గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

మిన్నున్ గాంచిన నీవె నిండితి.... శ్రీమన్నారాయణ శతకము .10వ పద్యము. రచన చింతా రామ కృష్ణారావు. గానం శ్రీమతి దోర్బల బాల సుజాత

జైశ్రీరామ్.

 10. శా. మిన్నున్ గాంచిన నీవె నిండితివటన్ మిధ్యా స్వరూపుండవై!

మన్నున్ గాంచిననుంటివీవె యచటన్  మాదేవరా! యెట్లు నీ

వున్నావన్నిట నెల్ల వేళలను ? నేనున్నా నిటన్, జూడు.  శ్రీ

మన్నారాయణ! నీదు పాదములె సమ్మాన్యుండ! నన్ జూడనీ.

భావము.

శ్రీమన్నారాయణా! జగత్కారకుడవైన శ్రీకృష్ణా! ఆకాశమును చూచినచో 

అక్కడమిధ్యాస్వరూపుఁడవై నీవే  నిండియున్నావు. భూమిని చూచినను 

అక్కడ కూడా నీవే నిండియున్నావు. మా దైవమా! అన్ని సమయములందును 

అన్ని ప్రదేశములయందునుఏ విధముగా నీవుంటివి?ఇక్కడ నేనుంటిని

నన్ను చూడుమునీ పాదద్వయమును నా మనమున గౌరవముతో గాంచునట్లు

చేయుము.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.