గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, డిసెంబర్ 2016, శనివారం

శ్రేయస్కరా శ్రీధరా. ౧౭ - ౨౪ / ౧౦౮. రచన . . . బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ కవి.

1 comments

జైశ్రీరామ్.
(సశేషమ్)
జైహింద్.

31 - 12 - 2007 న ఆవిష్కరించిన యువతరంగం - కళాశాల విద్యార్థుల ద్వైమాసిక పత్రిక.

1 comments

జైశ్రీరామ్.
 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చోడవరం, (విశాఖపట్టణం జిల్లా)లో నేను తెలుగు ఉపన్యాసకుఁడుగా విధులు నిర్వహించే రోజులలో విద్యార్థుల సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు వీలుగా  లిఖిత ద్వైమాసపత్రిక "యువతరంగం" పేరుతో ప్రారంభించినాను. విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇచ్చే సహృదయులైన మహనీయులకీ విషయం తెలిపి, వారి ఆశీర్వాదం అర్థించేవాడిని. వారు పత్రిక చదివి, ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులతోపాటు ఆ పత్రికలో ప్రచురితమైన రచయితలైన విద్యార్థులకందరికీ ఆరితోషకం ఇచ్చేవారు. నా ఉద్యోగ జీవితంలో విజయానికి ఇది ఎంతగానో సహాయపడటమే కాక, అనేకమంది విద్యార్థులు ర్ర్ ప్రోత్సాహంతో ఎంతగానో అభివృద్ధిపొంది నేడు చక్కని ఉద్యోగాలు చేసుకొంటూ ఆదర్శ భారతీయులుగా జీవిస్తున్నారు. 2005 నుండి 2008 వరకు నిరాఘాటంగా ఈ ప్రక్రియను కొనసాగించగలిగాను. 30-6-2006ని నేను పదవీ విరమణ చేసిననాడు కూడా ఒక పత్రిక విడుదలచేయడం జరిగింది. దురదృష్ట వశాత్తు ఆ పత్రిక అప్పటితో ఆగిపోయింది.
31 - 12 - 2007 న ఆవిష్కరించిన యువతరంగం - కళాశాల విద్యార్థుల ద్వైమాసిక పత్రిక.
ఉత్సాహవంతులైన విద్యార్థులే ఈ పత్రికా నిర్వహణబు కొనసాగించగలిగితే ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. ఆదైవ కృప ఎలాగుందో తెలియదు.
నమస్తే.
జైహింద్.

30, డిసెంబర్ 2016, శుక్రవారం

శ్రేయస్కరా శ్రీధరా. ౯ - ౧౬ / ౧౦౮. రచన . . . బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ కవి.

1 comments

జైశ్రీరామ్.
(సశేషమ్)
జైహింద్.

29, డిసెంబర్ 2016, గురువారం

శ్రేయస్కరా శ్రీధరా. ౧ - ౮ / ౧౦౮. రచన . . . బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ కవి.

0 comments

 జైశ్రీరామ్.
(సశేషమ్)
జైహింద్.

28, డిసెంబర్ 2016, బుధవారం

రమణిత సద్బుధావృత్తము. . . . రచన. శ్రీ వల్లభ,

0 comments

జైశ్రీరామ్.

27, డిసెంబర్ 2016, మంగళవారం

శ్రీకీర్తితాది వృత్త చతుష్టయ గర్భ శ్రీకీర్తిత వృత్తము. రచన. శ్రీ వల్లభ,

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

26, డిసెంబర్ 2016, సోమవారం

నేవపు వృత్త పంచక గర్భ శ్రీకీర్తిత వృత్తము. రచన. శ్రీ వల్లభ,

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

25, డిసెంబర్ 2016, ఆదివారం

తానిలాది వృత్త చతుష్టయ గర్భ శ్రీకీర్తిత వృత్తము. రచన. శ్రీ వల్లభ,

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

24, డిసెంబర్ 2016, శనివారం

ప్రియతమ ఆంధ్రామృత పాఠకాళికి నా ధన్యవాదములు.

9 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! ఆంధ్రామృత పాఠకులైన మీ అందరి ప్రోత్సాహం నా చేత యాదాద్రి శ్రీనృసింహశతకరచనను చేయించిమ్ది. ఆ శతకమును చదివిన ప్రజాపత్రిక యాజమాన్యం వారి పత్రికలో ఈ శతకం విషయం ప్రస్తావించింది. 
ఈ విషయం మీముందుకు తేవడం, ప్రోత్సాహకులైన మీ అందరికి నా ధన్యవాదాలు తెలియజేయడం నా ధర్మంగా భావించి ఆ పత్రికా ప్రచురణ మీముందుంచుచున్నాను.
ప్రత్యక్షంగా పరోక్షంగా నా కవితాపాటవానికి మూలమైన 
మీ అందరికీ ఈ విధంగా నన్ను ప్రోత్సహించుచున్న ప్రజాపత్రిక వారపత్రిక యాజమాన్యమునకు, దూరవాణిద్వారా నన్నభినందించుచున్న మహనీయులందరికి, నా ధన్యవాదాలు తెలియఁ జేసుకొంటున్నాను.
జైహింద్.

23, డిసెంబర్ 2016, శుక్రవారం

కని(కా)వరము. . . . రచన. శ్రీ వల్లభ,

0 comments

జైశ్రీరామ్.
 జైహింద్.

22, డిసెంబర్ 2016, గురువారం

సికింద్రాబాద్ అష్టావధానం - తేదీ : 26.12.2016 సాయంత్రం - 5 గంటలకు.

2 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

21, డిసెంబర్ 2016, బుధవారం

నిజాన్ని నిర్భయంగా . . . . ఒక సామాన్యుఁడు.

1 comments

జైశ్రీరామ్.

జైహింద్.

20, డిసెంబర్ 2016, మంగళవారం

శ్రీ మంగమేశ్వరు మంగళాశాసనము. ఫలశ్రుతి. . . . రచన శ్రీ వల్లభ,

1 comments

జైశ్రీరామ్.

19, డిసెంబర్ 2016, సోమవారం

శ్రీ వేంకటేశ్వర స్తోత్రము.ఆంధ్ర శుప్రభాతము. . . . రచన. శ్రీ వల్లభ,

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

18, డిసెంబర్ 2016, ఆదివారం

రక్షిత, వాంఛిత, సురాశ్రిత గర్భూషిత వ్త్తము. . . . రచన. శ్రీ వల్లభ,

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

17, డిసెంబర్ 2016, శనివారం

కాల విభాగము.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! చూచారా ఈ అనంత కాలంలో మన జీవన ప్రమాణం ఎంత చిన్నదో. చూడండి.
చూచారు కదా! ఆశ్చర్యం వేస్తోంది కదూ?
ఇంత తక్కువ జీవనావలాశాన్ని మాత్రమే పొందిన మనం ఆ జగన్మాతలో ఐకఒం ఐపోగలిగేటంతటి సత్ఫలితాన్ని సాధించే అవకాశం ఇచ్చిన ఆ పరమాత్మ ఎంతటి దయామయుఁడు! 
ఇంతటి మహదవకాశన్ని మనం అనవసర విషయాసక్తితో వృధా చేసుకుంటే అంతకు మించిన అవివేకం వేరే ఉంటుందా? అలోచించండి. సన్మార్గ ప్రవృత్తి చాలు ఆ అమ్మ మనలను తనదగ్గరికే చేర్చుకోవడానికి. సత్ప్రవర్తనతో సమయాన్ని సద్వినియోగం చేసుకొంటూ జన్మకు సార్థకత కల్పించుకుందాం
జైహింద్.

16, డిసెంబర్ 2016, శుక్రవారం

ఆదిత్య హృదయం.

1 comments

జైశ్రీరామ్.
ఆదిత్య హృదయం.
తతోయుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్
ఉపాగమ్యబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి:

అగస్త్య ఉవాచ:
రామరామ మహాబాహొ శృణు గుహ్యం సనాతనమ్
యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి    
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్
జయావహం జపేనిత్యం అక్షయం పరమం శివం
సర్వ మంగళ మాంగల్యం సర్వపాపా ప్రణాశనమ్
చింతాశోకప్రశమనం మాయుర్వర్ధనముత్తమమ్
రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతమ్
పూజయాస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్
సర్వదేవాత్మకో హ్యేష తీజస్వీ రశ్మిభావనః
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభి:
ఏష బ్రహ్మచ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతి:
మహేంద్రో ధనదః కాలో యమ స్సోమో హ్యపాంపతి:
పితరో వాసవ: స్సాధ్యా హ్యస్వినౌ మరుతో మను:
వాయ్తుర్వహ్ని: ప్రజాప్రాణ: ఋతుకర్తా ప్రభాకరః
ఆదిత్య: స్సవితా సూర్యః ఖగః పూషా గభస్తీమాన్
సువర్ణసదృశో భాను హిరణ్యరేతా దివాకరః
హిరిదశ్వః సహస్రార్చి: సప్తసప్తిర్మ్మరీచిమన్
తిమిరోన్మథన: స్శంభు: స్త్వష్టా మార్తాండ అంశుమాన్
హిరణ్యగర్భ స్సిశిర తపనో భాస్కరో రవి:
అగ్నిగర్భో దితే: పుత్రా: స్శంఖ స్శిశిరనాశనః
వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజు:స్సామపారగః
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీధీ ప్లవంగమః
ఆతపీ మండలీ మృత్యు: పింగళ:స్సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజా: రక్త స్సర్వభవోద్భవః
నక్షత్రగ్రహతారాణా అధిపో విశ్వాభావనః
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః
జ్యోతిర్గణానాం పతయే  దినాధీపతయే నమః
జయాయ జయ భద్రాయ హర్యశ్యాయ నమోనమః
నమో నమ: స్సహశ్రాంశో ఆదిత్యాయ నమోనమః
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమోనమః
నమః పద్మప్రభోదాయ మార్తాండాయ నమోనమః
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే
క్రుతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః
తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మనే
సమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే
నాశయత్యేష వై భూతం తథైవ సృజతి ప్రభు:
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభిస్తిభి
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టితః
ఏష ఏవాగ్నిహొత్రం చ ఫలం చైవాగ్నిహొత్రిణామ్
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవి: ప్రభు:
ఏనమాపత్సు క్రుచ్చ్రేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కస్చిన్నావసీదతి రాఘవ
పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్
ఏతత్  త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి
అస్మిన్ క్షణే మహాబాహొ రావణంత్వం వదిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్  
ఏతచ్చ్రుత్వా మహాతేజా నష్టశోకోభవత్ తధా
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోభవత్
అథ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహ్రుష్య మాణః
నిశిచరపతిసంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి
సూర్యం సుందర లోకనాధ మమృతం వేదాన్ తసారం శివం
జ్ఞానం బ్రహ్మమయం సురేషమమలం లోకైక చిత్తం స్వయం
ఇంద్రదిత్య నరాదీపం సురగురుం త్రైలోక్య చూడామణిమ్
విష్ణుబ్రహ్మశివస్వరూపహృదయం వందే సదాభాస్కరం
భానో భాస్కర మార్తాండ చండరష్మే దివాకర
ఆయురారోగ్య మైస్వర్యం విద్యాం దేహి నమోస్తుతే
తాత్పర్యము.
ఆనాటి యుద్ధానంతరము అలసి విశ్రాంతిలో ఉన్న రాముడు మరల రావణుని పై యుద్ధము గురించి ఆలోచనలు కలిగి చింతలో యుండగా,  ఇతర దేవతలతో కలసి యుద్ధము తిలకిస్తున్న అగస్త్య మహాముని రాముని ఇలా సంబోధించెను.
ఓ దశరథ కుమారా! గొప్ప బాహువుల కల రామా! ఈ రహస్యమును వినుము. దీని వలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును గాక!
ఈ ఆదిత్య హృదయము వలన పుణ్యము, శత్రు నాశనము కలుగును. దీనిని పఠించుట వలన జయము, శుభము, శాశ్వత పరము కలుగును.
ఈ ఆదిత్య హృదయము అత్యంత శుభకరమైనది, సంపూర్ణమైన సౌభాగ్యమును కలిగించునది. అన్ని పాపములను నాశనము చేయునది. చింత, శోకము, ఒత్తిడి మొదలగు వాటిని తొలగించి ఆయుర్వృద్ధి కలిగించునది. 
పూర్తిగా ఉదయించి ప్రకాశాకుడైన, దేవతలు, రాక్షసులచే పూజించ బడిన, తన ప్రకాశాముచే లోకాన్ని ప్రకాశింప చేసే ఆ భువనేశ్వరుని పూజించుము.
సూర్య భగవానుడు సర్వ దేవతల యందు కలవాడు, తేజస్వి, తన కిరణములచే లోకాన్ని ముందుకు నడిపే వాడు. తన శక్తితో దేవతలను అసురులను, సమస్త లోక జీవరాశికి జీవము కలిగించి కాల చక్రాన్ని ముందుకు నడిపే వాడు.
ఆ సూర్య భగవానుడే బ్రహ్మ, విష్ణువు, శంకరుడు, సుబ్రహ్మణ్యుడు, ప్రజాపతి, ఇంద్రుడు, కుబేరుడు, కాలుడు, యముడు, సోముడు, వరుణుడు.
ఆయనే పితరుడు, వసువు, సాధ్యుడు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రాణము, ప్రభాకరుడు, ఆరు ఋతువులను కలిగించే వాడు.
సూర్య భగవానుడు అదితి పుత్రుడు, విశ్వకర్త, కార్యములకు ప్రేరణ కలిగించే వాడు, ఆకాశము, వివిధ లోకముల యానము చేసేవాడు, స్థితికారకుడు, బంగారు కాంతితో ప్రకాశించే వాడు, దినకరుడు.
సూర్య భగవానుడు తన కిరణములతో ప్రకాశిస్తూ సర్వ వ్యపకుడైన వాడు. ఆయన సప్తేంద్రియములకు మూల శక్తి, అంధకారమును పోగొట్టేవాడు, ఆనందాన్ని, శుభాన్ని కలిగించే వాడు, సర్వ క్లేశములు తొలగించి జీవ చైతన్యము నింపేవాడు.
సూర్య భగవానుడు త్రిమూర్తుల రూపములో వ్యక్తమైన సనాతనుడు, దినమునకు కారకుడు, బ్రహ్మకు గురువు, అగ్ని గర్భుడు, అదితి పుత్రుడు, శంఖమును ధరించిన వాడు, నీరసమును తొలగించి మానసిక ఉత్తేజమును కలిగించే వాడు.
సూర్య భగవానుడు ఆకాశానికి అధిపతి, అంధకారాన్ని తొలగించే వాడు, సకల వేద పారంగుడు, కుబేరునికి, వరుణునికి మిత్రుడు, వర్ష కారకుడు. ఆయన వింధ్య పర్వతములను దాటి బ్రహ్మ నాడిలో క్రీడిస్తున్నాడు.
సూర్య భగవానుడు వృత్తాకారములో, పచ్చని కాంతితో, తీక్షణమైన కిరణములతో తాపమును కలిగించే వాడు. లయకారకుడు, విశ్వమంతా వ్యాపించి యున్నవాడు, మహాతేజము కలవాడు, రక్త వర్ణుడు, సమస్త చరాచర సృష్టి స్థితి లయకారకుడు.
సూర్య భగవానుడు నక్షత్రములు, వాటి సమూహములకు, గ్రహములకు అధిపతి. విశ్వములో ప్రతి వస్తువుకు మూలము, తేజస్సు కల్గిన వారికి కూడా తేజస్సును కలిగించే వాడు. ద్వాదశాదిత్య రూపములలో కనిపించే ఆ సూర్యునికి నమస్కరించుము.
తూర్పున, పడమరన ఉన్న పర్వతములకు నమస్కారములు (వాటిపై నుంచి సూర్య భగవానుడు ఉదయించి అస్తమిస్తాడు కాబట్టి). తారా గణములకు, దినమునకు అధిపతి అయిన సూర్య భగవానునికి నమస్కారములు.
జయమును కలిగించే, దాని వలన కలిగే సంపదను, శుభంను కాపాడే సూర్య భగవానునికి నమస్కారములు. వేయి (అనంతమైన) కిరణములు కలిగిన ఆదిత్యునికి నమస్కారములు.
ఉగ్రుడు, వీరుడు, అమిత వేగముగా ప్రయాణించే సూర్య భగవానునికి నమస్కారములు. తన ఉదయముతో పద్మములను వికసింప చేసే వాడు, మార్తాండుడు (తీక్షణమైన తేజము కలవాడు) అయిన ఆదిత్యునికి నమస్కారములు.
బ్రహ్మ, విష్ణు మహేశ్వరులకు అధిపతి, వర్చస్సు కలవాడు అయిన ఆ సూర్యునికి నమస్కారములు. ప్రకాశించేవాడు, శక్తిమంతుడు, అన్నిటినీ దాహించేవాడు, తీక్షణమైన రుద్ర రూపము కల ఆదిత్యునికి నమస్కారములు.
సూర్య భగవానుడు అంధకారాన్ని తొలగించే వాడు, భయమును తొలగించే వాడు, శత్రు నాశనము చేసేవాడు, సర్వ వ్యాప్తమైన ఆత్మ స్వరూపుడు. క్రుతఘ్నులను నాశనము చేసేవాడు, దేవుడు, నక్షత్ర గ్రహ కూటమికి అధిపతి అయిన ఆ సూర్యునికి నమస్కారములు.
కరిగించిన బంగారము కాంతి కలవాడు, అగ్ని రూపుడు, సర్వ జ్ఞాన ప్రకాశకుడు, విశ్వ కర్మ, అంధకారమును తొలగించేవాడు, రుచి, లోకానికి సాక్షి అయిన సూర్యునికి నమస్కారములు.
సమస్త సృష్టిని నాశనము చేసి మరల సృష్టించేవాడు, నీటిని ఆవిరి చేసి, మరల వర్షరూపములో మనకు ఇచ్చే ఆ గగన మండల అధిపతి అయిన సూర్యునికి నమస్కారములు.
సూర్య భగవానుడు సుషుప్తావస్థలో (నిద్రా సమయములో) యున్న జీవరాశి హృదయములో జాగ్రదావస్థలో ఉండేవాడు, అగ్నిహోత్రములోని అగ్ని మరియు ఆ అగ్నిహోత్ర ఫలము తానే యైన వాడు.
సూర్య భగవానుడు వేద సారుడు, క్రతువులు, వాటి ఫలము తానెయైన వాడు, ఈ సమస్త జగత్తులో అన్ని క్రియలకు కారణభూతుడు, ప్రభువు.

ఫల శృతి:
రాఘవా!  ఈ స్తోత్రమును ఆపద సమయములలో, బాధలు, కష్టములు కలిగిన సమయములో, దిక్కుతోచక యున్నప్పుడు, భీతితో యున్నప్పుడు పఠించుట వలన ధైర్యము, స్థైర్యము కలుగును.
రాఘవా! దేవ దేవుడు, జగత్పతి యైన సూర్య భగవానుని ఏకాగ్ర చిత్తముతో పూజించుము. ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించుట వలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును.
ఓ మహా బాహువులు కల రామా! నీకు ఈ క్షణము నుండి విజయమే. రావణుని వధించుము. అని చెప్పి అగస్త్యుడు తన యథా స్థానమునకు వెళ్ళెను.
ఇది విన్న రాముడు శోకమును, విచారమును వీడి, ప్రీతుడై, ధైర్యం పొందెను.
రాముడు సూర్యుని వైపు ఏకాగ్రతతో చూస్తూ ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించి సచ్చిదానందు డయ్యెను. మూడు మార్లు ఆచమనము చేసి శుద్దుడై ధనుర్బాణములు ధరించెను.
రావణుడు యుద్ధమునకు వచ్చుట చూచి, ధైర్యముతో రాముడు రావణుని సంహరించుటకు సమస్త శక్తులు ఒడ్డుటకు కృత నిశ్చయము చేసుకొనెను.
అప్పుడు, దేవతా సమూహముతో యుద్ధము తిలకించుచున్న సూర్యుడు, రావణుని మరణ సమయము ఆసన్నమైనదని గ్రహించి, తనవైపు చూస్తున్న రామునిపై సంతుష్టుడై, ప్రసన్నమైన వదనముతో, రామా! ముందుకు సాగుము!  అని పలికెను.
 జైహింద్., 

15, డిసెంబర్ 2016, గురువారం

శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రమ్.

0 comments

జైశ్రీరామ్

విష్ణుసహస్రనామస్తోత్రమ్.
పూర్వపీఠిక

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే || ౧ ||

యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరః శతమ్ |
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వకసేనం తమాశ్రయే || ౨ ||

వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ || ౩ ||

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః || ౪ ||

అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే |
సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే || ౫ ||

యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్ |
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే || ౬ ||

ఓమ్ నమో విష్ణవే ప్రభవిష్ణవే |

శ్రీవైశంపాయన ఉవాచ-
శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః |
యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత || ౭ ||

యుధిష్ఠిర ఉవాచ-
కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణమ్ |
స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవాః శుభమ్ || ౮ ||

కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః |
కిం జపన్ముచ్యతే జంతుర్జన్మసంసారబంధనాత్ || ౯ ||

శ్రీ భీష్మ ఉవాచ-
జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమమ్ |
స్తువన్నామసహస్రేణ పురుషః సతతోత్థితః || ౧౦ ||

తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయమ్ |
ధ్యాయన్స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ || ౧౧ ||

అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరమ్ |
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్ || ౧౨ ||

బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనమ్ |
లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవమ్ || ౧౩ ||

ఏష మే సర్వధర్మాణాం ధర్మోఽధికతమో మతః |
యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా || ౧౪ ||

పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్ || ౧౫ ||

పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళమ్ |
దైవతం దైవతానాం చ భూతానాం యోఽవ్యయః పితా || ౧౬ ||

యతః సర్వాణి భూతాని భవన్త్యాదియుగాగమే |
యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే || ౧౭ ||

తస్య లోకప్రధానస్య జగన్నాథస్య భూపతే |
విష్ణోర్నామసహస్రం మే శృణు పాపభయాపహమ్ || ౧౮ ||

యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః |
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే || ౧౯ ||

ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః |
ఛందోఽనుష్టుప్ తథా దేవో భగవాన్దేవకీసుతః || ౨౦ ||

అమృతాంశూద్భవో బీజం శక్తిర్దేవకినందనః |
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియోజ్యతే || ౨౧ ||

అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ || ౨౨ ||
విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్ |

శ్రీవేదవ్యాస ఉవాచ —
ఓమ్ అస్య శ్రీవిష్ణోర్దివ్యసహస్రనామస్తోత్రమహామంత్రస్య ||
శ్రీ వేదవ్యాసో భగవానృషిః | అనుష్టుప్ ఛందః |
శ్రీమహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా |
అమృతాంశూద్భవో భానురితి బీజమ్ |
దేవకీనందనః స్రష్టేతి శక్తిః |
ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః |
శంఖభృన్నందకీ చక్రీతి కీలకమ్ |
శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రమ్ |
రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రమ్ |
త్రిసామా సామగః సామేతి కవచమ్ |
ఆనందం పరబ్రహ్మేతి యోనిః |
ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః ||
శ్రీవిశ్వరూప ఇతి ధ్యానమ్ |
శ్రీమహావిష్ణుప్రీత్యర్థం సహస్రనామజపే వినియోగః ||

|| అథ ధ్యానమ్ |
క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతేర్మౌక్తికానాం
మాలాక్ళుప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః |
శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూష వర్షైః
ఆనందీ నః పునీయాదరినలినగదా శంఖపాణిర్ముకుందః || ౧ ||

భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే
కర్ణావాశాః శిరో ద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః |
అంతఃస్థం యస్య విశ్వం సురనరఖగగోభోగిగంధర్వదైత్యైః
చిత్రం రంరమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి || ౨ ||

ఓమ్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ || ౩ ||

మేఘశ్యామం పీతకౌశేయవాసం
శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగమ్ |
పుణ్యోపేతం పుండరీకాయతాక్షం
విష్ణుం వందే సర్వలోకైకనాథమ్ || ౪ ||

నమః సమస్తభూతానామాదిభూతాయ భూభృతే |
అనేకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే || ౫ ||

సశంఖచక్రం సకిరీటకుండలం
సపీతవస్త్రం సరసీరుహేక్షణమ్ |
సహారవక్షఃస్థలకౌస్తుభశ్రియం
నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్ || ౬ ||

ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి
ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతమ్ |
చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం
రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే || ౭ ||
ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః |
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః || ౧ ||

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాంపరమాగతిః |
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ || ౨ ||

యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః |
నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః || ౩ ||

సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః |
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః || ౪ ||

స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః |
అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః || ౫ ||

అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః |
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః || ౬ ||

అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః |
ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్ || ౭ ||

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః |
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః || ౮ ||

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః |
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ || ౯ ||

సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః |
అహః సంవత్సరో వ్యాలః ప్రత్యయః సర్వదర్శనః || ౧౦ ||

అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః |
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిఃసృతః || ౧౧ ||

వసుర్వసుమనాః సత్యః సమాత్మాఽసమ్మితః సమః |
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః || ౧౨ ||

రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః |
అమృతః శాశ్వత స్థాణుర్వరారోహో మహాతపాః || ౧౩ ||

సర్వగః సర్వవిద్భానుర్విష్వక్సేనో జనార్దనః |
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః || ౧౪ ||

లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః |
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః || ౧౫ ||

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః |
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః || ౧౬ ||

ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః |
అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః || ౧౭ ||

వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః |
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః || ౧౮ ||

మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః |
అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ || ౧౯ ||

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాం గతిః |
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః || ౨౦ ||

మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః |
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః || ౨౧ ||

అమృత్యుః సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన్ స్థిరః |
అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా || ౨౨ ||

గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః |
నిమిషోఽనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః || ౨౩ ||

అగ్రణీర్గ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః |
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ || ౨౪ ||

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః |
అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః || ౨౫ ||

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః |
సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః || ౨౬ ||

అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః |
సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః || ౨౭ ||

వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః |
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః || ౨౮ ||

సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః |
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః || ౨౯ ||

ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః |
ఋద్ధః స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః || ౩౦ ||

అమృతాంశూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః |
ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమః || ౩౧ ||

భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః |
కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః || ౩౨ ||

యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః |
అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ || ౩౩ ||

ఇష్టోఽవిశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః |
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః || ౩౪ ||

అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః |
అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః || ౩౫ ||

స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః |
వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరః || ౩౬ ||

అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః |
అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః || ౩౭ ||

పద్మనాభోఽరవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ |
మహర్ద్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః || ౩౮ ||

అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః |
సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః || ౩౯ ||

విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః |
మహీధరో మహాభాగో వేగవానమితాశనః || ౪౦ ||

ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః |
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః || ౪౧ ||

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః |
పరర్ద్ధిః పరమస్పష్టస్తుష్టః పుష్టః శుభేక్షణః || ౪౨ ||

రామో విరామో విరజో మార్గో నేయో నయోఽనయః |
వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః || ౪౩ ||

వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః |
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః || ౪౪ ||

ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః |
ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః || ౪౫ ||

విస్తారః స్థావరస్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ |
అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః || ౪౬ ||

అనిర్విణ్ణః స్థవిష్ఠోఽభూర్ధర్మయూపో మహామఖః |
నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః || ౪౭ ||

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాం గతిః |
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ || ౪౮ ||

సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ |
మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః || ౪౯ ||

స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ |
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః || ౫౦ ||

ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్క్షరమక్షరమ్ |
అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః || ౫౧ ||

గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూతమహేశ్వరః |
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః || ౫౨ ||

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః |
శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః || ౫౩ ||

సోమపోఽమృతపః సోమః పురుజిత్పురుసత్తమః |
వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్త్వతాంపతిః || ౫౪ ||

జీవో వినయితా సాక్షీ ముకుందోఽమితవిక్రమః |
అంభోనిధిరనంతాత్మా మహోదధిశయోఽంతకః || ౫౫ ||

అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః |
ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః || ౫౬ ||

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః |
త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ || ౫౭ ||

మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ |
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః || ౫౮ ||

వేధాః స్వాంగోఽజితః కృష్ణో దృఢః సంకర్షణోఽచ్యుతః |
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః || ౫౯ ||

భగవాన్ భగహాఽఽనందీ వనమాలీ హలాయుధః |
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః || ౬౦ ||

సుధన్వా ఖండపరశుర్దారుణో ద్రవిణప్రదః |
దివఃస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయోనిజః || ౬౧ ||

త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ |
సన్న్యాసకృచ్ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణమ్ || ౬౨ ||

శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః |
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః || ౬౩ ||

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః |
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః || ౬౪ ||

శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |
శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్లోకత్రయాశ్రయః || ౬౫ ||

స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః |
విజితాత్మాఽవిధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః || ౬౬ ||

ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశః శాశ్వతస్థిరః |
భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః || ౬౭ ||

అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః |
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః || ౬౮ ||

కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వరః |
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః || ౬౯ ||

కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః |
అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనంతో ధనంజయః || ౭౦ ||

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః |
బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః || ౭౧ ||

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః |
మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః || ౭౨ ||

స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః |
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః || ౭౩ ||

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః |
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః || ౭౪ ||

సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః |
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః || ౭౫ ||

భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః |
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరోఽథాపరాజితః || ౭౬ ||

విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ |
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః || ౭౭ ||

ఏకో నైకః స్తవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ |
లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః || ౭౮ ||

సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ |
వీరహా విషమః శూన్యో ఘృతాశీరచలశ్చలః || ౭౯ ||

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ |
సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః || ౮౦ ||

తేజోవృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాం వరః |
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః || ౮౧ ||

చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః |
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ || ౮౨ ||

సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః |
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా || ౮౩ ||

శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః |
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః || ౮౪ ||

ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః |
అర్కో వాజసనః శృంగీ జయంతః సర్వవిజ్జయీ || ౮౫ ||

సువర్ణబిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః |
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః || ౮౬ ||

కుముదః కుందరః కుందః పర్జన్యః పావనోఽనిలః |
అమృతాంశోఽమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః || ౮౭ ||

సులభః సువ్రతః సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః |
న్యగ్రోధోఽదుంబరోఽశ్వత్థశ్చాణూరాంధ్రనిషూదనః || ౮౮ ||

సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః |
అమూర్తిరనఘోఽచిన్త్యో భయకృద్భయనాశనః || ౮౯ ||

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ |
అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః || ౯౦ ||

భారభృత్ కథితో యోగీ యోగీశః సర్వకామదః |
ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణో వాయువాహనః || ౯౧ ||

ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః |
అపరాజితః సర్వసహో నియంతాఽనియమోఽయమః || ౯౨ ||

సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః |
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః || ౯౩ ||

విహాయసగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః |
రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః || ౯౪ ||

అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకజోఽగ్రజః |
అనిర్విణ్ణః సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః || ౯౫ ||

సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః |
స్వస్తిదః స్వస్తికృత్స్వస్తి స్వస్తిభుక్స్వస్తిదక్షిణః || ౯౬ ||

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః |
శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః || ౯౭ ||

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాంవరః |
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః || ౯౮ ||

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుఃస్వప్ననాశనః |
వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్థితః || ౯౯ ||

అనంతరూపోఽనంతశ్రీర్జితమన్యుర్భయాపహః |
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః || ౧౦౦ ||

అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః |
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః || ౧౦౧ ||

ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః |
ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః || ౧౦౨ ||

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ప్రాణజీవనః |
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః || ౧౦౩ ||

భూర్భువఃస్వస్తరుస్తారః సవితా ప్రపితామహః |
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః || ౧౦౪ ||

యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞీ యజ్ఞభుగ్ యజ్ఞసాధనః |
యజ్ఞాంతకృద్ యజ్ఞగుహ్యమన్నమన్నాద ఏవ చ || ౧౦౫ ||

ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః |
దేవకీనందనః స్రష్టా క్షితీశః పాపనాశనః || ౧౦౬ ||

శంఖభృన్నందకీ చక్రీ శార్‍ఙ్గధన్వా గదాధరః |
రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః || ౧౦౭ ||
సర్వప్రహరణాయుధ ఓమ్ నమ ఇతి |

వనమాలీ గదీ శార్‍ఙ్గీ శంఖీ చక్రీ చ నందకీ |
శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోఽభిరక్షతు || ౧౦౮ ||
శ్రీ వాసుదేవోఽభిరక్షతు ఓమ్ నమ ఇతి |

ఉత్తరపీఠిక 
శ్రీ భీష్మ ఉవాచ-
ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః |
నామ్నాం సహస్రం దివ్యానామశేషేణ ప్రకీర్తితమ్ || ౧ ||

య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ |
నాశుభం ప్రాప్నుయాత్కించిత్సోఽముత్రేహ చ మానవః || ౨ ||

వేదాంతగో బ్రాహ్మణః స్యాత్క్షత్రియో విజయీ భవేత్ |
వైశ్యో ధనసమృద్ధః స్యాచ్ఛూద్రః సుఖమవాప్నుయాత్ || ౩ ||

ధర్మార్థీ ప్రాప్నుయాద్ధర్మమర్థార్థీ చార్థమాప్నుయాత్ |
కామానవాప్నుయాత్కామీ ప్రజార్థీ చాప్నుయాత్ప్రజామ్ || ౪ ||

భక్తిమాన్ యః సదోత్థాయ శుచిస్తద్గతమానసః |
సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ప్రకీర్తయేత్ || ౫ ||

యశః ప్రాప్నోతి విపులం జ్ఞాతిప్రాధాన్యమేవ చ |
అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమమ్ || ౬ ||

న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి |
భవత్యరోగో ద్యుతిమాన్బలరూపగుణాన్వితః || ౭ ||

రోగార్తో ముచ్యతే రోగాద్బద్ధో ముచ్యేత బంధనాత్ |
భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః || ౮ ||

దుర్గాణ్యతితరత్యాశు పురుషః పురుషోత్తమమ్ |
స్తువన్నామసహస్రేణ నిత్యం భక్తిసమన్వితః || ౯ ||

వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవపరాయణః |
సర్వపాపవిశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్ || ౧౦ ||

న వాసుదేవభక్తానామశుభం విద్యతే క్వచిత్ |
జన్మమృత్యుజరావ్యాధిభయం నైవోపజాయతే || ౧౧ ||

ఇమం స్తవమధీయానః శ్రద్ధాభక్తిసమన్వితః |
యుజ్యేతాత్మసుఖక్షాంతిశ్రీధృతిస్మృతికీర్తిభిః || ౧౨ ||

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః |
భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే || ౧౩ ||

ద్యౌః సచంద్రార్కనక్షత్రా ఖం దిశో భూర్మహోదధిః |
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః || ౧౪ ||

ససురాసురగంధర్వం సయక్షోరగరాక్షసమ్ |
జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరమ్ || ౧౫ ||

ఇంద్రియాణి మనో బుద్ధిః సత్త్వం తేజో బలం ధృతిః |
వాసుదేవాత్మకాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ || ౧౬ ||

సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పతే |
ఆచారప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః || ౧౭ ||

ఋషయః పితరో దేవా మహాభూతాని ధాతవః |
జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవమ్ || ౧౮ ||

యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శిల్పాది కర్మ చ |
వేదాః శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వం జనార్దనాత్ || ౧౯ ||

ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః |
త్రీంల్లోకాన్వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః || ౨౦ ||

ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితమ్ |
పఠేద్య ఇచ్ఛేత్పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ || ౨౧ ||

విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయమ్ |
భజంతి యే పుష్కరాక్షం న తే యాంతి పరాభవమ్ || ౨౨ ||
న తే యాంతి పరాభవమ్ ఓమ్ నమ ఇతి |

అర్జున ఉవాచ-
పద్మపత్రవిశాలాక్ష పద్మనాభ సురోత్తమ |
భక్తానామనురక్తానాం త్రాతా భవ జనార్దన || ౨౩ ||

శ్రీభగవానువాచ-
యో మాం నామసహస్రేణ స్తోతుమిచ్ఛతి పాండవ |
సోహఽమేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః || ౨౪ ||
స్తుత ఏవ న సంశయ ఓమ్ నమ ఇతి |

వ్యాస ఉవాచ-
వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయమ్ |
సర్వభూతనివాసోఽసి వాసుదేవ నమోఽస్తు తే || ౨౫ ||
శ్రీ వాసుదేవ నమోఽస్తుత ఓమ్ నమ ఇతి |

పార్వత్యువాచ-
కేనోపాయేన లఘునా విష్ణోర్నామసహస్రకమ్ |
పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో || ౨౬ ||

ఈశ్వర ఉవాచ-
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే || ౨౭ ||
శ్రీరామనామ వరానన ఓమ్ నమ ఇతి |

బ్రహ్మోవాచ-
నమోఽస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే |
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగధారిణే నమః || ౨౮ ||
సహస్రకోటీ యుగధారిణే ఓమ్ నమ ఇతి |

సంజయ ఉవాచ-
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ || ౨౯ ||

శ్రీభగవానువాచ-
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ || ౩౦ ||

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || ౩౧ ||

ఆర్తాః విషణ్ణాః శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః |
సంకీర్త్య నారాయణశబ్దమాత్రం విముక్తదుఃఖాః సుఖినో భవంతు || ౩౨ ||

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతిస్వభావాత్ |
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి || ౩౩ ||

ఇతి శ్రీవిష్ణోర్దివ్యసహస్రనామస్తోత్రం సంపూర్ణమ్.
జైహింద్.

14, డిసెంబర్ 2016, బుధవారం

శ్రీరామ మంత్రమ్.

1 comments

జైశ్రీరామ్.
శ్రీరామాఖ్య  అజాది యోగి ముని సత్సేవ్యంపు చిన్మంత్రమున్,
దారిద్ర్యంబను దుఃఖ రోగ హరణోద్దాత్తంపు మంత్రంబు, సం
సారాంభోధిని దాటఁ జేసి, శుభ తేజంబిచ్చు సన్మంత్రమున్,
పారంద్రోలు భయంబు నట్టి శుభ సన్ మంత్రంబు నన్నేలుతన్.
జైహింద్. 

13, డిసెంబర్ 2016, మంగళవారం

నవాక్షర మంత్రమాలికా దత్త స్తవమ్ . . . రచన. శ్రీమాన్ అనంతకృష్ణ కవి.

2 comments

జైశ్రీరామ్.
శ్రీమాన్ నారుమంచి అనంతకృష్ణ కవి కృత దత్త స్తవము అమోఘమ్.చదివిన పిదప మీరూ ఇదేమాటనకమానరు.

ఓంకారమ్మున మూడు వర్ణములు తాముచ్చారణందొంటియౌ
సంకాశమ్ముగ మూడు మూర్తులొకటౌ సంపూర్ణ తత్త్వమ్ముగా
సంకల్పించిన తావులన్ తరలు నీ సాంగత్యమున్ కోరుచున్
జింకన్ పోలిక భీతుడన్ స్థిరమతిన్ సేవింతు దత్తప్రభో
.
.
ద్రా(మ్)
మిత్యాదిగ బీజ మంత్ర చయ వీర్యంబౌచునుత్తేజమై
కైమోడ్పుల్ మది నిన్ను కొల్చుటొకటే కార్యంబు నాభాగ్యమై
తామేరీతిగ పిల్చినన్ పలుకుచో ధైర్యంబు సంపూర్ణమై
క్షేమంబొప్పగ స్థైర్యమిమ్ముదయతో సేవింతు దత్తప్రభో
.
.
క్కంజేయు దిగంబరా స్మరణమే దాక్షిణ్య సాకారమా
చక్కంజేయుము దోష పూర్ణ నడతల్ శాసింతువే సర్వమున్
నిక్కంబీవె మహాత్మ ఆది గురువై నీవానిగా గొమ్మయా
చిక్కంజేయకు మాయకున్ మిషలకున్ సేవింతు దత్తప్రభో
.
.
త్తా
త్తాత్తా యన అర్ధహీన మగు శబ్దంబంచు దూషించకన్
దత్తా యంటినటంచు భావన మదిన్ తామెంచి ప్రేమార్ద్రతన్
మత్తాపంబు హరించి ధాత రచనల్ మన్నించకన్ మార్చుచున్
చిత్తైకాగ్రత నిచ్చిరే మరువకన్ సేవింతు దత్తప్రభో
.
.
త్రే
తాగ్నుల్ ఘన పాఠముల్ వివరముల్ దేశాటనల్ నేర్వనే
నీతోనుండెడి చిత్తమున్ నిరతమున్ నిండైన సద్భక్తియున్
మాతోనుండగ వేడ్కయున్ నిరవధిన్ మన్నాధ భావంబుతో
చేతోవృత్తిగ నిల్పగా సతతమున్ సేవింతు దత్తప్రభో
.
.
యా
చింతున్ నిను స్మర్తృగామివని సహ్యాద్రీశ సంరక్షకా
ప్రాచీనుండవు భక్తపాలన పరా రావే ప్రపన్నుండనే
నా చేతమ్మున నిల్చియుండుమనెదన్ జ్ఞానోపదేశమ్మిడన్
స్త్రీచాంచల్య విరాగినై సదమలా సేవింతు దత్తప్రభో
.
.
యం
త్రప్రాయపు జీవనమ్ములగుచో యజ్ఞాదులెట్లుండురా
మంత్రామ్రేడిత సాధనా బలిమియున్ మాలోన లేకున్నదే
సంత్రాణంబొనరింపు చిక్కితినయా సంసార కూపమ్ములో
చేంత్రాడట్లుగ చేయి నిమ్మని సదా సేవింతు దత్తప్రభో
.
.
మ్మయ్యా విడబోను పాదయుగళిన్ నాకింక దిక్కెవ్వరే
ఇమ్మయ్యా అవధూత చింతన సదా యింకేది నాకేటికో
కొమ్మయ్యా అరి షట్కమేల నిడితో కొండంత నీవుండగా
చిమ్మయ్యా పరిపూర్ణ సాంద్ర కరుణన్ సేవింతు దత్తప్రభో
.
.
ద్దైన్యంబును బాపరా భయహరా మంత్రార్ధమున్ జూపరా
పొద్దున్ బుచ్చెద భోగమోక్ష కరమౌ పూర్ణత్వ సంప్రాప్తితో
సద్దున్ చేయక బ్రహ్మతత్త్వమది సాక్షాత్కారమై నిత్యమై
చిద్దేశంబుననంతకాంతులలరన్ సేవింతు దత్తప్రభో.


కవిగారికి ఆ దత్తాత్రేయుఁడు వాంఛితార్థదుఁడగునుగాక. అభినందనలు.
జైహింద్.

12, డిసెంబర్ 2016, సోమవారం

కార్తీక పురాణము ౪.. రచన. శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

11, డిసెంబర్ 2016, ఆదివారం

కార్తీక పురాణము ౩.. రచన. శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

10, డిసెంబర్ 2016, శనివారం

కార్తీక పురాణము ౨.. రచన. శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

శ్రీ భాగవతుల సోమన్నా హైస్కూల్. దిమిలి. నా మిత్రులు, శిష్యులు.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!  ౦౧ - ౦౩ - ౧౯౭౪ వ తేదీన నేను శ్రీ భాగవతుల సోమన్నా హైస్కూల్ లో ప్రథమాంధ్రోపాధ్యాలుగా బాధ్యత చేపట్టినాను. ౮వతరగతి నుండి చదివి పదవ తరగతి పరీక్షలకు వెళ్ళిన విద్యార్థినీ విద్యార్థులు, నాతోపాటు ఆనందోత్సాహాలతో ఉపాధ్యాయ వృత్తి నెరపుచున్న నా మిత్రులు. అందరూ ఆదర్శ జీవనులే. వారందరిలోని మంచి లక్షణములన్నీ నన్ను చేరుట చేతనే నేను చెడ్డవాడిగా అనిపించుకోవటానికి అవకాశం లేక మంచు పేరు నా కాపాదింపబడింది.
నిరతము మిత్ర సంస్కృతిని నేర్పున నన్గని మెల్గుచుండి, నన్
గరుణను ప్రోత్సహించుచు ప్రకాశముఁ గొల్పిరి తోటి వారలా
గురువులు నాకు మిత్రులును, కోవిదులున్, గురు సన్నిభుల్. సదా
కరుణను చూపు వారలకు గౌరవమొప్ప నమస్కరించెదన్.
వారందరికీ నా అభినందన పూర్వక కృతజ్ఞతలు.
ఈ నా విద్యార్థులనేకమంది తాము చేపట్టిన వృత్తులలో నిపుణత చూపి మాకు మంచి పేరు తెచ్చి, పదవీ విరమణ కూడా చేసియున్నారు.
వారందరికీ నా శుభాశీస్సులు.
జైహింద్.

9, డిసెంబర్ 2016, శుక్రవారం

కార్తీక పురాణము ౧.. రచన. శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

8, డిసెంబర్ 2016, గురువారం

శ్రీ వరదాంజనేయాష్టకమ్.. . . .డా. మాడుగుల అనిల్ కుమార్.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

7, డిసెంబర్ 2016, బుధవారం

శ్రీ రఘురామ నవరత్నమాలా . . . .డా. మాడుగుల అనిల్ కుమార్.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.