గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, మే 2022, మంగళవారం

మనుష్యాణాం సహస్రేషు..|| 7-3 || . భూమిరాపోనలో వాయుః.. || 7-4 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

0 comments

 జైశ్రీరామ్.

 || 7-3 ||

శ్లో.   మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే|

యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః.

తే.గీ. మోక్ష సిద్ధికై యత్నించు భూమిపైన

వేలలో నొక్కడే, యందు వేలలోన

నొక్కడే నన్నెరుంగును నిక్కమిదియె,

పుణ్యసత్ఫలయుతునకే పొసగునిద్ది.

భావము.

వేలాది మనుష్యులలో ఏ ఒక్కరో మోక్షసిద్ధి కోసం ప్రయత్నిస్తారు. 

అలా ప్రయత్నించే సిద్ధులలో కూడా ఏ ఒక్కరో నన్ను యదార్ధంగా 

తెలుసుకుంటారు.

 || 7-4 ||

శ్లో. భూమిరాపోనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ|

అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా.

తే.గీ.  అగ్ని, భూమియు, వాయువు నాకసమును,

నీరు, మనసును, బుద్ధ్యహంకారము లను,

అష్టప్రకృతులు నావిగా నరయుమీవు,

తెలియ జెప్పెద నేనవి తెలియు మీవు.

భావము.

భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మరియు మనస్సు బుద్ధి, 

అహంకారం అని నా ప్రకృతి ఎనిమిది విధాలుగా ఉన్నది.

జైహింద్.

30, మే 2022, సోమవారం

కిన్నెరసాని పాటలు - విశ్వనాధ వారి గళంలో

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

మయ్యాసక్తమనాః పార్థ యోగం..|| 7-1 || . జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం.. || 7-2 ||..//.. శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

0 comments

 జైశ్రీరామ్.

శ్రీమద్భగవద్గీతే సప్తమోధ్యాయః - జ్ఞానవిజ్ఞానయోగః

శ్రీభగవానువాచ|

భావము. శ్రుకృష్ణభగవానుడనుచున్నాడు.

|| 7-1 ||

శ్లో.  మయ్యాసక్తమనాః పార్థ యోగం యుఞ్జన్మదాశ్రయః|

అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు.

తే.గీ.  మనసు నాపైన నిలుపుచు మహిత యోగ

మభ్యసించుచు మదిని న న్నాశ్రయించి,

శంకయేలేని విధముగా చక్కగ నను

పూర్తిగా నెట్లెరుగుదొవో యార్త వినుము.

భావము.

నాపై మనస్సును లగ్నం చేసి,యోగాన్ని అభ్యసిస్తూ నన్ను ఆశ్రయించి, 

నిస్సశయంగా, క్షుణ్ణంగా ఎలా తెలుసుకో గలవో దానిని గురించి వినుము.

 || 7-2 ||

శ్లో.  జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః|

యజ్జ్ఞాత్వా నేహ భూయోన్యజ్జ్ఞాతవ్యమవశిష్యతే.

తే.గీ.  అనుభవ జ్ఞానమున గల ఘనతరమగు

శాస్త్ర విజ్ఞానమును నీకు చక్కగాను

తెల్పుదున్ సర్వమున్ నీకు తెలిసిపోవు

తెలియవలసినదుండదు తెలియనిద్ది.

భావము.

అనుభవంతో కూడిన శాస్త్ర పరిజ్ఞానాన్ని నీకు పూర్తిగా చెబుతాను. దీనిని 

తెలుసుకున్నాక నీకు వేరే తెలుసుకోవలసినది ఏమీ ఉండదు.

జైహింద్.

29, మే 2022, ఆదివారం

శాంతా బయోటెక్నిక్స్ చైర్మన్ సుగర్ వ్యాధిపై ఇచ్చిన సమాచారం.

0 comments

 

జైశ్రీరామ్.
జైహింద్.

నిన్నను సిల్పాస్ ఆర్వీ ధర్మిష్టా ఎపార్ట్మెంటులో జరిపిన భారతమాత పూజ, చిత్రములు..

1 comments

 జైశ్రీరామ్.

నిన్నను సిల్పాస్ ఆర్వీ ధర్మిష్టా లో జరిపిన భారతమాత పూజ, ప్రసంగములు.

జైహింద్.
యోగినామపి సర్వేషాం ..|| 6-47 ||.....కర్మసన్యాస యోగము.

0 comments

జైశ్రీరామ్.

 || 6-47 ||

శ్లో.  యోగినామపి సర్వేషాం మద్గతేనాన్తరాత్మనా|

శ్రద్ధావాన్భజతే యో మాం స మే యుక్తతమో మతః.

తే.గీ.  మనసు నాపైన నిలిపెడి మహిత యోగి

నన్ను సేవించునుత్తముం డెన్న యోగి

పుంగవుండిలఘనులలో పుంగవుండు,

నీవు కావలెనట్టుల నిరుపమముగ.

భావము.

యోగులందరిలో తన మనస్సుని నాలో నిలిపి శ్రద్ధగా ఎవరు 

సేవిస్తారో. అతడు ఉత్తముడని నాఅభిప్రాయము.


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

ఆత్మసంయమయోగో నామ షష్ఠోऽధ్యాయః..

జైహింద్.

ప్రయత్నాద్యతమానస్తు యో .|| 6-45 ||..//.. తపస్విభ్యోऽధికో యోగీ..|| 6-46 ||.....కర్మసన్యాస యోగము.

0 comments

 జైశ్రీరామ్.

|| 6-45 ||

శ్లో.  ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః|

అనేకజన్మసంసిద్ధస్తతో యాతి పరాం గతిమ్.

తే.గీ.  యోగి సద్దీక్షతో డ చేయు జతనమున,

పాపముల నుండి విడివడి, పరమగతిని

శుద్ధుడై సదభ్యాసపు శుద్ధ ఫలము

చేత పొందు నోయర్జునా! ఖ్యాతిగాను.

భావము.

యోగి దీక్షతో చేసే ప్రయత్నం వలన పాపాలన్నింటి నుండి విడివడి 

శుద్ధుడై, అనేక జన్మల అభ్యాసం చేత యోగసిద్ధిని పొంది పరమగతిని

(మోక్షం)చేరుకుంటాడు.

|| 6-46 ||

శ్లో.  తపస్విభ్యోऽధికో యోగీ జ్ఞానిభ్యోऽపి మతోऽధికః|

కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున.

తే.గీ.  అర్జునా! తాపసుల కంటె నధికుడరయ,

జ్ఞానులకు మించు నధికుడు, కర్ములకును

మించు నధికుండు యోగియే, మించుచీవు

యోగి కావలె పడయ సద్యోగమిలను.

భావము.

అర్జనా! తపస్సు చేసేవారికంటే, జ్ఞానులకంటే, జ్ఞానులకంటే, కర్మ

చేసే వారికంటే కూడా యోగి అధికుడు. అందుచేత నువ్వూ

 (ఆత్మ సంయమ)యోగివి అగుము.

జైహింద్.

28, మే 2022, శనివారం

తత్ర తం బుద్ధిసంయోగం .|| 6-43 ||..//.. పూర్వాభ్యాసేన తేనైవ ..|| 6-44 ||.....కర్మసన్యాస యోగము.

0 comments

 జైశ్రీరామ్.

|| 6-43 ||

శ్లో.  తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్|

యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునన్దన!

తే.గీ.  పూర్వదేహపుయోగంపుబుద్ధినచట 

తిరిగి పొందసాధనచేయు నిరుపమగతి,

యోగమది పండి మరలతా యోగియౌను,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.

భావము.

కురునందనా! అక్కడ పూర్వ దేహ సంబంధమైన యోగ బుద్ధిని 

పొంది, ఆస్థాయి నుండే తిరిగి సంపూర్ణ యోగ సిద్ధిని పొందడానికి ప్రయత్నిస్తాడు.

|| 6-44 ||

శ్లో.  పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోऽపి సః|

జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే.

తే.గీ.  అవనిపైన యోగభ్రష్టు డనుపమగతి

సాధనముచేయు వివశుడై జయ సుయోగ

మార్గంబుపైలాగు మనసతనికి,

ప్రణవమంత్రమున్ బలికినన్ వరలగలడు.

భావము.

పూర్వ జన్మలో చేసిన అభ్యాసం వలన యోగ భ్రష్టుడు వివశుడై 

యోగం వైపు లాగబడతాడు. యోగాన్ని గురించి కేవలం కుతూహలం 

చూపినా, ఓంకారాన్ని జపించడం వలన లభించే వైదిక కర్మ ఫలాన్ని 

దాటి పోతాడు.

జైహింద్.

27, మే 2022, శుక్రవారం

ప్రాప్య పుణ్యకృతాం .|| 6-41 ||..//.. అథవా యోగినామేవ కులే ..|| 6-42 ||.....కర్మసన్యాస యోగము.

0 comments

 జైశ్రీరామ్.

|| 6-41 ||

శ్లో.  ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః|

శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోऽభిజాయతే.

తే.గీ.   అరయుమోయి, యోగభ్రష్టు డందు పుణ్య

లోకములనందు వసియించి, శ్రీకరముగ

పుణ్యకర్ములయింట తాపుట్టి, యిచట

భోగభాగ్యంబులన్ దేలు పుడమిపైన.  

భావము.

యోగబ్రష్టుడు పుణ్యలోకాలని పొంది అనేక సంవత్సరాలు 

అక్కడ నివసించి. తరవాత శుచివంతులు, శ్రీమంతులు ఐన 

వారి ఇంట్లో జన్మిస్తాడు.

|| 6-42 ||

శ్లో.  అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్|

ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్.

తే.గీ.  అటుల కాని యోగభ్రష్టు డనితరమగు 

జ్ఞాన నంపన్నులిండ్లలో కలిగి జన్మ

నిహపరంబులనందెడు మహిని పార్థ!

కనగ నరుదైన జన్మంబు ఘనుడ! వింటె?

భావము.

లేదా యోగ బ్రష్టుడు జ్ఞానులైన ఇండ్లలో పుడతాడు. లోకంలో 

ఇలాటి జన్మ చాలా అరుదైనది.

జైహింద్.

26, మే 2022, గురువారం

ఏతన్మే సంశయం కృష్ణ .|| 6-39 ||..//.. పార్థ నైవేహ నాముత్ర ..|| 6-40 ||.....కర్మసన్యాస యోగము.

0 comments

 జైశ్రీరామ్.

|| 6-39 ||

శ్లో.  ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః|

త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే.

తే.గీ. పూర్తిగా నాదు సందేహమును దొలంగ

చేయ దగువాడ వీవేను, చేయ లేరు

తొలగగా నాదు సందేహ మిలను పరులు,

నీకు మ్రొక్కెద దెలుపుమా నీరజాక్ష!

భావము.

కృష్ణా! నా ఈ సందేహాన్ని సమూలంగా ఛేదించ తగిన వాడివి నీవే. 

నా అనుమానాన్ని తీర్చగలిగిన వాళ్ళు లోకంలో నీకంటే ఎవరూ లేరు.

శ్రీభగవానువాచ

భావము.

శ్రీకృష్ణభగవానుడిట్లు పలికెను.

|| 6-40 ||

శ్లో.  పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే|

న హి కల్యాణకృత్కశ్చిద్ దుర్గతిం తాత గచ్ఛతి.

తే.గీ.  అర్జునా! యోగమునభ్రష్టుడయినవాని 

కిహపరంబుల నాశన మెన్న లేదు.

మంచి వానికి దుర్గతి మహిని రాదు,

భయము పొందగ పనిలేదు నయనిధాన!

భావము.

అర్జునా యోగబ్రష్టుడికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ నాశనం 

లేదు. నాయనా! మంచి పని చేసేవాడెవరూ దుర్గతిని పొందడు కదా.

జైహింద్.

25, మే 2022, బుధవారం

నేడు హనుమజ్జయంతి సందర్భముగా బ్రహ్మశ్రీ ధూళిపాళ మహాదేవమణి గారి ప్రవచనము.

0 comments

జైశ్రీరామ్.


బ్రహ్మశ్రీ ధూళిపాళ మహాదేవమణి.

 🌹  హనుమజ్జయంతి🌹

శ్రీ సువర్చలాంజనేయాయ నమః

📍 "రామాశ్లిష్ట వపు ర్నిధి ర్భవతి మే"📍

      "నూనంమదీయైవ తత్"

 📍"వార్ధే ర్లంఘన " 📍మత్ర నాస్త్యతిశయ

 స్తీర్ణోసి మద్వర్చసా "

 📍 "లంకా నిర్దహనం ? , సు‌రారి దమనం ?"📍

 "శౌర్యాణి వై మత్పతేః "

ఇత్థం హ్రీ కుసుమై ర్వివర్ధిత హనుః

 పాయా ద్ధనూమాన్ సదా .

 🌹🌹

రాముడు రావణ వధ చేసాక అయోధ్యకు వచ్చాడు.తనకు సహకరించిన 

వారినందర్నీ సంతోష పెట్టి ఇంటికి పంపిస్తూ హనుమను ప్రేమతో 

గాఢంగా కౌగిలించుకొన్నాడు. ఆపారశ్యంలో ఇంటికి వచ్చిన హనుమ 

భార్య సువర్చలతో 

  📍రామాలింగనం పొందిన ఈదేహం నాకు. మహాసంపద సుమా అంటూ 

గెంతులేస్తున్నాడు.

సువర్చల తన వాక్చాతుర్యంతో హనుమనుఆట పట్టించాలనుకొంది.

📍అవును .అది నాసంబంధమే.📍అంది.'రామా + ఆశ్లిష్ట "అని విడతీసి.

హనుమ భావంలో "📍రామ + ఆశ్లిష్ట "📍దాంతోహనుమ ఊరుకోక 

📍నూరుయోజనాలవిస్తృతి కల సముద్రందాటింది ఎవరు? 📍అన్నాడు.

సువర్చల నాతేజంవల్లే నువ్వు సముద్రం దాట కలిగావు " అంది.హనుమ 

సముద్రం పై ఎగరడానికి ముందు...

📍స సూర్యాయ మహేంద్రాయ...📍అని సూర్యునికి నమస్కరించడం 

వల్లే కదా దాట కలిగాడు?

హనుమ కొంచెం గట్టిగా 📍అంతటి లంకను కాల్చిందెవ‌రు ? 

అక్కడ రాక్షసుల్ని చావ

కొట్టిందెవ‌రూ?📍అన్నాడు.అప్పుడిక సువర్చల తెగీదాకా 

లాక్కూడదు అనుకొంది.

📍అవన్నీ నాభర్త గారి శౌర్యకృత్యాలు.నీగొప్ప ఏమిటి? అంది 

వ్యంగ్యంగా. 📍 అలా భార్యతనని పొగడగా హనుమ స్వామి బుగ్గలు 

సిగ్గు అనే పుష్పాలతో వికసించి పెద్దవయ్యాయి.దాంతో హనుమకు 

ఎత్తైన బుగ్గలు కలవాడు అనే అర్దంలో  

📍హనుమ 📍అన్న పేరు వచ్చింది. అట్టి హనుమ మనల్నందర్నీ

 రక్షించును గాక !

🌹🙏ధూళిపాళ మహాదేవమణి 🌹

మనోహరమయిన శుభాకాంక్షలందఁజేసిన బ్రహ్మశ్రీ మహాదేవమణి 

గారికి ధన్యవాదములు🙏

జైహింద్.

అయతిః శ్రద్ధయోపేతో .|| 6-37 ||..//.. కచ్చిన్నోభయవిభ్రష్టశ్ఛి ..|| 6-38 ||.....కర్మసన్యాస యోగము.

0 comments

 జైశ్రీరామ్..

అర్జున ఉవాచ

భావము.

అర్జునుడిట్లు పలికెను.

|| 6-37 ||

శ్లో.  అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః|

అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి.

తే.గీ. శ్రద్ధ గలిగియు మనసును చక్కగాను

వశమునం దుంచుకొనలేక పతితుడయిన

యోగభష్టుడౌ యోగి యేమి

యగును? తెలపుమా నాకు ననుపమముగ..

భావము.

శ్రద్ధ ఉన్నా మనస్సుని పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకోలేక పోయేవాడు, 

యోగం నుండి మనస్సు జారిపోయి యోగసిద్ధిని పొందనపుడు ఏమౌతాడు.

|| 6-38 ||

శ్లో.  కచ్చిన్నోభయవిభ్రష్టశ్ఛిన్నాభ్రమివ నశ్యతి|

అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి.

తే.గీ.  నియతి బ్రహ్మ పథమునందు నిలువలేని

మందబుద్ధి రెంటనుభ్రష్టుడందురు కద, 

చెదరినట్టిమేఘునివోలె చెడునొ తాను?

చెప్పుమా కృష్ణ! సన్నుతి చేసెద నిను.

భావము.

ఓ మహానుభావా! బ్రహ్మ పధంలో నిలవలేని మంద బుద్ధి ఇహపరాలు 

రెంటికీ భ్రష్టుడై చెదిరిన మేఘంలాగా నశించి పోడా?

జైహింద్.

24, మే 2022, మంగళవారం

అవధాన అంశపూరణలు Drవేదాలగాయత్రీదేవిగారిచే (భక్తిసాధనంలో)

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

Patwardhan 84th Ashtaavadhaanam

0 comments

అసంశయం మహాబాహో .|| 6-35 ||..//.. అసంయతాత్మనా యోగో ..|| 6-36 ||.....కర్మసన్యాస యోగము.

0 comments

 జైశ్రీరామ్.

|| 6-35 ||

శ్లో.  అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్|

అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే.

తే.గీ.  అవును, చంచల చిత్తము నణచ లేము,

నిగ్రహించుట కష్టము, నిరుపమాన!

పార్థ! సాధన చేతను భవ్యమయిన

దివ్య వైరాగ్య భావనన్ దీని నణచు.

భావము.

సందేహం లేదు. మనస్సుని నిగ్రహించడం చాలా కష్టం. అది 

చలిస్తుంది. అయితే కుంతీ కుమారా! అభ్యాసం చేతా వైరాగ్యం ద్వారా

నూ మనోనిగ్రహం సాధ్యం ఔతుంది.

|| 6-36 ||

శ్లో.  అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః|

వశ్యాత్మనా తు యతతా శక్యోऽవాప్తుముపాయతః.

తే.గీ. మనసు స్వాధీనమున లేని మనుజున కిల

పొంద నసాధ్యంబు యోగము, పొంద గలడు

మనసు స్వాధీనమున గల మహితు డిద్ది

యత్నమును చేసి యోచించి హాయిగాను. 

భావము.

మనస్సు స్వాధీనంలో లేని వాడికి యోగం పొందడం కష్టమని నా 

అభిప్రాయం. చిత్తం స్వాధీనంలో ఉన్నవాడు ప్రయత్నిస్తే ఉపాయంతో 

సాధించ వచ్చును.

జైహింద్.

23, మే 2022, సోమవారం

యోऽయం యోగస్త్వయా .|| 6-33 ||..//.. చఞ్చలం హి మనః కృష్ణ ప్రమాథి..|| 6-34 ||.....కర్మసన్యాస యోగము.

0 comments

 జైశ్రీరామ్.

అర్జున ఉవాచ

భావము.

అర్జునుడడిగెను.

|| 6-33 ||

శ్లో.  యోऽయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన|

ఏతస్యాహం న పశ్యామి చఞ్చలత్వాత్స్థితిం స్థిరామ్.

తే.గీ.  నీవు చెప్పిన యీ యోగ మే విధమున

నిలుచు చంచలంబగు చిత్త ఫలకమునను

ననుచు తోచునో కృష్ణుడా! యలయు మిదియు,

నాదు తప్పున్న మన్నించు నలిన నేత్ర!

భావము.

కృష్ణా నువ్వు చెప్పిన ఈ ఆత్మ సంయమ యోగం మనస్సు యొక్క 

చంచల స్వభావం వలన నిలుస్తుందని నాకు అనిపించడం లేదు.

|| 6-34 ||

శ్లో.  చఞ్చలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్ దృఢమ్|

తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్.

తే.గీ.  మనసు చంచలమైన, ప్రమాథి, దృఢము, 

బలముతో నొప్పుచుండును, పవను నెటుల

యణచ సాధ్యంబు కాదట్లె యణప జాల

మరయ దీనిని, శ్రీకృష్ణ! తెరవు నీవె.

భావము.

కృష్ణా! మనస్సు చంచలమైనది, భాధా కరమైనది, బలమైనదీ, గట్టిదీ, 

గాలిని అణచడంలాగే దీనిని నిగ్రహించడం కూడా కష్టమని నేను 

భావిస్తాను.

జైహింద్.

22, మే 2022, ఆదివారం

Gummannagari Laxminarasimha Sharma

0 comments

సర్వభూతస్థితం యో మాం .|| 6-31 ||..//.. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం..|| 6-32 ||.....కర్మసన్యాస యోగము.

0 comments

 జై శ్రీరామ్.

|| 6-31 ||

శ్లో.  సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః|

సర్వథా వర్తమానోऽపి స యోగీ మయి వర్తతే.

తే.గీ. అన్ని ప్రాణులలోనున్న నన్ను,

దైవ మొక్కడే యనుచు నన్ దలచుచుండి

నన్ను సేవించు నాయోగి మన్ననమున

నుండు నాలోన నెటులున్న  నిండుమదిని.

భావము.

అన్ని ప్రాణులలో ఉన్న నన్ను అన్నింటా పరమాత్మ ఒక్కడే 

అన్న భావం పొంది సేవిస్తారో, ఆ యోగి ఎలా సంచరించినా 

నాలోనే వర్తిస్తూ ఉంటాడు.

|| 6-32 ||

శ్లో.  ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున|

సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః.

తే.గీ. దుఃఖ సుఖములందున తనతో నితరుల

బోల్చుకొనుచు సమముగా ప్రపూజ్య యోగి

శ్రేష్టు డందరి కన్నను చింత చేయ,

నెరుగు మరజునా! నీవిది యెరుక గలిగి.

భావము.

అర్జునా! దుఃఖంగానీ, సుఖంగానీ తనతో పోల్చుకుని తనతో సమానంగా 

అందరిలోనూ చూస్తాడో, ఆ యోగి శ్రేష్టుడని నా అభిప్రాయము.

జైహింద్.

21, మే 2022, శనివారం

సర్వభూతస్థమాత్మానం .|| 6-29 ||..//.. యో మాం పశ్యతి సర్వత్ర..|| 6-30 ||.....కర్మసన్యాస యోగము.

0 comments

జైశ్రీరామ్.

|| 6-29 ||

శ్లో.  సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని|

ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః.

తే.గీ. యోగసంయుక్త సమదర్శి యోగి గాంచు

నన్నిటన్ దనన్, దనలోన నన్నిటి గను

నన్నియున్ దానె గన దానె యన్నిటనని

భావయుక్తుడై ప్బలెడి భవ్యుడతడు.

భావము.

యోగంతో కూడిన సర్వత్రా సమత్వాన్ని చూసే యోగి అన్ని 

ప్రాణులలో తననీ, తనలో అన్ని ప్రాణులనూ చూస్తాడు.

|| 6-30 ||

శ్లో.  యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి|

తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి.

తే.గీ. అన్నిటన్ నన్ను, నా లోన నన్నిటి నిల

కనెడి వానికి మరుగవన్, వినుము పార్థ!

మరుగు కాడతడును నాకు, ధరణిపైన

అతడు నేనేను, నేనన్ననతడె తెలియ.

భావము.

నన్ను అన్నిటిలోనూ, నాలో అన్నిటినీ ఎవరు చూస్తారో అలాంటి 

వారికి నేను మరుగు కాను. అతడు నాకూ మరుగు కాడు.

జైహింద్.

శుభకృన్నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనము.. 2022 - Friends Welfare Association

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

20, మే 2022, శుక్రవారం

సింహాచలం క్షేత్ర పూర్తి చరిత్ర | Simhachalam Sri Varaha Lakshmi Narasim...

0 comments

ప్రశాన్తమనసం హ్యేనం .|| 6-27 ||..//.. యుఞ్జన్నేవం సదాత్మానం..|| 6-28 ||..కర్మసన్యాస యోగము.

0 comments

 జైశ్రీరామ్.

|| 6-27 ||

శ్లో.  ప్రశాన్తమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్|

ఉపైతి శాన్తరజసం బ్రహ్మభూతమకల్మషమ్.

తే.గీ.  శమితమగురజో గుణుడు ప్రశాంత చిత్తు

డనుపమగుబ్రహ్మరూపుడై యలరు నట్టి

యోగి కాత్మసంబంధమౌ యుత్తమ సుఖ

మందునో పార్థ! నీవందవలయు.

భావము.

ఈ విధంగా రజోగుణం శమించి, దోషరహితమైన, ప్రశాంతమైన 

మనస్సుతో కూడి బ్రహ్మ స్వరూపుడైన యోగికి ఆత్మ సంబంధమైన 

ఉత్తమ సుఖం లభిస్తుంది.

|| 6-28 ||

శ్లో.  యుఞ్జన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః|

సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యన్తం సుఖమశ్నుతే.

తే.గీ.  ఆత్మ నభ్యసించుచు యోగి యనవరతము

కల్మషములకు దూరుడౌ, ఘనతరమగు

బ్రహ్మ సత్స్పర్శ సౌఖ్యము పడయునతడు,

పారమేలేని సౌఖ్యమున్ బడయునతడు.

భావము.

ఇలా నిరంతరం ఆత్మాభాసం చేసే యోగి యొక్క కల్మషాలు పూర్తిగా 

నశిస్తాయి. బ్రహ్మ స్పర్శ ఉన్న అత్యంత సుఖా న్ని తేలికగా పొందుతాడు.

జైహింద్.

అమ్మ అనుగ్రహమున లభించిన భక్తిసాధనమ్ సేవా భక్తి పురస్కారము.

0 comments

 జైశ్రీరామ్.

ఉ. అమ్మ కృపామృతంబుఁ బరమాత్మ లభింపఁగఁ జేసె మీకు, వే
దమ్ముల సారమున్ కవన ధారగఁ గల్పనఁ జేయఁ జేయుచున్,
మమ్ము సుఖోపవీతులుగ మాన్య మహోదయ! పండరీ సుధీ!
యిమ్ముగ సత్ పురస్కృతుల నిట్టులఁ జేసెడి మీకు సన్నుతుల్. 
సద్విధేయుఁడు🙏
చింతా రామకృష్ణారావు.

జైహింద్.

మహాకవి, సంస్కృతాంధ్ర ఉద్దండ పండితులు, ద్వ్యర్థి కవిగా కీర్తి గడించిన కీ.శే...గౌరీభట్ల రామకృష్ణశాస్త్రి.....డా.అయాచితం నటేశ్వర శర్మగారి సమీక్ష.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

19, మే 2022, గురువారం

తే. 28 - 6 - 2022 నుండి 30 - 6 - 2022 వరకు హైదరాబాదులో చి.లలితాదిత్య శతావధానము.

0 comments

 జైశ్రీరామ్.

జైహ్ంద్.

సుందరకాండ ప్రవచనము....శ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ.

0 comments

జైశ్రీరామ్.

శ్రీమన్మంగళ నారుమంచి కులజుల్, శ్రీమాతృ సద్భక్తులున్,

క్షేమంబున్ నిరతంబు కోరు ప్రజకున్, కీర్తిప్రదుల్ కృష్ణు లీ

ప్రేమోద్భాసిత మిత్రమండలి కృపన్ ప్రీతిన్ చిరంజీవినే

ధీమంతుల్ విని మెచ్చ చెప్పుదురిటన్ దేదీప్యమానంబుగా.
జైహింద్.

శనైః శనైరుపరమేద్ బుద్ధ్యా .|| 6-25 ||..//.. యతో యతో నిశ్చరతి..|| 6-26 ||..కర్మసన్యాస యోగము.

0 comments

 జైశ్రీరామ్.

|| 6-25 ||

శ్లో.  శనైః శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయా|

ఆత్మసంస్థం మనః కృత్వా న కిఞ్చిదపి చిన్తయేత్.

తే.గీ.  ధైర్యమును కల్గు బుద్ధితో తప్పకుండ 

నెమ్మదిగ మనసును శాంతిని నిలుప వలె,

మనసునాత్మలో నిలిపుచు ననితరముగ,

తలపరాదితరంబింక ధర్మవర్తి!

భావము.

ధైర్యంతో కూడిన బుద్ధితో నెమ్మది నెమ్మదిగా మనస్సుని

(బాహ్య ప్రపంచమునుండి మళ్ళించి)శాంతింప చేయాలి. 

మనస్సుని ఆత్మలో నిలిపి తదితరమైనది ఏదీ తలచుకోకూడదు.

|| 6-26 ||

యతో యతో నిశ్చరతి మనశ్చఞ్చలమస్థిరమ్|

తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్.

తే.గీ. చంచలంబగు చిత్తంబు నెంచి యెచటి

కేగినన్ గాని మరలించి వేగిరముగ

నాత్మలో నిల్పవలెనుసమంచితముగ

పార్థ గ్రహియింపుమియ్యది స్వార్థమువిడి.

భావము.

నిలకడ లేని చంచలమైన మనస్సు ఎక్కడెక్కడికి పోతుందో, 

అక్కడక్కడనుండి దానిని తీసుకు వచ్చి ఆత్మలో నిలబెట్టాలి.

జైహింద్.

18, మే 2022, బుధవారం

Ganapathi Thalam

0 comments

తం విద్యాద్ దుఃఖసంయోగ .|| 6-23 ||..//.. సఙ్కల్పప్రభవాన్కామాంస్త్యక్త్వా..|| 6-24 ||..కర్మసన్యాస యోగము.

0 comments

 జైశ్రీరామ్.

|| 6-23 ||

శ్లో.  తం విద్యాద్ దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్|

స నిశ్చయేన యోక్తవ్యో యోగోऽనిర్విణ్ణచేతసా.

తే.గీ.  యోగమన దుఃఖ దూరులై యుండుటె కద,

నిర్విచారులై దీక్షతో నిండు మదిని

యత్నమును చేసి సాధించు టరయుమయ్య,

యోగమన నిది తెలియుమో రాగదూర!

భావము.

దుఃఖంతో సంబంధం లేని స్థితిని యోగం అని తెలుసుకోవాలి, 

ఆ యోగాన్ని నిర్విచారమైన మనస్సుతో, పట్టుదలగా సాధించాలి.

|| 6-24 ||

శ్లో.  సఙ్కల్పప్రభవాన్కామాంస్త్యక్త్వా సర్వానశేషతః|

మనసైవేన్ద్రియగ్రామం వినియమ్య సమన్తతః.

తే.గీ. సకల సంకల్ప జనిత వాంఛలను విడిచి,

మనసు నిగ్రహించగవలె ఘనతరమగు

యింద్రియములను పట్టుతో, నెలమి పార్థ!

నీవు సాధింపవలెనిది నేర్పుమీర.

భావము.

సంకల్పమువల్ల పుట్టిన అన్ని కోరికలను పూర్తిగా విడిచి 

పెట్టాలి. మనస్సు ద్వారానే ఇంద్రియాలన్నింటిని అన్ని 

వైపులనుండి నిగ్రహించాలి.

జైహింద్.

17, మే 2022, మంగళవారం

సుఖమాత్యన్తికం యత్తద్ .|| 6-21 ||..//.. యం లబ్ధ్వా చాపరం లాభం..|| 6-22 ||..కర్మసన్యాస యోగము.

0 comments

 జైశ్రీరామ్.

|| 6-21 ||

శ్లో.  సుఖమాత్యన్తికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీన్ద్రియమ్|

వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః.

తే.గీ.  ఏది బుద్ధితో దెలియనౌ నేది యింద్రి

యములకు నతీతమైనట్టి, దంతు లేని

దేది యాసుఖమును యోగి యెచ్చటుండి

యనుభవించుచును చలింప డరయు మయ్య.

భావము.

ఏది బుద్ధితో మాత్రమే తెలుసుకోతగినదో, ఇంద్రియాలకు అతీతమో, 

అంతంలేనిదో, ఆ సుఖాన్ని యోగి ఎక్కడ ఉండి అనుభవిస్తూ, ఆ 

నుభవాన్నుంచి చలించకుండా ఉంటాడో,

|| 6-22 ||

శ్లో.  యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః|

యస్మిన్స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే.

తే.గీ.  ఏది పొందిన యోగి తా నితరమయిన

దేది పొందినన్ ఘనముగా నెంచకుండు,

ననుభవించుచునుగణింప డనుపమముగ

దేనియందుండుటన్, యోగి తానె పార్థ!

భావము.

దేనిని పొందిన తరవాత ఇతరమైన ఏ లాభాన్ని కూడా దానికంటే 

ఎక్కువ అనుకోడో, దేనిలో నిలిచి విపరీతమైన దుఃఖంచేతకూడా 

చలించడో, అతడే నిజమైన యోగి.

జైహింద్.

16, మే 2022, సోమవారం

తే.18 - 3 - 2922 దీని అన్నవర సమీప గోపాలపట్టణంలో నెలకొని యున్న నేరేళ్ళమ్మవారి ఆలయమునకు పూర్ణకుంభ స్వాగతము, నేరేళ్ళమ్మవారి దర్శనము.

0 comments

జైశ్రీరామ్.


జైహింద్. 

బుద్ధావతారము.....శ్రీ వద్దిపర్తి పద్మాకర్.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

యథా దీపో నివాతస్థో .|| 6-19 ||..//.. యత్రోపరమతే చిత్తం..|| 6-20 ||..కర్మసన్యాస యోగము.

0 comments

 జైశ్రీరామ్.

|| 6-19 ||

యథా దీపో నివాతస్థో నేఙ్గతే సోపమా స్మృతా|

యోగినో యతచిత్తస్య యుఞ్జతో యోగమాత్మనః.

తే.గీ. యోగి మనసు గణింపగ నొప్పియుండు

వాత రహితంపు దీపమవారితగతి

కావునన్బోల్తురట్టులలే ఘనులు నిజము

నీవు గ్రహియింపుమర్జునా నిరుపమముగ.

భావము.

ఆత్మ సమ్యమ యోగాన్ని అభ్యసించే యోగి మనస్సునుని, గాలి 

లేని చోట ఉంచిన దీపం స్థిరంగా ఉండే స్థితితో పోల్చుతారు.

|| 6-20 ||

శ్లో.  యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా|

యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి.

తే.గీ.  యోగి నిగ్రహాత్మెచ్చట నొందు శాంతి, 

ఆత్మ దర్శనమును యోగి హాయి నెచట

పొందుచుండునో తెలియుము బంధురముగ,

ననుపమాన శుభాస్పదా! ఘనసుచరిత!

భావము.

యోగాభ్యాసం ద్వారా నిగ్రహింప బడిన మనస్సు ఎక్కడ ఉపశమనము 

పొందుతుందో, ఎక్కడ తనలోతాను ఆత్మస్వరూపాన్ని చూస్తూ

(యోగి) ఆనందిస్తాడో,

జైహింద్.

శ్రీమన్నారాయణ శతకము | 1వ భాగము | చింతా రామకృష్ణారావు | అందుకూరి చిన్న పు...

0 comments

శ్రీమన్నారాయణ శతకము | 2వ భాగము | చింతా రామకృష్ణారావు | అందుకూరి చిన్న పు...

0 comments

15, మే 2022, ఆదివారం

శ్రీ కూర్మ జయంతి శుభాకాంక్షలు.💐

0 comments

 జైశ్రీరామ్.

ఓం నమో నారాయణాయ.🙏

శ్రీ కూర్మ జయంతి శుభాకాంక్షలు.💐


నేను రచించిన శ్రీయాదాద్రి శ్రీనృసింహశతకమునుండి దశావతారములు

105. ఓం లక్ష్మీనృసింహాయ నమః

దండక -  గర్భ సీసమాలిక.                   


(మత్స్యావతారము)

(3) నిద్రించగా బ్రహ్మ నిత్యంబులౌ వేద - ముల్ పైకి కన్పించ మూర్ఖుఁడైన

యా రాక్షసుండౌ హయగ్రీవుఁడే వాటి - నన్నింటినిన్ బట్టి మిన్నకుండ

చౌర్యంబు చేయంగ సద్వేద సంరక్ష - ణంబీవు గావించ నంబుజాక్ష!

క్రూరాత్మునిం జంప క్షోణిం బ్రభూతంపు - మత్స్యంబు నీవేర మహిత దేవ!

 (కూర్మావతారము)

(4) దైత్యాళియున్ దేవతల్ వ్యాప్తమైయున్న - క్షీరాబ్ధినే చిల్క చేరి యచట

కవ్వంబుగా కొండ, గైకొంచు నా త్రాడు - గా వాసుకిన్గొంచు కవ్వమట్లు

చిల్కంగ నవ్వేళ చిత్రంబుగా నీవు - కూర్మంబువై కాచి, కూర్మి చూపి

శ్రీ కూర్మ రూపాన శ్రీకూర్మమందుండి - రక్షింతువే నీవు ప్రాణ నాథ.

(వరాహావతారము)

(5) భూదేవి బాధించు మూర్ఖున్ హిరణ్యాక్షు - నింజంపి, భూమిన్ సునీతినొప్ప

రక్షించు దీక్షన్ వరాహంబుఁగాఁ బుట్టి - దుష్టాత్మునిన్ జంపి సృష్టిలోన

దీనార్తులం గాంచి ప్రాణంబుగా నిల్చి - భక్తాళినే బ్రోచి, ప్రతిభనొప్పి,

భూమిన్ వరాహంబు పూజ్యంబుఁగాఁ జేసి - వర్ధిల్లి తీవేగ ! వశమునుండు. 

(నరసింహావతారము)

(6) రక్షింప శిక్షింపఁ బ్రహ్లాదునిన్ తండ్రి - నిన్నీనృసింహంబు నేర్పు తోడ

రూపంబుగా తాల్చి పాపాత్మునిం ద్రుంచి - ప్రహ్లాదు రక్షించి, ప్రభను జూప

చిద్రూపమొప్పార సింహాచలంబింక, - యాదాద్రి యందీవు హ్లాదమొదవ

తేజంబుతోనిల్చి, దీపింతువే పెక్కు - చోట్లన్ నృసింహాఖ్య! శోభఁ గూర్ప.

(వామనావతారము)

(7) యజ్ఞాదులం జేయు ప్రజ్ఞాన్వితుండౌ బ - లిం గాంచి పాతాళ 

ప్రాంగణమున

లోకాధిపుం జేయ శ్రీకారముం జుట్టి - శ్రీవామనుండౌచుఁ జేర వచ్చి,

దానంబుగా కోరి ధాత్రిం ద్రిపాదంబు - లీయన్ వరాకాశ హృన్మనోజ్ఞ

భూభాగముల్గొంచు మూడున్ గొనన్ శీర్ష - మున్ ద్రొక్కితీవేగ! ప్రోవ నెంచి

 (పరశురామావతారము)

(8) భూపాలకుల్ సృష్టిఁ బాపాత్ములై మంచి - చెడ్డల్ విడన్ గాంచి, 

యడ్డగించి

నీ గొడ్డలిన్ బట్టి వేగంబుగాఁ జేసి - తే రాజ నాశంబు? దేవ దేవ!

రాముండవై? కాన రావయ్య నేడున్ దు - రాత్ముల్ విజృంభించి  యవని పైన

దౌష్ట్యంబులన్ జేయు. దండించు వారిన్ మ - ముం గావ రావేర 

పుణ్య ఫలమ!

(శ్రీరామావతారము)

(9) కామాతురుండై మృగంబట్లు వర్తించు - చున్ రావణ బ్రహ్మ శోభ చెదర

సీతాపహారంబు సేయంగ వానిన్ వ - ధించంగ సుగ్రీవు పంచ చేరి

స్నేహంబునే చేసి శ్రీలంకనే చేరి - యారావణుం జంపి యచట నున్న

సీతమ్మతోఁ జేరి శ్రీరామ.! రాజ్యంబు - పాలించితీవేర! పరమ పురుష!

 (శ్రీకృష్ణావతారము)

(10) శ్రీమన్మహా గీత చేకొండటంచున్ బ్ర - బోధంబు సేయంగ భూమిపైన

కృష్ణుండుగాఁ బుట్టి, తృష్ణన్ నినున్ జూచు - భక్తుండు పార్థుండు భయముఁ గొల్పు

యుద్ధంబులో భీతినొద్దంచు యుద్ధంబు - మానంగ నచ్చోట మహిమ చేసి

గీతన్ బ్రబోధించి చైతన్యముం గొల్పి - చేయించితీవేర చిద్విభాస!

(బుద్ధావతారము)

(11) భూమీశులున్ మానవుల్ యజ్ఞ యాగాదు - లన్ జేయుచున్ నందు లక్ష్యమొప్ప

జీవాళినే జంప, జీవంబులన్ దీయు - యాగంబులన్ మాన్ప నవనిపైన

సిద్ధార్థుఁడై పుట్టి బుద్ధుండుగామారి, - బౌద్ధంబు బోధించి, ప్రస్ఫుటముగ

హింసా విధిన్ మాన్పి, హృత్సీమలో శాంతి - నే గొల్పితీవేర నిత్య శుభద!

 (కల్క్యవతారము)

(12) దుష్టుల్ విజృంభించి, శిష్టాత్ములన్ బాధ - లన్ ముంచుటం జేసి లక్ష్యమైన

ధర్మంబు క్షీణింప, మర్మాత్ములం జంపి - ధర్మంబు రక్షింపఁ దప్పదంచు

కల్యంతమున్ ఘోర ఖడ్గంబునే దాల్చి - భూభారమే తగ్గ దుష్ట నిహతిఁ

జేయంగ జన్మించు శ్రీమన్మహా కల్కి - దేవా నమస్తేస్తు దీప్త నృహరి! 


105 వ సీస మాలిక గర్భస్థ దండకము.


(మత్స్యావతారము)

(3) నిద్రించగా బ్రహ్మ నిత్యంబులౌ వేదముల్ పైకి కన్పించ 

యా రాక్షసుండౌ హయగ్రీవుఁడే వాటినన్నింటినిన్ బట్టి 

చౌర్యంబు చేయంగ సద్వేద సంరక్షణంబీవు కావించ 

క్రూరాత్మునిం జంప క్షోణిం బ్రభూతంపు మత్స్యంబు నీవేర. 

(కూర్మావతారము)

(4) దైత్యాళియున్ దేవతల్ వ్యాప్తమైయున్న క్షీరాబ్ధినే చిల్క 

కవ్వంబుగా కొం డఁ గైకొంచు నా త్రాడుగా వాసుకిన్గొంచు 

చిల్కంగ నవ్వేళ చిత్రంబుగా నీవు కూర్మంబువై కాచి, 

శ్రీ కూర్మ రూపాన శ్రీకూర్మమందుండి రక్షింతువే నీవు . 

(వరాహావతారము)

(5) భూదేవి బాధించు మూర్ఖున్ హిరణ్యాక్షు నింజంపి, భూమిన్ సు 

రక్షించు దీక్షన్ వరాహంబుఁగాఁ బుట్టి దుష్టాత్మునిన్ జంపి 

దీనార్తులం గాంచి ప్రాణంబుగా నిల్చి భక్తాళినే బ్రోచి, 

భూమిన్ వరాహంబు పూజ్యంబుఁగాఁ జేసి వర్ధిల్లి తీవేగ?.

(నారసింహావతారము)

(6) రక్షింప శిక్షింపఁ బ్రహ్లాదునిన్ తండ్రి నిన్నీనృసింహంబు 

రూపంబుగా తాల్చి పాపాత్మునిం ద్రుంచి ప్రహ్లాదు రక్షించి, 

చిద్రూపమొప్పార సింహాచలంబింక, యాదాద్రి యందీవు 

తేజంబుతోనిల్చి, దీపింతువే పెక్కు చో…

జైహింద్.

యుక్తాహారవిహారస్య .|| 6-17 ||..//.. యదా వినియతం చిత్త..|| 6-18 ||..కర్మసన్యాస యోగము.

0 comments

 జైశ్రీరామ్..

|| 6-17 ||

శ్లో.  యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు|

యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా.

తే.గీ.  అవని పయి

యుక్త భుక్తి, విహారునకును

కర్మలన్యుక్తచేష్టప్రకాశునకును

యుక్త స్వప్నావబోధక రక్తునకిల

దుఃఖ హరణమౌ యోగమస్తోక సుగతి.

భావము.

ఆహార విహారాలను యుక్తంగా ఉంచుకునే వానికీ, కర్మలో తగు 

మాత్రంగా వినియోగించే వానికీ, నిద్రనూ మెళుకువనూ తగుమాత్రంగా 

వినియోగించే వానికీ, నిద్రనూ మెళుకువనూ సమంగా పాటించే 

వానికీ యోగం(జన మరణ)దుఃఖాన్ని హరిస్తుంది.

|| 6-18 ||

యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే|

నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా.

తే.గీ.  కామ్యవస్తువుల్ కోరక, కలుగ మనసు

వశము నందున, నాతనిన్ వసుధపైన

యోగ సిద్ధు డనందు రో యురుగుణాఢ్య!

యోగసిద్ధుడే ధన్యుడయుక్త రహిత.

భావము.

ఏ కామ్య వస్తువు పైనా కోరిక లేక, నిగ్రహింప బడిన మనస్సు ఆత్మలోనే 

ఉన్నప్పుడు అతడిని యోగ సిద్ధుడని అంటారు.

జైహింద్.

14, మే 2022, శనివారం

శ్రీ శివాష్టోత్తరశత పంచచామరావళి గానం.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

యుఞ్జన్నేవం సదాత్మానం .|| 6-15 ||..//.. నాత్యశ్నతస్తు యోగోऽస్తి..|| 6-16 ||..కర్మసన్యాస యోగము.

0 comments

 జైశ్రీరామ్.

|| 6-15 ||

యుఞ్జన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః|

శాన్తిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్ఛతి.

తే.గీ.  ఆత్మ నిగ్రహమున యోగి యహరహంబు

ధ్యాన మగ్నుడై నాలోన ననుపమముగ

కలిగినట్టిది, మోక్షమై ఘనతరమగు

శాంతి పొందును, కనుమిది సన్నుతాత్మ!

భావము.

మనస్సును నిగ్రహించి యోగి ఇలా ఎప్పుడూ ఆత్మ ధ్యానంలో నిలిపి, 

నాలో ఉన్నదీ, మోక్షరూపమైనదీ అయిన శాంతిని పొందుతాడు.

|| 6-16 ||

శ్లో.  నాత్యశ్నతస్తు యోగోऽస్తి న చైకాన్తమనశ్నతః|

న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున.

తే.గీ.  అతిగ తినువా డసలు తిననట్టి వాడు,

నతిగ నిద్రించువాడును, క్షితిని యసలు

నిద్రపోనట్టివాడును నిలువ లేడు,

సాత్వికాహారి యోగిగా సాగగలడు.

భావము.

అర్జునా! ఎక్కువ తినేవాడికి, బొత్తిగా తినని వాడికి, ఎక్కువ 

నిద్ర పోయేవాడికి, అసలు నిద్రపోనివాడికి ధ్యానయోగం సాధ్యపడదు. 

ఎల్లప్పుడు సాత్వికాహరమునె భుజించాలి.

జైహింద్.

13, మే 2022, శుక్రవారం

సమం కాయశిరోగ్రీవం.|| 6-13 ||..//.. ప్రశాన్తాత్మా విగతభీర్బ్రహ్మ..|| 6-14 ||..కర్మసన్యాస యోగము.

0 comments

జైశ్రీరామ్.

 || 6-13 ||

శ్లో.  సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః|

సమ్ప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్.

తే.గీ.  దేహమును, మెడన్, దలను, మదిని దలంచి

తిన్నగా దృష్టి నాసాగ్ర మున్నిలుపుచు,

సాధనము చేయవలెనయ్య! సరస సుగుణ!

యోగమున్ జేయ దగునిట్లు యోగియగుచు.

భావము. 

శరీరాన్ని, మెడని, తలనీ నిటారుగా కదలకుండా ఉంచి, దిక్కులు 

చూడకుండా తన ముక్కు కొసని చూస్తూ....

|| 6-14 ||

శ్లో.  ప్రశాన్తాత్మా విగతభీర్బ్రహ్మచారివ్రతే స్థితః|

మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః.

తే.గీ.  భయమ వీడి, ప్రశాంతుడై, బ్రహ్మచర్య

దీక్ష నూని, జితమనస్కుడై క్షమమున

నన్నె చిత్తంబునన్ నిల్పి, నన్ను జేర

ధ్యానమును లక్ష్య యుక్తుడై తనియవవయు.

భావము.

ప్రశంతమైన మస్సుతో భయాన్ని విడిచి, బ్రహ్మచర్య వ్రతంలో నిలిచి, 

మస్సుని బాగా నిరోధించి, నాలో చిత్తాన్ని నిలిపి, నన్ను చేరాలనే 

లక్ష్యంతో ధ్యాన యుక్తుడై ఉండాలి.

జైహింద్.

12, మే 2022, గురువారం

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య.|| 6-11 ||..//.. తత్రైకాగ్రం మనః కృత్వా..|| 6-12 ||..కర్మసన్యాస యోగము.

0 comments

 జైశ్రీరామ్.

|| 6-11 || 

శ్లో.  శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః |

నాత్యుచ్ఛ్రిత్రం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ || 

తే.గీ. ధరణి సమతలమందున దర్భగడ్డి

పరచి దానిపై చర్మమున్ బరచి దాని

పైన వస్త్రమ్ము పరచియు, దాని పైన

స్థిరముగాకూర్చొని తపము సేయ వలయు.

భావము.

ఎక్కువ ఎత్తూ పల్లమూ కాని పరిశుద్ధమైన ప్రదేశంలో దర్భలు పరచి, 

దానిమీద చర్మమూ, ఆపైన వస్త్రమూ వేసి తన స్థిరమైన ఆసనాన్ని 

ఏర్పరచుకోవాలి.

|| 6-12 || 

శ్లో.  తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః |

ఉపవిశ్యాసనే యుంజ్యాత్, యోగమాత్మవిశుద్ధయే || 

తే.గీ.  ఆసనముపైన గూర్చుండి, ధ్యాసనిలిపి,

యింద్రియములను, మనసునో యింద్రసముడ!

వశ పరచుకొని, మదినిల్పి, నిశలు నహము

లాత్మ శుద్ధికై యోగిగా నగుట తగును.

భావము.

ఆ ఆసనంమీద కూర్చుని, ఇంద్రియాలనూ మనస్సునూ స్వాధీన 

పరచుకుని, ఏకాగ్రచిత్తంతో ఆత్మశుద్ధికోసం యోగాభ్యాసం చేయాలి.

జైహింద్.

11, మే 2022, బుధవారం

చమత్కార శ్లోకము.. అద్భుతం.

2 comments

జైశ్రీరామ్.
జైహింద్.

సంస్కృతంలో అంకెలు నేర్చుకుందాం.

0 comments

జైశ్రీరామ్
జైహింద్.

సుహృన్మిత్రార్యుదాసీన.|| 6-9 ||..//.. యోగీ యుఞ్జీత సతతమాత్మానం..|| 6-10 ||..కర్మసన్యాస యోగము.

0 comments

జైశ్రీరామ్.

|| 6-9 || 

శ్లో. సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు |

సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే || 

తే.గీ. సాధువుల, సుహృ న్మిత్రులన్ శత్రువులను,

బంధువులను విరోధులన్, వసుధపైన

ఘన దురాచారులన్ మదిన్ గాంచునెవడు

నొక్కటిగ ఘనుడతడె సర్వోత్తముండు.

భావము.

శ్రేయోభిలాషి, స్నేహితుడు, శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, 

విరోధి, బంధువు, సాధువు, దురాచారి—వీళ్ళందరిపట్ల సమబుద్ధి 

కలిగినవాడే సర్వోత్తముడు.

|| 6-10 || 

శ్లో.  యోగీ యుఞ్జీత సతతమాత్మానం రహసి స్థితః |

ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః || 

తే.గీ. యోగి యేకాంత వాసియై యింద్రియముల

ను, మదిని వశపరచుకొని, కుమతి వీడి

ఏమియు గొనక,చిత్తంబు నెటులనైన

నాత్మపై నిల్పవలెనూ నిరంతరంబు.

భావము.

యోగి ఏకాంత స్థలంలో ఒంటరిగా ఉండి, ఆశలను వదలి, 

ఇంద్రియాలనూ మనస్సునూ వశపరచుకుని, ఏమీ పరిగ్రహించకుండా 

చిత్తాన్ని ఆత్మమీదే నిరంతరం నిలపాలి.

జైహింద్.

10, మే 2022, మంగళవారం

జితాత్మనః ప్రశాంతస్య.|| 6-7 ||..//.. సుహృన్మిత్రార్యుదాసీన..|| 6-8 ||..కర్మసన్యాస యోగము.

0 comments

జైశ్రీరామ్.

 || 6-7 || 

శ్లో.  జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః |

శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానావమానయోః || 

తే.గీ.  ఆత్మనుజయించు నతడే ప్రశాంతచిత్తు

డాతనికిదైవథర్శనమనవరతము

కలిగి, శీతోష్ణ సుఖదుఃఖములును మాన

ము నవమానమునొకటిగకనగలుగును.

భావము.

ఆత్మను జయించిన ప్రశాంతచిత్తుడు పరమాత్మ సాక్షాత్కారం నిరంతరం 

పొందుతూ శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, మానావమానాలపట్ల సమభావం 

కలుగుచుండును.

|| 6-8 || 

శ్లో.  జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః |

యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః || 

తే‌.గీ. జ్ఞాన విజ్ఞాన తృప్తుడు ఘనుడు నిర్వి

కారుడును జితేంద్రియుడును, కను నతండు

స్వర్ణమును మట్టి రాతిని సరిగ నొకటి

గ యతిగ నతనిచెప్పనౌన్ ఘనుడ! పార్థ!

భావము.

శాస్త్రజ్ఞానంవల్ల, అనుభవజ్ఞానంవల్ల సంతృప్తి చెందినవాడు, 

నిర్వికారుడు, ఇంద్రియాలను జయించినవాడు, మట్టినీ రాతినీ 

బంగారాన్నీ సమదృష్టితో చూసేవాడూ యోగి అని చెప్పబడుతాడు.

జైహింద్.

9, మే 2022, సోమవారం

ఆచార్య మానాప్రగడ శేషసాయి గారి ఉగాది కవిత,

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

ఉద్ధరేదాత్మనాత్మానం.|| 6-5 ||..//.. బంధురాత్మాత్మనస్తస్య..|| 6-6 ||..కర్మసన్యాస యోగము.

0 comments

 జైశ్రీరామ్.

|| 6-5 || 

శ్లో.  ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ |

ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః || 

తే.గీ.  శత్రువును బంధువాత్మయే సరిగ నరర

మానవులకిలన్, కాన యా మానవుండె

తనను తానుద్ధరించుకోతగును, నిము,

పతనమును పొందతగదు శుభంబులరయ.

భావము.

తన మనస్సే తనకు బంధువూ, శత్రువూ కూడా. కనుక మానవుడు తనను 

తానే ఉద్ధరించుకొనవలెను. తన ఆత్మను అధోగతి పాలుచేసుకోకూడదు.

|| 6-6 || 

శ్లో.  బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః |

అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్.

తే.గీ.  ఆత్మజితునకు బంధువా యాత్మ నిజము,

కానివానికి శత్రువే కనగ నాత్మ,

కాన యాత్మ నిల జయించు ఘనులు ఘనులు,

చేథకాకున్న పిది వారి చేటు నిజము.

భావము.

మనస్సును స్వాధీనపరచుకున్నవాడికి తన మనస్సే బంధువు. 

మనస్సును జయించనవాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది.

జైహింద్.

8, మే 2022, ఆదివారం

చిత్ర గర్భ కవిత్వం ఒకే పద్యంలో మూడు పద్యాలు .. చింతా రామకృష్ణారావు

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

ఆవు దూడ ప్రదక్షిణ చిలకల విన్యాసాలు రామ భక్తురాలు గౌరీశ్వరి గారు

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

ఆరురుక్షోర్మునేర్యోగం.|| 6-3 ||..//.. యదా హి నేంద్రియార్థేషు..|| 6-4 ||..కర్మసన్యాస యోగము.

0 comments

జైశ్రీరామ్.

 || 6-3 ||

శ్లో.  ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే|

యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే.

తే.గీ.  ధ్యాన యోగ సాధకునకు తలచి చూడ

నిత్య నిష్కామకర్మమే నిరుపమ గతి,

యోగ సిద్ధునకిలపైన నొప్పిదముగ

మహిని గాంచ కర్మత్యాగ మార్గమొప్పు.

భావము:

ధ్యానయోగాన్ని సాధించదలచిన మునికి నిష్కామకర్మయోగమే మార్గం. 

యోగసిద్ధి పొందినవాడికి కర్మత్యాగమే సాధనం.

|| 6-4 || 

శ్లో. యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే |

సర్వసంకల్పసన్న్యాసీ యోగారూఢస్తదోచ్యతే.

తే.గీ.  విషయ కర్మములపయిని ప్రీతి లేక

సకల సంకల్పముల్ వీడు సన్నుతు నిల

ననితరమగు యోగారూఢు డందురరయ,

తెలియుమర్జునా నిజమిది, తెలియవలయు.

భావము.

ఇంద్రియ విషయాలమీద కాని, కర్మలమీద కాని ఆసక్తి లేకుండా 

సంకల్పాలన్నీ విడిచిపెట్టినవాడిని యోగారూఢుడంటారు.

జైహింద్.

7, మే 2022, శనివారం

అనాశ్రితః కర్మఫలం కార్యం.|| 6-1 ||..//.. యం సన్న్యాసమితి ప్రాహుర్యోగం..|| 6-2 ||..కర్మసన్యాస యోగము.

0 comments

 జైశ్రీరామ్.

శ్రీభగవానువాచ|

భావము.

భగవానుడనుచున్నాడు.

|| 6-1 ||

శ్లో.  అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః|

స సంన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః.

తే.గీ. కర్మ ఫలలాభమునకయి కాంచకుండ

కర్మములు చేయు నెవ్వడు ఘను డతండు,

కర్మసన్యాసి తలపగ కవ్వడి! విను

మగ్నికార్యకర్మంబుల నతడు చేయు.

భావము:

కర్మఫలము పైన ఆధారపడకుండా, చేయ వలసిన కర్మని ఎవరు 

చేయునో అతడే కర్మ సన్యాసీ, కర్మ యోగి కూడా అగ్ని కార్యాన్నీ, కర్మనీ 

వదిలేసినవాడు కాదు.

|| 6-2 ||

శ్లో.  యం సన్న్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాణ్డవ|

న హ్యసన్న్యస్తసఙ్కల్పో యోగీ భవతి కశ్చన.

తే.గీ. కనగ సన్న్యాసమే యోగ మనగ నెరుగు

మెవరు సంకల్పమును వీడ రవని వారు

యోగి కానేరర్జునా! భోగులరయ,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.

భావము:

అర్జునా దేనిని సన్యాసమని అంటారో అదేయోగమని తెలుసుకో. 

సంకల్పాలను సన్యసించనివాడు ఎవడూ యోగికాలేడు.

జైహింద్.

6, మే 2022, శుక్రవారం

శ్రీ శంకర జయంతి సందర్భముగా డా.కరణం అరవిందరావుగారి సంస్కృతములో ఉపన్యాసము Shankara Jayanthi Talk (Sanskrit) - 02 by Dr. Karanam Aravinda Rao

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా శక్తిస్వరూపులగు భక్తపాళికి శుభాకాంక్షలు.

0 comments

 జైశ్రీరామ్.


శ్రీ శంకరభగవత్పాదులు.

శ్రీమన్మంగళపార్వతీశుకృపచే శ్రీపార్వతీ సత్ కృపన్ 

శ్రీమచ్ఛంకరులంది, తత్ఫలముచే చిన్మార్గ సద్భావనన్

శ్రీమాతన్ బరమేశ్వరున్ గొలుచుచున్ జిజ్ఞాసతో శ్లోకముల్

క్షేమంబున్ జనపాళికిన్ గొలుప, భాసింపంగ వ్రాసెన్ గృపన్..


అట్టి మహాత్ముడమ్మకృపనంది యనేక విశిష్ట సత్ కృతుల్

పట్టుగ భక్తియుక్తుఁడయి భావమహద్ద్యుతి నొప్ప వ్రాసి, జై

కొట్టగ భక్తపాళి కడు కూర్మిని జాతికొసంగినాడు, నే

డిట్టిమహాత్ము జన్మదినమిత్తరిసేమము మీ౩ కొసంగుతన్.


అమృతము పారజేసె కవితామృతమొల్కుచు భక్తిపెంచగన్,

ప్రముదము గొల్పు తత్పరత వర్ధిలజేసెను శ్లోకధారలన్,

సమధిక దైవచింతనము చక్కగ పెంచె జనాళిలోన,  దే

శము కడు ధన్యమాయె మన శంకరజన్మముచేత ధాత్రిపై.

జైహింద్.

భోక్తారం యజ్ఞతపసాం.|| 5-29 ||..//.. కర్మసన్యాస యోగము.

0 comments

 జైశ్రీరామ్.

|| 5-29 ||

శ్లో.  భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్|

సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాన్తిమృచ్ఛతి.

తే.గీ.  యజ్ఞ తపముల భోక్తగా, నన్ని ప్రాణు

లకును హితునిగా, ప్రభువుగా సకల మరయ

నేనెగా గాంచు ఘనుడిల నిత్య సుఖియు,

ముక్తుడున్ గాంచ నిజమిది, పుడమిపైన.

భావము.

యజ్ఞాలకు తపస్సులకి భోక్తగా, అన్ని లోకాలకు ప్రభువుగా, అన్ని ప్రాణుల 

హితం కోరేవాడిగా నన్ను తెలుసుకున్న వాడు శాశ్విత శాంతి పొందుతాడు.

ఓం తత్సదితి 

శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సుబ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే 

శ్రీకృష్ణార్జునసంవాదే కర్మసన్యాస యోగో నామ పంచమోధ్యాయః.

జైహింద్.

5, మే 2022, గురువారం

శ్రీ నల్లమోతు శ్రీధర్ సూచనలు. IT Expert Nallamothu Sridhar about Android App Store | Mobile App | Cybe...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

స్పర్శాన్కృత్వా బహిర్బాహ్యాం.|| 5-27 ||..//.. యతేన్ద్రియమనోబుద్ధిర్ము..|| 5-28 ||..//.. కర్మసన్యాస యోగము.

0 comments

జైశ్రీరామ్.

|| 5-27 ||

శ్లో.  స్పర్శాన్కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాన్తరే భ్రువోః|

ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యన్తరచారిణౌ.

తే.గీ.  ఇలను బాహ్యేంద్రియానుభూతులను గొనక

నెట్టివేయుచు భృకుటిపై పెట్టి ధ్యాస

తలచ వలయు ప్రాణాపానములను సమము

గా మదిని జూడ వలయును, కనుమటులనె.

భావము.

శబ్దస్పర్శాది బాహ్య ఇంద్రియ విషయాలను బయట నుంచి బయటకే 

నెట్టివేసి, ధ్యాసను భ్రూమధ్యంలో నిలిపి, నాసికారంధ్రాల ద్వారా 

చలిస్తున్న ప్రాణ, అపాన వాయువులను సమానంగా చూడాలి.

|| 5-28 ||

శ్లో.  యతేన్ద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః|

విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః.

తే.గీ.  ఇంద్రియంబుల్మనోబుద్ధులిలగ్రహించి

మోక్షమే లక్ష్యముగ గల్గి, పూర్తిగాను

కోపమున్ భయమును వీడి కోరికలిక

లేని ఋషియే గనన్ ముక్తు డెరుగు పార్థ!

భావము.

ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి, మోక్షమే తన అంతిమ లక్ష్యంగా 

పెట్టుకుని కోరికలను, భయమును, కోపాన్ని వదిలిన ఋషి ఎప్పుడూ 

ముక్తుడే..

జైహింద్.


4, మే 2022, బుధవారం

లభన్తే బ్రహ్మనిర్వాణమృషయః...|| 5-25 ||..//..కామక్రోధ వియుక్తానాం యతీనాం..|| 5-26 ||..//.. కర్మసన్యాస యోగము.

0 comments

 జైశ్రీరామ్.

|| 5-25 ||

లభన్తే బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః|

ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః.

తే.గీ. కల్మష విదూరమై భేదముల్మనమును

వీడిపోయి నిగ్రహశక్తి పెరిగి మదిని

ప్రాణికోటిహితమునెన్ను వారె రుషులు,

వారె బ్రహ్మనిర్వాణంబు వడయు ఘనులు.

భావము.

కల్మషాలు నశించి, భేదభావం తొలగిపోయి, మనస్సుని నిగ్రహించి, 

అన్ని ప్రాణుల హితాన్ని కోరే ఋషులు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు.

|| 5-26 ||

శ్లో.   కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసామ్|

అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్.

తే.గీ. విజిత కామాదుడై గొప్ప పేరుగాంచి,

విజిత మానసుడై, యాత్మ విశ్వరూప

మెరుగు నెవ్వ డా యోగికి నిరుపమాన

బ్రహ్మనిర్వాణ సుస్థితి పట్టుబడును. 

భావము.

కామక్రోధాల నుండి విడిపడి, మనస్సును జయించి, ఆత్మ స్వరూపాన్ని 

ఎరిగిన యతులకు బ్రహ్మ నిర్వాణస్థితి అంతటా ఉంటుంది.

జైహింద్.

3, మే 2022, మంగళవారం

కవిశేఖరులుబ్రహ్మశ్రీచింతారామకృష్ణారావు గారితో ముఖాముఖీ. #కవిసమయం,#కవిఅంత...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

వింతైన ఆశీర్వాద పద్యాలు | @SWAD...

0 comments

జైశ్రీరామ్
జైహింద్.

శక్నోతీహైవ యః సోఢుం...|| 5-23 ||..//..యోऽన్తఃసుఖోऽన్తరారామ..|| 5-24 ||..//.. కర్మసన్యాస యోగము.

0 comments

 జైశ్రీరామ్.

|| 5-23 ||

శ్లో.  శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్|

కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః.

తే.గీ.  దేహ జనిత కామాదుల దేల కెవ్వ

డవని నెదిరించి నిలుచునో యతడే యోగి,

అతడె సుఖమును పొందునో యగణిత గుణ!

ముక్తిక్తి గైకొంట కద్దియే ముఖ్యపథము.

భావము.

ఏవరైతే ఈ శరీరం ఉండగానే కామక్రోధాల నుండి పుట్టిన 

ప్రేరణలని తట్టుకోవడానికి సమర్ధుడౌతాడొ, అతడే యోగి, 

అతడే సుఖవంతుడు ఔతాడు.

|| 5-24 ||

శ్లో. యోऽన్తఃసుఖోऽన్తరారామస్తథాన్తర్జ్యోతిరేవ యః|

స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్ఛతి.

తే.గీ.  ఎవ్వ డాత్మలో నానంద మెన్నుచు గను

నాత్మలో జ్ఞాన సజ్జ్యోతి ననవరతము

నిలుకొనునాతడే యోగి, తలచిచూడ

నతడె బ్రహ్మమై మోక్షంబు ననుభవించు.

భావము.

ఎవరైతే తనలోనే సుఖాన్ని పొందుతూ, తనలో తాను ఆనందిస్తూ 

తనలో నే జ్ఞాన జ్యోతిని నిలుపుకున్న యోగి బ్రహ్మ స్వరూపుడై 

మోక్షాన్ని పొందుతాడు.

జైహింద్.

2, మే 2022, సోమవారం

బాహ్యస్పర్శే ష్వసక్తాత్మా ..|| 5-21 ||..//.. యే హి సంస్పర్శజా భోగా..|| 5-22 ||..//. . కర్మసన్యాస యోగము.

0 comments

 జైశ్రీరామ్.

|| 5-21 ||

శ్లో.  బాహ్యస్పర్శే ష్వసక్తాత్మా విన్దత్యాత్మని యత్సుఖమ్|

స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే.

తే.గీ. బాహ్యమౌ స్పర్శ లేనట్టి బ్రహ్మవేత్త

సుఖము నాత్మానుభూతితో శోభిల గను,

నిరుపమానంద సామ్రాజ్య నేత యతడు,

ధరణిపై వెల్గు నిరుపమ ధన్యు డతడు.

భావము.

బాహ్య స్పర్శలో తగుల్కోనివాడు, ఆత్మలో ఉండే సుఖాన్ని 

పొందుతాడు. బ్రహ్మతత్వానుసంధానంలో నిలిచిన ఆ యోగి 

అనంతమైన ఆనందాన్ని పొందుతాడు.

|| 5-22 ||

శ్లో.  యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే|

ఆద్యన్తవన్తః కౌన్తేయ! న తేషు రమతే బుధః.

తే.గీ.  బాహ్య సంస్పర్శ భోగమ్ము లేహ్యమయిన

దుఃఖ మూలమ్ము లెరుగుమా, తోచలేదొ?

యవధులున్నట్టివాటికై యరుగరెపుడు

సద్వివేకులు, ముక్తిసత్సారవిదులు.

భావము.

కుంతీకుమారా! బాహ్య విషయ స్పర్శలవల్ల జనించేభోగాలన్నీ దుఃఖాలకు 

మూలమే. ఆది, అంతములతో కూడుకున్న ఆ క్షణిక సుఖాలలో 

వివేకవంతుడు రమించడు.

జైహింద్.

Dr STV రాజగోపాలాచార్యులు.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.