వతం , పరశురాముడు తపస్సు చేసిన స్థలం - పశ్చిమ ఒరిస్సా
36. మిథిల - సీతాదేవి పుట్టినిల్లు (9-372-వ.) - జనక్ పూర్, నేపాల్
37. వాల్మీకి ఆశ్రమం (9-346-సీ.) - సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 50 కిలోమీటర్ల దూరములోని బితూర్.
38. విదర్భ - రుక్మిణిదేవి తండ్రి రాజ్యం, (10.1-1687-చ.) - విదర్భ, మహరాష్ట్ర
39. విభీషణుడు రాముని శరణు కోరిన (9-289-వ.) స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.
40. విరాటనగరము - పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం (1-243-వ.) - విరాట్ నగర్,రాజస్థాన్
41. వ్రేపల్లె / గోకులం - (10.2-186-వ.) గోకుల్, మధుర దగ్గర.
42. శమంత పంచకము (9-487-వ.) పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో అయిదు మడుగులు నెలకొల్పిన చోటు మరియు భీముడు దుర్యోధనుని చంపిన చోటు - కురుక్షేత్రము దగ్గర, హర్యానా
43. శోణపురము - బాణాసురుడి రాజధాని (10.2-318-వ.) - సోనిత్ పూర్, అస్సాం.
44. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు (9-288-క.) - రామేశ్వరము,తమిళనాడు
45. సరయూ నది (9-211-చ.) - ఈ నదీ తీరములోనే అయోధ్య నిర్మితమైనది - ఘాఘర నది.
46. సాళ్వ రాజ్యం - జరాసంధుని మిత్రులలో ఒకడు సాళ్వ దేశపువాడు, (10.1-1682-మ.) - కురుక్షేత్రము దగ్గర.
47. హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ,
48. హస్తినాపురము - కౌరవుల రాజధాని, పరీక్షిత్తుని రాజధాని, (1-78-వ.) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.
జైహింద్.
పితృభి స్తాడితో పుత్రః . ... మేలిమిబంగారం మన సంస్కృతి
0 comments
జైశ్రీరామ్.
శ్లో. పితృభి స్తాడితో పుత్రః ౹ - శిష్యస్తు గురు శిక్షితః ౹
ఘనాహతం సువర్ణం చ ౹ - జాయతే జనమండనమ్౹౹
తే.గీ. తల్లిదండ్రుల దండనవల్ల సంతు,
గురు సుశిక్షిత శిష్యుఁడు, నిరుపమముగ
భువి ఘనాహతమైనట్టి పుత్తడియును
కనగ జనమండనంబగు ఘనతరముగ.
భావము. తల్లిదండ్రులచే దండింపఁబడు సంతానము, గురువుచే
శిక్షితుఁడయిన శిష్యుఁడు, అలంకారముగా చేయఁబడునప్పుడు
సుత్తి దెబ్బలు తిన బంగారము సమాజములో అలంకారముగా అగుట నిశ్చయము.
జైహింద్.
అసమ్భావ్యం న వక్తవ్యం. ... మేలిమి బంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. అసమ్భావ్యం న వక్తవ్యం - ప్రత్యక్షమపి దృశ్యతే।
శిలా తరతి పానీయం - గీతం గాయతి వానరః॥
తే.గీ. వీటిలో రాయి తేలుట నీవు కనిన,
కోతి పాడుట వినినను నీతిఁ గనుము,
కంటికెదురిగా నీకది కనఁబడినను
పలుకఁబోకు మసంభవమ్ములను నీవు.
భావము. నీవు ప్రత్యక్షంగా చూచినప్పటికీ అసంభవమైన వాటిని ఎన్నడూ
ఇతరులతో చెప్పవద్దు. నీటిపై రాయి తేలింది. కోతి పాటలు పాడింది' అంటే
ఎవ్వరైనా నవ్వుతారేకాని నమ్మరు.
జైహింద్.
శ్రీ కుప్పా హైగ్రీవ వారి తండ్రిగారైన కుప్పా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.
0 comments
21, డిసెంబర్ 2024, శనివారం
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకరుల 22వ శతావధాన మహాసాహితీవిన్యాసం.
0 comments
ప్రస్తావసదృశం వాక్యం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. ప్రస్తావసదృశం వాక్యం - సద్భావసదృశం ప్రియమ్ ౹
ఆత్మశక్తిసమం కోపం యో - జానాతి స పండితః ౹౹
(చాణక్యనీతి ౧౪ - ౧౪)
తే.గీ. సమయమునకు తగిన మాట చక్కదనము,
మంచి భావనకు తగుచు మనెడి ప్రియము,
అవసరమున కోపించుట యనునవిగల
మనుఁజుడేపండితుండిల, మహితులార!
భావము. సమయానికి తగినట్టుగా చూడండి.సద్భావనము ఉన్నట్టుగా
ప్రియమైన పని, తన ఆత్మశక్తికి అనుగుణంగా ఉండే కోపం,వీటన్నింటిని
తెలిసిన వ్యక్తి ఎవరు ఉంటారో అతనే పండితుడు.
జైహింద్.
ఆడుతూపాడుతూ పిల్లలకు నేర్పండి. ... ఆధ్యాత్మిక ప్రశ్నోత్తరములు.
0 comments
జైశ్రీరామ్.
ఆడుతూపాడుతూ పిల్లలకు నేర్పండి.
1. భగవద్గీతను లిఖించినదెవరు?
=విఘ్నేశ్వరుడు.
2. భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?
= భీష్మ పర్వము.
3. గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?
=మార్గశిర మాసము.
4. గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?
=హేమంత ఋతువు.
5. ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వసంత ఋతువు.
6. భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?
=శ్రీకృష్ణుడు అర్జునునికి.
7. భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను?
=కురుక్షేత్ర సంగ్రామము.
8. భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను?
=కౌరవ పాండవులకు.
9. పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?
=అర్జునుడు.
10. వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?
=సామవేదము.
11. మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?
=పాంచజన్యము.
12. భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?
=పద్దెనిమిది (18)
13. “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?
= వినోబా భావే.
14. “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
= మహాత్మా గాంధీ.
15. భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?
= సంజయుడు.
16. సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=కుమారస్వామి.
17. మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?
=దేవదత్తము.
18. భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి?
= ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ.)
19. భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?
=నలుగురు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు.
20. ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= శ్రీరామచంద్రుడు.
21. భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?
=అచ్యుత, అనంత, జనార్ధన.
22. భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?
=ధనుంజయ, పార్ధ, కిరీటి.
23. శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి?
=గీతా గానం.
24. “ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?
=ఎడ్విన్ ఆర్నాల్డ్.
25. మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?
=పౌండ్రము.
26. ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=శంకరుడు.
27. “నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. కానీ అప్పటినుండి భగవద్గీత యను తల్లి ఆ స్ధానమును ఆక్రమించి, నా పక్కనే వుండి నన్ను కాపాడుచున్నది.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
=మహాత్మాగాంధీ.
28. భగవద్గీత ఏ వేదములోనిది?
=పంచమ వేదం-మహాభారతం.
29. భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది?
=11వ అధ్యాయము
30. ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=విష్ణువు
31. భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి?
=అర్జున విషాద యోగము.
32. భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు?
=పదివేలమంది.
33. మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?
=అనంతవిజయము.
34. భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?
= “ధర్మ” - శబ్దముతో గీత ప్రారంభమయినది.
35. ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు?
=సంజయుడు.
36. భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?
=దృష్టద్యుమ్నుడు.
37. ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వజ్రాయుధము.
38. మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహము పేరేమిటి?
=వజ్ర వ్యూహం.
39. గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?
=భీష్ముడు.
40. సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాసుకి.
41. అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= అనంతుడు.
42. మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి?
=సుఘోషము.
43. అర్జునుని ధనస్సు పేరేమిటి?
=గాండీవము.
44. జీవునకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను?
=నాలుగు. (బాల్యము, యౌవనము, వార్థక్యము, దేహాంతర ప్రాప్తి)
45. నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= గంగానది.
46. ఆత్మ యెట్టిది?
=నాశరహితమైనది.
47. కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమందురు?
=నిష్కామ కర్మ.
48. మనుజునకు దేనియందు అధికారము కలదు?
=కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలమునాశించుట యందులేదు.)
49. అర్జునుడు ఎవరి లక్షణములు-భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను?
=స్థితప్రజ్ఞుడు (జీవన్ముక్తుని లక్షణములు.)
50. వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీ కృష్ణుడు చెప్పెను?
= రావిచెట్టు.
51. పంచభూతములచే నాశనము పొందనిది ఏది?
=ఆత్మ.
52. మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి?
=మణిపుష్పకము.
53. ప్రపంచమున పూర్ణానందమెచట లభించును?
=ఆత్మయందు.
54. మహాభారత సంగ్రామంలో అర్జునుని రధము యొక్క జెండాపై గల వానరుడెవరు?
=హనుమంతుడు.
55. పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= గరుత్మంతుడు.
56. ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును?
=తాబేలు.
57. కర్మచేయుట మేలా, చేయకుండుట మేలా?
=చేయుటయే మేలు.
58. బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించునపుడు వారితో సహా మఱి వేనిని సృష్టించిరి?
=యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)
59. వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను?
=లోక క్షేమం కొరకు.
60. ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= కామధేనువు.
61. స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్ఠమైనది?
=స్వధర్మము.
62. పొగచేత అగ్నియు, మురికిచేత అద్దము, మావిచేత గర్భమందలి శిశువు కప్పబడి వున్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును?
=కామము చేత.
63. దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకొన్ననూ పాపమును చేయుచున్నాడు?
= కామము యొక్క ప్రేరణచే.
64. భగవంతుడెపుడు అవతరించును?
=ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధిపొందునపుడు.
65. అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ప్రహ్లాదుడు.
66. గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= చిత్రరథుడు.
67. హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివలన కలుగగలదు?
=జ్ఞానతపస్సు.
68. జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి?
=పరమశాంతి.
69. ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు?
=గాలిలేనిచోట గల దీపంతో.
70. ఏ సాధనములచేత మనస్సు నిగ్రహింపబడగలదు?
=అభ్యాసము, వైరాగ్యము.
71. భయంకరమైన మాయను దాటుట ఎట్లు?
=భగవంతుని శరణుపొందుట వలన.
72. భగవంతుని సేవించువారిని ఎన్నిరకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను?
=నాలుగు రకాలు (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని.)
73. భగవత్స్వరూపమును ఎవరు తెలిసికొనలేరు?
=అజ్ఞానులు.
74. విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది?
=బ్రహ్మవిద్య.
75. మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= భృగు మహర్షి.
76. బ్రహ్మవిద్యకు అర్హత యేమి?
=హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము.
77. ఆకాశమునందు వాయువు వలె, సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి యున్నది?
=పరమాత్మయందు.
78. గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు?
=పరమాత్మయందు అనన్యభక్తిచే.
79. ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు?
=భగవంతుని భక్తుడు.
80. సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు?
=సాక్షాత్తు పరమాత్మయే.
81. ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=మనస్సు.
82. పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను?
=మేరువు.
83. పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=బృహస్పతి.
84. వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=ఓం కారము.
85. యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను?
=జప యజ్ఞము.
86. ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఐరావతము.
87. గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఉచ్ఛైశ్శ్రవసము.
88. శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకమలుగా పేర్కొనబడెను?
= మూడు (సాత్విక, రాజస, తామసాహారము)
89. దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= నారదుడు.
90. సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=కపిల మునీంద్రుడు.
91. భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి?
= మోక్షసన్యాస యోగము.
92. లెక్కపెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= కాలము.
93. జలచరాలలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= మొసలి.
94. ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములేవి?
= సత్త్వ, రజ, తమో గుణములు.
95. వేగముగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాయువు.
96. భక్తియోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?
= 35.
97. విద్యలోల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఆధ్యాత్మ విద్య.
98. రాగద్వేష రహితముగా, తత్త్వ నిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాదము.
99. అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= "అ"-కారము.
100. భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను?
= అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)
101. మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= మార్గశిరము.
102. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?
= 20 (ఇరువది).
103. శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను?
= 26 (ఇరువదియాఱు).
104. శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను?
= 6 (ఆఱు).
105. తపస్సులెన్ని రకములు?
= మూడు (శారీరక, వాచిక, మానసిక)
106. పరబ్రహ్మమునకు ఎన్నిపేర్లు కలవు?
= మూడు (ఓమ్, తత్, సత్).
107. మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా?
= లేదు. కర్మలు చేయునపుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై వుండవలెను.
108. సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతాసంవాదమును నేరుగా (లైవ్) వినగలిగెను?
= వేదవ్యాసుడు.
జైహింద్.
20, డిసెంబర్ 2024, శుక్రవారం
కన్యాశుల్కం నాటకంపై బ్రహ్మశ్రీ పేరి రవికుమార్ గారి సమీక్ష సమాచారం పత్రికలో.
0 comments
జైశ్రీరామ్.
జైహింద్.
న విత్తందర్శయేత్ప్రాజ్ఞః. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. న విత్తందర్శయేత్ప్రాజ్ఞః - కస్య చిత్స్వల్పమప్యహో ౹
మునేరపి యతస్తస్య - దర్శనాచ్ఛలతేమనః ౹౹
తే.గీ. ధనమునించుకైననుగాని ధరను ప్రజకు
చూపుటొప్పదు ప్రాజ్ఞులు, సుగుణభాస!
ధనము కనినచో మునులకున్ దానిపైన
మనసు కలుగు చలించుచు, మాయణ్ జిక్కి.
భావము. తెలివయినవాఁడు ఎవరికీ కొంచం కూడా డబ్బుని చూపెట్టక్కూడదు.
డబ్బుని చూసిన వెంటనే ముని మనస్సుకూడా చంచలంగా మారుతుంది.
జైహింద్.
19, డిసెంబర్ 2024, గురువారం
ఆరస్సెస్స్ ప్రార్ధన గీతం | RSS Prayer Song | Namaste Sada Vatsa...
0 comments
శ్రీ వాడ్రేవు వేంకట సత్య ప్రసాదు గారింట జరిగిన శ్రీ డా. అక్కిరాజు సుందరరామకృష్ణ గారి అష్టావధానము.
0 comments
18-12-2024వ తేదీన మద్యాహ్నం 2గంటలకి
శ్రీ వాడ్రేవు వేంకట సత్య ప్రసాదు గారింట జరిగిన
శ్రీ డా. అక్కిరాజు సుందరరామకృష్ణ గారు
సాధనావధానంలో పూరణ చేసిన పద్యములు.
సంచాలకులు గా
శ్రీ ధూళిపాళ మహదేవమణిగారు నిర్వహించినారు.
ముఖ్య అతిథిగా
చిత్రకవితా సమ్రాట్ శ్రీ చింతా రామ కృష్ణారావుగారు అలరించారు
నిషిద్ధాక్షరి
అవధాన రాజహంస శ్రీ ముద్దురాజయ్య గారు
అంశం- శ్రీలలితాంబికను వర్ణించాలి
శ్రీ(వ)ర(మ)యి(మ)ర(స)యి(గ)నాన్ (వ )శ్రీ (న) తోన్..
యార (య)భి(ద)నా(ద)టన్- మ(ద)రి-(మ)-రి-యా(ట)పీ(య)లున్ లే....
కందము
శ్రీరయి రయినాన్ శ్రీతో
యారభి నాటన్ మరిమరి యాపీలున్ లే
శౌరికి పత్నివి నీవదె
మారుని మదిగన్నతల్లి మంగళ రూపా!
సమస్య
శ్రీ మాచవోలు శ్రీధర రావు గారు
పద్యమల్లుట సులభమ్ము పామరునకు
తే.గీ!
శారదాదేవి కృపయున్న చాలినంత
సరుకు లిచ్చును తప్పక చల్లగాను
మాటనమ్ముర నాదహోమాచవోలు
అమ్మ దయయున్న సత్యమ్ము నమ్ముమయ్య
*పద్యమల్లుట సులభమ్ము పామరునకు*
(ఆఖరి పాదమే సమస్య)
దత్తపది
శ్రీ వేంకట స్వామిగారు
అంశం
ప్రేమ- అనే పదమునునాలుగు పాదాలలోనూ వుంచుతూ
నాటి నేటి సినిమాలు.
ప్రేయసికి చాకు చూపుట పిచ్చి ప్రేమ
పిచ్చిమాటలు ప్రేలుట వింత ప్రేమ
గుడిని తాళిని కట్టెడి గొప్ప ప్రేమ
పాట పాడుట నానాడు ప్రేమ!!
వర్ణన
శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి
అంశం- మార్గశీర్ష మాసమంచు నిపూలవానగా మత్తచభంలో చెప్పాలి
అతివా! మార్గశిరంబె మంచుగదటే ఖ్యాతిని గనెన్ గాదటే
కుతుకం బొప్పగ విష్ణు పూజలను పెక్కుర్ సల్పరే మానినీ
ప్రతిరోజున్ మరి సుప్రభాతములలో భక్త్యాత్ములై యెల్లరున్
సతమా మంచునె పాలుగా దలుచుచున్ చక్రిన్ గొల్వరే!!
కవితాగానం
శ్రీక్రొవ్విడివెంకట రాజారావుగారు..
పౌరాణిక అంశాలని ప్రస్తావిస్తే ఆవధానిగారు సందర్భోచితంగా పద్యాలని అలవోకగాచెప్పారు
ఆశువు
శ్రీ కవిశ్రీ సత్తిబాబుగారు
అంశం-కపట సన్యాసి విన్యాసం
(వీరు తమ అంశాన్ని పద్యంలో అడిగారు)
కలిని నెప్పుడైరి కపట సన్యాసులు
వాణినాలయేడు క్షోణియందు
నిజము చూడ భళిర! నేర్పు మీరంగను
నధిక గౌరవంబు ఖ్యాతి గనిరి!!
*ఆశువు-2
అంశం- మాయాజలధినిదాటాలంటే ఏమి చేయాలి?
ఆ.వె మాయ సకల జగతి మాయరా నమ్మరా
సత్యమిద్ది నమ్ముసత్తిబాబు
శ్రీ హరినిని భక్తి సేవింప మెరుగురా
యిదియె మార్గమయ్య బుధవరేణ్య!!
ఆశువు-3
అంశం- కపటవిద్యాచరుడు
ఆ.వె! బొబ్లుపెట్టి మెడను పూసదండలువేసి
భక్తి పరుడు వోలె భావనమున
బ్రతుకు వాడెనిజము క్షితి పైన దొంగరా
సత్య మిద్దె నమ్ము సత్తి బాబు!!
ఛందోభాషణము
శ్రీ ధనికొండరవిప్రసాదు గారు
1--నిధి సుఖమా? రాముని స
న్నిధి సుఖమా?
జ కవివర విను నిక్కంబిదిరా
నిధి లేక బ్రతుకు గడుచున?
వ్యధపాలగు దలచిచూడ పండితవర్యా!!
ఆశువు-3
అవధానమ్ముల కొన్ని చేసితిరి కావ్య సృష్టిన్ చేసిరే?
భువిపై యాబది మూడు పుస్తకములన్ నే పొల్పార నే వ్రాసితే
స్తవనంబుల్ పలు చూపుచున్ వెల్గుగాక నవి మీ సామర్ధ్యమున్ జూపచున్
పవనాత్మజుడు నైనవాని కృపతో భాసిల్లిడిన్ సోదరా!!
అప్రస్తుత ప్రసంగము
శ్రీ సంచాలక చక్రవర్తి , ద్యుమణి శ్రీకటకం వేంకటరామశర్మ గారు
నిర్వహించినారు.
జైహింద్.
18, డిసెంబర్ 2024, బుధవారం
ఛందోభాషణం నాతో తమ్ముఁడు దత్తాత్రేయ ఎంతబాగా చేశాడో చూడండి.
0 comments
జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.🙏🏼
క్షిప్రావధాని శ్రీ మరుమాముల దత్తాత్రేయశర్మ.ఆర్యులారా!🙏🏼
👇🏼
ఛందోభాషణం నాతో తమ్ముఁడు దత్తాత్రేయ ఎంతబాగా చేశాడో చూడండి.౧.౩.పాదాలు నా పూరణ. ౨.౪. పాదాలు తమ్ముని పూరణ.
👇🏼
తరంగమాలిక ( రనరనరనర) యతి ౧ - ౭ - ౧౩.
👇🏼
పంచపాది వర భావనాధృతిని భవ్యమై తనరె సోదరా!
సంచితంబయిన సత్త్వసంపదలు సార్థకంబనెడు రీతిగా,
మంచిపద్యముగ మా సహోదరుఁడు మాకు నిచ్చె గద భారతీ!
మంచిమాత్రమిటు మానితంబుగను మాకొసంగెదరె, అన్నయా!
☝🏼
ఇలా నేను చెప్పగానే అలా తమ్ముఁడు చెప్పి నాపూరణ కోసం చూడ్డం నాకెంత ఆనందం కలిగించిందో మాటలలో చెప్పలేను.
తమ్మునకు ఆ అమ్మ కటాక్షం నిరంతరం ఇలాగే ఉండి అందరికీ ఆదర్శంగా ఉండేలా చేస్తూనే ఉండాలని ఆశిస్తున్నాను.🙏🏼
జైహింద్.
ఋణశేషోగ్ని శేషశ్చ. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. ఋణశేషోగ్ని శేషశ్చ - శత్రుశేషస్తథైవ చ !
పునః పునః ప్రవర్ధంతే - తస్మాచ్ఛేషం న రక్షయేత్!!
తే.గీ. ఋణము, నగ్నిని, శత్రువున్, మనము మిగుల
నీయరాదెప్పుడిలనున మేయమైగుచు
వృద్ధిచెందుట జరుగును శ్రద్ధతోడ
శేషరహితముల్ గావించి భాసిలుమయ!
భావము. ఋణశేషం, అగ్నిశేషం, శత్రుశేషం మరల మరల ప్రవృద్ధమౌతాయి.
అందువల్ల ఆమూడింటినీ మిగుల్చు కోరాదు.
జైహింద్.
సమస్య. *పద్యము పాతిపెట్టుడయ పండితలోకము సంతసించగన్.* దీనికి నా పూరణ.
1 comments
జైశ్రీరామ్.
ఉ. పద్యము హృద్యమై తనరి పామరపాళిని పండితాళిగా
సద్యశపూర్ణులైతనర చక్కఁగఁ జేయును, కావినన్ సదా
హృద్యముగా మనంబుల ననేకవిధంబుల నాటునట్లుగా
*పద్యము పాతిపెట్టుడయ పండితలోకము సంతసించగన్.*
మీరుకూడా పూరించి కామెంట్ చెయ్యండి.
జైహింద్.
అష్టావధానం/అవధాని శ్రీ మానేపల్లి నాగకుమార శర్మ గారు/ASHTAVADHANM/MANEPAL...
0 comments
శ్రీ మానేపల్లి నాగకుమార శర్మ మరియు శ్రీ ఇలపావులూరి శేషశ్రీధర్ శర్మల యుగళ అవధానం/ఒంగోలు/
0 comments
జిహ్వే! ప్రమాణం జానీహి. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. జిహ్వే! ప్రమాణం జానీహి - భోజనే భాషణేఽపి చ
అతిభుక్తి రతీవోక్తిః - సద్యః ప్రాణాపకారిణీ.
తే. పరిమితినిగను నాలుకా! భక్షణమున,
మాటలాడువిషయమున, మరచిపోకు,
మతిగ భుజియింప నారోగ్యమంరించు,
నతిగవాగున ప్రాణాలె యావిరగును.
భావము. ఓ నాలుకా! భోజనం విషయంలోనూ మాట్లాడే విషయంలోనూ
పరిమితిని తెలుసుకో. అతిగా తినడం, అతిగా మాటలాడడం ప్రాణాలను తీస్తాయి.
జైహింద్.
17, డిసెంబర్ 2024, మంగళవారం
లోకరక్షక,దక్షక,జీవశక్తి ,శక్తిదారక,వేదగోచర,పరమా,చరితార్ధ,దీవర,మనోహర,దామ,భువనైక,వశీకర,ధ్యానతా,శోభాయక,గర్భ"కీర్తి దామ"వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి జుత్తాడ,,
0 comments
జైశ్రీరామ్.
జైహింద్.