గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, ఆగస్టు 2022, బుధవారం

తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ- ...11 - 33...//.ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ- , , .11 - 34,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

0 comments

జైశ్రీరామ్.

 || 11-33 ||

శ్లో.  తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ

జిత్వా శత్రూన్ భుఙ్క్ష్వ రాజ్యం సమృద్ధమ్|

మయైవైతే నిహతాః పూర్వమేవ

నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్.

తే.గీ.  కాన పార్థ! యీ యుద్ధంబు కాదనకుము,

నేనె చంపితీ వీరలన్ గాన నీవు

కారణ మగుమ యుద్ధమునచ కోరి చేసి,

స్ఫూర్తి గాంచుము దీనిచే కీర్తి గనుము.

భావము.

కనుక ఓ సవ్యసాచీ! లెమ్ము, కీర్తిగాంచుము. శత్రువులను జయించి 

సర్వసంపదలతో తులతూగు రాజ్యమును అనుభవింపుము. 

వీరందఱును నాచేత మునుపే హతులైనవారు. నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము.

|| 11-34 ||

శ్లో.  ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ

కర్ణం తథాన్యానపి యోధవీరాన్|

మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా

యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్.

తే.గీ.  చంపితిని నేను పూర్వమే చంపు మిపుడు

భీష్మ, ద్రేణ, కర్ణాదులన్, వీరతతిని,

యుద్ధమును జేసి గెలుపొందు మొప్పుగాను, 

భీతి విడువుము, యత్నించు ప్రీతితోడ.

భావము.

ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ (సైంధవ) 

కర్ణాది యుద్దవీరులందఱిని నీవు సంహరింపుము. భయపడకుము. 

రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు. కనుక 

యుద్దము చేయుము.

జైహింద్.

మీకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు.

3 comments

 జైశ్రీరామ్

శా. ఓం గం శ్రీగణనాయకాప్రణతులీకో దేవ సంపూజ్యుఁడా!
ఓం గం శ్రీ వర భక్త సేవిత పదా! ఓంకారశబ్దోజ్వలా!
ఓం గం శ్రీ హిమరాజనందిని సుతా! ఓంతత్త్వసుజ్ఞానదా!
ఓం గం శ్రీ కవిపూజితా! శుభము లీ వొప్పార కల్పింపుమా.

నేడు సర్వమంగళ సుస్వరూపుఁడగు గణనాథుని చతుర్థి. ఈ సందర్భముగా మీకు ఆ గణనాథుని కృప అపారంగా లభించాలని కోరుకొంటూ మీకు నా శుభాకాంక్షలు తెలియఁ జేయుచున్నాను.

జై శ్రీమన్నారాయణ.

జైహింద్.

30, ఆగస్టు 2022, మంగళవారం

ఆంధ్ర భాషా ప్రౌఢిమ. .....రచన శ్రీ పుల్లూరు మాతయ్య:

0 comments

జైశ్రీరామ్.

శ్రీ పుల్లూరు మాతయ్య: 

మత్తేభవిక్రీడిత, కంద గర్భ సీసము.

సీ.  విభవభావాన్వితవిభ్రమంబు,పటు కా

వ్యాలంకృతంబౌ ప్రభావ భాష,

ప్రభవ సూక్తుల్ సుధ,వార్ధియై,తనుపు,నిం

పారన్,జిగీషా సభన్ ,జయించు,

సుకవి సంకల్పిత శోభితా రసధునుల్,

కావ్యాత్మ లోఁబాఱఁగాను పించు,

ప్రసవ సౌగంధ్యసువర్ణనా కలిత భా

షాయోష,వాక్సార సాగరంబు,

తే.గీ.  లలిత గుణ,వృత్తి,రీతుల నెలవు తెలుఁగు,

వాకొన,రమణీయ,మధురవాక్కులనిధి,

నవరస భరితామల పాక భవమనియన

గ,మనతెలుఁగమరెన్ బలుకనుమృదువుఁగ,


సీస గర్భిత మత్తేభము:-

భవభావాన్విత విభ్రమంబు,పటుకావ్యాలంకృతంబౌ ప్రభా

భవ సూక్తుల్ సుధవార్ధియై,తనుపు నింపారన్ జిగీషా సభన్,

కవిసంకల్పిత శోభితారసధునుల్,కావ్యాత్మలోఁబాఱఁగా,

సవసౌగంధ్య సువర్ణనా కలిత భాషాయోష,వాక్సారసా!


సీస గర్భిత కందము*

లలిత గుణ, వృత్తి ,రీతుల

నెలవు తెలుఁగు,వాకొన రమ ణీయ,మధుర వా                                                 

క్కులనిధి,నవరసభరితా

మల పాకభవమనియనఁగ మన తెలుఁగమరెన్;

                       

1,అలంకారములు=శబ్దార్థాద్యలంకారములు

2,రసధునులు=నవరసములు

3పాకము=(పదవ్యుత్పత్తి)ద్రాక్ష,నారికేళాదులు

4,గుణములు=శబ్దములకుప్రాణప్రదమైనవి,శ్లేష,మాధుర్యాదిగుణములు,

5,వృత్తులు=నాయకునికావ్యరసానుకూల చేష్టలు,,కైశికి,ఆరభటిమున్నగునవి.

6రీతులు=కావ్యరసాశ్రయ శబ్దరచన,వైదర్భి,గౌడీత్యాదులు.

7వర్ణనలు=అష్టాదశవర్ణనలు

జైహింద్.

భళారే....తెలుఁగు. రచన.... డా. ఏల్చూరి మురళీధరరావు..... శ్రీ పున్నమరాజు గళంలో.

0 comments

 

జైశ్రీరామ్.
భళారే....తెలుఁగు.    రచన.... డా. ఏల్చూరి మురళీధరరావు..... శ్రీ పున్నమరాజు గళంలో.
ఏల్చూరి మురళీధరులకు అభినందన పూర్వక నమస్సులు.
జైహింద్.

కళా విజయానందము..... రచన......డా. వెలుదండ సత్య నారాయణ పరమార్థ కవి

0 comments

జైశ్రీరామ్.

 🌻 కళా విజయానందము🌻 


డా. వెలుదండ సత్య నారాయణ   పరమార్థ కవి

      "కళ" లో కకారం బ్రహ్మవాచకం కాబట్టి సృష్టిని సూచిస్తుంది. లకారం లయాన్ని సూచిస్తుంది. ఈ విధంగా కళ సృష్టి స్థితి లయ రూప మయింది. లలితకళలలో శిల్పకళ పేరెన్నిక గన్నది. ఆలయాలకోసం శిల్పాలు చెక్కడం అనాదిగా జరుగుతున్నది. ఆగమ శాస్త్రాలు దీని కాధారాలు. ఇవి శివోపాసనకోసం ఉద్దేశింపబడినవి. 3 వ శతాబ్దం నుంచి కూడ ఎందరో శిల్పులు శిల్పకళారాధననే శివారాధనగా భావించి కావించి తరించినారు.

     శిల్పకళ ఇతివృత్తంగా అవిభాజ్యమైన మహబూబు నగర్ జిల్లాలో ఇటీవల విరచింపబడి నా దృష్టికి వచ్చిన పద్యకావ్యాలు రెండు.

     1.శిల్పి: ఇదొక ఖండ కావ్యం. రచయిత "శ్రీ జి. యాదగిరి గారు. 2011 లో ప్రచురితం. "శ్రమకు దగ్గ కీర్తి సంపదలును లేక  బ్రతుకుబండలైన భగ్న జీవి" గా శిల్పిని అద్భుతంగా ఆర్ద్రంగా అభివర్ణించారు కవి. వారి చేతి వ్రాతతోనే పుస్తకం అచ్చయింది.

    2. శిల్పశ్రీ : ఇదొక చారిత్రక కావ్యం. రచయిత శ్రీ ముంజంపల్లి వీరబ్రహ్మేంద్రాచార్య గారు. 2016 లో ప్రచురితం. శ్రీ దరిశేటి వేంకట రామాచార్యుల వారి సంస్కృత కృతికి ఆనంద దాయకమైన అనుకృతి. శిల్పిని గౌరవించడానికి వచ్చిన రుద్రమదేవి శిల్పాన్ని గౌరవించడం అనన్య సామాన్యంగా యిందులో అభివర్ణించబడినది.

    అదే కోవలో వెలువడిన ప్రస్తుత కావ్యం "నిర్వచన శిల్పకళా విజయం". రచయిత కీ.శే. మన్నె రాములు గారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గొరిట గ్రామవాసులు. సమీప నారదగిరి క్షేత్ర శ్రీవేంకటేశ్వర భక్తులై సంకీర్తనాచార్యులుగా పేరందిన తిరునగరి లక్ష్మణదాసు గారికి ప్రియశిష్యుడైన నాగదాసునకు పౌత్రులు వీరు.

    ఈ కావ్యంలో 104 పద్యా లున్నవి. ఇది శివుని కర్పించబడింది. 9 పద్యాల్లో ప్రార్థనాదులు గావించి కథారంభం చేయబడింది.

      సత్యపురంలో ఒక శిల్పకళా ప్రవీణు డున్నాడు. భార్య సుగుణాంబరి.. వారి కుమారుడే పూర్ణయాచారి లేదా పరిపూర్ణాచారి. చిన్నతనంలోనే శిల్పకళలో ఆరితేరినాడు. ఈడేరి మంచి అందగాడైనాడు.

     కాముకు డనే ఆ దేశపు రాజు ఒక శివాలయ నిర్మాణం సంకల్పించి పురోహితుని సూచన మేరకు పరిపూర్ణాచారిని పిలిపించగా గుడి నిర్మాణం ఆరంభ మయింది. గర్భగుడి, మండపాదులు అద్భుతంగా శిల్పిస్తూ వుండగా నీళ్ళకోసం వెళ్ళే యువతు లెందరో అతని అందచందాలు చూసి అబ్బుర పడిపోయారు. అంతేకాదు. అతని చిత్ర రూప మెదలో తమకు తెలియకుండానే పదిలపరచుకున్నారు.

     రాజ కుమార్తె సురక్త ఒకనాడు వచ్చి శిల్పిని  చూసింది. ఇద్దరి మనసులు ఒక టైనవి. మాటా మాటా కలిసింది. నిర్మాణాదులు ముగిసాక తనను పెళ్ళాడు మని ప్రార్థించింది...

   అంత నొక వింత యా పురమందు గలిగె 

   ప్రసవ మందిన కాంతల శిశువుల గన 

   యువక శిల్పిని బోలిన యుజ్జ్వలంపు

   చెలువు ప్రతి శిశువందున చెలగియుండె 60. 

        ఆ మధ్యకాలంలో ప్రసవించిన కాంతలకు శిల్పి రూపు రేకలే అచ్చు గుద్దినట్టు వున్న శిశువులే నూర్ల కొలది జన్మించినారు.

     అది చూసి జనులు విస్తుపోవడమే గాక బాధ పడి రాజుగారికి విన్నవించగా రాజు "శిల్పి యింత వంచకు డనుకోలేదు. తల తీయించండి." అని ఆజ్ఞాపించాడు. శిల్పి ఎంతో వేడుకున్నాడు. 


"కమలాప్త సుతునకు ఘనమగు వాహనం

     బనదగు నొక మంత్రి యధిప! మీకు

గిరిశుని బంటుకు స్థిర వాహనంబైన

     యట్టివానికి జత యనగ నొకడు..

పాండవ మధ్యము పడగకు నీ డగు 

     నట్టివానికి బోల్చ నగు నొకండు 

కృష్ణ జన్మంబున గూయుచు మేల్కొల్పి

     నట్టి జంతు సమాను డనగ నొకడు

గలరు నీ మంత్రివర్యులు ఘనులుగాను 

అంత కంటెను వారలు నధికు లనగ

జాలుదురు తెల్వితేటలు మేలు మేలు. 

వారి గని యెన్న వచ్చు మీ ప్రభుతనంబు" 75 


అన్నాడు రాజుతో. కావ్యంలోనే ఇది ఒక గూఢార్థ సమన్వితమైన పద్య రాజం. "నీ కొలువులో ఇలాంటి వా రున్నా" రని చెప్పాడు. ఎలాంటివా రంటే..

      కమలాప్త సుతు డంటే సూర్యుని కుమారుడు- యముడు. ఆతని వాహనం మహిషము. దున్నపోతు లాంటి వా డొక డున్నా డని మొదటి పాదం యొక్క భావం..

     గిరిశు డంటే శివుడు. అతని బంటు అంటే భైరవుడు. అతని వాహనం శునకం. కుక్కలాంటి వా డొక డున్నా డని 2 వ పాదం యొక్క భావం. 

     పాండవ మధ్యము డంటే అర్జునుడు. పడగ అంటే అతని ధ్వజము. దాని మీద ఆంజనేయు డుంటాడు. కోతిలాంటి వా డొకడు నీ కొలువులో వున్నా డని 3 వ పాదం యొక్క భావం.

     కృష్ణ జన్మంబున అంటే కృష్ణుడు జన్మించి నప్పుడు కూయుచు మేలుకొల్పిన జంతు వంటే ఓండ్రపెట్టి అందరినీ మేల్కొలుప జూచిన గార్దభ మని భావం. కారాగారంలో కృష్ణుడు జన్మించినాడు. ఆతణ్ణి వసుదేవుడు (కృష్ణుని తండ్రి) వెంటనే రేపల్లెలోని యశోద వద్దకు చేర్చవలె. లేకపోతే కంసునితో ప్రమాదం. ఆ అర్ధరాత్రి కావలి వారంతా గాఢనిద్రలో వున్నారు. వారు లేవక ముందే ఆ పని జరుగాలి. కానీ గాడిద ఒకటి ఓండ్రపెట్ట జూచింది. "వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు" అనే లోకోక్తి మన కున్నది. వసుదేవుడు దాన్ని బ్రతిమలాడినా డట! "నీ కొలువులో ఓ రాజా! గాడిదలాంటి వా డొక మంత్రి వున్నా" డని 4 వ పాదం యొక్క భావం.

     అద్భుతమైన ఈ పద్యం కావ్యంలోనే తలమానికం. అంతే కాదు ధైర్యంగా సృష్టి రహస్యా న్నిలా విడమరచి రాజుకు విన్నవించాడు శిల్పి.

     మానసికంబునన్ గలుగు

          మానవకోటుల రూప భేదముల్

     పూనికతోడ దెల్పెదను

           పుణ్యవతుల్ ఋతుకాలమందునన్

     దేనిని నాత్మలో నిడి త

            దేకము ధ్యాన మొనర్చుచుందురో

     దానినె పిండరూపమున

             దైవ మొనర్చు నుదాత్త పద్ధతిన్ 

        కావ్య మంతా ఈ పద్యము మీదనే ఆధార పడి వున్నది.

      

 "ఇదే యథార్థమైతే ఒక సంవత్సరం గడు విస్తున్నాను. నిరూపించు." అన్నాడు రాజు.

      ఆ ప్రాంతంలో శిల్పికి ఒక పెద్ద ఆవుల మంద, ఒక తెల్ల గుండు కనిపించినవి. ఒక నెల లోపల అతడు గుండును సర్వాంగ సుందరంగా ఒక "నంది" గా మలచినాడు. ఇక ఆవు లన్నీ దాని చుట్టే తిరిగినవి. వాటి మనస్సులలో ఆ నంది ముద్ర పడిపోయింది దృఢంగా. పదకొండు నెలలకు దూడలు జన్మించసాగినవి. అన్నీ ఆ నంది పోలికలతోనే అలరారుతున్నవి. 

     రాజు వెళ్ళి చూసి ఆశ్చర్యపడి తన తప్పు తెలుసుకొని పరిపూర్ణునికి సాష్టాంగపడి క్షమించు మని వేడుకొన్నాడు. మిగిలిపోయిన ఆలయం పనులు గుర్తు చేయగా శిల్పి నెలరోజులలో పూర్తి చేశాడు. సురక్త తండ్రితో చెప్పింది శిల్పిని ప్రేమిస్తున్నా నని. రాజు అంగీకరించగా ఇద్దరికీ వైభవంగా పెండ్లి జరిగింది...

     శిశువులకు ముఖ కవళిక లెలా రూపు దిద్దుకుంటా యనడానికి వెనుక సృష్టిలో నున్న మర్మాన్ని విప్పి చెప్పే ప్రయత్నం కవి చేయడమే గాక సఫలీకృతుడు కావడం ఎంతో ప్రశంసించదగిన విషయం. ఇటువంటి వినూతనమైన ఇతివృత్తం మీద ఆధార పడి కావ్యరచన సాగడం చాలా అరుదైన విషయం. 

      కీ.శే. బైరోజు దామోదరాచార్యుల వంటి మహాశిల్పులకు కీ.శే. తిరునగరి లక్ష్మణదాసు వంటి సంకీర్తనాచార్యులకూ, కీ.శే. కపిలవాయి లింగమూర్తి గారి వంటి మహాకవులకు ఆలవాల మయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇటువంటి కళాత్మక కావ్యం రావడం ఆశ్చర్యమేమీ కాకపోయినా ఆనంద మెంతో అయి తీరుతుంది. 

     ఈ కృతి ప్రభాలోకనం చేయడాని కహరహం తపించి శ్రమించిన సంస్కార విశాల హృదయులు, నాటకకళా పిపాసులు, బహుగ్రంథకర్త శ్రీ దుప్పల్లి శ్రీరాములు గారి ప్రేరణతో కావ్యం ముద్రణ దశలో వున్నప్పుడే చదివి ఈ వ్యాసం వ్రాయటం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 

(కృతి పరిష్కర్త: శ్రీ కపిల వాయి లింగమూర్తి.. 

ప్రచురణ 2020 వెల: రూ.50/ ప్రకాశకులు:

య.డి.జహంగీర్ ఇం.నెం.11-45, రాంనగర్ కాలనీ, నాగర్ కర్నూల్ జిల్లా 509 209

చరవాణి : 9493079850) 


డా. వెలుదండ సత్య నారాయణ 

పరమార్థ కవి

పరమార్థకవిగారికి అభినందన పూర్వక ధన్యవాదములు.

జైహింద్.

ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో- ...11 - 31...//.కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో- , , .11 - 32,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

0 comments

 జైశ్రీరామ్.

|| 11-31 ||

శ్లో.  ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో

నమోస్తు తే దేవవర ప్రసీద|

విజ్ఞాతుమిచ్ఛామి భవన్తమాద్యం

న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్.

తే.గీ. వందనంబులు పరమేశ!  వందుచుంటి

యెవరివో నీవు తెల్పు మేనెరుగ నిన్ను,

నాది పురుషుడవైన నిన్నరయ నుంటి,

నీ ప్రవృత్తిని సృష్టిలో నే నెరుంగ.

భావము.

ఓ పరమాత్మా! నీకు నా నమస్కారములు - ప్రసన్నుడవు కమ్ము. 

ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. 

ఆదిపురుషుడవైన నిన్ను విశదముగా తెలిసికొనగోరుచున్నాను.

 ఏలనన నీ ప్రవృత్తిని ఎఱుంగలేకున్నాను.

శ్రీభగవానువాచ|.

భావము.

భగవానుడు పలుకుచుండెను,

|| 11-32 ||

శ్లో.   కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో

లోకాన్సమాహర్తుమిహ ప్రవృత్తః|

ఋతేऽపి త్వాం న భవిష్యన్తి సర్వే

యేవస్థితాః ప్రత్యనీకేషు యోధాః.

తే.గీ. అంతమున్ జేయ సృష్టినే యమరితిచట

కాలునిగ నింక పోరీవు కా దనినను,

రిపులు మిగులరొక్కరును  హరింతు నేను,

కాలధర్మంబు తప్పింప గాంచుమీవె.

భావము.

నేను లోకములన్నింటిని తుదముట్టించుటకై విజృంభించిన 

మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొని

యున్నాను. కనుక నీవు యుద్దముచేయకున్ననూ ప్రతిపక్షముననున్న 

ఈ వీరులెవ్వరును మిగులరు.

జైహింద్.

29, ఆగస్టు 2022, సోమవారం

డా.య.ల్లె.స్వై.వీ.శర్మ.. ....అమ్మభాషకు అందలం.

1 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

యథా ప్రదీప్తం జ్వలనం పతఙ్గా- ...11 - 29...//.. లేలిహ్యసే గ్రసమానః సమన్తాల్- , , .11 - 30,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

0 comments

 జైశ్రీరామ్

|| 11-29 ||

శ్లో.  యథా ప్రదీప్తం జ్వలనం పతఙ్గా

విశన్తి నాశాయ సమృద్ధవేగాః|

తథైవ నాశాయ విశన్తి లోకాస్-

తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః.

తే.గీ.  మృత్యువును చేర నగ్నిలో మిడుతలట్లు

పడుచునుండిరి నీ నోట పరుగుపెట్టి

వచ్చి, వింతగానుండెను, భక్త సులభ!

మేము కనలేము నీమాయ నేమొకాని.

భావము.

మిడుతలన్నియు మోహవశమున బాగుగా మండుచున్న అగ్నివైపు 

అతివేగముగా పరుగెత్తి, తమ నాశనముకొఱకు అందు ప్రవేశించి, 

నశించునట్లు ఈ వీరులందఱును తమనాశమునకై అతివేగముగా 

పరుగెత్తి, నీ వక్త్రములయందు ప్రవేశించుచున్నారు.

|| 11-30 ||

శ్లో.  లేలిహ్యసే గ్రసమానః సమన్తాల్-

లోకాన్సమగ్రాన్వదనైర్జ్వలద్భిః|

తేజోభిరాపూర్య జగత్సమగ్రం

భాసస్తవోగ్రాః ప్రతపన్తి విష్ణో.

తే.గీ. ప్రజ్వలించు నీ ముఖముతో పట్టుచుండి

యెల్లలోకంబులన్ మ్రింగుటేనుగంటి,

నీదుతేజస్సుచే భీతినే జగంబు 

మున్గుటన్ గంటి గోవింద పుణ్యపురుష.

భావము.

హే విష్ణో! ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను 

అన్నివైపులనుంచి కబళించుచు మాటిమాటికిని చప్పరించుచున్నావు. 

నీ ఉగ్రతేజస్సులు అంతటను నిండి జగత్తును తపింపజేయుచున్నవి.

జైహింద్.

తెలుఁగు భాషాదినోత్సవము సందర్భముగా ప్రపంచ వ్యాప్తముగా ఉన్న తెలుణ్గు వారికి శుభాకాంక్షలు.

0 comments

 జైశ్రీరామ్.

వ్యవహారిక భాషోద్యమకారుఁడి గిడుగు రామమూర్తి గారి జన్మదిమయినాఅగష్టు 29వ 

తేదీ తెలుఁగుభాషా దినోత్సవము.

ఈ సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.

చం. తెలుఁగు సుధాస్రవంతి, గణుతిన్ గనె భాషలలోన మేటిగా

వెలుఁగులు చిందు సాహితి, కవిప్రముఖాళికి స్వర్ణపేటి యీ

తెలుఁగున సద్వధాన విధి, దివ్యవిచిత్ర కవిత్వతేజమున్

కలిగిన కారణంబున ప్రగణ్యముగా వెలుగొందె ద్రాత్రిపై.

జైహింద్.

28, ఆగస్టు 2022, ఆదివారం

మువ్వన్నెలజెండా రెపరెపల సాహితీ దీప్తులు. భూమిపుత్ర పతికలో.. రచన.. డా.పీ. రమేష్ నారాయణ్.

0 comments

 జైశ్రీరామ్.

శ్రీ కే.మురళీమోహన్ గారూ! . మీ అపురూపమయిన కృషి ఫలితంగా వెలువడిన ఉత్తమోత్తమ గ్రంథరాజము గుర్తింపఁనడి ప్రశంసింపఁబడుట ముదావహమండి. సామాజిక స్పృహతో చేసే ఏ కృషికి అయినా తప్పక మహాత్ములగుర్తింపు లభిస్తుండనడానికి ఎదే తార్కాణము. మీకు నా అభినందనలు. పాల్గొని పునీతజన్ములయిన కవులకు నా అభినందనలు. మీకు తోడయిన మీ సహోదరులకు, అచార్యఫణీంద్రులకు, సమీక్ష చక్కగా చేసిన డా. రమేష్ నారాయణ్ గారికి అభినందనపూర్వక నమస్కారములు.🙏
జైహింద్.

వక్త్రాణి తే త్వరమాణా విశన్తి- ...11 - 27...//.. యథా నదీనాం బహవోమ్బువేగాః , , .11 - 28,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

0 comments

 జైశ్రీరామ్

|| 11-27 ||

శ్లో.  వక్త్రాణి తే త్వరమాణా విశన్తి

దంష్ట్రాకరాలాని భయానకాని|

కేచిద్విలగ్నా దశనాన్తరేషు

సన్దృశ్యన్తే చూర్ణితైరుత్తమాఙ్గైః.

తే.గీ. అతి భయంకరదంష్ట్రలనమరినముఖ

ములను జేరి, చిక్కుచును కోరలకు మరియు 

నక్కడటునుగ్గుగానయిరనుపమాన!

భయము కలుగుచుండె నో భక్త సులభ!

భావము.

భయంకరములైన కోరలతోగూడిన నీ ముఖములయందు 

అతివేగముగా పరుగులుదీయుచు ప్రవేశించుచున్నారు. 

కొందఱి తలలు కోరల మద్యబడి నుగ్గునుగ్గైపోవుచుండగా 

వారు దంతములలో చిక్కుకొని వ్రేలాడుచున్నారు.

|| 11-28 ||

శ్లో.  యథా నదీనాం బహవోమ్బువేగాః

సముద్రమేవాభిముఖా ద్రవన్తి|

తథా తవామీ నరలోకవీరా

విశన్తి వక్త్రాణ్యభివిజ్వలన్తి.

తే.గీ. నదులు సంద్రంబులోపలికొదుగునట్లు 

సమరయోధులు నీముఖసరసిజమున

కభిముఖంబుగసాగిరోయగ్ని ముఖుడ!

చూడజాలను శాంతించు సుగుణభాస!

భావము.

అనేకములైన నదీనదములప్రవాహములన్నియును సహజముగా 

సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు 

ప్రవేశించుచున్నట్లు, ఈ శ్రేష్ఠులైన సమరయోధులు (నరలోకవీరులు) 

కూడ జ్వలించుచున్న నీ ముఖములయందు ప్రవేశించుచున్నారు.

జైహింద్.

27, ఆగస్టు 2022, శనివారం

దంష్ట్రాకరాలాని చ తే ముఖాని- ...11 - 25...//.. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః , , .11 - 26,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

0 comments

 జైశ్రీరామ్.

|| 11-25 ||

శ్లో.  దంష్ట్రాకరాలాని చ తే ముఖాని

దృష్ట్వైవ కాలానలసన్నిభాని|

దిశో న జానే న లభే చ శర్మ

ప్రసీద దేవేశ జగన్నివాస.

తే.గీ. నీ కరాళ దంష్ట్రల్ మోము నాకు భయము

గొల్పు, తోచవు దిక్కులు, కొరత కలిగె

శాంతి కో దేవదేవరా! శాంతి దాల్చి

నీవు సుప్రసన్నుడవయి కావు నన్ను.

భావము.

ఓ జగన్నివాసా! కరాళదంష్ట్రలతో 

(భయంకరమైన కోరలతో) ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్ని

జ్వాలలవలె భీతిగొల్పుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కు

తోచకున్నది. నెమ్మది (శాంతి) శూన్యమైనది. ఓ దేవేశా! ప్రసన్నుడవు కమ్ము.

|| 11-26 ||

శ్లో.  అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః

సర్వే సహైవావనిపాలసఙ్ఘైః|

భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ

సహాస్మదీయైరపి యోధముఖ్యైః.

తే.గీ.  ధార్తరాష్ట్రులున్, భీష్ముడున్, ధరనృపాలు

రట్లె కర్ణుడున్,ద్రోణుడు, నట్లెమనప

రిజనులున్ నిన్ బ్రవేశించిరి, కనితిపుడె,

నాకు మతిపోవుచుండెను నయనిధాన.

భావము.

ఇదిగో! (ఇచ్చట చేరియున్న) ఈ ధృతరాష్ట్రపుత్రులు 

(దుర్యోధనాదులు) ఇతర రాజన్యులతోసహా నీలో ప్రవేశించుచున్నారు. 

భీష్మపితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి 

ప్రధానయోధులు అందఱును.

జైహింద్.

26, ఆగస్టు 2022, శుక్రవారం

డా.నరాల రామారెడ్డి గారికి గండపెండేర సత్కారము.

0 comments

జైశ్రీరామ్.

డా.నరాల రామారెడ్డి గారికి గండపెండేర సత్కారము.

డా.నరాల రామారెడ్డి అవధాని వరేణ్యులకు అభినందనలు.

జైహింద్.

రూపం మహత్తే బహువక్త్రనేత్రం- ...11 - 23...//.. నభఃస్పృశం దీప్తమనేకవర్ణం , , .11 - 24,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

0 comments

 జైశ్రీరామ్.

|| 11-23 ||

శ్లో.  రూపం మహత్తే బహువక్త్రనేత్రం

మహాబాహో బహుబాహూరుపాదమ్|

బహూదరం బహుదంష్ట్రాకరాలం

దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్.

తే.గీ.   నీయనేకబాహుల్వక్త్ర నేత్రములును

పాదములునూరువులుదరభాగములును,

కోరలును కడు భీతిని గొలుపుచుండె,

నేనునున్ భీతినొందితి నీరజాక్ష!

భావము.

ఓ మహాబాహో! అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, 

చేతులను, ఊరువులను, పాదములను, ఉదరములను, కోరలను

 కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమునుచూచి, అందఱును 

భయకంపితులగుచున్నారు. నేనుకూడ భయముతో వణికిపోవుచున్నాను.

|| 11-24 ||

శ్లో.  నభఃస్పృశం దీప్తమనేకవర్ణం

వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్|

దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాన్తరాత్మా

ధృతిం న విన్దామి శమం చ విష్ణో.

తే.గీ. నభము దాకె నీ రూపమనంత దీప్తి

వర్ణముల్ పెక్కు కలుగుచు, పరగు కనులు

కాంతులన్జిందనొప్పునీ ఘన ముఖంబు,

భీతిలెన్గని యందరున్, భీతియయ్యె.

భావము.

ఏలనన హే విష్ణో! నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. 

అదే అనేకవర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను 

విరజిమ్ముచున్న విశాలనేత్రములతో, విస్తరించినముఖములతో 

అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా

 మనస్సు తత్తరపడుచున్నది. అందువలన నా దైర్యము సడలినది. 

శాంతి దూరమైనది.

జైహింద్.

24, ఆగస్టు 2022, బుధవారం

రాబోతున్న వినాయకచవితిని ఎలా చేసుకోవాలి? ఏమేమి పత్రాలు ,....

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

గణనాథునికి ఏకవింశతి పత్ర పూజ.

0 comments

జైశ్రీరామ్.

ఏకదంతునకు  ఏకవింశతి పత్రపూజ

(21 విధముల పత్రములతో పూజ)

 సీ.  సుముఖ! మాచీపత్రముమదిని గొనుమయ్య, 

బృహతిని గణనాథ మహిత! కొనుమ,


బిల్వము గొనుమయ్య ప్రీతినుమాపుత్ర!

గజముఖ! గొనుమయ్య గరిక నీవు,


హరసూన! దుత్తూరమందుకొనుము కృపన్

బదరి లంబోదరా! మదిని గొనుమ,


యొప్ప నపామార్గ మో గుహాగ్రజ కొను,

గజకర్ణ! తులసిని ఘనతఁ గొనుమ,


యేకదంతా! కొను మిదె చూతపత్రంబు, 

వికటా! కొనుము కర వీరమిదిగొ,


భిన్నదంతా! కొను ప్రీతి విష్ణుక్రాంత 

మున్, వట! దాడిమిన్ ముదము గొనుము,


దేవదారున్ గొను దివ్య సర్వేశ్వరా!

ఫాలచంద్రా! మరువంబు గొనుమ,


యీ సింధువారమున్ హేరంబ! కొనుమయ్య, 

శూర్పకర్ణా! జాజి శుభద! కొనుము,


యల గండకిఁ గొను సురాగ్రజా! యిభవక్త్ర! 

కొనుము శమీ పత్రము నయమలర,


నశ్వత్థ మిదె కొను మరసి వినాయకా!

సురసేవితా!ర్జునమరసి కొనుము,


తే.గీ.  కపిల! కొనుమర్క పత్రంబుఁ, గరుణ తోడ,

నేకవింశతి పత్రంబు లిటులఁ గొనిన

శ్రీగణేశా! శుభాకరా! చిత్తమలర

చెంగుచెంగున గెంతుచు చెలగుమిచట.


శ్రీ గణేశాయనమః ఏకవింశతి పత్రాణి పూజయామి,

సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి।

గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి।

ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి।

గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి

హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి।

లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి।

గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి।

గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి,

ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి,

వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి।

భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి,

వటవేనమః - దాడిమీపత్రం పూజయామి,

సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి,

ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి,

హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి

శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి,

సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి,

ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి,

వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి,

సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి।

కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి।

శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.

జైహింద్.

అమీ హి త్వాం సురసఙ్ఘా విశన్తి- ...11 - 21...//.. రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా , , .11 - 22,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

0 comments

 జైశ్రీరామ్.

|| 11-22 ||

శ్లో.  రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా

విశ్వేऽశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ|

గన్ధర్వయక్షాసురసిద్ధసఙ్ఘా

వీక్షన్తే త్వాం విస్మితాశ్చైవ సర్వే.

తే.గీ.  భవ్యులైన రుద్రాదిత్యవసువులు నిక ,

సాధ్యులస్వినుల్, పితరులు, సన్నుతులగు

ఘనతనట్టివిశ్వేదేవులును, మరుద్ణ

ణ, సుర, యక్షులున్, సిద్ధుల్గనరొకొ నిను.

భావము.

ఏకాదశరుద్రులును, ద్వాదశాదిత్యులును, అష్టవసువులును, 

సాధ్యులును, విశ్వేదేవతలును, అశ్వినీకుమారులును, 

మరుద్గణములును, పితరులును అట్లే గంధర్వయక్షాసు

రసిద్దసముదాయములును నిన్నే దర్శించుచున్నారు.

|| 11-22 ||

శ్లో.  రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా

విశ్వేऽశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ|

గన్ధర్వయక్షాసురసిద్ధసఙ్ఘా

వీక్షన్తే త్వాం విస్మితాశ్చైవ సర్వే.

తే.గీ.  భవ్యులైన రుద్రాదిత్యవసువులు నిక ,

సాధ్యులస్వినుల్, పితరులు, సన్నుతులగు

ఘనతనట్టివిశ్వేదేవులును, మరుద్ణ

ణ, సుర, యక్షులున్, సిద్ధుల్గనరొకొ నిన్ను.

భావము.

ఏకాదశరుద్రులును, ద్వాదశాదిత్యులును, అష్టవసువులును, 

సాధ్యులును, విశ్వేదేవతలును, అశ్వినీకుమారులును, మరుద్గణములును, 

పితరులును అట్లే గంధర్వయక్షాసురసిద్దసముదాయములును నిన్నే 

దర్శించుచున్నారు.

జైహింద్.

23, ఆగస్టు 2022, మంగళవారం

డా. నలవోలు నరసింహారెడ్డి గారి ముద్దుబాల శతకము 9వ 10వ భాగములు ఆవిష్కరణ.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

 

అనాదిమధ్యాన్తమనన్తవీర్య- ...11 - 19...//.. ద్యావాపృథివ్యోరిదమన్తరం హి , , .11 - 20,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

0 comments

 జైశ్రీరామ్

|| 11-19 ||

శ్లో.  అనాదిమధ్యాన్తమనన్తవీర్య-

మనన్తబాహుం శశిసూర్యనేత్రమ్|

పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం

స్వతేజసా విశ్వమిదం తపన్తమ్.

తే.గీ‌. ఆది మధ్యాంత రహితుడ వపరిమిత మ

యిన మహాశక్తిశాలివి, యినడు శశియు

నేత్రములునీకు, భుజములనేక బాహు

వులను ప్రజ్వలితపువక్త్రవుగ గనితిని.

భావము.

నీవు ఆదిమధ్యాంత రహితుడవు. అపరిమితశక్తిశాలివి. 

అసంఖ్యాకములైన భుజములు గలవాడవు. సూర్యచంద్రులు నీ 

నేత్రములు. అగ్నివలె  నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది. 

నీ తేజస్సులో ఈ జగత్తును సంతప్తమొనర్చుచున్నావు. 

అట్టి నిన్ను నేను చూచుచున్నాను.

|| 11-20 ||

శ్లో.  ద్యావాపృథివ్యోరిదమన్తరం హి

వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః|

దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం

లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్.

తే.గీ. దివిమొదలుగ నంతటనిటు భువివరకును

కలుగునాకాశమున నిండి కలిగితీవె,

అద్భుతంబు, భీకరమయి యలరు నిన్ను

జూచి ముల్లోకముల్ భీతి జొక్కె గృష్ణ.

భావము.

ఓ మహాత్మా! దివి నుండి భువి వఱకు గల అంతరిక్షమునం దంతటను 

అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవై యున్నావు. అధ్బుతమైన నీ 

భయంకరరూపమును చూచి ముల్లోకములును గడగడలాడుచున్నవి.

జైహింద్.

22, ఆగస్టు 2022, సోమవారం

కిరీటినం గదినం చక్రిణం చ ...11 - 17...//.. త్వమక్షరం పరమం వేదితవ్యం , , .11 - 18,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

0 comments

 జైశ్రీరామ్.

|| 11-17 ||

శ్లో.  కిరీటినం గదినం చక్రిణం చ

తేజోరాశిం సర్వతో దీప్తిమన్తమ్|

పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమన్తాద్

దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్.

తే.గీ.  గదను, చక్రమును, కిరీట ము ధరియించి

యంతటను తేజ వారాశి నమర నిల్పి

యున్న నిను గాంచుచుంటిని, కన్నుల నిను

గాంచజాలని తేజంబు కలిగితివిగ.

భావము.

హే విష్ణో! కిరీటమును, గదను, చక్రమును ధరించి, అంతటను 

తేజఃపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. 

ప్రజ్వలితాగ్నివలెను, జ్యోతిర్మయుడైన సూర్యునివలెను 

వెలుగొందుచున్న నీ అప్రమేయరూపము దుర్నిరీక్ష్యమై యున్నది.

|| 11-18 ||

శ్లో.  త్వమక్షరం పరమం వేదితవ్యం

త్వమస్య విశ్వస్య పరం నిధానమ్|

త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా

సనాతనస్త్వం పురుషో మతో మే.

తే.గీ. అక్షరుం డవవేద్యుడ వాదరువువు

లోకముల కవ్యయుండవు, లోక ధర్మ 

రక్షకుండవును, సనాతనాక్షయుడవు

గ తలతును నేను నిన్ను భోగ శయనుండ!

భావము.

పరమ - అక్షరస్వరూపుడవైన పరబ్రహ్మపరమాత్మవు నీవే, కనుక 

అందరికిని తెలుసుకొనదగినవాడవు. ఈజగత్తునకు నీవే పరమాశ్రయుడవు. 

సనాతన ధర్మరక్షకుడవు. నీవు అవ్యయుడవు. అని నా విశ్వాసము.

జైహింద్.

20, ఆగస్టు 2022, శనివారం

శ్రీవిజయలహరి వినాయక కౌతం నాట్యం

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

భరత స్వాతంత్ర్య వజ్రోత్సవాలులో రవీంద్రభారతిలో చింతా శ్రీవిజయలహరి, మాన్వ...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా రవీంద్రభారతిలో నిన్న జరిగిన కార్యక్రమంలో చిరంజీవి శ్రీవిజయలహరి కూచిపూడి నాట్యమునకు బ్రహ్మశ్రీ మాడుగున నాగఫణిశర్మగారి చేతులమీదుగా జ్ఞాపికనందుకొనుచున్న చిత్రము.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

నిన్నను శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భముగా రవీంద్రభారతిలో పోతనభాగవత పురస్కార సభలోబ్రహ్మశ్రీ నగఫణిశర్మ గారి ఉపన్యాసంలో భాగంగా నా ప్ర స్తా వన

0 comments

 జైశ్రీరామ్.

బ్రహ్మశ్రీ నాగఫణి శర్మ మహోదయులకు నాపై ఉన్న అవ్యాజానురాగమునకు 

హృదయపూర్వక 

ధన్యవాద పూర్వక నమస్సులు.

జైహింద్.

శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భముగా నిన్నను రవీంద్రభారతిలోజరిగిన కార్యక్రమంలో మా మనుమరాలు చిరంజీవి శ్రీ విజయ లహరి చేసిన కూచిపూడి నాట్యమ్.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.

భాగవత జయంత్యుత్సవములు 2022 । Bhagavata Jayanti 2022

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

శ్రీకృష్ణాష్టమి సందర్భముగా నిన్న ధర్మపురి క్షేత్రంలో జరిగిన కోలాటం పోటీలలీ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన శ్రీ మాచవోలు శ్రీహరరావు, శ్రీ ధనికొండరవిప్రసాద్ గారు నిర్వాహకురాలు శ్రీమతి సతుఅవాణి చేసత్కరింపబ్డుచున్న ఛాయాచిత్రం.

0 comments

 జైశ్రీరామ్.
శ్రీకృష్ణాష్టమి సందర్భముగా నిన్న ధర్మపురి క్షేత్రంలో జరిగిన కోలాటం పోటీలలీ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన శ్రీ మాచవోలు శ్రీహరరావు, శ్రీ ధనికొండరవిప్రసాద్ గారు నిర్వాహకురాలు శ్రీమతి సతుఅవాణి చేసత్కరింపబ్డుచున్న ఛాయాచిత్రం.

జైహింద్.

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భముగా రవీంద్రభారతి చిన్న సమావేశమందిర వేదికపై మా పౌత్రి చిరంజీవి చింతా శ్రీవిజయలహరి ప్రదర్శించిన కూచిపూడి నృత్యప్రదర్శన.

0 comments

 

జైశ్రీరామ్.
సహృదయులయిన మీ అందరి ఆశీస్సులూ ఫలించి
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భముగా రవీంద్రభారతి చిన్న సమావేశమందిర వేదికపై మా పౌత్రి చిరంజీవి చింతా శ్రీవిజయలహరి ప్రదర్శించిన కూచిపూడి నృత్యప్రదర్శన.
నన్ను అభిమానంతో ఆదరించే మీ అందరికీ నా ధన్యవాద్ములు.
జైహింద్.

నిన్నను శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంలో నాపౌత్రి చిరంజీవి చింతా శ్రీవిజయలహరి , చిరంజీవి మాన్వితాసాయి చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన చిత్రమాలిక.

1 comments

 జైశ్రీరామ్.
నిన్నను శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంలో నాపౌత్రి చిరంజీవి చింతా శ్రీవిజయలహరి , చిరంజీవి మాన్వితాసాయి చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన చిత్రమాలిక.
లక్షీదేవిగా మా మనుమరాలు, కృష్ణుడుగా మాన్వితాసాయి.

జైహింద్.

పశ్యామి దేవాంస్తవ దేవ ...11 - 15...//..అనేకబాహూదర వక్త్ర , , .11 - 16,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

0 comments

  జైశ్రీరామ్.

|| 11-15 |||

శ్లో.  పశ్యామి దేవాంస్తవ దేవ దేహే

సర్వాంస్తథా భూతవిశేషసఙ్ఘాన్|

బ్రహ్మాణమీశం కమలాసనస్థ-

మృషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్.

తే.గీ. నీ విరాట్రూపమందున నేను కంటి

ప్రాణి కోటిని, బ్రహ్మను, భస్మధరుని,

దేవతాళిని, ఋషులను, దివ్యమైన 

పాములన్, గృష్ణ! మదిలోన భ్రాంతి తొలగె.

భావము.

ఓ దేవాదిదేవా! నీ విరాట్-రూపమునందు సకల దేవతలను, 

నానావిధప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన 

శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచున్నాను.

|| 11-16 ||

శ్లో.  అనేకబాహూదర వక్త్రనేత్రం,

పశ్యామి త్వాం సర్వతోऽనన్తరూపమ్|

నాన్తం న మధ్యం న పునస్తవాదిం

పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప.

తే.గీ.  నీదు బాహువు లుదరముల్, నీదు ముఖము

లును, నయనము లనంతముల్, ఘనతరమగు

నీదు విశ్వతోముఖ రూపంబు నేగనదగ

నాదిమధ్యాంత రహిత! నన్నాదుకొనుము.

భావము.

ఓ విశ్వేశ్వరా! విశ్వరూపా! నీ బాహువులు, ఉదరములు, ముఖములు, 

నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంతరూపము సర్వతోముఖముగ 

విలసిల్లుచున్నది. నీవు ఆదిమధ్యాంతరహితుడవు. మహత్వ పూర్ణమైన

 నీ దివ్యరూపమునకు ఆది మధ్యాంతములను తెలిసికొనలేకున్నాను.

జైహింద్.

19, ఆగస్టు 2022, శుక్రవారం

తత్రైకస్థం జగత్కృత్స్నం ...11 - 13...//..తతః స విస్మయావిష్టో , , .11 - 14,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

0 comments

 జైశ్రీరామ్.

|| 11-13 ||

శ్లో.  తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా|

అపశ్యద్దేవదేవస్య శరీరే పాణ్డవస్తదా.

తే.గీ. విశ్వరూపంబునన్ గాంచె వివిధములుగ

కలుగునన్నిటినొకచోటె కలవిగాను,

సృష్టిమొత్తంబునచటనే దృష్టిపెట్టి

కాంచె పార్ధుండు కృష్ణుని కరుణ వలన.

భావము.

అపుడు అర్జునుడు దేవదేవుడగు భగవానుని శరీరములోనే 

అనేక విధములుగా విభజింపబడిన సర్వ ప్రపంచమును 

ఒకేచోటనున్న దానినిగా చూచెను.

|| 11-14 ||

శ్లో.  తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనఞ్జయః|

ప్రణమ్య శిరసా దేవం కృతాఞ్జలిరభాషత.

తే.గీ.  విస్మయము పొంది పార్థుడు విశ్వరూప

మును గని పులకితాంగుడై ప్రణతి చేసె

తాను సాష్టాంగముగ భక్తి తత్పరుడయి,

కృష్ణున కపుడు, ధన్యత, కీర్తి బడసి.

భావము.

పిమ్మట ధనంజయుడు విస్మయముతో పులకాంకితదేహుడై 

భగవానునికి సాష్టాంగ ప్రణామము చేసి అంజలి బద్ధుడై ఇట్లనెను.

జైహింద్.

నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భముగా మీకు నా శుభాకాంక్షలు.

0 comments

జైశ్రీరామ్.

 ఓం నమో భగవతే వాసుదేవాయ.

నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భముగా మీకు నా శుభాకాంక్షలు.

శా. శ్రీకృష్ణుండు దయార్ద్ర చిత్తుఁడు, జగచ్ఛేయంబు వాంఛించు స

ల్లోకోత్తంసులనాదరించుచును ముల్లోకంబులందున్న త

ల్లోకోత్తంసులఁ గాచుచుండు శుభసుశ్లోకార్థసంపత్తితో

మీకున్ దక్కుత తద్విశిష్ఠ ఫలముల్ మేల్గాంచుడెల్లప్పుడున్.

జైహింద్.

18, ఆగస్టు 2022, గురువారం

దివ్యమాల్యామ్బరధరం ...11 - 11...//..దివి సూర్యసహస్రస్య , , .11 - 12,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

0 comments

 జైశ్రీరామ్.

|| 11-11 ||

శ్లో.  దివ్యమాల్యామ్బరధరం దివ్యగన్ధానులేపనమ్|

సర్వాశ్చర్యమయం దేవమనన్తం విశ్వతోముఖమ్.

తే.గీ.  దివ్యమాల్యాంబరములతో దివ్య గంధ

లేపనముతోడవిశ్వవక్త్రోపభాస

మై యలరె విశ్వరూపంబు మహితముగను.

కాంచెనర్జునుడత్తరి ఘనతరముగ.

భావము.

దివ్యములైన పుష్పమాలికలను, దివ్యములైన వస్త్రములను 

ధరించి, దివ్య సుగంధ చందనాదుల పూతలతో నిండి, 

పరమాశ్చర్యకరమై, మహాకాంతివంతమై, అనంతమై,

 విశ్వతోముఖమై భగవానుని అద్భుత విశ్వరూపము విలసిల్లుచుండెను.

|| 11-12 ||

శ్లో.  దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా|

యది భాః సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః.

తే.గీ.  వేయిసూర్యులాకాశన వెలుగులీన

నెంత తేజబు కలుగునో యంత తేజ

మీ విష్ణు తేజమునెంచి చూడ

సాటి రాదు, గణింపగ జఖతిలోన.

భావము.

ఆకాశమున ఒక్కసారిగా హఠాత్తుగా సహస్ర సూర్యులు 

ప్రకాశించినచో ఎంతటి చూడశక్యముకాని కాంతి కలుగునో 

అంతటి అపారకాంతికి ఈ భగవానుని కాంతి సమానమగును.

జైహింద్.

17, ఆగస్టు 2022, బుధవారం

చింతారామకృష్ణారావు గారిచే ప్రశంసా రత్నావళి

0 comments

జైశ్రీరామ్.

శ్రీరస్తు.                        శుభమస్తు            అవిఘ్నమస్తు.

బ్రహ్మశ్రీ పండరి రాధాకృష్ణగారికి

సమర్పించిన

పంచరత్నములు.

శా.  శ్రీమన్మంగళ పండరీ కులజ! రాశీభూత సచ్చేతనో

ద్ధామా! సన్నుత భక్తి సాధకుఁడ! రాధాకృష్ణ! సద్భాసుఁడా!

శ్రీమాతాపరమేశ్వరప్రభలు చేరెన్ మిమ్ము మీ భక్తిచే,

ధీమంతా శుభ సంహతిన్ బడసి ధాత్రిన్ వెల్గుమా ప్రీతితో.

 

ఉ.  దేవుని నిత్యమున్ గొలుచు దీక్ష వహించితొ? దీప్తిఁ గొల్పగా

భావనఁ జేసి సత్ కవుల పద్యసుమాళిని దేవదేవు సం

సేవలకై రచించునటు చిత్తము పెట్టి రచింపఁ జేసి, శో

భావహమై వెలుంగుదువొ? భవ్యుఁడవీవు, శుభాస్పదా! సుధీ!

 

ఉ.  లక్షకు మించుపద్యములు లక్ష్యముతో రచియింపఁ జేసి, స

ల్లక్షణ లక్షితుండవయి, ధర్మనిబద్ధత నొప్పుచుంటివా?

మోక్షము గొల్పు సత్కవిత పూజ్య కవీశులకంచు నెంచి, యా

రక్షణమార్గమున్ గొలిపి, రాజిలఁ జేయుచునుంటివో భువిన్. 

 

శా.  నీ సత్ప్రేరణ పద్యపుష్పచయమున్ నిత్యంబు కల్పించు, 

       ద్ధ్యాసన్ సత్ కవులద్భుతంపు కవితల్ తత్త్వజ్ఞులై వ్రాయుచున్

       భాషాయోషి సుసేవనాపరులుగా భాసింతురిద్ధాత్రిపై,

      నీ సత్ సేవలు భక్తి సాధనమునన్ నిల్చుంధరిత్రిన్ సదా.

 

ఉ.  మంగళ భావనాభరిత మాన్యమహోదయ! నీకు నిత్యమున్

మంగళముల్ రచించు వరమంగళ దేవత వాసరాంబ, స

న్మంగళముల్ కవీశులకు, మంగళముల్ వర గాయకాళికిన్,

మంగళ భక్తి సాధక సమస్త జనాళికి మంగళంబగున్.

స్వస్తి.

జైహింద్.


ఏవముక్త్వా తతో రాజన్మహా ...11 - 9...//.. అనేకవక్త్ర నయన మనేకాద్భు , , .11 - 10,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

0 comments

 జైశ్రీరామ్.

సఞ్జయ ఉవాచ.

భావము.

సంజయుడిట్లు పలికెను.

|| 11-9 ||

శ్లో.  ఏవముక్త్వా తతో రాజన్మహాయోగేశ్వరో హరిః|

దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్.

తే.గీ. వినుము ధృతరాష్ట్ర! కృష్ణుడీవిధము పలికి

చూపె తన విశ్వరూపమున్, శుభనిధాన

దివ్య మహిమాన్వితంబైన భవ్యమయిన

విశ్వరూపంబు పార్థుడు ప్రీతిని గనె.

భావము.

ఓ ధృతరాష్ట్ర మహారాజా! మహా యోగీశ్వరుడైన భగవానుడిట్లు 

చెప్పిన పిమ్మట సర్వోత్తమమైన ఐశ్వర్యరూపమైన తన మహిమాన్విత 

విశ్వరూపమును పార్థునకు చూపెను.

 || 11-10 ||

శ్లో.  అనేకవక్త్ర నయన మనేకాద్భుత దర్శనమ్|

అనేక దివ్యాభరణం దివ్యానేకోద్య తాయుధమ్.

తే.గీ. వక్త్రములు కండ్లనేకముల్, ప్రభలనీను

దివ్యమౌయలంకారముల్, భవ్యపు మహి

తాయుధంబులనొప్పి, మహాద్బుతముగ

నొప్పు విశ్వరూపము జూపె నప్పుడటను.

భావము.

అనేక వక్త్రములతో, అనేక నేత్రములతో, అనేక అద్భుత 

దర్శనములతో, అనేక దివ్యాభరణములతో, దివ్యాయుధములతో

 భగవానుని ఘన దివ్యరూపము శోభిల్లుచుండెను.

జైహింద్.

16, ఆగస్టు 2022, మంగళవారం

బ్రహ్మశ్రీ పండరి రాధాకృష్ణగారికి భక్తి సాధన పురస్కారమ్. పంచరత్నములు.

0 comments

 

శ్రీరస్తు.                        శుభమస్తు            అవిఘ్నమస్తు.

బ్రహ్మశ్రీ పండరి రాధాకృష్ణగారికి భక్తి సాధన పురస్కారమ్.

పంచరత్నములు.

శా.  శ్రీమన్మంగళ పండరీ కులజ! రాశీభూత సచ్చేతనో

ద్ధామా! సన్నుత భక్తి సాధకుఁడ! రాధాకృష్ణ! సద్భాసుఁడా!

శ్రీమాతాపరమేశ్వరప్రభలు చేరెన్ మిమ్ము మీ భక్తిచే,

ధీమంతా శుభ సంహతిన్ బడసి ధాత్రిన్ వెల్గుమా ప్రీతితో.

.  దేవుని నిత్యమున్ గొలుచు దీక్ష వహించితొ? దీప్తిఁ గొల్పగా

భావనఁ జేసి సత్ కవుల పద్యసుమాళిని దేవదేవు సం

సేవలకై రచించునటు చిత్తము పెట్టి రచింపఁ జేసి, శో

భావహమై వెలుంగుదువొ? భవ్యుఁడవీవు, శుభాస్పదా! సుధీ!

.  లక్షకు మించుపద్యములు లక్ష్యముతో రచియింపఁ జేసి,

ల్లక్షణ లక్షితుండవయి, ధర్మనిబద్ధత నొప్పుచుంటివా?

మోక్షము గొల్పు సత్కవిత పూజ్య కవీశులకంచు నెంచి, యా

రక్షణమార్గమున్ గొలిపి, రాజిలఁ జేయుచునుంటివో భువిన్.

శా.  నీ సత్ప్రేరణ పద్యపుష్పచయమున్ నిత్యంబు కల్పించు, 

ద్ధ్యాసన్ సత్ కవులద్భుతంపు కవితల్ తత్త్వజ్ఞులై వ్రాయుచున్

భాషాయోషి సుసేవనాపరులుగా భాసింతురిద్ధాత్రిపై,

నీ సత్ సేవలు భక్తి సాధనమునన్ నిల్చుంధరిత్రిన్ సదా.

.  మంగళ భావనాభరిత మాన్యమహోదయ! నీకు నిత్యమున్

మంగళముల్ రచించు వరమంగళ దేవత వాసరాంబ,

న్మంగళముల్ కవీశులకు, మంగళముల్ వర గాయకాళికిన్,

మంగళ భక్తి సాధక సమస్త జనాళికి మంగళంబగున్.

సద్విధేయుఁడు  ….  చింతా రామకృష్ణారావు.

తేదీ.  16 – 8 - 2022