గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

పున్నెంబుండును బేదలన్ గనుమయా.... శ్రీమన్నారాయణ శతకము .11వ పద్యము. రచన చింతా రామ కృష్ణారావు. గానం శ్రీమతి దోర్బల బాల సుజాత

జైశ్రీరామ్.

11. శా. పున్నెంబుండును బేదలన్ గనుమయా. పోషింపఁగా లేక తా

మన్నంబైనను బెట్టలేక సుతులన్ బాధించుచున్నారు. నీ

వున్నావన్నది సత్యమై ప్రబలఁగా నోదార్చి పోకార్పు. శ్రీ

మన్నారాయణ!బాధలన్ బ్రజలకున్, మాకీవ మూలంబుగా.

భావము.

శ్రీమన్నారాయణానీకు పొణ్యముండును.పేదవారిని చూడుము

తమ సంతానమును పోషింపలేక కనీసము వారికి అన్నమైనను పెట్టలేక

ఆకలిబాధకు లోనగునట్లు చేయుచున్నారు.నీవున్నావన్న విషయము 

సత్యమై వ్యాపించునట్లుగా అట్టి పేదలనోదార్చి, వారి పేదరికము

పోగొట్టుము. శ్రేష్టమైన మనసు కలవాడవయి వారి కష్టములను 

మాపివేయుము.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.