గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, నవంబర్ 2011, బుధవారం

కవివతంస బులుసు కలం నుండి ప్రవహిస్తున్న రామ రసామృతం.

1 comments

సాహితీ ప్రియ మిత్రులారా! సుప్రసిద్ధులైన మనమిత్రులు కవివతంస బులుసు వేంకటేశ్వర్లు కలము నుండి రామాయణం నిరుపమాన కవితా విశేష సీస ధారగా ప్రవహింపనున్నదనే విషయం తెలుగు సాహితీ ప్రియులకు అమందానందాన్ని కలిగిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఇది వరలో వీరు రచించిన పండుగ అనే కథా సంకలనం, సంజీవినీ పుల్ల అనే కవితా సంకలనం అపారమైన ఆనందాన్ని పాఠకులకు అందించిన కారణంగానే భాషాంతరీకరణకు కూడా నోచుకున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.
వీరు రచింపబోవు రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాలలోని సీసాలనిక్కడ చూద్దాము.
మాయ లేడి:-
గొరిజలు శృంగముల్ గోమేధిక ప్రభల్
మౌక్తిక రుచి మేని ప్రక్కలందు.
భాసించు కంఠాన పద్మ రాగ చ్ఛటల్
కన్నులు నీలాల కాంతి కనులు.
మెత్తని పొట్టపై మేలి వజ్రపు ఛవుల్
వైడూర్య రోచిస్సు వాలమందు.
మరకత ద్యుతి మూపులిరు పార్శ్వములయందు,
శ్రీ పుష్య రాగముల్ శిరము మీద.
దేహ చాలనము ప్రవాళ దీప్తులెగసి,
కాంచనము మించి మించు కన్ పించు చుండ
వచ్చె నెచ్చటనుండియొ పంచ వటిలి.
చెంగుమని దూకి మాయా కురంగ మొకటి.
సీతా విలాపము:-
మనవి చేయుచునుంటి వన విహంగములార!
పతి తోడ నా సేగి పల్కరమ్మ!
నతులు చేసెద సమున్నత దివ్య తరులార!
శ్రీరాము తోడ వచింపరమ్మ!
వందనముల్ మీకు వనదేవతలు! నాదు
విలయమ్ము స్వామికి తెలుపరమ్మ!
ప్రార్థింతు దండకారణ్య సత్వములార!
నే పోవు దారులు చూపరమ్మ!
యజ్ఞ హోమార్థమౌ పురోడాశనమ్ము
సూకరము తకి అశుచియౌ చొప్పు కాగ
పర పురుష దుష్ట హస్త సంస్పర్శ నొంది
తనుచు నెలుగెత్తి యేడ్చె తొయ్యలి రథాన.
సీత కనుపింపక శ్రీరాముఁడు దుఃఖించుట:-
నిశ్శబ్దమయ్యె వనీ ప్రాంతమంతయు
నిచ్చోట బోసిపోయినది చూడు.
తరు శాఖ లెల్ల క్రింద బడి మార్గమ్మెల్ల
అడ్డ దిడ్డమ్ముగానైనదేమొ!
విభ్రాంతిలో మున్గి వెఱ్ఱి చూపులు చూచు
కానన మృగములే కారణంబొ!
అదె పర్ణ శాల నా కెదురేగి వచ్చెడు
ఇల్లాలు కన్పింపదేమి నేడు?
నన్ను భయ పెట్టు దుశ్శకునాలు తోచి
కాంతకేమైన కాలేదు కద విపత్తు?
నాయనా! లక్ష్మణా! చూతునా గృహాన
తరుణి లేకున్న నా జీవితమ్మె కాన.
రావణుఁడు దాసీ గణములకు ఆజ్ఞ లిచ్చుట:-
నీల్కోత్పలములైన నెలత కన్నుల నుండి
బాష్ప ధారలు జాలువార రాదు.
ప్రభలకు నెలవైన పడతి నెన్నుదుటిపై
స్వేద బిందువులింత చెమర రాదు.
మోహనమ్ముల రాశి పొలతి నెమ్మోమున
కళ యొక్కటియు కూడ కరగ రాదు.
విలసనమ్ముల ప్రోవు వెలది కౌ తీగెపై
తలచూపు కాంతులు తొలగ రాదు.
ఏమి చేతురొ యేమొ మీరెల్ల పోయి
సీత దేవత గాగ నర్చించుడిపుడు.
అయ్యశోక వనమ్మె దేవ్యాలయమ్ము.
తరుణి దయఁ గోరుచున్న కింకరుఁడ నేను.
రావణుని విపరీత వాక్కులు:-
ఆగర్భ సౌరభశ్రీ గాఢములు నంద
నానీత తరు లతాంతములు - దేవి
సుకుమార శ్రీరంగ శుద్ధ కస్తూరికల్
ధనద శుద్ధాంత నీతములు - దేవి.
నిత్య రోచిర్ముగ్ధ నిర్మలమ్ములు - మణుల్
పాతాళ లోక సంపదలు - దేవి.
సతత సౌఖ్యావహ సైత్య వాటికలివ్వి.
వరుణ లోకస్థ వైభవము - దేవి.
నీకు నైవేద్యములు సీత,నీ కటాక్ష
ములకె నైవేద్యములు సీత. కొనుము వీని.
వీనితో పాటు రావణ ప్రాణములకు
దేవియైయుండి పట్టపు దేవి యగుము.
సీత ప్రవచనం:-
రామ మానస సరో రాజ హంసిని నేను.
రామాబ్ధి లోని తరంగ మేను.
రామ నీలాకాశ రాకా శశిని యేను.
రామ గిరీంద్ర ప్రస్రవణ మేను.
రామ పాదప నిత్య రాగ వల్లిని నేను.
రామ లతాంత సౌరభము నేను.
రామ ప్రభాకర రాజితాంశువు నేను.
రామ విపంచీ స్వరమ్ము నేను.
రాముఁడును సీత యెంత దూరములనున్న
వారి ఆత్మల అద్వైత భావ సిద్ధి
ధన్యులకు కాక పరుల కర్థమ్ము కాదు.
కాదనుచు చెప్పవమ్మ! ఓ గడ్డి పరక.
చూచారు కదా! ఎంతటి అద్భుతంగా ఎంతటి రసస్ఫోరకంగా సాగాయో పద్యాలు. వీరు తలపెట్టిన రామాయణ రచన నిరాఘాటంగా సాగాలని, ఆంధ్ర మాత కంఠ హారంగా ఆ రామాయణం రాణించాలనీ మనసారా కోరుకొందాము. ఈ కవివతంసకు అభినందనలు తెలియ చేస్తూ, వారు రచించబోవు రామాయణానికై ఎదురు చూస్తూ ఉందాము.
జైశ్రీరాం.
జైహింద్.

29, నవంబర్ 2011, మంగళవారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము10. షడ్గోపుర ద్వార బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
షడ్గోపుర ద్వార బంధంలోశ్రీ అలమేలు మంగమ్మను కొలిచిన విధము  చూడం డి.
చూచారుకదా!
ఇంతటి చక్కనిరచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం. 
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము9. ఖడ్గ బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
ఖడ్గ బంధంలోశ్రీ నాంచారమ్మా కాపాడుమా! అని ఎలా స్తుతి చేసారో చూడం డి.
చూచారుకదా!
ఇంతటి చక్కనిరచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.

28, నవంబర్ 2011, సోమవారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము8. శకట బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
శకట బంధంలోశ్రీ నాంచారమ్మా కాపాడుమా! అని ఎలా స్తుతి చేసారో చూడం డి. 
చూచారుకదా!
ఇంతటి చక్కనిరచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్ర కవితను వెలయించి తెలుగును ఒక వెలుగు వెలిగించండి.
జైశ్రీరాం.  
జైహింద్. 

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము7. శ్రీ బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
శ్రీ బంధంలోఅలమేల్మంగాస్తుతి ఎలా చేసారో చూడండి.
చూచారుకదా!
ఇంతటి చక్కనిరచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్రకవితను వెలయించి తెలుగును ఒక వెలు వెలిగించండి.
జైశ్రీరాం. 
జైహింద్. 

27, నవంబర్ 2011, ఆదివారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము6. చక్ర బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!  
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
చక్ర బంధంలో శ్రీరాముని ఎలా పిలిచారో చూడండి. 
చూచారుకదా!
ఇంతటి చక్కనిరచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్రకవితను వెలయించి తెలుగును ఒక వెలు వెలిగించండి.
జైశ్రీరాం. 
జైహింద్. 

26, నవంబర్ 2011, శనివారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము5. శంఖ బంధము.

1 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!  
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
శంఖ బంధ ఆట వెలదిలో శ్రీ వేంకటేశ్వరుని ఎంత చక్కగా స్తుతించారో మీరూ చూడండి. 
చూచారుకదా!
ఇంతటి చక్కనిరచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్రకవితను వెలయించి తెలుగును ఒక వెలు వెలిగించండి.
జైశ్రీరాం. 
జైహింద్. 

25, నవంబర్ 2011, శుక్రవారం

కార్తీక బహుళ అమావాస్య గీతా జయంతి సందర్భంగా పాఠక మహాశయులందరికీ శుభాకాంక్షలు.

4 comments

కార్తీక బహుళ అమావాస్య  గీతా జయంతి సందర్భంగా పాఠక మహాశయులందరికీ శుభాకాంక్షలు.
ఆ గీతాచార్యుల కృప మీకు అపారముగా ప్రాప్తించుగాక.
ఇదేమిటి ఈ రోజు గీతా జయంతి అంటున్నారు అని ఆశ్చర్యపోతున్నారా? మన సుప్రసిద్ధ సిద్ధాంతి శ్రీమాన్ గార్గేయ గారు సప్రమాణికంగా నిరూపిస్తూ ప్రకటించారు. మీరూ సప్రమాణికంగా దీనిని గూర్చి తెలుసుకొనే ప్రయత్నం చేయగలరు.
జై శ్రీమన్నారాయణ.
జైహింద్.

9, నవంబర్ 2011, బుధవారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము4. వీణా బంధము.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
వీణా పుస్తక ధారిణియైన అ శారదాంబను స్తుతించడం వీణా బంధంలో ఉత్పల మాలతో చేసారు.
మీరూ తిలకించండి.
చూచారుకదా!
ఇంతటి చక్కనిరచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్రకవితను వెలయించి తెలుగును ఒక వెలు వెలిగించండి.
జైశ్రీరాం. 
జైహింద్. 

8, నవంబర్ 2011, మంగళవారం

హైదరాబాదు విచ్చేసిన శ్రీమాన్ మానాప్రగడ శేషశాయి

1 comments

శ్రీ మంగళంపల్లిని పరికిస్తున్న శ్రీ మానప్రగడ శేషశాయి. 
శ్రీమద్రామాయణ కల్పవృక్షాన్ని ఆంధ్రామృతంగా ఆంధృలకందించిన మహాకవి శ్రీ విశ్వనాధ వారికి ప్రియ శిష్యులు, మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల (విశ్రాంత)అధ్యక్షులు, ప్రసన్న భాస్కరాది గ్రంథ కర్త, విజయ నగర నివాసి, సత్కవి హృదయ వాసి ఐన శ్రీమాన్ మానాప్రగడ శేషశాయి గురువరేణ్యులు మన భాగ్య నగరానికి  విచ్చేసారు.
Belsons Taj mahal. Secunderabad. 
Room No.112. లో బస చేసి యున్నారు.
వారి సెల్ నెంబరు 9160724305. 
ఆ జ్ఞాన వృద్ధుల, వయో వృద్ధుల దర్శన భాగ్యం అపురూపమైనది.
అవకాశమున్న సాహితీ ప్రియులకు వారి అపురూపమైన దర్శన భాగ్యం ఆ పరమాత్మ ఈ విధంగా కలిగిస్తున్నాఁడు.
ఔత్సాహికులు తప్పక కలవడానికి సదవ కాశమని ఈ విషయాన్ని మీ ముందుంచాను.
నిరవకాశులు సెల్ ద్వారా మాటాడడానికి వీలుగా వారి సెల్ నెంబరు కూడా మీ ముందుంచాను. 
జైశ్రీరాం.
జైహింద్.

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము3.

0 comments

ప్రియ ఆంధ్రామృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
కవి ఈ చిత్ర కవితలో బ్రహ్మను స్తుతిస్తూ వ్రాసిన పద్యమును చిత్రములో మనం చూడవచ్చు.
చూడండి.
రాజీవ దివ్య వదనా! వర వేద సారా!
రాకా చతుర్ముఖ! ప్రథమావతారా!
రాగాల శారదకు నాలుకలందు దేరా!
రాడ్ఢంస సుందర రథా! మమ్మేలుకోరా! 
చూచారుకదా!
ఇంతటి చక్కనిరచనా పాటవం కల కవిగారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరూ చిత్రకవితాసక్తిని పొంది ప్రయత్నించి చిత్రకవితను వెలయించి తెలుగును ఒక వెలు వెలిగించండి.
జైశ్రీరాం. 
జైహింద్. 

7, నవంబర్ 2011, సోమవారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము 2.

4 comments

ప్రియ ఆంధ్రాంమృతాభిమాన పాఠక మిత్రులారా!
డా. దేవగుప్తాపు సూర్య గణపతి రావు గారు వ్రాసిన చిత్ర కవితలు అర్థవంతంగా ఔచిత్యంతో ఒప్పారుతూ ఉంటాయి.
గజముఖుని స్తుతిని గజచిత్ర బంధంలో వ్రాయడంలో కవియొక్క ఉత్కృష్టత మనకు ద్యోతకమౌతోంది.
మీరూ గమనించండి ఈ క్రింది గజ బంధాన్ని.
చూచారు కదా! మీరూ వ్రాసే ప్రయత్నం ఎందుకు చేయకూడదు? ఆసక్తితో  తప్పక ప్రయత్నించి మీరు సఫలీకృతులవాలని ఆకాంక్షిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.

5, నవంబర్ 2011, శనివారం

డా.దేవగుప్తాపు చిత్ర కవితాభిరామము 1.

6 comments

సాహితీ ప్రియ మిత్రులారా!
డా. దేవ గుప్తాపు సూర్య  గణపతిరావు గారు చిత్ర కవితాభిరతులనే విషయం ఇదివరలో ఆంధ్రామృతం ప్రచురించిన ఈ కవిగారి నాగ బంధం చూచిన మీకు తెలిసిన విషయమే.
వృత్తి రీత్యా వీరు సుప్రసిద్ధ వైద్యులు.
ఐనప్పటికీ వీరి ప్రవృత్తి చిత్రకవితా రచన ద్వారా మన  తెలుగు భాషలో గల కవిత్వ మహనీయతను లోకానికి చాటడం.
ఈ మహా చిత్ర కవి రచించిన పద్మ వ్యూహం అనే దశావతార బంధ ప్రబంధమున గల వినాయక స్తుతి ఓంకార బంధమును గమనించండి.
ఇటువంటివి వీరు రచించినవి సుమారు 73 ఉన్నవి.
మనము కూడా ప్రయత్నిస్తే ఇటువంటి పద్యములను తప్పక అద్భుతంగా వ్రాయకలము. మీరూ ప్రయత్నించండి. చిత్ర కవితాభివృద్ధిరస్తు అని ఆ శారదాంబ శుభాశీస్సులు మనకు లహించును గాక.
జైశ్రీరాం.
జైహింద్.

2, నవంబర్ 2011, బుధవారం

రవి కాననిచో కవి గాంచునే కదా! ఈ సమస్యను ఐచ్ఛిక ఛందస్సులో పూరించండి

17 comments

ఆంధ్రామృత పాన లోలులారా! మీ సాహితీ ప్రియత్వాన్ని అభినందిస్తున్నాను. మీ పద్యరచనాసక్తి నాకు చాలా ఆనందం కలిగిస్తోంది.
ఈ క్రింది సమస్యను శ్రీ నేమాని వారు సూచించారు.
ఈ సమస్యను పూరించి వారి సూచనపై మనకు గల సదాసక్తిని కనబరుద్దాము.
వారిచ్చిన సమస్యను చూడండి. 
రవి కాననిచో కవి గాంచునే కదా! 
ఈ సమస్యను ఐచ్ఛిక ఛందస్సులో పూరించనగును
జైశ్రీరాం.
జైహింద్.