గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, సెప్టెంబర్ 2015, బుధవారం

రుద్ర చమకము క్రమ పాఠము.

1 comments

జైశ్రీరామ్.జైహింద్.

29, సెప్టెంబర్ 2015, మంగళవారం

చతుషష్టి విద్యలు

1 comments

జైశ్రీరామ్.
చతుషష్టి విద్యలు
ఒక విధమున
1.  వేదము      
2. శాస్త్రము    
3. ధర్మశాస్త్రము
4.  వ్యాకరణము      
5. జ్యోతిషము    
6. ఆయుర్వేదము
7.  గాంధర్వము      
 8. కవిత్వము    
9. సర్వశాస్త్రము
10. సాముద్రికము
11. కొక్కోకము    
12. శాకునము
13. మల్లవిద్య      
14. గారుడము    
15. వాక్చమత్కారము
16. బూజవిజయము
17. దేశభాషలు    
18. లిపిఙ్ఞానము
19. లిపిలేఖనము
20. అరదగమనము
21. రత్నపరీక్ష
22. అస్త్రవిద్య      
23. పాకశాస్త్రము    
24. జంతుభేదము
25. వృక్షదోహదము
26. ఆగమము    
27. ఇంద్రజాలము
28. మహేంద్ర జాలము
29. కుట్టుపని    
30. శిల్పము
31. రసగంధము 
32. భూపాలము    
33. అంజనవిశేషము
34. వాయుజలాగ్ని
35.స్తంభన స్వరవంచన
36. ధ్వనివివేకము
37. గుటికాశుద్ధి      
38. పశుపాలనము
39. అవిద్యా ఛేదనము
40. విహంగభేదగతి
41. చిత్రలేఖనము
42. అభినయము
43. చోరత్వము      
44. వాస్తుశాస్త్రము
45. మణిమంతౌషధ సిద్ధి
46. లోహకార కల్పము
47. కాశవని        
48. స్వప్నశాస్త్రము
49. మణిసిద్ధి        
50. వడ్రంగసిద్ధ        
51. ఔషదసిద్ధి
52. చర్మకట్టు        
53. కార్యకారణవిద్య
54. గణితశాస్త్రము
55. సూతికా కృత్యము
56. చరాచరవ్యధాకరణం
57. తంతువిద్య
58. యోగరాజము
59. సేద్యము          
60. ప్రశ్నశాస్త్రము
61. వ్యాపారము          
62. మిత్రభేదము  
63. వేట
64. తుర గారోహణము.
అరువదినాలుగు విద్యలు
 ఇతిహాసము
గంధవాదము
దృష్టివంచనము
నాటకము
జలవాదము
చిత్రక్రియ
జూదము
వాక్స్తంభము
దారుక్రియ
అవధానము
మోహనము
అదృశ్యకరణము
రత్నశాస్త్రము
కాలవంచనము
కృషి దహదము
అంజనము వేట
రసవాదము
చోరకర్మము
అలంకారము
జలస్తంభము
మృత్తికక్రియ
కామశాస్త్రము
ఆకర్షణము
అంబరక్రియ
వాచకము
మారణము
పశుపాలనము
సాముద్రికము
ఐంద్రజాలము
మిత్రభేదము
పాకశాస్త్రము
మణిమంత్రౌషధాదికసిద్ధి
కావ్యము
ఖనివాదము
అశ్వక్రియ
కవిత్వము
ఖడ్గస్తంభము
చర్మక్రియ
లిపికర్మము
వశీకరణము
వాణిజ్యము
శాకునము
ఉచ్చాటనము
అసవకర్మము
మల్లశాస్రము
పాదుకాసిద్ధి
ఆగమము
ధాతువాదము
సర్వవంచనము
గానము
అగ్నిస్తంభము
లోహక్రియ
దేశభాషలిపి
వాయస్తంభము
వేణుక్రియ
సర్వశాస్త్రము
విద్వేషము
దౌత్యము
రథాశ్వగజకౌశలము
పరకాయప్రవేశము
వ్యసాయము
ప్రశ్నము
 చౌషష్టివిద్యలు -2వ విధము
అరువదినాలుగు విద్యలు
 ఇతిహాసము
గంధవాదము
దృష్టివంచనము
నాటకము
జలవాదము
చిత్రక్రియ
జూదము
వాక్స్తంభము
దారుక్రియ
అవధానము
మోహనము
అదృశ్యకరణము
రత్నశాస్త్రము
కాలవంచనము
కృషి
దహదము
అంజనము
వేట
రసవాదము
చోరకర్మము
అలంకారము
జలస్తంభము
మృత్తికక్రియ
కామశాస్త్రము
ఆకర్షణము
అంబరక్రియ
వాచకము
మారణము
పశుపాలనము
సాముద్రికము
ఐంద్రజాలము
మిత్రభేదము
పాకశాస్త్రము
మణిమంత్రౌషధాదికసిద్ధి
కావ్యము
ఖనివాదము
అశ్వక్రియ
కవిత్వము
ఖడ్గస్తంభము
చర్మక్రియ
లిపికర్మము
వశీకరణము
వాణిజ్యము
శాకునము
ఉచ్చాటనము
అసవకర్మము
మల్లశాస్రము
పాదుకాసిద్ధి
ఆగమము
ధాతువాదము
సర్వవంచనము
గానము
అగ్నిస్తంభము
లోహక్రియ
దేశభాషలిపి
వాయస్తంభము
వేణుక్రియ
సర్వశాస్త్రము
విద్వేషము
దౌత్యము
రథాశ్వగజకౌశలము
పరకాయప్రవేశము
వ్యసాయము
ప్రశ్నము
 చౌషష్టివిద్యలు 3వ విధము
అరువదినాలుగు విద్యలు.
 ఆగమము
ధాతువాదము
సర్వవంచనము
గానము
అగ్నిస్తంభము
లోహక్రియ
దేశభాషలిపి
వయస్తంభము
వేణుక్రియ
సర్వశాస్త్రము
విద్వేషము
దౌత్యము
రథాశ్వగజ
కౌశలము
పరకాయప్రవేశము
అసవకర్మము
గంధవాదము
దృష్టివంచనము
చిత్రలేఖనము
జలవాదము
చిత్రక్రియ
నాటకము
వాక్ స్తంభము
దారుక్రియ
జూదము
మోహనము
అదృశ్యకరణము
అవధానము
కాలవంచనము
కృషి,
వ్యవసాయం
రత్నశాస్త్రము
అంజనము
వాక్సిద్ది
దహదము
చోరకర్మము
అలంకారము
రసవాదము
మృత్తికక్రియ
కామశాస్త్రము
జలస్తంభము
అంబరక్రియ
వాచకము
ఆకర్షణము
పశుపాలనము
సాముద్రికము
మారణము
ప్రాణులతో మాట్లాడుట
పాకశాస్త్రము
ఐంద్రజాలము
కావ్యము
ఖనివాదము
మణిమంత్రేషధాదికసిద్ధి
కవిత్వము
ఖడ్గస్తంభము
అశ్వక్రియ లిపికర్మము
వశీకరణము
చర్మక్రియ
శాకునము
ఉచ్చాటనము
వాణిజ్యము
మల్లశాస్రము
పాదుకాసిద్ధి
ప్రాణిదూతృత,
సంగీతము .
జైహింద్.

27, సెప్టెంబర్ 2015, ఆదివారం

శిధిల దేవతా విగ్రహాలను జల నిమజ్జనం చేయండి.

3 comments

జైశ్రీరామ్.

26, సెప్టెంబర్ 2015, శనివారం

లీలాశుకుడు.....శ్రీ జాజిశర్మ.

1 comments

జైశ్రీరామ్
శ్రీకృష్ణం వందే జగద్గురుమ్.
లీలాశుకుడు.
లీలాశుకుడు ఒక గొప్ప వాగ్గేయకారుడు మరియు శ్రీ కృష్ణ కర్ణామృతం రచనచేసిన మహాకవి. ఇతడు జయదేవుడు తర్వాత 13వ శతాబ్ద కాలంలో శ్రీకృష్ణ భక్తిని అత్యున్నత స్థాయికి తీసుకొనిపోయాడు.
ఇతడు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా శ్రీకాకుళం ప్రాంతంలో నివసించేవాడని ప్రతీతి. ఇతడు రచించిన కృష్ణ కర్ణామృతంలోని శ్లోకాలు గానానికి, నృత్యానికి, అభినయానికి, చిత్రలేఖనానికి, శిల్పానికి ఉపయోగపడే రచనలుగా చెప్పవచ్చును.
శ్రీ కృష్ణ కర్ణామృతం
శ్రీ కృష్ణ కర్ణామృతం మూడు ఆశ్వాసాల భక్తి కావ్యం. మూడింటిలోను 110 చొప్పున శ్లోకాలున్నాయి. మొదటి ఆశ్వాసంలో శ్రీకృష్ణుని సాక్షాత్కారం, రెండవ ఆశ్వాసంలో శ్రీకృష్ణుని వివిధ లీలా విశేషాలు, మూడవ ఆశ్వాసంలో శ్రీకృష్ణుని జీవితంలోని అనేక ఘట్టాలు వర్ణించబడ్డాయి. దీనిలోని శ్లోకాలను సంగీత సభలలో రాగమాలికలుగా గానం చేయడం పరిపాటి.
కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం,
సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేచ ముక్తావళీ, గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిః!
ఈ శ్లోకం ఎక్కడో విన్నట్లున్నది కదా! గాన గంధర్వుడైన మహానుభావుడు ఘంటసాల గారి మధుర గాత్రంలో ఆంధ్రదేశమంతటా మారుమోగిన “పాండురంగమహత్యం” సినిమాలోని “జయ కృష్ణా ముకుందా మురారే” అనే పాట గుర్తుంది కదా? ఆ పాటలో సమయోచితంగా, సందర్భోచితంగా వాడిన శ్లోకమిది.
మరి ఈ శ్లోకానికి మూలమెక్కడుంది?
సంస్కృత సాహిత్యంలో ప్రముఖ స్థానమలంకరించిన శ్రీ కృష్ణుని స్తుతి కావ్యం “శ్రీకృష్ణకర్ణామృతం”లోది ఈ శ్లోకం. కృష్ణభక్తిని మధురంగా గానం చేసే గ్రంధాలలో విశిష్టమైన జయదేవుని “గీత గోవిందమూ”, నారాయణ తీర్ధుల “కృష్ణలీలా తరంగిణీ,” “క్షేత్రయ్య పదాలూ” వీటి కోవలోకి వచ్చేదే “శ్రీ కృష్ణకర్ణామృతం”. ఈ నాలుగు గ్రంధాలూ ఆంధ్రదేశం నాలుగు మూలలా నిన్న మొన్నటి వరకూ పండిత పామరులు చాలామంది నోళ్ళల్లో నానుతూ ఉండేవి. మన దురదృష్టం కొద్దీ ఇప్పుడా పరిస్థితి లేదు.
శ్రీ కృష్ణ కర్ణామృతం ” గ్రంధకర్త లీలాశుకుడు. ఈయనకే “బిల్వమంగళుడు” అనే మరో పేరు కూడా ఉంది. ఈయన ఏ ప్రాంతం వాడో ఏ కాలం వాడో స్పష్టంగా తెలియటం లేదు. అయితే ఈ “శ్రీ కృష్ణకర్ణామృతం” లోనిశ్లోకాలు 14 వ శతాబ్దం నుంచీ ఇతర గ్రంధాలలోనూ, శాసనాలలోనూ కనబడుతున్నాయి. అందుకని లీలాశుకుడు 11 వ శతాబ్ది నుంచీ 14 వ శతాబ్ది మధ్యలో ఉండి ఉంటాడని ఊహిస్తున్నారు. ఈ విధంగా చూస్తే లీలాశుకుడు జయదేవుడికంటే గూడా ప్రాచీనుడనే చెప్పాలి.
ఈ లీలాశుకుడు ఆంద్ర దేశంవాడనీ, వంగదేశం వాడనీ, మళయాళదేశం వాడనీ రకరకాల వాదాలున్నాయి. అయితే కృష్ణభక్తుడైన చైతన్య మహాప్రభువులు ఆంధ్రదేశయాత్రలో కృష్ణానదీతీరంలో ఒక గ్రామంలో ఉన్నప్పుడు ఈ కృష్ణకర్ణామృత గానం విని ఆనందభరితుడై దానికి నకలుప్రతి రాయించుకుని తనతో తీసుకువెళ్ళి వంగదేశంలో ఈ గ్రంధం ప్రాచుర్యంలోకి తెచ్చారని చైతన్యచరితామృతంలో చెప్పబడిఉంది.
లీలాశుకుడు ఏ ప్రాంతం వాడైనాగానీ ఆయన ఒక గొప్ప కృష్ణ భక్తుడూ, పండితుడూ, అద్వైత సంప్రదాయంలో అభినివేశమున్నవాడూ అనటంలో సందేహం లేదు. అటువంటి మహావ్యక్తిని “చింతామణి” నాటకం ద్వారా తెలుగువారు తమవాడిని చేసుకున్నారు.. తన తండ్రిగారు చెప్పిన లీలాశుకుడి కధ తనకు ప్రేరణ అని చింతామణి నాటకకర్త కాళ్ళకూరినారాయణరావు గారు చెప్పుకున్నారు.
శ్రీమద్భాగవత ప్రవక్తగా ప్రసిద్ధుడైన శుకుని లాగానే బిల్వమంగళుడు కూడా శ్రీకృష్ణలీలామాధుర్యాన్ని ఆస్వాదించి, అనుభవించి, ఆ పారవశ్యంలో మునిగి శ్రీకృష్ణకర్ణామృతాన్ని మనకందించి లీలాశుకుడనే సార్ధకనామధేయుడయ్యాడు.
ఈ గ్రంధంలోని శ్లోకాలన్నీ “ముక్తక”రూపంలో ఉన్నాయి. అంటే అన్ని శ్లోకాలూ స్వతంత్రంగా సమగ్రమైన అర్ధాన్ని అందిస్తాయన్నమాట. కధకోసం, భావంకోసం ముందు వెనకల శ్లోకాలు చూడక్కర్లేదు. ఈ గ్రంధం అద్భుతమైన వేదాంత, సాహిత్య, సంగీత, భక్తి, వ్యాకరణ, ఛందోవిషయాల సమాహారమని చెప్పవచ్చు. ఇది కేవలం కర్ణామృతమే కాదు. కరణామృతం. అంతః కరణామృతం కూడా. ఈ కావ్యంలోని సచేతనాలైన గోవులు, గోపాలురు, గోపికలు మాత్రమే కాకుండా గృహాలు, స్తంభాలు, గజ్జెలు, పూసలు, మణులు, వెన్నముద్దలు, పాలు, పెరుగు, కుండల వంటి జడపదార్ధాలు కూడా ఎంతో చైతన్యవంతంగా మన కళ్ళ ఎదుట సాక్షాత్కరించటం మరో విశేషం. కృష్ణుడు, గోకులంలో ఆడుకునే బాలగోపాలునిగానో, గోపకాంతలకు ఆరాధ్యుడైన లోకోత్తర శృంగార పురుషుడిగానో మాత్రమే ఈ కావ్యంలో మనకు దర్శనమిస్తాడు.
జైహింద్.

25, సెప్టెంబర్ 2015, శుక్రవారం

భారతాంధ్రీకరణలో నన్నయ రచించిన చివరి పద్యము ఎర్రన రచించిన మొదటి పద్యము.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
తెలుగు సాహిత్యంలో 1320 నుండి 1400 వరకు ఎఱ్ఱన యుగము అంటారు. ఈ యుగంలో ప్రబంధ రచనా విధానానికి పునాదులు పడ్డాయి. మహాభారతంలో అరణ్యపర్వశేషం తెలుఁగుచేయబడింది. నన్నయ తిక్కనాదుల కాలములో చెల్లిన గ్రాంధిక, పౌరాణిక భాష ఈ యుగంలో ఆధునికతను సంతరించుకోసాగింది.
తిక్కన మరణానికి షుమారు 10 సంవత్సరాలముందు (1280 ప్రాంతంలో) ఎఱ్ఱన జన్మించి ఉంటాడు. ఎఱ్ఱన మరణం 1360లో జరిగిఉండవచ్చును.
1365-1385 ప్రాంతంలో జన్మించిన శ్రీనాధుడు తరువాతి యుగకవిగా భావింపబడుతున్నాడు.
మహాభారతం అరణ్యపర్వములో నన్నయ రచించిన చివరి పద్యము.
శరత్కాలపు రాత్రులను వర్ణించునది.
శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండు రుచిపూరము లంబరి పూరితంబులై
అదే వర్ణనను ఎర్రన కొనసాగిస్తూ సూర్యోదయాన్ని వర్ణించాడు.
ఇది ఎర్రన భారతాంధ్రీకరణలో మొదటి పద్యం
స్ఫురదరుణాంశురాగరుచిఁ బొంపిరివోయి నిరస్తనీరదా
వరణములై దళత్కమల వైభవ జృంభణ ముల్లసిల్ల, మ
ద్దురతర హంస సారస మధువ్రత నిస్వనముల్ సెలంగఁగాఁ
గరము వెలింగె వాసర ముఖంబులు శారదవేళఁ జూడగన్. 
జైహింద్.

24, సెప్టెంబర్ 2015, గురువారం

ప్రదక్షిణ పదేపదే....

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! ప్రదక్షిణ ప్రమార్థం గ్రహించండి.
శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ప్రదక్షిణలాచరిస్తున్న భక్త సందోహం.
ఈ చరాచర జగత్తులో చైతన్య శక్తి సర్వం నిత్యం పరిభ్రమిస్తూనే ఉంటుంది.  సూర్యుని చుట్టూ అనేక గ్రహాలూ నిత్యం ప్రదక్షిణం చేస్తూ అనంత శక్తిని గ్రహిస్తున్నాయి.   విశ్వాంతరాళంలొ వివిధ నక్షత్ర మండలాలు నిత్యం ప్రకాశించేవి, పరిభ్రమణ శక్తి వల్లనే! గ్రహముల చేత గ్రహించబడిన శక్తితోనే గ్రహాచర జీవులు చైత​న్యవంత ​మవుతు​న్నాయి. సూర్యుని చుట్టూ చేసే ఒక ప్రదక్షిణ ఓ విధంగా శక్తి​​​ని పరిగ్రహించె 'ప్రదక్షిణ' అని చెప్పవచ్చు.  విశ్వంలోని ప్రతీ అణు
వూ ​ప్రకృతి అనే పరమాత్మను కేంద్రీకరించుకొని - ఆయన ఇచ్చిన శక్తితోనే పరిభ్రమిస్తుంది. ప్రదక్షిణం వలన ​మాత్రమే గ్రహాలు ​సుస్థిరమైన స్థానం కల్పించుకో గలుగుతున్నాయని చెప్పవచ్చు.
ఈ విశ్వం లో జననం నుంచి మరణం వరకు ఒక ప్రదక్షిణ ఎన్నో ఆవృతాలతో జన్మలలో సంపాదించుకున్న కర్మల ఫలితాలనుఅనుభవించడమే. వాని దుష్ఫలితాలను తొలగించు కోవాలని తాపత్రయ పడడమే ప్రదక్షిణపరమార్థం!
ఆలయంలోని దైవశక్తి, విశ్వశక్తి కేంద్ర బిందువుకు ప్రతీక! ఆయన చుట్టూ ఉన్న ఆలయం విశ్వానికి సంకేతం! విశ్వంలో ప్రదక్షిణ చేయడం కుదరదు కనుక విశ్వేశ్వరుని చుట్టూ చేసే ప్రదక్షిణం విశ్వానికి చేసే ప్రదక్షిణంగా భావించ వచ్చు.
ఈ శీర్షిక ఇంకా చాలా వివరంగా ఎన్నో విశేషాలతో కూడి ఉన్నది.  ఈ క్రింది లింకులో 41 నుండి 44 పేజీలలో ఉన్నది.  చూడ గలరు.    ​
http://ebooks.tirumala.org/Saptagiri/Book/?ID=9
అని శ్రీ కే.బీ.నారాయణశర్మగారు భాగస్వామ్యం చేసిన విషయంద్వారా తెలియుచున్నది.
జైహింద్.

23, సెప్టెంబర్ 2015, బుధవారం

శ్రీమతి వేమూరి శారదాంబ.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

22, సెప్టెంబర్ 2015, మంగళవారం

సామాజిక హితకారుఁడు దాసు శ్రీరామదాసు కవి.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

21, సెప్టెంబర్ 2015, సోమవారం

కృతి ఛందము ... శ్రీ వల్లభ,

1 comments

జైశ్రీరామ్
జైహింద్.

20, సెప్టెంబర్ 2015, ఆదివారం

అష్టాదశ పురాణాలు . వివరణాత్మక సమాచారం.

1 comments

జైశ్రీరామ్.
అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు.
శ్లో. మద్వయం భద్వయం చైవ, బ్రత్రయం వచతుష్టయమ్ .
     అ.నా.ప.లిం.గ. కూ.స్కాని, పురాణ్యష్టాదశా స్మృతా .
గీ. మద్వయము భద్వయంబును మరియు బ్రత్ర
యంబు వచతుష్తయంబును ప్రియ అ.నా.ప.
లిం.గ.కూ.స్కాంధ. ముయ్యారు లెక్ఖనుండె
వ్యాస లిఖితమైన పురాణ భాగ్య మమరె.
మద్వయం: మ కారంతో ప్రారంభమయ్యేవి 2. అవి మత్స్య పురాణం. మార్కండేయ పురాణం.
భద్వయం: భ కారంతో ప్రారంభమయ్యేవి 2. అవి భాగవత పురాణం. భవిష్యత్ పురాణం.
బ్రత్రయం: బ్ర కారంతో ప్రారంభమయ్యేవి 3. అవి బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం.
వచుతష్టయం: వకారంతో ప్రారంభమయ్యేవి 4. అవి వాయుపురాణం, వరహా పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం.
అ కారంతో అగ్ని పురాణం, నా కారంతో నారద పురాణం, ప కారంతో పద్మ పురాణం, లి కారంతో లింగ పురాణం, గ కారంతో గరుడ పురాణం, కూ కారంతో కూర్మ పురాణం మరియు స్క కారంతో స్కంద పురాణం రచించిరి.
1. మత్స్య పురాణం: దీనిలో 14000 శ్లోకములున్నవి. మత్స్యావతారమెత్తిన విష్ణువుచే మనువుకు బోధింపబడినది. కార్తికేయ, మయాతి, సావిత్రుల చరిత్రలు. ధర్మాచరణములు, ప్రయాగ, వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహత్మ్యములు చెప్పబడినవి.
2. మార్కండేయ పురాణము: ఇందులో 9000 శ్లోకములు కలవు. మార్కండేయ మహర్షిచే చెప్పబడినది. శివవిష్ణువుల మహత్మ్యములు, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహత్మ్యములు మరియు సప్తపతి (లేక దేవి మహత్మ్యము) చెప్పబడినవి. చండీ హోమము, శతచండీ సహస్ర చండీ హోమ విధానమునకు ఆధారమయినది ఈ సప్తశతియే.
3. భాగవత పురాణము: దీనిలో 18,000 శ్లోకాలు కలవు. వేద వ్యాసుని వలన శుకునకు, శుకుని వలన పరీక్షత్ మహారాజునకు 12 స్కందములులో మహా విష్ణు అవతారలు శ్రీ కృష్ణ జనన, లీలాచరితాలు వివరించబడినవి.
4. భవిష్య పురాణము: దీనిలో 14,500 శ్లోకాలు కలవు. సూర్య భగవానునిచే మనువునకు సూర్యాపాసన విధి, అగ్ని దేవతారాధన విధానం, వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడినవి. ముఖ్యంగా భవిష్యత్ అనగా రాబోవు కాలం. భవిష్యత్తులో జరుగబోవు విషయాల వివరణ ఇందు తెలుపబడినది.
5. బ్రహ్మపురాణము: దీనినే ఆదిపురాణం లేక సూర్యపురాణం అందురు. దీనిలో 10,000 శ్లోకాలున్నవి. బ్రహ్మచే దక్షునకు శ్రీ కృష్ణ, మార్కండేయ, కశ్యపుల చరిత్ర వర్ణనలు, వర్ణధర్మాలు, ధర్మాచరణాలు, స్వర్గ – నరకాలను గూర్చి వవరించబడినవి.
6. బ్రహ్మాండ పురాణము: దీనిలో 12,000 శ్లోకాలు కలవు. ఈ పురాణం బ్రహ్మచే మరీచికి చెప్పబడినది. రాధాదేవి, శ్రీకృష్ణుడు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు. శ్రీ లలితా సహస్ర నామస్తోత్రాలు, శివకృష్ణ సోత్రాలు, గాంధర్వం, ఖగోళశాస్త్రం మరియు స్వర్గ నరకాలు వివరణ ఇందు వివరించబడినది.
7. బ్రహ్మ వైవర్త పురాణము: దీనిలో 18,000 శ్లోకాలు కలవు. సావర్ణునిచే నారదునకు చెప్పబడినది. స్కంద, గణేశ, రుద్ర శ్రీకృష్ణుల వైభవములు, సృష్టికర్త బ్రహ్మ, సృష్టికి కారణమయిన భౌతిక జగత్తు (ప్రకృతి) మరియు దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలగు పంచ శక్తుల ప్రభావము గురించి వివరించబడినది.
8. వరాహ పురాణము: దీనిలో 24,000 శ్లోకములు కలవు. వరాహ అవతార మొత్తిన విష్ణువుచే భూదేవికి చెప్పబడినది. విష్ణుమూర్తి ఉపాసనా విధానము ఎక్కువగా కలదు. పరమేశ్వరీ, పరమేశ్వరుల చరిత్రలు, ధర్మశాస్త్రము, వ్రతకల్పములు, పుణ్య క్షేత్రవర్ణనలు ఈ పురాణములో కలవు.
9. వామన పురాణము: దీనిలో 10,000 శ్లోకములు కలవు. పులస్త్వ ఋషి నారద మహర్షికి ఉపదేశించినది. శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణము, శివగణేశ, కార్తికేయ చరిత్రలు, భూగోళము – ఋతు వర్ణనలు వివరించబడినవి.
10. వాయు పురాణము: దీనిలో 24,000 శ్లోకములు కలవు. ఇది వాయుదేవునిచే చెప్పబడినది. శివభగవానుని మహాత్మ్యము, కాలమానము, భూగోళము, సౌరమండల వర్ణనము చెప్పబడినది.
11. విష్ణు పురాణము: ఇందు 23,000 శ్లోకములు కలవు. పరాశరుడు తన శిష్యుడయిన మైత్రేయునికి బోధించినది. విష్ణుమహాత్మ్యము, శ్రీ కృష్ణ, ధృవ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు వర్ణింపబడినవి.
12. అగ్ని పురాణము: దీనిలో 15,400 శ్లోకాలు కలవు. అగ్ని భగవానునిచే వశిష్ణునకు శివ, గణేస, దుర్గా భగవదుపాసన, వ్యాకరణం, చంధస్సు, వైద్యం, లౌకిక ధర్మములు, రాజకీయము, భూగోళ ఖగోళ శాస్త్రాము, జ్యోతిషం మొదలగు విషయాలు చెప్పబడినవి.
13. నారద పురాణము: ఇందు 25,000 శ్లోకములు కలవు. నారదుడు సనక, సనందన, సనత్కుమార, సనాతరన్ అను నలుగురు బ్రహ్మామానసపుత్రులకు చెప్పినది. అతి ప్రసిద్ధి చెందిన వేదపాదస్తవము (శివస్తోత్రము) ఇందు కలదు వేదాంగములు, వ్రతములు, బదరీ ప్రయాగ, వారణాసి క్షేత్ర వర్ణనలు ఇందు కలవు.
14. స్కంద పురాణము: దీనిలో 81,000 శ్లోకములు కలవు. ఇది కుమారస్వామి (స్కందుడు) చే చెప్పబడినది. ఇందు ముఖ్యముగా శివచరిత్ర వర్ణనలు, స్కందుని మహాత్యము, ప్రదోష స్తోత్రములు, కాశీఖండము, కేదారఖండము, రేవా ఖండము (సత్యనారాయణ వ్రతము ఇందులోనివే), వైష్ణవ ఖండము (వేంకటాచల క్షేత్రము), ఉత్కళ ఖండము (జగన్నాధ క్షేత్రము), కుమారికా ఖండము (అరుణాచల క్షేత్రము), బ్రహ్మ ఖండము (రామేశ్వర క్షేత్రము) బ్రహోత్తర ఖండము. (గోకర్ణక్షేత్రము, ప్రదోషపూజ), అవంతికాఖండము (క్షీప్రానదీ, మహాకాల మహాత్మ్యము) మొదలగునవి కలవు.
15. లింగ పురాణము: ఇది శివుని ఉపదేశములు. లింగరూప శివ మహిమ, దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు. ఖగోళ జ్యోతిష, భూగోళ శాస్త్రములు వివరించబడినవి.
16. గరుడ పురాణము: ఇందు 19,000 శ్లోకములున్నవి. ఇది విష్ణువుచే గరుత్మంతునకు ఉపదేశించబడినది. శ్రీ మహావిష్ణు ఉపాసన, గరుత్మంతుని ఆవిర్భావము, జనన మరణములు, జీవి యొక్క స్వర్గ – నరక ప్రయాణములు తెలుపబడినవి.
17. కూర్మ పురాణము: ఇందులో 17,000 శ్లోకములున్నవి. కూర్మావతార మెత్తి విష్ణువుచే చెప్పబడినది. వరాహ నారసింహ అవతారములు, లింగరూప శివారాధన, ఖగోళము, భూగోళముతో వారణాసి, ప్రయోగక్షేత్ర వర్ణనలు తెలుపబడినవి.
18. పద్మపురాణము: ఇందులో జన్మాంతరాల నుండి చేసిన పాపాలను, కేవలం వినినంత మాత్రముననే పొగొట్టగలిగేది ఈ పద్మపురాణము. అష్టాదశ పురాణాలలోకెల్ల, అత్యధిక శ్లోకాలు ( 85,000 శ్లోకములు) కలిగి అనేక విశేషాలను మనుకు తెలియజేస్తుంది. మరియు మదుకైటభవధ, బ్రహ్మసృష్టికార్యము, గీతార్థసారం – పఠనమహాత్య్మం, గంగామహాత్మ్యం, పద్మగంధి దివ్యగాధ, గాయత్రీ చరితము, రావి వృక్ష మహిమ, విభూతి మహాత్మ్యం, పూజావిధులు – విధాణం, భగవంతుని సన్నిథిలో ఏ విధంగా ప్రవర్తించాలో పద్మపురాణంలో వివరంగా తెలియజేయబడింది.
ఈ విధముగా పురాణములందలి విషయములు క్రమముగా సంక్షిప్త రూపమున వేదవ్యాసపీఠ మందిరము నందు రచింపబడి నైమిశారణ్యమునందు ప్రసిద్ధములైయున్నవి.
వీటిని వ్యాసభగవానుడు మనకు అందించారు. పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండవ స్కందం చెప్తుంది. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయ గృహనుండి ఒక అనాహత శబ్ధం వెలువడింది. ఆ శబ్ధంలో నుండి అ కార ఉకార మకార శబ్ధాలు కూడిన ఓంకారశబ్ధం ఆవిర్భవించింది. "అ" నుండి "హ" వరకు గల అక్షరాలు ఆశబ్ధంనుండి ఉద్భవించాయి. ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరం అయింది. ఓంకారం నుండి నాలుగు వేదాలను ఉద్భవించాయి. ఆ 'అ'కార, 'ఉ'కార 'మ'కారములనుండి సత్వ,రజో,తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే చతుర్వేదాలు, భూ॰ భువ॰ సువ॰ అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తనకుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి. వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తుసారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించారు. పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణుకి చెప్పారు. రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన త్రైయారుణి, కశ్యపుడు, సావర్ణి లాంటి శిష్యులకు అందించారు. ఆ తర్వాత అలా ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి. 
జైహింద్.

19, సెప్టెంబర్ 2015, శనివారం

బాలార్కో ప్రేతధూమశ్చ ... మేలిమి బంగారం మన సంస్కృతి

1 comments

జైశ్రీరామ్.
శ్లో. బాలార్కో ప్రేతధూమశ్చ , వృద్ధా స్త్రీ పల్వలోదకమ్ ,
రాత్రౌ దధ్యన్నభుక్తిశ్చ , ఆయుఃక్షీణం దినే దినే .
గీ. ఉదయరశ్మి, కాటిపొగయు, నొప్పు తప్పి
వలచు వృద్ధురాల్ పొందును, పడియనీరు.
రాత్రి దధ్యన్న భుక్తము ప్రముదమగునె
దినదినంబున కాయువు తీయుచుండ?
భావము. ఉదయపు టెండ , కాటి పొగ , వృద్ధస్త్రీ పొందు , పడియ ( నీరు నిలచిన చిన్నగుంట )లోని నీరు త్రాగడము, రాత్రులందు పెరుగుతో భోజనము - ఇవన్నీ ఆయువును క్షీణింపఁజేయును .
                                                                              జైహింద్.

18, సెప్టెంబర్ 2015, శుక్రవారం

ఓం భద్రం కర్ణేభిః శృణు యామ దేవాః ... మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్
మంత్రము. ఓం భద్రం కర్ణేభిః  శృణు యామ దేవాః  భద్రం పశ్యేమా క్ష్యభి ర్యజత్రాః 
స్థిరై రంగై స్తుష్టువాగ్ఒస స్తనూభిః  వ్యశేమ దేవహితం యదాయుః 
గీ. శుభములే కర్ణముల విన్చు శోభిలుదుము.
శుభములే కన్నులన్ గాంచు చున్నడతుము.
బలము సంపద నారోగ్య ఫలములంది
యజ్ఞములదేవతతిఁగొల్తుమనవరతము!
భావము. ఓ దేవతలారా! మా చెవులతో శుభమైన దానినే వినెదముగాక !
ఓ పూజనీయులారా ! మా నేత్రములతో శుభప్రదమగు దానినే దర్శించెదము గాక !
మిమ్ములను స్తుతించుచు మా కొసంగబడిన ఆయుష్కాలమును సంపూర్ణ ఆరోగ్యముతో, శక్తితో జీవించెదముగాక!
మంత్రము. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః 
స్వస్తి న స్తార్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. 
ఓం శాంతిః శాంతిః శాంతిః 
గీ. ఋషి నుతేంద్రుఁడు శుభములనిచ్చుఁ గాత!.
సర్వవిత్సూసూర్యుడిచ్చుత సకల శుభము
లాపదలఁ గాచి వాయువు హాయినిడుత!
గురుఁడు కాచుత శుభములు కూర్చి మాకు.
భావము. సనాతన ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభము చేకూర్చుగాక !
సర్వజ్ఞుడైన సూర్యుడు మాకు శుభమును కలుగజేయుగాక !
ఆపదలనుండి కాపాడు వాయువు మాకు శుభమును అనుగ్రహించుగాక !
మాలోని ఆధ్యాత్మిక ఐశ్వర్యమును రక్షించి కాపాడు బృహస్పతి మాకు శుభమును ప్రసాదించుగాక !
ఓం శాంతిః శాంతిః శాంతిః
జైహింద్.

17, సెప్టెంబర్ 2015, గురువారం

శ్రీ మహా గణాధిప చతుర్థి పర్వదినము సందర్భముగాశుభాకాంక్షలు.

2 comments

జైశ్రీరామ్
        
శ్లో. గజాననం భూత గణాధి సేవితమ్ - కపిత్థ జంబూ ఫల సార భక్షితమ్
ఉమా సుతం శోక వినాశ కారణమ్న - మామి విఘ్నేశ్వర పాద పంకజమ్.
క. గజ వక్త్రు, పార్వతీసుతు, 
విజయదు, జంబూ కపిత్థ ప్రియ ఫల ఖాదిన్,
భజియించి వాని పదములు 
నిజమనముననిలిపి చేతు నేర్పున ప్రణతుల్.  
ప్రతి పదార్ధం: గజ ఆననమ్ = ఏనుగు ముఖముకలవానిని; భూత గణాధిసేవితమ్ = భూత గణములచేత బాగుగా సేవించబడువానిని; కపిత్థ = వెలగ; జంబూ = నేరేడు; ఫల = పళ్ళు యొక్క; సార = గుజ్జును; భక్షిమ్ = తినువానిని; ఉమాసుతమ్ = పార్వతీ మాత యొక్క పుత్రుని; శోక = దుఃఖము యొక్క; వినాశ = నాశనమునకు; కారణమ్ = కారణమైన వానిని;  విఘ్నేశ్వర = విఘ్నములకు అధిపతియైన వినాయకుని యొక్క; పాద పంకజమ్ = పాదపద్మములకు, నమామి = నమస్కరింతును.
భావము:  గజ ముఖుడు, భూత గణములచే సేవించ బడే వాడు, వెలగ మరియు రేగు పండ్ల గుజ్జును భక్షించు వాడు, పార్వతీ పుత్రుడు, దుఃఖ వినాశ కారకుడు అయిన విఘ్నేశ్వరుని పాద పద్మములకు నమస్కరించుచున్నాను. 
ఆర్యులారా! సమస్త కార్యారంభములందు ఆది పూజ్యుఁడైన శ్రీ మహా గణాధిప చతుర్థి పర్వదినము సందర్భముగా సకల చరాచర జగత్తుకు శుభమునాకాంక్షిస్తూ, 
మీకు నా మనః పూర్వక శుభాకాంక్షలను తెలియఁ జేసుకొంటున్నాను.
జైహింద్. 

16, సెప్టెంబర్ 2015, బుధవారం

రగడలు ద్విపదలు. గానానుకూల ఛందస్సమన్వితములు.

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! గానానుకూల ఛందస్సమన్వితములైన రగడలను గూర్చి తెలుసుకొందాము.
రగడలు ద్విపదలు. వీనికి ప్రాస మాత్రమే కాక అంత్యప్రాస కూడ అవసరము.
యతి తప్పక నుండవలెను.
అనంతామాత్యుని ఛందోదర్పణములో      
ఆద్యంతప్రాసంబులు  -  హృద్యంబుగ రెంట రెంట నిడి పాదములు                                 
ద్యద్యతులఁ గూర్పఁదగునన - వద్యంబగు రగడలందు వారిజ నాభా.  
అని రగడను నిర్వచించి, తెలుగులో 9 రకములైన రగడలు చెప్పెను.                                                   1.హయప్రచార రగడ - 4(త్రిమాత్రలు)సూ.గ, 7వ మాత్ర యతిస్థానము. (త్రిశ్ర, 1.1, 3.1)
ఉదా.  చతుష్టయంబు ఋతు
నిత యతుల రుఁగుఁ గృతు.                               
2.తురగవల్గన రగడ - 8(త్రిమాత్రలు)సూ.గ, 13వ మాత్ర యతిస్థానము. (త్రిశ్ర, 1.1, 5.1)
ఉదా. శ్రీతీశు పరమ పురుషుఁ జిత్తమునఁ దలంచువారు
వావాది నిఖిల దివిజ వంద్యునాశ్రయించువారు.                                  
3.విజయమంగళ రగడ - 16(త్రిమాత్రలు)సూ.గ, 13-25-37వ, మాత్రలు యతిస్థానము.(త్రిశ్ర, 1.1, 9.1)
ఉదా. శ్రీరాయ శిష్ట జననిషేవితాయ భక్త లోక జీవితాయ గర్వితోరు సింధురాజ బంధనా
గాధి పుత్ర యజ్ఞ విఘ్నర మహా సురీ మహోగ్ర కాయశైల దళననిపుణన సురాధిపాయుధా.                
4.ద్విరదగతి రగడ - 4పంచమాత్రలు, 11వ మాత్ర యతిస్థానము. (ఖండ, 1.1, 3.1)
ఉదా. శ్రీ యువతి నిజ యువతిఁజేసి యెంతయు మించి,
కాజునిఁ దన తనయుఁగా నెలమిఁ బాటించి.                                    
5.జయభద్ర రగడ - 8పంచమాత్రలు, 11-21-31వ మాత్రలు యతిస్థానము. (ఖండ, 1.1, 5.1)
ఉదా. శ్రీకి నొడయండనఁగఁ జిత్తజుని గురుఁడనఁగ శేషశయనుండనఁగఁ జెలువుగఁ జతుర్భుజుఁడు
నాకౌకసులనేలుముచిసూదను పూజ డుమఁదాఁగైకొన్న నంద గోపాత్మజుఁడు                                
6.మధురగతి రగడ - 4చతుర్మాత్రలు, 9వ మాత్ర యతిస్థానము. (చతురస్ర, 1.1, 3.1)
ఉదా. శ్రీనితాధిపుఁజేరి భజింపుఁడు
భాజ జనకుని క్తిఁదలంపుఁడు.                                
7.హరిగతి రగడ - 8చతుర్మాత్రలు, 17వ మాత్ర యతిస్థానము. (చతురస్ర, 1.1, 5.1)
ఉదా. శ్రీరామా కుచ కుంకుమ పంకము చేఁ బొలుపగు విపులోరఃఫలకము
తా తుషార పటీర సమానోక వాహిని యొదవిన పద కమలము                                    
8.హరిణగతి రగడ - త్రి చతుర్ త్రి చతుర్ మాత్రలు, 8వ మాత్ర యతిస్థానము. (మిశ్ర, 1.1, 3.1)
ఉదా. శ్రీనివాసు భజింతు నేనని
పూని కుజనుల పొంతఁ బోనని                               
9.వృషభగతి రగడ - త్రి చతుర్ త్రి చతుర్ త్రి చతుర్ త్రి చతుర్ మాత్రలు., 15వ మాత్ర యతిస్థానము. (మిశ్ర, 1.1, 5.1)
ఉదా. శ్రీ నోహరు నంబుజోదరుఁజిత్త జాత గురుందలంచెదఁ
గామితార్థవిధాయి నిర్జిత కాళియాహినినాశ్రయించె.                                              
మాత్రాబద్ధమైన పద్యములు, పాటలు పాడుటకు అత్యుత్తమమైనవి.                            
మూడు మాత్రల నడకను త్రిశ్రగతి యందురు. త్రిశ్రగతికి రూపక తాళము,                      
నాల్గు మాత్రల నడక చతురశ్రగతి యగును.  చతురశ్రగతికి ఏక తాళము,                      
ఐదు మాత్రల నడక ఖండగతి యనబడును.  ఖండగతికి జంపె తాళము,                      
మూడు, నాల్గు మాత్రలతో మిశ్రితమైన నడక మిశ్రగతి యగును.
మిశ్రగతికి త్రిపుట తాళము వాడుకలో నున్నవి.
చతుర్మాత్రలకు అట తాళము,
పంచమాత్రలకు ధ్రువ, మఠ్య తాళములు కూడ వాడబడినవి.
నమశ్శివాయరగడ .- చక్రపాణి రంగనాథు                                 
శ్రీగిరీశ వశ్యమంత్ర సేకరము నమశ్శివాయ
ఆగమోపదిష్ట విధి మహాకరము నమశ్శివాయ
పంచవర్ణ పంచరూప భాసురము నమశ్శివాయ
అంచితానురక్త జిత గజాసురము నమశ్శివాయ
నయనరగడ  - చక్రపాణి రంగనాథు
శ్రీశైల వల్లభుని శిఖరంబుఁ బొడగంటి
కాశీ పురాధీశు గౌరీశుఁ బొడగంటి
సర్వలోకేశ్వరుని సర్వేశుఁ బొడగంటి
సర్వసంరక్షకుని సర్వంబుఁ బొడగంటి.
సుదర్శన రగడ - తాళ్లపాక (అన్నమాచార్యుల కుమారుఁడు) తిరుమలయ్యంగారు
ఓంకారాక్షరయుక్తము చక్రము
సాంకమధ్యవలయాంతర చక్రము
సర్వఫలప్రదసహజము చక్రము
పూర్వకోణసంపూర్ణము చక్రము.
జైహింద్.

15, సెప్టెంబర్ 2015, మంగళవారం

బృహతీ ఛందము. శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

14, సెప్టెంబర్ 2015, సోమవారం

గర్భకవిత ... శ్రీవల్లభ,

0 comments

జైశ్రీరామ్.
జిహింద్.

13, సెప్టెంబర్ 2015, ఆదివారం

గ్రేండు పేరెంట్సు డే టుడే. గ్రేట్టు డేట్టు.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! మా దౌహిత్రి శ్రీవైష్ణవి ఈ రోజు గ్రేండు పేరెంట్సు డే తాతా. మీకు నమస్కరిస్తున్నాను. ఈ రోజును గూర్చి నాకేదైనా పద్యం వ్రాసి చెప్పవా? అని అడిగిందండి. ఐతే వ్రాసుకో అమ్మా చెప్తున్నాను.... అని ఇలా చెప్పాను.
తే.గీ. 
గ్రేండు పేరెంట్సు డే టుడే. గ్రేట్టు డేట్టు.
గ్రేండు సన్సెండు డాటర్సు గ్రీటు దెమ్ము. 
ఎక్సులెంట్దిస్సు సీక్వెన్సు. యెవ్విర్వేరు.                                           
గ్రేండు పేరెంట్సు విష్షెస్సు గిఫ్ట్సు గట్టు.

grandu parentsu day to day gratttu dattu
grenadu sonsendu daughtarsu greetu demmu.
excelent thissu sequenceu every wheru.
grand parentsu wish themmu gifts gettu.

తే.గీ. 
తల్లిదండ్రుల పూజ్యులౌ తల్లిదండ్రు
లరయ తాత, మామ్మ మ్మమ్మ లగుదురిలను.
వారి యొడిలోననాడుచు వారి మనుమ
లును, మనుమరాండ్రు సంతోషమనుభవింత్రు.

ఆంగ్లభాషా మాధ్యమంతో ౯ వ తరగతి చదువుచున్న మా మనుమరాలికి అజంత ఆంగ్లంలో ఒక పద్యము, తెలుగులో ఒక పద్యము చెప్పానండి. మీరూ మీ ఆశీస్సులు చిరంజీవి శ్రీవైష్ణవికి అందజేయండి. నమస్తే.
జైహింద్.

కృతిఛందము...శ్రీవల్లభ

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

12, సెప్టెంబర్ 2015, శనివారం

కృతిఛందము...శ్రీ వల్లభ,

0 comments

జైస్రీరమ్.
జైహింద్.

11, సెప్టెంబర్ 2015, శుక్రవారం

వ్యక్తిత్వ వికాశ శిక్షణా తరగతి.

0 comments

జైశ్రీరామ్
.
జైహింద్.

10, సెప్టెంబర్ 2015, గురువారం

కృతిఛందము. శ్రీవల్లభ.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

9, సెప్టెంబర్ 2015, బుధవారం

కృతి ఛందము. శ్రీవల్లభ.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

8, సెప్టెంబర్ 2015, మంగళవారం

కృతి ఛందము. ... శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

7, సెప్టెంబర్ 2015, సోమవారం

తెలుగు భాగవతం.ఆర్గ్ ద్వితీయ వార్షికోత్సవ చిత్రాలు.౩

2 comments

జైశ్రీరామ్.

జైహింద్.

ఉదారగుణ సంపన్న రాజమహేంద్ర వర పుత్రిక " ప్రజా పత్రిక " వారపత్రిక.

3 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!  సమాజం దృష్టిలో అతి సామాన్యమైన ఒక వార పత్రిక - ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిపుణులైన ఉపాధ్యాయులను గుర్తించి, వారిలో ఉన్న నిపుణతను సభాముఖంగా ప్రశంసిస్తూ, వారిని అత్యద్భుతంగా సత్కరించడం ద్వారా వారి సేవాపటిమను ద్విగుణీకృతం చేస్తూ సమాజంలోనే అసాధారణ మహోన్నతవిధానంతో సామాజికులను ఆశ్చర్యానికి లోను చేస్తోందంటే ..... అది సామాన్యమైన విషయం కాదు. 
ఈ క్రింది చిత్రాలను, 
ఆ పత్రిక ఎడిటర్ దేవీ సుదర్శన్. వ్రాసిన లేఖను, మీరు గమనించండి. 
ఆ పత్రిక తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరము నుండి సుమారు వందేళ్ళుగా వెలువడుతున్న 
" ప్రజాపత్రిక " వారపత్రిక.

సర్  /  మేడం,    
ఈ రొజు దర్మంచర కమ్యూనితి   హాల్లో టీచర్స్ డే చేశాం. సుదర్సన్ అధ్యక్షతన జరిగిన యీ  కర్యక్రమంలొ డా.కూర్మయ్య, పిల్లి డేవిడ్ కుమార్, మహీధర రామ శాస్త్రి, మాణిక్ రెడ్డి  సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.నెల్లూర్ లో ఏనుగు పై సన్మానం పొందిన షేక్ మస్తాన్  సాహెబ్  గారు ఈ సభలో చక్కటి ఉపన్యాసం ఇచ్చారు.`15 మంది తీచర్స్ కి సన్మానం జరిగింది. పి.వి.ఎస్ క్రిష్ణా రావ్,  ఎలిజిబెత్ రని ఫణి నాగేశ్వర రావ్, దెవీ సుదర్సన్ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు 
ఎడిటర్ 
దేవీ సుదర్శన్.
చూచారు కదా! ఇది ఎంతటి శ్రమ దమాదులతో కూడుకొన్నకార్యక్రమమో!
ఆదాయ వ్యయాలను పరిగణించకుండా ఎదుటి మనిషిలో మంచి అన్నది ఉన్నదంటే, దానిని గుర్తించి, అది వారి దృష్టికి తీసుకు వచ్చి ఆ మంచిని శతధా సహస్రధా ద్విగుణీకృతం చేయడం ద్వారా ఆ వ్యక్తిని సమాజానికి పరిపూర్ణంగా ఉపయోగపడేవానిగా మార్చుతున్న మహత్తర కార్యక్రమం ఇది.
ఇటువంటి పత్రికలు ఎంతగా ప్రోత్సహింపఁబడితే సమాజానికి అంతగా మేలు చేకూరుతుంది.
ఇట్టి మహత్తర కార్యక్రమాలను ఆదర్శప్రాయంగా చేపట్టి నిర్విఘ్నంగా అత్యద్భుతంగా నిర్వహిస్తున్న " ప్రజా పత్రిక " అధిపతులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియఁజేస్తున్నాను.
సన్మానితులందరినీ నేను మనసారా అబినందిస్తున్నాను.
ఐతే
ఈ సన్మానితులు తమలో పత్రిక ఏవైతే సుగుణాలను గుర్తించి సన్మానం చేసిందో ఆ సుగుణాలను మరింత పెంచుకొని, తమకు చేసిన సన్మానం యోగ్యమయినదే అని సమాజంలో అనిపించుకొనేలాగున తమ భవిష్యత్ కార్యక్రమావళిని తీర్చి దిద్దుకోవలసి, ఆవిధంగా తమ సేవలను సమాజానికి అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం భవిష్యత్తులో ఎంతమంది తాము సత్కరింపఁబడటంలో గల ఔచిత్యాన్ని ఋజువు చేసుకుంటారో.
జైహింద్.