31, జనవరి 2025, శుక్రవారం
గాయత్రీ వృత్తాంతం......శ్రీ క్రొవ్విడి వేంకట రాజారావు.
0
comments
శ్రీరామ తారావళి. ఆచార్య ఫణీంద్ర.Sri Ramayana Taravali | PROMO | Dr. Acharya Phaneendra | Sunny Vasu |...
0
comments
పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. మాడుగుల నాగఫణి శర్మ గారితో Padma Shri Award Winner Madugula Nagaphani Sarma Exclusive Interview | hmtv
0
comments
గుణిని గుణజ్ఞో రమతే. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. గుణిని గుణజ్ఞో రమతే - నా గుణశీలస్య గుణిని పారితోషః
అళిరేతి వనాత్కమలం - నతు భేక స్త్వేకవాసోఽపి.
కం. గుణవంతుఁడగు రసజ్ఞుఁడు
గుణవంతుని మెచ్చు, కనఁడు గుణరహితుఁడిలన్,
వనపద్మము వికసించినఁ
గని తుమ్మెద చేరు, కప్ప కాంచదు దరినే.
భావము. గుణవంతుని రసజ్ఞుడే మెచ్చవలయును గానీ మొరటువాడు నేరడు.
పద్మము వికసించగానే దానికోసం తుమ్మెద యెగిరివచ్చునే కానీ
అక్కడ వున్న కప్ప చేరరాదు కదా.
జైహింద్.
30, జనవరి 2025, గురువారం
0
comments
జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ బాబూదేవీదాస రావు గారుఆత్మకూరులో వారి గృహమున నిన్నను నాపై చూపిన ఆత్మీయత ఎన్నలేనిది.
జైహింద్.
సుందరం,ధన్యతా,జిత క్రోధ.విరోధాబాస,గర్భ"శ్రీధామ"వృత్తము, రచన..... శ్రీవల్లభ.
0
comments
జైశ్రీరామ్.
జైహింద్.
29, జనవరి 2025, బుధవారం
ఒక యువకుఁడు గోమూత్రికాబంధ శ్లోకమును చూచి కవి నైపుణ్యానికి ఆశ్చర్యపోతూ చేసిన చిత్రం
0
comments
28, జనవరి 2025, మంగళవారం
బ్రహ్మశ్రీ గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠి గారిచే వేదార్ధ ఉపన్యాసము.. ...
0
comments
ఆచార్య శ్రీ సూరంశ్రీనివాసులు తో భావనాప్రియ ముఖాముఖి.
0
comments
కవిసింహ పోకూరి కాశీపత్యవధానుల సాహితీపురస్కారము నాకు లభించుట ఆ జగన్మాత అనుగ్రహఫలమే కాని అన్యము కాదు.(తే.27 - 01 - 2025.)
0
comments
జైశ్రీరామ్.
26, జనవరి 2025, ఆదివారం
సుథాంబోధి.జీవాత్మ.వరాత్మ.నిష్ట,స్థావర,దోషార్తి.గర్భ"వర్ధనీయతా"వృత్తము, రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.
0
comments
జైశ్రీరామ్.
జైహింద్.
76వ గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు.
0
comments
జైశ్రీరామ్.
శ్రీమద్భారతమాత ముద్దుబిడ్డలగు యావద్భారతీయులకు 76వ సర్వసత్తాక గణతంత్ర సామ్రాజ్య దినోత్సవము సందర్భముగా శుభాకాంక్షలు.
శా. శ్రీమన్మంగళభారతాంబ సకలశ్రీపూర్ణ, యీ తల్లికిన్
క్షేమంబున్ వరగౌరవంబు జగతిన్ చెన్నార నిల్పంగ స
త్ప్రేమన్ భాతమాత బిడ్డలెల్లపుడు భక్తిన్ శక్తి వెచ్చించుతన్,
ధీమంతుల్ మన భారతీయులనగా తేజంబునే గాంచుతన్.
జైహింద్.
25, జనవరి 2025, శనివారం
మీస విలాసము. ... రచన. శ్రీ కోడూరి శేషఫణి శర్మ
0
comments
జైశ్రీరామ్.
రచయిత. శ్రీ కోడూరి శేషఫణి శర్మ
సీ||
పదునారు వయసులో పెదవిపై మృదువుగా
మొలకెత్తు మీసమ్ము మురిపెమౌను!
చురకత్తివలె దోచి కరవాలముగ సాగి
మగవాని మగటిమి జగతి జాటు!
కోరమీసము దువ్వ,కొంటెగా కనుగీట
ముదిత మురిసి మ్రోల మోకరిలును!
చివరలు మెలి ద్రిప్ప చెలియల మనములన్
చిలిపి యూహలనెన్నొ కలుగజేయు!
చెవిలోన గుసగుసల్ చెలికి జెప్పెడు వేళ
గిలిగింతతో నిడు పులకరింత!
అతివ యధరమంది యమృతమ్ము గ్రోలుచో
మధుర మిబ్బడి యౌను మగువలకును!
తరుణి తనువు పైన తారాడు మీసాలు
రసతంత్రులను మీటి రగులజేయు!
శృంగారసమయాన చిరుచెమటలు గ్రమ్మ
మీసమున్ బొగడుగా మెలత కరగి!
తే.గీ||
మగని మీసము మగువకు బిగువు నిడగ,
చెలుని శ్మశ్రువు చెలియకు చెలువమొసగ,
తరుణి తనియించు,మీసమున్ తడిమి తనియు,
మీసమున్నట్టి మగవాడె మేటి యనుచు!
కోడూరి శేషఫణి శర్మ
తే. 24 - 01 - 2025.
జైహింద్.
జపహోమార్చనం కుర్యాత్. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. జపహోమార్చనం కుర్యా - త్సు ధౌతచరణః శుచిః|
పాదశౌచవిహీనం హి - ప్రవివేశ నలం కలిః ||
తే.గీ. జపము హోమార్చనల్ చేయు సమయమునకు
ముందు కాళ్ళు కడుగుకొని పొలయుటొప్పు,
పాదశౌచవిహీనుని వదలఁబోక
కలి ప్రవేశించి కష్టముల్ కలుఁగఁ జేయు.
భావము. జపాలు, హోమాలు, అర్చనలు, పూజాది క్రతువులు ఆచరించే ముందు
శుభ్రముగా కాళ్ళు కడుక్కుని ప్రారంభించాలి. ఎవరైతే పాదాలు కడగకుండా
దైవ కార్యాలు చేసినా, మల మూత్ర విసర్జన తరువాత, భోజనం తరువాత,
బయట నుండి వచ్చిన తరువాత కాళ్ళు కడగరో ఆ కడగని పాదాల ద్వారా
కలి పురుషుడు ఇంట్లోకి ప్రవేశించి దరిద్రాలను, రోగాలను,
కలహాలను ప్రసాదిస్తాడు.
జైహింద్.
24, జనవరి 2025, శుక్రవారం
వందే భారతం. రచన. శ్రీసీయన్. నాగేశ్వరరావు. గానం. శ్రీమతి వల్లూరి సరస్వతి. Vande Bharatam Lyrics:CN Nageswararao. singer: Saraswathi Valluri
0
comments
23, జనవరి 2025, గురువారం
ఇంద్రియాణాం ప్రసంగేన. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. ఇంద్రియాణాం ప్రసంగేన - దోషమృచ్ఛత్యసంశయమ్ |
సంనియమ్య తు తాన్యేవ - తతః సిద్ధిం నియచ్ఛతి ||
(మనుస్మృతి)
తే.గీ. ఇంద్రి యాకర్షితుఁడు దోషమెలనిఁ జేయు,
నిల జితేంద్రియుఁడన శుభకలితుఁడె యగు,
నింద్రియములఁ జయించుమో సాంద్ర సుగుణ!
దోషమందక గొప్ప సంతోషము కను.
భావము. ఇంద్రియాల ఆకర్షణకు లోనయినవాడు పాపం చేస్తాడు. వాటిని
అదుపులో పెట్టినవాడు మంచి ఫలితాన్ని పొందుతాడు.
జైహింద్.
22, జనవరి 2025, బుధవారం
కవిసింహ పోకూరి కాశీపత్యవధాని 133వ జయంతి సందర్భముగా పురస్కారములు, కవిసమ్మేళనము.
0
comments
21, జనవరి 2025, మంగళవారం
కిమప్యస్తి స్వభావేన. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. కిమప్యస్తి స్వభావేన - సున్దరం వాప్యసున్దరమ్|
యదేవ రోచతే యస్మై - భవేత్ తత్తస్య సున్దరమ్||
తే.గీ. మనము కోరెడిదేదైన మహిని కనఁగ
సుందరంబెయైనఁ గన నసుందరంబె
యైననున్ సుందరంబెయౌ ననుపమమది,
భావననెనుండునంతయున్ భవ్యభావ!
భావము. ఈ లోకంలో ఏదైనా స్వభావరీత్యా అందంగా ఉన్ననూ లేకున్ననూ ,
ఎవడికైతే ఏదైతే నచ్చుతుందో అది అందంగా లేకున్ననూ అదే వాడికి
అందంగా తోస్తుంది.
జైహింద్.
20, జనవరి 2025, సోమవారం
అగ్నిహోత్రఫలా వేదాః. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. అగ్నిహోత్రఫలా వేదాః - శీలవృత్తఫలం శ్రుతమ్l
రతిపుత్రఫలా నారీ - దత్తభుక్తఫలం ధనమ్ll
తే.గీ. వేద ఫల మగ్ని యందున వేల్చుటెయగు,
సత్ప్రవర్త ఫలమగు శాస్త్రములకు,
పతిని గూడిపుత్రినిగాంచు టతివఫలము,
ధనము నకు దాన భోగముల్ తగిన ఫలము.
భావము. వేదము అగ్నిహోత్రార్చమే ఫలముగా కలది . శాస్త్రము సత్ప్రవర్తనయే
ఫలముగా కలది. స్త్రీ భర్తృసంగమమూ, తద్వారా పుత్రప్రాప్తీ ప్రయోజనంగా కలది.
ధనము దానం చేయఁబడుట, అనుభవింపఁబడుట ఫలముగా కలది.
జైహింద్.
మైత్రి అన్న అంశం మీద ఉపన్యాసము - వాగ్విదాంవర బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ. - మియాపూర్ మిత్రమండలి 18 - 01 - 2025.
0
comments
19, జనవరి 2025, ఆదివారం
యస్మాదభావీ భావీ వా. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. యస్మాదభావీ భావీ వా - భవేదర్థో నరం ప్రతి |
అప్రాప్తౌ తస్య వా ప్రాప్తౌ - న కశ్చిద్వ్యథతే బుధః || (మహాభారతం)
తే.గీ. కోరుకొనునది చేరునో, చేరబోదొ
దైవవశమది, దానికై తగదు వగవ,
జ్ఞాని వగవఁడు దేనినైనను సహించు,
నుత్తమునిలక్షణంబిది యుర్విపైన.
భావము. అదృష్టం అనేది దైవవశమైనందువల్ల మనిషికి ఇష్టమైన వస్తువులు
లభించవచ్చు లేదా లభించకపోవచ్చు. అందుచేత, జ్ఞానవంతుడైనవాడు
తనకు ఇష్టమైన వస్తువు లభించకపోయినా లేదా అనిష్టం కలిగినా దుఃఖపడడు.
జైహింద్.
కవుతా రామకృష్ణ యాదృచ్ఛిక సాధనావధానము.
1 comments
మనిషి గుణం గురించి స్వామీ వివేకానంద చెప్పినంత విపులంగా ఎవరూచెప్పలేదు.
0
comments
18, జనవరి 2025, శనివారం
ఆగమాపః ప్రజా దేశః. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. "ఆగమాపః ప్రజా దేశః - కాలః కర్మ చ జన్మ చ.!
ధ్యానం మంత్రోఽథ సంస్కారో, - దశైతే గుణహేతవః".!! (మనుస్మృతి)
తే.గీ. దైవము, పరిసరము, పని, త్రాగు నీరు,
దేశమును, జన్మ, కొనునుపదేశ, మంత్ర,
ధ్యాన విషయమున్, మనుకాల మను పదియును,
వ్యక్తి గుణముల మూలముల్, భక్తిపూర్ణ!
భావము. ఆరాధించు దైవము, త్రాగునీరు, చుట్టూ ఉండే పరివారము,
జన్మించిన దేశము, నివసించిన కాలము, చేయుపని, పుట్టిన పుట్టుక,
ధ్యానించు విషయము, ఉపదేశము పొందిన మంత్రము, లభించిన సంస్కారము.
ఈ పదిన్ని వ్యక్తులలోని గుణము లకు కారణము లగుచున్నవి.
జైహింద్.
17, జనవరి 2025, శుక్రవారం
అనేక శాస్త్రం బహు వేదితవ్యమ్. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. అనేక శాస్త్రం బహు వేదితవ్యమ్ - అల్పశ్చ కాలో బహుశ్చ విఘ్నాః ।
యత్ సారభూతం తదుపాసితవ్యం - హంసో యథా క్షీరమివామ్బుమధ్యాత్ ॥
తే.గీ. ఎఱుఁగ వలసిన గ్రంథము లెన్నొ కలవు,
కాలమల్పము, విఘ్నముల్ కలుఁగుచుండు,
క్షీరనీరంబులను హంస క్షీరముగొను,
మంచినట్టులే గొనవలె మనము, నరుఁడ!
భావము. చాలా గ్రంథాలు ఉన్నాయి, తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి,
కానీ సమయం పరిమితంగా ఉంది. మరియు అనేక అడ్డంకులు ఉన్నాయి.
కాబట్టి మనం హంస యే విధముగా క్షీరనీరముల మిశ్రమము నుండి క్షీరమును
మాత్రమే గ్రహించునో అట్టులే మనము కూడా సారవంతమైనవాటినే
గ్రహించవలెను.
జైహింద్.
అనవాప్యం చ శోకేన. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. అనవాప్యం చ శోకేన - శరీరం చోపతప్యతే
అమిత్రాశ్చ ప్రహృష్యన్తి - మా స్మ శోకే మతిం కృథా:
(విదురనీతి)
తే.గీ. దుఃఖపడినంత దొరకదు దూరమైన
దేదియైనను, తాప మహితము మిగులు,
శత్రువులు సంతసింతురు, జయనిధాన!
మెలగుమీవు దుఃఖము వీడి, మేలు గనుము.
భావము. శోకించినంత మాత్రాన కోరిన వస్తువు లభించదు. శరీరమా తాపము
చెందును. శత్రువులు సంతసించెదరు. అందువలన నీ మనస్సును శోకము వైపు
మళ్ళించకుము. దేనికీ దుఃఖింపకుము..
జైహింద్.
ఆహార నిద్రా భయ మైధునాని . ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. ఆహార నిద్రా భయ మైధునాని
సామాన్యమేతత్పశుభిర్నరాణాం
జ్ఞానంహి తేషా మధికో విశేషః
జ్ఞానేన హీనః పశుభిస్సమానః.
(ఉత్తర గీత 2-44)
తే.గీ. నిద్ర, భయ, మైధు నాహార క్షుద్రగుణము
లరయ పశువులన్ మనుజుల నాశ్రయించి
యుండు, జ్ఞానంబు నరునిలో నుండు, జ్ఞాన
హీన నరుఁడు పశు సముఁడు, భానుతేజ!
భావము. ఆహారము నిద్ర భయము మైధునము నాలుగును ప్రాణి ధర్మములు.
ఇవి జంతుకోటికి ఎంతటి అవసరమో మానవులకును ఆంతియే. అయిననిందు
విశేష మేమిటనిన మానవులకు జ్ఞానమనునది అధికముగా నున్నది.
పశువుల కది లేదు. అందువలన జ్ఞానహీనుడు పశు సమానుడు.
జైహింద్.
16, జనవరి 2025, గురువారం
గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ అష్టావధానము.Gummannagari Laxminarasimha Sharma
0
comments
దుష్కరం కిం మహాత్మనామ్? మహోదార గుణ సంపన్నులయిన బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శాస్త్రి మహోదయులకు అభినందన చందన చర్చ.
1 comments
జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శాస్త్రి .. అయోధ్య. 95507 54389 .
వీరి వితరణ అసామాన్యం. రామభక్తి అసాదృశం. ప్రజా సేవ అమోఘం.
వీరికి వీరి అర్థాంగి గారికి పాదాభివందనములు.
జైహింద్.
15, జనవరి 2025, బుధవారం
డా. ఎంవీ పటువర్ధన్ గారి శతావధాన ఆహ్వానపత్రిక. నిర్వహణ .. ప్రజ - పద్యం మరియుపిట్టిశ్రీరాములు తెలుఁగు విశ్వవిద్యాలయము.
0
comments
గోదాకల్యాణం - శతావధాని భరత్ శర్మ ప్రవచనం Goda Kalyanam pravachanam by Av...
0
comments
చిత్రకవి శ్రీ మరుమాముల దత్తాత్రేయశర్మ కృత తేటగీతి గర్భ చంపకమాల... శ్లోకానువాదము.
0
comments
జైశ్రీరామ్.
నాకు తన చిత్రకవితతో పరమానందమునందించిన
మా తమ్ముఁడు చి. మరుమాముల దత్తాత్రేయశర్మకు
ఆనందపారవశ్యంతో అమ్మవారి ఆశీస్సులు అర్ధిస్తున్నాను.
* * *
చిత్రకవి శ్రీ మరుమాముల దత్తాత్రేయశర్మ కృత శ్లోకానువాదము.
శ్లో. యత్నో హి సతతం కార్యః - తతో దైవేన సిద్ధ్యతి|
దైవం పురుషకారశ్చ - కృతాన్తేనోపపద్యతే||
👇🏼
తేటగీతి గర్భ చంపకమాల.
👇🏼
సతతము కార్యముల్ సలుప జాలుట ధర్మము సజ్జనాళికిన్
వ్రతముగ దైవమే బలము భాగ్యములిచ్చును ప్రాప్త సిద్ధికిన్
హితమగు సత్కృతుల్ జనులకీగతి సేమము సత్వశక్తియున్
జతగొని పూర్తియౌ మనుజ శక్తియు దైవము మంచిగూర్చుచున్
👇🏼
చంపకమాల గర్భస్థ తేటగీతి.
👇🏼
సలుప జాలుట ధర్మము సజ్జనాళి
బలము భాగ్యములిచ్చును ప్రాప్త సిద్ధి
జనులకీగతి సేమము సత్వశక్తి
మనుజ యత్నము దైవము మంచిగూర్చు.
భావము.
👇🏼
తమ ఇష్టసిద్ధికి నిరంతరం ప్రయత్నం చేయవలసినదే.
అప్పుడు దైవానుగ్రహం ఫలిస్తుంది. దైవానుగ్రహం, మానవప్రయత్నం,
కాలం వల్లనే సిద్ధిస్తాయి.
👌🏼
చిరంజీవి తమ్మునకు ఆ జగన్మాత ఆశీస్సులు నిండుగా ఉండుగాక.
పాఠకులు ఈ చిత్రకవితపై తమ అభినందనలందఁజేయఁగలరు.
జైహింద్.
14, జనవరి 2025, మంగళవారం
తునిలో గల తపోవనం పీఠాధిపతులు సచ్చిదానంద సరస్వతీస్వామివారితో సంతోష్ కుమార్ ఘనపాఠి చతుర్ముఖ సంభాషణ.
0
comments
హారతి కళ్ళకు అద్దుకోకూడదని ఎలా అనగలరు? బ్రహ్మశ్రీ సంతోష్ ఘనపాఠి గారి స్పష్టమైన సోపపత్తిక వివరణము. #Hindudharmakshetram #SantoshGhanapathi
0
comments
ఏకాదశ రుద్రుల స్తవము. ... రచన చింతా రామకృష్ణారావు.
0
comments
జైశ్రీరామ్.
"విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ
కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ
శ్రీమన్మహాదేవాయనమః"
అని రుద్రనమకంలో చెప్పబడింది.
దీనిప్రకారం ఏకాదశ రుద్రులపేర్లు
1. విశ్వేశ్వరుడు,
2.మహాదేవుడు,
3. త్ర్యంబకుడు,
4.త్రిపురాంతకుడు,
5.త్రికాగ్నికాలుడు,
6.కాలాగ్నిరుద్రుడు,
7.నీలకంఠుడు,
8.మృత్యుంజయుడు,
9.సర్వేశ్వరుడు,
10. సదాశివుడు,
11. శ్రీమన్మహాదేవుడు.
౧ తే.గీ. వినుత విశ్వేశ్వరా! నీదు విభవమెన్న
విశ్వవిజ్ఞానవేత్తకే వీలుపడును,
మానవుఁడనైన నేనెట్లు మన్ననమున
చెప్పఁనౌనయ? నీవె నన్ జేదుకొమ్ము.
౨ తే.గీ. ఓ మహాదేవ! సన్నామ! యో మహేశ!
నిన్ను సేవింప నీవౌచు నేనునొప్పి
నప్పుడే సాధ్యమౌనేమొ? యాదిశక్తి
కృపను పొంది నే సేవింతు నుపమ రహిత!
౩తే.గీ. ఓ త్రయంబకా! నీ శక్తి నొప్పుదీవె,
సాటినీకేది? జననియే సాటి నీకు,
నన్ను మన్నించి, నిన్ సదా మన్ననమున
జపము చేయంగఁ జేయుమా, జయనిధాన!
౪తే.గీ. వినుత త్రిపురాంతకా! నాదు వినుతి వినుము,
జ్ఞాన సంపత్ప్రభనుఁ గొల్పి కాంక్షతీర
నీదు రూపంబు మదిలోన మోదమునను
కాంచునట్టులఁ జేయుము, కాలకంఠ!
౫తే.గీ. హర! త్రికాగ్ని కాల! ధర మో హము ను వీడి
నీదు దివ్యాగ్ని తేజంబు నేను గనుచు
నిన్ను నభిషేకమునుఁ జేయనిమ్ము దయను,
వందనంబులు శ్రీకంఠ! సుందరాంగ!
౬తే.గీ. జయము! కాలాగ్ని రుద్రా! ప్రశాంతతనిడి
నీదు మహనీయ రూపంబు నేర్పు మీర
నాదు మదినెన్ని నిరతంబు మోదమలర
సేవలన్ జేసి తనియనీ, చిత్స్వరూప!
౭తే.గీ. నీలకంఠా! యుమానాథ! నిర్వికార!
నిత్యకల్యాణ కారకా! నీ మహత్వ
మెన్నుచున్ దృప్తి పొందనీ యీశ్వరుండ!
వందనంబులు శ్రీకంఠ! సుందరాంగ!
౮తే.గీ. దేవ! మృత్యుంజయ! జయము, దేవదేవ!
మృత్యుమార్గంబు నెడఁబాపి సత్యపథము
నందు నన్నిల్పి, నీ కృపనందనిమ్ము,
వందనంబులు శ్రీకంఠ! సుందరాంగ!
౯తే.గీ. దివ్య సర్వేశ్వరా! జ్ఞానదీప్తి నీవె,
సర్వమీసృష్టి నీదౌను నిర్వికార!
మంచినే పెంచి మాలోన మానవతను
దైవశక్తిగా మార్చుమా! తత్త్వమరయ.
౧౦తే.గీ. ఓ సదాశివా! లోక సద్భాసమాన
పూర్ణరూపంబునీది, నిను పూర్తిగాను
చూచు చిచ్ఛక్తి నాకిమ్ము శుభగుణాఢ్య!
వందనంబులు శ్రీకంఠ! సుందరాంగ!
౧౧తే.గీ. వినుత శ్రీమన్మహాదేవ! విశ్వనాథ!
ముక్తిమార్గము చేరంగ భక్తి నిమ్ము,
భక్తి నీ పాదములపైన వరలనిమ్ము,
వందనంబులు శ్రీకంఠ! సుందరాంగ!
🙏🏼🙏🏼🙏🏼
జైహింద్.