గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, నవంబర్ 2008, శనివారం

విద్యా వివాదాయ ధనం మదాయ . . . మేలిమి బంగారం మన సంస్కృతి 21

0 comments

విద్యా ధన బలముల ప్రభావము.
మనలో చాలామందికి విద్వత్తు, ధనము, బలము ఉండడం మనకు తెలిసిన విషయమే. ఐతే వీటి వినియోగం విషయంలో మాత్రం ఎవరెవరు ఎలా యెలా చేస్తారో వివరిస్తూ ఒక చక్కని శ్లోకం ఉంది. చూద్దామా!
శ్లో. విద్యా వివాదాయ ధనం మదాయ
శక్తిః పరేషాం ఖలు పీడనాయ.
ఖలస్య సాధోః విపరీతమేతత్
జ్ఞానాయ దానాయచ రక్షణాయ.

చ. వరలెడి విద్య మూర్ఖపు వివాదపు ప్రౌఢిమ, విత్తమున్ మదం
బరయగ శక్తి నన్యులను బాధలు పెట్టుగ మూర్ఖు లందునన్,
పరులకు జ్ఞానమున్ గొలుప, భక్తిని పంచగ పేదవారికిన్
సరగున రక్ష సేయగను సజ్జనులందున నొప్పు నెల్లెడన్.

భావము:- విద్య, ధనము, బలము అను యీ మూడూ మూర్ఖులందు వివాదము కొరకును, గర్వ పడుటకును, పరులను హింసించుటకునూ ఉపయోగ పడుచుండగా, సజ్జనులయందు ఇతరులకు జ్ఞాన బోధ కలిగించుటకు, పేదలకు కష్టములలో సహాయము చేయుట కొరకూ, బాధలలో నున్న వారిని రక్షించుట కొరకునూ
ఉపయోగ పడుచున్నది కదా!
విద్యా ధన బలములను మంచి కొరకు ఉపయోగించుకొనువాడు సజ్జనుడు. వీటిని అకారణ వివాదములకు, గర్వ పడుటకు , ఇతరులను బాధ పెట్టుతకూ ఉపయోగించుకొనువాడు దుర్జనుడు. మనం అపు రూపమయిన పై మూడూ పొంద గలిగితే తప్పక మంచి కొరకే, పరుల కుపకారము చేయుట కొరకే ఉపయోగించి సజ్జనుల జాబితాలో చేరుదామా మరి!
జైహింద్.

పోతన భాగవత కథా క్రమము ఏకాదశ { 11 వ ] ద్వాదశ { 12 వ } స్కంధములు.

3 comments

పోతన భాగవతము లోని కథా క్రమమును దశమ స్కంధము వరకు తెలుసుకొన్నాము కదా! ఇప్పుడు ఏకాదశ { 11 వ } , ద్వాదశ { 12 వ } స్కంధములలోని కథా క్రమమును తెలుసుకొందామా? ఐతే చూడండి.

పోతన భాగవత కథా క్రమము. ఏకాదశ { 11 వ } స్కంధము.
విశ్వామిత్ర వసిష్ఠ నారదాది మహర్షులు శ్రీ కృష్ణ సందర్శనంబునకు వచ్చుట.
వసుదేవునికి నారదుడు పురాతనంబగు విదేహర్షభ సంవాదంబు దెలుపుట.
బ్రహ్మాది దేవతలు శ్రీ కృష్ణుని వైకుంఠమునకు బిలువ వచ్చుట.
కృష్ణుడు దుర్నిమిత్తంబులంగని యాదవుల నెల్ల ప్రభాస తీర్థమునకు బంపుట.
కృష్ణుడుద్ధవునకు బరమార్ధోపదేశము సేయుట.
అవధూత యదు సంవాదము.
శ్రీకృష్ణ బలరాములు వైకుంఠమున కరుగుట.
ఏకాదశ { 11 వ } స్కంధమునందలి కథా క్రమము సమాప్తము.

ద్వాదశ { 12 వ } స్కంధ కథా క్రమము.
శుకయోగి పరీక్షిత్తునకు భావి కాల గతుల జెప్పుట.
యుగ ధర్మ ప్రాకృతాది ప్రళయ చతుష్టయ వివేచనము.
పరీక్షిత్తు తక్షకునిచే దష్టుండై మృతినొంద అతని పుత్రుడు సర్ప యాగము సేయుట.
శ్రీ వేదవ్యాసుడు వేదములను పురాణములను లోకమందు ప్రవర్తింప చేయుట.
మార్కండేయోపాఖ్యానము.
చైత్రాది మాసంబుల సంచరించెడు ద్వాదశాదిత్యుల క్రమంబును తెలుపుట.
ద్వాదశ { 12 వ } స్కంధము సమాప్తము.

ఇంత వరకు కథా క్రమాన్ని చూచిన మనం ఇకపై ప్రతీ కథలో నున్న బాల రసాల సాల నవ పల్లవ కోమలత్వాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేద్దామా! ఆ శ్రీమహా విష్ణువు మన ఆకాంక్ష తీర్చును గాక.
జై శ్రీమన్నారాయణ.
జైహింద్.

సత్యపిచ సుకృత కర్మణి . . . మేలిమి బంగారం మన సంస్కృతి 20

2 comments

దుష్ట స్వభావ ఫలము:-

మనము పుణ్య కర్మల నెన్నిటిని చేయు చున్నను మన ప్రవర్తన దుష్ట మార్గమున నున్నచో అవి అన్నియు వ్యర్థములు సుమా! ఈ విషయమున ఒక చక్కని శ్లోకము కలదు. పరిశీలిద్దామా!
చూడండి.
శ్లో. సత్యపిచ సుకృత కర్మణి
దుర్నీతిశ్చే చ్ఛ్రియం హరత్యేవ
తైలైః సదోపయుక్తానాం
దీప శిఖాం విదళయతి హి వాతాళిః .

గీ. పుణ్య కర్మలు చేసెడి పురుషునకును
దుష్టుడగునేని శ్రీలెల్ల నష్ట మగును.
తైల మెంతగా నున్నను దీప కళిక
నార్పి వేయును సుడిగాలి యరసి చూడ.

భావము:- ఎంత తైలము వున్నప్పటికీ దీపమును సుడిగాలి ఆర్పివేయు విధముగా మనుజునిలో దుస్స్వభావములు, దుశ్చేష్టలు ఉన్నచో అట్టి వాడు ఎన్ని పుణ్య కార్యములు చేయుచుండువాడైననూ వాని శ్రీలెల్ల హరించుకుపోవుట తథ్యము .
ఇది తెలుసుకొనిన మనము దుశ్చేష్టలకు దూరముగా నుండి, పుణ్య కార్యాచరణ వలన పుణ్య శ్రీని, శ్రీలను సంపాదించుకొనుచు నిలబెట్టు కొనుట అన్ని విధములా శ్రేయస్కరమే కదా! అందుకని అలా చెద్దామా!
జైహింద్.

పోతన భాగవత కథా క్రమము. దశమ { 10 వ } స్కంధము ఉత్తర భాగము.

1 comments

సహజ పాండిత్య బిరుదాంకితుడగు పోతన మహాకవి విరచిత భాగవతమునందలి దశమ { 10 వ } స్కంధమునందలి ఉత్తర భాగ కథా క్రమమును తెలుసుకొందామా ఇప్పుడు? ఐతే చూడండి.

దశమ { 10 వ } స్కంధము నందలి కథా క్రమము.
ప్రద్యుమ్న కుమార చరిత్ర ప్రారంభము.
రతీదేవి ప్రద్యుమ్న సహితయై గగన మార్గంబున ద్వారకకు బోవుట.
శ్రీ కృష్ణుండు లోకాపవాడ నివృత్తి కొఱకు స్యమంతక మణిన్ దెచ్చుట.
శతధన్వుడు సత్రాజితుని జంపి మణినపహరించుట.
శ్రీ కృష్ణుండింద్రప్రస్థ పురంబునకరుగుట.
శ్రీ కృష్ణుండు కాళిందీ మిత్రవింద నాగ్నగితి భద్ర లక్షణల బరిణయం బగుట.
శ్రీ కృష్ణుడు సత్యభామతో గూడ నరిగి నరకాసురుని వధించుట.
సత్యభామ నరకాసురునితో యుద్ధంబు సేయుట.
భూదేవి శ్రీ కృష్ణుని స్తుతించుట.
శ్రీ కృష్ణుడు పదాఱు వేల కన్నియల వరించి దేవ లోకమునకు బోయి పారిజాతము తెచ్చుట.
శ్రీ కృష్ణుండు కేళీ గృహమునందు రుక్మిణీ దేవితో విరసోక్తులాడుట.
రుక్మిణీ దేవి శ్రీ కృష్ణ లాలితయై యతని స్తుతించుట.
శ్రీ కృష్ణుండు రుక్మిణీ దేవి నూఱడించుట.
బాణాసురుండీశ్వర ప్రసాదంబు నొందుట.
బాణాసురుండనిరుద్ధుని నాగ పాశ బద్ధుని జేయుట.
నారదుని వలన ననిరుద్ధుని వృత్తాంతమును విని కృష్ణుడు బాణాసురునిపై దండెత్తుట.
బాణాసురుని సహాయభూతుండగు శివునకు కృష్ణునకు యుద్ధమగుట.
బాణాసురుండు రెండవ సారి యుద్ధమునకు వచ్చుట.
శివుడు బాణుని రక్షింప శ్రీ కృష్ణుని స్తుతించుట.
ఉషానిరుద్ధ సహితుండై కృష్ణుండు ద్వారకాపురంబున కరుగుట.
నృగ మహారాజు చరిత్రము.
బలరాముడు సుహృద్బంధుజన దర్శనార్థమై వ్రేపల్లెకు బోవుట.
శ్రీ కృష్ణుండు పౌండ్రకవాసుదేవుని మీద దండెత్తిపోయి వానిని జంపుట.
బలరాముండు ద్వివిదుడను వానరుని సమ్హరించుట.
బలరాముండు హస్తినా పురమును గంగలో ద్రోయ బూనుట.
షోడశ సహస్ర స్త్రీ సంగతుండైన శ్రీ కృష్ణుని మహిమ నారదుండరయుట.
నారదుండు శ్రీ కృష్ణునితో ధర్మరాజు రాజసూయము నెరవేర్పుమని సెప్పుట.
శ్రీ కృష్ణుండుద్ధవుని యాలోచన చొప్పున ధర్మరాజు పాలికి పోవుట.
పాండవులు శ్రీ కృష్ణుని తోడ్కొని పోవుట.
ధర్మరాజు శ్రీ కృష్ణు ననుమతంబున భీమాదుల దిగ్విజయంబునకు బంపుట.
శ్రీ కృష్ణ భీమార్జునులు జరాసంధుని వధింప బోవుట.
శ్రీ కృష్ణ సహాయుందగు భీముండు జారాసంధునితో యుద్ధము సేయుట.
కారా గృహ విముక్తులగు రాజులు శ్రీ కృష్ణుని స్తుతించుట.
ధర్మరాజు చేసేడి రాజసూయంబు నందు శ్రీ కృష్ణుండు శిశుపాలుని వధించుట.
సాల్వుండు శివ ప్రసాదంబున సౌభక విమానంబు వడసి ద్వారకా పురిపై దండెత్తుట.
శ్రీ కృష్ణుండు దంతవక్త్రుని సమ్హరించుట.
బలరాముండు తీర్థ యాత్రకు జనుట.
కుచేలోపాఖ్యానము.
శ్రీ కృష్ణుండు సకుటుంబముగ గ్రహణ స్నానమునకు బోవుట.
లక్షణ యను శ్రీ కృష్నుని యష్టమ భార్య ద్రౌపదీదేవికి తన వివాహ వృత్తంతము దెలుపుట.
నారదాది మహర్షులు స్రీ కృష్ణ దర్శనంబు సేసికొని వసుదేవునిచే క్రతువు చేయించుట.
శ్రీ కృష్న బలభద్రులు మృతులైన తన సహోదరుల దెచ్చి దేవకీదేవికి కనబఱచుట. సుభద్రా పరిణయము.
స్రీ కృష్ణుండు ఋషి సమేతుండయి మిథిలా నగరమునకు బోవుట.
శ్రుతిగీతలు.
పరీక్షిత్తునకు శుకయోగి విష్ణు సేవా ప్రాశస్త్యము సెప్పుట.
శివ ద్రోహంబు సేయంబూనిన వృకాసురుండు విష్ణు మాయచే మడియుట.
భృగుమహర్షి త్రిమూర్తుల ప్రాశస్త్యము శోధించుటకు బోవుట.
శ్రీకృష్ణుండు మృతులైన విప్ర సుతులను దెచ్చుట.
దశమ { 10 వ } స్కంధము ఉత్తర భాగము సమాప్తము.

మిగిలిన రెండు స్కంధములలోని కథా క్రమమును త్వరలో మీముందుంచగలను.
జైహింద్.

28, నవంబర్ 2008, శుక్రవారం

పోతన భాగవత కథా క్రమము. దశమ { 10 వ } స్కంధము - పూర్వ భాగము.

0 comments

బమ్మెర పోతన మహాకవి విరచిత భాగవతమునందలి ౯ స్కంధముల కథా క్రమమును ఇంతవరకూ తెలుసుకొన్నాము కదా! ఇప్పుడు దశమ స్కంధము పూర్వ భాగము లోని కథా క్రమమును తెలుసుకొందామా! ఐతే చూడండి.

దశమ { 10 వ } స్కంధము పూర్వ భాగము లోని కథా క్రమము.
శ్రీ కృష్ణ కథా ప్రారంభము.
బ్రహ్మాది దేవతలు దేవకీ గర్భస్థుండగు శ్రీ కృష్ణుని స్తుతించుట.
శ్రీ కృష్ణావతార ఘట్టము.
దేవకీదేవి స్వామిని స్తుతించుట.
దేవకీ వసుదేవుల పూర్వ జన్మ వృత్తాంతము.
కంసుని పంపున( బూతన యను రాక్షసి వ్రేపల్లెకు జనుదెంచుట.
బాల కృష్ణుండు శకటమున్ దన పాదమున ( గూల ( దన్నుట.
తృణావర్తుడను రాక్షసుడు సుడి గాలి యై కృష్ణు నెత్తుకొని పోవుట.
శ్రీ కృష్ణ బలరాముల బాల క్రీడాభివర్ణనము.
గోపికలు శ్రీకృష్ణుని దుడుకు జేతలు యశోదా దేవితో జెప్పుట.
మృద్భక్షణ విశ్వ రూప ప్రదర్శనాద్యభి వర్ణనము.
యశోదా నందుల పూర్వ జన్మ వృత్తాంతము.
యశోద దధి భాండ వికలనాదులు సేసిన కృష్ణుని ( బట్టుకొనుట.
ఉలూఖల బంధన యమళార్జున భంజనాద్యభి వర్ణనము.
నందాదులు బృందావనమునకు నరుగుదెంచుట.
వత్సాసుర బకాసురుల వధ.
శ్రీ కృష్ణుడు గోపకులతో బంతి చల్దులు గుడువ వనముల కేగుట.
గోపాల బాలురు కృష్ణునితో గూడి చల్దు లారగించుట.
బ్రహ్మ గోవత్సములను గోప బాలకులను నంతర్ధానంబు సేయుట.
గార్ధభాకారుండైన ధేనుకాసురుని బలభద్రుడు వధించుట.
శ్రీ కృష్ణుడు కాళియ మర్దనము గావించుట.
కాళీయుని భార్యలైన నాగాంగనలు శ్రీ కృష్ణుని నుతించుట.
కాళియుని పూర్వ కథ.
గో గోప గోపికా సంఘమును కార్చిచ్చు చుట్టుకొనుట.
గ్రీష్మర్తు వర్ణనము.
బలభద్రుండు ప్రలంబాసురుని వధించుట. శ్రీ కృష్ణుండు దావాగ్నిని మ్రింగి గో గోపక సంఘమును కాపాడుట.
వర్షర్తు వర్ణనము.
శరదృతు వర్ణనము.
హేమంత ఋతు వర్ణనము.
గోపికా వస్త్రాపహరణము.
ముని భార్యలన్నము దీసుకొని వచ్చి, శ్రీ కృష్ణు నారగింప ( జేయుట.
నందాదులింద్ర యాగము సేయ శ్రీ కృష్ణునితో నాలోచించుట.
శ్రీ కృష్ణుడు గోవర్ధన పర్వతము నెత్తుట.
శ్రీ కృష్ణ మూర్తి నందుని వరుణ గృహము నుండి కొని తెచ్చుట.
శరద్రాత్రి గానమొనర్చు కృష్ణు సన్నిధికి గోపికలు వచ్చుత.
గోపికా గీతలు.
రాస క్రీడాభి వర్ణనము.
జల క్రీడాభివర్ణనము.
సర్ప రూపియగు సుదర్శనుండను గంధర్వుని శాప విమోచనము.
కుబేర భటుండగు శంఖచూడుండను గుహ్యకుని సమ్హరించుట.
వృషభాసుర సమ్హారము.
శ్రీ కృష్ణుండు కేశివ్యోమాసురుల సమ్హరించుట.
కంసుని పంపున నక్రూరుండు బృందావనమునకు ( జనుదెంచుట.
అకౄరుండు యమునలో రామ కృష్ణుల దర్శించి నుతించుట.
శ్రీ కృష్ణ మూర్తి మధురా నగర ప్రవేశము సేయుట.
శ్రీ కృష్ణుండు రజకుని జంపి వాయక సుదాముల పూజలందుట.
సూర్యాస్తమయ చంద్రోదయముల వర్ణనము.
సూర్యోదయ వర్ణనము.
శ్రీ కృష్ణుండు కువలయా పీడనమను గజంబును వధించుట.
శ్రీ కృష్ణ బలరాములు చాణూర ముష్టికులను వధించుట.
శ్రీ కృష్ణుడు కంసుని వధించుట.
శ్రీ కృష్ణుండు దేవకీ వసుదేవుల చెఱ మాన్ పి యుగ్రసేనునికి బట్టంబు గట్టుట.
శ్రీ కృష్ణుండు గోప కాంతల చెంతకు నుద్ధవుని బంపుట.
భ్రమర గీతము.
కృష్ణుండుద్ధవునితో జేరుకొని కుబ్జా గృహంబునకు నరుగుట.
కృష్ణుండక్రూరుని హస్తినాపురంబునకు బంపుట.
జరాసంధుడు మధురమీద దండెత్తి వచ్చి కృష్ణునితో యుద్ధము సేయుట.
శ్రీ కృష్ణుండు నిరాయుధుడై కాలయవనుడు వెంటనంట బరుగెత్తుట.
ముచకుందుని పూర్వ కథాభి వర్ణనము.
ముచకుందుడు శ్రీ కృష్ణుని స్తోత్రము సేయుట.
జరాసంధుడు ప్రవర్షణ గిరిని దహించుట.
రుక్మిణీ కల్యాణ కథా ప్రారంభము.
శ్రీ కృష్ణుండు కుండిన నగరంబునకు రథారూఢుండై చనుట.
శ్రీ కృష్ణుండు శత్రు రాజులు చూచుచుండ రుక్మిణీదేవిని గొనిపోవుట.
సహోదరుని భంగమునకు ఖిన్నయగు రుక్మిణీదేవిని బలభద్రుండూరార్చుట.
శ్రీ కృష్ణుండు రుక్మిణీదేవిని బెండ్లి యాడుట.
దశమ { 10 వ } స్కంధము పూర్వ భాగము సమాప్తము.

త్వరలో ఉత్తరార్థమును గూడ మీ ముందుంచుటకు యత్నింతును.
జైహింద్.

నిర్గుణ్యమేవ సాధీయో . . . మేలిమి బంగారం మన సంస్కృతి 19

2 comments

లోకం తీరు:-

ఈ లోకంలో మనం చూస్తున్నాం. సుగుణ పూర్ణులను అవమానమానించుటయు, నిర్గుణులను, దుర్గుణులను గౌరవించుటయు అక్కడక్కడా జరుగుతోంది. దీని విషయంలో చక్కని శ్లోకమొకటుంది. చూద్దామా!
శ్లో. నిర్గుణ్యమేవ సాధీయో ధిగస్తు గుణ గౌరవం
శాఖినోన్యే విరాజంతే ఖండ్యంతే చందన ధృమాః !

గీ. నిర్గుణుని గౌరవింతురు నిజము కాదె?
సద్గుణుని గౌరవింపరు చక్కగాను.
విషపు వృక్షము జోలికి వెళ్ళ లేరు.
మంచి గంధపు చెట్టును త్రుంచుదు రిల.

భావము:- దుష్టులన్నను, మూర్ఖులన్నను, భయ విహ్వలురై వారి జోలికి ఎవరూ పోరు. ఆదుష్టత్వమే, ఆ మూర్ఖత్వమే వారి రక్షా కవచము. మంచివారన్నచో లోకువ కావుననే వారిని లెక్క చేయరు. చూడండి. ముండ్ల చెట్టు జోలికెవ్వరూ పోరు. మంచి గంఢపు చెట్టునయితే ముక్క ముక్కలు చేసి పట్టుకు పోతారు కదా.
ఏమి లోకువండి. ఏమి లోకమండి. ఆ పరమాత్మయే మంచి వారికి రక్ష.
జైహింద్.

పోతన భాగవత కథా క్రమము అష్టమ { ఎనిమిదవ} నవమ { తొమ్మిదవ } స్కంధములు .

0 comments

సహజ పాండిత్యుడగు పోతన భాగవతమునందలి సప్తమ స్కంధము వరకు కథా క్రమాన్ని చెప్పుకొన్నాం కదా! ఇప్పుడు అష్టమ { 8 వ } నవమ { 9 వ } స్కంధాలలోని కథా క్రమాన్ని తెలుసుకొందామా మరి? ఐతే చూడండి.

అష్టమ స్కంధము లోని కథా క్రమము.
గజేంద్ర మోక్ష కథా ప్రారంభము.
క్షీర సాగర మథన కథా ప్రారంభము.
కూర్మావతార కథా ప్రారంభము.
శివుండు దేవ ప్రార్థితుండై హాలాహలమును బానము సేయుట.
పాల కడలిన్ దరచు నెడ నైరావతాదులు జనించుట.
శ్రీ విష్ణు మూర్తి మోహినీ స్వరూపంబు నొందుట.
దేవాసుర యుద్ధము.
హరి దన మోహినీ రూపంబుచే నీస్వరుని మోహింప జేయుట.
వామన చరిత్ర కథా ప్రారంభము.
వమన మూర్త్యావిర్భావ ఘట్టము.
బలి చక్రవర్తి కడకు వామన మూర్తి యేతెంచుట.
మత్స్యావతార కథా ప్రారంభము.
అష్టమ స్కంధము కథా క్రమము సమాప్తము.
సహజ పాండిత్యుడగు పోతన భాగవతమునందలి సప్తమ స్కంధము వరకు కథా క్రమాన్ని చెప్పుకొన్నాం కదా! ఇప్పుడు అష్టమ { 8 వ } నవమ { 9 వ } స్కంధాలలోని కథా క్రమాన్ని తెలుసుకొందామా మరి? ఐతే చూడండి.

అష్టమ స్కంధము లోని కథా క్రమము.
గజేంద్ర మోక్ష కథా ప్రారంభము.
క్షీర సాగర మథన కథా ప్రారంభము.
కూర్మావతార కథా ప్రారంభము.
శివుండు దేవ ప్రార్థితుండై హాలాహలమును బానము సేయుట.
పాల కడలిన్ దరచు నెడ నైరావతాదులు జనించుట.
శ్రీ విష్ణు మూర్తి మోహినీ స్వరూపంబు నొందుట.
దేవాసుర యుద్ధము.
హరి దన మోహినీ రూపంబుచే నీస్వరుని మోహింప జేయుట.
వామన చరిత్ర కథా ప్రారంభము.
వమన మూర్త్యావిర్భావ ఘట్టము.
బలి చక్రవర్తి కడకు వామన మూర్తి యేతెంచుట.
మత్స్యావతార కథా ప్రారంభము.
అష్టమ స్కంధము కథా క్రమము సమాప్తము.

నవమ స్కంధములోని కథా క్రమము.
వైవస్వత మను వంశ కథనము.
అంబరీషోపాఖ్యానము.
ఇక్ష్వాకు వంశ క్రమము.
సగర చక్రవర్తి కథా ప్రారంభము.
శ్రీ పరమేశ్వర జటా నిర్గత గంగా ప్రవాహ మహిమాభివర్ణనము.
శ్రీ రామ చరిత్రము.
భవిష్యద్రాజేతిహాసము.
చంద్ర వంశ్యులగు రాజుల ఇతిహాసము.
పరశు రాముని చరిత్రము.
యయాతి చరిత్రము.
దేవయానిని యయాతి వరించుట.
శుక్రాచార్యులు యయాతికి శాపంబొసగుట.
యయాతి దేవయానికి బస్తోపాఖ్యానమనెడి వ్యాజంబున స్వప్న వృత్తాంతంబు తెలుపుట.
భరతుని చరిత్రము.
రంతి దేవుని చరిత్రము.
యదు వంశ చరిత్రము.
వసుదేవుని వంశ క్రమానువర్ణనము.
నవమ స్కంధములోని కథా క్రమము సమాప్తము.

దశమ స్కంధము లోని కథాక్రమమును అవకాశము చిక్కినపుడు చూద్దామా?
జైహింద్.

ద్వారం ద్వార మటన్ భిక్షుః . . . మేలిమి బంగారం మన సంస్కృతి 18

1 comments

యాచకుని హిత బోధ:-
సృష్టిలో మనం గ్రహించ గలిగితే అడుగడుగునా ప్రతీ అంశమూ మనకు పాఠాలు నేర్పుతాయి. మన యింటికి వచ్చే భిక్షగాడి విషయమును ఒక శ్లోకంలో ఎలా చెప్పాడో చూద్దామా?
శ్లో. ద్వారం ద్వార మటన్ భిక్షుః శిక్షత్యేవ న యాచతే
అ దత్వా మాదృశో మాభూః దత్వా త్వం త్వాదృశో భవః.

క. పెట్టక నావలె యుండక
పెట్టుచు మీవలెనె యుండి పెంపును గనుడన్
చట్టుల చెప్పక చెప్పెడి
దిట్ట కదా ముష్టి వాడు. తెలియగ వలదా!

భావము:- ముష్టి వాడు ఇంటింటికీ వచ్చి యాచిస్తున్నాడనుకొనుట కంటే హెచ్చరిస్తున్నాడనుకోవడం మంచిది. ఎలాగంటారా? దానము చేయుట మాని నాబోటి వారు కాబోకుడు. పెట్టి మీవలె మీరుండండి. అని సోదాహరణంగా గృహస్తులను శిక్షిస్తున్నాడనుకొనినచో సముచితంగా నుండును కదా.
ఇంటికి వచ్చిన భిక్షకులను తూలనాడ రాదు. వీలయినచో ధర్మముగా వారి భాగమును వారికర్పించ వలయును. అటుల చేయలేని పక్షమున మంచి మాటలతో తృప్తి పరచి పంప వలెను.
ధర్మం చేయండని యాచకులడుగుట మనకు తెలియునుకదా. ధర్మం అంటే మన ఇంటిలో గృహిణి తాను వంట చేసే ముందు అందరి కొరకై వండే అన్నముకొరకై తీసే బియ్యములోనుండి ఒక పిడికెడు బియ్యం ప్రక్కన వేరే చోట పెట్టుట, ఆ బియ్యం యాచకులకు పోయుట మనకు తెలియును కదా. అదే ధర్మం. ఆ ధర్మాన్నే భిక్షకులు మననుండి కోరేది. వారి వాటా వారికి ఈయకపోతే పాపం కదా! పూర్వ జన్మలో ధర్మం చేయకే తాను యాచకుడవవలసి వచ్చిందనీ, ఈ జన్మలో మనం ధర్మం చేయక రాబోయే జన్మలో తనవలె యాచకులుగా కాక ఈ జన్మలో ధర్మం చేసి మనం మనంగా వుండేందుకు ప్రయత్నించాలని యాచకుడు మనకు చేస్తున్న బోధగా గ్రహించాలి. మరి మీరేమంటారు?
జైహింద్.

27, నవంబర్ 2008, గురువారం

భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు.

1 comments

భాగవతమును తెలుగులో పద్య గద్య రూపమున అనువదించ బూనిన పోతన భాగవతమును పలుకుటను గూర్చి ఇలా చెప్పాడు.

ఆటవెలది:-
భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు,
శూలికైన తమ్మి చూలికైన.
విబుధ జనుల వలన విన్నంత కన్నంత
తెలియ వచ్చినంత తేట పరతు.

భాగవతాన్ని గూర్చి తెలుసుకొనుట, దానిని గూర్చి పలుకుట ఈశ్వరునకైనను, బ్రహ్మకైనను, చాలా కాష్టము. అట్టి భాగవతాన్ని నేను విన్న దానిని చూచినదానిని, నాకు తెలిసిన దానిని తేట తెల్లము చేయుదును.

అంత కష్ట తరమని చెప్పుతూ చెప్పిన భాగవతమే యింత గొప్పగా మందార మకరంద మాధుర్యాలు నింపుకొన్నదీ అంటే పోతన మదిలో భాగవతం ఇకా ఎంతటి గొప్పగా అమృతోపమానమై నిలిచినదో కదా. అట్టి మహాకవి రచించిన తెలుగు భాగవతం వలన ఎందరు భక్తులు ముక్తినొందారోకదా. సమయం చిక్కినప్పుడల్లా మనం కూడా భాగవతాన్ని హృదయస్థం చెద్దామా.
జైహింద్.

పోతన భాగవత కథా క్రమము. షష్ఠ {ఆరవ } సప్తమ { ఏడవ } స్కంధములు. .

0 comments

శ్రీమద్భాగవతోత్తమ కవి పుంగవుడైన పోతన విరచిత భాగవతము లోని కథా క్రమాన్ని పంచమ స్కంధము వరకు ఇంతకు మునుపు తెలుసుకొని యున్నాంకదా! ఇప్పుడు షష్ఠ, సప్తమ స్కంధాలలోని కథా క్రమాన్ని తెలుసుకొందామా! ఐతే చూడండి.

షష్ఠ { ఆరవ } స్కంధము లోని కథా క్రమము.
ఇష్ట దేవతా ప్రార్థనము.
సుకవి స్తుతి.
షష్ఠ్యంతములు.
అజామిళోపాఖ్యానము.
విష్ణుదూత యమ దూతల సంవాదము.
దక్షుడు స్తుతించిన హంస గుహ్య స్తవరాజము.
నారదుడు శబళాశ్వులకు నివృత్తి మార్గ ముపదేశించుట.
దక్షుడు నారదుని శపించి ప్రజా సర్గ మొనరించుట.
దానవులు దేవతలతో యుద్ధము చేసి దేవతల నోడించుట.
శ్రీమన్నారాయణ కవచము.
వృత్రాసుర వృత్తాంతము.
చిత్రకేతూపాఖ్యానము.శ్రీమద్భాగవతోత్తమ కవి పుంగవుడైన పోతన విరచిత భాగవతము లోని కథా క్రమాన్ని పంచమ స్కంధము వరకు ఇంతకు మునుపు తెలుసుకొని యున్నాంకదా! ఇప్పుడు షష్ఠ, సప్తమ స్కంధాలలోని కథా క్రమాన్ని తెలుసుకొందామా! ఐతే చూడండి.

షష్ఠ { ఆరవ } స్కంధము లోని కథా క్రమము.
ఇష్ట దేవతా ప్రార్థనము.
సుకవి స్తుతి.
షష్ఠ్యంతములు.
అజామిళోపాఖ్యానము.
విష్ణుదూత యమ దూతల సంవాదము.
దక్షుడు స్తుతించిన హంస గుహ్య స్తవరాజము.
నారదుడు శబళాశ్వులకు నివృత్తి మార్గ ముపదేశించుట.
దక్షుడు నారదుని శపించి ప్రజా సర్గ మొనరించుట.
దానవులు దేవతలతో యుద్ధము చేసి దేవతల నోడించుట.
శ్రీమన్నారాయణ కవచము.
వృత్రాసుర వృత్తాంతము.
చిత్రకేతూపాఖ్యానము.
చిత్రకేతుడు తపం బాచరించి భగవత్ ప్రసాదము పొందుట.
చిత్రకేతుడీశ్వర ధిక్కారమున గౌరిచే శాప మొందుట.
సవితృ వంశ ప్రవచనాది కథ.
షష్ఠ స్కంధ కథా క్రమము సమాప్తము.

సప్తమ { ఏడవ } స్కంధములోని కథా క్రమము.
నారాయణుని వైషమ్యాభావమును దెల్పుట.
శ్రీ హరి ద్వార పాలకులకు సనకాదుల వలన శాపము.
బాల వేషము దాల్చి వచ్చిన యముడు దెల్పిన సుయజ్ఞోపాఖ్యానము.
బ్రహ్మ దేవుడు హిరణ్యకశిపునకు వరములిచ్చుట.
ప్రహ్లాద చరిత్ర.
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వివిధోపాయములను హింసించుట.
శ్రీ హరి నరసిం హ రూపమున స్తంభమునందావిర్భవించుట.
నరసిం హమూర్తి హిరణ్యకశిపునితో బోరి, వానిని వధించుట.
బ్రహ్మాది దేవతలు వేర్వేఱ శ్రీ నృసిం హ దేవుని స్తుతించుట.
త్రిపురాసుర సమ్హారము.శ్రీమద్భాగవతోత్తమ కవి పుంగవుడైన పోతన విరచిత భాగవతము లోని కథా క్రమాన్ని పంచమ స్కంధము వరకు ఇంతకు మునుపు తెలుసుకొని యున్నాంకదా! ఇప్పుడు షష్ఠ, సప్తమ స్కంధాలలోని కథా క్రమాన్ని తెలుసుకొందామా! ఐతే చూడండి.

షష్ఠ { ఆరవ } స్కంధము లోని కథా క్రమము.
ఇష్ట దేవతా ప్రార్థనము.
సుకవి స్తుతి.
షష్ఠ్యంతములు.
అజామిళోపాఖ్యానము.
విష్ణుదూత యమ దూతల సంవాదము.
దక్షుడు స్తుతించిన హంస గుహ్య స్తవరాజము.
నారదుడు శబళాశ్వులకు నివృత్తి మార్గ ముపదేశించుట.
దక్షుడు నారదుని శపించి ప్రజా సర్గ మొనరించుట.
దానవులు దేవతలతో యుద్ధము చేసి దేవతల నోడించుట.
శ్రీమన్నారాయణ కవచము.
వృత్రాసుర వృత్తాంతము.
చిత్రకేతూపాఖ్యానము.
చిత్రకేతుడు తపం బాచరించి భగవత్ ప్రసాదము పొందుట.
చిత్రకేతుడీశ్వర ధిక్కారమున గౌరిచే శాప మొందుట.
సవితృ వంశ ప్రవచనాది కథ.
షష్ఠ స్కంధ కథా క్రమము సమాప్తము.

సప్తమ { ఆరవ } స్కంధములోని కథా క్రమము.
నారాయణుని వైషమ్యాభావమును దెల్పుట.
శ్రీ హరి ద్వార పాలకులకు సనకాదుల వలన శాపము.
బాల వేషము దాల్చి వచ్చిన యముడు దెల్పిన సుయజ్ఞోపాఖ్యానము.
బ్రహ్మ దేవుడు హిరణ్యకశిపునకు వరములిచ్చుట.
ప్రహ్లాద చరిత్ర.
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వివిధోపాయములను హింసించుట.
శ్రీ హరి నరసిం హ రూపమున స్తంభమునందావిర్భవించుట.
నరసిం హమూర్తి హిరణ్యకశిపునితో బోరి, వానిని వధించుట.
బ్రహ్మాది దేవతలు వేర్వేఱ శ్రీ నృసిం హ దేవుని స్తుతించుట.
త్రిపురాసుర సమ్హారము.
నారదుడు ధర్మ రాజునకు వర్ణాశ్రమ ధర్మములు దెలుపుట.
ప్రహ్లాదాజగర సంవాదము.
సప్తమ స్కంధము సమాప్తము.

దైవాంశ సంభూతులారా! నా పురాకృత పుణ్య ఫలమున ఆపరమాత్మ యనుగ్రహము వలన మీ దృష్టి లోనికి ఈ కథా క్రమమును తీసుకొనివచ్చు భాగ్యము నాకు కలిగినది. ఆ పరమాత్మకు వేవేల ప్రణతులర్పిస్తూ అతి త్వరలో ఆ దైవానుగ్రహం వలన మిగిలిన కథా క్రమమును మీముందుంచేందుకు ప్రయత్నిస్తాను.
జైహింద్.

మిత్ర ద్రోహీ కృతఘ్నశ్చ . . . మేలిమి బంగారం మన సంస్కృతి 17

3 comments

ఆ ముగ్గురికీ శాశ్విత నరకం ఖాయం:-
మిత్ర అనేది రెండక్షరాల రత్నమని క్రిందటి సారి చాలా గొప్పగా చెప్పుకొన్నాం. అటువంటి మిత్రునికి వీలయితే మేలు చేయాలి. మిత్ర ద్రోహానికి పాల్పడరాదు. అలా మిత్ర ద్రోహానికి పాల్ పడితే దాని ఫలితాన్ని గూర్చి చెప్పబడిందొక శ్లోకంలో. చూద్దామా?
శ్లో. మిత్ర ద్రోహీ కృతఘ్నశ్చ యశ్చ విశ్వాస ఘాతుకః
తే త్రయో నరకం యాంతి యావచ్చంద్ర దివాకరౌ.

గీ. మిత్రులకు ద్రోహ మొనరించు కౄరులకును,
మేలు పొందియు మరచెడి కూళ లకును
నమ్మకము వమ్ము చేసెడి నటకు లకును,
నరక మబ్బును సూర్యు లున్నంత వరకు.

భావము:- మిత్రులకు ద్రోహము చేసెడి మిత్ర ద్రోహులకూ, ఉపకారం పొంది కూడా మరచిపోయే దుష్టులకూ, విశ్వాస ఘాతకులకూ సూర్య చంద్రాదు లున్నంత కాలం నరకంలో ఉండి నరక యాతన పొందక తప్పదు.
చూచారా, ఎంత ఘోర పాపమో. తెలిసి తెలిసీ అలాంటి నరక యాతన కొని తెచ్చుకొంటామా! మిత్ర ద్రోహానికీ, కృతఘ్నతకీ, విశ్వాస ఘాతుకానికీ మనం పాల్పడకుండా ఉంటే సరి. ఆ నరక యాతన మనం పొందవలసిన అవసరముండదు కదా! ప్రయత్న పూర్వకంగా జాగ్రత్త పడదామా మరి?
జైహింద్.

పోతన భాగవత కథా క్రమము. చతుర్థ { నాల్గవ } పంచమ {ఐదవ } స్కంధములు

0 comments

ఇంత వరకు పోతన భాగవతములోని తృతీయ స్కంధము వరకు కథాక్రమాన్ని మనం తెలుసుకొన్నాం కదా1 ఇప్పుడు చతుర్థ , పంచమ స్కంధముల లోని కథా క్రమాన్ని చూద్దామా మరి ?

పోతన భాగవతం లోని చతుర్థ { నాల్గవ } స్కంధములోని కథా క్రమము.
కర్దమ ప్రజాపతి సంతతి వివరణము.
దక్ష ప్రజాపతి సంతతి వివరణము.
ఈశ్వరునకు దక్ష ప్రజాపతికి విరోధము సంభవించుట.
దాక్షాయణి దక్ష ప్రజాపతి యజ్ఞమునకు పోవ గోరుట.
శివుడు వీరభద్రునిచే దక్ష యజ్ఞము ధ్వంసంబు సేయించుట.
దేవతలు వీరభద్రాదులచే పరాజితులై, బ్రహ్మకు విన్నవించుట.
బ్రహ్మాదులు దక్షిణామూర్తి నీశ్వరుని స్తుతించిట.
శివుడు బ్రహ్మాదులచే ప్రార్థితుడై, దక్షాదులననుగ్రహించుట.
దక్షాధ్వరమునకు వచ్చిన నారాయణుని దక్షాదులు స్తుతించుట.
ధ్రువోపాఖ్యానము.
ధ్రువుడు నారదోపదేశము పొంది తపంబు సేయుట.
సాక్షాత్కరించిన భగవంతుని ధ్రువుడు స్తుతించుట.
ధ్రువుండు మరల తన పురంబునకు వచ్చుట.
ధ్రువుడు కుబేరానుచరులైన గుహ్యకులతో యుద్ధము సేయుట.
అంగ పుత్రుడగు వేనుని చరిత్ర.
పృథు చక్రవర్తి గోరూపిణి యగు భూమి వలన నోషధుల బితుకుట.
పృథు చక్రవర్తి యశ్వమేధమున నింద్రు డశ్వము నపహరించుట.
నారాయణుడు పృథు చక్రవర్తి ననుగ్రహించుట.
పృథు చక్రవర్తికి సభా సదులకు సద్ధర్మముల నుపదేశించి, బ్రాహ్మణ ప్రశంస సేయుట.
పృథు చక్రవర్తి యొద్దకు సనకాదు లరుగుదెంచుట.
జ్ఞాన వైరాగ్యవంతుడైన పృథు చక్రవర్తి ముక్తి నొందుట.
రుద్రుండు ప్రచేతసులకు యోగాదేశమను స్తోత్రమును దెల్పుట.
నారదుడు ప్రాచీనబర్హికి జ్ఞాన మార్గమును దెల్పుట.
పురంజనోపాఖ్యానము.
ప్రచేతసుల తపమునకు మెచ్చి భగవంతుడు వరము లిచ్చుట.
చతుర్థ { నాల్గవ } స్కంధము సమాప్తము.

పంచమ { ఐదవ } స్కంధము. ప్రథమాశ్వాసము లోని కథాక్రమము.
ప్రియవ్రతుని చరిత్ర.
భగవంతుడగు నారాయణుడు ఋషభావతార మెత్తుట.
ఋషభుడు పుత్రులకు నీతి యుపదేశించుట.
భరతోపాఖ్యానము.
భరతుడు హరిణ జన్మము విడిచి బ్రాహ్మణుడై జనించుట.
వృషల రాజ భృత్యులు భరతుని కాళీ బలికి గొనిపోవుట.
భరతుడు రహూగణుని మాటలకు బ్రత్యుత్తరములిచ్చుట.
పంచమ స్కంధము లోని ప్రథమాశ్వాసము సమాప్తము.

పంచమ { ఐదవ } స్కంధము ద్వితీయాశ్వాసములోని కథా క్రమము.
ఉపదేశ రూపమున శుకయోగి దెల్పు భూగోళ నిర్ణయము.
భగణ విషయము.
శుకయోగి పరీక్షిత్తునకు దెలిపిన నరక లోక వర్ణన.
పంచమ స్కంధములోని ద్వితీయాశ్వాసము సమాప్తము.

పరమ భాగవతోత్తములకు ప్రీతి కరమగునని నే చేయుచున్న ఈ ప్రయత్నమున దొసగులు పొసవిన సహృదయతతో మన్నించి సరి చూచుకొన వలసినదిగా మనవి చేయుచున్నాను. సమయము భగవంతుడు కల్పించినప్పుడు మిగిలిన విషయమును మీ ముందుంచగలవాడను.
జైహింద్.

న మాతరి న దారేషు . . . మేలిమి బంగారం మన సంస్కృతి 16

0 comments

మిత్రుడే నిజంగా గొప్పవాడు:-
ఈ ప్రపంచంలో ప్రతీ వ్యక్తికీ తన బంధు వులపైఎంత ప్రేమవున్నా నమ్మకం మాత్రం మిత్రుల పైనే ఎక్కువగా వుంటుంది. ఇది మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఈ క్రింది శ్లోకాన్ని చూద్దామా!
శ్లో. న మాతరి న దారేషు న సోదర్యో నచాత్మజే
విశ్వాసః తాదృశః పుంసాం యావన్ మిత్రే స్వభావజే.

ఆ. తల్లి, దండ్రి కంటె తనయుని కంటెను
భార్య కంటె తనదు భగిని కంటె
తృప్తి నొసగు వాడు మిత్రుడే యని నమ్ము
పురుషులెపుడు కూడ పుడమి పైన.

భావము:- పురుషులెప్పుడూ కూడా తన తల్లిదండ్రుల కంటే, తన సంతానమును కంటే, తన భార్య కంటే, తన సోదరి కంటే కూడా తనకు మిత్రుడే తృప్తిని కలిగిస్తాడని నమ్ముతుంటాడు.
చూచాం కదా మిత్రుని గూర్చి ఎలా చెప్పాడో. అందువలననే మరో చోట కవి ఏమన్నాడో చూద్దామా.
శ్లో. శోకారాతి భయ త్రాణం ప్రీతివస్రంభభాజనం
కేన రత్నమిదం సృష్టం మిత్రమిత్యక్షర ద్వయం.

ఆ. దుఃఖ భయములున్న దూరము చేయును
శత్రు భయము బాపు నాత్రముగను.
మిత్రుడన్న వాడు మేలునే కోరును.

ఇట్టిమిత్ర రత్న మెవరి సృష్టి?
భావము:- మిత్రుడనే వాడు దుఃఖాన్ని, భయాన్ని, శతృ భయాన్ని, పారద్రోలి రక్షిస్తూ వుంటాడు. అతడు నిజంగా రత్నమే. అట్టి రత్నాన్ని ఎవడు సృష్టించాడో కదా!
ఎంత బాగా మిత్ర అనే రెండక్షరాల్ని నిర్వచించాడో చూచారా! మనమూ మిత్ర ధర్మాన్ని పాటించి సన్మిత్రులుగా వెలుగొందుదామా!
జైహింద్.

26, నవంబర్ 2008, బుధవారం

పోతన భాగవత కథా క్రమము ద్వితీయ {రెండవ} తృతీయ { మూడవ } స్కంధములు

2 comments

మనం పోతన భాగవతం లోని ప్రథమ స్కంధం లోని కథా క్రమమును తెలుసుకొన్నాం. ఇప్పుడు ద్వితీయ{రెండవ,} తృతీయ { మూడవ } స్కంధముల లోని కథా క్రమాన్ని తెలుసుకొందామా మరి.

పోతన భాగవతము ద్వితీయ { రెండవ } స్కంధము లోని కథా క్రమము:-
శుకుడు పరీక్షితునకు ముక్తి మార్గమును దెలుపుట.
భక్తి మార్గమే ముఖ్యమని శుకుడు పరీక్షితునకు దెలుపుట.
ప్రపంచ ప్రకారమును గూర్చి నారదుడు బ్రహ్మ నడుగుట.
శ్రీమన్నారాయణుని లీలావతారముల వర్ణన
ప్రపంచోద్భవము మొదలైన వానిని గురించి పరీక్షితుడు శుక యోగినడుగుట.
నారాయణుడు బ్రహ్మ తపమునకు మెచ్చి వరములిచ్చుట.
ద్వితీయ { రెండవ } స్కంధము సమాప్తము.

తృతీయ { మూడవ } స్కంధము లోని కథా క్రమము:-
విదురుని తీర్థ యాత్ర.
విదురుడుద్ధవుని గని కృష్ణాదుల వృత్తాంతమడుగుట.
విదుర మైత్రేయుల సంవాదము.
పంకజ భవునిజన్మ ప్రకారము.
బ్రహ్మ కృత నారాయణ ప్రార్థనము.
బ్రహ్మకు శ్రీమన్నారాయణుని కర్తవ్యోపదేశము.
కమల సంభవుని మానస సర్గము.
బ్రహ్మ నిర్మితమైన దశవిధ సర్గములు.
కాల లక్షణ నిరూపణము.
మైత్రేయుడు విదురునకు సృష్టి మహిమ వివరించుట.
స్వాయంభువ మనువు ప్రజా వృద్ధి చేయుట.
శ్రీ యజ్ఞ వరాహావతార వర్ణనము.
బ్రహ్మాదులు శ్రీ యజ్ఞ వరాహ మూర్తిని స్తుతించుట.
మైత్రేయ మహాముని విదురునకు హిరణ్యాక్ష హిరణ్య కశిపుల వృత్తాంత మెఱిగించుట.
కశ్యపుడు భార్య సంతాపము తీర్చుట.
సనక సనందనాదులు వైకుంఠమునకరుగుట.
జయ విజయులకు సనక సనందనాదులు శాపమిచ్చుట.
సనకాదులు భగవన్నారాయణుని స్తుతించుట.
ముని వరులకు గోవిందుని ఉద్బోధ.
భగవంతునికి ముని వరుల వినతి.
లక్ష్మీ కాంతుడు జయ విజయులను ఊరడించుట.
జయ విజయులు దితికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులై పుట్టుట.
హిరణ్యాక్షుడు యజ్ఞ వరాహమగు హరి నెదిరించి పోరుట.
చతుర్ముఖుడొనర్చు యక్షాది దేవతా గణ సృష్టిని దెలుపుట.
కర్దముడు భగవదనుజ్ఞ వడసి దేవహూతిని పెండ్లి యాడుట.
స్వాయంభువుని కన్యాన్వేషణ ప్రయాణము.
దేవహూతి గర్భమున విష్ణుడు గపిలాచార్యుడుగా బుట్టుట.
దేవహూతి పుత్రుడైన కపిలునిచే దత్వ జ్ఞానము వడయుట.
కపిలుడు దేవహూతికి భక్తి యోగమును దెలియ జేయుట.
కపిలుడు దేవహూతికి పిండోత్పత్తి క్రమమును తెలియ జేయుట.
గర్భస్థుండగు జీవుండు భగవంతుని స్తుతించుట.
తృతీయ స్కంధము సమాప్తము.

మిగిలిన భాగములు దైవ కృపతో త్వరలో మీముందుంచే ప్రయత్నం చేయగలను.
జైహింద్.

పోతన భాగవత కథా క్రమము. ప్రథమ స్కంధము.

3 comments

మనలో చాలామందికి భారత భాగవత రామాయణాలలో మంచి పరిచయం ఉన్నప్పటికీ ఒక్కొక్క మాటుఏ కథ ఎందులోది, ఏ కథ తరువాత ఏకథ, అనే సందేహాలు రావడం సర్వ సామాన్యం. ఏ మహాకావ్యంలో కథైనా ఆద్యంతమూ గుర్తుండాలి అంటే అది కొంచెం కష్ఠసాధ్యమే. నాకనిపిస్తుంది భారత భాగవత రామయణాలలోని కథలు క్రమం తప్పకుండా తెలిస్తే బాగుండునని. నాలాగే ఎవరి కొరకయినా పనికిరాకపోతుందా అని ఆలోచించి ముందుగా పోతన భాగవతం లోని కథా క్రమాన్ని చూపదలచుకొన్నాను.

శ్రీ కైవల్య పదంబు చేరిటకునై పోతన చింతించిన ఆ పరమాత్మకు మనసారా నమస్కరిస్తూ, పరమ భాగవతోత్తములకు అంజలించుతూ, దోషములున్న సహృదయతతో మన్నించి, పఠించ వలసినదిగా పాఠకులను ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాను.

శ్రీమదాంధ్ర భాగవతము. - ప్రథమ {ఒకటవ }స్కంధము.:-
పీఠిక లో
ఈశ్వర, బ్రహ్మ, గణపతి, సరస్వతీ, దుర్గా, లక్ష్మీ, కవిజన ప్రార్థనలు.
కృతిపతి నిర్ణయము, శ్రీ రామ సాక్షాత్కారము, కృతి కర్తృ వంశ వర్ణన, షష్ట్యంతములు.

ప్రథమ స్కంధము:-
కథా ప్రారంభము.
సూతుని నారాయణ కథా ప్రశంస.
భగవంతుని ఇరువదియొక అవతారములు.
శ్రీ మహా భాగవత రచనాది వృత్తాంతము.
వ్యాసుడు వ్యాకుల చిత్తముతో చింతించుట.
వ్యాసుని కడకు నారదుని ఆగమనము.
నారదుని పూర్వ జన్మ వృత్తాంతము.
అర్జునుడు పుత్ర ఘాతియైన యశ్వత్థామ నవమానించుట.
ద్రౌపదీ అశ్వత్థామల సంభాషణ.
ఉత్తరా గర్భస్థుండైన యర్భకుని శ్రీకృష్ణుడు రక్షించుట.
కుంతీదేవి శ్రీ కృష్ణుని స్తోత్రము చేయుట.
ధర్మజుడు శ్రీకృష్ణ సహితుడై శర తల్ప గతుడైన భీష్ముని కడకేగుట.
భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించుట.
శ్రీ కృష్ణుడు ద్వారకా నగరమున కేగుట. శ్రీ కృష్ణుడు ద్వారక నగరము ప్రవేశించుట.
శ్రీకృష్ణుడు అంతః పుర కాంతలను జూడ బోవుట.
ఉత్తరకు పరీక్షిత్తు జనించుట.
గాంధారీ ధృతరాష్ట్రుల దేహ త్యాగము
ధర్మజుడు దుర్నిమిత్తములను గని చింతించుట.
అర్జునుడు ద్వారక నుండి వచ్చి కృష్ణుని నిర్యాణము దెలుపుట.
ధర్మ రాజు పరీక్షితునకు పట్టము గట్టి మహా ప్రస్థానమునకు వెళ్ళుట.
కలి పురుషుడు ధర్మ దేవతను తన్నుట.
పరీక్షిన్మహారాజు కలిని గ్రహించి, ధర్మ పరిపాలనము చేయుట.
వేటకు వెళ్ళిన పరీక్షిత్తు శమీకునిపై మృత సర్పమునెత్తి వేచుట.
శమీక పుత్రుడగు శృంగి పరీక్షితును శపించుట.
విప్ర శాపమెఱిగి పరీక్షితుడు ప్రాయోపవిష్టుడగుట.
శుక మహర్షి పరీక్షిన్మహారాజునొద్దకేతెంచుట.
ప్రథమ స్కంధము సమాప్తము.

ద్వితీయ స్కంధములోని అంశములను భగవంతుడు అవకాశము కల్పించినపుడు తప్పక మీ ముందుంచగలను.
జైహింద్.





ఆష్టా దశ పురాణాల పేర్లు

1 comments

మనము పురాణములు 18 అని చెప్పుతుంటాం. వాటినే అష్టా దశ పురాణములు అంటుంటాం. ఐతే ఈ పద్ధెనిమిది పురాణాలూ ఏవేవో పేర్లు చెప్పమంటే మాత్రం తటపటాయిస్తాం. ఆ సమస్య తీరాలంటే మనం ఈ క్రింది శ్లోకాన్ని కంథస్థం చేయవలసిందే. ఆ శ్లోకాన్ని చూద్దామా1

శ్లోకము:-
మద్వయం, భద్వయంచైవ
భ్ర త్రయం వ చతుష్టయం.
అ .నా . పద్ . లిం . గ . కూ . స్కా . ని
పురాణ్యష్టాదశా స్మృతా !

తేటగీతి:-
మద్వయము భద్వయము మన మదిని గాంచ.
భ్ర త్రయము వ చతుష్టయం పరగు నరయ
గా, అ . నా . పద్మ . లిం . గ . కూ . స్కా . లనంగ
పద్ధెనిమిది పురాణముల్ పరగుచుండె.

తేటగీతి:-
మ . మ . భ . భ . భ్ర . భ్ర . భ్ర . వ . వ . వ . వ . మరల చూడ
గా, అ . నా . పద్మ . లిం . గ . కూ . స్కా . లనంగ
పద్ధెనిమిదిపురాణముల్ పరగు చుండె.
వ్యాసు డద్భుత శక్తితో వరల జేసె.

గమనిద్దామా!
మద్వయము = రెండు మాలు
1. మత్స్య పురాణము,
2. మార్కండేయ పురాణము.

భ ద్వయము = రెండు భాలు
1. భాగవత పురాణము.
2. భవిష్యత్ పురాణము.

భ్ర త్రయం = మూడు భ్రాలు
1. బ్రహ్మాండ పురాణము.
2. బ్రాహ్మ పురాణము.
3. బ్రహ్మ వైవర్త పురాణము.

వ చతుష్టయము = నాలుగు వాలు.
1. వామన పురాణము.
2. వాయవ్య పురాణము.
3. వైష్ణవ పురాణము.
4. వారాహ పురాణము.

అ = అ. > అగ్ని పురాణము.
నా = నా > నారద పురాణము.
పద్ = పద్ > పద్మ పురాణము.
లిం = లిం > లింగ పురాణము.
గ = గ > గరుడ పురాణము.
కూ = కూ > కూర్మ పురాణము.
స్కా = స్కా > స్కాంద పురాణము.
తెలుగు వారిమైన మనం పురాణాల పేర్లు ఎవరయినా అడిగితే ఠక్కున చెప్పెయ్య గలుగుతాం పై శ్లోకాన్ని కాని పద్యాన్ని కాని కంఠస్థం చేయగలిగితే. కంఠస్థం చేద్దామా మరి?
జైహింద్.

ప్రథమ వయసి పీతం తోయమల్పం స్మరంతః . . . మేలిమి బంగారం మన సంస్కృతి 15

0 comments

ప్రకృతి నుండి నేర్చుకో వలసిన కృతజ్ఞతా గుణం:-
ఈ నాడు మనం ఎందరినో చూస్తున్నాం. నేను వాడికెంత ఉపకారం చేశానో. వాడికస్సలు విశ్వాసం లేదు. అంటూ వాపోతుంటారు. అలా జీవితంలో ప్రతీ ఒక్కడూ ఎప్పుడో ఒకప్పుడు మదన పడడం మనం చూచినప్పుడు మనకి కూడా అయ్యో పాపం అనిపిస్తుంది.
మనం వీలయితే ఇతరులకు ఉపకారంచెయ్యాలి. అది మానవుడై పుట్టిన వాని కనీస ధర్మంగా సహృదయులు భావిస్తారు. ఐతే అది మానవ ధర్మం మాత్రమే. మానవ కనీస కర్తవ్యం ఒకటుంది. అది ఏమిటంటే ఎవరయినా తనకు ఏమాత్రం చిన్న ఉపకారం చేసినా దానిని జీవితాంతం మరిచిపోకూడదు. అంతే కాదు. వీలున్నప్పుడల్లా వారికి ధర్మ బద్ధంగా ప్రత్యుపకారం చేస్తూనే ఉండాలి. ఈ విషంలో ఒక చక్కని శ్లోకముంది. చూద్దామా!
శ్లో. ప్రథమ వయసి పీతం తోయమల్పం స్మరంతః
శిరసి నిహిత భారా నారికేళా నరాణాం.
సలిలమమృత కల్పం దద్యు రాజీవితాంతం
నహి కృతముపకారం సాధవో విస్మరంతి.

గీ. చిన్న తనమున త్రాగిన చిన్న పాటి
నీటి విషయము మరువకేనాటివరకు
బ్రతుకునన్నాళ్ళు మ్రోయుచు, ఫలములిచ్చు
మేలు మఱువక సతతము మేలు చేయు.

ఉ. కొబ్బరి చెట్టు, చిన్నపుడు గోముగ నీటిని పోసి పెంచె నా
డబ్బురమంచు, పొంగి మది, హాయి నొసంగు జలంబులిచ్చు తా
నిబ్బరమున్ ఫలంబులను నిత్యముమోయుచు. మానవాళికిన్.
అబ్బు కృతజ్ఞతన్ సతము హాయినొసంగుట. సజ్జనాళికిన్.

భావము:- కొబ్బరి మొక్కను నాటి మనము నీరు పోసి పెంచినందుకు ఆ కొబ్బరి మొక్క చెట్టయి , చిన్నతనములో తనకు తీయని నీరు పోసి పెంచినారు అనే కృతజ్ఞతా భావంతో తాను బ్రతికున్నన్నాళ్ళూ బరువయిన తీయని నీటితో కూడిన కొబ్బరి కాయలను తలపై పెట్టుకొని మ్రోయుచూ మానవాళికి తాను పొందిన ఉపకారానికి ప్రత్యుపకారంగా అందజేస్తుంది. ఎవరయినా ఏ చిన్నపాటి మేలు తనకు చేసినా బ్రతికున్నన్నాళ్ళూ కృతజ్ఞతా భావం కలిగి ప్రత్యుపకారం చేయడమన్నది సజ్జనాళికి అబ్బును కదా!
కృతజ్ఞత, ప్రత్యుపకార బుద్ధి, అందరిలోనూ ఉన్ననాడు ఎవరికీ ఎట్టి బాధా కలిగించకుండా మనం కూడా సంతోషంగా హాయిగా బ్రతుక వచ్చును కదా! మరి మనం కూడా మనలోని సద్ గుణాల్ని పెంచుకొందామా?
జైహింద్.

25, నవంబర్ 2008, మంగళవారం

పోతన గారి మత్తేభం.

2 comments

సహజ పాండిత్యుడు శ్రీ బమ్మెర పోతన మహాకవి తాను విరచించే భాగవతాఖ్య కల్ప తరువు ఏ విధంగా వెలయునో మత్తేభంలో ఈ క్రింది విధంగా వివరిస్తున్నాడు. చూద్దామ్మా!

శ్రీమదాంధ్ర మహా భాగవతము పీఠికలో 22 వ పద్యము.
మత్తేభము:-
లలిత స్కంధము, కృష్ణ మూలము, శుకాలాభిరామంబు, మం
జు లతాభి శోభితము, సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్వల వృత్తంబు, మహా ఫలంబు, విమల వ్యాసాలవాలంబునై,
వెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజ శ్రేయమై.

రూపకాలంకార శోభితమైన ఈ మత్తేభం వృక్షాల్ని పెకలించే తన నిజ స్వభావాన్ని వీడి, తానే దీనిని కల్ప వృక్షంగా ప్రతిపాదిస్తూ, హొయలొలికే చక్కని నడకతో భాగవతాన్ని గూర్చి వివరించింది. మావటీడు పోతనకదా! మత్తేభం మరి నడవకేమి చేస్తుంది?
ఇంత అద్భుతమైన పద్యాన్ని కంఠస్థం చేసి తీరవలసిందే. మరిమనమూ కంఠస్థం చేద్దామా!
జైహింద్.

సాక్షరా విపరీతాశ్చేత్మే . . . లిమి బంగారం మన సంస్కృతి 14

0 comments

సాక్షరా శ్యులంత సరస వర్తులు కారు.:-
మనం లోకంలో ఎందరినో విద్యా వంతులను చూస్తున్నాం. విద్యా విహీనులనూ చూస్తున్నాం. గుణ వంతులను చూస్తున్నాం. గుణ హీనులనూ చూస్తున్నాం. సరసులను చూస్తున్నాం. రస హీనులను చూస్తున్నాం. విద్యా వంతులైన జ్ఞానులను చూస్తున్నాం. విద్యా వంతులైన జ్ఞాన హీనులను చూస్తున్నాం. విద్యా విహీనులైన జ్ఞాన వంతుల్ని చూస్తున్నాం. విద్యా విహీనులైన మూర్ఖుల్ని చూస్తున్నాం.
విద్యా విహీనుడైనవాడు మూర్ఖు డవడంలో అర్థం లేకపో లేదు. కాని విద్యావంతుడు మూర్ఖు డవడంలో అర్థం లేదు. ఈ విషయంలో ఒకసంస్కృత శ్లోకం గుర్తుకు వస్తోంది. చూద్దామా!
శ్లో. సాక్షరా విపరీతాశ్చేత్ రాక్షసా యేవ కేవలం.
సరసో విపరీతో2పి సరసత్వం నముంచతి.

గీ. సాక్షరాశ్యులు శృతి మించి రాక్షసాన
వెనుక మార్గము పట్టుట కనగ నుండె.
సరస వర్తులు సతతము సరసులుగనె
యుండు చూచిన. కనుడిది నిండు మదిని.

భావము:- సాక్షరాశ్యులు = అక్షర జ్ఞానము కలవారు = విద్యా వంతులు అని మనం గ్రహించినట్లయితే అట్టి వారు తమజ్ఞానాన్ని సద్వినియోగం చేస్తే సమాజానికి చాలా మేలు జరుగు తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఐతే ఆ అక్షరాశ్యులే తమ విపరీతమయిన తెలివినుపయోగించుకొని విపరీత పోకడలతో ప్రవర్తించినట్లయితే అది సమాజానికి ఎనలేని కీడు కలిగిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు రాక్షసులే.
దీనినే కవి చమత్కరించి " సాక్షరా " తిరగ బడితే అంటే వెనుకనుండి చదివినట్లయితే 

 " రాక్షసా " { సాక్షరా ; =  రాక్షసా } అని అవుతుందని చమత్కరించడం ఒక ఎత్తయితే,
సరస హృదయులు ఎప్పుడూ స్థిర స్వభావులుగా వుంటారని చెప్పడంలో మరో చమత్కారాన్ని కనబరచడం జరిగింది. గమనించండి. " సరస  = సరస " ఏవిధముగ చూచినను, ఏవిధముగ వెనుకనుండి ముందుకైనా, ముందు నుండి వెనుకకైనా చదివిననూ మార్పు వుండదు. సరసుడయిన వాని స్థిర స్వభావం అటువంటిది.అని చెప్పడం మరొకెత్తు.
దీనిని బట్టి మనం సమాజానికీ మనకీ మంచినే కాంక్షిస్తాం కాబట్టి సరసత్వముగల సాక్షరాశ్యులుగా వెలుగొందేందుకు ప్రయత్నిద్దామా మరి?
జైహింద్.

24, నవంబర్ 2008, సోమవారం

పోతన భాగవత పీఠిక లోని ప్రార్థన పద్యములు

2 comments

శ్రీ కైవల్య పదమును చేర్చ గలిగినది భక్తి మార్గమొక్కటే. అట్టి భక్తి మార్గమును సహజ పాండిత్యుడు శ్రీ బమ్మెర పోతనామాత్యుడు తన భాగవత రచన ద్వారా అమృతోపమానంగా మన కందించాడు. ఆ పోతన భాగవతం లోని పీఠికలోని పద్యములు నిత్య పారాయణ యోగ్యములు. అవి అందరికీ అందుబాటులో ఉండడం కొరకు
ఈ ఆంధ్రామృతంలో నిక్షిప్తం చేస్తున్నాను.

పీఠికలోని ఇష్ట దైవ ప్రార్థనలు.
శ్రీ మహా విష్ణువు ప్రార్థన.
శార్దూలము:-
శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోకర
క్షైకారంభకు, భక్త పాలన కళా సమ్రంభకున్, దానవో
ద్రేక స్తంభకు, గేళి లోల విలసద్దృగ్జాల సంభూతనా
నాకంజాత భవాండ కుంభకు, మహా నందాంగనా డింభకున్.

ఈశ్వర ప్రార్థన
ఉత్పలమాల:-
వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్, దయా
శాలికి, శూలికిన్, శిఖరిజాముఖ పద్మ మయూఖ మాలికిన్,
బాల శశాంక మౌళికి, గపాలికి, మన్మథ గర్వ పర్వతో
న్మూలికి, నారదాది మును ముఖ్య మనస్సరసీరుహాళికిన్.

బ్రహ్మ ప్రార్థన.
ఉత్పలమాల:-
ఆతత సేవ జేసెద సమస్త చరాచర భూత సృష్టి వి
జ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, వేదరాశి ని
ర్ణేతకు, దేవతా నికర నేతకు, గల్మష జేతకున్, నత
త్రాతకు, ధాతకున్, నిఖిల తాపస లోక శుభ ప్రదాతకున్.

గణపతి ప్రార్థన.
ఉత్పలమాల:-
ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సం
పాదికి, దోష భేదికి, బ్రపన్న వినోదికి, విఘ్న వల్లికా
చ్ఛేదికి, మంజు వాదికి, నశేష జగజ్జననంద వేదికిన్
మోదక ఖాదికిన్, సమద మూషక సాదికి, సుప్రసాదికిన్.

సరస్వతీ ప్రార్థన.
ఉత్పలమాల:-
క్షోణి తలమ్మునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు. సైకత
శ్రోణికి, జంచరీక చయ సుందర వేణికి, రక్షితామర
శ్రేణికి, దోయ జాత భవ చిత్త వశీకరణైక వాణికిన్,
వాణికి, నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.

శార్దూలము:-
పుట్టం బుట్ట , శరంబునన్ మొలవ, నంభోయాన పాత్రంబునన్,
నెట్టం గల్గను, గాళి గొల్వను, బురాణింపన్ దొరంకొంటి, మీ
దె ట్టేవెంట జరింతు, దత్ సరణి నాకీవమ్మ! యో యమ్మ! మేల్
పట్టున్ నా కగుమమ్మ ! నమ్మితి జుమీ, బ్రాహ్మీ! దయాంభోనిధీ.!

ఉత్పలమాల:-
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషారఫేన రజతాచల కాశ ఫణీశ కుందమం
దార సుధా పయోధి సితి తామర సామర వాహినీ శుభా
కారతనొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ!

ఉత్పలమాల:-
అంబ! నవాంబుజోజ్వల కరాంబుజ! శారద చంద్ర చంద్రికా
డంబర చారుమూర్తి! ప్రకటస్ఫుట భూషణ రత్న దీపికా
చుంబిత దిగ్విభాగ! శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ! భా
వాంబర వీధి విశ్రుత విహారిణి! నన్ గృప జూడు భారతీ!

దుర్గాదేవి ప్రార్థన.
ఉత్పలమాల:-
అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె
ద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చిన యమ్మ, దన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ, మా
యమ్మ, కృపాబ్థి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.

లక్ష్మీదేవి ప్రార్థన.
మత్తేభము:-
హరికిన్ బట్టపు దేవి, పున్నెములప్రో వర్థంపు బెన్నిక్క, చం
దురు తోబుట్టువు,భారతీ గిరిసుతల్ దో నాడు పూబోడి, దా
మరలన్ దుండెడి ముద్దరాలు, జగముల్ ,మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్.

కృతి పతి నిర్ణయము.
ఊత్పలమాల:-
ఇమ్మనుజేశ్వరాథములకిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములు కొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి, కాలుచే
సమ్మెట వ్రేటులంబడక సమ్మతితో హరికిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్.

చూచారు కదా! ఎంత అద్భుతమైన భక్తిభావ పూరితమైన పద్యాలో . మళ్ళీ అవకాశం కుదిరినప్పుడు మరికొన్ని మంచి విషయాలను అందిచే ప్రయత్నం చేయించగలడా పరమాత్మ.
జైహింద్.

సదయం హృదయం యస్య . . . మేలిమి బంగారం మన సంస్కృతి 13

0 comments

కలి పురుషుడు కన్నెత్తైనా చూడడానికి వీలు పడని మహాపురుషులు:- 
సమాజంలో కలి ప్రభావానికి లొంగనివా రుండరనుకొంటాం. యిది చాలా నిజమే. ఐతే కలి ప్రభావానికి లొంగనివారు కూడా వున్నారట మనలో. ఎవరా కాలి కల్మష దూరులో తెలుసుకొందామా మనం. ఈ క్రింది శ్లోకాన్ని చూస్తే మనకా విషయం తెలుస్తుంది.
శ్లో. సదయం హృదయం యస్య భాషితం సత్య భూషితం
కాయః పర హితో యస్య కలిస్తస్య కరోతి కిం.

గీ. సదయ హృదయంబు కలవాని సన్నుతాత్ము
సత్య భాషా విభూషితు సరస మతిని
పర హితార్ధంబు వర్తించు భవ్యు నెపుడు
కలి సమీపింప నేరడు. కరుణ జూపు.

భావము:- ఎవని హృదయము దయా పూరితమో, ఎవని పలుకులు సత్య భూషితములో, ఎవని దేహము పర హితైక ప్రయోజనమో, అట్టీ వానిని కలి యేమియూ చేయలేడు.
కలి ప్రభావము మనపై కూడా పడకూడదనుకొంటే మనము కూడా పైన చెప్పిన మంచి లక్షణములను పెంపొందించుకోవలసి వుంది. కాబట్టి మనమూ ప్రయత్నిద్దమా ?
జైహింద్.

ఆరోప్యతే శిలా శైలే . . . మేలిమి బంగారం మన సంస్కృతి 12

0 comments


మంచీ - చెడూ.
పుట్టినప్పుడు అందరం అకళంక హృదయులమే. కొంచెం జ్ఞానం వచ్చిన పిదప మనం మంచిగా సంతోషంగా బ్రతకాలనుకొంటాం. కాలక్రమేణా మనలో మంచీ చెడ్డా ప్రవేశిస్తాయి. సుఖంగా బ్రతకాలనే తపన కూడా మొదలౌతుంది. స్వార్ధం మనను క్రమ్ముకొన్న తరువాత మనం ఏం చేస్తున్నామో మంచో చెడో తెలిసికొన లేని మాయ మనల్ని ఆవరిస్తుంది. మంచి నేర్చుకోవడం చాలా దుష్కరంగా వుంటుంది. చేడ్డ ఆశించక ముందే మనల్ని ఆవరిస్తుంది. ఈ క్రింది శ్లోకాన్ని చూద్దామా మనం.

శ్లో. ఆరోప్యతే శిలా శైలే యత్నేన మహతా యథా
నిపాత్యతే క్షణేనా2ధః తథాత్మా గుణ దోషయోః !

గీ. పర్వతము పైకి శిల మోయు పగిది, మంచి
నరయు టెన్నగ కష్టంబు నరుని కిలను.
పర్వతము నుండి త్రోయగ పణుకు వోలె.
సులభముగ చేరు మదు లందు మలిన బుద్ధి.
భావము:- వద్దన్నా వచ్చి చేరేది చెడ్డ బుద్ధి. ఎంత ప్రయత్నించినా అలవరచు కొనుటకు సులభముగా వంట పట్టనిది మంచి బుద్ధి.
ఒక ఎత్తైన కొండ పైకి ఒక బండ రాయిని మోసుకొని పోవుట ఎంత కష్టమో మంచి నేర్చుకొనుట అంత కష్టము. ఆట్టి బండ రాయిని కొండ పైనుండి క్రిందికి త్రోసివేయుట ఎంత సులభమో చెడు నేర్చుకొనుట అంత సులభము. హృదయం లోనికి చెడు ప్రవేశించడం మొదలెడితే కొండమీది నుండి క్రిందికి జారి పడుతున్న బండ రాయి వలె వద్దన్నా వదలకుండా మనల్ని ఆక్రమిస్తుంది.
ఇది తెలుసుకొనిన మనం మనలో ప్రవేశించడానికి సిద్ధంగానున్న చేడ్డ విషయంలో యెలా జాగ్రత్త పడాలో ఎంతో సాధన చేస్తేనే కాని అలవడని మంచి గ్రహించే విషయంలో ఎలా ప్రవర్తించాలో తెలివి కలిగి మసలుకోక తప్పదు కదా! ఆలోచించుకొని సాధన చేద్దామా మరి ?
జైహింద్. 

22, నవంబర్ 2008, శనివారం

చితా, చింతా ద్వయోర్మధ్యే . . . మేలిమి బంగారం మన సంస్కృతి 11

4 comments

చితి - చింతల తారతమ్యం.

మానవులు ఎంత భోగ భాగ్యాలతో తులతూగుతున్నా కొందరిలో ఏదో తెలియని లోటు, ఏదో తెలియని విచారం, అంతుచిక్కని ఆలోచనలు, వాటి వలన వారు కృంగిపోవడం మనం గమనిస్తుంటాం. ఈ విషయంలో ఈ క్రింది శ్లోకాన్ని పరిశీలిద్దాం.
శ్లో. చితా, చింతా ద్వయోర్మధ్యే
చింతా నామ గరీయసీ.
చితా దహతి నిర్జీవం
చింతా ప్రాణ యుతం వపుః !

క. చితికిని చింతకు నడుమన
చితి కన్నను చింత గొప్ప. జీవము పోవన్
చితి కాల్చును భౌతికమును,
బ్రతికుండగ కాల్చు చింత. పరికించుడయా !

భావము:- భూమిపై చితి కన్నా చింత గొప్పది. చితి జీవము పోయిన పిదప మాత్రమే మన శరీరమును దహించును. చింత ఆవిధముగా కాక అది బ్రతికుండగనే మానవుని దహించివేయును.
మనము చేయ గలిగినదీ, చేయదగినదీ ఒక్కటే. శక్తి వంచన లేకుండా న్యాయ బద్ధంగా కృషి చేయడం. ప్రాప్తించిన దానితో తృప్తి పడడం. అలా వుంటే మనలను చింత అన్నదే సమీపించదుకదా !. ఆరోగ్యంగా, హాయిగా వుండగలుగుతాం కదా ! అందుకని అలా చేయడానికి ప్రయత్నిద్దామా మరి?
జైహింద్.

మంగిపూడి సుబ్బ లక్ష్మి గారి మహనీయ కార్యక్రమం.

0 comments

















































































ఈ నెల (నవంబరు 2008) 14 వ తేదీన శ్రీ న్నమాచార్య సంగీత పీఠం, చొడవరం, (విశాఖపట్నం జిల్లా) లో " కలహ క్షేత్రంలో నారదుని పాత్ర " అనే అంశంపై డా. యన్. రాజేశ్వరీ శంకరం (విశాఖ పట్నం) గారి చే సుదీర్ఘమైన ఉపన్యాసం యివ్వబడింది.
శ్రీమతి యన్. రాజేశ్వరి గారు ఆంధ్ర విశ్వ విద్యాలయం ద్వారా పి.హెచ్. డి. సాధించిన మొట్ట మొదటి మహిళ అవడం ఒక ప్రత్యేకత అయితే ఆ పి.హెచ్.డి. లో బంగారు పథకమును ఈమె కైవసం చేసుకోవడం రెండవ ప్రత్యేకత. ఈ సందర్భంగా తీయబడిన ఛాయా చిత్రాలను మీ ముందుంచగలిగాను.

ఈ మహిళా మణి ప్రసంగానంతరం ఆమెపై నేను ఆశువుగా చెప్పిన ప్రసంసా పూర్వక పద్యములు.
శార్దూలము:-
శ్రీ రాజేశ్వరి వాక్ ప్రవాహ మహిమా చిద్రూప గాంభీర్యముల్
పారంబంటిన పాండితీ గరిమయున్, భాస్వంత సద్ రూపమున్,
ధీరోదాత్తుడు నారదుండె యనగన్ తెల్పేటి యా పల్కులున్,
ధారా శుద్ధియు మాకు తృప్తి గొలిపెన్. ధన్యాత్మవీవమ్మరో!

ఆటవెలది:-
కాల యవను గూర్చి కమ్మగా చెప్పిరి,
నహుషు గూర్చి చెప్పి నయత దెల్పి,
వినిచిరిట జలంధరుని గూర్చి వివరించి
కంశు గూర్చి దెల్పె కమ్మగాను.

ఆటవెలది:-
సవివరముగ జెప్పె జాబాలి కథ మీరు,
దుష్ట యోధు గూర్చి దుమ్ము దులిపి
గయుని వృత్తమిపుడు ఘనముగా తెలిపిరి
యుగ యుగాలలోని సొగసు దెలిఓ.

ఉత్పలమాల:-
నారద వృత్తమే ప్రణవ నాదముగా వివరించి చెప్పి మా
కోరిక తీర్చినారు కడు కూర్మిజి. మా మహనీయ భాగ్యమే
చేరగ చెసె మమ్మిచట. చిద్ విలసన్ మహనీయ వమ్మ. నిన్
చేరి వచించుటీక్షణము చేసిన పుణ్యముగా తలంచెదన్.
జైహింద్.

కవి సామ్రాట్ విశ్వనాధ భావుకత 8

1 comments

కవి సామ్రాట్ వుశ్వనాధ భావుకతను గూర్చి కవి వతంస శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారి వివరణను మీ ముందుంచుతూ యిప్పుడు 8 వ భాగాన్ని ఉంచుతున్నాను.

రామాయణ కల్ప వృక్షము కిష్కింధా కాండ లో 1 లో 8 వ పద్యము.
మత్తేభము:-
వనమీనాటికినయ్యె బిల్వ బదిరాశ్వత్థంబు లీతీర్పు తీ
ర్చిన త్రోవన్ తొలి నాటికిద్ది క్రతు ధాత్రిన్ బోలె కన్ పించుచున్
తనయున్ జానకియున్ జనుర్విభవ వృత్తాంతంబు లా పంప యొ
డ్డున దుఃఖోల్బణ కంఠ రోధములు గండూషించె ప్రాణేశుడున్.

జీవితంలో సుఖ దుఃఖాలు బండి చక్రం ఆకుల వలె పర్యాయంగా వస్తూ పోతూ వుంటాయి. రెండూ శాశ్వితం కావు. రామునకు సీతా వియోగం భిన్న భిన్న కోణాల్లో దఃఖ కారకం అవుతోంది.

పంపా అరణ్య భూముల్లో బిల్వ, బదిర, అశ్వద్ధ వృక్షాలు కనిపిస్తున్నాయి. ఈ వృక్షాలు పవిత్రమైనవి. వీటి కాండాన్నే యజ్ఞాల్లో యూప స్తంభాలుగా వుపయోగిస్తారు. పవిత్ర యజ్ఞ కార్యములందుపయోగపడే ఆ వృక్షాలను చూడగానే తన తండ్రి దశరథ మహారాజు చేసిన యజ్ఞాలు రామునకు జ్ఞప్తికి వచ్చాయి. యూప స్తంభాల కోసం ఆనాడు ఖండింప బడిన ఆ వృక్ష కాండములు తెరిగి చిగిర్చి, కొమ్మలు వేసి, మహా వృక్షములై ఇన్నేళ్ళకు ఈ ప్రాంతాన్ని అడవిగా చేసాయి గదా అని తలంచిన రామునికి తన యొక్క పవిత్ర జన్మను, జానకి యొక్క పవిత్ర జనన ఘట్టాన్నీ, జ్ఞప్తికి తెచ్చాయి. దానితో పాటు ప్రస్తుత దురవస్థా జ్ఞపకం వచ్చింది.

పద్యంలో క్రతు స్మరణ రామునికి తన జన్మ వృత్తాంతం జ్ఞాపకంచేసింది. తాను పవిత్ర యజ్ఞ ఫలముగా ప్రభవించిన వాడు. జానకీ జన్మ వృత్తాంతం కూడా అటువంటిదే. జనకుడు యజ్ఞం కోసం భూమిని దున్ను చుండగా ఆమె ప్రభవించింది. క్రతు ధాత్రి వంటి తన యొక్క, సీత యొక్క పవిత్ర జన్మలు స్ఫురించిన రామునికి తమ జీవితములు నేడు యిలా అడవిలా అయిపోయాయికదా అని అనిపించి, దఃఖంతో గొంతు పూడుకుపోయింది. ఆ గాద్గద్యములతో కూడిన దఃఖాన్ని భరించాడు.

అత్యంత ప్రతిభావంతమైన కల్పనలో విరిసిన కవి భావుకతకు సాక్ష్యం యీ పద్యం. రుద్ధ కంఠము నాయకుని నిర్వేద స్థితిని తెలుపుతుంది. నిర్వేదము ఒక సంచారీ భావము. రోదనము తత్ సంజాతము. రస నిర్వహణ యందు శాస్త్ర ప్రావీణ్యము కవి భావనను దీప్తిమంతం చేస్తుంది. విప్రలంభ శృంగార నాయక అవస్థలన్నీ ప్రస్తుత వర్ణనలో అంతస్సూచ్యంగా విశ్వనాధ వారు ప్రవేశ పెట్టారు.

చూచారా విశ్వనాధవారి భావుకతను శ్రీ బులుసు వేంకటేశ్వర్లు వివరించిన విధాన్ని. మరొక పర్యాం మరొక పద్యాన్ని గూర్చి మీముందుంచే ప్రయత్నం చేయగలను.
జైహింద్.

21, నవంబర్ 2008, శుక్రవారం

సత్యం భ్రూయాత్, ప్రియం భ్రూయాత్. మేలిమి బంగారం మన సంస్కృతి 10

0 comments

అప్రియము కలిగించేది సత్యమైనా సరే చెప్ప కూడదు.:-

నేను కళ్ళారా చూచింది చెపితే నాన్న కొడతాడు. చెప్పకపోతే అమ్మ కొడుతుంది.మసరెలా? అని ఇంటిలో పిల్లడు సంకట స్థితిలో పడినట్లే మనం కూడా ఒక్కొక్క సారి ఈ విషయం చెప్పాలా వద్దా? చెపితే కుటుంబాలు విడిపోతాయేమో? చెప్పకపోతే అన్యాయం జరిగిపోతుందేమో? అని అప్పుడప్పుడు సంకట స్థితిలో పడిపోతుంటాం.
మనం ఏది చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే విషయాన్ని సూచిస్తున్న ఈ క్రింది శ్లోకాన్ని పరిశీలిద్దామా?

శ్లోకము:-
సత్యం భ్రూయాత్, ప్రియం భ్రూయాత్
నభ్రూయాత్ సత్యమప్రియం
ప్రియోపి నానృతం భ్రూయాత్
ఏష ధర్మస్సనాతనః.

తేటగీతి:-
సత్యమును పల్క వచ్చును సరస మతిని.
ప్రియము పల్కగ వచ్చును ప్రీతి తోడ.
బాధ కలిగించు సత్యము పలుక తగదు.
ప్రియము గొలుప నసత్యము ప్రేల రాదు.

ఆహా ఎంత చక్కగా చెప్పబడింది. మనము చక్కగా సత్యమును పలుక వచ్చునట. ఆందరికీ ప్రియము గొలుపు విధముగానూ మాటాడ వచ్చునట. ఐతే మనము పలికేది సత్యమైనప్పటికీ అది ఎవరికయినా బాధ కలిగించేదయినట్లయితే అటువంటి సత్యమును పలుక కూడదట. ఇతరులకు ప్రీతి కలిగించుటకొరకని అసత్యమును మాత్రము పలుక రాదట. ఎంత చక్కగా వుంది దీనిలోని భావన. దీనిని బట్టి మనకర్థమయింది కదా ఎప్పుడు, ఎలా మాటాడాలో. అలాగే చేద్దామా మరి?

జైహింద్.

20, నవంబర్ 2008, గురువారం

స్వాధీనతాచ పుంసాం మహదైశ్వర్యం వినాప్యర్థైః. మేలిమి బంగారం మన సంస్కృతి 9

4 comments

ఆరోగ్యం మొదలైనవే నిజమైన ఆస్తి:-

మనలో ధనికులు, పేదవారు అనేక మందున్నారు. కొందరికి ఎంత ధనమున్నా అనారోగ్యము చేత తిండి తినుటకైనను నోచుకోక దుఃఖ జీవనము గడుపవలసి వచ్చును. కొందరికి ఎంత ధనమున్నను అక్షర జ్ఞానము లేక అక్షర ప్రపంచంలో అంధులులాగా జీవించ వలసి వచ్చును. కొందరికి ఎంత ధనమున్నను సజ్జన సాంగత్యము లేక సత్తుకు దూరమై నీరస జీవనము గడుప వలసి వచ్చును. కొందరు ఎంత ధనమున్నను కులీనులు కాకపోవుటచే అవమానకర జీవితము గడుప వలసి వచ్చును.. కొందరికి ఎంత ధనమున్నను ఇంద్రియ నిగ్రహము లేకపోవుటచే సమస్తమును కోల్పో వలసి వచ్చును. అందుకే విద్వాంసులేమన్నారో క్రింది శ్లోకంలో గమనిద్దామా!

శ్లోకము:-
ఆరోగ్యం విద్వత్తా స
జ్జనమైత్రీ మహా కులే జన్మ
స్వాధీనతాచ పుంసాం
మహదైశ్వర్యం వినాప్యర్థైః.

తేటగీతి:-
అరయ నారోగ్య విద్వత్తు లమరి యుండి,
సరస సన్ మైత్రి, సత్కుల జననమంది
ఇంద్రియాల జయించిన యింటి కాపు ,
పేదవాడయ్యు ధనికుండు పృథివి పైన.

ఆరో గ్యము, విద్వత్తు, సజ్జన మైత్రి, కులీనత, ఇంద్రియ నిగ్రహము ఇవి వున్న వాడు పేదవాడయ్యును ధనికుడే సుమా!
ఎంత ధనమున్నను పైన చెప్పిన ఐదూ లేకపోయినట్లయితే నిరు పేదయే సుమా. అందుకని మనము పైన చెప్పిన ఐదింటినీ కలిగియుండి ధనికవర్గానికి చెందిన వారి గా ఉండడానికి ప్రయత్నిద్దమా మరి?

జైహింద్.

19, నవంబర్ 2008, బుధవారం

వచనే కా దరిద్రతా? మేలిమి బంగారం మన సంస్కృతి 8

1 comments

ప్రియ వాక్య మాహాత్మ్యము:-

మేలిమి బంగారం మన సంస్కృతి 6 వ భాగంలో జిహ్వను (నాలుకను) గూర్చి తెలుసు కొన్నాము. ఇక్కడ మరొక చక్కని సూచనను ఒక శ్లోకం సూచిస్తోంది. పరిశీలిద్దమా?

శ్లోకము:-
ప్రియ వాక్య ప్రదానేన
సర్వే తుష్యంతి జంతవః
తస్మాత్ తదేవ కర్తవ్యం
వచనే కా దరిద్రతా?


కందము:-
ప్రియముగ భాషించినచో
ప్రియమందును జీవకోటి. ప్రేమగ జూచున్.
ప్రియముగ పలుకుము సతతము.
నయముగ ప్రియముగను పలుక నలుగురు మెచ్చున్.

మంచైనా చెడ్డైనా యితరులతో మనం భాషించే భాషణను బట్టే ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏలనంటారా. చూడండి " మీ నాన్నగా రున్నారా? అని అడిగిన దానికీ, నీ అమ్మ మొగుడున్నాడా? అని అడిగిన దానికీ ఉన్న తేడా " తెలుసుకోలేమా మనం.
అర్థం ఒకటే అయినా ఫలితం వేరు. కావున మనం ఎవరితో మాటాడుతున్నా నోటిని అదుపులో పెట్టుకొని మాటాడాలి. ఆ మాటాడే మాట అవతలివ్యక్తికి ప్రీతికరంగా ఉండాలి ." కః పరః ప్రియ వాదినః" అన్న సూక్తి తెలియని వాళ్ళం కాదు కదా! కావున మనమూ చక్కగా మాటాదుతూ అందరి హృదయాలలోనూ మంచి స్థానం సంపాదించుకొందామా మరి ?

జైహింద్

18, నవంబర్ 2008, మంగళవారం

పిత్రోర్నిత్యం ప్రియం కుర్యాత్. మేలిమి బంగారం మన సంస్కృతి 7.

0 comments

మన ప్రవర్తనను చూచి మన తల్లి దంద్రులు, గురువు సంతోషించాలి:-

మన పుట్టుకకు మూలము మన తల్లి, తండ్రి. మన జ్ఞానమునకు మూలము మన గురువు. వారి నానంద పరచుట మన కనీస ధర్మము. ఈ క్రింది శ్లోకమును నా అనువాద పద్యమును పరిశీలింపుడు.

శ్లోకము:-
పిత్రోర్నిత్యం ప్రియం కుర్యాత్.
ఆచార్యస్య చ సర్వదా.
తేషు హి త్రిషు తృప్తేషు
తపస్సర్వం సమాప్యతే.

కందము:-
ప్రియమందగ తలి దండ్రులు
ప్రియమందగ గురువు మనదు ప్రియ వర్తనచే.
జయ శీలుడ! మన కదియె వి
జయము. తపః ఫలము. మనకు జయముల నొసగున్.

తల్లి దండ్రులకు ఎల్లప్పుడు ప్రియముగ నడచుకొన వలెను. అటులనే గురువులకునూ ప్రియ మొనర్చు చుండవలెను. ఈ ముగ్గురును తృప్తులైనచో మన తపము లన్నియు ఫలించినట్లే.

మన జన్మకు మూల కారకులయిన తల్లి దండ్రులకు, మన జ్ఞాన కారకులయిన గురువులకూ సంతోషము కలుగు విధముగా మన ప్రవర్తనను తీర్చి దిద్దుకొనడం ద్వారా వారికి తృప్తి కలిగించడమే కాక మనమూ హాయిగా, సంతోషంతో తేలిపోతున్న మనస్సుతో, సుఖ జీవనం సాగించడంలో పొరపాటేముంది? కాన తప్పక అలాగ చేద్దామా?

జైహింద్.

కవి సమ్రాట్ విశ్వనాధ భావుకత 7

0 comments

కవి సామ్రాట్ విశ్వనాధ భావుకత ను శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారు వివరించిన మరొక పద్యాన్ని మీ ముందుంచుతున్నాను.

రామాయణ కల్ప వృక్షంలోని కిష్కింధా కాండలో 1 -లో 7 వ పద్యం
ఆటవెలది::-
రేగి ముదురు వెలగ క్రింద ముగ్గిన పండ్లు
రాలి కమ్మ తావి గాలి సాగ
మూగికొనిన తేటి మొత్తమ్మునకు స్పృహా
స్పృహల నడుమ తత్తరింపులయ్యె.

శ్రీరాముడు సీతాన్వేషణ చేయుచూ, పంపా నదీ తీరమున ఉండగా అక్కడి ప్రకృతిని వర్ణించుతూ విశ్వనాధ వారు చెప్పిన పద్యం.
శ్రీరాముని మనసు విషాద మగ్నమయి ఉంది. అక్కడి ప్రకృతి సౌందర్యమునందు అనుభవము - నిరనుభవము అయిన ద్వంద్వ స్థితులను పొందుతున్నది. సీతా విషయికమైన స్నేహ నిరీహల యందు రామ హృదయం తల్లడిల్లుతున్నది.

పెద్ద పెద్ద వెలగ చెట్ల క్రింద ముగ్గిన వెలగపండ్లు రాలిపోయి యున్నవి. ఆ పండ్ల పరిమళం గాలిలో కమ్మగా తేలిపోతోంది. ఇక తుమ్మెదలు గుంపులు గుంపులుగా ఆ పండ్లపై వ్రాలి మళ్ళీ గాలిలోకి లేచిపోతున్నాయి. మరల ఆ సుమధుర పరిమళాన్ని వదల లేక స్పృహా స్పృహల మధ్య తత్తర పడుతూ అక్కడే తిరుగుతున్నాయి. ఇదీ పద్యం లోని భావము.

తుమ్మెదల గుంపు వెలగ గుజ్జు రసాన్ని ఆస్వాదించ లేదు. పూల మకరందమే వాటికాహారం. ఐతే ఇక్కడ మిగల మ్రుగ్గిన వెలగ పండ్ల పరిమళం తుమ్మెదల్ని మోసం చేస్తున్నది. పూల వాసనతో కూడిన మకరందం అని ఆ తుమ్మెదలు భ్రమిస్తున్నాయి.

ఆస్వాదనీయంగా కనిపించే ఫల రసం ఆస్వాదనీయం కాకపోయినా మత్తెక్కించే ఆ పరిమళ తరంగాల యందు లీనమౌతున్న తుమ్మెదలు ... శ్రీరాముని స్పృహా స్పృహల నడుమ నలుగుతున్న ఆలోచనలే కదా!

సీతావిషయకముగా ఆశ అంతలోనే నిరాశ ...... ఆశ నిరాశల మధ్య తత్తరపడుతున్న శ్రీరామ హృదయానికి ఈ పద్యం దర్పణం పడుతోంది. ఎంతటి భవుకత!

చూచారుకదా కవి వతంసుని ప్రసంగంలో వెలుగు చూచిన వీశ్వనాధుని భావుకత. మళ్ళీ కలుసుకొన్నప్పుడు మరొక పద్యంలోని భావుకతను మీముందుంచే ప్రయత్నం చేస్తాను. జైహింద్.

17, నవంబర్ 2008, సోమవారం

జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ. మేలిమి బంగారం మన సంస్కృతి 6

2 comments

మంచీ - చెడ్డా అంతా నాలుకపైనే ఆధార పడి వుంది:-

మనం సమాజంలో చూస్తూ ఉంటాం. కొంతమంది చాలా చమత్కారంగా మాతాడుతారు. వారు కార్య సాధనలో గట్టి వారు. కొందరు మటాడడం వలన వారికి అవుతున్న పనులు కూడా ఆగిపోతుంటాయి. కొందరు యేమీ పైకి మాటాడకుండానే వారి పనులను వారు చేయించుకో గలుగుతారు. అన్నిటికీ మూలం మాటాడే నాలుకే కారణం.
ఈక్రింది శ్లోకాన్ని పరిశీలించండి.

శ్లోకము:-
జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ
జిహ్వాగ్రే మిత్ర బాంధవాః
జిహ్వాగ్రే బంధన ప్రాప్తిః
జిహ్వాగ్రే మరణం ధృవం.

కందము:-
జిహ్వాగ్రము నుండును సిరి.
జిహ్వాగ్రము నుండు మిత్ర బృందము, బంధుల్.
జిహ్వాగ్రము బంధన మిడు.
జిహ్వాగ్రము మరణ కారి. జీవిత మందున్.

మన నాలుక చివరనే లక్ష్మి యున్నది. మననాలుక సహాయముతో పలికెడి మాటల వలననే మనకు బంధు మిత్రాదు లేర్పడు తున్నారు. మన మాటల కారణముగనే మనకు బంధన మేర్పడును. మనమాటలే మన మరణ హేతు వగుటయు నిజము.

మనము ధర్మ బద్ధముగా బ్రతుకుట కొరకు చక్కని సంభాషణ లక్ష్మీప్రదము. మంచిగా మాటలాడువారికడకు గౌరవ భావముతో బంధు మిత్రాదులు చేరుదురు. చెడుగా గర్వముతో మాటాడుట వలన మనకు బంధనం కూడా ప్రాప్తించ వచ్చును. మన మాట పొందిక లేకపోయినచో యితరులకు రుచించక పోవుట వలన అది మన ప్రాణములకు కూడా ముప్పు తే వచ్చును. కావుననే మనము మంచిగా మాటాడడం చాలా అభ్యాసం చేసయినా అలవరచుకోవాలి. అది మనకు మన కుటుంబానికి చాలా మంచిది. కాబట్టి అలా చేద్దామా!

జైహింద్.

కవి సమ్రాట్ విశ్వనాథ భావుకత 6

0 comments

శ్రీ విశ్వ నాథ వారి రామాయణ కల్ప వృక్షం నందలి భావుకతను గూర్చి కవి వతంస శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారి ఉపన్యాస పాఠములో 6 వ భాగాన్ని ఇప్పుడు మీ ముందుచుతున్నందుకు ఆనందంగా ఉంది

కిష్కింధా కాండలో 1 లో 6 వ పద్యము.
చంపకమాల:-
తిరిగిన పంప నీరములు తీర్చిన సారణులై లతల్ పొదల్
తరువుల చిక్క పచ్చనల తన్ కున యాకులు నేత్ర తర్పణ
స్ఫురణము సేయ నియ్యటవి ముగ్ధ మనోహర కేళికాననా
దరము గడించెడున్ నవ లతాంత మహాయుధు బాకుటిల్లు నాన్.


శ్రీరాముడు ప్రస్తుతం వియోగ శృంగార నాయకుడు. విరహ దందహ్యమాన హృదయుడై యున్నాడు.
నిన్ను సేవిస్తూ, నీతో విహరిస్తూ,వసంత శోభతో అందగించిన వనాల్లో నివసిస్తాను.అని ముచ్చట పడిన సీత ప్రస్తుతమాముని ప్రక్కన లేదు. ఈ వసంత సౌందర్యాన్ని సీతతో కలసి ఆస్వాదిద్దామనుకొనే అతని కోరిక సీతా వియోగం కారణంచేత దుఃఖ కారక మవుతోంది.అందు చేత పరమ మనోహర మధు మాస సౌందర్యము పంపా పరిసర అరణ్య సౌభాగ్యము శ్రీ రామునకు బాధాహేతువుగా కవి వర్ణించాడు.

ప్రకృతి సహజంగా ఏర్పడ్డ కాలువల ద్వారా ప్రవహించి సారవంతము గావించిన పంపా సరస్సు సమీప భూములలో లతలు, పొదలు, తరువులు, ఎంత ఆరోగ్యంగా పెరిగాయంటే ..... వాటి పచ్చని ఆకులు నేత్ర తర్పణ చేస్తున్నాయి. నేత్రేంద్రియానికి తృప్తిని కలిగిస్తున్నాయి.ఈ అడవి మనోహరమైన కేళీ వనంవలె కనిపిస్తున్నది. క్రీడోద్యానము వలె కనిపిస్తూ మన్మధుని బాకుటిల్లులాగుంది.

ఆ వనము శ్రీరామునికి గతములో తాను సీతతోవిహరించిన అయోధ్యలోనిక్రీడోద్యానమును గుర్తుకు తెచ్చినది. ఆ మధుర స్మృతి నుండి హఠాత్తుగా సీతా వియోగం అనే దురవస్థ కూడా తలపుకు వచ్చింది. సీతా విరహుడైన రామునకు ఆ వనము " నవ లతాంతాయుధు బాకుటిల్లులా కనిపించింది. " నవ లతాంతాయుధు " ప్రయోగం వల్ల పుష్ప విరాజితమై, మన్మధ బాకుటిల్లులాగుందని వర్ణిచడం వలన రామునికి గల విరహాధిక్యతను తెలియ జేయడం జరిగింది.

ఇటు ప్రకృతి సౌందర్యాన్ని వర్ణిస్తూనే అటు శ్రీరాముని విరహ స్పందనను తేలియ జేయడంలో విశ్వనాధుని కవన నైపుణ్యం ద్యోతకమవుతుంది.
ప్రకృతి యందలి ప్రతి వస్తువు రామునకు సీతను జ్ఞప్తికి తెస్తున్నాయి. ఇదే మనమిక్కడ గ్రహించ వలసిన విషయము. అదేమిటంటే ...సీతమ్మ ప్రకృతి స్వరూపిణి అని.

చూచారుకదా బులుసువారి వివరణని....మరొకమారు మరొక పద్యాన్ని గూర్చి వారి వివరణను మీ ముందుంచేందుకు ప్రయత్నిస్తాను. జైహింద్.

అమెరికా లోని ఆంధ్రులు క్షేమంగా వర్ధిల్లాలి.

1 comments

పైశాచికత్వాన్ని ముక్త కంఠంతో ఖండిద్దాం.
విజ్ఞాన సముపార్జనే లక్ష్యంగా విశ్వమే విద్యాలయంగా భావించి విద్యార్థులై పాశ్చాత్య దేశాలకు వెళ్ళి శ్రద్ధాబుద్ధులతో సంస్కారంతో వికసిస్తున్న ఆంధ్ర విద్యార్థినీ విద్యార్థులను అమెరికావంటి అభివృద్ధి పొందిన దేశాలలోనే అమానుషంగా, పరమ కిరాతకంగా, హతమారుస్తున్న వైనం చూచి ప్రపంచ దేశాలన్నీ ఏవగించుకొంటున్నాయి.
మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన " అర్పణ " 12రోజుల క్రితమే కత్తి పోట్లకు గురయి మరణిచగా నిన్న వరంగల్లుకుచేందిన శశాంక్ ను అతి దారుణంగా కాల్చేశారు. ఏమిటీ దొర్భాగ్యం?
మన దేశీయుల ప్రతిభ చూచి అక్కసుతో చంపెస్తున్నారా? లేక మరేదయినా కారణముందా? ఏది యేమైనా మన పిల్లలు ఆ దేశంలో వారికి అతిధులేకదా? అక్కడి ప్రభుత్వాలకి యివేవీ పట్టవా? మనప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం తప్ప మరేచర్యా తీసుకొనే సత్తా కలిగి లేదా? ఇలా యెంతమంది అక్కడ బలైపోవాలి? పోనీ వుచి విద్యకోసం అక్కడికి వెళ్ళారా? బోలెడంత ధనాన్ని, అక్కడ ఖర్చుపెట్టుకొంటూ, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చుకొంటూ, అందరినీ యిక్కడ విడిచిపెట్టి, ఇక్కడికి సుదూర ప్రాంతాలలో వుంటూ, కేవలం విద్యార్థులుగా వెళ్ళితే అమానుషంగా చంపెస్తారా?
ప్రపంచాన్నే శాశించ గలిగిన దేశమా అది? తన దేశంలొని దురాగతాలనే గమనించలేని, అదుపు చేయలేని దౌర్భాగ్య స్థితిలోనున్న ఆ దేశమా ప్రపంచాన్ని శాశించేది?
తప్పు. చాలా తప్పు. దేశ ప్రజలకూ, అతిధులుగా వచ్చిన విదేశీయులకూ ప్రభుత్వం రక్షణ కల్పించ గలగాలి. సార్వభౌమత్వాన్ని ప్రదర్శిచడం కాదు. రుజువు చేసుకోవాలి.
అమెరికా ప్రభుత్వమిప్పటికైనా కళ్ళు తేరవాలి. చుట్టుముట్టుతున్న అపఖ్యాతిని గ్రహించుకొని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. కారణం యెవరైనా ప్రభుత్వాలు అపఖ్యాతిపాలు కాకూడదు.
శశాన్ క్ క్షేమమనేవార్త ఇప్పుడే తీ.వీ. 9 లో చూచి చాలా ఆనంద పడుతున్నాను. అమెరికా వైద్యుల్ని అభినడైస్తున్నాను. ఆరోగ్యంగా శశాన్ క్ స్వదేశానికి రావాలని కోరుకొంటున్నాను.
అమెరికాలోనున్న మనవారంతా క్షేమంగా వుండాలని పరమాత్మను కోరుకొంటున్నాను. మీరూ నాతో ఏకీఎభవిస్తారనుకొంటున్నాను. జైహింద్.

16, నవంబర్ 2008, ఆదివారం

సంతోషో నందనం వనం. మేలిమి బంగారం మన సంస్కృతి 5.

0 comments

శత్రు మిత్రులు - స్వర్గ నరకాలు అన్నీ మనలోనే వున్నాయి:-

మానవుడు యెంత గొప్పవాడయినను కామాది అరిషడ్వర్గాన్ని జయించకపోతే తన గొప్పతనమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. నరకమనేది ఎక్కడో లేదు.ఈ క్రింది శ్లోకాన్నిపరిశీలించండి.

శ్లొకము:-
క్రోధో వైవస్వతో రాజా
ఆశా వైతరణీ నదీ
విద్యా కామ దుఘా ధేనుః
సంతోషో నందనం వనం.


తేటగీతి:-
క్రోధమే యముడందురు కోవిదు లిల.
ఆశ వైతరణీ నది. అరసి చూడ.
విద్యయే కామ ధేనువు.విశ్వమందు.
సంతసమునంద నవనము. సన్నుతాత్మ !

మానవునకు గల కోపమే యమ ధర్మ రాజు. అతనికుండే ఆశయే వైతరణీ నది. అతని విద్యయే అతని పాలిటి కామ ధేనువు. అతని సంతోషమే ఆనంద నందన వనము.

గ్రహించ గలము కదా! ఇంకెందుకాలస్యం ? మనమూ యీ పైన చెప్పిన సల్లక్షణాల్ని పెంపొందించుకంటే సరిపోతుంది కదా ! ప్రయత్నిద్దామా?

జైహింద్.

సెన్సార్ బోర్డును సెన్సార్ చెయ్యండి.

2 comments

మాతృ దేవోభవ! పితృ దేవో భవ! అనే మాటలు మనకి మురళీ గానంలాగా వినిపిస్తాయి. నేటి సినీమా, టీ. వీ. చిత్రాలలో కనిపిస్తున్న దౌర్భాగ్య సంభాషణలూ, దౌర్భాగ్య సన్నివేశాలూ, సభ్య సమాజానికి కీడు కలిగించడమే కాక ఎంద రెందరినో ఆవేదనకు గురి చేస్తున్నాయి. హృదయం లోంచొచ్చిన ఈ ఆవేదన 99% ప్రేక్షకుల స్పందన. బిడ్డలను గన్న తల్లి దండ్రులు, పాఠాలు నేర్పే గురువులూ, పెక్కురు విద్యార్థులూ, సమాజంలో మంచినే కాంక్షించే మహనుభావులూ, విశ్వనాధ వంటి ప్రముఖ దర్శక నిర్మాతలూ, లోక్ సత్తా వంటి నిజాయితీని నిలపాలనుకొనే ప్రముఖ పార్టీల నాయకులగు జయప్రకాష్ వంటి నాయకులూ, ఎందరో మహిళా మణులూ, చలన చిత్రాలలోను, టీ.వీ. లలోనూ, కనిపించే కొన్ని సన్నివేశాలకు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది నగ్న సత్యము.
కొందరు నిర్మాతలూ, దర్శకులూ, చిత్ర నిర్మాణంలో ధన సంబంధాన్నే తప్ప మానవ సంబంధాన్ని మచ్చుకైనా గుర్తుంచుకోవడం లేదు. వారి నిర్మాణ నైపుణ్యాన్ని జ్ఞానాన్ని వారికి తోచిన రీతిలో చిత్ర నిర్మాణంలో ఉపయోగించెస్తున్నారే తప్ప ఆ చిత్రాన్ని చూచే ప్రేక్షకులపై అది యెంత ప్రభావం చూపుతుందన్న విషయం కొంచెమైనా ఆలోచించకపోవడం విచారకరం.
మనం బ్రతకడంలో తప్పు లేదు. మన బ్రతుకు కోసం జీవనాధారాన్నెంచుకోవడంలో తప్పు లేదు. ఐతే మన బ్రతుకు వల్ల గాని, మన మెంచుకొన్న జీవనాధార బ్రతుకు మార్గం వల్ల గాని మనం బ్రతుకుతున్న సమాజంలోనున్న మరొకరికి ఏవిధమైన నష్టన్నికాని, హానిని కాని కలిగించ కూడదనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించకూడదుకదా? వ్యాపారులైన నిర్మాతల వల్ల తప్పు పూర్తిగా లేదు. ఎందుకంటే బోలెడు అప్పులు చేసి చిత్ర నిర్మాణం చేస్తారు. ఆ డబ్బు తిరిగి రాబట్టుకోడానికి అనేక జిమ్మిక్కులు చేస్తారు. ఐతే సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్టివ్వకుండా చిత్రాన్ని విడుదల చేయ లేరు కదా! మరి యీ సెన్సారు బోర్డు యేం చేస్తోంది?
ఈ సెన్సార్ బోర్డుకి కూడా నియమ నిబంధనలున్నాయి. వాటిలోనూ వారి అభిప్రాయాల కనుగుణంగా సమర్ధించుకోడానికి వీలుగా బోలెడు లొసుగులున్నాయి. అందుచేతనే యీ సమాజానికి యీ దౌర్భాగ్యం దాపురించింది.
మానవ హక్కులను కాపాడే సంస్థలున్నాయి. మహిళా హక్కులను కాపాడే సంస్థలున్నాయి. ఈ సంస్థలనుండి ఎంపిక చేసిన వ్యక్తులనుకూడా సెన్సార్ బోర్దు సభ్యులుగా చేస్తే యేమైనా మార్పు రావచ్చునేమో. ఈ ఆలోచన ప్రభుత్వానికి కలిగేదెప్పుడూ ? కలిగించేదెవ్వరూ....? ఈ కలి యుగంలో కృత యుగాన్ని చూడగలిగే దెప్పుడూ....? ఏమో .... వేచి చూడడం తప్ప చేయగలిగిందేముంది........? మీరూ ఆలోచించండి .
మాతృ దేవోభవ! పితృ దేవో భవ! అనే మాటలు మనకి మురళీ గానంలాగా వినిపిస్తాయి. నేటి సినీమా, టీ. వీ. చిత్రాలలో కనిపిస్తున్న దౌర్భాగ్య సంభాషణలూ, దౌర్భాగ్య సన్నివేశాలూ, సభ్య సమాజానికి కీడు కలిగించడమే కాక ఎంద రెందరినో ఆవేదనకు గురి చేస్తున్నాయి. హృదయం లోంచొచ్చిన ఈ ఆవేదన 99% ప్రేక్షకుల స్పందన. బిడ్డలను గన్న తల్లి దండ్రులు, పాఠాలు నేర్పే గురువులూ, పెక్కురు విద్యార్థులూ, సమాజంలో మంచినే కాంక్షించే మహనుభావులూ, విశ్వనాధ వంటి ప్రముఖ దర్శక నిర్మాతలూ, లోక్ సత్తా వంటి నిజాయితీని నిలపాలనుకొనే ప్రముఖ పార్టీల నాయకులగు జయప్రకాష్ వంటి నాయకులూ, ఎందరో మహిళా మణులూ, చలన చిత్రాలలోను, టీ.వీ. లలోనూ, కనిపించే కొన్ని సన్నివేశాలకు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది నగ్న సత్యము.
కొందరు నిర్మాతలూ, దర్శకులూ, చిత్ర నిర్మాణంలో ధన సంబంధాన్నే తప్ప మానవ సంబంధాన్ని మచ్చుకైనా గుర్తుంచుకోవడం లేదు. వారి నిర్మాణ నైపుణ్యాన్ని జ్ఞానాన్ని వారికి తోచిన రీతిలో చిత్ర నిర్మాణంలో ఉపయోగించెస్తున్నారే తప్ప ఆ చిత్రాన్ని చూచే ప్రేక్షకులపై అది యెంత ప్రభావం చూపుతుందన్న విషయం కొంచెమైనా ఆలోచించకపోవడం విచారకరం.
మనం బ్రతకడంలో తప్పు లేదు. మన బ్రతుకు కోసం జీవనాధారాన్నెంచుకోవడంలో తప్పు లేదు. ఐతే మన బ్రతుకు వల్ల గాని, మన మెంచుకొన్న జీవనాధార బ్రతుకు మార్గం వల్ల గాని మనం బ్రతుకుతున్న సమాజంలోనున్న మరొకరికి ఏవిధమైన నష్టన్నికాని, హానిని కాని కలిగించ కూడదనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించకూడదుకదా? వ్యాపారులైన నిర్మాతల వల్ల తప్పు పూర్తిగా లేదు. ఎందుకంటే బోలెడు అప్పులు చేసి చిత్ర నిర్మాణం చేస్తారు. ఆ డబ్బు తిరిగి రాబట్టుకోడానికి అనేక జిమ్మిక్కులు చేస్తారు. ఐతే సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్టివ్వకుండా చిత్రాన్ని విడుదల చేయ లేరు కదా! మరి యీ సెన్సారు బోర్డు యేం చేస్తోంది?
ఈ సెన్సార్ బోర్డుకి కూడా నియమ నిబంధనలున్నాయి. వాటిలోనూ వారి అభిప్రాయాల కనుగుణంగా సమర్ధించుకోడానికి వీలుగా బోలెడు లొసుగులున్నాయి. అందుచేతనే యీ సమాజానికి యీ దౌర్భాగ్యం దాపురించింది.
మానవ హక్కులను కాపాడే సంస్థలున్నాయి. మహిళా హక్కులను కాపాడే సంస్థలున్నాయి. ఈ సంస్థలనుండి ఎంపిక చేసిన వ్యక్తులనుకూడా సెన్సార్ బోర్దు సభ్యులుగా చేస్తే యేమైనా మార్పు రావచ్చునేమో. ఈ ఆలోచన ప్రభుత్వానికి కలిగేదెప్పుడూ ? కలిగించేదెవ్వరూ....? ఈ కలి యుగంలో కృత యుగాన్ని చూడగలిగే దెప్పుడూ....? ఏమో .... వేచి చూడడం తప్ప చేయగలిగిందేముంది........? మీరూ ఆలోచించండి . మాతృ దేవోభవ! పితృ దేవో భవ! అనే మాటలు మనకి మురళీ గానంలాగా వినిపిస్తాయి. నేటి సినీమా, టీ. వీ. చిత్రాలలో కనిపిస్తున్న దౌర్భాగ్య సంభాషణలూ, దౌర్భాగ్య సన్నివేశాలూ, సభ్య సమాజానికి కీడు కలిగించడమే కాక ఎంద రెందరినో ఆవేదనకు గురి చేస్తున్నాయి. హృదయం లోంచొచ్చిన ఈ ఆవేదన 99% ప్రేక్షకుల స్పందన. బిడ్డలను గన్న తల్లి దండ్రులు, పాఠాలు నేర్పే గురువులూ, పెక్కురు విద్యార్థులూ, సమాజంలో మంచినే కాంక్షించే మహనుభావులూ, విశ్వనాధ వంటి ప్రముఖ దర్శక నిర్మాతలూ, లోక్ సత్తా వంటి నిజాయితీని నిలపాలనుకొనే ప్రముఖ పార్టీల నాయకులగు జయప్రకాష్ వంటి నాయకులూ, ఎందరో మహిళా మణులూ, చలన చిత్రాలలోను, టీ.వీ. లలోనూ, కనిపించే కొన్ని సన్నివేశాలకు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది నగ్న సత్యము.
కొందరు నిర్మాతలూ, దర్శకులూ, చిత్ర నిర్మాణంలో ధన సంబంధాన్నే తప్ప మానవ సంబంధాన్ని మచ్చుకైనా గుర్తుంచుకోవడం లేదు. వారి నిర్మాణ నైపుణ్యాన్ని జ్ఞానాన్ని వారికి తోచిన రీతిలో చిత్ర నిర్మాణంలో ఉపయోగించెస్తున్నారే తప్ప ఆ చిత్రాన్ని చూచే ప్రేక్షకులపై అది యెంత ప్రభావం చూపుతుందన్న విషయం కొంచెమైనా ఆలోచించకపోవడం విచారకరం.
మనం బ్రతకడంలో తప్పు లేదు. మన బ్రతుకు కోసం జీవనాధారాన్నెంచుకోవడంలో తప్పు లేదు. ఐతే మన బ్రతుకు వల్ల గాని, మన మెంచుకొన్న జీవనాధార బ్రతుకు మార్గం వల్ల గాని మనం బ్రతుకుతున్న సమాజంలోనున్న మరొకరికి ఏవిధమైన నష్టన్నికాని, హానిని కాని కలిగించ కూడదనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించకూడదుకదా? వ్యాపారులైన నిర్మాతల వల్ల తప్పు పూర్తిగా లేదు. ఎందుకంటే బోలెడు అప్పులు చేసి చిత్ర నిర్మాణం చేస్తారు. ఆ డబ్బు తిరిగి రాబట్టుకోడానికి అనేక జిమ్మిక్కులు చేస్తారు. ఐతే సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్టివ్వకుండా చిత్రాన్ని విడుదల చేయ లేరు కదా! మరి యీ సెన్సారు బోర్డు యేం చేస్తోంది?
ఈ సెన్సార్ బోర్డుకి కూడా నియమ నిబంధనలున్నాయి. వాటిలోనూ వారి అభిప్రాయాల కనుగుణంగా సమర్ధించుకోడానికి వీలుగా బోలెడు లొసుగులున్నాయి. అందుచేతనే యీ సమాజానికి యీ దౌర్భాగ్యం దాపురించింది.
మానవ హక్కులను కాపాడే సంస్థలున్నాయి. మహిళా హక్కులను కాపాడే సంస్థలున్నాయి. ఈ సంస్థలనుండి ఎంపిక చేసిన వ్యక్తులనుకూడా సెన్సార్ బోర్దు సభ్యులుగా చేస్తే యేమైనా మార్పు రావచ్చునేమో. ఈ ఆలోచన ప్రభుత్వానికి కలిగేదెప్పుడూ ? కలిగించేదెవ్వరూ....? ఈ కలి యుగంలో కృత యుగాన్ని చూడగలిగే దెప్పుడూ....? ఏమో .... వేచి చూడడం తప్ప చేయగలిగిందేముంది........? మీరూ ఆలోచించండి .


మాతృ దేవోభవ! పితృ దేవో భవ! అనే మాటలు మనకి మురళీ గానంలాగా వినిపిస్తాయి. నేటి సినీమా, టీ. వీ. చిత్రాలలో కనిపిస్తున్న దౌర్భాగ్య సంభాషణలూ, దౌర్భాగ్య సన్నివేశాలూ, సభ్య సమాజానికి కీడు కలిగించడమే కాక ఎంద రెందరినో ఆవేదనకు గురి చేస్తున్నాయి. హృదయం లోంచొచ్చిన ఈ ఆవేదన 99% ప్రేక్షకుల స్పందన. బిడ్డలను గన్న తల్లి దండ్రులు, పాఠాలు నేర్పే గురువులూ, పెక్కురు విద్యార్థులూ, సమాజంలో మంచినే కాంక్షించే మహనుభావులూ, విశ్వనాధ వంటి ప్రముఖ దర్శక నిర్మాతలూ, లోక్ సత్తా వంటి నిజాయితీని నిలపాలనుకొనే ప్రముఖ పార్టీల నాయకులగు జయప్రకాష్ వంటి నాయకులూ, ఎందరో మహిళా మణులూ, చలన చిత్రాలలోను, టీ.వీ. లలోనూ, కనిపించే కొన్ని సన్నివేశాలకు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది నగ్న సత్యము.
కొందరు నిర్మాతలూ, దర్శకులూ, చిత్ర నిర్మాణంలో ధన సంబంధాన్నే తప్ప మానవ సంబంధాన్ని మచ్చుకైనా గుర్తుంచుకోవడం లేదు. వారి నిర్మాణ నైపుణ్యాన్ని జ్ఞానాన్ని వారికి తోచిన రీతిలో చిత్ర నిర్మాణంలో ఉపయోగించెస్తున్నారే తప్ప ఆ చిత్రాన్ని చూచే ప్రేక్షకులపై అది యెంత ప్రభావం చూపుతుందన్న విషయం కొంచెమైనా ఆలోచించకపోవడం విచారకరం.
మనం బ్రతకడంలో తప్పు లేదు. మన బ్రతుకు కోసం జీవనాధారాన్నెంచుకోవడంలో తప్పు లేదు. ఐతే మన బ్రతుకు వల్ల గాని, మన మెంచుకొన్న జీవనాధార బ్రతుకు మార్గం వల్ల గాని మనం బ్రతుకుతున్న సమాజంలోనున్న మరొకరికి ఏవిధమైన నష్టన్నికాని, హానిని కాని కలిగించ కూడదనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించకూడదుకదా? వ్యాపారులైన నిర్మాతల వల్ల తప్పు పూర్తిగా లేదు. ఎందుకంటే బోలెడు అప్పులు చేసి చిత్ర నిర్మాణం చేస్తారు. ఆ డబ్బు తిరిగి రాబట్టుకోడానికి అనేక జిమ్మిక్కులు చేస్తారు. ఐతే సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్టివ్వకుండా చిత్రాన్ని విడుదల చేయ లేరు కదా! మరి యీ సెన్సారు బోర్డు యేం చేస్తోంది?
ఈ సెన్సార్ బోర్డుకి కూడా నియమ నిబంధనలున్నాయి. వాటిలోనూ వారి అభిప్రాయాల కనుగుణంగా సమర్ధించుకోడానికి వీలుగా బోలెడు లొసుగులున్నాయి. అందుచేతనే యీ సమాజానికి యీ దౌర్భాగ్యం దాపురించింది.
మానవ హక్కులను కాపాడే సంస్థలున్నాయి. మహిళా హక్కులను కాపాడే సంస్థలున్నాయి. ఈ సంస్థలనుండి ఎంపిక చేసిన వ్యక్తులనుకూడా సెన్సార్ బోర్దు సభ్యులుగా చేస్తే యేమైనా మార్పు రావచ్చునేమో. ఈ ఆలోచన ప్రభుత్వానికి కలిగేదెప్పుడూ ? కలిగించేదెవ్వరూ....? ఈ కలి యుగంలో కృత యుగాన్ని చూడగలిగే దెప్పుడూ....? ఏమో .... వేచి చూడడం తప్ప చేయగలిగిందేముంది........? మీరూ ఆలోచించండి .

కందము:-
ధనమును గడియించుటకై
గుణమును విడువంగ రాదు.గురు, పితరులపై
వినయము బాపెడి చిత్రము
కనుటన దౌర్భాగ్యమయ్య! కాల్పగ వలదే ?

ప్రకృతి సిద్ధ మిదం హి దురాత్మనాం. మేలిమి బంగారం మన సంస్కృతి 4.

0 comments

దుష్టులకుండే సహజ గుణాలు:-

మనము మంచి ఆత్మలు కలవారుగా వుండాలీ అంటే ముందుగా దురాత్ములుగా ఉండకుండా ఉండాలి . ఐతే దురాత్ముని స్వభావాన్ని తెలుసుకొంటె అలా వుండకుండా ఉంటాం కదా! చూడండి భర్తృహరి ఏంచెప్పాడో.

శ్లోకము:-
అ కరుణత్వ మకారణ విగ్రః
పరధనే పరయోషితి చ స్పృహా
సుజన బంధు జనే ష్వసహిష్ణుతా
ప్రకృతి సిద్ధ మిదం హి దురాత్మనాం.


తేటగీతి:-
దయయె లేకుండు. కలహించు భయములేక.
పరుల ధన, స్త్రీల నాశించు. పరవశించు.
కారణము లేక ద్వేషించు ఘనుల, మిత్ర
వరుల, దుష్టుని. సహజాత మరయ నిదియె.

దయాగుణము లేక పోవుట, అ కారణముగా అందరితో కలహించుట, పరుల ధనమును స్త్రీలను కోరుకొంటూ వాటితో పరవశించుట, గొప్ప వారిని, మిత్రులను కారణము లేకుండానే ద్వేషించుట మొదలగు యిటువంటి గుణములు దుర్మార్గులకు పుట్టుకతోనే వచ్చును.

ఇట్టి గుణములకు మనము దూరముగానుండి సజ్జనులమై ప్రవర్తించుతూ సుజనత్వాన్ని నిలుపుకొందామామరి?

జైహింద్.