జైశ్రీరామ్.
86. ఓం చండవిక్రమాయ నమః.
త్వరితపదగతి వృత్త గర్భ సీసము.
నరహరి కన నిను స్మరణము విడువను, - దేవా! మహాభాగ! దీనబంధు!
మురహర!
శుభములు తిరముఁగ నిలుపుము - మాలో,
శుభాకార మహిమఁ గొలుపు..
పరమ పథమునిడు పరవశ మగుచుఁ గ - నంగన్, నియతి తోడ నన్నుఁ గనుము.
నిరుపమ వరదుఁడ! నిను నిరతము నిక - వీడన్. మహాదేవ! ప్రేమఁ జూపు.
గీ. త్వరితపదగతి వర్తించి వరలు నీవె - *చండ విక్రమా*! మదిలోననుండుమింక.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
86వ సీస గర్భస్థ త్వరితపదగతి వృత్తము. (న న న న న .. యతి 11)
నరహరి! కన నిను స్మరణము విడువను, దేవా!
మురహర! శుభములు తిరముఁగ నిలుపుము మాలో.
పరమపథమునిడు పరవశ మగుచుఁ గనంగన్.
నిరుపమ వరదుఁడ! నిను నిరతమునిక వీడన్.
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ మహా భాగా! ఓ దీన బంధూ! నిన్ను చూచువరకు నీ
స్మరణమును విడిచిపెట్టను. ఓ
శుభాకారా మాలో శుభములను స్థిరముగా నిలుపుము. నేను పరవశమగుచు చూచునట్లు
పరమపథమునిడుము.. నన్ను కనుచుండుము. వరములొసగుటలో సాటి లేనివాడా! ఓ మహాదేవా! నిన్ను
నేనింక విడువను. ఓ చండవిక్రమా! త్వరితపదగతివృత్తమున కలవాడవు నీవే. నా మదిలో ఉండిపొమ్ము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.