జైశ్రీరామ్
కంద,పర్మాత్మ,అభయంకర,పెంపొనరు,నిలకడ,గర్భ. చరితార్ధ"-వృత్తము.
రచన ;- వల్లభవఝుల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
అనిరు ద్ఛందాతర్గత "-అభికృతి ఛందము.
ప్రతి పాదమున 25,అక్షరములుండును!
ప్రాసనియమము కలదు.యతులు,12,17.అక్షరములు.
తరియగ నేరను,శివ హర! ధర్మాత్మ భవా! తరియం జేయు మోక్షా ర్ధివై!
సరి సరి సర్వము వరదము!చర్మాంబరుడా!చరితార్ధంబు జీవంబవన్?
గురు గుణ ప్రోవువు జగతికి!కుర్మా!నభయం!కురుచం బాపి పెంపేర్పుమా!
వరము నొసంగను!నిలువుము!పర్మాత్మ హరా!పరులం నమ్మ గంగాధరా!
1. చరితార్ధ"-వృత్త గర్భగత కందము.
తరియగ నేరను శివ హర!
సరి సరి సర్వము వరదము!చర్మాంబరుడా!
గురు గుణ ప్రోవువు జగతికి!
నొపరము నొసంగను!నిలువుమ!పర్మాత్మ హరా!!
2.గర్భగత"
అభయంకర. వృత్తము.
అభిజ్ఝా ఛందాంతర్గత"-సుప్రతిష్ట"-వృత్తము.
ప్రాసనియమము కలదు!పాదమునకు5.అక్షరములుండును!
ధర్మాత్మ!భవా!
చర్మాంబరుడా!
కుర్మా!నభయం
పర్మాత్మ!హరా!
3గర్భగత"-పెంపొనరు"-వృత్తము.
అణిమా ఛందాంతర్గత శక్వరి ఛందము.
ప్రాస నియమము కలదు.యతి6,వ యక్షరముతో చెల్లును.
పాదమునకు14.అక్షరములుండును.
ధర్మాత్మ భవా !తరియంజేయు మోక్షార్ధి వై!
చర్మాంబరుడా!చరితా ర్ధంబు జీవంబవన్?
కు ర్మా!నభయం!కురుచం బాపి పెంపేర్పుమా!
పర్మాత్మ హరా!పరులం నమ్మను!గంగాధరా!
4.గర్భగత"-నిలకడ"-వృత్తము.
అణిమా ఛందాంతర్గత"-కృతిఛందము.
ప్రాస నియమము కలదు.యతి12,వ.యక్షరమునకు చెల్లును.
పాదమునకు 20,యక్షరము లుండును.
దరియగ నేరను!శివ హర!తరియం జేయు మోక్షా ర్దివై!
సరి సరి సర్వము వరదము!చరితార్ధంబు!జీవంబవన్?
గురుగుణ ప్రోవువు జగతికి!కురుచం బాపి పెంపేర్పుమా!
పరము నొసంగను నిలువుమ!పరులం నమ్మ!గంగాధరా!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.