గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జనవరి 2020, శుక్రవారం

రథ సప్తమి స్నాన విధానము.

0 comments

జైశ్రీరామ్.
యద్యత్ జన్మ కృతం పాపం
మయా సప్తమజన్మసు
తన్మే రోగంచ శోకంచ
మాకరీ హన్తు సప్తమి
ఏ తత్  జన్మ కృతం పాపం
యచ్చ జన్మాన్తరార్జితం
మనోవాక్కాయజo యచ్చ
జ్ఞాతాజ్ఞేతేచ   ఏ పునః
ఇతి సప్త విధం పాపం
స్నానాన్మే సప్త సప్తికే
సప్త వ్యాధి సమాయుక్తo
హారమాకరీ సప్తమి

రేపు రధ సప్తమి పుణ్య తిథి కావున , ఉదయం ఐదు గంటలకి శిరః స్నానము చేయునపుడు,
నెత్తి పై జిల్లేడు ఆకు, ఒక రేగుపండు ఉంచుకుని, పైన శ్లోకములు చెప్పుచు స్నానము చేయవలెను.
సమంత్రక స్నానం చేయని స్నానము కాకి స్నానమే అగును. దానికి విలువ ఉండదు. ఏడు జన్మలలో ఏడు రకముల పాపముల వలన మనకి కలుగు ఏడు విధములైన మహా వ్యాధులును, దురితములను ఓ సప్తమసప్తమీ! నివారింతువు గాక అని పై శ్లోక తాత్పర్యము
జైహింద్.

లలితాదిత్య సైనిక్ పురి (౦౩ . ౦౧ . ౨౦౨౦.) అష్టావధానం పూర్తిగా.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

30, జనవరి 2020, గురువారం

సరస్వతీ కవచమ్.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఈ రోజు శ్రీపంచమి. ఈ సందర్భముగా మీకు శుభాకాంక్షలు.
శ్రీ సరస్వతీ కవచం

ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా శిరోమేపాతు సరస్వతః.
శ్రీం వాగ్దేవతాయై స్వాహా ఫాలం మే సర్వదా వతు.
ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతి శ్రోత్రే పాతు నిరస్తరమ్.
ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా నేత్రయుగ్మం సదావతు.
ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసాం మే సర్వదా వతు.
ఓం హ్రీం విద్యాధిష్ఠాతృ దేవ్యై స్వాహా ఓష్ఠం సదా వతు.
ఐం ఇత్యేకాక్షరో మంత్రో మమ కంఠం సదావతు.
ఓం శ్రీం హ్రీం పాతుమే గ్రీవాం స్కంధౌమే శ్రీం సదా వతు.
ఓం హ్రీం విద్యాధిషాంతృ దేవ్యై స్వాహా వక్షః సదా వతు
ఓం హ్రీం హేతి మమ హస్తౌ సదావతు.
ఓం వాగధిష్ఠాతృ దేవ్యై స్వాహా సర్వం సదావతు.
ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదా వతు.
ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహాగ్నిరుదిశి రక్షతు.
ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రో నైరృత్యాం సర్వదావతు.
ఓం ఐం జిహ్వాగ్ర వాసిన్యై స్వాహా మాంవారుణే వతు.
ఓం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సదావతు.
ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాముత్తరేవతు.
ఐం సర్వశాస్త్ర వాసిన్యై స్వాహేశాన్యాం సదావతు.
ఓం హ్రీం సర్వ పూజితాయై స్వాహా చోర్ధ్యంసదావతు
హ్రీం పుస్తకవాసిన్యై స్వాహాధో మాం సదావతు.
ఓం గ్రంథ బీజ స్వరూపాయై స్వాహా ఆమం సర్వదావతు.

అక్షర దోషాలుండవచ్చు. సరి చూసుకోవలసినదిగా మనవి.🙏🏻
చింతా రామకృష్ణారావు.
జైహింద్.

29, జనవరి 2020, బుధవారం

వసంత పంచమి. శుభాకాంక్షలు

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

28, జనవరి 2020, మంగళవారం

శతావధాని శ్రీ లలితాదిత్య సైనిక్ పురి అష్టావధానము.

0 comments

జైశ్రీరామ్
జైహింద్.

27, జనవరి 2020, సోమవారం

దర్శనమ్ శర్మ గారి నిర్వహణలో సైనిక్ పురిలో ౦౩ . ౦౧ . ౨౦౨౦.ని లలితాదిత్యచే అద్భుతంగా చేయబడింది.

0 comments

జైశ్రీరామ్
జైహింద్.

26, జనవరి 2020, ఆదివారం

సర్వ సత్తాక గణతంత్ర సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు

0 comments

జైశ్రీరామ్.
🙏🏻ఓం నమో నారాయణాయ🙏🏻

శుభోదయమ్.💐
ఈ రోజు
 భారతీయులమైన మనకు
సర్వ సత్తాక గణతంత్రసామ్రాజ్య దానోత్సవము.
శ్రీమంతమైన భరతమాతకు నమస్కరిస్తూ మన భారతీయులందరికీ అభినందనలు తెలుపుచున్నాను.💐

భారతదేశ కీర్తి పరివర్ధన చేయు మహానుభావులన్

ధీరతనొప్పు సైనిక సుధీవరకోటిని, సత్కవీంద్రులన్

శ్రీరమణీయ సద్గుణ కృషీవలురన్ మదినెంచి మ్రొక్కెదన్.

వీరి మహత్వ సేవలు భువిన్మన భారతికండకావలెన్.

సద్విధేయుఁడు,
చింతా రామకృష్ణారావు.
🇧🇴🙏🏻
జైహింద్.

అనంత సాగరంలో గల సరస్వతీ దేవాలయ చరిత్ర.

0 comments

 జైశ్రీరామ్.
ఈ . టీ. వీ. సౌజన్యంతో.
జైహింద్.

25, జనవరి 2020, శనివారం

సాధన....శ్రీ రంగావజ్ఞల మురళీధరరావు.

0 comments

జైశ్రీరామ్.
సాధన.... శ్రీ రంగావజ్ఝల మురళీధరరావు.
              "శివోఽహమ్" ఉపదేశం లేని మంత్రం. ఉపాసన‌. జపం. తపం. తపస్సు తాపత్రయాదులను ఉపసంహరింపజేస్తుంది. అపుడు దుఃఖాలు ఉండవు. అదే నిర్వాణము. అపుడు అంతఃకరణం శూన్యం అవుతుంది.నిష్క్రియం అవుతుంది.
     మానవుని దృష్టి నవరత్నాలమాలపై  పడియుంటుంటుంది. దానిలో ఒక్కొక్క రత్న వైభవాన్ని చూస్తుంటాడు. ఆ నవరత్నమాలయే నవరంధ్రదేహం. దానిని చూసి మానవుడు మురిసిపోతుంటాడు. భౌతికానందంతో తల్లీనమవుతుంటాడు. దానికి ఉన్నవన్నీ కన్నాలే. అని గ్రహించడంలేదు. కానీ మెరిసేదంతా బంగారం కాదు. మనసు బయట విషయాలతో రమిస్తుంటుంది. వేంటనే దానిని విరమింపచేయాలి. రోజూ మనకు తెలియకుండానే 21,600 సార్లు "సోహమ్" జపిస్తున్నాం. అది అజపాగాయత్రి. శంకరులే మనగురువుగా భావించాలి. "సోహమ్" అదెక్కడిదా!
" ఓమ్" కారమే. అది శబ్దబ్రహ్మ. సృష్టికి మూలం. పరమాత్మ రూపం. సచ్చిదానందం.
 " సోహమ్"-"సః+అహమ్= సోహమ్" అదే "శివోహమ్".

         ఇపుడు నిర్వాణషట్కము చదువుతున్నాంకదా! ఆత్మయే,"చిదానందరూపః శివోహమ్ శివోహమ్" అని 21600 సార్లు నిరంతరం జపించాలి. అది హృదయం లో నిరంతరం వెలిగే శాశ్వత జ్యోతి.
         "జ్యోతిషామపి తద్జ్యోతిః తమసః పరముచ్యతే
          జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య తిష్ఠతి"
 జ్యోతులనే ప్రకాశింపఁజేసే ఆ జ్యోతి అజ్ఞానాంథకారానికి అతీతం. జ్ఞానస్వరూపం.
దానిపై దృష్టి ఉంచి, జపిస్తూ ఉండాలి. దేహం పడిపోయినా పవిత్రంగా ఉంచుతుంది. "అదీ జప మహిమ" అని చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామివారి సందేశం.
     1.ఆ శ్వాస అప్రయత్నం. దానికి ప్రయత్నించి, మనసును తోడు చేయాలి.
     2.బుద్ధి ఏదో ఆలోచిస్తుంది. దానిని కూడా నిరంతరం శివమయం చేయాలి.     
     3. అహం జ్వలిస్తే " శివోహమ్" జపించాలి. "శివోహమ్" అనుకోవాలి. దానిని కూడా నిరంతరం శివమయం చేయాలి.
     4.చిత్తం జ్ఞాపకాల పుట్ట. జ్ఞాపకాలలో శివుని నింపుకోవాలి.
         ఇదీ సాధన. అపుడు ఇంద్రియార్థాలపై ఉన్న మనసుకు శబ్దం వినిపించినా మనసు స్పందించదు. బుద్ధి స్పందించదు. లోపల మనుజుని నడిపే అంతఃకరణమనే ఇంద్రియాలు బయటకు చూస్తున్నా అంతఃకరణం"శివోహమ్" అంటుంది. నేను శివుడను. ఆత్మ స్వరూపుడను అని అంతఃకరణాదులు బయటకు చూస్తున్నా వాటిలో రమించవు. శివ రూప ఆత్మలింగంలో రమిస్తాయి. క్రియలు ఆచరిస్తున్నా భగవాన్ రమణులవలె విదేహస్థితిలో ఉండగలుగుతాం.
    "యస్తు అవిజ్ఞావాన్ భవతి, అమనస్కః సదా - శుచిః. న స తత్ పదమాప్నోతి సంసారంచాధిగచ్ఛతి" ఎవరు బుద్ధిమంతుడో, పవిత్రుడో, అనన్యమనస్కుడో అతడు పరమపదాన్ని పొందుతాడు.
  1.అపుడు "శబ్ద,స్పర్శ,రూప,రస,గంధాలు" బయట ఆకర్షిస్తున్నా శూన్యంగా, నిశ్శబ్దంగా, నిర్మలంగా ఉన్న మనసాదులపై ప్రభావం ఉండదు. వినిపించినా, కనిపించినా మనసులో స్పందన ఉండదు. నిర్వికారస్పందన ఏర్పడుతుంది.
       
     ఆత్మదర్శనం కోరే సాధకుడు  వాక్కును మనస్సులో ఏకీకృతం చేయాలి. వాక్కు అగ్ని. అగ్ని జ్ఞానానికి సంకేతం. మనసు"చంద్రమా మనసో జాతః" అని మనసు చంద్రుడు. మనసుకు సంకేతం. మనసు వాయువుకు సంకేతం.- కేనోపనిషత్. "అగ్నీ సోమాత్మకం ఇదమ్ జగత్" అని వేదం. అగ్ని, చంద్రుల కలయికయే జగత్తు. వాక్కును మనస్సులో ఏకీకృతం చేయాలి."యచ్ఛేత్ వాఙ్మనసీ ప్రాజ్ఞః……" కఠోపనిషత్….

                                    ఏకీకృతం చేయడం

     మనస్సు             బుద్ధి                చిత్తము                 అహంకారం
      చెవి                 నాలుక.             ముక్కు                     కన్ను

    మనసు > నాలుక.  బుద్ధి >చెవి   చిత్తము> కన్ను   అహంకారం>ముక్కు
ఇలా నాలుగంచెల సోపానంలో బ్రహ్మశ్రీ నేతి సూర్యనారాయణశర్మగారు పేర్కొన్నట్లు ఉపాసన" శివోహమ్" మంత్రజపం చేస్తుండాలి.
       ఇది పరస్పరము కుండలినీ సర్పాలు మెలివేసినట్లుగా సాధన భుజంగ గమనంలా సాగుతుంది.
       మనసుకంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ, ఆత్మ కంటే, అవ్యక్తం, అవ్యక్తం కన్నా పరమాత్మ బలీయాలు. పరమాత్మ అనగా శాంతస్థితి." అదే శివత్వం. " శేరతే యస్మిన్ స శివః - శామ్యతి పరమానందరూపత్వాత్ స శివః"
""యచ్ఛేత్ వాఙ్మనసీ ప్రాజ్ఞః తద్ యచ్ఛేత్ జ్ఞాన ఆత్మని ఆత్మానం మహతి నియచ్ఛేత్ తద్ యచ్ఛేత్ శాంత ఆత్మని" కనుక మనసును పట్టుకుంటే, ఆత్మదృష్టి, అంతర్ముఖ ప్రయాణం, "నేనుఎవరు" అని లోపలకు చూడడం సులభం.
 2. శబ్దస్పర్శాదుల అనగా పంచ తన్మాత్రలు, మౌనం వహిస్తాయి.
 3.  తన్మాత్రల వెంట అనుసరిస్తూ పంచభూతాలు మౌనం దాల్చుతాయి,
 4.పంచభూతాల నుండి సాత్వికాంశాలనుండి జనించిన జ్ఞానేంద్రియాల పీకులాట ఉండదు. 
 5.పంచభూతాల రాజసాంశాలనుండి పుట్టిన  కర్మేంద్రియాల ఊసు ఉండదు.
 6. స్థూల, సూక్ష్మ ఇంద్రియాలు ప్రభావంగల , శరీరాలు బాహ్యవిషయాలపై స్పందించవు. ఆత్మనే చూస్తూ, అంతఃకరణం చూస్తుంది, రమిస్తూ, తపస్తూ తాపత్రయాలు లేని నిర్వాణాన్ని జీవుడు అందుకుంటాడు .త్రిగుణాల మాలిన్యం అంతరిస్తుంది. తద్వారా మాయను జయించగలుగుతాం.
  అందుకే శంకరులు దేహాత్మలతో ముడిపడిన దేహం నేను కాదని, ఆత్మను దేహంకంటే భిన్నమయిన "నేను" ను జీవుడు సందర్శిస్తాడు. జ్ఞానభూమికయే  ఆత్మ. దేహం అనుకుంటారు. దేహం పొందే ఆనందాలకు మూలం ఆత్మయే.
"దేహబుద్ధ్యా భవద్దాసః, జీవబుద్ధ్యా త్వదంశకః
 ఆత్మబుద్ధ్యా త్వమేవాహం, ఇతి మే నిశ్చితా మతిః"
 ఆంజనేయ స్వామి శ్రీ రామచంద్రునితో పలికిన మాటలివి.
"ఆత్మదృష్టి తో చూస్తే శ్రీ రాముడు, ఆంజనేయస్వామి ఇరువురూ ఒకటే. ఎపుడైతే దేహాన్ని వీడుతామో అపుడు జీవుడు శివుడే. అదే " శివోహమ్".
 కావున అందరూ దేహమే నేననే భావాన్ని విడనాడాలి. దివ్యాత్మను దర్శించాలి.
 "దేహానికి ప్రాణం, హృదయస్థానమైన అంతఃకరణాన్ని పట్టుకున్నారు శంకరస్వామి. అందులోనూ ఆయువుపట్టు అయిన" మనసు" తో శ్రీ కారం చుట్టారు. అదే తత్త్వం గల"నిర్వాణదశకం( 'న' అని నిషేధంతో ఆరంభం.) నిర్వాణమంజరి (అహం నామరో...మొదలు)" ని అలా ప్రారంభించారు.
     ఇందు భౌతిక, మానసిక వ్యాధులకు , ఔషధంగా "చిదానందరూపః శివోహమ్ శివోహమ్" మంత్రాన్ని, త్ర్యక్షరి మంత్రాన్ని ఉపదేశంలేని ఉపాసనగా అందించారు.
"చిదానందరూపః శివోహమ్ శివోహమ్" అహమంటే అదే స్థితిలో ఉంటాం.
 "కశ్చిత్ ధీరః ప్రత్యగాత్మానమ్ ఐక్షత్ ఆవృత్త చక్షురమృతత్వమిచ్ఛన్"
కఠోపనిషత్తు.

"అంతవంత ఇమే దేహాః"అని దేహం రాలిపోయేదే.ఆత్మ శాశ్వతము. కనుక" "యుద్ధాయ కృతనిశ్చయః" ఆత్మ దర్శనమునకై తీవ్రప్రయత్నం చేయాలి.

     ఇంద్రియ నిగ్రహం కలిగి యుండాలి. బయట కనిపించే విషయాలనుండి చిత్తాన్ని మరలించాలి.మోక్షమునుగూర్చి తీవ్రాభిలాషయుండాలి. అలా ప్రయత్నించేవాడు ధీరుడు. జీవాత్మ లోని ప్రత్యగాత్మను దర్శించుకోగలడు. సాధన ద్వారా ఆత్మానుభూతి చెందాలి. అది అనుభవస్థితియే. ఈ " మనోబుద్ధ్యహంకార చిత్తాని…." అనే శ్లోకం సూక్ష్మ శరీర విషయాలే అన్నీ. సూక్ష్మ శరీరమే స్థూలశరీరాన్ని నడిపిస్తుంది. కనుక అంతఃకరణాలను,జ్ఞానేంద్రియాలను, సూక్ష్మభూతాలను శమింపజేయాలి,ఆత్మోన్ముఖంచేయాలి. బాహ్య చింతన కలిగినపుడల్లా "చిదానందరూపః శివోహమ్ శివోహమ్" అని స్మరిస్తూ సాధన నిరంతరం ఆత్మాను సంధానం చేయాలి. ఇది సందేశం.

వీరి... శివోఽహమ్ గ్రంథంలో ఈ పై విషయము వివరించి యున్నారు. ఈ గ్రంథముపై నా స్పందన్
శివోఽహమ్....ఒక సిద్ధాంత గ్రంథము.

మ. పరమానంద మనోజ్ఞ
జీవ విలసద్బ్రహ్మైక్య సిద్ధాంతమున్

గరుణాంభోనిధి, వెల్వరించిరిట
రంగావజ్ఝలాఖ్యాన్వయుల్

మురళీధారి సునామధేయులు శుభంబుల్ గొల్ప జిజ్ఞాసతో

నరయంజేయననంత తేజము,
శివోఽహమ్మంచునుద్గ్రంథమున్.
🙏🏻
బుధజన విధేయుఁడు

చిత్రకవితా సమ్రాట్
చింతా రామకృష్ణారావు
జైహింద్.

24, జనవరి 2020, శుక్రవారం

సరస్వతీ మంత్రకల్పః.శ్రీమల్లిషేణాచార్యవిరచితః

0 comments

 జైశ్రీరామ్.
సరస్వతీ మంత్రకల్పః.
సరస్వతీమన్త్రకల్పః

అథ శ్రీమల్లిషేణాచార్యవిరచితః  సరస్వతీమన్త్రకల్పః ।

జగదీశం జినం దేవమభివన్ద్యాభిశఙ్గరమ్ ।
వశ్యే సరస్వతీకల్పం సమాసాయాల్పమేధసామ్ ॥ ౧॥

అభయజ్ఞానముద్రాక్షమాలాపుస్తకధారిణీ ।
త్రినేత్రా పాతు మాం వాణీ జటాబాలేన్దుమణ్డితా ॥ ౨॥

లబ్ధవాణీప్రసాదేన మల్లిషేణేన సూరిణా ।
రచ్యత్తే భారతీకల్పః స్వల్పజాప్యఫలప్రదః ॥ ౩॥

దక్షో జితేన్ద్రియో మౌనీ దేవతారాధనోద్యమీ ।
నిర్భయో నిర్మదో మన్త్రీ శాస్త్రే೭స్మిన్ స ప్రశస్యతే ॥ ౪॥

పులినే నిమ్నగాతీరే పర్చతారామసఙ్కులే ।
రమ్యైకాన్తప్రదేశే వా హర్మ్యే కోలాహలోజ్ఝితే ॥ ౫॥

తత్ర స్థిత్వా కృతస్నానః ప్రత్యూషే దేవతార్చనమ్ ।
కుర్యాత్ పర్యఙ్గయోగేన సర్వవ్యాపారవర్జితః ॥ ౬॥

తేజోవదద్వయస్యాగ్రే లిఖేద్ వాగ్వాదినీపదమ్ ।
తతశ్చ పఞ్చ శూన్యాని పఞ్చసు స్థానకేష్వపి ॥ ౭॥

ఓం వద వద వాగ్వాదినీ హ్రాఁ హృదయాయ నమః ।
ఓం వద వద వాగ్వాదినీ హ్రీఁ శిరసే నమః ।
ఓం వద వద వాగ్వాదినీ హూఁ శిఖాయై నమః ।
ఓం వద వద వాగ్వాదినీ హ్రౌఁ కవచాయ నమః ।
ఓం వద వద వాగ్వాదినీ హ్రః అస్రాయ నమః ।
ఇతి సకలీకరణ్ం విధాతవ్యమ్ ।

రేఫైర్జ్వలద్భిరాత్మానం దగ్ధమగ్నిపురస్థితమ్ ।
ధయాయేదమృతమన్త్రేణ కృతస్నానస్తతః సుధీః ॥ ౮॥

ఓం అమృతే !  అమృతోద్భవే !  అమృతవర్షిణి !
అమృతం శ్రావయ శ్రావయ  సం సం హ్రీం హ్రీం క్లీఁ
కలీఁ బ్లూఁ బ్లూఁ ద్రాం ద్రాం ద్రీం ద్రీం ద్రూం ద్రూం  ద్రావయ ద్రావయ స్వాహా ।

స్నానమన్త్రః । వినయమహా ।
ఓం హ్రీం పద్మయశసే యోగపీఠాయ నమః ।

పీఠస్థాపనమన్త్రః ।
పట్టకే೭ష్ఠదలామ్భోజం శ్రీఖణ్డేన సుగన్ధినా ।
జాతికాస్వర్ణలేఖిన్యా దూర్వాదర్భేణ వా లిఖేత్ ॥ ౯॥

ఓఙ్కారపూర్వాణి నమోన్తగాని శరీరవిన్యాసకృతాక్షరాణి ।
ప్రత్యేకతో೭ష్టౌ చ యథాక్రమేణ దేయాని తాన్యష్టసు పత్రకేషు ॥ ౧౦॥

బ్రహ్మహోమనమఃశబ్దం మధ్యేకర్ణికమాలిఖేత్ ।
కం కః ప్రభృతిభిర్వర్ణైర్వైష్టయేత్ తన్నిరన్తరమ్ ॥ ౧౧॥

కం కః,చం చః, టం టః, తం తః  పం పః, యం యః, రం  రః,
లం లః, వం వః, శం శః, షం షః,  సం సః, హం హః, ల్లం ల్లః,
క్షం క్షః, ఖం ఖః, ఛం ఛః, ఠం ఠః,  థం థః, ఫం ఫః,
గం గః,  జం జః, డం డః,  దం దః బం బః, ఘం ఘః,  ఝం ఝః,
ఢం ఢః,  ధం ధః,  భం భః,  ఙం ఙః,  ఞం ఞః, ణం ణః,
నం నః,  మం మః, ఏతాని కేసరాక్షరాణి ।

బాహ్యే త్రిర్మాయయా వేష్టయ కుమ్భకేనామ్బుజోపరి ।
ప్రతిష్ఠాపనమన్త్రేణ స్థాపయేత్ తాం సరస్వతీమ్ ॥ ౧౨॥

ఓం అమలే ! విమలే ! సర్వజ్ఞే ! విభావరి !
            వాగీశ్వరి ! జ్వలదీధితి ! స్వాహా

ప్రతిష్ఠాపనమన్త్రః ॥

అర్చయేత్ పరయా భక్త్యా గన్ఘపుష్పాక్షతాదిభిః ।
వినయాదినమో೭న్తేన మన్త్రేణ శ్రీసరస్వతీమ్ ॥ ౧౩॥

ఓం సరస్వత్యై నమః ।
వినయం మాయాహరివల్లభాక్షరం తత్పురో వదద్వితయమ్ ।
వాగ్వాదినీ చ హోమం వాగీశా మూలమన్త్రో೭యమ్ ॥ ౧౪॥

ఓం హ్రీఁ శ్రీఁ వద వద వాగ్వాదినీ స్వాహా । మూలమన్త్రః ।

యో జపేజ్జాతికాపుష్పైర్భానుసఙ్ఖ్యసహస్రకైః ।
దశాంశహోమసంయుక్తం స స్యాద్ వాగీశ్వరీసమః ॥ ౧౫॥

మహిషాక్షగుగ్గులేన ప్రతినిర్మితచణకమానసద్గుటికాః ।
హోమస్త్రిమధురయుక్తైర్వరదా೭త్ర సరస్వతీ భవతి ॥ ౧౬॥

దేహశిరోదృగ్నాసాసర్వముఖాననసుకణ్ఠహ్రన్నామి ।
పాదేషు మూలమన్త్రబీజద్వయవర్జితం ధ్యాయేత్ ॥ ౧౭॥

శ్వేతామ్బరాం చతుభుజాం సరోజవిష్టరస్థితామ్ ।
సరస్వతీం వరప్రదామహర్నిశం నమామ్యహమ్ ॥ ౧౮॥

సాఙ్ఖ్యభౌతికచార్వాకమీమాంసకదిగమ్బరాః ।
సౌగతాస్తే೭పి దేవి !  త్వాం ధ్యాయన్తి జ్ఞానహేతవే ॥ ౧౯॥

భానూదయే తిమిరమేతి యథా వినాశం
క్ష్వేడం వినశ్యతి యథా గరుడాగమేన ।
తద్వత్ సమస్తదురితం చిరసఞ్చితం మే
దేవి !  త్వదీయముఖదర్పణదర్శనేన ॥ ౨౦॥

గమకత్వం కవిత్వం చ వాగ్మిత్వం వాదితా తథా ।
భారతి !  త్వత్ప్రసాదేన జాయతే భువనే నృణామ్ ॥ ౨౧॥

సరస్వతీస్తవః ।
జపకాలే నమఃశబ్దం మన్త్రస్యాన్తే నియోజయేత్ ।
హోమకాలే పునః స్వాహా మన్త్రస్యాయం సదా క్రమః ॥ ౨౨॥

సవృన్తకం సమాదాయ ప్రసూనం జ్ఞానముద్రయా ।
మన్త్రముచ్చార్య సన్మన్త్రీ శ్వాసం ముఞ్చతి రేచనాత్ ॥ ౨౩॥

వాగ్భవం కామరాజం చ సాన్తం షాన్తేన సంయుతమ్ ।
బిన్ద్బోఙ్కారయుతం మన్త్రం గ్వే పురం తన్నిగద్యతే ॥ ౨౪॥

ఐం క్లీఁ దూ హ్సౌఁ నమః ।
శ్వేతైః పుష్పైర్భవేద్ వాచా శోణితైర్వశ్యమోహనమ్ ।
లక్షజాపేన సంసిద్ధిం యాతి మన్త్రం సహోమతః ॥ ౨౫॥

ఐం క్లీఁ హ్సౌఁ మన్త్రః ।
ఉష్మాణామాదిమం బీజం బ్రహ్మబీజసమన్వితమ్ ।
లాన్తం రాన్తేన సంయుక్తం మాయావాగ్భవబీజకమ్ ॥ ౨౬॥

స్వలాఁ హ్రీం ఐం సరస్వత్యై నమః ।
మన్త్రం జపతి యో నిత్యం జాతికాకుసుమైర్వరైః ।
రవిసఙ్ఖ్యసహస్రాణి స స్యాద్ వాచస్పతేః సమః ॥ ౨౭॥

సప్త లక్షాణి యో విద్యాం మాయామేకాక్షరీం జపేత్ ।
తస్య సిద్ధయతి వాగీశా పుష్పైరిన్దుసమప్రభైః ॥ ౨౮।
హ్రీం ఝం వం హ్వో జలభూబీజైర్నామ యత్ తత్ స్వరైర్వృతమ్ ।
బాహ్యే ద్విషడ్దలామ్భోజపత్రేషు సకలం నభః ॥ ౨౯॥

సాన్తం సమ్పుటమాలిఖ్య ఇఁవీ హంసైర్వలయీకృతమ్ ।
అమ్భఃపురపుటోపేతం సద్భూర్జే చన్దనాదిభిః ॥ ౩౦॥

సిక్థకేన సమావేష్ట్య జలపూర్ణఘటే క్షిపేత్ ।
దాహస్యోపశమం కుర్యాద్ గ్రహపీడాం నివారయేత్ ॥ ౩౧॥ శాన్తికయన్త్రమ్ ।
నామ త్రిమూర్త్తిమధ్యస్థ క్లీఁ క్రోఁ దిక్షు విదిక్షు చ ।
బహిర్వన్హిపుటం కోష్ఠేష్వోఁ జమ్భే !  హోమమాలిఖేత్ ॥ ౩౨॥

మోహాపి చ తథా గ్రాన్తబ్రాహ్మబ్లూఁకారమాస్థితమ్ ।
ఓం బ్లైఁ ధాత్రే వషట్ వేష్టద్యాన్తర్బాహ్యే క్షితిమణ్డలమ్ ॥ ౩౩॥

ఫలకే భూర్యపత్రే వా లిఖిత్వా కుఙ్కుమాదిభిః ।
పూజయేద్ యః సదా యన్త్రం సర్వ తస్య వశం జగత్ ॥ ౩౪॥

వశ్యయన్త్రమ్ ॥

మాన్తం నామయుతం ద్విరేఫసహితం బాహ్యే కలావేష్టితం
తద్బాహ్యే೭గ్నిమరుత్పరం విలిఖితం తామ్బూలపత్రోదరే ।
లేఖిన్యాన్యమృతాక్షకణకభువార్కక్షీరరాజీప్లుతం
తప్తం దీపశిఖాగ్నినా త్రిదివసే రమ్భామపీహానయేత్ ॥ ౩౫॥

రేఫద్వయేన సహితం లిఖ మాన్తయుగ్మం షష్ఠస్వరచతిర్దశబిన్దుయుక్తమ్ ।
బాహ్యే త్రివహ్నిపురమాలిఖ చైతదన్తః
పాశత్రిమూర్త్తిగజవశ్యకరైశ్చ వేష్ట్యమ్ ॥ ౩౬॥

పురం హిరణ్యరేతసో విలిఖ్య తద్బహిః పునః ।
కరోతు మన్త్రవేష్టనం తతో೭గ్నివాయుమణ్డలమ్ ॥ ౩౭॥

తద్యథా -
ఓం ఆఁ హ్రీం క్రోఁ మ్ల్వ్ర్యగ్యూం జమ్భే !  మోహే !  రరరర ఘే ఘే సర్వాఙ్గం
దహ దహ దేవదత్తాయా హృదయం మమ వశ్యమానయ హ్రీం యం వౌషట్ ॥

తం తామ్బూలరసేన హేమగరలబ్రహ్మాదిభిః సఞ్యుజా
ప్రేతావాసనకర్పరైః ప్రవిలిఖేత్ తామ్రస్య పత్రే೭థవా ।
అఙ్గారైః ఖదిరోద్భవైః ప్రతిదినం సన్ధ్యాసు సన్తాపయేత్
సప్తాహాత్ వనితాం మనో೭భిలషితాం మన్త్రీ హఠాదానయేత్ ॥ ౩౮॥

సంలిఖ్యాష్టదలాబ్జమధ్యగగనం కామాధిపేనావృతం
తత్పత్రేషు తదక్షరం ప్రవిలిఖేద్ పత్రాగ్రతో೭గ్న్యక్షరమ్ ।
బ్లేం పత్రాన్తరపూరితం వలయితం మన్త్రేణ వామాదినా
ద్రాం ద్రీం బ్లూం స్మరవీజహోమసహితేనైతజ్జగత్క్షోభణమ్ ॥ ౩౯॥

జాప్యః సహస్రదశకం సుభగాయోనావలక్తకం ధృత్వా ।
విద్యా నవాక్షరీయా తయాపసవ్యేన హస్తేన ॥ ౪౦॥

ఓం హ్రీం ఆఁ క్రోఁ హ్రీం క్షీఁ హ్రీం క్లీఁ బ్లూఁ ద్రాం ద్రీం
ఓం కామినీ రఞ్జయ హోమమన్త్రం యస్యా లిఖేచ్చాత్మకరే೭పసవ్యే ।
సన్దర్శయేత్ సా స్మరబాణభిన్నా೭ద్భుతం భవత్యత్ర కిమస్తి చిత్రమ్ ॥ ౪౧॥

వినయం చలే చలచిత్తే రతౌ ముఞ్చయుగ్మం హోమమ్ ।
ద్రావయత్యబలాం బలాల్లక్షేణైకేన జాప్యేన ॥ ౪౨॥

సిన్దూరసన్నిభం పిణ్డమైవలక్షరనిర్మితమ్ ।
ధ్యాతం సబిన్దుకం యోన్యాం ద్రావయత్యబలాం బలాత్ ॥ ౪౩॥

సమ్పిష్టోతప్తికామూలం జలశౌచం స్వరేతసా ।
భర్తుర్దదాతి యా షణ్ఢం సాన్యాం ప్రతికరోతి తమ్ ॥ ౪౪॥

మర్దయేత్ పిప్పలాకామం సూతకేన కురుణ్టికా ।
క్షీరేణ మధునా సార్ధం లిఙ్గలేపో೭బలాస్మరః ॥ ౪౫॥

మధుకర్పూరసౌభాగ్యం పిప్పిలీకామసంయుతమ్ ।
ద్రావయత్యఙ్గనాదర్పం లిఙ్గలేపనమాత్రతః ॥ ౪౬॥

ఏరణ్డతేలం ఫణికృత్తియుక్తం సన్మాతులిఙ్గస్య చ బీజమిశ్రమ్ ।
ధూపం చ దద్యాద్రతిహర్మ్యమధ్యే స్త్రీమోహనం జ్ఞానవిదో వదన్తి ॥ ౪౭॥

క్లీఁకారకారరుద్ధం లిఖ కూటపిణ్డం నామాన్వితం ద్వాదశపత్రపద్మమ్ ।
బ్రహ్మాదిహోమాన్తపదేన యుక్తాః పూర్వాదిపత్రేషు జయాదిదేవ్యః ॥ ౪౮॥

ఓం జయే స్వాహా । ఓం విజయే స్వాహా ।
ఓం అజితే స్వాహా । ఓం అపరాజితే స్వాహా
జభమహపిణ్డసమేతా జమ్భాద్యాః ప్రణవపూర్వహోమాన్తాః ।
విదిగ్దలేషు యోజ్యాః స్మరబీజం శేషపత్రేషు ॥ ౪౯॥

ఓం జ్మ్బ్ల్వ్ర్యూఁ  జమ్భే !  స్వాహా !  ఓం భ్మ్ల్వ్ర్యూఁ మోహే !
స్వాహా । ఓం మ్మ్ల్వ్ర్యూఁ స్తమ్భే !  స్వాహా ।
ఓం హ్మ్ల్వ్ర్యూఁ  స్తమ్భినీ స్వాహా । శేషపత్రేషు క్లీఁ ।

త్రిధా మాయయా వేష్టితం క్రోఁనిరుద్ధం
     లఖేద్ రోచననాకుఙ్కుమైర్భూయపత్రే ।
మధుస్థాపితం వేష్టితం రక్తసూత్రై-
     ర్వశం యాతి రమ్భాపి సప్తాహమధ్యే ॥ ౫౦॥

క్లీఁ రఞ్జికా ॥ ౧॥

యన్త్రం తదేవ విలిఖేద్ వనితాకపాలే
     గోరోచనాదిభిరనఙ్గపదే త్రిమూర్త్తిమ్ ।
సన్ధ్యాసు సప్తదివసం ఖదిరాగ్నితప్తాం
     దేవాఙ్గనామపి సమానయతీహ నాకాత్ ॥ ౫౧॥

హ్రీం రఞ్జికా ॥ ౨॥

స్థానే త్రిమూర్తేర్లిఖ విశ్వబీజం
     కస్తూరికాద్యైర్వరభూర్జపత్రే ।
బాహ్యే వృతం రూపపతఙ్గవేష్టయం
     సీమన్తినీనాం విదధాతి మోహమ్ ॥। ౫౨॥

ఈరఞ్జికా ॥ ౩॥

విష్ణోః పదే సమభియోజయ రోషబీజం
     మానుష్యచర్మణి విషేణ సలోహితేన ।
కుణ్డే ప్రపూర్య ఖదిరజ్వలనేన తప్తం
     శత్రోరకాలమరణం కురుతే೭వికల్పాత్ ॥ ౫౩॥

హూంరఞ్జికా ॥ ౪॥

భూర్జే೭రుణేన సవిషేణ మకారబీజం హూం
     స్థానకే లిఖ మలీమలమూత్రవేష్ట్యమ్ ।
మృత్పాత్రికోదరగతం నిహితం శ్మశానే
     దుష్టస్య నిగ్రహమిదం విదధాతి యన్త్రమ్ ॥। ౫౪॥

మః ॥ ౫॥

యన్త్రం విభీతఫలకే విషలోహితాభ్యాం
మః స్థానకే೭గ్నిమరుతోః ప్రవిలిఖ్య బీజమ్
సంవేష్ట్య వాజిమహిషోదభవకేశపాశైః
ప్రేతాలయస్థమచిరేణ కరోతి వైరమ్ ॥ ౫౫॥

ర్యః ॥ ౬॥

అననపవనవీజే వాయుబీజం ససృష్టిం,
     చితిజగరలకాకామధ్యయుక్తైర్విలిఖ్యమ్ ।
గగనగమనపక్షేణోద్యఖణ్డే ధ్వజానాం
     పవనహృతమరాత్యుచ్చాటనం తద్ విదధ్యాత్ ॥ ౫౬॥

యః ॥ ౭॥

స్వల్పేన మానుషభువా నృకపాలయుగ్మే
     పూర్వోదితాక్షరపదే విలిఖేత్ స్వబీజమ్ ।
క్ష్వేడారుణేన మృతకాలయభస్మపూర్ణే
     ప్రోచ్చాటయేదరికులం నిహితం శ్మశానే ॥। ౫౭।
హః ॥ ౮॥

ప్రేతామ్బరే వ్యోమపదే విలేఖ్యం ఫడక్షరం నిమ్బనృపార్కక్షీరైః ।
సిద్ధాలయే తన్నిఖనేత్ క్షపాయాం బమ్భ్రమ్యతే కాక ఇవారిరుర్వ్యామ్ ॥ ౫౮॥

ఫట్ ॥  ౯॥

కూటం ఫడక్షరపదే లిఖ కుఙ్కుమాద్యై-
     ర్భూర్యే వషట్పదయుతం మఠితం త్రిలోహైః ।
పుంసాం స్వబాహుకటికేశగలే ధృతానాం
     సౌభాగ్యకృద్ యువతిభూపతివశ్యకారి ॥ ౫౯॥

క్ష వషట్ ॥ ౧౦॥

క్షస్థానకే೭థ లిఖితం హరితాలకాద్యై-
     రిన్ద్రం శిలాతలపుటే క్షితిమణ్డలస్థమ్ ।
సూత్రేణ తత్ పరివృతం విధృతం ధరాయాం
     కుర్యాత్ ప్రసూతిముఖదివ్యగతేర్నిరోధమ్ ॥ ౬౦॥

లమ్ ॥ ౧౧॥

రఞ్జికా ద్వాదశయన్త్రోద్ధారః ॥

అజపుటే లిఖేన్నామ గ్లాం క్షం పూర్ణేన్దువేష్టితమ్ ।
వజ్రాష్టకపరిచ్ఛిన్నమగ్రాన్తబ్రాహ్మణాక్షరమ్ ॥ ౬౧॥

తద్బాహ్యే భూపురం లేఖ్యం శిలాయాం తాలకాదినా ।
కోపాదిస్తమ్భనం కుర్యాత్ పీతపుష్పైః సుపూజితమ్ ॥ ౬౨॥

ఓం గ్లాఁ క్షం ఠ లం స్వాహా ।
సంలిఖ్య నామాష్టదలాబ్జమధ్యే
      మాయావృతం షోడశసత్కలాభిః ।
క్లీఁ బ్లూఁ తథా ద్రామథ యోజయిత్వా
      దిక్స్థేషు పత్రేషు సదా క్రమేణ ॥ ౬౩॥

హోమం లిఖేదఙ్కుశబీజముచ్చైః
      కిఞ్చాన్యపత్రేషు బహిస్త్రిమూర్త్తిః ।
భూర్జే హిమాద్యైర్విధృతం స్వకణ్ఠే
      సౌభాగ్యవృద్ధిం కురుతే೭ఙ్గనానామ్ ॥ ౬౪॥

సౌభాగ్యరక్షా ॥

క్షజభమహరేఫపిణ్డైః పాశాఙ్కుశబాణరఞ్జికాయుక్తైః ।
ప్రణవాద్యైః కురు మన్త్రిన్ । షట్ కర్మాణ్యుదయమవగమ్య ॥ ౬౫॥

ఓం క్ష్మ్ల్వ్ర్యూం జ్మ్ల్వ్ర్యూం బ్మ్ల్వ్ర్యూం మ్మ్ల్వ్ర్యూం హ్మ్ల్వ్ర్యూం డ్మ్ల్వ్ర్యూం
ఆఁ క్రోఁ హ్రీఁ క్లీఁ బ్లూఁ
ద్రీం ద్రీం సంవౌషట్ త్రిభువనే సారః । సహస్ర  ౧౨ జపః ।
దశాంశేన హోమః ॥

వశ్యవిద్వేషణోచ్చాటే పూర్వమధ్యాపరాణ్హకే ।
సన్ధ్యార్ధరాత్రరాత్ర్యన్తే మారణే శాన్తిపౌష్టికే ॥ ౬౬॥

వషడ్ వశ్యే ఫడుచ్వాటే హుం ద్వేషే పౌష్టికే స్వధా ।
సంవౌషడాకర్షణే స్వాహా శన్తికే೭వ్యథ మారణే ॥ ౬౭॥

పీతారుణాసితైః పుష్పైః స్తమ్భనాకృష్టిమారణే ।
శాన్తిపౌష్టికయోః శ్వేతైర్జపేన్మన్త్రం ప్రయత్నతః ॥ ౬౮॥

కుర్యాద్ హస్తేన వామేన వశ్యాకర్షణమోహనమ్ ।
శేషకర్మాణి హోమం చ దక్షిణేన విచక్షణః ॥ ౬౯॥

ఉదధీన్ద్రమారుతాన్తకనైరృతకుబేరదిక్షు కృతవదనః ।
శాన్తికరోధోచ్చాటనమారణసమ్పుష్టిజనవశ్యే ॥ ౭౦॥

శాన్తిపుష్టౌ భవేద్ధోమో దూర్వాశ్రీఖణ్డతణ్డులైః ।
మహిషాక్షరఙ్కామ్భోజైః పురక్షోభో నిగద్యతే ॥ ౭౧॥

కరవీరారుణైః పుష్పైరఙ్గనాక్షోభముత్తమమ్ ।
హోమైః క్రముకపత్రాణాం రాజవశ్యం విధీయతే ॥ ౭౨॥

గృహధూమనిమ్బపత్రైర్ద్విజపక్షైర్లవణరాజికాయుక్తైః ।
హుతైస్త్రిసన్ధ్యవిహితైవిద్వేషో భవతి మనుజానామ్ ॥ ౭౩॥

ప్రేతాలయాస్థిఖణ్డైబిమ్భీతకాఙ్గారసమధూమయుతైః ।
సప్తాహవిహితహోమైరరాతిమరణం బుధైర్దిష్టమ్ ॥ ౭॥

నైవేద్యదీపాదిభిరిన్ద్రసఙ్ఖ్యైః సువర్ణపాదావభిపూజ్య దేవ్యాః ।
స్వవామదేశస్థితసవ్యహస్తో మన్త్రీ ప్రదద్యాత్ సహిరణ్యమమ్భః ॥ ౭౫॥

విద్యా మయేయం భవతే ప్రదత్తా త్వయా న దేయాన్యదృశే జనాయ ।
తచ్ శ్రావయిత్వా గురుదేవతానామగ్రేషు విద్యా విధినా ప్రదేయా ॥ ౭౬॥

ఆజ్ఞాక్రమః
కృతినా మల్లిషేణేన జినసేనస్య సునునా ।
రచితో భారతీకల్పః శిష్టలోకభనోహరః ॥ ౭౭॥

సూర్యాచన్ద్రమసౌ యావన్మేదినీభూధరార్ణవాః ।
తావత్ సరస్వతీకల్పః స్థేయాచ్చేతసి ధీమతామ్ ॥ ౭౮॥

శ్రీమల్లిషేణసారస్వతవిధిరయమ్ -
ప్రథమః కృతస్నానః సమౌనః ప్రాతః శ్రీభారత్యాః పూజాం కృత్వా
విహితార్కక్షారోదనః తతో೭నన్తరం సన్ధ్యాసమయే పునః స్నాత్వా
సర్వవ్యాపారవర్జితో భూత్వా శుచిః శ్వేతం వస్తు ధ్యాయేత్ ।

ఓం హ్రః భూరిసీ భూతధాత్రీ భూమిశుద్ధిం కురు కురు స్వాహా ।
భూమిశుద్ధిమన్త్రః ।
ఓం హ్రీం వాం నమో అరిహన్తాణం అశుచిః శుచీభవామి స్వాహా ।

ఆత్మశుద్ధిమన్త్రః ॥

ఓం హ్రీఁ వద వద వాగ్వాదినీ హ్రీఁ హృదయాయ నమః । హ్రీఁ శిరసే నమః ।
హ్రూఁ శిఖాయై నమః । హ్రౌఁ కవచాయ నమః । హ్రః అస్త్రాయ నమః ।
ఇతి సకలీకరణం విధాతవ్యమ్ ।

తతో೭మృతమన్త్రేణ సరస్వత్యాః పూజా క్రియతే ।
ఓం అమృతే !  అమృతోద్భవే !  అమృతవర్షిణి !
అమృతవాహిని !  అమృతం శ్రావయ శ్రావయ
ఐఁ ఐఁ క్లీఁ క్లీఁ బ్లూఁ [ బ్లూఁ ] ద్రాం ద్రీం ద్రావయ ద్రావయ స్వాహా ।
అథ మణ్డలస్థాపనా విధీయతే-
ఓం హ్రీం మహాపద్మయశసే యోగపీఠాయ నమః పీఠస్థాపనమన్త్రః ॥

అథ హ్రీం అమలే !  విమలే !  సర్వజ్ఞే !  విభావరి !
వాగీశ్వరి !  కలమ్బపుష్పిణి స్వాహా ।
ప్రతిష్ఠామన్త్రః
తతో మణ్డలపూజా విధీయతే । అ సరస్వత్యై నమః । పూజామన్త్రః ।
మణ్డలాగ్రే೭గ్నికుణ్డం సమచతురస్రం విధీయతే అఙ్గల ౧౬
ప్రమాణమ్ । తతో మూలమన్త్రేణ జాప ౧౨౦౦౦। తతో దశాంశేన హోమః ।
గుగ్గుల-మధు-ఘృత-పుష్పసహితగుటికా చనకప్రమాణా ౧౨౦౦౦
హోమః పిప్పలపలాశశమిసమిధైః । మూలమన్త్రేణ కరజాపలక్ష ౧౦౦౦౦౦।
తతః సిద్ధిః ।

॥ ఇతి శ్రీమల్లిషేణాచార్యవిరచితః  సరస్వతీమన్త్రకల్పః సమాప్తః ॥

  జైహింద్.

23, జనవరి 2020, గురువారం

అవధాని ప్రవరులు 4. రచన....శ్రీ మద్దూరి రామమూర్తి.

0 comments

జైశ్రీరామ్.
అ వ ధా ని  ప్ర వ రు లు  - 4.
రచన..శ్రీ మద్దూరి రామమూర్తి.

యువకుల్ కొందరు సంస్కృతాంధ్రముల కావ్యోక్తుల్ దగన్ నేర్చి, తా
మవలీలన్ రచియించు చుండిరిట పద్యంబుల్ రసోత్సాహులై,
యవలన్ వారు శతావధాను లగుచున్ ఖ్యాతిన్ గడింపంగ నా
కవులన్ గాంచి ముదంబు నందితిని. యా కావ్యజ్ఞులన్ మేటియై
నవ భావమ్ముల ఆముదాల మురళీ నాముండు గణ్యుండు గాన్
సు వధానామృత పానుడయ్యె  తలపన్ లోకా జగన్. అట్లె వా
క్పవియై సత్కవియై వధాని యయి రాంభట్లాహ్వయుం
డొప్పె, మే
ల్మి విభాసిల్ల అపర్ణ శాంతు లిరువుర్ లీలా విలాసంబుగా
నవధానంబులు జేసి వాసిగని రార్యాళుల్ నుతింపన్ భువిన్.
స్తవమున్ గాంచె ప్రభావతమ్మ మహిళా ధన్యావధానమ్మునన్.
వివరింపన్ మరిడాన శీను కవి నిల్పెన్ తా వధాన ధ్వజం.
బవురా! యంచు బుధుల్ నుతింప సరభీ మాన్యుండు వెల్గెన్. సం
స్తవ మొప్పన్ బహుళా వధానముల తాతా వంశ సందీప శ
ర్మ వధానాఖ్య విహార భూములను  రారాజత్ కళామూర్తియై
దివిషద్భాష వధానముల్ సలిపి నుత్తేజమ్ము కల్గించె, తా
నవధానమ్ములు జేసి మెప్పు గనె  నా ఆకెళ్ళ భాను ప్రమో
ద విశేష ప్రతిభల్ వెలార్చుచు, లలిత్ ధాత్రిన్ యశోధన్యుడై
యవధానాంగణమందు శోభిలెను.విద్యావంతుడై పృథ్వి మై
ల వరాఖ్యుండవధానియౌ మురళి లీలన్ వెల్గె మేల్మేలనన్.
బవరంబందున సత్యభామ యన విద్వన్మూర్తియౌ చంద్రికా
కవయిత్రిన్ స్మరియింతు.
నవ్విధిని నా కామేశ్వరీదేవి తా
నవధానమ్మున మేటియై వెలిగె.విద్యావామ నర్చించు
చున్
అవనిన్ తా అవధాయకీ యనగ జంధ్యాలాఖ్య వంశాంబ  ధీ
ప్రవరుల్ మెచ్చగ సుబ్బలక్ష్మి వెలిగెన్ పద్యాళి నందించు చున్
అవధాన ప్రతిభన్ యశమ్ము గొనె పేరయ్యాహ్వయుం డెన్నగా !
నవధానాహవ రాఘవుండనగ విఖ్యాతిన్ గడించెన్ యశో
రవి ధీ మాన్యుడు పోచిపెద్ది కుల సుబ్రహ్మణ్య మష్టావధా
న విధానమ్మున. తాదృశమ్ము గను జానాదుర్గ వంశాబ్జుడే
ఛవిమద్రత్నమనంగ వెల్గె,కవితాస్థన్ సత్యనారాయ
ణుం
డు విరాజత్ చెరువూరి దివ్య కుల భానుండొప్పె కావ్యజ్ఞుడై.
స్తవమున్ గాంచె వధానియై ములుగు అంజయ్యాఖ్యు డా రీతి ధా
త్రి వెలింగెన్ సుమి ఓం ప్రకాశ్ బుధులు సంప్రీతిన్ నుతింపన్. భువిన్
స్తవమున్ గాంచెను ముద్దువంశజుడు రాజయ్యా ఖ్యు డీరీతి స
త్కవియౌ గంగుల ధర్మరాజు ఘనుడై గణ్యుండునై యొప్పె  తా
నవధానాంగణమందు. శారద పద ధ్యానాత్ములై యొప్పు వీ
రి వలెన్ భారత భారతీ సుమధుర శ్రీ గల్గగా నెందరో
అవధానమ్ముల సభ్యరంజక మహా హ్లాదమ్ము నందించుచున్
ప్రవరాదృత్యభిలగ్న  మానసము తద్భవ్యాద రాహూతి బ్రా
జ్ఞ విపశ్చి త్కవిరాడ్రసజ్ఞ సుమ భాస్వద్వాటి చెల్వొందగా
నవ భావమ్ము లొసంగిరీభువికి.
శ్రీ జ్ఞానేశ్వరీ మాత యీ
యవధానాళిని బ్రోచుగాత ! సతమవ్యాజానురాగాల వా
క్ఛవి యొప్పారగ కీర్తిమంతు లయి సత్కావ్యాళి సృష్టింప నిం
పవు భావంబుల మాలికన్ మలచితిన్ మద్దూరి వంశాబ్జుడన్ .
కవితామాత పదాబ్జ సీధు రసమున్ జ్ఞానార్థినై గ్రోలుదున్
అవధాన ప్రవణుండునై ప్రకటిత జ్ఞానాత్మ భాస్వద్యశో
నవ చాంద్రీ తతదిక్తటుండగు రసానందున్ గురున్ గొల్చెదన్
కవులే స్రష్టలు ద్రష్టలంచు సతమున్ కైమోడ్పు లర్పించె దన్
అవధానిన్ భువి రామమూర్తి యను నాఖ్యాతుండ దీవించుడీ !
అవధానాగ్రణులార ! భవ్య కవులారా ! కీర్తులన్ జల్లుచున్
భువనానందద! బాసరాంబ! సతమున్ పోషించుతన్ మిమ్ములన్.

మద్దూరి రామమూర్తి.

వినతి.
సుకవి వరేణ్యులారా ! అవధానాగ్రణులారా ! నేను విన్న చూచిన అవధానులను ప్రస్తావించితిని. ఇంకను ఎందరో మహనీయులైన అవధానులు ఉండవచ్చును. వారందరు ప్రాతః స్మరణీయులే. వారిని ప్రస్తావించకున్న నన్నుమన్నించ గలరు. బుద్ధి పూర్వకముగ చేసినది కాదు. ఇందులో వరుస క్రమము కూడ తప్పి యుండ వచ్చును. ఏ వరుసలో నున్నను వారు మహనీయులే. ఈ 215 పాదముల మాలికను ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

మద్దూరి రామమూర్తి.

జైహింద్.

22, జనవరి 2020, బుధవారం

అవధాని ప్రవరులు..3. ..రచన..శ్రీ మద్దూరి రామమూర్తి.

0 comments

జైశ్రీరామ్.
అ వ ధా ని  ప్ర వ రు లు -  3.
రచన. శ్రీ మద్దూరి రామమూర్తి
నవనీతమ్మగు మానసమ్ముగల ఇందారంపు వాఙ్మూర్తి య
ష్టవధాన ప్రవరుండునై వెలిగి శశ్వత్కీర్తి సాధించె, ధీ
ప్రవణ ప్రస్ఫుట వాక్ప్రసన్న కవితా భాగీరథీమాత తా
ప్రవహత్తుంగ తరంగ గల్ఘల రవ ప్రాగల్భ్య మొప్పార నా
ట్య విలాసమ్మది వద్దిపర్తి రసనన్ హర్షాన నర్తించు నా
కవిరాణ్మౌళిని ప్రస్తుతించెదను. వాగర్థమ్ములన్ దెల్పుచున్
స్తవమున్ గాంచె నమళ్ళదిన్నె
కవి విద్యావామ సద్భక్తుడై,
అవధానం కులజున్ సుధాకరుని దివ్యం
బావధానమ్ములే
అవనిన్ మించియశమ్ముగాంచె
నిక ప్రఖ్యాతుండునై ధన్యుడై
అవధానమ్మున తెల్గు భారతికి దివ్యానందమున్ గూర్చగా
దివిషద్భాషకు దీటుగా తెనుగు నుద్దీపింపగా జేసె తా
నవధానమ్మున పాలకుర్తి కులజుండా శ్యామలానందు స
త్కవి వర్యున్ మనసార గొల్చెదను. పద్మాసీను
భామామణీ
ప్రవిమద్దివ్య కటాక్ష వీక్షణలచే రాజిల్లి గణ్యాత్ముడై
స్తవమున్ గాంచి వధాని యయ్యె ఘనుడాశావాది స్నిగ్ధాత్ముడై,
ఛవిమత్కంకణ ధారియై కవితలన్ సంగీత మాధుర్య మం
జు విలాసాంచిత భవ్య వాగ్రుచి రసజ్ఞుల్ మెచ్చ ధీ రమ్యుడై
యవధానంపు విపంచి మీటు సుకవిన్ ధ్యానాత్ము సుశ్లోకినిన్
కవియౌనాగఫణిన్ దలంచెదను
వాక్చాతుర్య మొప్పారగా
స్తువ గంగాభ తరంగ భంగిమల
నాశుప్రోక్త పద్యాళి పా
టవ మొప్పారగ జాలువారు కవిరాట్ భానుండు శ్రీ మేడసా
ని వరేణ్యున్ వర దివ్య కావ్య సరసీ నిర్మగ్న కావ్యజ్ఞునిన్
ధవుడౌ వేంకటనాథు శ్రీ చరణ ద్వంద్వార్చ్యున్ మదిన్ దల్చెదన్
స్తవమున్ గాంచె వధాని పైడి హరనాథాఖ్యుండు కీర్తి ప్రభన్.
అవలన్ వాక్ప్రతిభా విభాసితులు విద్యా పారగుల్ ధీ గణ
ప్రవరుల్ వ్యాకరణాంశ బోధకులు సూరం వంశజుల్ శ్రీనివా
స విరాజద్గుణ ధన్యులన్ దలచెదన్ సౌజన్య సంస్కారులన్.
కవియౌ కొండపి వంశజున్ మురళినిన్ జ్ఞానాత్ము నెంతున్ మదిన్
కవితామాధురి భావ మంజిమ చమత్కారోక్తి విస్ఫూర్తి లో
క విధానస్థితి బంధ చిత్ర కవితా కాణాచి కావ్యోక్తి వా
గ్వివిధా లంకృత మూర్తిమంత
మగు లక్ష్మీకాంతరాజా
హ్వయున్.
అవధానిన్ నుతియింపశక్యమె.
తగన్ హర్ష ప్రఫుల్లాత్ము,శు
భ్ర విపశ్చిత్కవిరాడ్వధాని కరుణా వర్షాంబువుల్ చాతకం
బు వలెన్ ద్రావుట నావధానిక కళన్ మొల్కెత్తగా సూ
రి వరుండై బహు కావ్యముల్ మలచె గౌరీభట్ల వంశ్యుండు పా
టవమున్ జూపుచు సంస్కృతాంధ్రముల రెంటన్ దిట్టయై వెల్గి ప్రా
భవమున్ జాటెను రామశర్మ కవి. కావ్యాబ్జాళికిన్ బూల తో
ట వివేకాత్తవధాన పుష్పమన కోటా రాజశేఖర్ తుషా
ర విరాజన్నగమై వెలింగె. ఫణతుల్ రామేశ్వరాఖ్యుండు ధీ
ప్రవణుండై యవధాన భాగ్యు
డయి యొప్పారెన్ బుధుల్ మెచ్చ , ర
మ్య వధానంబున మేటియై యలరె ముత్యంపేట వంశాబ్జుడున్
కవియౌ శంకర శర్మ నట్లె ముదిగొండాఖ్యుండు వాగ్భామినిన్ స్తవమున్ జేసి వధాని యయ్యె,నిక పాశ్చాత్యుల్ నుతింపన్ యశో
రవి నేమాని కులాబ్ధి పూర్ణశశి విభ్రాజత్ వధానమ్మునన్
భువిరాజిల్లె వచింప  పాలడుగు
సంభూతుండునౌ శ్రీ చరణ్
ప్రవణత్వమ్మును తెల్పగా తరమె, గీర్వాణాంధ్రముల్ నేర్చె
వా
ఙ్నవభావమ్ముల సద్వధానిగను
శ్రీ నారాయణం సత్కవి
ప్రవరుండయ్యె వచింప నివ్విధి వచోంబా రూపులై యెందరో
నవరాగమ్ములు పల్లవింపగను వాఙ్మాధుర్యముల్ జూపుచున్
నవ లోకమ్ముల తా సృజించు కవులై జ్ఞాన ప్రకాశాత్ములై
స్తవమున్ గాంచిరి.కావ్య లోకమున సంచారంబు గావించు నా
యవధానాఢ్యులె మా వధాన తతికిన్ ఆద్యుల్ నమస్కార సం
స్తవ పుష్పంబులు వారికిచ్చి మదిలో ధ్యానింతు సద్భక్తితో.
దీనిపై నా స్పందన.
అవధానిప్రవరాళి నెంచి కడు స్నేహార్ద్రంపు చిత్తంబుతో

శ్రవణానందముగా పఠించఁ దగు ధారాశుద్ధి నొప్పార, ధీ

వరులౌ మద్దురి రామమూర్తి నుడివెన్. భాస్వంతునీ సత్కవిన్,

గవి సంసేవ్యుని బ్రస్తుతించెదను రాగద్వేష దూరున్ భువిన్.
🙏🏻🙏🏻🙏🏻

జైహింద్.

21, జనవరి 2020, మంగళవారం

అవధాని ప్రవరులు 2. రచన. శ్రీ మద్దూరి రామ్మూర్తి.

0 comments

జైశ్రీరామ్.
అ వ ధా ని  ప్ర వ రు లు - 2.
రచన. శ్రీ మద్దూరి రామమూర్తి.

అవధాని ప్రవర ప్రనిర్మితి యశో హర్ష ప్రహర్షుండు, ర
మ్య వధానైక కళావతారము ,సతమ్మాత్మావధాని స్ఫుర
త్ప్రవరామ్నాయ, విశుద్ధ
మానసుడు, ప్రోత్సాహమ్ము నందించుచున్
కవితా కల్పక వృక్షమున్ నిలిపె. ప్రజ్ఞాశాలి నా పూజ్యునిన్
సి.వి.సుబ్బన్నను నే దలంచెద శుభాశీర్వాదమున్ గోరి, స
త్కవి మూర్ధన్యుడు మాన్యుడా అనుములాఖ్యాతుండు శేషేంద్రుడున్
ధ్రువతారౌచు వధాన లోకమున పేరున్ గాంచె నా స్వామి, ధీ
ప్రవరుండై యవధానియై యలరె చిర్రావూరి శ్రీ రామ శ
ర్మ వరేణ్యుండతనిన్ స్మరించెదను. రామబ్రహ్మమున్ గణ్యుడై
యవధానాటవి సంచరించె మృగరాజై పండితుల్ మెచ్చ, భా
ర్గవుడై దోర్బల శర్మ తా వెలిగె ప్రజ్ఞావంతులే మెచ్చ, కూ
ర్మి వధానమ్మున దిద్దితీర్చుచు సమున్మీలద్విశేషమ్ము లె
న్నొ వచించెన్ విజయా
శిషమ్ములిడె నన్నున్ ధన్యుగా జేసె, ధీ
దివిషద్వాహిని నోలలాడగ సదా దీవించె కావ్యజ్ఞుడౌ
శివరామాఖ్యుడు మాచిరాజుకులరాట్ శ్రీ రమ్యు డానందుడై,
యవధానమ్మున అష్టకాల నరసింహారాము డొప్పెన్ భువిన్.
కవి సస్నేహ కరావలంబ మహితాకారంబు సత్కీర్తి వా
మ విజృంభింప నరాల వంశజుడు రామారెడ్డి వాగీశుడై
అవధానాగ్రణియై గుణాధికుడునై ఖ్యాతిన్ గడించెన్ భువిన్.
శ్రవణానంద మొసంగె భూతపురి సుబ్రహ్మణ్య ధీశాలి  స
త్కవితా సూన మరంద ధారలను విజ్ఞానాళి కందించి, యే
యవరోధమ్ముల నైన లెక్కిడని కావ్యజ్ఞున్ గణేశున్ సదా
స్తవమున్ జేతు,తిగుళ్ళవంశ కుల హంసన్ శ్రీహరిన్ గొల్చెదన్.
కవియై, యష్టవధానియై చిటితొటీ గణ్యంపు వంశాబ్జుడై
స్తవమందెన్ విజయుండు. జ్ఞాన మణియై, సంస్కార సంశోభియై
పవలున్ రేలును భక్తి తత్పరత దైవమ్మైన గాయత్రినే
స్తవమున్ జేయు శతావధానియగు దత్తాత్రేయ శర్మాఖ్యుడున్
ధ్రువతారౌచు వధాని లోకమున పేరున్ గాంచె గండ్లూరిగా.
భువి భాసిల్లె మహావధానిగ జనుల్ భూషింప జ్ఞానాత్ముడై
కవియై కోవెల సుప్రసన్న .తలపన్ గాడేపలీ కుక్కుటే
శ వధానిన్ మరువంగ శక్యమె. మహా శబ్దంబులన్ బేర్చి తా
నవధానంబు లొనర్చె రావురి కులాఖ్యాతుండు ధన్యాత్ముడున్.
కవి రాజై శివగౌడు వెల్గెను మహా కావ్యావధానమ్మునన్.
పవియై వెల్గిన రాళ్ళబండి కవి భాస్వంతున్ ప్రసాదున్ మదిన్
స్తవమున్ జేతు వధాన రమ్య కవితా సారస్వతా మూర్తినిన్.
చవులూరించెడి మాట, మేన పులకల్ జంటింపగా దంట, స
త్కవితాలోలుడు, ధారణాసురుడనన్ ఖ్యాతుండు నైనట్టి ప్రౌ
ఢ వధానాధ్వహుడైన శ్రీ గరికపాడ్వంశ్యున్ నృసింహాహ్వయున్
స్తవమున్ జేయుదు.సత్కవీశు డనగా ధాత్రిన్ నుతిన్ గాంచు వా
క్ప్రవరున్ శ్రీ కడిమెళ్ళ వంశజు యశోభాగ్యున్ సహస్రా వధా
ని వరేణ్యున్ స్మరియింతు, తద్విధిని ధీ నిష్ఠాత్ముడై మాన్యుడై
కవులున్ బండితులున్ వధానులు రసజ్ఞ శ్రేష్ఠులున్ సాహితీ
దివిషన్నిర్ఝరిణీ సితచ్ఛదులు సందీపించ వాఙ్మూర్తిగా
కవిగా శ్రీ చెఱుకూరి వంశ్యుడు సమజ్ఞన్ సూర్యనారాయణ
ప్రవరుం డగ్నిగ తేజరిల్లె.బుధులున్ ప్రాజ్ఞుల్ నుతింపంగ స
త్కవియై దివ్య వధానియై సుగుణియై జ్ఞానాబ్ధియై మించె పా
టవ మొప్పన్ కవిలోక వంద్యుడగు కోటా వంశ చంద్రుండునౌ
కవి లక్ష్మీ నరసింహ పండితుడు.సత్కావ్యజ్ఞుడై మేటియై
కవిభానుండు రస ప్రవాహ విలసత్కావ్యాళి నిర్మాత, తా
నవధానాగ్రణి ధూళిపాల మహదేవాఖ్యున్ మణిన్ గొల్చెదన్.
నా స్పందన.
నవనీతంపు మహత్ కవిత్వ సుగతిన్ నైరాస్యమున్ బాపు స

త్కవితామాధురినందఁజేయు కవులన్ గణ్యావధానాళి నీ

భువి పైగల్గిన నేటివారిని ప్రభాపూర్ణుండు రామ్మూర్తి సం

స్తవమున్ జేసిరి. వీరి కీర్తి వెలుఁగున్ ధాత్రిన్ చిరస్థాయిగా.
🙏🏻

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

20, జనవరి 2020, సోమవారం

అవధానిప్రవరులు1......శ్రీ మద్దూరి రామమూర్తి.

0 comments

జైశ్రీరామ్.
అ వ ధా ని  ప్ర వ రు లు.1
రచన.
శ్రీ మద్దూరి రామమూర్తి.
మత్తేభ మాలిక.
అవనిన్ మానవ జన్మ దుర్లభము, కావ్యజ్ఞాన సంబంధ సం
భవ మెన్నన్ కడు దుర్లభమ్ము, భువి విద్వద్వంద్యయౌ భారతీ
ప్రవిమత్ దివ్య కృపావలోకనముచే రాజిల్లి గణ్యాత్ములై
నవనీత ప్రతిమాన మానసమునన్ జ్ఞానమ్ము నందించుచున్
భువి శిష్యాళిని సృష్టి చేసిరి మహా మోదమ్మునన్‌ సద్గురు
ప్రవరుల్. జ్ఞాన సరస్వతీ కృపను భ్రాజత్పండితాఖండులై
స్తవమున్ గాంచిరి. వారి వత్సలతచే ధన్యాత్ములై మించుచున్
అవలోకింపగ శిష్య రత్నములు ప్రత్యంగమ్మునన్ మిన్నలై
కవులై,మేటి వధానులై, సరసులై కావ్యమ్ములన్ నిల్పరే
అవనిన్ పుణ్యఫలమ్ము చేత గద గణ్యంబౌచు వర్ధిల్లు నా
కవితాశిల్పము,దానిలో నమరు ప్రాగ్జన్మంపు సంస్కారతన్
అవధాన ప్రవణత్వ లాస్యమును కావ్యానంద సంచారమున్
దివిషద్వాహిని నోలలాడుచు కవుల్ దీవ్యద్దయామూర్తులై
యవధానంబులు జేసి ధన్యతములై యాహ్లాదులై రెంతయో
ధ్రువమీ పల్కు మహానుభూతులకు,చిద్రూపమ్ముగా నిల్చి భ
వ్య విరించిన్ బలె వెల్గు సత్కవికి విద్యాదేవి తోడుండదే.
అవలోకింపగ సాహితీవనిని విద్యరామ పుంస్కోకిలల్
ప్రవణత్వమ్మగు కూజితమ్ముల సదా వాసంతికల్ నింపుచున్
చవులూరించు రసార్ద్ర
భావములతో సాహిత్యమున్ నిల్ప నా
కవితారామ మనోజ్ఞ సీమల రసజ్ఞానీక భృంగమ్ములే
కవితాపుష్ప మరంద బిందువుల తత్కాలాను గుణ్యమ్ముగా
స్తవనీయంబుగ గ్రోలి మత్త తనులై ధాత్రిన్ విరాజిల్లి రా
కవిలోక ప్రముఖాళి నెన్న తరమే? కావ్యమ్ములే కాక వా
రవధానాటవి సంచరించి యట సింహంబుల్ వలెన్ దుష్ట కా
కవి మత్తేభ దురంత కుంభముల రక్తాస్వాదనన్ జేసి సం
స్తవ నీయోజ్జ్వల మూర్తులై ధర యశో ధన్యాత్ములై మించి రా
కవిలోకమ్మున మాడభూషి గురుడై జ్ఞానాత్ముడై వేంకటా
ర్య వధాని ప్రవరుండు నిల్చె, కవులన్ రాడ్వర్యులై ధీరతన్
పవినాన్ తిర్పతి వేంకటేశ్వరులు వాగ్భామామణీ మూర్తులై
స్తవమున్ గాంచిరి.వారి గీరతము విశ్వస్తుత్యమై యొప్పెడిన్
అవలన్ దేవలపల్లి సోదరులు విద్యామూర్తులై యొప్ప స
త్కవియౌ పోకురి వంశ భానుడగు శ్రీ కాశీపతి స్వామి తా
నవధానాగ్రణియై యశమ్ముగనె,సద్యస్ఫూర్తు లొప్పార ధీ
రవి యయ్యెన్ పిసుపాటి వంశమణి విభ్రాజద్యశోధన్యుడై
అవధానంబులు జేయుచున్ గుణ రసజ్ఞాత్మీయ విద్వత్కవి
ప్రవరుల్ మెచ్చెడిరీతి కొప్పరపు సమ్రాట్టుల్ ధరన్ మించగా
కవిగా  మేటి విమర్శకుండుగ దివాకర్లాన్వయుండెన్న
తా
నవలీలన్ బహుళా
వధానములచే ఖ్యాతిన్ గడించెన్ భువిన్
అవధానాంగణ సార్వభౌమ శివరామాఖ్యుండటంచున్ దగన్
కవియౌ వేలురి వంశ సంభవుని నుద్ఘాటింతురా సత్కవి
ప్రవరున్ పాదములంటి మ్రొక్కెదను. సద్భక్తిన్ మనోజ్ఞంపు శ
బ్ద విలాసోజ్జ్వల భావ సద్రస కవిత్వానల్ప శిల్పంబుచే
యవధానాంచిత చంద్రశేఖరుడు తా నయ్యెన్ మహా స్రష్టగా.
శివుడై జ్ఞాన సురాపగన్ నిలిపె  కాశీ కృష్ణమాచార్యుడున్.
సువచోరమ్య మనోజ్ఞ ధీ ప్రవణతల్ శోభిల్లగా జేయుచున్
కవులై పింగళి కాటురీ వరులు విఖ్యాతావధానమ్ములన్
అవలీలన్ ధృతి సల్పి వెల్గిరిల. విద్యామూర్తి డోకూరియున్
ప్రవణుండౌచు వధానమందు నలరెన్. నండూరి శ్రీ రామకృ
ష్ణ వధానమ్మున సూర్యుడై వెలిగె, పాణ్యం శ్రీ నృసింహుండు సం
స్తవమున్ బొందె మహావధాని యనగా సత్కావ్య నిర్మాతయై
పవియై వెల్గెను రాళ్ళబండి కవి శుంభన్మూర్తి మంతమ్ముచే
కవిమూర్ధన్యుని పద్య గద్య రచనా కంజాత సంజాతు శాం
భవి పాదార్చకు సద్వధాన కవి దోమా వేంకటస్వామి గు
ప్త వధానామృత పానచిత్తు నిట సంభావింతు .నారీతి స
త్కవియై,రమ్య వధానియై గురుడునై,జ్ఞాన ప్రసూనమ్ములన్
సు విలాసమ్ముగ నిచ్చుచున్ తత విశుద్ధంబైన చిత్తంబుతో
నవలోకించెడి గౌరిపెద్ది కుల పద్మాదిత్యు నర్చింతు, వా
క్ప్రవరుండై శివభారతాది కృతులన్ వర్ధిల్లగా జేసె నా
యవధానాగ్రణి శేషశాస్త్రి గడియారాఖ్యాత వంశ్యున్ సుధీ
స్తవ పాదాబ్జు నుతింతు భక్తి
మెయి విద్వత్కుంజరున్ మాన్యు , భ
వ్య వచః స్మేరముఖీ కృపాస్రవ దకంప ప్రాజ్య కారుణ్య పూ
ర వియన్నిర్ఝరిణీ నిరంతర విహారాదృష్ట సమ్మోద భా
గ్య విశేషమ్మున దిక్తటిన్ వెలిగె గాడేపలీ కృష్టి, ప
ల్లవ పాణిన్ వర శారదన్ దలచు పుల్లాపంతు లాఖ్యాతునిన్
కవి శ్రీ వేంకటరామశర్మను వధానిన్ జ్ఞాను నర్చింతు. వా
గ్రవి జంధ్యాల కులోత్తమున్ సుకవి సుబ్రహ్మణ్యశాస్త్రిన్ మదిన్
స్తవమున్ జేతును
.జోస్యులాన్వయుని సమ్మాన్యున్ సదానంద ధీ
ప్రవరున్ దివ్య వధాన సింహమును సంభావింతు నిచ్చల్ హృదిన్.

భువి మత్తేభ మహద్వధానివరుడీ పూజ్యుండు మద్దూరి స

త్కవితా వాహిని రామమూర్తి యన తా గణ్యంపు మత్తేభమున్

జవనాశ్వంబన మాలికన్ గొలిచిరా సంస్తుత్యులన్ పూజ్యులౌ

యవధాన్యగ్రణులందరిన్ సరసులాహాయంచు మెచ్చన్. భళీ!
🙏🏻
చింతా రామకృష్ణారావు.

19, జనవరి 2020, ఆదివారం

సామూహిక కైలాసగౌరి నోము. 02 . 02 . 2020.

0 comments

జైశ్రీరామ్.
సామూహిక కైలాస గౌరి నోము

కైలాసములో గౌరీదేవి చేసుకున్న నోము భూలోకంలో మనమందరం సామూహికంగా కలిసి చేసుకుందాము.

ది.01-02-2020 శనివారం రధసప్తమి రోజు.

వాసవి కాలనీ , ఆధ్యాత్మిక కేంద్రం , అష్టలక్ష్మీ దేవాలయం దగ్గర , హైద్రాబాద్.

*7500/-*

మీ యొక్క పేర్లు నమోదు చేసుకోవటానికి చివరితేది: 25-01-2020.


మేము మీకు ఇచ్చే సామగ్రి:

పసుపు - 25 kg.
కుంకుమ - 25 kg.
పండ్లు - 108
తమలపాకులు - 216
వక్కలు -108
గాజులు - 216
5 మంది కి భోజనం

వలాటలు , ముక్కు పుడకలు పెట్టుకుని రావలెను.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ : తమ్మన లక్ష్మీ సుజాత   - 8125728881
L manjula 7013479323
V. లక్ష్మీ- 7396555404
కె.ఉమరాణి - 9700406283
ప్రొద్దుటూరి శాంతి - 7675963249
Ch కవిత - 7680922334


నిర్వహించు వారు:
ఐవిఫ్ మహిళా విభాగ్

శంకరాచార్య విరచిత నిర్వాణ షట్కము.భావసహితము

0 comments

జైశ్రీరామ్.
శంకరాచార్య విరచిత నిర్వాణ షట్కము.
1.మనోబుధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్త్రే
న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయు:
చిదానంద రూప: శివోహం శివోహమ్.
భావము-
మనస్సు,బుద్ధి,చిత్తము,అహంకారము అనేటటువంటివి ఏమీ నేను కాను.చెవి,నాలుక,ముక్కు, నేత్రములు మొదలైన ఇంద్రియాలను నేను అసలు కాను.ఆకాశము,భూమి,అగ్ని,వాయువు,నీరు లాంటి పంచభూతాలను నేను కానే కాను . ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
2.న చ ప్రాణ సంజ్నో న వై పంచవాయు:
న వా సప్తధాతు ర్న వా పంచకోశ:
న వాక్పాణిపాదౌ న చోపస్థపాయు:
చిదానంద రూప: శివోహం శివోహమ్.
భావము-
ప్రాణమనే పేరు కలవాడను కాను.ఐదు రకములైన వాయువును కాను.సప్తధాతువులను కానే కాను.పంచకోశములను కాను.మాట,చేయి,పాదములను కాను.సహాయపడే ఇంద్రియాలను కానే కాను.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
3.న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదోనైవ మే నైవ మాత్సర్యభావ:
న ధర్మో న చార్ధో న కామో న మోక్ష:
చిదానంద రూప: శివోహం శివోహమ్.
భావము-
రాగద్వేషాలంటే నాకు తెలియదు.లోభమోహాలు అంటే అసలు తెలియవు. మద మాత్సర్యములు నాకు లేనే లేవు.ధర్మ,అర్ధ,కామ మోక్షములు నాకు అసలు లేనేలేవు. ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
4. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దు:ఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా:
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూప: శివోహం శివోహమ్.
భావము-
పుణ్యపాపాలు,సుఖదు:ఖములు నాకు లేనే లేవు.మంత్రంలేదు,క్షేత్రములు లేవు.వేదములు,యజ్ఞములు అసలు లేనే లేవు.నేను భోజనాన్ని కాను,భోజ్యమును కాను,భోక్తను కూడా కాను.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
5.న మృత్యు ర్న శంకా న మే జాతి భేద:
పితో నైవ మే నైవ మాతా న జన్మ
న బంధు ర్నమిత్రం గురుర్నైవ శిష్య:
చిదానంద రూప: శివోహం శివోహమ్.
భావము-
నాకు మరణంలేదు.మృత్యుభయం,సందేహం లేదు.జాతిభేదములు లేనేలేవు.తండ్రిలేడు,తల్లి లేదు.అసలు నాకు పుట్టుకయే లేదు.బంధుమిత్రులు,గురుశిష్యులు లేనేలేరు.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
6.అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభుత్వాచ్ఛ సర్వత్ర సర్వేంద్రియాణాం
న చా సంగతం నైవ ముక్తి ర్నమేయ:
చిదానంద రూప: శివోహం శివోహమ్.
భావము-
నాకు ఎటువంటి వికల్పములు,బేధములు నాకు లేవు.నేను,నా ఇంద్రియాలు విశ్వమంతా వ్యాపించినట్లు అనిపించుట వలన నాకు సంబంధించని వస్తువులు కానీ,విషయములు కానీ లేనేలేవు.నేను తెలుసుకొన వలసినది మరియూ పొందవలసిన మోక్షమూ లేదు.ఇవేవీ కాకపోతే మరి నేనెవరినీ? చిదానంద రూపము కల శివుడను!శివుడనే తప్ప మరి వేరవరినీ కాను.
జైహింద్.

18, జనవరి 2020, శనివారం

సరస్వతీ వైభవము. శ్రీ ఆకెళ్ళ విభీషణ శర్మ.

1 comments

జైశ్రీరామ్
జైహింద్.

17, జనవరి 2020, శుక్రవారం

శ్రీ సరస్వతీ వైభవమ్. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

సరస్వత్యై నమో నమః

0 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

16, జనవరి 2020, గురువారం

తెలుఁగు వర్ణమాల ప్రాశస్త్యం దేవతాస్వరూపాలు.వాగ్దేవతలు.

1 comments

 జైశ్రీరామ్
తెలుఁగు వర్ణమాల ప్రాశస్త్యం దేవతాస్వరూపాలు.
వాగ్దేవతలు.

తెలుఁగు భాషలో  వాగ్దేవతల యొక్క వర్ణమాల దాని అంతర్నిర్మాణము :
అ నుండి అః.వరకు ఉన్న16 అక్షరాల విభాగాన్ని చంద్ర ఖండము అందురు.
ఈ చంద్రఖండములోని అచ్చులైన 16 వర్ణాలకు  అధిదేవత వశిని అంటే వశపరచుకొనే శక్తి కలది అని అర్ధము.

క నుండి భ వరకు ఉన్న24 అక్షరాల విభాగాన్ని  సౌర ఖండము  అంటారు.
మ నుండి  క్ష వరకు ఉన్న10 వర్ణాల విభాగాన్ని  అగ్ని ఖండము అంటారు.
ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని క్రోమౌజోములను ప్రభావితం చేయగలుగుతాయి.

సౌర ఖండంలోని క నుండి  ఙ వరకు  గల ఐదు అక్షరాల అధిదేవత కామేశ్వరి.
అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధము.
చ నుండి  ఞ వరకు గల ఐదు వర్ణాలకు అధిదేవత మోదిని అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది.
ట నుండి ణ వరకు గల ఐదు అక్షరాల  అధిదేవతా శక్తి విమల అంటే మలినాలను తొలగించే దేవత.
త నుండి న వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత అరుణ  కరుణను మేలుకొలిపేదే అరుణ.
ప నుండి మ వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత జయని జయమును కలుగ చేయునది.
అదే విధముగా అగ్ని ఖండములోని య, ర,ల, వ అనే అక్షరాలకు అధిష్టాన దేవత సర్వేశ్వరి. శాశించే శక్తి కలది సర్వేశ్వరి.
ఆఖరులోని ఐదు అక్షరాలైన శ, ష, స, హ, క్ష లకు అధిదేవత కౌలిని.
ఈ అధిదేవతలనందరినీ వాగ్దేవతలు అంటారు.

అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది.ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి అద్భవించింది.అంటే బ్రహ్మమే శబ్దము. ఆ బ్రహ్మమే నాదము.

మనం నిత్యజీవితములో  సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి.
అదే మంత్రాలు, వేదం అయితే ఇంకా లోతుగా ప్రభావం చూపుతుంది భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి అమ్మవార్లును అర్చిస్తున్నాయి.కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా, వేద మంత్రాలు, సూక్తులు వింటున్నా మనం ఈ విషయం స్ఫురణలో ఉంచుకుంటే అద్భుతాలను చూడవచ్చు.

మనం చదివే స్తోత్రం ఎక్కడో వున్న దేవుడిని/దేవతను  ఉద్దేశించి కాదు,
మనం చదివే స్తోత్రమే ఆ దేవత.మనం చేసే శబ్దమే ఆ దేవత
మన అంతఃచ్ఛేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత.
ఆ శబ్దం వలన పుట్టిన నాదం దేవత. ఎంత అద్భుతము ఇది సనాతన ధర్మం.ఇది మనకు మాత్రమే పరిమితమైన
అపూర్వ సిద్ధాంతము.
జైహింద్.

15, జనవరి 2020, బుధవారం

అరసున్నా....బండీరా..ఱ......వివిధ వీయస్సెన్ పద్మ

1 comments

జైశ్రీరామ్.
*ఎవరు రాసారో తెలియదు.  "అరసున్న" ,(బండి ర) "ఱ" గురించి వాట్సాప్ లో ఎవరో షేర్ చేశారు.*

*అరసున్న [ఁ],*
*బండి 'ఱ' లు ఎందుకు?*

*అరసున్న~బండి ‘ఱ‘ లు*
*నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు.*

*ఐతే ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి.*

*ద్రావిడ భాషా లక్షణాన్ని నిరూపించేవి.*

*అంతేకాదు*
*కావ్యభాషలోను,*
*లక్షణశాస్త్రంలోను*
*వీటి ప్రాముఖ్యం చాలావుంది.*

*వాడకపోతే పరవాలేదు*
*కానీ*
*వీటిగురించి తెలుగువాడు తెలుసుకోవాలిగదా!*

*మన భాషాసంపదలో*
*ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా!*

*అరసున్న, ఱ ల వల్ల*
*అర్థభేదం ఏర్పడుతొంది.*

*పదసంపదకి ఇవి తోడ్పడతాయి.*

*ఎలాగో చూడండి:*
*ఉదా*:-

*అరుఁగు*
*= వీది అరుగు*

*అరుగు*
*= వెళ్ళు, పోవు*

*అఱుగు*
*= జీర్ణించు*

*ఏఁడు*
*= సంవత్సరం*

*ఏడు*
*= బాధ~7 సంఖ్య*

*కరి*
*= ఏనుగు*

*కఱి*
*= నల్లని*

*కాఁపు*
*= కులము*

*కాపు*
*= కావలి*

*కాఁచు*
*= వెచ్చచేయు*

*కాచు*
*= రక్షించు*

*కారు*
*= ఋతువుకాలము*

*కాఱు*
*= కారుట (స్రవించు)*
(కారు=వాహనం ఆంగ్ల పదము)

*చీఁకు*
*= చప్పరించు*

*చీకు*
*= నిస్సారము, గ్రుడ్డి*

*తఱుఁగు*
*= తగ్గుట*

*తఱుగు*
*= తరగటం(ఖండించటం)*

*తరి*
*= తరుచు*

*తఱి*
*= తఱచు*

*తీరు*
*= పద్ధతి*

*తీఱు*
*= నశించు*

*దాఁక*
*= వరకు*

*దాక*
*= కుండ, పాత్ర*

*నాఁడు*
*= కాలము*

*నాడు*
*= దేశము, ప్రాంతము*

*నెరి*
*= వక్రత*

*నెఱి*
*= అందమైన*

*నీరు*
*= పానీయం*

*నీఱు*
*= బూడిద*

*పేఁట*
*= నగరములో భాగము*

*పేట*
*= హారంలో వరుస*

*పోఁగు*
*= దారము పోఁగు*

*పోగు*
*= కుప్ప*

*బోటి*
*= స్త్రీ*

*బోఁటి*
*= వంటి [నీబోఁటి]*

*వాఁడి*
*= వాఁడిగాగల*

*వాడి*
*= ఉపయోగించి*

*వేరు*
*= చెట్టు వేరు*

*వేఋ*
*= మరొకవిధము*

*మన తల్లిదండ్రులు*
*మన మాతృభాష*
*ఎంతో విలువైనవి*

*గుర్తుంచుకుందాం*
*గౌరవించుకుందాం*

*ఇవి మన సంపద*
*తెలుసుకుని సంతోషపడదాం*
జైహింద్.

14, జనవరి 2020, మంగళవారం

భోగి శుభాకాంక్షలు.

1 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! 
 నేడు భోగి పండుగ
మీకందరికీ భోగి పండుగ శుభాకాంషలు..
మీ యింట పౌష్య లక్షి ఆనంద నాట్యము చేయుగాక. మీరంతా సంతోషంతో ఉదారగుణ సంభరితులై దానధర్మాది సచ్చరితములతో వర్ధిల్లుదురు గాక.
జైహింద్.

13, జనవరి 2020, సోమవారం

ఏడువారాల నామసార్ధక్యం.

2 comments

జైశ్రీరామ్.
వారానికి ఏడు రోజులు 
ఎందుకు 

_రోజుకు 24 గంటలు కదా hour అనే పదం ఎక్కడిది ?_

_ఆదివారం తర్వాత సోమవారం ఎందుకు ? మంగళ వారం రావొచ్చుగా ?

ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పే మందు  మనలో కూడా చాలా మందికి తెలియని విషయాలు తెలుసుకోవలసి ఉంది.

ప్రపంచంలో ఏదేశానికి లేని జ్ఞాన సంపద మన సొత్తు.

ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుండి
మిగతా దేశాలు వారు గ్రహాలు అంటే ఏంటో తెలియక ముందే నవ గ్రహలను గుర్తించిన ఘనత మనదే.

ఏ రోజు ఎప్పుడు సూర్యోదయం అవుతుంది ?ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుంది ?

ఎప్పుడు చంద్రగ్రహణం ? ఎప్పుడు సూర్యగ్రహణం ?

ఏ కార్తెలో ఏ పంట పండించాలి ఇవన్నీ కూడా మన భారతీయులు చేతి వేళ్ళు లెక్కలతో వేసి చెప్పినవే..ఎటువంటి పరికరాలు టెలిస్కోపులు లేకుండా సాధించినవే.

పైన ప్రశ్నకి సమాధానం

మన వాడుకలో ప్రతి రోజుకి ఒక పేరు ఉంది. ఆది వారము, సోమ వారము, మంగళ వారము, బుధ వారము, గురు వారము, శుక్ర వారము, శని వారము. ఇవి ఏడు. ఇలా ఈ ఏడు రోజులకు ఏడు పేర్లు ఎందుకు పెట్టారు ?

ఆ పేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి వుంది. నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు. ఆ పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలున్నందునే ఆ పేర్లే ప్రపంచ వ్యాప్తంగా ఆచరణలో నేటికి ఉన్నాయి.

భారత కాలమానంలో  హోరా అనగా ఒక గంట అని అర్థం. దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు HOUR. ఒక రోజుకు 24 గంటలుంటాయి, అంటే 24 హోరాలు. ఒక రోజులో ఉన్న 24 గంటలు (24 హోరాలు) కూడా ఏడు హోరాల చక్రంలో తిరుగుతాయి.. ఆ 7 హోరాలకి ఏడు పేర్లున్నాయి. అవి వరుసగా... (ఈ వరుసలోనే) శని, గురుడు, కుజుడు, రవి, శుక్ర, బుధ, చంద్ర హోరాలు ప్రతి రోజూ వుంటాయి.

ఈ 7 హోరాలే ప్రతి రోజు 24 గంటల్లో ఉంటాయి. 7 గంటల కొకసారి ఈ 7 హోరాలు పూర్తీ అయ్యాక మళ్ళీ మొదటి హోరాకి వస్తుంది.. అంటే శని హోరా నుండి చంద్ర హోరాకి మళ్ళీ శని హోరాకి.

ఉదాహరణకు ఆదివారము రవి హోరాతో ప్రారంభం అయి మూడు సార్లు  పూర్తికాగా (3 సార్లు 7 హోరాలు 3x7 = 21 హోరాలు) 22వ హోరాపేరు మళ్ళీ రవి హోరా వస్తుంది. 23వ హోరా పేరు ఆ వరుసలో శుక్ర హోరా అవుతుంది. 24 వ హోరా బుధ హోర అవుతుంది. దాంతో ఒక రోజు పూర్తవుతుంది.

ఆ తర్వాత హోరా 25వ హోరా. అనగా తరువాతి రోజు మొదటి హోరా దాని పేరు చంద్ర హోరా. అనగా సోమవారము. అనగా చంద్ర హోరాతో ప్రారంభ మౌతుంది. ఏరోజు ఏ హోరాతో ప్రారంభమవుతుందో ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు వుంటుంది.

చంద్ర హోరాతో ప్రారంభమైనది గాన అది సోమ వారము. ఈ విధంగానే మిగిలిన దినములు కూడా ఆయా హోరాల పేరన పేర్లు ఏర్పడతాయి.

రవి (సూర్యుడు) హోరాతో ప్రారంభం = రవివారం, ఆదిత్య అన్నా కూడా సూర్యుడు పేరే. కావుననే ఆదివారం, భానుడు అన్న కూడా సూర్యుడే భానువారం (కర్ణాటక, తమిళనాడులో భానువారం వాడుతారు) ఇలా ఆయా హోరాలు బట్టి రోజుల పేర్లు వచ్చాయి.

ఆదివారం తరవాత సోమవారం ఎందుకు రావాలి ? మంగళ వారం రాకూడదా ?

రాదు.... ఏందుకంటే ఆదివారం రవి హోరా ప్రారంభం అయ్యింది, తరువాత రోజు అంటే సోమవారం చంద్ర హోరాతో ప్రారంభం అయ్యింది కాబట్టి.

ఇది మన భారతీయుల గొప్పతనం.. ఈ విషయాలు తెలియక మనల్ని మనం చిన్న చూపు చూసుకుంటాం.

ప్రపంచంలో దేశమయినా మన పద్ధతి ఫాలో అవ్వాల్సిందే.. కానీ మనకి మాత్రం మనం అన్నా మన దేశమన్నా లోకువ.

ఇంత నిర్థిష్టమైన పద్ధతిలో వారమునకు పేర్లు పెట్టారు గనుకనే భారతదేశ సంప్రదాయాన్ని ప్రపంచమంతా అనుసరిస్తున్నది.


జైహింద్.

12, జనవరి 2020, ఆదివారం

శ్రీశైల మల్లన్నను పాల్కురికి సోమన్న అచ్చులు,హల్లులతో చేసిన స్తుతి.

0 comments

జైశ్రీరామ్.
శ్రీశైల మల్లన్నను పాల్కురికి సోమన్న అచ్చులు,హల్లులతో చేసిన స్తుతి.

'అ'ఖిల లోకాధార
'ఆ'నంద పూర
'ఇ'న చంద్ర శిఖి నేత్ర
'ఈ'డితామల గాత్ర
'ఉ'రు లింగ నిజరూప
'ఊ'ర్జితా జలచాప
'ఌ'లిత తాండవకాండ
'ౡ'నికృతా జాండ
'ఏ'కైక వర్యేశ
'ఐ'క్య సౌఖ్యా వేశ
'ఓం' కార దివ్యాంగ
'ఔ'న్నత్య గుణ సంగ
'అం'బికా హృదయేశ
'అః'స్తోక కలనాశ

'క'నద హీనాభరణ
'ఖ'ల జలంధర హరణ
'గ'ల నాయక విధేయ
'ఘ'న భక్తి విజేయ
'జ'శ్చూల కాలధర
'చ'రిత త్రిశూల ధర
'ఛ'ర్మ యాధ్వస్త
'ఞ'న గుణ ధళ ధీర
'ట' త్రయాది విదూర
'ఠ' ప్రభావాకార
'డ'మరుకాది విహార
'ఢ' వ్రాత పరిహార
'ణ' ప్రవాగార
'త'త్త్వ జోనేత
'థ'వి దూర జవ పక్ష
'ద'వన పాలన దీక్ష
'ధ'రణీ థవోల్లీడ
'నంది కేశారూఢ
'ప'ర్వతీశ్వర లింగ
'బ'హుళ భూత విలాస
'భ'క్త్వ హృద్వ నహన
'మం'త్రస్తుతోధార
'య'క్ష రుద్రాకార
'ర'తిరాజ బిన హంస
'ల'లిత గంగోత్తంస
'ళ'మా విదవ్రంశ
'వ'రద శైల విహార
'శ'ర సంభ వాస్ఫార
'ష'ట్తింశ తత్త్వగత
'స'కల సురముని వినుత
'హ'రి నేత్ర పదపద్మ- అంశిత భూధరపద్మ
'క్ష'ర రహిత చరిత్ర - అక్షరాంక స్తోత్ర
శ్రీ పర్వత లింగ
నమస్తే నమస్తే నమస్తే నమః
 జైహింద్.

11, జనవరి 2020, శనివారం

శ్రీ శివాపరాధక్షమాపణ స్తోత్రమ్.

0 comments

జైశ్రీరామ్
శివాపరాధ క్షమాపన స్తోత్రమ్ 

ఆదౌ కర్మప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం 
విణ్మూత్రామేధ్యమధ్యే క్కథయతి నితరాం జాఠరో జాతవేదాః | 
యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం 
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో ||౧|| 

బాల్యే దుఃఖాతిరేకాన్మలలులితవపుః స్తన్యపానే పిపాసా 
నో శక్తశ్చేన్ద్రియేభ్యో భవగుణజనితా జన్తవో మాం తుదన్తి | 
నానారోగాదిదుఃఖాదుదన పరవశః శంకరం న స్మరామి 
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో || ౨|| 

ప్రౌఢోఽహం యౌవనస్థో విషయవిషధరైః పంచభిర్మర్మసన్ధౌ
దష్టో నష్టోఽవివేకః సుతధనయువతిస్వాదుసౌఖ్యే నిషణ్ణః | 
శైవీ చిన్తావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం 
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో || ౩|| 

వార్ధక్యే చేన్ద్రియాణాం విగతగతిమతిశ్చాధిదైవాది తాపైః 
పాపైర్రోగైర్వియోగై-స్త్వనవ సితవపుః ప్రౌఢిహీనం చ దీనమ్ |
మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యం 
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో ||౪|| 

నో శక్యం స్మార్తకర్మ ప్రతిపదగహనప్రత్యవాయాకులాఖ్యం 
శ్రౌతే వార్తా కథం మే ద్విజకులవిహితే బ్రహ్మమార్గే సుసారే | 
జ్ఞాతో*ధర్మో విచారైః శ్రవణమననయోః కిం నిదిధ్యాసితవ్యం 
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో ||౫|| 

స్నాత్వా ప్రత్యూషకాలే స్నపనవిధివిధౌ నాహృతం గాంగతోయం 
పూజార్థం వా కదాచిద్వహు-తరగహనాత్ఖణ్డబిల్వీదలాని | 
నానీతా పద్మమాలా సరసి వికసితా గన్ధపుష్పైస్త్వదర్థం 
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో ||౬|| 

దుగ్ధైర్మధ్వాజ్య యుక్తైర్దధిసితసహితైః స్నాపితం నైవ లింగం 
నో లిప్తం చన్దనాద్యైః కనక విరచితైః పూజితం న ప్రసూనైః | 
ధూపైః కర్పూరదీపైర్వివిధరసయుతైనైవ భక్ష్యోపహారైః 
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభోll౭|| 

ధ్యాత్వా చిత్తే శివాఖ్యం ప్రచురతరధనం నైవ దత్తం ద్విజేభ్యో 
హవ్యం తే లక్షసంఖ్యైర్హుతవహవదనే నార్పితం బీజమన్త్రైః | 
నో తప్తం గాంగతీరే వ్రతజపనియమై రుద్రజాప్యైర్న వేదైః
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో ||౮|| 

స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయమరుత్కుణ్డలే సూక్ష్మమార్గే 
శాన్తే స్వాన్తే ప్రలీనే ప్రకటితబిభవే జ్యోతిరూపేఽపరాఖ్యే | 
లింగజ్ఞే బ్రహ్మవాక్యే సకలతనుగతం శంకరం న స్మరామి 
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో ||౯|| 

నగ్నో నిఃసంగశుద్ధస్త్రిగుణవిరహితో ధ్వస్తమోహాన్ధకారో 
నాసాగ్రే న్యస్తద్రుష్టిర్విదితభవగుణో నైవ ద్రుష్టః కదాచిత్ | 
ఉన్మన్యాఽవస్థయా త్వాం విగతకలిమలం శంకరం న స్మరామి 
క్షన్తవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీమహాదేవ శంభో || ౧౦|| 

చన్ద్రోద్భాసితశేఖరే స్మరహరే గంగాధరే శంకరే 
సర్పైర్భూషిత కణ్ఠకర్ణవివరే నేత్రోత్థవైశ్వానరే | 
దన్తిత్వక్కౄతసున్దరాంబరధరే త్రైలోక్యసారే హరే 
మోక్షార్థం కురు చితవృత్తిమఖిలామన్యైస్తు కిం కర్మభిః || ౧౧|| 

కిం వాఽనేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం 
కిం వా పుత్రకళత్ర-మిత్రపశుభిర్దేహేన గేహేన కిమ్ 
జ్ఞాత్వైతత్క్షణభఙ్గురం సపదిరే త్యాజ్యం మనో దూరతః 
స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీవల్లభమ్ || ౧౨|| 

ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం 
ప్రాత్యాయాన్తి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః 
లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం 
తస్మాన్మాం శరణాగతం శరణద త్వం రక్ష రక్షాధునా || ౧౩|| 

కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా 
శ్రవణనయనజం వా మానసం వాఽపరాధమ్ | 
విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ 
జయ జయ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో|| ౧౪|| 

ఇతి శ్రీమచ్ఛఙ్కరాచార్యవిరచితం శివాపరాధక్షమాపనస్తోత్రం సంపూర్ణమ్ ||

10, జనవరి 2020, శుక్రవారం

నక్షత్రముతో....చమత్కారపద్యము.

1 comments

జైశ్రీరామ్. 
చమత్కారపద్యము.

నక్షత్రము గల చిన్నది
నక్షత్రము చేతబట్టి నక్షత్రప్రభున్
నక్షత్రమునకు రమ్మని
నక్షత్రము పైనవేసి నాథుని పిలిచెను.

ఇందులో నాలుగు నక్షత్రాలు దాగి ఉన్నాయి. పదే పదే చదివితేనే కానీ అంతసులువుగా అర్థమయేవికావు. ఇటువంటి ప్రహేళికలను'ప్రముషితా' ప్రహేళికలని అంటారని కవి దండి తన'కావ్యాదర్శం' లో చెప్పాడు.

ఇప్పుడు వివరణ చూద్దాం!
మహాభారతంలో విరాటపర్వం చదువనివారుండరు. విరాటరాజు కుమార్తె "ఉత్తర" (నక్షత్రం పేరు ) ఆమె అభిమన్యుని భార్య.
నక్షత్రము చేతబట్టి అంటే కుంకుమ పాత్ర "భరణిని" ( నక్షత్రం పేరు ) చేతిలో పట్టుకొని ; నక్షత్రప్రభున్ నక్షత్రాలకు ప్రభువైన చంద్రుని వంశపు ( చంద్రవంశము ) అభిమన్యుని; నక్షత్రమునకు రమ్మని అంటే ఒక "మూల" ( నక్షత్రం పేరు ) కు రమ్మని పిలిచి;
నక్షత్రము పైనవేసి అంటే "హస్త" (నక్షత్రం పేరు ) మును అతని మీదవేసి; నాథుని పిలిచెన్ అంటే పతియైన అభిమన్యుని ప్రేమగా పిలిచిందట.

అమ్మో! ఈ పద్యం అర్థంకాకుంటే మీకు నిజంగానే నక్షత్రాలు కనిపించేవి కదూ! అదీ మరి కవి చమత్కారమంటే!
జైహింద్.

9, జనవరి 2020, గురువారం

చమత్కారం.

1 comments

జైశ్రీరామ్.
ఒక మహా కవి మరో మహాకవిని పొగిడితే ?
చ: మతి , ప్రభ , నీగి, పేర్మి , సిరి , మానము పెంపున ;భీమునిన్ ;బృహ
స్పతి , రవి ,కర్ణు , నర్జును , కపర్ది , సుయోధను , బోల్పఁబూన ; నా
మతకరి , తైక్ష్ణు , దుష్కులు , నమానుషు , భిక్షు , ఖలాత్ము నెంచ; వా
క్సతిపు , శశిన్ , శిబిన్ , గొమరుసామిని , మేరువు , నబ్ధి , బోల్చెదన్ !
----- చాటు పద్యము;

ఈపద్యంతో ఒకమహాకవి మరియొక మహాకవిగారికి వాక్సన్మానం జేస్తున్నారు. ఎంత గొప్పగా చెప్పారో గమనించండి. అర్ధం గావటం కొద్దిగా కష్టం. మనసు జేసికొని చదవాలి.
"ఈమహాకవి మతిలో బృహస్పతి, కాంతికి సూర్యుడు , దానంలో కర్ణుడు ,పేర్మి (గొప్పతనం) లో అర్జునుడు, సంపదలతో శంకరునివంటివాడు , అభిమానపుపెంపున సుయోధనుడు'- అని (యీభీమకవిని ) నేను చెప్పదలచుటలేదు. ఎందుకంటే?
ఆబృహస్పతి మొదలగువారిలో కొన్ని దోషాలున్నాయి. ఎలాగంటారా?
బుధ్ధికి బృహస్పతి యందామంటే అతడు వట్టి మాటకారిమాత్రమే తెలివి సున్న.తెలివైన వాడైతే పెళ్ళాన్ని చంద్రున కప్పగిస్తాడా? అందుచేత సాక్షాత్తు బ్రహ్మకు సమానుడనేయంటాను. తేజస్సులో సూర్యుని వంటివాడని నేను చెప్పను.సూర్యనికాంతిలో వేడిమి ఉంటుంది. అందుచేత యితనిని చల్లని వెన్నెలగురిసే చంద్రుడనే యంటాను. దానంలో యితనిని
కర్ణుడని నేననను. కర్ణుడు హీనకులజుడు. అందుచేత యితనిని శిబిగా భావిస్తాను. పరాక్రమంలో యితనిని క్రీడితో నేపోల్చను. ఎందుకంటే , అతడు నపుంసకుడు. కాబట్టి కుమారస్వామితో నే పోలిక చెపుతాను. సంపదదల పెంపులో నితనిని శంకరునితో పోల్చను.ఎందుకంటే యెంతున్నా అతడు బిచ్చగాడే! అందువలన నేనితనిని మేరుపర్వతముతో సమానుడంటాను. అభిమానాధిక్యంలో నేనితనిని సుయోధనునకు సరియనను. ఎందుకంటే అతడు దుశ్చింతనాపరుడు(ఖలుడు) అందువలన నేనితనిని మహా గంభీరుడైన సముద్రునితో సమానుడంటాను.
' అని నన్నయ భట్టుగారు తనకు సమకాలికుడైన వేములవాడ భీమకవిని పొగడినారట! నిజమెంతో తెలియదుగాని, పద్యము మాత్రము పసందుగ నున్నది.
" క్రమాలంకారము"
స్వస్తి.
జైహింద్.

8, జనవరి 2020, బుధవారం

"అనన్తరత్నప్రభవస్య యస్య......మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
"అనన్తరత్నప్రభవస్య యస్య,
హిమం న సౌభాగ్యవిలోపి జాతమ్‌,
ఏకో హి దోషో గుణసన్నిపాతే,
నిమజ్జతీందోః కిరణే ష్వివాంకః" (కుమారసంభవము.)
క. గుణ సంహతినొకదోషము
కనఁబడు. గుణంబు చెడదు. ఘనతనె యొప్పున్.
కనఁబడు వెన్నెలె. యందన
కనుమరుగగు గాదె మచ్చ? కాంచఁగ మనకున్.
భావము.
సుగుణములు కుప్పలు కుప్పలుగా నున్నపుడు ఒకదోషమున్నను అది వానిలో మునిగి కలిసిపోవును గాని వస్తువునకు కళంకము తెచ్చిపెట్టనేఱదు. ఉదా- సుధాకరుని కిరణములయందు నల్లనిమచ్చ.
జైహింద్.

7, జనవరి 2020, మంగళవారం

ఒక్క దినముననే వ్రాసిన శ్రీ చంద్రమౌళీశ్వర శతకము. రచన. చింతా రామకృష్ణారావు. తే. ౧౬ - ౧౧ - ౨౦౧౯

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

6, జనవరి 2020, సోమవారం

నరాల రామారెడ్డి

0 comments

జైశ్రీరామ్.
నరాల వారి సాహిత్యం.
వ్యాస రచన అజ్ఞాత మహనీయుఁడు
హాలునికి తెలుఁగు మౌక్తికహారం
నరాల రామారెడ్డి అనువాదం.

ఆధునిక సాహిత్యంలో స్రవంతులైన అభ్యుదయ, దళితవాద మొదలైన సాహిత్యాలకు మూలం వర్గ చైతన్యం. సమాజంలోని ప్రజలను ఆర్థిక, సామాజిక అంశాల ప్రాతిపదికన  ఊహించుకుని వర్గాలు చేసి ఆయా జనసమూహాల ప్రయోజనాలను కాపాడేందుకు వారిని అప్రమత్తంగా ఉంచేది వర్గ చైతన్యం. దానికంటే ముందుగా పుట్టవలసినది  సామాజిక స్పృహ, అనగా వర్గాలకతీతంగా సమాజంలో ప్రాథమికంగా ఉండవలసిన మానవీయ విలువలు, సంబంధాలు. అటువంటి అంశాలను ప్రకటించే సాహిత్యాన్ని వేలయేళ్ళ భారతీయ కావ్య జగత్తులో మొదటగా ఎవరు సృశించారు? ఆ ప్రశ్నకు సమాధానం వెదుక్కుంటూ వెనక్కుపోతే కనబడేది శాలివాహనుడు సంకలనం చేసిన గాథా సప్తశతి. శాలివాహనునికి హాలుడు అనే పేరు కూడా ఉన్నది. ఎప్పుడో 1వ శతాబ్దంలో సాహిత్యయుగం సంధ్యాసమయంలో వెలుగుచూసినదీ  గాథా సంకలనం. గీర్వాణభాష ( దేవ భాషైన సంస్కృతం) కు సమాంతరంగా ప్రయాణించి అధికారంలో ఉన్న వారి గురించే కాక సమాజంలోని లోతులను తెరచి చూపయత్నించింది ప్రాకృత భాషా సాహిత్యం. సంస్కృతం పురుషుడి గొంతుక వలె పరుషంగా ఉంటే, ప్రాకృతం స్త్రీ కంఠంలా కోమలంగా ఉంటుందని ప్రాకృతకవులు గర్వంగా చెప్పుకొంటారు. ఆ భాషలో రాయబడిందీ గాథా సప్తశతి.

మరి సామాజిక స్పృహకు చెందిన అంశాలున్న ప్రాచీన సాహిత్యం కావడం వల్లనే ఆ గాథలు  ప్రముఖావధాని, విద్వత్కవి, ఆశుకవనరచనాచతురుడు నరాల రామారెడ్డి గారిని ఆకర్షించాయి. మొదటినుండీ అవధానక్రీడలో భావుకత, వీలైనచోటల్లా సరళతను కనబరుస్తూ అవధాన కళను సమాజానికి మరింత చేరువగా తీసుకొని పోవడానికి ప్రయత్నించి,  నేటి కాలపు అవధాన జగత్తులో ప్రత్యేక స్థానం చాటుతూవచ్చిన రామారెడ్డి గారు సహజంగానే ప్రాకృతకవిత్వం పై అభిమానం పెంచుకున్నారు. ఏడువందల పద్యాలను తీసుకుని ఆనాటి సాంఘిక జీవనానికద్దం పట్టే మూడువందల ప్రాకృత గాథలను ఎంచుకొని తెలుగు చేశారు. మూలాన్ని ప్రాకృతం నుండి కాక సంస్కృతానువాదమైన “ఛాయ” ను తీసుకుని, వాటిలోని శ్లోకాలను తెలుగుదనం ఉట్టిపడే విధంగా తేటగీతి ఛందస్సునెంచుకొని అనువాదం చేశారు.

శృంగార, కరుణ, హాస్య రసాలు ప్రధానంగా కలిగిన ఈ గాథలలో రామారెడ్డి గారు తన అవధానవిద్యలో వారు ప్రదర్శించిన పాండిత్యం, ప్రతిభ తోపాటు భావుకతను కూడా జోడించి స్వతంత్ర రచనలాగా వెలువరించారు. పదులఏళ్ళుగా పద్యాలతో గాలిలో బంతులాడిన అనుభవం వారిది, అనువాద పద్యాలు చెక్కినట్టుగా వచ్చాయి.

తే॥
అమృతధామ! నిశాతిలకాభిరామ!
చల్లచల్లని మామ! ఓ చందమామ!
ధవునిరమణీయగాత్రమ్ము తాకినట్టి
శీతకరముల నన్ను స్పృశించుమోయి!

భావము = ఓ అమృతనిలయా! రాత్రి అనే రమణి ముఖానికి రమ్యమైన తిలకం వంటి వాడవు నీవు.చల్ల చల్లని మామవు. చందమామవు. నీవు నా ప్రాణ వల్లభుని స్పృశించిన కిరణాలతో నన్ను కూడా స్పృశించు.

విశేషము = మూలంలో లేని “చల్లచల్లని మామ ఓ చందమామ” పదాలను జోడించి తెలుగు వెన్నెల చల్లదనాన్ని కురిపించారు నరాల గారు.

తే॥
‘ఎన్ని మాఱులు నన్ను మర్దింతువోయి!
ఇంక చాలును నను విసర్జింపవోయీ’
అంచు జీర్ణవస్త్రము విలపించినట్లు
అంబుకణములు స్రవియించెనంచులందు.

అంచు = అనుచు

భావము = “ఎన్నిసార్లు నన్ను బండకేసి బాదుతావయ్యా! ఇప్పటికైనా నన్ను వదలి పెట్టవయ్యా!” అని ఒక బీదవాని చినిగిపోయిన పాతపంచె ఏడుస్తున్నదేమో అన్నట్లు చిరుగుపాత అంచుల నుండి నీటిబొట్లు కారుతున్నాయి.

విశేషము = ఆ నాటి సమాజంలోని ఒక పేదవాడి పాత పంచె ఏ స్థితి లో ఉందో హాలుడు చెప్పకపోతే మనకిప్పుడు తెలిసేదా! మనకు కూడా అంబు కణాలు జీరగా నిండలేదూ ?! ఎంతటి సామాజిక స్పృహ కవిది.

తే॥
మొదటిసారి గర్భిణియైన ముగ్దగాంచి
ఇంతి! యేవి వస్తువులు నీకిష్టమనుచు
సుదతులందఱు ప్రశ్నించ చుట్టుముట్టి
నాతిచూపులు ప్రసరించె నాథువైపు

భావము =మొదటి సారి గర్భవతియైన ఒక ముగ్దురాలిని చుట్టుముట్టిన సకియలు ‘ఏఏ వస్తువులు నీకు ఇష్టమో’ చెప్పమన్నారు. సిగ్గలుమొగ్గ అయిన ఆ ముగ్దచూపులు ఆమె ప్రాణవల్లభుని వైపు ప్రసరించినాయి

విశేషము = మగనికన్నా రుచికరమైన, ఇష్టమైన వస్తువు ప్రపంచంలో ఇంకేముందని ఆ ముగ్ద చూపులిచ్చిన ప్రౌఢసమాధానం. గర్భిణి చుట్టూ చేరిన అమ్మలక్కలు, వారడిగే ప్రశ్నలు, ఆ అనురాగాలు, ఆ మెత్తటి భావనలు, ఆ కాలం నుండే ఉన్నాయా అని ఆశ్చర్యపడడం ఇక పాఠకుడి వంతు.

తే॥
గగనలక్ష్మి కంఠము నుండి గళితమైన
పద్మరాగగారుత్మతభాసమాన
కంఠహారము కైవడి కాంచుమోయి!
రామచిలుకలు బారుగా వ్రాలుచుండె

భావము = గగనలక్ష్మి కంఠసీమనుండి కెంపులు, గరుడపచ్చలు చెక్కిన కంఠహారం నింగినుండి జారిపడుతున్నట్లు రామచిలుకల బారు నేలమీద వ్రాలుతున్నది చూడు

విశేషం = చిలుకల ముక్కులు పద్మరాగ మణుల్లా, చిలుకల శరీరాలు మరకత మణుల్లా భాసిస్తున్నాయని భావం. ‘బారుగా వ్రాలుచుండె’ - ‘బారుగా’ అన్న తెలుగు నుడికారం ఈ చిత్రానికి స్పష్టతనూ, విస్తృతినీ ఇచ్చిందంటారు పి. రామకృష్ణ గారు నరాల వారి అనువాదం ముందు మాటలో. కృష్ణ శాస్త్రికి సైతం భావుకతను నేర్పిన భావనలా లేదూ భావన !! ఎంతటి గొప్ప సమాజమో అది, అంత భావనలు పోయారు.

ఈరీతిలో రామచిలుకలు బారులుగా వ్రాలినట్లు,  ముత్యాల్లాంటి పద్యాలు బారులుగా పేర్చబడి హారం రూపం దాల్చాయా అన్నట్లుగా ఉంది. అందుకేనేమో సినారే గారు ముందు మాటలో “రామారెడ్డి గారు అనువాద రూపంలో తెలుగు వారికి మరో కవితామౌక్తికహారం అందించారు” అన్నది. అందుకేనేమో అంతగా పలవరించి సినారే గారన్నది “ప్రతిభా వ్వుత్పత్తులను అతులిత రూపంలో మేళవించుకొన్న కవితాశిల్పి రామారెడ్డి గారు” .

నరాల రామారెడ్డి గారందించిన ఆ మౌక్తికహారం రచన పేరు “ గాథా త్రిశతి - శాలివాహనప్రాకృత గాథలకు ఆంధ్రానువాదం”.
జైహింద్.

5, జనవరి 2020, ఆదివారం

ఆత్మచెప్పిన కథ....శ్రీ రంగావజ్ఝల మురళీధరరావు.

0 comments

జైశ్రీరామ్.
ఆత్మకథ. శ్రీ రంగావజ్ఝల మురళీధరరావు.
          దేహం నేను కాకపోతే "నేను ఎవరు?" అంటే ఆత్మ చెప్పిన కథ విందాం అందరం.
           నీ కథ - నా కథ - మన కథ
 నీవు అచంచలాత్ముడవు. నిత్యుడవు. సత్యమిదే. నీలో ఉన్న సత్యమిది. నీ యథార్థస్థితి ఇది. ఈ శాశ్వతత్త్వం నీలో ఉంది. అవినాభావంగా ఉంది. అంటుకోకుండ ఉండి, నిన్ను, నడిపిస్తున్న చైతన్యమే నీవు. నీవు లేని మేను ఉండదు. నీవు ఉంటే మేను ఉంటుంది. మేనును నమ్మకండి. దానిపై అహంకార, మమకారాలు పెంచుకోకండి. మేను అశాశ్వతం. అశాశ్వతాన్ని వదలండి. బయట మేను. లోపల నీవు. లోపలకు చూడండి. మనసు ఆలోచనలన్నింటినీ ఆత్మపై ఉంచండి. నిర్మలం, నిశ్శబ్దంగా మీ లోని ఆత్మను చూడండి.
           "లోకంబులు లోకేశులు
             లోకస్థులుఁ దెగిన తుది నలోకంబగు పెం
             జీకటి కవ్వల నెవ్వం
             డేకాకృతి వెలుంగు నతని నే సేవింతున్" అని భాగవతం చెప్పింది. లోకాలు మూడు..మెళకువ, కల, నిద్ర..లోకేశులు..దేవతలు. వాటికి ఆధారమైన చైతన్య పరిధులు మూడు..విశ్వుడు, తైజసుడు , ప్రాజ్ఞుడు.. లోకస్థులు..మూడు లోకాలను అనుభవించేవి=ఇంద్రియాలు అంతఃకరణము , అహంకారం మొదలగునవి . తెగిన తుది అనగా నశించాక. అంటే ఇవేవీ అందుకోలేని .. అలోకంబగు పెన్జీకటికవ్వల..శూన్యావస్థను కూడా మించి ఎవ్వండు..ఎవడైతే ఉన్నాడో.. ఏకాకృతి వెలుగు..అంటే..నిర్వికల్ప నిశ్చల స్థితిలో, ఈ మూడు లోకాలను కూడా అంతర్యామి యై వ్యాపించిన ఏకాకృతిలో.. వెలుగు.. అంటే.. జ్యోతిగా కనిపిస్తాడో .. అంతర్ముఖులై ..వెదకి చూచిన..కనిపిస్తాడు. అటువంటి పరమాత్ముడైన శ్రీమహా విష్ణు మూర్తి నే.. సేవింతున్. .ప్రార్ధిస్తాను ! అని గజేంద్రుడు మొరపెట్టుకుంటాడు. అలా  అందరూ, అంతా నశించాక, గాఢాంథకారానికి , విశ్వానికి అవతల అఖండంగా, ఏకంగా వెలుగుతున్న పరమాత్మ
 వెలుగును చూడండి.  అదే ఆత్మ జ్యోతి. అదే నీవు. అదే నేను. "తత్త్వమసి - అహంబ్రహ్మాస్మి" అదే. "అయమాత్మా బ్రహ్మ" అదే. "సర్వంఖల్విదం బ్రహ్మ " అదే. చంద్రునిలో చల్లదనం, ఆహ్లాదం నీవే.. సూర్యునిలో తేజస్సు నీవే. అగ్నిలో వేడివి నీవే. ఈ విశ్వాన్నే నడిపే చైతన్యమే నీవే. నీవో చైతన్యం. చైతన్యమంటే ఆత్మయే. నీలో ఉంది. నాలో ఉంది. మనలో అందరిలో ఎంత దగ్గరలో ఉందో! కదా! "చంకలో పిల్లను పెట్టుకొని, ఊరంతా వెతికినట్లు వెదుకకండి."  శాశ్వతమైన ఆత్మను చూడండి.  ఆత్మ చెప్పే మాటలు నమ్మండి. శాశ్వతులు కండి.  శాశ్వతుడను. నీలోని ఆత్మను. ఇది నీ కథ. నాకథ. మనకథ. మనలోని ఆత్మ కథ. ఆరు శ్లోకాలలో  ఆత్మలమైన  మన కథ. ఆరు శ్లోకాలలో విడమరచి, చెప్పాను. నిన్ను అంశాలవారిగా నీవు దేహానివికాదు. అని సుస్పష్టంగా వివరించాను. నేను ఆత్మను. నీవూ ఆత్మవే. ఆరులో నేనూ, నీవూ ఉన్నాం. ఆరు గుణాలతో భాసించే ఆత్మను. పరమాత్మను. ఆరు వికారాలూ లేని ఆత్మషట్క కథ. తాపత్రయాదిదుఃఖాలు అంటని నిర్వాణ షట్క గాథ ఇది. మోక్షకథ. అని ఆత్మ, అహంపొర కమ్మిన దేహానికి చెప్పిన కమ్మని కథ. మేను ఎవరో! నేను ఎవరో! నీవు ఎవరో! అద్దె ఇంటిని అందంగా, భద్రంగా చూస్తారో! సొంత ఇల్లనే మణిద్వీపాన్ని చూసుకుంటారో! ఇది మన కథ. నాకథ. నీకథ, మన కథ అంతా ఉపనిషద్విజ్ఞానమే.
జైహింద్.

4, జనవరి 2020, శనివారం

ఉత్తరద్వారదర్శన ప్రత్యేకత.

0 comments

జైశ్రీరామ్.
ఉత్తర ద్వార దర్శనం'లో ప్రత్యేకత ఏమిటి..?

అసుర(రాక్షసుల) బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు. దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడు.

ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దీన్నే 'హరివాసరమ'ని, 'హరిదినమ'ని, 'వైకుంఠ దినమ'ని అంటారు.

ఈ ఒక్క ఏకాదశి 'మూడు కోట్ల ఏకాదశుల'తో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకాదశి వ్రతం" ఆచరించిన వారికి శుభ ఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకుంటారు. దీంతో స్వామి మురాసురుడి మీదికి దండెత్తి అతన్ని వధించాలని చూస్తాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకుంటాడు. అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు 'ఏకాదశి' అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని అంటారు.

వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులు ఈ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ఉదయం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం.

 దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి.

ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును.

ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరో జన్మంటూ ఉండదని అంటారు.
జైహింద్.

3, జనవరి 2020, శుక్రవారం

సైనక్ పురిలో అష్టావధానం నేడే. మీకు స్వగతమ్.

0 comments

జైశ్రీరామ్.

3వతేదీ సాయంత్రం సైనిక్ పురి శృంగేరీ శంకరమఠంలో లలిత్ ఆదిత్య అష్టావధానం

రాజమండ్రిలో అద్భుతంగా శతావధానాన్ని చేసి 25 నిముషాల్లోనే 75 పద్యాలు ధారణ చేసి ఉద్దండులయిన సంస్కృతాంధ్ర పండితులను అబ్బురపరిచి భళా అని ప్రశంసలు పొందిన అమెరికా వాసి యువ శతావధాన శిరోమణి శతావధాన శరచ్చంద్ర తెలుగింటి ముద్దుబిడ్డ లలిత్ ఆదిత్య మరో అద్భుత అవధానం చేయబోతున్నారు..అత్యంత వేగంగా మహాపండితులు పృచ్ఛకులుగా.. మహా సహస్రావధాని డా.గరికిపాటి నరసింహారావు గారి సమక్షంలో లలిత్ అవధాన విన్యాసం 3వతేదీ శుక్రవారం జరగబోతోంది.ఒకరకంగా రాజమహేంద్రవరం శతావధానం విజయోత్సవంగా ఈ అద్భుత అష్టావధానం సాహితీ ప్రియులను ఓలలాడించనుంది. *దర్శనమ్* ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో సికింద్రాబాద్ సైనిక్ పురిలోని హై టెన్షన్ రోడ్ లోని శ్రీ విజయగణపతి దేవాలయం ,శ్రీ శృంగేరీ శంకరమఠంలో 3వతేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నవయువ అవధాని లలిత్ అష్టావధానం జరుగుతుంది.. సాహితీ ప్రియులందరికీ సాదర స్వాగతం

*మరుమాముల వెంకటరమణ శర్మ* *దర్శనమ్ మాసపత్రిక* *9441015469*

*రాజమండ్రి లో జరిగిన లలిత్ శతావధానం విశేషాలు*
*రాజమండ్రి అద్భుతంగా లలిత్ ఆదిత్య శతావధానం*
*25 నిమిషాల్లో 75 పద్యాలు ధారణ*

*విజయతీరాలకు చేరుకున్న లలిత్‌ ఆదిత్య* 

*పులకించిన గోదావరి* 

*పద్యాల పండగకు తరలివచ్చిన సాహితీలోకం*

*ముగిసిన శతావధానం*

 లలితాదిత్యుడు మధ్యందిన మార్తాండుడిలా జాజ్వల్యమానంగా ప్రకాశించాడు. పృచ్ఛకవరేణ్యుల అక్షర అస్త్రశ్రస్తాలను అతి లాఘవంగా ఎదుర్కొన్నాడు. పద్యాలను ఛందోబద్ధంగా మాత్రమే కాదు, రసరమ్య గీతాలుగా, భావస్ఫోరకంగా చెప్పి పండితుల ఆమోదాన్ని, ఆశీస్సులను అందుకున్నాడు. ఆదికవి నన్నయ భట్టారకుడు, తిరుపతి వేంకట కవులు, కవిసార్వభౌముడు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి వంటి హేమాహేమీలు నడయాడిన గడ్డ మీద.. అమెరికాలో జన్మించి, అక్కడే చదువు‘సంధ్య’లు సాగిస్తున్న ఈ నూనూగు మీసాల నూత్నయౌవనంలో ఉన్న కుర్రాడు మంగళవారం శతావధానం విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ మహత్తర ఘటన తెలుగు సాహితీ జగత్తుకు గర్వకారణంగా నిలిచిపోతుందని పలువురు సాహితీవేత్తలు ఈ సందర్భంగా ముక్తకంఠంతో పేర్కొన్నారు.. ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల, శుభోదయం ఇన్‌ఫ్రా సంయుక్త ఆధ్వర్యాన కళాశాలలో ఆదివారం ప్రారంభమైన శతావధానం నిర్వాహకుల అంచనాలకంటే ముందుగానే ఉదయం 11.43 గంటలకు ముగిసింది.

ఘంటానాదం చేస్తున్న ధూళిపాళ

శతావధానంలోని అంశాలు
మూడు నిషిద్ధాక్షరులు, 24 సమస్యలు, 24 దత్తపదులు, 24 వర్ణనలు, 19 ఆశువులు, నాలుగు ఘంటావధానాలు, మూడు అప్రస్తుత ప్రసంగాలు వెరసి.. 101 అంశాలపై పృచ్ఛకులు సంధించిన ప్రశ్నలకు యతిప్రాసలు చెడకుండా, రసాత్మకంగా లలిత్‌ ఆదిత్య పద్యాలను అలవోకగా అందించాడు. ‘శ్చి’, స్త్వం’ వంటి ప్రాసలతో పద్యాలు చెప్పవలసివచ్చినా అదరలేదు.. బెదరలేదు. ‘శిష్యవాత్సల్యము చెలువుమీర’ అవధాన ప్రాచార్య డాక్టర్‌ ధూళిపాళ మహాదేవమణి అవధానిని ప్రోత్సహిస్తూ, పృచ్ఛకులను కవ్విస్తూ, రసజ్ఞులను మెప్పిస్తూ అంతటా తానే అయి, అన్నీ తానే అయి అవధాన క్రతువు నిర్వహించారు. అవధానిని ‘అవధాన శరచ్చంద్ర’ బిరుదుతో సత్కరించారు.

25 నిమిషాల్లో 75 పద్యాలు
మూడు రోజులుగా పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు తాను పద్యరూపంగా ఇచ్చిన సమాధానాలను సాయంత్రం జరిగిన మహాధారణలో లలిత్‌ ఆదిత్య 25 నిమిషాలలో చదివాడు. ‘గురువులయ్యె గురువుల దీవెనల్, లఘువులయ్యె నాదు శ్రమల్‌’ అని గురువులను స్తోత్రం చేశాడు. ఇది సరికొత్త రికార్డు అని మహాదేవమణి శిష్యుని ఆలింగనం చేసుకున్నారు. మహామహోపాధ్యాయులు, సంస్కృత శతావధానులు కొలువు తీరిన సభలో ఆదిత్య మహాధారణకు కరతాళధ్వనులు ఆగకుండా మోగాయి.

పూరి, గారె, వడ, దోసెలతో వాతావరణ కాలుష్యంపై పద్యం చెప్పమని సరసకవి డాక్టర్‌ ఎస్‌వీ రాఘవేంద్రరావు కోరగా.. అవధాని ఇలా చెప్పారు.
‘పూరి’త మయ్యె ముజ్జగము భూస్థితి భంగ రసాయనంబులన్‌
దూరినభ్యాదతన్‌గొనగ ‘దోసి’ళు లొగ్గిన వారు లేరు పొం
‘గారె’ను బాష్పముల్‌ కువలయాంగనకున్‌ కలుషమ్ము మీరగా
ఆరయచిత్తకంధి ‘వడ’వాగ్నిగ రేగెను దిర్నివారమై.. 

పండితుల ప్రశంసలు
ధార, ధారణ, పూరణ అవధానానకి ప్రాణాలు. శీలసంపద లేని పాండిత్యం, హారతి లేని పూజ, పూలు తలలో లేని మగువ కొప్పు, ధారణ లేని అవధానం వ్యర్థం. ధారణలో లలిత్‌ సందీప్‌ అసామాన్యమైన ప్రతిభ చూపాడు.
– ప్రవచన రాజహంస డాక్టర్‌ ధూళిపాళ మహాదేవమణి

అత్యద్భుత ప్రతిభ
లలిత్‌ ఆదిత్యుని ప్రతిభ అద్భుతం. దేవీదత్తం, ఉపాసనాసిద్ధి పొందిన లక్షణాలు అవధానిలో కనిపిస్తున్నాయి.
– మహామహోపాధ్యాయ

శలాక రఘునాథశర్మ పురాకృత సుకృతం
పద్యవిద్యలో లలిత్‌ ఆదిత్య సాధించిన ప్రతిభ పురాకృత సుకృతం. గురువుల ఆశీస్సులను మెండుగా అందుకున్న లలిత్‌ ఆదిత్య భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నాను.
– చింతలపాటి శర్మ, రాష్ట్రపతి పురస్కార గ్రహీత

*లలిత్ ఆదిత్య గురించి...*
సంస్కృతాంధ్రావధాని గన్నవరం లలిత్ ఆదిత్య

తండ్రి: గన్నవరం మారుతి శశిధర్
తల్లి: గన్నవరం శైలజ
జన్మదినము: 23 సెప్,2000

విద్యార్థి - Aerospace Engineering 2nd year
ప్రవృత్తి:
సంస్కృతాంధ్రసాహిత్యపఠనకవనములు, ప్రవచనాలు, అవధానములు, సంగీతము, టెన్నీస్

బిరుదులు:
అవధానయువశిరోమణి, అవధానశరచ్చంద్ర, అవధానయువకిశోరము
సంస్కృతగురువులు
శ్రీరాయప్రోలు కామేశ్వరశర్మగారు - ప్రారంభము
శ్రీధూళిపాళమహాదేవమణిగారు - వ్యాకరణము,అవధానవిద్య
శ్రీచిఱ్ఱావూరి పద్మనాభశర్మగారు - వ్యాకరణము - శృంగేరికి వెళ్ళి ఈ సెలవులలో వారి వద్ద చదువుకున్నాను

శ్రీవెంపటి కుటుంబశాస్త్రిగారు - అద్వైతవేదాంతము,అలంకారశాస్త్రము
శ్రీమల్లాప్రగడ శ్రీనివాస్ గారు - వేదము

11 అవధానాలు - రవీంద్రభారతి, నల్లుకుంట శంకరమఠము(హైదరాబాద్), రామకోటి శంకరమఠము(విజయవాడ), రాజమహేంద్రి, ఇత్యాది ప్రాంగణాలలో జరిగాయి in USA India and Canada
రవీంద్రభారతిలో సంస్కృతాంధ్ర ద్విగుణిత అష్టావధానం
రాజమండ్రిలో శతావధానం

రచనలు:
నారసింహనమశ్శతం (సంస్కృతం)
నఖశతకం (సంస్క్రతము - నృసింహుని నఖములను 108 శ్లోకాలలో కీర్తిస్తూ)
హనుమద్దోర్దండశతకము (తెలుగు)
ఆవిర్భావము,పర్యావరణావనము, ఇత్యాది ఆంధ్రఖండకావ్యాలు
సంస్కృతములో వివిధదేవతాస్తోత్రములు

శతావధానములో 24 సమస్యలు 24 దత్తపదులు, 24 వర్ణనలు 3 నిషిద్ధాలు, 4 ఘంటావధానాలు, 18 ఆశువులు, 3 అప్రస్తుతాలు

75 పద్యాలు ధారణ - సమస్యాదత్తపదివర్ణననిషిద్ధాలు

శతావధానము ముందు శృంగేరివళ్ళి జగద్గురువులను దర్శించుకున్నాను. వారు సంతోషముతో దయతో అనుగ్రహించి ‘అవిఘ్నమస్తు...జయముగా చేసిరా’ అని ఆశీస్సులను కురిపించారు
*************************

 *శతావధాన శరచ్చంద్ర*
*లలితాదిత్య అష్టావధానం*

నూతన ఆంగ్ల సంవత్సర, సంక్రాంతి  శుభాకాంక్షలు
నమస్కారం 
దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో 
అమెరికా వాసి, తెలుగు ముద్దుబిడ్డ  18 ఏళ్ల ,యువ శతావధాన శిరోమణి
శ్రీలలిత్ ఆదిత్య అష్టావధానం
తేదీ సమయం:  2020 జనవరి 3 వతేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు
వేదిక:  సైనిక్ పురి హై టెన్షన్ రోడ్ లోని శ్రీ విజయగణపతి దేవాలయం , శృంగేరీ శంకర మఠం
 శ్రీ భారతీతీర్థ కల్యాణ మండపంలో 
ముఖ్య అతిథి : మహాసహస్రావధాని డా. శ్రీ గరికిపాటి నరసింహారావు
అవధాన సమన్వయం : శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ
సాహితీ మిత్రులందరికీ సాదర స్వాగతం

భవదీయుడు
మరుమాముల వెంకటరమణ శర్మ
సంపాదకులు
దర్శనమ్ ,
ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక 9441015469

 *పృచ్ఛకులు-అంశాలు*

నిషిద్ధాక్షరి ...మావుడూరి సూర్యనారాయణ మూర్తి

సమస్య... కంది శంకరయ్య

దత్తపది... కె.చంద్రశేఖరరావు

వర్ణన... చింతా రామకృష్ణారావు

న్యస్తాక్షరి... ముత్యంపేట గౌరీశంకరశర్మ

అనువాదం... ముదిగొండ అమరనాథశర్మ

ఆశువు... సాధన నరసింహాచార్య

అప్రస్తుత ప్రసంగం..రంగి సత్యనారాయణ శాస్త్రి
జైహింద్.