గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, అక్టోబర్ 2018, బుధవారం

అనులోమ విలోమ కందము.(అర్ధభ్రమకము).రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
అనులోమ విలోమ కందము.(అర్ధభ్రమకము).రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
(చిత్ర కవితాభిరామ మైన"-పారిజాతాప హరణమున"-శ్రీ,ముక్కు తిమ్మనార్యు విరచిత అనులోమ విలోమ కందము ననుసరించి).

"- అనులోమ విలోమ కందము""-
      ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^.
రామిత మతినామ!శమగ
నామ!సుగమనా! రమ యమ నమసా!సమసా!
సామస!సామనమ యమర
నామగ! సుమనా గమ!శమనాతిమ తమిరా!

రామిత మతి నామ=రమియింపబడే బుద్ధియను పేరుగల,శమగనామ=
ఓర్మి యనే పేరుగల,సుగమనా=మంచిగా నడిచే,సుమనా=మంచిమనస్సు
గల,శమనాతిమ=అతి ఓర్పుగల,తమిరా=కోర్కెరా,రామిత మతి నామ=
అతిమనోహరమైన,సామస సామన మ యమ ర=సామ్యమనే మంచి
మనస్సుతో కూడియున్న(లక్ష్మీ దేవి).నామగ సు మనా=శుద్ధ మనస్సను
పేరొందిన
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

‘నవరత్న మాలికా’ ... డా.కే రాజన్న శాస్త్రి గారు వివరణ డా. కొరిడేవిశ్వనాధశర్మగారు.

1 comments

జైశ్రీరామ్.
‘నవరత్న మాలికా’  ...   డా.కే రాజన్న శాస్త్రి గారు వివరణ డా. కొరిడేవిశ్వనాధశర్మగారు.
మా నాన్నగారు {డా.కే రాజన్న శాస్త్రి గారు ) 14 సంవత్సారలకు పూర్వం {13.9.1999} ‘కవితా విపంచీ’ అనే తనచిన్ననాటనుండి ఆయా సందర్భాలలో వ్రాసిన సంస్కృతకవితల పుస్తకమును విడుదల చేసినారు. దానిలో నుండి లలితాదేవీ తత్వమును తెలిపే ఈ ‘నవరత్న మాలికా’ యను పద్యనవరత్నములను శరన్నవరాత్రి సం దర్భమును పురస్కరించుకొని వ్రాయబడినది. “సూర్యోదయః” అను సంస్కృతపత్రికలో ప్రచురితమైనది. ఈ శరన్నవ రాత్రోత్సవముల సందర్భముగా మీకు నిత్యము అందించిననూ, అన్నింటినీ ఒకచోటనే అందింస్తే బాగుంటుందన్న సహృదయసుహృన్మిత్రుల ఆకాంక్షలతో మరల పూర్తి పూర్తి భాగమును మీకు అందిస్తున్నాను.
శా. శ్రీమచ్చంద్రకలావతంసరుచిరా కారుణ్యపూర్ణేక్షణా,
గర్వాఖర్వసుపర్వవైరివిపిన శ్రేణీదవాగ్నిచ్చటా|
శిష్టానిష్టనివారణోద్యమపరా స్రష్ట్రాదిసంసేవితా,
భూయాచ్చ్రీలలితాంబికా భగవతీ నః శ్రేయసే భూయసే || 1 ||
తా. శోభాయమానమానమగు చంద్రకళయే శిరోరత్నమై ప్రకాశించున్నటిదియునూ, కారుణ్యముతోనిండిన కన్నులు కలదియునూ,అత్యధికమైనగర్వముతోకూడిన రాక్షసులు అను అటవికి దావాగ్నిశిఖలు కలిదియునూ, సత్పురుషుల బాధలను నివారించుటయను ఉద్యమమే ప్రధానమైనట్టిదియునూ, బ్రాహ్మాదులచేత మిక్కిలి సేవించబడునట్టిదియునూ, అగు శ్రీ లలితాంబికాదేవి మిక్కిలి మనకు శ్రేయస్సును కలిగించునుగాక!

శిఖరిణి. ముఖే స్వే భాస్వత్వం నయనయుగళేఽబ్జత్వమధరే-
రుణత్వం సౌమ్యత్వం మనసి కుచయుగ్మే చ గురుతామ్|
కృపాయాం సత్కావ్యం నను గతిషు మాన్ద్యం, కచభరే
తమోభూయం, కేతుత్వమరిషు జయస్యంబ ! దధతీ ||2|
తా. అమ్మ ! నీ స్వముఖమునందు ప్రకాశత్వము { సూర్యలక్షణము}, నేత్రద్వయమునందు కమలత్వము { నీటినపుట్టిన చంద్రుని లక్షణము} , అధరమునందు అరుణత్వము { కుజుని లక్షణము}, మనస్సునందు సౌమ్యత్వము {బుధ లక్షణము} కుచయుగమునందు గురుత్వము {భారత్వము,/ గురులక్షణము} అనుగ్రహమునందు సత్కావ్యము {శుక్రలక్షణము}, గమనమునందు మందత్వము {శనిలక్షణము} కేశపాశమునందు అంధకారత్వము {రాహు లక్షణము}, శత్రువులందు విజయ ధ్వజమును {కేతులక్షణము} ఇట్టి లక్షణములను ధరించుచున్నదానవై విజయమును పొందుచున్నావు.

పృథ్వీ. సుమాయుధమనన్యజం నిజనిదేశసంచారిణం
హ్యపాంగవలనైర్ నిజైరధికసత్త్వసంపన్నతామ్|
నయన్త్యథ సుశిక్షితుం భువనమోహవిద్యామముం
కిమమ్బ ! ధృతవత్యసి త్వము సుమేషుమేతం కరే || 3||
తా. ఓ అమ్మ ! అన్యులెవ్వరి చేత జనించని {స్వయముగా జనించునట్టి} వాడై, నీ ఆదేశముల ప్రకారము నడుచునట్టివాడునూ అగు మన్మథునికి నీ క్రీగంటిచేతనే మిక్కిలి సత్త్వసంపన్నమైనదగు ఈ జగన్మోహనవిద్యను కల్గియున్నదానవై నీవు నేర్పుటకేనా చేతియందు ఈ పుష్పబాణమును ధరించుచున్నావు?

పృథ్వీ. పురాభవసుసంచితాన్యమితదీనదీనానన-
స్వసంశ్రితజనావలీకటువిపాకకర్మాణి భోః ! |
విధాతుమివ మాధురీరసభరాణి కారుణ్యతః
కరే కృతవతీ శివే ! విమలమిక్షుఖండం నిజే || 4 ||
తా. హే శివపత్ని/మంగళరూపిణి ! మిక్కిలిదుఃఖితులదీనమైనముఖములచేత ఆశ్రయించబడిన జనసమూహములకఠోరములై పరిపక్వములైన పూర్వజన్మ సంచితకర్మలను కారుణ్యముతో మధురరసభరితములుగా చేయబూనుచున్నావో యన్నట్లు నీ స్వహస్తమున నిర్మలమైన ఇక్షుదండమును ఉంచినావు.

పృథ్వీ. జగద్ధితముపేక్ష్య యే స్వహితమేవ చాశాసతే
సమే పశవ ఇత్యముం మనసికృత్య తాన్ ఘాతుకాన్ |
మదోద్ధతమహాసురాన్ దమయితుం మదేభాన్ సృణిం
కరే ధృతవతీ స్వకే మహిషమర్దినీ ! త్వం కిము || 5 ||
తా. హే మహిషమర్దిని ! లోకహితమును ఎవరైతే అశ్రద్ధవహించి, తమ హితమునే కోరుతుంటారో, వారు పశుసమానులు అని మనస్సున తలంచి ఆట్టి కౄరులగు మదొద్ధతులైన మహాసురులు అను మదపుటేనుగులను అణచుటకొరకు నీవు నీ చేతియందుఅంకుశమును ధరించితివా ఏమి ?

ఉపజాతి. సంసారవాప్యాం విషయగ్రహాయాం
నిపత్య పాహీతి లపంతమేతమ్ |
ఆర్తం సముద్ధర్తుమనాః స్వహస్తే
పాశం బిభర్ష్యంబ ! దయావతీ త్వమ్ || 6 ||
తా.అమ్మ! విషయమనే మొసళ్ళచేత నున్నట్టిదైన సంసారకూపమునందు పడిరక్షించమని వదురుచున్నట్టి ఈ నన్ను ఉద్ధరించుటకొరుచున్నదానివై నీవు నీ నిజహస్తమునందు ఫాశమును ధరించుచున్నావా?
( ఉపజాతి వృత్తము = 1, 3 ,4 పాదాలలో ఇంద్రవజ్ర , 2 వ పాదంలో ఉపేంద్ర వజ్ర)

అశ్వధాటీ. సైషా సుమేషురిపుయోషా మహోజ్జ్వలవిభూషా విశిష్టవపుషా
శేషాహితల్పసుతయోషామశేషసురయోషాసమాం విదధతీ |
భూషావతీ శిరసి దోషాకృతా మధురభాషాంచితా భవతు న-
స్తోషాయ నిర్మథితదోషాచరా వినతదోషాపనోదనిపుణా || 7 ||
తా. మిక్కిలి ప్రకాశమానమగు అలంకాములతోకకూడినట్టిదియునూ,విశిష్టమైన ఆకృతితో సమస్తదేవకన్యలతో సమానమైనదగు ఆదిశేషతల్పగుడగు శ్రీమహావిష్ణుకోడలైన రతీదేవిని ధరించినట్టిదియునూ, శిరస్సుయందు చంద్రునితో అలంకరిచబడినట్టిదియునూ,మధురమైన వాక్కులచేత {స్తోత్రములచేత} అలంకరింపబడినట్టిదియునూ, దుష్టసంహారిణియునూ వినతులదోషములనుతొలగించుటలో శ్రేష్ఠురాలునూ యగు అట్టి మన్మథశత్రువైన శివునిధర్మపత్ని మనల సంతోషములనిచ్చుగాక !

అశ్వధాటీ. స్థూలా కుచే జలదనీలా కచే జలజలీలా విలోచనయుగే
హేలావినిర్జితమరాలాతిశోభిగతిశీలా కుశేశయకరా |
బాలారుణప్రభసుచేలా కదంబవనలీలావిహారరసికా
బాలా భవాంబునిధివేలాం నయత్వచలబాలామణిర్జనమిమమ్|| 8 ||
తా. కుచములందు స్థూలత్వముగలదియునూ, కేశములందు మేఘములనీలవర్ణము గలదియునూ, నేత్రయుగళమునందు కమలముల విలాసము గలదియునూ, హేళనచేతనే
జయింపబడిన హంసల మిక్కిలి శోభాయమానమగు నడకలప్రవర్తన గలదియునూ, కమలములవంటి కరములు కలదియునూ, బాలాసూర్యుని కాంతులవంటి శోభిల్లు చీరను
ధరించినట్టీడియును అగు హైమవతీదేవి ఈ నన్ను సంసారసాగరము నుండి గట్టెక్కించు గాక !

భుజంగప్రయాతమ్. దహన్తీ స్మృతా వాసనాబీజజాతం
వహన్తీ దృగన్తే చ కారుణ్యపూరమ్ |
ధునానా మమైనశ్చిదానన్దరూపా
లసత్వన్తరంగే సదా మామకీనే || 9 |
తా. కేవలము స్మరణ మాత్రముచేతనే వాసనాబీజజాతమైన ఈ సాంసారికవిషయాసక్తిత్వమును దహింపజేయుచున్నట్టిదియునూ, తన కటాక్షవీక్షణమునందు కారుణ్యజలప్రవాహమును ప్రవహింపజేయునట్టిదియునూ, నా పాతకములను నశింపజేయునట్టిదియునూ అగు చిదానన్దరూపాత్మకమైన ఆ దేవి నిరంతరము నా అంతరంగమునందు ప్రకాశించునుగాక !
జైహింద్..

30, అక్టోబర్ 2018, మంగళవారం

నారదుఁడు చతురోక్తుల శ్రీకృష్ణుని నుతించుట ... చిత్ర బంధ గర్భ కవితాదులు.,

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! నమస్సులు.
చిత్రకవితాభిరామమయిన పారిజాతాపహరణమున ముక్కు తిమ్మన విరచించిన చిత్రకవితలనిట గమనించి, మనమూ వ్రాయుటకు యత్నింపనగును.
గమనింపుడు.
పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
నారదుఁడు చతురోక్తుల శ్రీకృష్ణుని నుతించుట
అనులోమ విలోమ కందము.
నాయశరగసార విరయ
తాయనజయసారసుభగధరధీనియమా
మాయనిధీరధగభసుర
సాయజనయతాయరవిరసాగరశయనా! 92
(దీని నర్ధభ్రమక కంద మనియు నందురు. మొదటి రెండు పాదములను దుది నుండి
వెనుకకుఁ జదివినచో మూఁడు నాలుగు పాదము లగును. అనఁగా బూర్వార్ధమును
ద్రిప్పి చదివినచో నుత్తరార్ధమును, ఉత్తరార్ధమును వెనుక నుండి చదివినచో
పూర్వార్ధమును నగునని భావము.)

పాదభ్రమక కందము.
ధీర శయనీయ శరధీ
మార విభానుమత మమత మనుభావిరమా
సార సవననవసరసా
దారద సమ తార హార తామసదరదా! 93
(పాదభ్రమక మనఁగా బ్రతిపాదమును వెనుకనుండి చదివినను నదే పాదము యగును.
దీనినే యనులోమ విలోమ పాద మనియు నందురు.)

గోమూత్రికా బంధ కందము.
విదళితదైత్య రమాగృహ
పదసారస వినతదేవ పతగేశహయా
చిదమిత చైత్యశమావహ
మదవారణ విమతభావమతపాశజయా! 94

నాగ బంధ చంపకమాల.
జలదవితాననీల ఖలసాలకులక్షతివారణేశ ని
శ్చలమునివారపాల సురచారణయక్షనవానుకూల కుం
డలివరహారలోల నరనారదతత్పర భూవిధేయ యు
జ్జ్వలమనునీతిశీలితవశంవద శక్రరమానికేతనా! 95

ఛురికా బంధ కందము.
శ్రీవర వరవరహృత భవ
భావన వనజాయతాక్ష పాలితవిబుధా
ధావితదనుభవనియమి స
భావనచతురా సముద్ధృతార్ణవ వసుధా! 96

చక్ర బంధ శార్దూలము.
చిత్రాకృత్యభినందిత వ్రజమృగాక్షీమధ్యగా యక్షరా
మిత్రోష్ణద్యుతిదిగ్ధచక్ర జనివల్మీకర్క్షపా కృష్ణభా
సత్రారాధ్య నుతింతు నిన్ను జగదీశా విక్రమాతిస్థిరా
రాత్రీ నాంచితభామితాబ్జ సదయా రాధానుభావాకరా! 97
(ఈ బంధమున మూఁడవ చుట్టున "కృష్ణరాయకృతి" యనియు
నాఱవ చుట్టున "నందితిమ్మకవి" యనియుఁ
గృతిపతి కృతిభర్త నామములు గూర్పఁబడి యున్నవి.)

ద్వ్యక్షరి కందము. 
మనమున ననుమానము నూ
నను నీనామ మనుమనుమననమునునేమ
మ్మున మాన నన్ను మన్నన
మను మను నానామునీనమానానూనా! 98
(ఈ కంద పద్యము "న, మ" యను రెండక్షరముల తోడనే సాగినది.
కావున దీనికి ద్వ్యక్షరి కంద మని పేరు. ఈ రెండక్షరములనే
గ్రహించుటచే నయ్యది నమః పూర్వకస్తుతి యైనది.)

ద్వికంద క్రౌంచపదవృత్తము:
క. అంకురితశ్రీ సంగభు
జాంకా హరిహయమణి మదహర తనువర్ణా
సంకటకృద్దైత్యాశయ
శంకాజనన నిజచరిత శయధృతశంఖా! 99
క. పంకజనాభా భంజిత
పంకా పరమపురుష భవపరిభవనామా
శంకరభావా కిసలయ
సంకాశపదయుగ కలశశరనిధిశయనా! 100
(పై రెండు కంద పద్యములను గలిపి వానిలోని రెండేసి పాదముల నేక పాదముగాఁ
జేసి చదివినచో నది నాలుగు పాదములు గల క్రౌంచపద వృత్త మగును.
లక్షణము: ప్రతి పాదము నందును భ, మ, స, భ, న, న, న, య, యను గణము లుండును.
పదు నొకండవ యక్షరమునకును బందొమ్మిదవ యక్షరమునకును ( ౧  -  ౧౧  -  ౧౯ ) యతి.)

భుజంగప్రయాతగర్భ స్రగ్విణి.
వాసుదేవా ఘనస్వచ్ఛకాంతీ రమా
వాస వంశస్వరవ్యక్తవేద క్రమా
రాసలాస్యప్రకార ప్రవీణోద్యమా
వాసవాదిస్తుతవ్యక్తనామా నమః. 101
(ఇది స్రగ్విణీ వృత్తము. దీనిలో మరొక భుజంగ ప్రయాత మను
వృత్త మిమిడి యున్నది. పద్యాంత మందలి "నమః" యను పదమును
"నమో" యని మొదటఁ జేర్చి చదివినచో భుజంగ ప్రయాత వృత్తమగును.
స్రగ్విణి లక్షణము: ఇందుఁ బ్రతిపాదము నందును నాలుగు "ర" గణము లుండును.
ఏడవ యక్షరము యతి.
భుజంగ ప్రయాత లక్షణము: ఇందుఁ బ్రతిపాదమునందును నాలుగు "య" గణము లుండును.
ఇందు నెనిమిదవ యక్షరము యతి)

క. అని చిత్రగతుల నవ్విభుఁ
గొనియాడి మునీంద్రుఁ డరిగె గోపవధూటి
జనతా వల్లభుఁడును మి
త్ర నికాయముతోడ నిజపురంబున కరిగెన్‌. 102
 జైహింద్.

29, అక్టోబర్ 2018, సోమవారం

వినయశ,సన్నయ,యశోవిరాజి,గుణవరీ,సునయనా,అభయా,చరితనిలు,ప్రభవా,వరగుణి,సృజనేశ,.గర్భ"-శశినయన"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
వినయశ,సన్నయ,యశోవిరాజి,గుణవరీ,సునయనా,అభయా,చరితనిలు,ప్రభవా,వరగుణి,సృజనేశ,.గర్భ"-శశినయన"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
               
"-శశినయన"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.స.స.న.య.న.న.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
పతి,గతి,యుతి,మతినిం!ప్రభవాదుల సృజనేశా!భవ హర సాంబ శివా?
సతి,సుత,యుత,జగతిం!సబబౌనటు మననిమ్మా!జవమున శుభగాలన్!
అతులిత గుణ వరదా!అభయంబిడు మనసారా!అవగతమవ దేవా!
భృతి నిడ మదిగొల్తుం!విభవంబుల వెలుగీవై!వివరిత గుణ సాంద్రా!

ప్రభవాదులు=రభవాదిగా, గల తెలుగు వత్సరములు,పుట్టుకలు.
 సృజనేశా=సృష్షికి ప్రభువా, సబబగునటు=సరియగునట్లు,
జవమున=సత్తువతో,అవగతమవ=అర్ధమగునటుల,బోధపడునట్లు,

1,గర్భగత"-వినయశ"-వృత్తము.
బృహతీఛందము.న.న.స.గణములు.వృ.సం.256.ప్రాసగలదు.
పతి,గతి,యుతి,  మతినిన్!
సతి,సుత,యుత,జగతిన్!
అతులిత గుణ వరదా!
భృతి నిడ,మది గొుతున్!!

2.గర్భగత"-సన్నయ"-వృత్తము.
బృహతీఛందము.స.న.య.గణములు.వృ.సం.124.ప్రాసగలదు.
ప్రభ వాదుల సృజ నేశా!
సబబౌ!నటుమన నిమ్మా!
అభయంబిడు మనసారా!
విభవంబుల వెలుగీవై!

3.గర్భగత"-యశోవిరాజి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.న.గగ.గణములు.వృ.సం.64.ప్రాసగలదు.
భవ హర సాంబ శివా!
జవమున శుభగాలన్!
అవగతమవ!దైవం!
వివరిత గుణసాంద్రా!

4.గర్భగత"-గుణవరీ"-వృత్తము.
ధృతిఛందము.న.న.స.స.న.య.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పతి,గతి,యుతి,మతినిం!ప్రభవాదుల సృజనేశా!
సతి,సుతయుత గతినిం!సబబౌనటు మననిమ్మా!
అతులిత గుణ వరదా!అభయంబిడు మనసారా!
భృతినిడ మది గొలుతుం!విభవంబుల వెలు గీవై!

5.గర్భగత"-సునయనా"-వృత్తము.
అత్యష్టీఛందము.స.న.య.న.న.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ప్రభవాదుల సృజనేశా!భవ హరసాంబశివవా!
సబబౌనటు మన నిమ్మా!జవమున శుభగాలన్!
అభయంబిడు మనసారా!అవగతమవ దైవమ్!
విభవం బుల వెలు గీవై!వివరిత గుణ సాంద్రా!

6.గర్భగత"-అభయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.న.య.న.న.త.న.న.లగ.గణములు.యతులు.10,18,
ప్రాసనీమముగలదు.
ప్రభవాదుల సృజనేశా!భవ.హర.సాంబశివా!పతి,గతి,యుతి,మతినిన్!
సబబౌనటు మననిమ్మా!జవమున శుభగాలం?సతి,సుత,యుత గతినిన్!
అభయంబిడు మనసారా!అవగత మవ దైవం!అతులిత గుణ వరదా!
విభవంబుల వెలు గీవై!వివరిత గుణ సాంద్రా!భృతినిడ మది గొలుతున్!

7.గర్భగత"-చరితనిలు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.త.న.న.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
భవ,హర,సాంబశివా!పతి,గతి,యుతి,మతినిన్!!
జవమున శుభగాలం!సతి,సుత,యుత,గతినిన్!
అవగత  మవ దైవం!అతులిత గుణ వరదా!
వివరిత గుణసాంద్రా!భృతి నిడ మది గొలుతున్!

8.గర్భగత"-ప్రభవా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.త.న.న.జ.త.న.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
భవహర సాంబశివా!పతి,గతి,యుతి,మతినిం!ప్రభవాదుల సృజనేశా!
జవమున శుభగాలం!సతి,సుత,యుత,గతినిం!సబబౌనటు మననిమ్మా!
అవగత మవ దైవం!అతులిత గుణ వరదా!అభయంబిడు మనసారా!
వివరిత గుణ సాంద్రా!భృతినిడ మది గొలుతుం!విభవంబులు వెలుగీవై!

9.గర్భగత"-వరగుణి"-వృత్తము.
ధృతిఛందము.స.న.య.న.న.స.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ప్రభవాదుల సృజనేశా!పతి,గతి,యుతి,మతినిన్?
సబబౌనటు మననిమ్మా?సతి,సుత,యుత,గతినిన్!
అభయంబిడు మనసారా!అతులిత గుణ వరదా!
విభవంబుల వెలుగీవై!భృతి నిడ మది గొలుతున్!

10,గర్భగత"-సృజనేశా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.న.య.న.న.స.న.న.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
ప్రభవాదుల సృజనేశా!పతి,గతి,యుతి,మతినిం?భవ హర సాంబశివా!
సబబౌనటు మననిమ్మా!సతి,సుత,యుతి,గతినిం!జవమున శుభగాలన్?
అభయంబిడు మనసారా!అతులిత గుణ వరదా!అవగత మవ!దేవా!
విభవంబుల వెలు గీవై!భృతినిడ మది గొలుతుం!వివరిత గుణ సాంద్రా!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

28, అక్టోబర్ 2018, ఆదివారం

గతికా,రక్ణణ,తృప్తిద,తయనాతస,మర్మాలయ,మానరె,లోకమేలు,క్రియాశీల,దాసోహం,గర్భ"-శుభాంగిర"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
గతికా,రక్ణణ,తృప్తిద,తయనాతస,మర్మాలయ,మానరె,లోకమేలు,క్రియాశీల,దాసోహం,గర్భ
"-శుభాంగిర"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                   

"-శుభాంగిర"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.త.య.ర.త.స.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
ధనమె!లోక మేలుచుండ?ధర్మానికి తావేదిల?దాసోహమ్మనక తప్పునా?
మనుత బీద నెంతు రొక్కొ?మర్మంబుల పుట్టే గద! మాసె న్లే,  శుభగమంబులున్?                                            
కనగ నౌనె?శీల రక్ష!కర్మంబది భ్రష్టాయెను!గాసిల్లం దగిన మూర్ఖమౌ?
జనని మెచ్చ తీర్చి దిద్దు!చర్మాంబరధారీ!శివ!శాసించవె?శుభగమంబవన్?

1గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.ప్రాసగలదు.
ధనమె!లోక మేలుచుండ?
మనుత బీద నెంతు రొక్కొ?
కనగ నౌనె?శీల రక్ష!
జనని మెచ్చ తీర్చి దిద్దు!

2.గర్భగత"-రక్షణ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.త.య.లల.గణములు.వృ.సం.205.ప్రాసగలదు.
ధర్మానికి తావేదిల?
మర్మంబుల పుట్టే గద!
కర్మంబది భ్రష్టాయెను!
చర్మాంబరధారీ!శివ!

3.గర్భగత"-తృప్తిద"-వృత్తము.
బృహతీఛందము.మ.న.ర.గణములు.వృ.సం.185.ప్రాసగలదు.
దాసోహమ్మనక తప్పునా?
మాసెన్లే?శుభగమంబులున్!
గాసిల్లం దగిన మూర్ఖమౌ?
శాసించవె?శుభగమంబవన్!

4.గర్భగత"-నరజత"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.త.య.లల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ధనమె!లోక మేలుచుండ?ధర్మానికి తావేదిల?
మనుత బీద నెంతు రొక్కొ?మర్మంబుల పుట్టేగద?
కనగ నౌనె?శీల రక్ష! కర్మంబది భ్రష్టాయెను!
జనని మెచ్చ తీర్చి దిద్దు!చర్మాంబర ధారీ!శివ!

5.గర్భగత"-తయసా తస"-వృత్తము.
అత్యష్టీఛందము.త.య.స.త.స.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ధర్మానికి తా వేదిల?దాసోహమ్మనక తప్పునా?
మర్మంబుల పుట్టేగద?మాసెన్లే?శుభ గమంబవన్?
కర్మంబది భ్రష్టాయెను!గాసిల్లం దగిన మూర్ఖమౌ?
చర్మాంబర ధారీ!శివ!శాసించవె?శుభగమంబవన్?

6.గర్భగత,లఘ్వంత"-మర్మాలయ"-.
ఉత్కృతిఛందము.త.య.స.త.స.జ.స.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
ధర్మానికి తావేదిల?దాసోహమ్మనక తప్పునా?ధనమె!లోక మేలుచుండ?
మర్మంబుల పుట్టే గద?మాసెన్లే?శుభ గమంబవం!మనుత బీద. నెంతురొక్కొ?                                                     కర్మంబది భ్రష్టాయెను! గాసిల్లం దగిన మూర్ఖమౌౌ?కనగ నౌనె? శీల రక్ష!
చర్మాంబరధారీ!శివ!శాసించవె?శుభగమంబవం?జనని మెచ్చ తీర్చి దిద్దు!

7.గర్భగత"-మానరె"-వృత్తము.
ధృతిచందము.మ.న.ర.న.ర.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
దాసోహమ్మనక తప్పునా?ధనమె!లోక మేలుచుండ?
మాసెన్న్లే? శుభగమంబులుం!మనుత బీద నెంతు రొక్కొ?
గాసిల్లం దగిన మూర్ఖమౌ? కనగ నౌనె?శీల రక్ష!
శాసించవె? శుభ గమంబవం?జనని మెచ్చ తీర్చి దిద్దు!

8.గర్భగత"-లఘ్వంత"-లోకమేలు.
ఉత్కృతిఛందము.మ.న.ర.న.ర.జ.త.య.లల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
దాసోహమ్మనక తప్పునా?ధనమె!లోక మేలుచుండ?ధర్మానికి తావేదిల?
మాసెన్లే? శుభంబులుం!మనుత,బీద నెంతు రొక్కొ?మర్మంబుల పుట్టే గద?                                                         గాసిల్లందగిన మూర్ఖమౌ? కనగ నౌనె!శీల రక్ష!కర్మంబది భ్రష్టాయెను!
శాసించవె? శుభగమంబవం?జనని మెచ్చ తీర్చి దిద్దు!చర్మాంబరధారీ!శివ!

9,గర్భగత"-క్రియాశీల"-వృత్తము.
అత్యష్టీఛందము.త.య.న.స.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ధర్మానికి తావేదిల?ధనమె!లోక మేలుచుండ?
మర్మంబుల పుట్టే గద?మనుత బీద నెంతు రొక్కొ?
కర్మం బది భ్రష్టాయెను! కనగ నౌనె? శీల రక్ష!
చర్మాంబర ధారీ! శివ! జనని మెచ్చ తీర్చి దిద్దు!

10,గర్భగత"-దాసోహం"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.య.న.స.జ.ర.త.న.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
ధర్మానికి తావేదిల?ధనమె!లోక మేలుచుండ?దాసోహమ్మనక తప్పునా?
మర్మంబుల పుట్టేగద?మనుత బీద నెంతు రొక్కొ?మాసెన్లే?శుభ గమంబులున్!
కర్మం బది భ్రష్టా యెను!కనగ నౌనె?శీల రక్ష!గాసిల్లం దగిన మూర్ఖమౌ?
చర్మాంబరధారీ!శివ!జనని మెచ్చ తీర్చి దిద్దు!శాసించవె?శుభగమంబవన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

27, అక్టోబర్ 2018, శనివారం

భాసిజ,భ్రమక,భూజావర,యేపొనరు,దిగుడెదుగు,పంతుగాని,స్వార్ధసిరి,నేటిస్వేచ్ఛ,ఎదుగు,ఎండమావిజల,-గర్భ,"-గతవైభవ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
భాసిజ,భ్రమక,భూజావర,యేపొనరు,దిగుడెదుగు,పంతుగాని,స్వార్ధసిరి,నేటిస్వేచ్ఛ,ఎదుగు,ఎండమావిజల,-గర్భ,"-గతవైభవ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                 
"-గతవైభవ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.జ.ర.న.జ.ర.న.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
ఏడు పదులు స్వేచ్ఛ యందు! నెంత ఎత్తు నెదిగి తీవు?ఎండమావి  జలమటున్?                                                
పాడు పడెను నీమ నిష్ట!పంతుదప్పె కులమతాలు!పండుటాకు నిలుపునన్?
కీడు గనెను ప్రజ్ఞ ఠీవి! గెంతె స్వార్ధ సిరి వరామ ! గిండి దక్కె జనముకున్?
వేడుకొనెదు!మార్పు కోరి!వింత చాలు భరత మాత!వెండి శోభ లిడుమిలన్?
పండుటాకునిలుపు=పండుటాకు నిలకడ,గిండి=కమండలము,వెండి=మరల
శోభలిడు =శోభలునొసగు.స్వార్ధసిరి=స్వార్ధపూరితమైన సంపద.

1
గర్భగత"-భాసిజ"-వృత్తము.
బృహతీఛందము.భ.స.జ.గణములు.వృ.సం.351.ప్రాసగలదు.
ఏడు పదుల స్వేచ్ఛ యందు!
పాడు పడెను నీమ నిష్ట!
కీడు గనెను ప్రజ్ఞ ఠీవి!
వేడు కొనెదు మార్పు కోరి!

2.గర్భగత"-భ్రమక"-వృత్తము.
బృహతీఛందము.ర.న.జ.గణములు.వృ.సం.379.ప్రాసగలదు.
ఎంత యెత్తు ఎదిగి తీవు?
పంతుదప్పె కుల మతాలు!
గెంతె స్వార్ధ సిరి వరామ!.
వింత చాలు భరత మాత!

3.గర్భగత"-భూజావర"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.న.లగ.గణములు.వృ.సం.123.ప్రాసగలదు.
ఎండమావి జల మటుల్?
పండుటాకు నిలుపునన్?
గిండి దక్కె జనముకున్!
వెండి శోభ లిడు మిలన్?

4.గర్భగత"-ఏపొనరు"-గణములు
.ధృతిఛందము.భ.స.జ.ర.న.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఏడు పదుల స్వేచ్ఛ యందు!ఎంత యెత్తు యెదిగి తీవు?
పాడు పడెను నీమ నిష్ట!పంతు దప్పె కుల మతాలు!
కీడు గనెను ప్రజ్ఞ ఠీవి! గెంతి స్వార్ధసిరి వరామ!
వేడుకొనెదు! మార్పు కోరి!వింత చాలు భరత మాత!

5.గర్భగత"-దిగుడాదుగె"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.జ.ర.న.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఎంత యెత్తు ఎదిగి తీవు?ఎండమావి జలమటుల్?
పంతు దప్పె కుల మతాలు!పండుటాకు నిలుపునన్?
గెంతె స్వార్ధసిరి వరామ!గిండి దక్కె జనముకున్?
వింత చాలు భరత మాత!వెండి శోభ లిడుమిలన్?

6.గర్భగత.లఘ్వంత"-పంతుగానని"-.
ఉత్కృతిఛందము.ర.న.జ.ర.న.య.న.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
ఎంత యెత్తు ఎదిగి తీవు?ఎండమావి జలమటుల్?ఏడుపదులు స్వేచ్ఛ యందు!                                                
పంతుదప్పె కులమతాలు!పండుటాకు నిలుపునం?పాడు పడెను నీమనిష్ట!                                                      
గెంతె! స్వార్ధసిరి వరామ!గిండి దక్కె!జనముకుం?కీడు గనెను ప్రజ్ఞ ఠీవి!
వింత చాలు భరత మాత!వెండి శోభ లిడు మిలం?వేడు కొనెదు!మార్పు కోరి!
                                                                                             

7.గర్భగత"-స్వార్ధసిరి"-వృత్తము.
అత్యష్టీఛందము,ర.న.య.న.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఎండమావి జలమటుల్?ఏడుపదుల స్వేచ్ఛ యందు!
పండుటాకు నిలుపునం?పాడుపడెను నీమ నిష్ట!
గిండి దక్కె జనముకుం?కీడుగనెను ప్రజ్ఞ ఠీవి!
వెండి శోభ లిడు మిలం?వేడుకొనెదు!మార్పు కోరి!

8.గర్భగత లఘ్వంత"-నేటిస్వేచ్ఛ"-.
ఎండమావి జలమటుల్?ఏడుపదుల స్వేచ్ఛ యందు!ఎంత యెత్తు?ఎదిగి తీవు?                                                
పండుటాకు నిలుపునం!పాడు పడెను నీమ నిష్ట!పంతు దప్పె కుల మతాలు!                                                    
గిండి దక్కె జనముకుం?కీడు గనెను ప్ర జ్ఞ ఠీవి!గెంతె స్వార్ధసిరి వరామ!
వెండి శోభ లిడుమిలం?వేడుకొనెదు!మార్పు కోరి!వింత చాలు భరతమాత!
                                                                           

9,గర్భగత"-ఎదుగు"-వృత్తము.
ధృతిఛందము.ర.న.జ.భ.సజ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఎంత యెత్తు ? ఎదిగి తీవు! ఏడుపదుల స్వేచ్ఛ యందు!
పంతుదప్పె కుల మతాలు!పాడుపడెను నీమ నిష్ట!
గెంతె స్వార్ధసిరి వరామ! కీడు గనెను ప్ర జ్ఞ ఠీవి!
వింత చాలు భరత మాత!వేడు కొనెదు మార్పు కోరి!

10,గర్భగత"-ఎండఎండమావిజలవృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.జ.భ.స.జ.ర.న.లగ.గణములు.యతులు.10,19,
ప్రాసనీమముగలదు.
ఎంత యెత్తు ఎదిగి తీవు?ఏడుపదుల స్వేచ్ఛ యందు!ఎండమావి జలమటుల్?
పంతు దప్పె కులమతాలు!పాడుపడెను నీమ నిష్ట!పండుటాకు నిలుపునన్                                                      
గెంతె స్వార్ధసిరి వరామ!కీడుగనెను ప్రజ్ఞ ఠీవి!గిండి దక్కె జనముకున్?
వింత చాలు భరతమాత!వేడుకొనెదు మార్పు కోరి!వెండి శోభ లిడు మిలన్!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

26, అక్టోబర్ 2018, శుక్రవారం

సంతోషస్త్రిషు కర్తవ్యః ... మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. సంతోషస్త్రిషు కర్తవ్యః స్వదారే భోజనే ధనే 
త్రిషుచైవ న కర్తవ్యోధ్యయనే జపదానయోః
ఆ.వె భార్య విషయమందు, వంటకంబులయందు, 
ధనమునందు తృప్తి మనకు తగును.
చదువు, దాన, జపములఁ దనియ కుండుట
మేలు కూర్చు మనకు శ్రీలు కూర్చు.
భావము.తనభార్య,భోజనం,ధనం - అనే మూడిటియందు సంతుష్టి ఉండాలి. అధ్యయనం, జపం, దానం అనే 
మూడిటియందు మాత్రం ఉండకూడదు!
జైహింద్.

25, అక్టోబర్ 2018, గురువారం

భాసిజ,లీలా,మహత్వ,సేవల,కేళినీ,రాణిత,తజరాభస,ఆటపట్టు,అందగా,శిఖరిణీ,గర్భ"-అన్వేషణా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
భాసిజ,లీలా,మహత్వ,సేవల,కేళినీ,రాణిత,తజరాభస,ఆటపట్టు,అందగా,శిఖరిణీ,గర్భ"-అన్వేషణా"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                     
"-అన్వేషణా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.జ.ర.న.ర.భ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
అందు వరకు కాళ్ళు పట్టి!యంది నంత సిక  పట్టి!యాడింతు రదేమి,పాపమో!
సందు వెదకు స్వార్ధ మొప్ప!చందనాన సిరి యాన!జాడింతురు తోక గొప్పగా!
వందనములు కోరు చుంద్రు!వందిమాగదులు మెచ్చ!పాడెంతురు!భేదభావనన్?                                                   కంద దురద భంగిమాల!కంధరాలు దునుమాడి!కాడేర్తురు లోక భాతినిన్?

కంధరము=కంఠములు,దునుమాడి=నరికి,కాడేర్తురు=స్మశానము జేతురు,
లోక భాతి=లోక ప్రకాశములను(ప్రకృతి వనరులను),చందనాన=అందములో,
సిరియాన=సిరియాజ్ఞను,పాడు+ఎంతురు=చెడును కోరుదురు, వంది
మాగదులు=వెనుకజేరి తాళము వేయువారు.

1.గర్భగత"-భాసిజ"-వృత్తము.
బృహతీఛందము.భ.స.జ.గణము.వృ.సం.351.ప్రాసగలదు.
అందు వరకు కాళ్ళు పట్టి!
సందు వెదకు స్వార్ధ మొప్ప!
వందనములు కోరు చుంద్రు!
కంద దురద భంగి మాల!

2.గర్భగత"-లీలా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.న.గల.గణములు.వృ.సం.187.ప్రాసగలదు.
అంది నంత సిక పట్టి!
చందనాన సిరి యాన?
వందిమాగదులు మెచ్చ!
కంధరాలు దును మాడి!

3.గర్భగత"-మహత్వ"-వృత్తము.
బృహతీఛందము.త.జ.ర.గణములు.వృ.సం.173.ప్రాసగలదు.
ఆడింతు రదేమి పాపమో?
జాడింతురు తోక గొప్పగా!
పాడెంతురు భేద భావనన్?
కాడేర్తురు లోక భాతినిన్?

4.గర్భగత"-సేవల"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.స.జ.ర.న.గల.గణములు.యతి.10,వయక్షరము.
ప్రాసనీమముగలదు.
అందు వరకు కాళ్ళు పట్టి! అంది నంత సిక పట్టి!
సందు వెదుకు స్వార్ధ మొప్ప!చందనాన సిరి యాన?
వందనములు కోరు చుంద్రు?వందిమాగదులు మెచ్చ!
కంద దురద భంగిమాల!కంధరాలు దును మాడి!

5.గర్భగత"-కేళినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.స.జ.ర.న.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
అందినంత సిక పట్టి ?యాడింతు రదేమి పాపమో?
చందనాన సిరి యాన?జాడింతురు తోక గొప్పగా!
వందిమాగదులు మెచ్చ!పాడెంతురు భేద భావనన్?
కంధరాలు దునుమాడి!కాడేర్తురు లోక భాతినిన్?

6.గర్భగత" లఘ్వంత-రాణిత"ము.
ఉత్కృతిఛందము.ర.న.ర.భ.ర.య.న.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
అంది నంత సిక పట్టి!యాడింతు రదేమి పాపమో?అందువరకు కాళ్ళుపట్టి!
చందనాన సిరియాన!జాడింతురు తోక గొప్పగా!సందు వెదుకు మార్గ మొప్ప!
వందిమాగదులు మెచ్చ!పాడెంతురు భేదభావనం?వందనములు కోరుచుంద్రు?                                                   కంధరాలు దునుమాడి!కాడేర్తురు లోక భాతినిం?కంద దురద భంగిమాల!

7 గర్భగత"-తజరాభస"-వృత్తము.
ధృతిఛందము.త.జ.ర.భ.స.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ఆడింతు రదేమి పాపమో?అందు వరకు కాళ్ళు పట్టి!
జాడింతురు తోక గొప్పగా!సందు వెదుకు మార్గ భావనం
పాడెంతురు భేద భావనం?వందనములు కోరు చుంద్రు?
కాడేర్తురు లోక భాతినిం?కంద దురద భంగిమాల!

8.గర్భగత"-లఘ్వంత ఆటపట్టు"-.
ఉత్కృతిఛందము.త.జ.ర.భ.స.జ.ర.న.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు
ఆడింతు రదేమి పాపమో?అందువరకు కాళ్ళు పట్టి!అందినంత సిక పట్టి!
జాడింతురు తోక గొప్పగా!సందు వెదుకు మార్గ మొప్ప!చందనాన సిరి యాన!
పాడెంతురు భేద భావనం?వందనములు కోరుచుంద్రు!వందిమాగదులు మెచ్చ!
కాడేర్తురు లోక భాతినిం?కంద దురద భంగిమాల!కంధరాలు దునుమాడి?

9.గర్భగత"-అందగా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.ర.ర.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
అందినంత సిక  బట్టి!అందు వరకు కాళ్ళు పట్టి!
చందనాన సిరి యాన!సందు వెదుకు మార్గ మొప్ప!
వందిమాగదులు మెచ్చ!వందనములు కోరుచుంద్రు!
కంధరాలు దునుమాడి!కంద దురద భంగిమాల?

10,గర్భగత"-శిఖరిణీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.ర.న.జ.రనభ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
అంది నంత సిక బట్టి!అందు వరకు కాళ్ళు పట్టి!ఆడింతు రదేమి పాపమో?
చందనాన సిరి యాన!సందు వెదుకు మార్గమొప్ప!జాడింతురు తోక గొప్పగా!
వంది మాగదులు మెచ్చ! వంద నములు కోరు చుంద్రు!పాడెంతురు భేద భావనన్?                                               కంధరాలు దునుమాడి!కంద దురద భంగిమాల!కాడేర్తురు లోక భాతినిన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

24, అక్టోబర్ 2018, బుధవారం

సృజనా,ప్రమాణీ,మత్తరజినీ,సద్దూర,జరా మజా,గరీయమే,కనరాని,పాపార్తి,మాయామయ,ప్రభాహీన,గర్భ"-మాయేలు"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
సృజనా,ప్రమాణీ,మత్తరజినీ,సద్దూర,జరా మజా,గరీయమే,కనరాని,పాపార్తి,మాయామయ,ప్రభాహీన,గర్భ"-మాయేలు"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                   
"-మాయేలు"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.త.న.జ.ర.మ.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
ధనమే!ధర్మాన్ని కొనెను!ధరాతలాన నీతేదీ?దాసి స్వేచ్ఛ తీరిదే యనన్?
మనసే!కోట్లాశ దనరె!మరింత మాయ నేలెంగా?మాసిపోవ భారతీ ప్రభల్!
ఘనతే?పాపార్తి నమరె!గరీయమంచు! తూలెన్లే?గాసిలంగ జేసి రమ్మరో?
కనునే?సామ్యంబు ధరణి!కరం బశాంతి సౌధాలం!కాసులేని బీద చైదతన్?

1.గర్భగత"-సృజనా"-వృత్తము.
బృహతీఛందము.స.త.న.గణములు.వృ.సం.484.ప్రాసగలదు.
ధనమే!ధర్మాన్ని కొనెను!
మనసే!కోట్లాశ దనరె!
ఘనతే?పాపార్తి నమరె!
కనునే?సామ్యంబు ధరణి!

2.గర్భగత"-ప్రమాణీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.జ.ర.లగ.గణములు.వృ.సం.86.ప్రానగలదు.
ధరా తలాన! నీతేదీ?
మరిం మాయ!నేలెంగా?
గరీయ మంచు! తూలెన్లే?
కరం బశాంతి సౌధాలన్!

3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
దాసి స్వేచ్ఛ! తీరిదే?యనన్!
మాసిపోవ!భారతీ ప్రభల్?
గాసిలంగ! జేసి రమ్మరో?
కాసులేని బీద చైదతన్?

4.గర్భగత"-సద్దూర"-వృత్తము.
అత్యష్టీఛందము.స.త.న.జ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ధనమే?ధర్మాన్ని కొనెను!ధరాతలాన!నీతేదీ?
మనసే?కోట్లాశ దనరె?మరింత మాయ నేలెంగా?
ఘనతే?పాపార్తి నమరె?గరీయమంచు తూలెన్లే?
కనునే?సామ్యంబు దరణి?కరం బశాంతి!సౌధాలన్?

5,గర్భగత"-జరామజా"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.ర.మ.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ధరాతలాన!నీతేదీ?దాసి స్వేచ్ఛ!తీరిదే?యనన్?
మరింత మాయ నేలెంగా?మాసి పోవ!భారతీ ప్రభల్?
గరీయ మంచు తూలెన్లే?గాసిలంగ!జేసి రమ్మరో?
కరం బశాంతి సౌధాలం? కాసు లేని బీద చైదతన్?

6.గర్భగత"-లఘ్వంత"గరీయమే",
ఉత్కృతిఛందము.జ.ర.మ.జ.ర.జ.య.భ.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
ధరా తలాన! నీతేదీ?దాసి!స్వేచ్ఛ తీరిదే?యనం! ధనమే?ధర్మాన్ని కొనెను!
మరింత మాయ నేలెంగా?మాసిపోవ! భారతీ ప్రభల్?మనసే?కోట్లాశ దనరె?
గరీయ మంచు తూలెన్లే?గాసిలంగ!జేసి రమ్మరో?ఘనతే?పాపార్తి నమరె!
కరం బశాంతి సౌధాలం?కాసు లేని బీద చైదతం?కనునే?సామ్యంబు ధరణి?

7.గర్భగత"-కనరాని"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.స.త.న.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
దాసి స్వేచ్ఛ తీరిదే?యనం! ధనమే?ధర్మాన్ని కొనెను!
మాసి పోవ!భారతీ ప్రభల్! మనసే?కోట్లాశ దనరె?
గాసిలంగ జేసి రమ్మరో?ఘనతే?పాపార్తి నమరె!
కాసు లేని బీద చైదతం?కనునే?సామ్యంబు ధరణి?

8.గర్భగత"-పాపార్తి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.స.త.న.జ.ర.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
దాసి స్వేచ్ఛ తీరిదే?యనం! ధనమే?ధర్మాన్ని కొనెను!ధరాతలాన!నీతేదీ?
మాసిపోవ?భారతీ ప్రభల్! మనసే?కోట్లాశ దనరె?మరింత మాయ నేలెంగా?
గాసిలంగ జేసి రమ్మరో?ఘనతే?పాపార్తి నమరె! గరీయమంచు తూలెన్లే?
కాసు లేని బీద చైదతం?కనునే?సామ్యంబు!ధరణి?కరం బశాంతి సౌధాలన్?

9.గర్భగత"-మాయామయ"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.ర.త.య.భ.లల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
ధరాతలాన!నీతేదీ?ధనమే?ధర్మాన్ని కొనెను!
మరింత మాయ నేలెంగా?మనసే?కోట్లాశ దనరె?
గరీయమంచు తూలెన్లే?ఘనతే?పాపార్తి నమరె!
కరం బశాంతి సౌధాలం?కనునే?సామ్యంబు ధరణి?

10,గర్భగత"-ప్రభావిహీన"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.ర.త.య.భ.స.జ.ర.లగ.గణములు.యతులు.9,18.ప్రాసనీమమముగలదు.
ధరా తలాన నీతేదీ?ధనమే?ధర్మాన్ని కొనెను!దాసి స్వేచ్ఛ తీరిదే!యనన్?
మరింత మాయ!నేలెంగా?మనసే?కోట్లాశ దనరె?మాసిపోవ!భారతీ ప్రభల్!
గరీయ మంచు తూలెన్లే?ఘనతే?పాపార్తి నమరె!గాసిలంగ జేసి రమ్మరో?
కరం బశాంతి సౌధాలం?కనునే?సామ్యంబు ధరణి!కాసు లేని బీద చైదతన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

23, అక్టోబర్ 2018, మంగళవారం

మత్తరజినీద్వయ,సమాశ్రీ,వసుగంధి.సుగంధినీ,రజినీకరప్రియద్వయ,కల్పద్రుమద్వయ,యతిర్నవసుగంధి,కొంగుబంగరు,గర్భ"-గిరివరదమ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
మత్తరజినీద్వయ,సమాశ్రీ,వసుగంధి.సుగంధినీ,రజినీకరప్రియద్వయ,కల్పద్రుమద్వయ,యతిర్నవసుగంధి,కొంగుబంగరు,గర్భ"-గిరివరదమ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                             

-"గిరివరదమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
నీతిలేని తీర్పు లిక్కలిం!నీమ,నిష్ట,భ్రష్టు  పర్చు!నేవగింత్రు భావి సంతతుల్!భావి మచ్చ తెచ్చి పెట్టుగా!సామ సౌష్టవంబు మాపు!చావు దెబ్బ నందు                                                                                                 శీలమున్!
భూత కర్మ నామమాత్రమౌ!భూమి కంపనంబు నొప్పు!పోవు గాదె?గౌరవంబిలన్!
                                                                                             
చేతనాలు నిచ్ఛ మీరులే!సీమ లెల్ల నీట మున్గు!జీవ నాడి కుంచితంబగున్?

భావము:-నీతిని వీడి వినుకలిబట్టి,యిక్కలి కాలమున నిచ్చేతీర్పులు,
నీమ,నిష్టలను భ్రష్టు పరచును!భావి సంతతుల జన్మ కారకులను తెలిసి
కోలేక,నేవగింతురు.జాతికే తీరని మచ్చ తెచ్చి పెట్టును.కులములు సంకర
మౌను.సామ్యతా సౌష్టవము పూర్తిగా మాపి వేయును.శీలము చావుదెబ్బ
తినును.కర్మజీవులు చేయుకర్మ నామ మాత్రముగా నిల్చును.భూమాత
ఈ ,దురాగతాలకు తట్టుకో లేక కంపించును.(భూకంపము లేర్పడును).
భూమియందు గౌరము పోవును.చేష్టలు కోర్కె లతిశయించును.సమస్త
సీమలు నీట మున్గును.(ప్రళయములేర్పడును).జీవన ప్రమాణము కుంచిత మౌను.గతి కోరని మితి మీరు నూహ,విననాశ హేతువగును.

1.గర్భగత"-మత్తరజినీద్వయ"-వృత్తములు
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృసం.171.ప్రాసగలదు.
1.నీతిలేని తీర్పు లిక్కలిన్!          2.నేవగింత్రు భావి సంతతుల్!
   జాతి మచ్చ తెచ్చి పెట్టుగా!          చావుదెబ్బ నందు శీలమున్?
   భూత కర్మ నామమాత్ర మౌ!        పోవుగాదె?గౌరవంబిలన్!
   చేతనాలు నిచ్ఛ మీరులే!            జీవనాడి కుంచితం బగున్?

2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
నీమ,నిష్ట, భ్రష్టు పర్చు!
సామ సౌష్టవంబు మాపు!
భూమి కంపనంబు నొప్పు?
సీమ లెల్ల నీట మున్గు!

3.గర్భగత"-వసుగంధి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నీతిలేని తీర్పు లిక్కలిం?నీమ,నిష్ట భ్రష్టు పర్చు!
జాతి మచ్చ తెచ్చిపెట్టుగా!సామ సౌష్టవంబు మాపు!
భూత కర్మ నామ మాత్రమౌ?భూమి కంపనంబు నొప్పు!
చేతనాలు నిచ్ఛ మీరులే!  సీమ లెల్ల నీట మున్గు!

4.గర్భగత"--సుగంధినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నీమ,నిష్ట,భ్రష్టు,పర్చు!నేవగింత్రు భావి సంతతుల్?
సామ సౌష్టవంబు మాపు!చావు దెబ్బనందు శీలమున్?
భూమికంపనంబు నొప్పు!పోవుగాదె?గౌరవంబిలన్!
సీమ లెల్ల నీట మున్గు!జీవనాడి!కుంచితంబగున్?

5.గర్భగత"-రజినీకరప్రియ"-వృత్తద్వయం".
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1.
నేవగింత్రు భావి సంతతుల్!నీతి లేని తీర్పు లిక్కలిన్?
చావుదెబ్బ నందు శీలముం?జాతి మచ్చ తెచ్చి పెట్టుగా!
పోవుగాదె?గౌరవం బిలం!భూత కర్మ నామ మాత్రమౌ?
జీవనాడి కుంచితంబగుం?చేతనాలు నిచ్ఛ మీరులే?
2.
నీతిలేని తీర్పు లిక్కలిం!నేవగింత్రు? భావి సంతతుల్?
జాతి మచ్చ తెచ్చి పెట్టుగా!చావుదెబ్బ నందు శీలమున్?
భూత కర్మ నామ మాత్రమౌ?పోవుగాదె?గౌరవంబిలన్!
చేతనాలు నిచ్ఛ మీరులే? జీవనాడి కుంచితంబగున్?

6.గర్భగత.లఘ్వంత"-కల్పద్రుమ"ద్వయం.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
1.
నేవగింత్రు భావి సంతతుల్?నీతిలేని తీర్పు లిక్కలిం?నీమ,నిష్ట,భ్రష్టు పర్చు!
చావుదెబ్బ నందు శీలముం?జాతి మచ్చ తెచ్చి పెట్టుగా!సామసౌష్టవంబు
                                                                                                 మాపు!
పోవుగాదె?గౌరవంబిలం?భూత కర్మ నామ మాత్రమౌ?భూమి కంపనంబునొప్పు!
                                                                                             
జీవ నాడి  కుంచితం బగుం?చేతనాలు నిచ్ఛ మీరులే! సీమ లెల్ల?నీటముల్గు!
                                                                                           
2.
నీతిలేని తీర్పు లిక్కలిం? నేవగింత్రు భావి సంతతుల్!నీమ నిష్ట,భ్రష్టు పర్చు!
జాతి మచ్చ తెచ్చి పెట్టుగా!చావుదెబ్బ నందు శీలముం!సామ సౌష్టవంబు
                                                                                                 మాపు!
భూత కర్మ నామ మాత్రమౌ?పోవు గాదె?గౌరవంబిలం? భూమి కంపనంబునొప్పు!
                                                                                               
చేత నాలు నిచ్ఛ మీరులే! జీవ నాడి కుంచితం  బగుం?    సీమ లెల్ల నీటముల్గు!
                                                                                             

7.గర్భగత"-యతిర్నవసుగంధినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నీమ,నిష్ట,భ్రష్టు,పర్చు!నీతిలేని తీర్పు లిక్కలిన్?
సామ సౌష్టవంబు మాపు!జాతి మచ్చ తెచ్చి పెట్టుగా?
భూమి కంపనంబు నొప్పు?భూత కర్మ నామ మాత్రమౌ?
సీమ  లెల్ల నీట ముల్గు! చేత నాలు  నిచ్ఛ   మీరులే?

8.గర్భగత"-కొంగు బంగరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
నీమ నిష్ట భ్రష్టు పర్చు!నీతిలేని తీర్పు లిక్కలిం?నేవగింత్రు భావి సంతతుల్?
సామ సౌష్టవంబు మాపు!జాతి మచ్చ తెచ్చి పెట్టుగా?చావు దెబ్బ నందు  శీలమున్?
                                                                                         
భూమి కంపనంబు నొప్పు?భూత కర్మ నామ మాత్రమౌ?పోవుగాదె? గౌరవం బిలన్?
                                                                                           
సీమ లెల్ల నీట ముల్గు!చేతనాలు నిచ్ఛ మీరులే?జీవనాడి కుంచితం  బగున్?
                                                                                       
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

22, అక్టోబర్ 2018, సోమవారం

చాణుక్యుడు

1 comments

జైశ్రీరామ్.
చాణుక్యుఁడు.
చాణుక్యుడు తెలియనివారు లేరు కదా!
చాణుక్యుడు ఎవరు అని ప్రశ్నించారేమిటి?
అని సందేహించ పనిలేదు ఆయన గురించి
వాస్తవ విషయాలలోకెళితే
మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి -
వాటిని ఇక్కడ చూద్దాం-

చాణుక్యుడు ఒక అద్భుతరాజనీతిజ్ఞుడు.
మగధదేశాన నందవంశ నిర్మూలన
మౌర్యసామ్రాజ్య స్థాపన చేసి రాజనీతి
విషయకమైన ఒక గొప్ప గ్రంధాన్ని
అర్థశాస్త్రం పేరున మనకు అందించినవాడు.
తన అర్థశాస్త్రం చివర తనను గురించి
ఈ విధంగా వ్రాసుకున్నాడు చూడండి-

యేన శాస్త్రం చ శస్త్రం చ నందరాజ చ భూః
అమర్షే ణోద్ధృతాన్యాశు తేన శాస్త్రం మిది కృతమ్
                                                           (కౌటిల్యుని అర్థశాస్త్రం - 15- 1 - 180)

(దుష్టులైన నందరాజుల చేతిలో చిక్కిన పృథివిని,
శస్త్రములను, శాస్త్రములను విడిచిన ఆచార్య
చాణుక్యుని ద్వారా ఈ గ్రంథం రచింపబడెను.)

హేమచంద్రుని అభిదాన చింతామణిలో ఈయనను
గురించి ఈయనకు ఈ క్రింది నామాంతరములు
ఉన్నట్లు పేర్కొన్నాడు-

1. వాత్సాయనుడు, 2. మల్లనాగుడు, 3. కుటిలుడు,
4. చణకాత్మజుడు, 5. ద్రామిలుడు, 6. పక్షిస్వామి,
7. విష్ణుగుప్తుడు, 8. అంగులుడు
(అభిదాన చింతామణి 853, 854)

ఈయనకు ఇన్ని పేర్లున్నా తండ్రి పెట్టిన పేరు
విష్ణుగుప్తుడు. చణకుని కుమారుడు కావున లేదా
మిక్కిలి కుశాగ్రబుద్ధి కలవాడగుటచే అత్యంత
చతురుడనే అర్థం వచ్చే చాణుక్యుడు అనే పేరు
చెప్పబడుతున్నది. కౌటిలీయ అర్థశాస్త్రంలో
కౌటిలుడనే పేరు చాలా చోట్ల వాడబడింది
ఇది బహుశా గోత్రనామం కుటిల పేరుతో
కౌటిల్యుడు అనేపేరు వచ్చిందికాని కుటిల
స్వభావంతో కౌటిల్యుడు కాదు అని
మహామహోపాధ్యాయ గణపతి శాస్త్రిగారు పేర్కొన్నారు.

చాణుక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో
విద్యాభ్యాసం జరిగింది. ఆయన జన్మస్థలం
ఖచ్చితమైనది తెలియదు తక్షశిల పాకిస్తాన్
లోని పంజాబుకు సమీపంలోని ఝేలం గ్రామంలో
ఉన్నందున ఈయన కూడ ఆ ప్రాంతంలోనే జన్మించి
ఉంటాడని భావిస్తున్నారు.

ఈయన ఇంటిని విశాఖదత్తుడు ముద్రారాక్షసం(3-15)లో
ఈ విధంగా వర్ణించాడు -

ఉపలశకల మేతద్ భేదకం గోమయానాం
వటుభి రుపహృతానాం బర్హిషాం స్తోమ ఏషః
శరణమపి  నమిద్భిహిః శుష్యమాణాభిర్
వినమిత పటలాన్తం దృశ్యతే జీర్ణకుడ్యమ్

చాణుక్యుని పాకలో ఒకవైపు పిడకలను పగులగొట్టు ఱాయి,
మరొకచో శిష్యులు తెచ్చిన దర్భలు, కప్పుపైన ఎండుటకు
ఆరబెట్టిన సమిధలు ఉన్నాయి. ఆ సమిధల బరువుకు
ఇంటి కప్పు వంగి ఉంది. అలాంటి ఇంట్లో చాణుక్యుడు
ఉండేవాడు. ఒకమారు ఒక విదేశరాయబారి ఈ ఇంటిని చూచి
ఇంత పెద్ద రాజ్యానికి ప్రధానమంత్రి ఇటువంటి పాకలో ఉండటమా-
అని అనగా చాణుక్యుడది విని ఈ విధంగా అన్నాడట-

ఏ దేశంలో ప్రధానమంత్రి పాకలో ఉంటాడో
ఆ దేశవాసులు సుందర భవనాల్లో ఉంటారు.
ఏ దేశప్రధానమంత్రి ఆకాశాన్నంటే సౌధాల్లో
ఉంటాడో ఆ దేశ ప్రజలు గుడిసెల్లో మగ్గుతుంటారు.
అన్నాడట.

ఆంగ్లేయుల లెక్కప్రకారం క్రీ.పూ. 322 లేక 325
సంవత్సరాలకు పూర్వం మౌర్య చంద్రగుప్తుడు
ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ కాలంలోనే ఈయన
ఉన్నట్లు చెబుతారు.

ఈయన బ్రాహ్మణుడే కాని ప్రతిదినము లోభుల
ఇండ్లకు వెళ్ళి యాచించు బ్రాహ్మణుడు కాదు.
రాజ్యనాశము, రాజ్యనిర్మాణముచేయు బ్రాహ్మణడు
స్వాభిమానియైన తపస్వి, నల్లగా ఉండి కురూపిగా
ఉండటం వల్ల  ఒకమారు శ్రాద్ధక్రియకు పిలువబడి
తిరస్కృతుడై  పంక్తి నుండి బహిష్కృతుడై ఆ అవమానంతో
క్రుద్ధుడై నందుని రాజ్యభ్రష్టుని చేసి నందవంశాన్నే
సమూలంగా నాశనం మౌర్యసాంమ్రాజ్య స్థాపనము చేసినవాడు.

ఈయన కేవలము కౌటిలీయ అర్థశాస్త్రమేకాదు
మరి కొన్ని రచనలు చేశారు ఆ రచనలు-

1. వృద్ధచాణక్య -
   ఇందులో 8 అధ్యాయాలు, 108 శ్లోకాలున్నాయి.

2. చాణక్యనీతిశాస్త్రము-
   ఇందులో 108 శ్లోకాలున్నాయి

3. చాణక్యసారసంగ్రహము-
   దీనిలో 300 శ్లోకాలున్నాయి.

4. లఘుచాణక్య -
   ఇందులో 8 అధ్యాయాలు, 91 శ్లోకాలున్నాయి

5. చాణక్య రాజనీతిశాస్త్రము-
   ఇదే అర్థశాస్త్రమని పేరున్నది.
   దీనిలో 8 అధ్యాయాలు 512 శ్లోకాలున్నాయి


(ఇది చాణక్య నీతి దర్పణము,
 జగదీశ్వరానంద్ తెలుగు అనువాదం
 నుండి సేకరించబడింది)
జైహింద్.

21, అక్టోబర్ 2018, ఆదివారం

రసయా ద్వయ,మృదు మానస,ధృతిరసయా ద్వయ ,రసాయన, రసమజాసామమ్యవాద,మౌనగీతి,గర్భ"-యశోరసయ"-ద్వయ వృత్తములు.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
రసయా ద్వయ,మృదు మానస,ధృతిరసయా ద్వయ ,రసాయన, రసమజాసామమ్యవాద,మౌనగీతి,గర్భ"-యశోరసయ"-ద్వయ వృత్తములు.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.   జుత్తాడ.
                
-"యశోరసయద్వయ"-వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.స.య.ర.స.య.ర.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
1,
భూత,ప్రేత పిశాచి మూకల్!భూధరంబులు కీడుసేయం!భూమి వ్రక్కలు గాదొకో?
నేతలై భువి నీతి మాపం!నీది నాదనకుండ మేయం!నీమ,నిష్టలు చేదునౌ!
చేతనా విభవంబు మాయుం!ఛీదరించరె?దేవసంఘం!శ్రీమహాత్మ్యముదక్కునే!
ఘాతుకంబగు!భావి లోకం!కాదనం తర మేరి కైనం!కాముకుల్భువి నిండరే?
2.
భూధరంబులు కీడు సేయం!భూత,ప్రేత పిశాచి మూకల్!భూమి వ్రక్కలుగాదొకో?
నీది నాదనకుండ మేయం!నేతలై భువి నీతి మాపం!నీమ,నిష్టలు చేదునౌ!
ఛీదరించరె?దేవసంఘం!చేతనా విభవంబు మాయుం!శ్రీ మహాత్మ్యముదక్కునే?                                                   కాదనం తర మేరి కైనం?ఘాతుకం బగు!భావి లోకం!కాముకుల్భువి నిండరే?

1.గర్భగత"-రసయాద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.ర.స.య.గణములు.వృ.సం.91.ప్రాసగలదు.
1.భూత,ప్రేత పిశాచి మూకల్!        2  .భూధరంబులు కీడు సేయన్!
   నేతలై భువి నీతి మాపం!                 నీది,నా దనకుండ మేయన్!
   చేతనా విభవంబు మాయున్!         ఛీదరించరె?దేవ సంఘమ్!
   ఘాతుకంబగు భావి లోకమ్!           కాదనం తర మేరికైనన్?

2.గర్భగత"-మృదుమానస"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.స.లగ.గణములు.వృ.సం.91.ప్రాసగలదు.
భూమి వ్రక్కలు గాదొకో?
నీమ,నిష్టలు చేదు నౌ!
శ్రీ మహాత్మ్యము దక్కునే!
కాముకుల్భువి నిండరే?

3.గర్భగత"ధృతి రసయా ద్వయ"-వృత్తము.
ధృతిఛందము.ర.స.య.ర.స.య.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1.
భూత,ప్రేత,పిశాచి మూకల్భూధరంబులు కీడు సేయన్!
నేతలై భువి నీతిమాపం!నీది,నా దనకుండ మేయన్?
చేతనా విభవంబు మాయుం!ఛీదరించరె?దేవ సంఘమ్!
ఘాతుకంబగు భావి లోకం!కాదనం తర మేరి. కైనన్?
2.
భూధరంబులు కీడు సేయం!భూత,ప్రేత,పిశాచి మూకల్!
నీది,నా దన కుండ మేయం?నేతలై భువి నీతి మాపన్?
ఛీదరించరె?దేవ సంఘం!చేతనా విభవంబు మాయున్!
కాదనం తర మేరికైనం?ఘాతు కంబగు భావి లోకమ్!

4.గర్భగత"-రసాయన"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.య.ర.స.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
అత్యష్టీఛందము.
భూ ధరంబులు కీడు సేయం!భూమి వ్రక్కలు గాదొకో?
నీది,నా దనకుండ మేయం?నీమ,నిష్టలు చేదునౌ!
ఛీదరించరె?దేవ సంఘం!శ్రీ మహాత్మ్యము దక్కునే?
కాదనం తర మేరికైనం?కాముకుల్భువి నిండరే?

5.గర్భగత"-రసమజా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.మ.జ.జ.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
భూమి వ్రక్కలు గాదొకో?భూత,ప్రేత,పిశాచి మూకల్!
నీమ,నిష్టలు చేదునౌ!నేతలై భువి నీతి మాపన్?
శ్రీ మహాత్మ్యము దక్కునే?చేతనా విభవంబు మాయున్!
కాముకుల్భువి నిండరే?ఘాతుకంబగు భావి లోకమ్!

6.గర్భగత"-సామ్యవాద"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.ర.స.య.జ.జ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
భూ ధరంబులు కీడు సేయం!భూమి వ్రక్కలు గాదొకో?భూత,ప్రేత,పిశాచి
మూకల్!నీది,నా దనకుండ మేయం?నీమ నిష్టలు చేదునౌ!నేతలై భువి నీతి మాపన్!
ఛీదరించరె?దేవసంఘం!శ్రీ మహాత్మ్యము దక్కునే?చేతనా విభవంబు మాయున్!                                                 కాదనం తర మేరి కైనం?కాముకుల్భువి నిండరే?ఘాతుకం బగు భావిలోకమ్!

7.గర్భగత"-మౌనగీతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.జ.జ.మ.జ.జ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
భూమి వ్రక్కలు గాదొకో?భూత,ప్రేత,పిశాచి మూకల్!భూధరంబులు కీడు సేయన్!                                                 నీమ,నిష్టలు చేదునౌ!నేతలై భువి నీతి మాపం!నీది,నా దనకుండ మేయన్?
శ్రీమహాత్మ్యము దక్కునే?చేతనా విభవంబు మాయుం!ఛీదరించరె?దేవ
సంఘమ్!కాముకుల్భువి నిండరే?ఘాతుకం బగు భావి లోకం!కాదనం,తర మేరికిన్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ
జైహింద్.

20, అక్టోబర్ 2018, శనివారం

గతికా,చీకట్లలరు,నరజయుగళీద్వయ,పెడసరి,మోక్షార్ధి,గతజన, కౌతుకం ,గర్భ"-కాతరిల్లుద్వయ"-వృత్తములు.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
గతికా,చీకట్లలరు,నరజయుగళీద్వయ,పెడసరి,మోక్షార్ధి,గతజన, కౌతుకం ,గర్భ"-కాతరిల్లుద్వయ"-వృత్తములు.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                       

"-కాతరిల్లు "-ద్వయ వృత్తములు.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.ర.జ.ర.య.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
1.
గత జనంబు సత్య నిష్ట!గడగిరెంతొ?మేలుకోరి!కౌతుకాన మోక్షార్ధులై!
వెతలులేని జీవితాల!పెడసరంబు గానరాక!భీతిలేని స్వాతంత్ర్యతన్!
బ్రతుకుబాట నీతి సాగి!వడలిపోని శక్తి యుక్తి!పాతకాల దూరంబునన్!
కతకరైరి యొడ్ల తిండి!కడలి గుంభనంబు నొప్పి!కాతరిల్రి మేల్గూర్చుచున్!
2.
గడగిరెంతొ మేలు కోరి!గత జనంబు సత్య నిష్ట!కౌతుకాన మోక్షార్ధులై!
పెడసరంబు గాన రాక!వెతలు లేని జీవితాల!భీతిలేని స్వాతంత్ర్యతన్!
వడలిపోని శక్తి యుక్తి!బ్రతుకుబాట నీతి సాగి!పాతకాల దూరంబునన్!
కడలి గుంభనంబు నొప్పి!కతక రైరి యొడ్ల తిండి!కాతరిల్రి మేల్గూుచున్!

కాతరిల్రి=సిద్ధపడిరి,పాతకాలు=పాపములు,గత జనంబు=పూర్వీకులు,
వడలిపోని=శృక్కిపోని,కతుక=భుజిప,

1.గర్భగత"-గతికా"-ద్వయ వృత్తములు.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.ప్రాసగలదు.
1.గత జనంబు సత్య నిష్ట.!           2.గడగిరెంతొ?మేలు కోరి!
   వెతలు లేని జీవితాల!                   పెడసరంబు గాన రాక!
  బ్రతుకుబాట నీతిసాగి!                  వడలిపోని శక్తి యుక్తి!
  కతక రైరి యొడ్ల తిండి!                 కడలి గుంభనంబు నొప్పి!

2.గర్భగత"-చీకట్లలరు"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.య.లగ.గణములు.వృ.సం.75.ప్రాసగలదు.
కౌతుకాన మోక్షార్ధులై!
భీతిలేని స్వాతంత్ర్యతన్!
పాతకాల దూరంబునన్!
కాతరిల్రి మేల్గూర్చుచున్!

3.గర్భగత"-నరజయుగళీ"-ద్వయ వృత్తములు.
ధృతిఛందము.న.ర.జ.న.ర.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1,
గత జనంబు సత్య నిష్ట!గడగి రెంతొ?మేలు కోరి!
వెతలు లేని జీవితాల!పెడసరంబు గాన రాక!
బ్రతుకుబాట నీతి సాగి!వడలిపోని శక్తి యుక్తి!
కతక రైరి యొడ్ల తిండి!కడలి గుంభనంబు నొప్పి!
2.
గడగి రెంతొ?మేలు కోరి!గత జనంబు సత్య నిష్ట!
పెడసరంబు గాన రాక!వెతలు లేని జీవితాల!
వడలిపోని శక్తి యుక్తి!బ్రతుకుబాట నీతి సాగి!
కడలి గుంభనంబు నొప్పి!కతకరైరి యొడ్ల తిండి!

4.గర్భగత"-పెడసరి"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.ర.య.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
గడగిరెంతొ?మేలు కోరి!కౌతు కాన మోక్షార్ధులై!
పెడసరంబు గానరాక!భీతి లేని స్వాతంత్ర్యతన్!
వడలిపోని శక్తి యుక్తి!పాతకాల దూరంబునన్!
కడలి గుంభనంబు నొప్పి!కాతరిల్రి మేల్గూర్చుచున్!

5.గర్భగత"-లఘ్వంత-మోక్షార్ధి"-.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.య.జ.స.జ.గల.గణములు.యతులు.10,18,
ప్రాసనీమముగలదు.
గడగి రెంతొ?మేలు కోరి!కౌతు కాన మోక్షార్ధులై!గత జనంబు సత్య నిష్ట!
పెడసరంబు గాన రాక!భీతి లేని స్వాతంత్ర్యతం!వెతలు లేని జీవితాల!
వడలిపోని శక్తి యుక్తి!పాతకాల దూరంబునం!బ్రతుకు బాట నీతి సాగి!
కడలి గుంభనంబు నొప్పి!కాతరిల్రి మేల్గూర్చుచుం!కతకరైరి యొడ్ల తిండి!

6.గర్భగత"-గత జన"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.య.జ.స.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
కౌతు కాన మోక్షార్ధులై!గత జనంబు సత్య నిష్ట!
భీతిలేని స్వాతంత్ర్యతం!వెతలు లేని జీవితాల!
పాతకాల దూరంబునం!బ్రతుకుబాట నీతి సాగి!
కాతరిల్రి మేల్గూర్చుచుం!కతకరైరి యొడ్ల తిండి!

7.గర్భగత "-లఘ్వంత"-కౌతుకం"-,
ఉత్కృతిఛందము.ర.య.జ.స.జ.భ.స.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
కౌతుకాన మోక్షార్ధులై!గత జనంబు సత్య నిష్ట!గడగి రెంతొ?మేలు కోరి!
భీతిలేని స్వాతంత్ర్యతం!వెతలు లేని జీవితాల!పెడసరంబు గానరాక!
పాతకాల దూరంబునం!బ్రతుకుబాట నీతి సాగి!వడలిపోని శక్తి యుక్తి!
కాతరిల్రి  మేల్గూర్చుచుం!కతకరైరి యొడ్ల తిండి!కడలి గుంభనంబు నొప్పి!
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

ఆహ్వానము.

1 comments

జైశ్రీరామ్.జైహింద్

19, అక్టోబర్ 2018, శుక్రవారం

కో హి భారః సమర్థానాం? .. .. .. మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. కో హి భారః సమర్థానాం? కిం దూరం వ్యవసాయినాం? 
కో విదేశః సవిద్యానాం? కః పరః ప్రియవాదినామ్?
తే.గీ. మహిని భారమేముండు సమర్ధునకును?
కృషిని చేయువానికి దూరమేమియుండు?
దివ్య విద్వద్వరునకు విదేశమేమి?
ఇష్ట సద్భాషణాఢ్యునికితరులెవరు?
భావము.
సామర్థ్యం కలవారికి కార్యభారం ఏమిటి? కృషి చేయగలవానికి దూరం ఏమిటి?విద్య గలవానికి విదేశం ఏమిటి? ప్రియ భాషణం చేసేవానికి ఇతరులు ఎవ్వరు?
జైహింద్.

18, అక్టోబర్ 2018, గురువారం

గతికాద్వయ,సిరినిలయ,నరజయుగళీద్వయ,పగగొను,సత్కృత,పురోగతి,ప్రగతి,గర్భ"-నీతిచర"-యుగళ వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
గతికాద్వయ,సిరినిలయ,నరజయుగళీద్వయ,పగగొను,సత్కృత,పురోగతి,ప్రగతి,గర్భ"-నీతిచర"-యుగళ వృత్తము.  రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                                                   
       
నీతిచరయుగళ:-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.ర.జ.స.స.లగ.గణములు.యతులు.10.19.
్రాసనీమముగలదు.
1,
ప్రగతిగోరు తీరునెంచి!బ్రతుకుబాట తీర్చిదిద్దు!పగ బూనకు మానవా!
సుగతి నెంచు దారి గోరి!స్తుతమతిం చరించు ముక్తి!సుగమంబదె సోదరా!
వగపుమాని స్వేచ్ఛ నిల్పు!పతనకీర్తి దోషమౌర!వగపే నిను మాపురా!
జగము నిల్చు నీతియున్న!సతత సేవ సత్కృతంబు!జగతి నిలు తారవై!
2.
బ్రతుకుబాట తీర్చిదిద్దు!ప్రగతిగోరు తీరునెంచి!పగబూనకు మానవా!
స్తుతమతించరించు ముక్తి!సుగతి నెంచు దారినిల్చి!సుగమంబదె!సోదరా!
పతనకీర్తి దోషమౌర! వగపు మాని స్వేచ్ఛ నిల్పు!వగపే నిను మాపురా!
సతతసేవ సత్కృతంబు!జగము నిల్చు నీతియున్న!జగతినిలు తారవై!

1"-గతికాద్వయ"-వృత్తములు.
బృహతీ ఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.ప్రాసగలదు.
1.ప్రగతి కోరు తీరు నెంచి!               2.బ్రతుకు బాట తీర్చి దిద్దు!
   సుగతినెంచు దారి కోరి!                  స్తుత మతిం చరించు ముక్తి!
  వగపు మాని స్వేచ్ఛ నిల్పు!              పతన  కీర్తి దోష. మౌర!
  జగము నిల్చు నీతి యున్న!             సతత సేవ సత్కృతంబు!

2.గర్భగత"-సిరినిలయ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.స.లగ.గణములు.వృ.సం.92.ప్రాసగలదు.
పగ బూనకు మానవా!
సుగమంబదె సోదరా!
వగపే నిను మాపురా!
జగతి నిలు తారవై!

3.గర్భగత"-నరజయుగళీద్వయ"-వృత్తములు.
ధృతిఛందము.న.ర.జ.న.ర.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
1.ప్రగతి కోరు తీరు నెంచి!.బ్రతుకు బాట తీర్చిదిద్దు!
   సుగతి నెంచు దారి కోరు!స్తుత మతిం చరించు ముక్తి!
   వగపు మాని స్వేచ్ఛ నిల్పు!పతన కీర్తి దోష మౌర!
   జగము నిల్చు నీతి యున్న!సతత సేవ సత్కృతంబు!

2.బ్రతుకు బాట తీర్చి దిద్దు!ప్రగతి కోరు తీరు నెంచి!
   స్తుత మతిం చరించు ముక్తి!సుగతి నెంచు దారి కోరు!
  పతన కీర్తి దోష మౌర!వగపు మాని స్వేచ్ఛ నిల్పు!
  సతత సేవ సత్కృతంబు! జగము నిల్చు నీతి యున్న!

4.గర్భగత"-పగగొను"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.స.స.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాషనీమముగలదు.
బ్రతుకు బాట తీర్చిదిద్దు!పగ బూనకు మానవా!
స్తుత మతిం చరించు ముక్తి!సు గమంబదె సోదరా!
పతన కీర్తి దోష మౌర!వగపే నిను మాపురా!
సతత సేవ సత్కృతంబు!జగతిం నిలు తారవై!

5.గర్భగత"- లఘ్వంత సత్కృతము.
ఉత్కృతిఛందము.న.ర.జ.స.స.జ.స.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
బ్రతుకుబాట తీర్చిదిద్దు!పగబూనకు మానవా!ప్రగతి కోరు తీరు నెంచి!
స్తుతమతిం చరించు ముక్తి!సుగమంబదె సోదరా!సుగతినెంచు దారికోరు!
పతన కీర్తి దోషమౌర! వగపే నిను మాపురా!వగపు మాని స్వేచ్ఛ నిల్పు!
సతత సేవ సత్కృతంబు!జగతిం నిలు తారవై!జగము నిల్చు నీతియున్న!

6.గర్భగత"-పురోగతి"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.జ.స.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
పగ బూనకు మానవా!ప్రగతి కోరు తీరు నెంచి!
సు గమంబదె సోదరా!సుగతి నెంచు దారి కోరు!
వగపే నిను మాపురా!వగపు మాని స్వేచ్ఛ నిల్పు!
జగతిం నిలు తారవై!జగము నిల్చు నీతి యున్న!

7.గర్భగత లఘ్వంత"-ప్రగతి"-.
ఉత్కృతిఛందము.స.స.జ.స.జ.భ.స.జ.గల.గణములు.యతులు.9,18,
ప్రాసనీమముగ లదు.
పగబూనకు మానవా!ప్రగతి కోరు తీరునెంచి!బ్రతుకు బాట తీర్చి దిద్దు!
సు గమంబదె సోదరా!సుగతి నెంచు దారి కోరు!స్తుతమతిం చరించు ముక్తి!
వగపే నిను మాపురా!వగపు మాని స్వేచ్ఛ నిల్పు!పతనకీర్తి దోష మౌర!
జగతిం నిలు తారవై!జగము నిల్చు నీతి యున్న!జగతిం నిలు తారవై!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

17, అక్టోబర్ 2018, బుధవారం

దసరా పండుగ 18 ననే...పంతంగి రమాకాంత శర్మ పీఠాధిపతి శ్రీ పంచాయతన శక్తి పీఠమ్. హైదరాబాద్. ఫోన్: *9849804463*

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
*దసరా పండుగ 18 ననే*
పంతంగి రమాకాంత శర్మ
పీఠాధిపతి
శ్రీ పంచాయతన శక్తి పీఠమ్.
హైదరాబాద్.
ఫోన్: *9849804463*

*ఇదేమిటో! ఈ మధ్య పండుగలు అన్నీ రెండేసి చొప్పున వస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విషయం చెబుతున్నారు. ఏ రోజు చెయ్యాలో అర్థం కావడం లేదు, చాలా కన్ఫ్యూజన్ గా ఉంటున్నది.*
ఇటీవల సగటు హైందవునికి వస్తున్న ప్రశ్న ఇది. నిజానికి ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. లోపమంతా మనలోనే ఉంది.
ఒక ఊరికి వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గమే ఉంటుందా? అనేక మార్గాలు ఉంటాయి. వీటిని మార్గాంతరాలు అన్నట్లే... జీవిత లక్ష్యమైన మోక్ష గమ్యానికి మన ఋషీశ్వరులు అనేక మార్గాలను సూచించారు. వీటినే *మతాంతరాలు* అని అంటారు.(హిందూ, ఇస్లాం... కావు).
ఇరవై ముప్ఫై ఏళ్ళ క్రితం వరకు కూడా దాదాపు ప్రతి ఒక్కరికి *గురువు*, *ఇంటి పురోహితుడు* ఉండేవారు. వారి నిర్ణయానుసారం అన్నీ సక్రమంగా జరిగేవి. ఎలాంటి తికమకలు, గందరగోళాలూ లేవు. అవసరమైతే పండితులు చర్చించుకొనే వారు. సగటు హైందవుడు తన గురువు లేదా ఇంటి పురోహితుని వాక్కును చిత్తశుద్ధితో అనుసరించేవాడు.
నవనాగరక పోకడలలో... ఎవరికి వారు స్వయంగా నిర్ణయం చేసుకోవడం, పైగా, టీవీ ఛానళ్ళలో వచ్చే విపరీతమైన ప్రచారాలు మొదలైన కారణాల వల్ల గందరగోళం ఏర్పడుతున్నది.
*మతాంతర విషయాలను ఏకీకృతం చేసే ప్రయత్నాలు* ఇందుకు మూలం.
మతాంతర విషయాలపై తీర్పు ఇవ్వాలంటే... వాద-ప్రతివాదుల ధర్మ నియమాలు క్షుణ్ణంగా ఆపోశన పట్టిన వ్యక్తి న్యాయమూర్తి స్థానంలో ఉండాలి.
పరిపాలనా విభాగంలో నిష్ణాతుడైన ఒక వ్యక్తి *జ్యోతిషం వ్యర్థం, శుద్ధ దండగ* అని తీర్పు చెబితే ఎలా?
*అపరాజితపృచ్ఛ, సమరాంగణ సూత్రధార, విశ్వకర్మ ప్రకాశిక* ఇత్యాది గ్రంథాల పేర్లు కూడా వినని తాపీ మేస్త్రీ(క్యాలెండర్‌ ల వెనుక ఉన్న కొన్ని సూత్రాలను చదివి, లేదా విని) వాస్తు శాస్త్రంపై సూచనలు ఇవ్వడం గందరగోళానికి నాంది కాదా?
సరే!
ఈ సంవత్సరం *దసరా* పండుగను పరిశీలిద్దాం.
*దినద్వయ, అపరాహ్ణ వ్యాప్తి* ఇత్యాది లోతైన విషయాలను కాసేపు విస్మరిద్దాం.
దసరా పండుగకు సామాన్య నియమం ఏమిటి?
కేవలం *ఆశ్వీజ శుద్ధ దశమి తిథి* మాత్రమే ప్రమాణం కాదు. దశమి ఘడియలతో పాటుగా *శ్రవణ నక్షత్ర* సమ్మేళనం అత్యంత కీలకం.
ఇంగ్లీషు తేదీల ప్రకారం...
18 వ తేదీన మధ్యాహ్నం గం. 3:29 ని.ల నుంచి 19 వ తేదీన సాయంత్రం గం. 5:57 ని.ల వరకు దశమి వ్యాపించి ఉన్నది. ఈ తిథి వ్యాప్తిని చూస్తే, దసరా పండుగ 19 వ తేదీననే. ఇంతటితో నిర్ణయం చేయడం శుద్ధ తప్పు. నక్షత్ర వ్యాప్తిని గమనించాలి.
శ్రవణ నక్షత్రం - 17 వ తేదీన రాత్రి గం. 9:28 ని.ల నుంచి 18 వ తేదీన అర్ధరాత్రి దాటాక అంటే, 19 వ తేదీ ప్రవేశించిన 34 ని.ల వరకే (12:34 ఏ.ఎం) ఉంటుంది. అనగా, 19 వ తేదీన సూర్యోదయ సమయానికి శ్రవణ నక్షత్రం ఉండదు, ధనిష్ఠ నక్షత్రం ఉంటుంది.
ఇప్పుడు గమనించండి... ఆశ్వీజ శుద్ధ దశమి + శ్రవణ నక్షత్రం కలిసి ఉన్న రోజు ఏది?
నిర్ద్వంద్వంగా 18 వ తేదీననే.
కనుక, దసరా పండుగను 18 వ తేదీననే జరుపు కోవాలి. (మహర్నవమి - ఆయుధ పూజ కూడా).

ధర్మ లోతులను పరిశీలించక, గురువులను ఆశ్రయించక మిడిమిడి జ్ఞానంతో మహోన్నతమైన హిందుత్వాన్ని దూషించడం కుసంస్కారమే!

సద్గురువులను ఆశ్రయించి, ధర్మ లోతులను పరిశీలించండి. ఆనందంగా జీవించండి.
స్వస్తిశ్రీ విలంబ విజయదశమి శుభాకాంక్షలు, శుభాశీస్సులతో మంగళాశాసనములు.
శుభం భూయాత్!
మంగళం మహత్!!
పంతంగి రమాకాంత శర్మ
పీఠాధిపతి
శ్రీ పంచాయతన శక్తి పీఠమ్.
హైదరాబాద్.
ఫోన్: *9849804463*
జైహింద్.

16, అక్టోబర్ 2018, మంగళవారం

అనంతరత్న ప్రభవస్య యస్య .. .. .. మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments


జైశ్రీరామ్.
श्लॊ अनंतरत्नप्रभवस्य यस्य
    हिमं न सौभाग्यविलोपि जातं ।
एको हि दोषो गुणसन्निपाते
    निमज्जतींदोः किरणेष्विवांकः ॥ 
శ్లో. అనంతరత్న ప్రభవస్య యస్య
హిమం న సౌభాగ్య విలోపి జాతమ్ l
ఏకో హి దోషో గుణ సన్నిపాతే
నిమజ్జతీందోః కిరణేష్వివాంకః ll               కు.సం. 1-2
తే.గీ. రత్నరాశులు కల హిమాలయము కీర్తి
మంచు పోకార్పఁగా నేరదెంచి చూడ.
దోషమొకటైనగుణములఁ జేసి మాయు.
మచ్చలవి చంద్ర కాంతిలో మఱఁగిపోవె.
భావము.
చంద్రునిలోని మచ్చ చంద్రుని తెల్లని కిరణాలతో కలసిపోయినట్లు‘ ఎన్నో రత్నరాశులకు , వృక్షరాజములకు నిలయమైన హిమవత్పర్వతములో మంచు నిండియుండట యనే ఒక దోషము లెక్కింప దగినది కాదు. అనంత గుణరాశిలో ఒక్క దోషమున్నను అది గుణములలో కలిసిపోవును.
జైహింద్.

15, అక్టోబర్ 2018, సోమవారం

కృష్ణసంతానం . . శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారు

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారు ఎంత వివరంగా సమీకరించి చూపారో చూడండి. వారికి ధన్యవాదములు.
కృష్ణసంతానం
శ్రీకృష్ణుడికి రుక్మిణి, సత్యభామ తదితర అష్ఠ మహిషులు, పదహారు వేల వంద మంది భార్యలు ఉన్నారు. కృష్ణుడికి ఆ భార్యల వల్ల కలిగిన సంతానం ఎంత? భార్యలందరితోనూ ఆయనకు ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు.
*రుక్మిణి వల్ల కృష్ణుడికి*
ప్రద్యుమ్నుడు,
చారుదేష్ణుడు,
సుదేష్ణుడు,
చారుదేహుడు,
సుబారుడు,
చారుగుప్తుడు,
భద్రచారుడు,
చారుచంద్రుడు,
విచారుడు,
చారుడు అనే బిడ్డలు కలిగారు.
*కృష్ణుడికి సత్యభామ* వల్ల
భానుడు,
సుభానుడు,
స్వర్భానుడు,
ప్రభానుడు,
భానుమంతుడు,
చంద్రభానుడు,
బృహద్భానుడు,
అతిభానుడు,
శ్రీభానుడు,
ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు.
*జాంబవతీ శ్రీకృష్ణులకు*
సాంబుడు,
సుమిత్రుడు,
పురజిత్తు,
శతజిత్తు,
సహస్రజిత్తు,
విజయుడు,
చిత్రకేతుడు,
వసుమంతుడు,
ద్రవిడుడు,
క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.
*నాగ్నజితి, కృష్ణులకు*
వీరుడు,
చంద్రుడు,
అశ్వసేనుడు,
చిత్రగుడు,
వేగవంతుడు,
వృషుడు,
లముడు,
శంకుడు,
వసుడు,
కుంతి అనే పిల్లలు కలిగారు.
*కృష్ణుడికి కాళింది* వల్ల
శ్రుతుడు,
కవి,
వృషుడు,
వీరుడు,
సుబాహుడు,
భద్రుడు,
శాంతి,
దర్శుడు,
పూర్ణమానుడు,
శోమకుడు అనే కుమారులు జన్మించారు.
*లక్షణకు, శ్రీకృష్ణుడికి*
ప్రఘోషుడు,
గాత్రవంతుడు,
సింహుడు,
బలుడు,
ప్రబలుడు,
ఊర్ధ్వగుడు,
మహాశక్తి,
సహుడు,
ఓజుడు,
అపరాజితుడు అనే సంతానం కలిగింది.
*మిత్రవింద, కృష్ణులకు*
వృకుడు,
హర్షుడు,
అనిలుడు,
గృద్ధుడు,
వర్ధనుడు,
అన్నాదుడు,
మహాశుడు,
పావనుడు,
వహ్ని,
క్షుధి అనే పుత్రులు పుట్టారు.
*కృష్ణుడికి భద్ర* అనే భార్య వల్ల
సంగ్రామజిత్తు,
బృహత్సేనుడు,
శూరుడు,
ప్రహరణుడు,
అరిజిత్తు,
జయుడు,
సుభద్రుడు,
వాముడు,
ఆయువు,
సత్యకుడు అనే పిల్లలు పుట్టారు.
*శ్రీ కృష్ణ నిర్యాణం*
కురుక్షేత్ర సంగ్రామం అనంతరం, ఒకనాడు కణ్వ, విశ్వామిత్ర , నారద మహర్షులు శ్రీ కృష్ణుని సందర్శనార్దం ద్వారకకు విచ్చేశారు. వీరు పురవీధుల్లో సంచరిస్తూ ఉండగా కొందరు ద్వారక యువకులకు చిలిపి ఊహ తట్టింది. ఆ యువకులు ఒకడికి స్త్రీ వేషం వేసి ఆ మునుల వద్దకు తీసుకుని పోయి ఈ చిన్నదానికి ఆడ బిడ్డ పుడతాడో , మగ బిడ్డ పుడతాడో చెప్పమన్నారు. ఆ మహర్షులు అమాయకులు కాదు కదా, దివ్యదృష్టి తో మొత్తం కనుక్కుని ఆగ్రహం తో, ఆడబిడ్డా కాదు మగబిడ్డా కాదు ఒక ముసలం(రోకలి) పుడుతుంది, అది మీ యాదవ వంశం మొత్తాన్ని నాశనం చేస్తుంది అని శపించి వెనక్కి వెళ్ళిపోయారు.
ఈ విషయం శ్రీ కృష్ణునికి తెలిసింది. విధి రాత ను ఎవరూ తప్పించలేరు, యాదవ వంశానికి కాలం చెల్లింది అనుకున్నాడు.
మహర్షుల తపశ్శక్తి ఫలితంగా ఆ యువకుడికి ముసలం జన్మించింది.
ఆ యువకులు దానిని శ్రీ కృష్ణుని వద్దకు తీసుకుపోయారు.
శ్రీ కృష్ణునికి అది యాదవ వంశాన్ని నాశనం చేసే ఆయుధం లా కనిపించింది. దానిని పిండి చేసి సముద్రం లో కలపమని ఆ యువకులకు చెప్పాడు.
వారు దానిని పిండి చేసి సముద్రం లో కలిపారు. చివరగా ఒక ముక్కను అరగదీయలేక దానిని సముద్రం లోనికి విసిరివేశారు. పిండి చేసిన ముసలం మనల్ని ఎలా నాశనం చేస్తుంది లెమ్మని సంతోషం గా ఇళ్ళకు పోయారు. కానీ మునుల వాక్కు వృధా పోదు కదా. మిగిలిన ఆ రోకలి ముక్క తీరానికి కొట్టుకు వచ్చి ఒకానొక చోట ఇసుకలో దిగబడింది.
సముద్రంలో కలిసిన రోకలి పిండి బడబాగ్ని వలె కాచుకుని ఉంది. శ్రీ కృష్ణునికి ఇవన్నీ తెలిసినా విధి రాతను తప్పించే శక్తి లేక మిన్నకుండి పోయాడు.
అది మొదలు ద్వారక నగరం లో అనేక ఉత్పాతాలు సంభవించాయి.
ఎపుడూ లేని విధంగా యాదవులు సజ్జనలును బాధించడం మొదలుపెట్టారు.
స్త్రీలు భ్రష్టు పట్టిపోతున్నారు. యాదవవంశ నాశనం దగ్గరలోనే ఉందని కృష్ణునికి అర్ధం అయ్యింది.
తను ఎంతో ప్రేమించే ద్వారకలో యాదవులు నాశనం అవ్వడం ఇష్టం లేని కృష్ణుడు యాదవులు అందరినీ కొలువుపర్చాడు.
సముద్రానికి జాతర చెయ్యాలని అందరినీ బయలుదేరమని చెప్పాడు. అందరూ కావలసిన సరంజామా అంతా తీసుకుని బయలుదేరారు.
బలరాముడు అరణ్యమునకు బయలుదేరాడు. శ్రీ కృష్ణుడు ఒక్కడే యాదవుల తో పాటు వెళ్ళాడు. వెళ్ళే ముందు తండ్రియైన వసుదేవునితో ఇలా అన్నాడు. “తండ్రీ! కొద్ది రోజులలో ద్వారకను సముద్రం ముంచెత్తనున్నది. అర్జునుడు వస్తాడు మిమ్ములను అందరినీ ఉద్ధరిస్తాడు. అతను వేరు నేను వేరు కాదు. అందరూ అతని ఆజ్ఞను పాటించండి.”
సముద్ర తీరానికి వెళ్ళిన యాదవులు సుష్ఠుగా భోజనం చేసి, కృష్ణుని ఎదుటే మద్యం తాగి ఒకరిలో ఒకరు కలహించుకోసాగారు.
అన్నీ తెలిసినా కృష్ణుడు ఏమీ చెయ్యలేని వాడయ్యాడు.
అంతలో ఒకడు ఆనాడు సముద్ర తీరంలో దిగబడిన రోకలి తుంగను తీసుకుని ఒకడిని మోది చంపేశాడు.
అది మొదలు అందరూ ఒకరిని ఒకరు చంపుకున్నారు.
మిగిలిన దారుకుడిని, భబ్రుడిని తీసుకుని బలరాముడు ఉన్న చోటికి బయలుదేరాడు శ్రీ కృష్ణుడు. అక్కడ బలరాముడు అరణ్యం లో ధ్యానం లో ఉన్నాడు.
అపుడు శ్రీ కృష్ణుడు అర్జునుడి ని ద్వారకకు తీసుకురమ్మని దారుకుడిని పంపాడు. భబ్రుడి ని ద్వారకలోని స్త్రీలను, మిగిలిన వాళ్ళని ప్రయాణమునకు సిద్దం చెయ్యమని పంపాడు.
కానీ మార్గమధ్యం లో ఒక ఆటవికుడు అతనిని అదే రోకలి తుంగ తో సంహరించాడు.
దారుకుడు ఏడుస్తూ పాండవుల దగ్గరికి వెళ్ళాడు. అతనిని ఆ పరిస్థితి లో చూసి పాండవులు చలించిపోయారు.
అపుడు దారుకుడు జరిగిన విషయం చెప్పి బలరామకృష్ణులు అరణ్యం లో ఉన్నారని, అర్జునుడుని ద్వారకకు తీసుకువెల్లమన్నారని చెప్పాడు.
అది విని పాండవులు ఆశ్చర్యపోయారు.
శ్రీ కృష్ణ భగవానుడు అచట ఉండగా ఇలా ఎందుకు జరిగిందా అని చాలా భాధపడ్డారు. అర్జునుడు వెంటనే ద్వారకకు పయనమయ్యాడు.
అచట అరణ్యంలో బలరాముడు తన దేహమును విడిచి తన అంశ అయిన మహా సర్ప రూపం ధరించి సముద్రం లో కలిసిపోయాడు.
తన అన్న లేని లోకంలో ఉండటం వృధా అని తలచి, తను చెయ్యవలసిన పనులు కూడా ఏమీ లేవని గ్రహించి తన శరీరం వదలడానికి ఏమి కారణం దొరుకుతుందా అని వేచి చూడసాగాడు. ఒకనాడు తనకు అరికాలితో మరణం సంభవిస్తుందని దుర్వాస మహాముని శాపం ఇవ్వడం గుర్తుకువచ్చింది.
అపుడు శ్రీ కృష్ణుడు ఒక మహా వృక్షం నీడన మేను వాల్చి, అక్కడకు వస్తున్న ఒక బోయవానికి, తన పాదం లేడి పిల్ల లాగా భ్రమింపచేశాడు. అది తెలియని బోయవాడు గురి చూసి కృష్ణుని పాదానికి బాణం వదిలాడు.
తర్వాత వచ్చి చూసి దేవదేవుడైన వాసుదేవునికా నేను బాణం వేసింది అని రోదించడం మొదలు పెట్టాడు. శ్రీ కృష్ణుడు అతనిని ఓదార్చి ఇలా అన్నాడు.
“త్రేతాయుగాన వాలి వైన నిన్ను చెట్టు చాటునుండి చంపిన ఫలితం ఇపుడు అనుభవిస్తున్నాను. కర్మ ఫలమును భగవంతుడైనను అనుభవించవలసినదే. నీవు నిమిత్తమాత్రుడవు.”
అని శ్రీ కృష్ణుడు తన శరీరమును త్యజించాడు.
ద్వారకకు చేరుకున్న అర్జునుడు కృష్ణుడు లేని ద్వారకను చూసి ఖిన్నుడయ్యాడు. శ్రీ కృష్ణుడి ప్రియ సఖుడైన ఆర్జునుడిని చూడగానే శ్రీ కృష్ణుని భార్యలు పలు విధాల రోదించారు.
వసుదేవుడు శ్రీ కృష్ణుడు తనకు చెప్పినదంతా అర్జునుడికి చెప్పి తన యోగనిస్ఠ తో శరీరం వదిలాడు.
వసుదేవుని మరణవార్త శ్రీ కృష్ణునికి చేరవేయడానికి అర్జునుడు అరణ్యానికి బయలుదేరాడు. అరణ్యం లో శ్రీ కృష్ణ భగవానుని మృతదేహం చూసి కన్నీళ్ళ పర్వంతం అయ్యాడు. మృతదేహానికి చెయ్యవలసిన కార్యక్రమాలు చేసి తను ద్వారకకు పయనమయ్యాడు. సిద్ధంగా ఉన్నవారిని తీసుకుని తన రాజ్యానికి బయలుదేరాడు. అర్జునుడు ద్వారక విడిచిన మరుక్షణం అప్పటివరకు కాచుకుని ఉన్న సముద్రం ద్వారకను ముంచెత్తింది.
స్వస్తి !
జైహింద్.

14, అక్టోబర్ 2018, ఆదివారం

అద్రోహః సర్వభూతేషు ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. అద్రోహః సర్వభూతేషు కర్మణా మనసా గిరా
అనుగ్రహం చ దానం చ శీలమే తత్ప్రప్రశన్యతే (మహాభారతం అను. 124-66)
తే.గీ. కరణములు మూటిచే వైరి కాక యుంట,
దయను వర్తిలుచుండుట ప్రియము తోడ,
దాన సద్గుణౌఁడుచునీ ధరణి నుంట
శీలవంతుల లక్షణ జాలమరయ.
భావము. ప్రాణులన్నిటి యందు మనోవాక్కాయ కర్మలచే వైరము లేకుండుటయు, దయకలిగి ఉండుటయు, దానముచేయుటయు శీలముగా ప్రశంసింపబడుచున్నది.
జైహింద్.

13, అక్టోబర్ 2018, శనివారం

భావగోపన ఆద్యక్షర బంధ సీసము.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! వందనములు.
శ్రీనాధమహాకవికి సమకాలికుడైన కొఱవిగోపరాజు రచించిన 
'సింహాసన ద్వాత్రింశిక' యనేగ్రంథములోని 
భావగోపన ఆద్యక్షర బంధ సీసము.

సీ: రాజ్యంబు వదలక, రసికత్వమెడలక
జయశీలముడుగక, నయముచెడక
దీనుల ఁజంపక, దేశంబు నొంపక ,
నిజముజ్జగింపక, నేర్పుఁగలిగి ,
విప్రులఁ జుట్టాల, వెన్నుసొచ్చినయట్టి
వారిని ,గొల్చినవారి, ప్రజల
హర్షంబుతో గాంచి, యన్యాయముడుపుచు,
మున్నుజెప్పినరీతి జెన్నుమీరి
గీ: చేతలొండులేక, పాత్రులవిడువక ,
యశము కలిమి తమకు వశము గాగ ,
వసుధనేలు రాజవర్గంబు లోన న
య్యాది విష్ణుమూర్తి వండ్రు నిన్ను .
విక్రమాదిత్యునివద్దకు ఒకనిరుపేద బ్రాహమణుఁడు తనకుమార్తెను వెంటబెట్టుకొని వచ్చినాడు. ఈపిల్ల నాకుమార్తె. పెళ్ళియీడువచ్చినది. అయితే పేదరికంవలన ధనంలేక దీనికి పెళ్ళిచేయలేకపోతున్నాను. నీవు సహాయపడి యీపిల్లకు పెళ్ళిచేయవయ్యా! అనిఆద్యక్షర బంధ సీసములో అడిగెను. పద్యపాదాదివర్ణములు కలిపి చదివినచో ఈ విషయము బహిర్గతమగును. ఇదియే భావగోపన ఆద్యక్షర చిత్రము
 జైహింద్.

12, అక్టోబర్ 2018, శుక్రవారం

తృణాం ఖాదతి కేదారే . . మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. తృణాం ఖాదతి కేదారే జలం పిబతి పల్వలే 
దుగ్ధం యచ్ఛతి లోకేభ్యో ధేనుర్నో జననీ ప్రియా.
కం. పొలమున తృణమునె మేయుచు
జలములు పల్వలములందు చక్కఁగఁ గొనుచీ
యిలప్రజలకు పాలనొసగు
సులలిత గోదేవి మనకు చూడఁగ తల్లే.
భావము. పొలాలలో గడ్డి తింటూ , గుంటలలో నీళ్ళు త్రాగుతూ, లోకులకు పాలనిచ్చే ఆవు - కన్న తల్లి వంటిదే కదా!
జైహింద్.

11, అక్టోబర్ 2018, గురువారం

సమాశ్రీ,గతికా,మత్తరజినీ, నెడదనిడు, నీతిగా,జ్ఞానజీవ,రజోరంజిత, అమలకీర్తి,సమాశ్రి,కీర్తిగామినీ,గర్భ"-శోధకా"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పలనరసింహ మూర్తి.జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
సమాశ్రీ,గతికా,మత్తరజినీ, నెడదనిడు, నీతిగా,జ్ఞానజీవ,రజోరంజిత, అమలకీర్తి,సమాశ్రి,కీర్తిగామినీ,గర్భ"-శోధకా"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పలనరసింహ మూర్తి.జుత్తాడ.
                   
"-శోధకా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.స.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
నీతిలేని లోకమందు!నిజము లేదదెంచి చూడ!నీవె గావరావె?దైవమా!
భూతికోరి ప్రాకులాడి!భుజ బలాన ఛండు లౌచు!భూవరాలు మాపుచుండిరే!
స్వాతిచిన్కు తోయమట్లు!సజల దూరమెంచరైరి!సావధాన మేది?వీరికిన్!
చేతి కంద నట్టి తీరు! సృజన శీల మేది? చూడ! శ్రీ  వరాశి  వేంకటేశ్వరా!

1.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
నీతి లేని!లోకమందు!
భూతి కోరి!ప్రాకులాడి!
స్వాతి చిన్కు తోయ మట్లు?
చేతి కంద నట్టి  తీరు!

2.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.364.ప్రాసగలదు.
నిజము లేదదెంచి చూడ!
భుజబలాన ఛండులౌచు!
సజల దూర మెంచరైరి!
సృజన శీలమేది?చూడ!

3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
నీవె!గావ రావె?దైవమా!
భూవరాలు!మాపు చుండిరే?
సావధాన మేది?వీరికిన్!
శ్రీ వరాశి! వేంకటేశ్వరా!

4.గర్భగత"-నెడదనిడు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.స.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నీతిలేని లోకమందు!నిజములే దదెంచి చూడ!
భూతిగోరి ప్రాకులాడి!భుజబలాన ఛండులౌచు!
స్వాతి చిన్కు తోయమట్లు!సజల దూరమెంచరైరి?
చేతికందనట్టి తీరు!సృజన శీలమేది?చూడ!

5.గర్భగత"నీతిగా"-వృత్తము.
ధృతిఛందము.న.ర.జ.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నిజము లేదదెంచిచూడ!నీవె!కావ రావె?దైవమా!
భుజబలాన ఛండులౌచు!భూ వరాలు మాపుచుండిరే?
సజలదూర మెంచరైరి?సావధానమేది?వీరికిన్!
సృజన శీల మేది?చూడ!శ్రీవరాశి వేంకటేశ్వరా!

6.గర్భగత"-జ్ఞానజీవ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
నిజములే దదెంచి చూడ!నీవె!గావరావె?దైవమా!నీతిలేని?లోకమందు!
భుజబలాన ఛండు లౌచు!భూవరాలు మాపుచుండిరే,భూతికోరి ప్రాకులాడి!
సజలదూర మెంచరైరి?సావధాన మేది?వీరికిం!స్వాతిచిన్కు తోయమట్లు?
సృజన శీల మేది?చూడ! శ్రీవరాశి! వేంకటేశ్వరా!చేతి కంది నట్టి తీరు!

7.గర్భగత"-రజోరంజిత"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నీవె!గావరావె?దైవమా!నీతిలేనిలోకమమందు!
భూవరాలు మాపుచుండిరే?భూతికోరి ప్రాకులాడి!
సావధానమేది?వీరికిం! స్వాతి చిన్కు తోయ మట్లు?
శ్రీ వరాశి!వేంకటేశ్వరా!చేతి కంది నట్టి తీరు!

8,గర్భగతలఘ్వంత"అమలకీర్తి"-.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.భ.స.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
నీవె!గావరావె?దైవమా!నీతిలేని!లోకమందు!నిజములే దదెంచి చూడ?
భూవరాలు మాపు చుండిరే?భూతికోరి ప్రాకులాడి!భుజబలాన ఛండు లౌచు!
సావధానమేది?వీరికిం!స్వాతిచిన్కు తోయమట్లు?సజలదూర మెంచరైరి?
శ్రీవరాశి! వేంకటేశ్వరా! చేతి కంది నట్టి తీరు!సృజన శీల మేది?చూడ!

9,గర్భగత"-సమాశ్రి"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నిజములే దదెంచి చూడ?నీతిలేని!లోకమందు!
భుజబలాన ఛండులౌచు!భూతికోరి ప్రాకులాడి!
సజలదూర మెంచరైరి?స్వాతి చిన్కు తోయమట్లు?
సృజన శీల  మేది?చూడ!చేతి కంది నట్టి తీరు!

10,గర్భగత"-కీర్తిగామినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.జ.ర.జ.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
నిజము లే దదెంచి చూడ?నీతిలేని!లోకమందు!నీవె!కావ!రావె!దైవమా!
భుజబలాన ఛండులౌచు!భూతికోరి!ప్రాకులాడి!భూవరాలు మాపుచుండిరే?
సజలదూర మెంచైరి?స్వాతిచిన్కు తోయ మట్లు?సావధాన మేది?వీరికిన్?
సృజన శీల మేది?చూడ!చేతి కంది నట్టి తీరు! శ్రీ వరాశి వేంక టేశ్వరా!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

10, అక్టోబర్ 2018, బుధవారం

శరన్నవరాత్రులు సందర్భముగా మొదటి రోజున జరుగుచున్న నేటి అష్టావధానమునకు మీకు మనసారా స్వాగతము.

1 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శుభోదయం. నేటి నుండి శరన్నవరాత్రులు. ఈ సందర్భముగా భక్తులైన మీ అందరికీ ఆ జగన్మాత ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలని మనసారా కోరుకొంటున్నాను.
 నేడు కొత్తపేట్(నాగోలు) సరస్వతీ దేవాలయములో సాయంత్రం ఆరు గంటలకు జరుగబోవుచున్న అష్టావధానమునకు మీకు మనసారా స్వాగతము పలుకుచున్నారు నిర్వాహకులు. గమనించ మనవి.
జైహింద్.

9, అక్టోబర్ 2018, మంగళవారం

అవిశ్రామం వహేద్భారం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. అవిశ్రామం వహేద్భారం శీతోష్ణం చ న విందతి
ససంతోషస్తథా నిత్యం త్రీణి శిక్షేత్ గార్ధభాత్.
క. నిరతము బరువును మోయుట,
వెరవక వేడికి చలికిని బ్రీతి మనుటయున్,
గరపును గాడిద మనలకుఁ
జరియింపఁగ వలయు నటుల చక్కగ మనమున్.
భావము. విశ్రాంతి లేకుండా భారం మోయుట, చలి ఎండలకు చలించకుండా వుండుట, నిత్యము సంతోషముగా నుండుట, ఈ మూడు లక్షణములు మనము గాడిద నుంచి నేర్చుకొనవలెను.
జైహింద్.

8, అక్టోబర్ 2018, సోమవారం

శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారు విలిఖించి మనతో పంచుకొనిన చిత్రకవన విన్యాసమును దర్శించండి.

1 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారు విలిఖించి మనతో పంచుకొనిన చిత్రకవన విన్యాసమును దర్శించండి.
 జైహింద్.

7, అక్టోబర్ 2018, ఆదివారం

మత్యరజినీ,అనఘా,రనరా,రజరోన్నర,మగంటిమి,ఘనతెంచు,గగనమాయె,సరిదారి,రేపటూహ,హానిచర్య,గర్భ"-పూతకీర్తి"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

1 comments

జైశ్రీరామ్.
మత్యరజినీ,అనఘా,రనరా,రజరోన్నర,మగంటిమి,ఘనతెంచు,గగనమాయె,సరిదారి,రేపటూహ,హానిచర్య,గర్భ"-పూతకీర్తి"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                 
"-పూతకీర్తి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.ర.య.జ.స.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
సాటివారి హాని చర్యలం!జగడమాడు తీరునం?జాతి బట్టి ఘనతెంచితే!
కాటికూడు భుక్త మేలరా?గగనమాయె!నీతిలం?ఘాతుకాళి ప్రభ పెచ్చయెన్?
మాట చేత పొంతనేదిలం?మగతనంపు మృగ్యతం!మాతనైన హతమార్తురే?
భూటకంపు స్వేచ్ఛ మోసమే!పొగలు గ్రమ్మె మంచికిం!పూతజిక్కె,భువి కీర్తులున్!                                                                                            
1.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.ప్రాసగలదు.
సాటివారి హాని చర్యలన్!
కాటికూడు భుక్త మేలరా?
మాట చేత పొంత నేదిలన్?
భూటకంపు స్వేచ్ఛ మోసమే!

2.గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.88.ప్రాసగలదు.
జగడమాడు తీరునన్?
గగన మాయె!నీతిలన్?
మగతనంపు మృగ్యతన్!
పొగలు గ్రమ్మె మంచికిన్!

3.గర్భగత"-రనరా"-వృత్తము.
బృహతీఛందము.ర.న.ర.గణములు.వృ.సం.187.ప్రాసగలదు.
జాతిబట్టి ఘన తెంచితే?
ఘాతుకాళి ప్రభ పెచ్చయెన్!
మాత నైన హతమార్తురే!
పూత జిక్కె భువి కీర్తులన్!

4.గర్భగత"-రజరోన్నర"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.న.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సాటివారి హాని చర్యలం!జగడమాడు తీరునన్?
కాటి కూడు భుక్త మేలరా?గగనమాయె!నీతిలన్?
మాట చేత పొంత నేదిలం?మగతనంపు మృగ్యతన్!
భూటకంపు స్వేచ్ఛ మోసమే?పొగలు గ్రమ్మె మంచికిన్!

5.గర్భగత"-మగంటిమి"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.య.జ.స.లగ.గణములు.యతి.9,వయక్షరము.
ప్రాసనీమముగలదు.
జగడమాడు తీరునం?జాతిబట్టి ఘన తెంచితే?
గగనమాయె!నీతిలం?ఘాతుకాళి ప్రభ పెచ్చయెన్?
మగతనంపు మృగ్యతం!మాత నైన హతమార్తురే!
పొగలు గ్రమ్మె మంచికిం!పూత జిక్కె భువి కీర్తులున్!

6.గర్భగత"-ఘనతెంచు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.య.జ.స.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
జగడమాడు తీరునం?జాతిబట్టి ఘనతెంచితే?సాటివారి హానిచర్యలన్!
గగనమాయె!నీతిలం?ఘాతుకాళి ప్రభ పెచ్చయెం?కాటికూడు భుక్త మేలరా?
మగతనంపు మృగ్యతం!మాతనైన హతమార్తురే!మాట చేత,పొంతనేదిలన్?
పొగలు గ్రమ్మె మంచికిం!పూతజిక్కె భువి కీర్తులుం!భూటకంపు స్వేచ్ఛ మోసమే?                                                
7.గర్భగత"-గగనమాయె"-వృత్తము.
ధృతిఛందము.ర.న.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జాతిబట్టి ఘన తెంచితే?సాటివారి హాని చర్యలన్!
ఘాతుకాళి ప్రభ పెచ్చయెం?కాటికూడు భుక్త మేలరా?
మాతనైన హతమార్తురే!మాట,చేత పొంత నేదిలన్?
పూత జిక్కె!భువి కీర్తులుం!భూటకంపు స్వేచ్ఛ మోసమే?

8.గర్భగత"-సరిదారివృత్త్తము.
ఉత్కృతిఛందము.ర.న.ర.ర.జ.ర.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
జాతిబట్టి ఘనతెంచితే?సాటివారి హాని చర్యలం!జగడమాడు తీరునన్?
ఘాతుకాళి ప్రభ పెచ్చయెం?కాటికూడు భుక్త మేలరా?గగనమాయె!నీతిలన్?
మాతనైన హతమార్తురే?మాటచేత పొంతనేదిలం?మగతనంపు మృగ్యతన్?
పూతజిక్కె!భువికీర్తులుం!భూటకంపు స్వేచ్ఛ మోసమే?పొగలు గ్రమ్మె! మంచికిన్?                                                                  
9,గర్భగత"-రేపటూహ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.య.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జగడమాడు తీరునం?సాటివారి హాని చర్యలన్!
గగనమాయె!నీతిలం?కాటికూడు భుక్త మేలరా?
మగతనంపు మృగ్యతం?మాట చేత పొంత నేదిలన్?
పొగలు క్రమ్మె మంచికిం?భూటకంపు స్వేచ్ఛ మోసమే?

10,గర్భగత"-హానిచర్య"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.య.జ.ర.య.జ.స.లగ.గణములు.యతులు.9,18,
ప్రాసనీమముగలదు.
జగడమాడు తీరునం?సాటివారి హాని చర్యలం!జాతిబట్టి ఘనతెంచితే?
గగనమాయె నీతిలం?కాటికూడు భుక్త మేలరా?ఘాతుకాళి ప్రభ పెచ్చయెన్?
మగతనంపు మృగ్యతం?మాట చేత పొంతనేదిలం?మాతనైన హతమార్తురే?
పొగలు క్రమ్మె మంచికిం?భూటకంపు స్వేచ్ఛ మోసమే?పూత జిక్కె భువి
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.