గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, నవంబర్ 2010, శుక్రవారం

జ్ఞానప్రసూనమ్మకు జన్మదిన శుభాకాంక్షలు

8 comments


శా.సమ్మాన్యాద్భుత మందునన్ తెలివినన్ సచ్చీల సంపన్నతన్
మమ్మున్ బ్రేమగ జూచు తల్లి జననమైనట్టి రోజిద్ది నీ
మమ్మున్ శ్రీహరి యీమెఁగాంచి సుఖముల్ మాంగల్యసద్యోగముల్
సమ్మోదమ్మునఁ గొల్పుఁ గావుత కృపన్ జ్ఞానప్రసూనాంబకున్