గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, మార్చి 2020, మంగళవారం

పితౄణ,విలసిత,దోషార్ణవ,సరయా,అశృతార్పణ,కోరంగీ,యాతనా,ప్రాణాంతక,కురూపిణీ,నదృశ,గర్భ"భద్రంకరీ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

పితౄణ,విలసిత,దోషార్ణవ,సరయా,అశృతార్పణ,కోరంగీ,యాతనా,ప్రాణాంతక,కురూపిణీ,నదృశ,గర్భ"భద్రంకరీ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
"-భద్రంకరీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.ర.య.త.జ.త.మ.భ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కలి విధ్వంస మెంచితా!కానం శక్యము గాని దౌచున్!కరోనా'ప్రాణాంతక మాయెన్!                                                
పలు భగ్నాశృతార్పణన్!బోనం పొట్టను పెట్టు కొనెన్!బరోసా లేదాయెను జీవమ్!                                                  
కులమున్గూల్చె సర్వమున్!గూనుం బొందెను లోకమెల్లన్!కురూపాయెన్ భూమికి భద్రమ్!                                  
బలము న్గావు శ్రీహరీ!ప్రాణంబుల్నిలుపంగ రమ్మా!పరార్థం బొప్పం!గను శ్రీశా!                                                    
1.గర్భగత"-పితౄణ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.మ.స.య.గణములు.వృ.సం.84.
ప్రాసనియమము కలదు.
కలి"-విధ్వంస మెంచి తా
పలు భగ్నాశృతార్పణన్
కులమున్గూల్చె సర్వమున్!
బలము న్గావు శ్రీ హరీ!
2.గర్భగత"-విలసిత"-వృత్తము.
బృహతీఛందము.మ.స.య.గణములు.వృ.సం.89.
ప్రాసనియమము కలదు.
కానం శక్యము గానిదౌచున్!
బోనం పొట్టను పెట్టుకొనెన్!
గూనుం బొందెను లోకమెల్లన్!
ప్రాణంబుల్నిలుపంగ!రమ్మా!
3.గర్భగత"-దోషార్ణవ వృత్తము.
బృహతీఛందముయయ.త.య.గణములు.వృ.సం.98.
ప్రాసనియమము కలదు.
కరోనా"-ప్రాణాంతక మాయెన్!
బరోసా లేదాయెను జీవమ్!
కురూ పాయెం భూమికి భద్రమ్!
పరార్ధం బోపం గను !శ్రీశా!
4.గర్భగత"-సరయా"-వృత్తము
అత్యష్టీఛందము.స.ర.య.త.జ.గగ.గణములు.యతి.9వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కలి"-విధ్వంసమెంచి తా!కానం శక్యము గానిదౌచున్!
పలు భగ్నాశృ తార్పణన్!బోనం పొట్టను పెట్టు కొనెన్!
కులమున్గూల్చె సర్వమున్!గూనున్బొందెను లోక మెల్లన్!
బలమున్గావు శ్రీ హరీ! ప్రాణంబుల్నిలుపంగ!రమ్మా!
5.గర్భగత"-అశృతార్పణా"-వృత్తము.
ధృతిఛందము.మ.స.య.య.త.య.గగణములుయతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కానం శక్యము గాని దౌచున్!"-కరోనా"-ప్రాణాంతక మాయెన్!
బోనం పొట్టన్ పెట్టు కొనెన్! బరోసా లేదాయెను జీవమ్!
గూనుం బొందెను లోక మెల్లన్!కురూపాయెం భూమికి భద్రమ్!
ప్రాణంబుల్నిలు పంగ రమ్మా!పరార్థం బోపం గను శ్రీశా!
6.గర్భగత"-కోరంగీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.స.య.య.త.య.స.ర.లగ.గణములు.యతులు.10,19.ప్రాసనియమము కలదు.వృ.సం.
కానం శక్యము గాని దౌచున్!"-కరోనా"-ప్రాణాంతక మాయెన్!కలి విధ్వంస మెంచి తా!                                          
బోనం పొట్టను పెట్టు కొనెన్!బరోసా లేదాయెను జీవమ్!పలు భగ్నాశృతార్పణన్!                                                  
గూనుం బొందెను లోక మెల్లన్!కురూపాయెంభూమికి భద్రమ్!కులమున్ న్గూల్చె సర్వమున్!                              
ప్రాణంబుల్నిలు పంగ రమ్మా!పరార్థం బోపం గను శ్రీశా!బలమున్గావు శ్రీ హరీ!                                                      
7.గర్భగత"-యాతనా"-వృత్తము.
అత్యష్టీఛందము.య.త.య.స.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కరోనా"-ప్రాణాంతక మాయెన్!కలి విధ్వంస మెంచితా!
బరోసా లే దాయెను జీవమ్!పలు భగ్నాశృ తార్పణన్!
కురూపాయెం భూమికి భద్రం!కులమున్గూల్చె సర్వమున్!
పరార్థం బోపం గను శ్రీశా! బలమున్గావు శ్రీ హరీ!
8.గర్భగత"-ప్రాణాంతక"-వృత్తము.
ఉత్కృతి ఛందము.య.త.య.స.ర.య.త.జ.గగ.గణములు.యతులు.
10,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
కరోనా"-ప్రాణాంతక మాయెన్!కలి విధ్వంస మెంచి తా!కానం శక్యము కాని దౌచున్!                                            
బరోసా లేదాయెను జీవమ్! పలు భగ్నాశృ తార్పణన్! బోనం పొట్టను పెట్టు కొనెన్!                                              
కురూపాయెం భూమికి జీవమ్! కులమున్గూల్చె సర్వమున్!గూనుం బొందెను లోక మెల్లన్!                                
పరార్థం బోపం గను శ్రీశా!బలమున్గావు శ్రీహరీ!ప్రాణంబుల్నిలు పంగ! రమ్మా!                                                      
9,గర్భగత"-కురూపిణీ"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.స.య.స.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కానం శక్యము గాని దౌచున్!కలి విధ్వంస మెంచి తా!
బోనం పొట్టను పెట్టు కొనెన్!పలు భగ్నాశృ తార్పణన్!
గూనుం బొందెను లోక మెల్లన్! కులమున్గూల్చె సర్వమున్!
ప్రాణంబుల్నిలుపంగ రమ్మా!బలమున్గావు శ్రీ హరీ!
10,గర్భగత"-నదృశ"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.స.య.స.ర.జ.మ.భ.గగ.గణములు.యతులు.
10,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
కానం శక్యము కాని దౌచున్!కలి"-విధ్వంస మెంచి తా!"-కరోనా"-ప్రాణాంతక మాయెన్!                                        
బోనం పొట్టను పెట్టు కొనెన్!పలు భగ్నాశృ తార్పణన్!బరోసా లేదాయెను జీవమ్!                                                
గూనుం బొందెను లోక మెల్లన్!కులమున్గూల్చె సర్వమున్!కురూపాయెం భూమికి జీవమ్!                                
ప్రాణంబుల్నిలుపంగ రమ్మా!బలమున్గావు శ్రీ హరీ!పరార్థం బోపం గను శ్రీశా!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్

30, మార్చి 2020, సోమవారం

నేయక,వశీకరణ,కమఠ,భూతాత్మ,వల్లని,అంథకార,విభ్రమ,శరవేగ,బాధిత,వెరబోవు,గర్భ"-కల్లడి మాపు"-వృత్తము. రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి, జుత్తాడ.

0 comments

నేయక,వశీకరణ,కమఠ,భూతాత్మ,వల్లని,అంథకార,విభ్రమ,శరవేగ,బాధిత,వెరబోవు,గర్భ"-కల్లడి మాపు"-వృత్తము.
రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి, జుత్తాడ.

 కల్లడి మాపు"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.భ.మ.భ.న.త.స.స.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వికారి"-చేష్టలు మిన్నంటెన్!వెల్లి విరిసె కరోనా!వెతను "-శార్వరి"-వాపోవన్!
బికార తంజనె!భూతాత్మల్!విల్లు వెడలు శరాలై!బితుకు జీవన ముంచెత్తెన్!
ప్రకాశ మెంచగ లేదాయెన్!వల్లని గురికి లోనై! బ్రతుకు లంతము గావింపన్!
కకా వికల్గనె లోకంబున్!కల్లడి చెరిపె నెంచన్!గతుకునం బడె! జీవాత్మల్!

అర్థములు:-కల్లడి చెరిపె=పొందును,అభివృద్ధిని,పాడు చేసెను,గతుకు
నంబడె=గోతిలో బడెను,వల్లని గురికి=పనికిరాని ఏకాగ్రతకు,విల్లు వెడలు
శరము=వింటిని వీడు బాణము,ప్రకాశ మెంచక=కాంతి నూహింపక.  (అంధకారము వైపు నెట్టుతీరున),చితుకు జీవన=జీవితాలు ఛిన్నాభిన్నము
కాగ,

1.గర్భగత"-నేయక"-వృత్తము.
బృహతీఛందము.జ.భ.మ.గణములు.వృ.సం.54.
ప్రాసనియమము కలదు.
వికారి చేష్టలు మిన్నంటెన్!
బికారతం జనె భూతాత్మల్!
ప్రకాశ మెంచగ లేదాయెన్!
కకా వికల్గనె లోకంబున్!
2.గర్భగత"-వశీకరణ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.న.గగ.గణములు.వృ.సం.63.
ప్రాసనియమము కలదు.
వెల్లి విరిసె "-కరోనా"-
విల్లు వెడలు శరాలై!
వల్లని గురికి లోనై!
కల్లడి చెరిపె నెంచన్!
3.గర్భగత"-కమఠ"-వృత్తము.
బృహతీఛందము.న.భ.మ.గణములు.వృ.సం.56.
ప్రాసనియమము కలదు.
వెతను"-శార్వరి"-వాపోవన్!
బితుకు జీవన ముంచెత్తెన్!
బ్రతుకు లంతము గావింపన్!
గతుకునం బడె జీవాత్మల్!
4.గర్భగత"-భూతాత్మ"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.భ.మ.భ.న.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వికారి చేష్టలు మిన్నంటెన్!వెల్లి విరిసె"-కరోనా"-
బికారతం జనె భూతాత్మల్!విల్లు వెడలు శరాలై!
ప్రకాశ మెంచగ లేదాయెన్!వల్లని గురికి లోనై!
కకా వికల్గనె లోకంబున్!కల్లడి చెరిపె నెంచన్!
5.గర్భగత"-వల్లని"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.న.త.స.స.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వెల్లి విరిసె"-కరోనా"-వెతను "-శార్వరి"-వాపోవన్!
విల్లు వెడలు శరాలై! బితుకు జీవన ముంచెత్తెన్!
వల్లని గురికి లోనై!బ్రతుకు లంతము గావింపన్!
కల్లడి చెరిపె నెంచన్!గతుకునం బడె జీవాత్మల్!
6.గర్భగత"-అంథకార"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.న.త.స.స.త.ర.స.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వెల్లి విరిసె"-కరోనా"- వెతను"-శార్వరి"-వాపోవన్!వికారి చేష్టలు మిన్నంటెన్!
విల్లు వెడలు శరాలై!బితుకు జీవన మంచెత్తెన్!బికారతం జనె భూతాత్త్మల్!
వల్లని గురికి లోనై!బ్రతుకు లంతము గావింపన్! ప్రకాశ మెంచగ లేదాయెన్!
కల్లడి చెరిపె నెంచన్!గతుకునం బడె జీవాత్మల్!కకా వికల్గనె!లోకంబున్!
7.గర్భగత"-విభ్రమ"-వృత్తము.
ధృతిఛందము.న.భ.మ.జ.భ.మ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వెతను"-శార్వరి"-వాపోవన్!వికారి చేష్టలు మిన్నంటెన్!
బితుకు జీవన ముంచెత్తెెన్! బికారతం జనె భూతాత్మల్!
బ్రతుకు లంతము గావింపన్!ప్రకాశ మెంచగ లేదాయెన్!
గతుకునం బడె జీవాత్మల్!కకా వికల్గనె లోకంబున్!
8.గర్భగత"-శరవేగ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.మ.జ.భ.మ.భ.న.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వెతను"-శార్వరి"-వాపోవన్!వికారి చేష్టలు మిన్నంటెన్!వెల్లి విరిసె"-కరోనా"-
బితుకు జీవన ముంచెత్తెన్!బికారతం జనె భూతాత్మల్!విల్లు వెడలు శరాలై!
బ్రతుకు లంతము గావింపన్!ప్రకాశ మెంచగ లేదాయెన్!వల్లని గురికి లోనై!
గతుకునం బడె జీవాత్మల్!కకా వికల్గనె లోకంబున్! కల్లడి చెరిపె నెంచన్!
9.గర్భగత"-బాధిత"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.న.త.ర.స.గగ.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వెల్లి విరిసె "-కరోనా"-వికారి చేష్టలు మిన్నంటెన్!
విల్లు వెడలు శరాలై!బికారతం జనె భూతాత్మల్!
వల్లని గురికి లోనై!ప్రకాశ మెంచగ లేదాయెన్!
కల్లడి చెరిపె నెంచన్!కకా వికల్గనె లోకంబున్!
10,గర్భగత"-వెరబోవు"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.న.త.ర.స.తస.స.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వెల్లి విరిసె"-కరోనా"-!వికారి చేష్టలు మిన్నంటెన్!వెతను శార్వరి"-వాపోవన్!
విల్లు వెడలు శరాలై!బికారతం జనె భూతాత్మల్!బితుకు జీవన ముంచెత్తెన్!
వల్లని గురికి లోనై!ప్రకాశ మెంచగ లేదాయెన్!బ్రతుకు లంతము గావింపన్!
కల్లడి చెరిపె నెంచన్!కకా వికల్గనె లోకంబున్!గతుకునం బడె. జీవాత్మల్!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ
జైహింద్.

29, మార్చి 2020, ఆదివారం

అవధాని శ్రీ బండకాడ అంజయ్య అవధాని గారి అంతర్జాల అష్టావధానము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

28, మార్చి 2020, శనివారం

అంతర్జాల అష్టావధానము శ్రీ ముత్యంపేట గౌరీశంకర్.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.


27, మార్చి 2020, శుక్రవారం

తమసోమా.

0 comments

జైశ్రీరామ్.
🙏🏻ఓం నమో నారాయణాయ🙏🏻
తమసోమా.
శ్రీమంతంబుగ మిత్రపాళి పొగడన్ జీవించుచీవుంటివో?
ఏమాత్రంబయినన్గ్రహింపఁ దగవో? యీ సృష్టి నే శక్తి నిన్
ధీమంతుండుగ సృష్టి చేసెనొ, కృపన్ దేజంబునే గొల్పెనో?
ప్రేమన్ నీ మది నిల్పి జీవతతినే ప్రేమింపగా జేసెనో?
ధీమంతా! గ్రహియించి తన్మహితమౌ తేజస్స్వరూపంబునే
ప్రేమన్ నీమదిఁ గొల్వకుంట తగునా? విశ్వాసమే లేదొకో?
నీ మాన్యత్వము, నీదు శక్తి, ఘనమౌ నీ జ్ఞాన సంపత్తియున్,
నీమంబున్ జరియించు తత్వమును తానే నీకు కల్పించి, నిన్
బ్రేమన్ గాచుచునుంట నీవు కనవో? విజ్ఞాన తేజోనిధీ!
యేమాయెన్ ఘనమైన నీ యెరుక? నీ యిచ్ఛానుసారంబుగా
ప్రేమన్ మిత్రుల నెప్పుడున్ బొగడుచున్ పేరున్ గనన్ జూతువో?
ధీ మాహాత్మ్యము వ్యర్థమైన విషయోద్దీప్తంబవన్ నీవహో!
కామక్రోధ సలోభమోహ మద సంకాశంపుమాత్సర్యముల్
భూమిన్ బెంచగ ఖర్చు చేయ కనుదో? మూర్ఖత్వమెట్లబ్బె? నీ
వీమాత్రంబయినన్ గ్రహించవొకొ? దేహిన్ వీడి దేహంబుపై
ప్రేమన్ బెంచుకొనంగనేల? మదినావిర్భావమౌ జ్ఞానమున్
క్షేమంబున్ గలిగించు నాత్మపయినే జేర్చన్ శుభంభౌనుగా?
యీ మాయామయ లౌకికాంశములపై నేలా మదిన్ నిల్పు టా
శ్రీమాతాహృదయేశ్వరున్ నిలుపినన్ జిత్తంబునన్  మేలగున్.
నీమంబొప్పగ నీవు చేయు రచనల్, నీధ్యాస, నీ పూరణల్,
శ్రీమంతా! ఫలమేమి గొల్పును గనన్ జిన్మార్గమున్ జూపునా?
యే మార్గంబు సుఖంబటంచు కనితో హే రామకృష్ణా! మహత్
ద్ధూమంబందున తల్లడిల్లఁ గనుదో తూలించు నా దుర్గతిన్?
ప్రేమోద్ధాముని శ్రీహరిన్ బడసి సుశ్రేయంబులే గాంచఁగా
నీమంబొప్పగ పూజ చేయ కనుమా. నీ చిత్తమందెంచు మీ
శ్రీమార్గంబును పూనుమింక నృహరిన్ చేరంగ మార్గంబు. పో
రామిన్ గాంచగ జాలలేవొ? కనుమా. ప్రార్థించుమా శ్రీహరిన్.
🙏🏻జైశ్రీమన్నారాయణా🙏🏻
చింతా రామకృష్ణారావు.
జైహింద్

26, మార్చి 2020, గురువారం

శ్రీ శార్వరినామ సంవత్సర ఉగాది సందర్భముగా అష్టావధానము.

0 comments

జైశ్రీరామ్.
 జైహింద్.

25, మార్చి 2020, బుధవారం

శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

0 comments

జైశ్రీరామ్.
పాఠకపాళికి శ్రీ శార్వరి నామ సంవత్సరౌగాది శుభాకాంక్షలు.
శ్రీమన్మంగళ భావనా లహరులన్ శ్రీ శార్వరిన్ గాంచుడీ
మీ మీ వాంఛలనీశ్వరుండు కనుతన్ మేల్గొల్పనీడేర్చుతన్.
శ్రీమాతాహృదయేశ్వరుండు మిములన్ చిన్మార్గమున్ శ్రేయముల్
ప్రేమన్ గూర్చుత సౌఖ్య సంపదలతో  ప్రీతిన్ ప్రవర్ధిల్లుడీ!
జైహింద్.

24, మార్చి 2020, మంగళవారం

శ్రీ రుద్ర భాష్యము. రెండవ భాగము. శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

23, మార్చి 2020, సోమవారం

శ్రీ రుద్రభాష్యము. శ్రీ సామవేదం షణ్ముఖశర్మ.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

22, మార్చి 2020, ఆదివారం

కరుణించి కావుమో కరోనా.........

1 comments

జైశ్రీరామ్.
కరుణించుచు కావుమో కరోనా! ...........🙏🏻

చ. కరుణయె లేనిదానవయి, కష్టపు జీవుల నింటఁ గట్టి, సుం

దరముగ నట్టహాసమున, దర్పిలి యుంటివహో! కరోన!  యే

తెరవున భుక్తి నాకొదవు? తిండికి లేక గృహాంతరంబులన్

నిరుపమ దుఃఖమున్ బొగిలి నిన్ మది తిట్టుచునుంటి. కానవో?


క. కష్టమునే తినుమాకిల

నష్టము కలిగింపఁ దగునొ? ఘనముగ కనెదో?

సృష్టిని గల పాపుల కిల

నష్టము కలిగింపవచ్చు. 
నాకేలనిటుల్?


క. రెక్కాడిన డొక్కాడును

ముక్కాలములందు మాకు, బోధపడదొకో? 

ఒక్కదినంబె యనందువొ?

ఎక్కడికిన్ పోక తిండదెట్టులు కలుగున్?


ఉ. పేదలసాదలన్ గనవు. విజ్ఞతనొప్పవు. విశ్వమంతటన్

మోదముతో జరించుదువు. పుణ్యము పాపము లేదు నీకు. దు

ర్వ్యాధిగ తిట్టినన్ వినవు. ప్రాణములన్ గొనిపోవుబుద్ధితో

ఖేదము గొల్పుచుండెదవు. కిమ్మనవేమి? కరోన రక్కసీ!


క. ధర్మాత్ముల, సుగుణ పరుల,

మర్మమెఱుంగని మనుజుల, మాన్యులఁ గనుచున్

గర్మము కాల్చకు. భువిపై

దుర్మార్గుల పీచమడచు. దుష్ట కరోనా!


క. వేగముగా పొమ్ము విడిచి

భూ, గగనములను. మసలకు. పుణ్యంబుండున్.

మాగతి మార్చకు మింకను.

రోగార్తిని బాపుమా కరోనా! కొలుతున్ 

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చింతా రామకృష్ణారావు.
జైహింద్.

శ్రీ రుద్ర ప్రవచనంల్.భువనేశ్వరి మరియు శ్రీనివాసన్

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

21, మార్చి 2020, శనివారం

మహాన్యాసము....వివరణ.

0 comments

జైశ్రీరామ్.
మహాన్యాసము అంటే భక్తుడు శ్రీ రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకు అధికారి అవ్వటానికి, వాటికి ముందు మహా మహిమలు కలిగిన రుద్రుని తన (ఆత్మ) యందు విశిష్టముగా నిలుపుకొనుట, రౌద్రీకరణము. ఇది చాలా మహిమ కలది. దీన్ని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు, తన సర్వాంగములను తాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే, తాను రుద్రుడే అయి, రుద్రార్చనకు అధికారి అగును.
“నారుద్రో రుద్రమర్చయేత్” - అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడు. ఇది ప్రమాణ వచనము. అందుకనే, కల్ప సూత్రకారులగు బోధాయనులు మహాన్యాసము అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు ఇచ్చారు. అప్పటినుంచి ఈ మహాన్యాసము శ్రీ రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి మన దేశములో ప్రసిద్ధమై, ప్రచారములో ఉంది.
రుద్ర మహాన్యాసము ఐదు అంగ న్యాసములు కలిగినది.
౧. ప్రథమాంగన్యాసము - శిఖాది అస్త్రాంతము ముప్ఫై ఒకటి అంగన్యాసములు కలది
౨. ద్వితీయాంగన్యాసము - మూర్ద్నాది పాదాంతము దశాంగన్యాసము కలది
౩. తృతీయాంగన్యాసము - పాదాది మూర్ధ్నాంతము పంచాంగన్యాసము కలది
౪. చతుర్థాంగన్యాసము - గుహ్యాది మస్తకాంతము పంచాంగన్యాసము కలది
౫. పంచమాంగన్యాసము - హృదయాది అస్త్రాంతము పంచాంగన్యాసము కలది
ఇవి అయిదు కలవారు పంచాంగ రుద్రులు.
౧. ప్రథమాంగన్యాసము
భక్తుడు సంకల్పము చేసిన మీదట పూర్వాంగ రుద్ర, దక్షిణాంగ రుద్ర, పశ్చిమాంగ రుద్ర, ఉత్తరాంగ రుద్ర, ఊర్ధ్వాంగ రుద్రులకు స్తుతి పూర్వక నమస్కారములు చేయవలెను. అటు తర్వాత,  పూర్వాంగముఖ రుద్ర, దక్షిణాంగముఖ రుద్ర, పశ్చిమాంగముఖ రుద్ర, ఉత్తరాంగముఖ రుద్ర, ఊర్ధ్వాంగముఖ రుద్రులకు స్తోత్ర పూర్వక నమస్కారములు చేయవలెను. తర్వాత, "యా తే రుద్ర శివాతమా" మొదలగు మంత్రములను పఠించుచు, తన శిఖాదులను తాకవలెను.
౨. ద్వితీయాంగన్యాసము
ఓం నమో భగవతే రుద్రాయ అని పలికి నమస్కరించి, ఓం మూర్ద్నే నమః, నం నాసికాయై నమః, మోం లలాటాయ నమః, భం ముఖాయ నమః, గం కంఠాయ నమః, వం హృదయాయ నమః,  తేం దక్షిణ హస్తాయ నమః, రం వామ హస్తాయ నమః, యం పాదాభ్యాం నమః  అనే మంత్రాలు చదువుతూ ఆయా అంగాల యందు  నమస్కార పూర్వకంగా న్యాసము (రుద్రుని నిలుపుట) చేయవలెను.
౩. తృతీయాంగన్యాసము
సద్యోజాతాది మంత్రములు చదువుతూ పాదాది అంగములను న్యాసము చేయవలెను. హంస గాయత్రీ మంత్రము పఠించి "హంస హంస" అని పలికి శిరస్సును స్పృశించవలెను. హంస అనగా శివుడు. ఇలా న్యాసము చేయుట వలన భక్తుడు ఆ సదాశివుడే తానగును.
తర్వాత, అంజలి చేసి "త్రాతార మింద్ర...." మొదలగు మంత్రములు   పఠించుచు ఆయ దిక్కుల అధిదేవతలగు ఇంద్రాదులకు నమస్కారములు చేయవలెను. దీనినే, సంపుటం అంటారు.
తర్వాత దశాంగ రౌద్రీకరణం - భక్తుడు అంజలి ఘటించి, పైన సంపుటంలో చెప్పిన మంత్రములు పఠించుచు, వరుసగా తూర్పు నుండి మొదలు పెట్టి అథో దిక్కు వరకు, ఆయా దేహ స్థానాన్ని తాకి (లలాటము నుండి పాదముల వరకు), ఆయా దేవతకు నమస్కరించుచు (ఇంద్రుని మొదలు పృథివి చివర) రుద్రుని తన దేహము యందు న్యాసము చేయవలెను. ఇందులో ప్రతి మంత్రమునకు ముందు "ఓం నమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అని చెప్పవలెను.
తర్వాత షోడశాంగ రౌద్రీకరణము -  ఓం  అం విభూరసి  ప్రవాహణో.... అనే మంత్రముతో మొదలు పెట్టి ఓం అః  ఆహిరసి బుధ్నియో" అను మంత్రముల వరకు (అకారాది వర్ణమాల), అన్ని మంత్రములు ప్రతి దాని చివర 'రౌద్రేణానీకేన పాహిమాగ్నే పిపృహి మా మా మాహిగ్‍ం సీః' అనే మంత్రభాగమును జోడించి చదువుతూ, తన శిఖ నుండి పాదముల వరకు పదహారు అంగములను తాకుచు, తన దేహమును రుద్రుని భావించవలెను. కొంతమంది దీనికి కూడా ప్రతి మంత్రము ముందు  "ఓం నమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అని సంపుటీకరణ చేస్తారు.
దీనివలన తన చర్మము, ఎముకలయందు సర్వ పాపములనుండి విముక్తి పొందును, సర్వ భూతములచే అపరాజితుడగును, ఉపఘాతములన్ని తొలగి, రక్షణ పొందును.
౪. చతుర్థాంగన్యాసము
"మనోజ్యోతిః...." మొదలగు మంత్రములు చదువుతూ, గుహ్యాది శిరస్యంతం అంగముల తాకుతూ, ఆ అంగములను అభిమంత్రణము చేయవలెను. గుహ్యము, పాదములు తాకినప్పుడు అప ఉపస్పృశ్యము చేయవలెను (రెండు చేతులను నీతితో శుద్ధి) - ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆత్మ రక్షా అంటారు. దీనితో పాటు "బ్రహ్మాత్మ న్వదసృజత" మొదలగు మంత్రములు చదివి 'ఆత్మనే నమః' అని నమస్కారము చేయవలెను. ఇలా చేయటం వలన తన ఆత్మ యందు ఆ పరమాత్మ ఉండునట్లు చేయుట అగును.
౫. పంచమాంగన్యాసము
ఇందులో శివ సంకల్ప సూక్తం ప్రధాన మైనది. శివ సంకల్పం గురించి ప్రత్యేక వ్యాసం తర్వాత రాస్తాను. "యే వేదం భూతం భువనం భవిష్యతి.." మొదలుకొని  ముప్ఫై తొమ్మిది మంత్రములున్న శివ సంకల్ప సూక్తాన్ని పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ శివసంకల్పగ్‍ంహృదయాయ నమః" అని చెప్పి తన హృదయమున న్యాసము చేయవలెను. దీనివలన మోక్షము కలుగును.
తరువాత పురుష సూక్తము పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ పురుష సూక్తగ్‍ంశిరసే స్వాహా" అని శిరసున న్యాసము చేయవలెను. దీనివలన జ్ఞానమోక్ష ప్రాప్తి.
తర్వాత, ఉత్తర నారాయణమును "అద్భ్య స్సం భూతః" మొదలు "సర్వమ్మనిషాణ" వరకు పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఉత్తర నారాయణగ్‍ంశిఖాయై వషట్" అని శిఖ యందు న్యాసము చేయవలెను.
తరువాత అప్రతిరథకవచమును పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఆశుశ్శిశానోప్రతిరథం కవచాయ హుం" అని చెప్పి కవచముగా న్యాసం చేయవలెను. దీని వలన శత్రు బాధా నివారణం, విజయ ప్రాప్తి.
తరువాత, "ప్రతి పూరష మేకకపాలా న్నిర్వపతి......" అనే అనువాకమును, "జాతా ఏవ ప్రజా రుద్రా న్నిరవదయతే..." అను అనువాకమును పఠించి, "ఓం నమో భగవతే రుద్రాయ ప్రతి పూరుషం ప్రతి పూరుషం విభ్రా డితి నేత్రత్రయాయవౌషట్" అని చెప్పి మూడు నేత్రములను తాకవలెను.
తరువాత, "త్వ మగ్నే రుద్ర ....." అనే అనువాకమును, "దేవా దేవేషు శ్రయధ్వం..." అనువాకమును పఠించి "ఓం నమో భగవతే  రుద్రాయ అస్త్రాయ ఫట్" అని న్యాసము చేయవలెను. తరువాత "భూ ర్భువ స్సువ ఇతి దిగ్బంధః"  అని దిగ్బంధమును చూపించ వలెను.
తరువాత, ఆష్టాంగ ప్రణామములు చేయవలెను (ప్రతి అంగమునకు ఒక మంత్రము ఉంది. దాన్ని పఠించి, ఎనిమిది అవయవములు భూమిపై తాకునట్లు, వాటిని తాను కూడా తాకుచు ఒక్కొక్క అవయవామునకు ఒక్కొక్క సాష్టాంగ ప్రణామము చేయవలెను (రొమ్ము, శిరస్సు, కన్నులు, మనస్సు, వాక్కు, పాదములు, చేతులు, చెవులు - ఇవి అష్టాంగములు).
వీటి తర్వాత, తన్ను రుద్ర రూపునిగా ధ్యానించ వలెను. 
శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్‍ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్‍ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండలం వక్షసూత్రధర మభయవరదకరగ్‍ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్‍ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్
దీని తర్వాత, రుద్ర స్నానార్చనాభిషేక విధిని ప్రారంభించ వలెను.
లింగమును ప్రతిష్ఠించి, "ప్రజననే బ్రహ్మాతిష్ఠంతు" మొదలు "సర్వేష్వంగేషు సర్వాః దేవతాః యథాస్థానాని తిష్ఠంతు మాం రక్షంతు" అని చెప్పవలెను. (ఇప్పుడు అన్ని అంగములలో ఆయా దేవతలు యథా స్థానములందు ఉండునట్లు ప్రార్థించునది).
[తరువాత, "అగ్ని ర్మే వాచిశ్రితః వాగ్ఘ్రుదయే హృదయం మయి" మొదలు "అంత స్తిష్ఠ త్వమృతస్య గోపాః" వరకు పఠించి లింగము, అంగములను స్పృశించ వలెను. గంధము, అక్షతలు, బిల్వ పత్రములు, పుష్పాలు, ధూప దీప నైవేద్య తాంబూలములతో లింగమును అర్చించి ఆత్మను ప్రత్యారాధించ వలెను.అభిషేక ప్రారంభములో చమకములోని 'శంచమ' అనువాకమును, నమక చమకముల లోని మొదటి అనువాకములను పఠించి, "ప్రాణానాం గ్రంథిరసి"  అనే నాలుగు అనువాకములు, దశ శాంతి మంత్రములు, ప్రశ్నాంతము జపించి, శతానువాకములను, పంచకాఠకములను పఠించి అభిషేకము చేయవలెను. ఇట్లు ఏకాదశ వారములు చేసినచో అది ఏకాదశ రుద్రాభిషేకమగును.
జైహింద్.

20, మార్చి 2020, శుక్రవారం

శ్రీమాన్ అందుకూరి చినపున్నయ్యశాస్త్రిగారిని వరించిన రాయప్రోలు పురస్కారం.

0 comments

జైశ్రీరామ్.
శ్రీమాన్ అందుకూరి చినపున్నయ్యశాస్త్రిగారిని వరించిన రాయప్రోలు పురస్కారం.
జైహింద్

19, మార్చి 2020, గురువారం

వార్ధక్యం వయసా నాస్తి.....మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.
శ్లో.  వార్ధక్యం వయసా నాస్తి
మనసా నైవ తద్భవేత్‌
సంతతోద్యమ శీలస్య
నాస్తి వార్ధక్య పీడనమ్‌

ఆ.వె. వయసులోన లేదు వార్ధక్యదుస్స్థితి.
మనసుకూడ వీడి మనుటె యొప్పు.
నిరతముద్యమించు నేర్పిరిఁ జేరదు
ఉద్యమమున సతతమొప్పుమయ్య.

భావము. ముసలితనం వయసులో లేదు. మనసులోనూ ఉండకూడదు.
ఎప్పుడూ పని చేసుకునేవానికి ముసలితనపు పీడ ఉండదు.

ముసలితనం రెండు రకాలుగా వస్తుంది. వయోభారంతో వచ్చేది శారీరకం. దుఃఖం వల్ల వచ్చేది భావజం.
వయోభారం వల్ల వచ్చేది కూడా ఆపాదింపబడిన ముసలితనమే.
కొంతమంది యాభయ్యవ పడిలోకి రాగానే వృద్ధులయ్యారంటారు. కొందరు అరవై సంవత్సరాలకు ముసలివారనిపించుకుంటారు.
 70 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉండేవారు మరికొందరు. శరీర బలం తగ్గి, అవయవాలు పటుత్వం కోల్పోయి, నరాల కండరాల పట్టు సడలినా.. బుద్ధిబలంతో నిత్యం విజయాలను సాధించేవారు ఉన్నారు.* కొందరికి సోమరితనం వల్ల వృద్ధాప్యం వస్తుంది.

పని చేయడానికి బద్ధకించి పని సామర్థ్యాన్ని కోల్పోతే దాన్ని మించిన వార్ధక్యం మరొకటి లేదు.* _అటువంటివారు సమాజ ప్రగతికే కాక సొంత ప్రగతికి కూడా శత్రువులే. అతి పిసినారితనం, స్వార్థం, మద్యపానం, ధూమపానం, మత్తుమందుల వాడకం వంటి దురలవాట్లు శరీరంలో అనేక సామర్థ్యాలను బలహీన పరుస్తాయి. అకాల వార్ధక్యానికి దారి తీస్తాయి.
ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయి. అటువంటి వృద్ధులు తమ కుటుంబాలకు సమాజానికి కూడా భారమే. మానసిక ఒత్తిడులు, కుంగుబాటు వల్ల వచ్చే ముసలితనం చెదపురుగు లాంటిది. మనిషి భవితను సమూలంగా తినేస్తుంది.

మానసిక వృద్ధాప్యం అంటే.. ‘నాకు ముసలితనం వచ్చేసింది’ అనే భావన. అలాంటి వృద్ధాప్యాన్ని రానీయకూడదు. ‘సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక పీడనం’ అన్న మాటలను గుర్తుపెట్టుకుని ఏదో ఒక పని పెట్టుకోవాలి.
భారతీయ సంప్రదాయంలో జ్ఞానవార్దక్యాన్ని అంగీకరించారుగానీ వయో వార్ధక్యాన్ని కాదు.
నిత్యవ్యాయామం, యోగాభ్యాసం, సద్గ్రంథ పఠనం, సతతక్రియాశీలత, మితాహారం, హితాహారం, ఇష్టదేవతా ఉపాసనం, ఇవి ఉన్న చోట ముసలితనం ఉండదు.
జైహింద్.

18, మార్చి 2020, బుధవారం

౨౦౧౯ - ౨౦ వృద్ధుల ఆదాయపు పన్ను లెక్ఖించు విధము.

0 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

2019 - 29 వృద్ధపౌరుల ఆదాయపన్ను లెక్ఖించు విధము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారికి కొప్పరపు కవుల పురస్కారం - 2007

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

17, మార్చి 2020, మంగళవారం

కొప్పరపుకవులను గూర్చి ముగ్గురు ప్రతిభామూర్తుల పద్య నీరాజనం! సర్వశ్రీ మేడసాని, మాడుగుల, గరికపాటి

0 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

16, మార్చి 2020, సోమవారం

మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి శత జయంత్యుత్సవము సందర్భముగా....రచన. చింతా రామకృష్ణా రావు.

0 comments

 జైశ్రీరామ్

.
జైహింద్.

15, మార్చి 2020, ఆదివారం

కవిసమ్మేళనానికి ఆహ్వానం.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

14, మార్చి 2020, శనివారం

చమత్కార ఆశీర్వాద పద్యము.

0 comments

జైశ్రీరామ్.
చమత్కార పద్యం

చదువుచున్నప్పుడు ఏమిటి ఈ పదాలు.. అనుకుంటాము. ... కానీ ఇది సంకేతార్థాలతో రచింపబడ్డ ఒక ఆశీర్వాద పద్యము!  ఇదొక కవి చమత్కారం!

 ఆలి నొల్లకయున్న వానమ్మ మగని
 నందులోపల నున్న వానక్క మగని
 నమ్మినాతని జెరచు దానమ్మ సవతి
 సిరులు మీకిచ్చు నెప్పట్ల గరుణతోడ!

ఆలినొల్లక యున్నవాడు భీష్ముడు.
అతని అమ్మ గంగ.
ఆమె మగడు సముద్రుడు.
అందులో ఉన్నవాడు మైనాకుడనే పర్వతము.
అతని అక్క పార్వతి.
ఆమె మగడు శివుడు.
అతణ్ణి నమ్మినవాడు రావణుడు.
వానిని చెరచినదిగా అనగా అంతమొందించినది సీత.
ఆమె అమ్మ భూదేవి.
ఆమెకు సవతి లక్ష్మీదేవి.
ఆమె దయతో మీకు ఎల్లప్పుడూ సంపదలనిచ్చు గాక అని పై పద్యము యొక్క భావము.
జైహింద్.

13, మార్చి 2020, శుక్రవారం

శ్రీ శివభారతము -గడియారము వేంకట శేషశాస్ర్తీ

0 comments

 జైశ్రీరామ్
శ్రీ శివభారతము -గడియారము వేంకట శేషశాస్ర్తీ

సంస్కృతంలో రామాయణం ఆదికావ్యమైతే, తెలుగులో మహాభారతం ఆదికావ్యం. ఇది కవిత్రయ కృతం. ‘అందు ఇది దొడంగి మూడు కృతులు ఆంధ్ర కవిత్వ విశారదుండు, విద్యా దయితుం డొనర్చె మహితాత్ముడు నన్నయభట్టు దక్షితన్ అని చెప్పి తిక్కన సోమయాజి పదియేనింటి తెలుగు చేసెదనన్నాడు. కథ ముగించి ‘హరిహరనాథ సర్వభువనార్చిత నన్ను దయజూడు మెప్పుడున్’’ అని చెయ్యి కడుక్కొన్నాడు. తిక్కన లెక్క ప్రకారం పదునెనిమిది పర్వములు వెలువడినవి. ‘అరణ్య పర్వశేషము.. కవీంద్ర కర్ణపుట పేయముగన్’ పూరించినఎఱ్ఱన ఎక్కడున్నాడు? ఈ కించిత్పూరణమే ఎఱ్ఱనకు, నన్నయ తిక్కనల ప్రక్క ప ఈఠం కల్పిస్తుందా? అంటే, ఎఱ్ఱన హరివంశం తెనిగించినాడు. అది ప్రౌఢరచన. మహాభారతానికి హరివంశం శిష్టం. హరివంశం కలి వస్తే కాని, మహాభారతానికి పూర్ణత్వం రాదు. అందుచేత హరివంశకర్త ఎఱ్ఱన గణేయుడైనాడు. అయినా ఎర్ఱనకు తిక్కనపట్ల అపారమైన భక్తి. తిక్కనను కవిబ్రహ్మ అన్నాడు. తిక్కన సృష్టి తిక్కనదే. అది తక్కొరులచేత కాదు అన్నాడు. తరువాత వచ్చిన నాచన సోమనాథుడు- తన ఉత్తర హరివంశ కావ్య గద్యలో ‘తిక్కన సోమయాజి ప్రణీతంబైన మహాభారత కథానంతరం తిక్కనను మఱపించే కావ్యసృష్టి చేసినవాడననిసగర్వంగా చెప్పుకున్నాడు. తరువాత ఒకరిద్దరు తిక్కనకు ఉద్ది కావలెనని ప్రయత్నించినారు. చెప్పుకొన్నారు కూడా. కాని, ఎఱ్ఱన చెప్పిన మాటనే మనం గ్రహించక తప్పదు. తిక్కన కావించిన సృష్టి సృష్టి తక్కొరులచేతకాదు.
కాలం కడిచింది. ఇరువదవ శతాబ్ది వచ్చింది.
శ్రీమంతము సకల కళాసీమ ప్రకృతి సహజభాగ్యసేవధి విజ్ఞానామృత భాండము, దైవతభూమి, ఋషుల భూమి, భరతభూమి- కళ తప్పింది. పరుల పాలనలో ప్రజలు క్రక్కలేక, మ్రింగలేక, అల్లాడుతున్నారు. నలుదిక్కుల మబ్బులు. ఈ పరిస్థితిలో-
‘‘అలసాయాత సమీర సంయమిత సంధ్య గర్భనిర్బిన్న కం
దల బాలారుణ పాదచోదన దళన్మందేహ సందోహమూ
చెలువౌ ఒండొక సుప్రభాతం’’ వచ్చింది.
అరుణోదయం,మందేహరాక్షస పలాయనం, మబ్బులు విచ్చిపోగా కళకళలాడే ప్రకృతి శోభ అదే సుప్రభాతం. అదే శివభారతం. తిక్కనామాత్యుడు ‘ఆంధ్రావళి మోదమున్ బొరయ’ భారతం కూర్చినాడు. శివభారతకర్త శ్రీ గడియారం వేంకట శేషశాస్ర్తీగారు జగములున్నంత వరకెల్ల జనులు చదివి తనియుదురుగాక అన్నారు. అంటేశివభారతం ఆచంద్రార్కం నిలుస్తుందన్నమాట. ఇతివృత్తం భారతహృదయమే. రచన తిక్కన సోమయాజి అడుగుజాడల్లో నడిచిన రచన. ఎందుకు నిలవదు?
శ్రీ విశ్వనాథవారు తిక్కన శిల్పపు తెనుగుతోట అన్నారు. శిల్పపుతోట అంటే అందంగా చూడముచ్చటగా కత్తిరించి, పందిరికెక్కించి, మలచిన పుష్పలతా తరువిలాసం కలిగిన ఉద్యానవనం. తిక్కన తన నిర్వచనోత్తర రామాయణావతారికలో అమలోదాత్త మనీష! నే నుభయ కావ్యప్రౌఢి వాటించు శిల్పమునన్ సారగుడన్ కళావిదుడ అన్నాడు. అటువంటి కోటికెక్కినశిల్పం శివభారతంలో అడుగడుగునా కనిపిస్తుంది.
శాస్ర్తీగారు కాళిదాసాది గీర్వాక కవుల, నన్నయాధిక ప్రాక్తనాద్యత నాంధ్ర కవుల ఒక్క ముక్కలో చెప్పి, సోమయాజికి చంపకమాలిక అర్పించినారు.
‘‘హరిహరనాథ శాంతమధురాకృతి లోపలి చూపునన్ పురా
చరిత తఫః ఫలం ఋభయసత్కవిమిత్రత వెల్గ ధ్యాన త
త్పరుడయి భారతాగమము పల్కెడు తిక్కన వాక్కు వెంట త
త్కరమున తాండవించు వరదాయిని లేఖిని నే భజించెదన్
సోమయాజి ధ్యానతత్పరుడై భారతరచనను చేస్తున్నాడు. కాదు, పలుకుచున్నాడు. ఆ పలుకు వెంట గంటం నడుస్తూ వుంది. శాస్ర్తీగారి స్వానుభవం కూడా ఇదే లాగున వుంటుంది.
మాఘమహాకవి- ‘‘గహన మపరరాత్రప్రాప్త బుద్ధిప్రసాదాః కవయః ఇవ మహీపాః చింతయంత్యర్థజాతమ్’’ అన్నాడు. రాజులు కవుల వలె వేకువ జామున రాజకీయ విషయాలు ఆలోచిసాతరట. అంటే, నాలుగవ జామున బుద్ధికి ప్రసన్నభావం కలుగుతుంది. శాస్ర్తీగారు తెల్లవారుజామున లేచి, కూర్చుండి, కళ్ళు మూసుకొని, కథలో లీనమై, తనలో తాను పద్యాలు అల్లుకుంటూ పోతారు. చేతిలో చక్కగా మెదిపిన ఏకులోనుండి వడుకుతూ దారం తెగకుండా తీసినటుక్ల, పద్యపరంపర సాగిస్తారు. అదంతా సృదయ కమలంలో ఒదిగి వుంటుంది. ఉదయం లేచి కాల్యములు తీర్చి, జపాదులు ముగించుకొని కూర్చుండి, కాగితాలు కలం తీసుకొని అదంతా వ్రాస్తారు. అవి వంద పద్యాలు కావచ్చు.
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)
-సి.వి.సుబ్బన్న శతావధాని
జైహింద్.

12, మార్చి 2020, గురువారం

శివభారతమ్.

0 comments

జైశ్రీరామ్.
ఆదిపర్వ సభాపర్వ పర్వ ఆరణ్యకం తథా |
విరాటపర్వ విజ్ఞేయం చతుర్థం తదనన్తరమ్ || ౫౭ ||
ఉద్యోగం పఞ్చమం పర్వ భీష్మపర్వ అతః పరమ్ |
సప్తమం ద్రోణపర్వ తు కర్ణపర్వ అథాష్టమమ్ || ౫౮ ||
నవమం శల్యపర్వ చ గదాపర్వ అతః పరమ్ |
సౌషుప్తికమ్ తదా పర్వ గర్భపాతనమేవ చ || ౫౯ ||
త్రయోదశం తు స్త్రీపర్వ ప్రదానముదకస్య చ |
శాన్తి పర్వ అతః ప్రోక్తమాశ్వమేదికమేవ చ || ౬౦||
స్వర్గారోహణ పర్వ తు హరివంశస్తథైవ చ |
ఇత్యష్టాదశపర్వాణి సంఖ్యా ద్వైపాయనేన తు || ౬౧ ||
భాతి సర్వేషు వేదేషు రతిః సర్వేషు జన్తుషు |
తరణం సర్వపాపానాం యస్మాద్భారతముచ్యతే || ౬౨ ||
భారతస్య సముద్రస్య మేరోర్నారాయణస్య చ |
అప్రమేయాణి చత్వారి పుణ్యం తోయం గుహాగుణాః || ౬౩ ||
హేమన్తే ప్రథమే మాసే శుక్లపక్షే త్రయోదశీ |
ప్రవృత్తం భారతం యుద్ధం నక్షత్రమ్ యమదైవతమ్ || ౬౪ ||
ఫాల్గున్యాం నిహతో భీష్మః కృష్ణ పక్షే చ సప్తమీ |
అష్టమ్యాం చైవ సౌభద్రో నవమ్యాం చ జయద్రథః || ౬౫ ||
దశమ్యాం భగదత్తస్తు మహాయుద్ధే నిపాతితాః |
ఏకాదశ్యామర్ధరాత్రౌ హతో వీరో ఘటోత్కచః || ౬౬ ||
తతః ప్రభాతసమయే విరాటద్రుపదౌ హతౌ |
ద్వాదశ్యాం చైవ మధ్యాహ్నే ద్రోణాచార్యో రణే హతః || ౬౭ ||
త్రయోదశ్యాం తు మధ్యాహ్నే వృషసేనో నిపాతితః |
చతుర్దశ్యామ్ తు పూర్వాహ్ణే రణే దుఃశాసనో హతః || ౬౮ ||
తస్మిన్నేవ మహాయుద్ధే వర్తమానే చతుర్దశీ |
ధనఞ్జయేన మధ్యాహ్నే కర్ణో వైకర్తనో హతః || ౬౯ ||
నిఃశబ్దతూర్యం హత యోధవీరమ్
ప్రశాన్తదర్పం ధృతరాష్ట్రసైన్యమ్ |
న శోభతే సూర్యసుతేన హీనమ్
వృన్దం గ్రహాణామివ చన్ద్రహీనమ్ || ౭౦||
ముఖం కమలపత్రాక్షం యథా శ్రవణవర్జితమ్ |
తథా తత్ కౌరవం సైన్యం కర్ణహీనం న శోభతే || ౭౧ ||
వ్యూఢోరస్కం కమలనయనం తప్తహేమావభాసమ్ |
పుత్రం దృష్ట్వా భువనతిలకం పార్థబాణావసక్తమ్ |
పాంసుగ్రస్తం మలినవసనం పుత్రమన్వీక్ష్య తం చ
మన్దమ్ మన్దమ్ మృదితవదనం మేదినీ మన్దరాశిః || ౭౨ ||
కృష్ణ ఉవాచ
స్వ (యా) మయా చ కున్త్యా చ ధరణ్యా వాసవేన చ |
జామదగ్న్యేన రామేణ షడ్భిః కర్ణో నిపాతితః || ౭౩ ||
సన్జయ ఉవాచ
అమాయాం ధర్మపుత్రేణ శల్యో మద్రాధిపో హతః |
ఉలూకః శకునిశ్చైవ యమాభ్యాం వినిపాతితౌ || ౭౪ ||
అమాయామర్ధరాత్రే తు రాజా దుర్యోధనో హతః |
భీమసేనస్య గదాయా తాడితో వినిపాతితః || ౭౫ ||
అభవత్తాదృశం యుద్ధం క్షత్రియాణాం మనస్వినామ్ |
అన్యథా భాషితం యుద్ధం కర్మణా కృతమన్యథా || ౭౬ ||
అమాయామేవ యామిన్యాం ద్రోణినా నిహతస్తదా |
ధృష్టాద్యుమ్నః శిఖణ్డీ చ ద్రౌపద్యాః పఞ్చ చాత్మజాః || ౭౭ ||
అష్టౌ రథసహస్రాణి నవ దన్తి శతాని చ |
రాజపుత్రసహస్రమ్ చ అశ్వత్థామ నివర్తతే || ౭౮ ||
దినాని దశ భీష్మేణ భారద్వాజేన పఞ్చ చ |
దినద్వయే తు కర్ణేన శల్యేనాఅర్ధదినమ్ తథా || ౭౯ ||
దినార్ధం తు గదాయుద్ధమేతద్భారతముచ్యతే |
ఏవమష్టాదశం హన్తి అక్షౌహిణ్యాం దినక్రమాత్ || ౮౦||
ధర్మక్షేత్రే క్షయక్షేత్రే కురుక్షేత్రే మహాత్మనా |
పార్థేనారోహయన్స్వర్గమ్ రాజపుత్రా యశశ్వినః || ౮౧ ||
జైహింద్.

11, మార్చి 2020, బుధవారం

అధ్యక్షోపన్యాసం - డా. ధూళిపాళ మహాదేవమణి // కొప్పరపు పురస్కారాలు 2019

0 comments

జైశ్రీరామ్.
అధ్యక్షోపన్యాసం - డా. ధూళిపాళ మహాదేవమణి // కొప్పరపు పురస్కారాలు 2019
జైహింద్.

10, మార్చి 2020, మంగళవారం

కాళిదాసుపాటి కవియు లేడు.

2 comments

జైశ్రీరామ్.
భోజ కాళిదాస కథలలో ఎక్కువ కథలు భోజుడి ఔదార్యాన్నీ , కాళిదాసు కవిత్వ మహాత్వాన్నీ ప్రశంసిస్తూ
చెప్పేవి. కొన్ని కథలలో కాళిదాసు యుక్తితో సమస్యల నుంచి తప్పించుకోవడం గురించి చెప్తారు.యిది అలాంటి కథ.

ఒక దూరదేశం లో దుర్యోధను డనే కవి వుండేవాడు.ఆయన కాళిదాసు కవిత్వము గురించీ ఆయన పొందుతున్న సత్కారాలను గురించీ విన్నాడు.భోజుడి రాజ్యం లో కాళిదాసునే భోజుడికంటేఎక్కువ గౌరవిస్తారానీ విన్నాడుదుర్యోధనుడు స్వయం గా మంచి విద్వాంసుడూ.కవీ దానికి తోడు
మహా భక్తుడు,దేవీ ఉపాసకుడు కూడా.అయితేనేమి కొంచెం అసూయా పరుడు.కాళిదాసును మించిన కవిత్వం చెప్పాలనే కోరిక తో
దేవిని గూర్చి తపస్సు చేశాడు.దేవి ప్రత్యక్ష మైంది.మాతా!నాకు కాళిదాసు ను మించిన కవితా పాటవాన్ని ప్రసాదించు.కాళిదాసును ఓడించాలని నాకోరిక. అని అడిగాడు..అప్పుడు దేవి భక్తా! నీ కోరిక లో ఈర్ష దాగి వుంది అది నీకు మంచిదికాదు.కాళిదాసు నా భక్తుడు.నా వరం తోనే మహా కవి యైన వాడు.ఆయన తో నీకు పోటీ కూడదు.అయినా తపస్సు చేసి నన్ను మెప్పించావు కాబట్టి,నీకు ఆ శక్తిని ప్రసాదిస్తున్నాను. కానీ
రాబోయే పౌర్ణమి నాటికి భోజుడి ఆస్థానం చేరితే ఆ రోజు ఒక్కరోజు మాత్రమే ఆ శక్తి పనిచేస్తుంది. అని చెప్పి అంతర్ధాన మైంది.
సంతోషం తో తన పరివారాన్ని తీసుకొని ధారనగారానికి వెళ్లి నగర శివార్లలో విడిది చేసి పొర్ణమి నాడు తను
రాజాస్థానానికి వస్తున్నానని కబురు పంపాడు.ఆ సాయంత్రం కాళిదాసు రోజు లాగే కాళీమాతను పూజిస్తూండగా దేవి పలుకులు వినిపించాయి కాళిదాసా! రేపు మీ ఆస్థానం చేరబోతున్న దుర్యోధన కవికి రేపు పున్నమి రోజు ఒక్క రోజుకూ నేను నిన్ను ఓడించగల శక్తి ప్రసాదించినాను.ఈ ఒక్కరోజూ దుర్యోధనుడిని గెలవటానికి నేను ఏమీ సహాయం చేయలేను.నీ వేమయినా జాగ్రత్త పడతావేమో నని నిన్ను హెచ్చరిస్తున్నాను.అని చెప్పి మాయమై పోయింది.కాళిదాసు ఒక యుక్తి పన్నాడు.గడ్డి మోపులు అమ్మేవాడిలాగా వేషం వేసుకొని ఊరిబయట వున్నగుడారాలలో విడిది చేసిన దుర్యోధనుడి పరివారాల దగ్గరికి వెళ్లి గుర్రాలకు కావలిసిన మేత కారు చౌకగా అమ్మాడు.రాత్రయిపోయిందని సాకు చెప్పి అక్కడే వుండి పోయాడు.
గుడారం లో దుర్యోధనుడికి నిద్ర పట్టలేదు,బయట వున్న కాళిదాసుకూ నిద్ర పట్టలేదు.యిద్దరికీ రేపేంజరుగుతుందో నని ఆందోళనా భయం.దుర్యోధనుడు తెల్లవారక ముందే తన గుడారం నుంచి బయటికి వచ్చిఅక్కడే తిరుగుతున్నాడు. కాళిదాసు అయన ప్రక్కన చేతులు కట్టుకొని నిలబడ్డాడు.పడమటి దిక్కున చంద్రుడు యింకా ప్రకాశిస్తున్నాడు.సూర్యోదయం యింక కాలేదు.పక్షుల కలకలా రావాలు అప్ప్దప్పుడే మొదలవుతున్నాయి.ప్రకృతి ఎంత అందం గా వున్నది.యిదంతా చూస్తుంటే నీ హృదయం స్పందించడం లేదా?అని అడిగాడు.దుర్యోధనుడు మారువేషం లో వున్న కాళిదాసును.గడ్డి అమ్ముకునే వాడిని నాకవన్నీ
ఏమి తెలుస్తాయి?మీరే  ఏదైనా మంచి వర్ణన చెప్పండి వింటాను అన్నాడు.అయితే విను అని దుర్యోధనుడు

చరమగిరి కురంగీ శృంగ కండూయనేన
స్వపితి పునరిదానీం అంతరిందో:కురంగః

అంటే అర్థ మయిందా?నీకు కాలేదనుకుంటాను నేను చెప్తాను అన్నాడు.చిత్తం అవసరం లేదండీ.కాళిదాసు గారి గుర్రాలకు కూడా నేనే గడ్డి అమ్ముతాను అక్కడి సేవకులతో మాట్లాడుతుంటాను.కాళిదాసుగారి కవిత్వం అప్పుడప్పుడూ వింటూ వుంటాను మరీ కఠిన మైనవి అర్థం కావు కానీ ఇలాంటి చిన్న చిన్న శ్లోకాలు అర్థం చేసుకోగలను.అన్నాడు.దుర్యోధనుడు నివ్వెర పోయి ఏదీ చెప్పుచూద్దాం అన్నాడు.
చరమగిరీ అంటే పడమటి కొండ కురంగీ అంటే లేడి శృంగం అంటే క్మొమ్ము కండూయనం అంటే దురద పోయేలా హాయి కలిగించేలా మెల్లగా గీరటం.అంతరిందో:కురంగః అంటే ఆ చంద్రుని లోపల కనిపిస్తున్న లేడి.
(చంద్రుడికి హరిణాంకుడు అని పేరు.మధ్యలో హరిణం వున్నవాడు.అని అర్థం)వెరసి మీరనేది పడమటికొండ అనే లేడి తన కొమ్ములతో చంద్రుడి లో వున్న లేడికి హాయి గొలిపేలా గీరుతూ వుంటే అది నిద్రావస్థ లోకి యిప్పుడు జారుకుంటున్నది అని అంతే కదా కవిరాజా! అన్నాడు.అమాయకత్వం నటిస్తూ.ఆరి పిడుగా అని ఆశ్చర్య పోయాడు దుర్యోధనుడు.గడ్డి అమ్ముకునే వాడికే యింత పాండిత్యం వుంటే యిక ఆస్థానం లోని కవులేంతటి వారో అని అతనికి వణుకు పుట్టింది.పైకి మాత్రం డాంబికంగా చూశావాఅలంకారం యెంత బాగా
వేశానో అన్నాడు.అలంకారానికేమి స్వామీ అద్భుతం గా వున్నది.కాకపొతే నాదొక చిన్న సందేహం
'చరమగిరి కురంగీ' అన్నారు కదా!కురంగీ అంటే ఆడలేడి.ఆడ లేడికి కొమ్ములు వుండవు కదండీ మీరు ఏ
భావం తో చెప్పారో వివరం చెప్పరా?అన్నాడు కాళిదాసు.దుర్యోధనుడి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.
తను పప్పులో కాలేశాడు.పైకి మాత్రం ఆ ఏదో తెల్లవారు ఝాముననె నిద్రకళ్ళతో ఆశువుగా రెండు ముక్కలు చెప్పానులే నువ్వు కనుక్కో గలవో లేదో అని నిన్ను పరీక్షించ డానికి చెప్పాను అన్నాడు.దానికి కాళిదాసు .ఇది నిజంగా   అద్భుతమైన ఊహండీ
ఇలాంటి తప్పులు సవరించడం నేను కాళిదాసు గారి దగ్గర నేర్చుకున్నానండీ మీరు నన్నుప్రోత్సహిస్తున్నారు కాబట్టి నేను దీన్ని సవరించి చెప్తానండీ మీకు నచ్చుతుందో లేదో తెలియదు.
మీ శ్లోకం లో కురంగీ కి బదులుగా 'తుండీ' అని మారిస్తే సరిపోతుందండీ తుండి అంటే ముట్టే అని అర్థం వస్తుంది కదండీ అందుకని సరిపోతుంది.మిగతా రెండు పాదాలూ చెప్పేయండి.అన్నాడు.
శ్లోకం పూర్తీ చెయ్యటం అంటే గడ్డిమోపులు అమ్మినంత సులభం కాదు.అలంకారం,ధ్వనీ రసం అన్నీ సరిచూసుకోవాలి కదా!వున్న పళాన చెప్పేది కాదు అన్నాడు.నిజమే లెండి అవన్నీ ఆలోచించి మీరు శ్లోకాన్ని ఎలా పూరిస్తారో నాకు తెలియదు కానీ నేను పూరిస్తాను చూడండి.నేను కాళిదాసు గారు పండితులతో ముచ్చటి స్తూంటే విని నాకూ కొంచె పూర్తి చెయ్యటం అబ్బింది లెండి అని యిలా చెప్పాడు.

'పరిణిత రవి గర్భ వ్యాకులా పౌరుహూతీ
దిగపి ఘన కపోతీ హుంకృతై:క్రంద తీవః
మీరు పడమటి దిక్కు గురించి రెండు పాదాలు చెప్పారు.తూర్పుదిక్కు గురించి మిగతా రెండు పాదాలూ
చెప్తే సరిపోతుంది కదా! అని చేప్పాను.పౌరుహూతి అంటే తూర్పు దిక్కు కదండీ 'పరిణత రవి గర్భ వ్యాకుల'
అంటే సూర్యుడిని గర్భం లో వుంచుకొని నెలలు నిండిన వనితలా ప్రసవ వేదన తో కేకలు పెడుతున్నది కదండీ అదిగో 'ఘన కపోతీ హుంకృ తై క్రందతీ యివ అంటే పెద్ద పెద్ద పక్షుల అరుపుల రూపం లో ఆమె ప్రసవ వేదన పడుతున్నట్లు అనిపించడం లేదూ?అంటూ అప్పుడే లేచి కలకలా రావాలు చేస్తున్న పక్షులను చూపించాడు.కాళిదాసు.శ్లోకం పూర్తయింది.

చరమగిరి కురంగీ తుండ కండూయ నేన
స్వపితి పునరిదానీం అంతరిందో:కురంగః
పరిణిత రవి గర్భ వ్యాకులా పౌర హూతీ
దిగపి ఘన కపోతీ హుంకృతై :క్రందతీవః

పడమటి కొండ అనే ఆడ లేడి తన తుట్టేతోచంద్రుడిలో వుండే హరిణాన్ని తనముట్టెతో దానికి హాయి గోలిపేలా గీరుతున్నది.యిక తూర్పుదిక్కు సూర్యుడిని తన గర్భం లో దాచుకొని నెలలు నిండిన వనిత ప్రసవ వేదన పడుతున్నప్పుడు చేసే ఆక్రందనల్లాగా పక్షుల కిలకిలా రావాలు అనిపిస్తున్నాయి.
దుర్యోధనుడికి ఆ కవిత్వ సౌందర్యానికి ఒళ్ళు పులకరించింది.కాళిదాసు యొక్క గుర్రాలకు గడ్డి అమ్మే వాడికే యింత కవిత్వం వస్తే యింక కాళిదాసును నేనెలా ఎదుర్కొన గలను?యింక రాజాస్థానం లోపరాభవం తప్పదని
భయం వేసి దేవీ కటాక్షం మీద కూడా నమ్మకం పోయి ఈ కవుల ముందు తాను నిలువ లేనని పించి
అప్పటికపుడే తన సేవకులందరినీ లేపేసి తెల్లవారక ముందే సపరివారం గా వూరు విడిచి వెళ్లి పోయాడు.
కాళిదాసుr
' మాణిక్యవీణా ముపలాలయంతీం'
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మాహేంద్ర నీల ద్యుతి కోమలాంగీం
మాతంగ కన్యాం మనసాస్మరామి
అని దేవిని స్తోత్రం చేసుకుంటూ ఇల్లు చేరాడు.
జైహింద్.

9, మార్చి 2020, సోమవారం

నారాయణ.......దేవీదాసః.

0 comments

జైశ్రీరామ్.
శ్రీరస్తు
నారాయణంనమస్కృత్యమ్ నరం చైవనరోత్తమమ్
దేవీం సరస్వతీo చైవ తతో జయ ముదీరయేత్
ప్రాణి శరీరములకు పిండాoడ మనియు దృశ్యమగు చరాచరమునకు బ్రహ్మాణ్డమనియు పేరు . పిండాo డమునకు అధినేత అగుటచే జీవునకు నరుడని పేరు . అట్లే బ్రహ్మాణ్డమునకు అధినేతఅగు పరమేశ్వరునకు నరుడని పేరు నరుడగు పరమేశ్వరునినుండి ఆవిర్భవించుటచే ఈ చరాచరమునకు
' నారం 'అనియు వ్యాపకత్వ ధర్మముచే ' ఆపః ' అనియు పేరు. అట్టి నారము నకు  అనగా చరాచరమునకు ఆయనము - అనగా అధిష్టాన రూపుడై వసతిస్థానమగుటచే పరమేశ్వరునలు ' నారాయణ ' అనిపేరు ప్రసిద్ధము. నరనారాయణులగు జీవేశ్వరులు ఇరువురకును స్వరూపభూతుడై యధినేత అగు నిర్గుణ బ్రహ్మమునకును నరః 'పేరు యిట్లు నర , నారాయణ నిర్గుణ బ్రహ్మలు మువ్వురును నరశ్శబ్దవాచ్యులే చేతనుడగుటచే జడవర్గము కంటే జీవుడు ఉత్కృష్టుడు . జీవునికంటే కారణాత్మ యగు నారాయణుడు ఉత్క్రుష్టస్తరుడు
వీరిరువురికంటే " సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ " ఇత్యాది శ్రుతి ప్రతిపాద్య నిర్గుణ బ్రహ్మతత్త్వము ఉత్కృష్టతమము . కావున అట్టి నిర్గుణ తత్త్వము ' నరోత్తమం ' అని యిట కీర్తింపబడుట యుక్తమే. ఇట్టి ఈ - నర - నారాయణ - నరోత్తమ తత్త్వములను ప్రకాశింప జేయుచు సంసార జయమునకు సాధన భూతమైప్రవర్తిల్లిన దగుటచే ఈ మహాభారత మునకు ' జయ ' మని పేరు. మహాభారతమే కాదు ; సర్వ పురుషార్థ ప్రతిపాదకమై సంసార జయమునకు సాధభూతములైన పురాణాదులు శారీరక సూత్ర భాష్యాది గ్రంథములును ' జయ' శబ్ద వాచ్యములే అగును అట్టి గ్రంథములు చదువుటకు ఉపక్రమించు నపుడు నర  నారాయణ  నరోత్తములను తత్తత్వ ప్రకాశిక అగు సరస్వతిని , అట్టి సరస్వతీదేవి అనుగ్రహమునకు పాత్రుడగు వ్యాసుని స్మరించి నమస్కరింపవలెనని పై శ్లోకమునకు సంప్రదాయానుగతమైన అర్థము.
ఈ భారతము మొదటి మంగళ శ్లోకము నర   నారాయణ.  నరోత్తమ తత్త్వములను అనగా జీవేశ్వర బ్రహ్మతత్త్వములను ప్రకాశింపజేయుతల్లి సరస్వతి అని కీర్తింప బడుట గమనార్హము .
సరస్వతీ సాధయన్తీ ధియం నః - ఇత్యాది శ్రుతులు జిజ్ఞాసువుల బుద్దిని సంస్కరించి తత్త్వమునుద్దీపింప జేయు తల్లి సరస్వతి. అని చెప్పుచున్నవి. అట్టి శ్రుత్యర్థమే ఆది మంగళ శ్లోకమున గ్రంథారంభ సమయమున మహర్షిచే తలపింపజేయబడుచున్నది. నీల కంఠ పండితుడును శ్రుత్యర్థానుగుణ్యముగానే పై శ్లోక వ్యాఖ్యానమున సరస్వతీ స్వరూపము నిట్లు వివరించాడు
" దేవీం నరనారాయణ నరోత్తమ తత్త్వ ప్రద్యోతనీంసరస్వతీంచ నమస్కృత్యైవ.
( నీల కంఠ )
జైహింద్.

8, మార్చి 2020, ఆదివారం

విశ్వ మహిళాదినోత్సవము సందర్భముగా మహిళా మణులకు శుభాకాంక్షలు.

0 comments

జైశ్రీరామ్.
🙏🏻జై శ్రీమన్నారాయణీ🙏🏻

విశ్వ మహిళా దినోత్సవము సందర్భముగా
సర్వశక్తిసంపన్నులయిన మహిళలకునమస్కరిస్తూ....

కళల కనంత శక్తి కలకాలము నిల్పెడి నైపుణీ నిధుల్.

ప్రళయము వచ్చినన్ కలత బారగనీయక నిల్పు ధీనిధుల్,

కలలు నిజంబు చెయఁ గల కార్యచణుల్. మహనీయులైన యీ 

నెలతల నేలు శాంభవియు నిత్యము వాణి, రమాలలామయున్.🙏🏻

మహిళాలోకానికి అభినందన పూర్వక వందనాలు.
💐🙏🏻🙏🏻🙏🏻
జైహింద్.

అన్నీ గుడులతో పద్యము. రచన...కాశీపత్యవధానులు గారు.

0 comments

జైశ్రీరామ్.
అన్నీ గుడులు వుండే పద్యం --కాశీపత్యవధానులుగారు.

కినిసి సిరి దీసి నీలిగి
తిని సిగ్గిడి కింగిరి కిని దిగి తీరితికి గి
త్తిని జీరినించి చిక్కిడి
తిని జియ్యా యింతి కీరితిని నిల్చిరిసీ

హరిశ్చంద్రుని పై కోపంతో అతని ఐశ్వర్య మంతా పోయేటట్లు చేశాను. సిగ్గులేక నీచ కార్యానికి (కింగిరిసి) దిగాను.అగ్ని (కిత్తి) వంటి హరిశ్చంద్రుని పిల్చి,నిందించి, ఎన్నో
కష్టాలకు గురి చేశాను. అయినా ఈ రాజు,రాణి (జియ్యా యింతి) కీర్తిని గెల్చుకున్నారు.
అని పైన పేర్కొన్న పద్య భావం. విశ్వామిత్రుడు తనను తాను నిందించుకునే సందర్భాన్ని పురస్కరించుకొని. అన్నీ గుడులతోనే పద్యం వ్రాయడం ఎంతో
ఔచిత్యవంతంగా వుంది.
శుద్ధ నిరోష్ట్యం 
అలికాంచి తా శ్రాయాశా
ఖల దైత్యానీక నాశ కలితాంత్యాశా
లలితాంత రిక్ష కేశా
సలిల జనయ నేశ యీశ శశి నీకాశా

టీక:---నాలిక= నొసటి యందున, అంచిత= ఒప్పుచుండిన, ఆశ్రయాశా=అగ్నిహోత్రుడు గలవాడా, ఖల= దుర్మార్గులగు,దైత్యానీక =రాక్షస సైన్యముల, నాశ= హతము చేసినవాడా, కలిత=ఒప్పుచున్న, అంత్య= చివరిదియగు
ఆశా =దిక్కు గలవాడా,(ఈశాన్య మూల యనుట)లలిత-మనోజ్ఞమైన,
అంతరిక్ష= ఆకాశమునే, కేశా=వెంట్రుకలుకల వాడా, సలీలజ నయన =కమలాక్షుడగు
విష్ణునకు,ఈశ= ఈశ నామము గలవాడా, శశి= చంద్రుని వంటి, నీకాశా=కాంతి గలవాడా.
ఈ పద్యం పెదవులకు తగలకుండా చదవడానికి వీఎలుగా రచింప బడినది. అందుచేత
దీనిని 'శుద్ధ నిరోష్ట్యం' అంటారు.

అన్నీ యేత్వాలు గల పద్యం---కాశీపత్యవధానులు గారి రచన.
కేలే దే తేతేలే
వే లేవే మెట్లె దేబేవే యెల్చేడె
న్నే లేనే వేరే యె
గ్గే లేనే లేదే యేడ్చే దేవే మేలే

టీక:- కేలు= హస్తం, యేదే=ఎచ్చటనే, తేతేవే =తెమ్ము తెమ్ము, లే= శీఘ్రముగా
లేవే మెట్లే =లేవలేమి యెట్లనే, దేబేవే = దీనురాలవా, ఏల్చేడెన్= రక్షించు వనితను,
నేలేనే=నేనుండ లేదా, వేరే= వేరుగా, ఎగ్గే లేనే లేదే =కీడు,లేక దోషము లేనే లేదే
ఏడ్చేదేవే=యేడ్చెదవెందుకే, మేలే =శుభమే లే.
ఈ పద్యమంతా ఎత్వాలతో రచింప బడింది.(అచ్చ తెలుగులో)
ఇన్ని ప్రయోగాలు చేసిన తెలుగు కవి మరొకరు ఈ 20 వ శతాబ్దములో ఎవరూ లేరేమో.

 పద్యభ్రమకం.
చిత్ర కవిత కర్ణపేయంగా ఉన్నప్పటికీ, వ్యర్థ పదాడంబరము తో నిండి సులభంగా అర్థం కాదు. రసపుష్టి కూడా లోపిస్తుంది. చిత్రకవితా పంచాననులైన కాశీపతిగారు చిత్రకవిత్వము లో వ్రాసిన పద్యాలలో పేర్కొనదగినవి రెండు. అందులో రెండవది 'పద్యభ్రమకం'
. 'పద్యభ్రమకం' లో పద్యమంతా క్రిందినుంచి చదివినా ఒకటిగానే వుంటుంది.

సారసజ నుత జయ తరల
శూరహరా సాదర వర సు సురా పరమా
మార పరా సుసుర వరద
సారా హర శూలరత యజతనుజ సరసా

టీక:--సారసజ =పద్మసంభవుడైన బ్రహ్మ చేత, నుత =కొనియాడబడు, జయ=జయము
గలవాడా, తరళ=చరించునట్టి, శూరహర = రణ సాహసులను హరించిన వాడా,
సాదర=ఆదరముతో గూడిన, వర=ప్రభువా, సు=శ్రేష్ఠుడవైన సుర =దేవతా,పర =పరమాత్ముడా, మార=మన్మథునకు,పరా=శత్రువైనవాడా,సుసుర=మంచి వేల్పులయొక్క, వర=కోరికలను, ద =యిచ్చువాడా, స+ఆరా =వేగయుక్త
హర= హర నామము గలవాడా, శూలరత =త్రిశూలాయుధము నందాసక్తి కలవాడా,
సరసా=సరసుడైనవాడా.
ఈ పద్యాన్ని చివరినుండి మొదటికి చదివినా, మొదటినుండి చివరికి చదివినా
ఒకే విధంగా వుంటుంది.
ఇన్ని ప్రయోగాలు చేసిన తెలుగు కవి మరొకరు ఈ 20 వ శతాబ్దములో ఎవరూ లేరేమో.
జైహింద్.

7, మార్చి 2020, శనివారం

కాశీపత్యవధాని....శ్రీ బెజ్జంకి జగన్నాథాచార్యులు.

0 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

6, మార్చి 2020, శుక్రవారం

స్త్ర్రీలను సూచించు పదజాలము.

0 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

5, మార్చి 2020, గురువారం

ఏకాక్షర కందము.

0 comments

జైశ్రీరామ్.
ఏకాక్షరి అంటే ఒకే హల్లుతో కూర్చిన పద్యం.
ఇందులో ఏ అచ్చైనా వాడవచ్చు ఎన్ని అచ్చులైనా వాడవచ్చు
కానీ హల్లుమాత్రం ఒకటే వాడాలి.
విక్రాల శేషాచార్యులవారి
శ్రీ వేంకటేశ్వర చిత్రరత్నాకరములోని
ఈ ఉదాహరణ చూడండి-

నిన్ను నిను నెన్న నీనె
నెన్నిన నన్నన నన్నన నన ననిన నానేనా
ని న్నూనినా ననూనున్
న న్నూనన్నాను నేననా నున్నానా!


దీన్ని ఈ విధంగా పదవిభాగం తీసుకోవాలి-

నిన్నున్ - ఇనున్ - ఎన్నన్ - ఈనేను - ఎన్నినన్-
అన్నన్న - ననను -అనిన - నానేనా - నిన్ను -
ఊనినాను - అనూనున్ - నన్ను - ఊను -
అన్నాను - నేను - అనా - నున్నానా

అర్థం -
నీకు పైన ప్రభువులులేని, సర్వస్వమునకు ప్రభువైనవాడా
సర్వేశ్వరుడవైన నిన్ను స్తుతించుటకొరకు ఈ నేను ఆలోచిస్తే
చిగురువలె అల్పుడను. చోద్యము గొప్పవాడవైన నిన్ను ఆశ్రయించాను
శకటాసురుని సంహరించినవాడా తండ్రీ నన్ను ఆదుకొనుము అంటిని.
జైహింద్.

4, మార్చి 2020, బుధవారం

అరుణోదయం. ఖండిక(౧ నుండి౧౫). రచన. డా. నలవోలు నరసింహారెడ్డి

0 comments

జైశ్రీరామ్.
అరుణోదయం.
డా. నలవోలు నరసింహారెడ్డి
1.చ॥ అదియొక పూల తోట విరు లందము జిందుచు తావు లొప్పెడిన్‌
అది సెలయేటి హోరు విను మల్లదిగో జలపాత సధ్వనుల్.
అది భ్రమరాలు ఝుమ్మనుచు హాయిగ బాడెడు గాన మాధురుల్‌
అది తిలకించ బూని దరహాసముతో నొక కాంత యుండెడిన్‌

2.ఆ॥ ఆమె పేరు ‘‘అరుణ’’ అత్యంత ధీ ధీత
అశ్వముపయి నెక్కి ఆమె వెంట
సరస హృదయులైన సఖులు తోడై రాగ
వచ్చె తాను పుష్పవనము నరయ

3.శా॥ ధాత్రిన్‌ మించిన సోయగంబులను సందర్శించు నాకాంక్షతో
ఆత్ర మ్మాత్రము సంచరించుచును, దృశ్యంబుల్‌ సమీక్షించుచున్‌
మిత్ర ద్వంద్వము వెంటనంటి చనగా, మించైన లేనవ్వుతో,
రాత్రిన్‌ బూచిన పూవు కన్నుగవతో, రంజిల్లె పూదోటలో

4.ఆ॥ ప్రాణ సఖులు వెంట పయనమై చనుదెంచ
కాంత గనుచు ప్రకృతికాంత సొగసు
సఖుల తోడ తాను సరదాలు పచరించి
నడువసాగె వనము నంత నంత

5.ఉ॥ అల్లన నీలిమబ్బు కురులందము జిందెడు వేణికట్టుతో,
పుల్ల సరోజ నేత్ర ముఖపుష్పముతో, మధురంపు వాక్కుతో,
తెల్లని యాణిముత్యములు తేటగ రాల్చెడు హాసరేఖతో,
మల్లెల బోలు దివ్యమగు మాటలతో విలసిల్లు చుండెడిన్‌

6.గీ॥ పోత బోసిన బంగారు బొమ్మ వోలె
బ్రహ్మ దిద్దిన అందాల భరిణ వోలె
అప్సరాంగనలను మించు నంద మొప్పి
యలరుచుండెను వీక్షింప తలపు లూర

7.గీ॥ మధుర భావాలు విచ్చేయ మనసు నిండ
ఊహ లోకాల యంచుల నొదిగిపోయి
గాలి కెరటాల తేరులో తేలిపోయి
తనరు చుండగ నా వనితా త్రయంబు

8.కం॥ విర బూసిన పూ దోటను
విరుల నడుమ దిరుగుచుండి వేవేల గతుల్‌
‘‘అరుణ’’ మెగొందెడు నచ్చట
చిరు గాలులు మేను సోకి చిందులు వేయన్‌.

9.ఉ॥ అంతట నేగు దెంచినది ఆలము అల్పుచు తోపునుండి బల్‌
వింతగ నొక్క మత్తకరి బృందము చిర్రుగ బిట్టు రేగుచున్‌
గాంతల గాంచి వెంటబడ కన్నెలు మువ్వురు వేరు వేరుగన్‌
సొంతపు దారులన్‌ పరుగు జొచ్చిరిగా నిజ ప్రాణభీతితో

10.కం॥ దొరకిన దారుల నంటియు
పరుగు లిడుచు చాల దవ్వు వనితాత్రయమున్‌
కరియూథము చేష్ట కతన
పురమును జనునట్టి దారి బోల్చన్ ‌ లేకన్‌

11.ఆ॥ చెదిరి పోయినట్టి చెలుల జాడలు లేక
భ్రాంతితోడ నడవి ప్రాంతమందు
వెళ్ళు దారి గనక వేరు దారులలోన
ఉండి పోయె ‘‘నరుణ’’ ఒంటరిగను

12.ఆ॥ పశ్చిమాద్రి వైపు పరుగు వెట్టుచు సూర్యు
డస్తమించ గానె యవని నిండ
నలము కొనియె తమసు లంచు నెగబ్రాకి
మింట చుక్క లెల్ల మెరువ దొడగె

13.మ॥ రజనీకాంతుడు మెల్ల మెల్లగను మార్గంబున్‌ విలోకించుచున్‌
విజయుండై విను వీధులం దలరి వేవేగన్‌ ప్రయాణించి రా
గ, జడాకారపు చిమ్మచీకటి తెరల్‌ కంపించుచున్‌ జీలిపో
యి, జగంబందున పండువెన్నెలలు తా మింపారుచున్‌ నిండెడిన్‌

14.కం॥ కాంతుతో నా రజనీ
కాంతుం డాకాశమందు కనబడగా నే
కాంతము నందుండిన నా
కాంతకు మైకొన్న భయము కరిగె నొకింతన్‌

15.కం॥ ఇంటికి జను తెరువెరగక
వెంట సఖులతోడు లేక విలపించుచు తా
నొంటరియై తిరుగాడుచు
కంటకము పాలబడియె కానలలోనన్‌.
(సశేషమ్)
నలవోలు నరసింహారెడ్డి.
ఇంత చక్కని ఖండిక వ్రాసిన నరసింహారెడ్డి గారికి అభినందన పూర్వక ధన్యవాదములు.
జైహింద్.

3, మార్చి 2020, మంగళవారం

శ్రీ కాళ హస్తి...నామ విశేషమ్......శ్రీ అందుకూరి చినపున్నయ్య శాస్త్రి.

0 comments

 జైశ్రీరామ్.

ఐహింద్.

2, మార్చి 2020, సోమవారం

మెఱిసిన ‘ఆంధ్రపురాణ’ సౌందర్యం.. డా దార్ల వెంకటేశ్వరరావు.

0 comments

జైశ్రీరామ్.
మెఱిసిన ‘ఆంధ్రపురాణ’ సౌందర్యం..
డా దార్ల వెంకటేశ్వరరావు.
విమర్శకునికి ఉండవలసిన ప్రధాన లక్షణాల్లో ‘భావుకత’ ఒకటి. కవి భావించిన భావాన్ని విమర్శకుడు పట్టుకోగలిగే సామర్థ్యమే భావుకత. ‘ధ్వన్యాలోకం’ వ్యాఖ్యాత అభినవగుప్తుడు ‘లోచనం’లో కూడా భావుకత, ‘సహృదయత’ల గురించి చర్చించాడు. అలాంటి సహృదయుడైన విమర్శకుడు లభించినప్పుడు ‘కావ్యం’ పాఠకులు పాఠకుల హృదయాల్లో కొత్తవెలుగులు ప్రసరిస్తుంది. అందుకనే పాండిత్యం బాగా ఉన్నప్పటికీ,  విమర్శకునికి భావుకత, సహృదయత తోడయితేనే ‘కావ్యం’లో కవిబ్రహ్మ వెలువరించిన భావాల్లో ఉండే మహోన్నతమైన ‘విషయాల్ని’ బయటకు తీయగలుగుతాడు. ఆ విషయాన్ని చదివి, కొన్నిసార్లు ‘కవిగారే’ ఆశ్చర్యపోయే సందర్భాలు కూడా కలగవచ్చు. తెలుగు సాహిత్య విమర్శకుల్లో పాండిత్యం, సహృదయత, భావుకత ముప్పేటలా కలిగినవారు కొంతమంది ఉన్నారు. అందువల్లనే సాహిత్యంలో కొత్త కొత్త దృక్పథాలు, ధోరణులు బయటకు వస్తున్నాయి. అలాంటి సహృదయ విమర్శకుల్లో ఆచార్య అనుమాండ్ల భూమయ్యగారొకరు. ఇటీవల ‘ఆంధ్రపురాణం భారతీయ సంస్కృతి వైభవం’ పేరుతో ఆయన ఒక గ్రంథాన్ని రచించారు.
 మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు ‘ఆంధ్రపురాణం’ రచించి, ప్రచురించి యాభై సంవత్సరాలైంది. మొదటిసారి 1954లో ఈ ‘ఆంధ్రపురాణం’ గురించి భూమయ్యగారి కంటే ముందు కూడా ఎంతోమంది రాశారు. ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిల్లో పాఠ్యాంశంగా ఈ గ్రంథాన్ని అనేక వేల మంది విద్యార్థులు దీన్ని చదువుకున్నారు. బి. నాగిరెడ్డిగారు ‘ఆంధ్రపురాణం - సమగ్ర పరిశీలనం’ పేరుతో పరిశోధన చేశారు. యువ భారతి వారి ‘ఇతిహాస లహరి’ లో జి.వి.సుబ్రహ్మణ్యం గారు  ఒక మంచి వ్యాసం రాశారు. ఇంత మంది ‘ఆంధ్రపురాణం’ గురించి రాయగా, మళ్లీ భూమయ్యగారు ఎందుకు రాశారనే దాన్ని తెలుసుకోవడమే ఈ చిరు సమీక్ష ఉద్దేశం.
ఆంధ్రపురాణం గురించి ఇంతకు ముందు రాసినవారి కంటే అదనంగా భూమయ్య గారు భారతీయ సంస్కృతీ వైభవాన్ని అనేక కోణాల్లో చూడగలిగారు. సంస్కృతిలో ధర్మం ప్రధానంగా భావించి కావ్యాన్ని మరింత సౌందర్య భరితం చేశారు. ‘కావ్య కథకు మూలం చరిత్ర. ఎన్నుకొన్నది కావ్యకళా మార్గం. చెప్పదలచుకున్నది ధర్మం. ఇది ఆంధ్రపురాణంలోని విషయం. ఈ కావ్యరచనకు రాజుల చరిత్ర సారకథనం ఒక మిష. ధర్మకథనమే ప్రధానాంశం’' అని కావ్యాత్మను ఆవిష్కరించి పాఠకునికి కావ్య పఠనాభిరుచితో పాటు రచనలో గల ఔన్నత్యాన్ని మరింత వివరించారు.
ఆంధ్రపురాణంలో మధునాపంతులవారు రాజవంశాల పేర్లతో తొమ్మిది పద్యాలు రాస్తే, భూమయ్యగారు ధర్మరక్షణ, భారతీయత, కళాసంపద, కావ్యకళ వంటి పేర్లతో తొమ్మిది విభాగాల్లో దాన్ని విశ్లేషించడం ఒక చమత్కారంతో పాటు ఔచిత్యం. మొత్తం రెండూ కలిస్తే పద్దెనిమిది సంఖ్య అవుతుంది. భారతీయ సాహిత్యంలో పద్ధెనిమిదికి ప్రముఖ స్థానం ఉంది. ఈ దృష్టితో కూడా ఆంధ్రపురాణాన్ని పద్దెనిమిది సంఖ్యతో ముడిపడేట్లు చేసి దాన్ని భారతీయ సంస్కృతిలో గల ఔన్నత్యాన్ని చమత్కార భరితంగా తన ప్రణాళిక ద్వారా సూచించారు. సుమారు రెండు వేల నూట అరవై రెండు పద్యాలు గల కావ్యంలో 196 పద్యాల్లో గల కళాత్మక సౌందర్యాన్ని విశదీకరించారు. రాజరాజ నరేంద్రుడు ఆంధ్ర మహాభారతాన్ని రాయించడానికి కారణాలు అనేకం ఉన్నా, ధార్మికత కూడా ఉండబట్టే రాజ్యం పోయినా, రాజులు పోయినా ఆ సాహిత్యం నేటికీ నిలబడి ఉంది. ఈ సందర్భంలో మధునాపంతుల సత్యనారాయణగారు వర్ణించిన పద్యాన్ని భూమయ్యగారు  వ్యాఖ్యానించిన తీరుని చదివితే పాఠకుడు సంభ్రమాశ్చర్యాలకు గురవుతాడు.
‘‘కావున శ్రుత మత ధర్మపు
జీవకు జివురిచ్చిపూల దేలించు వసం                                                        
తావిర్భావమునకు మీ
దీవన కావలయు గని సుధీ మధుమూర్తీ’’ దీన్ని రాజరాజనరేంద్రుడు నన్నయను మహాభారతాన్ని రచించమని కోరిన సందర్భంలో కవి వర్ణించారు. ఇది రాజరాజు నన్నయను కోరినట్లు కనిపిస్తుంది. కానీ ఇక్కడ‘మధుమూర్తి’ ని బట్టి ‘మధునాపంతుల’ వారిని కూడా స్ఫురిస్తున్నాడు కవి అని భూమయ్యగారు అన్నారు. ఆనాడు, నన్నయ వైదిక ధర్మ పునరుద్ధరణకు రాజరాజు ప్రేరణతో వ్యాసభారతాన్ని తెనిగించాడు. నేడు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు ‘‘శ్రుత మత ధర్మపు జీవకు జివురిచ్చి పూల దేలించటానికి ఈ ఆంధ్ర పురాణ రచనకు పూనుకొన్నట్లు తెలుస్తుంది’’ అనడం ద్వారా ఆలోచనాపరులైన పాఠకుల్ని ఆహ్లాదంలో ముంచెత్తి ఆంధ్రపురాణ సౌందర్యం మెరుపు మెరిసినట్లు అవుతుంది. శ్రతులు అంటే వేదాలు. దానిలోని ధార్మిక జీవనాన్ని ప్రచారం చేయడానికి కవి ప్రయత్నించాడనేది భూమయ్యగారి వ్యాఖ్య. దీనివల్ల ఒక మత ప్రచారం కోసం కాకుండా వేదధర్మాన్ని ప్రచారం చేయడానికి మహాభారతం తెలుగులో వెలిసిందనడం ద్వారా సాహిత్య విస్తృతిని పెంచారు.
ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరాల్ని వివిధ కథల్లో వర్ణించిన మధునాపంతుల వారి సుధారసాన్ని గొప్పగా ఈ విమర్శక పరిశోధకుడు వ్యాఖ్యానించారు. మగధ సామ్రాజ్యంలో సామంతులుగా ఉన్న సాతవాహనులు స్వతంత్ర రాజులై తొలి తెలుగు రాజులుగా కీర్తి గాంచడం, వీరిలో హాలుని కథ రసవత్తరంగా వర్ణితమయ్యాయి. చాళుక్య, కాకతీయ పర్వాల్లో చరిత్రను చెప్తున్నట్లు ఉన్న ధర్మం అంతర్లీనంగా దాగిన వైనాన్ని చక్కగా విశదీకరించగలిగారు. ప్రతాపరుద్రుడి ఆత్మహత్య సంఘటన రసార్ద్రంగా ఉంది. ‘‘ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి’’ ని ఒక పాఠ్యాంశంగా చదివే విద్యార్థులకు లేదా దీని గురించి  తెలుసుకోవాలనుకునేవారికి మధునాపంతుల వారి పద్యాలు చదివిన వెంటనే అర్థం చేసుకోలేనివారికీ భూమయ్యగారి గ్రంథం అరటి పండు ఒలిచి పెట్టినట్లు ఉంటుంది. గ్రంథం ఆసాంతం చదివితే చక్కని శైలి, పరిశోధనా పద్ధతి పాఠకుల్ని సత్యాన్వేషణకు పురికొల్పుతుంది. ముఖచిత్రం హిమాలయాలు, అట్ట వెనక కాకతీయ తోరణం, వేయి స్తంభాల గుడి ఎంతో ఆకర్షణీయంగా మల్టీకలర్‌లో ముద్రించి చరిత్రలో కాకతీయ శిల్పానికి శాశ్వతత్వం సిద్ధింపజేశారు. భారతీయ సంస్కృతిని హిమాలయాల చిత్రం ద్వారా, తాను నివసించే ఓరుగల్లు శిల్పాల్ని కాకతీయ తోరణం, వేయిస్తంభాల ద్వారా చూపి భారతీయతలో తెలుగు సంస్కృతి అంతర్భాగమనేది ఔచిత్యవంతంగా ప్రతీకాత్మకంగా నిరూపించారు. భారత, రామాయణాలను, కొన్ని కావ్యాలను చదివే పద్ధతిని గుర్తించడానికి ఈ గ్రంథం ఒక నమూనాగా ఉపయోగపడుతుంది. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వమనేది భారతీయ సంస్కృతిగా చెప్తున్నా దాన్ని నిరూపించే పుస్తకంగా దీన్ని భావించవచ్చు. కవి రాసిన కావ్యాన్ని భావుకత, సహృదయత, పాండిత్యాల్ని ముప్పేటగా ఉంటే సాహిత్యం నిరంతరం కొత్త కొత్త అందాల్ని, ఆలోచనల్ని అందిస్తుందనడానికి, పునర్మూల్యాంకన విమర్శను చూడ్డానికీ ఈ పుస్తకం విమర్శకులకు, పరిశోధకులకు కూడా ఉపయోగపడుతుంది.
( ఆంధ్రపురాణం: భారతీయ సంస్కృతి వైభవం,  రచన: ఆచార్య అనుమాండ్ల భూమయ్య, వెల: రూ. 75/- ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్, ఆర్యసమాజ్ ఎదురుగా, కాచిగుడా, హైదరాబాద్)
డా. దార్ల వెంకటేశ్వరరావు.
జైహింద్.  

1, మార్చి 2020, ఆదివారం

మధునాపంతుల వారి ఆంధ్ర పురాణము ... ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

1 comments

జైశ్రీరామ్.
మధునాపంతుల వారి ఆంధ్ర పురాణము
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
ఆయన పొందికగా, పుస్తకం లాంటి మనిషి. ఆ పుస్తకం లగువు బిగువుల మనిషిలా చరిత్ర సృష్టించింది.
ఆయన పేరు మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీ. ఆ పుస్తకం పేరు ఆంధ్రపురాణం.
సాహిత్యంగా - వ్యక్తి చరిత్రను గాని, దేశ చరిత్రనుగాని రకరకాలుగా రచించవచ్చు. పాతకాలంలో బసవపురాణం, కాటమరాజు కథ, పల్నాటి వీరచరిత్ర, అన్నమాచార్య చరిత్రలలాగా ద్విపదగా చెప్పవచ్చు. కుమార ధూర్జటి కృష్ణరాయ విజయంలాగా ప్రబంధంగా చెప్పవచ్చు. రాయప్రోలు, విశ్వనాథలాగా ఆంధ్రావళిగానో, ఆంధ్రప్రశస్తిగానో, ఖండకావ్యాలుగా చెప్పవచ్చు. హంపీ క్షేత్రాన్ని కొడాలి సుబ్బారావుగారు చిత్రించినట్టు స్థల స్మృతి పురాణంగా కీర్తించవచ్చు.
తెలుగు సాహిత్యంలో చారిత్రకత వృత్తాల కావ్య రచన కొత్త కాకపోవచ్చుగాని-
ఆధునిక తెలుగు సాహిత్యంలో చారిత్రక కావ్యాలకు- ముఖ్యంగా మహాకావ్యాలకు ఒక ఒరవడి పెట్టినవారు, రాణాప్రతాప సింహ చరిత్ర కావ్యనిర్మాత దుర్భాక రాజశేఖర శతావధాని. ఆయన ప్రేరణతో శివభారత కావ్యంవ్రాసినవారు గడియారం వేంకట శేషశాస్ర్తీ. ఈ క్రమంలో చెప్పదగినవి తుమ్మల సీతారామమూర్తిగారి మహాత్మ కథ. వానమామలై వరదాచార్యులుగారు పోతన చరిత్ర ముదిగొంత వీరభద్రమూర్తిగారి వందేమాతరం- వీటన్నింటిలో విభిన్నంగా, విశిష్టంగా నిలిచిన మహాకావ్యం ఆంధ్రపురాణం.
ఇప్పుడు పేర్కొన్న కావ్యాలు చారిత్రక మహాపురుషుల గురించీ ఏక దేశమైన ఒక ఉద్యమతత్వంగురించీ చిత్రించినవి.
ఆంధ్రపురాణ నిర్వహణ ప్రణాళిక వేరు. మహాకావ్యం అనే మాటనిక్కడ బరువును బట్టీ, పరువును బట్టీ వాడుతున్నారు.
అలనాడెప్పటిదో.. ఋగ్వేద ఐతరేయ బ్రాహ్మణంలోని శునశే్శపుని కథతో ఎత్తుకుని క్రీస్తుశకం 1633-1673 నడుమ తంజావూరు రాజ్యాన్ని పాలించిన విజయరాఘవుని నాటివరకు తెలుగువారి చరిత్ర, ఒక రాజవంశంకాదు. ఒక పాలకుడు కాదు. ఒక తరహా జీవన విధానం కాదు. తరచి చూసేకొద్దీ అగాధం. ఏది చరిత్ర? ఏది కల్పన? తేల్చి చెప్పడం దుష్కరం.
‘‘తెలుగున వేలయేండ్లుగా/ గతించిన గాథల పెంపు
కొండ గుర్తుల పెనుగుంపుగాని/ ‘‘యిది రూఢిగ నిట్టిది’’ నాగ దెల్ప
నెవ్వలన నసాధ్య’’-మని- మధునాపంతులవారే కావ్యావతారికలో 34వ పద్యంలో అననే అన్నారు. అయినా ఒకపాటి చరిత్రాన్ని నేర్పు తీర్పు పరిశీలకులు- తడవి, ప్రోవులు పెట్టినదాన్ని- ఆధారం చేసుకుని సత్యనారాయణ శాస్ర్తీగారు పురాణించడానికి బృహత్ ప్రయత్నం చేశారు. కావ్యం, పురాణం, ప్రబంధం అనే పదాలను, ఆంధ్రపురాణాన్ని సాహిత్యంగా పరిగణించే సందర్భంగా కావ్య సామాన్యార్థాలుగా మనం గ్రహించాలి.
సంప్రదాయార్థంలో సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితాలనే పంచలక్షణ లక్షితార్థంలో ఆంధ్రపురాణాన్ని చూడకూడదు. ‘‘త్రిలింగరాజ వంశ్యానుచరిత్ర’ ప్రధానంగా తానీ కావ్యం రచిస్తున్నానని, మధునాపంతులవారు వివరించారు- అవతారిక అయిదవ వచనంలో.
పునఃప్రతిష్ఠా పర్వాంత పద్యాల్లో
‘‘నాచే నీ చరిత్ర ప్రబంధమిటు సందర్భింప’’బడిందని చెప్పి- మొత్తం కావ్యం చివర, నాయక రాజపర్వం తరువాత- పర్వాంత పద్యాల మొదటలో - ‘కావ్య కవితా కల్యాణ నీరంధ్రమైన’ మహావీర చరిత్ర వినిపించడం పూర్తయిందన్నారు.
కనుక- ఆంధ్ర పురాణం- ఏకకాలంలో పురాణం, ప్రబంధం, కావ్యంగా పరిగణించడం ఈ కవికిష్టం.
అమలోదాత్తం- ధర్మనిర్వహణ మర్యాదం- విద్యాకృతశ్రమం- అయోధన రంగ సంగతపరోగ్రం పశ్యం- అశా తటాక్రమిత స్వచ్ఛయశం- కావ్య కవితా కల్యాణ నీరంధ్రం- అనే ఆరు విశేషణాలతో మహావీర చరిత్రను, ఈ ఆంధ్ర పురాణంలో కథన చేయడమైంది.
ఆంధ్రుడనగ నెవ్వ! డాంధ్ర దేశాభిఖ్య/ యేల వెలసె! న నెడి యిట్టి ప్రశ్న
ములకు, బదులుగాగ బలికెడి తొలినాటి/ గాథలొందు రెండు కలవు పుడమి’’
అంటూ ప్రారంభించి సత్యనారాయణశాస్ర్తీగారు 1.ఉదయపర్వం 2.శాతవాహనపర్వం, 3.చాళుక్య పర్వం, 4.కాకతీయ పర్వం, 5.పునఃప్రతిష్ఠ పర్వం, 6.విద్యానగర పర్వం, 7.శ్రీకృష్ణదేవరాయ పర్వం, 8.విజయపర్వం, 9.నాయకరాజ పర్వం- అంటూ తొమ్మిదంశాలుగా వింగడించి సంప్రదాయ పద్యరచనా సంవిధానం, అవతారికతో సహా 2052 పద్యవచనాలతో ఈ రచన చేశారు.
-ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
జైహింద్.