గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఏప్రిల్ 2020, గురువారం

వర్ణన ఆశువు అను అంశములననేకులయిన అవధానుల పూరణలలో గల వైవిధ్యము గమనింపదగును.

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! బ్రహ్మశ్రీ పండరి రాధాకృష్ణ గారు ఎంతటి దైవ భక్తులో అంతటి ఆంధ్రభాషానురక్తులు.తాను ఆలయపూజారిగా జీవితము గడుపుచు, వారికి గల భాషాభిమానముచే కవిసమ్మేళనములు అవధానములు ఆధ్యాద్నికోపన్యాసములు నిష్ణాతులయిన కవిపండితులచే చేయించుచు ఆ కార్యక్రమములను చిత్రీకరించుచు యూట్యూబ్ ద్వారా ఆయా కవులకు గల ప్రఖ్యతిని ద్విగుగుణీకృతము చేయుచున్న మహనీయులు.
వారు ప్రాశ్నికులను, అవధానులను స్వాగతించిరశ్నలను పూరణలను చిత్రీకరించి సమాజముముందుంచినవాటిలో ఈ కార్యక్రమమొకటి. అవధరించి వారికి మీ ప్రశంసలతో ప్రోత్సాహము కలిగించగలరని ఆశించుచున్నాను.
 జైహింద్.

29, ఏప్రిల్ 2020, బుధవారం

ఆర్యులారా! నిన్న మధ్యాహ్నం మూడు గంటలనుండి అవధాన సుధా సింధువు అంతర్జాల వాట్సప్ లో శ్రీ అప్తగోయిన వేంకటేశ్వర్లు అవధాని చేయుచున్న అవధానమును నేనును అనుసరిస్తూ చేసిన ప్రయత్నము. తే. ౨౮ - ౪ - ౨౦౨౦,

0 comments

జయ్ శ్రీరామ్.
ఆర్యులారా! ఇప్పుడే మూడు గంటలనుండి అవధాన సుధా సింధువు అంతర్జాల వాట్సప్ లో శ్రీ అప్తగోయిన వేంకటేశ్వర్లు అవధాని చేయుచున్న అవధానమును నేనును అనుసరిస్తూ చేసిన ప్రయత్నము.
తే. ౨౮ - ౪ - ౨౦౨౦,
ఓం
౧. నిషిద్ధాక్షరి.
గ్రీష్మంలో మల్లెపూవు వర్ణన.
శ్రీమంతంబై వెన్నన్,
శ్రీమంతుండగు శశిని ప్రసిద్ధిగ పోలున్
ప్రేమను గొలిపెడి మల్లియ
కోమలి! గ్రీష్మమునమనలకోసమె వచ్చెన్.

౨. సమస్యా పూరణ.  
సులలిత రామ పదాబ్జము
లిల మానవ జాతికిహిత మే కద గొలుపున్
విలువను గనుచును పలుకుచు
తలపున నిలుపగ నిరతము తలమానికమౌన్.

౩. దత్తపది.
నమ్మితి రామపదాబ్జమె
నమ్మితి సీతమ్మ భక్తి నమ్మితి నీతిన్
నమ్మితి రుజు మార్గంబునె
నమ్మితి నని హనుమ పలికె నయముదలిర్పన్.

౪. న్యస్తాక్షరి.
ఉత్పలమాలలో
కారణ జన్ముడీతఁడిల. కాళియె సద్వరభాగ్యమీయగా     ((౧/కా)
వీరికి మౌళి భాగమున ప్రీతిగ శారదయే వశించునే       .( ౫/ళి)
స్మేర మనోజ్ఞుడై కవుల చిత్తములెక్క ముదాకరంబుగా   (౧౬/దా)
కోరిన దానినే పలుకు గొప్ప కవీశుఁడు కాళిదాసుగా..  ( /౧౯/సు)

౫. వర్ణన.
వసంత యామిని వర్ణన. మత్త్కోకిలలో.
శ్రీకరంబవసంతశోభలు చేర్చునందముభూమికిన్.
లోకమందు వసంత యామినిశ్లోకముల్ పలికించుగా
శ్రీకరంబగు భావ సంపదచేర్చుచున్ మది పొంగగా
హే కవీశ్వరులార గొల్పుడహీనసత్కవితాసుధన్..

౬. ఆశువు.  ౧
కరోనాలో రైతు హృదయను.
తొలకరిజల్లులింక మము తొందరపెట్టుచు వచ్చుచుండెనే
తొలగదదేలనో కనగ దుష్టకరోన ప్రపంచ భాగ్యమే
వెలవెలబోవుచుండె మరి పృథ్విని దున్నుటదెట్లు సాగు? నీ
వలననె సాధ్యమౌనుగద బాపుము దీనిని దీన బాంధవా!

౬. ఆశువు.  ౨.
ఓజోన్ ఆనందం.
నెలకొనె లాక్కుడౌను కరుణించెను దైవము నన్ను క్రోలుకోఁ
గలిగితి నేటికిన్ ప్రజలు గాలిని ధూమము తోడ పాడుగా
విలువల నెంచి చేయరిక విశ్వ విధానము బాగుగానగున్
శ్రీలనుగొల్పుదేవ యని కోరెను ఓజ శుభంబునెంచుచున్.


౭.అంత్యాక్షరి.  ౧. ఓజోన్ ఆనందం
వరదుఁడ! శ్రీహరీ పృథివి వర్ధిలఁ జూడుము ప్రేమతోడ ని
న్నరయుచు భక్తులెల్లరుఘనంబుగ పూజలు చేఅనెంచినన్
దురిత కరోనచే నెటుల దోపకయున్నది చేయు కార్యముల్
పరమహితంబు నీవెకద భాగ్యదగొల్పుదువయ్య మాకిలన్..

౭.అంత్యాక్షరి.  ౨.
భోగములేలఁ గొల్పితివి భోగశయాన మహాత్మ మాకిలన్.
రాగము నీపయిన్ గొలిపి రంజిల చేసిన మేము మెచ్చమే
మాగతి నీవె. చూడు వరమైన నిను విడఁ జాలమయ్య. సద్
యోగము నీ కృపన్ గలుగు హాయిగ మమ్ములనుండజేయుమా.

స్వస్తి.
చింతా రామకృష్ణారావు.
జయ్ హింద్.

28, ఏప్రిల్ 2020, మంగళవారం

ఇప్పుడే అనగా౨౭ - ౪ - ౨౦౨౦ మధ్యాహ్నం మూడు నుండి జరిగిన అవధానం.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా. నమస్సులు. ఇప్పుడే శ్రీ కవిరాజు గంగుల ధర్మరాజు అవధాని అంతర్జాలంలో అవధాన సుధాసింధువు వాట్సప్ గ్రూపులో జరుగుచున్న అవధానమును నేనును ప్రయత్నించి తోడనే చేసిన పూరణలు.
ఓం
౧. నిషిద్ధాక్షరి.
లలితాంబ వర్ణన.

శ్రీనేవేడన్గానే
తానేనీవై శుభాళిదయ చేతువుగా.
నేనిను సతతము లలితా
జ్ఞానంబిడ కొలుతునమ్మ. గౌరవమొప్పన్.

౨. సమస్యా పూరణ.
శంభుఁడు సాంబుఁడై సతము సజ్జన పాళిని గాచుచుండు నా
రంభము నుండి భక్తులను రాజిల వర్ధన జేయ జూచుచున్
శంభుని సేవజేయుచుభృశంబు శ్రమించుచునుండెనట్టి సం
రంభను గాంచి యంబయని రాగమునొందెగదా మహేశుఁడే.

౩. దత్తపది.
కంపము బుట్టు దుష్టులకు కంసుని జంపిన కృష్ణుఁడన్నచో
గంపను పెట్టియాతనిని కావగనందునిఁ జేర్చి తండ్రియే.
కొంపలు ముల్గె దుష్టులకు కూల్చెను వారిని పట్టి కృష్ణుఁడున్.
చెంపకుచారెడైన కను చిన్నెలు గోపిక లెన్ని పొంగిరే.

౪. వర్ణన.
ఆటవెలదిలో కరోనా హెచ్చరిక యువతకు.
దూరదృష్టి లేక దూసుకుపోవుచు
తిరుగరాదు మీకు తెలియవలయు.
కనగనీ కరోన కాలాంతకునివలె
చంపునయ్య పిదప కొంప మునుగు.

౫. న్యస్తాక్షరి.
కలియుగ వేంకటేశ్వరుఁడు కాచు ప్రజాళి నటంచు నిత్యమున్ (౧/౫వేం)
కలఁగను వేళనుండియును మ్మగనిద్దురపోవనీయకన్ (౨/౧౧క)
సులలిత వాక్సుధాలహరిశోక నటేశుని బోలియాడుచున్ (౩/౧౪టే.)
కలకలనుందురిప్పుడటు కాదు. కరోనయె యీ! చేసెనే. (౪/౧౮శ)

౬. ఆశువు.
శంకరాచార్య అద్వైతం.
శంకరునద్వైతంబది
శంకలనేబాపె పృథ్వి సర్వజనులకు
సంకటభావము బాపెను.
శంకరుడే శంకరుడయె సరసగుణాఢ్యా!

౭. చిత్రానికి పద్యం. ౧.

కోపము వలదు యశోదా!
యీపాడు చిన్నివాడు యిటులే చేయున్
పాపంబల్లరి. కావున
శ్రీపతిసముడీతడు. కను చిన్ని కుమారున్.

౬. ఆశువు. ౨.
కరోనాలో సేవలందిస్తున్నవారిని ప్రశంసించండి.
నిరతము బాధ్యతన్ గలిగి నిర్మల సద్హృదయుల్ మహాత్ములున్
పరమ దయార్ద్ర చిత్తులయి భాసిలు సేవలఁ జేయుచున్.ప్రజన్
చొరబడనీక కాచుదురు చూచి కరోనకు దూరముంచుచున్
వరగుణ సేవనన్ ఘనులు వర్ధిలుచుండిరి వారికిన్నతుల్.

౭. చిత్రానికి పద్యం.౨.

ఫాలాక్షుఁడు గొనుచుండెన్
హాలాహలమరెరె బాధనరయమినయయో!
మేలగు రమ నాశ్రీహరి
యేలఁగ గొని విషమితనికి నిచ్చుట తగునా?
స్వస్తి.
చింతా రామకృష్ణారావు.

తే.౨౭ - ౪ - ౨౦౨౦.
జైహింద్.

27, ఏప్రిల్ 2020, సోమవారం

కరోనా దండకము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.చోడవరం(మం).విశాఖ పట్నము(జిల్లా).

0 comments

 జైశ్రీరామ్.
కరోనా దండకము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.చోడవరం(మం).విశాఖ పట్నము(జిల్లా).
             
ఓం,కార,హ్రీం కార,హ్రాం కార,రీం కార,రాం కార,బీజాశ్రి,
విష్ణ్వంశ,భక్తాళి మోదంబునై,రక్షకుం నెల్వవం,రాద్ధాంత
మున్జేయ,కోరంగి నామాన క్రొవ్వెక్కి,ఉచ్ఛ్వాస,నిశ్వాసలం
జేరి,మర్త్యాళి నాశంబు కాక్షించి,కానంగ రాకీవు కోరంగి నామా!
కరోనా పిశాచీ! ప్రకోపాన లోకంబు దండెత్త లెక్కింప
కీవుంటి వేలన్!వినాశీ కబోదీ!కరాళ ధంష్ట్రీ!సదా నంద
మున్బొంది ప్రాణాలు గొంపోవు నిన్జూసి,లోకంబు హింసింప
యత్నింప,తప్పించు కుంటున్న ద్రోహీ!వినాశంబు లేదెంతొ దూరంబు!
మాపాలి దైవాలు,నీపాల రుద్రాలు!వెన్నంటి తర్మంగ,
పర్వెత్తు కాలంబు!దర్జేరె!నీదౌ వికారంబు వికారిం
ప్రవేశించి ధర్మంబు గీడ్చేసి,కర్మంబు సేయంగ,నీక్షుద్ర
కర్మంబు జీవాళి హర్షంబు గా దెంచ! మర్యాద పాఠించి
పో పొమ్ము!సౌమ్యాన! లేకున్న దర్మంబు  రక్షింప. బీజాస్త్ర
నాగాస్త్ర,సర్వాస్త్ర సంపన్నతం దేవ సంఘంబు విచ్చేసి
లోకంబు రక్షించు!మన్నింప రెవ్వారు నిన్నెంచ!
భీతిల్లి నిస్సాయతం పారు,నీభీతి మాపంగ శక్యంబు
గాదింక!పో వేగ భూ మండలం వీడి!మారీ మహామారి
కోరంగి రూపీ కరోనా కఠోరీ!
కటాక్షించు దైవాలు!హింసింప పాపంబు!
నా మాట లాలించి శాంతించి పొమ్మింక!
సద్ధర్మ సంకీర్తనం బొప్ప,కీర్తింతు రెన్నండు!శాంతించు
లోకంబు!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

26, ఏప్రిల్ 2020, ఆదివారం

తే.26 - 4 - 2020నిశ్రీ బండికాడ అంజయ్యావధాని అంతర్జాల వాట్సప్ అవధానం అవధానసుధాసింధు సమూహంలో జరుగుచుండగా నేనూ ప్రయత్నిస్తూ చేసిన పూరణలు.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఇప్పుడు అనగా తే.26 - 4 - 2020నిశ్రీ బండికాడ అంజయ్యావధాని అంతర్జాల వాట్సప్ అవధానం అవధానసుధాసింధు సమూహంలో జరుగుచుండగా నేనూ ప్రయత్నిస్తూ చేసిన పూరణలు.
ఓం
నిషిద్ధాక్షరి.
నృసింహ వర్ణన.

శ్రీనాథా నీ రూపే
జ్ఞానాక్షిన్గొల్పునృహరి! కానంగనినున్.
నే నీదర్శనభాగ్యం
బీనాడే పొందితినయ హేభక్త నుతా!

సమస్యా పూరణ.
మన్నన చేసి భక్తులిట మాన్యుని నన్ను గ్రహించి రండిటన్
క్రన్నన మీకు మేలుగతి కల్పన చేసెడి కృష్ణుఁడన్ గనన్
వెన్ననుగ్రోలి మిము మది ప్రీతిని గాంచి శుభాళినీయ కం
దున్నను గొల్చినన్ దొలగు దోషములన్ని లభించు పుణ్యముల్.

దత్త పది.కరోన.
ఇలలో సుజనులు నిను గని
కలవరపడుచుండిరహహ కాంచుము కృపతో
తలక్రిందుల చేయకుమా
వలదిక పొమ్మీవు కృపను పాడు కరోనా

న్యస్తాక్షరి. సరస్వతి వర్ణన.
జ్ఞానమదే పరమార్తము.(౧/౫.ప).
వాణిన్ గాపాడుమనువు వచ్చిరి భక్తుల్.(౨/౩గా)
మౌనీశులమొర వినుమా౩/౪ల..
వాణీ! జ్ఞానంబు నిచ్చి వర్ధిల గనుమా.(౪/౧ వా)

ఆశువు,
అంతర్జాల అవధానము.
అంతర్జాలమునందున
శాంతంబుగ సద్వధాన సాధన ఘనమౌన్
వింతగ నుండగ నోపును.
వింగ కరోన గొల్పిను ప్రీతిని దీనిన్.

చిత్రానికి పద్యం.
తిరుపతి వేంకటేశ్వరులు దివ్య వధాన విధాన బ్రహ్మలే.
తిరిగిరి దేశ దేశములు దీప్తి గడించిరి పద్యవిద్యచే
సరసవచోవిలాసులయి చక్కగ పద్యములల్లు నైపుణిన్
గురువులు గావెలింగిరిల. కోమలి! మీకిది చెప్పనేటికిన్.

వర్ణనాంశము.
కరోనా చేస్తున్నమృత్యు విన్యాసాన్ని శార్దూలములో.
ప్రాణాపాయము లోకమంత కలిగెన్ పాపీ కరోనా! ప్రజల్
జ్ఞానోద్భాసులు సత్యసంధులు గతిన్ కానంగ మార్గంబికన్
లేనే లేదనిపించుచుండె కనుమా లేశంబు జాలైన లే
దా? నీ మార్గము వీడుమింక దయతో తాల్మిన్ మమున్ బ్రోవుమా.

చిత్రానికి పద్యం ౨.
అరటిని సృష్టి చేసె విధి. హాయిగ వండి నివేదనంబునే
హరికిలఁ జేసి ధన్యులుగ హాయిగ మానవులుండఁ జేయగన్.
నిరతము దీని సత్ ఫలము నిర్మల చిత్తముతో భుజించినన్
హరి సుఖ సంపదల్ గొలుపు. హాయిగ మీరు భుజించుడెన్నుచున్.

ఆశువు ౨. సూర్య వర్ణన.
అరయన్ స్వస్థత గొల్పు దేవ! నిను నే నానందమొప్పారఁగా
పరమాత్మా మది నెంచి గొల్తును మహద్భాగ్యంబు నిన్ గొల్చుటన్
వరమై కల్గును సూర్య దేవ! కరుణన్ వర్ధిల్ల జేయన్ బ్రజన్
కురిపింపన్ గృప మాపయిన్ కొలిచెదన్ కూర్మిన్ గనన్ గోరెదన్.


అవధాని శ్రీ బండికాడ అంజయ్యగారికి అభినందనలు
శ్రీనాథుండు కృపామృతమ్ము నిడి యీ శ్రీ బండి కాడాన్వయున్
జ్ఞానోద్భాసితుగానొనర్చి శుభముల్ కల్గించనష్టావధా
నానూనాక్షర విద్య విద్య భువిపైనానందమున్ బంచగా
దీనోద్ధారకుఁడై యొనర్చె. శుభముల్ దీపించిమీ కెల్లెడన్.

అభినందనలతో

చింతా రామకృష్ణారావు.
జైహింద్.

25, ఏప్రిల్ 2020, శనివారం

మంగళ మహాశ్రీ వృత్తము.

0 comments

 జైశ్రీరామ్.
మంగళ మహాశ్రీ వృత్తము.
భ జ స న భ జ స న గగ.
యతి ౧ - ౯ - ౧౭.
శ్రీ కరుఁడు శంకరుఁడు, శ్రీధవుని సేవలను, శ్రీధరుఁడుశంకరుని సేవల్
లోకమున పొందుట విలోకనము చేసిన వెలుంగు మది కారణము దేవా!
చేకొనునవెన్నమది శ్రీకర గుణాఢ్యమగు చిత్ప్రభయటంచు వర భావా!
శ్రీకరము మాకది. ప్రసిద్ధిగను భక్తులకు చిన్మయము  లోకమె గనంగన్.
జైహింద్.

24, ఏప్రిల్ 2020, శుక్రవారం

౨౩ - ౪ - ౨౦౨౦ వతేదీని అంతర్జాల అష్టావధానంలో అవధాని శ్రీ లోకా కగన్నాథశాస్త్రితో పాటు నేను ప్రయత్నించిన పూరణలు.

0 comments

 జైశ్రీరామ్.
౨౩ - ౪ - ౨౦౨౦ వతేదీని అంతర్జాల అష్టావధానంలో అవధాని శ్రీ లోకా కగన్నాథశాస్త్రితో పాటు నేను ప్రయత్నించిన పూరణలు.
నిషిద్ధాక్షరి.
వైద్యుడు దైవసమానుడు వర్ణించండి.

క. శ్రీమార్గమ్మై దైవ
మ్మై మేల్ కూర్మిన్ గొలిపెడి మాన్యుల్ గాచే
ధీమంతుల్ వైద్యులిలను
క్షేమంబున్గొల్పు సురలె కీర్తింపవలెన్.

సమస్య.

భవితను చూడలేక. గుణవర్ధనులన్ భువి నిందఁ జేయుచున్
ప్రవిమలఛందముల్ విడిచి పాడువిధానములాశ్రయించుచున్
కవితలు చెప్పు దుష్కవులు. జ్ఞానమొకింతయు లేనియట్టి యా
కవులను గౌరవింపకుడు కావ్యములన్ బడవేయుడగ్నిలో.


దత్తపది.
కార్యములాచరించుటను గౌరవమొప్పగ మెల్గుచుండి యా
హార్యమునందు భర్తమది కానుచునుండియు కర్య కల్పనా
ధుర్యవరేణ్యయై కులవధూమణియై మహనీయ సౌమ్యయౌ
భార్యను కల్గియుండుటది భాగ్యము పుణ్యఫలంబె చూడగన్.

న్యస్తాక్షరి.

“శాసనము “ అను అక్షరములు ఉత్పల మాలా వృత్తము లో
1. వ పాదములో  1 వ  అక్షరము  “శా”  
2. వ పాదములో 5 వ  అక్షరము “స”
3. వ పాదములో 9 వ అక్షరము “న”
4. వ పాదములో 12 వ అక్షరము “ము”
వచ్చేలా ఆధునిక రాజకీయము పై ఒక పద్యము చెప్పండి.

శాంతముతోడ నీప్రజను చక్కగ పాలన చేయువారలున్
క్షాంత విలాస5. ధామ, గుణగణ్యులునున్మహనీయ దాతలున్
భ్రాంతికి దూరులైన మన9పాలకవల్గమునాడు కల్గె. నే
డింతయు క్షేమమున్ గనని హేయము12నొప్పెడివారె పాలకుల్.

వర్ణనభారతీయ సంస్కృతి.
సీ. శ్రీమన్మహాజ్ఞాన భూమీశులానాడు
గురుకుల విద్యను కూర్మి నెరప
పాఠములానాడు ప్రజలకు శ్రేయంబు
వరలింప గరపెడి బాటగొలిపి
ప్రకృతివైద్యవిధాన మకళంకముగ నేర్ప
యారోగ్యసత్పథమమరఁజేసి
హోమోదులంజేసి భూమిన్ జనులసౌఖ్య
కారణమగుచును ఘనత వరలి
గీ. భారతీయత దెలిపి సద్భావిగొలిపి
సౌఖ్యసంపత్తులను గొల్పు సచివులలర
భరతభూమియే యానాడు వరలె కనగ.
సంస్కృతీప్రభనలరెడిజన్మభూమి.

ఆశువు.1
ఒక్కరోజు ప్రథాని.నైతే....

ప్రాణము మోడీ. కాదని
నేనొల్ల ప్రథాని పదవి నేర్పరి నే కాన్
ప్రాణములనె గొనిపోయెడి
జాణనుయీ దుష్కరోనఁ జంపగనేరన్.

చిత్రానికి పద్యం.1
ఎంతటి దుస్థితి నలునకు.
సుంతైనా దయయెలేదు చూడగ విధికిన్.
క్రాంతి పథమ్ముననడచెడి
శాంతునిబాధించ శనికె సంభవమాయెన్.

ఆశువు 2.
హిమాలయాలకి విహారయాత్ర. అల్లసాని పూనితే.

చెప్పెద గొప్పగు ప్రకృతిని.
చెప్పెద గంగాఝరులను శేముషినొప్పన్.
జెప్పెద నక్కడి మనుజుల
జెప్పెదనా స్థలమహిమను శ్రీకర. వినగన్.

చిత్రానికి పద్యం 2.
అద్దములో తన యందపు
ముద్దుమొగమునను కనుచును మోమున చుక్కన్
తద్దయు పెట్టెడి కాంతను
ముద్దుగ కను భాగ్యులీరు పూజ్యా. కనుడీ.

స్వస్తి.
జైహింద్.

23, ఏప్రిల్ 2020, గురువారం

రసయా ద్వయ,సింహరేఖా,రసరాజి,హరాయుధ ద్వయ,శక్తిబీజ ద్వయ,పుఱ్ఱియౌ,గర్భ"-బీజకుండలినీ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
రసయా ద్వయ,సింహరేఖా,రసరాజి,హరాయుధ ద్వయ,శక్తిబీజ ద్వయ,పుఱ్ఱియౌ,గర్భ"-బీజకుండలినీ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.                        
"-బీజ కుండలినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.ర.జ.మ.జ.జ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.

బీజ శక్తిని మించి తంచున్!విఱ్ఱవీగెదే!"-కరోనా"-!వెఱ్ఱిదాన!హరాయుధానన్!
ఆజి నోడక!సాగి పొమ్మా!అఱ్ఱు చాచకే!పిశాచీ!అఱ్ఱమౌ!జవ సత్వ మెల్లన్!
తూ జపంబిది కాదు లెమ్మా!తొఱ్ఱ పుల్గు చూపు లాపే!తుఱ్ఱు మంచున్జేరు  చంద్రున్.                                             వాజినం బది నీఱు నౌలే!పఱ్ఱి యౌలే!పారిపొమ్మా!పఱ్ఱు మన్నటు లౌదు! వెంచన్!
                                                                                 
అర్ధములు:-
అఱ్ఱమౌ=జీర్ణము కానిదౌ,తొఱ్ఱ పుల్గు=గుడ్ల గూబ,తుఱ్ఱుమంచున్=
వడిజను,వాజినంబు=బలము,నీఱు=బూడిద,పఱ్ఱి యౌలే=ఛిన్నా భిన్న
మగును(ముక్కలు కాబడును),పఱ్ఱు మన్నటు=చౌటి మట్టి వలె,
శాస్త్రము లోక కల్యాణానికి నుపయోగ పడుట హర్షనీయమే!కాని
రక్షణమనే ముసుగులో ఆధిపత్య పోరుకు గాను ఒకరికొకరు తెలిసి కొనని
విధమున మారణాయుధాలు తయారు చేసి కొను నేపధ్యములో పంచ
భూతాత్మక ప్రకృతి ప్రకోపించు ననుటకు సందేహము లేదు.జీవ థాత్రిని
నడిపించే అతీతమైన శక్కి యొకటి గలదు.అదియే దైవము.భగవద్గీతలో
శ్రీకృష్ణుడు"-థర్మ సంస్తాపనార్ధాయ సంభ వామి యుగే!యుగే"-అన్నాడు.
యుగ ధర్మాన్ని బట్టి,నీతి,ధర్మము పూర్తిగా నశించు నపుడు దానిని
రక్షించుటకు భగ వంతుడు జన్మించు చుండును.మానవుడు తన రక్షణార్థమై
యెన్ని మారణాయుధములు సృజించినను లాభ ముండదు.దైవాన్నే మన
అదుపులో నుంచు కొందామనే యోచన ముప్పునకు కారణమగును.
త్రికాలజ్ఞులైన యోగులు మునులు వారి తపః శక్తిచే రాబోవు కాలమున
జరుగు య రాచికములను ముందుగనే యూహించి ప్రజల కందించినారు.
యోగ వాశిష్ట్యమున వాటిని దూరము చేసికొనుటకు బీజ సంపుటి
నేర్పరచిరి.
ప్రస్తుతము కరోనా మారి వాయు రూపమున దుష్ట క్రిమి యెదిరించుటకు
కనబడని మహమ్మారియై ప్రపంచమునే గడగడ లాడించుచున్నది.
దానినుండి తప్పించు కొనుట కవకాశము లేని పరిస్థితి యేర్పడినది.
అందరిని సమాన దృష్టిచే చూసి  కబళించు నీ పిశాచిని యంత్ర శక్తి,
శాస్త్ర శక్తి నిరుప యోగమని తేలినది.ఇప్పుడు దిక్కు మాలిన స్థితి
యేర్పడినది.దిక్కు లేని వారికి దేముడే దిక్కను నార్యుల వచనము
లిప్పటికైనా విందాము.
   
ఓం,హ్రీం,రీం,రాం,అనే విష్ణుబీజములు విపత్తులను దూరము చేయును.
అదియే విష్ణు శక్తితో"-హర హర,నయ నయ,పచ పచ,మథ మథ, ఉత్పాదయ దూరే కురు కురు స్వాహా!హర హరా శ క్త్యాయుధాన"-కోరంగి"-
కరోనా"-మారిని దూరముగా చంద్రమండలము పొమ్మని"-ఏక వింశత్యా
ధిక బీజము లుపయోగించి ఈ "-బీజ కుండలినీ"-లిఖింబడినది.
భావము:-
అణుశక్తి నాకు లెక్కా!బీజ శక్తినే మించినా నని,విఱ్ఱ వీగు "-కరోనా"-
హర హర యను నాయుధమున మేము చేయు యుద్ధమున పరాజయము
నందక వెడలి పొమ్ము.గెలుపునకు పిశాచీ యూహింపకు.ఇంత వరకు
యెందరినో పొట్టను పెంటు కొంటివి.అజీర్తి రోగముచే!నీ జవ సత్వములు
కృశించును.తూ తూ మంత్రము కాదు.మేము చేయునది.గుడ్ల గూబ  చూపు లెందు లకు?(గుడ్ల గూబలు,గబ్బిల భక్షణమున  కరోనా సంక్రమించునట).
తుఱ్ఱుమని యెగిరి చంద్రుని చేరికొమ్ము.నీ బలము బూడిదగును.నీబ్రతుకు
ఛిన్నా భిన్న మగును.పారి పొమ్ము.తుదకు నీవు.చౌటి మట్టి వౌదువు.

1.గర్భగత"-రసయాద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.ర.స.య.గణములు.వృ.సం.123.
ప్రాసనియమము కలదు.
బీజ శక్తిని మించి తంచున్!
ఆజి నోడక సాగి పొమ్మా!
తూ జపంబిది కాదు!లెమ్మా!
వాజినం బది నీఱు నౌ లే!

వెఱ్ఱి దాన!హరాయుధానన్!
అఱ్ఱమౌ!జవ సత్వ మెల్లన్!
తుఱ్ఱు మంచు న్జేరు చంద్రున్!
పఱ్ఱు మన్నటు లౌదు వెంచన్!

2.గర్భగత"-సింహరేఖా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గగ.గణములు.వృ.సం.43.
ప్రాసనియమము కలదు.
విఱ్ఱ వీగెదే!"-కరోనా"-
అఱ్ఱు చాచకే!పిశాచీ!
తొఱ్ఱ పుల్గు!చూపు లాపే!
పఱ్ఱి యౌలె!పారి పొమ్మా!

3.గర్భగత"-రసరాజి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.య.ర.జ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
బీజ శక్తిని మించి తంచున్!విఱ్ఱ వీగెదే!"-కరోనా"-
ఆజి నోడక సాగి పొమ్మా!అఱ్ఱు చాచకే!పిశాచీ!
తూ జపంబిది కాదు!లెమ్మా!తొఱ్ఱ పుల్గు!చూపు లాపే!
వాజినం బది!నీఱు నౌ లే!పఱ్ఱి యౌలే!పారి పొమ్మా!

4.గర్భగత"-హరాయుధ ద్వయ "-వృత్తములు.
అత్యష్టీఛందము.ర.జ.మ.జ.జ.గ.గణములు.యతి9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
విఱ్ఱ వీగెదే!"-కరోనా"-!వెఱ్ఱిదాన!హరాయుధానన్!
అఱ్ఱు చాచకే!పిశాచీ!అఱ్ఱమౌ!జవ సత్వ మెల్లన్?
తొఱ్ఱ పుల్గు!చూపు లాపే!తుఱ్ఱు మంచు న్జేరు!చంద్రున్!
పఱ్ఱియౌలే?పారి పొమ్మా!పఱ్ఱు మన్నటు లౌదు!వెంచన్!

విఱ్ఱ వీగెదే!"-తకరోనా"-బీజ శక్తిని మించి తంచున్!
అఱ్ఱు చాచకే!పిశాచీ!ఆజి నోడక సాగి పొమ్మా!
తొఱ్ఱ పుల్గు!చూపు లాపే!తూ జపంబిది కాదు!లెమ్మా!
పఱ్ఱి యౌలే!పారి పొమ్మా!వాజినం బది నీఱు నౌలే!

5.గర్భగత"-శక్తి బీజ ద్వయ"-వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.జ.మ.జ.జ.మ.జ.జ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
విఱ్ఱ వీగెదే!"-కరోనా"-వెఱ్ఱిదాన హరాయుధానన్!బీజ శక్తిని మించితంచున్!
అఱ్ఱు చాచకే!పిశాచీ!అఱ్ఱమౌ!జవ సత్వ మెల్లన్!ఆజి నోడక సాగి పొమ్మా!
తొఱ్ఱ పుల్గు చూపులాపే!తుఱ్ఱు మంచు న్జేరు చంద్రున్!తూ జపంబిది కాదు లెమ్మా.                                                                                                                                            
విఱ్ఱ వీగెదే"-కరోనా!బీజ శక్తిని మించి తంచున్!వెఱ్ఱిదాన హరాయుధానన్!
అఱ్ఱు చాచకే!"-పిశాచీ!ఆజి నోడక సాగి పొమ్మా!అఱ్ఱమౌ!జవ సత్వ మెల్లన్!
తొఱ్ఱ పుల్గు చూపులాపే!తూ జపంబిది కాదు లెమ్మా!తుఱ్ఱు మంచు న్జేరు చంద్రున్!
పఱ్ఱి యౌలే!పారి పొమ్మా!వాజినంబది నీఱు నౌ లే!పఱ్ఱు మన్నటు లౌదు వెంచన్!                                                                                    
6.గర్భగత"-రసయద్వయ"-వృత్తము.
ధృతిఛందము.ర.స.య.ర.స.య.గణములు.యతి10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వెఱ్ఱిదాన హరాయుధానన్!బీజ శక్తిని మించి తంచున్!
అఱ్ఱమౌ!జవ సత్వ మెల్లన్!ఆజి నోడక సాగి పొమ్మా!
తుఱ్ఱు మంచు న్జేరు చంద్రున్!తూ జపంబిది కాదు లెమ్మా!
పఱ్ఱు మన్నటు లౌదు వెంచన్!వాజినంబది నీఱు నౌ లే!
7.గర్భగత"-పఱ్ఱియౌ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.ర.స.య.ర.త.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వెఱ్ఱిదాన హరాయుధానన్!బీజ శక్తిని మించి తంచున్!విఱ్ఱ వీగెదే!"-కరోనా"-
అఱ్ఱమౌ!జవ సత్వ మెల్లన్!ఆజి నోడక సాగి పొమ్మా!అఱ్ఱు చాచకే"-పిశాచీ"-
తుఱ్ఱు మంచు న్జేరు చంద్రున్!తూ జపంబిది కాదు లెమ్మా!తొఱ్ఱ పుల్గు చూపు లాపే!                                             పఱ్ఱు మన్నటు లౌదు వెంచన్!వాజినం బది నీఱు నౌలే!పఱ్ఱి యౌలే!పారి పొమ్మా!                                                                                
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

22, ఏప్రిల్ 2020, బుధవారం

భారణా,వరీయ,దోషచరా,నిభసరి,అనూత్తమ,ఉన్నతావరోధ,పద్దుగ,వికారతా,మందతా,బన్నముసేయు,గర్భ"-ఛిన్నా భిన్న"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
భారణా,వరీయ,దోషచరా,నిభసరి,అనూత్తమ,ఉన్నతావరోధ,పద్దుగ,వికారతా,మందతా,బన్నముసేయు,గర్భ"-ఛిన్నా భిన్న"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
     
                         
"-ఛిన్నా భిన్న"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.న.భ.ర.ర.మ.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉన్నది మాసిపోయె గద!ఉన్నతి గూల్చె "-కరోన"-ఉద్ధరణంబేమౌ?భూతలిన్!
ఛిన్నము కాబడె న్జగతి!చెన్నెడ మేర్చు"- చమారి"-!సిద్ధికి క్షుద్రం బేర్చె న్భవిన్!
భిన్న మనోవికారముల!వెన్నున తన్నె"- పిశాచి"-!పెద్దగు దుర్మార్గంబు న్హరా!
పన్నె విషాధ ఘోషణలు!బన్నము సేయ"-మహేశ!పద్దుగ మాప న్రావా!వడిన్!

అర్ధములు:-
ఉన్నతి=గొప్పతనము(అభివృద్ధి).ఛిన్నము=విచ్చిత్తు,చెన్నడమేర్చు=మనోహరతను. దూరముచేయు,(ఆనందము మాపు),వెన్నునదన్నె=నడ్డిపై తన్నె,నడ్డి విరిచె,పెద్దగు=గొప్పది యగు,పన్నె=విస్తరించె, బన్నముసేయ=ఆటంక పరచ,
పద్దుగ=పద్ధతి ననుసరించి,భవిన్=భవిష్యత్తును,

1.గర్భగత"-భారణా"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.న.గణములు.వృ.సం.471.
ప్రాసనియమము కలదు.
ఉన్నది మాసిపోయె గద!
ఛిన్నము కాబడె న్జగతి!
భిన్న మనోవికారముల!
పన్నె విషాధ ఘోషణలు!

2.గర్భగత"-వరియ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.భ.గల.గణములు.వృ.సం.183.
ప్రాసనియమము కలదు.
ఉన్నతి గూల్చె!"-కరోన"-
చెన్నెడ మేర్చు"-చమారి"-
వెన్నున దన్నె "-పిశాచి"-
బన్నము సేయ "-మహేశ"-

3.గర్భగత"-దోష చరా"-వృత్తము.
బృహతీఛందము.భ.మ.ర.గణములు.వృ.సం.135.
ప్రాసనియమము కలదు.
ఉద్ధరణంబేమౌ?భూతలిన్!
సిద్ధికి క్షుద్రం బేర్చె న్భవిన్!
పెద్దగు దుర్మార్గంబు న్హరా!
పద్దు మాపన్రావా!వడిన్!

4.గర్భగత"-నిభ సరి"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.న.భ.భ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉన్నది మాసిపోయె గద!ఉన్నతి గూల్చె"-కరోన"-
ఛిన్నము కాబడె న్జగతి!చెన్నెడమేర్చు"-చమారి"-
భిన్న మనోవికారముల!వెన్నున దన్నె"-పిశాచి"-
పన్నె విషాధ ఘోషణలు!బన్నము సేయ"-మహేశ"-

5.గర్భగత"-అనుత్తమ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.స.మ.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉన్నతి గూల్చె"-కరోన"-ఉద్ధరణం బేమౌ?భూతలిన్!
చెన్నెడ మేర్చు"-చమారి"-సిద్ధికి క్షుద్రం బేర్చె న్భవిన్!
వెన్నున దన్నె"-పిశాచి"-పెద్దగు దుర్మార్గంబు న్హరా!
బన్నము సేయ"మహేశ" పద్దుగ మాపన్రావా!వడిన్!

6.గర్భగత"-ఉన్న తావరోధ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.స.మ.య.స.జ.లల.గణములు.యతులు.
9,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉన్నతి గూల్చె "-కరోన"-ఉద్ధరణం బేమౌ?భూతలిన్!ఉన్నది మాసిపోయె గద!
చెన్నెడ మేర్చు"-చమారి"-సిద్ధికి క్షుద్రం బేర్చె న్భవిన్!ఛిన్నము కాబడె న్జగతి!
వెన్నున దన్నె"-పిశాచి"-పెద్దగు దుర్మార్గంబు న్హరా!భిన్న మనోవికారముల!
బన్నము సేయ"-మహేశ"-పద్దుగ మాపన్రావా!వడిన్!పన్నె విషాధ ఘోషణలు!

7.గర్భగత"-పద్దుగ"-వృత్తము.
ధృతిఛందము.భ.మ.ర.భ.ర.న.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉద్ధరణం బేమౌ?భూతలిన్!ఉన్నది మాసిపోయె!గద!
సిద్ధికి క్షుద్రం బేర్చె న్భవిన్!ఛిన్నము కాబడె న్జగతి!
పెద్దగు దుర్మార్గంబు న్హరా!భిన్న మనో వికారముల!
పద్దుగ మాప న్రావా!వడిన్!పన్నె విషాధ ఘోషణలు!

8.గర్భగత"-వికారతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.మ.ర.భ.ర.న.భ.భ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉద్ధరణం బేమౌ?భూతలిన్!ఉన్నది మాసిపోయె గద!ఉన్నతి గూల్చె"-కరోన"-
సిద్ధికి క్షుద్రం బేర్చె న్భవిన్!ఛిన్నము కాబడె న్జగతి!చెన్నెడ మేర్చు"-చమారి"-
పెద్దగు దర్మార్గంబు న్హరా!భిన్న మనో వికారముల!వెన్నున దన్నె"-పిశాచి"-
పద్దుగ మాప న్రావా!వడిన్!పన్నె విషాధ ఘోషణలు!బన్నము సేయ"-మహేశ"
-
9.గర్భగత"-మందతా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.స.జ.లల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉన్నతి గూల్చె"-కరోన"-ఉన్నది మాసిపోయె గద!
చెన్నెడ మేర్చు"-చమారి"-ఛిన్నము కాబడె న్జగతి!
వెన్నున దన్నె"-పిశాచి"-భిన్న మనో వికారముల!
బన్నము సేయ"-మహేశ"-పన్నె విషాధ ఘోషణలు!

10,గర్భగత"-బన్నము సేయు"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.స.జ.స.స.మ.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉన్నతి గూల్చె"-కరోన"-ఉన్నది మాసిపోయె గద!ఉద్ధరణంబేమౌ?భూతలిన్!
చెన్నెడ మమేర్చు"-చమారి"-ఛిన్నము కాబడె న్జగతి!సిద్ధికి క్షుద్రంబేర్చెన్భవిన్!
వెన్నున దన్నె"-పిశాచి"-భిన్న మనో వికారముల!పెద్దగు దుర్మార్గంబు న్హరా!
బన్నము సేయ"-మహేశ"-పన్నె విషాధ ఘోషణలు!పద్దుగ మాపన్రావా వడిన్.
 స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.

21, ఏప్రిల్ 2020, మంగళవారం

మహత్వ,వరీయ,ఉత్సుక,శూన్యతా,ముల్లియ,పొల్లొనరు,అబ్బుర పడు,శ్వాసిని,భీతావహ,నిబ్బర,గర్భ"-విత్తహర"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
మహత్వ,వరీయ,ఉత్సుక,శూన్యతా,ముల్లియ,పొల్లొనరు,అబ్బుర పడు,శ్వాసిని,భీతావహ,నిబ్బర,గర్భ"-విత్తహర"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.     
                            
"-విత్తహర"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.జ.ర.భ.భ.ర.స.స.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు. వృ.సం.
సత్తత్తులు నిల్ప నిబ్భువిన్!జాతి మతాలన మాని!జల్లెడ పట్టె కరోన తా
విత్తంబు హరించె సర్వతన్!భీతిల జేసెను చూడ!విల్లును వీడు శరంబునై!
పుత్తెంచె కరాళ చైద మై!భూతల శ్వాసల నంటె!పొల్లొనరించె మహోగ్రతన్!
మొత్తం బిల శూన్య మేర్చునో?మూతుల జేరి పిశాచి!ముల్లియ లేర్చె! వికారతన్!                                              
1.గర్భగత"-మహత్వ"-వృత్తము.
బృహతీఛందము.త.జ.ర.గణములు.వృ.సం.173.
ప్రాసనియమము కలదు.
సత్తత్తుల నిల్ప నిబ్భువిన్!
విత్తంబు హరించె సర్వతన్!
పుత్తెంచె కరాళ చైదమై!
మొత్తంబిల శూన్య మేర్చునో?
2.గర్భగత"-వరీయ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.భ.గల.గణములు.వృ.సం.183.
ప్రాసనియమము కలదు.
జాతి మతాలన మాని!
భీతిల జేసెను చూడ!
భూతల శ్వాసల నంటె!
మూతుల జేరి పిశాచి!
3.గర్భగత"-ఉత్సుక"-వృత్తము.
బృహతీఛందము.భ.భ.ర.గణములు.వృ.సం.183.
ప్రాసనియమము కలదు.
జల్లెడ పట్టె కరోన తా!
విల్లును వీడు శరంబునై!
పొల్లొనరించె మహోగ్రతన్!
ముల్లియ లేర్చె వికారతన్!
4.గర్భగత"-శూన్యతా"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.ర.భ.భ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సత్త త్తుల నిల్ప నిబ్భువిన్!జాతి మతాలన మాని!
విత్తంబు హరించె సర్వతన్!భీతిల జేసెను చూడ!
పుత్తెంచె కరాళ చైదమై!భూతల శ్వాసల నంటె!
మొత్తంబిల శూన్య మేర్చునో?మూతుల జేరి పిశాచి!
5.గర్భగత"-ముల్లియ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.స.స.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జాతి మతాలన మాని !జల్లెడ పట్టె కరోన తా!
భీతిల జేసెను చూడ!విల్లును వీడు శరంబునై!
భూతల శ్వాసల నంటె!పొల్లొనరించె మహోగ్రతన్!
మూతులు జేరి పిశాచి!ముల్లియ లేర్చె వికారతన్!
6.గర్భగత"-పొల్లొనరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.స.స.య.భ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జాతి మతాలన మాని!జల్లెడ పట్టె కరోన తా!సత్తత్తుల నిల్ప నిబ్భువిన్!
భీతిల జేసెను చూడ!విల్లును వీడు శరంబునై!విత్తంబు హరించె సర్వతన్!
భూతల శ్వాసల నంటె!పొల్లొనరించె మహోగ్రతన్!పుత్తెంచె కరాళ చైదమై!
మూతులు జేరి పిశాచి!ముల్లియ లేర్చె వికారతన్!మొత్తంబిల శూన్య  మేర్చునో!                                              
7.గర్భగత"-అబ్బురపడు"-వృత్తము.
ధృతిఛందము.భ.భ.ర.త.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జల్లెడ పట్టె కరోన తా!సత్తత్తుల నిల్ప నిబ్భువిన్!
విల్లును వీడు శరంబునై!విత్తంబు హరించె సర్వతన్!
పొల్లొనరించె మహోగ్రతన్!పుత్తెంచె కరాళ చైదమై!
ముల్లియ లేర్చె వికారతన్!మొత్తం బిల శూన్య మేర్చునో?
8.గర్భగత"-శ్వాసినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.త.జ.ర.భ.భ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జల్లెడ పట్టె కరొన తా!సత్తత్తుల నిల్ప నిబ్భువిన్!జాతి మతాలన మాని!
విల్లును వీడు శరంబునై!విత్తంబు హరించె సర్వతన్!భీతిల జేసెను చూడ!
పొల్లొనరించె మహోగ్రతన్!పుత్తెంచె కరాళ చైదమై!భూతల శ్వాసల నంటె!
ముల్లియ లేర్చె వికారతన్!మొత్తంబిల శూన్య మేర్చునో?మూతులు జేరి పిశాచి!                                                
9.గర్భగత"-భీతావహ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.భ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జాతి మతాలను మాని!సత్తత్తుల నిల్ప నిబ్భువిన్!
భీతిల జేసెను చూడ!విత్తంబు హరించె సర్వతన్!
భూతల శ్వాసల నంటె!పుత్తెంచె కరాళ చైదమై!
మూతులు జేరి పిశాచి!మొత్తంబిల శూన్య మేర్చునో?
10,గర్భగత"-నిబ్బర"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.భ.ర.య.స.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జాతి మతాలను మాని!సత్తత్తుల నిల్ప నిబ్భువిన్!జల్లెడ పట్టె కరోన తా!
భీతిల జేసెను చూడ!విత్తంబు హరించె సర్వతన్!విల్లును వీడు శరంబునై!
భూతల శ్వాసల నంటె!పుత్తెంచె కరాళ చైదమై!పొల్లొనరించె!మహోగ్రతన్!
మూతులు జేరి పిశాచి!మొత్తంబిల శూన్య మేర్చునో?ముల్లియ లేర్చె వికారతన్!                                                
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

20, ఏప్రిల్ 2020, సోమవారం

అరసున్న [ ఁ ], బండి ' ఱ 'లు ఎక్కడెక్కడ?

0 comments

జైశ్రీరామ్.
*అరసున్న [ ఁ  ], బండి ' ఱ 'లు ఎందుకు??*

అరసున్న, బండి ' ఱ 'లు నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు.ఐతే ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి. ద్రావిడభాషాలక్షణాన్ని నిరూపించేవి. అంతేకాదు- కావ్యభాషలోను, లక్షణశాస్త్రంలోను వీటి ప్రాముఖ్యం చాలావుంది. వాడకపోతే పరవాలేదు గానీ వీటిగురించి తెలుగువాడు తెలుసుకోవాలిగదా! మన భాషాసంపదలో ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా! అరసున్న( ఁ   ) , ఱ- ల వల్ల అర్థభేదం ఏర్పడుతొంది. పదసంపదకి ఇవి తోడ్పడతాయి. ఎలాగో చూడండి:

అరుఁగు = వీది అరుగు 

అరుగు = వెళ్ళు, పోవు

అఱుగు = జీర్ణించు

ఏఁడు = సంవత్సరం

ఏడు = 7 సంఖ్య

కరి = ఏనుగు

కఱి = నల్లని

కాఁపు = కులము

కాపు = కావలి

కాఁచు = వెచ్చచేయు

కాచు = రక్షించు

కారు = ఋతువుకాలము

కాఱు = కారుట (స్రవించు)

చీఁకు = చప్పరించు

చీకు = నిస్సారము, గ్రుడ్డి

తఱుఁగు = తగ్గుట, క్షయం

తఱుగు = తరగటం(ఖండించటం)

తరి = తరుచు

తఱి = తఱచు

తీరు = పద్ధతి

తీఱు = నశించు, పూర్తి(తీరింది)

దాఁక = వరకు

దాక = కుండ, పాత్ర

నాఁడు = కాలము

నాడు = దేశము, ప్రాంతము

నెరి = వక్రత

నెఱి = అందమైన

నీరు = పానీయం

నీఱు = బూడిద

పేఁట = నగరములో భాగము

పేట = హారంలో వరుస

పోఁగు - దారము పో( గు

పోగు = కుప్ప

బోటి = స్త్రీ

బోఁటి = వంటి [నీబోఁటి]

వాఁడి = వాఁడిగాగల

వాడి = ఉపయోగించి

వేరు = చెట్టు వేరు

వేఋ = మరొకవిధము

మడుఁగు = వంగు, అడఁగు

మడుగు =  కొలను, హ్రదము

మొదలైనవీ ఉన్నాయి.

[డాక్టర్ ద్వా. నా. శాస్త్రి గారి "సాహిత్య కబుర్లు" , "తెలుగు వెలుగు" ల నుండి.]
జైహింద్.

19, ఏప్రిల్ 2020, ఆదివారం

ఆన్లైన్ వాట్సప్ అష్టావధానము.....శంకరయ్యావధానితో పాటు నేను చేసిన....నాపూరణలు

0 comments

జైశ్రీరామ్.
నిన్నను శంకరయ్యగారి అవధానం సమయంలో నేనూ ప్రయత్నించి వ్రాసినవి.
నరేంద్రమోడీ వర్ణన.నిషిద్ధాక్షరి.

న్యాయంబై భాసిల్లన్
జ్ఞేయమ్మై జాతికంద జేయగ మోదీ
శ్రేయంబౌ సంస్కరణలు
చేయించుచు సాగుచుండె జేజే మోడీ!

సమస్యాపూరణ.
పాములు చూసి భీతిలి యపాంపతి కన్నులు మూసెనక్కటా


నా పూరణ.
శ్రీమహిమంబునెంచి గళ సీమను తాకెనతాకెను హైమ. కంఠమున్
హేమవిభూషణావళులనెన్నుచు, తాకుచు రత్నహారముల్
లేమ కనంగబోవ నట లేవవి, బుస్సని లేచుచున్న యా
పాములు చూసి భీతిలి, యపాంపతి! కన్నులు మూసెనక్కటా.

*వర్ణనాంశం:*
దక్షయజ్ఞంలో సతీదేవి దేహత్యాగం చేసిన విషయం తెలుసుకుని కోపోద్రిక్తుడైన *శివుని* గుఱించిన వర్ణన *శార్దూలంలో*

దక్షయజ్ఞంలో శివుని కోపం
నాపూరణ.

దక్షుండవ్విధినాసభన్ శివ సతిన్ దర్పంబుతో తూలగా
చక్షుల్విచ్చి జనాళి చూడ సతియే చయ్యన్ హతంబాయె తా
శిక్షించన్ హరుడుగ్రుడైయట సభన్ ఛిద్రంబు గావించ తత్
పక్షంబందున భద్రునిన్నిలిపెగా భస్మంబు చేయన్ సభన్.

దత్తపదులు
*సైకిలు*
*బైకు*
*ఆటొ*
*లారి*
పై నాలుగు పదాలను ఉపయోగిస్తూ
*పద్య ప్రాశస్త్యాన్ని*
తెల్పుతూ
 స్వేచ్ఛ ఛందములో వర్ణించండి

పద్య ప్రాశస్త్యము.
నా పూరణ.

సైకిలునుత్రొక్కు తీరున సహజ కవిత
(మధ్యలో అప్రస్తుతానికి సమాధానం...కష్టాలు తెలుస్తాయని)
బైకు పై పోవువేగాన వరలు కవిత
వరల ఆటోను నడిపెడి భవ్య కవిత
కవిత లారీలకొద్దియు కవులు వ్రాయు.

అంశం: ఆశువు
పృచ్ఛకుడు:మొగలిమాల

1)భారతమ్మ ఇంట్లో  బూజుతో సమానం చైనావైరస్ కరోనను సమర్థించండి.

నా పూరణ.
భారత దేశ సంస్కృతికి పశ్చిమదేశ జనాళి పొంగుచున్
స్మేరముఖాబ్జముల్ గలిగి చక్కగ సంస్కృతి నేర్చుచుండిరే.
యీ రకమౌ కరోన మనకివ్విధి చూచినబూజు పోలికన్
దూరముగా విడన్ గదగు శోభిలు దేశము భారతాంబయే.

అంత్యాక్షరి.
చివరి అక్షరం నా
నేటి కవులగురించి చెప్పండి

నయమును తప్పకుమెప్పుడు.
ప్రియమున ఖనుమయ్య ప్రజను విజజ్ఞతతోడన్.
భయమును వీడుచు మేలుగ
నియమముతో మెలగుమయ్య నేర్పును గనుమా.

చిత్రానికి పద్యం. 1.
నా పూరణ.
శ్రీహరీ గను బంగారు జింక నచట
దానినే తెమ్ము నామది తనియునటుల
సీతమాటలనాలించి శ్రీధరుండు
జింకకై వీడ సీతను. చేటు కలిగె

చిత్రానికి పద్యం. 2.
నా పూరణ.
సహజ సౌందర్య రాశితో చందమామ
గగనమందున వెలుగుచు గనగ భువికి
దిగినయట్లుండెకద చూడ? సొగసుగాను.
ప్రకృతి సౌందర్యమును చూచి పరవశించు.

న్యస్తాక్షరి.
శ్రీరామ రక్ష అంశము.
రామదాసు..లు ఆద్యక్షరాలుగా.

నా పూరణ.
రాక్షసాంతక రామయా రమ్ము కావ,
మమ్ము మన్నించి కాచి క్షేమమ్మునిమ్ము.
దాసులము నీకు కాపాడి దారి చూపు.
సుజన రక్షక శ్రీరామ శుభద! రమ్ము.
స్వస్తి.
జైహింద్.

18, ఏప్రిల్ 2020, శనివారం

కొప్పరపు కవులు.... శ్రీ గరికిపాటి ఉపన్యాసము.

0 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

17, ఏప్రిల్ 2020, శుక్రవారం

షట్కర్మ కర్తా, కలికాల భర్తా. ... దా.గరికిపాటి నరసింహారావు.

0 comments

జైశ్రీరామ్
    శ్రీ గరికపాటి నరసింహారావు గారికి ఒక అవధానంలో ఆశువు అంశం క్రింద ఒక పృచ్ఛకుడు ఇలా అడిగాడు - "అవధానిగారూ! కార్యేషు దాసీ కరణేషు మంత్రీ... అంటు ఆడది ఎలా ఉండాలో ఒక సంస్కృత శ్లోకంలో చెప్పారు గదా. దానికి పారడీగా, ఈ రోజుల్లో, భర్త ఎలా ఉండాలని ఆడవారు కోరుకుంటారో ఆశువుగా చెప్పండి". అప్పుడు అవధానిగారు చెప్పిన ఈ అనేకభాషల శ్లోకం చూడండి:

శ్లో. కార్యేషు మిక్సీ, శయనేషు సెక్సీ  -  భరణేచ కూలీ, తరుణీషు శూలీ
రూపేచ హీరో, కోపేచ జీరో  -  షట్కర్మ కర్తా, కలికాల భర్తా.

భావము.
కలికాలంలో భర్తలు ఈ ఆరుపనులు చేయాలి.
పనులు త్వరత్వరగా చేయాలి మిక్సీ లాగా; పడకగదిలో సెక్సీగా ఉండాలి;
సామాన్లు భరిస్తున్నప్పుడు కూలీలాగా ఉండాలి;
ఆడవారి విషయాల్లో భార్యకు సగభాగమిచ్చిన శివుడు లాగా ఉండాలి;
చూడటానికి సినిమా హీరోలాగా ఉండాలి;
కాని జీరో కోపం ఉండాలి.
జైహింద్.

16, ఏప్రిల్ 2020, గురువారం

యత్ర యత్ర హరేరర్చా....మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో. యత్ర యత్ర హరేరర్చా
స దేశః శ్రేయసాం పదమ్,
స వై పుణ్యతమో దేశః
సత్పాత్రం యత్ర లభ్యతే.

తే.గీ. శ్రేయమిడు విష్ణు పూజలు చేయు చోటు.
దివ్య పాత్రులుండెడి చోటె తీర్థమరయ.
విష్ణుపూజలు జరుగుచు విశ్వమెల్ల
పాత్రులను వెల్గుగావుత భవ్యముగను.

భావము.
ఎక్కడెక్కడైతే విష్ణు పూజ జరుగుతుందో ఆ దేశం (ప్రాంతం) శ్రేయస్సులకు నిలయం.
ఎక్కడైతే సత్పాత్రదానం ఇవ్వడానికి తగిన ఉత్తమ వ్యక్తి లభిస్తాడో (ఉత్తమ వ్యక్తి నివసిస్తాడో) ఆ ప్రాంతం గొప్ప పుణ్యక్షేత్రము.

జైహింద్.

15, ఏప్రిల్ 2020, బుధవారం

మహిమ కరో నయా మార్గ్ దిఖావో. స్వీయ కవిత

1 comments

జైశ్రీరామ్.
కరోనా మీద 
ఒక పద్యం వ్రాయమని 
ఒక సహృదయులు అడిగేరు.

నేను వ్రాసినది.
చదవగలరు.

మహిమ "కరో న"య మార్గ్ దిఖావో.
సాధు సంతుకో 'కరో న'యోజ్వల్.
భరత జాతికో 'కరో న'యాశ్రయ్. 
దఃఖ భాగ్గు న'కరో,  న' కరో దేవ్.
కరోన బీజ్ కో కరో వినాశ్.
ప్రపంచ్ శాంతి ప్రేమ్ సే కరో దేవ్.

జైహింద్.

వరాంగి,రాయసా,రాజియ,యజమజా,వడిజను,కటుజీవనా,పరాజయ, తృళ్ళక,కావరంబ,హతవిథీ,గర్భ "-అజేయ"-వృత్తము.. రచన... శ్రీ వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.

0 comments

జైశ్రీరామ్
వరాంగి,రాయసా,రాజియ,యజమజా,వడిజను,కటుజీవనా,పరాజయ, తృళ్ళక,కావరంబ,హతవిథీ,గర్భ
"-అజేయ"-వృత్తము..
రచన... శ్రీ వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.
"-అజేయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.జ.మ.జ.త.యజ.భ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గరాణేలనే?కరోనా!కళ్ళ కావరం తప్పు సుమా!కాలి పోదువే!త్వరలోనన్!
పరం బెంచవా!పిశాచీ!పళ్ళు రాలులే!చూడు త్వరన్!పాలిపోవు నీ కటు జీవమ్!                                                  
త్వరం పొమ్ము మొండి మారీ!త్రాళ్ళ నుచ్చునం బాధిలకన్!తాళ జాలవే!నడు వేగన్!                                            
దురంబందు గెల్పు మాదే!తూల కేగుమా!నీచ మతీ!తోలు తీతురే!కడు తెల్విన్!                                                  
1.గర్భగత"-వరాంగి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.య.జ.గగ.గణమలు.వృ.సం.42.
ప్రాసనియమము కలదు.
గరాణేలనే?కరోనా!
పరంబెంచవా!పిశాచీ!
త్వరం పొమ్ము!మొండి మారీ!
దురంబందు గెల్పు మాదే!
2.గర్భగత"-రాయసా"-వృత్తము.
బృహతీఛందము.ర.య.స.గణములు.వృ.సం.203.
ప్రాసనియమము కలదు.
కళ్ళ కావరం తప్పు సుమా!
పళ్ళు రాలులే!చూడు త్వరన్!
త్రాళ్ళ నుచ్చునం బాధిలకన్!
తూల కేగుమా!నీచ మతీ!
3.గర్భగత"-రాజియ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.య.గణములు.వృ.సం.107.
ప్రాసనియమము కలదు.
కాలిపోదువే!త్వరలోనన్!
పాలిపోవు నీ కటు జీవమ్!
తాళ జాలవే!నడు వేగన్!
తోలు తీతురే!కడు తెల్విన్!
4.గర్భగత"-యజమజా"-వృత్తము.
అత్యష్టీఛందము.య.జ.మ.జ.త.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గరాణేలనే?కరోనా!కళ్ళ కావరం తప్పు సుమా!
పరంబెంచవా!పిశాచీ!పళ్ళు రాలులే!చూడు త్వరన్!
త్వరం పొమ్ము!మొండి మారీ!త్రాళ్ళ నుచ్చునం బాధిలకన్!
దురంబందు గెల్పు మాదే!తూల కేగుమా!నీచ మతీ!
5.గర్భగత"-వడిజను"-వృత్తము.
ధృతిఛందము.ర.య.స.ర.జ.య.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కళ్ళ కావరం!తప్పు సుమా!కాలి పోదువే!త్వరలోనన్!
పళ్ళు రాలులే!చూడు త్వరన్!పాలిపోవు నీ కటు జీవమ్!
త్రాళ్ళ నుచ్చునం!బాధిలకన్!తాళ జాలవే!నడు వేగన్!
తూల కేగుమా!నీచ మతీ!తోలు తీతురే!కడు తెల్విన్!
6.గర్భగత"-కటు జీవనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.య.స.ర.జ.య.య.జ.గగ.గణములు.యతులు.10,19.ప్రాసనియమము కలదు.వృ.సం.
.కళ్ళ కావరం తప్పు సుమా!కాలిపోదువే!త్వర లోనన్!గరాణేలనే?కరోనా!
పళ్ళు రాలులే!చూడు త్వరన్!పాలిపోవు నీ కటు జీవమ్!పరంబెంచవా! పిశాచీ!                                                  
త్రాళ్ళ నుచ్చునం!బాధిలకన్!తాళ జాలవే!నడు వేగన్!త్వరం పొమ్ము ! మొండి మారీ!                                        
తూల కేగుమా!నీచమతీ!తోలు తీతురే!కడు తెల్విన్!దురంబందు గెల్పు మాదే!                                                  
7.గర్భగత"-పరాజయ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.య.య.జ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాలిపోదువే!త్వరలోనన్!గరాణేలనే?కరోనా!
పాలిపోవు నీ కటు జీవమ్!పరంబెంచవా!పిశాచీ!
తాళ జాలవే!నడు వేగన్!త్వరం పొమ్ము మొండి మారీ!
తోలు తీతురే!కడు తెల్విన్!దురంబందు గెల్పు మాదే!
8.గర్భగత"-తృళ్ళక"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.య.య.జ.మ.జ.త.లగ.గణములు.యతులు.10,18. ప్రాసనియమము కలదు.వృ.సం.
కాలి పోదువే!త్వరలోనవ్!గరాణేలనే?కరోనా!కళ్ళ కావరం తప్పు సుమా!
పాలిపోవు నీ కటు జీవమ్!పరం బెంచవా!పిశాచీ!పళ్ళు రాలులే!చూడు త్వరన్!                                                  
తాళజాలవే!నడు వేగన్!త్వరం పొమ్ము మొండి మారీ!త్రాళ్ళు నుచ్చునం బాధిలకన్!                                          
తోలు తీతురే!కడు తెల్విన్!దురంబందు గెల్పు మాదే!తూల కేగుమా! నీచ మతీ!                                                
9.గర్భగత"-కావరంబ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.య.స.య.జ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కళ్ళ కావరం తప్పు సుమా!గరాణేలనే?కరోనా!
పళ్ళు రాలులే!చూడు త్వరన్!పరం బెంచవా?పిశాచీ!
త్రాళ్ళు నుచ్చునం బాధిలకన్!త్వరం పొమ్ము మొండి మారీ!
తూల కేగుమా!నీచ మతీ!దురంబందు గెల్పు మాదే!
10,గర్భగత"-హతవిథీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.య.స.య.జ.మ.జ.భ.గగ.గణములు.యతులు.
10,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
కళ్ళ కావరం తప్పు సుమా!గరాణేలనే?కరోనా!కాలి పోదువే!త్వరలోనన్!
పళ్ళు రాలులే?చూడు త్వరన్!పరం బెంచవా!పిశాచీ!పాలిపోవు నీ కటు జీవమ్!
త్రాళ్ళు నుచ్చునం బాధిలకన్!త్వరం పొమ్ము మొండి మారీ!తాళ జాలవే!నడు వేగన్!
తూల కేగుమా!నీచ మతీ!దురంబందు గెల్పు మాదే!తోలు తీతురే!కడు తెల్విన్!                                                                                  
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

14, ఏప్రిల్ 2020, మంగళవారం

౧౨ - ౪ - ౨౦౨౦ వ తేదీన శ్రీ కందిశంకరయ్య చేసిన ఆన్లైన్ అష్టవధానం. .

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులకు నమస్సులు.
శ్రీ కందిశంకరయ్య అవధాని చేసిన ఆన్లైన్ అష్టవధానం. .
వారిని పృచ్ఛకులడిగిన వాటికి వెంట వెంటనే నేనూ వ్రాసిన సమాధినాలు కూడా ఇక్కడ ఉంచియుంటిని. .
అవధానమునకు సంచాలకత్వం వహించిన శ్తీ ఆముదాల మురళి గారు శ్రీకారముతో ప్రారంభము చేసిరి.
శ్రీ రమణీయ భావ రస శేవధి యైన కవిత్వ తత్వమున్
చారు సుధామయోక్తుల ప్రసన్న గభీర విశిష్ట శైలితో
ధీరులు మెచ్చు పద్యముల తేకువ చెప్పెడి తేజమిచ్చి శ్రీ
శారద! రమ్ము! మమ్ము సరసమ్ముగఁబ్రోవ వధాన మందునన్.

వేలకు వేలు సమస్యల
లీలగ సంధించు సుంత క్లేశమనక ని
ర్వేలముగ, కంది శంకర
ధీలలితుం డిట వధాని దీప్తులు నింపున్. 

సప్తతి దాటిన వయసున 
ప్రాప్తించెడి మరపునకు పరాజయ మిడుచున్
సుప్త వధానము మేల్కొనె
శప్తులు గా పద్యవిద్య శత్రువు లణగన్.

శ్రీ కంది శంకరార్యులు 
మా కెల్లను మార్గదర్శి ,మాన్యుడు ,విద్యా
శ్రీకంఠుండవధానము 
ప్రాకామ్యము తోడఁజేయు భారతి కృపచే.

నమస్కారం
శంకరాభరణం సమూహ మిత్రులకు, రసజ్ఞులకు స్వాగతం. ఈరోజు మనం ఈ సముదాయంలో మూడవ  అష్టావధానాన్ని నిర్వహించుకొంటున్నాము. అవధానం చేస్తున్నవారు శ్రీమాన్ కంది శంకరయ్య గారు.వారిని గూర్చి చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు .అయితే చెప్పాల్సిన విషయం మాత్రం ఉన్నది. ఇప్పుడు వారి వయస్సు సుమారు 70 ఏళ్ళు. అవధానాలు చేసేవాళ్ళు మానేసే వయసు అది. ప్రముఖ అవధాని శ్రీ గాడేపల్లి వీర రాఘవ శాస్త్రిగారి పుత్రులు శ్రీ గాడేపల్లి శివరామయ్య గారు మిత్రుల ప్రోత్సాహంతో 60 ఏళ్లు నిండిన తరువాత అవధానాలు ప్రారంభించి విజయవంతంగా నిర్వహించారు. అలాంటి సంఘటనే ఇది కూడా.
శ్రీమాన్ శంకరయ్య గారు చేయి తిరిగిన పద్యరచయిత కావడం వల్ల అవధానాన్ని నల్లేరుపై బండి నడకలా పూర్తి చేయగలరు. అది అలా ఉంచితే ఈ అవధానంలో పృచ్ఛకులు అందరూ అవధానులు కావడం చాలా గొప్ప విషయం . అందరూ అవధానులు కనుక అవధాన అరంగేట్రం చేస్తున్న పెద్దలు శ్రీ కంది శంకరయ్య గారికి సహకరించి శారదా మాత కృపకు పాత్రులు కాగలరు అని వేడుకుంటున్నాను.
ఇలాంటి చారిత్రాత్మకమైన అవధానానికి సంచాలకుడిగా ఉండే అవకాశం రావడం నా పురాకృత పుణ్య విశేషం గా భావిస్తున్నాను. సమస్యా పృచ్ఛక చక్రవర్తి అవధాన చక్రవర్తిగా అవతరించే ఈ సమయంలో జరుగుతున్న ఈ అక్షర అభిషేకానికి మరొక్కమారు మీకందరికీ స్వాగతం పలుకుతున్నాను పృచ్ఛకులకు నియమాలు తెలిసినవే గదా !అవధాని గారు పాదం చెప్పిన తర్వాత  ప్రశంసించే పద్ధతికి స్వస్తి పలికితే మంచిది.  చివరన వారివారి స్పందనలను తెలియజేయవచ్చు .అప్రస్తుత ప్రసంగం చేసే పృచ్ఛకులు తప్ప మిగిలిన వారు ఇతర అంశాలు జరుగుతున్నప్పుడు జోక్యం కల్పించుకొనరాదని మనవి. నేను కూడా అవసరం ఉంటే తప్ప మాట్లాడను. పృచ్ఛకులు మంచి ప్రశ్నలు అడగండి, మంచి పద్యాలను రాబట్టండి. ఇక అవధాని గారు వారి ఇష్టదేవతా ప్రార్థన తో అవధానం ప్రారంభిస్తారు .

[12/04, 3:05 pm] ఆముదాల మురళి: అవధానిగారి ఇష్టదేవతా ప్రార్థన
[12/04, 3:06 pm] Kandi 2: దైవ ప్రార్థన....
శ్రీసతి నెప్డు వక్షమునఁ జేర్చి జగమ్ములఁ గాచు శౌరి, గౌ
రీసుదతీమణిన్ దన శరీరమునన్ సగమిచ్చి మెచ్చు కై
లాసగిరిస్థితుండగు కళానిధిమౌళి, సరస్వతిన్ మనో
ల్లాసముగం జతుర్ముఖములందు ధరించిన బ్రహ్మ వేడ్క నా
కీ సమయమ్మునన్ శుభము లీయఁగఁ గోరుచుఁ బ్రస్తుతించెదన్.
[12/04, 3:06 pm] Kandi 2: అమ్మా భారతి! నీ పదాబ్జముల కేనందింతు దండంబుఁ జే
కొమ్మా! తల్లడమందు నా యెడఁదకున్ గోరంత ధైర్యమ్ము నీ
విమ్మా! నేఁ డవధానమందు విజయం బిచ్చోట వాక్శుద్ధితో
నెమ్మిం బొందు నదృష్ట మీయఁ గదవే నిన్నే మదిన్ నమ్మితిన్.
[12/04, 3:07 pm] Kandi 2: గురుస్తుతి....
కమ్ర కళ్యాణరాఘవ కావ్యకర్త
యై యఖండ యశమ్ముఁ గొన్నట్టి చిలుక
మఱ్ఱి రామానుజాచార్యు మద్గురువరు
పాద పంకజమ్ములకు నేఁ బ్రణతులిడుదు.
[12/04, 3:07 pm] Kandi 2: ప్రస్తావన....
స్తవనీయమ్ముగ నెచ్చో
నవధానము జరుగునో నయంబుగ నటకున్
దవిలి పయనించుచుండెద
నవధానముఁ జేయఁ బోదు ననుకొనలేదే!
[12/04, 3:08 pm] Kandi 2: 'శంకరాభరణం' సమూహ సభ్యులు.....
శ్రీ రంజిల్లఁగ శంకరాభరణ సుక్షేత్రమ్మునన్ సత్సుధా
ధారాపాతముగా కవిత్వమును సంధానించుచున్ నిచ్చలు
న్మేరల్ మీరిన స్నేహమాధురుల నందింపంగ ముందుండు వి
స్తారోదార కవీంద్ర సంఘమున కందం జేసెదన్ నా నుతుల్.
[12/04, 3:08 pm] Kandi 2: సంచాలకులు....
రసిక జన హృత్సరోరుహ రవివి నీవె
యగణితాష్టావధాన శతావధాన
కరణ వైదగ్ధ్య సంపన్న కవివరుండ
వాముదాల మురళి! నిన్ను నభినుతింతు.
[12/04, 3:08 pm] Kandi 2: పృచ్ఛకులు....
అక్షరాక్షర నిషేధాచరణోత్సుక
          చింతాన్వయ శశాంక! చేసెద నుతి;
మతినిఁ బోఁగొట్టు సమస్య నిచ్చెడి మైల
          వరపు మురళి నీకు వందనములు;
దత్తపదములతోఁ జిత్తమ్ముఁ గలఁగించు
          ముద్దు రాజయ్య! కేల్మోడ్తు నీకు;
శిక్షింప నన్ను న్యస్తాక్షరి నిచ్చెడి
          లోకా జగన్నాథ! మోకరిలుదు;
భావసంపదఁ గోరి వర్ణనాంశ మిడెడి
           యంజయ్య గౌడ! ని న్నభినుతింతు;
నాశువుల నొసంగి యాగమ్ము సేసెడి
          యైతగోనీ! నీకు జోతలిడుదు;
చిత్రమేదో యిచ్చి చెప్పు పద్య మనెడి
          భానుప్రకాశ! నిన్ బ్రస్తుతింతు;
అప్రస్తుత ప్రసంగార్భాటి గంగుల
          ధర్మరాజా! నీకు దండమిడుదు
అందరికి నంద రవధాను లడుగువార
లనుభవము సుంత లేనట్టి యర్భకుఁడను
యుక్తమౌ ప్రశ్న లడిగిన యుక్తితోడఁ
జెప్పఁగా సమాధానముల్ చేసెదఁ గృషి.
[12/04, 3:09 pm] Kandi 2: ఒప్పులను మెచ్చుకొని నా
తప్పుల మన్నించి దిద్ది దయతోఁ గనఁగన్
గొప్పగఁ గీర్తించెద మీ
మెప్పును నే నందినపుడె మేలని తలఁతున్.
[12/04, 3:09 pm] ఆముదాల మురళి: అవధాన కావ్య ఆరంభం అదిరింది
[12/04, 3:10 pm] ఆముదాల మురళి: ఇక ప్రారంభిద్దామా అవధాని గారు
[12/04, 3:11 pm] ఆముదాల మురళి: అవధాని శ్రీ కంది శంకరయ్యగారు తమ ఇష్ట దేవతా ప్రార్థనను, ప్రస్తావనాంశాలను పూర్తి చేశారు. ఇప్పుడు అవధానం లోని మొట్టమొదటి అంశం నిషిద్ధాక్షరి ప్రారంభం అవుతున్నది .మాన్యులు చిత్రకవితా సామ్రాట్ శ్రీ చింతా రామకృష్ణారావు గారు నిషేధం చేస్తారు ,వారికి స్వాగతం .
చింతా వారు !నిషేధం ప్రారంభించండి.

నిషిద్ధాక్షరి.
చింతా రామకృష్ణారావు.
అవధాన మిచట సుకరము
ప్రవిమల శంకరులకుఁ గన. వాగీశ్వరియే
నవ కవితావేశంబిడు.
భవుడుఁను మెచ్చంగ సాగి వరలఁగఁ జేయున్.

ఆర్యా!
అంశము. రావణునిచే అపహరించఁ బడిన సీత మనోగతము. స్వేచ్ఛా ఛందస్సులో.చెప్పవలసినదిగా మనవి..

నిషిద్ధాక్షరి.. అవధాని.పూరణ.
(ర)ఏ(న)మి(ట)ది(వేసుకోండి) నా(ద) భా(గ)వ(న)మ్మై
(జ)నా మ(న)ది(వేసుకోండి)లో(వేసుకోండి)కు (వ) కుందు(చ)న(న)ట్లు నై(ర)క (వేసుకోండి)కంబై (త)యీ
క్షేమాంతపు దుస్థితి నా
కేమాత్రము కోరనిది యిసీ నా రామా!

సమస్య....పూరణ. శ్రీ మైలవరపు మురళీకృష్ణ.
ఇచ్చిన సమస్య.
*కందెను* *కందిశంకరముఖాబ్జము* *పద్యములల్లువేళలో !!*

సమస్యకు అవధాని పూరణ.
సుందర శబ్ద భావముల చొప్పు నెఱుంగుచు పద్యలేఖనం
బందిన విద్యయే యని నయంబుగ నెంచ వధానమందు పే
రందిన పృచ్ఛకాళియె దయన్ విడనాడుచు ప్రశ్నలివ్వగన్
కందెను కంది శంకర ముఖాబ్జము పద్యము లల్లు వేళలో.

దీనికి నా పూరణ.
సుందరమౌ సమస్యలను శోభిల వారలొసంగు వేళలో
నందముగా లిఖించుతరి నద్భుత పూరణచేయ నేర్తుమే
మందర మేలనందుర? సమంచిత రీతిని వ్రాయఁ బూన మా
కందెను కంది శంకర ముఖాబ్జము పద్యములల్లు వేళలో.

దత్తపది....శ్రీ ముద్దు రాజయ్య అవధాని.
చిత్తము, పొత్తము, విత్తము, బెత్తము అనే పదాలను వాడి ప్రస్తుత లాక్ డౌన్ ను గూర్చి  స్వేచ్ఛాఛందంలో చెప్పండి.

దత్తపది..అవధాని..పూరణ.
చిత్తమునన్ భయమ్ము గడు జిత్రముగాగ కరోన నింపెనే
పొత్తములం దెటన్ జదువబోము గతమ్మున నిట్టి దుస్థితిన్
విత్తము లేనిదాయె గన వింతలు పెక్కులు గానవచ్చె పో
బెత్తము బట్టు వారిఁ గన భీతిని పారుచునుంటి మయ్యయో!

దీనికి నా పూరణ.
చిత్తము వచ్చినట్లు ప్రజ ఛీ యను దుస్థితిఁ గొల్పుటన్ మనన్
బెత్తము పట్టి శిక్షణను ప్రీత్ నొసంగ కరోన వచ్చె. యే
పుస్తకమందు చూచినను పుణ్యచరి త్రలె కాన గ్రంథముల్
విత్తముపెట్టి పొంద గుణవృద్ధినొనర్చు. కరోన నాశమౌన్.

న్యస్తాక్షరికి అంశం.. శ్రీ.లోకా జగన్నాథ శాస్త్రి.
అంశం..పోతన సారస్వత స్తవం. మత్తేభంలో పద్యం ..
1 పాదం..1 వ అక్షరం... అ
2 పాదం..2 వ అక్షరం....వ
3 పాదం..3 వ అక్షరం... ధా
4 పాదం..4 వ అక్షరం... నం.

న్యస్తాక్షరి...అవధాని.పూరణ.
అవధుల్ లేని కవిత్వ సంగ్రథన విద్యాపారగుండై సదా
స్తవనీయమ్మగునట్లు భాగవతమున్ ధన్యుండుగా వ్రాసె కే
శవ ధామమ్మును జేరగా దగిన శాస్త్రజ్ఞాన మందించె నా
యవధానమ్మున జేప్పి పోతనకు పద్యంబిట్టు లర్పించెదన్.

దీనికి నా పూరణ.
అవధానంబననాట కాదు. మహనీయారా ధ్య సద్విద్య. సం
భవమౌ చేయుట శారదా కృపఁ గనన్ వర్ధిల్లఁ జేయున్ భువిన్.
సువిధానంబునఁ జేయు సత్కవులిలన్ శోభిల్లి రీ విద్యచే,
శషవణానందకరంపు పద్య రచనన్. సన్మార్గ తేజో నిధీ!

వర్ణన....శ్రీ బండికాడ అంజయ్య అవధాని.
అంశము.....ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వల్ల ప్రజలు అనుభవిస్తున్న బాధల్ని ఏదైనా వృత్తంలో వర్ణించండి..

వర్ణన.. అవధాని..పూరణ.
గడగడలాడుచుండగ జగంబున నున్న ప్రజల్ వినాశమై
చెడుగుడులాడునట్లు గడు జిత్రముగా జరియించుచున్నదే
యిడుముల బెట్టుచున్నది యిదేమి కరోన యంచు జెప్పిరే
గడబిడ రేగె గుండియలు గట్టిగ గొట్టుకొనెన్ పరాత్పరా!

దీనికి నా పూరణ.
పగలును రాత్రియు ప్రజలను
వగపించెడునీరోన వదులునిదెపుడో?
జగమంతయు భుగభుగమని
రగులుచునుండెను మురారి! రమ్మిటు కావన్.

ఆశువు.... శ్రీ ఐతగోని వేంకటేశ్వర్లు అవధాని.
అంశము.
ప్రకృతి పాడు జేయు పాడుమానవులకు
బుద్దినిడ కరోనపుట్టెననుచు
భావనంబు సేసి పద్యమందీయగ
శంకరావధాని సన్నుతి యిదె.

అవధాని.... పూరణ.
చయ్యన నరుదెంచె చైనాను విడి యిద్ది
నిత్యకార్యములకు నిప్పుఁ బెట్టె
నెచటఁ జూడ కానుపించె నిర్వేదమే
వచ్చినట్టి ముప్పు వదలు నెపుడొ?

దీనికి నా పూరణ.
చేయకూడని పనులను చేయువారు.
నియమబద్ధులు కాకిట నెగడువారు
పెచ్చు పెరుగ కరోన తా వచ్చె మార్చ .
మారకుండిన కొలుపును మరణములను.

చిత్రానికి పద్యరచన....శ్రీ అవుసుల భానుప్రకాశ్ అవధాని.

భారతీయ సంస్కృతీ రక్షణము గోరి
దేవుడంపినాడు ధీమహితుని
కనగ నెటుల జేయు కర్తవ్యపాలనం
బనుచు చూడ రాము డరుగుదెంచె.

దీనికి నా పూరణ.
మోదమునమోది సద్విల న్ బోధఁ గొలుప
వ్రాయుచుండగ ర ముఁడు వచ్చెనటకు
శక్తియుక్తులు కల్పింప సదయనిల చిత్రాన్ని.
భారతావన భ గ్యము వరలునిలను.

చిత్రానికి పద్య రచన.....శ్రీ అవుసుల భానుప్రకాశ్ అవధాని.సద్యోజ్ఞానముతోడ నీ వెపుడు విశ్వాసమ్ము జూపించుచున్
విద్యారాణిని వాణినిన్ గొలుచుచున్ వేవేల పద్యమ్ములన్
హృద్యంబౌనటు వ్రాసి వాసి గని నీ వెంతో ముదంబందితే
పద్యంబందు నుతింతు భాను! నిను సంభావింతు నెల్లప్పుడున్.

దీనికి నా పూరణ.
అవుశులభాను ప్రకాశుని
నవని సదవధానియనుచు ననురక్తిమెయిన్
భువనేశ్వరి శారదయే
భువికీవిధి వచ్చె దరికి. పుణ్యాత్మీండా!

అప్రస్తుతానికి నా సమాధానములలో ఒకటి.
అవధాని మురళి యొక్కరు.
ప్రవిమల శ్రీ రామకృష్ణ రమ్యులొకరు ప్రా
భవము నొప్పెడి మిత్రుడులు
నవధానిగనన్నుఁజూడనాశించిరయా.

నా ధన్యవాదములు.
ఆర్యా!🏻
అవధానంచేసి అత్యద్భుతంగా ర ణించిన మీకు నా అభినందనలు.

వరలుత కంది వంశజ శుభప్రద శంకర నామధేయు లీ
ధరను మహద్వధానిగ. సుధారసధారల సత్కవిత్వమున్
గురియుత సద్వదాన్యులిల కోకిలయీ కవి యంచు మెచ్చ. సు
స్థిర శుభయోగమున్ గలిగి చిత్రకవీశుల మెప్పులందుతన్..🏻

నాకు పృచ్ఛకున గా సదవకాశము కలుగఁజేసిన మీకు, రాణింపఁ జేసిన శ్రీ మురళి గారికి
నాధన్యవాదములు.
పూచ్ఛకులకు ప్రేక్షకులకు అభినందనవందనములు.
మీ
చింతా రామకృష్ణారావు
 చూచారుకదా! శ్రీ కందిశంకరయ్య అవధానిగారిని అభినందించ మనవి
జైహింద్.