జైశ్రీరామ్.
85. ఓం మహాత్మనే నమః -
ప్రభాత వృత్త గర్భ సీసము.
విడను! కుసుమ సమానుఁడ! గోపబాలకా! - రా, రమ్ము. కాపాడ రార దేవ!
సకల విషమ వినాశక! వేల్పువీవ, రా! - రాణింపఁ జేయ, రా! రమ్య చరిత.
ఘనుఁడ! వసుధ ననున్ గన భక్త పాలకా! - రాజిల్లు నాయెదన్ బూజితముగ.
జయము త్రసన హరాక్షర! రా! యఘాపహా! - రాక్షసాంతక! రార! రక్షనీయ.
గీ. ఘన ప్రభాత పూర్ణోద్భాస కనఁగ రమ్ము. - వినుతుఁడ! *మహాత్మ*వై నిల్చి ఘనత నిలుపు.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
85వ సీస గర్భస్థ ప్రభాత వృత్తము. (న జ జ ర గ .. యతి 8)
కుసుమ సమానుఁడ! గోపబాలకా! రా!
విషమ వినాశక! వేల్పువీవ, రారా!
వసుధ ననున్ గన భక్త పాలకా! రా!
త్రసన హరాక్షర! రా! యఘాపహా! రా!
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! సుమ సుకుమారా! నిన్ను నేను విడిచిపెట్టను, సమస్థ
విషయ లంపటములు నశింపఁ జేయువాడా! ఓ రమ్య చరితా! రాణింపఁజేయువాఁడవు నీవే, వేగముగా రమ్ము.భయమును
హరించువాడా! నీకు జయము.. ఓ దురాపహా! ఓ రాక్షసాంతకా! రక్షణనిచ్చుటకు రమ్ము. గొప్ప ప్రభాసవృత్తమున పూర్తిగా
ప్రకాశించువాడా!
నన్ను చూచుటకు రమ్ము, ప్రశంసింపబడు దేవా! గొప్ప ఆత్మవై నాలో నిలిచి నా గొప్పతనము
నిలుపుము. ఓ గోపబాలకా! నన్ను కాపాడుటకు రమ్ము. ఓ ఘనుఁడా! భక్తపాలకా! వసుధపై నన్ను చూచుటకు
నాహృదయములో ప్రకాశించుము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.