గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 62వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

జైశ్రీరామ్.

62. ఓం శ్రీవిష్ణవే నమః.

మనోహర వృత్త గర్భ సీసము

హాయిగానున్న యాదాద్రి నివాస! - యాపర! నాకమీ శ్రీపదములె.

యార్తిని నా హృదయాద్రి వసించుట - శ్రేయము కావునఁ జేర రమ్ము.

తప్పదు. నిజము. నా దారిఁక నీవె. - నాతనుఁడా! కాంచు ప్రీతితోడ.

ధీరుఁడ! నన్ ముదమారఁగఁ జూడు ప్ర - భూ! నృహరీ! వర ముక్తి వరద!    

గీ శుభద! *శ్రీ విష్ణు*దేవుఁడా! అభయమిమ్ము.నన్ను వీడనటంచునుసన్నుతాత్మ!

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

62 సీస గర్భస్థ మనోహర వృత్తము. (1.3. పాదములు కాంతా{గీతాలంబన}

                                             వృత్తము. .. యతి 8.

                                                   2.4.పాదములు తోటక వృత్తము .. యతి 9) 

యాదాద్రి నివాస దయాపర! నా - హృదయాద్రి వసించుట శ్రేయముగా?

నా దారిఁక నీవె సనాతనుఁడా! - ముదమారఁగఁ జూచూడు ప్రభూ! నృహరీ!   

భావము.

భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రిత జనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! సుఖముగా నొప్పెడి యాదాద్రి నివాసాదయాపరా! నీ

మంగళప్రదములైన పాదములే స్వర్గము. ఆర్తితో నా హృదయాద్రిని నీవుండుట మంచిది.   కావున నీవు నా

హృదయమున ఉండ రమ్ము.. సనాతనుఁడా! నా దరికి నీవు రాక తప్పదు.  ప్రీతితో చూడుము. ధీరుఁడవైన స్వామీ!

వర ముక్తి వరప్రదాతానీవు నన్ను ప్రేమతో చూడుము. శుభప్రదా! శ్రీవిష్ణుదేవుఁడా! సన్నుతాత్మా! నన్ను విడి పోనని

అభయమునిమ్ము.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.