గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 60వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

60. రాజాధిరాజులకు నేఁ జాలనీయఁగను రాజీవ కల్ప కృతినే.

రాజిల్లు నీకొసఁగ రాజిల్ల వచ్చు నిట రాజీవలోచన భువిన్

పూజాఫలమ్మదియె రాజేశ్వరీ కొనుమ రాజిల్లఁ జేయుమ ననున్,

నే జేయుదున్ నతులు నా జీవమా! కొనుమ, రాజీవలోచన సతీ!

భావము.

లేడి కన్నులవంటి కన్నులు గల ఓ సతీ మాతా! సహస్రదళపద్మ 

సన్నిభమయిన  యీ నా గ్రంథమును నేను రాజాధిరాజులయినవారికినీ 

యీయ నేరనమ్మా.  తేజస్వినివయిన నీకొసఁగినచో ఇక్కడ భూమిపై 

వెలుగొంద వచ్చునుకదా తల్లీ!  అదే కదా పూజాఫలము. ఓ రాజేశ్వరీ మాతా! 

స్వీకరింపుమమ్మా. నన్ను రాజిల్లునట్లు చేయుము. నీకు నమస్కరింతును నా 

ప్రాణమా! ఓ జగన్మాతా! స్వీకరింపుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.