గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, నవంబర్ 2016, బుధవారం

డా. మాడుగుల అనిల్ కుమార్ కృతులపై ప్రశంసాపత్రము. బ్రహ్మానంద.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్

29, నవంబర్ 2016, మంగళవారం

మాతృ భూమి స్తుతిః .. . . .డా. మాడుగుల అనిల్ కుమార్.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

28, నవంబర్ 2016, సోమవారం

చతుష్షష్టి కళలు.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్

27, నవంబర్ 2016, ఆదివారం

ధాతా పురస్తాద్యముదాజహార. మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
మంత్రం.17. ధాతా పురస్తాద్యముదాజహార. శక్రః ప్రవిద్వా న్ప్రదిశస్చతస్రః.
తమేవం విద్వానమృత ఇహ భవతి. నాన్యః పంధా అయనాయ విద్యతే.
వ్యాఖ్యానము:-
సృష్టి ప్రారంభమును కల్పాది (కల్పముయొక్క మొదలు) నుండి, పరమాత్ముని
వలన సృష్టి కొరకు, పరమాత్ముడు ప్రారంభించిన ఈ మహాయజ్ఞమునందు
ప్రభవించిన బ్రహ్మేందాది దేవతలు సమస్తము అవలోకించినారు.
'' బ్రహ్మవిద్ బ్రహ్మ భవతి''
ఆ బ్రహ్మ, ఇంద్రాదులు, పరబ్రహ్మను తెలుసుకొన్నవారైనారు.
సమస్తమునకు, ఆధార భూతుడైన పరమేశ్వరుని, తెలుసుకొనుటకువేరొకమార్గ
ములేదు.
పరమేశ్వరుని త్యాగమువలన, ఫ్రభవించిన ఈ ప్రపంచ నిర్మాణ మహాయజ్ఞమును
తెలుసుకొను విద్వాంసుడు, ఇక్కడే ఈ జన్మలోనే ముక్తుడవుతాడు.
మోక్షమునకు వేరే మార్గమేదియు లేదు.
మంత్రం 18. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః. తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ .
తే హ నాకం మహిమానః సచంతే . యత్ర పూర్వే సాధ్యాః సంతి తేవాః .
బ్రహ్మాది దేవతలు ఈ యజ్ఞమును తెలుసుకున్నవారై , ఆదే యజ్ఞము ద్వారా
భగవంతుని ఆరాధించారు.
ఆ యజ్ఞమునుండి,సమస్త ధర్మములు ఉత్పన్నమైనవి. అనగా ఆచరించ తగినవి
ఏర్పడినవి. కర్తవ్యములు అవగతమైనవి.
ఈ విధముగా ఏర్పడిన ధర్మములనాచరించి, మొదట ఋషుల, దేవతలు,
సాధ్యులు ( సాధనచేత పొందబడినవారు)వీరందరూ మహిమాన్వితమైన
ఉన్నత లోకాలను ( దివ్యజ్ఞానమును) పొందినారు.
దేవతలు ఈ ప్రపంచ నిర్మాణ మహాయజ్ఞాన్ని నెరవేర్చినందున,మహోన్నతమైన
దివ్యలోకాన్ని చేరుకొన్నరు.
ఈ మహా యజ్ఞమను తెలుసుకొని, తత్ ప్రతీకగా , ప్రకృతి నుండి స్వీకరిచుచున్న
ఉన్నతమై, పవిత్రమైన పదార్ధములతో యజ్ఞముముచేయమని,ఋషులు ప్రబోధించినారు. ( యజ్ఞమే విష్షు స్వరూపము)
జైహింద్.

26, నవంబర్ 2016, శనివారం

సూక్ష్మజ్ఞానముఁ గొల్పి నన్నుఁ గనుమా!

1 comments

జైశ్రీరామ్.
ఓం మహాదేవ్యైచ విద్యహే విష్ణు పత్న్యైచ ధీమహి
తన్నో లక్ష్మి : ప్రచోదయాత్
లక్ష్మీ! పాల సముద్ర రాజ తనయా! లక్ష్యార్థ సంధాయినీ!
శ్రీ క్ష్మాభాగ విశాఖ పట్టణమునన్ చెన్నొందుచున్, భక్తులన్
సూక్ష్మజ్ఞాన ప్రపూర్ణ చిత్తులవగా శోధించి కాపాడుదే!
సూక్ష్మజ్ఞానముఁ గొల్పి నన్నుఁ గనుమా! శుద్ధాంధ్ర భాషాకృతీ!
జైహింద్.

25, నవంబర్ 2016, శుక్రవారం

ప్రాతః స్మరామి. శ్లోకత్రయము. . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్
శ్లో. ప్రాతః స్మరామి హృదిసంస్ఫురదాతమతత్వం!
సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయమ్!
యత్స్వప్నజాగర సుషుప్తమవైతి నిత్యం!
తత్బ్రహ్మ నిష్కల్మహం న చభూతసంఘః!!
జ్ఞానోజ్వలత్సచ్చిదానంద రూపంబు, యోగాళికిన్నిత్యముద్యత్శరణ్యంబు, ముక్తిప్రదానాత్మ తత్వంబు నేదల్తు నా యంతరంగాన ప్రాతః సమాయత్త ప్రఖ్యాతమౌ వేళ. ఏ బ్రహ్మ రూపంబు జాగ్రత్ సుషుప్తంబు, స్వప్నంబులన్ దెల్యు, భేదంబె లేనట్టి బ్రహ్మంబు నేనే. కనన్ బంచ భూతాళి రూపంబు నేకాను. సముద్యత్ చిదానంద రూపంబు నేనే యటంచున్ తలంతున్ గ. ప్రాతః సమాయుక్త వేళన్. తలంతున్, తలంతున్, తలంతున్, తలంతున్.
భావము. సచ్చిదానందరూపము, మహాయోగులకు శరణ్యం, మోక్షమునిచ్చునదీ అగు ప్రకాశవంతమైన ఆత్మ తత్త్వమును ప్రాతఃకాలమునందు నా మదిలో స్మరించుచున్నాను. ఏ బ్రహ్మ స్వరూపము స్వప్నమూ, జాగరణ, సుషుప్తి అను వాటిని తెలుసుకొనుచున్నదో నిత్యమూ భేదము లేనిదీ అగు బ్రహ్మను నేనే. నేను పంచ భూతముల సముదాయము కాదు.
శ్లో. ప్రాతర్భజామి చ మనోవచసామగమ్యం!
వాచోవిభాన్తి నిఖిలా యదనుగ్రహేణ!
యం నేతి నేతి వచనైః నిగమా అవోచు!
స్తం దేవ దేవమజ మచ్యుతమాహురగ్ర్యం!!
మనసుకు మాటకు అందని బ్రహ్మను ప్రాతః కాలము నే తలతున్. తలపుల చిక్కిన బ్రహ్మము నెదనిడి సేవింతున్నే సేవింతున్.ఆ .  .  .బ్రహ్మ యనుగ్రహముండుట చేతనె వాక్కులు సర్వము వెలుగొందున్, కాదిది కాదిది యని వేదంబుల వేబ్రహ్మంబును తెల్పెడినో, ఆ జనన మరణ విరహితుడౌ దేవుఁడు ఘనుఁడని పండితులెల్లఁ గనున్.
భావము. మనస్సుకు, మాటలకు, అందని ఆ పరబ్రహ్మను ప్రాతఃకాలమునందు సేవించుచున్నాను. ఆయన అనుగ్రహము వల్లనే సమస్త వాక్కులు వెలుగొందుచున్నవి. వేదములు నేతి నేతి (ఇది కాదు ఇది కాదు) వచనములచే ఏ దేవుని గురించి చెప్పుచున్నవో, జనన మరణము లేని ఆ దేవ దేవునే అన్నిటికంటే గొప్ప వాడుగా పండితులు చెప్పారు.
శ్లో. ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం!
పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యాం!
యస్మిన్నిదం జగదశేషమశేష మూర్తౌ!
రజ్జ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై!!
అజ్ఞానాంధం బునకావల గలసుజ్ఞానోజ్వల తేజమె బ్రహ్మ, సనాతనుఁడాతఁడు, పురుషోత్తముఁడతఁడఖిల జగతి పతి యంతయు నతఁడా చేతో రూపుని ప్రాతః కాలము చిత్తమునందున నే తలతున్, నా చిత్తమునందున నే తలతున్, నా చిత్తమునందున నే తలతున్.ఆత్మ రజ్జువది బ్రమలకు లోనై సర్పముగా మది కనఁబడుటెఱిఁగితి. శాశ్వితమగు నా బ్రహ్మము నా మది వెలుగై నిలిచుత యెల్లపుడున్.
భావము. అజ్ఞానాంధకారము కంటే వేరుగా సూర్యుని వలే ప్రకాశించు పూర్ణ స్వరూపుడు, సనాతనుడు, అగు పురుషోత్తముని ప్రాతః కాలమునందు నమస్కరించుచున్నాను.అనంత స్వరూపుడగు ఆయన యందే ఈ జగత్తంతయూ తాడులో సర్పము వలే కనపడుచున్నది.
శ్లో. శ్లోకత్రయమిదం పుణ్యం లోకోత్రయ విభూషణం!
ప్రాతః కాలే పఠేద్యస్తు సగత్సేత్పరమం పదం!!
ముచ్చటఁగా పై మూడు పాటలను నిచ్చలు ప్రాతః కాలమ్బందున సచ్చిద్బ్రహ్మము నాత్మను తలచుచు నుచ్చరించినను ముక్తిలభించున్.ఇహ పర సుఖములు చేతికి చిక్కున్.నిత్యము సత్యము బ్రహ్మ పదార్థము ప్రాతః స్మరనము ధన్యొపాయము. ప్రాతః స్మరణము ధన్యోపాయము. ప్రాతః స్మరణము ధన్యోపాయము.
భావము. ఈ మూడు శ్లోకములు మూడు  లోకములకు అలంకారములు,  ఈ శ్లోకములను ఎవరైతే ప్రాతః కాలమునందు పఠింతురో వారు ఇహ పర సౌఖ్యములందుదురు.
జైహింద్..

24, నవంబర్ 2016, గురువారం

శ్రీకృణుడి కుటుంబం.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

23, నవంబర్ 2016, బుధవారం

మోదితకమలమ్. . . . శ్రీ వల్లభ,

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

22, నవంబర్ 2016, మంగళవారం

సుప్రభాత గాయకులు.

1 comments

జైశ్రీరామ్.

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ || ౧ ||

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ |
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు || ౨ ||

మాతస్సమస్తజగతాం మధుకైటభారేః
వక్షోవిహారిణి మనోహరదివ్యమూర్తే |
శ్రీస్వామిని శ్రితజనప్రియదానశీలే
శ్రీవేంకటేశదయితే తవ సుప్రభాతమ్ || ౩ ||

తవ సుప్రభాతమరవిందలోచనే
భవతు ప్రసన్నముఖచంద్రమండలే |
విధిశంకరేంద్రవనితాభిరర్చితే
వృషశైలనాథదయితే దయానిధే || ౪ ||

అత్ర్యాదిసప్తఋషయస్సముపాస్య సంధ్యాం
ఆకాశసింధుకమలాని మనోహరాణి |
ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్ || ౫ ||

పంచాననాబ్జభవషణ్ముఖవాసవాద్యాః
త్రైవిక్రమాదిచరితం విబుధాః స్తువంతి |
భాషాపతిః పఠతి వాసర శుద్ధిమారాత్
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్ || ౬ ||

ఈషత్ప్రఫుల్లసరసీరుహనారికేల
పూగద్రుమాదిసుమనోహరపాలికానామ్ |
ఆవాతి మందమనిలస్సహ దివ్యగంధైః
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్ || ౭ ||

ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంజరస్థాః
పాత్రావశిష్టకదలీఫలపాయసాని |
భుక్త్వా సలీలమథ కేలిశుకాః పఠంతి
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్ || ౮ ||

తంత్రీప్రకర్షమధురస్వనయా విపంచ్యా
గాయత్యనంతచరితం తవ నారదోఽపి |
భాషాసమగ్రమసకృత్కరచారరమ్యం
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్ || ౯ ||

భృంగావళీ చ మకరందరసానువిద్ధ
ఝంకారగీత నినదైఃసహ సేవనాయ |
నిర్యాత్యుపాంతసరసీకమలోదరేభ్యః
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్ || ౧౦ ||

యోషాగణేన వరదధ్నివిమథ్యమానే
ఘోషాలయేషు దధిమంథనతీవ్రఘోషాః |
రోషాత్కలిం విదధతేకకుభశ్చ కుంభాః
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్ || ౧౧ ||

పద్మేశమిత్రశతపత్రగతాలివర్గాః
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యా |
భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్ || ౧౨ ||

శ్రీమన్నభీష్ట వరదాఖిలలోకబంధో
శ్రీశ్రీనివాస జగదేకదయైకసింధో |
శ్రీదేవతాగృహభుజాంతర దివ్య మూర్తే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || ౧౩ ||

శ్రీస్వామిపుష్కరిణికాఽఽప్లవనిర్మలాంగాః
శ్రేయోఽర్థినో హరవిరించసనందనాద్యాః |
ద్వారే వసంతి వరవేత్రహతోత్తమాంగాః
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || ౧౪ ||

శ్రీశేషశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామ్ |
ఆఖ్యాం త్వదీయ వసతేరనిశం వదంతి
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || ౧౫ ||

సేవాపరాః శివసురేశకృశానుధర్మ-
రక్షోఽంబునాథ పవమాన ధనాధినాథాః |
బద్ధాంజలి ప్రవిలసన్నిజశీర్ష దేశాః
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || ౧౬ ||

ఘాటీషు తే విహగరాజ మృగాధిరాజ-
నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః |
స్వస్వాధికార మహిమాధికమర్థయంతే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || ౧౭ ||

సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి-
స్వర్భాను కేతు దివిషత్పరిషత్ప్రధానాః |
త్వద్దాస దాస చరమావధి దాసదాసాః
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || ౧౮ ||

త్వత్పాదధూళి భరితస్ఫురితోత్తమాంగాః
స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః |
కల్పాగమాఽఽకలనయాఽఽకులతాం లభంతే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || ౧౯ ||

త్వద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః
స్వర్గాపవర్గపదవీం పరమాం శ్రయంతః |
మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయంతే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || ౨౦ ||

శ్రీభూమినాయక దయాదిగుణామృతాబ్ధే
దేవాధిదేవ జగదేకశరణ్యమూర్తే |
శ్రీమన్ననంత గరుడాదిభిరర్చితాంఘ్రే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || ౨౧ ||

శ్రీపద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే |
శ్రీవత్సచిహ్న శరణాగతపారిజాత
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || ౨౨ ||

కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తే
కాంతాకుచాంబురుహ కుట్మల లోలదృష్టే |
కళ్యాణనిర్మలగుణాకర దివ్యకీర్తే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || ౨౩ ||

మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్
స్వామిన్ పరశ్వథతపోధన రామచంద్ర |
శేషాంశరామ యదునందన కల్కిరూప
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || ౨౪ ||

ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం
దివ్యం వియత్సరితి హేమఘటేషు పూర్ణమ్ |
ధృత్వాఽఽద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః
తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్ || ౨౫ ||

భాస్వానుదేతి వికచాని సరోరుహాణి
సంపూరయంతి నినదైః కకుభో విహంగాః |
శ్రీవైష్ణవాస్సతతమర్థిత మంగళాస్తే
ధామాఽఽశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్ || ౨౬ ||

బ్రహ్మాదయః సురవరాస్సమహర్షయస్తే
సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః |
ధామాంతికే తవ హి మంగళవస్తు హస్తాః
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || ౨౭ ||

లక్ష్మీనివాస నిరవద్యగుణైకసింధో
సంసార సాగర సముత్తరణైకసేతో |
వేదాంతవేద్యనిజవైభవ భక్తభోగ్య
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || ౨౮ ||

ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతమ్
యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః |
తేషాం ప్రభాతసమయే స్మృతిరంగభాజాం
ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే || ౨౯ ||

జైహింద్.

21, నవంబర్ 2016, సోమవారం

రుద్రకవచమ్.

0 comments

జైశ్రీరామ్.
రుద్రకవచమ్
ఓం అస్య శ్రీ రుద్ర కవచ స్తోత్ర మహా మంత్రస్య,
దూర్వాసఋషిః
అనుష్ఠుప్ ఛందః
త్ర్యంబక రుద్రో దేవతా
హ్రామ్ బీజమ్
శ్రీమ్ శక్తిః
హ్రీమ్ కీలకమ్;
మమ మనసోభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః ||
హ్రామిత్యాదిషడ్బీజైః షడంగన్యాసః ||

                                   || ధ్యానమ్ ||
శాంతమ్ పద్మాసనస్థమ్ శశిధరమకుటమ్ పంచవక్త్రమ్ త్రినేత్రమ్
శూలమ్ వజ్రంచ ఖడ్గమ్ పరశుమభయదమ్ దక్షభాగే మహన్తమ్ |
నాగమ్ పాశమ్ చ ఘంటామ్ ప్రళయ హుతవహమ్ సాంకుశమ్ వామభాగే
నానాలంకారయుక్తమ్ స్ఫటికమణినిభమ్ పార్వతీశమ్ నమామి ||
|| దూర్వాస ఉవాచ ||
ప్రణమ్య శిరసా దేవమ్ స్వయంభు పరమేశ్వరమ్ |
ఏకమ్ సర్వగతమ్ దేవమ్ సర్వదేవమయమ్ విభుమ్ |
రుద్ర వర్మ ప్రవక్ష్యామి అంగ ప్రాణస్య రక్షయే |
అహోరాత్రమయమ్ దేవమ్ రక్షార్థమ్ నిర్మితమ్ పురా ||
అథ రుద్ర కవచమ్
రుద్రో మే చాగ్రతః పాతు పాతు పార్శ్వౌహరస్తథా |
శిరోమే ఈశ్వరః పాతు లలాటమ్ నీలలోహితః || 

నేత్రయోస్త్ర్యంబకః పాతు ముఖమ్ పాతు మహేశ్వరః |
కర్ణయోః పాతు మే శంభుః నాసికాయామ్ సదాశివః ||

వాగీశః పాతు మే జిహ్వామ్ ఓష్ఠౌ పాత్వంబికాపతిః |
శ్రీకణ్ఠః పాతు మే గ్రీవామ్ బాహో చైవ పినాకధృత్ ||

హృదయమ్ మే మహాదేవః ఈశ్వరోవ్యాత్ స్సనాన్తరమ్ |
నాభిమ్ కటిమ్ చ వక్షశ్చ పాతు సర్వమ్ ఉమాపతిః ||

బాహుమధ్యాన్తరమ్ చైవ సూక్ష్మ రూపస్సదాశివః |
స్వరంరక్షతు మేశ్వరో గాత్రాణి చ యథా క్రమమ్ ||

వజ్రమ్ చ శక్తిదమ్ చైవ పాశాంకుశధరమ్ తథా |
గణ్డశూలధరాన్నిత్యమ్ రక్షతు త్రిదశేశ్వరః ||

ప్రస్తానేషు పదే చైవ వృక్షమూలే నదీతటే|
సంధ్యాయామ్ రాజభవనే విరూపాక్షస్తు పాతు మామ్ ||

శీతోష్ణా దథకాలేషు తుహినద్రుమకంటకే |
నిర్మనుష్యే సమే మార్గే పాహి మామ్ వృషభధ్వజ ||
ఫలశృతిః-
ఇత్యేతద్ద్రుద్రకవచమ్ పవిత్రమ్ పాపనాశనమ్ |
మహాదేవ ప్రసాదేన దూర్వాస మునికల్పితమ్ |
మమాఖ్యాతమ్ సమాసేన నభయమ్ తేనవిద్యతే |
ప్రాప్నోతి పరమ ఆరోగ్యమ్ పుణ్యమాయుష్యవర్ధనమ్
విద్యార్థీ లభతే విద్యామ్ ధనార్థీ లభతే ధనమ్ |
కన్యార్థీ లభతే కన్యామ్ నభయ విన్దతే క్వచిత్ |
అపుత్రో లభతే పుత్రమ్ మోక్షార్థీ మోక్ష మాప్నుయాత్ |
త్రాహి త్రాహి మహాదేవ త్రాహి త్రాహి త్రయీమయ |
త్రాహిమామ్ పార్వతీనాథ త్రాహిమామ్ త్రిపురంతక
పాశమ్ ఖట్వాంగ దివ్యాస్త్రమ్ త్రిశూలమ్ రుద్రమేవచ |
నమస్కరోమి దేవేశ త్రాహిమామ్ జగదీశ్వర |
శత్రు మధ్యే సభామధ్యే గ్రామమధ్యే గృహాన్తరే |
గమనేగమనే చైవ త్రాహిమామ్ భక్తవత్సల |
త్వమ్ చిత్వమాదితశ్చైవ త్వమ్ బుద్ధిస్త్వమ్ పరాయణమ్ |
కర్మణామనసా చైవ త్వంబుద్ధిశ్చ యథా సదా |
సర్వ జ్వర భయమ్ ఛిన్ది సర్వ శత్రూన్నివక్త్యాయ |
సర్వ వ్యాధినివారణమ్ రుద్రలోకమ్ సగచ్ఛతి
రుద్రలోకమ్ సగచ్ఛత్యోన్నమః ||
|| ఇతి స్కందపురాణే దూర్వాస ప్రోక్తమ్ రుద్రకవచమ్, సంపూర్ణమ్||
జైహింద్.

20, నవంబర్ 2016, ఆదివారం

మాతెలుగు తల్లికి మల్లెపూదండ. శంకరంబాడి .... టంగుతూరి సూర్యకుమారి.

0 comments

జైశ్రీరామ్.
శంకరంబాడి
జైహింద్.

19, నవంబర్ 2016, శనివారం

కవివతంస బ్రహ్మశ్రీ బులుసు వేంకటేశ్వర్లు విరచిత భారతీస్తుతి అద్భుతము.

0 comments

జైశ్రీరామ్.
ఆకాఁరానుగత ప్రదీప కలికా హార్య ప్రమో దాయిత 
శ్రీ కారార్చిత రూప! లోక జననీ! శ్రీ హంసి! ఛందో వికా
సీ! కళ్యాణపథాంతరోజ్వలిత దృష్టిక్షేప విక్షేప మా
త్రాకీర్ణామృత భావ దాత్రి! సరసార్ద్రా! భారతీ ! మ్రొక్కెదన్. 
జైహింద్.

18, నవంబర్ 2016, శుక్రవారం

ఉత్తమం స్వార్జితం విత్తమ్ . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. ఉత్తమం స్వార్జితం విత్తమ్, మధ్యమం పిత్రార్జితమ్.
అధమం భ్రాతరం విత్తం స్త్రీవిత్తమధమాధమమ్.
గీ. తనదు సంపాదనము మేలు. తండ్రి ధనము
మధ్యమంబన్నదమ్ముల మాన్య ధన మ
ధమము స్త్రీధనంబులధ మాధమము తలుప,
కష్ట జీవికి సంతోష పుష్టి కలుగు.
భావము. కష్టపడి స్వయముగా సంపాదించిన ధనమే ఉత్తమమైనది. తండ్రి సంపాదించిన ధనముతో జీవించుట అన్నది మధ్యమము.సహోదరుని ధనముతో జీవించుట అధాము. స్త్రీ ధనముతో జీవించుట యన్నది 
అధమాధమము.
జైహింద్.

17, నవంబర్ 2016, గురువారం

అవతారాద్భుత గాయత్రులు.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

16, నవంబర్ 2016, బుధవారం

డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణతో ముఖాముఖీ.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

15, నవంబర్ 2016, మంగళవారం

హనుమంతునికి వడమాల – జాంగ్రి మాల . . . కంచి స్వామీజీ వివరణము.

0 comments

జైశ్రీరామ్.

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం ||
వాష్పవారిపరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం ||
వడమాల – జాంగ్రి మాల
ఒకసారి ఉత్తర భారతదేశం నుండి ఒక భక్తుడు మహాస్వామి వారి దర్శనానికి కంచి మఠానికి వచ్చాడు.
అతను కొంచెం సంకోచిస్తూ ఉన్నట్టు కనపడ్డాడు.
మహాస్వామి వారు అతన్ని తన సందేహమేంటో అడగమన్నారు.
అతను గొంతు సవరించుకొని ఆంజనేయస్వామి వారిని భారతదేశమంతటా ఆరాధిస్తారు కాని ఎందుకు దక్షిణ భారతంలో వడమాలలు వేస్తారు. ఉత్తర భారతంలో మమూలుగా జాంగ్రితో మాల చేసి వేస్తారు అన్నది అతని సందేహం. పైగా ఈ ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం ఇవ్వలేకపోయారని మహాస్వామి వారికి విన్నవించాడు.

మహాస్వామి వారు హనుమంతుని గూర్చి మాట్లాడడానికి చాలా ఆనందపడిపోయారు.
పిల్లలు ఎప్పుడైనా తినడానికి మారాం చేస్తే తల్లి వారికి ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ అన్నం తినిపిస్తుంది. పిల్లలు ఆ చందమామని చూస్తూ ఆ చల్లని వెన్నెలని ఆస్వాదిస్తూ భోజనం ముగిస్తారు.
అలాగే బాల హనుమంతుడు ఆకాశములో ప్రకాశిస్తూ ఉన్న సూర్యబింబం చూసి చాలా ముచ్చట పడ్డాడు. అంతటితో ఆగక ఆ సూర్యబింబాన్ని చేత్తో పట్టుకోవాలని ఆకాశంలోకి ఎగిరాడు.

అదే సమయంలో సూర్యున్ని మ్రింగాలని రాహువు కూడా వస్తున్నాడు.
వారి పోరులో వాయుపుత్రుడైన హనుమంతుడు సులభంగా గెలిచాడు.
హనుమంతుని పరాక్రమానికి మెచ్చిన రాహు దేవుడు ఎవరైతే నిన్ను మినుములతో చేసిన వంటకములతో పూజిస్తారో వారికి రాహు దోషము నుండి విముక్తి కలుగుతుంది మరియు రాహువు వారిని బాధించదు.
ఆ చేసిన వంటకమును హారముగా కాని లేదా రాహు స్వరూపమైన పాముగా కాని చేసి హనుమంతునికి నివేదన చేయవలెను.
రాహు గ్రహము యొక్క ఇష్ట ధాన్యము మినుములు కావున దానితో వండిన పదార్థము రాహువుకు అత్యంత ప్రీతిపాత్రము.

మహాస్వామి వారు హనుమంతునికి వడమాల ఎందుకు వేస్తారో వివరించి ఉత్తరాది వారు దక్షిణాది వారు ఎందుకు వేరేగా మాల సమర్పణం చేస్తారో వివరించారు.

దక్షిణాన ఉప్పు ఎక్కువగా తయారు చేస్తారు. ఉత్తరాన చెరుకును ఎక్కువగా పండిస్తారు. వడలు మినుములతో చేసి మంచి రుచి కొరకు ఉప్పు మరియు కారము అందులో కలుపుతారు. అందువల్ల దక్షిణాన వడమాలను వేయడం సాంప్రదాయం.

ఉత్తరభారతీయులు ఉప్పు కారం కంటే తీపిని ఎక్కువగా ఇష్టపడతారు. జాంగ్రి కూడా మినుములతో వం

ఈ విషయమును విన్న అక్కడి వారు మరియు ఈ అనుమానాన్ని వ్యక్తపరచిన ఆ ఉత్తరభారతీయుడు పరమానందముతో మహాస్వామి వారి పాదములపై పడి ప్రణమిల్లారు.
జైహింద్.

14, నవంబర్ 2016, సోమవారం

యాజ్ఞవల్క్య మహర్షి

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

13, నవంబర్ 2016, ఆదివారం

నక్షత్ర గాయత్రి మంత్ర జపములు.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! మనము నక్షత్ర దోష నివారణ కొఱకు జపములు చేయించుకొంటుంటాం కదా! మనమే స్వయముగా ఆజపము చేసుకొనుట వలన విశేష ఫలితము కలుగవచ్చును. అందుకే ఆ యా నక్షత్ర దోష శాంతి కొఱకు నక్షత్ర గాయత్రిని మనమే చేసుకొనుటకు వీలుగా శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిషాలయము శ్రీమాన్ పరాక్రి గారు ప్రచురించినది మీ ముందుంచుచున్నాను.
శ్రీమాన్ పరాక్రి గారికి ధన్యవాదములు.
జైహింద్.

12, నవంబర్ 2016, శనివారం

నిజాన్ని నిర్భయంగా . . . . ఒక సామాన్యుఁడు.

1 comments

జైశ్రీరామ్.

జైహింద్.

11, నవంబర్ 2016, శుక్రవారం

సర్వజ్ఞాభిరామ ప్రశ్నోత్తరి. అనువాదకులు శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్. 

నమో వేంకటేశా! దండక, - భుజంగ ప్రయాత స్రగ్విణి గర్భ సీసము

1 comments

జైశ్రీరామ్

నమో వేంకటేశా!
దండక, - భుజంగ ప్రయాత  స్రగ్విణి గర్భ సీసము
హే మారమానాథ! ప్రేమార రమ్మన్న - రా వే వేగంబు రార దేవ!
నా నేరమా వల్లభా! నేర్పరా! నా వి - ధిన్ శ్రీ పరంధామ! దీప్తిఁ గొలుప,
ధీరా! రమోద్ధాముఁడా! రార! రక్షింప - రా రా! కృపా సాంద్ర రక్షనీవె!
నే నా రమన్ గొల్చెదన్ నమ్మరా! గాంచు -  మాతేను. నిత్యాత్మ! మమ్మునింక.
నీదు హృదయాన వసియించు నీరజాక్షి
నన్నుఁ గరుణించి నిన్ జూపె మన్ననమున 
నీవె నన్ జూచి నాలోనె నిలిచి యున్న 
మాత సంతోషమును చెంది మహిని కాచు.
                   జైహింద్.              

10, నవంబర్ 2016, గురువారం

చిరంజీవి ఈయన్వీ రవి అందఁ జేసిన అంకెలతో తెలుగుకవిత్వపు చమత్కారం ( ముకుందవిలాసం 2.98)

1 comments

జైశ్రీరామ్.
అంకెలతో తెలుగుకవిత్వపు చమత్కారం చూడండి.
అనువై నెన్నుదురొంటుగాఁ బదునొకండై కన్బొమల్ జంటగా
ఘనతం బోల్పఁగ రెండు తొమ్మిదులునై కర్ణద్వయం బొప్పగా
గన పూర్ణస్థితి బర్వ లీల నెసగంగా నింతయుం గూడదా
దినసంఖ్యం దిలకింప నిండునెలగా దీపించు మోమింతికిన్.
( ముకుందవిలాసం 2.98)
అమ్మాయి నుదురు "౧" - ఇలా ఉంది. కనుబొమలు "౧౧" - ఇలా ఉన్నాయి. కర్ణద్వయము "౯౯" - ఇలా ఉన్నాయి. అన్నీ కూడితే - అంటే ౧ + ౧౧ + ౯ + ౯ = ౩౦. ౩౦ రోజుల నిండునెలగా భద్రాదేవి ముఖం చంద్రునివలే భాసిస్తోంది.
జైహింద్.

9, నవంబర్ 2016, బుధవారం

కేతు గ్రహమునకు సంబందించిన ధర్భ మొక్కలను నాటడము పూజించడము. తత్ ఫలితము.

1 comments

జైశ్రీరామ్.
కేతువు:- దర్భ.
దర్భ తో హోమంచేస్తే కాలసర్పదోషాలు తొలగిపోతాయి.మూర్ఛ రోగాలను తగ్గిస్తుంది.
జాతకంలో ఏదైనా సమస్యలు ఉంటే శాంతి ప్రక్రియలో భాగంగా హోమం చేసుకోవాలి అని చెబితే ఇంట్లో స్థలం లేదని దేవాలయంలోనో, మరెవరైనా ఇంట్లోనో నవగ్రహ సమిధలతో హోమం చేస్తే గ్రహబాధలు తొలగిపోవును..
ఇబ్బంది ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోనే హోమం చేస్తే మంచిది.
తరచుగా హోమాలను చేసినట్లయితే ఏ రకమైన ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురుకావు.
హోమంవల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
ప్రత్యక్షంగా మన ఆరోగ్యానికి. పరోక్షంగా నవగ్రహాలపై ప్రభావం చూపుతుంది.
దర్భ
మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన "దర్భ" (Desmostachya bipinnata) ముఖ్యమయినది. దీనిని ఆంగ్లములో Halfa grass, Big cord grass, Salt reed-grass అనీ ప్రాంతానికి తగ్గట్టు పిలుచుకుంటారు. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భను శుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరము (రెల్లు, ఈ పేరు వినగానే నాకు రెల్లుపూల పానుపు గుర్తుకొస్తుంది) జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.
దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది. వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు శరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మిక. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు మొదలయిన వానికి మందుగా వాడుతున్నారు. అలానే ముంజ పర్వతం మీద ఉండే దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అథర్వణ వేదంలో చెప్పబడింది.
అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం మనకు అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే: సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రం నిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితో కప్పుకొమ్మని శాసనం చేశారు (బహుశా అందుకనే గడ్డితో ఇంటి పైకప్పుని ఎక్కువగా కప్పుకునేవారు). కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది, ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరచుకొని తూ తూ మంత్రంలా కానిచ్చేస్తున్నారు. ఇలాకాక, కనీసం పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణ సమయాలలో శిరస్సుమీద కప్పుకొంటే, చెడు కిరణాల ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. సదాశివరావు అనే ఒక వైద్యులు ఈ దర్భ గురించిన ఎన్నో విషయాలను తెలుసుకుని, నమ్మకం కుదరక, కొన్ని దర్భలను తీసుకుని అరచేతిలో ఉంచుకుని మరీ X-ఋఅయ్ తీయించుకోగా, ఆయన నమ్మలేని విధంగా అరవై శాతం రేడియేషన్ ఈ దర్భ గడ్డి చేత శోషించబడిందిట. దీనికి కారణం దర్భల కొనలు తేజమును కలిగి ఉండుట. ఇటువంటి దర్భ గురించి మరెన్నో ఆసక్తికరమయిన విషయాలున్నాయి.
శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః
నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజినకుశోత్తరం
అని భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఒక మంచి, స్థిరమయిన ప్రదేశంలో, మనసుని లగ్నం చేసేందుకు సరయిన ఆసనం ఎత్తుగా కాకుండా, మరీ క్రిందకి కాకుండా, చక్కని కుశ గడ్డిని పరచి, దాని మీద జింక చర్మం వేసి ఆ పైన ఒక చక్కని వస్త్రము ఉండేటటువంటి దర్భాసనమే ధ్యానానికి ఉత్తమం అని శ్రీకృష్ణుడు చెప్తారు. అలానే తైత్తరీయోపనిషత్తులో బర్హిషావై ప్రజాపతి: అని ఉంది. అనగా బర్హిష అనే గడ్డిని పరిచి దాని పైన ప్రజలను ఉత్పన్నం చేయటం, వృద్ధి పరచటం చేసేవారని చెప్పబడింది. ఋగ్వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ రకమయిన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని కుశ ద్వీపం అని కూడా అంటారు. వీటిని గూర్చి మన వేమన గారు ఏమన్నారో చూడండి:
దాతగానివాని తఱచుగా వేఁడిన
వాడుఁ దాతయగునె వసుధలోన
అవురు దర్భ యౌనె యబ్ధిలో ముంచిన
విశ్వదాభిరామ వినర వేమ!
అనగా దానము అంటే ఎరుగని వాడిని ఎన్నిసార్లు అడిగినా వాడు దానము ఇస్తాడా? దాత అవుతాడా? అదే విధముగా ఇంటిపై కప్పు గడ్డిని పవిత్రమైన సముద్రములో ముంచినంత మాత్రాన దాని రూపు మారి దర్భ అవుతుందా? అని. కానీ ఇక్కడ ఇంటిపైకప్పు గడ్డి అన్నది రెల్లు గడ్డి కాదని గుర్తుంచుకోమని మనవి. ఈ విధముగా దర్భలు ఆధ్యాత్మికతతో పాటూ సాహిత్యంలో కూడా చోటు సంపాదించుకున్నాయి.
వేద పాఠం మననం చేసుకునేటప్పుడూ, నేర్చుకునేటప్పుడూ, పఠించేటప్పుడూ దర్భ ఉంగరం కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. చావు సంబంధిత కర్మలకి ఏక ఆకు దర్భని, శుభప్రదమయిన వాటికి రెండు ఆకుల దర్భని, అశుభకార్యాలకి (పితృ పూజ, తర్పణాలు, మొ) మూడు ఆకుల దర్భని, పూజా తదితర కార్యక్రమాలకు నాలుగు ఆకుల దర్భని ఉంగరముగా వాడవలెననీ ఉంది. అలానే శ్రాద్ధ కర్మలకు బ్రాహ్మణులు దొరకని పక్షంలో దర్భ ఉంగరాన్ని ఆ స్థానంలో ఉంచి కర్మ చేయవలెనని శ్రీ పద్మ పురాణములో చెప్పబడింది.
దర్భల కొనలు విడుదల చేసే తేజము - దేవతలనూ, పితృ దేవతలను సైతం ఆకర్షించి మనం ఏ పనయితే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టు వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సమూలస్తు భవేత్ దర్భః పితృణాం శ్రాద్ధ కర్మణిం అన్నట్టుగా దర్భను వేరుతో (మూలము నుండి) సహా భూమి నుండి పెకిలించి దానిని వాడాలి. ఎందుకంటే ఈ వేరులు మాత్రమే పితృ లోకంలోని పితృ దేవతలకు విజయాన్ని చేకూరుస్తాయని అంటారు. అందుకే యజ్ఞ యాగాదులలో అగ్ని గుండానికి నలువైపులా దర్భలను పరుస్తారు.
వీటికి ఉండే సహజసిద్ధమయిన గుణములను ఆరు నెలల తరువాత కోల్పోతాయిట. ఇవి స్వ, పర జనాల కోపాలను పోగొట్టి, సముద్రాన్ని సైతం అణచిపెడుతుంది అని అథర్వణ వేదంలో చెప్పబడింది. దర్భలను ఎక్కువగా వాడుట వలన మనలో సత్వ గుణం పెరుగుతుంది. ఒకవేళ మనం వాటిని నేలకేసి కొట్టినా, గోటితో చీలినా, వాటికి ఎటువంటి హాని కలుగ చేసినా మనలో రజ-తమో గుణాల తీవ్రత పెరిగి మనలో ఉండే సత్వ గుణాన్ని కూడా నాశనం చేస్తుందిట. వీటిని పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నాడు మాత్రమే ఈ క్రింది శ్లోకం చదువుతూ కొయ్యాలి:
విరించినా సహోత్పన్న పరమేష్ఠి నిసర్గజ
నుద సర్వాణి పాపాని దర్భ స్వస్తికరో భవ
ఈ విధముగా దర్భలు ఎన్నో కార్యక్రమాలలో, ఎన్నో విషయాలలో మనకు చేరువయ్యాయి. దర్భల కొన కోసుగా ఉండుట వలననే అమృతం నాకడానికి వచ్చిన పాముల నాలుకలు రెండు క్రింద చీలాయని నిందలు భరించినా అవి మాత్రం మనకు ఎన్నో విధాలుగా మంచి చేస్తూ, సహకరిస్తూనే ఉన్నాయి. వీటి విలువ తెలిసింది కనుక ఎప్పుడూ ఒక గుప్పెడన్నా ఇంట్లో ఉండేలా చూసుకోవడం మరువకండి.
జైహింద్.

8, నవంబర్ 2016, మంగళవారం

షట్త్రింశతి రత్నాలు. . . . రచన. శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

7, నవంబర్ 2016, సోమవారం

లింగము లేని దేవళము. . . . రచన. శ్రీవల్లభ.

0 comments

జైశ్రీరామ్. 
జైహింద్.

6, నవంబర్ 2016, ఆదివారం

వైదిక సంగీత స్వరముల అనుబంధ వివరణము. శ్రీ ఆర్య సోమయాజుల వేంకట జగన్నాథ రావు..

0 comments

జైశ్రీరామ్.
 జైహింద్.

5, నవంబర్ 2016, శనివారం

అతో విచారః కర్తవ్యో . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో.  అతో విచారః కర్తవ్యో జిజ్ఞాసోరాత్మవస్తునః
సమసాద్య దయాసింధుం గురుం బ్రహ్మవిదుత్తమమ్.
గీ. ఆత్మనెఱుఁగఁగ జిజ్ఞాసనలరు సుమతి
బ్రహ్మ విద్యలో నిపుణుని, భక్త సులభు
ననుపమాన దయాపరు నరసి వానిఁ
శిష్యుఁడై తాను గురువును చేర వలయు.
భావము. ఆత్మ గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినవాడు ఆలోచించాలి. అటువంటివాడు మొదట బ్రహ్మవిద్యలో నిపుణుడై, దయ కలిగిన ఒక ఉత్తముఁడైన గురువును సమీపించాలి..
జైహింద్.

4, నవంబర్ 2016, శుక్రవారం

షోడశ రత్నాలు . . . శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్. 
జైహింద్. 

3, నవంబర్ 2016, గురువారం

ఉత్పల పరిహరణ గర్భ ఉత్పలమాల. . . . శ్రీ వల్లభ,

1 comments

జైశ్రీరామ్. 
జైహింద్. 

2, నవంబర్ 2016, బుధవారం

మేలుకో భారతమ్మా. ... శ్రీ వల్లభ,

1 comments

జైశ్రీరామ్. 
జైహింద్. 

1, నవంబర్ 2016, మంగళవారం

సూక్తి రత్నాలు. ... శ్రీ వల్లభ,

1 comments

జైశ్రీరామ్
జైహింద్.