గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, ఆగస్టు 2015, సోమవారం

విజయ రహస్యము.

1 comments

జైశ్రీరామ్.

జైహింద్.

30, ఆగస్టు 2015, ఆదివారం

తెలుగు సాహిత్య కళా పీఠం వారు నిర్వహించిన తెలుగుభాషాదినోత్సవము.

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! తెలుగు సాహిత్య కళా పీఠం వారు ౨౯-౮-౨౦౧౫ న ముషీరాబాద్ జ్ఞాన సరస్వతీ మందిర ప్రాంగణమునతెలుగు భాషాదినోత్సవం చక్కగా నిర్వహించి సముచిత సత్కారాలు చేసి తెలుగు కవులగౌరవాన్ని పెంచారు.
ఈ సందర్భంగా నేను పఠించిన నా రచన..
1.ఉ. అక్కలు, చెల్లెళుల్, మరియు అన్నలు తమ్ములు, నేస్తగాండ్రు, పెం
పెక్కిన పాటగాండ్రు, మురిపించెడి కైతలనల్లు వారలున్,
ఠక్కున మంచి చెడ్డల నెడం గన తిన్నియ నున్నపెద్దలున్,
మక్కువ వెల్గుచుండిరిట. మంచిగ నా కయి మోడ్పులందుడీ!
2. షడరర చక్ర బంధ శార్దూలము
 ఇందు పైనుండి 3వ వృత్తములో రామకృష్ణ కవి, 6 వ వృత్తములో రామదాసు చిక్కా అని వచ్చును.
దివ్యా! రాణ్మణి రామచంద్రుఁడ! సుమేదిన్ సున్దరోష్ణప్రభా! 
భవ్యా! మన్మది మన్దిరస్థుఁడ! రమావైచిత్ర్య సత్ కల్పకా!
సవ్యా! కృష్ణ! మదార్తిహారుఁడ! సుధోత్స్రక్కావ్య సంవిత్ప్రభా
భావ్యా! మేదిని సంభవించు సదయన్! భానూత్సుకా! సత్యభా!
3. సీ. విరజాజి కుసుమాళి సరిపోలు ఘన వర్ణ సౌరభాన్విత తెల్గు జగతి వెల్గు
రమణీయ మహనీయ కమనీయ మధుపాళి రసరాగ రమ్య సుశ్రావ్య, తెల్గు.
తెలుగన్న నిలనున్న వెలుగన్న నిజమెన్ని తెలఁబోయి చూచిన తెల్లవారు
మరుగైన కవిపాళి సరిలేని ఘనకావ్యతతిఁ గాంచి ముద్రణోద్ధరణులైరి.
గీ. నన్నయాదిగ నేటి సినారె వరకు - రాజ మర్యాదలందిన రమ్యభాష 
గిడుగు రామ్మూర్తి మదినెంచి వెలుగు భాష - పద్య సాహస్ర కంఠుని హృద్య భాష.
4. మ. నర నారాయణు లెన్నుసంస్కృతిఁ గనన్ నాకస్థులౌ దేవతల్
మురిపంబొప్ప జనించి యాంధ్ర కృతులన్ ముద్దారగా చేసి, సం
స్కరణోద్భాసులు తెల్గువారలనుచున్ గావ్యంబులంజూపి, మా
ధురులం బంచిరి తెల్గు కావ్య కవితా ధుర్యాత్ములై భారతిన్.  
5. సప్తవింశత్యధిక ద్వివిధ కంద గీత గర్భ చంపక మాల.
విన తెలుఁగున్ భువిన్ చలువ వెన్నెల వెల్గులు జల్లుచుండునే!
కన విలువన్ మదిన్ వలచు కన్నెల పల్కులు పంచుచుండునే,
మును తెలియున్ గదా  మనకు పొన్నల తెల్గులు, మన్ననంబునన్
కను తెలుఁగున్ సదా కనఁగ కన్నుల వెల్గులు కాకపోవునో!       స్వస్తి.
ఈ విధంగా తెలుగు భాషాభిలాషతో నిరంతరం శ్రమిస్తున్న సాహిత్యకళాపీఠాన్ని మనసారా అభినందిస్తూ, ధన్యవాదాలు తెలియఁ జేస్తున్నాను.
జైహింద్.

ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎవరో మీకు తెలుసా?

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులార! ఎందరో మహానుభావులు తెలుగు భాషా సంసేవనాపునీత చరిత్రులు చరిత్రపుటలలో మనకు కనిపిస్తుంటారు. వారిలో మహా కవి దాసు శ్రీరాములుగారొకరు. 
దాసు శ్రీరాములనుపమతత్వ వేత్త,
మేటి సత్కావ్యకల్పనాధాటిఁ జూపి
తెలుగు భాషకునెనలేని దీప్తిఁ గొలిపె,
తెలుగు జనయిత్రి బిడ్డడుదివ్యుఁడిలను.
వారిని గూర్చిన సూక్ష్మపరిచయం చూడండి.

జైహింద్.

29, ఆగస్టు 2015, శనివారం

తెలుగు మాతృభాషా దినోత్సవము సందర్భంగా జరుపబడుతున్న అద్భుతమైన కార్యక్రమం.

1 comments

జైశ్రీరామ్.

ఆర్యులారా! తెలుగు మాతృభాషగా కలిగి సంతోషించేవారందరికీ నా అభినందనలు. శుభాకాంక్షలు.
తెలుగు భాషా వైతాళికుఁడు గిడుగురామమూర్తిగారి జన్మదినమును తెలుగు మాతృభాషాదినోత్సవంగా జరుపుకొంటున్నందులకు మనం గర్వపడుతున్నాము.
మన భాషకు ప్రపంచ స్థాయిలోనే చక్కని గౌరవం చిరస్థాయిగా ఉండేలాగ చేసేందుకు మన భాషాభిమానులు తప్పక ప్రయత్నిస్తుంటారు. అట్టి వారికి నా కైమోడ్పులు.
అట్టి వారిలో హాస్య బ్రహ్మ బిరుదాంకితులు శ్రీమాన్ శంకర నారాయణ గారొకరు. ప్రపంచ దేశాలలో మన తెలుగువాడిగా హాస్య బ్రహ్మగా మన పతాకం ఎగురవేసి తెలుగు ప్రజలందరికీ గర్వ కారణంగా  నిలిచారు.
ఆ మహనీయునిచే  "హాస్య మేథా యాగము" పేరుతో అత్యద్భుతమైన కార్యక్రమం ముషీరాబాద్ గాంధీ హాస్పటల్, ఎదురుగా ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతీ మందిరమున ఈ సాయంత్రం ఐదు గంటలకు జరగబోతోంది. ఔత్సాహికులు ఈ సదవకాశం సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాను.
ఈ కార్యక్రమంతో పాటు కవిసమ్మేళనంలో తెలుగు తేజం శ్రోతల ఆనంద హేతువు కాగలదు.
ఈ కార్యక్రమములను సహస్రపద్య కంఠీరవ బిరుదాంకితులైన శ్రీ చిక్కా రామదాసు గారి అధ్యక్షతన నిర్వహింపఁబడుచున్న "తెలుగు సాహిత్య కళా పీఠము" అను సాహితీ సంస్థ నిర్వహిస్తోంది. 
సాహితీప్రియులందరికీ అహ్వానం తెలియజేయడమైనది.
జైహింద్.

శ్రీకృష్ణ దేవరాయలవారి 506 వ పట్టాభిషేకదినోత్సవము. మియాపూర్. భాగ్యనగరము.

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీకృష్ణ దేవరాయలవారి 506 వ పట్టాభిషేకదినోత్సవమును శ్రీ గుత్తి(జోళదరాశి)చంద్రశేఖర రెడ్డిగారు జే.పీ.నగర్, మియాపూర్ లో 07-08 - 2015 వ తేదీన కడు రమ్యముగా నిర్వహించిన సందర్భముగా తీసిన దృశ్యమాలికను వీక్షించండి.
శ్రీకృష్ణ దేవరాయలవారి విగ్రహారాధన.
సభాసదులు.
కన్నడకవి శ్రీ శేష శాస్త్రిగారికి జరుగుచున్న సత్కృతి
కృష్ణ దేవరాయలు వంశమునకు చెందిన రాణీ చంద్రకాంతా దేవి గారికి జరుగుచున్న సత్కృతి
సభాధ్యక్షులు శ్రీ సత్యనారాయణ గారికి జరుగుచున్న సత్కృతి.
తెలుగు సాహిత్య కళా పీఠ కార్యదర్శి శ్రీ పట్టాల గారికి జరుగుచున్న సత్కృతి.
సభలో గంభీరోపన్యాసము చేయుచున్న ప్రముఖ వక్త శ్రీ చినవీరభద్రుఁడు గారు.
జైహింద్.

28, ఆగస్టు 2015, శుక్రవారం

శ్రీ వరలక్ష్మీ వ్రత మాహాత్మ్య కథ! పద్య రచన. శ్రీ గుండు మధుసూదన్!

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు శ్రావణ మాసమునందు  పౌర్ణమికి ముందు వచ్చే వరలక్ష్మీ శుక్రవారము. పరమ పవిత్రమైన పండుగ రోజు.
ఈ సందర్భముగా యావజ్జనానీకానికి శుభాకాంక్షలు తెలియఁ జేస్తూ, ఆ వరలక్ష్మీదేవి యొక్క కృపకు పాత్రులవాలని మనసారా కోరుకొంటున్నాను.
ఈ సందర్భముగా శ్రీ గుండు మధుసూదనరావుగారు రచించిన వరలక్ష్మీ  వ్రత మాహాత్మ్యము కథను పద్యములలో చూచి ఆనందించండి.
మధుసూదనరావుగారికి అభినందన పూర్వక కృతజ్ఞతలను తెలియఁ జేసుకొంటున్నాను.
పద్య రచన. శ్రీ గుండు మధుసూదన్! 
ఆ.వె.
సకల దేవతాళి సంస్తుతించుచునుండఁ
జేరి పార్వతియును, జిఱునగవుల
శివుఁడు తనదు భస్మసింహాసమ్మునఁ
గొలువు దీఱఁ, బతినిఁ గోరెనిట్లు! (1)
ఆ.వె.
“స్వామి! స్త్రీలు సకల సౌఖ్యసౌభాగ్యముల్,
పుత్రపౌత్రవృద్ధిఁ బొందునట్టి
వ్రత మొకండుఁ దెలిపి, వ్రతవిధానమ్మును
జెప్పుమయ్య నాకుఁ జిత్త మలర!” (2)
కం.
సతి కోరఁగ విని, శివుఁడును
హిత మిత వాక్యముల ననియె, “హే పార్వతి! నీ
వతి వినయమునను గోరితి;
కుతూహల మ్మెసఁగ వినుము కోరిక తీఱన్! (3)
తే.గీ.
మగధదేశానఁ గుండిన మనెడి పట్ట
ణమున నొక ద్విజ, ‘చారుమతి’, మతి దధిజ,
పద్మ పదపద్మ సక్త సద్భక్తి హృదయ,
ఘన పతివ్రత, సద్వంద్య కలదు; వినుము! (4)
కం.
ఒకనాఁడు స్వప్నమందున
సకల ధనము లొసఁగు తల్లి, సాక్షా ద్రమయే
ప్రకటిత మాయెను సరగున
వికసిత కరుణా హృదబ్జ విలసితమణియై! (5)
తే.గీ.
“చారుమతి! నన్నుఁ బూజింపు, శ్రావణమునఁ
బౌర్ణమికి ముందునన్ శుక్రవారమందు!
సకల సౌభాగ్య సంతాన సౌఖ్యతతులఁ
గూర్చుదానను నమ్ముమో గుణవిశాల!” (6)
ఆ.వె.
అనుచుఁ బలికి మాయమాయె నా మాతయ;
చారుమతియు లేచి, సంతసించి,
“వరము లొసఁగు తల్లి! వరలక్ష్మి! కరుణించి,
మమ్ముఁ బ్రోవు మమ్మ! నెమ్మి నిమ్మ! (7)
కం.
హే మాతా! సంపత్కరి!
శ్రీ! మా! నారాయ ణీంది! సింధుజ! లక్ష్మీ!
నేమమున నిన్నుఁ గొలుతును;
నీ మనమున మమ్ముఁ గరుణ నెసఁగఁగ గనుమా!” (8)
తే.గీ.
అనుచుఁ బరిపరి విధముల వినుతి సేసి,
పతికి, నత్తమామలకును నతివ తెలుప;
సంతసమ్మున విని, వారు సమ్మతించి,
“వ్రతము సలుపంగ వలె” నని పలికి రపుడు! (9)
కం.
ఇది విన్న యూరి సుదతులు
ముదమున మది మెచ్చి యంతఁ బున్నమి మున్నై
యెదురుపడు శుక్రవారము
గదురన్ శ్రావణమునందు ఘనమగు వేడ్కన్! (10)
తే.గీ.
“పద్మకరి! సర్వలోకైకవంద్య! లక్ష్మి!
దేవి! నారాయణప్రియాబ్ధితనయ! నమ”
దేవి! నారాయణ ప్రియాబ్ధిజ నమామి
యనుచు, వారలు చారుమతిని గలసియుఁ
జేరి వరలక్ష్మి పూజను జేసి రపుడు. (11)
తే.గీ.
తొలి ప్రదక్షిణచే నందియలును మ్రోగె;
మలి ప్రదక్షిణఁ గంకణములు మెఱసెను;
కడ ప్రదక్షిణ సర్వాంగ ఘటిత భూష
ణ యుతలైరి! సంపదలె యందఱి గృహాల!! (12)
తే.గీ.
పఱఁగ వరలక్ష్మి కరుణించి పడతులకును
సంపదలు ధాన్య సౌఖ్య సత్సంతతులను,
నాయురారోగ్య భోగ్య సన్మాన్యములను
దగఁ బ్రసాదించె! వ్రత ఫలితమ్ము దక్కె!! (13)
కం.
సతి వింటివె యీ కథ! నే
సతి పతు లిది విన్న మఱియుఁ జదివిన, లక్ష్మీ
సతి, తా నొసఁగును సకలము,
లతి శుభముల నిచ్చుఁ గాత మనవరతమ్మున్! (14)
(ఇది వరలక్ష్మీ వ్రతమాహాత్మ్య కథ)

27, ఆగస్టు 2015, గురువారం

కృతి ఛందము. శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

26, ఆగస్టు 2015, బుధవారం

తెలుఁగు సాహిత్య కళా పీఠం. జరుపుచున్న తెలుగు భాషా దినోత్సవము.

6 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! తే.29-8-2015. తెలుగు భాషా దినోత్సవము సందర్భముగా 
సహస్ర పద్య కంఠీరవ బిరుదాంకితులైన 
శ్రీ చిక్కా రామదాసు 
ఆధ్వర్యవములో నిర్వహింపఁబడుచున్న 
తెలుగు సాహిత్య కళా పీఠము, 
సాయంత్రం5 గంటలకు 
గాంధీ హాస్పటల్ సమీపమున ఉన్న
 జ్ఞాన సరస్వతీ దేవలయ ప్రాంగణమున 
తెలుగు కవి సమ్మేళనము నిర్వహించుచున్నది.
తెలుగు సాహిత్యాభిలాషులందరూ ఆహ్వానితులే.
జైహింద్.

25, ఆగస్టు 2015, మంగళవారం

కృతి ఛందము. శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్
జైహింద్.

24, ఆగస్టు 2015, సోమవారం

కృతి ఛందము - శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝల కవి పరిశీలన కృతి ఛందమును పరిశీలించండి.
జైహింద్.

23, ఆగస్టు 2015, ఆదివారం

నూతన ఛందో నక్షత్ర మాలికా విన్యాసము. శ్రీవల్లభ

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝల కవి కృత నూతన ఛందో నక్షత్ర మాలికా విన్యాసము తిలకించండి.
జైహింద్.

22, ఆగస్టు 2015, శనివారం

బృహతీ ఛందము. శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝల కవి పరిశోధనలోని బృహతీఛందమును పరిశీలించండి.
జైహింద్.

21, ఆగస్టు 2015, శుక్రవారం

అష్టదళ పద్మ బంధ వసంత తిలకము. రచన శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల కవి కృత  అష్టదళ పద్మ బంధ వసంత తిలకము తిలకించండి.
జైహింద్.

20, ఆగస్టు 2015, గురువారం

సమవృత్తములందు ౮ వది - శ్రీ వల్లభ.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

౯.బృహతీ ఛందము - శ్రీ వల్లభ, (౫౫)

1 comments

జైశ్రీరామ్
జైహింద్.

బృహతీ ఛందము. శ్రీ వల్లభ 56-57

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

౯.బృహతీ ఛందము - శ్రీ వల్లభ (౫౩)

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

వినయ బింబ మృగీ వృత్త గర్భ మత్తేభము. రచన శ్రీవల్లభ.

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝలకవి కృత వినయ బింబ మృగీ వృత్త గర్భ మత్తేభము తిలకించండి.
జైహింద్.

19, ఆగస్టు 2015, బుధవారం

బృహతీ ఛందము. శ్రీ వల్లభ

4 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల కవి పరిశ్రమలో బృహతీఛందము పరిశీలించండి.
జైహింద్.

బృహతీ ఛందము. శ్రీ వల్లభ 50.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

18, ఆగస్టు 2015, మంగళవారం

బృహతీ ఛందము పరిశోధన. శ్రీ వల్లభ,

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝలకవివరులు చేసిన బృహతీఛందము పరిశోధనా ఫలము పరిశీలించండి.
జైహింద్.

17, ఆగస్టు 2015, సోమవారం

కృతి ఛంద వృత్త పరిశోధన, శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝల అప్పలనరసింహ కవి చేసిన.కృతి ఛంద వృత్త పరిశోధన తిలకించండి. 
జైహింద్.

16, ఆగస్టు 2015, ఆదివారం

బృహతీ ఛందము . శ్రీవల్లభవఝల.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝలవారు వివరించిన బృహతీ ఛందమును తిలకించండి.
జైహింద్.