గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, జూన్ 2026, మంగళవారం

అణిమా ఛందము, 2.వ,భాగము, రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి, జుత్తాడ,

0 comments

జైశ్రీరామ్.

అణిమా ఛందము,

  2.వ,భాగము,

 రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,       జుత్తాడ,

                   అతి శక్వరి ఛందము,15.

            (వెలసిన వృత్తములు,32.768.).

                 ప్రాస నియమము కలదు, 


           1.శ్రీవత్స వృత్తము.

            శ్రీ పద్మ నాభ!జనార్థన!స్థిత ప్రజ్ఞ!చక్రీ!

           ఆపన్నివారక!శ్రీవర హర బంధు సింథూ!

           తాపార్తి హారక! జన్మ. దురి తాప హారాష       

          శ్రీ పర్వ మేర్చెడి దేవ!శృతి నెంచి గొల్తున్!


శ్రీవత్స వృత్తము,త,భ,భ,స,య,గణములుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-6069.


2.మణిగణ వృత్తము,


            పరము నెదుట నిలిచి ప్రార్థించు భక్తులున్!

           వరలు నిలను గురు తపంబంచు నిష్టతన్!

           పరమ వరదయు గన!ప్…

[10:15 am, 5/6/2026] Appala narasimhamurthy Vallabhavajhala: 51.భీమార్తి వృత్తము,


            వియతే!మేఘాలన్వడిన్ !విద్యుద్ఘాత!భీషార్తిన్!

            దయనీయంబగు న్గనన్!తత్వంబేర్చు?నీతెంచన్!

            స యశా వర్ఛసే?స్తుతౌ?సర్వార్థాల శ్రేయంబౌ!

           నియతం బేర్పడ న్జనన్!నిస్వార్థంబు!కీర్తెంచున్!


భీమార్తి వృత్తము,య,ర,య,త,మ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-2132.


52.ఊహాగాన వృత్తము,


              యూహామయ లోకంబిది!యోడు న్తుది కెంచగన్!

              బాహాటపు సత్యం బది! భద్రంబిడు!భావికిన్!

              సాహాయము దీనాళికి!శర్వంబదె?జీవికిన్!

             ద్రోహంబది!దోషం బిడు!తూలం దగదే?భువిన్!


ఊహాగాన వృత్తము,త,య,స,భ,ర,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృసం:-11469.


53,మను తీరు వృత్తము,


         1.    దన్ను బాధ వెన్ను విర్గు!తప్పు సేయ!శిక్షయౌ!

                మన్న లేక తూలి తూలి!మంట నంటె!దేలనో?

                తిన్న తిండి చాల దంచు!తిందు వేల?నన్యముల్!

                పొన్ను గాదు!మట్టి కుండ!పోవ నెంచ బోకుమా


      2.   తారకంపు కీర్తికిన్!తరించి రెల్ల మౌనులే!

            వారి నీయు మేఘముల్!పరార్ధ మెంచి వర్షిలున్!

           కోరకున్న పండ్లిడున్?కుంబు లెల్ల భూమినిన్!

          మేర మీరి నీతినిన్!మిఠాయి పంచు లోకమున్!

      

                    (యతి,8.వ,యక్షరము).


మనుతీరు వృత్తము,ర,జ,ర,జ,ర, గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-10923.


54.ధర్మం చర వృత్తము,


             చర్విత చర్వణ జీవమ్!సర్వేశా!సదా శివా!

             పర్వము గాదిది చూడన్పర్మాత్మా!భజామ్యహమ్!

            కుర్వతి ధర్మమ్!నిత్యమ్!గుర్వంబౌ!నదే!భువిన్!

           సర్వద!మోక్షం గోరన్!సాక్షాత్కారమౌ!పరమ్!


ధర్మం చర వృత్తము,భ,భ,మ,త,ర,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-10295.


55.ఫలమిడు వృత్తము,


             రాగల నాపద నెంచే?రసజ్ఞత లేదీ భువిన్!

            భోగిలు నాశ తలంపే!పురోగమం బేర్చగా!

           త్యాగులు పుట్టిన భూమిన్!తరాల తంత్రంబిదా!

           యోగ తపఃఫలాపేక్షే?యొరంగె నిట్లందువే?


ఫలమిడు వృత్తము,భ,భ,త,ర,ర,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-9537.


56.పరాధీన వృత్తము,


            పరాధీన జీవితమ్!బ్రతుకు బండ లేర్చులే?

           నిరాధార నమ్మకమ్!నివురు గప్పు ద్రోహమే?

           బరోసాలు గోరుచో?భ్రమయె సుమ్మి జీవితమ్!

           తరింపేది?మాయకున్?దరియ రాని నీతదే?


పరాధీన వృత్తము,య,జ,భ,జ,ర,గణములుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం:-11178.


57..గురుతెంచు వృత్తము,


              కరణమె!కారణం!క్రమ నీతి చరంబుకున్!

              చరిత మనోజ్ఞతన్!సమతెంచగ!ధాత్రినిన్!

              కురు నుపకారమున్?గురుతెంచు!కీర్తినిన్!

             పరమత సామ్యతన్!వరలంగ!శ్రీయమౌ!


గురు తెంచు వృత్తము,న,జ,భ,ర,ర,గణములుండును,

యతి,,8.వ,యక్షరము,వృ,సం:-9648.  


58..జననిచింత వృత్తము,,


              నీతి లేని బ్రతుకే?నివురు గప్పు నిప్పునౌ!

              పాత రేర్చు!భవితన్!పరువు తీయు!ధాత్రిన్!

             ఘాతుకాల నెలవై!కనిన వారు చూడగన్!

             జాతి నీతి చెరుపన్!జనని చింతిలు న్గదే  !


జనని చింత వృత్తము,ర,న,భ,జ,ర,గణములుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం:-11195.


59..  బలమెయి వృత్తము,


                చిన్న చేప రోదనల్!చెల్లనౌనె?గండు మీలన్!

               కన్ను దోషమొందెనో?కల్కి దోష చింతనంబో?

              తన్ను కొందు రేలనో?దన్ను బట్టి!పేరు నొందన్!

              మన్ను నంటునాశయే?మాయరోగమాయె!జీవా!


బలమెయి వృత్తము,ర,జ,త,ర,య,గణములుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం:-5419.


60..నిబ్బర వృత్తము,


             దెబ్బ తింటి వేమి?నీతినిన్!తెల్వి పెంచి జనన్

            అబ్బురంబు గాదు నెయ్యుడా!ఆశమీర చెడౌ!

           ఉబ్బ కయ్య మాయ మాటలన్!ఒబ్బి డెంచుమిలన్

          నిబ్బరించు లోక మెల్లయున్!నేర్పె!ఖ్యాతి పెంచునయా!


నిబ్బర వృత్తము,ర,జ,ర,ర.స,గణములుండును,

యతి.10.వ యక్షరము,వృ,సం:-13483.


61.వీడని చీడ వృత్తము,


            బానిసత్వ మొదలినా!పాత రోత వీడదే?

           కాని పోని హొయలుతో?కర్మ కాండ మాసెనే?

           మానవత్వ నియమమే?మట్టిపాలు జేసిరే?

           దాన ధర్మ,సమతలే?దారి తప్పె లోకమున్?


వీడని చీడ వృత్తము,ర,న,య,జ,ర,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-5925.


62.విద్య నేర్వు వృత్తము,


      1.        అక్షరాలు తక్కువైన!హంగామా!పెచ్చాయెనే!

                 పక్షపాత మేల?తెల్గు వారింప!దైవమా!

                 తక్షణంబు తెల్గు నేర్పి!దివ్యతేర్చి దీర్చుమా!

                 కక్ష తప్పు!శిక్ష కల్గు!కావ్య ఖ్యాతి మాపుచో?


     2.    పట్టు పట్టి బాలకా!ప్రమాదంబెంచి సాగుమా!

              గట్టి పట్టు జ్ఞానమున్!గరీయుండౌదు!సర్వదా!

             వట్టి మాటలాడకన్!వరంబౌ!విద్య నేర్చుమా!

             చట్ట బద్ధ తెల్వితో?జగంబెల్లం!చరించుమా!

                          [అష్టమాక్షర యతి].



విద్య  నేర్వు వృత్తము,ర,జ,ర,త,ర,గణములుండును,

 1.వ,వృత్తము,   యతి,9.వ యక్షరము,వృ,సం:-10411.


63.భవిష్య వాణి వృత్తము,


            అనకొండ లండలై!యవని కీర్తి ఘటింపన్?

           వినువీధి రిక్కలే?వికటి తంబులు చూడన్?

           కనుచుండె?దైవమే?కలికి  తీరిది యేమో?

          మనుజాళి చర్యలే?మరణ కారక మంచున్?


భవిష్య వాణి వృత్తము,స,జ,భ,జ,య,గణము లుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం:-6984.


64.వరజీవ వృత్తము,


             భవానీ వల్లభా!భవబంధ మోచనా!శివా!

             శివానీ!శంకరా!వరజీవ మోక్షదా!భవా!

             దినేశా!జీవదా!గురుదేవ!భూతిదా!హరా!

            శివాంశే ర్పాటునన్!భువి జీవ రక్ష సేయవా?


వరజీవ వృత్తము,మ,ర,స,జ,ర,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-10961.


65.శివమేర్చు వృత్తము,


             తర తరాల దాస్యం!తప్పించి తీవ!భారతిన్!

            వరదమంబు గూర్పన్!పర్మంబు గూర్చి బ్రోవుమా!

            నిరతమీవ!నీతిన్?నిండార!చూడు లోకమున్!

           వెరగు లేదు!సర్వమ్!విశ్వేశ మేర్చు జీవులన్!


శివమేర్చు వృత్తము,న,ర,మ,జ,ర,గణములుండును,

యతి.8.వ,యక్షరము,వృ,సం:-10766.


66.కాశివాస వృత్తము,


             వరాశి క్షేత్ర కాశి నివాసి!జీవ మోక్షధీ!

             ధరాతలంపు!క్షేమ వధాన్యధన్య శోభినీ!

           సురా సురేద్ర పావని!సుభూతి రామణీ!

           కరాళ మృత్యు కంటకి!కామితార్థ దాయినీ!


కాశి వాస వృత్తము,జ,ర,స,జ,ర,గణములుండును,

యతి,9.వ యక్షరము,వృ,సం;-10966.


67.ధీరజ వృత్తము,


           గరీయసీ!వరీయసీ!క్రమోప శాంతి గూర్చన్!

          తరాల కీర్తి!ధీరజీ! తమోప హారి శర్వున్!

          సరాగ రంజి తాగ్రణీ!సదాశివార్తి గొల్వన్!

         నిరాశ వీడి శాంతిలున్!నిరంత సేవ శొభన్!


ధీరజ వృత్తము,జ,ర,జ,ర,య,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-5464.


68.పరమెంచు వృత్తము,


            కేలెరిగి వాత బెట్ట!కీడు పోయి!శాంతిలున్!

           వాలెరిగి నీరు పంప!వాట మొప్పనింపునౌ!

           చాలనెడు తృప్తి లేక!చాల కోర!ముప్పునౌ!

          మేలు పధ మెంచకున్న?ముక్తి లేదు?మానవా!


పరమెంచు వృత్తము,భ,జ,ర,జ,ర,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-5927.


69.చారు శీల వృత్తము,


         చోర తీరు దోష మేర్చు!జుఱ్ఱు సర్వ శ్రేయంబున్!

         పార మార్ధ చింత మారు!పట్టు నీచ సంస్కారమ్!

         కోర రాని కోర్కెమాని!కోర మంచి మేలేనౌ!

         చారు శీల మెంచు మోయి!జైత్ర యాత్ర నీదేయౌ!


చారు శీల వృత్తము,భ,జ,ర,జ,మ గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-2695.


70..గులామౌ వృత్తము,


           చరాశ పాశ బద్ధమౌ!చరింపు తప్పు గూర్చున్!

           స్థిరంపు జీవయాత్రకై!జీవించి పెంచు నీతిన్!

          తరింపు లేని జీవుడా!తలంచ వేమి?దైవమ్!

          కురూపి గాకు?చైదతన్!గులాము వౌదు!నెంచన్!

              (   గులము వౌదు=దాసీ వైదవు.)


గులామౌ వృత్తము,జ,ర,జ,ర,మ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-5462


71.అమేయ వృత్తము,

 

              నీదేదీ!నీది కాదు!నీతి భూతిద మేనయా!

             సాధ్యంబే!నిత్యమంచు!సావధాన మదెంచుమా!

             బోధ్యంబౌ!తత్వ జ్ఞానపూర్ణ మంది!మెలుంగుమా!

            విద్యార్ధీ!మేథ పెంచువిద్య!నేర్వు!వినోదివై!


అమేయ వృత్తము,మ,ర,జ,భ,ర,గణములుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం:-11601.


72.సత్యం!నిత్యమ్ వృత్తము,


              నిర్భేద సాదృశ్యమాయాన్విత దూరమే!సత్యమ్!

              స్వర్భాను తేజోవిరాజీ!వర దీప్తియే?జ్ఞానమ్!

             దుర్భేద్య చైతన్య!మరందమ!బిందు సాదృశ్యమ్!

             స్వర్భావ మేథాశ్రి మేథ్యమ్!జనమాశ్రితమ్!సత్యమ్!


సత్యం నిత్యమ్.వృత్తము,త,త,త,జ,మ,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-2853.


73.భూతాశ్రి వృత్తము,


            భూతాశ్రిత మాకర్ష ప్రబోధాశ్రిత మోఘమై!

           వాతా!తప! వైదుష్యతభ్రామాయత!మాశ్రియై!

           నీతిర్నియ మానందత!నేతార మమోఘమై!

           జాతిర్నవతా మోదక!సద్భావక!మోదమౌ!


భూతాశ్రి వృత్తము,త,య,స,భ,ర,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-12493.


74.భావి సౌఖ్య ,వృత్తము,


             శతక నీతి జీవితమ్!చక్క దిద్దు బాలకా!

             మెతగ గాకు!వర్తనన్!మేలు మార్గ మేగుమా!

             గతుకు లెంచి తెల్విగా!కర్మ మెంచి సాగుమా!

             బ్రతుకు బాట దిద్దుకో?భావి సౌఖ్య మీదయా!


భావి సొఖ్య వృత్తము,న,ర,య,జ,ర,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-10840.


75.భద్ర శోభ వృత్తము,


         1.     చదువు నందు శ్రద్ధ!చాక చక్య మేర్చు నయ్యా!

                  మదిని మెచ్చు మంచి!మాన్యమౌను!జీవితానన్!

                 సుధలు జిమ్ము!భద్ర శోభ!శోభి తంబు!నౌచున్!

                 కదులు నీతి పెంచి! నిల్చు!ఖ్యాతి! ధాత్రి యందున్!


                   యతిర్నవ భద్రశోభ

                    ××××××××××××


        2.  బరవు మోయు వేసడమ్!బ్రతుకు గాకు జీవుడా!

             తరము మంచి నీతినిన్?తనువు నీడ్చు!మంచికిన్!

             వెరవ బోకు నాపదల్!వరలు చుండు!ధాత్రినిన్!

             పరుల హాని గోరకన్!బ్రతుకు లోక మంచికిన్!


భద్ర శోభ వృత్తము,న,ర,జ,ర,య,,గణములుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-5976.


76..గాలివాట వృత్తము,


              గాలి వాట దీపమై!కదులాడును జీవితమ్!

             నీలీమేఘమార్భటిన్!నిలుపోపని తీరునై!

             తేలునో?మున్గునో?తెలియంగని సాగరమ్!

             జాల లీల వాటతన్! చలితంబగు మిథ్యయే!


గాలి వాట వృత్తము,ర,జ,భ.భ,ర,గణములుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం:-11691.


77.సమ న్యాయ వృత్తము,


            ఒకరి మేలొకరి కీడు!ఉంది సత్య మందున్!

           సకల మేలొనర జేయ!జాలనౌనె?భూమిన్!

          వికట సంకట మదేల?వీడు తప్పు మాటల్!

         బకరులైరొకొ?జనంబు!పాప చైద్య మేలన్?


సమ న్యాయ వృత్తము,న,భ,జ,ర,య,గణములుండును,

యతి,10.వ,యకషరము,వృ,సం:-6096.


78.జగద్రోహ వృత్తము,


            తెగల యందు ద్వేషమ్!తీరని ద్రోహమౌ!జాతిన్!

           పగకు తావు గూర్చున్!పాడగు సర్వ సామ్యమ్!

          జగతి సామ్య వాదమ్!చక్రి వశంబె?కూర్చన్!

          బిగువు లేని మాటే?బీదకు హత్తు నెంతో?


జగద్రోహ వృత్తము,న,ర,త,జ,మ,గణములుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం;-2840.


79.ప్రాణభీతి వృత్తము,


             నీతి మాలిన నేతృత్వమ్!నెట్టు దేశ!సౌభాగ్యమ్!

            జాతి బిచ్చపు జీవంబుల్!సర్వ శ్రేయ హేయంబౌ!

           పాతకాళి విషాధంబుల్ !ప్రాణ భీతి పాత్రంబౌ!

           నాతి భూరమ!రోధిల్లున్!నాశమౌను!సర్వంబున్!


ప్రాణ భీతి వృత్తము,ర,స,మ,జ,య,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-2586.


80.గుప్త స్వార్థ వృత్తము,


            పరంబోర్చని పాడు!భంగ మేర్చు! భావి తీరున్!

            తరింపంచును బల్క!దాగె స్వార్థ మందు!నెంతో?

            పరార్థంబును కోరు!వారిమాట తేనెలూరున్!

            కరాటీ లిక నేల?కల్మషాన తేలి యాడన్!


గుప్త స్వార్థ వృత్తము,య,స,జ,ర,య,గణములుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం:-5466.


 81.స్వానుకూల వృత్తము,


            స్వాను కూల!సామ్యంబు!సర్వ శ్రేయ మిక్కలాయెన్?

            తాను కొన్న ధర్మంబె!ధన్య తేర్చి! తా బ్రోవంగన్!

            కాన రాని చింతేల?కర్మ ధాత్రి!మర్మం బెంచన్?

           మాన నీయ కీర్తంత!మాదు పక్షమై యుండంగన్?


స్వానుకూల వృత్తము,ర,య,జ,రయ,గణములుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం;-5451.


82.కాని పని వృత్తము,


           పనికి మాలిన పని!ప్రాణాంతకం బేర్చుచో?

          జన వినోదమొకొ?సత్యంబు!కాచున్సదా!

         వెనుక ముందును గని!పెచ్చేవ?చిచ్చే సుమా!

        మనుజ జాతి మనది!మంచెంచి!జీవించుమా!


కాని పని వృత్తము,న,భ,స,ర,ర,గణము లుండును,

యతి9.వ,యక్షరము,వృ,సం:-9468.


83.చంచల వృత్తము,


           చంచల సిరి ఛాన!చంచల్య! తత్వంబే?గనున్!

           వంచిత జనులౌచొ?వాత్సల్యమంతంబేర్చులే!

           కుంచిత గుణమేల?కూర్మెంచ!శ్రేయంబే?యగున్!

           సంచిత గుణ ధీర!సర్వత్ర !దైవంబీవె  లే!


చంచలత్వ వృత్తము,భ,స,య,య,ర,గణములుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం:-8797.


84.మంచి నెంచు వృత్తము,


                తన పెంపు పర పెంపె?ధన దాహ తృష్ణయౌ!

                ఘన కీర్తి ఘటియింప!కలి గూర్చ!మానుమా!

               మనసార సమతెంచి!మను ధాత్రి!రామతన్!

              చను జీవి!భువి వీడి! చరి తెంచు?నీతినిన్!


మంచి నెంచు, వృత్తము,స,న,భ,జ,ర,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-11196.


85.హిత మెంచు వృత్తము,


              కుతలంబే?సుతలంబౌ!కూర్మి సర్వశ్రేయమౌ!

             మితిమీరే?తలపెంచన్!మేటి కీర్తి!నాశమౌ!

             అతి సర్వమ్?గతి మాపున్!ఆర్త నాధ మేలయా?

             హిత మెంచే?నుతి మార్గమ్!హేమ పూర్ణ జాతికిన్!


హిత మెంచు వృత్తము,స,భ,మ,జ,ర,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-10804.


86.దురితాపహ వృత్తము,


              గురుతర దురితమ్!కువలయ!క్షేయ మేర్చున్!

             వరదము లవియున్! వడిజన!హేయ మోపున్!

             సరసిజ నయనున్!సతతము నెంచ!మేలౌ!

            కరమరుదు నవన్!కనుమిల శాంతి!నెల్లన్!


 దురితాపహ వృత్తము,న,న,భ,స,య,గణము లుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం;-6144.


87.నితి నడు వృత్తము,


           చదిర గుణము సదా!చారు శీల మందునా?

          బుధుల పలుకు లవే?భూమి నెంచు శీలమున్!

          వెదుకు!నిజము!సదా!వేది వౌదు!నీమతన్!

          విధుల క్రమత జనన్?బీరువోని?శాంతిడున్!


నీతి నడు,వృత్తము,న,న,య,జ,ర,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-10880..


88.సత్యం!శివమ్!వృత్తము,


              పరుల కష్ట మిష్టమా?పాప హేతు భూతమౌ!

              సరస నిల్చు!మిత్రులన్!సాకు నీతి చేతనన్!

             పరువు నిల్చు జాతినిన్!పాత రోత!వీడుచున్!

            కరము మెచ్చు ధర్మమున్!కాచు సత్య మెన్నడున్!


సత్యం శివమ్ వృత్తము,న,ర,య,జ,ర,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-10840.


89.ఆశా కోశ వృత్తము,


              ఆశ పాశ కోశమే?యనంతమ్!దిగంతం బదే?

             పాశమై!తులం జనున్!ప్రతాపంబునీర్ష్యెంచుచున్!

            దేశ ఖ్యాతి సర్వమున్!తిరంబార్పు!భాగ్యంబులన్

            కేశపాశ మూడగా!కనున్!శూన్య!తేజంబిటన్!


ఆశా కోశ వృత్తము,ర,జ,ర,ర,ర,గణము లుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం:-9387.


90.ప్రగతి తీరు,వృత్తము,


            ప్రగతి బాగు కోరు!వరలు భావి సౌఖ్యమున్!

           పగకు తావు నీకు!పడును స్వేచ్ఛ తుచ్ఛమై!

          బుగలు రేప జాతి!వగచు బీద చింతనన్!

          నెగువ వాడు జూచు!యిడుములొప్పు జాతినిన్!


ప్రగతి తీరు వృత్తము,న,ర,న,జ,ర,గణము లుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం:-11224.


91.నిండు ధర్మ వృత్తము,


              అన్య ద్రోహ చింత మాను!యదియె?దైవ తుల్యమ్!

             మాన్యమైన జీవితంబు!మంచి యదేను భూమిన్!

             ధన్య జీవి వై!జనంగ!తరము మెచ్చు నిన్నున్!

             ధాన్య పూర్ణ లోకమౌచు!ధర్మమునిండు!భూమిన్!


నిండు ధర్మ వృత్తము,ర,జ,భ,స,య,గణము లుండును,

యతి,9.వశయక్షరము,వృ,సం:-6059.


92.స్వార్థ మనర్థ వృత్తము,


             చావు పుట్టుక లొక్కటే?స్వార్థ మేల?మానవా!

             నీవు నిల్చెడు!కాలమే?నిక్కమౌనె?రేపటన్!

            దేవు రింపది!యేలయా?తీరు నెంచు!జీవితమ్!

           కాన రాదిల నీదరిన్?కల్మషాత్మ వీడుమా!


స్వార్థ మనర్ధ వృత్తము,ర,స,య,జ,ర,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-10843.


93.విష తత్వ వృత్తము,


           తోక తొక్కిన లేతువే?తూలు నాగము నౌచున్!

           పీక మొయ్య విషంబునన్!భీతి నోపుదు వేలన్?

          కాకి వౌచును జీవిలన్!కాలమే సరి జేయున్!

          చీక మాంసము జీవముల్!చెందెదే!నరకార్తిన్?


విష తత్వ వృత్తము,ర,స,య,జ,య,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-6747.


94.దూర దృష్టి వృత్తము,


             నీతి నిల్చు!నిల్కడన్?నేతి బీర నేయి గాదే?

             పాతి పెట్టు పాపమున్!భావి జీవ!జాగృతెంచున్?

            రోత మాని జాతినిన్?రూపు దిద్ది!తీర్చు మయ్యా!

           తోపు గావు నీవిలన్?దూర ధృష్టి!నెంచు మేలున్!


దూర ధృష్టి వృత్తము,ర,జ,త,ర,య,గణము లుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం;-5429.


95.పేరిలు వృత్తము,


              పేరు పొందే?టప్పు!ముప్పౌ!పిండి సేయు జీవముల్!

             చేరికో నౌనెంచ?నీతిన్!జీవ ఖ్యాతి! జూడుమా!

             కామ మబ్బు ల్కమ్మె!ఖ్యాతిన్!గాంచ నౌనె?భాగ్యముల్!

             తీరు మార్పే?మేలు గూర్చున్!తెల్వి పెంచు!జాతినిన్!


పేరిలు వృత్తము,ర,త,మ,జ,ర,గణము లుండునుశ

యతిశ9.వ,యక్షరము,వృ,సం:-10787.


96.ఆత్మ క్షోభ వృత్తము,


              అమ్మ నెంచ నవివేకే?ఆత్మ క్షోభేర్చు లోకమ్!

              దమ్ము యుందనుచు!నెంచన్!ధర్మమున్!జేర నౌనే?

              వమ్ము మాటలకు లోనై!పారమార్థంబు నెట్టున్!

             చిమ్మ చీకటి!వరాశన్!జీరు దుర్మార్గంబు!సర్వమ్!


ఆత్మ క్షోభ వృత్తము,ర,స,మ,య,య,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-4635.


97.చూడవేమి? వృత్తము,


               బలము సంఖ్యే?పాలింపన్!బలహీన ద్రోహమౌ!

               తలప ముర్ఖం బేపారున్?తల  దన్ను!నీతినిన్!

              చెలిమి మాటే?మృగ్యంబౌ!చిరు జీవ హానియౌ!

              కలయె?సర్వార్ధం బెంచన్!గనవేమి?మాతరో!


చూడవేమి?వృత్తము,న,మ,త,జ,ర,గణము లుండును,

యతి,యతి,9.వ,యక్షరము,వృ,సం:-11016.


98.సర్వశూన్య వృత్తము,


                హీన గుణు డొకనిచే!హేయమౌ?జాతదెల్లన్!

               ధీన జనితుడు!భువిన్?దిట్టయా?యోచిలంగన్!

              జ్ఞాన రహితు డసలే?సర్వ శూన్యంబు సేయున్!

              కాన గలమె?సుజనున్!కర్మ భూమిం జనాళిన్!


సర్వ శూన్య వృత్తము,భ,న,య,య,య,గణము లుండును,

యతి.9.వ,యక్షరము,వృ,సం:-4935.


99.పంతెంచు, వృత్తము,


                 స్వంత సొమ్ము జార నీక!సర్వము తామందురే?

                 కొంతయైన!సిగ్గు లేక?కూర్మి గనన్?న్యాయమా!

                 అంత విఱ్ఱ వీగ మాని!ఆర్యత !జూపించరే?

                 పంతు గూర్ప!సాగు నీతి!భాగ్యము! జేకూర్చగన్!


పంతెంచు వృత్తము,ర,జ,ర,స,ర,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-10155.


100.చింత పొంతన వృత్తము,


                గొడ్డు గోత పడినచో?కోరి రాలు వేతురే?

               అడ్డు దిడ్డ తలపదే?హాని గూర్చు లోకమున్!

               మెడ్డ లేవు!దురితమున్!మేలు గాదు!జీవికిన్!

              చెడ్డ గూర్చు బ్రతు కదే?చింత గూర్చు!సర్వదా!


చింత పొంతన వృత్తము,ర,న,య,జ,ర,గణము లుండును,

యతి,9.వ యక్షరము,వృ,సం:-10875.


101.సరళ జీవ వృత్తము,


              పరుల మంచి నెంచుచో?భగవంతుని రక్షౌ!

             నరుల మయ్య!నర్మ మదే?నరకంబు గదెంచన్!

            సరళ మెంచి మించుమా!జగదాభిద మౌలే!

            తర తరాల కీర్తి నిలన్?తలపోయుమి!నీతిన్!


సరళ జీవ వృత్తము,న,ర,జ,జ,య,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-7000.


102.సుఖ జీవన వృత్తము,


              హద్దు మీరి యాట లందు!యాడు టెల్ల!తప్పేనౌ!

             శుద్ధ మైన తెలి వెంచి!శుంఠ!లంట బోకోయీ!

             పద్ధ తెంచి!బ్రతుకంగ!భావి సొఖ్య మీదే లే!

            వద్దు చెడ్డ చెలి మెంచ!పాడు నౌను భావెల్లన్!


సుఖ జీవ వృత్తము,స,జ,ర,ర,స,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-13483.



అతి శక్వరీ ఛందమునందు,కొన్ని వృత్తములు

మాత్రమే!గైకొన బడినవి,

జైహింద్.