గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, మార్చి 2018, శనివారం

అంతఃకరణ,తళ్కుసోయగ,గర్భ "-కళానిలయ"-వృత్తము. రచన:- శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

1 comments

జైశ్రీరామ్.
అంతఃకరణ,తళ్కుసోయగ,గర్భ "-కళానిలయ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
 కళానిలయ వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.స.జ.భ.న.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.

కన్నతల్లి!భారతమ్మ!కలుములమ్మ!రత్నగర్భ!కళల నిలయ!సామగా!
మిన్నకీర్తి!మోదమాంబ!మిళుకు తళ్కు!సోయగాల!మెలకువొనర!జాగృతిన్!
దన్నుకాగ!లోకమెల్ల!తలపులందు నిల్చిగాచు!దళికులనక!సర్వులన్!
పొన్ను నిచ్చు!కాచుశోభ!పులకరింప భూజనాలు!పొలతి!మిగుల!బ్రోచుతన్!
పొన్ను=బంగారము. సామగా=సౌమ్యగుణోపేత.

1గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
కన్నతల్లి!భారతమ్మ!
మిన్నకీర్తి!మోదమాంబ!
దన్నుకాగ!లోకమెల్ల!
పొన్ను నిచ్చి!కాచు శోభ!

2.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.ప్రాసగలదు.
కలుములమ్మ!రత్నగర్భ!
మిళుకు!తళ్కు!సోయగాల!
తలపులందు!నిల్చి గాచు!
పులకరింప!భూజనాలు!
కలుములు=సంపదలు.

3.గర్భగత"-ఉపమా"-వృత్తము.
బృహతీఛందము.న.న.ర.గణములు.వృ.సం.192.ప్రాసగలదు.
కళల నిలయ!సామగా!
మెలకువొనరు!జాగృతిన్!
దళికులనక!సర్వులన్?
పొలతి!మిగుల బ్రోచుతన్?

4.గర్భగత"-పొన్నొదవు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.స.జ.గల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కన్నతల్లి!భారతమ్మ!కలుములమ్మ!రత్నగర్భ!
మిన్నకీర్తి!మోదమాంబ!మిళుకు తళ్కు!సోయగాలు!
దన్నుకాగ!లోకమెల్ల?తలపు లందు!నిల్చి గాచు!
పొన్ను నిచ్చి!కాచుశోభ!పులకరింప!భూజనాలు!

5.గర్భగత"-వెన్నుదన్ను"-వృత్తము.
ధృతిఛందము.న.ర.జ.న.న.ర.గణములు.యతి.10.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
కలుములమ్మ!రత్నగర్భ!కళలనిలయ!సామగా!
మిళుకు!తళ్కు!సోయగాల!మెలకువొనర!జాగృతిన్!
తలపులందు!నిల్చిగాచు!దళికులనక?సర్వులన్!
పులకరింప!భూజనాలు!పొలతి!మిగుల!బ్రోచుతన్?

6.గర్భగత"-సామగా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.న.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
కలుములమ్మ!రత్నగర్భ!కళల నిలయ!సామగా!కన్నతల్లి!భారతమ్మ!
మిళుకు!తళ్కు సోయగాల!మెలకువొనర!జాగృతిం!మిన్నకీర్తి!మోదమాంబ!
తలపులందు!నిల్చి!గాచు!దళితులనక?సర్వులం!దన్నుకాగ!లోకమెల్ల!
పులకరింప!భూజనాలు!పొలతి!మిగుల!బ్రోచుతం?పొన్నునిచ్చికాచుశోభ!

7.గర్భగత"-మేలుకో"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.ర.ర.జ.గల.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.   
కళలనిలయ!సామగా!కన్నతల్లి!భారతమ్మ!
మెలకువొనర!జాగృతిం!మిన్నకీర్తి!మోదమాంబ!
దళితులనక?సర్వులం!దన్నుకాగ?లోక మెల్ల?
పొలతి!మిగుల!బ్రోచుతం?పొన్నునిచ్చి!కాచుశోభ!

8.గర్భగత"-బ్రోవరి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.ర.ర.జ.భ.స.జ.గల.గణములు.యతులు.10.18.
ప్రాసనీమముగలదు.
కళలనిలయ!సామగా!కన్నతల్లి!భారతమ్మ!కలుములమ్మ!రత్నగర్భ!
మెలకువొనర!జాగృతిం!మిన్నకీర్తి!మోదమాంబ!మిళుకు తళ్కు!సోయగాల!
దళితులనక?సర్వులం?దన్నుకాగ!లోకమెల్ల?తలపులందునిల్చి!గాచు!
పొలతి!మిగుల!బ్రోచుతం?పొన్నునిచ్చి! కాచి!శోభ!పులకరింప!భూజనాలు!

9.గర్భగత"-అంతఃకరణ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కలుములమ్మ!రత్నగర్భ!కన్నతల్లి!భారతమ్మ!
 మిళుకు!తళ్కు!సోయగాల!మిన్నకీర్తి!మోదమాంబ!
తలపులందు!నిల్చిగాచు!దన్నుకాగ!లోకమెల్ల?
పులకరింప!భూజనాలు!పొన్నునిచ్చి!కాచి శోభ!

10.గర్భగత"-తళ్కుసోయగ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.జ.భ.న.న.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
కలుములమ్మ!రత్నగర్భ!కన్నతల్లి!భారతమ్మ!కళల!నిలయ!సామగా!
మిళుకు!తళ్కు!సోయగాల!మిన్నకీర్తి!మోదమాంబ!మెలుకువొనర!జాగృతిన్!
తలపులందు!నిల్చి గాచు!దన్నుకాగ!లోకమెల్ల?దళితు లనక!సర్వులన్?
పులకరింప!భూజనాలు!పొన్ను నిచ్చి!కాచిశోభ!పొలతి!మిగుల !బ్రోచుతన్?
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్

30, మార్చి 2018, శుక్రవారం

డా గౌరీనాథభట్ల మెట్టురఘురామశర్మ శతావధానిగారు చేసిన అవధానము

1 comments

జైశ్రీరామ్.
ఉగాదిసందర్భముగా భక్తిసాధన పత్రికా సంపాదకులు బ్రహ్మశ్రీ పండరి రాధాకృష్ణగారి నిర్వహణలో డా గౌరీనాథభట్ల మెట్టురఘురామశర్మ శతావధానిగారు చేసిన అవధానము పరికించండి.

జైహింద్.

29, మార్చి 2018, గురువారం

మృదుపద,మత్తరజినీద్వయ,కృద్దోష,రజినీకరప్రియ,ద్వ్యర్ధీభావ,తగునటుద్వయ,వనరశూన్యద్వయ,గర్భ"-శూన్యభావి"-వృత్తము రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

1 comments

 జైశ్రీరామ్.

మృదుపద,మత్తరజినీద్వయ,కృద్దోష,రజినీకరప్రియ,ద్వ్యర్ధీభావ,తగునటుద్వయ,వనరశూన్యద్వయ,గర్భ"-శూన్యభావి"-వృత్తము 
రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ 
"శూన్యభావి"వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.ర.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9.18.
ప్రాసనీమముగలదు.
జగతి వనరులెల్ల!స్వార్ధ చింత దోచి మ్రింగుచుం!సర్వశూన్యభావి నేర్చితే?
తగని తెగువ నొంది!ద్వ్యర్ధి భావ, చింత!రాగతం!తర్వరేమి?లోక దుర్గతిన్!
ప్రగతి మరతు రేల?వ్యర్ధ కృత్య దోష!చర్యలుం!పర్వమౌనె?పొంగిపోకుడీ!
వగవ!తుదికి మేలె?వర్ధితంబు!కావవెన్నడుం? పర్వు లెత్తు!రోజు లేర్పడున్!

1.గర్భగత"-మృదుపద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.న.గల.గణముల.వృ.సం.192.ప్రాసగలదు.
జగతి!వనరులెల్ల?
తగని!తెగువ నొంది!
ప్రగతి!మరతు రేల?
వగవ!తుదికి మేలె?

2.గర్భగత"-మత్తరజినీద్వయ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.

స్వార్ధచింత!దోచి మ్రింగుచున్!    2.సర్వశూన్య!భావి నేర్చితే?
ద్వ్యర్ధిభావ!చింత రాగతన్!           తర్వవేమి?లోక దుర్గతిన్!
వ్యర్ధ కృత్య!దోష చర్యలున్!          పర్వమౌనె?పొంగి పోకుడీ!
వర్ధితంబు!కావవెన్నడున్?            పర్వులెత్తు!రోజులేర్పడున్!

3.గర్భగత"కృద్దోష"-వృత్తము..
అత్యష్టీఛందము.న.న.ర.జ.ర.లగ.యతి.9.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
జగతి వనరులెల్ల?స్వార్ధచింత!దోచి మ్రింగుచున్!
తగని!తెగువనొంది!ద్వ్యర్ధిభావ!చింత రాగతన్!
ప్రగతి!మరతు రేల?వ్యర్ధ కృత్య!దోష చర్యలున్!
వగవ!తుదికి మేలె?వర్ధితంబు!కావ వెన్నడున్?

4.గర్భగత"-రజినీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
స్వార్ధ చింత!దోచి మ్రింగుచుం!సర్వశూన్య!భావి నేర్చితే?
ద్వ్యర్ధి భావ!చింత రాగతం!తర్వవేమి?లోక దుర్గతిన్!
వ్యర్ధ కృత్య!దోష చర్యలుం!పర్వమౌనె?పొంగి పోకుడీ!
 వర్ధితంబు!కావవెన్నడుం?పర్వులెత్తు!రోజులేర్పడున్!


5.గర్భగత"-ద్వ్యర్ధీభావ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.న.న.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
స్వార్ధచింత!దోచి మ్రింగుచుం!సర్వశూన్య!భావి నేర్చితే?జగతి!వనరులెల్ల?
ద్వ్యర్ధిభావ!చింత రాగతం?తర్వ వేమి?లోకదుర్గతిం!తగని!తెగువ!నొంది!
వ్యర్ధకృత్య!దోషచర్యలుం?పర్వమౌనె?పొంగిపోకుడీ!ప్రగతిమరుతురేల?
వర్ధితంబు!కావవెన్నడుం?పర్వులెత్తు!రోజులేర్పడున్!వగవ!తుదికి!మేలె?

6.గర్భగత"-తగునటు"-ద్వయవృత్తములు.
అత్యష్టీఛందము.ర.జ.ర.న.న.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1.సర్వశూన్య!భావి నేర్చితే?జగతి వనరులెల్ల?
తర్వ వేమి?లోక దుర్గతిం!తగని తెగువ నొంది!
పర్వమౌనె?పొంగి పోకుడీ!ప్రగతి మరుతురేల?
పర్వులెత్తు!రోజులేర్పడుం!వగవ!తుదికి!మేలె?

2.స్వార్ధచింత!దోచి మ్రింగుచుం!జగతి వనరులెల్ల?
ద్వ్యర్ధిభావ!చింత రాగతం!తగనితెగువనొంది!
వ్యర్ధకృత్య!దోషచర్యలుం?ప్రగతి!మరుతురేల?
వర్ధితంబు!కావవెన్నడుం?వగవ!తుదికి మేలె?

7.గర్భగత"-వనరశూన్య"-ద్వయవృత్తములు.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.న.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
1.సర్వశూన్య!భావి నేర్చితే?జగతి వనరులెల్ల?స్వార్ధచింత!దోచి!మ్రింగుచున్!
తర్వవేమి?లోక దుర్గతిం?తగని తెగువనొంది!ద్వర్ధిభావ!చింత!రాగతన్!
పర్వమౌనె?పొంగి పోకుడీ?ప్రగతిమరుతురేల?వ్యర్ధకృత్య!దోషచర్యలున్?
పర్వులెత్తు!రోజులేర్పడుం?వగవతుదికి!మేలె?వర్ధితంబు!కావవెన్నడున్?

2.స్వార్ధచింత!దోచి మ్రింగుచుం!జగతి!వనరులెల్ల?సర్వశూన్య!భావినేర్చితే!
ద్వ్యర్ధిభావ!చింత రాగతం!తగని తెగువనొంది!తర్వవేమి?లోక దుర్గతిన్?
వ్యర్ధకృత్య!దోషచర్యలుం?ప్రగతి మరుతురేల?పర్వమౌనె?పొంగిపోకుడీ?
వర్ధితంబు!కావవెన్నడుం?వగవ తుదికి!మేలె?పర్వులెత్తు!రోజులేర్పడున్?

ఇట్లు,
తమవిశ్వసనీయుడు.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

28, మార్చి 2018, బుధవారం

అరుంధతీ (నక్షత్రం) ఎందుకు పూజ నీయమైంది? శ్రీ రాజశేఖరుని విజయ శర్మ.

1 comments

  జైశ్రీరామ్.
అరుంధతీ (నక్షత్రం) ఎందుకు పూజ నీయమైంది?
శ్రీ రాజశేఖరుని విజయ శర్మ.
ఈ ప్రశ్న నేటిదికాదు, నాటిదేనని చెబుతున్నది ‘సూత సమ్హితా శౌనకాది మహర్షి గణాలకు ఒకసారి ఇదే సందేహం కలిగింది. దీనిని వారు త్రికాలవేత్త సమస్త పురాణ వ్యాఖ్యానదక్షుడు అయినటువంటి సూతుని ముందుంచగా, ఆయన ‘అరుంధతీ దేవి ప్రాముఖ్యతను ఇలా వివరించాడు.
“అరుంధత్యనసూయా చ సావిత్రీ జానకీసతీ తేజస్వనీ చ పాంచాలీ వందనీయ నిరంతరం!!’

అనగా అరుంధతీ, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది. ఈ అయిదుగురు స్త్రీ మూర్తులు సదా వందనీయులని తెలుస్తున్నది. అరుంధతిదేవి పతివ్రతలో అగ్రగామి. ఈమె చరిత్రను స్మరించినంతనే పుణ్యం కలుగుతుందని ‘నైమిసమ్హితా పేర్కొంటోంది. అసక్తికరమైన అరుంధతి జన్మవౄత్తాంతాన్ని ఇపుడు మీకు చెప్పబోతున్నాను అన్నాడు సూత మహాముని.
ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత తేజోవితయైన ఒక కన్యను, వర్ణింపనలవికాని ఓక సుందరుని సౄష్టించాడు. ఆ కన్య పేరు ‘సంధ్యా. యువకుని పేరు మన్మథుడు. సౄష్టికార్యంలో తనకు సాయపదమని చెబూతూ బ్రహ్మ ఆ యువకునికి -
అరవింద మశోకంచ చూతంచ నవమల్లికా నీలోత్పలంచ పంచైతే పంచబాణాశ్చసాయకా!! అంటూ

అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలం అనే అయిదు సమ్మోహన బాణాలను అందించాడు. బాణశక్తిని పరీక్షింపదలచిన మన్మథుడు వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టగా, బ్రహ్మతో సహా అందరూ అక్కడే ఉన్న ‘సంధ్యా ను చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి ఈశ్వరుని ప్రార్థించగా, స్వామి అక్కడ ప్రత్యక్షమై పరిస్థితిని చక్కబరిచాడు. రెప్పపాటుకాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సౄష్టికర్త కోపించి మన్మథుని ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని శాపం ఇచ్చాడు. తనవల్లనే కదా ఇంతమంది నిగ్రహం కోల్పోయారనే అపరాధభావంతో ‘సంధ్యా చంద్రభాగా నదీతీరంలో తపస్సు పేరిట తనువు చాలించదలచి పయనమై పోయింది. అపుడు బ్రహ్మ వశిష్టమహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించమని కోరగా, వశిష్టుడు ఆమెకు ‘శివా మంత్రానుష్టానమును వివరించి తన ఆశ్రమానికి వెడలిపోయాడు. సంధ్య తదేకనిష్టలో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకొమ్మని కోరగా, ఆమె “ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామవికారం కలగరాదనే’ వరాన్ని అనుగ్రహించమంది. శివుడు ఆమె లోకోపకార దౄష్టికి సంతోషించి మరో వరాన్ని కోరుకోమన్నాడు. అపుడు సంధ్య ‘నా భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను కామదౄష్టిలో చూచినట్లయితే, వారు నపుంసకులుగా మారాలి, అంతేకాదు నేను పుట్టగానే అనేకమంకి కామవికారాని కల్గించాను. కాబట్టి ఈ దేహం నశించిపోవాలీ అని కోరింది. శివుడు ‘తథాస్తూ అని మేధతిథి అనే మహర్షి గత పుష్కరకాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదౄశ్యురాలివై శరీరాన్ని దగ్దం చేసుకుని, తిరిగి అదే అగ్నికుండం నుండి నీవు జన్మిస్తావు. నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా తలుస్తావో! అతడే నీ భర్త అవుతాడని చెప్పి అంతర్థానమయ్యాడు.
శివాజ్ణ్జగా సంధ్యా శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్టుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండం నుండి తిరిగి జన్మించింది. సంస్కౄత భాషలో ‘అరుం’ అంటె అగ్ని, తేజము, బంగారువన్నె అనే అర్థాలున్నాయి. ‘ధతీ అంటె ధరించినది అనే అర్థం వున్నది. అగ్ని నుంచి తిరిగి పుట్టింది కాబట్టి ఆమె ‘అరుంధతీ అనబడింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి వశిష్టునకు ఇచ్చి వివాహం జరిపించాడు. అరుంధతి తన పాతివ్రత్య మహిమ వలన త్రిలోకపూజ్యురాలైంది. ఈ దంపతులకు పుట్టినవాడే ‘శక్తీ. శక్తికి పరాశరుడు, పరాశరునకు వ్యాసుడు జన్మించారు. అరుంధతిని మనవారు ‘ఆరని జ్యోతీ అని ‘అరంజ్యోతీ అని పిలుస్తూంటారు. విష్ణుసహస్రనామాల్లో సైతం అరుంధతి సంతతి గురించి, మనమలు, మునిమనమలు గురించి ప్రస్తావించబడివుంది.

అరుంధతీ నూతన దంపతులకు ఇచ్చే దీవెనలు ఏమిటి? అంటే, కొత్త పెళ్ళైన దంపతులకు ఆకాశంలో సప్తర్థి మండలంలో వున్న వశిష్టుని తారకు ప్రక్కనే వెలుగుతుండే అరుంధతీ నక్షత్రాన్ని కూడా చూపిస్తారు. దీనివెనుక ఒక ప్రధాన కారణమున్నది. వశిష్ట, అరుంధతీ ద్వయం ఆదర్శ దంపతులకు ఒక ప్రతీక. కొత్తగా పెళ్ళైన దంపతులు సైతం వారివలెనే ఉండాలనే ఉద్దేశ్యంతో మనవారు ఆ దంపతులిద్దర్ని తారారూపంలో వీక్షింపచేస్తూ రావడం ఒక సాంప్రదాయమైంది. వీరిద్దర్ని సందర్శించడం వలన దంపతులకు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యము, సౌభాగ్యములు కలుగుతాయి.
స్వస్తి
రాజశేఖరుని విజయ శర్మ
బ్రహ్మశ్రీ విజయశర్మగారికి ధన్యవాదములు.
జైహింద్.

27, మార్చి 2018, మంగళవారం

పార్ధమృగ్య,బలిమిస్వేచ్చ్ఛబంధనా,గర్భ వక్రజ్ఞాన వృత్తము. రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

0 comments

జైశ్రీరామ్.
పార్ధమృగ్య,బలిమిస్వేచ్చ్ఛబంధనా,గర్భ వక్రజ్ఞాన వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.

               "-వక్రజ్ఞాన"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.భ.స.స.జ.జ.జ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
వెలవెలబోయె!భారతి విధుషీమణి!వేదవేద్య!పెరంబడె!ఖ్యాతటంచున్?
తెలుగును!వాడరేమని?తిధి,వారము!తెల్యదేల?తెరంగెటుమారె! నేలన్?
బలిగొనె!స్వేచ్ఛబంధన!పదిలంబెటు?చూడ!లేదు!పరార్ధము మృగ్యమాయెన్!
కులములపేర!నైచ్యత!కుదురెన్నడుకల్గు?నెంచ!కురూపిగ!నీతి! నిల్చెన్!

1.గర్భగత"-చంపవృత్తము.
బృహతీఛందము.న.జ.భ.గణములు.వృ.సం.432.ప్రాసగలదు.
వెలవెలబోయె!భారతి!
తెలుగును!వాడరేమని?
బలిగొనె!స్వేచ్ఛ ?బంధన!
కులములపేర !నైచ్యత!

2.గర్భగత"-గతిమా"-వృత్తము.
బృహతీఛందము.స.స.జ.గణములు.వృ.సం.348.ప్రాసగలదు.
విధుషీమణి!వేదవేద్య!
తిధి,వారము!తెల్యదేల?
పదిలంబెటుచూడ?లేదు!
కుదురెన్నడు?కల్గు నెంచ!

3.గర్భగత"-మదపెంపు"-వృత్తము.
అనుష్టుప్ఛందము.జ.జ.గగ.గణములు.వృ.సం.46.ప్రాసగలదు.
పెరంబడె!ఖ్యాతటంచున్!
తెరంగెటు?మారె!నేడున్!
పరార్ధము!మృగ్యమాయెన్!
కురూపిగ!  నీతి నిల్చెెన్!

4.గర్భగత"-భద్రదూర"-వృత్తము.
ధృతిఛందము.న.జ.భ.స.స.జ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
వెలవెలబోయె!భారతి!విధుషీమణి!వేదవేద్య!
తెలుగును!వాడరేమని?తిధి,వారము!తెల్యదేల?
బలిగొనె స్వేచ్ఛ!బంధన!పదిలంబెటు?చూడ లేదు?
కులముల పేర!నైచ్యత!కుదురెన్నడు?కల్గు!నెంచ?

5.గర్భగత"-కుదురొనరని"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.జ.జ.జ.గగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
విధుషీమణి!వేదవేద్య!పెరంబడె!ఖ్యాతటంచున్?
తిధి,వారము!తెల్యదేల?తెరంగెటు?మారె!నేడున్?
పదిలంబెటుచూడ?లేదు!పరార్ధముమృగ్యమాయెన్!
కుదురెన్నడు?కల్గునెంచ?కురూపిగ!నీతి నిల్చెన్!

6.గర్భగత"-వెరతెరంగు"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.జ.జ.జ.త.న.ర.లల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
విధుషీమణి!వేదవేద్య!పెరంబడె!ఖ్యాతటంచుం?వెలవెలబోయె!భారతి!
తిధి,వారము!తెల్యదేల?తెరంగెటు?మారె!నేడుం?తెలుగును!వాడరేమని?
పదిలంబెటుచూడ?లేదు!పరార్ధము!మృగ్యమాయెం!బలిగొనె స్వేచ్ఛ!బంధన!
కుదురెన్నడుకల్గు?నెంచ!కురూపిగ!నీతి!నిల్చెం!కులముల పేర! నైచ్యత?

7.గర్భగత"-పెరగమ్య"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.జ.త.న.ర.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పెరంబడె!ఖ్యాతటంచుం?వెలవెలబోయె!భారతి!
తెరంగెటు?మారె!నేడుం?తెలుగును!వాడరేమని?
పరార్ధము!మృగ్యమాయెం? బలిగొనె!స్వేచ్ఛ! బంధన!
కురూపిగ!నీతినిల్చెం?కులములపేర! నైచ్యత!

8.గర్భగత"-పరార్ధమృగ్య"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.జ.త.న.ర.న.జ.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
పెరంబడె!ఖ్యాతటంచుం?వెలవెలబోయె!భారతి!విధుషీమణి!వేదవేద్య!
తెరంగెటు?మారె నేడుం?తెలుగును!వాడరేమని?తిధి,వారము!తెల్యదేల?
పరార్ధము!మృగ్యమాయెం!బలిగొనెస్వేచ్ఛ!బంధన!పదిలంబెటుచూడ!లేదు!
కురూపిగ!నీతి!నిల్చెం?కులములపేర!నైచ్యత!కుదురెన్నడు?కల్గు!నెంచ?

9.గర్భగత"-బలిమినీ"-వృత్తము.
ధృతిఛందము.స.స.జ.న.జ.భ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
విధుషీమణి!వేదవేద్య!వెలవెలబోయె?భారతి!
తిధి,వారము,తెల్యదేల?తెలుగును!వాడరేమని?
పదిలంబెటుచూడ?లేదు!బలిగొనె?స్వేచ్ఛబంధన!
కుదురెన్నడు?కల్గు?నెంచ?కులములపేర!నైచ్యత!

10.గర్భగత"-స్వేచ్ఛబంధనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.జ.న.జ.భ.జ.జ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
విధుషీమణి!వేదవేద్య!వెలవెలబోయె!భారతి!పెరంబడె!ఖ్యాతటంచున్!
తిధి,వారము,తెల్యదేల?తెలుగును!వాడరేమని?తెరంగెటు?మారె నేడున్?
పదిలంబెటుచూడ?లేదు!బలిగొనెస్వేచ్ఛ?బంధన!పరార్ధముమృగ్యమాయెన్!
కుదురెన్నడు?కల్గునెంచ?కులములపేర!నైచ్యత!కురూపిగ!నీతి!నిల్చెన్!

స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

26, మార్చి 2018, సోమవారం

శ్రీరామ నవమి సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శుభోదయమ్.
శ్రీ సీతారామచంద్రపరబ్రహ్మణేనమః.
ఈ రోజు పరమ పావనమైన సీతారాముల కల్యాణ మహోత్సవము జరుపుకొను మహోత్కృష్టమైన రోజు శ్రీరామ నవమి.
ఈ సందర్భముగా మీ అందరికీ ఆ సీతారాముల ఆశీస్సులు అపారముగా అందాలని కోరుకొంటూ మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
శా. ఎన్నో జన్మల పుణ్య సత్ఫలముగానిద్ధాత్రి సీతమ్మ నీ
కన్నుల్ కాంతిగ వెల్గ నీ సతిగ భూకాంతారమావల్లభా.
మిన్నున్ ముట్టదె మాదు సంబరము సామీ చేయ మీ పెండ్లి. శ్రీ
మన్నారాయణ! భక్తులన్ సతము ప్రేమంజూచి దీవింపుడీ.  
భావము.
ఓ శ్రీమన్నారాయణా! ఓభూకాంతారమావల్లభా! ఓ స్వామీ! పెక్కు జన్మలలో చేసిన
పుణ్యఫలముగా ఈ ధాత్రిపై సీతమ్మతల్లి నీ పత్నియై నీ కన్నులలో కాంతియై
ప్రకాశించు విధముగా మీ వివాహము చేయుటచే మా సంతోషము ఆకాశమునంటును.
మీరెల్లప్పుడూ భక్తులను కృపతో చూచుచు దీవించుడు.
జైహింద్


25, మార్చి 2018, ఆదివారం

వెసనుడు, యాగఫల, గర్భ బీజాపూర్ణ వృత్తము రచన;-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
వెసనుడు, యాగఫల, గర్భ బీజాపూర్ణ వృత్తము
రచన;- వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.

బీజాపూర్ణ వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.య.జ.న.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.

రసనుముక్తినందగా!రామరామ!యనుమి!చాలు!రాజితుండవౌదు భూతలిన్!
వెసనుగొల్వు రామునిం!వేమరంబుపడకు జీవ!వేజపించి!ముక్తి నందుమా!వెసలు!పాపదోషముల్ప్రేమ పాత్రుడగుదువీవు!బీజపూర్ణశక్తి వంతతన్!
వసతిశోభజేకురుం!భాములెల్ల దరికిరావు!వాజపేయ!కీర్తి వాటిలన్!

1 గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.88.ప్రాసగలదు.
రసను ముక్తి నందగా!
వెసను గోల్వురామునిన్!
వెసలు!పాప దోషముల్!
వసతి!శోభ జేకురున్!

2.గర్భగత"-భ్రమర"-వృత్తము.
బృహతీఛందము.ర.న.జ.గణములు.వృ.సం.379.ప్రాసగలదు.
రామరామ!యనుమి చాలు!
వేమరంబు పడక!జీవ!
ప్రేమపాత్రుడగుదు వీవు!
భాములెల్ల దరికి రావు!

3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
రాజితుండవౌదు!భూతలిన్!   
వేజపించి!ముక్తి నందుమా!
బీజపూర్ణశక్తి వంతతన్!
వాజపేయ!కీర్తి వాటిలన్!

4.గర్భగత"-వేమరు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.య.జ.న.గల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
రసను!ముక్తినందగా!రామరామ యనుమి!చాలు!
వెసనుగొల్వు!రామునిం!వేమరంబు పడకుజీవ!
వెసలు !పాపదోషముల్!ప్రేమపాత్రుడగుదు!వీవు!
వసతి శోభ జేకురుం!భాములెల్ల!దరికి  !

5.గర్భగత"-పాత్రతా"-వృత్తము.
ధృతిఛందము.ర.న.జ.ర.జ.ర.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు..
రామరామ!యనుమి చాలు!రాజితుండవౌదు!భూతలిన్!
వేమరంబు పడకు!జీవ!వేజపించి ముక్తి నందుమా!
ప్రేమపాత్రుడగుదు!వీవు!బీజపూర్ణశక్తివంతతన్!
భాములెల్ల!దరికి రావు!వాజపేయ కీర్తి!వాటిగగగు

6.గర్భగత"-రాజీవా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.జ.ర.జ.ర.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
రామరామ!యనినచాలు!రాజితుండవౌదు!భూతలిం!రసను ముక్తినందగా!
వేమరంబుపడకు!జీవ!వేజపించి!ముక్తినందుమా!వెసనుగొల్వు!రామునిన్!
ప్రేమపాత్రుడగుదు!వీవుబీజపూర్ణశక్తివంతతం!వెసలు పాపదోషముల్!
భాములెల్ల!దరికిరావు!వాజపేయ!కీర్తివాటిలం!వసతిశోభ!జేకురున్!

7.గర్భగత"-రజరోన్నర"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.న.ర.లగ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
రాజితుండవౌదు!భూతలిం!రసను ముక్తినందగా!
వేజపించి!ముక్తినందుమా!వెసను గొల్వు!రామునిన్!
బీజపూర్ణశక్తివంతతం!వెసలు!పాపదోషముల్!
వాజపేయ!కీర్తివాటిలం!వసతిశోభ!జేకురున్!

8.గర్భగత"-సురశోభా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.ర.య.జ.న.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
రాజితుండవౌదు!భూతలిం!రసనుముక్తినందగా!రామరామయనిన చాలు!
వేజపించి!ముక్తినందుమా!వెసనుగొల్వు!రామునిం!వేమరంబుపడకు!జీవ!
బీజపూర్ణ!శక్తివంతతం!వెసలుపాపదోషముల్!ప్రేమపాత్రుడగుదు వీవు!
వాజపేయ!కీర్తివాటిలం!వసతిశోభ!జేకురుం!భాములెల్ల !దరికి రావు!

9.గర్భగత"-వెసనుడు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.జ.ర.లగ.గణములు.యతి.10.వ..యక్షరము.
ప్రాసనీమముగలదు.
రామరామ!యనుమి చాలు!రసను ముక్తినందగా!
వేమరంబు!పడకు జీవ!వెసనుగొల్వు రామునిన్!
ప్రేమపాత్రుడగుదు వీవు!వెసలు పాపదోషముల్!
భాములెల్ల దరికిరావు!వసతిశోభ!జేకురున్!

10.గర్భగత"-యాగఫల"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.జ.న.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
రామరామ!యనుమిచాలు!రసను ముక్తినందగా!రాజితుండవౌదు!భూతలిన్!
వేమరంబు!పడకుజీవ!వెసనుగొల్వు!రామునిం!వేజపించి!ముక్తినందుమా!
ప్రేమపాత్రు!డగుదువీవు!వెసలుపాపదోషముల్!బీజపూర్ణశక్తివంతతన్!
భాములెల్ల!దరికిరావు!వసతిశోభ!జేకురుం!వాజపేయకీర్తి!వాటిలన్!

స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

24, మార్చి 2018, శనివారం

ఆంధ్ర కవితా పితామహుఁడు అల్లసాని పెద్దన .... నాటకము.

1 comments

  జైశ్రీరామ్.
జైహింద్.

23, మార్చి 2018, శుక్రవారం

యథా సునిపుణ: సమ్యక్! పరదోషే క్షణే రతః! .. .. .. మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో.యథా సునిపుణ: సమ్యక్! పరదోషే క్షణే రతః! 
తథాచేన్నిపుణః స్వేషు! కోనముచ్యేత బంధనాత్!!
చ.ఇతరుల దోషముల్ వెదక నెవ్వరు కల్గుదురట్టివారు తా
సతతము వారి దోషములు చక్కఁగ గాంచి చెలంగిరేని స
న్నుతమగు సత్పథంబున గనుంగొన జాలుదురయ్య ముక్తి. సం
స్తుతమతిమంతులెప్పుడును దోషములెంచరు సుస్వభావులై.
భావము.ఇతరుల దోషముల నెంచుట లో చూపు సహజ చాకచక్యమును,తెలివినీ తమ 
దోషములను గుర్తించుటలో వినియోగించినచో వాడు సంసార బంధనమునుండి విముక్తి 
చెందును.
జైహింద్.

22, మార్చి 2018, గురువారం

మురియకు, చెడుకలి, పరస్వేచ్ఛా, గర్భ "ఉపకరి" వృత్తము. రచన:-శ్రీవల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

1 comments

జైశ్రీరామ్.
మురియకు, చెడుకలి, పరస్వేచ్ఛా, గర్భ "ఉపకరి" వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
ఉపకరి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.న.న.న.న.న.న.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
చెరపకురా!చెడెదవు!సిరులకు!మురియకు!చెరగొనకు!పరస్వేచ్ఛన్!
కరివరదు!మదిగను!గరికల!చెరపకు!కరటుతనమది!తప్పౌ!
పరిమళ గంధముబలె!వరదుల దరినిలు!పరులకుపకరి వౌచున్!
సురలలరం!వెలుగుమ!సురభిళ!సుమసరి!సురధములొనర!కాంతిన్!

1.గర్భగత:-తెల్వరి"-వృత్తము.
బృహతీఛందము.న.జ.న.గణములు.వృ.సం.496.ప్రాసగలదు.
చెరపకురా!చెడెదవు!
కరివరదు!మదిగను!
పరిమళ!గంధము బలె!
సురలలరం!వెలుగుమ!

2.గర్భగత"-చతురిమ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.న.లల.గణములు.వృ.సం.256.ప్రాసగలదు.
సిరులకు!మురియకు!
గరికల!చెఱపకు!
వరదుల!దరినిలు!
సురభిళ!సుమసరి!

3.గర్భగత"-భుజగశిశురుత"-వృత్తము.
బృహతీఛందము.న.న.య.గణములు.వృ.సం.428.ప్రాసగలదు.
చెరగొనకు!పర స్వేచ్ఛన్!
కరటు తనమది తప్పౌ!
పరుల కుపకరి వౌచున్!
సురధము!లొనర!కాంతిన్!

4.గర్భగత"-వెలుగుమా"--వృత్తము.
అత్యష్టీఛందము.న.జ.న.న.న.లల.గణములు.యతి10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చెరపకురా!చెడెదవు!సిరులకు!మురియకు!
కరివరదు!మదిగను!గరికల!చెఱపకు!
పరిమళ!గంధము బలె!వరదుల!దరినిలు!
సురలలరం!వెలుగుమ!సురభిళ!సుమసరి!

5.గర్భగత"-నాగావళి"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.న.న.నన.గగ.గణములు.యతి.9.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
సిరులకు!మురియకు!చెరగొనకు!పర స్వేచ్ఛన్!
గరికల!చెఱపకు! కరటుతనమది!తప్పౌ!
వరదుల దరి నిలు!పరులకుపకరి!వౌచున్!
సురభిళ!సుమసరి!సురధములొనర!కాంతిన్!

6.గర్భగత"-చెఱగొను"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.న.న.న.త.న.భ.లల.గణములు.యతులు.9.18.
ప్రాసనీమముగలదు.
సిరులకు మురియకు!చెరగొనకు!పరస్వేచ్ఛం!చెరపకురా!చెడెదవు!
గరికల చెఱపకు!కరటుతనమది!తప్పౌ!కరివరదుని మదిగను!
వరదులదరి!నిలు!పరులకుపకరివౌచుం!పరిమళ!గంధముబలె!
సురభిళ!సుమసరి!సురధము లొనర!కాంతిం!సురలలరంవెలుగుమ!

7.గర్భగత"-కరటు"-వృత్తము.
ధృతిఛందము.న.న.య.న.జ.న.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చెరగొనకు!పరస్వేచ్ఛం!చెరపకురా!చెడెదవు!
కరటుతనమది!తప్పౌ!కరివరదుని!మదిగను!
పరులకుపకరి వౌచుం!పరిమళ!గంధముబలె!
సురధములొనర!కాంతిం!సురలలరం!వెలుగుమ!

8.గర్భగత"-మురియకు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.య.న.జ.న.న.న.లల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
చెరగొనకు!పరస్వేచ్ఛం!చెరపకురా!చెడెదవు!సిరులకు!మురియకు!
కరటుతనమది!తప్పౌ!కరి వరదుని!మదిగను!గరికల!చెరపకు!
పరుల!కుపకరి!వౌచుం!పరిమళ!గంధముబలె!వరదుల దరి నిలు!
సురధము లొనర!కాంతిం!సురలలరం!వెలుగుమ!సురభిళ!సుమ!సరి!

9.గర్భగత"-చెడుకలి"-వృత్తము.
అత్యష్టీవృత్తము.న.న.న.న.భ.లల.గణములు.యతి9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సిరులకు!మురియకు!చెెరపకురా!చెడెదవు!
గరికల!చెరపకు!కరివరదుని మదిగను!
వరదుల దరి నిలు!పరిమళ!గంధముబలె!
సురభిళ!సుమసరి!సుర లలరం! వెలుగుమ!

10.గర్భగత"-పరస్వేచ్ఛా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.న.న.భ.న.న.న.గగ.గణములు.యతులు9,18.
ప్రాసనీమముగలదు.
సిరులకు!మురియకు!చెరపకురా!చెడెదవు!చెరగొనకు!పరస్వేచ్ఛ!
గరికల!చెఱపకు!కరివరదుని!మదిగను!కరటుతనమది!తప్పౌ!
వరదులదరి నిలు!పరిమళగంధము బలె!పరులకుపకరి!వౌచున్!
సురభిళ సుమసరి!సురలలరం!వెలుగుమ!సురధములొనర!కాంతిన్!

ఇట్లు,
తమవిశ్వసనీయుడు.
మూర్తి. జుత్తాడ
జైహింద్.

21, మార్చి 2018, బుధవారం

ఉదయశ్రీ . .రచన . జంధ్యాల పాపయ్యశాస్త్రి. . . . పాడినది . . . ఘంటసాల.

1 comments

జైశ్రీరామ్.

జైహింద్.

20, మార్చి 2018, మంగళవారం

సీతా రాముల ప్రవరలు.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

పుష్ప విలాపమ్. రచన పాపయ్యశాస్త్రి. పాడినది ఘంటసాల.

1 comments

జైశ్రీరామ్.

జైహింద్.

19, మార్చి 2018, సోమవారం

నరధర్మవృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

1 comments

జైశ్రీరామ్.
నరధర్మవృత్తము. 
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                                      జుత్తాడ.
నరధర్మవృత్తము.
ఉత్కృతిఛందము.స.భ.భ.స.స.జ.భ.న.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
నరులే!వానరులైలచొ?నరధర్మము!నిల్చు. నీతి!న్యాయము!కుదురు!ధరన్!
పరమార్ధంబునె!యెంతురు!పరపీడన!మృగ్యమౌను!బాయరు పరమునెదన్!
పరకష్టాలను!నిల్తురు!వరదంబులు!గాంతురెన్నొ?వ్రాయుదురిల!స్తుతులన్!
చరితార్ధంబగు!దేశము!సరిమార్గము!నెంతురెల్ల?సా యశులనగ! నిలన్!

"-సత్యయుగమున!ధర్మమునాల్గుపాదముల నడచెను.అదేసత్యము త్రేతా
యుగమున మూడుపాదములనిలచెను.ధర్మసంస్థాపనార్ధమైవిష్ణువు
రామావతారమెత్తవలసి వచ్చెను.నేటి నరులు వానరులైన!కలియుగము
త్రేతాయుగమగును.రామాయణమంతా!వానరులప్రతిభా!సంపత్తుల
వలననే!దనరెను.వానరులు సేవాభావము,నాటిధర్మరక్షణకునుపకరించి
యుగపురుషుడు!రామునికీర్తిభూమండలమున్నంతవరకు నిల్చునట్లు
జేసిరి.ప్రస్తుత"కలియుగము ధర్మమేకపాద!చరితము.అన్యాయము
అక్రమము,అవినీతి.అపకారచింతన,దైవదూషణ,విలయతాండవము,
చేయుచున్నది.ఇట్టిదినములలో!ఈమానవులకు వానరత్వచింతన,
కల్గిన!ధర్మసంస్థాపన గల్గి! త్రేతాయుగమనిపించుననుట!నిజము."-

1.గర్భగత"బుద్బుధ"-వృత్తము.
బృహతీఛందము.స.భ.భ.గణములు.వృ.సం.436.ప్రాసగలదు.
నరులలే!వానరు లైనచొ?
పరమార్ధంబునె!యెంతురు!
పరకష్టాలను!నిల్తురు!
చరితార్ధంబగు!దేశము!

2.గర్భగత"గతిమా"-వృత్తము.
బృహతీఛందము.స.స.జ.గణములు.వృ.సం.348.ప్రాసగలదు.
నర ధర్మము నిల్చు!నీతి!
పరపీడన!మృగ్యమౌను!
వరదంబులుగాాంతు రెన్నొ?
సరిమార్గము!నెంతు రెల్ల?

3.గర్భగత"-వాదిలు"-వృత్తము.
అన్ష్టుప్ఛందము.భ.న.లగ.గణములువృ.సం.127.ప్రాసగలదు.
న్యాయముకుదురరు ధరన్!
బాయరు పరము నెదన్!
వ్రాయుదు! రిల స్తుతులన్!
సా యశులనగ!  నిలన్!

4.గర్భగత"-సాయస"-వృత్తము.
ధృతిఛందము.స.భ.భ.స.స.జ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నరులే!వానరులైనచొ?నర ధర్మము! నిల్చు నీతి!
పరమార్ధంబును!యెంతురు!పరపీడన!మృగ్యమౌను!
పరకష్టాలను!నిల్తురు!వరదంబులు!గాంతు రెన్నొ?
చరితార్ధంబగు!దేశము!సరిమార్గమునెంతు!రెల్ల?

5.గర్భగత"-చేతక"-వృత్తము.
అయష్టీఛందము..స.స.జ.భ.న.లగ.గణములు యతి.10.వ.యక్షరము
ప్రాసనీమముగలదు.
నరధర్మము!నిల్చు నీతి!న్యాయముకుదురు!ధరన్!
పరపీడన!మృగ్యమౌను!బాయరు!పరము!నెదన్?
వరదంబులు!గాంతురెన్నొ?వ్రాయుదురిల!స్తుతులన్!
సరిమార్గము!నెంతురెల్ల?సా యశులనగ? నిలన్!

6.గర్భగత"నీతిననిల్చు"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.జ.భ.న.జ.య.జ.లల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
నరధర్మము!నిల్చునీతి!న్యాయము!కుదురు!ధరం!నరులే!వానరులైనచొ?
పరపీడన!మృగ్యమౌనుబాయరు!పరము!నెదం!పరమార్ధంబును!యెంతురు!
వరదంబులు!గాంతురెన్నొ?వ్రాయుదురిల!స్తుతులం!పరకష్టాలను!నిల్తురు!
సరిమార్గము!నెంతురెల్ల?సాయశులనగ!నిలం?చరితార్ధంబగు!దేశము

7.గర్భగత"-జయాశయ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.న.జ.య.స.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
న్యాయము!కుదురు!ధరం!నరులే!వానరులైనచొ?
బాయరు!పరము!నెదం?పరమార్ధంబును!యెంతురు?
వ్రాయుదురిల!స్తుతులం!పరకష్టాలం!నిల్తురు!
సాయశులనగ!నిలం!చరితార్ధంబగు!దేశము!

8.గర్భగత"-మృగ్యతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.న.జ.య.స.న.జ.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
న్యాయము!కుదుర!ధరం!నరులే!వానరులైనచొ?నరధర్మము!నిల్చు నీతి!
బాయరు!పరము!నెదం?పరమార్ధంబును!యెంతురు?పరపీడన!మృగ్యమౌను!
వ్రాయుదురిల!స్తుతులం?పరకష్టాలను!నిల్తురు!వరదంబులు!గాంతురెన్నొ?
సా యశులనగ!నిలం?చరితంబగు!దేశము!సరిమార్గము నెంతురెల్ల?

9.గర్భగత"-నీమక"-వృత్తము 
ధృతిఛందము.స.స.జ.స.భ.భ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నరధర్మము!నిల్చు!నీతి!నరులే!వానరులైనచొ?
పరపీడన!మృగ్యమౌను!పరమార్ధంబును!యెంతురు!.
వరదంబులు!గాంతురెన్నొ?పరకష్టాలను!నిల్తురు!
సరిమార్గము!నెంతు రెల్ల?చరితంబగు!దేశము!

10.గర్భగత"-వరదంబుల"-వృత్తము
.ఉత్కృతిఛందము.స.స.జ.స.భ.భ.భ.న.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
నరధర్మము!నిల్చునీతి!నరులే!వానరులైనచొ?న్యాయము!కుదురు!ధరన్?
పరపీడన!మృగ్యమౌను!పరమార్ధంబును!యెంతురు!బాయరు!పరము!నెదన్?
వరదంబులు!గాంతురెన్నొ?పరకష్టాలను!నిల్తురు!వ్రాయుదురిల!స్తుతులన్?
సరిమార్గము!నెంతురెల్ల?చరితంబగు!దేశము!సా యశులనగ!నిలన్!

స్వస్తి.


.మూర్తి.జుత్తాడ.
జైహింద్.

18, మార్చి 2018, ఆదివారం

శ్రీవిళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శుభోదయమ్.

82. శా. తిన్నన్ జాలు నుగాది పచ్చడిని, భాతిం గొల్పు నొరోగ్యమున్,
విన్నన్ జాలును భూసురుల్ పలుకు భావిన్దెల్పు పంచాంగమున్.
కన్నా దివ్య యుగాదినాడునిజ సంకల్పంబులీడేరు. శ్రీ
మన్నారాయణ! నిత్య చేతనమిడన్ మాలోనుగాదైతివా
18 . 03 . 2018.

భావము.
ఓశ్రీమన్నారాయణా! ఓ కన్న తండ్రీ. ప్రతీ సంవత్సరమూ 
ఉగాది రోజున ఉగాది పచ్చడిని తినిన చాలును. 
భాతిని, ఆరోగ్యమును కలిగించును. భూదేవతలు పలికెడి
భావిని తెలియజేయు పంచాంగమును వినీనసరిపోవును. 
మా సంకల్పములన్నియు నెరవేరును. 
మాలో నిత్య చైతన్యము కల్పించుటకు 
నీవు మాలో ఉగాదివై
యుంటుందువా.
స్వస్తి. శ్రీ చాంద్రమాన విళంబి నామ సంవత్సర ఉగాది సందర్భముగా మీ అందరికీ ఆయురారోగ్య ఆనంద ఐశ్వర్య సౌఖ్య సౌభాగ్యాలను ఆ శ్రీమన్నారాయణుడు వృద్ధిచేయాలని మనసారా కోరుకొంటూ మీకు అభినందనపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను.
దిగువనున్నది
విళంబి తంగిరాలవారి పంచాంగమ్. లంకె.
https://drive.google.com/file/d/18W1EYuCQdIB2iSfMRhArnFbvPthy2y4C/view?usp=drive_web
జైహింద్.

సాదృశీ,అనఘా,మత్తరజినీ,సారనీర,రేపటూహ,జేజేల,రజరారజన,వరామతా, వాసంతికా,లంబచతుర, గర్భజ్ఞానచాతురీవృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

1 comments

జైశ్రీరామ్.
శ్రీవిళంబినామక నూతనతెలుగువత్సరాది శుభాకాంక్షలతోసమర్పించు
సాదృశీ,అనఘా,మత్తరజినీ,సారనీర,రేపటూహ,జేజేల,రజరారజన,వరామతా,
వాసంతికా,లంబచతుర, గర్భజ్ఞానచాతురీవృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.

జ్ఞానచాతురీవృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.న.న.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.

శ్రీ"విళంబి"-లంబచతుర!సిరివరామ!రామతం!చేరె!చైత్రుకూడి తాభువిన్!
పావకంబు గూర్ప రమణి!పరమభక్తి!బోధిలం!పార శాంతి!నల్దిశల్సదా!
జై!వసంతి!సంతసమున!జరుగుబాటు!పెంపిలం!సారనీర,క్షీర!పారతన్     
బ్రోవవచ్చె!సామ్యమొనర!పెరలుమెచ్చలోకమున్!భూరికీర్తి!భాసమానమై!

భావము:-మహాచాతుర్యముగల,సిరివరామ!శ్రీవిళంబినామక!వసంతలక్ష్మి
చైత్రునితోకూడి,భూమినిపావక మేర్చుట కరుదెంచెను.భక్తిభావముకల్గించి,
శాంతి నల్దిశల వ్యాపింపజేయ,సంతోషము,జరుగుబాటు,సారనీరక్షీరములు,
నొసగి, సర్వసామ్యతనెలకొల్పి!,పరులుమెచ్చునటుల,గొప్పకీర్తిగలదేశముగ
ప్రకాశింపజేయుటకామె!వచ్చెను.

1.గర్భగత"-సాృశీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.న.గణములు.వృ.సం.491.ప్రాసగలదు.
శ్రీవిళంబి లంబ చతుర!
పావకంబు గూర్ప రమణి!
జై!వసంతి!సంతసమున!
బ్రోవ!వచ్చె!సామ్య మొనర!

2.గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.88.ప్రాసగలదు.
సిరివరామ!రామతన్!
పరమ భక్తి బోధిలన్!
జరుగుబాటు!పెంపిలన్!
పెరలుమెచ్చ!లోకమున్!

3.గర్భగత"మత్తరజిననీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
చేరె!చైత్రుగూడి! తాభువిన్!
పార శాంతి!నల్దిశల్సదా!
సార నీర క్షీర!పారతన్!
భూరికీర్తి!భాసమానమై!

4.గర్భగత"-సారనీర"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.న.న.ర.లగ.గణములు.యతి.10.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
శ్రీవిళంబి లంబచతుర!సిరివరామ!రామతన్!
పావకంబు గుర్పరమణి!పరమభక్తి!బోధిలన్!
జై!వసంత సంతసమున!జరుగుబాటు!పెంపిలన్!
బ్రోవవచ్చె!సామ్యమొనర!పెరలుమెచ్చ!లోకమున్!

5.గర్భగత"-రేపటూహ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.య.జ.ర.లగ.గణములు.యతి.9.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
సిరి!వరామ!రామతం!చేరె!  చైత్రు!కూడి తాభువిన్!
పరమ భక్తి!బోధిలం! పార శాంతి!నల్దిశల్సదా!
జరుగుబాటు పెంపిలం!సార నీర క్షీర పారతన్!
పెరలు మెచ్చ!లోకముం!భూరికీర్తి !భాసమానమై!

6.గర్భగత"-జేజేల"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.య.జ.ర.య.జ.భ.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు. 
సిరివరామ రామతం!చేరె!చైత్రుకూడి తాభువిం!శ్రీవిళంబి!లంబ చతుర!పరమభక్తి!బోధిలం!పార!శాంతి!నల్దిశల్సదా!పావకంబుగూర్ప!రమణి!
జరుగుబాటు!పెంపిలం!సార నీర క్షీర పారతం!జైవసంత!సంతసమున!
పెరలుమెచ్చ!లోకముం!భూరికీర్తి భాసమానమై!బ్రోవ!వచ్చె!సామ్యమొనర!

7.గర్భగత"-రజరారజన"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.న.గణములు.యతి.10.వ.యక్షరము
ప్రాసనీమముగలదు.
చేరె!చైత్రు!కూడితా! భువిం!శ్రీవిళంబి!లంబచతుర!
పారశాంతి!నల్దిశల్సదా!పావకంబుగూర్ప!రమణి!
సార నీర క్షీరపారతం!జైవసంత!సంతసమున!
భూరికీర్తి!భాసమానమై!బ్రోవవచ్చె!సామ్యమొనర!

8.గర్భగత"-వరామతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.న.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
చేరె!చైత్రుకూడి!తాభువిం!శ్రీవిళంబి లంబచతుర!సిరివరామ!రామతన్!
పారశాంతి!నల్దిశల్సదా!పావకంబు!గూర్పరమణి!పరమభక్తి!బోధిలన్!
సార!నీర!క్షీర పారతం!జైవసంత!సంతసమున!జరుగుబాటు!పెంపిలన్!
భూరికీర్తి!భాసమానమై!బ్రోవ వచ్చె!సామ్యమొనర!పెరలు!మెచ్చలోకమున్!

9.గర్భగత"-వాసంతికా"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.య.జ.భ.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సిరి వరామ!రామతం!శ్రీవిళంబి!లంబచతుర!
పరమభక్తి!బోధిలం!పావకంబుగూర్ప!రమణి!
జరుగుబాటు!పెంపిలం!జైవసంత!సంతసమున!
పెరలుమెచ్చ!లోకముం!బ్రోవ వచ్చె!సామ్యమొనర!

10.గర్భగత"-లంబచతుర"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.య.జ.భ.స.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
సిరివరామ!రామతం!శ్రీవిళంబి!లంబచతుర!చేరి!చైత్రు!కూడితా!భువిన్!
పరమభక్తి!బోధిలం!పావకంబుగూర్ప!రమణి!పార శాంతి!నల్దిశల్సదా!
జరుగుబాటు!పెంపిలం!జైవసంత!సంతసమున!సార,నీర,క్షీర!పారతన్!
పెరలుమెచ్చ!లోకముం!బ్రోవవచ్చె!సామ్యమొనర!భూరికీర్తి!భాసమానమై!

స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.