గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జులై 2013, బుధవారం

వెలుగు చూచిన అసాధారణ ప్రతిభాన్విత భారతీయ విజ్ఞాన సాక్ష్యము

2 comments

జైశ్రీరామ్.
మహనీయ భారతీయులారా!అనంతమైన కాల గర్భములో కలిసిపోయిన అసాధారణ మహిమాన్విత భారతీయ ప్రాచీన విజ్ఞాన తేజమునకు సాక్షీభూతముగా 5000 సంవత్సరముల క్రిందటి విమానము అమెరికాలో త్రవ్వకాలలో బైట పడింది. దానికి సంబంధించిన సంభాషణను ఈ క్రింది యూట్యూబ్ లో విన వచ్చును.
Published on 2 Mar 2013 in youtube.
What caused the sudden rush of these most powerful leaders of the Western World to go to Afghanistan, this report continues, was to directly view the discovery by US Military scientists of what is described as a "Vimana" entrapped in a "Time Well"
that has already caused the "disappearance" of at least 8 American Soldiers trying to remove it from the cave it has been hidden in for the past estimated 5,000 years.

Vimana

Vimāna is a word with several meanings ranging from temple or palace to mythological flying machines described in Sanskrit epics.

Reference to ancient Indian flying vehicles comes from ancient Indian sources, many are the well known ancient Indian Epics, and there are literally hundreds of them. Most of them have not even been translated into English yet from the old sanskrit.

It is claimed that a few years ago, the Chinese discovered some sanskrit documents in Lhasa, Tibet and sent them to the University of Chandrigarh to be translated. Dr. Ruth Reyna of the University said recently that the documents contain directions for building interstellar spaceships!

Their method of propulsion, she said, was "anti-gravitational" and was based upon a system analogous to that of "laghima," the unknown power of the ego existing in man's physiological makeup, "a centrifugal force strong enough to counteract all gravitational pull."

According to Hindu Yogis, it is this "laghima" which enables a person to levitate. Dr. Reyna said that on board these machines, which were called "Astras" by the text, the ancient Indians could have sent a detachment of men onto any planet, according to
the document, which is thought to be thousands of years old. The manuscripts were also said to reveal the secret of "antima", "the cap of invisibility" and "garima", "how to become as heavy as a mountain of lead."

Steve Quayle
Stephen Quayle is the author of five books. For over thirty years, he has been investigating ancient civilizations, giants, UFOs and biological warfare as they relate to the future of mankind. Stephen discusses the coming worst-case scenarios approaching this world and how they interrelate to each other. Earthquakes, volcanoes, nuclear and biological terrorism, coupled with the planned financial meltdown of the U.S. dollar will thrust us into unimagined tribulations. Stephen Quayle is on record as stating that we have moved from the realm of natural threats into the arena of supernaturally guided events of the unseen hand of evil orchestrating world events of unfathomable proportions.

తెలుగు బంధు బ్లాగులో దీనికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా తెలుగులో చదువుట కొఱకు ఈ క్రింది చిత్రముపై క్లిక్ చేసి భాషణమును వినండి.


మహిమాన్విత మహనీయ భారతీయులమై పుట్టుట పురాకృత సుకృత విశేషమే కాని అన్యము కాదు. ఈ మహనీయతను గుర్తించి మహనీయుల అడుగు జాడలలో నడువనెంచుట భారతీయుడై పుట్టిన ప్రతీవాని ధర్మమని మరువరాదు.
ఈ అసాధారణ విషయమును యూట్యూబు ద్వారా అందించిన మహనీయునకు, తెలుగు బంధునిర్వాహకులకు కృతజ్ఞతలు.
జైహింద్.

30, జులై 2013, మంగళవారం

శ్రీమదధ్యాత్మ రామాయణ ప్రశంస - హరి వెంకట సత్యనారయణ మూర్తి

1 comments

జైశ్రీరామ్.

శ్రీ మధ్యాత్మ రామాయణ ప్రశంస

శ్రీమత్పండిత రామజోగి గురునిన్ శ్రీరామ భక్తాగ్రణిన్
నేమాన్యన్వయ జాతునిన్ బుధవరున్ నిష్ఠాగరిష్థున్ కవిన్
శ్రీమద్రామ కథామృతంబు భువిపై చిందించు పుణ్యాత్మునిన్
ధీమంతున్ కొనియాడెదన్ మునినిభున్ తేజోవిశేషాన్వితున్ 

బమ్మెర పోతరాజు మన భాగ్యవశాన మరొక్కమారు తా
నిమ్మహి నాంధ్రదేశమున నీవిధి దాశరథీ కథాసుధల్
కమ్మని పద్యరత్నములుగా రచియించగ రామజోగి జ
న్మమ్మును పొందె నౌర! యనుమానమొకింతయు లేదు చూడగన్

ఒక్కటి రెండు కాదు చవులూరెడు ఛందము లెందు జూచినన్
పెక్కులు నిండియున్నయవి విస్తృతరీతిని గ్రంథమంతటన్
చక్కని పద్యమాలికలు సాగిన వెంతయు హర్షదంబులై
యక్కట! ధన్యుడీ సుకవి, యందును శ్రీ రఘురాము సత్కృపన్ 

ప్రతి పద్యము మధురంబై
యతులితమైనట్టి మహిమ లందుటచే పం
డితవర్యా! మీ కావ్యము
క్షితి జదివెడి వారి కొసగు చిత్సౌఖ్యంబుల్

నానాసద్గుణ భాసితంబగు విధిన్ నవ్య ప్రబంధంబుగా
దీనిన్ వ్రాసితి రార్యసన్నుత! మహద్దీక్షా నిమగ్నాత్ములై
యానందప్రదమై వెలుంగు సతతం బధ్యాత్మరామాయణం
బో నేమాని కవీశ్వరా! గురువరా! యుర్విన్ సదారాధ్యమై

ఇట్లు
హరి వెంకట సత్యనారయణ మూర్తి
జైహింద్.

29, జులై 2013, సోమవారం

శ్రీ వల్లభవఝల కృత శ్రీ నారాయణ హృదయము

0 comments

జైశ్రీరామ్.
సుజనులారా! శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కవి కృత శ్రీ నారాయణ హృదయమును మీ ముందుంచుచుంటిని. తప్పక చదివి, మీ అభిప్రాయమును తెలియ జేయ మనవి.
కవివరులకభినందనలు.
జైహింద్.

28, జులై 2013, ఆదివారం

మహనీయుల కృషి ఫలమగు అంతర్జాలము అందుబాటులోకి వచ్చి నేటికి మప్ఫైయేళ్ళు.

2 comments

జైశ్రీరామ్.
ఇంటర్నెట్ ద్వారా ప్రపంచం అంతా మనగుప్పిట్లో ఇమిడిపోవడం ఎంత వింత?
మిత్రులారా! అంతర్ జాలము (ఇంటర్నెట్) మనకు అందుబాటులోకి వచ్చి సరిగ్గా నేటికి ముప్పదేండ్లు పూర్తయ్యెను.
ఈ నాడు మనకు ఇంటర్ నెట్ సదుపాయం ఉండటం వల్ల అన్ని పనులూ సుకరమైన మాట సత్య దూరము కాదు. ఇంతటి సాంకేతిక పరిజ్ఞానముమనకందించుటకు ఎంతమంది మహనీయులు నిద్రాహారాలు మాని అహర్నిశలూ కృషిచేశారో తల్చుకుంటేనే మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది కదండీ!
ఇంతకీ మనమెప్పుడైనా ఆ మహనీయులను తలుచుకొంటున్నామా? వారి శ్రమ ఫలితాన్ని కూర్చొని అనుభవిస్తున్న మనం వారికి ఋణపడుతున్నామన్న మాటైనా గుర్తిస్తున్నామా?  అట్టి మహనీయుల ఋణం మనం తీర్చుకోవాలంటే మనసారా మనసులోనైనా వారికి ధన్యవాదాలు చెప్పాలి. మనం కూడా సాధ్యమైనంత వరకు సమాజానికి అపకారం జరగని మార్గంలో ఉపకారం చేసే మార్గంలో పయనించాలి.
ఈ ఇంటర్ నెట్ 1983 లో ఇదే రోజున ప్రారంభమయింది.  1995 నుండి విస్త్రుతమయింది.
ఎందరు శాస్త్ర వేత్తలు శ్రమించి రహర్నిశలెన్నినాళ్ళొ! వా
రందరి మేధ సంపద మనందరి నిత్య సుఖోపభోగ్యమై
సుందర వ్సప్నలోకము వసుంధరపైననె గొల్పుచుండె. వా
రందరు నిత్య సత్శుభదు లందరికేను నమస్కరించెదన్.
మహనీయులు నిత్య సంతుష్టులై వరలుదురు గాక. వారు నిత్యమంగళురై మంగళ మార్గమున లోకమున ప్రవర్ధింప జేతురు గాక.
జైహింద్.

27, జులై 2013, శనివారం

లలితపదముల మది లలిత గొలుతు. రచన శ్రీ అనంత కృష్ణ యన్వీ.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ యన్వీ అనంత కృష్ణ కృతమగు వరసిద్ధి వినాయక శతకము ఇంతకు ముందు చదివాము కదా! ఇప్పుడు ఆ కవి కృతమగు లలిత శతకమును కూడా చదివే అవకాశం మనకు లభించింది. మీరు కూడా చదివి మీ మీ అభిప్రాయాలను వ్రాయవలసినదిగా మనవి.భక్త కవి శ్రీ అనంత కృష్ణ గారికి మనః పూర్వక అభినందనలు తెలియజేయుచున్నాను.
జైహింద్.