గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 78వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

జైశ్రీరామ్.

78. ఓం అవ్యక్తాయ నమః.

పాదప గర్భ సీసము.

చిత్భవ శ్రీనరసింహుఁడచిన్మణి - రావాకృపాసాంద్రరక్షఁగొల్ప.

భక్తులౌ దీనుల పాలిటి తేజము - నీవేమముం గాతువీవె జగతి!

దినమణి భానుని తేజము వర్ధిలు - నీచేతనే కదానిగమ వేద్య!

జగతిని మానిత సజ్జన మన్నన - మీవేకదారమా హృన్నివాస!

గీ. సీస పద్యస్థ పాదపా! చిత్ప్రకాశ! - కరుణఁ జూపెడి *యవ్యక్త* కల్పతరువ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

78 సీస గర్భస్థ పాదపము లేదా తోదకము లేదా దోధకము. ( గగ .. యతి 7)

శ్రీనరసింహుఁడచిన్మణి రావా! - దీనుల పాలిటి తేజము నీవే

భానుని తేజము వర్ధిలు నీచే. - మానిత సజ్జన మన్నన మీవే

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా చిద్భవుఁడా! చిన్మణీ! కృపాసాంద్రా! చిన్మణీ! మాకు

రక్షణ గొలుపుటకై రమ్ము.  ,భక్తులయిన దీనుల తేజస్సు నీవే, మమ్ములను కాపాడునది నీవే. నిగమవేద్యా!

సూర్యుని ప్రకాశము నీ వలననే వృద్ధియగుచుండునుకదా. లోకమున గొప్పవారి మన్నన  నీ స్వరూపమే కదా.సీస గభిస్థ

పాదపవృత్తమున కలవాడా! అవ్యక్తా! కరుణ చూపుము.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.