జైశ్రీరామ్.
53. ఓం కవిమాధవాయ నమః.
షట్పద ద్వయ గర్భ సీసము.
నరహరీ! నీ కృపన్ వరలించు, ధరణిని - నిరుపమానముగనో నీరజాక్ష!
పరిహాసమును మాని కరుణించు నను నీవు - నిరపాయ సదుపాయ నిపుణుఁ జేయ.
నరసింహ పరమాత్మ! మురియంగ నినుఁ జూచి, - దరహాస చంద్రికన్ దక్కనిమ్ము.
చిరకీర్తిని రచింప పరివర్తన రచించు - శ్రీ రమా వల్లభా చిత్ప్రభాస!
గీ. ఘన సు*కవిమాధవా*! ననుఁ గనుమ. నాదు - కవితలందున వెలుగుమ, కవనమగుచు.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
53వ సీస గర్భస్థ షట్పద ద్వయము. (1వ పాదమునందు 2ఇంద్ర గణములు, 2వ పాదమునందు 2ఇంద్ర గణములు, 3వ
పాదమునందు 2ఇంద్ర 1చంద్ర గణములు, 4వ పాదమునందు 2ఇంద్ర గణములు, 5వ పాదమునందు 2ఇంద్ర గణములు,
6వ పాదమునందు 2ఇంద్ర 1చంద్ర గణములుండును. యతి 3వ పాదమునందు 3వ గణము1వఅక్షరము. 6వ
పాదమునందు 3వ గణము యొక్క 1వ అక్షరము) {చంద్రగణములు.రగ/నగగ/తగ/సలగ/భగ/
నలగ/మల/సగల/రల/నగల/తల/సలల/భల/నలల}
1.నరహరీ! నీ కృపన్
వరలించు ధరణిని
నిరుపమానముగనో నీరజాక్ష!
పరిహాసమును మాని
కరుణించు నను నీవు
నిరపాయ సదుపాయ నిపుణుఁ జేయ.
2.నరసింహ పరమాత్మ!
మురియంగ నినుఁ జూచి,
దరహాస చంద్రికన్ దక్కనిమ్ము.
చిరకీర్తిని రచింప
పరివర్తన రచించు
శ్రీ రమా వల్లభా చిత్ప్రభాస!
భావము. భక్తులను పోషించువాఁడా!
భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత
జనమున ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ పద్మనేత్రుఁడా! నీ కృపతో ఈ భూమిని సాటి
లేని విధముగా వరలించుము. నీవు పరిహాసము మాని నన్ను నిరపాయ సదుపాయ నిపుణునిగా చేయుటకు నన్ను
కరుణించుము. ఓ నరహరీ! శాశ్వత కీర్తి కలిగించుటకై మంచి మార్పును మాలో కొలిపెడి ఓ రమా వల్లభా! ఓ చిత్రప్రభాస!
నిన్ను చూచి మేము ఒప్పొంగిపోవునట్లుగా నీ దరహాసచంద్రికలు మాకు దక్కునట్లు చేయుము. ఓ సుకవిమాధవా! నా
కవితలందు వెలుగువై నన్ను కరుణించుము.!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.