28, ఫిబ్రవరి 2013, గురువారం
శ్రీ వల్లభ వఝలవారి చక్రకేళీ బంధ సుగంధి వృత్తము, ఇక్షు బంధ రవి ప్రియ వృత్తము
1 comments
Labels:
శ్రీ వల్లభ
26, ఫిబ్రవరి 2013, మంగళవారం
ఢమరు -కమండల మాలికా బంధ కందములు, (భిక్షా)సుగంధ పాత్రికా బంధ చంపకము.బిల్వదళ బంధ గీతము. రచన-శ్రీ వల్లభవఝల.
1 comments
Labels:
శ్రీ వల్లభ
24, ఫిబ్రవరి 2013, ఆదివారం
మధురోక్తుల మాతృ భాష
4 comments
జైశ్రీరామ్.
ప్రపంచ మాతృ భాషా దినోత్సవము సందర్భముగా తెలుగు సాహిత్య కళా పీఠం నిర్వహించిన
కవి సమ్మేళనము సందర్భముగా సమర్పితము.
కవి సమ్మేళనము సందర్భముగా సమర్పితము.
మధురోక్తుల మాతృ భాష
శా:- శ్రీమద్విశ్వ మనోజ్ఞ రూప రచనా జిజ్ఞాస సంశోభితుల్,
ప్రేమోద్దీపన వాఙ్నిధానులును, సుప్రీతాత్ములున్, సాహితీ
స్తోమోజ్జ్వాలన
దీక్షితుల్, వినుత సచ్ఛుద్ధాంతరంగుల్, సభన్
క్షేమంబున్
విరచింప నుండి రిచటన్. కీర్తింతు నే వారలన్. 1.
a.కంద b.గీత గర్భ ఉత్పలమాల:-
శ్రీ కమనీయ భావన సుసేవ్య మహాత్ముల వాక్ సుధారలౌ
శ్రీ కవితల్ సుధా మధుర చిత్ర ప్రబంధ రమా నిధానముల్.
నా కమలాప్తులౌ ఘనుల, నాద మునీంద్రుల, గౌరవింతు ధా
రా కవితన్. ప్రథాన సమ రాట్కవి చంద్రుల కంజలింతు నే. 2.
a.ఉత్పల గర్భస్థ కందము:-
కమనీయ భావన సుసే - వ్య మహాత్ముల వాక్ సుధార లౌ శ్రీ కవితల్.
కమలాప్తులౌ ఘనుల, నా - ద మునీంద్రుల, గౌరవింతు ధారా కవితన్.
b.ఉత్పల గర్భస్థ గీతము:-
వన సుసేవ్య మహాత్ముల వాక్ సుధార - మధుర చిత్ర ప్రబంధ రమా నిధాన.
ఘనుల, నాద మునీంద్రుల, గౌరవింతు - నసమ రాట్కవి చంద్రుల కంజలింతు.
శా:- కంఠంబెత్తుచు పాడు పద్య కవితా కంఠస్థ సాహస్రుఁడౌ
కంఠీ రావ మనోజ్ఞ మూర్తి మన చిక్కా రామ దాసే, మహా
కంఠేకాలుఁడు. విన్న వీని ఘనమౌ గాత్రంబు నీ తెల్గులో
గంఠేరుండును భాగ్యవంతుఁడగు. శంఖం బందునా కంఠమున్.. 3.
a.అవసాన గీతాంతర్గత కంద యుత b.చంపక - c1&c2.ద్వివిధ కంద ద్వయ - d.గీత గర్భ,
సీసము:-
క్షితి తెలుగున్ శుభా కృతిని శ్రీనిడు శార - ద క్షేమ దాయియే తలచి చూడ.
స్తుత మతి యైన యీ సుజన శోధిత భాష - యె స్తుత్య వారి ధీ యిలను సుగుణ
యుత. వెలుగే కదా అతిశ యోజ్వలి తాంధ్ర - ము ధ్యాన యుక్త వాగ్ భూరి సుఖద.
ధృతి నుతయే సుమా! వ్రత సు ధీరత నేర్వ - ర ! భ్రాంతి గ్రోల రారా తెలుంగ !
గీ:- తెలుగు మధు సేవనా పర తెలుగు కవులు
కావ్య జగతి తేలుదురటగా? తెలియుడు
కావ్య జగతి తేలుదురటగా? తెలియుడు
సుమధుర తెలుగీ యిలలోన ప్రముద కరమ
గు నినుని విధమున నలర మనుదు మిమ్ము. 4.
గు నినుని విధమున నలర మనుదు మిమ్ము. 4.
a. సీసావసాన గీత గర్భస్థ కందము:-
తెలుగు మధు సేవనా పర - తెలుగు కవులు కావ్య జగతి తేలుదురటగా?
తెలియుడు సుమధుర తెలు గీ - యిలలోన ప్రముద కరమగు నినుని విధమునన్.
b. సీస గర్భస్థ చంపకమాల :-
క్షితి తెలుగున్ శుభా కృతిని శ్రీనిడు శారద క్షేమ దాయియే
స్తుత మతి యైన యీ సుజన శోధిత భాషయె స్తుత్య వారి, ధీ
యుత వెలుగే కదా అతిశ యోజ్వలి తాంధ్రము ధ్యాన యుక్త వాగ్
ధృతి నుతయే సుమా! వ్రత సు ధీరత నేర్వర ! భ్రాంతి గ్రోల రా!
c1. సీస గర్భస్థ ద్వివిధ గతి కందము :-
తెలుగున్ శుభా కృతిని శ్రీ - నిడు శారద క్షేమ దాయియే స్తుత మతియై
వెలుగే కదా అతిశ యో - జ్వలి తాంధ్రము ధ్యాన యుక్త వాగ్ధృతి నుతయే.
c2. సీస గర్భస్థ ద్వివిధ గతి కందము :-
మతి యైన యీ సుజన శో - ధిత భాషయె స్తుత్య వారి. ధీ యుత. వెలుగే .
నుతయే సుమా! వ్రత సు ధీ - రత నేర్వర ! భ్రాంతి గ్రోల రా! క్షితి తెలుగున్ !
d.సీస గర్భస్థ గీతము :- కృతిని శ్రీనిడు శారద క్షేమదాయి. - సుజన శోధిత భాషయె స్తుత్య వారి.
అతిశ యోజ్వలి తాంధ్రము ధ్యాన యుక్త. - వ్రత సు ధీరత నేర్వర ! భ్రాంతి గ్రోల.
సర్వలఘు సీసము:-
తెలుగుననె వెలుగునది, తెలియఁ దగు తొలి పలుకు – పలుకు పలుకుల వెలుగు చిలుకు తెలుగు.
తొలి జనని పలుకునది, పలుకఁగను తెలుపునది - సులభముగ తెలియునది తొలిగ తెలుగు.
కొలువులను వెలుగునది, తెలుగు కవి పలుకునది - పులకలను గొలుపునది తెలుగు వెలుగు.
పలుకులను లలిత గతి తెలుగు సుధ లొలుకునది - తెలియనిది దెలుపునది తెలుగు పలుకు.
గీ:- తెలుగు వెలుగు జిలుగు పలుకుల కననగు.
తెలుగు పలుకు మధువు లొలుకు నిలను.
తెలుగు పలుకు మధువు లొలుకు నిలను.
తెలుగు తనము ఘనము తెలియుము, తెలుపుము.
తెలుగు తనము ధరణి వెలుగ వలయు. 5.
తెలుగు తనము ధరణి వెలుగ వలయు. 5.
కం:- పంచేంద్రియముల రూపున - సంచిత ఫల మనుభవింప జన్మించగ బో
ధించెడి, పలికెడి భాషగ - నుంచెను తెలుగును మురారి. యుత్తమ మనుచున్. 6.
ఆ:- పుణ్య మూర్తి తల్లి పురిటి నొప్పుల నోర్చి - జన్మ నీయ మనకు చచ్చి బ్రతుకు.
అట్టి తల్లి భాష కిట్టదా మనలకు ?- పట్టు పట్టి నేర్చు పనియు లేదె ! 7.
ఆ:- మాతృ మూర్తి మిన్న. మాతృ భాషయు మిన్న. - మతృ దేశ మెన్న మనకు మిన్న.
మాతృ మూర్తి వీడి, మాతృ భాషను వీడి, - పరుల నాశ్రయించు బ్రతు కదేల? 8.
గీ:- మాతృ దేశము విలువను మరువబోకు. - మాతృ దేవిని కనుమయ్య మన్ననమున.
మాతృ భాషను విడువక మాట లాడు. - మాతృ మూర్తుల మన్నించి మహిమ గొనుమ. 9.
గీ:- ధీర సాహస్ర పద్య కంఠీరవుండ ! - సఖ్య శ్రీ చిక్క రామ దాసాఖ్య ఘనుఁడ !
తెలుగు సాహిత్య శ్రీ కళా దీప్త పీఠ - మాన్యతాధార! మీకు సన్మంగళములు. 10.
స్వస్తి
జైహింద్.
మాతృభాషా వైభవం సాహితీ కార్యక్రమం.
1 comments
జైశ్రీరామ్.
సాహితీ సంపన్నులారా! ప్రపంచ మాతృభాషా దినోత్సవము సందర్భమును పురస్కరించుకొని ఈ రోజు చిక్కడపల్లిలో గల త్యాగరాయ గాన సభలో సహస్ర పద్య కంఠీరవ బిరుదాంకితులు శ్రీ చిక్కా రామ దాసు ఆధ్వర్యవమున నడచుచున్న తెలుగు సాహిత్య కళా పీఠము వారు మాతృభాషా వైభవము పేర సాహితీ సభ నిర్వహించిరి.
ఈ కార్యక్రమమునకు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిష్ట్రార్ ప్రస్తుతం అధికార భాషా సంఘం సభ్యులు అయిన ఆచార్య గౌరీశంకర్ గారు అధ్యక్షత వహించారు.
కేంద్రీయ విశ్వ విద్యాలయం తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య శరజ్జ్యోత్స్నారాణిముఖ్య అతిథిగా, డా.తిరునగరి, శ్రీ సాధన నరసింహాచార్యులు, శ్రీ సుర్వి గణేష్ గౌడ్, ప్రసిద్ధ కవి, వాగ్గేయ కారుడు శ్రీ గోరటి వెంకన్ననృత్య కళా శిరోమణి శ్రీమతిసరితా దిలీప్,త్యాగరాయ గాన సభ అధ్యక్షులు శ్రీకళా వేంకట దీక్షితులు, శ్రీ రాధాశ్రీ, పాల్గొన్నారు.
తెలుగు భాషా ప్రాశస్త్యమును గూర్చి నేను, నాతో పాటుగా శ్రీ తల్లోజు యాదవాచార్యులు, శ్రీ వేముల ప్రభాకర్, శ్రీ రాపోలు వేంకటేశం, శ్రీ బాలవర్ధి రాజు, శ్రీ పెసరు లింగారెడ్డి, శ్రీ వేముల సత్యనారాయణ, శ్రీ చిన్నం అంజయ్య, శ్రీ సుందర రామ కృష్ణ, శ్రీమతి పాణ్యం మీనాకుమారి, శ్రీమతి బి.నె౩ఎలిమ, శ్రీమతి జ్యోషి అరుణశ్రీ, మున్నగు వారు చేసిన పద్య పఠనం సభాసదుల మన్ననలను పొందాయి. ఈ కార్యక్రమమునకు సంబంధించిన ఛాయాచిత్రములు తిలకించ వచ్చును.
జ్యోతిప్రజ్వలన.
తెలుగు సాహిత్య కళా పీఠం అధ్యక్షులు పలుకుచున్న స్వాగతం.
అధ్యక్షోపన్యాసము చేయుచున్నఅధికార భాషా సంఘ సభ్యులు ఆచార్య టి.గౌరీశంకర్.
శ్రీ సుందర రామ కృష్ణ పద్య పఠనము.
నేను చేయుచున్న పద్య పఠనము.
ఆచార్య గౌరీశంకర్ గారు నన్ను సత్కతిస్తున్న సన్నివేశము.
4నందీపురస్కారములందుకొన్న నృత్యకళాశిరోమణి శ్రీమతిసరితాదిలీప్ ఉపన్యాసము.
ఆర్యులారా! చూచారు కదా! మన మాతృభాషాభిమానాన్ని పెంచే ప్రయత్నంలో శ్రీ చిక్కా రామదాసుగారు ఎందరెందరినో ఆదరాభిమానాలతో ఆహ్వానించి, సముచిత సత్కారం చేసి, వారి ద్వారా తెలుగు భాషాభిమానులకానందం పంచారు. అట్టి ప్రయత్నం సత్ఫలాలనిస్తుందని ఆశిద్దాం.ఆ సభలో నేను చేసిన కవితా గానాన్ని అతి త్వరలో మీముందుంచగలనని సవినయముగా మనవిచేసుకొనుచున్నాను. శుభమస్తు.
జైహింద్.
23, ఫిబ్రవరి 2013, శనివారం
తే.24-02-2013 న"త్యాగరాయ గాన సభలో" కవి సమ్మేళనం.
0 comments
జైశ్రీరామ్.
ఆర్యులారా!
తే.24-02-2013న అనగా రేపే
త్యాగరాయ గాన సభలో
ఉదయం. 10. గంటలకు
కవిసమ్మేళనం జరుగబోతోంది.
సహస్ర పద్య కంఠీరవ బిరుదాంకితులైన శ్రీ చిక్కా రామ దాసు అధ్యక్షతన నిర్వహిఒంప బడుచున్న
‘తెలుగు సాహిత్య కళా పీఠం’ఆధ్వర్యవములో
ఆహ్వానితులైన కవులచే, కవయిత్రులచే
మాతృభాషా మాధుర్యమును గూర్చిన కవితలు పఠింపబడును.
ఈ సందర్భముగా ప్రముఖ వాగ్గేయకారులు శ్రీ వెంకన్నను ఘనంగా సత్కతింపనున్నారు.
తెలుగు భాషాభివృద్ధికై ఈ పీఠము చక్కని కృషి చేయుచున్నదనుటకు ఈ కార్యక్రమమే నిదర్శనము.
ఈ కార్యక్రమమునకు
అందరూ ఆహ్వానితులే.

22, ఫిబ్రవరి 2013, శుక్రవారం
ఉగ్రవాదుల దురాగతానికి బలైపోయినవారికి,క్షతగాత్రులకు నా ప్రగాఢ సానుభూతి.
1 comments
సోదరీ సోదరులారా!
హైదరాబాదులో మనందరితో పాటు సహ జీవనం చేస్తూ
ఆత్మీయతలను పంచుకొంటూ కూడా
దురదృష్ట వశాత్తు
టెఱ్ఱరిష్టుల చేతిలో కీలుబొమ్మలైపోయినవారి
దురాగతానికి బలైపోయిన
మన తోటివారి ఆత్మలకు శాంతి చేకూరాలని మనసారా కోరుకొంటున్నాను.
క్షతగాత్రులు ఆ పరమాత్మ దయకు పాతృలై వేగముగా కోలుకోవాలని ఆశిస్తూ
వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేయుచున్నాను.
ఓం అసతోమా సద్గమయ!
తమసోమా జ్యోతిర్ గమయ.
మృత్యోర్మా అమృతం గమయ.
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః.

21, ఫిబ్రవరి 2013, గురువారం
ప్రపంచ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు.
0 comments
జైశ్రీరామ్.
మిత్రులారా! ప్రపంచ మాత్రు భాషా దినోత్సవము సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు.
ముఖ్యముగా తెలుగును మాతృ భాషగా కలవారికి అభినందనలు.
తెలుగు పలుకులందుగల జిగి బిగి నెఱిగి అందలి నిగనిగలను వెలువరింప చేసి, అత్యుద్భుతమైనది తెలుగు భాషే అని నిరూపించడానికి తెలుగువారంతా సమైక్యం కావాలి. వైవిధ్యాలు విడనాడాలి. భాషాభిమానం పెల్లుబకాలి. మాతేఉ భాషలోనే భాషణ చేయాలి.భాషలోని మాధ్ర్యాన్ని చవి చూడడంతో పాటు ప్రపంచానికి చాటాలి.
ఇంతటి బాధ్యత మనపై ఉంది. మరువకండి. మనం ఉన్నది నిజమైతే, అంటే మన అస్తిత్వం నిజమైతే దానికి మూలమైన తెలుగు మాతృ భూమియొక్క ఔన్నత్యము, తెలుగు మాతృభాష యొక్క అసాధారణ ప్రతిభ ముందుగా మనం మననం చేసుకోవాలి. తదనంతరం మన మహత్తర గ్రంథరాజములందున్న కవితామృతఝరిలో తోటి వారిని ఓలలాడించాలి. అది చెయ్యాలంటే ముందుగా మనకు మనం మన మాతృభాష అయిన తెలుగుపై పట్టు సాధించాలి. అందుకొఱకు నిరంతరం అకుంఠిత దీక్షతో కృషి చెయ్యాలి. అప్పుడే మన అస్తిత్వానికొక అర్థం ఉంటుంది. మన ప్రతిభా పాటవాలు ప్రపంచానికి తెలుస్తాయి.
మీరేమంటారు?

సదసద్వివేకజ్ఞులైన మీ అందరికీ భీష్మ ఏకాదశి సందర్భముగా శుభాకాంక్షలు
1 comments
జైశ్రీరామ్.
నేడు పరమ పవిత్రమైన భీష్మ ఏకాదశీ పర్వ దినము. ఈ సందర్భముగా మానవాళికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలందజేయుచున్నాను.
శ్రీ పండిత నేమాని వారు గీతాబోధపై వ్రాసిన ఒక పద్యమును చూడండి:
శ్రీ కృష్ణ పరమాత్మ క్రీడికి తోడుగా
....సారథియై నిల్చి సమర భూమి
అర్జునుండు వివేక మంతరింప విషాద
....మొంది సంశయముతో నున్నవేళ
కర్తవ్య బోధను గావించి దుఃఖమ్ము
....పోగొట్టి మెండుగా ప్రోత్సహించి
ఉపనిషత్సమమైన యోగ శాస్త్రమ్మును
....బ్రహ్మ విద్యను దెల్పె పరమ గుహ్య
మైన గీత నా రీతిగా జ్ఞాన బోధ
సకల లోకములకు జేసె సద్గురుడయి
యా జగద్గురువర్యు పాదాబ్జములకు
వందన శతమ్ము గూర్తును భక్తి మెఱయ‘
జైహింద్.
20, ఫిబ్రవరి 2013, బుధవారం
మంత్రోపాసన – నాదోపాసన. శ్రీ భాస్కరానంద నాథ వివరణ.
1 comments
జైశ్రీరామ్.
ఆర్యులారా! మంత్రోపాసన – నాదోపాసన అనే విషయమును శ్రీ భాస్కరానంద నాథులవారు వివరించిన విషయం మనం తెలుసుకొందాం.
మంత్రానికి మూలం బీజం, ఆ బీజానికి మూలం నాదం, ఆ నాదానికి మూలం బిందువు. అన్నింటికీ మూలం బిందువు.
బిందువు లో నుంచే సృష్టి అంతా జరిగినది. బిందువు వికసనం వలన ఇది అంతా జరిగినది అని మనకు తెలుసు. బిందువు ఎందుకు వికసనం జరిగినది? దాని లోపలి శక్తి తాడనము చేత. కాబట్టి బిందువు లోపలే శక్తి వున్నది. దీనిని బట్టి మనకు అర్ధమయ్యేది ఏమిటంటే బిందువు పరమాత్మ, దానిలోపలి శక్తి ప్రకృతి.
అయ్య, అమ్మ ఇద్దరూ ఒక్కటే. ఒకరి లోపల ఒకరు వున్నారు. శక్తి లేనిదే అయ్య కదలడానికి అశక్తుడు అని మనకు తెలుసు. ఇదే మాటను శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పి వున్నారు.
ఇప్పడు మనము తెలుసు కోవలసినది అసలు ఈ శక్తి ఎవరు? ఏమిటి? ఎక్కడి నుంచి వస్తుంది? అని.
ఝుమ్మంది నాదం .. అని మనకు తెలుసు. నాదం లో నుంచి ఝు౦ అనే శబ్దం వస్తుంది. ఏమిటి ఈ ఝు౦ అనే నాదం అని పరిశీలిస్తే ఇదే శక్తి. బిందువు లో నుంచి ఝు౦ అనే నాదం వస్తుంది, అదే శక్తి. అదే అమ్మ. అదే భ్రమరాంభిక. అదే ఆది శక్తి. శబ్దం లో నుంచి నిశ్శబ్దం, దానిలో నుంచి శబ్దం. నిశ్శబ్దం లో నుంచి శబ్దం ఎలా? అదే ఝు౦ అనే నాదం.
ఈం, ఈమ్ , అమ్ , మ్. వీటిల్ని పరిశీలించండి. “మ్” ... అనేది శక్తి. అదే ఉమా.
అదే మూల ప్రకృతి.
నాదంలో నుంచి వచ్చేది అదే ... “మ్”.
హార్మోనియం పెట్టెలో నుంచి వచ్చేది అదే ధ్వని. వీణ మీటితే అదే ధ్వని, నాద స్వరములో అదే ధ్వని,
గంట లో నుంచి వచ్చేది అదే ... “మ్”.
ఇతర గ్రహాలలో విన వచ్చేది అదే. నిశ్శబ్దం లో నుంచి వచ్చేది అదే. చంద్ర మండలములో ““మ్”. అనే ధ్వని వినిపిస్తుందని చెప్పారు శాస్త్రజ్ఞులు. విద్యుచ్చక్తి లో అదే ధ్వని. శక్తి ఎక్కడ వుందో అక్కడ అదే ధ్వని.
High Induction transformer / HT voltage లో అదే ధ్వని. ...... “మ్”.
ల౦, హం, య౦, రం, వం, సం, గం... లో నుంచి వచ్చేది అదే శబ్దం ...... “మ్”.
శ్రీరాముని తారక మంత్రమైన బీజాక్షరం “రాం, రామ్” లో నుంచి అదే శబ్దం ...... “మ్”.
రామం, విష్ణుం, శివం, కేశవం, దామోదరం ..... లో నుంచి అదే శబ్దం ...... “మ్”.
విష్ణు సహస్ర నామం లోని “విష్ణుం” అదే.
హ్రీం లోని “ఈ” కారము అదే. ... “మ్”.
అదే శ్రీమాత.
హిరణ్య వర్ణాం హరిణీం ,........... హిరణ్మయీం... అదే శబ్దం ...... “మ్”.
ఏ మంత్ర మైనా అదే "ఈమ్" అనే శబ్దం రావాలి. అదే ప్రాణ శక్తి, అదే జీవ శక్తి. అదే చలనము. మంత్రానికి మూల శక్తి అదే.
అదే ఆదిశక్తి. "ఈం" అనేది మూల ప్రకృతి, అదే నాదం.
ఓం కారములోని జీవ శక్తి అదే. "మ్.
దానిని మీద ధ్యాస వుంచండి, సమాధి లోకి వెళ్లి పోతారు. మనము చేయవలసిన సాధన అదే. అందరం కలిసి చేద్దాము.
ఝు౦ కారం వినడమే. శ్రీశైలం లో వినబడేది అదే. కైవల్యం అదే. అదే కైవల్యం. అదే కైవల్యం. నిశ్శబ్దం లోకి వెళ్ళగలిగిన వాడు ఈ శబ్దం వినగలడు , అది వినగలిగిన వాడు ధన్యుడు.
అదే సమాధి స్థితి. దానిలో లీనం అయిపోవడమే.
శ్రీ భాస్కరానంద నాథ వివరణ. చూచారు కదా! మరొక పర్యాయం మరొక మంచి విషయాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.
జైహింద్.
ఆర్యులారా! మంత్రోపాసన – నాదోపాసన అనే విషయమును శ్రీ భాస్కరానంద నాథులవారు వివరించిన విషయం మనం తెలుసుకొందాం.
మంత్రోపాసన – నాదోపాసన
శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నాదం ఎక్కడి నుంచి ఉత్పన్నమౌతుంది? మంత్రానికి మూలం ఏమిటి?మంత్రానికి మూలం బీజం, ఆ బీజానికి మూలం నాదం, ఆ నాదానికి మూలం బిందువు. అన్నింటికీ మూలం బిందువు.
బిందువు లో నుంచే సృష్టి అంతా జరిగినది. బిందువు వికసనం వలన ఇది అంతా జరిగినది అని మనకు తెలుసు. బిందువు ఎందుకు వికసనం జరిగినది? దాని లోపలి శక్తి తాడనము చేత. కాబట్టి బిందువు లోపలే శక్తి వున్నది. దీనిని బట్టి మనకు అర్ధమయ్యేది ఏమిటంటే బిందువు పరమాత్మ, దానిలోపలి శక్తి ప్రకృతి.
అయ్య, అమ్మ ఇద్దరూ ఒక్కటే. ఒకరి లోపల ఒకరు వున్నారు. శక్తి లేనిదే అయ్య కదలడానికి అశక్తుడు అని మనకు తెలుసు. ఇదే మాటను శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పి వున్నారు.
ఇప్పడు మనము తెలుసు కోవలసినది అసలు ఈ శక్తి ఎవరు? ఏమిటి? ఎక్కడి నుంచి వస్తుంది? అని.
ఝుమ్మంది నాదం .. అని మనకు తెలుసు. నాదం లో నుంచి ఝు౦ అనే శబ్దం వస్తుంది. ఏమిటి ఈ ఝు౦ అనే నాదం అని పరిశీలిస్తే ఇదే శక్తి. బిందువు లో నుంచి ఝు౦ అనే నాదం వస్తుంది, అదే శక్తి. అదే అమ్మ. అదే భ్రమరాంభిక. అదే ఆది శక్తి. శబ్దం లో నుంచి నిశ్శబ్దం, దానిలో నుంచి శబ్దం. నిశ్శబ్దం లో నుంచి శబ్దం ఎలా? అదే ఝు౦ అనే నాదం.
ఈం, ఈమ్ , అమ్ , మ్. వీటిల్ని పరిశీలించండి. “మ్” ... అనేది శక్తి. అదే ఉమా.
అదే మూల ప్రకృతి.
నాదంలో నుంచి వచ్చేది అదే ... “మ్”.
హార్మోనియం పెట్టెలో నుంచి వచ్చేది అదే ధ్వని. వీణ మీటితే అదే ధ్వని, నాద స్వరములో అదే ధ్వని,
గంట లో నుంచి వచ్చేది అదే ... “మ్”.
ఇతర గ్రహాలలో విన వచ్చేది అదే. నిశ్శబ్దం లో నుంచి వచ్చేది అదే. చంద్ర మండలములో ““మ్”. అనే ధ్వని వినిపిస్తుందని చెప్పారు శాస్త్రజ్ఞులు. విద్యుచ్చక్తి లో అదే ధ్వని. శక్తి ఎక్కడ వుందో అక్కడ అదే ధ్వని.
High Induction transformer / HT voltage లో అదే ధ్వని. ...... “మ్”.
ల౦, హం, య౦, రం, వం, సం, గం... లో నుంచి వచ్చేది అదే శబ్దం ...... “మ్”.
శ్రీరాముని తారక మంత్రమైన బీజాక్షరం “రాం, రామ్” లో నుంచి అదే శబ్దం ...... “మ్”.
రామం, విష్ణుం, శివం, కేశవం, దామోదరం ..... లో నుంచి అదే శబ్దం ...... “మ్”.
విష్ణు సహస్ర నామం లోని “విష్ణుం” అదే.
హ్రీం లోని “ఈ” కారము అదే. ... “మ్”.
అదే శ్రీమాత.
హిరణ్య వర్ణాం హరిణీం ,........... హిరణ్మయీం... అదే శబ్దం ...... “మ్”.
ఏ మంత్ర మైనా అదే "ఈమ్" అనే శబ్దం రావాలి. అదే ప్రాణ శక్తి, అదే జీవ శక్తి. అదే చలనము. మంత్రానికి మూల శక్తి అదే.
అదే ఆదిశక్తి. "ఈం" అనేది మూల ప్రకృతి, అదే నాదం.
ఓం కారములోని జీవ శక్తి అదే. "మ్.
దానిని మీద ధ్యాస వుంచండి, సమాధి లోకి వెళ్లి పోతారు. మనము చేయవలసిన సాధన అదే. అందరం కలిసి చేద్దాము.
ఝు౦ కారం వినడమే. శ్రీశైలం లో వినబడేది అదే. కైవల్యం అదే. అదే కైవల్యం. అదే కైవల్యం. నిశ్శబ్దం లోకి వెళ్ళగలిగిన వాడు ఈ శబ్దం వినగలడు , అది వినగలిగిన వాడు ధన్యుడు.
అదే సమాధి స్థితి. దానిలో లీనం అయిపోవడమే.
శ్రీ భాస్కరానంద నాథ వివరణ. చూచారు కదా! మరొక పర్యాయం మరొక మంచి విషయాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.
జైహింద్.
18, ఫిబ్రవరి 2013, సోమవారం
శ్రీ వల్లభ వఝల కృత ‘పిడికిలి బంధ కందము - నారికేళ బంధ ఆటవెలది’
1 comments
జైశ్రీరామ్.
ప్రియ ఆంధ్రామృతాస్వాదనా తత్పరులారా!మన ఆంధ్రభాషలో పద్యరచనలో చిత్ర బంధ, గర్భ కవిత్వములు భాషకే భూషణములనిన అతిశయోక్తి కానేరదు. అట్టి కవితాసక్తిని పెంపొందించుకొని రచనలు సలుపుచూ పాఠకులమదికెక్కుచున్న మహనీయులెందరో ఉన్నారు. అట్టి వారిలో శ్రీ వల్లభ వఝల నరసింహమూర్తి కవిమిత్రులు ముఖ్యులని చెప్పుకొనవలయును. ఎందుచేతననగా వారి కంట బడిన ఎటువంటి చిత్ర కవిత్వమయినా సరే మరుక్షణంలో వారి కలము నుండి నూతనోత్తేజముతో జాలువారుతుంది. అట్టి కవివరులు వ్రాసిన
పిడికిలి బంధ కందము - నారికేళ బంధ ఆటవెలది చూడండి.
ఇంత చక్కటి ప్రయత్నంతో కృతకృత్యులగుచున్న శ్రీ వల్లభవఝలవారిని మనసారా అభినందిస్తున్నాను.
మీరు కూడా ఎందుకు ఇలా వాసే ప్రయత్నం చేయ కూడదు? ఒక్కసారి ఆలోచించండి.
జైహింద్.
Labels:
శ్రీ వల్లభ
జ్ఞానమార్గంలో పదేళ్ళలోకి అడుగు పెట్టిన శ్రీ నేమాని రామ జోగి సన్యాసిరవు గారికి అభినందనలు.
1 comments
జైశ్రీరామ్.
ప్రియ మిత్రులారా!
ఈ రోజు ‘తెలుగు అధ్యాత్మరామయణ’ కర్త పండిత నేమాని రామ జోగి సన్యాసిరావు గారు అరువది తొమ్మిది సంవత్సరములు పూర్తి చేసుకొని 70వ సంవత్సరము లోనికి అడుగిడుచున్నారు.
జ్ఞాన తేజముతో పదేళ్ళు పూర్తి చేసిన శ్రీ నేమానివారిని మనసారా అభినందిద్దాము.
ఆర్యా! పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు గారూ! అభినందనలు.
జ్ఞానజ్యోతిప్రపూర్ణ పూర్ణ హృదయా! కల్యాణ భావోజ్వలా!
ప్రాణోద్భాసిత దివ్య తేజ విలసత్ ప్రఖ్యాత దైవంబ! మీ
కీనాడర్వది తొమ్మిదేండ్లు గడిచెన్ హృద్యంబుగా డబ్బదిన్
మేనందాల్చిన మీకు మేలు కలుగున్. మీ భావనల్ పండుతన్.
మీకు మా హృదయ పూర్వక శుభాకాంక్షలు.
భువన విజయ ప్రదర్శనానంతరము ప్రదర్శించిన బాల బాలికలకు, నిర్వాహకులకు మీ రు ప్రసాదదించిన అధ్యాత్మ రామాయణ గ్రంథములను మీ పేరున బహూకరింప గలనని తెలియ జేయుచున్నాను.

17, ఫిబ్రవరి 2013, ఆదివారం
నేడు రథ సప్తమి సూర్య జయంతి సందర్భముగా అందరికీ ఆరోగ్యాభివృద్ధి కలుగునుగాక.
1 comments
జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా!నేడు రథ సప్తమి. సూర్యభగవానుని జన్మదినముగా పురాణాలు చెప్పుచున్నవి.
సూర్యభగవానుని అనుగ్రహము పొందు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు సమకూరునని పెద్దల మాట.
ఈ ప్రకృతి అంతా సూర్యభగవానునిపై ఆధారపడి నడుచుచున్నది. అట్టి సూర్యభగవానుని అనుగ్రహము మీ అందరికీ లభించవలెనని, మీరంతా శారీరక, మానసిక ఆరోగ్యవంతులై సద్వృద్ధికి మూలమవవలెనని, మనసారా కోరుకొనుచుంటిని.
ఈ సందర్భముగా కళింగాంధ్ర లో సూర్య జయంతి శీర్షికతో వెలువడిన వ్యాసమును ఈ క్రింది
http://kalingaandhra.blogspot.in/2013/02/blog-post_16.html?m=1
ద్వారా చూడతగినది.
సప్తాశ్వంబులు లాగు నట్టి రథమున్, జక్రం బుతానొక్కటే,
ప్రాప్తంబైన ననూరు డాకసమునన్ వర్తించు సారధ్యమున్
సుప్తంబందున నున్న జీవతతికిన్ సూర్యుండు మేల్కొల్పగా
సప్తోద్భాసిత వర్ణ భాస రథియై సంచారమున్ సల్పెడున్.
అట్టి సూర్యుని సత్కృప నలరుడయ్య.
ఆయురారోగ్యములతోడ నసదృశమగు
గుణము ధాన్యము సంపత్తి ధనము లొంది
సుఖములందుచు భూమిపై శోభిలుడయ!
శ్రీ నేమాని వారు ఇలా అభినందన పూర్వకముగా వ్రాస్తున్నారు.
సూర్య స్తోత్రము:
Greetings to all.
ఆదిదేవాయ లోకాప్తాయ సూర్యాయ
దినకరాయ ఖగాయ తేనమోస్తు
వేదస్వరూపాయ బిసరుహమిత్రాయ
త్రిభువన సాక్షిణే తేనమోస్తు
ఏకచక్ర రథాయ లోకైకరక్షాయ
త్రివిధ తాపహరాయ తేనమోస్తు
బ్రహ్మవిష్ణీశ్వరత్రయ తత్త్వవిభవాయ
దేవసంస్తుత్యాయ తేనమోస్తు
పద్మినీ వల్లభాయ శోభాకరాయ
వైనతేయ ప్రచోదిత వాహనాయ
అరుణ కిరణాయ తిమిర సంఘాపహాయ
శ్రితజన హితాయ ప్రహితాయ తేనమోస్తు
Nemani Ramajogi Sanyasi Rao
నమస్తే.జైహింద్.
15, ఫిబ్రవరి 2013, శుక్రవారం
‘మామ! మనమ్ము నున్న ననుమానము మానుమ. నన్ను నమ్ముమా’ మీ పూరణము మనోరంజకమగును గాక.
4 comments
జైశ్రీరామ్.
సోదరీ సోదరులార! అభివాదములు.
‘మామ! మనమ్ము నున్న ననుమానము మానుమ. నన్ను నమ్ముమా!
ఈ సమస్యా పూరణమున మీరు కనబరొచే నిపుణత రచయితలకు మార్గదర్శము కాగలదని ఆశించుచుంటిని. ద్వ్యక్షర గతితో మీ పూరణము సాగినచో మిక్కిలి మనోరంజకముగా నుండ గలదని అశించు చున్నాను. నేనును పూరింప ప్రయత్నించాను.
చూడండి.
మామన మేన మామె. నను మన్నన నెన్ను మనన్ మనమ్ము. మా
మామ ననూన మన్ననను మన్మనమున్ మును మున్నె మొన్ననే
నేమమునెన్ను నన్ను మననీనని మామ మనమ్మునెన్నె. మా
మామ! మనమ్ము నున్న ననుమానము మానుమ నన్ను నమ్ముమా!
15 ఫిబ్రవరి 2013 4:36 PM
రాజేశ్వరి నేదునూరి అన్నారు...
ఏమని జెప్పుదున్ వినగ నీకభి మానము పెంపు జేయగా
నామది నిండుగా దెలిపి నౌరుగ మెప్పును పొంద గోరితిన్
నీమము వీడి నెమ్మికను నేరము లెంచక సంత సంబునన్
మామమ నమ్మునున్న ననుమానము మానుము నన్ను నమ్ముమా !
మీ పూరణముల కొఱకు ఎదురుచూస్తున్నాను.

14, ఫిబ్రవరి 2013, గురువారం
బకింగ్హాంపేలెస్లో వేద మంత్రములను సాధన చేయుచున్న బ్రిటిష్ బాలబాలికలు.
3 comments
జైశ్రీరామ్.
ప్రియ మిత్రులారా! వైదిక సాంప్రదాయముపైన వేద మంత్రాదులపైన ఆసక్తి కనపరచుచు సాధన చేయుచున్న బ్రిటిష్ బాల బాలికలను చూడండి. అట్టి సత్ సంస్కృతికి మూలమైన భారత దేశములో పుట్టిన మనము ఏమి చేయ లేకపోతున్నామో ఏమి చెయ్య వలసి ఉందో ఒక్కమారు మనసుపెట్టి ఆలోచించి అవశ్యాచరణీయమును ఆచరించడానికి ఉద్యుక్తులు అవవలసిన అవసరమెంతైనా ఉంది.
విన్నారు కదా? మన భారతీయులలో ఎందరున్నారు ఇలా శిక్షణనిస్తున్నవారు కాని, శిక్షణ పొందుచున్నవారు కాని. ఒక్కమారు ఆలోచించుకోవాలి
జైహింద్.
13, ఫిబ్రవరి 2013, బుధవారం
శ్రీ భాస్కరానంద నాథ ఇలా తెలియ జేస్తున్నారు.
4 comments
జైశ్రీరామ్.
ప్రియ సాహితీ బంధువులారా!శ్రీ భాస్కరానందనాథ సమాజ శ్రేయస్కాములై ఈ క్రింది విషయాలను సూచించారు.
నమ్మినవారికి అమ్మ అండ దండలు మెండుగా ఉండునని భావిస్తూ ఆ వివరణ మీ ముందుంచుచుంటిని.
15-02-2013 తేది శుక్రవారం శ్రీ లలితా పంచమి
జగన్మాత ఆవిర్భవించిన రోజు. మహత్తరమైన రోజు. రాక్షసులను సంహరించడానికి తానూ అగ్నిగుండం లో నుంచి అవతరించినది.
ఆ తల్లి బాలా త్రిపుర సుందరిగా కొలువై వుండే రోజు. అందరూ చక్కగా శ్రీ లలితా సహస్రనామములు చదువుకొని, ఆ తల్లికి పంచ పూజలు చేసి, ధూప, దీప, నైవేద్యములను సమర్పించ వలసినదిగా మనవి.
ఈ రోజు అమ్మ బాల రూపములో వుంటుంది, బాలలను పూజించండి.
25-02-2013 - మాఘ పౌర్ణమి
ఈ రోజు అమ్మ తన పరిపూర్ణ స్వరూపమతో, చతుషష్టి కళలతో లలితా త్రిపుర సుందరిగా, శ్రీ రాజ రాజేశ్వరిగా, శ్రీమత్సింహాసనేశ్వరీ గా పున్నమి వెలుగులో, చంద్ర బింబములో కొలువై భక్తుల కోరికలను ఈడేర్చేందుకు
సంసిద్దురాలై వుంటుంది. ఈ రోజు అమ్మ పెద్ద ముత్తైదు రూపములో వుంటుంది, కావున ఈ రోజు ఇంటికి వచ్చిన మొదటి ముత్తైదువును పూజించండి. ఎవరు కనిపించినా వెంటనే పసుపు, కుంకుమలను, వస్త్రములను సమర్పించండి. పౌర్ణమి నాడు అమ్మ విశేష కృపతో, ప్రేమతో నిండి వుంటుంది, అడిగిన వారికీ అడిగినట్లుగా అన్నీ తీరుస్తుంది. ఈ రోజు అమ్మ నవ్వును చంద్ర బిమ్బములో చూచిన వాడు ధన్యుడు.
ఈ రోజు అందరూ ఆ తల్లికి పంచ పూజలు చేసి, ఐదు సార్లు లలిత సహస్రనామ పారాయణ చేయవలెను. అలా చేసిన వారికి,
యత్రాస్తి భోగోన చ తత్ర మోక్షః
యత్రాస్తి మోక్షో న చ తత్ర భోగః
శ్రీ సుందరీ సేవన తత్పరాణాం
భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ
నిష్కామముగా పారాయణ చేసిన వారికి బ్రహ్మ జ్ఞానము, ధనార్ధికి ధనము, కీర్తిని కోరువారికి కీర్తిని, విద్యను కోరువారికి విద్య, భోగము కోరుకోనువారికి భోగము, మోక్షము కోరుకోనువారికి మోక్షము సిద్ధించును.
అందరూ ఆ తల్లి యొక్క పరి పూర్ణ అనుగ్రహమును పొందెదరు గాక. మాయను తొలగించి బ్రహ్మ విద్యను ప్రసాదించే తల్లి ఈ తల్లి.
అమ్మ ఉపాసన మొదలు పెట్టాలను కొనే వారికి మంచి సుదినము ఈ రోజు. ఆ చిత్కళ దొరికేరోజు ఈ రోజు. అమ్మ కాళ్ళు పట్టుకోండి, మీకు సాధ్యం కానిది ఏదీ ఉండదు.
జగత్తు అంతా అమ్మ మయం . అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే.
చూచారు కదండి.
నమస్తే.
జైహింద్.
12, ఫిబ్రవరి 2013, మంగళవారం
ఈ సమస్యను పూరించే సమర్థులు మీరు కాక మరెవరు?
9 comments
జైశ్రీరామ్.
ప్రియ ఆంధ్రామృతాభిమానులారా!
ఈ క్రింది సమస్యను మీరైతే సున్నాయాసంగా పూరించ గలరని నమ్ముతున్నాను. వ్రాసి పంపండి.
వెరవును లావు చేవయును వీరము బీరము గల్గి యోడెనే!
నా పూరణమును వ్యాఖ్యలో పరికించండి.
జైహింద్.
11, ఫిబ్రవరి 2013, సోమవారం
9, ఫిబ్రవరి 2013, శనివారం
శ్రీ అనంత కృష్ణ గారికి చంపక - కంద - గీత - గర్భ సీసము.
3 comments
జైశ్రీరామ్.
సుగుణాకరులారా! ఈ రోజు ఎంతో ఆనందప్రదమైనది. అనంత భక్తిభావ సంపన్నులైన శ్రీ అనంత కృష్ణ (ఉన్నత న్యాయస్థానము న్యాయవాది)కవి నాపై అవ్యాజానురాగముతో మా గృహమునకు విచ్చేసిరి.
వారి భక్తి మనోజ్ఞమైన శతకద్వయము(వరసిద్ధి వినాయక శతకము, ౨.లలిత శతకము)ను నాకు ప్రసాదించి, ఆయా శతకములందలి వారి మనోగత భావములను వివరించి మహదానందమును కలిగించిరి. వారి ప్రేమానురాగాలకు ప్రతిస్పందిచి పలుకుటకు నాకు మాటలు కరువైనవి ఐనను, కృతజ్ఞతా పూర్వకముగా వారినుద్దేశించి నా మనోగతమును ఈ విధముగ వ్యక్తపరచితిని.
సుహృన్మణి అనంత కృష్ణ గారూ! నమస్సులు.
మీ హృదయాకాశసముద్భవానంత సత్కవితామృతఝరి నను అమందానందతుందులిత హృదయునిగా చేసినది.
చంపక - కంద - గీత - గర్భ సీసము:-
వర గుణ గణ్యుడా! పరమ భావన మీ ధనవ్రాతమందువా! నవ్య తేజ!
సరస కవీశ మీ శ్రవణ సమ్మత కావ్యజ క్రాంతి గంటినే! సదయ హృదయ!
ధర జన సేవ్యమై పరగు ధారణ చూపెడు ప్రాభవంబురా! సుప్రసిద్ధ!
మరువనురానినున్ నిరుపమాన కవీశ్వర జ్ఞేయ మీవగా! రవిప్రకాశ.
వరలు సిద్ధి వినాయకు భక్తి గొలిచి,
లలిత పదములు మదిగని కొలిచి, గురువు
మహిత చంద్ర కళాధరు మన్ననమున
జ్ఞాన తేజంబునన్ వెల్గు కవివి నీవు.
చ:- వర గుణ గణ్యుడా! పరమ భావన మీ ధనవ్రాతమందువా!
సరస కవీశ మీ శ్రవణ సమ్మత కావ్యజ క్రాంతి గంటినే!
ధర జన సేవ్యమై పరగు ధారణ చూపెడు ప్రాభవంబురా!
మరువనురానినున్ నిరుపమాన కవీశ్వర జ్ఞేయ మీవగా!
క:- గుణ గణ్యుడా! పరమ భా
వన మీ ధనవ్రాతమందువా! సరస కవీ
జన సేవ్యమై పరగు ధా
రణ చూపెడు ప్రాభవంబురా! మరువనురా!
గీ:- పరమ భావన మీ ధనవ్రాతమందు!
శ్రవణ సమ్మత కావ్యజ క్రాంతి గంటి!
పరగు ధారణ చూపెడు ప్రాభవంబు!
నిరుపమాన కవీశ్వర జ్ఞేయ మీవ!
ఈ సహృదయుని శతకములందలి పద్యమాణిక్యములను అవకాశమున్నపుడెల్ల పరికింప గలము.
వారి రాకకు మరొక్కమారు ధన్యవాదములు తెలుపుకొనుచున్నాను.
జైహింద్
‘మధుర వాగ్ఝరి మన్నన మాయఁ జేసె’ కందంలో పూరించగలరు.
14 comments
జైశ్రీరామ్.
ప్రియ పాఠకపుంగవులారా!
పద్యరచనాసక్తి పరిఢవిల్లుతున్న వీ హృదయాలను చూస్తుంటే ముచ్చటగా ఉంది.
ఈ పర్యాము ఒక చిన్న నూతన గతిలో రచనలు పూరణలు చేసే మార్గమున సమస్యాపూరణ చేసే ప్రయత్నం చేద్దామా?
ఈ క్రింది సమస్య తేటగీతిలో ఉంది. ఈ సమస్యను తేటగీతిలో కాకుండా కందంలో పూరించాలి.
చూడండి సమస్యను.
‘మధుర వాగ్ఝరి మన్నన మాయఁ జేసె’
ఈ సమస్యకు నా పూరణమును వ్యాఖ్యలో చూడనగును.

8, ఫిబ్రవరి 2013, శుక్రవారం
సమస్య నాది. పూరణ మీది. ‘చెదరిన జీవియయ్యె వెత జెందెను దైవ కృపాభిషిక్తుడై’
8 comments
జైశ్రీరామ్.
నిరుపమాన సాహిత్యాభిమానులారా!
ఈ క్రింది సమస్యకు చక్కని పూరణమును మీరైతే సునాయాసంగా అందజేయ గలరనే నా విశ్వాసం వ్యర్తము కాదు. ప్రయత్నించగలరు.
‘చెదరిన జీవియయ్యె వెత జెందెను దైవ కృపాభిషిక్తుడై’
నా పూరణను వ్యాఖ్యలో చూడనగును.

5, ఫిబ్రవరి 2013, మంగళవారం
‘కన్యను ధార పోయమన, కాదని పొమ్మనె. పుణ్యమూర్తి తా’ ఈ సమస్యను మీరైతే సముచితంగా పూరిస్తారు.
7 comments
జై శ్రీరామ్.
సాహితీ బంధువులారా!
ఈ క్రింది సమస్యాపూరణము మీరైరే సముచితముగా చేయగలరని నా విశ్వాసము.
కన్యను ధార పోయమన, కాదని పొమ్మనె. పుణ్యమూర్తి తా.
ఈ సమస్యకు నా పూరణమును వ్యాఖ్యానంలో చూడ గలరు.
జైహింద్.
4, ఫిబ్రవరి 2013, సోమవారం
అశ్వత్థ వృక్ష(రావి చెట్టు) ప్రదక్షిణ విధి, ఆవశ్యకత - వ్రాసినది శ్రీ జనార్థన శర్మ
3 comments
జైశ్రీరామ్.
మిత్రులారా! ఏ పుట్టలో ఏ పాముంటుందో, ఏ విషయ సంగ్రహణం వల్ల ఏ సత్ఫలముంటుందో అంత సులభంగా అర్థం కాదు మనకు.శ్రీ జనార్థన శర్మగారు వ్రాయగా శ్రీ రాజశేఖరుని విజయ శర్మ అంద జేసిన అశ్వత్థవృక్ష ప్రదక్షిణావశ్యకత, ప్రదక్షిణ విధానము వివరములు.
అశ్వత్థ ప్రదక్షిణ విధి
శనివారమునాడు శ్రీ శనైశ్చర దేవతా పీడా పరిహారమునకై అశ్వథ్థ ప్రదక్షిణము చెప్పబడినది.
అశ్వథ్థ వృక్షమును ఒక్క శనివారమునాడు మాత్రమే ముట్టుకోవచ్చును.
అశ్వథ్థ ప్రదక్షిణ , త్రిమూర్తుల సేవలలో ఒకటి.
ఉదకశాంతి మంత్రములలో వచ్చు " నమో అస్తు సర్పేభ్యో యేకే చ పృథివీ మను .... " అను మంత్రము లోని ’సర్పము ’ అను శబ్దమునకు ’ సూర్య కిరణము ’ అని కూడా అర్థమున్నది. ( ఈ మంత్రము రాహు గ్రహ ప్రత్యధిదేవత మూల మంత్రము కూడా )
అశ్వత్థ వృక్షము(రావి చెట్టు) ఆకులనుండీ ప్రసరించే సూర్య కిరణాలు గర్భవతుల పై పడినచో ఆ పుట్టబోయే వారికి ’ కాల సర్ప దోషము ’ కలగదు. వారి జాతకములో కాల సర్పదోషము ఉండదు. అందుకే , గర్భవతులు రావి చెట్టు ప్రదక్షిణము చేయవలెనని విధించినారు.
ప్రదక్షిణ చేయునపుడు చెప్పవలసిన
శ్లోకము:- మూలతో బ్రహ్మ రూపాయ - మధ్యతో విష్ణు రూపిణే
అగ్రతో రుద్రరూపాయ - వృక్షరాజాయ తే నమః.
పై శ్లోకము చెప్పుచూ యథాశక్తి 7 - 12 - 24 - 48 - 108 సార్లు ప్రదక్షిణలు చేసి అనంతరము కింది శ్లోకము చెప్పుచూ ప్రదక్షిణ సంఖ్యానుసారముగా అశ్వథ్థ వృక్షమునకు నమస్కరించవలెను.
శ్లో:- అశ్వత్థ హుతభుక్ వ్యాసో గోవిందస్య సదాశ్రయః
అశేషం హర మే శోకం వృక్షరాజ నమోஉస్తుతే.
నమస్తే.
జైహింద్.
2, ఫిబ్రవరి 2013, శనివారం
దత్త పది:- మోదము - రోదము - వేదము - జూదము . భారతం లోని కథ. స్వేఛా ఛందములో వ్రాయ గలరు.
6 comments
జైశ్రీరామ్.
దత్త పది:-
మోదము - రోదము - వేదము - జూదము .
భారతం లోని కథను స్వేఛా ఛందములో వ్రాయ గలందులకు మనవి.
నా పూరణను వ్యాఖ్యలో చూడ గలరు.
జైహింద్.
దత్త పది:-
మోదము - రోదము - వేదము - జూదము .
భారతం లోని కథను స్వేఛా ఛందములో వ్రాయ గలందులకు మనవి.
నా పూరణను వ్యాఖ్యలో చూడ గలరు.
జైహింద్.
1, ఫిబ్రవరి 2013, శుక్రవారం
జయతు జయతు దేవో దేవకీ నందనోஉయం
5 comments
జైశ్రీరామ్.
శ్లో:-
జయతు జయతు దేవో దేవకీనందనోஉయం
జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీప:!
జయతు జయతు మేఘశ్యామల: కోమలాంగో
జయతు జయతు పృథ్వీభారనాశో ముకున్ద:!!
గీ:-
దేవకీ నందనా! కృష్ణ దేవ! జయము.
వృష్ణి వంశ ప్రదీప! శ్రీ కృష్ణ జయము.
కోమలాంగాశిత బాల గోప జయము.
పృథ్వి దుర్భార దూర శ్రీ కృష్ణ జయము.
భావము:-
దేవకీ కుమారుడైన దేవదేవునికి జయము జయము! వృష్ణి వంశ ప్రదీపుడైన శ్రీ కృష్ణునికి జయము కలుగు గాక! మేఘశ్యామలుడు, కోమలాంగుడూ అయిన కృష్ణ భగవానునికి జయము జయము! భూమాత భారాన్ని తగ్గించడానికి అవతరించిన ముకుందునికి జయము జయము!

మేలిమి బంగారం మన సంస్కృతి
(దత్త పది)"రక్ష - భిక్ష - కుక్షి - పక్షి".అనే పదాలనుపయోగించి భగవంతునికీ భక్తునికీ అనుసంధాన పరచండి.
12 comments
జైశ్రీరామ్.
ఆర్యులారా!
దత్త పది:-
"రక్ష - భిక్ష - కుక్షి - పక్షి".అనే పదాలనుపయోగించి భగవంతునికీ భక్తునికీ అనుసంధానం చేస్తూ పూరించి వ్యాఖ్యగా పంప గలరని ఆశింతును.
నా పూరణను వ్యాఖ్యలో చూడగలరు.
జైహింద్.
ఆర్యులారా!
దత్త పది:-
"రక్ష - భిక్ష - కుక్షి - పక్షి".అనే పదాలనుపయోగించి భగవంతునికీ భక్తునికీ అనుసంధానం చేస్తూ పూరించి వ్యాఖ్యగా పంప గలరని ఆశింతును.
నా పూరణను వ్యాఖ్యలో చూడగలరు.
జైహింద్.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)