గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జులై 2024, బుధవారం

సంఘం శరణం గచ్ఛామి(ఏకాదశ రుద్రాత్మకమ్)రచన:-శ్రీవల్లభ

0 comments

 జైశ్రీరామ్.

కం:_శ్రీమాతా కరుణింపుమ
        నీమావృతి నడచు జగము నిన్నే దలపన్
        రామాశ్రిత రమ్య జగతి
        ధామంబును గూర్చి గావ దలచెదు మాతా!

తే గీ:-కర్మ సిద్ధాంత జనితమై ధర్మ నిరతి!
       మర్మ కర్మాంత  వేద్యుల మాయ దవిలి
      చర్మ ధారుల దౌర్భాగ్య సాయకముల
     మర్మ స్వార్ధపు మాంగళ్య మందె కలిని!    1.

తే గీ:-స్వార్ధ భూయిష్ట సంసార కడలి నిలచి
       వ్యర్ధ జీమూత సంఘంబు పట్టు జిక్కి
      ధర్మ మన్నది దరిజేర తప్పటంచు
     వర్ధ మానుల రీతిని వరల దగునె?          2

తే గీ:-శక్తి రూపిణి స్త్రీ మాత జగతి క ర్త
        కష్టముల కోర్చి కన్నట్టి కన్న త ల్లి
       కృ ళ్ళు సంఘాన కుత్సితాకులము చెంది
       భిక్షు లోకాన వేస రి వేడె శివుని!          3

తే గీ:-అన్న ముక్కంటి గనవేమి?యాటవికుల
       చేష్ట లన్నియు కలి నడ్డి చితుక కొట్టె
      ధర్మ గ్లానియు చేకురి తల్లడిల్లె
     దురితులను  చీల్చి ఛెండాడ తెగువ లేద? 4.

తే గీ:-కుల మతాల కుంపట్ల జ్వాల లెగసె
       జాతి మత సంక్షోభ చరిత మిగిలె!
      రక్ష యవి నీతి భక్షణ రక్ష గనక
      శిక్ష గూర్చెడి శివ మూర్తి చక్షువంటె!      5.

(అవినీతి జ్వాల లు శివుని మూడవ కన్నును జేరుటచే
చూడ జాలక మూసియుంచెను)

తే.గీ:-చక్షువును మూసి న్యాయంపు సరళి గనుచు
        దొంగ దోబూచి మాటల లొంగి పోయె
        జగతి కాధార మూర్తివి! జనకు డీవు!
       జాల మేలుచు లోకాన్ని  చక్క దీర్చు!   6.

తే.గీ:-  దుష్ట సంహారమును జేసి శిష్ట రక్ష
           నిష్టమై జేయు నిర్మల నీతి మంత!
          సమ సమాజంబు డబ్బుతో!చక్క బడునె?
         మమత మమకారములు పెంచు మహితమూర్తి! 7.

తే గీ:-భూమి కబళించు మృచ్ఛులు పుట్టి రిలను
        తట్టు కో లేక కన్నీట తడిసె దేల?
       విలయ తాండవ మేర్చుమా!వినుతి గనెదు!
       తండ్రి తలకోయు ధన్యులు ధాత్రి గలరు!         8.

తే.గీ:-క్షమకు కాలంబు చెల్లెను చచ్చె సుఖము!
        జీవ హింసయె జీవన సరళి యాయె!
        పాప కూపాన మిట్టాడ పద్ధ తగునె?
        ధర్మ దేవత కను గుడ్డ తగదు విడుమ!       9.

(కంటితోచూచి విని చెప్ప నీయని ధర్మము సంపూర్ణత
గనునా?)

తే.గీ;-జనన మరణాల నాపంగ శక్య మగునె?    
         సృష్టి కర్తృక మంతయు శివ మయంబు!
        లోక దౌర్భాగ్య దుస్తితి లోను యగుచు
        దురితు లాయెడి వారల దురిత మాపి!     10.

తేగీ:-సత్తు తత్తుల దృష్టిని సాగ నిచ్చి
       సత్వ బుద్ధిని నేర్పించి జగము బ్రోచి!
       కావు కల్యాణ కారకా!కన్న తండ్రి!
      శివము శాంతంబు కాదొకో? జీవ ధాత్రి!   11.

జైహింద్.

కవి శిఖామణి చింతా రామకృష్ణారావు గారికి కవికల్పభూజ బిరుదు ప్రదానము సందర్భముగా పంచ పద్యసుమాలు .. డా. నలవోలు నరసింహా రెడ్డి

0 comments

జైశ్రీరామ్.

 జాతీయ తెలుగు సాహితీ పీఠము …

     తేనియల్ చిందు నా భాష తెలుగుభాష
            డా. నలవోలు నరసింహా రెడ్డి  

  .         కవి శిఖామణి చింతా రామకృష్ణారావు గారికి 
  .                        పంచ పద్యసుమాలు 
ఉ. ఆతడు నిండుకుండ, మరియాదకు తెల్లని మంచు కొండ, ప్ర 
ఖ్యాతికి పూల దండ, గగనంబున నెత్తిన ఝండ పాండితిన్,    
భూతలమంత నిండ విర బూచిన మండ తెలుంగు  పద్యపుం 
రాతల  లోన గండ, తన లాస్యము శిష్యుల కండ,  నుండెడిన్ 

ఉ . మెత్తని వాడవీవు, సుతి మెత్తని భావము నీది, అన్యులన్   
మొత్తగ బోవు , గుండియలు మోసులు వారగ పండితాళురన్    
చిత్తములోన  మెచ్చు కొను చిత్తము  నీది, నీదు సేవయే 
పొత్తము నందు వ్రాసికొన బోలును ఓ కవి రామకృష్ణుడా! 

ఉ. అందరి వాడు, స్నేహమున హద్దులెరుంగని వాడు, కైతలో 
ముందరి వాడు, నెల్లరకు మోదము గూర్చెడు వాడు, చల్లనౌ
డెందము వాడు, నెయ్యెడల టెక్కులు జేయనివాడు, దర్పమున్ 
జెందని వాడు, సాదు గుణ శీలుడు  మాకవి రామకృష్ణుడున్ 

ఉ. మంచికి మారు పేరు, అభి మానుడు పెద్దల పట్ల, యెన్నడున్వం
చన సేయ నేరడు, వివాదము లందున దూరబోడు, దీ  
పించెడు  సౌమ్య శీలుడయి యెల్లరి  గుండెల  కొల్ల గొట్టు ని 
ర్వంచిత  బుద్ధి శీలునకు రంజిల నా యభినందనంబులున్    

మ. చిర కాలంబును గల్గు గావుత ! శుభాశీస్సుల్ సిరుల్ సంపదల్ ! 
కొరతేమాత్రము లేక జీవితమునన్ కొంగ్రొత్త భాగ్యంబులున్ 
వరలున్  గాత! ధరాతలంబునను దివ్యంబై యశో వల్లికల్ 
విరియున్ గాత! నిరంతరంబు మిము దీవించంగ వాగ్దేవి తాన్.
జైహింద్.

2వపద్యము. శ్రీమన్నారాయణ శతకము. గానము. శ్రీమతి దోర్బల బాలసుజాత.

0 comments

 

జైశ్రీరామ్

శా.  నిన్నున్నే ధర నెంచఁగాఁ దగుదునా? నీరేజపత్రేక్షణా! 
పున్నామాదులనుండి కాచెదవుగా, పూజ్యుండ! నన్నెంచుచున్. 
మన్నింతున్ మది నిన్ను నేను. గనుమా మర్యాదనే నిల్పి, శ్రీ 
మన్నారాయణ కావుమీజగతిఁ బ్రేమన్ మీ రమాసాధ్వితోన్. 2

భావము: ఓ శ్రీమన్నారాయణా! ఓ పద్మనేత్రుండా! భూమిపై నిన్ను నేను ఎంచుటకు సరిపోదునా? ఓ పూజ్యుఁడా! నన్ను గుర్తించుచు పున్నామాది నరకముల నుండి. మమ్ము కాపాడుదువు కదా. నిన్ను గుర్తించి నేను గౌరవింతును. నామర్యాద నిలిపుచు, లోకమున ప్రేమతో కూడిన దైవ గాథలతో నన్ను కాపాడుము.

జైహింద్.

Rephrase with Ginger (Ctrl+Alt+E)

శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మి అక్కయ్య శారదామాత పాదాలచెంతకు వాడని పుష్పంగా చేరి కీర్తిశేషులయ్యారన్నవార్త తెలియఁజేయుటకు విచారంగా ఉంది.

0 comments

ఓం నమశ్శివాయ.

శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మి
అక్కయ్య
నాలుగు రోజుల క్రితమే నాతో మాటాడారు. నాపద్యాలను ప్రశంసిస్తూ నాలో కవితోత్తేజాన్ని పెంపొందింపచేసేవారు. ఆ మధ్య నేను విశాఖపట్టణం వెళ్ళితే అది తెలిసి నాకు ఫోన్ చేసి ఒకచోట సమావేశం ఏర్పాటు చేసి మిత్రులందరినీ అక్కడికి చేర్చి నన్నెంతగానో ఆదరించి నేను మరువలేనంతటి ఆప్యాయత చూపించారు. అట్టి అక్కయ్య నిన్న రాత్రి రెండు గంటలకు కీర్తిశేషులయ్యారనే వార్త హృదయానికి అశనిపాతమైంది. ఇంతవరకు మనముందున్న అక్కయ్య ఇంక లేరన్న సత్యాన్ని మనస్సు అంగీకరించటం లేదు. ఐనా ఆ పరమాత్మ చిత్తం.శారదామాత పాదాలచెంతకు వాడని పుష్పంగా చేరిపోయారు. 
శివశివా! యేమి యీ దుస్స్థితి,

చం.  మనసది వెన్న, మాటలవి మార్దవపూర్ణము, కన్నెపల్లికిన్,
వినయవిధేయతల్ ఘనము, పిన్నలనైనను గౌరవించు, వే
దనలను మానసంబుననె తాను భరించుచు సంతసంబునే
ఘనముగఁ బంచునందరికి,  కాలుని పాలికి నెట్లుపోయెనో?

చం.  చనితి విశాఖపట్టణము,  సన్నుతయౌ వరలక్ష్మి యక్కయే
చనువుగ తమ్ముఁడా యనుచు, స్వాగతవాక్యము పల్కి రమ్మనన్,
జనితిని వారి సన్నిధికి, చక్కగ నన్ను ప్రసాదుగారిదౌ
ఘనమగునింటిలోపలికి గౌరవమొప్పగ చేరఁజేసిరే.

ఉ.  స్నేహితులందరిన్ బిలిచి చేర్చిరి యచ్చటి కప్పుడే సము
త్సాహముతోడ, భోజనము సన్నుతరీతిని బెట్టెనక్కయే,
మోహవిదూర, సత్కవనపుష్పములన్ ననునింపె నాడు, సం
దేహములున్న తీర్చెడిది, దేవునివద్దకు నెట్లువోయెనో?

మ.  కృతులన్ బెక్కు రచించె, సన్నిహితులన్ గూర్మిన్ మదిన్ నిల్పె, సం
స్తుతయై సజ్జనపాళిచే, బిరుదులన్ శోభాయమానంబుగా
కృతులన్ జేసిన గుర్తుగా గొనిరి, తత్ కీర్తిన్ దిశల్ నింపిరే,
నుతయౌ శ్రీవరలక్ష్మి సోదరిని నేనున్ గొల్తు శ్రద్ధాంజలిన్.

శా.  నన్నున్, దమ్ముఁడ! యెట్టులుంటివి? సతిన్ సాధ్విన్ మదిన్ దల్పుచున్
గన్నుల్ నీటిని నింపుటాపి బ్రతుకన్ గాంక్షింపుమా, యంచు నా
కెన్నోమాటలు చెప్పుచున్ గడకు తా నేగెన్ హరిన్ జేరగన్,
కన్నేపల్లి సహోదరీమణికి నా కన్నీటి వీడ్కోలిదే.😢🙏🏼


వరలక్ష్మి అక్కయ్యకు శ్రద్ధాంజలి ఘటిస్తూ
చింతా రామకృష్ణారావు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకొంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియఁజేసుకొనుచున్నాను. శివశివా.😢

ఆశాపిశాచికావిష్టః ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ఆశాపిశాచికావిష్టః  -  పురతో యస్య కస్యచిత్ |

వందతే నిందతి స్తౌతి  -  రోదితి ప్రహసత్యపి ||  (సుభాషితసుధానిధి)

తే.గీ.  ఆశ పెనుభూత మెవనికి నావహించు

నతఁడు దూషించు, భాషించు, నంతలోనె

యేడ్చు, నవ్వుచునుండు తా నెవ్వరున్న

నాశ యుండగనొప్పు దురాశ తగదు.

భావము.  ఆశ అనే పిశాచి పట్టినవాడు 'ఎవరంటే వారి ఎదుట' నమస్కరిస్తాడు, 

దూషిస్తాడు, ప్రశంసిస్తాడు, ఏడుస్తాడు మరియు నవ్వుతాడు.

జైహింద్.

107 వ పద్యము. శ్రీమన్నారాయణ శతకము. రచన చింతా రామకృష్ణారావు. గానం. శ్రీమతి దోర్బల బాలసుజాత.

1 comments

 

జైశ్రీరామ్.
గానం.  శ్రీమతి దోర్బల బాలసుజాత.

శా.  ఉన్నంజాలును దేవ సంతతము నా యుచ్ఛ్వాస నిశ్వాసమై, 
కన్నన్ జాలును కాంతులీను కనులన్ కారుణ్య! మిత్రుండవై, 
నిన్నున్నే వరచిత్ర గర్భకవినై నేర్పారఁ జూపింతు శ్రీ 
మన్నారాయణ లోకులెన్నఁగ మహిన్, మాన్యుండ! ముక్తిప్రదా! 107
భావము: ఓ శ్రీమన్నారాయణా! ముక్తిని ప్రసాదించు ఓ సర్వ శ్రేష్టుఁడా! నీవు నా ఉచ్ఛ్వాసనిశ్వాసవై ఎల్లప్పుడు ఉండిన చాలును. ఓ కారుణాస్వభావా! నీ కాంతులు చిందే కనులతో మిత్రుల సమూహమై నన్ను చూచిన చాలును.

జైహింద్.

30, జులై 2024, మంగళవారం

ద్రౌపది ఏకపాత్రాభినయం (వాచికం) వాచికాభినేత్రి శ్రీమతి దోర్బల బాల సుజాత.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.

28, జులై 2024, ఆదివారం

కాంతాకటాక్షవిశిఖా న దహంతి యస్య ... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  కాంతాకటాక్షవిశిఖా న దహంతి యస్య

చిత్తం న నిర్దహతి కోపకృశానుతాపః |

కర్షంతి భూరివిషయాశ్చ న లోభపాశైః

లోకత్రయం జయతి కృత్స్నమిదం స ధీరః || (భర్తృహరి)

తే.గీ.  ఇంతి చూపులశిఖికి తపించఁడెవఁడొ,

కలుష కోపాగ్ని మదిఁ జొచ్చి కాల్చదెవని, 

నింద్రియ సుఖము లెవనిఁ బ్రేరించలేవొ,

యట్టి ఘనుఁడు విజితలోకుఁడగుట నిజము.     

భావము.  స్త్రీల కనుచూపుచేత ఎవని హృదయము తాపము చెందదో, 

కోపం అనే అగ్ని ఎవరి మనసును కాల్చలేదో, ఆశాపాశాలతో ఉన్న 

ఇంద్రియ సుఖాలు ఎవ్వరిని ఆకర్షించలేవో, అటువంటి ధీరుడు 

మూడు లోకాలను కూడా జయిస్తాడు.

జైహింద్.

మాతృ నిందా మహావ్యాధిః .. మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  మాతృ నిందా మహావ్యాధిః  -  పితృ నిందా పిశాచతః

దైవ నిందా దరిద్ర స్యాత్  - గురు నిందా కుల క్షయమ్.


తే.గీ.  తల్లినే నింద చేసిన తగులు వ్యాధి,

తండ్రినే నింద చేసిన తా పిశాచి

యగును, దైవనిందను పేద యగును,

గురుని నిందింప క్షయమగు కులము, నృహరి!


భావము.  తల్లిని నిందించినచో మహావ్యాధిసంక్రమించును. 

తండ్రినినిందించినచో పిశాచి అగును. దైవమును నిందించినచో 

దరిద్రుఁడగును. గురువును నిందించినచో కుల క్షయ మగును.

జైహింద్.

శ్రీమన్నారాయణ శతకము. 1వ పద్యమునుండి 5వ పద్యము వరకు. (అష్టోత్తర శత ద్విత్వ నకార ఏక ప్రాస శార్దూలావళి) రచన. చింతా రామకృష్ణారావు.గానము. బ్రహ్మశ్రీ అందుకూరి చిన్నపున్నయ్య శాస్త్రి మహోదయులు.

0 comments

 జైశ్రీరామ్.

ఓం  నమో నారాయణాయ.

శ్రీమన్నారాయణ శతకము.

(అష్టోత్తర శత ద్విత్వ నకార ఏక ప్రాస శార్దూలావళి)

రచన. చింతా రామకృష్ణారావు.

గానము.  బ్రహ్మశ్రీ అందుకూరి చిన్నపున్నయ్య శాస్త్రి మహోదయులు.

1. శా. శ్రీన్నీవక్షమునందు నిల్పి, సుజన శ్రేయంబుఁ జేకూర్చు నీ

వన్నన్ మాకుఁ బ్ర మోదమే. సుగుణ సౌహార్ద్రంబులన్ మాకు మే

మున్నన్నాళ్ళునుఁ దక్కఁ జేయుదువు,  దీనోద్ధారకా! దేవ! శ్రీ

మన్నారాయణ! సత్య సన్నుత గుణా! మద్భాగ్య సంవర్ధనా!  

భావము.

దీనోద్ధారకా! ఓ దేవాది దేవా! సత్యము కారణముగా సన్నుతింప బడెడి గుణములు కలవాడా!  నా 

భాగ్యమును ప్రవృద్ధి చేయువాఁడా! శ్రీమన్నారాయణా! మేమున్నన్నాళ్ళును సుగుణ సౌహార్ద్రంబులను మాకు కలుగ చేతువని లక్ష్మీదేవిని నీ వక్షస్థలముపై నిలిపి, మంచివారికి శ్రేయస్సును చేయించెడి నీవన్నచో మాకు చాలా యిష్టమే సుమా.


2. శా. నిన్నున్నే ధర నెంచఁగాఁ దగుదునా? నీరేజపత్రేక్షణా! 

పున్నామాదులనుండి కాచెదవుగా, పూజ్యుండ! నన్నెంచుచున్.

మన్నింతున్ మది నిన్ను నేను. గనుమా మర్యాదనే నిల్పి, శ్రీ

మన్నారాయణ! కావుమీజగతిఁ బ్రేమన్ మీ రమాసాధ్వితోన్. 

భావము. 

ఓ శ్రీమన్నారాయణా! ఓ పద్మనేత్రుఁడా! భూమిపై నిన్ను నేను ఎంచుటకు సరిపోదునా? ఓ పూజ్యుఁడా! నన్ను గుర్తించుచు పున్నామాది నరకముల నుండి మమ్ము కాపాడుదువు కదా. నిన్ను గుర్తించి నేను గౌరవింతును. నామర్యాద నిలిపుచు, లోకమున ప్రేమతో కూడిన దైవ గాథలతో నన్ను కాపాడుము.


3. శా. క్రన్నన్ గావఁగ వచ్చి ప్రోతు వనుచున్, గన్పింతువీవంచు నో

కన్నా! చిత్త కవాటమున్ దెఱచి, నిన్ గాంచంగ నేనుంటి, నా

కన్నుల్ కాయలు కాచుచుండె, నయినన్ గన్పింప రావేల? శ్రీ

మన్నారాయణ! గాంచ నేరనయితో మాన్యా! మదిన్ వెల్గు నిన్. 

భావము. 

ఓ శ్రీమన్నారాయణా! ఓ కన్నతండ్రీ! వేగమే కాపాడుటకు వచ్చి నన్ను కాపాడుదువనియు, నీవు నాకు 

కనిపింతువనియు, నా హృదయ కవాటమును తెరచి యుంచితిని. నా కన్నులు కాయలు కాచుచుండెను అయినప్పటికీ నీవు నాకు కనిపించగా రావేమి? నా హృదయముననే నీవు ప్రకాశించుచున్నప్పటికీ నిన్ను చూచుట నే నెఱుఁగకుంటినా?


4. శా. అన్నా కేశవ! మాధవా! నృహరి! మోహాతీత! గోవింద! రా

మన్నా! కృష్ణుఁడ! వామనా! సకల ప్రేమాధార! విశ్వేశ! యే

మన్నన్ నీదు ప్రశస్తనామమగు. మోహాంధంబునే బాపు. శ్రీ

మన్నారాయణ! నీదు నామ మహిమన్ మమ్మున్ సుఖంబందనీ.  

భావము.

ఓ అన్నా. శ్రీమన్నారాయణా! కేశవా! మాధవా ! నరహరీ ! మోహాతీతుడా ! గోవిందుడా! ఓ రామన్నా ! ఓ కృష్ణుడా! వామనా! సమస్తమైన ప్రేమాధారమైనవాడా! ఓ లోకేశా!మేము ఏది పలికినప్పటికీ అది నీ యొక్క.పేరే యగును. మోహాంధకారమునుపోగొట్టును. నీ నామ మహీమచే మమ్ములను సుఖమునందనిమ్ము.పోగొట్టెడివాడా. నీ నామ మహీమచే మమ్ములను సుఖమునందనిమ్ము.


5. శా. ఎన్నం జాలుదె? దేవ! నీదు పద సంస్పృశ్యంబు నా చిత్తమం

దెన్నెన్నో మహిమల్ కనం బరచునే! దృష్టాంతముల్ పెక్కులో

కన్నా! నా కనులారఁ జూచుటకు నేఁ గాంక్షించుదున్. నీవె శ్రీ

మన్నారాయణ! నీదు పాద వరపద్మమ్ముల్ కనం జేయుమా. 

భావము. 

ఓ దేవా! శ్రీమన్నారాయణా! నీ పాద స్పర్శను కనీసము నేను మనసున ఊహించుటకైనను సరిపోదునా? ఓ కన్నతండ్రీ! ఎన్నెన్నో మహిమలను నీ పాదములు కనఁబరిచెననుటకు పెక్కు ఉదాహరణలు కలవు. అట్టి నీ పాద పద్మములను నా కనులారా చూడవలెనని నేను కోరుకొందును. నీవే నీ పాద పద్మములు నాకు చూచునట్లుగా చేయుము.


 

జైహింద్.

View Synonyms and Definitions

27, జులై 2024, శనివారం

నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల శతజయంతి సందర్భంగా 4వ అష్టావధానము @Umam...

0 comments

జైశ్రీరామ్. 
జైహింద్.

గీతావధానాలు ఎందుకు చేస్తున్నానంటే? @UmamaheswararaoYarramsetti

0 comments

జైశ్రీరామ్.

https://youtube.com/shorts/sWZ1P7Y3pSQ?si=OS3Gd_n72cARuCwB
జైహింద్.

|తొలి మహిళా శతావధానం| ఒరిస్సా రాయగడ, part-2, | First woman centenarian ...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

|తొలి మహిళా శతావధానం| ఒరిస్సా రాయగడ, part-1, | First woman centenarian ...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

26, జులై 2024, శుక్రవారం

భవన్తి నమ్రాస్తరవః ఫలోద్గమైః. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.🙏🏼

శ్లో.  భవన్తి నమ్రాస్తరవః ఫలోద్గమైః

నవాంబుభిర్భూరి విలంబినో ఘనాః

అనుద్ధతాః సత్పురుషాః సమృద్ధిభిః

స్వభావ ఏవైష పరోపకారిణామ్.

తే.గీ. పండ్లతోనున్న వృక్షము వంగియుండు,

నీటితోనున్న మేఘంబు నింగి వ్రేలు,

జ్ఞానసంపన్నులణకువఁ గలిగియుంద్రు,

పరులకుపకారగుణులిట్లె వరలుదురుగ.

భావము. ఫలములతో నిండిన వృక్షము, నీటితో నిండిన మేఘము, 

జ్ఞానంతో పండిన సత్పురుషుడు ఎల్లప్పుడూ వినయశీలురై వంగి

(అణగి)వుందురు.🙏🏼

చింతా రామకృష్ణారావు.

జైహింద్.

25, జులై 2024, గురువారం

చిరంజీవి అహలా లక్ష్మి దశవర్షప్రాయములోనే చేసిన అష్టావధానము. Lakshmi Ahala(10years) First Ashta Avadhanam-Brahmasri Vaddiparti Padmak...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

24, జులై 2024, బుధవారం

బ్రహ్మశ్రీ పద్మాకర్ గారి అష్టావధానం.13-10-2018 - Astavadhanam - Sri Sharada Parameswari Sharannavarathri Mah...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

మోక్షకారణ సామగ్ర్యాం ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  “మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ 

స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిదీయతే” (శంకర భగవత్పాదులు)

తే.గీ.  మోక్షకారణమగునది పూర్ణభక్తి,

గొప్పదదియంచు శంకరుల్ చెప్పినారు,

స్వస్వరూపానుసంధానమే స్వయముగ

ముక్తినిడు భక్తిగాఁ జెప్పె పూజ్యులార!

భావము.  మోక్ష కారణలైన సామాగ్రులలో “భక్తి” గొప్పది. “స్వస్వరూప అనుసంధానమేఽనగా తనరూపముననే ఆ భగవంతుని నిలుపుకొనుటయే భక్తి అనబడును.

భాగవతంలో నవవిధభక్తులు ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉన్నది. 

శ్లో.  శ్రవణం కీర్తనం విష్ణోః  -  స్మరణం పాద సేవనం

అర్చనం వందనం దాస్యం  -  సఖ్యమాత్మ నివేదనమ్.

పోతన భాగవతములో దీనినే ఈ విధముగ చెప్పెను.

మ.  తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనా

ర్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం

బను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి స

జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!

ఆ నవవిధభక్తులు.

1. శ్రవణ భక్తి : సత్పుతురుషుల వాక్యాలు, సంద్గ్రంథాలు విన్న  జ్ఞానానికి మార్గం చూపుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు.

2. కీర్తనా భక్తి : భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. వాల్మీకి, నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనార్లు, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో పరమపదం పొందారు.

3. స్మరణ భక్తి : భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించుట స్మరణ భక్తి. మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు.

4. పాదసేవన భక్తి : భగవంతుని పాదాలు సేవించడం. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు.

5. అర్చన భక్తి : ప్రతిరోజు తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చారూపంలో దేవుని పూజించడం అర్చనా భక్తి. 

6. వందన భక్తి : వందనం అనగా నమస్కారం. తన యందు మనస్సు నుంచి భక్తులై పూజింపుమని, నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోవించాడు.

7. దాస్య భక్తి : ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. కులశేఖర అళ్వారు, హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తి నాశ్రయించి ముక్తిని పొందారు.

8. సఖ్య భక్తి : భగవంతునితో సఖ్యమేర్పరచుకున్న వారు ధన్యులు. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు.

9. ఆత్మ నివేదన భక్తి : ఆత్మనివేదన మనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం. ఈ మార్గాన ద్రౌపతి, గజేంద్రాదులు ముక్తులైనారు.

జైహింద్.

Rephrase with Ginger (Ctrl+Alt+E)

తావన్మౌనేన నీయన్తే ... మేలిమి బంగారం మన సంస్కృతి

0 comments

 జైశ్రీరామ్.

శ్లో. తావన్మౌనేన నీయన్తే కోకిలశ్చైవ వాసరాః|        

యావత్సర్వం జనానన్దదాయినీ వాఙ్న ప్రవర్తతే ||

తే.గీ.  కూతవచ్చునందాక తా కోయిలమ్మ

మౌనముననుండి పిదపతా గానఫణితి

ప్రకటనముచేయు నట్టులే ప్రతిభు లవని

సమయమును చూచి పలుకుట జాణతనము.

భావము. తనకు కూత వచ్చే వరుకు కోయిల మౌనంగా ఉండి రోజులు 

గడుపుతుంది. కాలక్రమంలో మధురమైన స్వరంతో అందరినీ ఆకర్షిస్తుంది. 

అదే విధంగా సమయం వచ్చినప్పుడే సందర్భోచితమైన మాట పలికి 

అందరినీ మెప్పించాలి. సమయం సందర్భం రానంతవరుకు మౌనం 

వహించడమే ఉత్తమం.

జైహింద్.

23, జులై 2024, మంగళవారం

ఆరోగ్యం వ్యసనం హన్తి. ... రచన .బ్రహ్మశ్రీ సదాశివానందనాథః (ఆచార్య రాణి సదాశివ మూర్తిః) మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

తస్మాత్ హరం భజ్యానిశమ్

ఆచార్య రాణి సదాశివ మూర్తిః

శ్లో.  ఆరోగ్యం వ్యసనం హన్తి - తద్ధన్తి రుగ్మతా తాం చ| 

మృత్యుర్వై హన్తి తం హరః - తస్మాత్ హరం భజాऽనిశమ్  ||

శ్లోక రచన- సదాశివానందనాథః (ఆచార్య రాణి సదాశివ మూర్తిః)

తే.గీ.  వ్యసన మారోగ్యమును చంపు, వ్యసనమదియు

రోగమునఁ జచ్చు, చచ్చును రోగమదియు

మృత్యు దేవత చేతిలో, మిత్తి శివుని

చేత చచ్చును, గొలువుమా శివుని సతము.

భావము. ఆరోగ్యమును వ్యసనము హరించును. వ్యసనమును రోగము హరించును. 

రోగమును మృత్యువు హరించును. మృత్యువును హరుడు హరించును. 

కనుక హరుని ఎల్లప్పుడూ సేవింపుము.

జైహింద్.

ముక్తాఫలైః కిం మృగపక్షిణాం చ ... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

 హైశ్రీరామ్.

శ్లో. ముక్తాఫలైః కిం మృగపక్షిణాం చ - మృష్టాన్న పానం కిము గార్దభానామ్। 

అంధస్య దీపో బధిరస్య గీతం - మూర్ఖస్య కిం ధర్మకథాప్రసంగః|| (నీతి చంద్రిక)

తే.గీ.  అల మృగములు పక్షులకు ముత్యములవేల?

మధురమైనట్టి భుక్తి గాడిదలకేల?

నంధ బధిరులకును దీప, సుందర నుత

గీతమేల? ద్రాబకు ధర్మ గీతులేల?

భావము.  మృగాలకుగానీ పక్షులకుగానీ ముత్యాల అవసరమే లేదు.  

గాడిదలకు మధురమైన భోజనము గానీ, మధురపానీయము గానీ అవసరమే లేదు.  

గ్రుడ్డివానికి దీపముతో పని లేదు. చెవిటివానికి సంగీత మవసరము లేదు.  

మూర్ఖునికి ధర్మబోధలతో ప్రయోజనము లేదు.

జైహింద్.

ప్రభుర్వివేకీ ధనవాంశ్చ దాతా ... మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ప్రభుర్వివేకీ ధనవాంశ్చ దాతా  -  విద్వాన్ విరాగీ ప్రమదా సుశీలా।

తురఙ్గమః శస్త్రనిపాతధీరః"  -  భూమణ్డలస్యాభరణాని పఞ్చ॥ 

తే.గీ.  తెలివి కల రాజు నీవిని కలుగు ధనుఁడు,

నుత విరాగియౌ చదువరి, క్షితి సుశీల

వనిత, యుద్ధముననిలుచు ఘనతరాశ్వ

మనెడి యైదును ధాత్రికి కనగ నగలు. 

భావము. తెలివైన రాజు, దానగుణంకల ధనవంతుడు, పేరుప్రతిష్టలయందు 

కోరిక లేనట్టి విద్వాంసుడు, సత్ప్రవర్తనగల స్త్రీ, శత్రుసమూహమునందు ధైర్యంగా 

నిలిచే గుఱ్ఱం - ఈ అయిదుగురు భూమికి ఆభరణములు." 

జైహింద్.

గాత్రేషు వలయః ప్రాప్తాః ... మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  గాత్రేషు వలయః ప్రాప్తాః  -  శ్వేతాశ్చైవ శిరోరుహాః |

జరయా పురుషో జీర్ణః  -  కిం హి కృత్వా ప్రభావయేత్.

(వాల్మీకి రామాయణం)

తే.గీ.  చర్మమందున ముడతలు సహజముగనె

పడును, శిరసుపై జుత్తును పండుచుండు,

వెద్దవయసున మనిషికి, వీటినరసి

యాపగలిగెడిదేది? మహాత్మ! నృహరి!   

భావము.  అవయవాలు ముడతలు పడతాయి. జుట్టు తెల్లబడుతుంది. 

వృద్ధాప్యంతో మనిషి క్షీణిస్తాడు. దాన్ని ఆపడానికి ఏ ప్రభావం అక్కడ 

జరుగుతుంది?

జైహింద్.

Rephrase with Ginger (Ctrl+Alt+E)

22, జులై 2024, సోమవారం

శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత పద్యసహస్ర దళపద్మము. రచన. చింతా రామకృష్ణారావు.

0 comments

శ్రీలక్ష్మీసహస్రనామావలిః

శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత పద్యసహస్ర దళపద్మము.

రచన.   చింతా రామకృష్ణారావు.

ఓం శ్రీమహాలక్ష్మీం ఉపాస్మహే

సీ. ఆషాఢ బహుళపాడ్యమి నాడు యాదాద్రి  -  నృహరిపాదార్చకుల్ మహిత నృహరి

దూరశ్రవణమునన్ కోరిమాటాడిరి. నన్ బ్రశం సించుచు నరహరి శత

కము ఘనంబనినారు, రమణీయ శ్రీ రమా నామసహస్రంబు స్వామి మెచ్చ

పద్యపుష్పములందు భాసిల్లగా నిల్పి  పదిదినంబులలోన వ్రాయమనిరి.

తే.గీవిదియ మొదలు నేకాదశి వెడలులోపు  -  వ్రాయ జేసెను శ్రీలక్ష్మి వాసి చూపి,

దినమునకు నూరు పద్యముల్ వినయముగను  -  వ్రాసినాడను దైవంబు వ్రాయఁజేయ.

సద్విధేయుఁడు  -  చింతా రామకృష్ణరావు.

స్వస్తిశ్రీ చాంద్రమాన శుభకృన్నామ సంవత్సర ఆషాఢ బహుళ ఏకాదశీ

భానువారం.   ఆంగ్ల తేదీ. 24 - 7 - 2022

 

పండితాభిప్రాయములు.

అనపాయినీ వరివస్య

వాగ్విదాంవర బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ

     శ్రీమన్నారాయణుడుధర్మస్థాపనప్రయోజనమునాశించి అనేక అవతారములను దాల్చి ఆనుషంగికముగా భక్తరక్షణ లీలను కూడా ప్రకటించెను.కానీ కేవలము భక్తరక్షణయే లక్ష్యముగా స్వామి స్వీకరించిన రూపు నారసింహావతారము. ఇతర అవతారముల వలె కాక నారసింహావతారము ఉపసంహారములేని నిత్యావతారము. అంటే సదా భక్తరక్షణ తత్పరుడన్న మాట స్వామి ప్రేరణతో శ్రీ చింతా రామకృష్ణారావుగారు నారసింహ అష్టోత్తర శతనామాలకు ఆయా నామాలను పద్యపాదములలో నిలుపుచు, నిలువెత్తు భక్తితో పదికాలాలు నిలిచేశతకాన్నివెలయించి స్వామికి సమర్పించిన ధన్యులు. స్వామి ఉదరములో ప్రపంచాలన్నీ ఉన్నాయని గుర్తు చేయటానికేమో ప్రతి పద్యములో మరొక పద్యాన్ని దాచి ఉంచిన గర్భకవిత్వము శతకములోని మరొక విశేషము.

     అది నేపధ్యం. ప్రకృతములో యాదాద్రి నారసింహక్షేత్రములో స్వామి ప్రధానార్చకులు శ్రీమాన్ నరసింహాచార్యులుగారి రూపములో స్వామి మరొక ఆదేశం పంపారుట, లక్ష్మీ సహస్రనామాలను కూడా పద్యస్థం చేయమని, అది  కూడా 10 రోజుల్లో పూర్తి చేయమని. అంటే రోజుకొక శతకము. భాగవతుల ఆజ్ఞ భగవదాజ్ఞగా స్వీకరించి అమ్మపైన అచంచల విశ్వాసముతో  చింతావారు నడుము బిగించి అనుకున్న పదిరోజులలో పద్యపుష్పసహస్రము సిద్ధము చేసారు. తాను వ్రాస్తున్నాను అనుకోలేదు అమ్మ వ్రాయించింది అన్నది భావన. అందుకే ముందు సహస్రనామములలో శ్లోకము, తరువాత శ్లోకాంతర్గత నామములకు అమ్మ నామముతో చతుర్ధ్యంతముగా నమస్కరించి, సంక్షిప్తముగా నామవిశేషము చెప్పి అమ్మదయతో పద్యము వ్రాసారు. ఇది కొత్త ప్రక్రియ. శ్లోకమును నామములుగా విభజించునప్పుడు కొంత కాఠిన్యము కలుగుతుందికనుక వివిధ విభజనలను సమన్వయపరుచుకొని సర్వజనామోదముగా స్థిరీకరించుకొనుట మరొక ఇబ్బంది.

     ఛందోవిషయకముగా ఒక మాట చెప్పుకోవాలిప్రసిద్ధమైన పద్యలక్షణాలు కొన్ని మాత్రమే సాధారణ వినియోగములో ఉన్నాయి. అయితే పద్యపాదాక్షరాలను అనుగుణముగా 1 నుండి 26 ఛందస్సులుగాను, అలా ఒకొక్క ఛందస్సులో ప్రస్తారము వేయగా సుమారు 13 కోట్ల వృత్తాలు అవుతాయని లాక్షణికులు చెప్తారు. ఇక్కడ అమ్మ నామము యథాతథముగా పద్యములో ఉండాలన్న నియమము పెట్టుకున్నారు. అందుకు అనువైన కందము, తేటగీతి ఇత్యాది జాత్యుపజాత్యులను వినియోగించినారు. ఉత్పల, మత్తేభ, శార్దూల, పంచచామరాదులు కూడా విస్తృతముగా వినియోగించారు.అయితే కొన్ని నామాలు ప్రసిద్ధపద్యలక్షణాలలో ఇమడవు కనుక అలాంటి విశేషలక్షణాలు నిర్మించుకుని నామము వచ్చేలాగా పద్యనిర్మాణం చేసారు. అలాంటి నూతనముగా నిర్మించుకున్న పద్య లక్షణాలను    ఉదాహరణగా 128 పద్యములో  చూడవచ్చుఇది అంత సులువు కాదుపద్యము నడక, లయ గమనికలో ఉంచుకుని చేయాల్సిన జిలుగుపని. ఇది అమ్మ అనుగ్రహముతో జరిగినది అన్న భావనతో  ఇలాంటి క్రొత్త వృత్తాలకు నామమునే లేక ఆయా నామములలోని ఒక భాగమునో వృత్తనామముగా వ్రాసిస్వయంకల్పిత మృణాలి వృత్తముఅని స్పష్టపరిచినారు. ఇలాంటి చాలా కొద్ది సంఖ్యలోనే ఉన్నాయి. పైన చెప్పినట్లు శ్లోకమునకు భిన్నమైన నామవిభజనలు కనబడ్డాయి అన్నాను కదా. వీరు అలాంటి భిన్నమైన విభజనలకు అన్ని రకాల పద్యాలు (క్రమసంఖ్య లేకుండా) వ్రాసినారు. అంటే ఎవరైనా తమకు నచ్చిన పద్యము చదువుకోవచ్చునన్నమాట. ఉదాహరణకి 77 పద్యమునకు సంబంధించిన శ్లోకం గమనించవచ్చు. ఇక్కడకాలిమాఅన్న శ్లోకపదాలు కాలి, మా అని రెండుగా  కొందరైతే  కాలిమా అని ఏకపదముగా కొందరు విభజించారు. చింతావారు కాలి, మా, కాలిమా అని మూడు నామాలకు మూడు పద్యాలు వ్రాసారన్నమాట. అలా అనేకమైన ఇబ్బందులను అమ్మదయతో అద్భుతముగా నిర్వహించబడినది.

     శ్రీకారాదిగా పద్యసహస్రాన్ని క్షేమకరముగా ప్రారంభించారు. వేయి నామాలు వేయి పద్యాలు. ముందుమాట వ్రాయుటలో నిడివికున్న సంక్షిప్తతను దృష్టిలో ఉంచుకుని కొన్ని విశేషాలు, గ్రంథము చదువునప్పుడు గమనించవలసిన అంశాలు మాత్రమే ప్రస్తావిస్తానుఅమ్మ స్తుతి పద్యములో కవికి తన స్వకీయమైన భావమును పద్యము వ్రాసి నామమును సంబోధనగా చేయుట సులువైన పని. సాధారణముగా శతకకర్తలు ఆశ్రయించే విధానము కూడా. అదిదోషము ఎంతమాత్రము కాదు కూడా. కానీ చింతావారు తేలికమార్గమును స్వీకరించలేదుపైన చెప్పినట్లు నామమునకు సంక్షిప్తమైన అర్థము చెప్పారుపద్యములో అర్థము విస్తృతమైనదిగా నామవ్యాఖ్యగా ప్రకటించారుఅంటే పద్యలక్షణాన్ని ఎన్నుకోవటంలో వ్యాఖ్యాపదాలకు కూడా అనుగుణమైనవిగా గమనించుకోవాలికవి పరిశ్రమ ఎంతదో ఊహించవచ్చుఇన్ని జాగ్రత్తలతో వేయి పద్యాలు పది రోజులలో పూర్తిచేయడం అనితరసాధ్యముఅందుకు చింతావారికి ఎన్నిసార్లు నమస్కరించినా తక్కువే.

     ఇలాంటి గ్రంథనిర్మాణమునకు కర్త, కారయితా, ప్రేరకుడు, అనుమోదకుడు కూడా నారసింహుడే, కేవలం వివిధరూపాలలో కనబడ్డాడు అంతేచింతావారు పద్యరచనా తపస్సులో కృతకృత్యులయ్యారనుటకు ఎట్టి సందియము లేదుతప్పక ఆద్యంతము చదువదగినది, పదే పదే చదువదగినది. అమ్మ పాఠకులకు అజ్ఞాతదోషనివృత్తిపూర్వకముగా సకల శుభములు తప్పక కలుగచేస్తుంది అన్నది నా ప్రగాఢ విశ్వాసముఇలాంటి మహద్గ్రంథాన్ని తొలి పాఠకుల జాబితాలో నేను కూడా ఉండటం నా అదృష్టముఅందుకు మా చింతారామకృష్ణారావు అన్నగారికి నమస్కరిస్తు, వారు మరింత సాహిత్యసేద్యము చేయుటకు ఆయురారోగ్యభాగ్యాలను అమ్మ అనపాయినీదేవి కలిగించాలని ప్రార్థిస్తూ..  స్వస్తి

హైదరాబాదు                                                                                                                                       గురుపాదధూళి

తేది; 16.10.2022                                                                                                             నారుమంచి వేంకట అనంతకృష్ణ

 

 

 

 

 

 

 

 

 

 

 

డా. రాణి సదాశివ మూర్తిఃఉపకులపతిఃరాష్ట్రియ సంస్కృత విశ్వవిద్యాలయః,…తిరుపతిః

నవరత్నమాలికా.

శ్రీలక్ష్మీ సహస్రనామాంచితపద్యసహస్రదళపద్మార్చనం

శ్రీ మహాగణాధిపతయే నమఃశ్రీ మాత్రే నమఃశ్రీ గురుభ్యోనమః

శ్లోవికసితే సహస్రారే   -  మోక్షద్వారస్య ఫుల్లతా

కిం వక్తవ్యం సహస్రాబ్జే  -  ఫుల్లే యది సహస్రధా।।1।।

శ్లోరామస్త్రేతాపతిర్భూత్వా  -  ధర్మమార్గమదర్శయత్

కృష్ణో ద్వాపర సంజాతో  -  ముక్తిమార్గమదర్శయత్।।2।।

శ్లోకలౌ కాలుష్యకాంతారే  -  చింతాపనోదదీక్షితః

రామకృష్ణ కవీంద్రోయం  -  భక్త్యుపాయం ప్రయచ్ఛతి।।3।।

శ్లోచంద్రే విలసితే పూర్ణే  -  జ్యోత్స్నాశ్రీః ప్రసరేద్భువి।।

ఫుల్లే కవిమనస్యద్య  -  కవితాశ్రీర్విభాసతే।।4।।

శ్లోశ్రియః స్తోత్రం చిత్రమార్గే  -  పద్యాధ్వన్యవతారయన్

తారయత్యాశు సల్లోకం  -  శ్రీవాగేకసమర్చయా।।5।।

శ్లోశ్రియః పాదార్చనాసక్తః  -  ఆంధ్రపద్యవిభూషణః

శ్రీ చింతా రామ కృష్ణార్యః  -  శ్రీచింతన తపఃప్రియః।।6।।

శ్లోదశశతవర్త్మారూఢామ్  -  ఏకవర్త్మని రూపయన్

శ్రియం శ్రీశే సుభక్తిమాన్  -  కృతకృత్యః కృతీ కవిః।।7।।

శ్లోస్వయం దివ్యత్వ పాత్రం సత్  -  సతామపి శుభప్రదః

కవీంద్రో రాజతే భూయో  -  భూయస్తత్త్వార్థదర్శకః।।8।।

శ్లోవర్ధతాం భక్త్యధ్వైషో  -  వర్ధతాం కవిరాట్సుధీః

వర్ధతాం భక్తభూర్భూమిః  -  వర్ధతాం శ్రీః కవిగృహే।।9।।

 

ఇత్థం సనతితతిశతమ్  బుధజనవిధేయః  రాణి సదాశివ మూర్తిః

బ్రహ్మశ్రీ రాణి సదాశివ మూర్తి మహోదయులకు

నా కృతజ్ఞతాంజలి.

. మాటలు చాలకుండెనయ మాన్యమహోదయ! మీ కృపన్ గనన్, -  కోటికి యొక్కరుండుదురు కూర్మిని మీవలె చూపువారిలన్,

దీటుగ వ్రాయనేర్వనయ దివ్యపు మీ కవితామృతమ్ముతో, -  సాటియె లేరు మీకు, మనసార నమస్కృతులందుడిమ్ముగన్.

 

నా మనసులో మాట.

ఓం శ్రీమాత్రే నమః.                                                                                                                                                    శ్రీ మహాలక్ష్మి మహిమలు చెప్పఁ జాల.

     శ్రీమన్మంగళదివ్యతేజ శ్రీమల్లక్ష్మీ జగన్మాత అనుగ్రహ విశేషమున యాదాద్రి శ్రీమల్లక్ష్మీనారసింహులనిరంతర సంసేవనా పునీత జన్ములయిన ప్రథానార్చకులగు శ్రీ నారసింహాచార్యులవారు శ్రీ శుభకృత్ ఆషాఢబహుళ పాడ్యమినాడు నాతో దూరవాణిద్వారా మాటాడుచు, శ్రీ యాదాద్రి నారసింహ శతక పద్యములు మీరు వ్రాసిస్వామికి అర్పించుకొనినారు. చాలా బాగున్నవి. మరి లక్ష్మీ అమ్మవారి సహస్రనామములకు పద్యములు వ్రాయండి. అమ్మవారికి ఆనందం కలిగించండి వారంపది రోజులలో పూర్తి చెయ్యండి అని ఆదేశించిరి. ఇది సాక్షాత్ అమ్మవారి ఆదేశంగా భావించి ఆశ్చర్య చకితుఁడనయ్యాను. పదిరోజులలో వేయి నామములకు పద్యములు వ్రాయుట నావంటి సామాన్యునకు సాధ్యమెట్లగును? అని భావించి, అంతా అమ్మే వ్రాసుకోనుందేమో అని, నా ప్రత్నములో భాగంగా పాడ్యమినాడి సహస్రనామములు పొందుపరచుకొని ఉంచుకొనినాను.

     మరునాడు విదియ రోజున నామములను పద్యములలో నిక్షేపించుచు వ్రాయుట ప్రారంభించితిని. అమ్మవారే స్వయముగా నాచే రోజునకు వంద నామములకు పద్యములు వ్రాయించుకొని ఆషాఢబహుళ ఏకాదశి నాటికి పరిపూర్ణముగా రచన చేయించుట, నేను ఆచార్యస్వాములవారికి ఈ వైనము విన్నవించి ఆ పద్య సహస్రమును వారికి పంపుట చేసితిని. వారు నామములకు వివరణకూడా వ్రాసినచో ప్రయోజనకరముగా ఉండునని సూచించి మరికొంత సమయము తీసుకొమ్మనిరి. నేను నామ వివరణవ్రాయుటతో పాటు ముద్రారాక్షసములను కూడా సరిచేసి వారికి ఈ ప్రతి పంపుట జరిగినది.

     శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దయాంతరంగాన్ని కనీసము ఊహించుటకైననూ నేను సరిపోను. వారిపై అష్టోత్తర శత నామాంచితముగా అనేక ఛందస్సులు గర్భమునందుండు సీసములను వ్రాయించుకొని, ఇప్పుడు వారి హృదయేశ్వరి కడగంటి కాంతికిరణము నాపై ప్రసరింపఁజేయనెంచి ఈ తలంపు కలిగించి ఈ మహత్కార్యమును నాపేర పూర్తి చేయించిరి. ఏ నాటి నా పెద్దల, గురుదేవుల పుణ్యఫలమో ఈనాటి ఈ మహద్భాగ్యమును నేననుభవించుట సంభవించినది.

     నేను వ్రాసిన ప్రతిని సరిచూచు పనిని శ్రీ మాచవోలు శ్రీధరరావు గారు, శ్రీ కటకం వేంకటరామ శర్మగారు, శ్రీఅన్నపరెడ్డి సత్యనారాయణరెడ్డిగారు శ్రమతో పూర్తి చేసిరి. శ్రీ యల్లాపంతుల సూర్యనారాయణ గారు యాదాద్రిలో ఒక ఉద్యోగి. వీరితో పరిచయము నా భాగ్యమని చెప్పవలెను. వీరి మూలముననే ప్రథానార్చకుల పరిచయ భాగ్యము నాకు కలిగినది. వారి ఆకంక్ష మేరకే ఈ గ్రంథ రచనకు బీజము పడుట, పదిరోజులలో సుసంపన్నమగుట తటస్థపడినది.

     శ్రీ ప్రథానార్చకుశ్రీ లక్ష్మీనరసింహాచార్యులవారికి, శ్రీ యల్లాపంతుల సూర్యనారాయణ గారికి, శ్రీ మాచవోలు శ్రీధరరావుగారికి, శ్రీ కటకం వేంకటరామ శర్మగారికి, శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి నా ధన్యవాదములు. నాకు కలిగిన సందేహములలో తన ఆలోచనలను జోడించి సందేహనివృత్తి చేయుచు ముందుకు నడిపిన నా అర్థాంగి చి..సౌ.విజలక్ష్మి గారికి నా ఆశీస్సులు.

రచనలో నా కెదురయిన సమస్యలు.

అమ్మవారి వేయి నామములూ నూట ఏభైనాలుగు శ్లోకములలో ఉన్నవి.   ఈ నామములను కొందరు కొన్నివిధములుగను, మరికొందరు మరికొన్ని విధములుగను విడదీసి యుండిరి. కొందరు వేయి నామములుగా చూపిరి, మరికొందరు వేయీ ఎనిమిది నామములుగా చూపిరి, మరికొందరయితే వేయీముప్పదినామములకు పైగా చూపిరి.

     నేనుముందు అన్ని నామములకూ అందరి మతములననుసరించి పద్యములు వ్రాసితిని. ఆతరువాత ఔచిత్యముగా ఉన్నవిధమును భావించి వేయీ యెనిమిది నామములను గుర్తించి సంఖ్యలు నామములకు నిర్దేశించి పద్యములు వ్రాసియుంటిని.

మిగిలినమతములప్రకారము కూడా పద్యములు వ్రాసి చూపి యుంటిని. ఎవరికి కావలసిన విధముగా వారు   అమ్మవారు తోపించినవిధముగా చేయుట జరిగినది.

     కొన్ని నామములు అనేకపర్యాయములు శ్లోకములలో ఉన్నప్పటికీ కేవలము ఒక నామమునకే సంఖ్యనొసగి మిగిలినవాటికి పద్యములు మాత్రము వ్రాసి ఉంచితిని.

     అన్ని నామములూ సుపరిచిత ఛందస్సులలో నప్పకపోవుచుండుటతో అమ్మవారి ప్రేరణననుసరించి అటువంటి నామములకు ఛందస్సులు స్వయముగా కల్పించి పద్యరచనలొ ఆ నామములను ఉంచి వ్రాయుట జరిగినది.

     సహృదయులు దైవప్రేరణతో జేసిన ఈ రచనలో నాదైన జ్ఞాన లేశమైననూ లేదనే విషయమును గుర్తించి గుణములన్నియూ అమ్మవారి ప్రేరణ కారణముగా వ్రాయబడినవని గ్రహింతురుగాక. దోషములున్న అవి నా అజ్ఞానముగా భావించి పెద్దమనసుతో భక్తిని మాత్రమే స్వీకరింతురుగాక.    

     ఈ నా కృతిని భక్తితో పఠించి తమ అమూల్యమయిన అభిప్రాయములను అందఁజేసిన వాగ్విదాంవర బిరుదాంకితులు బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ సహోదరులకు నా ఆనందమును తెలియఁజేయుచున్నాను.

     నాపై అవ్యాజానురాగమును చూపెడి ఆచార్య రాణీ సదాశివమూర్తి మహోదయులు నాయొక్క ఈ గ్రంథమును ఆమూలాగ్రమూ చదివి  తమ అమూక్యమయిన అభిప్రాయమును చక్కని మనోహరమయిన శ్లోక నవరత్నమాలిక రూపమున అందించియున్నారు. వీరు చూపిన అభిమానమునకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియఁజేసుకొనుచున్నాను.

     ఈ గ్రంథ ముద్రణను యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ దేవస్థాన ప్రథానాచార్యస్వాములవారి ద్వారానే జరుగనున్నందున ముద్రించబోవు పుణ్యాత్ములకు, వారికి ప్రేరణ కలిగించిన ఆచార్య మహోదయులకూ నా ధన్యవాదములు తెలియఁజేసుకొనుచున్నాను.

ఓం వాసుదేవాయ నమః.. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః.                                                                                     సద్విధేయుఁడు                                                                                                                                                  చింతా రామకృష్ణా రావు.

 

 

 

 

 

ప్రార్థన.

శాశ్రీమన్మంగళ భావనాచయముతో శ్రీలక్ష్మిసన్నామముల్

ప్రేమన్ వేయి తెలుంగు పద్యముల దీప్తిన్ వ్రాయ శాసించె నా

శ్రీమద్రమ్య రమాలలామ నను నో శ్రీ విఘ్నరాజా కృపన్

నీమంబొప్పఁగ వ్రాయఁ జేయుము లసన్నిర్విఘ్నధారాగతిన్.

శా.  శ్రీవాణీ! రచియింతు పద్యములు లక్ష్మీనామ సాహస్రమున్

భావోద్భాససుధాస్రవంతిగఁ, గృపన్ వ్రాయించు నాచేత, నా

కీవే దిక్కు, రమాభిరామముగనాకిమ్మా! పదాళిన్ గృతిన్

జీవంబైవెలుగొందఁ జేయ, జననీ! శ్రీ బాసరాంబా! నతుల్.

శా.  శ్రీలక్ష్మీ! ననుఁ గన్న తల్లి! కృప నాశీర్వాదమందించి,

ల్లీలన్ నామ సహస్రమున్ శుభగతిన్ క్లేశంబులన్ బాపుచున్

నాలోనుండి రచింపుమా! కొలుతు నిన్, నవ్యార్థ సద్భావనల్

నీలోనుండి జనించునమ్మ, జననీ! నీభక్తులే పొంగగన్.

గురువౌ వేంకట వీర రాఘవుని నే కూర్మిన్, సభక్తుండనై

చరణంబుల్ శరణంబు వేడెదను, భాషాయోష యుప్పొంగగా

స్థిరమౌ నామ సహస్రమున్ నిలుపుచున్ దీపించు పద్యంబులన్,

కరిసంరక్షకునాలి మెచ్చునటులన్ కల్పించి వ్రాయించగన్.

శానీమంబొప్పఁగ వ్రాయఁజేయుచు ననున్ నీవానిగాఁ జూడు మో

శ్రీ మన్మంగళ నారసింహ! జయముల్ క్షేమంబుఁ జేకూర్చుమా

శ్రీమంతంపు సహస్ర పద్య పఠనన్ శ్రీమద్రమన్ గొల్చు

ద్ధీమాన్యాళికి శ్రీరమా కృపను సత్తేజంబుఁ గల్పించుమా.

 

అంకితము.

శ్రీ, మన్మంగళ దివ్య భాసుర శుభశ్రీపూర్ణ శ్రీదేవికిన్,

శ్రీమంతుండగు విష్ణుమూర్తి సతికిన్, జీవాళినే బ్రోవగా

ప్రేమన్ దివ్య ధనంబులిచ్చెడి జగద్విఖ్యాత శ్రీలక్ష్మికిన్,

శ్రీమంతంబుగనంకితంబిడితి భాసింపంగ నీ గ్రంథమున్.

శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత పద్యసహస్ర దళపద్మము.

శ్లోనిత్యాగతానంతనిత్యా నందినీ జనరంజనీ

నిత్యప్రకాశినీ చైవ స్వప్రకాశస్వరూపిణీ 1

1.  ఓం *నిత్యాగతా*యై నమః

నామ వివరణ.

నిత్యమూ వచ్చుచుండెడి తల్లి మన అమ్మ లక్ష్మీ మాత.

శాశ్రీమన్మంగళ భవ్యభాగ్యద రమా! శ్రీ రూప! *నిత్యాగతా!*

ప్రేమోదార గుణాలయా! శుభద! నీవే సృష్టిలో మూలమై

క్షేమంబున్ గలిగింప మాకు సతమున్, శ్రీదేవివై వత్తువే,

నీ మాతృత్వమునెన్న నాకుఁ దరమా, నిన్నున్ సదా కొల్చెదన్.

2. ఓం *అనన్తనిత్యా*యై నమః

నామ వివరణ.

అంతము లేని శాశ్వతమయిన తల్లి రమామాత.

కంపరమాత్ముని నారాయణు

నరయుట నీ కృపను గలుగు నమ్మా! శుభదా!

కరుణ ననంతుని జూపెడి

నిరుపమ జననీ! *యనంత నిత్యా!* కొలుతున్,

3. ఓం *నన్దిన్యై* నమః

నామ వివరణ.

ఆనందమును కలుగఁ జేయు తల్లి మన అమ్మ శ్రీదేవి.

తే.గీవినుత *నన్దినీ!* యానంద మనుభవైక

వేద్యమమ్మరో నీకృపన్ బ్రీతిఁ గనిన,

సతతమానందము న్మదిన్ సదయ నిలిపి,

కాచి రక్షించఁ, గొల్తు నిన్ గమల నయన!

4. ఓం *జనరఞ్జన్యై* నమః

నామ వివరణ.

జనుల మనసులకానందము కలుగజేయు తల్లి మన శ్రీదేవి.

తే.గీదివ్య  *జనరఞ్జనీ!* సన్నిధిగనె నీకు

నన్ను నిలుపుకొనుము కృపన్, సన్నుతముగ

జనుల రంజింప జేసెదన్ ఘనతనెన్ని

పద్యములు వ్రాసి నీపైన భవహరముగ.

5. ఓం *నిత్యప్రకాశిన్యై* నమః

నామ వివరణ.

ఎల్లప్పుడూ ప్రకాశించు తల్లి లక్ష్మీదేవి.

తే.గీజనని *నిత్యప్రకాశినీ!* జయము నీకు,

నీవె నిత్యప్రకాశమై నిండి మదిని

నీదు తేజంబు నాలోన నిండనిమ్ము

జ్ఞానసద్భాగ్య దాయినీ! కరుణఁ గనుమ.

6. ఓం *స్వప్రకాశస్వరూపిణ్యై* నమః

నామ వివరణ.

స్వయముగా ప్రకాశించు స్వరూపము కల తల్లి.

తే.గీ.  *స్వప్రకాశస్వరూపిణీ!* విప్ర పూజ్య!

నీ ప్రకాశమ్ము నాలోన నిలువనిమ్ము,

జ్ఞాన దివ్యప్రకాశమ్ము కలుగఁ జేసి,

కనఁగఁ జేయుము  నీ పతిన్ గాంక్షతీర.

శ్లోమహాలక్ష్మీర్మహాకాలీ మహాకన్యా సరస్వతీ

భోగవైభవసంధాత్రీ భక్తానుగ్రహకారిణీ 2

7. ఓం *మహాలక్ష్మ్యై* నమః

నామ వివరణ.

గొప్ప లక్ష్మీదేవి మన అమ్మ. అందరికీ జీవనాధారమయిన తల్లి మన

మహాలక్ష్మితల్లి.

తే.గీనుత *మహాలక్ష్మి!* నినుఁ గొల్చు బ్రతుకు బ్రతుకు.

క్షితిజ మానవ జాతికి బ్రతుకు నీవె,

నీవు లేకున్న బ్రతుకులే లేవు జనని,

నీదు కృపజూపి భక్తుల నాదుకొనుము.

8. ఓం *మహాకాల్యై* నమః

నామ వివరణ.

మిక్కిలి శక్తిస్వరూపిణి అయిన కాలీ స్వరూపము మన తల్లి.  మిక్కిలి నల్లగా

ఉండు తల్లి జనని.

తే.గీశ్రీ *మహాకాలి!* నిలుము నా చిత్తమందు,

నా గృహంబున నీవుండి నన్ను గనుచు

నైహికంబును బరము నాకందఁ జేసి

నన్ను గాపాడుమమ్మరో సన్నుతముగ.

9. ఓం *మహాకన్యా*యై నమః

నామ వివరణ.

మన అమ్మ లక్ష్మీమాత గొప్ప కన్యక. కన్యకలయందు ప్రకాశించు మహాకన్యక

మన అమ్మ.

తే.గీకన మహాకన్య వీవమ్మ కల్పవల్లి!

కొలిచెదన్ *మహా కన్య!* నిన్ గొప్పగాను,

కన్యకామణులందునఁ గలిగి నీవు

వినుత లక్ష్మీప్రదమ్ముగా వెలుగుదువుగ.

10. ఓం *సరస్వత్త్యై* నమః

నామ వివరణ.

మన అమ్మయగు లక్ష్మీ మాతయే సరస్వతీ స్వరూపము.

తే.గీ *సరస్వతీ!* నీకృపనొప్పిదముగ

జీవితము సాగుచుండును సేవిత పద!

హంసవాహినివగుచు నీవమరియుండి

చిత్తమునవెల్గు చుందువే చిన్మయముగ.

11. ఓం *భోగవైభవసంధాత్ర్యై* నమః

నామ వివరణ.

భోగమును వైభవములను మనకు ప్రసాదించుజనని లక్ష్మీమాత.

తే.గీ.  *భోగవైభవ సన్ధాత్రి!* పూజలంది

భోగవైభవములనిమ్ము పూజ్యముగను,

యోగమును గొల్ప ముక్తికై, యోగ్యులకును,

నిన్ను సేవించు యోగమే నిరుపమమిల.

12. ఓం *భక్తానుగ్రహకారిణ్యై* నమః

నామ వివరణ.

భక్తులపై అనుగ్రహ కారణమయిన జనని లక్ష్మీమాత.

శా.  *భక్తానుగ్రహకారిణీ!* జయము, నీ భక్తాళి ధన్యాత్ములై

రక్తిన్ నిన్ మదిలోన నిల్పి సతమున్ బ్రార్థింతురోయమ్మ! నీ

శక్తిన్ మానసమందు నెంచి కృపకై సాంతంబు నిన్ గొల్తురే,

భక్తిన్ శక్తి నిహంబు సత్ పరము నా భాగ్యంబుగాఁ గొల్పుమా.

శ్లోఈశావాస్యా మహామాయా మహాదేవీ మహేశ్వరీ

హృల్లేఖా పరమా శక్తిర్మాతృకాబీజరూపిణీ 3

13. ఓం *ఈశావాస్యాయై* నమః

నామ వివరణ.

అంతటనూ తానై యున్న తల్లి లక్ష్మీ మాత.

శా*ఈశావాస్య! * జయోzస్తు తే, యనుచు నిన్నే కొల్తురోయమ్మ!

ద్ధీశాలాగ్రణు లెల్లవేళలనుస్వాధీ నాత్ములై ధాత్రి, వా

గీశానీ నుత సత్ స్వరూపిణివి దేవీలోకమందంతటన్

నీ శక్తిన్ గను నేర్పునిమ్ము కృపతో నిత్యంబు నిన్ గొల్చెదన్.

14. ఓం *మహామాయాయై* నమః

నామ వివరణ.

అష్ట లక్ష్మీ స్వరూపిణియైన జనని గొప్ప మాయా స్వరూపిణి.

శామాయామోహములన్ జయింపనయితిన్ మాయన్ ద్యజించన్   *మహా

మాయా!* నీ పదపద్మముల్ కొలిచెదన్ మాయన్ విడన్ జేయుమా,

నీ యాజ్ఞన్ శిరసావహించి నడచున్ నీ సృష్టి సర్వంబు, నీ

మాయన్ బాపుట నీకు లెక్కయగునా? మాతల్లివే, పాపుమా.

15. ఓం *మహాదేవ్యై* నమః

నామ వివరణ.

గొప్ప దేవత జహన్మాతయైన లక్ష్మీ మాత.

కంభావాతీతవుగ *మహా

దేవీ!* మద్భాగ్యలబ్ధ దీపిత వీవే

కావక యున్నను నాకిక

నేవారలు ప్రోవఁగల రహీన దయాబ్ధీ!

16. ఓం *మహేశ్వర్యై* నమః

నామ వివరణ.

గొప్ప ప్రభ్విణి మన లక్ష్మీ మాత. మహేశ్వరుని అర్థాంగలక్ష్మి మహేశ్వరి.

కంనీ యనుఁగు భక్తుల కిలను

శ్రేయములిడు శ్రీ *మహేశ్వరీ!* నినుఁ గొలుతున్.

నాయందు కృపను నిలువుము

మాయను పోకార్పి కావ, మహిలో జననీ!

17. ఓం *హృల్లేఖాయై* నమః

నామ వివరణ.

హృదయమును తాకు జనని. హ్రీమ్ అనే అక్షరంలో ఉన్న జనని. 
 
కం.  *హృల్లేఖా!* నా మదిలో
 
కల్లోలములణచివేసి కారుణ్యముతోఁ
 
జల్లగ కావుము నన్నున్!
 
దల్లిగ నీ కృపను జూపి ధైర్యమునిమ్మా.
 

18. ఓం *పరమాయై* నమః

నామ వివరణ.

లక్ష్మీమాత గొప్పదైన తల్లి.

కం*పరమా* నిన్నే కొలిచెద

పరమార్థమునెన్ని నేను ప్రఖ్యాతముగా,

నిరుపమ సద్గుణ గణ్యా!

వరదాయిని వీవె నీ ప్రభావము నెంతున్.

 

19. ఓం *శక్త్యై* నమః

నామ వివరణ.

అమ్మ శక్తి స్వరూపణి.

తే.గీశక్తివోయమ్మ శ్రీ పరా! *శక్తి! * నీవు

ముక్తి భాగ్యప్రదాయివి! పూజ్య దేవి!

యుక్తమైనట్టివిమ్ము నాకొప్పిదముగ,

వందనంబులు చేసెద నందుకొనుము.

ఓం *పరమాయై శక్త్యై* నమః.
 

నామ వివరణ.

గొప్ప శక్తి స్వరూపిణి మన  లక్ష్ని మాత.

కం. ననుఁ గను *పరమా! శక్తీ! *

నిను నామది నిలిపి సతము నిన్నే కొలుతున్,

కనిపించు కంటికెదురుగ

వినయంబుగఁ బ్రణుతులిడుదుఁ, బ్రీతిగ జననీ!

కంఅమ్మా! *పరమా శక్తీ!*

సమ్మోదము తోడ నాదు సంస్తుతి  వినుమా,

నెమ్మదిఁ బరమాశక్తిగ

నిమ్మది నివసింపుమో యహీన దయాబ్ధీ!

20. ఓం *మాతృకాబీజరూపిణ్యై* నమః

నామ వివరణ.

మాతృకా వర్ణస్వరూపిణి మన అమ్మ.

తే.గీ.  *మాతృకాబీజరూపిణీ!* మహితమయిన

మాతృకా వర్ణమయముగా మదిని నిలిచి

పద్యసంస్తుతులందీవు పరిఢవిల్లి

సంతసంబును గొలుపుమా చదువరులకు.

శ్లోనిత్యానందా నిత్యబోధా నాదినీ జనమోదినీ

సత్యప్రత్యయనీ చైవ స్వప్రకాశాత్మరూపిణీ 4

21. ఓం *నిత్యానన్దాయై* నమః

నామ వివరణ.

నిరంతరమూ ఆనందమయమై భక్తులకు ఆనంద ప్రదాయినిగా వెలుగు తల్లి

మన లక్ష్మీమాత.

కంనిరుపమ *నిత్యానందా!*

తరుగని యానందమిమ్ము తలచిన నిన్నున్,

పరమానందమె బ్రహ్మము,

తరణోపాయముగ ముక్తిదా! మది నిలుమా.

22. ఓం *నిత్యబోధా*యై నమః

నామ వివరణ.

నిరంతరమూ బోధను గొలుపు మాతృదేవత లక్ష్మీమాత.

తే.గీ.  *నిత్యబోధా!* నినుం గన్న నిత్యబోధ

నొందుచుండి శుభావళిన్ బొందఁగలము,

నిత్యబోధన్ మదిన్ గొల్పి నిలుపు మమ్మ!

నిన్ను స్మరియింప నిత్యమున్ నిరుపమాన!

23. ఓం *నాదిన్యై* నమః

నామ వివరణ.

నాదమునకు మూలమయి నాదమును కలిగించు తల్లి మన అమ్మ.

తే.గీ.  *నాదినీ!* నీవె యోంకార నాదమెఱుఁగ,

నాదు మదిలోన యోంకార నాదమీవె,

సేదఁ దీర్చుచు నిహలోక బాధలుడుప

ఖేదమును వాసి నీకు నేఁ గేలు మోడ్తు.

24. ఓం *జనమోదిన్యై* నమః

నామ వివరణ.

జనులకు సంతోషమును కలిగించు జనని మన అమ్మ.

కం.  *జనమోదినీ!* వసుంధర

ఘనతర శుభకర నిరుపమ కరుణామృతమై

మనఁ జేయుచు జనపాళిని

వినుతంబుగ నిలుతువు మది ప్రీతిగ శుభదా!

25. ఓం *సత్యప్రత్యయిన్యై* నమః

నామ వివరణ.

సత్యమునకు నిదర్శనముగా సత్యమై, సత్యము నిలుపు తల్లియైయొప్పు

జగజ్జనని అమ్మ.

కం.  *సత్యప్రత్యయినీ! ధర

స్తుత్యముగా సత్యధనులతో నిలిచెదవే,

నిత్యము నీదగు సుగుణౌ

న్నత్యము సత్యముగ తెలిపి నతులందింతున్.

26. ఓం స్వప్రకాశాత్మరూపిణ్యై నమః

నామ వివరణ.

స్వయముగా ప్రకాశించు ఆత్మ స్వరూపము కల తల్లి లక్ష్మీ మాత.

తే.గీ.  *స్వప్రకాశాత్మరూపిణీ!* సన్నుతింతు

నిన్ను, నేనున్ బ్రకాశింతు నిన్ను దాల్చి

మానసంబందుఁ, గృపతోడ మనుము నీవు,

నిన్నుఁ దాల్చిన  నేనును సన్నుతుఁడనె.

శ్లోత్రిపురా భైరవీ విద్యా హంసా వాగీశ్వరీ శివా

వాగ్దేవీ మహారాత్రిః కాలరాత్రిస్త్రిలోచనా 5

27. ఓం *త్రిపురాయై* నమః

నామ వివరణ.

ముల్లోకముల స్వరూపిణి మన అమ్మ. సర్వవ్యాపి మన అమ్మ. సర్వమూ తానే

అయిన తల్లి లక్ష్మీ మాత.

కం.  *త్రిపురా!* సర్వము నీవే

కృపఁ జూపుచు నీవె మాకుఁ గేలొసగుచు

మ్మపమార్గదూరులగునటు

తపియించుచుఁ జేయు నీకు  దండములమ్మా.

28. ఓం *భైరవ్యై* నమః

నామ వివరణ.

భైరవిగా నహీజ్వల ప్రకాశనుననుండి తల్లి లక్ష్మీ మాతయే.

తే.గీ. *భైరవీ!* దుష్టులను గూల్చి  భాతినిలుపు

భారతాంబకు, నాత్మవై ప్రభను గొలుపు,

మంచివారిని కాపాడు మహితముగను

దుష్ట శిక్షణఁ జేయుము తోయజాక్షి!

29. ఓం *విద్యా*యై నమః

నామ వివరణ.

సకల విద్యా స్వరూపిణి జగన్మాతయగు లక్ష్మీదేవి.

తే.గీ. జనని! *విద్యా! * ప్రణామముల్, వినుము మొరల,

నైహికాముష్మికంబులనలరఁ జేయు

విద్యలందఁగ జేయుమా! విశ్వరూప!

విద్యగా నీవె నాలోన వెలుగుమమ్మ.

30. ఓం *హంసాయై* నమః

నామ వివరణ.

పరమహంస మన లక్ష్మీ మాతయే.

తే.గీజనని! *హంసా!* పరాశక్తి! ప్రణవమీవె,

యాత్మలో హంసవైన నిన్నరయఁ దరమె?

జ్ఞాన చక్షువు నాకిచ్చి కనఁబడుమిక.

వందనంబులు చేసెదనందుకొనుము

31. ఓం *వాగీశ్వర్యై* నమః

నామ వివరణ.

వాగీశ్వరి అయిన భారతీ మాత మన అమ్మయే.

తే.గీప్రణుత *వాగీశ్వరీ!* నీదు పదయుగమ్ము,

నాదు చిత్తమందున నిల్పి నీదు సేవ

చేయగన్ వాక్కులందించు జీవమిడుచు

వాక్ప్రభాసంపు కవితలన్ వరల నిలుము.

32. ఓం *శివా*యై నమః

నామ వివరణ.

శుభమే అస్మ్మ.శుభాకారమే మన అమ్మ, శుభాధారమే అమ్మ.

తే.గీ *శివా!* శుభాకారమా! లేశమైన

నీదు శివతత్వముల్ తెల్ప నేను జాల

ననుపమాన శుభాస్పదా! కనుము నన్ను,

శుభకరంబగు జీవన  శోభనిమ్ము.

33 ఓం *వాగ్దేవ్యై* నమః

నామ వివరణ.

పలుకులకు మూలాధారమయిన జనని మన అమ్మయే.

కం *వాగ్దేవీ!* శుభకర

భావంబులు వాగ్గరిమను వరలింపగ నన్

నీవే యొసగుమ నాకున్,

జీవాత్మను పరమమునను జేర్చగ నిమ్మా.

34. ఓం *మహారాత్ర్యై* నమః

నామ వివరణ.

అమ్మ మహారాత్రి స్వరూపము. చీకటిలో కొట్టుమిట్టాడు భక్తులకు అండగా

నిలుచు తల్లి.

. శత్రు చయంబు చేతి కిల చక్కగ చిక్కి, గణింప నిన్,  *మహా

రాత్రి!*  గ్రహింపు నా వినతి, రక్షణఁ గొల్పుము, శత్రు షట్కమున్

,ధాత్రిని మాపి, నామదికి దక్కుము నీవు ప్రపూజ్యమానవై,

యాత్రముతోడ కోరితి నహర్నిశలున్ నిను గొల్వనెంచుచున్.

35. ఓం *కాలరాత్ర్యై* నమః

నామ వివరణ.

దుష్ట భయంకర రూపమయిన కాలరాత్రి జగజ్జనని అయిన మన తల్లియే.

చంకరుణను జూపఁబోకుమిక కల్మష హారిగ *కాళరాత్రి!* దు

స్తర దురహంకృతుల్ సుజన సత్తములన్ గలగించుచుండుటన్

దురితములాచరించు పలుదుష్టులపాలిట కాలరాత్రివై

నెరపుము నీ విధానమును నివ్వెరపోవగ లోకమంతయున్.

36. ఓం *త్రిలోచనా*యై నమః

నామ వివరణ.

సూర్యచంద్రాగ్నులనే త్రిలోచనములుగా కల తల్లి లక్ష్మీదేవి.

తే.గీసూర్య చంద్రాగ్నులను గల్గి చూడ్కులొప్ప

వరలుచున్న *త్రిలోచనా! * భరమొ నీకు

నన్ను గావంగ మది నిల్చి? సన్నుతాత్మ

దివ్యసామ్రాజ్ఞి! కావనందిమ్ము కరము.

శ్లోభద్రకాలీ కరాలీ మహాకాలీ తిలోత్తమా

కాలీ కరాలవక్త్రాంతా కామాక్షీ కామదా శుభా 6

37. ఓం *భద్రకాల్యై* నమః

నామ వివరణ.

భద్రమునకు, మంగలమునకు స్థానమయిన తల్లి, భద్రమును కల్యాణ

ప్రదయు అయిన తల్లి మన భద్ర కాలి.

తే.గీ.  *భద్రకాలీ!* కృపన్నాకు భద్రదవయి

మానసంబున నెలకొని మసలుచున్న

నిన్ను మహనీయ యుక్తితో నెన్ని కొల్తు

భక్తి భావంబుతో  నాదు శక్తి కొలది.

38. ఓం *కరాళ్యై* నమః

నామ వివరణ.

దుష్ట సంహరూపిణి కరాలి మాత శిష్టులకు మంగలప్రద.

తే.గీమహితమౌ భీకర *కరాళి!* మానసమున

నిన్ను నిలుపు టసాధ్యంబు, నిజము కనగ,

నీవె నాలోన రహియించు నేర్పు మీర

నిత్య మంగళ కారివై నిష్ఠతోడ.

39. ఓం *మహాకాల్యై* నమః

నామ వివరణ.

అమ్మ మహాకాలీ స్వరూపమే. అంతు లేని కాలస్వరూపము అమ్మయే.

తే.గీశ్రీ *మహాకాలి*! నీ దివ్య చేతన మది

లోకమునఁ గల్గు జనులకు, శ్రీకరమగు,

నా మదిన్ జేతనంబీవె, నన్ను లోక

మందు వెలయింతు వీవమ్మ, సుందరముగ.

40. ఓం *తిలోత్తమా*యై నమః

నామ వివరణ.

అమ్మ తిలోత్తమ. సర్వశ్రేష్ఠురాలు. దివ్యాత్మ అయిన తిలోత్తమ అమ్మయే.

అత్యంత సౌందర్య వారాశి అయిన తిలొత్తమ అమ్మయే.

చంసుగుణ *తిలోత్తమా! * జగతి శోభిలు నీ పదపంకజప్రభన్,

సగుణసురూపధారిణుల సంస్కృతి వీవె దయా సుధాంబుధీ!

యగణిత సత్య సత్ పథ మయాచితరీతిని గల్గు నీ కృపన్,

నిగమ సువేద్యవీవు, గణనీయ శుభంబులు నాకుఁ గొల్పుమా.

41. ఓం *కాల్యై* నమః

నామ వివరణ.

కాల వర్ణముననొప్పు కాలీస్వరూపము కూడా అమ్మయే.

తే.గీగౌరి! నీవె యీ సృష్టిలో కలిని పెంచు

టేలను? హరించుమమ్మరో! *కాళి!* దుష్ట

కలిని బాపుము నా లోనఁ గలిగి నీవు,

కలిత సద్గుణ సన్నుతా! సలలితాత్మ!

42. ఓం *కరాలవక్త్రాన్తా*యై నమః

నామ వివరణ.

కరాలవక్త్రాంతము అనగా భయంకరమయిన నోరు కలతల్లి మన అమ్మ

లక్ష్మీదేవియే.

సంతత సత్య సన్నుత లసద్గుణదాయిని! యో *కరాల

క్త్రాంత! * శుభాస్పదా! జయము కల్గగఁ జేయుచు మంచివారికిన్,

చింతలఁ ముంచు దుష్టులను జీల్చుచు నీ శుభ నామధేయమున్

సాంతము నిల్పుకొందువు, ప్రశాంతతఁ గూర్చగ లోకమందునన్

43. ఓం *కామాక్ష్యై* నమః

నామ వివరణ.

భక్తుల కోరికలు తీర్చెడి కామాక్షీమాత మన అమ్మలక్ష్మీదేవియే.

కం.  *కామాక్షీ!* శుభ దృష్టిని

క్షేమము కలుగంగఁ జేసి కీర్తిని గనుచున్.

శ్రీమన్మంగల సుజనుల

కైమోడ్పులు గొనెడి నీకు కైమోడ్తునిటన్!

44. ఓం *కామదాయై* నమః

నామ వివరణ.

కోరికలను తీర్చు జనని కామద, మన అమ్మ. కమేశ్వర దర్శన భాగ్య ప్రదాత

మన అమ్మ.

కం. *కామద!* నీ సద్భక్తుల

కామములగు భుక్తి, ముక్తి, కరుణనొసగుచున్,

క్షేమము గొలిపెదవమ్మా!

యేమని నిన్ గోరువాడ నిమ్ము శుభాళిన్.

45. ఓం *శుభా*యై నమః

నామ వివరణ.

శుభమనిన మన అమ్మ్యే. కారణముగనే అమ్మ శుభా అను పేరు

గడించగలిగినది.

తే. గీవర *శుభా! * సుజనాళికిన్  వరములొసగి

మంచినెన్నుచు కాచెదవెంచి చూడ,

నేను నీ దాసుడఁ, గనుచు నీవె నన్నుఁ

గాచి రక్షించుమమ్మరో కనికరించి.

శ్లోచణ్డికా చండరూపేశా చాముండా చక్రధారిణీ

త్రైలోక్యజయినీ దేవీ త్రైలోక్యవిజయోత్తమా 7

46. ఓం *చణ్డికా*యై నమః

నామ వివరణ.

చండప్రచ్ండ క్రోధాకార్ముతో శత్రి భయంకర చండిక.

తే.గీ*చణ్డికా* నీదగు ఘన ప్రచండ దృష్టి

దుష్టపాళిపై పడనిమ్ము, సృష్టిలోన

మంచివారిని కాపాడ మంచు నిన్ను

కోరుచుంటిని, తీర్చుమా కోరికనిఁక.

47. ఓం *చణ్డరూపేశా*యై నమః

నామ వివరణ.

శిష్ఠులపాలిట కరుణాంఋత మూర్తి అయిన మన తల్లిదుష్టులపాలిట

చండరూపిణి.

తే.గీ. *చండ రూపేశ!* నీదైన చండ రూప

మనితరంబగు శుభకారి వినయధనుల

కనుగుణంబుగ దుష్టులనణచివేయు,

ఘనతరంబుగ నిన్ను నే గాంచనుంటి.

48. ఓం *చాముణ్డా*యై నమః

నామ వివరణ.

చాముండేశ్వరి మన అమ్మ లక్ష్మీదేవియే.

కం.  *చాముణ్డా*! దురితాత్ములు

భూమిన్ ప్రళయాంతకులయి పుట్టుట గనితే?

ధీమంతులఁ గాపాడగ

నీ మహిమన్ ద్రుంచుమమ్మ నీచులనెలమిన్.

49. ఓం *చక్రధారిణ్యై* నమః

నామ వివరణ.

అమ్మ ధర్మచక్రమును ధరించిన జనని.

తే.గీ.  *చక్రధారిణీ!* నీ కాలచక్రమందు

నెవ్వరున్ శాశ్వతంబుగా నివ్వసుధను

నిల్చి యుండరు. నిల్చెద నేను నీదు

పాదపద్మమ్ములన్ జేరి పరవశమున.

50. ఓం *త్రైలోక్యజయిన్యై* నమః

నామ వివరణ.

ముల్లోకములనూ జయించిన తల్లి త్రైలోక్య జయినని మన అమ్మయే.

తే.గీమహిత *త్రైలోక్య జయినీ!* నమస్కరింతు

నీకు భక్తితో సాగిలి, నీదు కృపను

పొందకున్నచోఁ  బరమెట్లు పొందగలను?

భువిని నున్నట్టి నన్ గను పూజ్యవీవు.

51. ఓం *దేవ్యై* నమః.

నామ వివరణ.

దివ్యత్వము ఉన్న దేవతా స్వరూపిణి మన దేవీమాత.

కందేవీ నిను నా మదిలో

భావింతును  మోక్షదవని, పరమేశ్వరి! నా

కీవే దిక్కై యుంటివి,

కేవల మోక్షంబొసంగ కీర్తింతు నినున్.

52.  ఓం *త్రైలోక్యవిజయోత్తమా*యై నమః

నామ వివరణ.

ముల్లోకములనూ జయించిన ప్రథమ గణ్య త్రైలోక్య

విజయోత్తమ మనకు శుభద.

కంక్షేత్రంబేనెఱుఁగ నటులె

క్షేత్రజ్ఞుఁడ నెఱుగనమ్మ! కీర్తింతును ని

న్నే త్రైలోక్యాధిష్ఠగ

మా *త్రైలోక్య విజయోత్తమా!* నిను గొలుతున్.

శ్లోసిద్ధలక్ష్మీః క్రియాలక్ష్మీర్మోక్షలక్ష్మీః ప్రసాదినీ

ఉమా భగవతీ దుర్గా చాంద్రీ దాక్షాయణీ శివా 8

53. ఓం *సిద్ధలక్ష్మ్యై* నమః

నామ వివరణ.

అంతులేని లక్ష్మీ తల్లి. ప్రసిద్ధమయిన మన తల్లి, భక్తులకోరికలను

సిద్ధింపజేయు తల్లి.

తే.గీ.  *సిద్ధ లక్ష్మీ!* నినున్ గొల్చి సిద్ధి పొంది

యిహ పరంబుల సౌఖ్యంబు మహితముగను

పొందవచ్చును  నీకృపఁ బొందవచ్చు,

శిష్ఠ భక్తులన్ రక్షించి సిద్ధి నిమ్ము.

54. ఓం *క్రియాలక్ష్మ్యై* నమః

నామ వివరణ.

అన్ని పనులకూ వెనుకనుండి సాగఁజేయుక్రియాలక్ష్మి మన లక్ష్మీజననియే.

తే.గీ *క్రియాలక్ష్మి*కార్యంబులొప్పిదముగఁ

జరుగఁ జేయుచు మమ్ము నీవరయుమమ్మ

యిహపరంబులసౌఖ్యంబులిచ్చు నిన్ను

పొగడ నాతరంబగునొకో? పుణ్యలబ్ధ!

55. ఓం *మోక్షలక్ష్మ్యై* నమః

నామ వివరణ.

నిరంతర సాధనతో అమ్మను కొలుచు మోక్షార్థులకు మోక్షమును ప్రసాదించు

జనని మోక్షలక్ష్మి.

తే.గీఎన్ని జన్మలనెత్తిననేమి ఫలము

కడకు సన్మోక్షలబ్ధిచేఁ గలుగు సుఖము.

*మోక్షలక్ష్మీ!* నినున్ గొల్వ మోక్షమబ్బు.

పూజ చేయుదు నీకు సన్ ముక్తినిడుమ.

56. ఓం *ప్రసాదిన్యై* నమః

నామ వివరణ.

భక్తులయెడ ప్రసన్నముగా అనుగ్రహముతో నుండు జనని మన తల్లి

ప్రసాదిని.

తే.గీశాంత రూపా! *ప్రసాదినీ!* సదయ నీవు

భక్తులన్ జూచుచుండుటన్ శక్తి పెరిగి

భక్తులెన్నుచు నిను గొల్త్రు ముక్తిఁ గోరి,

నీదు ప్రాసాదగుణము గణింపలేను.

57. ఓం *ఉమా*యై నమః

నామ వివరణ.

పరమ శాంత స్వభావ ఉమ మన జనని లక్ష్మీదేవియే.

తే.గీసుజన సన్నుత శ్రీ *యుమా!* నిజము కనగ

నీదు మాహాత్మ్యమెన్నంగ లేదు భాష,

మేటి శరదిందుచంద్రికల్  సాటిరావు

నీదు శాంతంబునకు, నన్ను నీవు కనుము.

58. ఓం *భగవత్యై* నమః

నామ వివరణ.

ప్రకాశవంతముగా జ్ఞానప్రభా భాసమనముగా నొప్పునట్టిది మన అమ్మ భగవతి

తే.గీ.  *భగవతీ!* నినుఁ చేరెడి భాగవతులు

ధన్య జీవుల్, పునర్జన్మ తప్పి వారు

ముక్తి సాధింతురిద్ధరన్ భక్తి నిలిపి

నీదు పదపంకజములపై నేర్పు మీర.,

59. ఓం *దుర్గా*యై నమః

నామ వివరణ.

ఎవ్వరికినీ తనను అధిగమింప సాధ్యము కానితల్లి దుర్గ.

కంభర్గునకైనను కుదరదు

*దుర్గా!* నిన్నధిగమింప, దుస్తరరిపుష

డ్వర్గము, నిన్ లెక్కింపని

మార్గమునన్ నన్ను జేరె, మాపుము కృపతో.

60. ఓం *చాన్ద్ర్యై* నమః

నామ వివరణ.

చన్ద్ర కాంతులతో ప్రకాఇంచు చాంద్రీ మాత కరుణకు పెట్టినది పేరు.

కం*చాన్ద్రీ!* పాలకడలియే

చన్ద్రునకున్ నీకు తండ్రి, చల్లని శోభల్

సన్ద్రంబు నుండి గొనితో?

సాన్ద్రప్రభ శశి కొసగితొ? చల్లగ నుండన్.

61. ఓం *దాక్షాయణ్యై శివాయై* నమః!

నామ వివరణ.

దక్షుని తనయ మన తల్లి దాక్షాయణి, శివప్రదాయిని మన అమ్మ శివా.

కం*దాక్షాయణీ! శివా! * నను

రక్షింపఁగ నుంటివమ్మ ప్రాణప్రదవై,

మోక్షమునొందఁగ నాకున్

శిక్షణనిడి ప్రోవుమమ్మ శ్రీమంతముగా.

ఓం *దాక్షాయణ్యై* నమః

కం.  *దాక్షాయణీ!* సుధాంబుధి!

రక్షింపుము నన్ను సతముప్రార్థింతును ని

న్నక్షయ శుభదవు నన్నున్

సుక్షేమము బడయఁజేసి శోభిలఁ గనుమా.

ఓం *శివా*యై నమః.

తే.గీ *శివా! * దివ్య శుభద! మహోన్నతంబు

నీదు భావంబు పరికింప, లేదు తిరుగు,

సృష్టినే చేసి కాపాడు దృష్టి నీది,

వందనంబులు చేసెద నందుకొనుము.

శ్లోప్రత్యంగిరా ధరావేలా లోకమాతా హరిప్రియా

పార్వతీ పరమా దేవీ బ్రహ్మవిద్యాప్రదాయినీ 9

62. ఓం *ప్రత్యఙ్గిరా*యై నమః

నామ వివరణ.

హిరణ్య కశ్యప వధానంతరము కూడా నరసింహుని కోపము శాంతించనందున

శివుఁడు శరభేశ్వరుఁడుగా యుద్ధము చేయుటకు రాగా అమ్మవారు, శూలిని,

మహాప్రత్యంగిర, అను రెండు రూపములలో ప్రభవించి శరభేశ్వరునకు రెండు

రెక్కలుగా మారెను. ఆమెను ప్రప్రథమముగా చూచవారు ప్రత్యంగుడు