గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, డిసెంబర్ 2022, శుక్రవారం

శ్రద్ధయా పరయా తప్తం - ...17 - 17...//...సత్కారమానపూజార్థం - ...17 - 18,,,//.....సప్తదశోధ్యాయము - శ్రద్ధాత్రయవిభాగయోగము

0 comments

 జైశ్రీరామ్

శ్లోశ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః|

అఫలాకాఙ్క్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే. || 17-17 ||

తే.గీమూడు తపములున్ శ్రద్ధతో కూడి, లాభ

కాంక్షలేకుండి, నిగ్రహ గతిని చేయ

బడిన సాత్వికతపముగ వరలు పార్థ!

నీవు గ్రహియించు శ్రద్ధతో నేర్పు మీర.

భావము.

పై మూడు రకాల తపస్సు పూర్తి శ్రద్ధతో, లాభమూ కోరకుండా, నిగ్రహంచేత 

చేయబడినప్పుడు, సాత్వికమైన తపస్సుగా చెప్పబడుతుంది.

శ్లోసత్కారమానపూజార్థం తపో దమ్భేన చైవ యత్|

క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్. || 17-18 ||

తే.గీసత్కృతికొ, మానమర్యాద సంస్తుతులకొ,

దంబమున తాము చేసెడి తపములరయ

రాజసికతపములిల పార్థ! తెలియుమిది.

నీకు తెలియవలయునిది నిజము తెలియ.

భావము.

సత్కారంకోసమూ, మాన మర్యాద కోసమూ డంభంతోనూ తపస్సు చేయబడుతుందో 

దానిని స్తిరత్వము లేని రాజసిక తపస్సుఅంటారు.

జైహింద్.

27, డిసెంబర్ 2022, మంగళవారం

30 - 12 - 2022న చి. నల్లాన్ చక్రవర్తుల సాహిత్ అష్టావధానం రవీంద్రభారతిలో.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

 

భక్తిసాధనం నిర్వహిస్తున్న గజారోహణము.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.

బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ౧౨౪౭వ అష్టావధానము.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్

అనుద్వేగకరం వాక్యం సత్యం - ...17 - 15...//...మనః ప్రసాదః సౌమ్యత్వం - ...17 - 16,,,//.....సప్తదశోధ్యాయము - శ్రద్ధాత్రయవిభాగయోగము

0 comments

 జైశ్రీరామ్.

శ్లోఅనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం యత్|

స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే. || 17-15 ||

తే.గీవాక్కులుద్వేగరహితమై, వరలుచు, ప్రియ,

సత్య, హిత యుక్తమై, పరులకు చక్కనొప్పు

నట్లుపలుకుట, స్వాధ్యాయ మరసి నేర్వ,

వాచికంబగు తపమది, పార్థ! వినుమ.

భావము.

ఇతరులను బాధింపనిదీ, సత్యమూ, ప్రియమూ, హితమూ అయిన వాక్కుస్వాధ్యాయాన్ని అభ్యసించడమూ ఇది వాచికమైన తపస్సు.

శ్లోమనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః|

భావసంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే.  || 17-16 ||

తే.గీసుప్రసన్నచిత్తము,మంచి సుగుణచయము,

మౌనమును, నిగ్రహంబును, మహితభావ

శుద్ధి, మానసికతపస్సు, చూడ ఘనము.

నీవు గ్రహియింపుమర్జునా! నేర్పు మీర.

భావము.

ప్రసన్నమైన మనస్సూ, మంచితనమూ, మౌనమూ, మనోనిగ్రహమూశుద్ధమైన భావాలూ-ఇవి మానసిక తపస్సు.

జైహింద్.

26, డిసెంబర్ 2022, సోమవారం

అష్టోత్తర శత సతీ అశ్వధాటి సతీశతకము ( 1వ పద్యము)

0 comments

 అష్టోత్తరశత సతీ అశ్వధాటి

(సతీ శతకము). రచన. చింతా రామకృష్ణారావు. 1 .శ్రీ శాంభవీ! సుగుణులాశింత్రు నీ కృపకు నీ శక్తినెన్నుచు సదా. ధీశాలియౌ శివునికాశావహంబువయి నీ శక్తినే గొలిపితే. నీ శక్తినే బొగఁడ నాశక్తి చాలదుగ ధీశక్తినిమ్ము మిగులన్, ఆశాంతముల్ వెలుగు ధీశాని నీ ప్రతిభ లేశమ్ము గాంచుదు సతీ!

25, డిసెంబర్ 2022, ఆదివారం

విధిహీనమసృష్టాన్నం - ...17 - 13...//...దేవద్విజగురుప్రాజ్ఞపూజనం - ...17 - 14,,,//.....సప్తదశోధ్యాయము - శ్రద్ధాత్రయవిభాగయోగము

0 comments

 జైశ్రీరామ్.

శ్లోవిధిహీనమసృష్టాన్నం మన్త్రహీనమదక్షిణమ్|

శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. || 17-13 ||

తే.గీశాస్త్రవిధిలేక, మంత్రముల్ శ్రద్ధ లేక,

యన్నదానంబు చేయక, మన్ననమున

దక్షిణేమాత్రమీయకధాత్రి జేయు

యజ్ఞ మదితామసికమను యజ్ఞమరయ.

భావము.

శాస్త్ర విధి లేకుండా అన్నదానం చేయకుండా, మంత్రాలు లేకుండాదక్షిణ ఇవ్వకుండా, శ్రద్ధ లేకుండా చేయబడే యజ్ఞం తామసిక యజ్ఞం 

అని చెప్పబడుతుంది.

శ్లోదేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్|

బ్రహ్మచర్యమహింసా శారీరం తప ఉచ్యతే. || 17-14 ||

తే.గీగురుల, దేవతలన్, బ్రాహ్మకులజుల నిల

పండితుల బూజ చేయుట, బ్రహ్మచర్య

ము, శుచి, రుజువర్తనంబును, ముక్తిదమగు

నట్టి శారీరకతపస్సు, నరయుమయ్య.

భావము.

దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, విద్వాంసులను పూజించడంశుచిత్వం, సూటియైన ప్రవర్తన, బ్రహ్మచర్యం అహింస ఇవి శారీరక తపస్సులు.

జైహింద్.

24, డిసెంబర్ 2022, శనివారం

అఫలాఙ్క్షిభిర్యజ్ఞో విధిదృష్ - ...17 - 11...//...అభిసన్ధాయ తు ఫలం - ...17 - 12,,,//.....సప్తదశోధ్యాయము - శ్రద్ధాత్రయవిభాగయోగము

0 comments

జైశ్రీరామ్ శ్లో. అఫలాఙ్క్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే| యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్త్వికః. || 17-11 || తే.గీ. ఫలితమాశించకయె ధర్మ మెలయ కర్మ శాస్త్ర విహితమున్ జేయుట సాత్వికమగు యజ్ఞ మగునర్జునా! కనుమహర్నిశములు ధర్మబద్ధతన్ వర్తింప ధరణిపైన. భావము. ఫలాపేక్ష లేకుండా, శాస్త్రాలలో విధింపబడిన ప్రకారంగానూ, తను ఆ కర్మ చేయడం కర్తవ్యమనే స్థిర చిత్తంతో చేయబడే యజ్ఞం సాత్విక యజ్ఞం. శ్లో. అభిసన్ధాయ తు ఫలం దమ్భార్థమపి చైవ యత్| ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్. || 17-12 || తే.గీ. ఫలమునాశించి చేయుట, మలిన మతిని దంబమునకయి చేయుట తగదు యజ్ఞ కర్మ, రాజసయజ్ఞమౌ కనగనదియు, నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర. భావము. అర్జునా! ఫలాన్ని ఆశిస్తూనో, డంభం కోసంమో చేయబడే యజ్ఞం రాజసిక యజ్ఞం అని తెలుసుకో. జైహింద్.

21, డిసెంబర్ 2022, బుధవారం

ఈశావాస్యోపనిషత్ వ్యాఖ్య : ఆచార్య చిలుకూరి.

0 comments

 జైశ్రీరామ్.

ఈశావాస్యోపనిషత్
వ్యాఖ్య : ఆచార్య చిలుకూరి.
~*~
శాంతి పాఠం.
ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే|
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||
ఓం శాంతి: శాంతి: శాంతి: ||
ప్రతిపదార్థము ||
ఓం = పరమాత్మా.
అద: పూర్ణం = అది పూర్ణమై ఉన్నది.
ఇదం పూర్ణం = ఇది పూర్ణమైనది.
పూర్ణాత్ = పూర్ణమునుండి.
పూర్ణం = పూర్ణమే.
ఉదచ్యతే = ఉద్భవిస్తుంది.
పూర్ణస్య = పూర్ణమైన దాని నుండి.
పూర్ణం = పూర్ణము.
ఆదాయ = తీసివేసినచో.
పూర్ణం ఏవ = పూర్ణము మాత్రమే.
అవశిష్యతే = మిగులుతుంది.
తా|| అది అనగా బ్రహ్మము, పరమాత్మ. అది పూర్ణమైనది. ఇది అనగా ఈ జగత్తు,ప్రపంచం. ఇదియును పూర్ణమైనది. పూర్ణమైన పరమాత్మ నుండి పూర్ణమైన జగత్తే ఉద్భవిస్తుంది. పూర్ణమైన దానినుండి పూర్ణం తీసివేసినప్పటికి పూర్ణమే మిగిలి ఉంటుంది. ఓం మనయొక్క అధి దైవిక, ఆధ్యాత్మిక అధిభౌతిక తాపములు శాంతించు గాక !
*నీ యందలి జ్ఞానాన్ని నీవు ఎంత పంచినా నీ జ్ఞానానికి ఏ లోటూ లేనట్లు, భగవంతుడు నిత్యుడు పరిపూర్ణుడు, బ్రహ్మానందమయుడు, శాశ్వతైశ్వర్యసంపన్నుడు, ఏకొరతా లేని వాడు.ఆయన నుండి ఏది ఎంత పంచుకున్నా ఆయనకేమీ లోటు లేదు. కనుక మనం పొందవలసినది పరమాత్మనే. ఈ జగత్తు పూర్ణమైనదే కాని ఇది మనకు పూర్ణమైన శాశ్వతమైన ఆనందాన్ని అందించుటలేదు. మృత్యువుతోను దు:ఖముతోను కూడియున్నది. అధి దైవిక ఆధ్యాత్మిక అధి భౌతిక తాపములను కలుగ జేస్తున్నది. ఇది మన ఎదుటనే ఉంది కాబట్టి బ్రతికి యున్నంతవరకూ దీనిలో పొందవలసిన క్షణికమైన సుఖ దు:ఖాలన్ని ఎప్పటకప్పుడు పొందుతూనే ఉన్నాము కాబట్టి ఇందులో కొత్తగా పొందవలసినదేమీ లేదు. ఇక పోతే మనకు కనిపించని వాడు పరమాత్మ.అతని యందు మృత్యువులేదని శాశ్వతమైన ఆనందము ఆ భగవంతుని లోనే ఉందని శృతులు చెబుతున్నాయి కనుక మనం అతడినే పొందవలెను. అందుకు దారి ఏమిటి? ఈ ఉపనిషత్తు ఎలాంటి మార్గం చూపుతున్నదో తెలుసుకుందాము.
మం|| ఓం ఈశావాస్యమిదం సర్వం యత్ కించ జగత్యాంజగత్ |
తేన త్యక్తేన భుంజీథా మా గృధ: కస్య స్విద్ ధనమ్ || -1
ప్రతిపదార్థం :
జగత్యాం = ప్రపంచం లో,
జగత్ = కదులుతున్నటువంటి,
యత్ కించ = ఎంత చిన్నదైనా,
ఇదం సర్వం = ఈ సర్వమూ,
ఈశ = పరమేశ్వరుని చేత,
అవాస్యం = ఆవరింపబడి యున్నది.
తేన = అందువలన,
త్యక్తేన = త్యజించుట ద్వారా,
భుంజీధా = భుజించుము (అనుభవించుము),
కస్య స్విత్ = ఎవరి యొక్క ,
ధనం = ధనాన్ని కూడా,
మా గృధ: = ఆశించ వద్దు.
తా|| ఈ ప్రపంచం లో కదులు తున్న ప్రతిదీ అది ఎంత చిన్నదయినా సరే - ఈ మొత్తం పరమాత్మ చేతనే ఆవరింప బడి యున్నది. కనుక ఇది నీది కాదు ఆ పరమాత్మదే నని త్యజించి, త్యాగం చేసి అనుభవించుము. ఇతరుల ధనాన్ని ఆశించవద్దు.
వ్యాఖ్య- ఈ మంత్రం లో పరమాత్మను అందుకోవటానికి బుద్ధిలో ఎలాంటి జ్ఞానం ఉండాలి, మనసులో ఎలాంటి భావన ఉండాలి అనేది చెప్పటం జరిగింది. ఈ ప్రపంచం లో అంతటా ఉన్నది పరమాత్మే తప్ప మరేదీకాదు - అనేదే ఉత్తమ జ్ఞానం. అటువంటి జ్ఞానం మనలో స్థిరం గా ఉన్నట్లయితే మన మనసులో కలిగే భావనలు కూడ తదనుగుణం గానే ఉంటాయి. ఈ ప్రపంచం ఇందులో ఉన్న అన్ని వస్తువులు, నేల, నీరు , గాలి, ఈ ప్రకృతి సంపద అంతా మన అందరి కోసం భగవంతుడు ప్రసాదించినది. ఇది ఎవరి స్వంతమూ కాదు. దీన్ని అనుభవించే హక్కు . జీవులందరికీ ఉన్నది. ఈ ప్రకృతి నాస్వంతం దీన్ని నేను మాత్రమే అనుభ వించాలి అనుకోవటం దుర్మార్గం, రాక్షసత్వం కూడా. అలా కాక జీవులందరూ ఆ భగవంతుని స్వరూపమే అనుకుంటే దీన్ని త్యాగబుద్ధితొ సమానంగా పంచుకొని తినాలి. నీ కష్టార్జితం వలన నీకు లభించేది ఏమిటో దాన్నే భగవత్ ప్రసాదం గా భావించి స్వీకరించటం నేర్చుకోవాలి. దానిని కూడా ఇతరులతో పంచుకున్నపుడు నీకు ఆనందము లభిస్తుంది.అంతే కాని ఇతరుల ధనాన్ని, ఇతరుల కష్టార్జితాన్ని కాని నీవు ఆశించ వద్దు. అలా ఆశించావు అంటే పరమాత్మ నీకు నూరు జన్మలెత్తినా లభ్యం కాడు. ముందుగా అంతటా భగవంతుడున్నడని గ్రహించు, త్యాగ బుద్ధి అలవరచుకో! తరువాత "మమాత్మా సర్వభూతాంతరాత్మా" అని తెలుసుకుంటేనే పరమాత్మ తత్వం బోధపడుతుంది. లేకుంటే నీకు మోక్షం లేదు అని ఈ ఉపనిషత్తులోని ప్రథమ మంత్రమే చెబుతున్నది.
జైహింద్.

ఈశావాస్యోపనిషత్ – శంకరభాష్యముతో – సంపూర్ణమ్

0 comments

 ఈశితా సర్వభూతానాం సర్వభూతమయశ్చ యః ।

ఈశావాస్యేన సంబోధ్యమీశ్వరం తం నమామ్యహం ।।

శాంతి పాఠః

ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే ।

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ।।

ఈశావాస్యమ్ ఇత్యాదయః మన్త్రాః కర్మసు-అవినియుక్తాః, తేషాం అకర్మశేషస్య ఆత్మనః యాథాత్మ్యప్రకాశకత్వాత్ ।  యాథాత్మ్యం చ ఆత్మనః శుద్ధత్వ-అపాపవిద్ధత్వ-ఏకత్వ-నిత్యత్వ-అశరీరత్వ-సర్వగతత్వాది వక్ష్యమాణమ్ ।  తచ్చ కర్మణా విరుధ్యత ఇతి యుక్త ఏవైషాం కర్మస్వవినియోగః[*1] । 

న హి ఏవం లక్షణం ఆత్మనః  యాథాత్మ్యమ్ ఉత్పాద్యం వికార్యమ్ ఆప్యం సంస్కార్యం కర్తృభోక్తృరూపం వా యేన కర్మశేషతా స్యాత్;  సర్వాసాం ఉపనిషదాం ఆత్మయాథాత్మ్యనిరూపణేనైవ ఉపక్షయాత్,  గీతానాం మోక్షధర్మాణాం చైవంపరత్వాత్ ।  తస్మాత్ ఆత్మనః అనేకత్వ-కర్తృత్వ-భోక్తృత్వాది చ అశుద్ధత్వపాపవిద్ధత్వాది చ ఉపాదాయ లోకబుద్ధిసిద్ధం కర్మాణి విహితాని ।

యః హి కర్మఫలేనార్థీ దృష్టేన బ్రహ్మవర్చసాదినా అదృష్టేన స్వర్గాదినా చ ద్విజాతిరహం న కాణత్వకుబ్జత్వాది-అనధికార-ప్రయోజక-ధర్మవాన్ ఇత్యాత్మానం మన్యతే సః అధిక్రియతే కర్మస్వితి హి అధికారవిదో వదన్తి ।

తస్మాత్ ఏతే మన్త్రాః  ఆత్మనః  యాథాత్మ్యప్రకాశనేన ఆత్మవిషయం స్వాభావికకర్మవిజ్ఞానం నివర్తయన్తః శోకమోహాది-సంసారధర్మవిచ్ఛిత్తిసాధనం-ఆత్మైకత్వాదివిజ్ఞానమ్-ఉత్పాదయన్తి । ఇతి ఏవముక్త-అధికారి-అభిధేయ-సమ్బన్ధ-ప్రయోజనాన్ మన్త్రాన్ సఙ్క్షేపతో వ్యాఖ్యాస్యామః –

ఓం ఈశావాస్యమిదగ్ం సర్వం యత్కిం చ జగత్యాం జగత్  ।

తేన త్యక్తేన భుఞ్జీథా మా గృధః కస్య స్విద్ధనమ్  ॥ ౧ ॥

ఈశావాస్యమితి : ఈశా ఈష్టే ఇతి ఈట్, తేన ఈశా ।  ఈశితా పరమేశ్వరః పరమాత్మా సర్వస్య ।  స హి సర్వమీష్టే సర్వజన్తూనామాత్మా సన్ ప్రత్యగాత్మతయా । తేన స్వేన రూపేణాత్మనా ఈశావాస్యమ్ ఆచ్ఛాదనీయమ్ ।

కిమ్? ఇదం సర్వం యత్కిం చ యత్కించిత్ జగత్యాం పృథివ్యాం జగత్ తత్సర్వమ్ । స్వేనాత్మనా ఈశేన ప్రత్యగాత్మతయా అహమేవేదం సర్వమితి పరమార్థసత్యరూపేణానృతమిదం సర్వం చరాచరమాచ్ఛాదనీయం పరమాత్మనా । 

యథా చన్దన-అగరు-ఆదేః ఉదకాదిసమ్బన్ధజక్లేదాదిజమ్ ఔపాధికం దౌర్గన్ధ్యం తత్-స్వరూపనిఘర్షణేన ఆచ్ఛాద్యతే స్వేన పారమార్థికేన గన్ధేన, తద్వదేవ హి స్వ-ఆత్మని-అధ్యస్తం స్వాభావికం కర్తృత్వ-భోక్తృత్వాది-లక్షణం జగద్ద్వైతరూపం జగత్యాం పృథివ్యాం, జగత్యామితి ఉపలక్షణార్థత్వాత్ సర్వమేవ నామరూపకర్మాఖ్యం వికారజాతం పరమార్థసత్యాత్మభావనయా త్యక్తం స్యాత్ ।

ఏవమీశ్వరాత్మభావనయా యుక్తస్య పుత్రాద్యేషణాత్రయసంన్యాస ఏవాధికారః, న కర్మసు । తేన త్యక్తేన త్యాగేన ఇత్యర్థః ।  న హి త్యక్తో మృతః పుత్రో భృత్యో వా ఆత్మసమ్బన్ధితాయా అభావాదాత్ ఆత్మానం పాలయతి । అతః త్యాగేన ఇతి అయం ఏవ వేదార్థః ।  భుఞ్జీథాః పాలయేథాః ।  ఏవం త్యక్తైషణస్త్వం మా గృధః గృధిమ్ ఆకాఙ్క్షాం మా కార్షీః ధనవిషయామ్ । కస్య స్విత్ ధనం కస్యచిత్ పరస్య స్వస్య వా ధనం మా కాఙ్క్షీః ఇత్యర్థః । స్విత్ ఇతి అనర్థకః నిపాతః ।

అథవా, మా గృధః ।  కస్మాత్? కస్యస్విద్ధనమ్ ఇత్యాక్షేపార్థః । న కస్యచిద్ధనమస్తి, యద్గృధ్యేత । ఆత్మైవేదం సర్వం ఇతి ఈశ్వరభావనయా సర్వం త్యక్తమ్ । అత ఆత్మన ఏవేదం సర్వమ్, ఆత్మైవ చ సర్వమ్ । అతో మిథ్యావిషయాం గృధిం మా కార్షీః ఇత్యర్థః ॥

అవతారిక : ఏవమాత్మవిదః పుత్రాద్యేషణాత్రయ సంన్యాసేన ఆత్మజ్ఞాననిష్ఠతయా ఆత్మా రక్షితవ్య ఇత్యేష వేదార్థః ।  అథేతరస్య అనాత్మజ్ఞతయా ఆత్మగ్రహణాయ అశక్తస్య ఇదముపదిశతి మన్త్రః –

 కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగ్ం సమాః  ।

 ఏవం త్వయి నాన్యథేతోఽస్తి న కర్మ లిప్యతే నరే  ॥ ౨॥

కుర్వన్నేవేతి:  కుర్వన్నేవ నిర్వర్తయన్నేవ ఇహ కర్మాణి అగ్నిహోత్రాదీని జిజీవిషేత్ జీవితుమిచ్ఛేత్ శతం శతసఙ్ఖ్యాకాః సమాః సంవత్సరాన్ ।  తావద్ధి పురుషస్య పరమాయుర్నిరూపితమ్ ।  తథా చ ప్రాప్తానువాదేన యజ్జిజీవిషేచ్ఛతం వర్షాణి తత్కుర్వన్నేవ కర్మాణీత్యేతద్విధీయతే ।  ఏవమ్ ఏవంప్రకారేణ త్వయి జిజీవిషతి నరే నరమాత్రాభిమానిని ఇతః ఏతస్మాదగ్నిహోత్రాదీని కర్మాణి కుర్వతో వర్తమానాత్ప్రకారాత్ అన్యథా ప్రకారాన్తరం నాస్తి, యేన ప్రకారేణ అశుభం కర్మ న లిప్యతే; కర్మణా న లిప్యత, ఇత్యర్థః ।  అతః శాస్త్రవిహితాని కర్మాణ్యగ్నిహోత్రాదీని కుర్వన్నేవ జిజీవిషేత్ ॥

కథం పునః ఇదం అవగమ్యతే – పూర్వేణ మన్త్రేణ సంన్యాసినో జ్ఞాననిష్ఠోక్తా ద్వితీయేన తదశక్తస్య కర్మనిష్ఠేతి? ఉచ్యతే –  జ్ఞానకర్మణోర్విరోధం పర్వతవత్ అకమ్ప్యం యథోక్తం న స్మరసి కిమ్? ఇహాప్యుక్తం – యో హి జిజీవిషేత్స కర్మాణి కుర్వన్నేవ ఇతి; “ఈశా వాస్యమిదం సర్వం “, “తేన త్యక్తేన భుఞ్జీథాః మా గృధః కస్యస్విద్ధనమ్ “, ఇతి చ ।

“న జీవితే మరణే వా గృధిం కుర్వీత అరణ్యమియాత్ ఇతి పదమ్ తతో న పునరేయాత్ ” ఇతి సంన్యాసశాసనాత్ । ఉభయోః ఫలభేదం చ వక్ష్యతి । “ఇమౌ ద్వావేవపన్థానౌ అనునిష్క్రాన్తతరౌ భవతః క్రియాపథశ్చైవ పురస్తాత్ సంన్యాసశ్చ ఉత్తరేణ ”; తయోః సంన్యాసపథ ఏవ అతిరేచయతి – “న్యాస ఏవాత్యరేచయత్” ఇతి చ తైత్తిరీయకే । “ద్వావిమావథ పన్థానౌ యత్ర వేదాః ప్రతిష్ఠితాః । ప్రవృత్తిలక్షణో ధర్మో నివృత్తశ్చ విభావితః” ఇత్యాది పుత్రాయ విచార్య నిశ్చితముక్తం వ్యాసేన వేదాచార్యేణ భగవతా । విభాగం చానయోః దర్శయిష్యామః ॥

అవతారిక : అథ ఇదానీం అవిద్వన్నిన్దార్థోఽయం మన్త్ర ఆరభ్యతే –

 అసుర్యా నామ తే లోకా అన్ధేన తమసావృతాః  ।

 తాగ్ంస్తే ప్రేత్యాభిగచ్ఛన్తి యే కే చ ఆత్మహనో జనాః  ॥ ౩॥

అసుర్యాః ఇతి :  అసుర్యాః పరమాత్మభావమద్వయమపేక్ష్య దేవాదయః అపి అసురాః తేషాం చ స్వభూతా లోకా అసుర్యాః నామ ।  నామశబ్దోఽనర్థకో నిపాతః ।  తే లోకాః కర్మఫలాని లోక్యన్తే దృశ్యన్తే భుజ్యన్త ఇతి జన్మాని । అన్ధేన అదర్శనాత్మకేన అజ్ఞానేన తమసా ఆవృతాః ఆచ్ఛాదితాః । తాన్ స్థావరాన్తాన్, ప్రేత్య త్యక్త్వా ఇమం దేహమ్ అభిగచ్ఛన్తి యథాకర్మ యథాశ్రుతమ్ ।  యే కే చ ఆత్మహనః ఆత్మానం ఘ్నన్తి ఇతి ఆత్మహనః ।  కే? తే జనాః యే అవిద్వాంసః ।  కథం తే ఆత్మానం నిత్యం హింసన్తి? అవిద్యాదోషేణ విద్యమానస్య ఆత్మనః తిరస్కరణాత్ ।  విద్యమానస్య ఆత్మనో యత్కార్యం ఫలం అజరామరత్వాది-సంవేదనలక్షణం, తత్ హతస్యేవ తిరోభూతం భవతీతి ప్రాకృతా అవిద్వాంసో జనాః ఆత్మహనః ఉచ్యన్తే ।  తేన హి ఆత్మహననదోషేణ సంసరన్తి తే ॥

అవతారిక : యస్య ఆత్మనో హననాత్ అవిద్వాంసః సంసరన్తి, తత్ విపర్యయేణ విద్వాంసో జనాః ముచ్యన్తే తే అనాత్మహనః, తత్ కీదృశం ఆత్మతత్త్వమితి ఉచ్యతే –

అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్పూర్వమర్షత్  ।

తద్ధావతోఽన్యానత్యేతి తిష్ఠత్తస్మిన్నపో మాతరిశ్వా దధాతి  ॥ ౪॥

అనేజదేతి : అనేజద్ న ఏజత్ ।  “ఏజృ కమ్పనే”, కమ్పనం చలనం స్వావస్థాప్రచ్యుతిః, తద్వర్జితమ్, సర్వదా ఏకరూపమ్ ఇత్యర్థః ।  తచ్చ ఏకం సర్వభూతేషు । మనసః సఙ్కల్పాదిలక్షణాత్ జవీయో జవవత్తరమ్ । కథం విరుద్ధముచ్యతే –  ధ్రువం నిశ్చలమిదమ్, మనసో జవీయ ఇతి చ? నైష దోషః, నిరుపాధి-ఉపాధిమత్త్వేన-ఉపపత్తేః ।  తత్ర నిరుపాధికేన స్వేన రూపేణోచ్యతే అనేజదేకమ్ ఇతి ।  మనసః అన్తఃకరణస్య సఙ్కల్పవికల్పలక్షణస్య ఉపాధేః అనువర్తనాత్ । ఇహ దేహస్థస్య మనసో బ్రహ్మలోకాదిదూరగమనం సఙ్కల్పేన క్షణమాత్రాత్ భవతి ఇతి అతః మనసో జవిష్ఠత్వం లోకే ప్రసిద్ధమ్ । తస్మిన్మనసి బ్రహ్మలోకాదీన్ ద్రుతం గచ్ఛతి సతి, ప్రథమప్రాప్త ఇవ ఆత్మచైతన్య-అభాసో గృహ్యతే । అతః మనసో జవీయః ఇత్యాహ ।

నైనద్దేవాః, ద్యోతనాద్దేవాః చక్షురాదీని ఇన్ద్రియాణి, ఏతత్ప్రకృతం ఆత్మతత్త్వం న ఆప్నువన్ న ప్రాప్తవన్తః ।  తేభ్యో మనో జవీయః । మనోవ్యాపారవ్యవహితత్వాత్-ఆభాసమాత్రమపి-ఆత్మనో నైవ దేవానాం విషయీభవతి; 

యస్మాత్ జవనాత్ మనసోఽపి పూర్వమర్షత్ పూర్వమేవ గతమ్, వ్యోమవత్ వ్యాపిత్వాత్ । సర్వవ్యాపి తదాత్మతత్త్వం సర్వసంసారధర్మవర్జితం స్వేన నిరుపాధికేన స్వరూపేణావిక్రియమేవ సత్, ఉపాధికృతాః సర్వాః సంసారవిక్రియా అనుభవతి-ఇవ[2]– అవివేకినాం మూఢానాం అనేకం ఇవ చ ప్రతిదేహం ప్రత్యవభాసత ఇతి ఏతదాహ ।

తత్ ధావతః ద్రుతం గచ్ఛతః అన్యాన్ ఆత్మవిలక్షణాన్ మనోవాగిన్ద్రియప్రభృతీన్ అత్యేతి అతీత్య గచ్ఛతి ఇవ । ఇవార్థం స్వయమేవ దర్శయతి తిష్ఠత్ ఇతి, స్వయమ్ అవిక్రియమ్ ఏవ సత్ ఇత్యర్థః ।

తస్మిన్ ఆత్మతత్త్వే సతి నిత్యచైతన్యస్వభావే మాతరిశ్వా మాతరి అన్తరిక్షే శ్వయతి గచ్ఛతీతి మాతరిశ్వా వాయుః సర్వప్రాణభృత్ క్రియాత్మకో యదాశ్రయాణి కార్యకరణజాతాని యస్మిన్ ఓతాని ప్రోతాని చ, యత్సూత్రసంజ్ఞకం సర్వస్య జగతో విధారయితృ, స మాతరిశ్వా, అపః కర్మాణి ప్రాణినాం చేష్టాలక్షణాని అగ్ని-ఆదిత్య-పర్జన్య-ఆదీనాం జ్వలన-దహన-ప్రకాశ-అభివర్షణ-ఆది-లక్షణాని దధాతి విభజతి ఇత్యర్థః ధారయతీతి వా; “భీషాస్మాద్వాతః పవతే” (తై.ఉ. 2-8-1)  ఇత్యాదిశ్రుతిభ్యః ।  సర్వా హి కార్యకరణవిక్రియా నిత్య-చైతన్య-ఆత్మస్వరూపే సర్వాస్పదభూతే సత్యేవ భవన్తీత్యర్థః ॥

అవతారిక : న మన్త్రాణాం జామితాఽస్తీతి పూర్వమన్త్రోక్తమప్యర్థం పునరాహ –

 తదేజతి తన్నైజతి తద్దూరే తద్వన్తికే  ।

 తదన్తరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః  ॥ ౫॥

తదేజతి-ఇతి : తత్ ఆత్మతత్త్వం యత్ప్రకృతమ్ ఏజతి చలతి తదేవ చ నైజతి స్వతో నైవ చలతి, స్వతః అచలమేవ సత్ చలతి ఇవ ఇత్యర్థః ।  కిఞ్చ, తద్దూరే వర్షకోటిశతైః-అపి-అవిదుషామ్-అప్రాప్యత్వాత్ దూర ఇవ । తత్ ఉ అన్తికే (ఇతి ఛేదః) సమీపే అత్యన్తమేవ విదుషామ్, ఆత్మత్వాత్ న కేవలం దూరే, అన్తికే చ ।  తత్ అన్తః అభ్యన్తరే అస్య సర్వస్య, “య ఆత్మా సర్వాన్తరః” ఇతి శ్రుతేః, అస్య సర్వస్య జగతో నామరూపక్రియాత్మకస్య । తత్ ఉ అపి సర్వస్య అస్య బాహ్యతః; వ్యాపకత్వాత్- ఆకాశవత్-నిరతిశయసూక్ష్మత్వాత్-అన్తః; “ప్రజ్ఞానఘన ఏవ” ఇతి చ శాసనాత్ నిరన్తరం చ ॥

 యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవానుపశ్యతి  ।

 సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే ॥ ౬॥

యస్తు-ఇతి : యస్తు పరివ్రాట్ ముముక్షుః సర్వాణి భూతాని అవ్యక్తాదీని స్థావరాన్తాని ఆత్మని ఏవ అనుపశ్యతి, ఆత్మవ్యతిరిక్తాని న పశ్యతి ఇత్యర్థః । సర్వభూతేషు చ తేషు ఏవ చ ఆత్మానం తేషామపి భూతానాం స్వం ఆత్మానం ఆత్మత్వేన యథాస్య దేహస్య కార్యకరణ[3]సఙ్ఘాతస్య ఆత్మా అహం సర్వప్రత్యయసాక్షిభూతః-చేతయితా  కేవలః నిర్గుణః అనేన ఏవ స్వరూపేణ అవ్యక్తాదీనాం స్థావరాన్తానామ్ అహమేవ-ఆత్మా-ఇతి సర్వభూతేషు చ ఆత్మానం నిర్విశేషం యః తు అనుపశ్యతి, సః తతః తస్మాదేవ దర్శనాత్ న విజుగుప్సతే విజుగుప్సాం ఘృణాం న కరోతి । 

ప్రాప్తస్య ఏవ అనువాదః అయమ్ ।  సర్వా హి ఘృణా ఆత్మనః అన్యత్ దుష్టం పశ్యతో భవతి ; ఆత్మానమేవ అత్యన్తవిశుద్ధం నిరన్తరం పశ్యతో న ఘృణానిమిత్తమర్థాన్తరమస్తీతి ప్రాప్తం ఏవ – తతో న విజుగుప్సతే ఇతి ॥

అవతారిక : ఇమం ఏవ అర్థం అన్యః అపి మన్త్రః ఆహ –

 యస్మిన్సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః  ।

 తత్ర కో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః  ॥ ౭॥

యస్మిన్నేతి : యస్మిన్ సర్వాణి భూతాని యస్మిన్ కాలే యథా ఉక్త ఆత్మని వా, తాన్యేవ భూతాని సర్వాణి  పరమార్థాత్మదర్శనాత్ ఆత్మైవాభూత్ ఆత్మైవ సంవృత్తః పరమార్థవస్తు విజానతః, తత్ర తస్మిన్కాలే తత్రాత్మని వా, కో మోహః కః శోకః? శోకశ్చ మోహశ్చ కామకర్మబీజం అజానతః భవతి, న తు ఆత్మైకత్వం విశుద్ధం గగనోపమం పశ్యతః । కో మోహః కః శోక ఇతి శోకమోహయోః అవిద్యాకార్యయోః ఆక్షేపేణ అసమ్భవప్రదర్శనాత్ సకారణస్య సంసారస్య-అత్యన్తం-ఏవ-ఉచ్ఛేదః ప్రదర్శితః భవతి ॥

అవతారిక : యః అయం అతీతైః మన్త్రైః ఉక్తః  ఆత్మా, స స్వేన రూపేణ కింలక్షణః ఇత్యాహ అయం మన్త్రః –

స పర్యగాచ్ఛుక్రమకాయమవ్రణమస్నావిరగ్ం శుద్ధమపాపవిద్ధమ్ ।

కవిర్మనీషీ పరిభూః స్వయమ్భూర్యాథాతథ్యతోఽర్థాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః  ॥ ౮॥

సః పర్యగాత్-శుక్రం-అకాయం-అవ్రణం-అస్నావిరగ్ం-శుద్ధం-అపాపవిద్ధమ్ । కవిః-మనీషీ-పరిభూః- స్వయమ్భూః -యాథాతథ్యతః-అర్థాన్-వ్యదధాత్-శాశ్వతీభ్యః-సమాభ్యః  ॥

స పర్యగాతితి : స పర్యగాత్, సః యథోక్త ఆత్మా పర్యగాత్ పరి సమన్తాత్ అగాత్ గతవాన్, ఆకాశవత్ వ్యాపీ ఇత్యర్థః ।  శుక్రం శుభ్రం జ్యోతిష్మత్ దీప్తిమాన్ ఇత్యర్థః । అకాయమ్ అశరీరం లిఙ్గశరీరవర్జితః ఇత్యర్థః । అవ్రణమ్ అక్షతమ్ । అస్నావిరమ్ స్నావాః సిరా యస్మిన్న విద్యన్తే  ఇత్యస్నావిరమ్ । అవ్రణమస్నావిరమితి-ఏతాభ్యాం స్థూలశరీరప్రతిషేధః । శుద్ధం నిర్మలమవిద్యామలరహితమితి కారణశరీరప్రతిషేధః ।  అపాపవిద్ధం ధర్మాధర్మాదిపాపవర్జితమ్ । శుక్రమిత్యాదీని వచాంసి పుంలిఙ్గత్వేన పరిణేయాని, స పర్యగాత్ ఇత్యుపక్రమ్య కవిర్మనీషీ ఇత్యాదినా పుంలిఙ్గత్వేన ఉపసంహారాత్ ।

కవిః క్రాన్తదర్శీ సర్వదృక్, “నాన్యోఽతోఽస్తి ద్రష్టా” ఇత్యాదిశ్రుతేః ।  మనీషీ మనస ఈషితా, సర్వజ్ఞ ఈశ్వర ఇత్యర్థః । పరిభూః సర్వేషాం పరి ఉపరి భవతీతి పరిభూః । స్వయమ్భూః స్వయమేవ భవతీతి, యేషాముపరి భవతి యశ్చోపరి భవతి స సర్వః స్వయమేవ భవతీతి స్వయమ్భూః । స నిత్యముక్త ఈశ్వరః యాథాతథ్యతః సర్వజ్ఞత్వాత్ యథాతథా భావో యాథాతథ్యం తస్మాత్ యథాభూతకర్మఫలసాధనతః అర్థాన్ కర్తవ్యపదార్థాన్ వ్యదధాత్ విహితవాన్, యథానురూపం వ్యభజదిత్యర్థః । శాశ్వతీభ్యః నిత్యాభ్యః సమాభ్యః సంవత్సరాఖ్యేభ్యః ప్రజాపతిభ్యః ఇత్యర్థః ॥

అత్ర ఆద్యేన మన్త్రేణ సర్వ ఏషణాపరిత్యాగేన జ్ఞాననిష్ఠోక్తా ప్రథమో వేదార్థః “ఈశావాస్యమిదం సర్వమ్”, “మా గృధః కస్యస్విద్ధనమ్” ఇతి । అజ్ఞానాం జిజీవిషూణాం జ్ఞాననిష్ఠాసమ్భవే “కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్” ఇతి కర్మనిష్ఠోక్తా ద్వితీయో వేదార్థః ।  అనయోశ్చ నిష్ఠయోః విభాగః  మన్త్రద్వయప్రదర్శితయోః బృహదారణ్యకే అపి ప్రదర్శితః – “సోఽకామయత జాయా మే స్యాత్”  ఇత్యాదినా అజ్ఞస్య కామినః కర్మాణి ఇతి । “మన ఏవాస్యాత్మా వాగ్జాయా” ఇత్యాదివచనాత్ అజ్ఞత్వం కామిత్వం చ కర్మనిష్ఠస్య నిశ్చితమవగమ్యతే । తథా చ తత్ఫలం సప్తాన్నసర్గః- తేషు- ఆత్మభావేన-ఆత్మస్వరూపావస్థానమ్ ।

జాయాది ఏషణాత్రయసంన్యాసేన చ ఆత్మవిదాం కర్మనిష్ఠాప్రాతికూల్యేన ఆత్మస్వరూపనిష్ఠా ఏవ దర్శితా – “కిం ప్రజయా కరిష్యామో యేషాం నోఽయమాత్మాయం లోకః” ఇత్యాదినా ।  యే తు జ్ఞాననిష్ఠాః సంన్యాసినస్తేభ్యః “అసుర్యా నామ తే” ఇత్యాదినా అవిద్వన్నిన్దాద్వారేణ ఆత్మనః యాథాత్మ్యం “స పర్యగాత్” ఇత్యేతత్-అన్తైః-మన్త్రైః-ఉపదిష్టమ్ । తే హ్యత్రాధికృతా న కామిన ఇతి ।  తథా చ శ్వేతాశ్వతరాణాం మన్త్రోపనిషది “అత్యాశ్రమిభ్యః పరమం పవిత్రం ప్రోవాచ సమ్యగృషిసఙ్ఘజుష్టమ్” ఇత్యాది విభజ్యోక్తమ్ ।  యే తు కర్మిణః కర్మనిష్ఠాః కర్మ కుర్వన్త ఏవ జిజీవిషవః, తేభ్యః  ఇదముచ్యతే – “అన్ధం తమః” ఇత్యాది ।

కథం పునరేవమవగమ్యతే, న తు సర్వేషామ్ ఇతి ?

ఉచ్యతే – అకామినః సాధ్యసాధనభేదోపమర్దేన “యస్మిన్సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః । తత్ర కో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః” ఇతి యత్ ఆత్మైకత్వవిజ్ఞానం, తత్ న కేనచిత్ కర్మణా జ్ఞానాన్తరేణ వా హి మూఢః సముచ్చిచీషతి ।  ఇహ తు సముచ్చిచీషయా అవిద్వదాదినిన్దా క్రియతే । తత్ర చ యస్య యేన సముచ్చయః సమ్భవతి న్యాయతః శాస్త్రతో వా తత్ ఇహ ఉచ్యతే ।  తద్దైవం విత్తం దేవతావిషయం జ్ఞానం కర్మసమ్బన్ధిత్వేనోపన్యస్తం న పరమాత్మజ్ఞానమ్,  “విద్యయా దేవలోకః” ఇతి పృథక్ఫలశ్రవణాత్ । తయోః జ్ఞానకర్మణోః ఇహ ఏకైకానుష్ఠాననిన్దా సముచ్చిచీషయా, న నిన్దాపర ఏవ ఏకైకస్య, పృథక్ఫలశ్రవణాత్ – “విద్యయా తదారోహన్తి”, “విద్యయా దేవలోకః” “న తత్ర దక్షిణా యన్తి” “కర్మణా పితృలోకః” ఇతి ।  న హి శాస్త్రవిహితం కిఞ్చిదకర్తవ్యతామియాత్ ।  తత్ర –

అన్ధం తమః ప్రవిశన్తి యే అవిద్యాముపాసతే  ।

తతో భూయ ఇవ తే తమో య ఉ విద్యాయాగ్ం రతాః  ॥ ౯॥

అన్ధమేతి : అన్ధం తమః అదర్శనాత్మకం తమః ప్రవిశన్తి । కే? యే అవిద్యాం, విద్యాయా అన్యా అవిద్యా తాం కర్మ ఇత్యర్థః, కర్మణో విద్యావిరోధిత్వాత్,  తాం అవిద్యాం అగ్నిహోత్రాదిలక్షణాం ఏవ కేవలామ్ ఉపాసతే తత్పరాః సన్తః అనుతిష్ఠన్తి ఇత్యభిప్రాయః ।  తతః తస్మాత్ అన్ధాత్మకాత్ తమసః భూయః ఇవ బహుతరమేవ తే తమః ప్రవిశన్తి । కే? కర్మ హిత్వా యే ఉ యే తు విద్యాయామేవ దేవతాజ్ఞానే ఏవ రతాః అభిరతాః ॥

తత్ర అవాన్తరఫలభేదం విద్యాకర్మణోః సముచ్చయకారణం ఆహ । అన్యథా ఫలవదఫలవతోః సన్నిహితయోః అఙ్గాఙ్గితైవ స్యాత్ ఇతి అర్థః

అన్యదేవాహుర్విద్యయా అన్యదాహురవిద్యయా  ।

ఇతి శుశ్రుమ ధీరాణాం యే నస్తద్విచచక్షిరే  ॥ ౧౦॥

అన్యేతి : అన్యత్ పృథక్ ఏవ విద్యయా క్రియతే ఫలమితి ఆహుః వదన్తి, “విద్యయా దేవలోకః[4] “ , “ విద్యయా తదారోహన్తి “ ఇతి శ్రుతేః.   అన్యదాహుః అవిద్యయా కర్మణా క్రియతే “కర్మణా పితృలోకః “ ఇతి శ్రుతేః । ఇతి ఏవం శుశ్రుమ శ్రుతవన్తో వయం ధీరాణాం ధీమతాం వచనమ్ ।  యే ఆచార్యా నః అస్మభ్యం తత్ కర్మ చ జ్ఞానం చ విచచక్షిరే వ్యాఖ్యాతవన్తః, తేషాం అయమాగమః పారమ్పర్యాగత ఇత్యర్థః ॥

యత ఏవం అతః –

 విద్యాం చావిద్యాం చ యస్తద్వేదోభయగ్ం సహ  ।

 అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయాఽమృతమశ్నుతే  ॥ ౧౧॥

విద్యాం ఇతి  : విద్యాం చ అవిద్యాం చ దేవతాజ్ఞానం కర్మ చ ఇత్యర్థః । యత్ తత్ ఏతత్ ఉభయం సహ ఏకేన పురుషేణ అనుష్ఠేయం వేద తస్య ఏవం సముచ్చయకారిణః ఏవ ఏక పురుషార్థసమ్బన్ధః క్రమేణ స్యాత్ ఇతి ఉచ్యతే అవిద్యయా కర్మణా అగ్నిహోత్రాదినా మృత్యుమ్, స్వాభావికం కర్మ జ్ఞానం చ మృత్యుశబ్దవాచ్యమ్, ఉభయం తీర్త్వా అతిక్రమ్య విద్యయా దేవతాజ్ఞానేన అమృతమ్ దేవతాత్మభావం అశ్నుతే ప్రాప్నోతి । తత్ హి అమృతముచ్యతే, యద్దేవతాత్మగమనమ్ ॥

అవతారిక : అధునా వ్యాకృత-అవ్యాకృత-ఉపాసనయోః సముచ్చిచీషయా ప్రత్యేకం నిన్దా ఉచ్యతే –

 అన్ధం తమః ప్రవిశన్తి యేఽసమ్భూతిముపాసతే  ।

 తతో భూయ ఇవ తే తమో య ఉ సమ్భూత్యాగ్ం రతాః  ॥ ౧౨॥

అన్ధం ఇతి : అన్ధం తమః ప్రవిశన్తి యే అసమ్భూతిమ్, సమ్భవనం సమ్భూతిః సా యస్య కార్యస్య సా సమ్భూతిః తస్యాః  అన్యాః  అసమ్భూతిః ప్రకృతిః కారణమ్ అవిద్యా అవ్యాకృతాఖ్యా, తాం అసమ్భూతిం అవ్యాకృతాఖ్యాం ప్రకృతిం కారణం అవిద్యాం కామ-కర్మ-బీజ-భూతాం అదర్శనాత్మికాం ఉపాసతే యే తే తత్ అనురూపం ఏవ అన్ధం తమః అదర్శనాత్మకం ప్రవిశన్తి । తతః తస్మాదపి భూయో బహుతరం ఇవ తమః తే ప్రవిశన్తి య ఉ సమ్భూత్యామ్ కార్యబ్రహ్మణి హిరణ్యగర్భాఖ్యే రతాః ॥

అవతారిక : అధునా ఉభయోః ఉపాసనయోః సముచ్చయకారణం అవయవఫలభేదం ఆహ –

 అన్యదేవాహుః సమ్భవాదన్యదాహురసమ్భవాత్  ।

 ఇతి శుశ్రుమ ధీరాణాం యే నస్తద్విచచక్షిరే  ॥ ౧౩॥

అన్యేతి : అన్యత్ ఏవ పృథక్ ఏవ ఆహుః ఫలం సమ్భవాత్ సమ్భూతేః కార్యబ్రహ్మోపాసనాత్ అణిమాద్యైశ్వర్యలక్షణమ్ వ్యాఖ్యాతవన్తః ఇత్యర్థః ।  తథా చ అన్యదాహురసమ్భవాత్ అసమ్భూతేః అవ్యాకృతాత్ అవ్యాకృతోపాసనాత్ యదుక్తమ్ “అన్ధం తమః ప్రవిశన్తి” ఇతి, ప్రకృతిలయః ఇతి చ పౌరాణికైః ఉచ్యతే । ఇతి ఏవం శుశ్రుమ ధీరాణాం వచనం యే నస్తద్విచచక్షిరే వ్యాకృతావ్యాకృతోపాసనఫలం వ్యాఖ్యాతవన్తః ఇత్యర్థః ॥

అవతారిక : యత ఏవమ్, అతః సముచ్చయః సమ్భూతి-అసమ్భూతి-ఉపాసనయోః యుక్తః ఏవ ఏకపురుషార్థత్వాత్ చ ఇతి ఆహ –

 సమ్భూతిం చ వినాశం చ యస్తద్వేదోభయగ్ం సహ  ।

 వినాశేన మృత్యుం తీర్త్వాసమ్భూత్యాఽమృతమశ్నుతే  ॥ ౧౪॥

సమ్భూతి ఇతి :  సమ్భూతిం చ వినాశం చ యః తత్ వేద ఉభయం సహ, వినాశేన వినాశో ధర్మో యస్య కార్యస్య స తేన ధర్మిణా అభేదేనోచ్యతే “వినాశ” ఇతి । తేన తదుపాసనేన అనైశ్వర్యమధర్మకామాదిదోషజాతం చ మృత్యుం తీర్త్వా, హిరణ్యగర్భోపాసనేన హి అణిమాదిప్రాప్తిః ఫలమ్, తేన అనైశ్వర్యాదిమృత్యుం అతీత్య, అసమ్భూత్యా అవ్యాకృతోపాసనయా అమృతం ప్రకృతిలయలక్షణమ్ అశ్నుతే ।  “సమ్భూతిం చ వినాశం చ” ఇత్యత్ర అవర్ణలోపేన నిర్దేశో ద్రష్టవ్యః, ప్రకృతిలయఫలశ్రుతి -అనురోధాత్ ॥

అవతారిక : మానుష-దైవ-విత్త-సాధ్యం ఫలం శాస్త్రలక్షణం ప్రకృతిలయాన్తమ్; ఏతావతీ సంసారగతిః ।  అతః పరం పూర్వోక్తం “ఆత్మైవాభూద్విజానతః” ఇతి సర్వాత్మభావ ఏవ ర్వైషణాసంన్యాసజ్ఞాననిష్ఠాఫలమ్ ।  ఏవం ద్విప్రకారః ప్రవృత్తి-నివృత్తిలక్షణో వేదార్థః అత్ర ప్రకాశితః ।  తత్ర ప్రవృత్తిలక్షణస్య వేదార్థస్య విధిప్రతిషేధలక్షణస్య కృత్స్నస్య ప్రకాశనే ప్రవర్గ్యాన్తం బ్రాహ్మణం ఉపయుక్తమ్ । నివృత్తిలక్షణస్య వేదార్థస్య ప్రకాశనే అత ఊర్ధ్వం బృహదారణ్యకం ఉపయుక్తమ్ । తత్ర నిషేక-ఆది-శ్మశానాన్తం కర్మ కుర్వన్ జిజీవిషేద్యో విద్యయా సహ అపరబ్రహ్మవిషయయా, తదుక్తం – “విద్యాం చావిద్యాం చ యస్తద్వేదోభయమ్ సహ । అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే ” ఇతి । తత్ర కేన మార్గేణ అమృతత్వమశ్నుత ఇత్యుచ్యతే – “తద్యత్తత్సత్యమసౌ స ఆదిత్యో య ఏష ఏతస్మిన్మణ్డలే పురుషో యశ్చాయం దక్షిణేఽక్షన్పురుషః” ఏతదుభయం సత్యం బ్రహ్మోపాసీనః యథోక్తకర్మకృచ్చ యః, సః అన్తకాలే ప్రాప్తే సతి ఆత్మానం ఆత్మనః ప్రాప్తిద్వారం యాచతే –

హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖమ్  ।

తత్త్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే ॥ ౧౫॥

హిరణ్మయేనేతి : హిరణ్మయేన పాత్రేణ హిరణ్మయమివ హిరణ్మయం, జ్యోతిర్మయమితి ఏతత్, తేన పాత్రేణ ఇవ అపిధానభూతేన సత్యస్య ఆదిత్యమణ్డలస్థస్య బ్రహ్మణః అపిహితమ్ ఆచ్ఛాదితం ముఖమ్ ద్వారం; తత్ త్వమ్ హే పూషన్ అపావృణు అపసారయ సత్యధర్మాయ తవ సత్యస్య ఉపాసనాత్ సత్యం ధర్మో యస్య మమ సోఽహం సత్యధర్మా తస్మై మహ్యమ్; అథవా, యథాభూతస్య ధర్మస్యానుష్ఠాత్రే, దృష్టయే తవ సత్యాత్మన ఉపలబ్ధయే ॥

 పూషన్నేకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మీన్ సమూహ

తేజో యత్తే రూపం కల్యాణతమం తత్తే పశ్యామి  యోఽసావసౌ పురుషః సోఽహమస్మి  ॥ ౧౬ ॥

పూషన్నితి : హే పూషన్, జగతః పోషణాత్ పూషా రవిః । తథా ఏక ఏవ ఋషతి గచ్ఛతి ఇత్యేకర్షిః హే ఏకర్షే । తథా సర్వస్య సంయమనాత్ యమః హే యమ । తథా రశ్మీనాం ప్రాణానాం రసానాం చ స్వీకరణాత్ సూర్యః హే సూర్య । ప్రజాపతేః అపత్యం ప్రాజాపత్యః హే ప్రాజాపత్య । వ్యూహ విగమయ రశ్మీన్ స్వాన్ । సమూహ ఏకీకురు ఉపసంహార తేజః తావకం జ్యోతిః ।  యత్ తే తవ రూపం కల్యాణతమమ్ అత్యన్తశోభనమ్, తత్ తే తవాత్మనః ప్రసాదాత్ పశ్యామి । కిఞ్చ, అహం న తు త్వాం భృత్యవత్ యాచే యః అసౌ ఆదిత్యమణ్డలస్థః అసౌ వ్యాహృత్యవయవః పురుషః పురుషకారత్వాత్, పూర్ణం వా అనేన ప్రాణబుద్ధ్యాత్మనా జగత్ సమస్తమితి పురుషః; పురి శయనాద్వా పురుషః । సోఽహమ్ అస్మి భవామి ॥

 వాయురనిలమమృతమథేదం భస్మాన్తగ్ం శరీరమ్  ।

 ఓం క్రతో స్మర కృతగ్ం స్మర  ఓం క్రతో స్మర కృతగ్ం స్మర ॥ ౧౭॥

వాయుః ఇతి : అథేదానీం మమ మరిష్యతో వాయుః ప్రాణః అధ్యాత్మపరిచ్ఛేదం హిత్వా అధిదైవతాత్మానం సర్వాత్మకం అనిలమ్ అమృతమ్ సూత్రాత్మానం ప్రతిపద్యతామ్ ఇతి వాక్యశేషః ।  లిఙ్గం చేదం జ్ఞానకర్మసంస్కృతముత్క్రామత్వితి ద్రష్టవ్యమ్, మార్గయాచనసామర్థ్యాత్ । అథ ఇదం శరీరం అగ్నౌ హుతం భస్మాన్తమ్ భూయాత్ । ఓం ఇతి యథా-ఉపాసనం ఓం ప్రతీకాత్మకత్వాత్ సత్యాత్మకం అగ్ని ఆఖ్యం  బ్రహ్మ-అభేదేన ఉచ్యతే ।

హే క్రతో సఙ్కల్పాత్మక స్మర యత్ మమ స్మర్తవ్యం తస్య కాలోఽయం ప్రత్యుపస్థితః, అతః స్మర ఏతావన్తం కాలం భావితం కృతమ్ అగ్నే స్మర యత్ మయా బాల్యప్రభృతి-అనుష్ఠితం కర్మ తత్ చ స్మర । క్రతో స్మర కృతం స్మర ఇతి పునర్వచనం ఆదరార్థమ్ ॥

అవతారిక : పునః అన్యేన మన్త్రేణ మార్గం యాచతే –

 అగ్నే నయ సుపథా రాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్  ।

 యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ  ॥ ౧౮॥

అగ్నే ఇతి : హే అగ్నే నయ గమయ సుపథా శోభనేన మార్గేణ ।  సుపథేతి  విశేషణం దక్షిణమార్గనివృత్తి-అర్థమ్ ।  నిర్విణ్ణః అహం దక్షిణేన మార్గేణ గతాగతలక్షణేన; అతో యాచే త్వాం పునః పునః గమనాగమనవర్జితేన శోభనేన పథా నయ । రాయే ధనాయ, కర్మఫలభోగాయ ఇత్యర్థః । అస్మాన్ యథోక్తధర్మఫలవిశిష్టాన్ విశ్వాని సర్వాణి హే దేవ వయునాని కర్మాణి, ప్రజ్ఞానాని వా విద్వాన్ జానన్ ।  కించ, యుయోధి వియోజయ వినాశయ అస్మత్ అస్మత్తః జుహురాణం కుటిలం వఞ్చనాత్మకమ్ ఏనః పాపమ్ । తతో వయం విశుద్ధాః సన్తః ఇష్టం ప్రాప్స్యామ ఇత్యభిప్రాయః ।  కిన్తు వయమిదానీం తే న శక్నుమః పరిచర్యాం కర్తుం; భూయిష్ఠామ్ బహుతరాం తే తుభ్యం నమ ఉక్తిమ్ నమస్కారవచనం విధేమ నమస్కారేణ పరిచరేమ ఇత్యర్థః ॥

“అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయాఽమృతమశ్నుతే”, “వినాశేన మృత్యుం తీర్త్వా అసమ్భూత్యాఽమృతమశ్నుత” ఇతి శ్రుత్వా కేచిత్సంశయం కుర్వన్తి । అతః తత్ నిరాకరణార్థం సఙ్క్షేపతః విచారణాం కరిష్యామః ।

తత్ర తావత్ కింనిమిత్తః సంశయః  ఇతి, ఉచ్యతే – విద్యాశబ్దేన ముఖ్యా పరమాత్మవిద్యా ఏవ కస్మాత్ న గృహ్యతే, అమృతత్వం చ ?

నను ఉక్తాయాః పరమాత్మవిద్యాయాః కర్మణశ్చ విరోధాత్ సముచ్చయానుపపత్తిః ।

సత్యమ్ । విరోధః తు న అవగమ్యతే, విరోధావిరోధయోః శాస్త్రప్రమాణకత్వాత్; యథా అవిద్యానుష్ఠానం విద్యోపాసనం చ శాస్త్రప్రమాణకం, తథా తత్ విరోధ-అవిరోధావౌ అపి । యథా చ “న హింస్యాత్సర్వా భూతాని” ఇతి శాస్త్రాదవగతం పునః శాస్త్రేణైవ బాధ్యతే “అధ్వరే పశుం హింస్యాత్” ఇతి, ఏవం విద్యావిద్యయోరపి స్యాత్; విద్యాకర్మణోశ్చ సముచ్చయః ।

న;  “దూరమేతే విపరీతే విషూచీ అవిద్యా యా చ విద్యేతి జ్ఞాతా” ఇతి శ్రుతేః ।

“విద్యాం చావిద్యాం చ” ఇతి వచనాత్ అవిరోధః  ఇతి చేత్,

న; హేతుస్వరూపఫలవిరోధాత్ । 

విద్యావిద్యావిరోధావిరోధయోః వికల్ప-అసమ్భవాత్ సముచ్చయవిధానాత్ అవిరోధః ఏవేతి చేత్,

న; సహసమ్భవ-అనుపపత్తేః । 

క్రమేణ-ఏకాశ్రయే స్యాతాం విద్యావిద్యే ఇతి చేత్,

న; విద్యోత్పత్తౌ అవిద్యాయా హ్యస్తత్వాత్ తదాశ్రయే అవిద్యానుపపత్తేః; న హి అగ్నిరుష్ణః ప్రకాశశ్చ ఇతి విజ్ఞానోత్పత్తౌ యస్మిన్నాశ్రయే తదుత్పన్నం, తస్మిన్నేవాశ్రయే శీతోఽగ్నిరప్రకాశో వా ఇత్యవిద్యాయా ఉత్పత్తిః । నాపి సంశయః అజ్ఞానం వా, “యస్మిన్సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః । తత్ర కో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః” ఇతి శోకమోహాద్యసమ్భవశ్రుతేః । అవిద్యా-అసంభవాత్ తదుపాదానస్య కర్మణోఽప్యనుపపత్తిమ్ అవోచామ । ”అమృతమశ్నుత” ఇత్యాపేక్షికమమృతం; విద్యాశబ్దేన పరమాత్మవిద్యాగ్రహణే “హిరణ్మయేన” ఇత్యాదినా ద్వారమార్గయాచనమనుత్పన్నం స్యాత్ । తస్మాద్ యథావ్యాఖ్యాత ఏవ మన్త్రాణామర్థ ఇత్యుపరమ్యతే ॥

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ ఈశావాస్యోపనిషద్భాష్యం సమ్పూర్ణమ్ ।


[*1] కర్మసు-అవినియోగః

[2] ఇతి – పాఠాన్తరః

[3] కారణ – ఇతి పాఠాన్తరః

[4] బృహదారణ్యకే – 1-5-16

[5] ఇతి – పాఠాన్తరః