గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, నవంబర్ 2015, సోమవారం

సంస్కృత వ్యాకరణము ౧౧ నుండి ౨౦. వరకు.

1 comments


29, నవంబర్ 2015, ఆదివారం

సంస్కృత వ్యాకరణము ౧ నుండి ౧౦. వరకు.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! సంస్కృత వ్యాకరణమును గూర్చి తెలుసుకుందామా? ఐతే విందాము.జైహింద్.

28, నవంబర్ 2015, శనివారం

అసహాయః సమర్ధోపి ... మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. అసహాయః సమర్ధోపి తేజస్వీ కిం కరిష్యతి?
నిర్వాతే జ్వలతే వహ్నిః స్వయమేవోపశామ్యతి.
ఆ.వె. పరుల తోడు లేక బలవంతుఁడైనను
చేయ లేడు పనులు చేవ చూపి.
గాలి తోడు లేక ఘనమైన యగ్నియు
నారిపోవుఁ గాదె దారి లేక. 
భావము. శూన్యంలో అగ్ని తనంతట తానే ఉపశమిస్తుంది, కారణం తనకి తోడుగావుండవలసిన గాలి, ఆమ్లజని తగినంత మోతాదులో దొరకక తనంతతానే ఆరి పోతుంది. అలాగే ఎంతటి సమర్ధుడైనా తేజోవంతుడైనా ఇంకొకరి సహాయం లేకపోతే ఏమీ చేయ లేడు. 
జైహింద్.

27, నవంబర్ 2015, శుక్రవారం

అపర గాంధీ శ్రీ నితీష్ చొరవతో కాబోతున్న మద్య రహిత బీహార్

3 comments

జైశ్రీరామ్.
బీహార్ ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీనితీష్ కుమార్ గారికి హృదయ పూర్వక అభినందనలు.
01 - 04 - 2016 నుండి బీహార్ రాష్ట్రములో మద్యపానమును పూర్తిగా నిషేధించటానికి వర్యలు చేపట్టి నందులకు గర్విస్తూ, మీరు ముఖ్యమంత్రి అయినందులకు చాలా సంతోషిస్తున్నాము. నిజంగా మీరు తీసుకొన్న ఈ నిర్ణయం పూర్తిగా కార్యరూపం దాలిస్తే గాంధీ మహాత్ముఁడు కలలు కన్న భారతికి మీరు నాందీ పలికినవారవతారు. 
మీరు చేపట్టిన ఈ సత్కార్యము మిగిలిన రాష్ట్రాలకు కూడా మార్గదర్శకం కావాలని, భారతమాత ఆనందంతో పులకరించాలని మనసారా కోరుకొంటూ,  మీరు చేపట్టే మంచి పనులకు ఆ పరమాత్మ ఎల్లప్పుడూ సహకరించాలని మనసారా కోరుకొంటున్నాను.
జైహింద్.

శివుడి పుష్పార్చన ఎలా చేయాలి? ఫలితం ఏమిటి? ... బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు..

0 comments

జైశ్రీరామ్
శివుడి పుష్పార్చన ఎలా చేయాలి? 
ఫలితం ఏమిటి?
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు.
నిత్యం మనం భగవంతునికి చేస్తున్న పూజలలో పుష్పాలదే అగ్రస్థానం. ఏ స్వామి పూజ అయినప్పటికీ, ఏ తల్లి పూజ అయినప్పటికీ, వారి వారి పూజలలో పుష్పాలకే ప్రాముఖ్యత. ఎన్నో పూజా ద్రవ్యాలుండగా, పుష్పాలకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని అనిపించవచ్చు. పుష్పం యొక్క ముఖ్యత్వాన్ని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి.
పుష్పామూలే వసేద్బ్రహ్మ మధ్యేచ కేశవః
పుష్పాగ్రేచ మహాదేవః సర్వదేవాః స్థితాదలే
పుష్పం మొదట్లో బ్రహ్మ, పుష్పమధ్యమంలో కేశవుడు, పుష్పపు కొనలో మహాదేవుడు నివశిస్తుంటారు. పుష్ప దళాలలో సర్వదేవతలుంటారని ప్రతీతి.
పరంజ్యోతిః పుష్పగతం పుష్పేణైవ ప్రసీదతి
త్రివర్గ సాధనం పుష్పం పుష్టిశ్రీ స్వర్గమోక్షదమ్
పువ్వులలో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నుడవుతుంటాడు. కాబట్టి పుష్పం త్రివర్గ సాధనం. అంటే సంపదలను, స్వర్గాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది.
పుష్పైర్దేవాః ప్రసీదంతి పుష్పేదేవాశ్చ సంస్థితాః
కించాతి బహునోక్తెన పుష్పస్యోక్తి మత్రంద్రికామ్.
పుష్పాలతో దేవతలు ప్రసన్నులవుతుంటారు. ఎందుకంటే వారు పుష్పాలలో నివశిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే పుష్పాలలో చైతన్యం ఉంటుంది.
ఇక, మన పురాణాలలో ఒక్కొక్క దేవతకు ఇష్టమైన పువ్వులను గురించి కూడ ప్రస్తావించబడింది. విష్ణువుకు, దుర్గాదేవికి, వినాయకుని రకరకాల పుష్పాలతో పూజించ వచ్చని పేర్కొనబడగా, శివునికి మాత్రం మారేడు ప్రతిచాలన్నట్లుగా చదువుతుంటాం. ఈ విషయాన్నే శ్రీనాథ మహాకవి వర్ణించాడు.
శివుని శిరమున కాసిన్ని నీళ్ళుజల్లి - పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు
కామధేను వతడింట గాడిపసర - మల్ల సురశాఖి వానింట మల్లెచెట్టు
శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు ప్రతిని శివలింగంపై పడవేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటిపశువుగా ఉంటుంది. ఆ భక్తుని ఇంట కల్పతరువు మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయాసముద్రుడు శివుడు. మరి, అంతటి బోళాశంకరునికి మారేడు దళాలు తప్ప మరే పుష్పాలతో పూజించే అవకాశం లేదా?!
ఈ ప్రశ్నకు సమాధానం శివధర్మసంగ్రాహం, శివరహస్యఖండం, లింగపురాణం, కార్తీకమాహాత్మ్యం గ్రంథాలు చెబుతున్నాయి. శివునికి ఇష్టమైన పువ్వుల గురించి ఆ గ్రంథాలు ఇలా చెబుతున్నాయి.
శివుని పుష్పాలతో పూజిస్తే, పది అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుంది. ఎవరైతే కనీసం ఎనిమిది పుష్పాలతో శివుని పూజిస్తారో వారికి కైలాసప్రాప్తి కలుగుతుంది. శివుని పూజకు ఉపయోగించే పువ్వులు వాదిపోయినవిగా ఉండ కూడదు. కీటకాడులతో కొరకబదినవిగా ఉండేవి శివ పూజకు పనికిరావు. అలాగే ఇతరుల పూదోటలో పూచిన పువ్వులను దొంగతనంగా తీసుకువచ్చి పూజిస్తే ఫలితం కనిపించదు. ఇంకా పాపం కలుగుతుంది.
శివపూజకు అరణ్యంలో పూచిన పువ్వులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. గన్నేరు, పొగడ, జిల్లేడు, ఉమ్మెత్త, కలిగొట్టు, పెద్దములక, తెల్లదింటెన, కట్లతీగ పువ్వులు, అశోకపువ్వు, మందారం, విష్ణుక్రాంత, జమ్మి, గులాబి, నెమ్మిపూలు, ఉత్తరేణి, తామర, జాజి, చెంగలువ, సంపెంగ, వట్టివేరు పూలు, నందివర్థనం, నాగకేసరం, పొన్న, పచగోరింట, తుమ్మి, మేడి, జయంతి, మల్లె, మోదుగ, మారేడు దళాలు, కుసుమపూవు, కుంకుమపూవు, ఎర్రకలువలు, నీలిపూలు శివపూజకు ప్రశస్తమైనవి. ఈ పుష్పాలతో ఏ పుష్పాన్ని సమర్పించినప్పటికీ శివ పరమాత్మ ఆనందంతో స్వీకరిస్తాడు. ఈ విషయాన్ని స్వామివారే ఉమాదేవికి చెప్పినట్లు పురాణవాక్కు.
అదేవిధంగా శివుని ఏయే మాసాలలో ఏయే పూలతో పూజిస్తే ఏయే ఫలితం ఉంటుందన్న విషయాన్ని గురించి కూడ చెప్పబడింది. చైత్రమాసంలో శంకరుని నృత్యగీతాలతో సేవిస్తూ, దర్భ పువ్వులతో పూజిస్తే బంగారం వృద్ధి చెందుతుంది. వైశాఖమాసంలో శివుని నేతితో అభిషేకిస్తూ తెల్లని మందారాలతో పూజిస్తే వారికి అశ్వమేధఫలం కలుగుతుంది.
జ్యేష్ఠ మాసంలో పెరుగుతో అభిషేకిస్తూ తామరపువ్వులతో పూజించిన వారికి పరమగతి కలుగుతుంది. ఆషాఢమాసంలో కృష్ణ చతుర్ధశినాడు స్నానం చేసి శివునికి గుగ్గిలంతో ధూపం వేసి తొడిమల తోడిమాలతో కూడిన పుష్పాలతో అర్చించినవారికి బ్రహ్మలోకాన్ని పరమపదం లభిస్తుంది. శ్రావణమాసంలో ఒంటి పూట భోజనం చేస్తూ గన్నేరుపూలతో శివుని పూజించినవారికి వేయిగోదానముల ఫలం లభిస్తుంది. భాద్రపద మాసంలో శివుని ఉత్తరేణి పూలతో పూజించిన వారు హంసధ్వజంతో కూడిన విమానంలో పుణ్యపదానికి చేరుకుంటారు. ఆశ్వయుజమాసంలో పరమశివుని జిల్లేడుపూలతో పూజించినవారు మయూర ధ్వజంతో కూడిన విమానంలో దివ్యపదాన్ని చేరుతారు.
కార్తీకమాసంలో శివుని పాలతో అభిషేకించి జాజిపూలతో పూజించినవారు శివపదాన్ని దర్శించుకుంటారు. మార్గశిర మాసంలో శివుని పొగడపూలతో పూజించినవారు, ముల్లోకాలను దాటి తామున్నచోటికే తిరిగిరాగలరు. పుష్యమాసంలో శివుని ఉమ్మెత్త పూలతో పూజించినవారు పరమ పదాన్ని పొందగలరు. మాఘ మాసంలో శివదేవుని బిల్వదళాలతో అర్చించినవారు, లేత సూర్యుడు, చంద్రుడులున్న విమాన,లో పరమపదానికి వెళతారు. ఫాల్గుణమాసంలో శివుని సుగంధజలంతో అభిషేకించి తుమ్మిపూలతో పూజించినవారికి ఇంద్రుని సింహాసనంలో అర్ధభాగం దక్కుతుంది.
ఇక, శివపూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే, ఒక్కొక్క ఫలితం కలుగుతుంటుంది. శివుని రోజూ జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసిననంత ఫలితాన్ని పొందుతారు.
శివపూజకు సంబంధించినంత వరకు వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.
వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.
వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం.
వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.
వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మేత్తుపువ్వు ఉత్తమం.
వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం.
వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మిపూవు ఉత్తమం.
వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.
వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపువ్వు ఉత్తమం.
వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపువ్వు శ్రేష్ఠం.
వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు. శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువపువ్వు ఉత్తమోత్తమమైనది. శివునికి వేయినల్ల కలువలతో మాలను అల్లి సమర్పించినవారు, శివునితో సమమయిన పరాక్రమంగలవారై వందల, వేలకోట్ల కల్పాలు నిత్యకైలాసంలో నివశిస్తారు. ఈ పుష్పమాలతో కాక మిగతా పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు.
పరమశివునికి పొగడపూలంటే అమితమైన ఇష్టం. ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడపువ్వుతో అర్చించే భక్తుడు వేయిగోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు.
ఒక నెలపాటు పొగడపూలతో పూజించినవారు స్వర్గ సుఖాలను పొందుతారు. రెండునెలలపాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు. మూడు నెలల పాటు పొగడపూలతో అర్చించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి. నాలుగు నెలలు పూజించినవారికి కార్య సిద్ధి. ఐదు నెలలు పూజించినవారికి యోగసిద్ధి. ఆరు నెలలు పూజించినవారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది.
సాధారణంగా శివునికి బిల్వపత్రాలే ప్రీతిపాత్రమైనవి. మిగతా పత్రాలు ప్రీతికరం కావని అనుకుంటుంటాం. లింగపురాణం ఆ స్వామికి ఇషామైన మరిన్ని పత్రాలను గురించిన వివరాలను అందిస్తోంది. మారేడు, జమ్మి, గుంట గలగర, అడ్డరసము, అశోకపత్రాలు, తమాలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచీపత్రి, నల్ల ఉమ్మెత్త, తామరాకు, నీతికలువ, మెట్టకలువ ఆకులు, సంపెంగ పత్రి, తుమ్మి, ఉత్తరేణి ఆకులను పత్రాలను పూజలో ఉపయోగించవచ్చు. అంటే, ఆయా పుష్పాలు లభించనపుడు, ఆయా పత్రిని ఉపయోగించవచ్చు.
ఇక పుష్పదానానికి సంబంధించినంతవరకు, పుష్పాన్ని గాని, ఫలాన్నిగాని దైవానికి నివేదిస్తున్నప్పుడు ఆ పుష్పం ముఖం బోరగిలబడకూడదు. అలా చేయడంవల్ల దుఃఖం కలుగుతుంది. అయితే ఆ పుష్పాలను లేక పత్రిని దోసిట్లో పెట్టుకుని నివేదించేటప్పుడు బోర్లాపడినప్పటికీ దోషం కాదు. ఉమ్మెత్త, కడిమిపువ్వులను శివునికి రాత్రివేళ సమర్పించాలి. మిగిలిన పూలతో పగిటిపూట. మల్లెలతో రాత్రివేళ, జాజి పూలతో మూడవజామున, గన్నేరుతో అన్నివేళలా పూజించవచ్చు.
ఇప్పటివరకు మనం ఏయే పూలతో శివుని పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం. అయితే మన మనసులోని కోరికననుసరించి కూడ శివునికి పువ్వులను సమర్పించవచ్చు. ఉదాహరణకు ధనం కావాలను కున్నవారు శివుని గన్నేరుపూలతో, మోక్షం కావాలంటే ఉమ్మెత్తపూలతో, సుఖశాంతుల కోసం నల్లకాలువతో, చక్రవర్తిత్వం కోసం తెల్లతామరలతో, రాజ్యప్రాప్తి కోసం ఎర్రతామరలతో, నాగకేసరం, కేసరీపుష్పాలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయట. గన్నేరు, అశోకం, ఊడుగు, తెల్లజిల్లేడులతో పూజించిన వారికి మంత్రసిద్ధి, రోజాపుష్పాలతో లాభాసిద్ధి, దంతి ప్రత్తి పూలతో సౌభాగ్యం కలుగుతుంది. కోరుకున్న కన్యను పొందాలంటే శివుని సన్నజాజి పూలతో పూజించాలి. సంతానం కావాలనుకునేవారు శివుని మొల్లపువ్వులతో పూజించాలి. దర్భపూలతో ఆరోగ్యం, రేలపూలతో ధనం, తుమ్మిపూలతో వశీకరణం, కడిమిపూలతో శత్రుజయం కలుగుతుంది. బిల్వదళ పూజ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. శివుని మరువంతో పూజిస్తే సుఖం, లోద్దుగపూలతో పూజిస్తే గోసంపద కలుగుతుంది. మోదుగ, బూరుగు పూలతో పూజిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది.
ఇక, శివపూజకు పనికిరాని పువ్వుల గురించి మన పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి.
మొగిలి, మాధవి, అడవిమల్లి, సన్నజాజి, దిరిసెన, సాల, మంకెన పువ్వులు శివార్చనకు పనికిరావు. బావంచి ఆకులు, పువ్వులు, కానుగపూలు, తాండ్ర ఆకులు, దాసాని, ఎర్రమద్ది, మందార, విషముష్టి, అడవిమొల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర, తెల్ల గులాబీలు, దిరిసెన పువ్వులు శివపూజకు పనికిరావు. వేప, వెలగ, గురివింద పూలు కూడా శివపూజకు అర్హం కావు.
దశసౌగంధికం పుష్పం నిర్గంధియది భామిని
శాతసాహస్రి కామాలా అనంతం లింగపూజసే
పది సుగంధపుష్పాలతో (ఒకవేళ పరిమళం లేకపోయిన వైనప్పటికీ) శివలింగాన్ని పూజిస్తే, శతసహస్రమాలలతో పూజించిన అనంత పుణ్యఫలం లభిస్తుందని శివధర్మ సంగ్రహం చెబుతోంది.
జైహింద్.

26, నవంబర్ 2015, గురువారం

మన్నిందయా యది జన: పరితోష మేతి . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. మన్నిందయా యది జన: పరితోష మేతి
నన్వ ప్రయత్న జనితోzయ మనుగ్రహో మే,
శ్రేయోర్ధినో హి పురుషా: పరతుష్ఠి హేతో:
దు:ఖార్జితాన్యపి ధనాని పరిత్యజంతి.
క. నను నిందించుచు తృప్తిని
గనఁ గలిగిన సంతసంబె కదనా కన్యుల్
ధనమును వెచ్చింతురు పర
జనులను తృప్తులను జేయ, సత్కృతునగుదున్..
నన్ను తిట్టడం వలన జనాలకి ఆనందం కలుగుతోందా !? ఆహా ! ఎంత అదృష్టవంతుడిని !నా భాగ్యం ఎంత గొప్పది ! నా మీద అప్రయత్నమైన అనుగ్రహం చూపించడమే కదా, నన్ను నిందించడమంటే. ఈ విధంగానయినా నన్ను పట్టించుకుంటున్నారంటే నాకు అంత కన్నా ఇంకేం కావాలి? లోకంలో చాలా మంది ఎంతో డబ్బు తగలేసి, ఇతరులకు సంతృప్తిని కలిగించి మరీ వారి కి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు.
మరి నాకో? ఒక్క పైసా ఖర్చు చేయకుండానే ఇతరులకు ఆనందాన్ని కలిగించే భాగ్యం దక్కుతోంది. నన్ను తిట్టడం వలన వారికి అట్టి ఆనందం కలుగుతూ ఉంటే నాకు అంతకన్నా ఏం కావాలి చెప్పండి !
జైహింద్.

25, నవంబర్ 2015, బుధవారం

మాడుగులానిలు మహనీయ పూరణ కవిపుంగవులకెల్ల కమ్ర ఫలము.

3 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
మాడుగులానిలు మహనీయ పూరణ కవిపుంగవులకెల్ల కమ్ర ఫలము.
వారికి నా హృదయ పూర్వక అభినందనలు.
డా. మాడుగుల అనిల్ అవధానిశేఖరుల అనుభూతిని వారి మాటలలోనే విన్న తరువాత ఈ విషయాన్ని మీరే ఒప్పుకుంటారు.
ఇక చూడండి వారేమి చెప్పారో.
ఇటీవల బ్రహ్మశ్రీ ఆచార్య డా.శలాక రఘునాథ శర్మగారు ఇంటికి విచ్చేశారు.
మాటల మధ్యలో వారు శృంగేరిలో బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారి సంస్కృత అవధానంలో సమస్యకు పృచ్ఛకులుగా వ్యవహరించినట్లు తెలిపి
బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారికి వారు ఇచ్చిన శార్దూలవిక్రీడిత సమస్యను చెప్పారు.
ఆ సమస్య –
అజ్ఞానాదిహ మోక్షసిద్ధిరితి సిద్ధాంతశ్చ వేదాంతినామ్ II
“అజ్ఞానము వలన మోక్షము కలుగుతుంది అని వేదాంతుల సిద్ధాంతము” అని ఈ సమస్యకు అర్థము.
నన్ను సమస్య పూరించమని వారు చెప్పలేదు. కాని
విన్న వెంటనే పూరించాలనే ఉబలాటం సహజంగానే నాకుంది.
ఆ సమస్యను నేనిలా పూరించాను.
లోకే మానవ సేవయా చ భగవత్ సేవాఫలం లభ్యతే 
తస్మాన్నాస్తిక వాదినామభిమతం విద్యాత్ తథా దేవతా
ద్యజ్ఞానాదిహ మోక్షసిద్ధిరితి ; సిద్ధాంతశ్చ వేదాంతినా 
మద్వైతామరవాదినాం స భగవాన్ బ్రహ్మైవ జీవేతి హి II
భావము :- లోకంలో మానవ సేవతో కూడ భగవంతుని సేవిస్తే కలిగే సేవాఫలం లభిస్తూ ఉన్నది. అందుకే మానవ సేవయే మాధవ సేవ అన్నారు. అందుకే దేవతల విషయంలో అజ్ఞానం (దేవుడిని తెలియక పోవడము) మోక్ష కారకము, ప్రజా సేవతో భగవంతుడిని పొందవచ్చు అని నాస్తిక వాదుల అభిమతమై ఉండవచ్చు. అద్వైతామర వాదులైన వేదాంతుల అభిమతం కూడ అదే కదా! “జీవో బ్రహ్మైవ నాపరః” అని. జీవుడే బ్రహ్మ. బ్రహ్మయే జీవుడు. కావున అజ్ఞానంతో మోక్షసిద్ధి కలుగుతుంది.
ఆ తరువాత బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారికి అవధానానికి ముందు ఇచ్చిన మరొక తెలుగు సమస్యను నా ముందుంచారు.
ఆ సమస్య –
మద విభ్రాంత వివేక శీలునకు సంప్రాప్తించు మోక్షంబిలన్ II
మదము పట్టిన వివేక శీలునికి మోక్షము లభిస్తుంది అని ఈ సమస్యకు అర్థము. దానిని నేనిలా పూరించాను.
పెదవుల్ శ్రీహరి నామ కీర్తనమునన్ విప్పారి చెన్నొందగా 
పదముల్ పంకజ నాభు చెంతకని దేవస్థానముంజేర , ని
చ్చెదనార్జించిన సొమ్ము పేదకనుచున్ శీఘ్రమ్ముగా వెళ్ళు కా 
మద విభ్రాంత వివేక శీలునకు సంప్రాప్తించు మోక్షంబిలన్ II
భావము :- పెదవులు శ్రీ హరినామ కీర్తనలో సాఫల్యాన్ని పొందుతూ ఉండగా, కాళ్ళు దేవుని చేరడానికని దేవస్థానాల వైపు వెళ్తుండగా, తాను కష్టపడి ఆర్జించిన ధనాన్ని పేదవారికి పంచి పెట్టడానికి వెంటనే వెళ్ళి, కోరిన కోరికలు తీర్చడానికి యాచకులకు పిచ్చిగా దానము చేసే వానికి మోక్షము లభిస్తుంది.
మరల
బ్రహ్మశ్రీ ఆచార్య డా.శలాక రఘునాథ శర్మగారు
చిర్రావూరి శ్రీ రామ శర్మ గారికి ఇచ్చిన సంస్కృత సమస్యను చెప్పారు.
ఆ సమస్య –
చిత్తుకాపికదేందిరా II
చిత్ తు కా అపి క దా ఇందిరా ఇవన్నీ మహాలక్ష్మికి విశేషణ పూర్వ పదాలు. ఏకాక్షరాలు. వాటిని శలాక వారు తెలియజేస్తే తప్ప నేను తెలుసుకోలేను.
కాని
ఎక్కడైనా అవధానాలలో అట్లా ఇస్తే ఏమి చేయాలి ? 
అందుకే నా మార్గంలో నేను పూరించి చూపాను. నా పూరణ –
పరీక్షామలిఖత్ ఛాత్రః గ్రంథం దృష్ట్వా , తదా గురుః I
అపృచ్ఛదాంధ్ర బాలం తం చిత్తుకాపికదేందిరా II
భావము :- పిల్లవాడు పుస్తకాన్ని చూస్తూ పరీక్ష వ్రాస్తున్నాడు. అయ్యవారు దానిని చూశాడు. ఆ బాలుడు తెలుగువాడు. అందుకే తెలుగులో “చిట్టీ పెట్టి వ్రాయడానికి అదేమిరా పుస్తకమే పెట్టి వ్రాస్తున్నావు ?” అని అడిగినాడు.
శలాక వారు అప్పుడు సమస్య సంస్కృతంలో ఉంది కదా! అని నవ్వుతూ కలగజేసుకున్నారు.
అపృచ్ఛదాంధ్ర బాలం తం (తెలుగు పిల్లవాడిని అడిగినాడు) అని కదా నేను పూరించాను అన్నాను.
అందుకు వారు ఆనందించారు.
ఇవన్నీ ఒక వైపు ఇద్దరు కూడ world cup semi final చూస్తూ జరిపినవి.
వారు మరొక సమస్యను –
భీమో భీమః సురపతిసుతం దంతకూరే జఘాన II అని ఇచ్చారు.
భీముడు రణరంగ భీముడు అర్జునుని యుద్ధంలో చంపినాడు అని ఈ సమస్యకు అర్థము.
దానిని నేనిలా పూరించాను. –
సుగ్రీవోsసౌ జనకతనయా వల్లభం చాశ్రయిత్వా
తస్మిన్ పార్శ్వే సమరసుముఖః హంతుకామో జగామ I
వీరో వాలిః బత! విధివశాత్ దుర్బలోs భూత్ తదా హి
భీమోsభీమః సురపతిసుతం దంతకూరే జఘాన II
భావము :- వాలికి భయపడి రాజ్యము కోల్పోయి పారిపోయిన సుగ్రీవుడు శ్రీరాముని ఆశ్రయించినాడు. శ్రీరాముడు చెంతనుండగా యుద్ధము చేయడానికి సుముఖుడై వాలిని చంపడానికి వెళ్ళినాడు. అయ్యో! అప్పుడు వీరుడైన వాలి దైవబలం వలన దుర్బలుడైనాడు. యుద్ధ రంగంలో భీముడైన వాలి అభీముడైనాడు. అప్పుడు ఇంద్రుని కుమారుడైన వాలిని సుగ్రీవుడు యుద్ధంలో చంపినాడు.
ఈ సమస్యలకు నా పూరణలను వినిన
ఆచార్య బ్రహ్మశ్రీ ఆచార్య డా.శలాక రఘునాథ శర్మగారు బాగున్నది అని ఊరికే చెప్పి చాలించలేదు.
మరుసటి దినము క్రొత్త శాలువ తీసుకొని వచ్చి సన్మానించి దీవించారు.
 అన్ని సన్మానాలకన్నా ఉప్పొంగి వచ్చిన ఆనందంతో వారు చేసిన సన్మానము చిరస్మరణీయము.
ఇట్లు
మీ మాడుగుల అనిల్ కుమార్.
జైహింద్.

24, నవంబర్ 2015, మంగళవారం

కార్తీక పూర్ణిమ ఆచరణీయములు. బ్రహ్మశ్రీ సామవేదం.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

కవితా కన్య వేసే వర మాల ఎవరి మెడలో ? శ్రీమాన్ పంతుల జోగారావు

2 comments

జైశ్రీరామ్.
వర మాల ఎవరి మెడలో?

నైవ వ్యాకరణఙ్ఞ మేతి పితరం న భ్రాతరం తార్కికం,
దూరాత్సంకుచితేవ గచ్ఛతి పునశ్శుండాల వచ్ఛాంధసాత్,
మీమాంసానిపుణం నపుంసక ఇతి ఙ్ఞాత్వా నిరస్యాదరాత్,
కావ్యాలంకరణఙ్ఞ మేవ కవితాకన్యా వృణీతే స్వయమ్.
కవితా కన్యకు వెలకట్టగల రసఙ్ఞు లెవరు ?
కవితా కన్యకు ప్రియు లెవరు ?
వ్యాకరణ వేత్తలా ? తార్కికులా ? ఛాందసులా ? మీమాంసకులా ? కావ్యాలంకరణ వేత్తలా ?
ఎవరినామె వరిస్తుంది? ఎందు చేత? ఇవీ ప్రశ్నలు. ఇవిగో జవాబులు:
కవితా కన్యకు వ్యాకరణవేత్త తండ్రివంటి వాడు. అతడామె గుణ దోషములను విచారించి, చక్కగా తీర్చి దిద్దుతాడు. తండ్రిలాంటి వ్యాకరణవేత్తను కవితా కన్య అభిలషించే ప్రశ్నే లేదు.
ఇక తార్కికుడో ? అతడామెకు సోదరతుల్యుడు. ఆమె అతనిని అంగీకరించదు. ఛాందసుడు - అంటే వేదవేత్త. లౌకిక ఙ్ఞాన శూన్యుడు. వేదాధ్యయన జడుడు. కనుక ఆమె అతనిని అంగీకరించదు. మత్త గజంనుండి దూరంగా జరిగి పోయినట్టుగా ఆమె అతనిని సమీపించదు.
మీమాంసా నిపుణుడో ? అతడు నపుంసకుడని తలచి వానినుండి దూరంగా జరిగి పోతుంది.
వైయాకరణులు , తార్కికులు , ఛాందసులు , మీమాంసకులు ... వీళ్ళందరూ కవిత్వ విషయంలో ఏకపక్షంగా ఉండే వాళ్ళే. వాళ్ళ శాస్త్రం ప్రకారం ఆమె గుణగణాలను మదింపు చేసే వారే. ఎవరికీ కవితా రసాన్ని ఆస్వాదించే లక్షణం లేదు. లక్ష్య లక్షణ యుక్తంగా ఉందా లేదా అనే తప్ప, వారెవరూ రసాస్వాదనా దృష్టి పరులు కాజాలరు.
అందు చేత కవితా కన్య వారిని అనాదరిస్తుంది. వారి నుండి దూరంగా తొలిగి పోతుంది.
మరి, ఎవరినయ్యా ఆమె వరిస్తుంది ?
కావ్యాలంకరణవేత్తను మాత్రమే ఆమె వరిస్తుంది. అలంకార శాస్త్రఙ్ఞులు మాత్రమే కవితకు వెలకట్టి రసాస్వాదన చేయగల వారు. వారు రసఙ్ఞులు. అందు వల్ల వారే కవితా కన్యకు ప్రియులు.
రసఙ్ఞత ప్రసక్తి ఎలాగూ వచ్చింది కనుక, ఈ పద్యం కూడా చూదాం ...
చదువది యెంత గల్గిన రసఙ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు; గుణసంయుతు లెవ్వరు మెచ్చరెచ్చటన్
పదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చునుటయ్య భాస్కరా !
ఎంత చదువుకున్నా , రసఙ్ఞత ఉండాలయ్యా. అది లేనప్పుడు ఎంత చదువుకున్నా ఆ చదువు వ్యర్ధం .రసాప్వాదన చేసే మనసు ఉండాలి. లేనప్పుడు ఎంత చదివీ ఏం లాభం ? నలపాకంలాగ ఎంత మంచి కూర ఘుమఘుమలాడేలా చెయ్యి, కాని దానికి రుచిని తెచ్చే ఉప్పు వెయ్యడం మానీసేవనుకో, ఆ కూరకి మరి రుచేం ఉంటుంది చెప్పు ?
ఇతర కర్మ ఫలాని యదృచ్ఛయా
విలిఖితాని సహే చతురానన !
అరసికేషు కవిత్వ నివేదనం
శిరసి మాలిఖ మాలిఖ మాలిఖ !!
ఓ బ్రహ్మ దేవుడా ! ఎన్ని కష్టాలయినా నా నుదుటన రాయి. భరిస్తాను. కాని, అరసికులకు కవిత్వాన్ని వినిపించే దుర్గతి మాత్రం ముమ్మాటికీ రాయవద్దయ్యా.
అని కవిగారు వేడుకోవడం తెలిసినదే కదా ?
కొయ్య బొమ్మలె మెచ్చు కళ్ళకు
కోమలులు సౌరెక్కునా? ... ... ... అని గురజాడ తృణీకరించినదీ ఇలాంటి అరసికులనే.
అరసికులలో మరో రకం జాత్యంధకారులు. వీరు కులాన్నిబట్టి కవితకు వెలకడతారు.
నా కవితా వధూటి వదనంబు నెగాదిగఁజూచి, రూపు, రే
ఖా కమనీయ వైఖరులు గాంచి, ‘భళీ!భళి!’ యన్న వాడె, ‘మీ
దే కుల’ మన్న ప్రశ్న వెలయించి, చివాలున లేచి పోవు చో
బాకున గ్రుమ్మినట్లగును పార్ధివ చంద్ర వచింప సిగ్గగున్
నా కవిత్వాన్ని చదివి బాగుందని మెచ్చుకుంటూనే, నా కులం ఏదని అడిగి తెలుసుకుని, చివాలున లేచిపోయి నన్నూ, నా కవిత్వాన్నీ అనాదరించే వారూ ఉన్నారు. అప్పుడు నా గుండెలో బాకు దించినంతగా బాధ కలుగుతుంది. అని బాధతో పలికాడు కవి జాషువా.
అరసికులను మరింత ఘాటుగా తిట్టిన కవి గారూ ఉన్నారు. చూడండి ...
నక్కలు బొక్కలు వెదుకును
అక్కరతో నూరపంది అగడిత వెదకున్
కుక్కలు చెప్పులు వెదుకును
తక్కిడి నా లంజ కొడుకు తప్పే వెదుకున్
ఎంత ఉక్రోషపడితే ఇంత ఘాటయిన తిట్టు వస్తంది చెప్పండి ?
రస సిద్ధి కల కవులకీ, అల్ప కవులకీ తేడా ఎప్పుడూ ఉంటుంది.
శ్లోకం చెబుతే భోజుడు తగిన కానుకలు ఇస్తాడు కదా అనే దురాశతో ఓ కవి శ్లోకం రాయాలని ప్రయత్నించి కొంత వరకూ ఏదో గిలికి, ఆపైన చేత కాక డీలా పడ్డాడు. వాడి అవస్థ చూసి, కాళిదాసు జాలి పడి తక్కినది పూర్తి చేసి ఇచ్చేడు.. ఇంకే ముంది !! ఆ పిల్ల కాకి ... కాదు కాదు ... ఆ పిల్ల కవి దానిని రాజు గారికి వినిపించాడు.
చూడండి ...
భోజనం దేహి రాజేంద్ర !
ఘృత సూప సమన్వితమ్.
ఇంత వరకూ కవిగారి పైత్యం. ఓ రాజా నాకు నెయ్యీ ,పప్పుతో మంచి భోజనాన్ని ఇవ్వవయ్యా అని దీని అర్ధం
మాహిషం చ శరచ్చంద్ర
చంద్రికా ధవళమం దధి:
ఇది కాళిదాస పూరణ.
శరత్కాలపు వెన్నెల లాంటి తెల్లని గేదె పాలతో చేసిన గడ్డ పెరుగుతో భోజనం సమకూర్చవయ్యా అని పూర్తి చేసాడు కాళిదాసు. అప్పటికి కదా, పిల్ల కవి గారి కపిత్వం కవిత్వం అయి శోభించింది. భోజుడు కవితా రసగుణగ్రహణ పారీణుడు కనుక, ఈ శ్లోకంలో కాళి దాసు చేయి పడిందని పోల్చుకుని, కవికి తిని బతకమని ( మరెప్పుడూ కవిత్వం జోలికి వెళ్ళ వద్దని హెచ్చరించే ఉంటాడు, బహుశా) కొంత ధనమిచ్చి, కాళిదాసుకి గొప్ప సత్కారం చేసాడు.
జయన్తి తే సుకృతినో:
రస సిద్ధా: కవీశ్వరా:
నాస్తి తేషాంయశ: కాయే
జరామరణజం భయమ్
రస సిద్ధులయిన కవులు పుణ్యాత్ములు. వారికి జరామరణ భయాలు లేవు. వారు యశ:కాయులు. వారికి జయము కలుగు గాక !
శ్రీమాన్ పంతుల జోగారావు
జైహింద్.

23, నవంబర్ 2015, సోమవారం

మా గురువుదేవులు శ్రీమాన్ గోవిందాచార్యులవారు, శ్రీమాన్ రామ రాజు గారు.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేను ౧౯౬౮ - ౬౯,  ౬౯ - ౭౦,  ౭౦ - ౭౧,  ౭౧ - ౭౨ సంవత్సరములలో ప్రభుత్వ మహారాజా సంస్కృత కళాశాలలో భాషాప్రవీణ చేయుచున్న సందర్భములో శ్రీమాన్ గోవిందాచార్యులవారు , శ్రీమాన్ రామరాజుగారు సంస్కృతకావ్యములు, తెలుగు కావ్యములు బోధించెడివారు.
 నేను ఎడ్మిషన్ టెష్ట్ టు భాషాప్రవీణ పరీక్ష వ్రాయుటకు వెళ్ళినప్పుడు శ్రీ గోవిందాచార్యుల వారి యింటనే ఉన్నాను. అమ్మగారైతే ఎంతో ఆప్యాయంగా కన్నబిడ్డను సాకినట్టు ఎంతో ఆత్మీయతతో మాటాడుతూ  అల్పాహారము, భోజనము పెట్టి చూచారు. ఆ మహాయిల్లాలి చేతి వంటకమును భుజించిన దాని ఫలమే నా యొక్క యీ సుఖజీవనము, సాహిత్య ప్రియత్వమూను.
ఏమోయ్యంచుముదంబుతోడ నను తామిష్టాప్తితో పిల్చి, సత్
ప్రేమన్ జూపుచు సాకినట్టి మహిత శ్రీ వైష్ణవీ వైష్ణవుల్
శ్రీమాన్ సద్గురు మూర్తి పత్నియును సుశ్రేయఢ్య గోవిందులున్.
ప్రేమన్ వారికి నంజలించెదను మహచ్ఛ్రేయంబు నాకిచ్చుటన్.
లక్శ్మీనారాయణులవంటి మా గోవిందాచార్య దంపతుల ఋణము తీర్చుకో లేనిది. వారికి నా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
శ్రీమాన్ రామరాజుగారు కూడా ఆత్మీయతతో మమ్ములను చేరదీసి ఎంతో ప్రేమగా చూచేవారు. వారికి కూడా పాదాభివందనం చేస్తున్నాను.
ప్రస్తుతము వీరంతా విజయనగరంలోనే నివాసముంటున్నారు.
వీరంతా ఆ పరమాత్మ కృపకు పాత్రులై ఆయురారోగ్యాలతో సుఖమయ జీవనం గడుపుతూ దీర్ఘాయుష్మంతులై మా కనుల వెలుగై ఉండాలని మనసారా అదేవుని ప్రార్తించుచున్నాను.
జైహింద్.

22, నవంబర్ 2015, ఆదివారం

కార్తీక శుద్ధ ఏకాదశీ పర్వదిన సందర్భముగా మీకందరికీ శుభాకాంక్షలు.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఈ రోజు పరమ పవిత్రమైన కార్తీక శుద్ధ ఏకాదశి.
ఆజగన్నాథుని పరిపూర్ణ కరుణా కటాక్షములు మీపై ప్రసరించాలని జ్ఞానామృతాస్వాదనాపరులై దైవ జ్ఞాన సంపన్నులై ఐహిక సుఖ సంతోషములతో పాటు మహదాత్మానంద సంభరితులు కావాలని మాసారా కోరుకొంటూ శుభాకాంక్షలు తెలియఁ జేస్తున్నాను. 
శ్రీ జగన్నాథా! జ్ఞాన సంపన్నమైన మానవ జన్మను నీవు మాకు ప్రసాదించినందులకు నీపాదారవిందములకు అనవరత నమస్కృతులు.
పరమేశ్వర నీదయ పాఠకులన్
నిరపాయమహత్స్థితి నిల్పునుగా.
కరుణించుచు కావుమ కామ్యదుఁడా!
సిరిసంపదలిచ్చుచు చేకొనుమా!
జైహింద్.

21, నవంబర్ 2015, శనివారం

సుసంపన్నమైన రాంభట్ల శతావధానమ్.

1 comments

శ్రీ కుర్తాళం పీఠాధిపతుల శుభాశీస్సులందుకొనుచున్న అవధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ.
శ్రీమాన్ చాగంటి కోటేశ్వరరావుగారి దివ్య జ్ఞాన ప్రభలనందుకొనుచు, శతావధానియగుచున్న శర్మ. 
సంచాలకుఁడుగా శ్రీ కొట్టే కోటారావు. 
శ్రీమాన్ డా. కోట లక్ష్మీనరసింహం గారి సంచాలకత్వంతో రెండవరోజు అవధానం చేస్తున్న శత్మ.
ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పృచ్ఛకాళి.
ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పృచ్ఛకాళి.
మంగళప్రదంగా శతావధానమును సుసంపన్నం చేసిన చిరంజీవి రాంభట్ల పార్వతీశ్వర శర్మకు ఆంధ్రామృతమ్ అభినందలు అందఁజేస్తోంది
మతిమంతుఁడ! శర్మ!మనో
జ్ఞత నొప్ప శతావధాన సదమలవృత్తిన్
శత పుష్పార్చన చేసితి
వతులితముగ శారదాంబ హాయిని కనఁగన్.
అభినందనలతో
చింతా రామ కృష్ణా రావు

20, నవంబర్ 2015, శుక్రవారం

శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ సాహసోపేత శతావధానాధ్వరము. అధ్యక్షులు శ్రీ కోట లక్ష్మీనరసింహావధాని..

3 comments

జైశ్రీరామ్.

పెట్టని కోట సింహగిరి పెన్నిధి శ్రీనరసింహు సత్కృపన్
పట్టుగ సాగకుండునొకొ! భద్రముగా శత సద్వధాన మీ
పట్టున రామభట్ల కవి భాస్కర! సద్గుణ పార్వతీశ్వరా!
దిట్ట సుచిత్ర, బంధ కవి తేజము నీ ప్రభ పెంచుగావుతన్.
పార్వతీశ్వర శర్మా! అభినందనలు.
జైహింద్.

19, నవంబర్ 2015, గురువారం

ఆశయా బధ్యతే లోకే . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. ఆశయా బధ్యతే లోకే కర్మణా బహుచిన్తయా |
ఆయుః క్షీణం న జానాతి తస్మాత్-జాగ్రత జాగ్రత ||
आशया बध्यते लोके कर्मणा बहुचिन्तया ।
आयुः क्षीणं न जानाति तस्मात्-जाग्रत जाग्रत ॥
ఆ.వె. పాప పుణ్య ఫలిత బహుచింతనములచే
నాశఁ దగులు లోక మనవరతము.
గడిచిపోవు వయసు పొడనైనఁ గనలేరు
కనుక జాగృతినిల మనఁగఁ దగును.
భావము. లోకులు తమ కర్మ ఫలముల చేత, అనేక చింతల చేత ఆశాపాశ బద్ధులై ప్రవర్తించుదురే కాని గడిచిపోవుచున్న్ ఆయువును చూడజాలేరు. కావున జాగ్రత్తాగా ప్రవర్తించ వలసి యున్నది.
జైహింద్.

18, నవంబర్ 2015, బుధవారం

శ్రీ గోమాత. . కాకరాల విశ్వ గారు.

2 comments

జైశ్రీరామ్.
నమో గోభ్యః, శ్రీమతీభ్యః
''కోడి,మేక,లాగా గోవు కూడా జంతువే కదా అలాంటప్పుడు దాన్ని కోసుకుని తింటే తప్పేంటి'' అని అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానుల్లారా.....
గోవు కూడా జంతువే కానీ....
ప్రపంచంలో మరే జంతువుకూ లేని (చివరకు మనిషిగా పుట్టిన నీకూ,నాకూ కూడా లేని) చాలా ప్రత్యేకతలు గోవుకుంది.
అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ''గోమాత'' అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు.
నీ చదువు...
నీ సంస్కారం...
నీ విచక్షణ...
నీ విజ్ఞత...
నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే...
గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా
* ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని..ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమో అని ..
ఒక ఆవుకు ప్రతిరోజూ ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని,పాలను
,మూత్రాన్ని, పేడను ప్రయోగశాల(ళబ్ )కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసుందో పరీక్షించారు.
అలా ఒకరోజు,రెండ్రోజులు కాదు...ఏకంగా తొంభై రోజులు(మూడు నెలలు) ఢిల్లీ లోని ఎయిమ్స్(ఆల్ల్ ఈందీ ఈన్స్తితుతె ఒఫ్ ంఎదిచల్ శ్చిఎంచె ) కు పంపి పరీక్షించారు.
ఆ ఆవు పాలలోగానీ, రక్తంలోగానీ,మూత్రంలోగానీ,పేడలో
గానీ విషపు ఛాయలేవీ కనిపించలేదు వారికి.
మరి వీరు తొంభైరోజులు ఎక్కించిన విషమంతా ఏమయినట్టు?
గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత.
మరే జంతువుకూ లేని విశిష్టగుణం ఇది.
* ప్రాణవాయువు(ఓక్ష్య్గెన్ )ను పీల్చూకుని ప్రాణవాయువు(ఓక్ష్య్గెన్ )ను వదిలే ఏకైక ప్రాణి.
* విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది.
* వైద్యశాస్త్రానికే అర్థంకాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది.
* ఆవునెయ్యి,బియ్యం రెండూ కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్,ప్రోపలీస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి.
* కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలీస్ ఆక్సైడే శ్రేష్టమైనది.
* గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని.
* గోవుపేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు.
* ఇళ్ళను,వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు.
* ఆవుపేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది.
* ఒక తులం నెయ్యిని అగ్ని(యజ్ఞం)లో వాడితే ఒక టన్ను ప్రాణవాయవు(ఓక్ష్య్గెన్ )ఉత్పత్తి అవుతుంది.
* గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది.
''గోరక్షణ వల్లనే మన జాతి,మన ధర్మము రక్షింపబడును.గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు''.
- గాంధీజీ.
''ఆవుపాలలో రసాయన్,ఆవునెయ్యిలో అమృతం ఉంది.దాని మాంసం తింటే రోగిస్టులు అవుతారు''.
- మహ్మద్ ప్రవక్త.
''ఒక గోవును చంపితే ఒక మనిషిని చంపినట్టే''.
- ఏసుక్రీస్తు.
''గో క్షీరము గొప్పమందు.దాని నెయ్యి గొప్ప ఆరోగ్యప్రదాయిని.దాని మాంసము రోగకారకము''.
- హజరత్ మహమ్మద్.
''గోవులు మానవ సమాజమునకు ఒక గొప్పవరము.ఎక్కడ గోవులు చక్కగా పోషించబడుచూ రక్షింపబడునో ఆ దేశపుభూములు గొప్పగానుండును.
గృహములు ఉన్నతి చెందును.నాగరికత పురోగమించును''.
- బర్మార్డ్ మేక్ ఫెడన్.
''మహ్మదీయుల మత గ్రంధమైన ఖురాన్ లో ఎక్కడనూ గోవధ సమర్థింపబడలేదు''.
- హకీల హజ్మల్ ఖాన్.
''గో హత్య ఇస్లాం మత నియమములకు విరుద్ధం''.
- తోహస్-వి-హింద్ బిజహరు.
భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడైనా చూడగలవా?
నువ్వు హిందువైనా, మస్లీమువైనా,క్రిస్టియన్వైనా నాదేశంలో ఉన్నంతవరకూ భారతీయుడివి.
నా దేశ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడం నీ ధర్మం.
స్వేచ్ఛంటే....
''నీకు నచ్చినట్టు బ్రతకడం కాదు''
''నా(నీ,ఈ)దేశం మెచ్చేటట్టు బ్రతకడం''
''వందేగోమాతరం''
శ్రీ కాకరాల విశ్వం గారికి గోమాత ఆయురారోగ్య ఐశ్వర్యానందాలనంతంగా అనుగ్రహించాలని మనసారా కోరుకొంటున్నాను.
గోవుమాలచ్మికీ కోటి దండాలు.http://andhraamrutham.blogspot.in/2012/03/blog-post_6173.html#.VipS-JJ95kg
గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ.
http://andhraamrutham.blogspot.in/2012/06/blog-post_07.html#.VipSfZJ95kg
జైహింద్.

17, నవంబర్ 2015, మంగళవారం

వాస్తు పురుష ౧౦౮ నామావళి . . . వాస్తు స్తోత్రము.

2 comments

జైశ్రీరామ్.
ఓం వాస్తు నాథాయ విద్మహే చతుర్భుజాయ ధీమహి తన్నో వాస్తుః ప్రచోదయాత్.
ఓం అనుగ్రహ రూపయ, భూమి పుత్రాయ ధీమహి తన్నో వాస్తు పురుష ప్రచోదయాత్.
శ్రీ వాస్తు ౧౦౮ నామావళి
ఓంవాస్తు పురుషాయనమః.
మహా కాయాయ నమః
కృష్ణాంగాయనమః,
రక్తలోచనాయనమః,
౫ఊర్ధ్వాసనాయనమః,
ద్విబాహవేనమః,
బభృవాహనాయనమః,
శయనాయనమః,
వ్యస్తమస్తకాయనమః,
౧౦కృతాంజలిపుటాయనమః,
వాస్తోష్పతయేనమః,
ద్విపదేనమః,
చతుష్పదే, నమః
భూమియజ్ఞాయనమః,
౧౫యజ్ఞదైవతాయనమః,
ప్రసోదర్యైనమః,
హిరణ్యగర్భిణ్యైనమః,
సముద్రవసనాయనమః,
వాస్తుపతయేనమః,
౨౦వసవేనమః,
మహాపురుషాయనమః,
ఇష్టార్థసిద్ధిదాయనమః,
శల్యవాస్తునిధయేనమః,
జల వాస్తునిధయేనమః,
౨౫గృహాదివాస్తునిధయేనమః,
వాసయోగ్యాయనమః,
ఇహ లోక సౌఖ్యాయనమః,
మార్గదర్శికాయ,ప్రకృతి శాస్త్రాయనమః,
మామోత్తరణమార్గాయనమః,
౩౦జ్ఞానోపదేశాయనమః,
సుఖవృద్ధికరాయనమః,
దుఃఖనివారణాయనమః,
పునర్జన్మరహితాయనమః,
అజ్ఞానాంధకారనిర్మూలాయనమః,
౩౫ప్రపంచ క్రీడావినోదాయనమః,
పంచభూతాత్మనేనమః,
ప్రాణాయనమఃనమః,
ఉచ్ఛ్వాసాయనమః,
నిశ్వాసాయనమః,
౪౦కుంభకాయనమః,
యోగభ్యాసాయనమః,
అష్ట సిద్ధాయనమః,
సురూపాయనమః,
గ్రామవాస్తునిధయేనమః,
౪౫పట్టణ వాస్తు నిధయేనమః,
నగరవాస్తు నిధయేనమః,
మనశ్శాంతయేనమః,
అమృత్యవేనమః,
గృహ నిర్మాణ యోగ్య స్థలాధిదేవతాయనమః,
౫౦నిర్మాణ శాస్త్రాధికారాయనమః,
మానవశ్శ్రేయోనిధయేనమః,
మందారావాస నిర్మాణాయనమః,
పుణ్య స్థలావాసనిర్మాణాయనమః,
ఉత్కృష్టస్థితికారణాయనమః,
౫౫పూర్వ జన్మ వాసనాయనమః,
అతినిగూఢాయనమః,
దిక్సాధనాయనమః,
దుష్ఫలిత నివారణ కారకాయనమః,
నిర్మాణ కౌశల దురంధరాయనమః,
౬౦ద్వారాదిరూపాయనమః,
మూర్ధ్నే ఈశానాయనమః,
శ్రవసేఅదితయేనమః,
కంఠేజలదేవాతాయనమః,
నేత్రేజయాయనమః,
౬౫వాక్ అర్యమ్ణేనమః,
స్తనద్వయేదిశాయనమః,
హృది ఆపవత్సాయనమః,
దక్షిణ భుజే ఇంద్రాయనమః,
వామ భుజే నాగాయనమః,
౭౦దక్షిణ కరే సావిత్రాయనమః,
వామ కరే రుద్రాయనమః,
ఊరూద్వయే మృత్యవేనమః,
నాభిదేశే మిత్రగణాయనమః,
పృష్టే బ్రహ్మణేనమః,
౭౫దక్షిణ వృషణే ఇంద్రాయనమః,
వామ వృషణే జయంతాయనమః,
జానుయుగళే రోగాయనమః,
శిశ్నే నందిగణాయనమః,
శీలమండలే వాయుభ్యోనమః,
౮౦పాదౌ పితృభ్యోనమః,
రజక స్థానే వృద్ధి క్షయాయనమః,
చర్మకారక స్థానేక్షుత్పిపాసాయనమః,
బ్రాహ్మణ స్థానే జనోత్సాహకరాయనమః,
శూద్ర స్థానే ధనధాన్య వృద్ధిస్థాయనమః,
౮౫యోగీశ్వర స్థానేమహదావస్థకారకాయనమః,
గోపక స్థానే సర్వసిద్ధిప్రదాయనమః,
క్షత్రిఅయ స్థానే కలహప్రదాయనమః,
చక్రస్థానే రోగ కారణాయనమః,
సప్తద్వార వేధాయనమః,
౯౦ఆగ్నేయస్థానేప్రథమ స్థంభాయనమః,
చైత్రమాస నిర్మాణే దుఃఖాయనమః,
వైశాఖమాస నిర్మాణే ద్రవ్యవృద్ధిదాయనమః,
జ్యేష్ట మాస నిర్మాణే మృత్యుప్రదాయనమః,
ఆషాఢమాస నిర్మాణే పశునాశనాయనమః,
౯౫శ్రావణ మాస నిర్మాణే పశు వృద్ధిదాయనమః,
భాద్రపద మాస నిర్మాణే సర్వ శూన్యాయనమః,
ఆశ్వయుజ మాస నిర్మాణే కలహాయనమః,
కార్తీక మాస నిర్మాణే మృత్యునాశనాయనమః,
మార్గశిర మాస నిర్మాణే ధన ధాన్యవృద్ధిదాయనమః,
౧౦౦పుష్య మాస నిర్మాణే అగ్నిభయాయనమః,
మాఘ మాస నిర్మాణే పుత్ర వృద్ధిదాయనమః,
ఫాల్గుణ మాస నిర్మాణే స్వర్ణరత్నప్రదాయనమః,
స్థిరరాశే ఉత్తమాయనమః,
చర రాశే మధ్యమాయనమః,
౧౦౫ద్విస్వభావ రాశే నిషిద్ధాయనమః,
శుక్లపక్షే సుఖదాయనమః,
బహుళ పక్షే చోరభయాయనమః,
౧౦౮.చతుర్దిక్షుద్వార గృహేవిజయాఖ్యాయనమః.
హరిః ఓమ్.
. మానదండం కరాబ్జేన వహంతం భూమి శోధకం,
వందేహం వాస్తు పురుషం శయానం శయనే శుభే
. వాస్తు పురుష నమస్తేస్తు భూశయ్యాదిగత ప్రభో,
మద్గృహే ధన ధాన్యాది సమృద్ధిం కురుమే ప్రభో,
. పంచ వక్త్ర జటాజూటం పంచ దశ విలోచనం,
సద్యో జాతానాంచ స్వేతం వాసుదేవంతు కృష్ణకం,
. అఘోరం రక్తవర్ణంచ శరీరంహేమ వర్ణకం,
మహాబాహుం మహాకాయం కర్ణ కుండల మండితం,
. పీతాంబరం పుష్పమల నాగయజ్ఞోపవీతినం,
రుద్రాక్షమాలాభరణంవ్యాఘ్రచర్మోత్తరీయకం,
. అక్షమాలాంచ పద్మంచ నాగ శూల పినాకినాం,
డమరం వీణ బాణంచ శంఖ చక్ర కరాన్వితం,
. కోటి సూర్య ప్రతీకాశంసర్వ జీవ దయావరం,
దేవ దేవం మహాదేవం విశ్వకర్మ జగద్గురుమ్,
. వాస్తుమూర్తి పరంజ్యోతిర్వాస్తు దేవః పరశ్శివః,
వాస్తు దేవాస్తు సర్వేషాం వాస్తు దేవం నమామ్యహమ్..
జైహింద్.