గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, మే 2020, ఆదివారం

కరోనానంతరం భారతీయ జీవనం....బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారు.

0 comments

జైశ్రీరామ్.
కరోనానంతరం భారతీయ జీవనం. బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారు. Rjy: 

తరతరాలుగా భారతదేశం వసుధైక కుటుంబ భావనతో పరంపరగా వచ్చిన ధర్మ సంప్రదాయాలను నేర్పుతూ ఇల్లే ఒక ఙ్ఞాన కేంద్రంగా ఏర్పడి ఒక విశిష్టమైన సంస్కృతిని వ్యవస్థగా చేసుకున్నది. అలాంటి అవకాశాన్ని కరోనా కారణంగా మళ్లీ మనం తలచుకొని మన ఇళ్లల్లో ప్రసారం చేసుకుని పునరుత్తేజితులమవుదాం. విశ్వానికి మార్గదర్శకులమవుదాం.
కరోనా తొలగిన తరువాత కూడా ఈ జీవనాన్ని మనం అలవాటు చేసుకుంటే ఒక అద్భుత శక్తిని పొంది విశ్వానికి అందించగలుగుతాం.
స్పర్శదోషాత్ సూక్ష్మరోగా:
స్పర్శదోషాత్(ద్)కృమి వ్రజా:
స్పర్శదోషాత్(ద్) విషూచ్యశ్చ
భవేద్ అస్పర్శత: సుఖం

స్పర్శ దోశం వల్లనే సూక్ష్మ రోగాలు, విషక్రిములు, అంటురోగాలు తెలియకుండా వస్తాయి. కాబట్టి మడిగా ఉండడం వలన, ఎవరి హద్దులలో వాళ్లు ఉండడం వలన, అనవసరమైన స్పర్శ లేకుండా ఉండడం వలన అలాంటి సుఖం కలుగుతుంది. దాన్ని పొందుదాం.
సర్వే 2 పి నియమా: పాల్యా:
కథితా(:) ఋషిభి: పురా
మానస్య: స్యుశ్చ వాచిక్య:
శారీర్యశ్చ క్రియా: శుభా:

మనకు పూర్వ ఋషులు అందించిన అన్ని నియమాల్ని పాలించాలి. మన మానసిక వాచిక శారీరిక క్రియలు ఏవైనా మనకు అందరికీ శుభాన్ని ఇచ్చేవిగా ఉండాలి. వాటిని పాటిద్దాం.
వర్ణాశ్రమాచారధర్మా:
గృహస్థైర్ జ్యేష్ఠపూరుషై: (ర్)
మాతృభి: సాధువృద్ధాభి: (ర్)
గృహ్యా(:) జ్ఞేయా(:)విచార్యచ

జీవన వృత్తి కొసం, పొరుగిండ్లవారికి చేయుతనివ్వడం కోసం ఎవరు ఒత్తిడి చేయకుండగనే పరంపరగా వచ్చినవి వర్ణాశ్రమాచారధర్మాలు. మనం వేరే కుటుంబాల వారికి సమాజానికి సేవ చేయటం బ్రాహ్మణాది వర్ణ ధర్మాలు. ఏ వయస్సులో ఏమి చేయ్యాలనేదాన్ని సూచించేది బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మం. ఎవరి ఇంటిలో వారు చేసుకునే జీవన వ్యాపార వ్యవహారాలు, వృత్తి ధర్మాలు, కుల ధర్మాలు, ఆచారాలూ. వీటిని పూర్వము ఇంటిలో ఉండే వారే పెద్దలు, తల్లులు, అతిథులు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు అందరూ చెప్పేవారు. ఈ విషయాన్ని గమనించి ఇప్పుడు కూడా పెద్దలు చెప్పిన ఆ తల్లులు చెప్పిన వర్ణాశ్రమాచార ధర్మాలను చర్చించి తెలుసుకుందాం. అర్థంచేసుకుందాం.
గృహం ధర్మపదం ప్రోక్తం
గృహాచారా: శివా: స్మృతా:
అభ్యాసశ్చ భవేన్నిత్యం
సంస్కార: పారివారిక:

ధర్మం అనే శబ్ధం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి స్థానము చోటు ఇల్లే. కాబట్టి, ఇంటి ఆచారాలు అన్నీ మంచిని చేస్తాయని మంగళాన్ని కలిగిస్తాయని గమనించాలి. వీటిని ఇంట్లోనే నేర్చుకోవాలి. కుటుంబ సంప్రదాయము, పరంపరగా వచ్చిన ఆచారమే సంస్కారము.
వృద్ధానాం వచనం శ్రావ్యం
తథా కార్యం యథాశ్రుతం
శనై: శనై: ప్రబోధ: స్యాద్ (జ్)
ఊనానాంచ వయో 2 ధికై:

పెద్దవాళ్ల మాటను వినటము, విని ఆచరించటం ఇప్పుడు ఈ రెంటినీ మర్చిపోయాం. వాళ్లేమి చెప్పితే అది విని అర్థం చేసుకుని ఆచరించడాన్ని ప్రారంభించాలి. ఆచరించి తీరాలి. పెద్దవాళ్లు కాలానుగుణంగా పిల్లలకు ఉద్వేగము రాకుండా సావధానంగా ఉత్సాహము కలిగేట్టుగా ప్రబోధించాలి. చిన్నవాళ్లు పెద్దలు చెప్పిన దానిని వ్యతిరేకించకుండా మెల్లమెల్లగా ఆచరిస్తూ ఉంటే వాళ్ల మాటలకు గల భావం అర్థమవుతుంది.
కుటుంబే విధయ: సర్వే
నిర్వర్తవ్యా: సమై: సహ
పరస్పరం సమైక్యేన
కార్యం కార్యం హితం ప్రియం

కుటుంబంలో, ఇంట్లో చేయవలసిన ఏ పనులు అయినా అందరివి అని ఆలోచించాలి. అందరూ కలిసి చేసుకోవాలి. ఒకరికి విరుద్ధంగా ఒకరు చేయకూడదు. మనం చేసే పనులు మనకు ఇంట్లో ఉండేవాళ్లందరికీ ఇష్టంగా మేలు కలిగించేవిగ చేయదగినవిగా ఉండాలి. కాబట్టి అలాంటి పనులను ఆలోచించి చేద్దాం.
గృహకార్యేషు సర్వేషు
నిర్వర్తనసమానతా
తథా ధర్మప్రబోధశ్చ
భవేద్భూయో యథా పురా

ఇంటిలో ఉండే పనులన్నింటి మీద చేయవలసిన బాధ్యత అధికారము అందరికీ సమానము. కాబట్టి పూర్వకాలములోలాగా ఇప్పుడు కూడా అట్టి ప్రబోధము జరుగుతుండాలి.
పాఠశాలాసు సంబోధ్యా:
నృణాం జీవాతవో గిర:
క్షమాదయాదిసుగుణా:
కలా: సద్వృత్తయ: శివా:

పాఠశాలలలో డబ్బు వచ్చే విషయాలను బోధించటం కాకుండా ఉత్తమ జీవనమునకు ఆధారమైన మంచి మాటలు సుభాషితాలు ఓర్పు దయా మొదలైన గుణాలు, ఇంటిలో చేసే జీవన వృత్తులు కళలు అన్నీ మంచివని బోధింపబడాలి.
మాతా పిత్రోర్గురూణాం చ
గౌరవం జ్ఞానినాం నృణాం
శిక్షణీయం చ విజ్ఞానం
వైరాగ్యం తత్వచింతనం

అట్లే తల్లిదండ్రులు పెద్దలూ గురువులు ఙ్ఞానులూ ధర్మము చేయువారు దేశభక్తులూ గొప్పవారనే విషయం, వారి పూర్వుల యొక్క గొప్ప విఙ్ఞానం తృప్తి వైరాగ్యము తత్త్వచింతనము, ఇవన్నీ గొప్పవని కూడా పాఠశాలలో నేర్పించాలి.

2. భారతీయ జీవనం - కరోనానంతర జీవనం
న శిక్షణీయా వైదేశ్యా:
భాషాస్తజ్జీవనీ పుర:
న నాగరికపద్ధత్య: (శ్)
చాలస్యాసత్యవర్ధితా:

ప్రారంభ దశలో విదేశీయ భాషలు గానీ విదేశ జీవన విధానాన్ని గానీ నేర్పకూడదు. గ్రామీణులు ముందుగానే తమ పిల్లలకు నాగరిక పద్ధతులను కూడా బోధించరాదు. అట్లే ముందుగానే ప్రక్క ఇంటి వారి పద్ధతులను నేర్పరాదు. అట్లు నేర్పినచో సోమరితనము అసత్య ప్రవృత్తి పెరుగును. కొంత విఙ్ఞానము కలిగిన తరువాత వీటిని తెలుసుకొనవచ్చును. ఎవరి ఇంటిలో వాళ్లకు సోమరితనం ఉండరాదు, అసత్య వ్యవహారం ఉండరాదు అని తాత్పర్యము.
మాతాపిత్రోశ్చ యా వృత్తి:
సైవ స్యాదనుజీవినాం
దుహితౄణాం చ పుత్రాణాం
సా హి పిత్రో: సుభక్తి కృత్

తల్లిదండృలకు ఏది జీవనవిధానమో (వ్యవసాయము, వ్యాపారము, వైద్యము, న్యాయవాదిత్వము, పౌరోహిత్యము, అర్చన, వాహన చాలనము మొదలైన వృత్తి) అదే ఆ ఇంటిలో పిల్లలకు ఉండవలయును. వారిననుసరించు వారి వృత్తియే వీరిననుసరించు వారికిని ఉండవలయును. కూతుళ్లకు తల్లి చెప్పే పని పట్ల కొడుకులకు తండ్రి చేసే పని పట్ల శ్రద్ధ ఉంటే అదే తల్లిదండ్రుల పట్ల భక్తిని కలిగిస్తుంది.
జీవనార్థం నాన్యవృత్తి: (ర్)
వృథా దుర్వ్యయకారిణీ
గృహం జీవనవృత్యాస్త్థా
శాలా సత్సంప్రదాయదా

బ్రతుకు కోసం తల్లిదండ్రుల జీవన వృత్తి కాకుండా ఇంకొకరి జీవన వృత్తి, లేదా డబ్బు వచ్చే వేరొక మార్గము మంచిది కాదు. అది వ్యర్థముగా ఎక్కువ ధనమును వ్యయ పరచడానికి కారణమవుతుంది. ఇల్లు బ్రతకడానికి ఒక జీవనవృత్తి పద్ధతి కలదనే నమ్మకము పిల్లలకు కలిగించేది కావాలి. పాఠశాల ఆ పరిసరాలలో ఉండే వారందరికీ సామూహిక సామాన్య సంప్రదాయమును అందరము ఒకటను కలిసివుండాలను మంచి పద్ధతిని నేర్పించేది కావాలి.
వాసస్థానసమీపే స్యాత్
పాఠశాలా సనాతనీ
భాషావిద్యాప్రబోధాయ
నార్థసంపాదనాయ సా

మనము నివసించే చోటునకు దగ్గరగానే మన సంప్రదాయాన్ని తెలియచేసే పాఠశాల ఉండాలి. దూరంగా ఉండే పాఠశాలలకు పిల్లలను పంపరాదు. ఆ పాఠశాల ముఖ్యముగా భాషను విద్యను విఙ్ఞానమును ధర్మమును బోధించేది అయి ఉండాలి. కేవలము డబ్బు వచ్చే మార్గమును తెలియుటకై ఏ పాఠశాల ఉండకూడదు.
కలాశాలా పృథగ్ భూయాత్
పుంసాం స్త్రీణాం సువృత్తిదా
న ప్రేష్యాస్తనయా: దూరం
పితృభ్యాం జాతు వృత్తయే

అలాగే కొంత వయసు వచ్చిన పిల్లలకు, స్త్రీలకు గానీ పురుషులకు గానీ విడివిడిగా, వారి వృత్తికి, వారి సేవా వృత్తికి మార్గముగా కళాశాలలు ఉండాలి. కాబట్టే తల్లిదండ్రులు తమ పిల్లల్ని యువకులనైనా యువతులనైనా దూరంగా పంపకూడదు.
స్వదేశవస్తువాణిజ్యం
శ్రేష్ఠం కార్యం వణిగ్వరై:
విదేశవస్తువ్యామోహో
న సంవర్ధ్య: కదాచన

ఈ కాలమున అందరమూ వ్యాపారము చేద్దాం అనుకుంటున్నాం. అయితే మన దేశములోని వస్తువులనే ఎక్కువగా అమ్మడం కొనడం చేస్తే మన దేశ వాసులకే ఎక్కువ లాభం కలుగుతుంది. కాబట్టి స్వదేశ వస్తువుల వ్యాపారమును మనవారికి లాభకరముగా ఉండునట్లుగా వ్యవస్థ చేసుకోవాలి. (విదేశ వస్తువులు అవసరమైనచో అవి మన దేశములో లభించనివైతేనే వాటిని దిగుమతి చేసుకోవాలి. విదేశీయులకు మన వస్తువులు అవసరమైతేనే వారికి ఎగుమతి చెయ్యాలి. మొత్తము మీద వారికి మనకు లభించని వస్తువులను మాత్రమే విదేశ వ్యాపారముగా చేసుకోవాలి. విదేశ వస్తువుల పైన వ్యామోహము ఉంచరాదు పెంచరాదు.)
గ్రామస్థా నగరస్థా: స్యు: (ర్)
భిన్నభిన్నస్వవృత్తికా:
పరస్పరాంతికావాసా:
పరస్పరహితక్రియా:

గ్రామములో ఉండే వారు గాని, నగరములో ఉండే వారు గాని వేరు వేరు జీవన వృత్తులు కలవారై కలిసి దగ్గర దగ్గరగా ఉండాలి. ఒకరికొకరు కావలసిన సహకారమును మేలు చేసుకోవాలి.
కలాశ్చ వృత్తయ: సర్వా:
పూజ్యా జీవనసాధనా:
ఆవశ్యక్య: స్వయం కార్యా:
శ్రమతృప్తిహితాకరా:

ఏ కళలు గానీ ఏ జీవన వృత్తులు గాని, బ్రతుకుకు సాధనమైన ఏ మార్గమము గానీ తక్కువవి అని భావించకుండా వాటిని మనము గౌరవించాలి. మన పూర్వుల జీవన వృత్తులను మనము స్వయముగా స్వీకరించి జీవనవృత్తులుగా మార్చుకున్నచో అవసరములని భావించినచో అవి మనకు తగినంత పనినిచ్చి తృప్తినిచ్చి మేలును కలిగిస్తాయి. కాబట్టి అన్ని కళలు, అన్ని వృత్తులు అవసరములే.
ప్రకృతే: సులభా అర్థా:
ఉపయుజ్యా హితా: ప్రియా:
వికృతిద్రవ్యసంప్రీతి: (ర్)
న కర్తవ్య: ప్రయత్నత:

ప్రకృతి సహజంగా లభించే వస్తువులను వీలయినంత వరకు సంపాదించుకోవాలి. వాటినే ఉపయోగించితే అవి ఇష్టముగా ప్రీతికరంగా అవుతాయి, అలా వాటిని చేసుకోవాలి. వికృతి పదార్థములను (అనగా వస్తువులను కలిపి చేసిన, కొన్న అమ్మిన వ్యాపారములకు సిద్ధపరిచిన వండిన కూరలు, వండిన పచ్చళ్లూ మొదలగు వాటిని) విపరీతముగా ప్రీతితో స్వీకరించరాదు, సంపాదించరాదు. (ఇంటిలో వండిన కూరలనూ, పచ్చళ్లనూ, అన్నము మొదలైన పదార్థములను స్వీకరించవలెను, తినవలెను.)
3. భారతీయ జీవనం - కరోనానంతర జీవనం
యత్నేన సిద్ధ ఆహార:
స్వీకర్తవ్య: స్వయం గృహే
క్రీతాహారో భవేన్నైవ
జీవనాయాహితప్రద:

మన ఇంటిలోనే శ్రద్ధగా ప్రయత్నముతో సంపాదించిన ఆహారమును తినవలెను. కొనిన ఆహారము, అట్ట శూలములలో, అంటే హొటళ్లలో వీలయినంతవరకు స్వీకరింపకూడదు. అది బ్రతుకునకు జీవనానికి మేలు చెయ్యదు.
అనివార్య: కథఞ్చిత్ స్యాద్ (చ్)
(చ్చా) శాకాహారో నృణాం ప్రియ:
వార్యో మాంసమయాహారో
విశేషేణ క్రమేణ వా

మన ఇంటిలో చేసిన శాకాహారము తప్పకుండా స్వీకరించవలెను. మాంసాహారము వీలయినంతవరకు లెకుండా చేసుకొనవలెను. క్రమముగా అందరు శాకాహారులు కావలెను.
ఆగతాతిథి సత్కార-
పూర్వకం దినభోజనం
మితం హితం న ద్రుతం చ
విహితం రాత్రిభోజనం

ప్రతిరోజు పగలు ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాదగా భోజనము పెట్టి మనము భుజించవలెను. భోజనమును మితముగా హితకరముగా స్వీకరించవలెను. తొందరతొందరగా భోజనము చెయ్యరాదు. రాత్రి వీలయినంత తక్కువగా తీసుకోవడం మంచిది.
జీరకార్ద్రక హారిద్ర
హింగుధాన్యాకమారిచా:
ఘృతతైలై: సంస్కృతా వా
మిశ్రితా వా నిరామయా:

మనము తినే ఆహారములో జీలకర్ర, అల్లము, పసుపు, ఇంగువ, ధనియాలు, మిరియాలు, సాధారణముగా వాడవలెను. మంచి నేతితో గాని, మంచి నూనెలతో గాని పోపు పెట్టబడిన ఔషధములతో కూడిన ఆహారములు అనారోగ్యాన్ని కలిగించవు.
అకట్వనాంలా లవణా:
రస్యా: స్నిగ్ధా: శుచి ప్రియా:
సూపసారా: స్యురాహారా:
దధిక్షౌద్రఫలాన్వితా:

మనము తినే పదార్థాలు మిక్కిలి కారముగా, చేదుగా, మిక్కిలి పులుపుగా, ఉప్పుగా ఉండక, ఆరు సమాన రసములతో ఉండేవై నేయి మొదలైన చమురుతో ఉండేవై శుద్ధములై ఉండేవై ఇష్టమైనవై కావలెను. పప్పు చారు పెరుగు తేనె వివిధ ఫలములు మొదలైనవి ఆహారముగా ఉండవలెను.
స్థానాంతరే చ కార్యాణి
కర్తుం యోగ్యాని చింతయేత్
యథా 2వకాశం స్వస్థానాద్
దూరం దూరం న చ వ్రజేత్

మనం ఊళ్ళో కాక వేరే ఊళ్ళల్లో చేసే పనులను వీలయినంతవరకు గొప్ప వాటినే చేయవలెను. వీలయినంతవరకు మన స్థానాన్ని వదిలిపెట్టి దూరప్రాంతాలకు వెళ్లరాదు.
బాలాన్ యూన: పాఠనాయ
గ్రామదేశాంతరాణి తే
నైవ సంప్రేషయేయుర్హి
పితర: సాధువృత్తయ:

చిన్న పిల్లల్ని గానీ పెద్ద పిల్లల్ని గానీ చదువు కోసం గ్రామాంతరాలకూ దేశాంతరాలకూ పంపరాదు. తల్లిదండ్రులు మంచి పనులను చేస్తూ పిల్లలు మంచి పనులు చేసేటట్లు చేయవలెను.
పుత్రస్య పుత్ర్యా వా వృత్తి: (ర్)
మాతా పుత్ర్యోస్తు యా భవేత్
స్వధర్మ ఇతి సా వృత్తి:
శిక్షణీయా హి జీవికా

కుమారునికి గానీ కూతురుకు గానీ తాము చేస్తున్న జీవన వృత్తినే స్వధర్మమని జీవికగా నేర్పవలెను.
అలసత్వమసత్యత్వం
అక్రియత్వం న కస్య చిత్ (ద్)
యథా నైవ భవేదేవం
శిక్షణం శ్రేయసే భవేత్

ఎవరికీ సోమరితనం ఉండరాదు. అసత్య వ్యవహారము ఉండరాదు. పని లేకుండా ఎవరూ ఉండరాదు. ఆ విధముగా ఇంటిలోనే శిక్షణ జరగవలెను. అదే అందరి మేలుకు కారణమగును.
స్వస్తి.
జైహింద్.

30, మే 2020, శనివారం

వినయశ,భువనా,భుజగశిశురుత,హడలు,సడిచెడు,వడిసుడి,సుడివడి,గడికెడమ,తడువెడలు,తడబడు,గర్భ"-నెడమిడు"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
వినయశ,భువనా,భుజగశిశురుత,హడలు,సడిచెడు,వడిసుడి,సుడివడి,గడికెడమ,తడువెడలు,తడబడు,గర్భ"-నెడమిడు"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                       
"-నెడమిడు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.స.న.జ.త.న.న.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
కడి నెడమిడి జగమున్!గడగడ లాడ జేసెన్!గడి కెడమన "-కరోనా!
తడబడ కుడి నెడమల్!తడ వెడమిడి దైవమ్!దడ నుడుగతిని మాడ్చున్!
జడు పిడె!కడు కటుతన్!సడి చెడ నెడ మేర్చున్!సడియును విడిచి వేగన్!
పడయడె?సుడి క్రిమినిన్!వడి మృఢు డతి వేగన్!వడి జనులెడద మెచ్చన్!
1.గర్భగత"-వినయశ"-వృత్తము.
బృహతీఛందము.న.న.స.గణములు.వృ.సం.256.
ప్రాసనియమము కలదు.
కడి నెడమిడి జగమున్!
తడ బడ కుడి నెడమల్!
జడుపిడె కడు కటుతన్!
పడయడె?సుడి క్రిమినిన్!
2.గర్భగత"-భువనా"-వృత్తము
అనుష్టుప్ఛందము.న.జ.గగ.గణములు.వృ.సం.48.
ప్రాసనియమము కలదు.
గడ గడ లాడ జేసెన్!
తడ వెడమిడి దైవమ్!
సడి చెడ! నెడమేర్చున్!
వడి మృఢుడతి వేగన్!
3.గర్భగత"-భుజగశిశురుత"-వృత్తము.
బృహతీఛందము.న.న.య.గణములు.వృ.సం.428.
ప్రాసనియమము కలదు.
గడి కెడమన"-కరోనా"-
దడ నుడుగతిని మాడ్చున్!
సడియును విడిచి వేగన్!
వడి జను లెడద!మెచ్చన్!
4.గర్భగత"-హడలు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.స.న.జ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కడి నెడమిడి జగమున్!గడగడ లాడ జేసెన్!
తడ బడ కుడి నెడమల్!తడ వెడమిడి దైవమ్!
జడు పిడె కటుతన్!సడి చెడ!నెడమేర్చున్!
పడయడె?సుడి క్రిమినిన్!వడిమృడు డతి వేగన్!
5.గర్భగత"-సడిచెచు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.జ.త.న.న.గగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గడగడ లాడ జేసెన్!గడి కెడమన"-కరోనా"-
తడ వెడమిడి దైవమ్!దడ నుడుగతిని మాడ్చున్!
సడి చెడ నెడమేర్చున్!సడియును విడిచి వేగన్!
వడి మృడుడతి వేగన్!వడి జను లెడద మెచ్చన్!
6.గర్భగత"-వడిసుడి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.త.న.న.త.న.న.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గడగడ లాడ జేసెన్!గడి కెడమన"-కరోనా"-కడి నెడమిడి జగమున్!
తడ వెడమిడి దైవమ్!దడ నుడుగతిని మాడ్చున్!తడ బడ కుడి నెడమల్!
సడి చెడ నెడమేర్చున్!సడియును విడిచి వేగన్!జడుపిడె కడు కటుతన్!
వడి మృడుడతి వేగన్!వడిజను లెడద మెచ్చన్!పడయడె? సుడి క్రిమినిన్!
7.గర్భగత"-సుడివడి"-వృత్తము.
ధృతిఛందము.న.న.య.న.న.స.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గడి కెడమన "-కరోనా"-!కడి నెడమిడి జగమున్!
దడ నుడుగతిని మాడ్చున్!తడబడ కుడి నెడమల్!
సడియును విడిచి వేగన్!జడుపిడె కడు కటుతన్!
వడి జను లెడద మెచ్చన్!పడయడె?సుడి క్రిమినిన్!
8.గర్భగత"-గడికెడమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.య.న.న.స.న.జ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గడి కెడమన"-కరోనా"-!కడి నెడమిడి జగమున్!గడగడ లాడ జేసెన్!
దడ నుడుగతిని మాడ్చున్!తడబడ కుడి నెడమల్!తడు వెడమిడి దైవమ్!
సడయును విడిచివేగన్!జడుపిడె! కడుకటుతన్!సడిచెడ!నెడమేర్చున్!
వడి జను లెడద మెచ్చన్!పడయడె?సుడి క్రిమినిన్!వడి మృడుడతి వేగన్!
9.గర్భగత"-తడువెడమ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.జ.త.న.న.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గడగడ లాడ జేసెన్!కడి నెడమిడి జగమున్!
తడు వెడమిడి దైవమ్!తడబడ కుడి నెడమల్!
సడిచెడ!నెడ మేర్చున్!జడుపిడె కడు కటుతన్!
వడి మృడుడతి వేగన్! పడయడె?క్రిమి సుడినిన్!
10,గర్భగత"-తడబడు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.త.న.న.జ.న.న.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గడగడ లాడ జేసెన్!కడి నెడమిడి జగమున్!గడి కెడమన"-కరోనా"-!
తడు వెడమిడి దైవమ్!తడబడ కుడి నెడమల్!దడ నుడుగతిని మాడ్చున్!
సడిచెడ నెడ మేర్చున్!జడుపిడె కడు కటుతన్!సడియును విడిచి వేగన్!
వడి మృడు డతివేగన్!పడ యడె! క్రిమి సుడినిన్!వడి జను లెడద మెచ్చన్!

స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

భక్తిసాధనమ్ వారు నిర్వహించిన సమస్యాపూరణము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

29, మే 2020, శుక్రవారం

భక్తిసాధనంవారు నిర్వహించిన వర్ణన.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

28, మే 2020, గురువారం

ప్రమాణీ,మత్తరజినీ,జ్యోతిర్మయీ,జరామజా,నయమా,అరమర,న యాచర,సత్సంగమ,జంటనడు,చరితమ,గర్భ"-వాటమెంచు"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
ప్రమాణీ,మత్తరజినీ,జ్యోతిర్మయీ,జరామజా,నయమా,అరమర,న యాచర,సత్సంగమ,జంటనడు,చరితమ,గర్భ"-వాటమెంచు"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                         
"-వాటమెంచు"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.ర.మ.జ.ర.త.న.మ.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
"-కరోన"-భూరి సత్సంగమ్!కాటువేయ మాను స్నేహతన్!కలిసి నడుద్దాం ధాత్రినిన్!                                              వరాల బ్రోచు దివ్యత్వమ్!బాటలందు కల్సి తిర్గినన్!బలమున సౌభ్రాతృ త్వతన్!ె                                                  తరించు లోక సర్వస్వమ్!దాటు లేయు కుప్పి గెంతులన్!తలపుల దిగ్భ్రాం  తిన్గనన్!                                            వరించు మాత స్వాతంత్రమ్!వాటమెంచి నెట్టు దుర్గతిన్!వలనగు  కాంక్షార్ధంబవన్!                                                          
1.గర్భగత"-ప్రమాణీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.జ.ర.లగ.గణములు.వృ.సం.86.
ప్రాసనియమము కలదు.
కరోన భూరి సత్సంగమ్!
వరాల బ్రోచు దివ్యత్వమ్!
తరించు లోక సర్వస్వమ్!
వరించు మాత స్వాతంత్రమ్!
2.గర్భగత"-మత్త రజినీ"-వృతము
బృహతీ ఛందము.ర.జ.ర.గణములుమవృ.సం.171.
ప్రాసనియమము కలదు.
కాటు వేయ మాను స్నేహతన్!
బాటలందు కల్సి తిర్గినన్!
దాటు లేయు కుప్పి గెంతులన్!
వాట మెంచి నెట్టు దుర్గతిన్!
3.గర్భగత"-జ్యోతిర్మయీ"-వృత్తము.
బృహతీఛందము.న.య.ర.గణములు.వృ.సం.144.
ప్రాసనిమము కలదు.
కలిసి నడుద్దాం!ధాత్రినిన్!
బలమున!సౌభ్రాతృత్వతన్!
తలపుల!దిగ్భ్రాంతిం గనన్!
వలనగు!కాంక్షార్ధం బవన్!
4.గర్భగత"-జరామజా"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.ర.మ.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
"-కరోన"-భూరి సత్సంగమ్!కాటు వేయ మాను స్నేహతన్!
వరాల బ్రోచు దివ్యత్వమ్!బాటలందు కల్సి తిర్గినన్!
తరించు లోక సర్వస్వమ్!దాటు లేయు కుప్పి గెంతులన్!
వరించు మాత స్వాతంత్రం!వాటమెంచి నెట్టు దుర్గతిన్!
5.గర్భగత"-నయమా"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.న.య.ర.గణములు.యతి10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేయ మాను స్నేహతన్!కలిసి నడుద్దాం!ధాత్రినిన్!
బాట లందు తిర్గినన్!బలమున సౌ భ్రాతృత్వతన్!
దాటు లేయు కుప్పి గెంతులన్!తలపుల దిగ్భ్రాంతిం గనన్!
వాట మెంచి నెట్టు దుర్గతిన్!వలనగు కాంక్షా ర్థంబవన్?
6.గర్భగత"-అరమర"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.న.య.ర.జ.ర.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేయ మాను స్నేహతన్!కలిసి నడుద్దాం!థాత్రినిన్!"-కరోన"-భూరి  సత్సంగమ్!                                             బాట లందు కల్సి తిర్గినం!బలమున సౌ భ్రాతృత్వతన్!వరాల  బ్రోచు దివ్యత్వమ్!                                                   దాటు లేయు కుప్పి గెంతులన్!తలపుల దిగ్భ్రాంతిం గనన్!తరించు లోక సర్వస్వమ్!                                           వాట మెంచి నెట్టు దుర్గతిన్!వలనగు కాంక్షార్థం బవన్!వరించు మాత స్వాతంత్రమ్!
                                                                     
7.గర్భగత"-నయాచర"-వృత్తము.
అత్యష్టీఛందము.న.య.ర.జ.ర.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కలిసి నడుద్దాం!ధాత్రినిన్!"-కరోన"-భూరి సత్సంగమ్!
బలమున సౌ భ్రాతృత్వతన్!వరాల బ్రోచు దివ్యత్వమ్!
తలపుల దిగ్భ్రాంతిం గనన్!తరించు లోక సర్వస్వమ్!
వలనగు కాంక్షార్థం బవన్!వరించు మాత స్వాతంత్రమ్!
8.గర్భగత"-సత్సంగమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.య.ర.జ.ర.మ.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కలిసి నడుద్దాం!ధాత్రినిన్!"-కరోన"-భూరి సత్సంగమ్!కాటు వేయ మాను స్నేహతన్!                                             బలమున సౌభ్రాతృత్వతన్!వరాల బ్రోచు దివ్యత్వమ్!బాటలందు కల్సి తిర్గినన్!                                                     తలపుల దిగ్భ్రాంతిం గనన్!తరించు లోక సర్వస్వమ్!దాటు లేయు కుప్పి గెంతులన్!                                             వలనగు కాంక్షార్థం బవన్!వరించు మాత స్వాతంత్రమ్!వాటమెంచి నెట్టు దుర్గతిన్!
                                                                               
9.గర్భగత"-జంటనడు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేయ మాను స్నేహతన్-"-కరోన"-భూరి సత్సంగమ్!
బాట లందు కల్సి తిర్గినన్?వరాల బ్రోచు దివ్యత్వమ్!
దాటు లేయు కుప్పి గెంతులన్!తరించు లోక సర్వస్వమ్!
వాట మెంచి నెట్టు దుర్గతిన్!వరించు మాత స్వాతంత్రమ్!
10,గర్భగత"-చరితమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.త.న.మ.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేయ మాను స్నేహతన్!"-కరోన"-భూరి సత్సంగం!కలిసి నడు ద్దాం! ధాత్రినిన్!                                            
బాటలందు కల్సి తిర్గినన్!వరాల బ్రోచు దివ్యత్వమ్!బలమున సౌ భ్రాతృ త్వతన్!                                                  
దాటు లేయు కుప్పి గెంతులన్!తరించు లోక సర్వస్వమ్!తలపుల దిగ్భ్రాం తి న్గనన్?                                          
వాటమెంచి నెట్టు దుర్గతిన్!వరించు మాత స్వాతంత్రమ్!వలనగు కాంక్షార్థంబవన్?
                                                                     
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.

27, మే 2020, బుధవారం

దత్తపది పూరణలు.....నిర్వహణ శ్రీ పండరి రాధాకృష్ణ.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

26, మే 2020, మంగళవారం

అంతర్జాలమున శ్రీ పండరి రాధాకృష్ణ నిర్మించిన శ్రీ మైలవరపు మురళీకృష్ణ అష్టావధానము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

25, మే 2020, సోమవారం

మత్తరజినీ,కమ్మని,భారవాహక,హుతవహా,తరుము,పద్మరాగ,క్రూరచేష్టిత,వాడి మయూఖ,రణమజా,పద్మ వ్యూహ,గర్భ"-హీరమ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

 జైశ్రీరామ్.
మత్తరజినీ,కమ్మని,భారవాహక,హుతవహా,తరుము,పద్మరాగ,క్రూరచేష్టిత,వాడి మయూఖ,రణమజా,పద్మ వ్యూహ,గర్భ"-హీరమ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.  జుత్తాడ.
                       
"-హీరమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.న.మ.స.య.లగ.గణములు.యతులు.
10,18.ప్రాసనియమము కలదు.వృ.సం.

చిక్కి తీవు పద్మ వ్యూహమున్!చేరువైతి మరణంబున్!జీవి"-కరోన"-దుశ్చింతనన్!                                               బక్క చిక్కి  డొక్క మాడులే!పౌరుషంబు పడిపోవున్!భావి జగంబు  దూషింప నిన్!                                               తిక్క చేష్ట మాని పొమ్మికన్!తీరిపోవు చెడు పీడన్!దేవి వరాన భూ మండలిన్!                                                       వ్రక్క లౌను నీదు రూపమున్!పౌరులంద శుభగంబుల్!పావకమౌ సు భూతిన్సదా!
                                                                 
1.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
చిక్కి తీవు పద్మ వ్యూహమున్!
బక్క చిక్కి డొక్క మాడులే!
తిక్క చేష్ట మాని పొమ్మికన్!
వ్రక్క లౌను నీదు రూపమున్!
2.గర్భగత"-కమ్మని"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.న.గగ.గణములు.వృ.సం.59.
ప్రాసనియమము కలదు.
చేరు వైతి మరణంబున్!
పౌరుషంబు పడి పోవున్!
తీరి పోవు చెడు పీడన్!
పౌరు లంద శుభగంబుల్!
3.గర్భగత"-భారవాహ"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.ర.గణములు.వృ.సం.151.
ప్రాసనియమము కలదు.
జీవి"-కరోన"-దుశ్చింతనన్!
భావి జగంబు దూషింపగన్!
దేవి వరాన భూ మండలిన్!
పావకమౌ!సు భూతి న్సదా!
4.గర్భగత"-హుతవహా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.న.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చిక్కి తీవు పద్మ వ్యూహమున్!చేరు వైతి మరణంబున్!
బక్క చిక్కి డొక్క మాడులే!పౌరుషంబు పడి పోవున్!
తిక్క చేష్ట మాని పొమ్మికన్!తీరి పోవు చెడు పీడన్!
వ్రక్క లౌను నీదు రూపమున్!పౌరులంద శుభగంబుల్!
5.గర్భగత"-తరుము"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.మ.స.య.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేరువైతి మరణంబున్!జీవి"-కరోన"-దుశ్చింతనన్!
పౌరుషంబు పడి పోవున్!భావి జగంబు దూషింపగన్!
తీరి పోవు చెడు పీడన్! దేవి వరాన భూ మండలిన్!
పౌరు లంద శుభగంబుల్!పావకమౌ!సు భూతిన్సదా!
6.గర్భగత"-పద్మరాగ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.మ.స.య.య.జ.ర.లగ.గణములు.యతులు.
9,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
చేరు వైతి మరణంబున్!జీవి"-కరోన"-దుశ్చింతనన్!చిక్కి తీవు పద్మ వ్యూహమున్!                                               పౌరుషంబు పడి పోవున్!భావి జగంబు దూషింపగన్!బక్క చిక్కి డొక్కమాడులే!                                                   తీరి పోవు చెడు పీడన్!దేవి వరాన భూ మండలిన్!తిక్క చేష్ట మాని పొమ్మికన్!                                                     పౌరు లంద శుభగంబుల్!పావకమౌ సు భూతి న్సదా!వ్రక్క లౌను నీదు రూపమున్!
                                                                     
7.గర్భగత"-క్రూర చేష్టిత"-వృత్తము.
ధృతిఛందము.భ.ర.ర.ర.జ.ర.గణములు.యతి10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జీవి"-కరోన"-దుశ్చింతనన్!చిక్కి తీవు పద్మ వ్యూహమున్!
భావి జగంబు దూషింపగన్!బక్క చిక్కి డొక్క మాడు లే!
దేవి వరాన భూ మండలిన్!తిక్క చేష్ట మాని పొమ్మికన్!
పావకమౌ సు భూతి న్సదా!వ్రక్క లౌను నీదు రూపమున్!
8.గర్భగత"-వాడిమయూఖ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.ర.ర.జ.ర.ర.న.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జీవి"-కరోన"-దుశ్చింతనన్!చిక్కి తీవు పద్మ వ్యూహమున్!చేరు వైతి మరణంబున్!                                               భావి జగంబు దూషింపగన్!బక్క చిక్కి డొక్క మాడు లే!పౌరుషంబు  పడిపోవున్!                                                 దేవి వరాన భూమండలిన్!తిక్కచేష్ట మాని పొమ్మికన్!తీరిపోవు! చెడు పీడన్!                                                       పావకమౌ!సు భూతి న్సదా!వ్రక్కలౌను నీదు రూపమున్!పౌరులంద శుభగంబుల్!
                                                               
9.గర్భగత"-రణమజా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.మ.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేరువైతి మరణంబున్!చిక్కి తీవు పద్మ వ్యూహమున్!
పౌరుషంబు పడి పోవున్!బక్క చిక్కి డొక్క మాడు లే!
తీరి పోవు చెడు పీడన్!తిక్క చేష్ట మాని పొమ్మికన్!
పౌరు లంద శుభగంబుల్!వ్రక్క లౌను నీదు రూపమున్!
10,గర్భగత"-పద్మవ్యూహ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.మ.జ.ర.య.స.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేరువైతి మరణంబున్!చిక్కితీవు పద్మ వ్యూహమున్!జీవి "-కరోన"- ! దుశ్చింతనన్!                                             పౌరుషంబు పడిపోవున్!బక్క చిక్కి డొక్క మాడు లే!భావి జగంబు దూషింపగన్!                                                   తీరిపోవు చెడు పీడన్!తిక్క చేష్ట మాని పొమ్మికన్!దేవి వరాన ! భూమండలిన్!                                                     పౌరు లంద శుభగంబుల్!వ్రక్కల లౌను నీదు రూపమున్!పావకమౌ! సు భూతి న్సదా!
స్వస్తి.
మూర్తి,జుత్తాడ.
 జహింద్.

24, మే 2020, ఆదివారం

డా. జీ.యమ్.రామశర్మ శతావధాని గారితో నా ఛందో భాషణము..... భక్తిసాధనమ్ నిర్వహణలో...

0 comments

జైశ్రీరామ్.
 జైహింద్.

23, మే 2020, శనివారం

మత్రజినీద్వయ,కమ్మనమ్మ,హుతవహా,రణమజా,క్షాత్రధర్మ,రజినీకర ప్రియ,అలల వారి,రంజిమా,శివనారీ,గర్భ"-సా రసార"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

0 comments


 జైశ్రీరామ్
మత్రజినీద్వయ,కమ్మనమ్మ,హుతవహా,రణమజా,క్షాత్రధర్మ,రజినీకర ప్రియ,అలల వారి,రంజిమా,శివనారీ,గర్భ"-సా రసార"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

"-సా రసార"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.మ.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వారి వీరి వారి కాదులే!పారు వారి శివ నారే!పార లేవు వారి తీరునన్!
తీర మేల?చేర వేమయా!ధీర వీర చరితానన్!తీరుగాను చేర లేవులే!
సారసా రసార విందమా!చారు శీల వర భూజా!సార కీర్తి నిల్పు మిబ్భువిన్!
పారమార్ధ భావ పూర్ణవై!వారిదంపు జలభంగిన్!పారు మోక్షగామివో!యనన్?
1.గర్భగత"-మత్రజినీద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
వారి వీరి వారి కాదులే!                 పారలేవు వారి తీరునన్!
తీరమేల? చేర వేమయా!             తీరుగాను చేర లేవులే?
సారసా రసార విందమా!             సార కీర్తి నిల్పు మిబ్భువిన్!
పారమార్ధ భావ పూర్ణవై!              పారు మోక్షగామివో?యనన్!
2.గర్భగత"-కమ్మనమ్మ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.న.గగ.గణములు.వృ.సం.59.
ప్రాసనియమము కలదు.
పారు వారి శివ నారే!
ధీర వీర చరితానన్!
చారుశీల వర భూజా!
వారిదంపు జల భంగిన్?
3.గర్భగత"-హుతావహా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.న.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వారి వీరి వారి కాదులే!పారు వారి శివ నారే!
తీర మేల?చేర వేమయా? ధీర వీర చరితానన్!
సారసా రసార విందమా!చారు శీల వర భూజా!
పారమార్ధ భావ పూర్ణవై!వారిదంపు జల భంగిన్!
4.గర్భగత"-రణమజా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.మ.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పారు వారి శివ నారే!పార లేవు!వారి తీరునన్?
ధీర వీర చరితానన్!తీరుగాను చేర లేవులే?
చారు శీల వర భూజా!సార కీర్తి నిల్పు మిబ్భువిన్!
వారిదంపు జల భంగిన్!పారు మోక్షగామివో?యనన్!
5.గర్భగత"-క్షాత్రధర్మ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.మ.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పారు వారి శివ నారే!పార లేవు?వారి తీరునన్!వారి వీరి వారి కాదులే?
ధీర వీర చరితానన్!తీరుగాను చేర లేవులే?తీర మేల?చేర వేమయా!
చారు శీల వర భూజా!సార కీర్తినిల్పు మిబ్భువిన్!సారసా!రసారవిందమా!
వారిదంపు జల భంగిన్!పారు మోక్షగామివో?యనన్!పారమార్ధ భావపూర్ణవై!
6.గర్భగత"-రజినీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పారలేవు?వారి తీరునన్!వారి వీరి వారి కాదులే!
తీరుగాను చేర లేవులే?తీర మేల?చేరవేమయా!
సార కీర్తి నిల్పు మిబ్భువిన్!సారసా!రసార విందమా!
పారు మోక్షగామివో?యనన్!పారమార్ధ భావ పూర్ణవై!
7.గర్భగత"-అలల వారి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.న.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పార లేవు?వారితీరునన్!వారి వీరి వారి కాదులే!పారు వారి శివ నారే!
తీరుగాను చేర లేవులే?తీర మేల?చేరవేమయా!ధీర వీర చరితానన్!
సార కీర్తి నిల్పు మిబ్భువిన్!సారసా!రసారవిందమా!చారు శీల వర భూజా!
పారు మోక్షగామివో!యనన్!పారమార్ధ భావపూర్ణవై!వారిదంపు జల భంగిన్!
8.గర్భగత"-రంజిమా"-వృత్తము.
అత్యష్టీవృత్తము.ర.జ.మ.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియు కలదు.వృ.సం.
పారు వారి శివ నారే!వారి వీరి వారి కాదులే?
ధీర వీర చరితానన్!తీర మేల? చేర వేమయా!
చారు శీల వరభూజా!సారసా!రసార విందమా!
వారిదంపు జల భంగిన్!పార మార్ధ భావ పూర్ణవై!
9.గర్భగత"-శివ నారీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.మ.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పారు వారి శివ నారే!వారి వీరి వారి కాదులే?పార లేవు?వారి తీరునన్!
ధీర వీర చరితానన్!తీర మేల?చేర వేమయా!తీరుగాను చేర లేవులే?
చారు శీల వరభూజా!సారసా!రసార విందమా!సార కీర్తి నిల్పు మిబ్భువిన్!
వారిదంపు జల భంగిన్!పారమార్ధ భావ పూర్ణవై!పారు మోక్షగామివో!యనన్!

స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.

మత్తరజినీద్వయ,తరంగ,వసుగంథి,యతిర్నవ సుగంథిద్వయ,కొంగు బంగరుద్వయ,రజినీకరప్రియ,కల్పద్రుమ,గర్భ"-గిరివరదమ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

0 comments

 జైశ్రీరామ్.
మత్తరజినీద్వయ,తరంగ,వసుగంథి,యతిర్నవ సుగంథిద్వయ,కొంగు బంగరుద్వయ,రజినీకరప్రియ,కల్పద్రుమ,గర్భ"-గిరివరదమ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                       
"-గిరివరదమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నింగిలోన,మేఘమందునన్!నీటిలోన,గాలిలోన!నీడ,యెండ శ్వాసనుంటివే!
జంగమాల నంటి తిర్గుచున్!చాటుగాను కానరాక!జాడనెంచ వీలుగా నటుల్!
భంగిమాలు గాననీయకన్! బాట,పేట,కోటలందు!పాడుబుద్ధి ప్రాణ ఘాతివై!
నంగనాచి వైతి వేలనే?నాటకాలు మానుమింక!నాడి పట్టు పట్టినా రిలన్!
1.గర్భగత"-మత్త రజినీద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
నింగిలోన,మేఘమందునన్!
జంగమాల నంటి తిర్గుచున్!
భంగిమాలు గాననీయకన్!
నంగ నాచి వైతి వేలనే?

నీడ,యెండ శ్వాస నుంటివే!
జాడ నెంచ వీలుగా నటుల్!
పాడు బుద్ధి ప్రాణ ఘాతివై!
నాడి పట్టు పట్టి నారిలన్!
2.గర్భగత"-తరంగ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.173.
ప్రాసనియమము కలదు.
నీటిలోన,గాలిలోన!
చాటుగాను కానరాక!
బాట,పేట,కోటలందు!
నాటకాలు మానుమింక!
3.గర్భగత"-వసుగంథి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నింగిలోన,మేఘ మందునన్!నీటి లోన, గాలిలోన!
జంగమాల నంటి తిర్గుచున్!చాటుగాను కానరాక!
భంగిమాలు గాన నీయకన్!బాట,పేట,కోటలందు!
నంగ నాచి వైతి వేలనే?నాటకాలు మాను మింక!
4.గర్భగత"-యతిర్నవ సుగంథి ద్వయ"-వృత్తములు.
అత్యష్టీఛందము.ర.జ.రజ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము
ప్రాసనియమము కలదు.వృ.సం.
నీటిలోన గాలి లోన!నీడ,యెండ,శ్వాస నుంటివే!
చాటుగాను కానరాక!జాడ నెంచ వీలు గానటుల్!
బాట,పేట,కోటలందు!పాడు బుద్ధి ప్రాణ ఘాతివై!
నాటకాలు మాను మింక!నాడి పట్టు పట్టినా రిలన్!

నీటి,లోన ,గాలి లోన!నింగి లోన,మేఘమందునన్!
చాటుగాను కానరాక!జంగమాల నంటి తిర్గుచున్!
బాట,పేట,కోట లందు!భంగిమాలు గాన నీయకన్!
నాటకాలు మానుమింక!నంగనాచి వైతి వేలనే?
5.గర్భగత"-కొంగు బంగరు ద్వయ"-వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం
నీటిలోన,గాలిలోన!నీడ,యెండ,శ్వాస నుంటివే!నింగిలోన,మేఘమందునన్!
చాటుగాను,కానరాక!జాడనెంచ వీలు గానటుల్!జంగమాలనంటి తిర్గుచున్!
బాట,పేట,కోట లందు!పాడు బుద్ధి ప్రాణ ఘాతివై!భంగిమాలు గాన నీయకన్
నాట కాలు మాను మింక!నాడి పట్టు పట్టినా రిలన్!నంగ నాచి వైతి వేలనే?

నీటిలోన,గాలిలోన!నింగిలోన మేఘమందునన్!నీడ,యెండ,శ్వాస నుంటివే!
చాటుగాను కానరాక!జంగమాల నంటి తిర్గుచున్!జాడ నెంచ వీలుగానటుల్!
బాట,పేట,కోటలందు!భంగిమాలు గాన నీయకన్!పాడు బుద్ధి ప్రాణ ఘాతివై!
నాట కాలు మాను మింక!నంగ నాచి వైతి వేలనే?నాడి పట్టు పట్టి నారిలన్!
6.గర్భగత"-రజినీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నీడ,యెండ,శ్వాస నుంటివే!నింగి లోన మేఘ మందునన్!
జాడ నెంచ వీలు గానటుల్!జంగమాల నంటి తిర్గుచున్!
పాడు బుద్ధి ప్రాణ ఘాతివై!భంగిమాలు గాన నీయకన్!
నాడి పట్టు పట్టి నారిలన్!నంగనాచి వైతి వేలనే?
7.గర్భగత"-కల్పద్రుమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నీడ,యెండ,శ్వాస నుంటివే!నింగిలోన,మేఘమందునన్!నీటిలోన,గాలిలోన!
జాడ నెంచ వీలుగానటుల్!జంగమాల నంటి తిర్గుచున్!చాటుగాను కానరాక!
పాడుబుద్ధి ప్రాణ ఘాతివై!భంగిమాలు గాన నీయకన్!బాట,పేట,కోట లందు!
నాడి పట్టు పట్టి నారిలన్!నంగ నాచి వైతి వేలనే?నాటకాలు మాను మింక!

స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

22, మే 2020, శుక్రవారం

సమాశ్రీ,భారజా,మత్తరజినీ,దుశ్చర్య,చెరుపు,పతనమౌ,రసగంథి,లెక్కయా,ఛేదిలు,రాలెనే,గర్భ"-కటుతర"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

1 comments

 జైశ్రీరామ్.
సమాశ్రీ,భారజా,మత్తరజినీ,దుశ్చర్య,చెరుపు,పతనమౌ,రసగంథి,లెక్కయా,ఛేదిలు,రాలెనే,గర్భ"-కటుతర"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                       
"-కటుతర"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.స.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.

చేదు వేప కొమ్మ లెల్ల!చేరి"-కరోన"-యెండి పోయె!జీవధాత్రి లెక్క యౌనొకో?
ఛేద లేవు ఉష్ణ హంత్రి!చీరు బిరాన క్రొవ్వదేల?శ్రీ వసంత శోభ వెల్గెనే!
బూది వౌదు చేదు నంట!పోరగ పుల్పు సాయుధాన!భూవరాళి యండ  దండలన్!
బాధ లాపు పిప్ప లొప్పె!పారెదవే!పెశాచి వేగ!భావజారి మాకు రక్ష లే!

భావము:-
పూర్వలు కోరంగిగా బిల్వబడెడు దానిని నేడు కరోనా యనిరి.
కోరంగికి పిప్పలి,ఉసిరి యను నర్ధములు కలవు.అవితగ్గిన వారియందు
కరోనా విజృంభింప వచ్చును.
వేపకు చేదు వన్నె.అట్టి వేప కొమ్మలు కరోనా ధాటికి యెండుచుండెను.
వేపనే లెక్క జేయని కరోనకు మనుజు లేమాత్రము లెక్క కాదు.రక రకాల
జ్వరములను హరించు దివ్యౌషధ మైన వేపను ముమ్మాటికీ జయింపలేవు.
వేప చేదే నిన్ను వడిగా చీల్చి చెండాడును.క్రొవ్వెందులకు,వసంత శోభల
మరలా వేప చిగురించెను లే.చేదు మ్రింగిన నీవు తప్పక బూది వౌదువు.
పులుపనే సాయుధాన పోరాడగా హరించుకు పోదువు.నాయకులు మా
యండదండ లవగా,పరమేశ్వరుడు మము రక్షింపగా!నెటువంటి బాధ
నైన తొలగించు పిప్పలి మావద్ద కలదు.ఓ!పిశాచీ"-నీవు పరుగు లెత్తెదవు!

1.గర్భగత"-సమాశ్రీ "-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు
చేదు వేప కొమ్మ లెల్ల!
ఛేద లేవు ఉష్ణ హంత్రి!
బూది వౌదు చేదు నంట!
బాధ లాపు పిప్ప లొప్ప!
2.గర్భగత"-భారజా"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.జ.గణములు.వృ.సం243.
ప్రాసనియమము కలదు.
చేరి కరోన"-యెండి పోయె!
చీరు బిరాన క్రొవ్వదేల?
పోరగ పుల్పు సాయుధాన!
పారెదవే!"-పిశాచి"-వేగ!
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
జీవధాత్రి లెక్క యౌనొకో?
శ్రీ వసంత శోభ వెల్గెనే!
భూ వరాళి యండదండలన్!
భావ జారి మాకు రక్ష లే!
4.గర్భగత"-దుశ్చర్య"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.స.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేదు వేప కొమ్మ లెల్ల!చేరి"-కరోన"-యెండి పోయె!
ఛేద లేవు ఉష్ణ హంత్రి!చీరు బిరాన క్రొవ్వ దేల?
బూది వౌదు చేదు నంట!పోరగ పుల్పు సాయుధాన!
బాధ లాపు పిప్ప లొప్ప!పారెదవే! పిశాచి వేగ!
5.గర్భగత"-చెరుపు"-వృత్తము.
ధృతిఛందము.భ.ర.జ.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేరి "-కరోన"-యెండి పోయె!జీవ ధాత్రి లెక్క యౌనొకో?
చీరు బిరాన క్రొవ్వదేల?శ్రీ వసంత శోభ వెల్గెనే!
పోరగ పుల్పు సాయుధాన!భూ వరాళి యండదండలన్!
పారెదవే!పిశాచి వేగ!భావజారి మాకు రక్ష లే!
6.గర్భగత"-పతనమౌ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.జ.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేరి "-కరోన"-యెండి పోయె!జీవధాత్రి లెక్క యౌనొకో?చేదు వేప కొమ్మ లెల్ల!
చీరు బిరాన!క్రొవ్వదేల?శ్రీ వసంత శోభ వెల్గెనే!ఛేద లేవు ఉష్ణ హంత్రి!
పోరగ పుల్పు సాయుధాన!భూ వరాళి యండ దండలన్!బూది వౌదు చేదు నంట!                                                 పారెదవే!పిశాచి వేగ!భావ జారి మాకు రక్ష లే!బాధ లాపు పిప్ప లొప్ప!
7.గర్భగత"-రసగంథి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జీవధాత్రి లెక్క యౌనొకో?చేదు వేప కొమ్మ లెల్ల!
శ్రీ వసంత శోభ వెల్గెనే!ఛేద లేవు ఉష్ణ హంత్రి!
భూ వరాళి యండ దండలన్!బూది వౌదు!చేదు నంట!
భావ జారి మాకు రక్ష లే!బాధ లాపు పిప్ప లొప్ప!
8.గర్భగత"-లెక్కయా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.స.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జీవ ధాత్రి లెక్క యౌ నొకో?చేదు వేప కొమ్మ లెల్ల!చేరి "-కరోన యెండి పోయె!
శ్రీ వసంత శోభ వెల్గెనే!ఛేద లేవు!ఉష్ణ హంత్రి!చీరు బిరాన క్రొవ్వ దేల?
భూ వరాళి యండ దండలన్!బూది వౌదు !చేదు నంట!పోరగ పుల్పు   సాయుధాన!                                             భావజారి మాకు రక్ష లే! బాధలాపు!పిప్ప లొప్ప!పారెదవే!పిశాచి వేగ!
9.గర్భగత"-ఛేదిలు"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.జ.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేరి కరోన యెండి పోయె!చేదు వేప కొమ్మ లెల్ల!
చీరు బిరాన క్రొవ్వదేల?ఛేద లేవు ఉష్ణ హంత్రి!
పోరగ పుల్పు సాయుధాన!బూది వౌదు చేదు నంట!
పారె దవే!పిశాచి వేగ!బాధ లాపు పిప్ప లొప్ప!
10,గర్భగత"-రాలెనే"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.జ.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చేరి కరోన"-యెండి పోయె!చేదు వేప కొమ్మ లెల్ల!జీవధాత్రి లెక్క యౌ నొకో?
చీరు బిరాన క్రొవ్వదేల?ఛేద లేవు ఉష్ణ హంత్రి!శ్రీ వసంత శోభ వెల్గెనే!
పోరగ పుల్పు సాయుధాన!బూది వౌదు!చేదు నంట!భూ వరాళి యండ దండలన్!                                                 పారెదవే!పిశాచి వేగ!బాధ లాపు పిప్ప లొప్ప!భావజారి మాకు రక్ష లే!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

21, మే 2020, గురువారం

డా.జీ.యమ్.రామశర్మ గారి సంస్కృత అష్టావధానము. ...భక్తిసాధనమ్ నిర్వహణలో.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

20, మే 2020, బుధవారం

భారణా,పరిహరణా,నిదర్శనా,ఉత్పలాంగిర,శశినీ,గమితమ,రంబకా,హీనధర్మ,రసజ్ఞ,వెనుజను,గర్భ"-త్రాత నీతి"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
భారణా,పరిహరణా,నిదర్శనా,ఉత్పలాంగిర,శశినీ,గమితమ,రంబకా,హీనధర్మ,రసజ్ఞ,వెనుజను,గర్భ"-త్రాత నీతి"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                           
"-త్రాతనీతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.న.భ.ర.య.స.స.లగ.గణములు.యతులు10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తాతల నీతి నిల్పరిక!ధారుణహింస నొప్పుచున్!ధర్మము నెట్టిరి గాలికిన్!
పాతర వేసి కీర్తు లిల!పారగు లంచు బల్కుచున్!పర్మ కిరాతక మెంచిరే!
కాతర సేయ రెవ్వరిని!గౌరవ హీనతం జనన్!కర్మ వికారత మాశ్రతన్!
త్రాతయె జూడగా వలెను!తారయులౌట!కల్లయే!తర్మును భూత పిశాచులున్!
                                                                         
1.గర్భగత"-భారణా"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.న.గణములు.వృ.సం.471.
ప్రాసనియమము కలదు.
తాతల నీతి నిల్పరిక!
పాతర వేసి కీర్తులిల!
కాతర సేయ రెవ్వరిని!
త్రాతయె!చూడగా వలెను!
2.గర్భగత"'పరిహరణా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.ర.లగ.గణములు.వృ.సం.87.
ప్రాసనియమము కలదు.
ధారుణ హింస నొప్పుచున్!
పారగు లంచు బల్కుచున్!
గౌరవ హీనతం జనన్!
తారయు లౌట కల్లయే!
3.గర్భగత"-నిదర్శనా"-వృత్తము.
బృహతీఛందము.భ.భ.భ.గణములు.వృ.సం.439.
ప్రాసనియమము కలదు.
ధర్మము నెట్టిరి గాలికిన్!
పర్మ కిరాతక మెంచిరే!
కర్మ వికార తమాశ్రతన్!
తర్మును భూత పిశాచులున్
4.గర్భగత"-ఉత్పలాంగిర"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.న.భ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తాతల నీతి నిల్పరిక!ధారుణ హింస నొప్పుచున్!
పాతర వేసి కీర్తు లిల!పారగు లంచు బల్కుచున్!
కాతర సేయ రెవ్వరిని!గౌరవ హీనతం జనన్!
త్రాతయె!చూడగా వలెను!తారయు లౌట!కల్లయే!
5.గర్భగత"-శశినీ"-వృయక్షరమ
అత్యష్టీఛందము.భ.ర.య.స.స.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధారుణ హింస నొప్పుచున్!ధర్మము నెట్టిరి గాలికిన్!
పారగు లంచు బల్కుచున్!పర్మ కిరాతక మెంచిరే!
గౌరవ హీనతం జనన్!కర్మ వికార తమా శ్రతన్!
తారయులౌట కల్లయే!తర్మును భూత పిశాచులున్!
6.గర్భగత"-గమితమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.య.స.స.య.స.జ.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధారుణ హింస నొప్పుచున్!ధర్మము నెట్టిరి గాలికిన్!తాతల నీతి నిల్పరిక!
పారగు లంచు బల్కుచున్!పర్మ కిరాతక మెంచిరే!పాతర వేసి కీర్తు లిల!
గౌరవ హీనతం జనన్!కర్మ వికార తమాశ్రతన్!కాతర సేయ రెవ్వరిని!
తారయు లౌట కల్లయే!తర్మును భూత పిశాచులున్!త్రాతయె!చూడగా వలెను!
                      ::                                                        
7.గర్భగత"-రంబకా"-వృత్తము.
ధృతిఛందము.భ.భ.ర.భ.ర.న.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధర్మము నెట్టిరి గాలికిన్!తాతల నీతి నిల్ప రిక!
పర్మ కిరాతక మెంచిరే!పాతర వేసి కీర్తు లిల!
కర్మ వికార తమాశ్రతన్!కాతర సేయ రెవ్వరిని!
తర్మును భూత పిశాచులున్!త్రాతయె!చూడగా వలెను!
8.గర్భగత"-హీనధర్మ"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.భ.ర.న.భ.ర.లగ.గణములు.యతులు10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధర్మము నెట్టిరి గాలికిన్!తాతల నీతి నిల్పరిక!ధారుణ హింస నొప్పుచున్!
పర్మ కిరాతక మెంచిరే!పాతర వేసి కీర్తు లిల!పారగు లంచు బల్కుచున్!
కర్మ వికార తమాశ్రతన్!కాతర సేయ రెవ్వరిని!గౌరవ హీనతం జనన్!
తర్మును భూత పిశాచులున్!త్రాతయె!చూడగా వలెను!తారయు లౌట కల్లయే!
                                                                                 
9.గర్భగత"-రసజ్ఞ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.య.స.జ.లల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధారుణ హింస నొప్పుచున్!తాతల నీతి నిల్పరిక!
పారగు లంచు బల్కుచున్!పాతర వేసి కీర్తు లిల!
గౌరవ హీనతం జనన్!కాతర సేయ రెవ్వరిని!
తారయు లౌట కల్లయే!త్రాతయె!చూడగా వలెను!
10,గర్భగత"-వెను జను"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.య.స.జ.సస.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ధారుణ హింస నొప్పుచున్!తాతల నీతి నిల్పరిక!ధర్మము నెట్టిరి గాలికిన్!
పారగు లంచు బల్కుచున్!పాతర వేసి కీర్తులిల!పర్మ కిరాతక మెంచిరే!
గౌరవ హీనతం జనన్!కాతర సేయ రెవ్వరిని!కర్మ వికార తమా శ్రతన్!
తారయు లౌట కల్లయే!త్రాతయె!చూడగా వలెను!తర్మును భూత  పిశాచులున్!
                                                                         
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.

19, మే 2020, మంగళవారం

బప్రాచీన,దశాశ్రీ,మత్తరజినీ,నిర్జరీ,సతత,సురచాతురి,పసందు,మథుమతి,గతులొసంగు,నభయానీ,గర్భ"-అమరాభయ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
బప్రాచీన,దశాశ్రీ,మత్తరజినీ,నిర్జరీ,సతత,సురచాతురి,పసందు,మథుమతి,గతులొసంగు,నభయానీ,గర్భ"-అమరాభయ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                           
"-అమరాభయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.జ.ర.న.భ.య.జ.య.లగ.గణములు.యతులు.10,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
జరా మరణాల కావలన్!చతురులై సుర వరుల్!చాలినంత గ్రోలిరే!సుధన్!
చరాచర జీవసంఘమున్!సతతముం శుభగతిన్!జాల మేల నీతి పాత్రతన్!
గరీయపు శోభ ధృగ్గతిన్!గతు లొసంగి వరలన్!కాల చక్ర మెల్ల త్రిప్పుచున్!
పరంబు నొసంగ నిల్చిరే!ప్రతిన బూని వసుధన్!పాలనంబు సేతు రెన్నడున్!
1.గర్భగత"-ప్రాచీన"-వృత్తము.
బృహతీఛందము.జ.జ.ర.గణములు.వృ.సం.174.
ప్రాసనియమము కలదు.
జరా మరణాల కావలన్!
చరాచర జీవ సంఘమున్!
గరీయపు శోభ ధృగ్గతిన్!
వరంబు నొసంగ నిల్చిరే!
2.గర్భగత"-దశాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.భ.లగ.గణములు.వృ.సం.184.
ప్రాసనియమము కలదు.
చతురులై సురవరుల్!
సతతముం శుభగతిన్!
గతు లొసంగి వరలన్!
ప్రతిన బూని వసుధన్!
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వో.సం.171.
ప్రాసనియమము కలదు.
చాలినంత గ్రోలిరే సుధన్!
జాల మేల నీతి పాత్రతన్!
కాలచక్ర మెల్ల త్రిప్పుచున్!
పాలనంబు సేతు రెన్నడున్!
4.గర్భగత"-నిర్జరీ"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.జ.ర.న.భ.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జరా మరణాల కావలన్!చతురులై సుర వరుల్!
చరాచర జీవ సంఘమున్!సతతముం శుభగతిన్!
గరీయపు శోభ ధృగ్గతిన్!గతు లొసంగి వరలన్!
వరంబు నొసంగ నిల్చిరే!ప్రతిన బూని వసుధన్!
5.గర్భగత"-సతత"-వృత్తము.
అత్యష్టీఛందము.న.భ.య.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చతురులై సుర వరుల్!చాలినంత గ్రోలిరే!సుధన్!
సతతముం శుభగతిన్!జాలమేల నీతి పాత్రతన్!
గతులొసంగి వరలన్!కాల చక్ర మెల్ల త్రిప్పుచున్!
ప్రతిన బూని వసుధన్!పాలనంబు సేతు రెన్నడున్!
6.గర్భగత"-సురచాతురి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.య.జ.ర.జ.భ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చతురులై సురవరుల్!చాలినంత గ్రోలిరే!సుధన్!జరామరణాల కావలన్!
సతతముం శుభగతిన్!జాలమేల నీతి పాత్రతన్!చరాచర జీవ సంఘమున్!
గతులొసంగి వరలన్!కాలచక్ర మెల్ల త్రిప్పుచున్!గరీయపు శోభ ధృగ్గతిన్!
ప్రతినబూని వసుధన్!పాలనంబు సేతురెన్నడున్!వరంబు లొసంగ నిల్చిరే!
7.గర్భగత"-పసందు"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.జ.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చాలినంత గ్రోలిరే సుధన్!జరామరణాల కావలన్!
జాలమేల ప్రీతి పాత్రతన్!చరాచర జీవ సంఘమున్!
కాలచక్ర మెల్ల త్రిప్పుచున్!గరీయపు శోభ ధృగ్గతిన్!
పాలనంబు సేతు రెన్నడున్!వరంబు లొసంగ నిల్చిరే!
8.గర్భగత"-మథువతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.జ.ర.న.భ.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చాలినంత గ్రోలిరే!సుధన్!జరామరణాల కావలన్!చతురులై సురవరుల్!
జాలమేల ప్రీతి పాత్రతన్!చరాచర జీవసంఘమున్!సతతముం శుభగతిన్!
కాలచక్రమెల్ల త్రిప్పుచున్!గరీయపుశోభ ధృగ్గతిన్!గతులొసంగి వరలన్!
పాలనంబు సేతురెన్నడున్!వరంబు లొసంగ నిల్చిరే!ప్రతినబూని వసుధన్!
9.గర్భగత"-గతులొసంగు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.భ.జ.భ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చతురులై సురవరుల్!జరామరణాల కావలన్!
సతతమున్ శుభగతిన్!చరాచర జీవసంఘమున్!
గతులొసంగి వరలన్!గరీయపు శోభ ధృగ్గతిన్!
ప్రతినబూని వసుధన్!వరంబు లొసంగ నిల్చిరే!
10,గర్భగత"-నభయానీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.భ.జ.భ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చతురులై సురవరుల్!జరామరణాల కావలన్!చాలినంత గ్రోలిరే సుధన్!
సతతముం శుభగతి న్చరాచర జీవసంఘమున్!జాలమేల ప్రీతిపాత్రతన్!
గతులొసంగి వరలన్!గరీయపు శోభ ధృగ్గతిన్!కాలచక్రమెల్ల త్రిప్పుచున్!
ప్రతినబూని వసుధన్!వరంబులొసంగ నిల్చిరే!పాలనంబు సేతు రెన్నడున్!

స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

18, మే 2020, సోమవారం

ఎనిమిదేండ్ల చిరంజీవి శ్రీవిజయ లహరి ఎట్లా నిన్నెత్తూకొందూనమ్మా అనే పాటకు చేయుచున్న కూచిపూడి నాట్యము.

2 comments

జైశ్రీరామ్.
మా పౌత్రి  ఎనిమిదేండ్ల చిరంజీవి శ్రీవిజయ లహరి ఎట్లా నిన్నెత్తూకొందూనమ్మా అనే పాటకు చేయుచున్న కూచిపూడి నాట్యము. చూచి చిరంజీవిని దీవింప వేడుకొనుచున్నాను.
జైహింద్.

నా ఆంతర్జాల అవధానం తే.24 - 4 - 2020 శంకరాభరణం వాట్సప్ లో

0 comments

జైశ్రీరామ్.
నా ఆంతర్జాల అవధానం తే.24 - 4 - 2020 శంకరాభరణం వాట్సప్ లో
ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా గణాధిపతయే నమః.
ప్రార్థన. 

శా.  శ్రీమన్మంగళ భావనాక్షరదుఁడౌ శ్రీ పార్వతీ నందనున్,
శ్రీమద్వాణిని, శ్రీ రమా శుభద నా శ్రీ విష్ణువున్, శంకరున్,
శ్రీమద్బ్రహ్మను నా మదిన్ దలచెదన్  చిత్తంబులో నిల్చి, న
న్నీమాన్యాధ్వరమందు శోభిలునటుల్ హృద్యంబుగా చేయఁగన్.

చ.  గురువులు కల్వపూడి కుల కోవిదులౌ వర వీరరాఘవున్
నిరుపమ భక్తితోఁ గొలుతు, నేర్పరులౌ మన శంకరార్యులన్,
విరియఁగ సద్వధాన విరి పృచ్ఛకపాళియెమూలమంచు ని
త్తరిని నుతింతు వారలను దారిని నన్ గమనింపఁ జేయఁగన్.

సంచాలకుల, పృచ్ఛకుల ప్రశంస. 
ఆటవెలదులు.
కందిశంకరయ్య కమనీయ రమణీయ 
కవితలల్లఁజేయు ఘనులు భువిని
మహితులువెలుదండి మాన్యసత్కవివరుల్ 
గ్రంథ రచన చేయు ఘనముగాను. ౧.

అనుపమాన ప్రతిభు లరయనన్నపురెడ్డి
సత్ ప్రబంధ కర్త సరస మతియు.
సౌమనస్యులరయ సరస  పంచాంగము
సత్యముభువి సుగుణ స్తుత్యమతులు. ౨. 

నారుమంచి వంశ నయ వర్తనుల్ కృష్ణు
లసదృశ ప్రజ పద్య మమరిచి రిల.
ముద్దురాజయాఖ్య పూజ్య సత్కవిఁ జూడ
మోముపైన నగవె ముద్దుఁ గొలుపు. ౩.

శ్రీధరుండె క్షితిని  శ్రీధరరావు సత్
కృతికి కర్తగనయి కీర్తిపొందె.
సుగుణుఁడు మిరియాల ప్రగణిత వంశజ
సత్ప్రసాదు ఘనుడు సహృదయుఁడిల. ౪.

విట్టుబాబు చరిత బట్టి చూచితిమేని
కవిగ బ్రహ్మగ నిల ఘనత గనెను.
ఇట్టి ఘనత నొంది రిచటి సంచాలకుల్,
పృచ్చకాళి నాకు పెంచు కీర్తి. ౫.

వందనంబు చేసి వరలింప గోరుచున్
శారదాంబ కృపను సన్నుతింతు
ప్రేక్షకాళి మదుల నక్షయసత్కీర్తి
కోరుచుంద్రు నాకు గురువులగుచు. ౬.


1.  నిషిద్ధాక్షరి.
డా.వెలుదండి సత్యనారాయణ🏼
అవధాని గారూ! నమస్సులు..

శ్లో. బుద్ధి ర్బలం యశో ధైర్యం
నిర్భయత్వ మరోగతా
అజాడ్యం వాక్పటుత్వం చ
హనుమత్ స్మరణా ద్భవేత్

అనే ప్రసిద్ధ శ్లోక భావంతో
ఆంజనేయుని ప్రార్థించండి.
🏼
నా పూరణ.

క.  శ్రీ లక్ష్యంబుల్ గొల్పున్  
కేలం బ్రోచున్ ప్రభావ నిత్యత్వమ్మున్
మ్రోలన్ మ్రొక్కన్ హనుమన్
బీలమ్ముల్ బాపి శక్తి వెల్గఁగఁ జేయున్.

2.  సమస్యా పూరణ.
శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణరెడ్డి.🏼
గురువర్యులకు, సంచాలకులకు, పృచ్ఛకులకు, అవధానిగారికి నమస్సులు.
నేనిచ్చే సమస్య:
చినవాడే నను చేర్చు స్వర్గమునకున్ చేయంగ నారాధనల్.

నా పూరణ.
చ.  గుణగణ్యుండిల శ్రీహరిన్ దలచుచో కూర్మిన్ గనున్ తాను సద్
వినయంబున్ గలిగించి మంచిఁ గొలుపున్ విశ్వాసమున్ నిల్పుచున్
క్షణమైనన్ విడనట్టివాడు గనుచున్ గాపాడు రాముండు. బ్రో  
చినవాడే ననుఁ జేర్చు స్వర్గమునకున్ చేయంగ నారాధనల్.

3. దత్తపది.
శ్రీ పంచాంగం సత్యం.
నమః సభాయై
అవధానిగారికి నమస్సులు.
నేనిచ్చే దత్తపది :
హంత
ముంత
వింత
చింత

పై పదాలను ఉపయోగిస్తూ
కరోనాకాలంలో నిర్మానుష్యమైన తిరుమలలో  స్వామివారిని సేవిస్తూ ఉత్పలమాలలో
మాల వేయండి.

నా పూరణ
ఉ.🏼  హంతకి యౌ కరోన కరుణాత్ములకున్ వ్యధ గొల్పుచుండగా
ముంత జలంబునైన హరి ముంగిట బెట్టు టసాధ్యమాయెనే  
వింత కరోనచే హరియె వింతగనొంటరిగానె నిల్చెని
శ్చింతగ నుండ జేయుమయ శ్రీహరి సేవలు గొల్పు శంకరా!

4.  న్యస్తాక్షరి.
శ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ.
అవధాని చింతా రామకృష్ణారావు అన్నగారికి నమస్సులు.  మీ అవధానములో నాకు భాగస్వామ్యం కల్పించినందుకు శంకరాభరణం నిర్వాహకులు సమస్యాపృచ్ఛక  చక్రవర్తి  శ్రీ కంది శంకరయ్యగారికి ధన్యవాదములు.   సహపృచ్ఛకులైన పెద్దలందరికి నమస్సులు.
ఇవాళ న్యస్తాక్షరిలో
‘దేశభక్తి’ అన్న పదాలు వినియోగిస్తూ,
ఉత్పలమాల వృత్తములో
“నేటి యువతకు చక్కని దిశానిర్దేశము చేస్తూ  సందేశము ఇవ్వాలని కోరుకుంటున్నాను.
దే మొదటిపాదము 4 వ అక్షరము
శ రెండో పాదము 8 వ అక్షరము
భ మూడో పాదము 12 అక్షరము
క్తి నాలుగో పాదము 17 అక్షరము
అనంతకృష్ణ.

నా పూరణ.
ఉ.  శ్రీకర 'దే'వతార్చకుల చెంత చరించుడు చింత బాయగన్,
ప్రాకట మొప్ప తా ది'శ'ను బాగుగ చూపుచు మంచి గూర్చుచున్,
శోక విదూర మార్గమును  జూపు'భ'వుండు కృపామృతంబునే.
లోకులు దైవమున్ గనుడు లుబ్ధత వీడుచు భ'క్తి'యుక్తులై.

5.  వర్ణన.
శ్రీ ముద్దు రాజయ్య.
అవధాని గారికి నమస్కారం.
నా వర్ణనాంశం :
లాకుడౌనులోస జీవనోపాధి లేని ఒకని మనోవేదనను
ఏదైనా వృత్తంలో వర్ణించండి.
.
నాపూరణ.
ఉ.  శ్రీకరమైన జీవితము చేయుచు కష్టము సాగజేయు మా
భీకరమైన జీవితము వింతగ మార్చెనుగా కరోన మే
మే క్రియ జీవనంబును గణింపక దీనిని సాగజేయుటో
శ్రీకర శ్రీ నృసింహ గని చింతలు బాపుచు నాదుకొమ్మికన్.

6.  ఆశువు. 1
శ్రీ మాచవోలు శ్రీధరరావు.🏼
అందరికి నమస్కారం.
అవధానిగారూ! చాలా కాలం తర్వాత మరల సాహితీ కిరణాలను ప్రసరింప జేయడానికి   సిద్ధమైన  గురువర్యులు, చిత్రకవితా సమ్రాట్ శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి,  సంచాలకులు గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి, పృచ్ఛక కవిమిత్రులకు శంకరాభరణ సమూహ సభ్యులందరికి అభినందనవందనములు.

మ.కో. చిత్రరీతుల కైత  లల్లెడి చింత వారి కనంతకున్
ఛాత్రులన్ దగ తీర్చి దిద్దెడి శంకరార్యుల కంకనల్
మిత్రులౌ వెలుదండకున్ బ్రియ మిత్రులన్నపరెడ్డికిన్
మిత్రులంజయ, ముద్దు , సత్యము, మేల్ప్రసాదు లకున్ నుతుల్!

మఱియు కవిమిత్రులు శ్రీ విట్టుబాబు గారికి అభినందనలు.
మాచవోలు శ్రీధరరావు

అంశము
"హంపీ నగరంలో విజయనగర సామ్రాజ్య శిథిలాలను దర్శించినపుడు ప్రప్రథమంగా మీ మదిలో మెదిలే భావాన్ని ఒక చక్కని ఆశువులో తెలుపండి"

నా పూరణ.
చ.  కలఁ గని మాసినట్లయెను కారణమేమొ గ్రహింపలేము, స
ద్విలసిత హంపి వైభవ్చము భీతిని గొల్పు విధంబు మారెనే!
చిలికెనొకప్పు డా విభవ చిన్మయ సత్సుధ నేమి చెప్పుదున్?
కలియుగదుష్ప్రభావమిది, కాదనలేముగ శ్రీధరా కనన్.                                                                                    
                                                       
7.  చిత్రానికి పద్యం.1

నా పూరణ.
శా.  శ్రీరామున్ మదినమ్మినట్టి ఘనులీ చిన్మార్గ సద్వర్తనుల్,
వీరావేశములొందనేరరు. మహత్ ప్రీతిన్ ప్రసంగించుచున్
శ్రీరామున్మరిపించు మోడి ధరణిన్, చిద్యోగహామిత్తుషా,
లీలన్ వీరలు గొల్పి చూపునది మేలే గాంచ భాగ్యంబిదే.

ఆశువు : 2
శంకరాభరణం వ్వాట్సాప్ ఆన్లైన్ వేదికగా నిర్వహిస్తున్న "అవధాన స్వప్తాహ" వైభవాన్ని గురించి ఒక ఆశువులో తెలుపండి.
🏼
నా పూరణ.
అవధాన సప్తాహ వైభవము.
మ.  అవధానంబన నాట కాదు కనగానాద్యంతమున్ గుండెలే
జవనాశ్వంబులటుల్ చరించి వణుకున్ సప్తాహమింకెంతయో, 
భవుడే శంకరుడై చరించుటను సత్ భావ్యంబుగా సాగెడున్.
నవనీతాన్విత పద్యరాశి కిరవై నవ్యంబుగానొప్పెనే.

చిత్రానికి పద్యం. 2🏼

నా పూరణ.
ఉ.  భారతి ముద్దుబిడ్డడు ప్రభాకర తేజుడె యీ శివాజి, సు  
స్మేరముఖుండు చూడ గుణ సింధువు దేశమునేలె గొప్పగా
శ్రీరఘురాము పాలనను జేసి ప్రశంసలనందె గొప్పగా
భారతి పొంగు నీతని ప్రభావమునెన్నుచు నిత్యమున్ గనన్.

ఆశువు: 3
సూర్యోదయ సమయంలో పవిత్ర వారణాసి నగరంలో గంగా స్నానమాచరిస్తున్నపుడు మీరేమనుకుంటారో ఒక ఆశువులో తెలుపండి.

నా పూరణము🏼
శా.  గంగాస్నానము పాపముల్ తొలఁగగా కాక్షించుచున్ జేసెదన్,
గంగా మాతయు సత్ కృపామృతమునే కాంక్షించి యందించునే.
భంగంబందుట జీవితంబునికపై పారాడ రానేరదీ
గంగా స్నానము సత్ఫలంబునిడుచున్ గాపాడు నన్ నిత్యమున్.

జైహింద్.

17, మే 2020, ఆదివారం

తే.03 . 5 . 2020 ని శంకరాభరణం లో జరిగిన అవధానమును నేనూ అనుసరిస్తూ ప్రయత్నించి చేసిన పూరణలు.

0 comments

జైశ్రీరామ్.
తే.03 . 5 . 2020 ని శంకరాభరణం లో జరిగిన అవధానమును నేనూ అనుసరిస్తూ ప్రయత్నించి చేసిన పూరణలు.

నిషిద్ధాక్షరి. మిర్చిబజ్జి
ఈవేళన్ నే దింటిన్.
భావంబున్ గలిగినట్టి పచ్చి మిరపచే
జీవంబిచ్చెడి బజ్జీ.
దేవా రుచిచూడుమయ్య. తెలియును నీకున్.

సమస్యాపూరణము.
ఉ.  కల్లయెకాదు చూడ కలికాలమహత్యము లోకమందు సం
ధిల్లెడునీయనసంగతము దేవర వింతలు చూడ నేరవా?
చల్లగ వృద్ధురాలికిట సంతతి కల్గెమరంతెకాదు యీ
పిల్లకు పిల్లబుట్టెగద పిన్నతనంబుననబ్బురంబుగన్!

దత్తపది. కరోన సమయంలో స్త్రీసుస్వభావ.
కీటకము,భూతము, రాక్షసి, కయ్యము.

ఉ.  పాయఁగఁ జేసి కీటకము భద్రతనిద్ధర మానవాళికిన్
స్త్రీయె శుభప్రదంబగుచు తీరుగ కాచుచు భూతజాలమున్
పాయ కరోన రాక్షసియె పన్నుగ జేసును శౌచ్యమున్ భువిన్
జ్ఞేయము కయ్యముల్ తుడిచి శ్రేయము గొల్పును స్త్రీలె నమ్మినన్.

న్యస్తాక్షరి.
పార్వతీ పరిణయము.
విశ్వము మెచ్చునట్టులుగ (౧౦ వి)జ్ఞతతో గిరి రాజ కన్య తా
శాశ్వితమైన(౬ మా)ర్గమని చక్కగ నీశ్వరునే వరించగా
శశ్వదనంతకీర్తి గన సమ్మతి (౧౩ సా)గగ జేసె నత్తరిన్
విశ్వవిభున్ మదిన్ గొలిచి వేగమ పెండ్లిని (౧౬ పె)పెద్ద తానెయై.

వర్ణన.
విశ్వరూపంలో కరోనా కల్లోలం శార్దూలములో/
శ్రీకృష్ణా! వర విశ్వరూపమున నే చిత్రంబుగానో కరో
నా కల్లోలము చూచుచుంటి నకటా! న్యాయంబు కాదే కనన్.
నీకే న్యాయము లేనిచో నిక మమున్ నిష్టన్ సదా రక్షణన్
లోకంబందెవరయ్య చేయుదురహో లోకేశ! రక్షింపరా!

ఆశువు. 1
వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి మనోగతం కరోనా వల్ల ఏకాంతంగా పూజల్కందుకొంటున్నందున.
మానవ జాతి చేసెడి యమానుషకృత్య ఫలంబు దైవమౌ
నేనును పొంద తప్పదయె.నిత్యమహోత్సవమీ విధంబుగన్
మౌనముగానె పొందుటది మాకును తప్పకపోయె నక్కటా.
నేనె కరోన బాపెద మనీషులు నాకడ నుండఁ జేయగన్.

చిత్రానికి పద్యం. 1
నల్లపూసలదండ నా నల్లనయ్య
భార్య మెడలోన వేయుటన్ బరవశమున
బ్రాహ్మణాళియు చూచుచు పరవశులవ
లక్ష్మియుప్పొంగె చూడుడు లక్ష్యమునను.

ఆశువు ౨. కరోనా కారణంగా వలస కూలీల బాధ.
కష్టమును చేసి బ్రతికుటే కష్టమయ్యె
పనులు లేవుకరోనచే పస్తులింక
తప్పవాయెను బ్రతుకులే దైన్యమాయె
మమ్ము కాపాడ రావేల మా మహేశ!

చిత్రానికి పద్యం ౨.
దినకరు తేజమెన్నగ సుధీమణులేకద తగ్గ వారు. నే
ఘనముగ నెన్నఁ జూచినను కన్నులనీరవిఁ గాన నేరనే
మనమున గాంచ నెంచినను మాన్యుఁడు నన్ను ననుగ్రహించునా?
క్షణము మనమ్మునన్ నిలువ కమ్మగ నే గని వ్రాయఁ గల్గుదున్.

ఆశువు 3.
చదువులు చెప్పినా మకట సన్నుతి గొల్పగ శిష్యపాళికిన్
వదల దహో కరోన. వరభావ సమృద్ధులు శిష్యులెన్నగా.
మదులు విచార మగ్నమయె మాయపరీక్షలు కాకపోవుటన్.
హృదయము కల్గు దేవ! మదినెన్ని తొలంగగ జేయుమీస్థితిన్.

చిత్రానికి పద్యం 3.
బంగినపల్లి మామిడిది భద్రము మిత్రమ! పెట్టిలోపలన్
రంగుదలిర్ప నుంచుము. పరాకును వీడుము పాడుచేయబో
కంగురుదేవుఁ జేరి యట గౌరవమొప్పగ వారికిమ్ము. ని
న్నంగజ వైరి కాచుత శుభాష్పదుఁడై భువి వెల్గఁ జెయుతన్.

జై శ్రీమన్నారాయణ.
చింతా రామకృష్ణారావు.
జైహింద్.

16, మే 2020, శనివారం

భక్తిసాధనమ్ నిర్వహించిన సమస్యాపూరణము.

0 comments

జైశ్రీరామ్.
 జైహింద్.

15, మే 2020, శుక్రవారం

అంతర్ జాల అవధానాంశములలో అంత్యాక్షరి.... నిర్వహణ భక్తిసాధనమ్ పత్రిక.

0 comments

జైశ్రీరామ్.
 జైహింద్.

14, మే 2020, గురువారం

డా.పాలపర్తి శ్యామలానందప్రసాద్...అంతర్జాల అవధానము...నిర్వహణ భక్తి సాధనమ్ పత్రిక.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

13, మే 2020, బుధవారం

భగవద్భక్తులు తెలుఁగు సంస్కృత భాషాభిమాని శ్రీ పండరి రాథాకృష్ణ....శ్రీ మరుమామల దత్తాత్రేయశర్మ ఉపన్యాసము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

12, మే 2020, మంగళవారం

శ్రీ పండరి రాధాకృష్ణమూర్తిని గూర్చి శ్రీ మరుమామల దత్తాత్రేయశర్మగారు చేయుచున్న పరిచయం.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

11, మే 2020, సోమవారం

సమస్యా పొరణము...భక్తి సాధనమ్.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

వర్ణన ఆశువు.....భక్తి సాధన

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

9, మే 2020, శనివారం

శ్లోకమునకు పద్యానువాదము.....భక్తి సాధన

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! భక్తిసాధన పత్రికా నిర్వాహకులు శ్రీ పండరి రాధాకృష్ణ గారు అంతర్జాలంలో నిర్వహించిన అష్టావధాన ప్రల్రియలలో ఒకటైన శ్లోకమునకు తెలుఁగు పద్యానువాదములో అన్కులు అవధానులు తమ రచనా నైపుణిని కనబరిచినారు. అందు నా అనువాదము కూడా కలదు. 
 జైహింద్.

8, మే 2020, శుక్రవారం

భక్త కన్నప్ప....డా.ముదిగొండ అమరనాథ శర్మ. ప్రవచనము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

7, మే 2020, గురువారం

మోహినీప్రియ,సమాశ్రీ,నీచజన్మ,స్థవనీయ,నీలిమా,కాలవహ్ని,అనుబంధ,తా యశ,ఫలమూల,రంజిత,గర్భ"-జరాత్రయ"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

 జైశ్రీరామ్.
మోహినీప్రియ,సమాశ్రీ,నీచజన్మ,స్థవనీయ,నీలిమా,కాలవహ్ని,అనుబంధ,తా యశ,ఫలమూల,రంజిత,గర్భ"-జరాత్రయ"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                           
"-జరాత్రయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.ర.జ.ర.జ.ర.భ.త.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం
కరోన"-బారి చిక్కినాము!కాలవహ్ని కంఠ ధారి!కందర్పహరా!సాంబ శివా!
నిరంత సేవ దేలు చుంటి!నీలిమంబు నావహించె!నిందింప!కటాక్షించు భవా!
వరంబులిచ్చు భూతనాధ!ఫాల వహ్ని భద్ర రుద్ర!బంధాలు!తెగంజేసె భువిన్!
భరింప లేము!ప్రాణ హాని!పాలిపోయె!లోక కీర్తి!బంధించి!క్రిమిన్ద్రోలు హరా!
1.గర్భగత"-మోహినీ ప్రియ"-వృత్తము.
బృహతీఛందము.జ.ర.జ.గణములు.వృ.సం.342.
ప్రాసనియమము కలదు.
కరోన బారి చిక్కి నాము!
నిరంత సేవ దేలు చుంటి!
వరంబు లిచ్చు భూతనాథ!
భరింప లేము ప్రాణహని!
2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
కాలవహ్ని!కంఠ ధారి!
నీలిమంబు నావహించె!
ఫాలవహ్ని భద్ర రుద్ర!
పాలిపోయె లోక కీర్తి!
3.గర్భగత"-నీచజన్మ"-వృత్తము.
బృహతీఛందము.త.య.స.గణములు.వృ.సం.205.
ప్రాసనియమము కలదు.
కందర్ప హరా!సాంబశివా!
నిందింప!కటాక్షించు భవా!
బంధాలు తెగన్జేసె భువిన్!
బంధించి క్రిమిన్ద్రోలు హరా!
4.గర్భగత"-స్థవనీయ"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.ర.జ.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కరోన బారి చిక్కి నాము!కాలవహ్ని కంఠధారి!
నిరంత సేవ దేలుచుంటి!నీలిమంబు నావహించె!
వరంబు లిచ్చు భూత నాథ!ఫాల వహ్ని భద్ర రుద్ర!
భరింప లేము ప్రాణ హాని!పాలిపోయె లోక కీర్తి!
5.గర్భగత"-నీలిమా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.భ.త.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాల వహ్ని కంఠ ధారి!కందర్ప హరా!సాంబ శివా!
నీలిమంబు నావహించె!నిందింప కటాక్షించు భవా!
ఫాల వహ్ని భద్ర రుద్ర!బంధాలు తెగన్జేసె భువిన్!
పాలిపోయె లోక కీర్తి!బంధించి క్రిమిన్ద్రోలు హరా!
6.గర్భగత"-కాలవహ్ని"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.భ.త.జ.ర.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాల వహ్ని కంఠ ధారి!కందర్ప హరా సాంబశివా!కరోన బారి చిక్కి నాము!
నీలిమంబు నావహించె!నిందింప కటాక్షించు భవా!నిరంత సేవ దేలుచుంటి!
ఫాల వహ్ని భద్ర రుద్ర!బంధాలు తెగన్జేసె భువిన్!వరంబులిచ్చు భూతనాథ!
పాలి పోయె లోక కీర్తి!బంధించి క్రిమిన్ద్రోలు హరా!పాలి పోయె లోక కీర్తి!
7.గర్భగత"-అనుబంధ"-వృత్తము.
ధృతిఛందము.త.య.స.జ.ర.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కందర్ప హరా!సాంబ శివా!కరోన బారి చిక్కి నాము!
నిందింప కటాక్షించు భవా!నిరంత సేవ దేలు చుంటి!
బంధాలు తెగన్జేసె భువిన్!వరంబు లిచ్చు భూత నాథ!
బంధించి క్రిమి న్ద్రోలు హరా!భరింప లేము ప్రాణ హాని!
8.గర్భగత"-తా యశ"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.య.స.జ.ర.జ.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కందర్ప హరా!సాంబశివా!కరోనబారి చిక్కినాము!కాల వహ్ని కంఠధారి!
నిందింప కటాక్షించు భవా!నిరంతసేవ దేలు చుంటి!నీలిమంబు నావహించె!
బంధాలు తెగన్జేసె భువిన్!వరంబు లిచ్చు భూతనాథ!ఫాలవహ్ని భద్ర రుద్ర!
బంధించి క్రిమిన్ద్రోలు హరా!భరింప లేము ప్రాణ హాని!పాలి పోయె లోక కీర్తి!
9.గర్భగత"-ఫలమూల"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.ర.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాల వహ్ని కంఠ ధారి!కరోన బారి చిక్కినాము!
నీలిమంబు నావ హించె!నిరంత సేవ దేలు చుంటి!
ఫాల వహ్ని భద్ర రుద్ర!వరంబు లిచ్చు భూత నాథ!
పాలిపోయె లోక కీర్తి!భరింప లేము ప్రాణ హాని!
10,గర్భగత"-రంజిత"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.ర.జ.ర.భ.త.లగ.గణములు.యతులు9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాల వహ్ని కంఠ ధారి!కరోన బారి చిక్కినాము!కందర్ప హరా!సాంబ శివా!
నీలిమంబు నావహించె!నిరంత సేవ దేలుచుంటి!నిందింప కటాక్షించు భవా!
ఫాల వహ్ని భద్ర రుద్ర!వరంబు లిచ్చు భూతనాథ!బంధాలు తెగన్జేసె భువిన్!
పాలిపోయె లోక కీర్తి!భరింప లేము ప్రాణహాని!బంధించి క్రిమిన్ద్రోలు హరా!

స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

6, మే 2020, బుధవారం

అహమస్మి,సమాశ్రీ,మత్తరజినీ,సత్వర,యతి ర్నవ సుగంథి,చేటు చేష్ట,నీటగు,చింతేల?,నేటికేని,ఉద్వహ,గర్భ"-హతకలి"--వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

 జైశ్రీరామ్.
అహమస్మి,సమాశ్రీ,మత్తరజినీ,సత్వర,యతి ర్నవ సుగంథి,చేటు చేష్ట,నీటగు,చింతేల?,నేటికేని,ఉద్వహ,గర్భ"-హతకలి"--వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                           
"-హతకలి"--వృత్తము,
ఉత్కృతిఛందము.య.జ.ర.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కరోనాలొ పెండ్లి సేయగన్!కాటు వేసి చంపితీరు!కాటి కేగు చింతదేలరా?
నిరాశే వరించు జీవులన్!నేటి కైన బుద్ధి నొప్పు!నీటునౌ!సుజీవ మెంచుమా!
బరోసా నొసంగు నాహరే!వాట మొప్పు దారి నెంచు!పాటు మంచి నెంచు దైవమే!                                                                                    
చిరాకేల?తెల్సి మన్నుమా!చేటుచేష్ట దోష మౌను! సాటి వారలందు మేటివై!
                                                                                     
1.గర్భగత"-అహమస్మి"-వృత్తము.
బృహతిఛందము.య.జ.ర.గణములు.వృ.సం.170.
ప్రాసనియమము కలదు.
కరోనాలొ పెండ్లి సేయగన్!
నిరాశే!వరించు జీవులన్!
బరోసా నొసంగ నా హరే!
చిరాకేల?తెల్సి మన్నుమా!
2.గర్భగత"-సమాశ్రీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
కాటు వేసి చంపి తీరు!
నేటికైన బుద్ధి నొప్పు!
వాటమొప్పు దారి సాగు!
చేటు చేష్ట దోష మౌను!
3.గర్భగత"-మత్త రజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
కాటి కేగు చింతదేలరా?
నీటునౌ!సుజీవ మెంచుమా!
పాటు మంచి నెంచు దైవమే!
సాటి వార లందు మేటివై!
4.గర్భగత"-సత్వర"-వృత్తము.
అత్యష్టీఛందము.య.జ.ర.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కరోనాలొ!పెండ్లి సేయగన్!కాటు వేసి చంపి తీరు!
నిరాశే!వరించు జీవులన్!నేటికైన బుద్ధి నొప్పు!
బరోసా నొసంగు నా హరే!వాట మొప్పు దారి సాగు!
చిరాకేల?తెల్సి మన్నుమా!!చేటు చేష్ట దోష మౌను!
5.గర్భగత"-యతిర్నవ సుగంథి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేసి చంపి తీరు!కాటి కేగు చింత దేలరా?
నేటికైన బుద్ధి నొప్పు!నీటునౌ!సు జీవ మెంచుమా!
వాట మొప్పు దారి సాగు!పాటు మంచి నెంచు దైవమే!
చేటు చేష్ట దోష మౌను!సాటి వార లందు మేటివై
6.గర్భగత"-చేటు చేష్ట"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.జ.త.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేసి చంపితీరు!కాటికేగు చింతదేలరా?కరోనాలొ పెండ్లి సేయగన్?
నేటికైన బుద్ధి నొప్పు!నీటునౌ సుజీవ మెంచుమా!నిరాశే!వరించు జీవులన్!
వాటమొప్పు దారిసాగు!పాటు మంచి నెంచు దైవమే!బరోసా నొసంగు నా హరే!
                                                                                   
చేటుచేష్ట దోష మౌను!సాటివార లందు మేటివై!చిరాకేల?!తెల్సి మన్నుమా!
7.గర్భగత"-నీటగు"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.య.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటికేగు చింతదేలరా?కరోనాలొ పెండ్లి సేయగన్!
నీటునౌ!సుజీవ మెంచుమా!నిరాశే!వరించు జీవులన్!
పాటు మంచి నెంచు దైవమే!బరోసా నొసంగు నాహరే!
సాటివార లందు మేటివై?చిరాకేల?తెల్సి మన్నుమా!
8.గర్భగత"-చింతేల?"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.య.జ.ర.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటికేగు చింతదేలరా?కరోనాలొ పెండ్లి సేయగన్!కాటువేసి చంపితీరు!
నీటునౌ!సుజీవ మెంచుమా!నిరాశే వరించు జీవులన్!నేటికైన బుద్ధినొప్పు!
పాటు మంచి నెంచు దైవమే!బరోసా నొసంగు నాహరే!వాట మొప్పు!దారిసాగు!                                                                                      
సాటివారు మేలుమేలనన్?చిరాకేల?తెల్సి మన్నుమా!చేటుచేష్ట దోష మౌను!
9.గర్భగత"-నేటికేని"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.త.ర.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేసి చంపితీరు!కరోనాలొ పెండ్లి సేయగన్!
నేటికైన బుద్ధి నొప్పు!నిరాశే!వరించు జీవులన్!
వాటమొప్పు దారిసాగు!బరోసా నొసంగు నా హరే!
చేటుచేష్ట దోష మౌను!చిరాకేల?తెల్సి మన్నుమా!
10,గర్భగత"-ఉద్వాహ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.త.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేసి చంపితీరు!కరోనాలొ పెండ్లి సేయగన్!కాటికేగు చింతదేలరా?
నేటికైన బుద్ధినొప్ప!నిరాశే వరించు జీవులన్!నీటునౌ!సుజీవ మెంచుమా!
వాటమొప్పు దారిసాగు!బరోసా నొసందేలరాజీవులన్మ మంచి నెంచు దైవమే ?                                                                                  
చేటుచేష్ట దోషమౌను!చిరాకేల?తెల్వి మన్నుమా!సాటివారు మేలుమేలనన్!

స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

5, మే 2020, మంగళవారం

తే.03 . 5 . 2020 ని శంకరాభరణం లో జరిగిన అవధానమును నేనూ అనుసరిస్తూ ప్రయత్నించి చేసిన పూరణలు.

0 comments

జై శ్రీరామ్.
తే.03 . 5 . 2020 ని శంకరాభరణం లో జరిగిన అవధానమును నేనూ అనుసరిస్తూ ప్రయత్నించి చేసిన పూరణలు.

నిషిద్ధాక్షరి. మిర్చిబజ్జి
ఈవేళన్ నే దింటిన్.
భావంబున్ గలిగినట్టి పచ్చి మిరపచే
జీవంబిచ్చెడి బజ్జీ.
దేవా రుచిచూడుమయ్య. తెలియును నీకున్.

సమస్యాపూరణము.
ఉ.  కల్లయెకాదు చూడ కలికాలమహత్యము లోకమందు సం
ధిల్లెడునీయనసంగతము దేవర వింతలు చూడ నేరవా?
చల్లగ వృద్ధురాలికిట సంతతి కల్గెమరంతెకాదు యీ
పిల్లకు పిల్లబుట్టెగద పిన్నతనంబుననబ్బురంబుగన్!

దత్తపది. కరోన సమయంలో స్త్రీసుస్వభావ.
కీటకము,భూతము, రాక్షసి, కయ్యము.

ఉ.  పాయఁగఁ జేసి కీటకము భద్రతనిద్ధర మానవాళికిన్
స్త్రీయె శుభప్రదంబగుచు తీరుగ కాచుచు భూతజాలమున్
పాయ కరోన రాక్షసియె పన్నుగ జేసును శౌచ్యమున్ భువిన్
జ్ఞేయము కయ్యముల్ తుడిచి శ్రేయము గొల్పును స్త్రీలె నమ్మినన్.

న్యస్తాక్షరి.
పార్వతీ పరిణయము.
విశ్వము మెచ్చునట్టులుగ (౧౦ వి)జ్ఞతతో గిరి రాజ కన్య తా
శాశ్వితమైన(౬ మా)ర్గమని చక్కగ నీశ్వరునే వరించగా
శశ్వదనంతకీర్తి గన సమ్మతి (౧౩ సా)గగ జేసె నత్తరిన్
విశ్వవిభున్ మదిన్ గొలిచి వేగమ పెండ్లిని (౧౬ పె)పెద్ద తానెయై.

వర్ణన.
విశ్వరూపంలో కరోనా కల్లోలం శార్దూలములో/
శ్రీకృష్ణా! వర విశ్వరూపమున నే చిత్రంబుగానో కరో
నా కల్లోలము చూచుచుంటి నకటా! న్యాయంబు కాదే కనన్.
నీకే న్యాయము లేనిచో నిక మమున్ నిష్టన్ సదా రక్షణన్
లోకంబందెవరయ్య చేయుదురహో లోకేశ! రక్షింపరా!

ఆశువు. 1
వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి మనోగతం కరోనా వల్ల ఏకాంతంగా పూజల్కందుకొంటున్నందున.
మానవ జాతి చేసెడి యమానుషకృత్య ఫలంబు దైవమౌ
నేనును పొంద తప్పదయె.నిత్యమహోత్సవమీ విధంబుగన్
మౌనముగానె పొందుటది మాకును తప్పకపోయె నక్కటా.
నేనె కరోన బాపెద మనీషులు నాకడ నుండఁ జేయగన్.
చిత్రానికి పద్యం. 1
నల్లపూసలదండ నా నల్లనయ్య
భార్య మెడలోన వేయుటన్ బరవశమున
బ్రాహ్మణాళియు చూచుచు పరవశులవ
లక్ష్మియుప్పొంగె చూడుడు లక్ష్యమునను.

ఆశువు ౨. కరోనా కారణంగా వలస కూలీల బాధ.
కష్టమును చేసి బ్రతికుటే కష్టమయ్యె
పనులు లేవుకరోనచే పస్తులింక
తప్పవాయెను బ్రతుకులే దైన్యమాయె
మమ్ము కాపాడ రావేల మా మహేశ!
చిత్రానికి పద్యం ౨. 
దినకరు తేజమెన్నగ సుధీమణులేకద తగ్గ వారు. నే
ఘనముగ నెన్నఁ జూచినను కన్నులనీరవిఁ గాన నేరనే
మనమున గాంచ నెంచినను మాన్యుఁడు నన్ను ననుగ్రహించునా?
క్షణము మనమ్మునన్ నిలువ కమ్మగ నే గని వ్రాయఁ గల్గుదున్.

ఆశువు 3.
చదువులు చెప్పినా మకట సన్నుతి గొల్పగ శిష్యపాళికిన్
వదల దహో కరోన. వరభావ సమృద్ధులు శిష్యులెన్నగా.
మదులు విచార మగ్నమయె మాయపరీక్షలు కాకపోవుటన్.
హృదయము కల్గు దేవ! మదినెన్ని తొలంగగ జేయుమీస్థితిన్.
చిత్రానికి పద్యం 3.
బంగినపల్లి మామిడిది భద్రము మిత్రమ! పెట్టిలోపలన్
రంగుదలిర్ప నుంచుము. పరాకును వీడుము పాడుచేయబో
కంగురుదేవుఁ జేరి యట గౌరవమొప్పగ వారికిమ్ము. ని
న్నంగజ వైరి కాచుత శుభాస్పదుఁడై భువి వెల్గఁ జెయుతన్.

జై శ్రీమన్నారాయణ.
చింతా రామకృష్ణారావు.
జైహింద్.

4, మే 2020, సోమవారం

అంతర్జాల వాట్సప్ అవధానం.

0 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా!
కరోనా కారణంగా ఇండ్లకే జనంతా పరిమితమవక తప్పలేదు.
ఇట్టి స్థితిలో కూడా సాహితీవేత్తలు తమ అమూల్యమయిన సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించుకొంటూ సద్వినియోగం చేసుకోవడం ఎంతో ముదావహం.
అవధాని పేఉచ్ఛక చక్రవర్తి బిరుదాంకితులయిన శ్రీ కంది శంకరయ్య గారు తమ శంకరాభరణం వాట్సప్ సమూహమునందు ప్రయోగాత్మకంగా అవధాన నిర్వహణను చేసి సఫలీకృతులవడంతో అవధాన సప్తాహం అని తే.19 - 4 - 2020 నుండి 25 - 4 - 2020 వరకు నిర్వహించి ఎందరో అవధానులకు, కవులకు, పృచ్ఛకులకు ప్రేరణనిచ్చి తన సాహితీ సేవ కొనసాగించారు.
అందులో నాచేత ౨౪ - ౪ - ౨౦౨౦ ని అవధానం చేయించారు. చిన్నప్పుడు ఉద్యోగం చేసే రోజులలోను విద్యార్థులలో సాహితీ పిపాస పెంచుట కొఱకు నేను అవధానం చేసి అవధానులచే చేయించి చూపేవాడిని.
మళ్ళీ ఇప్పుడు భక్తిసాధనం పత్రిక నిర్వాహకులు శ్రీపండరి రాధాకృష్ణ గారు ఒక అవధానం నాచేత చేయించి యూట్యూబులో ఉంచగా శ్రీ మాడుగుల అనిల్ కుమార్ గారు అన్ని పృచ్ఛక పాత్రలూ తానే వహించి నాచే ప్రయోగాత్మకంగా అవధానం చేయించగా ఇప్పుడు శ్రీ కంది శంకరయ్యగారు ప్రత్యక్షంగా వాత్శప్ లో పృచ్చకులెనిమిదిమందిని ఉంచి అవధానం చేయించారు.
ఇటువంటి సేవలు పత్రికలవారి దృష్టికి వెళ్ళగా వారు తమ పత్రికలద్వారా ఈ వార్తను పెఅసారం చేశారు. అందులో ఒక పత్రికా ప్రకటనను మీ ముందుంచుతున్నాను.
కంది శంకరయ్య గారికి ధన్యవాదాలు.
జైహింద్.

3, మే 2020, ఆదివారం

ధారా,మత్తరజినీ,ప్రమాణీ,పఠిష్ట,హేతుక,కాటేయు,జరయజా,బుధా పహా,నిష్పఠిమా,కరాళరాత్రి,గర్భ"-అణుగార్చు"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్
ధారా,మత్తరజినీ,ప్రమాణీ,పఠిష్ట,హేతుక,కాటేయు,జరయజా,బుధా పహా,నిష్పఠిమా,కరాళరాత్రి,గర్భ"-అణుగార్చు"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-అణుగార్చు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.జ.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కర్మకర్తృ కరోన మారి!కాటువేయ కూరకుండునే?కరాళ రాత్రి భూతమై!
ధర్మ గ్లాని బుధాప హాన!దాటి దాటి మీటి ప్రాణముల్!ధరిత్రి హేయ   మేర్చుచున్?                                                 మర్మ జీవుడు మాయ గూర్చె!మాట లేర?ధాత్రిని న్హరా!మరింత తీవ్ర చైదతన్!                                                       దుర్మదం బది!హంత మౌలె!తూటులౌ!పిశాచి దేహమున్!దురాశ గీడ్పడు న్వడిన్!
                                                                             
1.గర్భగత"-ధారా"-వృత్తము.
బృహతీఛందము.ర.స.జ.గణములు.వృ.సం.347.
ప్రాసనియమము కలదు.
కర్మ కర్తృ కరోన మారి!
ధర్మ గ్లాని బుధాప హాన!
మర్మ జీవుడు మాయ గూర్చె!
దుర్మదంబది హంత మౌలె!
2.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
కాటువేయ కూరకుండునే?
దాటి దాటి మీటి ప్రాణముల్!
మాట లేర?ధాత్రిని న్హరా!
తూటులౌ!పిశాచి దేహమున్!
3.గర్భగత"-ప్రమాణీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.జ.ర.లగ.గణములు.వృ.సం.86.
ప్రాసనియమము కలదు.
కరాళ రాత్రి భూతమై!
ధరిత్రి హేయ మేర్చుచున్!
మరింత తీవ్ర చైదతన్!
దురాశ గీడ్పడు న్వడిన్!
4.గర్భగత"-పఠిష్ఠ వృత్తము.
ధృతిఛందము.ర.స.జ.ర.జ.ర.గణములు.యతి10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కర్మ కర్తృ కరోన మారి!కాటువేయ కూరకుండునే?
ధర్మ గ్లాని బుధాప హాన!దాటి దాటి మీటి ప్రాణముల్!
మర్మ జీవుడు!మాయ గూర్చె!మాట లేర!ధాత్రి నిన్హరా!
దుర్మదంబది హంత మౌలె!తూటులౌ!పిశాచి దేహమున్!
5.గర్భగత"-హేతుక"-వృత్తము.
అత్యష్టీ ఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేయ కూరకుండునే?కరాళ రాత్రి భూతమై!
దాటిదాటి మీటి ప్రాణముల్!ధరిత్రి హేయ మేర్చుచున్!
మాట లేర?ధాత్రి.నిన్హరా!మరింత తీవ్ర చైదతన్!
తూటులౌ!పిశిచి దేహమున్!దురాశ గీడ్పడు న్వడిన్!
6.గర్భగత"-దాటులేయు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.జ.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేయ కూరకుండునే?కరాళ రాత్రి భూతమై!కర్మ కర్తృ కరోన మారి!
దాటి దాటి మీటి ప్రాణముల్!ధరిత్రి హేయ మేర్చుచున్!ధర్మ గ్లాని బుధాప హాన!
                                                                                     
మాటలేల?ధాత్రిని న్హరా!మరింత తీవ్ర చైదతన్!మర్మ జీవుడు మాయ గూర్చె!
                                                                                   
తూటులౌ!పిశాచి దేహమున్!దురాశ గీడ్పడు న్వడిన్!దుర్మదం బది!హంత మౌలె!
                                                                                 
7.గర్భగత"-జరయజా"వృత్తము.
అత్యష్టీఛందము.జ.ర.య.జ.జ.గల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కరాళ రాత్రి భూతమై!కర్మ కర్తృ కరోన మారి!
ధరిత్రి హేయ మేర్చుచున్?ధర్మ గ్లాని బుధాప హాన!
మరింత తీవ్ర చైదతన్!మర్మ జీవుడు మాయ గూర్చె!
దురాశ గీడ్పడున్వడిన్!దుర్మదంబది హంత మౌలె!
8.గర్భగత"-బుధాపహా"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.ర.య.జ.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కరాళరాత్రి భూతమై!కర్మకర్తృ కరోన మారి!కాటు వేయ కూరకుండునే?
ధరిత్రి హేయ మేర్చుచున్!ధర్మ గ్లాని బుధాప హాన!దాటి దాటి మీటి   ప్రాణముల్!                                                                          
మరింత తీవ్ర చైదతన్!మర్మ జీవుడు మాయ గూర్చె!మాటలేల?ధాత్రిని న్హరా!                                                                                  
దురాశ గీడ్పడున్వడిన్!దుర్మదంబది హంత మౌలె?తూటులౌ!పిశాచి దేహమున్!
                                                                           
9.గర్భగత"-నిష్పఠిమా"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.స.జ.గణములు.యతి.10,వ.యక్షరము
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేయ కూర కుండునే?కర్మ కర్తృ కరోన మారి!
దాటి దాటి మీటి ప్రాణముల్!ధర్మ గ్లాని బుధాప హాన!
మాట లేల?ధాత్రిని న్హరా!మర్మ జీవుడు మాయ గూర్చె!
తూటులౌ!పిశాచి దేహమున్!దుర్మదం బది హంత మౌలె!
10,గర్భగత"-కరాళ రాత్రి"-వృత్తము.
ఉత్కృతి ఛందము.ర.జ.ర.ర.స.జ.జ.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాటువేయ కూర కుండునే?కర్మ కర్తృ కరోన మారి!కరాళ రాత్రి భూతమై!
దాటి దాటి మీటి ప్రాణముల్!ధర్మ గ్లాని బుధాప హాన!ధరిత్రి హేయ  మేర్చుచున                                                   మాట లేల?ధాత్రిని న్హరా!మర్మ జీవుడు మాయ గూర్చె!మరింత తీవ్ర  చైదతన్?                                                     తూటులౌ!పిశాచి దేహమున్!దుర్మదం బది హంతమౌలె?దురాశ గీడ్పడు న్వడిన్?                                                స్వస్తి
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.