గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఆగస్టు 2026, గురువారం

18.ధృతి ఛందము, వెలసిన వృత్తములు,2.62.288. ... వల్లభేయము ఛందస్సు. రచన శ్రీవల్లభ.

0 comments

జైశ్రీరామ్.

 18.ధృతి ఛందము, వెలసిన వృత్తములు,2.62.288.

                                                రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి

                                                                              జుత్తాడ,


1.సర్వ శ్రేయ వృత్తము,


              కర్మ కర్తృ కారకా!శివా!కమనీయ శోభ నీయవా?

             ధర్మ జ్ఞాన వృద్ధి చేకురెన్!తమ మాయె!భావి జీవితమ్!

             మర్మ రాజ నీతిలన్!మమకార  హేయ స్వార్ధతన్!

            దుర్మదాన జెల్లెనే?తొలి గొల్తు మంచి దీర్చుమా!


సర్వ శ్రేయ వృత్తము,ర,జ,ర,స,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-87537.


2.నీతి గావు వృత్తము,


             .  మల్లేశ!యీశ!సదా శివా!మన సంత నిండి తీవయా!

                భల్లూక పట్టువిధానమే?భవ మేర్చి కూర్చె!భారతిన్!

                విల్లాల నొందు టదే?గదా!పెను ముప్పు జాతి పెంపుకున్!

                 చెల్లాయె!నీతి హర హరా! శివమేర్చి గావ!రా వడిన్!


నితి గావు వృత్తము,త,భ,ర,స,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృసం;-39297.


3.సమోత్పల వృత్తము,


            1.    మానవ చర్యలందుగల!!మంచిని దెల్పుట!గొప్పయౌ!

                   కానని దోష భావములు!కర్మను సత్కృత మొప్పగా!

                    జ్ఞానిద మేర్చు తీరదియె!దివ్యత తేజము పెంపిడున్!

                    మానవ కర్మ మార్భటుల!మంచి ఘటించవె?బాలకా!


       2.     తాతల నాటి ధర్మమది!తప్పెను నేడిల నేలనో?

              కాతర జేయ కెవ్వరిని!కల్లల జీవము నెంచెదే!

               జాతుల సఖ్యతం జెరిపి!సర్వ మనర్ధము గూర్చిరే!

              మేతయె!చేతనం బనగ!మెక్కుట తప్పది గాదొకో?


    3.     గండర గండ డం చిలను!కర్కస కార్యము దోషమౌ!

           కొండలు పిండి సేయగల!కోవిదు లెల్లరు రాలిరే!

           ఛండ ప్రఛండ జీవనము!సర్వము గీడ్పడ జేయులే!

           కొండగ నుండు సర్వులకు!కూర్మి ఘటించుమి!సోదరా!


సమోత్పల వృత్తము,భ,ర,న,భ,భ,ర, గణము లుండును,

యతి,10.వ.యక్షరము,వృ,సం:-93655.


4.నీతి మాలు వృత్తము,


             తెలిసి జేయు పాపములే!తెల్వి నటనైన దోషమౌ!

            కలిని కల్గు కలతలకే?కాటు పడు!భావి సౌఖ్యమ్!

           పలుకు నీతి పల్కు లవే?భద్రమగు భావి శోభయౌ!

           చెలిమి మేలు!జాతి కిడున్!జీవిత మదే?వరీయమౌ!


నీతి మాలు వృత్తము,న,ర,స,భ,జ,ర, గణములుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-113930.


5.ఇలయే  నరకమ్!వృత్తము,


               నరక స్వర్గ మిల లోనే!నరుడ!తెల్సి కొమ్మిదియే!

               కరకు చేష్టలవి యెంచన్!కలిని జీవ నర్క మిదే?

               పరగు సౌఖ్య మరయంగా!పరమ మేర్చు భువిన్!

               తిరుగు లేని!సమతెంచన్!తెలివి  స్వర్గ మదే!


ఇలయే నరకమ్!వృత్తము, న,భ,య,న,ర,స,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృసం;-91164.


6.సారావనీ వృత్తము,


               స్థావర జంగమ ప్రభాసమాన స్థవనీయ భూ రమన్!

              పావన స్వర్గ మన నౌ!ప్రభావ సుమ గంథి!సౌరులన్!

              దేవ వరామ వారియే!వరాంబుధి!సుధీర!ధీరజన్!

              జీవన మందుటదియే!శివంబు!పరంబు నౌ గదే?


సారావనీ వృత్తము,భ,భ,జ,భ,జ,ర,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-83463.


7.:మేలుకో వృత్తము,  


              1.పోటి నిల్చి దుష్ట సంఘమున్!పొంకమార్పు జాతి పెంపుకున్!

                 చేటు వాట తత్వ మూర్ఖులన్!చెంప వాయగొట్టి తర్ముమా!

                పోటి తెల్వి మాయ గమ్మినన్!పూర్తి నాణ్యతంత మౌ సుమా!

                పాలు పోసి పెంచ పాపమున్!పట్టి చంపు ఖ్యాతి నీతినిన్!


        2.   పాత రోత బానిసత్వమే!పట్టి వీడ దాయె!నేటికిన్!

              చేతకాని పౌరుషం బదే!చేరి స్వార్థ పెంపు నెంచెనే!

              భూత మాంత్రి కంబయెన్!భూతి గోరి జాతి పంటనన్!

             గోత బడ్డ గొడ్డు తీరయెన్!కూడు గుడ్డ లోటు తీరునే?


       3.     పట్టు పట్టి స్వర్గదామమే!పట్ట నెంచు నాశయే!

               కొట్టి తట్టి లేపి తెల్వినిన్!గుట్టు పట్టి స్వర్గ మందెదే?

              నెట్టు లీవు?సృష్టి మూలమున్!నిష్ట పట్టి దైవ మౌదువే?

              పొట్ట నిండ తిండి లే దిలన్?పోడిమంబు మాప!న్యాయమా!

         


మేలుకో,వృత్తము,ర,జ,ర,ర,జ,ర,గణము లుండును,

యతి.10.వ,యక్షరము,వృ,సం;-87211.


8.ఆశా వర వృత్తము,


            ధన దాహము తీరబోదు!దండమూని బాదినా సరే!

           పెను ముప్పుల చిక్కుకున్న!పెంకితీరు మార నోపునే!

           తన ధర్మమె!గొప్పటంచు!తప్పు దారి వీడ మానునే!

           మను నీచ  కఠోర దీక్ష మంట గల్పు జాతి నీతినిన్!


ఆశాపర వృత్తము,స,స,జ,ర,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-87228.


9.ఈవి లేని వృత్తము,


              ఈవి ,నీడ లేని బ్రతుకు!యేడ లేని?పీడయే?సుమా!

             కాన గల్గు ధర్మమునకు!కంటి గుడ్డ చూడనీ నటుల్?

             మానవత్వమున్న నరుని!మాయ లోక నీతి వాచ్యమే!

              చేనుమేయు కంచి!వలెను!చేడు లాడె నీతి  చేతనల్!


ఈవి లేని వృత్తము,ర,జ,న,ర,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-87521.


10.ప్రగల్భ వృత్తము,


              మిక్కిలి తప్పులు జేయుచు!మేటిగ పర తప్పు లెంచన్!

              టక్కరి దొంగయె!కాదొకొ?తప్పును పరిరక్ష  చేతౌ!

             అక్కట?లేనిది  యున్నటు!అక్కజమని బల్క నీతే?

             మ్రొక్కరు దుర్గుణ జన్యుల!మోసరిక మదేను!ధాత్రిన్!


ప్రగల్భ వృత్తము,భ,,భ,భ,భ,స,య,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం;-48567.


11.నీతి మాలు వృత్తము,


           సత్వ రజః స్థమోగుణాల!సత్వ మేడ కేగెనో?భువిన్!

           కత్వ,కుఠారి వాట మెల్ల!కల్మి నీయు దైవ మాయెనే!

           స్తుత్వ మదే?విధాన మొందె!జుఱ్ఱ దేశ!ఖ్యాతి నీతినిన్!

           జిత్వ మనం కరాళ దంష్ట్ర!చీకు టాయె!స్వేచ్ఛ తుచ్ఛమై!


నీతి మాలు వృత్తము,భ,ర,జ,ర,జ,ర,గణము లుండును,

యతి.10.వ,యక్షరము,వృ,సం:-86017.


12.ఆశావాద వృత్తము,


              తోడూ నీడా లేదు!తొల్లి తుష్టి పుష్టి లేదాయె?నేడిలన్!

              పాడీ పంటా పోయె!సత్య!భంగ మాయెసర్వేశ!యాశ్వరా!

              కూడూ గుడ్డా లేనివారు!కూర్మి నొందు రోజేదీ?భూతలిన్!

              చీడా పీడా వీడి! సర్వ శ్రేయ!వాంఛ!సాకూల్య మౌనొకో?


ఆశావాద వృత్తము,మ,త,ర,జ,త,ర,గణములుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-104651.


13.భాగ్యమేర్చు వృత్తము,


            మండు టెండ బోడి వాటమై!మలమల మాడేను లోకమ్

             బండ నీతి జ్ఞాన వాసమై!పదిలత లే దెంచి  చూడన్!

             కొండ కోన లెల్ల మ్రింగెడిన్!కుజనుల కీడేర్చ వేమీ?

             ఛెండి రక్కసాళి సర్వమున్!సిరు లలరం జేయ రావే?


భాగ్య మేర్చు వృత్తము,ర,జ,ర,న,య,య,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సై:-40619.


14.సుగుణ వృత్తము,


            నీతికి జాతితో?పనేమి?నిర్మల తత్వము గావలెన్!

            ఘాతుక చర్యలం విడంగ!కాంచుమి!సత్యము నిత్యమున్!

             మాతను గౌరవించు మెల్ల!మంచికి పాటిలు సర్వదా!

             భీతిల మాని!మంచి నెంచు!పించ మడంచుమి నీచులన్!


సుగుణ వృత్తము,భ,ర,జ,భ,భ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వ,సం;-93571.


15.స్థితి కర వృత్తము,


               రసవత్తర స్తవ్య గుణా!రమణీ వర శ్రీ హరినిన్!

               వెస ధర్మ పరీక్షకునిన్! విధి నిర్మిత జన్యుల తా

               పస నిల్పగ!జూచు విభున్!ప్రధమున్!ధర బ్రోచు గురున్

                దెస లెల్లను తా ననగన్?భిషగున్మది గొల్తు సదా!


స్థితికర వృత్తము,స,స,స,స,స,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం;-112298.


16.సుజీవనా వృత్తము,


            గుణాతీతుడు!సద్గురుడు!కోర్కెలు దీర్చెడి!శంకరున్!

           మణి పూసయె!రక్షణను!మా విభు మల్లి నాథునిన్!

             ఫణి భూషణుడా హరుడు!భక్త జనార్తుల దీర్చుచున్!

             ప్రణవంబును!భీజమును భద్రత గూర్చె నిలాతలిన్!


 సుజీవనా వృత్తము,య,భ,న,భ,భ,ర,గణములుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-93658.


17.పాలనా వృత్తము,


              వికట సంకటు లేలికన్?వినాశమౌ?జగమెల్లయున్!

              ప్రకటి తంబుల పిచ్చదే?ప్రమాధ మేర్చు భావికిన్!

             సకల శ్రేయము గాంచకన్!క్రమంబు దప్పు జాలమున్!

              వెకిలి చైదపు వర్తనన్!బికారు లౌదురు లోకులున్!


పాలనా వృత్తము,న,భ,ర,జ,భ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-92856.


18.గాన పీయూష వృత్తము,


               కక పిక రావ భేదమే?కలిమి లేమి జీవా లిలన్!

              పికంబు కకం బు నౌ నొకో?వెలితి లేని గాన మంజరిన్!

              కకము కకంబె?మారదే?కడయు లేని దీర్ఘ జీవమున్!

              కక విక లేల?మానుమా!కను పికంపు మేలు జీవనన్!


                      [ కకము=కాకి, పికము=కోకిల పక్షి]


గాన పీయూష వృత్తము,ర,జ,ర,న,ర,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-97584.


19.దుర్మతి వృత్తము,


            సాటి వాడు వెతల జిక్క! సంత సించు దుష్ట జన్మునిన్!

            మేటి యైన మనన తప్పు మేథ నెంచి పెట్టు మావలన్!

           గోటు నీటు పనికిరాదు!కోరు సర్వ శ్రేయ మిద్ధరన్!

           మోటరైన చెడును ధాత్రి!మోది లంగ దోష చర్యలన్!


దుర్మతి వృత్తము,ర,న,జ,ర,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృసం:-77479.


20.మంచి కోరు వృత్తము,


            మనుజులందు మంచి పెంచు!సమత మమతదే?సుమా!

           కనులు గప్పి మోస పుచ్చ!కనను వశమె?సామ్యమున్!

            ఘనత!స్వార్థ చింత నొప్ప!కనుమరుగగు స్వేచ్ఛయే?

            మనుజ జన్మ !యుత్తమంబు!మనగ వలెను!నీతినిన్!


మంచి కోరు,వృత్తము,న,ర,జ,న,న,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-98136.


21.పదవీ మోహ వృత్తము,


              తినుటకే!పదవి యంచు!ప్రాకులాడు లోకమాయెనే!

             వెనుక ముందు గన మాని!వేత్త లట్లు బింక మోపగా!

              పెనుగు లాట!సిరి కోరె!పిచ్చి లోక పోక డెంచిరే!

               కొనకు దేశ ప్రగ తెంచ!కొంచె మైన దీక్ష బూనరే!


పదవీ మోహ వృత్తము,న,భ,జ,ర,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-87316.


22.మానవ నైజం,వృత్తము,


              అవని సర్వము నొందినా!యాశ విడదు మానవాళిన్!

              భువన భాండము లన్నిటన్. !భోజ్యము మది గోరు టాశన్!

              గవము దాటిన వీడడే?కామితములు పొందు దన్కన్!

              శివత మెంచడు నెన్నడున్?చేటు నడత యూహె!దప్పన్!


మానవ నైజం వృత్తము,న,భ,ర,భ,స,య,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం;-47312.


23.ధర్మం చర వృత్తము,


        1.     భూరి సత్వుడ!నే నటంచున్!బుద్ధిమాలి చరించె దేలన్?

                కోరి నిల్తురు తాట తీయన్!కూర్మి రోజు లేగు నాడున్!

                కోరి కోరకు!పాపి మూకన్!కూల్తురే?భవి జీవితంబున్!

                నేర చర్యది దోషమేయౌ!నీతి జీవన ధన్యతేర్చున్!


       2.    హద్దు పద్దుల దూర మాయెన్!యాత్మ రక్షణ వేద భూమిన్!

              పద్దు మారెను!దేశ భద్రమ్!పాప పంకిల మాశ్ర యించెన్!

               నిద్దు రించెను న్యాయ శాస్త్రమ్!నేతలండల బంధి యౌచున్!

               పద్ధతే గన దెందు చూడన్!పండ దాయెను పాప మేమో?


ధర్మం చర,వృత్తము,ర,స,య,ర,స,య,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-46161.


24.సృష్టిశోధన,వృత్తము,


               చతుర్ముఖ బ్రహ్మ సృష్టికిన్!సాటిలేని సృష్టి చేయగా!

              ప్రతాపము జూప నెంచిరే?ప్రజ్ఞ మీరె!మేథ పెంపునన్!

             గతాను గతెంచి మించగన్!కర్తృ సృష్టి మూల మారయన్!

              మతెంచి పరంపు మన్గడన్!పట్ట నెంచు దీక్ష నొప్పిరే!


సృష్టి శోధన వృత్తము,జ,జ,ర,ర,జ,ర,గణము లుండును,

యతి,10.10.వ,యక్షరము,వృ,సం:-87214.


25.ఆగత మెంచు వృత్తము,


              సృష్టి రహస్య శోధనమే!జీవ జ్ఞానము పెంపు నేర్పన్!

             స్రష్టయు గావు గొప్ప సరే!సర్వ భూత ప్రకోప మార్పన్!

              భ్రష్టపు జన్మ యౌ తుదిన్!భావి యేమగు?నూహిలంగన్!

              అష్ట విశిష్ట శ్రేష్టితమై! హర్ష మీయగ!నోప నౌనే?


ఆగత మెంచు వృత్తము,భ,ర,స,ర,స,య,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-46295.


26.ఛేదనా ధృతి వృత్తము,


             పూర్ణా పూర్ణ ప్రపూర్ణ పూర్ణ!భూర్భు వస్వాది!బ్రహ్మాండమున్!

            వర్ణా వర్ణ వివర్ణ వర్ణ!వర్ణిత!భద్రపు జన్య జీవాత్మలన్!

             పర్ణా పర్ణ సుపర్ణ పర్ణ!ప్రాగ్భవ దీప్తిద మైన కాదంబమున్!

              వర్ణాశ్రంపు సు ధర్మ ధర్మవాస్తవ సృష్టి!ఛేద్యంబొకో?


ఛేదనా ధృతి,వృత్తము,మ,స,జ,భ,ర,ర, గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-67145.


27సర్వం స్వాహా వృత్తము,


               వినాశ విద్వద్వి జ్ఞానమే!విశ్వ సృష్టిన్!విధ్వంశ మేర్చన్!

              ఘనం బదే?యంచు నీర్ష్యతన్!కార్పణ్య దృష్టెంతు వేలన్?

               చనెండు ప్రాణాలు!నాపగా!శక్తేది?నీ శాస్త్ర మందున్?

                 కనంగ సమంబు యోచనన్!కక్షేల?రక్షించు సర్వులన్!


సర్వం స్వాహా వృత్తము,జ,మ,ర,ర,మ,య,గణము లుండును,

యతి.10.వ,యక్షరము,వృ,సం:-33926


28.మూర్ఖ జ్ఞాన వృత్తము,


               పరమ భీభత్సాలే?ప్రాణాపాయం బేర్చ!వీక్షించు చీవున్!

               పెరగ!ప్రాచుర్యం బెంచేవే?విధ్వంసంబు కాహ్వాని యౌచున్?

               అరరె? మార్చం!భూగోళంబున్!అణ్వాస్త్రాల!సారింతు నంటే?

               తరగు!జీవా లెల్లన్!కాస్తంతైనా!తర్కించేవ!జ్ఞానంబు తోడన్!


మూర్ఖ జ్ఞాన వృత్తము,న,మ,మ,మ,య,య,గణము లుండును,

యతి.10.వ,యక్షరము,వృ,సం,36872.


29.పరోపకార వృత్తము,


               భూ భార తుల్యంబు సేయగా!భూతాల ధాత్రేల?నుండగన్?

              నీబోడి దుశ్చర్య!తప్పగున్!నీవెంత?తెల్వెంత!తెల్సికో!

             చేబూను జీవాల రక్షయున్!శిష్టంపు నీకీర్తి !వర్తిలన్!

             పోబోకు తెల్వెంచి జీవముల్!పుణ్యుండవై యొప్పు!జ్ఞానతన్!


పరోపకార వృత్తము,త,త,ర,త,త,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం;-75133.


30.కర్మ జీవ వృత్తము,


              కర్మమే!జను జీవి వెంటన్!కల్మి లేము లిచటే!యుండున్!

             ధర్మ మార్గము గాచు!మంచిన్!తారకంబదియె లే!జీవా!

              నర్మ జీవన జీర!పాపమ్!నమ్రుడై!నిలుమ!శాశ్వతమ్!

             చర్మధారిగ  జేయు!భక్తిన్!సర్వ మీశ్వరమె!గాదొకో?    


కర్మ జీవ వృత్తము,ర,స,య,ర,స,ర,గణము లుండును,

యతి,10.వయక్షరము,వృ,సం:-78939.


31.పూర్ణిమా వృత్తము,


             గురు పూర్ణ భూతి!విభూతి కోరుమి!ముక్తిదం. బదేలే!

            చరణాబ్జముల్!స్పృశింప!సద్గతి గల్గు!నెంచు మోయీ!

             పరార్థ పూర్ణ ప్రకీర్తి! వాటిలు!శోభిలు న్శుభాలన్!

             నిరతాయు వేర్చు విభుడే!నిశ్చల దీక్షతం!జనంగన్!


పూర్ణిమా వృత్తము,స,త,స,భ,ర,య,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-44260.


32.నవమే మూలం,వృత్తము,


             నవమే!మూలం!సృష్టికిన్!ప్రణవంబే!యోంకారమ్!విశ్వంబౌ!

            స్థవనీయంబౌ!భీజముల్!పస గూర్చు న్వైశిష్ట్యమ్!తేజానన్!

              భువి శక్తి పెంపేర్చుచున్!సు భూతి న్దోడ్పాటై! వర్తించున్!

              జవ సత్వాలం గూర్చుచున్!వశమాయెన్!శోధించే దేదీ?


నవమే మూలమ్ వృత్తము,స,మ,జ,స,మ,మ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-1860.


33.మనసే మమత,వృత్తము,


          1.    మనసు దెలిసి మసలు!మమత లొలుకు జీవమౌ!

                 వినక చెడును వదలు!విసుగు గొనకు!బాలకా!

                 తనకు తగని పనికి!తగునని జన బోకుమా!

                  అనయ వినయ మొలయ!యవని సుఖము నొందుమా!


       2.     అనకు వినకు చెనకు!అనృత మహిత చెడులన్!

               పనిగ పరుల హితము!పరమ మమర జేయుమా !

                 హరులు సురలు విరులు!యమృత మొనర!కీర్తిలన్!

                 అరరె?పురము లవని!యమరు!సృజనవాటులై!


మనసే మమత,వృత్తము,న,న,న,న,న,ర,గణము లుండును,

యతి,10.యక్వషరము,వృ,సం:-97304.


34.మేల్కోరు వృత్తము,


           చదువగ ముచ్చట పడు!జగడాల కేగు దూరమున్!

            పదవిని స్వచ్ఛత గను!పర సొమ్ము కోర కెన్నడున్!

            ముద మొదవం జనుమయ!ముదిమిం శివంబు నెంచుమా!

              బుధ నుత మార్గము నడు!పుర మేలు కోరు!నీతినిన్!


మేల్కొను వృత్తము,న,జ,న,స,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం;-88408.


35.పావన వృత్తము,


          సాయపడు కష్ట మందునన్!సర్వ శ్రేయమదే?బాలకా!

         న్యాయమది కాచు సర్వదా!నర్మ దూర మదే?నీతియౌ!

           మాయ నడతెంచ బోకుమా!మాయ పాప మిడు న్వీ!డుమా!

           బాయకుమి!తల్లి దండ్రులన్!పావనం బదియె!జన్మకున్!


పావన వృత్తము,భ,జ,ర,ర,స,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-76023.


36.నడవడి వృత్తము,


           గోడు లేని జీవన మది!కోరు మంచి నెల్ల వేళలన్!

          పాడు వారి దూర మిడుచు!పద్ధతెంచి మెల్గు మంచిగా!

          తోడు నీడ!బాయకు మయ!తుళ్వ చేష్ట దోషమే!యగున్!

          వాడి మాట దోష మయా!పౌర కక్ష లోను నౌదువే!


నడవడి వృత్తము,ర,జ,న,ర,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-87601.


37.నీతి మసలు,వృత్తము,


           త్రికాల జ్ఞాని వీవు కావు!తెలిసి మసలు నీతినిన్!

            ప్రకోప తాప మాపకున్న!పడు నిశితపు జ్ఞానమున్!

             వికార స్వార్థ చింత వింత!వెనుక నడచు పాపమై!

              పుకారు మాట!నమ్మరాదు!బుధత చెడును బాలకా!


నీతి మసలు వృత్తము  జ,ర,జ,న,న,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-98124.


38.తగని యాశ వృత్తము,


              వరాశ పాశమేల!నయ్య!పరగు నీతి నిర్మలతన్!

             దురాశ దుఃఖ హేతు వౌను!తురుమి ఖ్యాతి సర్వ మిలన్!

              నిరర్థమైన యూహ మాను!నెరపు సామ్యవాద మిలన్!

              పరోపకార బుద్ధి గల్గి!వరదు డౌమి!బాలకుడా!


తగని యాశ వృత్తము,జ,ర,జ,న,ర,స,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం;-110414.


39.గతం రాదు,వృత్తము,


              కాల చక్ర భ్రమణంబునన్!గతము తిర్గి రాదు సుమా!

             చాలు వక్ర చరం బవనిన్!చరిత నిల్పు నీచునిగా!

            పాలుపోని పరార్థ మదే?పరము నందనీదు!గుణా!

            బేల గాక చరించు మిలన్!పెను వసంత శోభిదమౌ!


గతం రాదు వృత్తము,ర,న,ర,న,ర,స,గణణము లుండును,

యతి,10.యక్వషరము,వృ,సం;-1102 63.


40.శివుడే రక్ష,వృత్తము,


               కాలి బూడి దౌను దేహమే!కనుమరుగై పోదువయా!

               ఆలి రాదు!యాస్థి రాదయా!యట శివుడే!రక్ష సుమా!

                కాలమందు నాశ పాశివై!కలి'సిరులే!కోరితివే!

                జాలమందు మంచి నెంచుమా!సరగుమి!సంసారివై!


శివుడే రక్ష వృత్తము,ర,జ,,ర,న,జ,స,గణము లుండును,

యతి.10.వ,యక్షరము,వృ,సం:-122032.


41.అతి తెల్వి వృత్తము,


             వనరులే!ధనంబీయగన్!వద్దందురె?పాలనం బిలన్!

            ధనపు టంచు పెంచేరిలన్!దాసో హమ్!దైవ మేర్చిరే!

             గొనపు తీరెంచేరొకో?గోదాములె!నింపు సంపదన్!

             వెనుక రోజుల న్మించిరే!విజ్ఞాన మనన్య సాధ్యమై!


అతి తెల్వి వృత్తము,న,ర,ర,త,జ,ర,గణము లుడును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-88216.


42.కీర్తి కోరు వృత్తము,


              ఏమి జూచి మిడిసె దీవు!యెగిరి పాటు యీడ్చి తన్నున్!

             పాము కాటు కెదురు నిల్చి!పరమ నీతి పల్క నేలన్?

              క్షేమ మెంచి బ్రతుకు నీతి!చివరి జీవ మెంచు!భక్తిన్!

               మామకం బలర నిష్ట మహిత కీర్తి గోరు మెల్లన్!


కీర్తి కోరు వృత్తము,ర,న,జ,న,ర,య,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-44923.


43.కుల జాఢ్య వృత్తము,


          భిన్నత్వంబున!నేకత్వానన్!ప్రీతి భారతి!భాసి లంగన్! 

           పెన్నాశం కుల జాఢ్యంబేలెన్?విశ్వ కల్మష!రాజి యౌచున్!

           చెన్నొందెం గడు దుర్మార్గంబుల్!చీల్చె జాతుల!స్నేహ భావమ్!

             అన్నింట న్విడ దీసేనోయీ?హర్ష మేగతి?గల్గు జాతిన్


కుల జాఢ్య వృత్తము,మ,స,మ,ర,స,య,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-46105.


44.నీతి జ్ఞతా వృత్తము


      1.         కుల మతాలు రెచ్చగొట్టి!కొల్లగొట్టు స్వేచ్ఛి దాయెనే?

                 కులము సంఖ్య నేలి కేర్చ!కూల్చె నైక్య భావ మిద్ధరన్!

                 బలము లేని బీద సాద!భంగ మొందె! నెందు చూడగన్!

                 కలత లేని!స్వేచ్ఛ యేది?కంగు తిన్న నీతి మాతరో?


    2.        నలువ రాణి వీణ పాణి!నాట్య మాడు స్థవ్య  ఛందమున్!

               వలయు జ్ఞాన సెద్ధి గూర్చి!భద్ర మేర్చు ఛంద రాజమై!

               తలప దృశ్య శ్రావ్య కావ్య!ధాత్రి కింపు పెంపు గూర్చుచున్!

               చెలిమి గూర్చె!జ్ఞాన దీప్తి!జీవ ధాత్రి యౌచు  భారతిన్!


నీతి జ్ఞతా వృత్తము,న,ర,జ,ర,జ,ర,గణము లుండును,

యతి.10.వ,యక్అషరము,వృ,సం:-87386.


45.సర్వత్రా జయమా వృత్తము,


          భూత ప్రేత భూ భుక్తమే!పురోగతిన్!మాప కోపునే?

          త్రాత నైన భోంచేయగా!ధరాతలంబొప్పె!నీచతన్!

         పోతరించి దాహార్తులై!పురాలు దోచంగ నెంచిరే!

         చేతగాని స్వార్థంబదే!జయంబు సర్వంబు నౌ నొకో?


సర్వత్రా జయమా వృత్తము,ర,య,జ,జ,త,ర,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-84781.


46.పటువొందు వృత్తము,


             చేటు ఓటు నాట్యమా యిది!శివరంజిని సరాగమా!

              చోట నిల్వ లేని శ్రీరమ!శివ సోదరి విలాసమా!

               భూటకాల భూతి చేష్టయా!భువి యందలి ప్రలోభమా!

                ఆట కట్టు జేయ!రావయ! హర,కపర్థి, విభూతిదా!


పటువొందు వృత్తము,ర,జ,భ,స,న,ర,గణము లుడును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-96161.


47.కలికుల్కు వృత్తము,


               పలుకుబడి,లంచాలకు!బానిసాయె!నీతి నే డిలన్!

               నిలకడయు లేదాయెనె!నీతి మాలె!దుష్ట చర్యలే!

                బలిదులకు!నీతాయెనె!భద్ర నీతి గూర్చు దైవమా!

                 కలి కుల్కులం జిక్కెలె?కాస్త మేలు జాతి కౌనొకో?


కలి కుల్కు వృత్తము,న,స,భ,ర,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-87456.


48.తీర్చు ప్రగతి వృత్తము,


               పరోపకార పారాయణ!బరగు వాడీవు గావయా!

               నిరాశ పాశ బద్ధంబిది!నిను భవింకీర్తి మాపులే!

               చరించు నీతి నీమాలను!జయము నీదౌను!బాలకా!

                గరీయ దేశ భాగ్యంబిడు!ఖనివి గమ్మీవు!జ్ఞానివై!


తీర్చు ప్రగతి,వృత్తము,జ,ర,భ,న,భ,ర,గణములుండును,

యతి,10.వ యక్షరము,వృసం:-85810.


49.భూది సేయు వృత్తము,


                 గాదే?నాదంచు మించుచున్!కల్ము లెల్ల మ్రింగ జూచుచో!

                 భూదేరా!లోక మెల్లయున్!పొర్లి యేడ్చు భావి జీవముల్!

                 చేదేరా!సత్యమీ భువిన్!చేట పెయ్యి గాకు భూతలిన్!

                 శోధించే!శక్తి నొందుచున్!చూడు జాతి తెల్వి పెంపుకున్!


                             ( గాదె=ధాన్యము నిలువ యుంచే పొణక)


భూది సేయు వృత్తము,మ,ర,స,ర,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-87129.


50.జ్ఞాన కర్తృక వృత్తము,


              నేనెవడ?నీ వెవడవూ?నే నహంభావ సంభావ్యమౌ!

              నే ననెడు?జీవ మదియే!నిండునౌ!దేవ సాదృశ్యమే!

              కాన నగు దేహ మదియే?కర్తృ జ్ఞానోప దేవాలయమ్!

              మాన ధనుడీవు!నరుడా!మాయలం వీడి!జీవింపుమా!


జ్ఞాన కర్తృక వృత్తము,భ,జ,స,ర,ర,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-74991.


51.నాడీ దోష వృత్తము,


               కనలేని వినలేని!రోగాల కాలవాలమాయెనే!

               మనలేని దురితాలవే!మంత్రితంబయెం జగంబునన్!

               మును నాటి గుణ పాలనే!మోదతం ప్రభావ మేర్చెనే!

               జన నాడి చెడి పోయెనే!జాతినిం చరింపు దోషమై!


నాడీ దోష వృత్తము,స,న,ర,ర,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-87228.


52.పరమేలు వృత్తము,


            స్వయంకృతాపరాధమున్!సరి జేసి మెలగ వలెన్!

            నియంతృతంబదే!దుర మౌనని దిద్దు కొనుము!నరా!

             భయంబదేల?తెల్విగనం!పరిపాలనగను  మికన్!

            శ్రి యంబు సర్వ శ్రేయ మదే!నయ మేర్చుసమత నిలన్!


పరమేలు వృత్తము,జ,ర,స,స,న,స,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-128720.


53.సుఖీభవ వృత్తము,


              పర పెంపు నింపు సొంపనన్!పరిపుష్టి గూర్చు!జాతికిన్!

             నిరసించ బోకు!నీర్ష్యతో!నిరుపంబు గాదు నేర్మికిన్!

             కరటైన మాట లేలయా?కలికాల జన్మ మిద్దిరా!

             నరు లెల్ల సుఖము నొందుటే? నయమేర్చు!సర్వ సామ్యతన్!


సుఖీ భవ వృత్తము,స,జ,ర,స,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-87718.


54.శుభగ వృత్తము,


           సమత మమత ధోరణిన్!సర్వ శ్రేయ మేర్ప రమ్మికన్!

           సమత విలువ తెల్సికో?సాగు మోయి లోక ఖ్యాతికిన్!

            భ్రమిత జగము నీతినిన్!పర్వ మేర్చు సత్య సేవనన్!

            మమత లలము సంతతిన్!మంగళంబు గూర్చు!సోదరా!


శుభగ వృత్తము,న,న,ర,ర,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం;-87226.


55.మనీష వృత్తము,


             సదాచార సంపన్న తదే?సదామయ జీవ యానమై!

            నిధానంబు జేకూర్చు నికన్!నిరాశ లవేల?నాకయా?

             విధానంబు!ధర్మంబు గనన్!విశేష!కృషెంచు నీతినిన్!

             సుఖాంబుధీ!చంద్రుడవై!సుఖించు మనీషి గమ్మికన్!


మనీష వృత్తము,జ,త,స,త,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-89294.


56.ధర్మతేజ వృత్తము,


             అష్ట పదుల యమ్మ స్వేచ్ఛ!హాయి గొల్పు!నెన్ని నాళ్ళకో?

            ఇష్ట పదుల బీద లెల్ల!యెంత యెత్తు నిల్తురో?గదా!

            కష్ట పడగ దివ్యు నాజ్ఞ!కల్మి పెంచ బీద యుండునే?

            త్రష్ట కరుణ సృష్టియందె!ధర్మ తేజ మేర్చు!నమ్ముమా!


ధర్మ తేజ వృత్తము,భ,స,జ,ర,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-87387.


57.ప్రజ్ఞా పాలన,వృత్తము,


               ప్రజ్ఞ పాటవాలు నిండునై!పాలనానుభవ పూర్ణులే?

              ఆజ్ఞ దైవమంచు నెంచుచున్!హర్షమైన పరిపాలనన్!

              యజ్ఞ దీక్ష బూని పేదలన్!యాదరింప వలె!మిక్కిలిన్!

              ప్రజ్ఞ పెంచు విద్య నేర్పగా!వాసిలున్!శుభగ తేజతన్!


ప్రజ్ఞా పాలన వృత్తము,ర,జ,ర,ర,న,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-95287.


58.హరి హర వృత్తము,


            దివము వెలుగు సత్యము!తెలుపు! శివము!శ్రీకరమ్!

            మనుజ మమత శాంతము!మరులు గొలుపు!మాథవమ్!

              కనని మనసు తేజము!కవన ప్రగతి! శోభకమ్!

             అవని జగని భాగ్యమె?హరి హర సుర మోదకమ్!


హరి హర వృత్తము,న,న,భ,న,న,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-98234.


59.యశోవిరాజి వృత్తము,


               ఘన యశో విరాజితమౌ!కమనీయ కర్మ కారకమ్!

               మనుజ శక్తి మూలకమై!మహి  కీర్తి వెల్గు తారకమ్!

               కనుము మంచి!శర్వ మదే!కలిమీయు లోకభూషయై!

               మనసు మంచి చింతనమే!మహి వెల్గు పెంచు!బాలకా!


యశో విరాజి వృత్తము,న,ర,స,స,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-87762


60.సృష్టిమూలమ్,వృత్తము,,


               జనన మరణం చర్వితమ్!సమస్త సృష్టి మూల మింతే!

              కనగ భవిత సాధ్యమా!కఠోర దీక్ష దక్షు డైనన్!

              మనుజ శుభగ చర్యలే!మహేశ్వరేశ్వ రంబు!లేయౌ!

               కొనుమి స్మరణ శ్రీశునిన్!గుణంబు మంచి!మోక్ష మీయున్!


సృష్టి మూల వృత్తము,న,న,ర,జ,ర,స,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-99242.


61.బాల వికాశ వృత్తము,


             మధ్యందిన మార్తాండున్బలెన్!మథ్య యవ్వన తీరు నొప్పున్!

            సద్యాంశ విశేషం బేర్చునే?సాథ్యా సాధ్య వివేచనంబునన్!

            విద్యార్జన బాల్యం!సాగులే!విశ్వధాభిద!జ్ఞాన వాంఛన్!

             విద్యంబుధి రాజిలం దగన్!విద్యున్మాలగ!దీప్తి కాంక్షన్!


బాల వికాశ వృత్తము,త,య,ర,ర,స,య,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-46221.


62.ధీరతా వృత్తము,


               నిజము నిష్టుర మొప్పినన్!నీతి వీడుట!తప్పే సుమా!

               స్వజనమందున మంచినిన్!చక్క జేయుమి!దివ్యంబదౌ.

               భజన ముక్తికి మార్గమౌ!భాగ్యదం బిడి!గవు న్సదా!

               అజయమౌ!భవికాలమున్!యార్తి వీడుమి ధీరుండవై.


ధీరతా వృత్తము,న,న,ర,ర,స,ర,,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-78014.


63.సుపూజ్య వృత్తము,


             బోధ కొలది వృద్ధి యౌను!పూజ్యమౌ!శ్రీ!యదే విద్యలే!

             సాధనమున జ్ఞాని వౌదు!సాధ్యమే?కాని దేదిలన్!

             వేధిల పని లేదయా?వివేకమే!యండయై!పేరిడున్!

              కాదని యవినీతినిన్!వికార చేష్టాళినిన్!త్రెంచరా!


సుపూజ్య వృత్తము,భ,స,జ,ర,ర,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం;-75097.


64.నిండుదన వృత్తము,


                మంచి చెడుల నెంచు శక్తి!మనిషి నిండుదనమదే!

                కుంచితముల యాశ మాని!గుణము పెంచు ననయమున్!

               మించి తెగువ జేయ బోకు!మితము మీర దోషమౌ!

               వంచితుల కెడంబు నుండు!పరము మెచ్చు బ్రతు కగున్!


నిండు దన వృత్తము,భ,స,జ,న,భ,స,గణము లుండును,

యతి.10.వ,యక్షరము,వృ,సం:-119509.


65.యశోవర వృత్తము,


             జయ మపజయము లవి!జంట పక్షులు!వీడకుండున్!

            నయ మనయము గనగ నౌనె?కాల మహాత్మ్య మింతే!

            భయము వలదు!నిలువు!పట్టు పెంచుమి!గెల్పు నీయున్!

             స యశత!మనగ వలె!జన్మ ధన్యత గాంచు కోర్కెన్!


యశోవర వృత్తము,న,న,న,ర,స,య, గణము లుండును,

యతి.10.వ,యక్షరము,వృ,సం:-46592.


66.వైభవ వృత్తము,


              దొంగ బుద్ధి దొరతనంబు! తప్పు రేపి మాపు నిద్ధరన్!

              భంగ మొంది!పరము డంటె?పట్టి యీడ్చు లోక మెల్లెడన్!

              రంగ రింపు చెడు నెసంగ!రాణు వెల్ల ఛీదరింపరే?

             అంగ రంగ విభవ మొప్ప!ఆణి ముత్యమీవు!గావయా!


వైభవ వృత్తము,ర,న,జ,ర,జ,ర,గణము లుండును,

యతి,10.వయక్షరము,వృ సం:-87413.


67.వినయ వృత్తము,


              వినయ మనయము వీడ!వేడుక గాదు!భూ తలానన్!

              అనయ సమత నెసంగ!హాయి గలుంగు నెల్ల కాలమ్!

              గొనము గురు తమమొప్ప!కూర్మి గల్గు భారతానన్!

              ముని ఱుషి వర వరామ!మోక్షదంబు! జనిమ ధన్యమ్!


వినయ వృత్తము,న,న,జ,భ,ర,య,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-48416. 


68.పుణ్య ధాత్రి,వృత్తము,


                బుధులు నడచి రిచట!పుణ్య భూమి!మన భారతిన్!

               విధి వరమయ మణుల!వేద సార!గణిత భూమిదే?

               మదిని బెడ గెరుగని!మాయ లేనిమనుజ! జీవనన్!

                కొదువ గనని బ్రతుకు!కూర్మి నొప్పె!గుణ గణ్యమై!


పుణ్య ధాత్రి వృత్తము,న,న,న,ర,న,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-115738.


69.కీర్తిలు,వృత్తము,


            కొండ కోన లాశ పాశమై!కోర్కె దీర!యాశ పాశమై!

            బండ తత్వ జ్ఞాన మూర్ఖతే!పట్టి గెల్చి!నేల జూచుచున్!

           యెండమావి!నీటి తీరగున్!యిట్టె మాయు!భూత సంతతే?

           ఛండ శాసనంబు కీడిడున్?సర్వ సామ్య మేర్చు?మంచిగన్!

   

కీర్తిలు వృత్తము,ర,జ,ర,జ,ర,య,గణము లుండును,

యతి10.వ,యక్షరము,వృ,సం:-43691,


70.చిగురిలు వృత్తము,


              బోడి తలకు జుట్టు బలెన్?బొడమె!స్వేచ్ఛటందు వేలన్?

              చీడ బ్రతుకు పోయె!నయా!చిగురించె స్వీచ్ఛ భూజమ్!

              యాడు కొనుడి!భీతి జనెన్!యమరంగ నీతి. నొప్పన్!

              గోడు విడచి పెంచి సిరుల్!గురుత కీర్తి  పొంద!నీతిన్!


  చిగురిలు వృత్తము,భ,స,స,నర,య,గణము లుండును,

యతి.10.,వ యక్షరము,వృ,సం:-45667.


71.ప్రశాంతి వృత్తము,


             కాలి నలుపయె!గళము!గరళ ప్రభావత న్శివా!

            మేలి తెలుపు టొడలుకు!మిగిలెను మచ్చయె!భవా!     

            ఫాల మనిల నయన!భగ భగ లెట్లు తాళెదో?

            నీలి కురుల జలములు!నిలిపె!ప్రశాంత మెంతయో?


ప్రశాంతి వృత్తము,భ,న,న,న,జ,ర, గణము లుండును,

యతి.10.వ,యక్షరము,వృ,సం;-80104.


72.ఆర్తి హర,వృత్తము,


             అతను కృతము కలిగి!హరించి తీవ్ర కోపమొప్పన్!

             కుతల జనము గనుమ!గుణానుకూల!నీతి నింపై!

             గతులు గలుగ!వెతలు! గమింప!రక్ష సేయు మీశా!

            మతిని గొలుతు!నొసగు !మనంత శోభ!కీర్తిలంగన్!


               (అతను=తనువు లేనివాడు,మన్మథుడు).


ఆర్తిహర వృత్తము,న,న,న,జ,ర,య,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-44032.


73.స్మరణ వృత్తము


            పురాణ పురుషు డీవయా!పురారి!శంభో!సాంభ శివా!

           సరాగ రమిత సారమా!జరార్తి జీవుండేను?భవా!

           వరాశ్రీత జన రక్షకా!ప్రభాస భాస్వా!భద్ర!మృఢా!

          నిరంతరము నినే మదిన్!నిధానతన్!గీర్తింతు!హరా!


స్మరణ వృత్తము,జ,న,ర,జ,మ,స,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-104028.


74.చర్విత వృత్తము,


            చర్విత చర్వణ జీవితమ్!సాగును యాగదు!శ్రీధవా!

            పర్వును సర్వద భ్రాంతినిన్!పండిత పామర లోకమై!

            సర్వము మిథ్యని తెల్సికో!జాగృతి గావలె?జీవితమ్!

             నిర్వహణంబున నీతదే?నిల్చును!ధాత్రిని!శాశ్వతమ్!


చర్విత వృత్తము,,భ,భ,ర,భ,భ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-93361.


75!స్మృతి ఫలక వృత్తము,


                 స్మృతి ఫలకముపై గల!జిత కర్మము నూహించేవే!

                మతి యుత నుతినే గని!మరి చేతన శూన్యుండైతే?

                గతి సుగమ గమంబును!కలగా దది!సర్వేశంబౌ!

                స్తుతి మతమున చెల్వము!స్వగుణంబుగ!గైకొమ్మోయీ!


స్మృతి ఫలకము,వృత్తము,న,స,న,స,స,మ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-14144.


76.వైశిష్ట్య వృత్తము,


            తుష్టి  పుష్టి ముష్టి నష్టి!సంతుష్టి !యాగ మేఘ! మేగెనే?

           క్లిష్ట చేష్ట పుష్టి నష్టి!సంక్లిష్ట ధాష్టికంబు!నౌనొకో?

           కష్ట మిష్ట చేష్టనేర్చ!సంస్కార!పాత్ర పోషణంబయెన్!

           శిష్ట శ్రేష్ట ఖ్యాతి యెంతొ?వైశిష్ట్య మేర్చభాగ్య మౌనులే!


వైశిష్ట్య వృత్తము,ర,జ,మ,ర,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-87077.


77.అతి తెల్వి వృత్తము,


                అండ దండ లుండినా!సరే!హాయి గనదయె?భారతిన్!

               తిండి గింజ పంట పోయెనే?తేరుకొనుటది!కష్టమే?

                మండు టెండ,వాయు కల్మషమ్!మాడె జగమిది!పాశమై!

                మెండు తెల్వి నిండె గానిటన్!మేడి ఫలమిది!యాయెనే!


అతి తెల్వి వృత్తము,ర,జ,ర,భ,న,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-97455.


78.మమతొనరని వృత్తము,


                  చెరువు నిటి వంట,పంట!చెలువ మమరె!పూర్వమున్!

                  పరువు కోరి గొప్ప నొప్పి!పర మిహములు మర్చిరే?

                  పరమ ఠీవి పెంపు నెంచు!కలి ప్రభ లివియే?యనన్!

                   వరలె!జీవి యంత్ర మౌచు!వరత ! సమత!గానకన్!


మమతొనరని వృత్తము,న,ర,జ,న,న,ర,గణము లుండును,

యతి.10.వ,యక్షరము,వృ,సం:-98130.


79.స్వేచ్ఛా జీవన వృత్తము,


                 ఆశ పాశలు మాసి పోయెన్!అల విహంగపు తీరయెన్!

                 పాశ బంధము లూడి పోయెన్!పరమ స్వేచ్ఛ వికారతన్!

                 కాశి వాసుడు చూచు చుండెన్!కలిమలాప ప్ర కీర్తినిన్!

                దేశ సంస్కృతి భావ తత్వమ్!దివిజులే!దిగి రావలెన్!


స్వేచ్ఛా జీవన వృత్తము,ర,స,య,న,భ,ర,గణము లుండును,

యతి.10.వ,యక్షరము,వృ,సం:-93781.


80.భావ పూర్ణ వృత్తము,


              గంథపు టందము ఛందము!గణిత భావ ప్రపూర్ణతన్!

              గంథిని వాక్సతి భూషయు!క్రమ విశిష్టత కూర్చుచున్!

              అందము చిందు!మనోజ్ఞత!యతియు,ప్రాస,విశేషతన్!

             బంధపు టంద!పసందుల!బహుళ సార్ధకమౌ చిలన్!


     (  గంథపు టందము=భూ సౌరభము,గంధిని=సుహాసిని)


భావ పూర్ణ వృత్తము,భ,భ,భ,న,భ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-94109.


81.శ్రవణోపేత వృత్తము,


                వాణి గళ రత్న హారము!వాచామృత ధార!ఛందమై!

               భాణి గణ పూర్ణ భావత భాసిల్లె! విభూతి భాతినిన్!

               వేణు నినదాల శ్రావ్యత!భేషంచు విరించిమెప్పునన్!

               కాణి పుర విఘ్న రాజె?ప్రకాశంబు గనంగ సేయుతన్!


         (కాణి పుర విఘ్న రాజు=కాణిపాక గణపతి,)


శ్రవణోపేత వృత్తము,భ,జ,భ,ర,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-88489.


82.సుగతొనరు వృత్తము,


            ఛంద సొబగు లెరయకే!జరిగి వెనుక కేగగా!

           మందమతిని విడువరా!మరులు గొలుప తేజమున్!

           సుందరమగు తెలుగురా!సుగతి వెలుగు నింపుడీ!

           ఎందులకని విడిచితే?యిహము సుఖము మిథ్యరా!


సుగతొనరు వృత్తము,ర,న,ర,న,న,గణము లుడును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-98041.


83.పురుషతా వృత్తము,


           కంటికి కనురెప్ప తెల్గు!కాచు ననర్థాల నన్నిటిన్!

          ఇంటికి యిల వేల్పు భాష!యేలను?వీడగ జూచిరే!

           జంటకు నడి మంత్ర శ్రీలు!సాములు గారిడు లేలయా?

            బంటికి కొరకంచే! మందు!కాపురు షుండవు గాకుమా!


పురుషతా వృత్తము,భ,స,జ,భ,త,ర,గణము లుండును

యతి,10.వ,యక్షరము,వృ,సం:-85339.


84.వాచా దోష వృత్తము,


                 పర మమ్మీయే!మన యమ్మా!ప్రాణ హీన యమ్మ నీదొకో?

                కొర నౌనే?నీచెడు పక్కీ!కోరి జీవ మూడ దీసెగా!

                పరభాషా మోహము జీవా!పాడు జేయు!జాతి జీవనమ్!

               వరభీజా పూర్ణను వీడన్!వాని జన్మ చేకు చింతయే!


 వాచాదోష వృత్తము,న,య,య,ర,జ,ర,గణము లైడును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-94210.


85.నిత్య సత్యం వృత్తము,


            అంతు లేని యాశదేలయా?హాని చేరంగ నీయునే!

           పంత మూని దేశ భక్తినిన్!భావి సౌఖ్యంబెంచు!ధాత్రిన్!

            మంతనంబు లాడి మంచికిన్!మాయను బోనాడు!బాలకా!

            యెంతకైన!నిల్చు!నీతియే! యేదయ?సాటెంచ నీతికిన్!


నిత్య సత్యై వృత్తము,ర,జ,ర,భ,త,ర,గణము లుండును,

యతి 10.వ,యక్షరము,వృ,సం:-85157.


86.మనుచర్య,వృత్తము,


            అనాది జ్ఞాన విహీనుడా!అంత నాదను కొందు వేల న్?

            సనాతనంబగు ధర్మమే?సర్వ మిథ్యగ నెంచి తేలన్?

            వినాశ పాశ విభూషణా!వింత చైద విషాశ్రితుండా!

             కనం గలంగునే?యాయువున్?కాల జ్ఞానివి!గావయా!


మను చర్య వృత్తము,జ,భ,ర,ర,స,య,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-45262.


87.జ్ఞాన కైవల్య వృత్తము,


                  మనల నడిపే!శక్తినే!మాయ శక్తిని గెల్వ నౌనే?

                  ఘనుడనని యెంచేవె పో!?కాన రావిల తెల్సి కొమ్మా!

                  మనుజుడవు!నీజన్మమే మైనదైవము సామ్య మౌనే!

                   కన మిడిసి పాటేలయా?కైవలంబది కల్గు నొక్కో?


జ్ఞాన కైవల్య వృత్తము,న,నశత,త,భ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-92474.


88.కీర్తిలు వృత్తము,


            కల్తీ జన్మము నీయ. వచ్చు కన్నా!చావు నాపం గలవే?

           పల్తాపంబుల జన్మ మిద్ది పన్నా బ్దంబు లాపం వశమే?

            కల్తీ సేంద్రియ జీవ నాడి!కాలంతంబు నాపం దరమే?

            తొల్తం జీవుల సౌఖ్య మెంచు!తోరంబౌ!సుకీర్తిం వరలన్!


కీర్తిలు వృత్తము,మ,స,జ,మ,ర,స,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-106835.


89.నానానీ,వృత్తము,


             నా నానీ నానను నేనే!నానానను!నీ నాననన!నానీ!

            నేనే!నానే నను నానీ!నే నేనననీ!నీనానను! నే నే!

            నా నానీ!నిను నానం!నానీ!నిను!నానం!నన నీనే!

            నేనే నానీ నన నీనా!నే నే నిను నానా నను!నానీ!


నానానీ వృత్తము,మ,భ,మ,భ,త,య,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-52273.


90.అను భూతి వృత్తము,


            స్తుతి మతి యుత!నీతినిసూచి నెంచుమి!సుగుణానన్!

           గతి చెదరదు!మంచిని గను!కాంచన మను భూతిన్!

            అతులిత గుణ గణ్యునిశివు నొందగ నగు జీవా!

            కతిపయ గురు ధ్యానమె!కలుషంబులు తొలగించున్!


అనుభూతి వృత్తము,న,ర,భ,స,నశయ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-63424.


91.మోక్షగామి వృత్తము,


              జీవ శక్తి తగ్గు నపుడు!చింత మోహరించు జీవికిన్!

             యావహించు!సర్వ వెతలు!యాత్మ క్షోభ నావరించున్!

            యేవగింపు గల్గు బ్రతుకు!యైచు ప్రాణ త్యాజ్య చింతన్!

             భావమందు భక్తి కుదుర!పాటు నెంచు మోక్ష ధృష్టిన్,!


మోక్ష గామి వృత్తము,ర,జ,న,ర,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-82525.


92.వేదజ్ఞాన వృత్తము,


              ఉదాత్తానుదాత్త స్వరితయుజ్వల భావ గుంభనమై!

              సదా శక్తి భీజ వరద!శాస్త్రము వేదమై!భువినిన్!

              ప్రధానంబు జేకురిచెను!పావన కీర్తి కౌముదుల్!

              బధానంద సంస్మరితము!బోధిల నేర్చు వేదమున్!


వేద జ్ఞాన వృత్తము,య,జ,న,,భ,ర,స,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-110072.


93.వేద ప్రభ వృత్తము,


              అక్షయ తూణీరము వెదం!యహ రహముల్!సాధ్యం!శోధ్యమ్!

              పక్షము గాదేరికి?నిలన్బహు విధ జ్ఞానానందమ్!స్తుత్యమ్!

              శిక్షణ వైశిష్ట్యం!సాధ్యమ్!స్థిమిత వధాన్యందివ్యో ద్భాష్యమ్!

               భక్షిత భోజ్యం!హార్యమ్!పరమ ప్రబోధం జ్నానానందమ్!


వేద ప్రభ వృత్తము,భ,త,య,న,య,మ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-7782.


94.అరుదగు వృత్తము,


               అరనిమిషము జాలును యశువులు బాయన్!భువి లోన్!

               పరముని గన నౌనొకొ?బ్రతుకున యెంతో యతనన్!

              తరముల శ్రమ జీవుల!తపనము!ధాత్రిం కీర్తిడున్!

               కర మరుదైన జీవన!గనుమయ!గర్వింపం!జగమ్!


అరుదగు వృత్తము,న,జ,భ,న,య,మ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-40880.


95.సర్వేశం వృత్తము,


           తిమిర మజ్ఞానంబు పోవన్!తెలివే!జ్ఞానంబై!కీర్తిడున్!

          ప్రమిద దీపంబే?వెలుంగై!పరమాత్మం జేర్చున్!జ్ఞానతన్!

         తమ మహంబే?చెడుంగై!తర జీవాల మాపున్వడిన్!

         శ్రమ ఫలంబే?విభూదౌ?సమ సామ్యంబే?సర్వేశ్వరమ్!


సర్వేశం వృత్తము,న,మ,య,స,మ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము, వృ,సం:-67138.


96.పరమార్థ వృత్తము,


            పురుషార్థ జయంబే మోక్షమ్!పుణ్యంపురుషోత్తమం!బుధమ్!

             పరమార్థ మనంతానంతమ్!పర్వం !సు రసా విశేషకమ్!

             నర జన్మ గరీయమ్!సామమ్!నానా విధ సోధనమ్!వరమ్!

             వర జ్ఞాన విధి న్మేథ్యం బౌ!పరాకర్ష ధీమతం స్తుతమ్!


పరమార్థ వృత్తము,స,స,మ,త,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృసం:-88086.


97.పుణ్య ఫల వృత్తము,


              దయ,దాన,ధర్మ,నిరతిం దనరం బుణ్య ఫలంబిడున్!

             సు యశా!విశుద్ధ జననమ్!సురసాంబోధి!ప్రమోదమౌ!

              నియమం బనంత సుఖదమ్!నిరుపం బౌను!ధరాతలిన్!

              నయమెంచు జీవి బ్రతుకే?నవ సంఖ్యాక!సు జీవమౌ!


పుణ్య పల వృత్తము,స,జ,స,స,భ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం;-91880.


98.మనోరమ వృత్తము,


               రామా!యని బల్క నోరారన్!రహిమించి పెంచు మంచినిన్!

               నీమంబది రామమే!భూమిన్!నిరతంబు గాచు నేర్పునన్!

               కామారి,మనోభిదమ్!రామం కమనీయ శ్రీమనో రమమ్!

              శ్రీమంత మనంత కాంతారమ్!జిత మన్మథ కౌస్తుభమ్!బుధమ్!


మనోరమ వృత్తము,త,జ,య,స,జ,ర, గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-87593.


99.జీవన సత్యం వృత్తము,


                  శివం! సుందరం!శ్వేత వర్ణమ్!జీవి సత్యము స్వచ్ఛమేర్చున్!

                  భవాం బోధినీ!క్షార తత్వమ్!బాధ రాయణ కారకం బౌ!

                  దివేశం!మహేశమ్!వరీయమ్! దీప్తిదంబగు కాల మెల్లన్!

                  జవం బేర్చుమా!నీతి మంతా!నేవ మొప్పగ భావి సౌఖ్యమ్!


జీవన సత్యం వృత్తము,య,య,య,ర,స,య,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-46154.


100.స్వేచ్ఛేనా వృత్తము,


               కొండ నాల్క మందు న్న నాల్కకోరి పీకె!నేమి వైద్యమో?

              మెండు టాశ!నాంగ్లేయు లంపె!మేలు స్వేచ్ఛ తీరిదాయెనే!

               పండె జాతి వైషమ్య భావ భంగు రాన నొప్పె!గొప్పగన్!

                మండె!సామ్య వాద మనంగ!!మాయ మున్గి తేల?భారతీ!


స్వేచ్ఛేనా వృత్తము,ర,జ,జ,ర,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-97397.


101.నెఱుక సాని వృత్తము,


                  నిదన మదన సదనా!నిథులు జేరె!ధనికులన్!

                  బదులు గనని వరమే!వరద మాయె!నవనిలోన్!

                 నిధులు వెనుక మనన్!నెఱుక సాని పదమయెన్!

                 తిధుల దనరు వెలుగే!తిరిగి వచ్చు ననునటుల్!


నెఱుక సాని వృత్తము,న,న,స,న,భ,స,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-106710.


102.అదుపు మీరు వృత్తము,


             కొదమ సింగ మవనిలో!కుక్క పిల్ల తోయ మయెన్!

            బదులు పల్కు జనులకే?పాప మొప్పె!నీచ సంస్కృతిన్!

           నిధులు లెక్క విడిచిరే!నేల సొమ్ము రాజుదే!యనన్!

           అదుపు దస్సె!ప్రగతదే!హాస మాన భూష లార్భటిన్!


అదుపు మీరు వృత్తము,న,భ,స,ర,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం;-77282


103.భవిష్య వాణి వృత్తము,


                ఏమి కాల మహిమ యిదో?యెండమావి పంట భూమయెన్!

               కామితార్థ సిరు లవియే?@కాల మాయె నంచు దెల్పుచున్!

               క్షేమ మార్పు టూహ యిదియో?శిక్ష లేని దక్ష దోషమో?

              తామ సత్వ గుణ మిదియో?తప్పటంచు!చూపు చుండెనో?


భవిష్య వాణి వృత్తము,ర,న,న,ర,జ,ర,గణము లుండును,

యతి,10.వశయక్షరము,వృ,సం:-87581.


104.చర్విత వృత్తము,


             కలిమి లేములు జంటగా!కదులు చుండును వీడకన్!

            కలిమి గర్వము పెంచునే?కనని రోగము!భోగమై!

            బలము శాసిలు ధర్మమున్!పరమ పావన మోపకన్!

            కలిమి పోయిన రోజునన్!కన నగున్!సమ సామ్యమున్!


చర్విత వృత్తము,న,భ,ర,న,న,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-87740.


105..కమ్మ నమ్మ వృత్తము,


               అమ్మలేని జగము లేదు!అమ్మ జన్మ నిచ్చు దైవమే!

               అమ్మ నిండు మనసదేను?ఆత్మ స్థైర్య ధైర్య మిద్ధరన్!

                అమ్మ నిండు దనము భూమి!హాయి నింపు జన్మ జన్మమౌ!

                 అమ్మలమ్మ చదువు లమ్మ!హర్ష జీవ మేర్చు బాలకా!


కమ్మ నమ్మ వృత్తము,ర,న,జ,ర,జ,ర,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-77413.


106.మాయా లోకమ్ వృత్తము,


                నేరానికి శిక్ష లేదయె?నీతినే!యవినీతి గెల్చెన్!

                బేరాలకు లొంగె లోకమ్!బీరువోని వికార మాయెన్!

                 సారామయ జీవ మాయెను!సర్వ మాయకు చిక్కె. సర్వమ్!

                 కారాటవి వెన్నెలో?యన!కాన దాయెను నేడు సత్యమ్!


                       (సారా మయ=సారాతో కూడిన)


మాయా లోకమ్ వృత్తము,భ,జ,భ,ర,స,య,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం,46511.

ధృతి ఛందము నందు,106.ఛందములు మాత్రమే గైకొన

 బడినవి,

                                మంగ ళమ్ మహాత్

                                    శ్రీ,శ్రీ శ్రీ శ్రి శ్రీ,  

9, ఆగస్టు 2026, ఆదివారం

మామిడి చెట్టు పరివారం. (గంపెడు పిల్లలు) రచన ... శ్రీ కడయింటి కృష్ణమూర్తి..గోవా...(నెల్లూరు)

0 comments

జైశ్రీరామ్. 

మామిడి చెట్టు పరివారం. (గంపెడు పిల్లలు)



రచయిత ... శ్రీ కడయింటి కృష్ణమూర్తి..గోవా...(నెల్లూరు)

పురుషోత్తమ రావు పాతకాలం మనిషి కాదు, నవీన ఛాందసుడు. కుటుంబ వ్యవస్థల మీద అపారమైన నమ్మకం కలవాడు. పాత తరాలకు క్రొత్త మెఱుగులు దిద్దాలన్న పంతం ఆయనది. పశు పక్ష్యాదులకు కూడా సంబంధాలు నెఱపుతూ దాని కూతురిది, దీని మనుమరాలది, దాని తల్లి యిది అని తన కొట్టం లోని పశువుల గురించి కూడా వరసలు గలిపి చెబుతుంటాడు. పశువులకు మాత్రం బంధుత్వాలు ఉండవా?? చెట్లకు ఉండవా??అనేది వారి వాదన. వారికి ఓ కూతురు ఇద్దరు కుమారులు. పెరట్లో ఒక మామిడి చెట్టు.  ఆ ముగ్గురూ ఈ మామిడి చెట్టూ వారికి ఆరు ప్రాణాలు. ఆ చెట్టు వారి ఇల్లాలికి అరణపు సంపద. 

దానికో చిన్న పూర్వ కథ. 

పురుషోత్తమ రావు గారి ఇల్లాలు కాపురానికి వచ్చిన రోజున ఆమె తండ్రి తమ పొలంలోని మామిడి చెట్టు పండ్లు ఓ బుట్టడు తెచ్చియిస్తూ "నాయనా ఇవి మన ఇంటి చెట్టు పండ్లు" అంటూ "అమ్మా ఇవి కోసి అందరికీ పెట్టు" అంటూ కూతురి చేతిలో ఓ రెండు పండ్లు పెట్టి మిగతా బుట్ట లోపల పెట్టించాడు.. "ఆమె ఇంకో నాలుగు పండ్లు కోసి భర్తకూ నాన్నగారికీ అత్తయ్య మామయ్యలకు కూడా పళ్లేలలో పెట్టి అందించింది. అందరూ వాటి రుచిని మెచ్చుకుంటూ ఆరగించారు. వారి ఆనందం చూసి అమ్మాయి తండ్రి సంతోషించారు. కొత్త గాబట్టి అమ్మాయి "అత్తయ్యా ఈ టెంకలూ తొక్కలూ ఎక్కడ వెయ్యమంటారు" అనడిగింది.

"అక్కడ ఉంచమ్మా నేను తీస్తాను. నువ్వెళ్లి నాన్నగారి దగ్గర కూర్చో" అంటూ ప్రేమగా చెప్పి ఆ టెంకలు తీసి ఇంటి పెరట్లో పడవేసింది. వాటికి ఈగలు ముసురుతూ ఉంటే అక్కడ ఉన్న పాలేరెవరో చూసి దాని మీద రెండు పారల మట్టి పోశాడు. "ఇక ఇక్కడ మనకేం పని, ఈ పాలేరు మన నోట మట్టి గొట్టాడు " అనుకుంటూ ఈగలు వెళ్లి పోయాయి. ఆ తర్వాత వారం రోజులకు వర్షం పడింది. ఆ ముసురు వారం పది రోజుల వరకూ సాగింది. ఆ తర్వాత కాస్త తెరిపి ఇచ్చేసరికి ఎవరో తట్టి లేపినట్లుగా ఆ మామిడి టెంకలు తలెత్తి చూసి మొలకెత్తాయి. ఎరుపూ హరితమూ కాని వర్ణంలో ఆకులు వ్రేళ్లాడేసుకుని ముద్దుగా కనిపించాయి. ముందుగా వాటిని చూసింది పురుషోత్తమ రావే. వాటిని పశువులు తొక్కకుండా ఒక ముళ్ల కంప అడ్డం పెట్టాడు. నాలుగు రోజులకు ఆకులు చిలుకాకు పచ్చగా వుండి తర్వాత నిదానంగా ముదురాకు పచ్చలోకి మారాయి. వారం పది రోజులకు మరో నాలుగాకులు వేశాయి, అలా నిదానంగా ఓ అడుగు ఎత్తు ఎదిగాయి. ఎంతో ఆరోగ్యంగా బలంగా ముద్దుగా ఉన్నాయా మొక్కలు. 

అప్పుడు పాలేరు వాటిని చూసి అయ్యగారూ ఇవి ఆరూ ఒక్కచోట ఉంటే సారం చాలక బలహీన పడతాయి. ప్రస్తుతానికి కుండీలలో వేర్వేరుగా వేద్దాం. అని ఆరు మట్టి కుండీలు అడుగున్నర ఎత్తూ ఓ అడుగు వ్యాసమూ ఉన్నవి చూసి తెచ్చి మంచి బలమైన ఎరువూ మంచి మట్టీ పోసి అందులో నాటారు. ఓ పది నెలలు గడిచేసరికి అవి బలంగాఎదిగి దారిన పోయే వారిని కూడా ఆకర్షించ సాగాయి. 

అప్పుడు పురుషోత్తమ రావు గారి తండ్రి వాటిని రామాలయం వద్ద ఒకటి, ఇంటి వెనుక పెరట్లో ఒకటీ, గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద ఒకటి, పాఠశాల వద్ద ఒకటి, తమ పొలంలో దొరువు గట్టున రెండూ ఇలా నాటించాడు. అవి దినదిన ప్రవర్థమానమవుతూ జనులకు కనుల విందు చేస్తున్నాయి.

అలా వారి సంకల్ప బలంతో పురుషోత్తమ రావు పెరట్లోని చెట్టుకూడా దినదిన ప్రవర్థమానమవుతోంది. ఈలోగా కాల చక్రం కూడా ఓ యిరవై ఆకులు ముందుకు జరిగింది. ఇప్పుడు పురుషోత్తమ రావు కుమార్తెకు పద్దెనిమిదేళ్లు. ఆయనకు కూతురంటే ఎంత ప్రేమో ఆ మామిడి మొక్క అన్నా అంతే ప్రేమ. మామిడి మొక్క కాస్త ఆలస్యంగానైనా పూతకొచ్చింది. పురుషోత్తమరావు పెద్ద పండుగే చేశాడు. అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేయించాడు. అన్నదానం విరివిగా చేశాడు. పని గట్టుకుని వెళ్లి మిగతా చెట్లను కూడా చూసి వచ్చాడు. అవి కూడా ఇంచుమించు ఇదే పరిణామ క్రమంలో ఉన్నాయి. సంతోషించాడు.

మామిడి చెట్టు పూత పిందెలతో నిండుగా కనుల విందుగా ఉంది. భార్య ప్రోద్బలంతో గౌతమికి సంబంధాలు వెదకడం మొదలెట్టారు పురుషోత్తమ రావు గారు.

గౌతమి లాంటి అమ్మాయికి సంబంధాలు పనిగట్టుకు వెదకాలా? ఆయన అలా సంకల్పించిన విషయం తెల్సిన వెంటనే ఓ సంప్రదాయ కుటుంబం  "అమ్మాయిని చూసుకోవడానికి ఎప్పుడు రమ్మంటారు" అన్న వాకబుతో ముందుకొచ్చింది. పురుషోత్తమరావుగారికి సంతోషం కలిగించింది. సంకల్పించి ఏదీ ఇంకా రెణ్ణెల్లయినా కాందే. 

మామిడి కాయలు పక్వానికొచ్చాయి. 

ఇటు అమ్మాయికి మంచి సంబంధం రావడం అటు మామిడి తొలి కాపు కాయడం పురుషోత్తమ రావు గారికి రెండు కళ్లకీ రెండు పండుగల లాగా ఉంది. తమ పురోహితుడి సలహా మేరకు పెళ్లిచూపుల రోజు నిర్ణయించడం తో అది కూడా దగ్గర కొచ్చింది. శుభస్య శీఘ్రం అన్నారు పురోహితులు.

ముందు రోజు మధ్యాహ్నం పురుషోత్తమ రావు మామిడి చెట్టు క్రింద నులక మంచం వేసుకుని కూతురితో కలిసి కూర్చుని అటు మామిడి చెట్టునీ ఇటు గౌతమినీ కనుల నిండుగా చూసుకుంటూ ముచ్చట్లాడుతున్నాడు. అది చూస్తూ వారి ముచ్చట్లు వింటూ మామిడి చెట్టు కూడా పులకించింది.   ఆ పులకరింతతోబాటు కదలిక వచ్చి ఒక అరమాగిన పండును  వారి మధ్యన మెల్లగా పడేసింది. తండ్రీ కూతుళ్లిద్దరూ తలెత్తి చూశారు. "మీ ప్రయత్నాలు ‘ఫల’వంతం అవుతాయి ఇది నా ఆశీర్వాదం" అన్నట్లుగా చిరునవ్వు చిందించింది సీతమ్మ లాగా. ఆ సీతమ్మ కీమె తోబుట్టువే కదా. అది అర్థం అయినట్లుగా పురుషోత్తమ రావు రెండు కళ్లనుండి రెండు ఆనంద బాష్పాలు. గౌతమిని ప్రేమగా దగ్గరకు తీసుకుని ఆమె తలతో తన తల తాటించి కళ్లు తుడుచుకున్నాడు.

ఆ పండును భార్య కిచ్చి భద్రంగా బియ్యపు డబ్బాలో దాచమని చెప్పాడు.

ప్రక్క రోజుసాయంత్రం నాలుగవుతుండగా అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వచ్చారు. పురుషోత్తమ రావుగారు ఉదయమే మామిడి చెట్టు నీడ పడినంత మేర శుభ్రం చేయించి నీళ్లు చల్లించారు. నాలుగైదు కుర్చీలు వేయించి క్రింద కూర్చునే వాళ్లకు చాపలు వాటిపైన తెల్లని దుప్పట్లు పరిపించారు. అందరూ మామిడి చెట్టు కనుసన్నలలో ఆసీనులయ్యారు. పురోహితుల వారు ఇరు కుటుంబాల పరిచయ వాక్యాలు పలికారు. పురుషోత్తమ రావు గారు వరుని గురించి తెలుసుకున్నారు.

తెలుసుకొని తన కుమార్తె గురించి,

ఉ. ఇల్లడ బెట్టె నీపె నిట, యీమెవి యాటలు పాటలింతలా!

    పెల్లుగ బెంచినార మిక పెద్దగు వేలుపు మాట నిల్పుచు

    న్నిల్లడ దీర్పగా దలచి యీ సహకారము తోడు నీడలో

    చల్లగ నాటపాటలను చక్కగ నేర్చిన గౌతమిం దగన్.


మ.కో. కన్నవారము మేమె యైనను కాన్క బెట్టక దప్పునా

         కన్ను ఱెప్పల నార్పకుండగ గాచి నారము ప్రేముడిన్

         మన్ననన్ మరి యిచ్చుటల్ గని మాయురే యన ధాతయున్

         గ్రన్ననన్ మరి మీరలిప్పుడు కాన్క నందిన భాగ్యమే.

అని కావ్యపరిభాషలో పరిచయం చేసి వారి సంబంధాన్ని పటిష్ఠం చేసుకున్నాడు. 

తర్వాత నిన్నటి మామిడి పండును వారికి పళ్లెంలో పెట్టి అందించి ఆ పండునూ, పండు దొరికిన వైనాన్నీ,ఆ పండును కన్నతల్లి చెట్టునూ పరిచయం చేసి కళ్లు తుడుచుకుని ఆ పండును అక్కడే అందరూ ఆరగించాలని వేడుకున్నాడు. గౌతమికి కాబోయే మామగారు విస్తుబోయారు. ఒక మామిడి పండుకు ఇంత చరిత్రా. దాని పరిచయాని కింత ఉద్వేగమా? అనుకుంటూ తానూ  పురుషోత్తమ రావుగారి సహృదయాన్ని గ్రహించి ఆ పండును అందరూ తలో ముక్కా ఆరగించిన తర్వాత ఆ టెంకను కడిగించి " ఈ టెంకను పరంపరానుగతంగా మా యింటివద్ద నాటి పెంచుతాను. "గౌతమినీ, ఈ టెంకనుండి రాబోయే ఆ మొక్కనూ సమానంగా అభిమానంతో వాత్సల్యంతో చూసుకుంటానని మాట యిస్తున్నాను". అనగానే పురుషోత్తమ రావు కళ్ల నుండి నీళ్లు జలజల రాలాయి. వారికి గౌతమికీ మామిడి చెట్టుకీ ప్రేమ పరంగా అభేదం. ఒక్కసారి తలెత్తి మామిడి చెట్టు వంక జూశాడు. అది తృప్తిగా తలాడించింది. సంబంధాన్ని ఆమోదించింది. పురుషోత్తమ రావు గారి మనస్సు తేలిక పడింది. నా బిడ్డ బాగోగులు చూసుకోవడానికి ఈ చెట్టు తన బిడ్డని ముందే పంపుతోంది. అని కళ్లు తుడుచుకున్నాడు.

ముహూర్తాలు పెట్టుకోవడం, తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం సుముహూర్తం దగ్గర పడడం అన్నీ మామిడి చెట్టు స్వయంగా పర్యవేక్షించింది. గమనించింది, కల్యాణాన్ని కన్నులారా వీక్షించింది. దీవించింది, వధూ వరులను కళ్లారా చూసుకుంది. కొత్త దంపతులకు కబుర్లు చెప్పుకోవడానికి దట్టమైన నీడ నిచ్చింది.

చల్లని పిల్లగాలులతో వారిలో కొత్త కొత్త కోరికలను రేకెత్తించింది. గౌతమి ముంగురులను అటూ యిటూ పరుగెత్తింప జేస్తూ వరుని కళ్లలో ఆనందాన్ని నింపింది. తానూ ఆనందించింది.

గౌతమిని అత్తవారింటికి సాగనంపిన పురుషోత్తమరావు పెరట్లోకి వచ్చి మామిడి చెట్టు వంక తలెత్తి చూశాడు "బెంగ పెట్టుకోకు" అని ఓదారుస్తున్నట్లుగా రెండుసార్లు కళ్లార్పే నెపంతో కన్నీళ్లు చెంపల మీదికి వదిలేశాడు. భార్యా భర్తలిద్దరూ ఆ సాయంత్రం ఆ చెట్టు వద్దే కూర్చున్నారు. ఒకర్నొకరు చూసుకుంటున్నారు.

నేల వంక చూస్తున్నారు. చెట్టువంక చూస్తున్నారు. "అల్లుణ్ణీ అమ్మాయినీ ఇంకో రెండు రోజులు ఉండమని చెప్పాల్సింది" గొణుక్కున్నారు ఇద్దరూ ఒకేసారి.

"ఠప్" మని వారి మధ్య ఒక మామిడి పండు పడింది. ఉలిక్కి పడ్డారిద్దరూ.  తలెత్తి చూశారు చాలా ఎత్తుకొమ్మమీది నుండి పడిందేమో పండు చితికి పోయింది.

"వారినిప్పుడు కాపురానికి పంపడమే మంచిది. ఎక్కువ రోజులుంటే మమకారాలు ఎక్కువై మనస్పర్థలు రావచ్చు" "ఇలాగా"

అని ఆ చెట్టు పండును చూపి చెప్పినట్లయ్యింది వారికి. రెండు సార్లు కళ్లార్పుకుని అప్పటికి ఇంట్లో ఉన్న బంధువులు హెచ్చరించడంతో లేచి కళ్లు తేట పడగా లోనికి వచ్చి నిత్య నైమిత్తికాలు అన్యమనస్కంగానే పూర్తిచేశారు. "పండు పక్వం పరాధీనం" అన్న భావన కదలాడింది వారి కళ్లలో. ఆ భావన వారికీ వారు పెంచుకున్న ఆ చెట్టుకీ కూడా వర్తించింది. అవును గదా. 

కాల చక్రం మరో పదాకులు నడిచింది. పురుషోత్తమ రావు గారి కుమారులు ఇరువురూ చదువుకుని స్థిరపడ్డారు. గౌతమి కుమార్తె కిప్పుడు ఐదున్నరేళ్లు. గౌతమి తో బాటు అరణంగా అత్తవారింటికి వచ్చిన మామిడి మొక్క కిప్పుడు పదేళ్లు. ఇప్పుడిప్పుడే కాపుకొస్తూ ఉంది. 

చల్లని ఆ చెట్టు నీడలో అమ్మగారింటి ఆదరణను అత్తగారింట్లో పొందుతోంది గౌతమి. తండ్రి పరిష్వంగమే ఆ చెట్టు సాంగత్యం. ఆ చల్లని నీడయే తండ్రి ఆశీర్వచనం. తండ్రి గుర్తొచ్చాడు గౌతమికి.

మామిడి తొలి పూత పిందె చూసి పెద్ద పండుగే చేశాడు తండ్రి ఆనాడు. ఆ చెట్టు సంతానం ఇప్పుడు ఇక్కడ పూతకొచ్చింది. అదే ఆలోచిస్తూ 

చెట్టు వంక చూస్తూ కూతురితో కబుర్లలో ఉన్న గౌతమిని చూశారు మామగారు. మాటిమాటికీ మామిడి వంక చూస్తున్న ఆమె ఆలోచనలను పసిగట్టారు. "అమ్మా గౌతమీ" అంటూ దగ్గరకు వచ్చాడు. "మామయ్యా" అంటూ గౌతమి లేచి నిలబడింది. మామయ్య గౌతమి తల నిమిరి

"నాన్న గుర్తొస్తున్నాడు కదా తల్లీ" అనగానే గౌతమి కళ్ల నుండి రెండు కన్నీటి బొట్లు రాలాయి. నిన్నటి రోజున గౌతమి పేరుతో వచ్చిన ఉత్తరాన్ని

ఆమె చేతిలో పెడుతూ "నిన్న మధ్యాహ్నం పొలానికి వెళ్తూ ఉంటే పోష్టుమాష్టరు ఇచ్చాడు. రాత్రి యివ్వడం మరిచి పోయానమ్మా" అనగానే "అయ్యయ్యో ఫరవాలేదు మామయ్యా" అంటూ  విప్పి చదివి "తమ్ముళ్లిద్దరూ ఊరికి వెళ్తున్నారట మామయ్యా. దారిలో ఇక్కడ దిగి మేన కోడలిని చూసి వెళతారట" అంది గౌతమి.

"సంతోషం తల్లీ" "రెండు రోజులు ఉండమని చెబుదాం" అంటూ కొడుక్కి ఈ కబురందించడానికి లేచారు మామయ్యగారు. ఆ కబురు వారికందడం రెండు మూడు రోజులు ఉండే విధంగా పనులు సర్దుబాటు చేసుకుని వారు రావడం మేనగోడలితో కబుర్లు ఆటలు పాటలు ముద్దులూ మురిపాలూ పెద్దవారి ఆనందాలూ యధావిధిగా ఒక్కక్షణంలో జరిగి పోయాయి. ఆ రెండు రోజులూ మేనమామల మధ్యనే నిద్రపోయింది మేనగోడలు.

అటు నుంచి అన్నా యిటునుంచి తమ్ముడూ మేనగోడలిని చూచుకోవడంతోనే వారి నిద్రలు తెల్లారి పోయాయి. రాత్రంతా మేన గోడలి మీద ఈగను కూడా వాల నివ్వలేదు మేనమామలు.  ఒకరి కుడి చెయ్యి మరొకరి యెడమచెయ్యి భరోసాగా నిశ్చింతగా నిద్రబోయింది మేనగోడలు.

నిద్రలో లేచి తమ్ముళ్ల నిబ్బంది పెడుతున్నదేమోనని ఒకటికి రెండుసార్లు వచ్చి చూసింది గౌతమి.  వారి మధ్య ప్రసన్న వదనంతో ‘మా మామ లుండగా నాకు భయమేంటోయ్’ అన్నట్లుగా చిరునవ్వు చెదరనీకుండా నిండు చందమామను ధిక్కరిస్తూ నిద్రపోతోంది చిట్టి తల్లి. వారిని తృప్తిగా చూసి తానూ నడుం చాల్చింది. మేన మామ అనే మాట ఎంత భరోసా మేనగోడలికి.

ఉదయాన్నే నిద్ర లేచేసరికి తమ్ముళ్లిద్దరూ ఒకరు మేనగోడలికి పళ్లు తోముతున్నారు రెండో వారు చెంబుతో నీళ్లూ టవలూ పట్టుకుని రాణీగారి సేవకు సిద్ధంగా ఉన్నారు. అదయ్యింతర్వాత ముఖం తుడిచారు. ఆ తర్వాత మామల బుజాలమీద గుఱ్ఱం ఎక్కి వచ్చింది. మామయ్యలు పాలు తాగిస్తే తాగింది. సాయంత్రం మామయ్యలు వెళ్లి పోతారని తెలిసిందా గడుగ్గాయికి. అంతే, వెళ్లి పోవద్దు మామయ్యా ఇంకా కొన్ని రోజులుండండి మామయ్యా, అని అమ్మతో చూడమ్మా మామయ్యలు వెళ్లి పోతామంటున్నారు. అని ఫిర్యాదు చేసి తాతయ్య దగ్గరకెళ్లి "తాతయ్యా మీరు చెప్పండి వెళ్లవద్దని, నాకు మామయ్యలతో ఆడుకోవాలని ఉంది" అని తాతయ్యవద్ద గారాలు పోయింది. ఏడుపు మొఖం పెట్టింది. కోపంగా చూసింది. అవ్వ దగ్గరకెళ్లి కూర్చుంది.

అప్పుడు తాతయ్య ‘ఇలా రాతల్లీ’ అని చేతులు చాచాడు. పరుగున వెళ్లి కళ్లింత పెద్దవి చేసి"మామయ్యలను ఉండమని చెబుతావా??" అని చంకెక్కింది.

దేవుడు భక్తికి వశుడవుతాడు. ఎంతటి ఱాతి గుండె అయినా చిన్న పిల్లల ప్రేమకు వశం కాక తప్పదు. "మామయ్యల తోబాటు ఊరికి వెళ్తావా తల్లీ" అనగానే తాతయ్య బుగ్గల మీద అమాంతం ముద్దుల వర్షం కురిపించేసింది మనుమరాలు. అందరి కళ్లూ తెరిపిన బడ్డాయి.

"అమ్మా గౌతమీ మీరూ తమ్ముళ్లతో కలిసి వెళ్లి అమ్మా నాన్నల దగ్గర నా ల్రోజులుండి రండి అని కొడుకుతో నీవూ వెళ్లు" అంటూ "ఈరోజు నవమి రేపు ఉదయం బాగుంది ప్రయాణానికి "

అని బయటికి నడిచాడు. అలా వెళ్లి పాలేరుని పిల్చుకుని వచ్చి కొన్ని కొబ్బరి కాయలు దింపించాడు. దోర మామిడి కాయలు ఏరి కొయ్యమని పురమాయించాడు. వాడాపనిలో నిమగ్నమయ్యాడు. అత్తగారేవేవో జాడీలలో సర్దింది. 

అన్నీ భద్రంగా కట్టి బండెక్కించారు మామగారు. కోడలికి జాగ్రత్తలు చెప్పి వెనుదిరిగారు. బయలుదేరేటప్పుడు మనుమరాలు తాతయ్య మెడకు చుట్టుకుని ‘మా మం...చి తాతయ్య’ అని కితాబిచ్చింది. అంత పెద్ద బిరుదిస్తే ఏ తాతయ్య పొంగిపోడు.

కొడుకులూ కూతురూ అల్లుడూ మనుమరాలూ ఒక్క సారిగా వచ్చేసరికి పురుషోత్తమ రావు దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇక్కడికొచ్చినా మేనగోడలికి మేన మామల తోడిదే లోకం. మామిడి పండ్లూ కొబ్బరికాయలూ ఇంకా ఏవేవో అన్నీ ఇంట్లోకి చేరాయి.

గౌతమి రాగానే ముందు పరామర్శించిది మామిడి చెట్టునే. ఒక్కసారి తడిమి చూసుకుంది చేతికందిన ఆకులని నిమిరింది. తనివిదీరా చివరి కొమ్మవరకూ చూసింది. దాని నీడన కూర్చుంది. ‘గౌతమీ కాఫీ’ అని తల్లి పిలవడంతో లేచి లోనికెళ్లింది.

"అమ్మా నేనలా అమ్మవారి గుడిదాకా వెళ్లోస్తాను. అంది గౌతమి. ‘నేనో’ అంది కుమార్తె. ‘నీవు లేకుండానా? లేచి స్నానం చేసి మామయ్య తెచ్చిన గౌను వేసుకో’ అంటూ కూతుర్ని స్నానానికి లేవదీసింది. మామయ్య లిద్దరూ దొడ్లో మామిడి కాయలను పక్వానికొచ్చినవి ఏరి కోయిస్తున్నారు.  

పురుషోత్తమరావు అది చూసి చెట్టు కొమ్మలు లాగి లాగి కాయలు కోస్తూ ఉంటే ఆ చెట్టుకెక్కెడ నొప్పి కలుగుతుందేమోనని, వారితో

ఉ. భద్రము కాయ గోయునెడ భద్రము కొమ్మెలు రెమ్మలుందగన్

    ఛిద్రము గాక యుండగను చిక్కము లోనికె గోయుడెంతయున్

    నిద్రల గాచి పెంచితిని నిక్కము దీనిని కన్న బిడ్డగన్

    భద్రము గాగ నిచ్చినది భవ్యుల మన్మల మన్మరాండ్రనున్. 

అని హెచ్చరించారు.

పిల్లలు గుడికి బయలుదేరుతూ ఉండగా పురుషోత్తమరావుగారు రెండు బుట్టలలో గౌతమి తెచ్చిన మామిడి పండ్లూ ఇక్కడి చెట్టు పండ్లూ విడిగా నింపి "అమ్మా గౌతమీ ఇవి గుడిలో అమ్మవారికి నివేదనగా సమర్పించు. ఈ బుట్టలోని పండ్లు ఆ బుట్టలోని పండ్లకు మేన మామలు అని పూజారికి చెప్పు" అంటూ అందించాడు. 

పురుషోత్తమరావు గారి హృదయం తెలిసిన పూజారి ఆశ్వర్య పడలేదు. వారిలా కాక మరోలా ఆలోచిస్తారా? అనుకున్నాడంతే.

"అమ్మా గౌతమీ ఈ పండ్లను ఊరంతటికీ ప్రసాదంగా పంచి పెడతాను." అమ్మవారు కూడా సంతోషిస్తారు. ఆశీర్వదిస్తారు. అని చేయెత్తి తానూ ఆశీర్వదించాడు.

ఆలయం ఆవరణలోని చెట్టుపండ్లు ఓ పది కోయించి గౌతమి వెంట పంపించాడు. 

మధ్యాహ్నం మేనమామలు మేనగోడలిని వెంటబెట్టుకుని తాము చదువుకున్న పాఠశాల కెళ్లారు. వచ్చినప్పుడల్లా బడికి వెళ్లి మాష్టార్లను కలిసుకోవడం వారి ఆశీస్సులు పొందడం వారికొక ఆనవాయితీ. మాష్టార్లందరినీ మేనగోడలు కబుర్లతో ముంచెత్తింది. ఆ పాఠశాలకు కూడా 

మామిడి బంధుత్వం ఉంది గదా. ఆ చెట్టుకూడా కాపుకొచ్చింది. ఆ చెట్టు పండ్లు కోయించి మేనగోడలికి చిన్న బుట్టలో పెట్టి "ఇవి నీవే" అంటూ అందించారు.

అలాగే పొలంలోని చెట్టు పండ్లు కూడా పురుషోత్తమరావు గారింటికి చేరాయి. మనుమరాలు వాటిని చూసి అబ్బో ఎన్ని మామిడి పండ్లో అని ముక్కున వేలేసుకుంది. "తాతయ్యా నేను లెక్క బెట్టనా?" అనే మాటకే పొంగిపోయారు తాతగారు. తాత సాయంతో మనుమరాలు లెక్కబెట్టింది. ఆమె లెక్క ఏమో గానీ మొత్తం అరవై పండ్లు తేలాయి. ఇవన్నీ ఆ చెట్టు గంపెడు పరివారమే. గర్వంగా తలెత్తి చూసింది మామిడి చెట్టు.

ఆ నాలుగు రోజులలో ఎవరొచ్చినా మామిడి పండ్లే పలహారం. అరవై మామిడి టెంకలనూ జాగ్రత్త చేయించారు పురుషోత్తమరావుగారు. పాలేరు చేత

ఆ టెంకలన్నీ తన పెరట్లోనే పాతేయించాడు. అవి మొలకెత్తి ఓ ఆడుగు వరకూ పెరిగిన తర్వాత అరవై కుండీలని తెప్పించి వాటిలోకి మార్చాడు. మంచి ఎరువు వేస్తూ జాగ్రత్తగా కాపాడాడు. ఇదంతా ఆ మామిడి చెట్టు గమనిస్తూ ఉంది. తన పిల్లలను అక్కున జేర్చుకుని కాపాడుతున్న పురుషోత్తమ రావు ఆ చెట్టు కళ్ళకు సర్వ జగత్పోషణ కర్తయైన పురుషోత్తముడి లాగే కనిపిస్తున్నాడు. మనసు నిండి పోయింది. 

వినాయక చతుర్థి దగ్గర పడుతోంది. కుండీలలోని మామిడి మొక్కలు ననవలాడుతూ కనువిందు చేస్తున్నాయి. వియ్యంకుల వారినీ అల్లుడినీ కుమార్తెనూ మనుమరాలినీ పండుగ ఇక్కడ జరుపుకుందామని ఆహ్వానించారు. వారూ వచ్చారు. హడావిడి అంతా తాతలూ మనుమరాలిదే.

మేనగోడలి సేవలన్నీ మేనమామలవే. గౌతమికీ ఆమె తల్లికీ  ఈ పనులనుండి విశ్రాంతి.

ఆ మామిడి మొక్కల కుండీలను వలయంగా ఏర్పరచి  మధ్యలో  చిన్న మంటపం ఏర్పాటు చేసి గణపతిని అక్కడకు ఆహ్వానించారు. ఆవాహయామి పూజయామి. పంటల గణపతి పేరు సార్థకం అయింది. ఈ ఏర్పాట్లను చూసి ఊరు ఊరంతా వచ్చి పాలు పంచుకుంది. ఉత్సవం తొమ్మిది రోజులు సాగింది. వచ్చిన అతిథులకు భోజన సత్కారాలతోబాటు  ఓ మామిడి మొక్క ప్రసాదంగా సమర్పించారు. ఓ పదిహేను మొక్కలు గౌతమి మామగారు అక్కడ తమ ఊరిలో వితరణ చేస్తానని చెప్పారు.

ఆ ఏర్పాట్లు జరిగాయి. ఆ ఉత్సవాలలోనే మేనమామ లిరువురకూ తమ పిల్లల నిస్తామంటూ ఓ రెండు కుటుంబాల వారు ముందుకు వచ్చి సంబంధం ఖాయం చేసుకున్నారు. చెప్పేదేముంది ఓ రెండు మామిడి కుండీలు వారిళ్లకూ చేరాయి. మామిడి సంతతి ఊరు ఊరంతా విస్తరించింది.

ఈ తతంగం అంతటినీ పర్యవేక్షిస్తున్న మామిడి చెట్టుదే ఉత్సాహం అంతా. సంతోషానందాలతో పొంగి పోయింది.  తన బిడ్డలూ మనుమలూ మనుమరాండ్రూ ఎంతలా విస్తరించారు. 

తర్వాతి పదేళ్లలో ఈ దేశం మొత్తం తన సంతతి సంతతితో నిండి పోతుంది అన్న భావం ఆ చెట్టుని మరింత పులకింప జేసింది.

పురుషోత్తమ రావు తలమీద నాలుగాకులు రాల్చి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ "ఇవీ మన కుటుంబాలు గంపల కొద్దీ పిల్లలు" అని కన్నీళ్లతో కళ్లు నిండి పోగా మనసారా ఆశీర్వదించింది.

అన్నట్లు ఆ రోజు అమ్మవారి గుడిలోని అర్చకులు చేసిన పని చెప్పడం మరిచాను.

వారికి కూడా గౌతమి అభిమాన పుత్రికే. అందుకే 

ఉ. పావన గంగ, భోగ శచి, భాగ్యపు గౌరి, గభీర భూమి సం

    భావన కుంతి, రూప గుణ భారతి, సంపద లక్ష్మి దేవి, సం

    సేవిత సంజ్ఞ,నిశ్చల విశేష యరుంధతి యైన లక్ష్మి దాఁ

    గేవల కన్యయే తలఁపఁ గీర్తన సేయఁ దగున్ ధరాస్థలిన్.(వీరభద్ర విజయం)

అని గౌతమిని ఆశీర్వదించారు.

శుభం.....

కడయింటి కృష్ణమూర్తి..గోవా...(నెల్లూరు)

జైహింద్.

7, ఆగస్టు 2026, శుక్రవారం

శ్రీ కంచి పరమాచార్య స్వామివారి మూకసారములో23 వ శ్లోకమయిన మందస్మిత శతకములోని 23వ శ్లోక భాష్యము. ... శ్రీ తాడేపల్లి పతంజలి.

0 comments

శ్రీ కంచి పరమాచార్య స్వామివారి మూకసారములో23 వ శ్లోకమయిన మందస్మిత శతకములోని 31వ శ్లోక భాష్యము.   ...   

శ్రీ తాడేపల్లి పతంజలి.  07 -08 -2026.

శ్లోII   చేతః శీతలయంతు నః పశుపతేరానందజీవాతవో

నమ్రాణాం నయనాధ్వసీమసు శరచ్చంద్రాతపోపక్రమాః |

సంసారాఖ్యసరోరుహాకరఖలీకారే తుషారోత్కరాః

కామాక్షి స్మరకీర్తిబీజనికరాస్త్వన్మందహాసాంకురాః ||

ప్రతిపదార్థం

కామాక్షి = ఓ కామాక్షీ దేవీ!

పశుపతేః = పరమశివునికి

ఆనంద జీవాతవః = ఆనందాన్ని తిరిగి ప్రాణవంతం చేసే దివ్యౌషధాలు,

నమ్రాణామ్ = నమస్కరించే భక్తుల యొక్క

నయనాధ్వసీమసు = కంటి చూపుల పరిధిలో (కంటి మార్గాల్లో)

శరచ్చంద్రాతపోపక్రమాః = శరత్కాలపు వెన్నెల వలె ఆహ్లాదాన్ని కలిగించేవి,

సంసారాఖ్య సరోరుహాకర ఖలీకారే = సంసారము అనే తామర చెరువును పాడుచేయడంలో (నాశనం చేయడంలో)

తుషారోత్కరాః = మంచు బిందువుల సమూహం వంటివి,

స్మర కీర్తి బీజనికరాః = మన్మథుని కీర్తి అనే పైరుకు (విజయానికి) తెల్లని విత్తనాల సమూహం వంటివి అయిన

త్వత్ మందహాసాంకురాః = నీ చిఱునవ్వు మొలకలు

నః = మా యొక్క

చేతః = మనస్సును

శీతలయంతు = చల్లబరచుగాక (శాంతింపజేయుగాక).

తాత్పర్యం

ఓ కామాక్షీ దేవీ! పరమశివునికి ఆనందాన్నిచ్చే సంజీవని వంటివి, నమస్కరించిన భక్తుల నేత్రాలకు శరత్కాలపు వెన్నెలలాగా అత్యంత ఆహ్లాదాన్ని పంచేవి, ‘సంసారం’ అనే తామరల చెరువును తుడిచిపెట్టే తుషార బిందువులు (మంచు సమూహం) వంటివి, మన్మథుని యశస్సును పెంచే విత్తనాల వంటివి అయిన నీ చిరునవ్వు మొలకలు (కాంతిరేఖలు) మా మనస్సులకు పరమ శాంతిని, చల్లదనాన్ని ప్రసాదించుగాక!

విశేష వివరణలు

1. రూపకాలంకారము:

అమ్మవారి మందహాసాన్ని కేవలం ఒక నవ్వుగా కాకుండా, శివునికి ఆనందాన్నిచ్చే 'దివ్యౌషధం'గా, భక్తుల కళ్లకు 'శరత్కాలపు వెన్నెల'గా, సంసార తామరలను తుడిచిపెట్టే 'మంచు'గా, మన్మథుని కీర్తిని పెంచే 'విత్తనాలు'గా అభేదంగా నిరూపించి వర్ణించడం వల్ల ఇందులో రూపకాలంకారము సుస్పష్టంగా ఉంది.

2. కవి సమయము (కీర్తి వర్ణన):

సంస్కృత కావ్య సంప్రదాయంలో (కవి సమయంలో) 'కీర్తి' లేదా యశస్సును ఎప్పుడూ తెల్లని రంగుతో పోలుస్తారు. ఇక్కడ అమ్మవారి నవ్వు కూడా తెల్లనిది కావడం చేత, ఆ తెల్లని చిరునవ్వులను మన్మథుని కీర్తికి కారణమైన "తెల్లని విత్తనాలు" (బీజములు) గా కవి వర్ణించారు.

3. సమాసోక్తి మరియు పరిణామాలంకారాలు (కృషక వ్యవహార స్ఫురణ):

ఈ శ్లోకంలో ఒక రైతు వ్యవహారం (వ్యవసాయ ప్రక్రియ) రూపకంగా స్ఫురిస్తుంది:

ఖలీకారే = పొలాన్ని దుక్కి దున్ని సిద్ధం చేయడం (కళ్ళం చేయడం).

తుషారోత్కరాః = నీరు చల్లడం.

బీజనికరాః = విత్తనాలు విత్తడం.

అంకురాః = మొలకలు రావడం.

ఈ విధంగా ఒక వ్యవసాయ క్రమం అమ్మవారి మందహాస వర్ణనలో అంతర్లీనంగా స్ఫురించడం వల్ల సమాసోక్త్యలంకారము ఏర్పడింది. అలాగే, ఈ అంకురాలు భక్తుల మనస్సును చల్లబరచడానికి అమ్మవారి 'మందహాసాలు'గా పరిణమించవలసి రావడం వల్ల పరిణామాలంకారము కూడా ఇందులో ఇమిడి ఉంది.

స్వస్తి.

పతంజలి తాడేపల్లి.

ఇంతటి చక్కని భాష్యమునందించిన మహోదయులు శ్రీ తాడేపల్లి పతంజలిగారికి ధన్యవాదములు.

ఈ శ్లోకమునకు నా అనువాద పద్యము.

తే.గీ.II  అభవు నానందమున్ బెంచు నౌషధంబు,

భక్తులకు శరచ్చంద్రిక, భవ సరోరు

హములఁ గలగించు మంచు, కీర్తిమొలక రతి 

పతికి, నీ నవ్వు, జనని! నన్ సతము కాచు.

జైహింద్.

6, ఆగస్టు 2026, గురువారం

"సున్నా '0' ని ఆర్యభట్ట 5వ శతాబ్దంలో కనిపెడితే... వేల సంవత్సరాల నాటివంటున్న రామాయణ భారతాల్లో రావణుడికి పది తలలు కౌరవులు వందమంది అని అబద్దాల కథలు ఎందుకు చెప్పారు?" ... -శ్రీ గౌతమ్ కశ్యప్.

0 comments


జై శ్రీరామ్.

1.  "సున్నా '0' ని ఆర్యభట్ట 5వ శతాబ్దంలో కనిపెడితే... వేల సంవత్సరాల నాటివంటున్న రామాయణ భారతాల్లో రావణుడికి పది తలలు కౌరవులు వందమంది అని అబద్దాల కథలు ఎందుకు చెప్పారు?" 

శ్రీ గౌతమ్ కశ్యప్.

ఈ ప్రశ్న పైకి చూడటానికి చాలా తార్కికంగా, హేతుబద్ధంగా అనిపిస్తుంది. సామాన్యుడికి కూడా, "అవును కదా! సున్నా లేకుండా 10, 100 ఎలా అవుతాయి?" అనే సందేహం రావడం సహజం. అందుకే ఆ వీడియోకు అన్ని లైకులు, షేర్లు వచ్చాయి.

కానీ, ఒక్క నిమిషం ఆలోచిద్దాం. 🤔 సమాజంలో ప్రశ్నలు పుట్టడం ఆరోగ్యకరమే, కానీ ఆ ప్రశ్న సత్యశోధన కోసం పుట్టాలి తప్ప, కేవలం అవహేళన చేయడానికి లేదా వివాదాలు సృష్టించడానికి పుట్టకూడదు. ఈ ప్రశ్న పైకి చాలా మేధోపరమైనదిగా అనిపించినా, దీని లోతుల్లోకి వెళితే చరిత్ర, భాష, మరియు గణిత శాస్త్రాల పట్ల కనీస అవగాహన లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. సగం జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే. అక్షరాలకు (పదాలకు), అంకెలకు (చిహ్నాలకు) మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసాన్ని గ్రహించలేని స్థితి నుండి ఇలాంటి తర్క రహితమైన ప్రశ్నలు పుట్టుకొస్తాయి. ఆ అజ్ఞానాన్ని ఆధారాలతో బద్దలు కొడదాం. 👇

2: భావం, భాష మరియు లిపి - లెక్కపెట్టడం వేరు, చిహ్నాలతో రాయడం వేరు

ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే, మనం మానవ నాగరికత పరిణామ క్రమాన్ని కొద్దిగా అర్థం చేసుకోవాలి. మనిషి అంకెలు, కాగితాలు, పెన్నులు కనుక్కోవడానికి ఎన్నో వేల సంవత్సరాల ముందే ప్రకృతితో మమేకమై జీవించాడు.

మానవుడికి మొదట కలిగింది 'భావం' (Thought/Concept). తన ఎదురుగా ఉన్న చెట్లను, జంతువులను, తోటి మనుషులను చూసి వాటి పరిమాణాన్ని తన మెదడులో ముద్రించుకున్నాడు. ఆ భావాలను ఇతరులతో పంచుకోవడానికి కొన్ని శబ్దాలను సృష్టించాడు. ఆ శబ్దాలే కాలక్రమంలో 'భాష' (Language) గా మారాయి. చాలా కాలం తర్వాత, ఆ భాషకు ఒక శాశ్వత రూపాన్ని ఇవ్వడానికి 'లిపి' (Script/Symbols) ను కనుక్కున్నాడు.

ఇక్కడ మనం గ్రహించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం: లెక్కపెట్టడం (Counting) వేరు, లెక్కించిన దానిని అంకెల చిహ్నాలతో రాయడం (Notation) వేరు.

కాగితం మీద 1, 2, 3 అని అంకెలు (Digits) రాయడం వేరు, ఒక వస్తువుల సమూహాన్ని చూసి అవి ఎన్ని ఉన్నాయో పదాల ద్వారా (Words) వ్యక్తపరచడం వేరు. ఒక ఆదిమానవుడు తన ఎదురుగా ఐదు పండ్లు ఉంటే, తన చేతి వేళ్లు చూపించో లేదా తన భాషలోని ఒక పదం ద్వారానో వాటి పరిమాణాన్ని కచ్చితంగా చెప్పగలిగాడు. ఐదు అనే అంకె (5) చిహ్నం కనుక్కుోవడానికి ముందే మనిషికి ఐదు అనే 'భావన' తెలుసు, లెక్కపెట్టడం తెలుసు. రామాయణ భారతాల కాలంలో నేటి ఆధునిక అంకెల లిపి (1, 2, 3...) లేనంత మాత్రాన వారికి లెక్కపెట్టడం తెలియదు అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది.

3: వేద కాలం నాటి భాషా వైభవం - సంస్కృతంలో సంఖ్యలను ఎలా లెక్కించేవారు?

ఇప్పుడు మనం రామాయణ, మహాభారతాలు రాయబడిన సంస్కృత భాషా చరిత్రను పరిశీలిద్దాం. సంస్కృత భాష ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన, శాస్త్రీయమైన, మరియు పరిపూర్ణమైన భాషలలో ఒకటి. ఆధునిక ప్రపంచం అంకెలను చిహ్నాల రూపంలో రాయడం నేర్చుకోక ముందే, ప్రాచీన భారతీయులు అనంతమైన సంఖ్యలను వ్యక్తపరచడానికి అద్భుతమైన పదజాలాన్ని (Nomenclature) సృష్టించారు.

రామాయణ, మహాభారతాలు కాగితం మీద ఆధునిక అంకెలతో రాయబడలేదు. అవి శ్రుతి (వినడం), స్మృతి (గుర్తుపెట్టుకోవడం) అనే విధానం ద్వారా గురుశిష్య పరంపరగా మౌఖికంగా తరతరాలు ప్రయాణించాయి. ఆ తర్వాత కాలంలో తాళపత్రాల మీద లిఖించబడ్డాయి. అవి శ్లోకాల రూపంలో ఉన్నాయి. શ్లోకాలలో అంకెలు ఉండవు, పదాలు ఉంటాయి.

📖 వాల్మీకి మహర్షి రామాయణంలో రావణుడి గురించి వర్ణించేటప్పుడు ఎక్కడా '10' అనే అంకెను వాడలేదు. ఆయన "దశగ్రీవుడు" (దశ - పది, గ్రీవ - మెడలు కలవాడు) లేదా "దశకంఠుడు" అనే పదాలను ప్రయోగించారు.

📖 అలాగే వేదవ్యాసుడు మహాభారతంలో కౌరవులను వర్ణించేటప్పుడు "కౌరవులు 100 మంది" అని రాయలేదు, "శత కౌరవులు" (శత - వంద) అని పదంతో వర్ణించారు.

పది, వంద అనేవి సంఖ్యావాచకాలు (Number Words). ప్రాచీన భారతీయులకు సంఖ్యలను పదాల రూపంలో లెక్కించడం వెన్నతో పెట్టిన విద్య. దీనికి ఆధారాలు మన వేదాలలోనే పుష్కలంగా ఉన్నాయి.

📜 ఆధారం 1: యజుర్వేదం (తైత్తిరీయ సంహిత): క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల నాటిదిగా భావిస్తున్న యజుర్వేదంలోని తైత్తిరీయ సంహితలో సంఖ్యలను పదాల రూపంలో ఎంత అద్భుతంగా లెక్కించారో చూడండి. వారు పది యొక్క గుణకారాలను (Powers of 10) ఉపయోగించి అనంతమైన సంఖ్యలకు పేర్లు పెట్టారు.

"ఏక చ దశ చ దశ చ శతం చ శతం చ సహస్రం చ సహస్రం చాయుతం చాయుతం చ నియుతం చ నియుతం చ ప్రయుతం చ..."

దీని అర్థం:

ఏక = 1

దశ = 10

శత = 100

सहస్ర = 1,000 (వెయ్యి)

అయుత = 10,000 (పది వేలు)

నియుత = 100,000 (లక్ష)

ప్రయుత = 1,000,000 (పది లక్షలు) ... ఇలా పరార్ధ (10^17) వరకు పేర్లు ఉన్నాయి.

ఆధునిక '0' చిహ్నం కనుగొనబడక ముందే, వేల సంవత్సరాల క్రితమే భారతీయులు 'దశ' (పది), 'శత' (వంద) అనే పదాల ద్వారా ఆ పరిమాణాన్ని లెక్కించారు మరియు గ్రంథాలలో పొందుపరిచారు. కాబట్టి, రావణుడికి పది తలలు, కౌరవులు వందమంది అని చెప్పడానికి '0' అనే చిహ్నం అవసరం లేదు, 'దశ', 'శత' అనే పదాలు చాలు.

4: రోమన్ సామ్రాజ్యపు అద్భుతం - సున్నా చిహ్నం లేకుండానే ప్రపంచాన్ని ఏలారు

ఈ తర్కాన్ని మరింత బలంగా బద్దలు కొట్టడానికి, భారతదేశం వెలుపల ఉన్న చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం. ప్రపంచ చరిత్రలో రోమన్ సామ్రాజ్యం అత్యంత శక్తివంతమైనది మరియు అభివృద్ధి చెందినది. వారు అద్భుతమైన కట్టడాలు, రోడ్లు, ఆక్విడక్ట్‌లు నిర్మించారు. భారీ సైన్యాన్ని నిర్వహించారు. వారి వ్యాపార లావాదేవీలు ఖండాంతరాలకు వ్యాపించాయి. మరి ఇదంతా వారు ఎలా చేశారు? వారు కూడా లెక్కపెట్టారు.

కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే: రోమన్ సంఖ్యామానం (Roman Numerals) లో 'సున్నా' (0) అనే చిహ్నమే లేదు! 🚫

వారు సంఖ్యలను సూచించడానికి అక్షరాలను (Letters) చిహ్నాలుగా వాడారు:

I=1, V=5, X=10, L=50, C=100, D=500, M=1,000.

వారు పదిని సూచించడానికి 'X' అనే అక్షరాన్ని వాడారు తప్ప, '1' పక్కన '0' పెట్టలేదు. వందను సూచించడానికి 'C' ని వాడారు. సున్నా అనే చిహ్నం లేకుండానే రోమన్లు పదిని, వందను, వేలను (M) అవలీలగా లెక్కపెట్టగలిగారు, మహా మహా కట్టడాలకు ఇంజనీరింగ్ లెక్కలు వేయగలిగారు, వారి సామ్రాజ్యాన్ని ఏలారు.

ఆ వీడియోలో ప్రశ్నించిన మహిళ తర్కం ప్రకారం అయితే, రోమన్లకు సున్నా తెలియదు కాబట్టి, వారు పది మంది సైనికులను లెక్కపెట్టలేకూడదు, వంద నాణేలను లెక్కపెట్టలేకూడదు. కానీ చరిత్ర మనకు ఏం చెబుతోంది? వారు లెక్కపెట్టారు, చిహ్నాల రూపంలో రాశారు, కానీ సున్నా అనే చిహ్నాన్ని వాడలేదు.

ఇది స్పష్టంగా నిరూపిస్తోంది: ఒక పరిమాణాన్ని (Quantity) గుర్తించడానికి నిర్దిష్టమైన అంకె చిహ్నం (Digit Symbol - like '0') అవసరం లేదు, ఒక ప్రత్యామ్నాయ గుర్తు లేదా పదం (Word) ఉంటే చాలు. రామాయణ భారతాల కాలంలో 'దశ', 'శత' అనే పదాలు ఆ పనిని చేశాయి.

5: శూన్యం అనగా ఏమిటి? ఆర్యభట్ట నిజంగా ఏం చేశాడు?

ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఆర్యభట్ట (క్రీ.శ. 5వ శతాబ్దం) 'సున్నా' ను కనిపెట్టాడు అనే వాదనలోని సత్యమెంత? ఇక్కడ సామాజిక మాధ్యమాలలో చెలామణి అవుతున్న ఒక పెద్ద చారిత్రక అపోహను తొలగించాలి.

ఆర్యభట్ట క్రీ.శ. 5వ శతాబ్దంలో 'ఏమీ లేకపోవడం' (Nothingness) అనే భావనను లేదా 'సున్నా' అనే ఆకారాన్ని మొదటిసారిగా కనిపెట్టలేదు. ఆర్యభట్ట కన్నా ఎన్నో వేల సంవత్సరాల క్రితమే భారతీయులకు 'శూన్యం' (Void / Emptiness) అనే తాత్విక మరియు గణిత భావన తెలుసు. మన వేదాలు, ఉపనిషత్తులు, మరియు ప్రాచీన గణిత గ్రంథాలు శూన్యం గురించి, అనంతం గురించి ఎంతో లోతుగా చర్చించాయి.

💡 ఆధారం 2: పింగళుడి ఛందస్సూత్రం (క్రీ.పూ. 3వ శతాబ్దం): ఆర్యభట్ట కంటే సుమారు 800 సంవత్సరాల ముందే, పింగళుడు అనే మహర్షి తన 'ఛందస్సూత్రం' లో ఛందస్సును లెక్కించడానికి 'శూన్యం' అనే పదాన్ని ఒక గణిత సూచికగా ఉపయోగించాడు. ఆయన ద్విసంఖ్యామానం (Binary System) వంటి పద్ధతిని వాడాడు. "గాయ్త్రీ శేషే శూన్యమ్" (ఛందస్సూత్రం 8.29). ఇక్కడ 'శూన్యం' అనే పదాన్ని స్పష్టంగా వాడారు. అంటే[5:23 pm, 6/8/2026] కాదంబరి ప్రభు Kadambari Prabhu: అంటే ఆర్యభట్ట కంటే ముందే గణిత ప్రక్రియలలో శూన్యం అనే భావన ఉనికిలో ఉంది.

మరి ఆర్యభట్ట సాధించిన ఘనత ఏమిటి?

ప్రాచీన కాలంలో లెక్కలు పదాల రూపంలో ఉండేవి. ఇది చాలా నిదానంగా సాగే ప్రక్రియ. ఆర్యభట్ట చేసిన గొప్ప పని ఏమిటంటే: స్థాన విలువ విధానాన్ని (Decimal Place Value System) పరిపూర్ణం చేయడం మరియు సున్నాను ఒక సంఖ్యగా (Number) గణిత ప్రక్రియలలో ఉపయోగించే పద్ధతిని క్రమబద్ధీకరించడం.

ఆర్యభట్ట తన 'ఆర్యభట్టీయం' లో స్థాన విలువ పద్ధతిలో, ఒక స్థానంలో ఏమీ లేకపోతే (ఉదాహరణకు 101 లో పదుల స్థానంలో ఏమీ లేదు), ఆ ఖాళీని సూచించడానికి ప్రాచీన భారతీయులు ఒక చుక్క (Dot) ను లేదా చిన్న వృత్తాన్ని వాడటం ప్రారంభించారు. దీనినే 'శూన్య బిందువు' అన్నారు. ఆర్యభట్ట ఈ పద్ధతిని ఉపయోగించి ఖగోళ లెక్కలను అత్యంత ఖచ్చితంగా చేశాడు. ఆయన సున్నా లేనిదే సాధ్యం కాని 'స్థాన విలువ పద్ధతి' ని ప్రపంచానికి అందించాడు.

🔲 ఆధారం 3: బక్షాలీ వ్రాతప్రతి (c. క్రీ.శ. 3-4 శతాబ్దం): ఆర్యభట్ట కంటే ముందే ఉన్న ఈ గ్రంథంలో 'సున్నా' ని ఒక చిన్న చుక్క (Dot) రూపంలో స్థాన విలువలో ఖాళీని సూచించడానికి వందలాది చోట్ల ఉపయోగించారు.

🔲 ఆధారం 4: బ్రహ్మగుప్తుడు (క్రీ.శ. 7వ శతాబ్దం): ఆర్యభట్ట తర్వాత వచ్చిన ఈయన సున్నాకు సంబంధించిన గణిత నియమాలను (A-A=0, Ax0=0) మొట్టమొదటిసారిగా స్పష్టంగా నిర్వచించాడు.

🔲 ఆధారం 5: గ్వాలియర్ కోట శాసనం (క్రీ.శ. 876): మనం ఈనాడు వాడుతున్న సున్నా ఆకారం (0 - వృత్తం) మొట్టమొదటిసారిగా ఈ శాసనంలో కనిపించింది.

6: సగం జ్ఞానం - సోషల్ మీడియాలో ప్రమాదకరమైన ధోరణి

ఈ కథనం ప్రారంభంలో ఉదహరించిన మహిళ ప్రశ్న, దానిని సమర్థిస్తూ వచ్చిన వేలాది కామెంట్లు నేటి సమాజంలో నెలకొన్న ఒక ప్రమాదకరమైన ధోరణికి అద్దం పడుతున్నాయి. అదే "సగం జ్ఞానం" (Half-Knowledge).

ఆ ప్రశ్న అడిగిన మహిళకు ఒక విషయం తెలుసు: ఆర్యభట్ట సున్నాకు సంబంధించి ఏదో చేశాడు మరియు అది 5వ శతాబ్దంలో జరిగింది. కానీ ఆమెకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి:

❌ లిపికి, భాషకు ఉన్న తేడా తెలియదు.

❌ పదాల రూపంలో లెక్కించే సంస్కృత పద్ధతి తెలియదు.

❌ రోమన్ సంఖ్యామానంలో సున్నా లేదనే చరిత్ర తెలియదు.

❌ ఆర్యభట్ట కంటే ముందే శూన్య భావన, బక్షాలీ చుక్క చిహ్నం ఉన్నాయనే చారిత్రక ఆధారాలు తెలియదు.

త తను తెలిసిన ఆ ఒక్క ముక్క సమాచారంతో (ఆర్యభట్ట = 5వ శతాబ్దం), తనకు తెలియని వేల సంవత్సరాల చరిత్రను (రామాయణ భారతాది కాలం) తప్పుబట్టే ప్రయత్నం చేసింది. ఇది మేధోపరమైన అహంకారం మరియు అజ్ఞానానికి పరాకాష్ఠ.

నేడు సోషల్ మీడియాలో వీక్షణల (Views) కోసం, లైకుల కోసం పనిగట్టుకుని వివాదాలు సృష్టించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా మతపరమైన విశ్వాసాలను, ప్రాచీన ఇతిహాసాలను టార్గెట్ చేయడం ద్వారా సులభంగా పబ్లిసిటీ పొందవచ్చని కొందరు భావిస్తారు. ఈ ప్రశ్న వెనుక ఉన్నది కేవలం సత్యశోధన కాదు, హిందూ పురాణాలను లేదా కొందరిని అవహేళన చేయడానికి ఒక తప్పుడు లాజిక్ పట్టుకుని అడిగిన ప్రశ్న ఇది.

దీనిని బుర్ర తక్కువ వారు షేర్ చేయడం, ఛాలెంజ్ చేయడం, చప్పట్లు కొట్టడం మరింత ప్రమాదకరం. వారు తాము కూడా ఒక గొప్ప తార్కిక ప్రశ్నను అడుగుతున్నామని భ్రమిస్తారు. నిజానికి వారు తమ అజ్ఞానాన్ని పదిమందికీ చాటుకుంటున్నారు. శాస్త్రీయ దృక్పథం అంటే ప్రతిదానినీ తప్పుబట్టడం కాదు, ఒక విషయం గురించి పూర్తిగా, ఆధారాలతో సహా తెలుసుకోవడం. సగం సమాచారంతో ముగింపుకు రావడం అశాస్త్రీయం.

7: ముగింపు - సత్యం వైపు నడవాల్సిన బాధ్యత

"గొప్ప ప్రశ్న" అని చప్పట్లు కొట్టిన వారందరికీ, ఈ కథనం ఒక మేల్కొలుపు కావలసి ఉంది. మన ప్రాచీన ఇతిహాసాలైన రామాయణ మహాభారతాలు కేవలం కథలు కావు, అవి మన సంస్కృతి, నాగరికత మరియు విజ్ఞానానికి ప్రతీకలు. వాటిని తప్పుబట్టే ముందు, మనకు ఆ విషయంపై పూర్తి అవగాహన ఉందా అని ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి.

సత్యం యొక్క సారాంశం:

✅ రామాయణ భారతాల కాలంలో లెక్కపెట్టడం తెలుసు, సంఖ్యలను 'దశ' (పది), 'శత' (వంద) అనే పదాల రూపంలో రాశారు.

✅ సున్నా అనే భావన క్రీ.పూ. వేల సంవత్సరాల నుండి భారతీయులకు తెలుసు (యజుర్వేదం, పింగళుడు).

✅ ఆర్యభట్ట కంటే ముందే సున్నాను చుక్క (Dot) చిహ్నం రూపంలో గణితంలో వాడారు (బక్షాలీ వ్రాతప్రతి).

✅ ఆర్యభట్ట 5వ శతాబ్దంలో 'సున్నాను కనిపెట్టలేదు', కానీ స్థాన విలువ పద్ధతిని క్రమబద్ధీకరించి, గణితాన్ని కొత్త పుంతలు తొక్కించాడు.

కాబట్టి, రావణుడికి పది తలలు, కౌరవులు వందమంది అని చెప్పడం అబద్ధం కాదు. అది ఆ కాలపు భాషా మరియు గణిత పద్ధతి. ఆర్యభట్ట పుట్టక ముందే వారు లెక్కపెట్టారు.

సోషల్ మీడియాలో వచ్చే ప్రతి తప్పుడు సమాచారాన్ని గుడ్డిగా నమ్మడం, షేర్ చేయడం ఆపేయాలి. సందేహం వస్తే, లోతుగా అధ్యయనం చేయాలి. సగం జ్ఞానంతో అవహేళన చేయడం వల్ల మన అజ్ఞానమే బయటపడుతుంది. సత్యాన్ని ప్రేమతో పంచుదాం, నిరాధారమైన వాదనలను ఆధారాలతో తిప్పికొడదాం. అప్పుడే సమాజంలో సత్యం సూర్యుడిలా ప్రకాశిస్తుంది. 🌟

- గౌతమ్ కశ్యప్

ఇది చాలా విలువైన వ్యాసం... గా"

గుర్తించి నాకు పంపించిన ఆచార్య శ్రీ బేతవోలు రామ బ్రహ్మంగారికి కృతజ్ఞతలతో.🌹

ఈ వ్యాసముశ్రీ విశ్వనాథ సాహిత్యపీఠ నిర్వాహకులు శ్రీ కాదంబరి ప్రభు గారు వాట్సప్ లో ప్రచురించగా సేకరించి ప్రచురించితిని.

శ్రీ గౌతం కాశ్యప్ గారికి ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం గారికి,  శ్రీ కాదంబరి ప్రభు లకు నా ధన్యవాద పూర్వక నమస్సులు.

జైహింద్.

మందస్మిత శతకంలోని 24వ శ్లోకము. ప్రతిపదార్థ భావ విశేషాల వివరణము. బ్రహ్మశ్రీ తాడేపల్లి పతంజలి.

0 comments

జైశ్రీరామ్.

మందస్మిత  శతకంలోని 24వ శ్లోకము.  

ప్రతిపదార్థ భావ విశేషాల వివరణము ... తాడేపల్లి పతంజలి.

మూకపంచశతిలోని అమృతతుల్యమైన 500శ్లోకాలలో, శ్రీ కంచి పరమాచార్య స్వామివారు ఎంపిక చేసిన 31 ముఖ్య శ్లోకాలలో ( మూక సారములో 22వ శ్లోకము,) ఒకదాని దానిప్రతిపదార్థం,  తాత్పర్యంమరియు విశేష వివరణలు  06 -08 -2026

‘మూకసారము’లోని 22వ శ్లోకము మూకపంచశతి - మందస్మిత  శతకంలోని 24వ శ్లోకము.

శ్లోకము

కర్పూరైరమృతాంశుభిర్జనని! తే కాన్తైశ్చ చన్ద్రాతపై-

ర్ముక్తాహారగుణైర్మృణాలవలయైర్ముగ్ధస్మితశ్రీరియమ్।

శ్రీకాఞ్చీపురనాయికే! సమతయా సంస్తూయతే సజ్జనై-

స్తత్తాదృఙ్మమ తాపశాన్తివిధయే కిం దేవి! మన్దాయతే॥

ప్రతిపదార్థము

శ్రీకాఞ్చీపురనాయికే! = ఓ శ్రీకాంచీపురమునకు అధిదేవతవైన కామాక్షీ అమ్మవారా!

జనని! = జగన్మాతా!

దేవి! = ప్రకాశించు స్వభావము గల పరాశక్తీ!

తే = నీ యొక్క,

ఇయమ్ = ఈ,

ముగ్ధస్మితశ్రీః = అందమైన, అమాయకమైన చిఱునవ్వు యొక్క కాంతి/శోభ,

కర్పూరైః = కర్పూరములతోను,

అమృతాంశుభిః = శీతల కిరణాలు గల చంద్రులతోను,

కాన్తైః = మనోహరమైన,

చన్ద్రాతపైః చ = వెన్నెలలతోను,

ముక్తాహారగుణైః = ముత్యాల దండలతోను,

మృణాలవలయైః = తామరతూండ్లతో చేసిన కడియములతోను,

సజ్జనైః = సత్పురుషులచేత (జ్ఞానులచేత),

సమతయా = సమానమైనదిగా (తుల్యమైనదిగా),

సంస్తూయతే = కొనియాడబడుచున్నది.

తత్ = అటువంటి,

తాదృక్ = సాటిలేని శీతలత్వము గల నీ చిఱునవ్వు శోభ,

మమ = నా యొక్క,

తాపశాన్తివిధయే = (సంసార) తాపములను తొలగించి శాంతిని కలిగించే విషయంలో,

కిమ్ = ఏ కారణము చేత,

మన్దాయతే = ఆలస్యము/సోమరితనము చూపుచున్నది?

తాత్పర్యము

కాంచీపురేశ్వరియైన ఓ జగన్మాతా! కామాక్షీ దేవీ! నీ మందహాసము (చిఱునవ్వు) యొక్క కాంతి కర్పూరము, పూర్ణ చంద్రుడు, చల్లని వెన్నెల, ముత్యాల హారములు, తామరతూండ్ల కడియములతో సమానమైన శీతలత్వము కలిగినదని సజ్జనులు ఎల్లప్పుడూ కీర్తిస్తుంటారు. అటువంటి మహా మహిమాన్వితమైన నీ చిఱునవ్వు శోభ, నా మానసిక, శారీరక తాపములను (దుఃఖములను) నివారించే విషయంలో ఎందుకు ఆలస్యము చేస్తోందో నాకు బోధపడటం లేదు!

విశేష వివరణ

శీతలోపచారములు & ఉపమాలంకారము:

భారతీయ సాంప్రదాయంలో శరీరాన్ని లేదా మనస్సును చల్లబరిచేందుకు కర్పూరము పూసుకోవడం, వెన్నెలలో గడపడం, ముత్యాల హారాలు ధరించడం, తామరతూండ్లను ధరించడం వంటివి శీతలోపచారాలుగా చెబుతారు. కవి కామాక్షీ అమ్మవారి చిఱునవ్వును ఈ అన్ని శీతల వస్తువులతో సమానమైనదని సజ్జనులు (జ్ఞానులు) స్తుతిస్తున్నారనడం ద్వారా ఇక్కడ సుందరమైన ఉపమాలంకారము స్ఫురిస్తోంది.

కవి వ్యాజస్తుతి / ఆర్తి:

జ్ఞానులైన సజ్జనులు చెప్పే మాట ఏనాడూ అసత్యం కాజాలదు. నీ చిఱునవ్వు అంతటి చల్లదనము, ప్రశాంతతను ఇవ్వగలిగినప్పుడు, నా తాపములను శమింపజేయడంలో ఎందుకు ప్రశాంతంగా, ఆలస్యంగా వ్యవహరిస్తోంది? అని కవి అమ్మవారిని నిష్కాపట్యంతో ప్రశ్నిస్తున్నారు.

'ముగ్ధ' శబ్ద స్వారస్యము:

ఈ శ్లోకంలో అమ్మవారి చిఱునవ్వును "ముగ్ధస్మితశ్రీః" అని వర్ణించారు. 'ముగ్ధ' అనగా అమాయకత్వము లేదా భోళాతనము. అమాయకులైనవారు ఏ పనినైనా వెంటనే చేయక కొంత ఆలస్యంగా గ్రహించి స్పందిస్తుంటారు (మందగిస్తారు). కాబట్టి, అమ్మవారి చిఱునవ్వులోని అమాయకత్వము (ముగ్ధత్వము) వలనే నా తాప నివారణలో కూడా ఈ చిన్నపాటి ఆలస్యము జరుగుతోందేమోనని కవి చాలా మధురమైన భావనతో అమ్మవారి చిఱునవ్వు యొక్క అమాయకత్వాన్ని కొనియాడారు.

ఇట్లు

బ్రహ్మశ్రీ తాడేపల్లి పతంజలి.

పతంజలి మహోదయులకు ధన్యవాదములు.

ఈ శ్లోకమునకు నా తెలుగు అనువాద పద్యము.

తే.గీ.II  కప్పురపుపొడి, యమృతమ్ము, కమ్మనైన

వెన్నెలయు, ముత్తెములపేరు, బిసమటంచు

నీదు మందస్మితంబును నేర్పుమీర

చెప్పుదురిలను కామాక్షి! గొప్పవారు.

జైహింద్.

3, ఆగస్టు 2026, సోమవారం

శ్రీ వల్లభేయ ఛందో దర్పణము, రచన. శ్రీవల్లభవఝల అప్పల నరసింహమూర్తి..

0 comments

 జైశ్రీరామ్.

శ్రీ వల్లభేయ ఛందో దర్పణము,


                               2.వ,భాగము,

                     అణిమా ఛందము నందలి

                    17.అత్యష్టీ ఛందము,

              [వెలసిన వృత్తములు,1.31.072.]


ప్రతి పాదము నందు,17.అక్షరములుండును, ప్రాస నియమము కలదు,

1.చూడు మేలు,వృత్తము,


             రాముడైనా!రంగ డైనా!రాజిలెం గదె?తల్లి ప్రేమన్!

            నీమ నిష్టా శ్రేష్టు డైనా!నీతి వీడిన భ్రష్టు డౌగా!

            కామితార్ధా లిచ్చు భూమే?కన్న తల్లి యనంగ నౌగా!!

           కోమలత్వమ్!నిండు గూర్చన్?కోరు మెల్లరి!మేలు జీవా!


చూడు మేలు వృత్తము,ర,జ,ర,జ,జ,గగ,గణము లుండును,

యతి,9.యక్వషరము, వృసం:-11496.


2.చరమ జీవనా వృత్తము,


          ముసలి కాలము నందు!మోహరించును!చింత లెన్నో?

          పసితనంబది కాదు!పండు టాకును బోలి రాలున్!

          కొసకు సాయము లేదు!కోరినన్?దరి జేర రారే!

         మసలు దైవము నెంచి! మానితంబగు!లోకమంతన్!


చరమ జీవనా వృత్తము,న,భ,ర,జ,జ,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరమువృ,సం:-23224.


3.జీవనతీరు,వృత్తము,


           నవ్వు లొలికే?మాట లాడన్!నాణ్యమౌ!నర జాతినిన్!

          చివ్వ కెపుడున్!దూర మేగన్!చిక్కు లేదిక!నీకిలన్!

          పువ్వు బొడమన్!వాస నిచ్చున్!పూజ్యు డౌదువు!నీతి నిన్!

         బువ్వ దొరుకున్!నీతి మంతా!పొందు విద్యను!బాలకా!


జీవన తీరు వృత్తము,భ,య,య,ర,స,లగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరవృ,సం:-46159.


4.మేర లేని వృత్తము,


         చదువు కంతిమమే?దోయీ!జన్మ చాలునె?విద్యకున్!

         మదిని గెల్చుట!సాధ్యంబా!మంచి తత్వము లేనిచోన్?

         ప్రధమ కోపము!తప్పేయౌ!పాడు నెంచును తెల్యుమా!

        బెదర కెన్నడు?నీమానన్!పేరు తెచ్చుమి,!జాతికిన్!


మేర లెని వృత్తము,న,భ,మ,ర,స,లగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం;-44136.


5.నిర్జీవ రమ్య వృత్తము,


             పేడి వాని రూప మటులు!బీడు పంట వాటమగున్!

            నీడ నీని తాడి యటులు!నింగి నేగు యానమదే?

           పాడు వాని జీవ చరణ!పారమార్థ!చింతిడునే?

           కోటు లాశ!కొంప ముంచును !కూర్మి నెంచు మికన్

!


నిర్జీవ వృత్తము,ర,జ,ర,మ,ర,లగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరవృ,సం;-54753.


6.లెక్క లేని వృత్తము,


          పద్దు లేని లెక్క చెప్పెదే!పాపాల నాగ పుట్టుకౌ!

          హద్దు మీరు దుష్ట చింతదే?హర్మ్యాల శోభ నిచ్చునా!

         బుద్ధి లేని జీవి గాకుమా?పూజ్యార్హం బేడ కేగెనే?

        శుద్దులాడ!నమ్మబోరిలన్!శోధించి తాటతీయకన్?


లెక్క లేని వృత్తము,ర,జ,ర,త,ర,లగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-43179.


7.అమరత్వ వృత్తము,


          ఆక లన్నది లేనిచో?అమరులే?నరు లీభువిన్!

         చీకు చింతలు లేకనౌ!సిరుల వాదము రాదికన్?

         బోకు లందరు దివ్యులై!భువిని స్వర్గము సేయరే?

        నాకమే?యిక శర్వమై!నర వరామత రమ్యమౌ!


అమరత్వ వృత్తము,ర,స,జ,స,స,లగ,,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-46939.


8.నిరోధక వృత్తము,


        తాడిం దన్ను వానికిని!తలం దన్నెడు వాడుండు లే!

        వాడిం జూసి వేటిడుట!భవం బౌ!గదె?ప్రాళు బ్ధమై!

       పోడెం బౌనె?పూర్వ వర !పుణ్యంబే?నెగ వేయు నయా!

       నీ డౌచుం పరార్ధముల!నిరోధించుమ!శోభాశ్రి వై!


నిరోధక వృత్తము,మ,జ,న,త,య,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;39351.


9.నిలుపెంచు వృత్తము,


          నెలవు దప్పిన తత్వమ్!నిలు పెంప దే నాటికిన్?

          విలువ జారిన!జీవమ్!విధి లెక్క తిక్కేర్చు గాదే!

          కలిమి లేముల లోకమ్!కదలాడు ద్వేషాశ్రితానన్!

         శిలను మల్చిన దైవమ్!సిరు లీయు సర్వేశు ధృష్టిన్!


నిలు పెంచు వృత్తము,న,భ,త,జ,త,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-19256.


10.నేటి జీవన వృత్తము,


              ఆనాటి విజ్ఞాన మెంతో?ఆశాంత ము న్నిల్చె నేటికిన్!

             పోనాడె!దుశ్చింత లన్నీ!పాటేర్చి పోషించె!లోకమున్!

             ఈనాటి సంస్కార మెంచన్?యే కాంతి కానంగ దాయే!

             మానాభి మానాల దూరమ్!మారాడ నీదాయె?నేడున్!


నేటి జీవన,వృత్తము,భ,త,మ,ర,ర,ల,గణము లుండును,

యతి,9.వ,యక్గషరము,వృ,సం:-42023.


11.శ్రీ లొందు వృత్తము,


              సూదెంటు రాయివౌ!నీతిన్!శోధించు సర్వార్తి హరణన్!

              నాదంచు స్వార్థమే!లేకన్?నర్మాన్ని పట్టీడ్చు వడినిన్!

              నీరాంబుధీవ యౌచున్?నీరిచ్చి పోషించు లోకమున్!

             పోదేది?పుణ్యమే!నీకౌ?ప్రీతొందు!మాహాను భావతన్!


శ్రీ లొందు వృత్తము,త,ర,మ,ర,భ,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-57435.


12.కలి జీవనా వృత్తము,


             భూతాల భంజింప నౌనే?పూజ్యార్హతం జెర్చగా నౌనే?

            నీతేమొ?లేదాయె!భూమిన్!నీర్ష్యాళురే!నిండి యుండంగన్!

            శీతా తపం బోర్వ రైరే?శ్రీ మంత మేర్చేరు!శ్రీశా!

            పోతెంచుజీవాల భ్రాంతే!పోనాడి జీవింతు రంతే?


కలి జీవనా వృత్తము,త,త,మ,ర,భ,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-25537.


13.గర్వహరణా వృత్తము,


            పుత్రులం పరిమార్చి!రాజ్యమ్!పొందు టెంతో?నీచ మౌరా!

            అత్ర సౌఖ్యం శూన్య మేర్చున్!అంతకెంతో?పాప మౌచున్!

           చిత్ర జీవన శ్రీల కేళిన్!చింత లందన్?సౌఖ్య మౌనే?

          చిత్ర గుప్తుని లెక్క చిక్కన్!చీల్చు గర్వమ్!దండ ధారే?


గర్వ హరణా వృత్తము,ర,స,య,ర,త,గగ,గణము లుండును,

యతి.10.వ,యక్షరము,వృ,సం:-17499.


14.ఆశ వీడు,వృత్తము,


             ఆషాఢ భూతివి గాకుమా!అంతా!మిథ్యేయౌ?జీవితమ్!

            వేషాలు మాని సునీతినిన్!విశ్వంబంతా!నా వారనన్?

            శేషాద్రి వాసు!మదెంచుమా!జీవంబే!సౌఖ్యంబౌ!నయా!

            ఘోషించు వేద విధానమున్!కూర్మైంచి మించన్!సౌఖ్యమౌ!


ఆశ వీడు,వృత్తము,త,భ,ర,మ,మ,లగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-32949.


15.వినయం విద్య,వృత్తము,


             వినయ మిచ్చు విద్యే సుమా!పెంచు జ్ఞానమ్!విద్యచేన్!

             ధనము తగన్!దానంబిడన్!ధాత్రి సామ్యం బేర్పనౌ?

             తనది కాని ధర్మంబదే?దక్కునంచుం గోరుచోన్?

            మనన జాతి కీడే యగున్!మంచి గాదెంచన్వలెన్!


వినయం విద్య,వృత్తము,న,ర,ర,ర,మ,లగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-33944.


16.నడవడిక వృత్తము,


        1.     మిత్ర తత్వము!యుత్తమంబౌ?మేలు గోరును సర్వదా!

               శత్రు భావన సర్వ హేయమ్!జాతి ద్వేషము పెంచులే!

               కృత్రిమంబులు!నెంచకయా?కీలు గొల్పునె?శాంతమున్!

               ఛత్ర మూనిన గర్వ మోపున్?సర్వ శ్రేయము గోరుమా!


             ఛత్ర మూనిన=పదవి నొందిన,


         2.      అన్నలే!మునుపెన్నడున్!హట్టంబు నం బడి గొట్టిరే?

                 కన్నతల్లిని కొట్టుచున్!కాలంబు తీరి దని!యందురే?

                 చెన్నునౌ?సిరి పొంకమే?స్వాతంత్ర్య!మంటె?తప్పగున్!

                 నిన్న మొన్నటి నీచులే?నేరాలుచేయుటది,న్యాయమే?                                                                               

                        [పైపద్యము యతి,9.వ.యక్షరము].



నడవడిక,వృత్తము,,ర,స,య,ర,స లగ,   ,ర,స,య,ర,స,లగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-46171.


17.అడాశ వృత్తము,


            అంతా తనదంచు నెంచి!ఆకాశమ్!నిచ్చినేయుటౌగా!

           వింతే గద?పంత మూన!వేసారం దప్పదెంచ వేలన్?

          చింతాన్విత జీవయాన!క్షేమంబౌ నొక్కొ?నించు కెంచన్?

          శాంతంబది సద్గుణంబు సౌమ్యం బెంచంగ!మేలు కూర్చున్!?

  

అడాశ వృత్తము,త,జ,ర,మ,జ,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-20651


18.కాలమే బోధిలు వృత్తము,


            కట్టె వంపు పొయ్యి!దీర్చటుల్!కఠిను దీర్చు!కాలమే!

           పట్టె డన్నమున్న!బింకమున్!పదవి గోర భంగమౌ?

           దిట్టు గాక!ధీటు వాటమై!తెగువ జూప!జారడే?

          పట్ట లేని పల్కు లేమగున్?వగవ జేయు నెల్లెడన్?


కాలమే బోధిలు వృత్తము,ర,జ,ర,న,ర,లగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం;-33569.


19.శ్రద్ధ పట్టు వృత్తము,


            వినియు చక్కగ పాఠముల్!వెంటనే!గ్రహి యించుమా!

           వెనుక పాఠము లన్నిటిన్!వేగ వల్లెయు వేయుమా!

          చనుము ఛాత్రుల మేటివై!సాక రించుమి నేర్పుగన్!

          కొనుమ నొజ్జల సాయమున్!కూర్మియౌ!నిక భావినిన్!


శ్రద్ధ పట్టు వృత్తము,న,భ,ర,ర,స,లగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-46264.


20.అమరత్వ వృత్తము,


           ఆకలే!లేకున్న?నరులే!అమరాళి తుల్యు లేగా!

          చీకు చింతే!లేని తనమున్!చివురింప ఘోషమానున్!

         రూకలం గోకంగ జనరే!ఱుజు మార్గ చర్యలే యౌ!

        బోకులే?నీతెంచి మనరే?పురు లెల్ల పర్వ మొప్పన్!


అమరతా వృత్తము,ర,త,స,స,జ,గగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-22243.


21.గిరి వర వృత్తము,


            నరుల ధాటి కాగ లేక!నంటి తీవు!కొండ కోనలన్!

            పరము డయ్యు బాగటంచు!పట్టి తేల?భక్త పోషా!

            పెరల పాప పూర్ణతెంచి!పెద్దవౌచు!గావ వేమీ?

            దురిత దూరమేర్చి వేగ!తొల్లి నీతి నింపు దేవా!


గిరివర వృత్తము,న,ర,జ,ర,ర,గగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-21848.


22.జీవ శాంతి వృత్తము,


            అసురగణ జన్య బాధల్!యార్తి దేవ గణ్య మొందెన్!

           వసుధ శివ మేర్ప జాతిన్!ప్రాణ భీతి మాప రావా!

           వెసను యమృతంబు జిల్కన్?వేడె దేను!రక్షణంబున్!

          దెసకు దిశ వీవె గావె?ధర్మ మేర్చు!జాతి కంతన్!


జీవ శాంతి వృత్తము,న,స,య,ర,జ,గగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-21600.


23.సుఖమెంచు వృత్తము,


             పులు మేయు పసరంబదే!పూజ్యంపు దైవంబు నౌగా!

             తెలివైన నర జన్మి దే?దేదీప్య మేర్చంగ!నొప్పౌ!

             విలు వెంచి వెల పెంచున్!విశ్వస పాత్రుండు గమ్మా?

             తొలి నాటి సుఖ జన్మమున్!దోపించు సన్మిత్రు డౌచున్!


సుఖ మెంచు వృత్తము,స,న,ర,త,త,గగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం;-18618.


24.తత్వార్థ వృత్తము,


            తత్వార్థమే?జీవ భద్రమ్!ధర్మార్థ బోధాదర్థ కంబౌ

            సత్యాన మంచెంచు జీవా!సంతోషసాకుల్యత మౌగా!

           తత్వార్థ జీర్ణంబు నౌచో?సర్వేశ మీశంబే?సు ధీరా!

           మృత్యార్తి లేదింక!నెంచన్!మిథ్యేర!తత్వార్ధీ!తలంపన్?


తత్వార్థ వృత్తముత,త,మ,ర,త,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృశసం:-17445.


25.భద్రమిడు వృత్తము,


            దిగులు జీవుల బ్రోవ!దేశ సౌరులు పెంచు మోయీ!

           పగటి దొంగల పట్టి!భద్ర తేర్చుమి!రాజ్య మెల్లన్!

           సెగలు లేపెడి వారి!చీల్చు చెండుమి!తెల్వి మీరన్!

           నిగమ నీతిని నిల్పు!నేత నీవన!నొప్పు మయ్యా!


భద్రమిడు,వృత్తము,న,భ,ర,జ,జ,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-13224.


26.ఖల హరణ వృత్తము,


               నిలువెల్ల విష భర!నిష్టుర ఖల సంత తొప్పెన్!

               బలమెంచి పెరలను!పట్టి దురుము చుండి రెంతో!

               కలతేర్చి సుజనుల!కాటిడ దలపాయె! మాయన్!

              చెలువంపు దొర హర!జీవ జగతి బ్రోవ రావా?


ఖల హరణ వృత్తము,స,న,స,న,జ,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృసం:-24296.


27.మాతృ ప్రేమ వృత్తము,


            కన్న సుతుల తల్లి మెచ్చు!కాదన దేనాటికైనన్!

            మన్ననమున మేలు!తల్లి!మాటల వేధింప పాపమ్!

            జన్నముల సుకీర్తి నొంద!చక్కగ మెచ్చేది!తల్లే!

            మిన్న!జగతి మాత!భూమి!మేలును జేకూర్చు!బాలా!


మాతృ ప్రేమ వృత్తము,న,స,జ,భ,త,గగ,గణము లుడును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-19808.


28.అపార జ్ఞాన వృత్తము,


              తిన్నది వంట బట్ట వలె!తెల్వియమేయము!విద్యే!

             మిన్నగ శ్రద్ధ బట్ట వలె!మేథిని మెచ్చును!బాలా!

             ఎన్నగ నీతి కోవిదుల!యిచ్ఛను మెచ్చుము! తెల్విన్!

            పున్నమి నాటిచంద్రు బలె!పూజ్యత నొందుము బుద్ధిన్!


అపార జ్ఞాన వృత్తము,ర,ర,న,భ,భ,గగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం;-28223.


29.నిర్జీవ నాట్య వృత్తము,


            పేడి వాని రూప మటులు!బీడుపంట తీరు గదే?

           నీడ నీని తాడి యటులు!నింగి సాగు యానమదే?

           పాడు వాని జీవ చర్య!పారమార్ధ మెంచునొకో?

            నాడిలేని జీవు డిలను!నాట్య మాడుటెట్లు? నరా!


నిర్జీవ నాట్య వృత్తము,ర,జ,న,ర,జ,లగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-54753.


30.మార్పేర్చు వృత్తము,


              పద్దు లేని లెక్క చెప్పెదే!పాపాల నాగ పుట్టుకౌ!

              హద్దు మీరు దుష్ట మేలనో?హర్మ్యాల కోరు!స్వార్ధమా!

              బుద్ధి లేని జీవి గాకుమా!పూజ్యార్హ మెల్ల మాయుగా!

            సుద్దు లాడు!నమ్ము బోధలన్!శోధించి!మెచ్చు !నీతినిన్!


మార్పేర్చు వృత్తము,ర,జ,ర,త,ర,లగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-43179.


31.కూర్మి జీవన వృత్తము,


            నాటకాలు మెత్తురే?ప్రజల్!నర్మాలే?నిల్వ వెన్నడున్!

            మోటు వాట మేల?ధీరజా!మోదంబే?క్రోధ మెంచదే?

            చీటి చిన్గు రోజు లందునన్!చేరంరా రెవ్వ రెంచుమా!

            కోటు లాశ!కొంప ముంచదే?కూర్మెంచన్!యొప్పు భూమినిన్!


కూర్మి జీవనా వృత్తము,ర,జ,మ,మ,,ర,లగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరవృ,సం:-41131,


32.భూతల స్వర్గ వృత్తము,


               ఆకలే!లేకున్న!జగము!నమరత మించు నెంతో

              చీకు చింతే!లేదు!శివత చెడదిక!భూమి యందున్!

             శోక మిచ్చే చావు!తొలగ!సురలకు!సామ్య మౌచున్!

             నాకమే!భూలోక మగును!నరుడిల!దైవమే నౌ!


భూతల స్వర్గ వృత్తము,ర,త,న,న,జ,గగ,గణములుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం;-24547.


33.మెలుకువ గను,వృత్తము,


            అన్నమె!జీవికి ప్రాణమ్!అమృతమది సురలకున్!

           ఎన్నగ!వాయువు సర్వమ్!ఇల జలచర జలమున్!

           పన్నుగ నిజ్జగ మొప్పున్!పరముడు గద!జగతికిన్!

          మిన్నగ రక్షిత మేర్చున్!మెలుకువ గని!మసలు మా!


ములుకువ గను,వృత్తము,భ,భ,త,న,న,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-65335.


34.లోకరక్షా వృత్తము,


              క్షుదాహార పిపాసలు!చూడ న్భువి!సృష్టేర్చితివే?

              మదాహం!ధన దాశ్యత!మాయాన్మయజీవాలయెన్!

             చిదానంద బుధోత్తమ!సత్యం,శివ మదేది?గనన్?

             నిధానించి యెదంనిలు!నేతీవె!హర!రక్షింపవా!


లోక రక్షా వృత్తము,య,స,స,భ,త,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-19684.


35.ఏమేమో?వృత్తము,


            పలు వికార చేష్టలే?పట్టి కుదిపె!సదామయా!

           కలుషితాల కాలమా!కలుము లలము నాట్యమా!

           విలువ లేని సత్యమా!వికృత మెసగు చేష్టయా!

           పులుము కొందు వేలయా?పొగరుదిగుడు!కాలమా!


ఏమేమో?వృత్తము,న,ర,య,న,స,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-48228.


36.మేలేర్చు వృత్తము,


            కామితార్ధ మోహ భయమ్!కంటి పంటి దోష మంటెనే!

           సామ దాన భేద మదే!సాగ దాయె!తీర్చ మేలిలన్!

           నామ మాత్ర మేలదయెన్!నాగ దోష మంటె!భూమినిన్!

           రామ రామ లోక జిగిన్!రామ మేర్చ మందు శ్రీ హరిన్!


మేలేర్చు వృత్తము,ర,జ,య,జ,ర,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-43627.


37.ఊహాతీత వృత్తము,


            పాప భూష లాశ్రయమే!బంగరంపు మార్గ మాయెలే?

           భూప తాప దోష మదే?బుద్ధి మార్చె లోకమంతయున్!

          నేపు గోరు వార లిలన్!ఎంత కేని సాహ సింతురే?

         తాపు యూపు తట్టు కొనే?దెట్లొ?జీవ ధాత్రి భావినిన్!


ఊహాతీత వృత్తము,ర,జ,మ,జ,ర,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-43613.


38.యతి ర్నవ సుగంథి వృత్తము,


           1.   నీతి నిల్పు వారు లేరె?నేతి బీర నేతి భాతినిన్!

                 పోతరంబు నిండె!నెల్ల!భూతి చేత!చేతి వాటమై!

                 కోతి చేష్ట వీడ దాయె?కొంటి తీర్పు!పంట పండగా!

                  ఖ్యాతి పెంచ!దైవ తత్వ.గమ్య మొందు!మార్గ మొక్కటే?


         2.  పారశీక వేష భాష! పట్టి వీడదాయె?నేటికిన్!

              సారమైన తెన్గు భాష!సంత కేగె!చింత నందుచున్!

               నీరు గార్చె!నీతి నాతి!నేటి వారి చేటు పాటుకున్!

               సానబట్టి తెన్గు భాష!స్వచ్ఛ!భారతంబు! జేయుమా!


యతిర్నవ సుగంథి వృత్తము,ర, జ,ర,జ,ర,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-43691.


39.రుచిమయ వృత్తము,


            నిగూఢ భావ శైలి !నిండు ఛంద చంద మిదే?భూమిన్!

           సుగంథి వృత్తమందు!చూడ!జుంటి తేనె రుచిం!బోలున్!

           దిగంత కీర్తి గాంచు తేజమేర్చు!హర్షమిచ్చుబలెన్ధాత్రిన్

          ప్రగాఢ నమ్మకంబు!ప్రజ్ఞ ధీటు భాగ్య దాయి!యదే నయ్యా!


రుచిమయ వృత్తము,జ,ర,జ,ర,స,గగ,గణము లుండును,

యతి,8.వ,యక్షరము,వృ,సం:-13554.


40.మాయాజాల వృత్తము,


             పూనకాలు పూనె నేలన్?భూతాతప మెట్లు మాయునో?

            మాన భంగ!ప్రాణ హానిన్!మాయా మయ!మాంత్రికంబయెన్?

             కాన వేమి?దుష్ట తెల్విన్?కాలంబని నెట్టు చుండిరే?

            మేన బ్రాణ మున్న జీవా?మేలౌ!సమతెంచ వేలనో?


మాయా జాల వృత్తము,ర,జ,మ,భ,ర,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-44375.


41.సు బోధా వృత్తము,


             సుభాషిత ప్రబోధమే!సు భూత భవ్య చరణంబౌ!

             విభావరివి గావయా!విశుద్ధ బుద్ధి శోభిలంగన్!

            భి భీషిక లెడం బగున్!విభూతి భాతివెల్గు లోకమ్!

            విభూతిద మదే నయా!విశేష ప్రజ్ఞ సాకరంబౌ!


సు బోధా వృత్తము,జ,స,జ,ర,జ,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-21854.


42.వేద జ్ఞాన వృత్తము,


            వేదమే!ప్రమోద మేర్చు!విధి విధాన మహిమచేన్!

            సాధనే?సదామయంబు!సతత ముక్తి వరదమౌ!

            బాధలే!తొలంగు జీవ!ప్రధిత కీర్తి! చరితమౌ?

           నాధమే?విధాన మొంది!నవ నవోన్నతిడుచున్!


వేద జ్ఞాన వృత్తము,ర,జ,భ,స,న,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-63403,


43.గుణ తత్వ వృత్తము,


               ఉత్తమ,మధ్య,మాధమ.యుషో వర జగంబి దయా!

              త త్తను కూల్యతంబది!త్రయంబక!ప్రభాస్వితమై!

             చిత్తము త్ర్యై గుణాశ్రిత!శిలీముఖ సమాశ్రితమై!

             గుత్తము చిత్త తత్వము! గుణాన్విత!జనాను సరై!


    తత్వములు3. 1.ఉత్తమ,2.మధ్యమ.3.అధమ,

   గుణములు 3. 1.సత్వ 2.రజ. 3.తమ,


గుణ తత్వ వృత్తము,భ,ర,న,భ,త,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-62695.


44.ఆకలి కలి,వృత్తము,


             అమరామృత సేవనమే?ఆయు విచ్చె దివ్యులకున్!

            కమనీయత చేకురెనే?కల్మి లేము లేల?యనన్!

            సమ సామ్యత నిల్చె నటన్!సర్వ దేవలోక!ప్రభన్!

           కన యాకలి దప్పులవే?కాల దోష పాశ మిలన్?


ఆకలి కలి,వృత్తము,స,స,స,ర,జ,లగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-54592.


45.సుర సరి,వృత్తము,


              జర లేని!సుర లెంచ!సరగె మూడు కోట్ల లెక్కన్!

              పెరి గేది?తరిగేది!పిసిని గొట్టు మాన వాళే!

              విరిపింపు కరిపింపు!పెనుగు లాట!తిండి కోరే!

             నరులే!సురలైన!నరక మెల్ల!మూత యౌగా!


సుర సరి,వృత్తము,స,న,భ,స,జ,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-22462.


46.భాగ్యోదయ వృత్తము,


              సృజనాత్మక శక్తి గల్గి!సిద్ధాంతము!హృద్యమం బవన్?

             నిజ మేథను తర్కిలంగ!నేర్పౌ!నధునాతన యూహలన్!

            ప్రజ కెంతయొ?మేలు గూర్చు!భాగ్యోదయభావి జీవమౌ?

            ధ్వజ మెత్తుము తెల్గు బాల!వహ్వాయన!జీవ ధాత్రినిన్!


భాగ్యోదయ,వృత్తము,స,జ,ర,భ,ర,లగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-44204.


47.కర్మ కృత వృత్తము,


               1. ,ధర్మ సంకట మేర్పడన్!ధాత్రియుం ప్రళయంబు గల్గున్!

                       కర్మ పక్వము కాగనే?కాలమే ?విష నాగ మౌగా!

                      నర్మ భాషణ నాశమే నౌ?వినాశ మదేల?వేరే?

                      చర్మ ధారివి!నీవయా! సద్గతింమది నెంచు మెల్లన్!


           2. ఏల జూతురు!లోకమున్!యేపు పెంపు ధనాశ!మీరన్!

                     ఫాల నేత్రుడు!లెక్కయా?వట్టి మాట లివేల?యంచున్!

                    కాలమే తమ కాశ్రియై!కామిదంబులు!దీర్చు చుండన్?

                   నేల!జాతులు!లెక్కిడన్?నీతి మాలిన స్వార్ధమే!యౌ!


కర్మ కృత వృత్తము,ర,స,య,జ,జ,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-13231.


48.కలి మేథ,వృత్తము,


             మాటలం దాదరణమున్!మనుగడం దది కానదే?

             భూటకా లెల్ల! నెలవై!పురిటి సందెను!గొట్టెనే!

             కాటకం బాయె నడతే?కలిమి నెంచెడి తీరునై!

             రాటు దీరే!జనమునై!రమ తేదియు?లేదిలన్!


కలి మేథ,వృత్తము,ర,భ,జ,స,స,లగ,గణము లుండును,

యతి9. వశయక్షరము,వృ,సం:-46953.


49.కులస్వార్ధ వృత్తము,


              కాలు జారెడు పంకమే?కలికాల తీరదే నయా!

             నోటి బూకర చైదమే?కుల సంకటంబునై!జనెన్!

            పాట కాటక కేళియై!పరిపక్వ మాయె!పాపమున్!

             పూట పూట ధనాశతన్!!భువివెల్గె!ధర్మ విరుద్ధమై!


కుల స్వార్ధ వృత్తము,ర,స,జ,జ,ర,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-33867.


50.కలి నీతి,వృత్తము,


             కలి యాకలి యీకలి! కారుణ్యత గన రాదిటన్!

             తెలివింగను వారిల!తక్కుంగల ,పగ నాట్యతన్

             బలిమిం కడు మూర్ఖమె!భాగ్యంబుగ మది నెంతురే!

           కుల పోకడ లేలగ?కూర్మెంచునె? యిల ధర్మమున్!


కలి నీతి వృత్తము,స,స,స,భ,స,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:78439.


51.వీడని నీడ,వృత్తము,


             నీడం బలె !వీడదయా!నేర వారాజి!విరాజియై!

            వాడెంచును పాడి విడున్!పార మేపారును దోషతన్!

            కీడే కర మోదమిడున్!కేళియై కీర్తిలు నిక్కలిన్!

            నేడీ కలి!చీడయునై!నీరు సంబెంచె!పురోగమమ్!


వీడని నీడ వృత్తము,త,జ,య,య,స,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-45777.


52.భక్తి చిత్తం వృత్తము,


           పోడిమంబు చెరంచ రాదు!బుద్ధి మార్పు దోష మిడున్!

          నీడ వీడి నడంగ రాదు!నెండ గాడ్పు!తాళ వలెన్!

         పాడు బుద్ధి తరింపు నౌనె?పాప మిచ్చు!తప్ప దికన్!

         చీడ పీడ లెడంబు గావె?చిత్త మొప్పు భక్తి జనన్?


భక్తి చిత్తం వృత్తము,ర,స,జ,ర,జ,లౌగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం;-54619.


53.మానాభిమాన వృత్తము,


           మానాభి మానాలకున్!మనుజు లిద్ధర నొప్పిరిలన్!

           జ్ఞానాభివృద్ధొందుచున్!జగముకే!తలమానికలై!

           దానాది సత్కర్మలన్!తగు తగన్!పర మెంచు మతిన్

          ఆనంద మొందేవదే?హరి!హరాదుల భక్తి నెదన్!


మానాభి మాన వృత్తము,త,త,భ,జ,జ,,లగ,గణము లుండును,

యతి,.8.వ,యక్షరము,వృ,సం:-55225.


54.కలతలార్పు వృత్తము,


            కుల చిచ్చు మత చిచ్చు!కూర్చు దోషుల నెట్ట కున్నన్?

           బలియౌను జగమెల్ల?పాపి మూకల దోష చర్యన్!

           తలపోయ ధన పిచ్చి దాహమే?యిది!తర్కిలంగన్!

           కలతేర్చి!వెలు గొందు!కల్మ షాత్ములతీరిదే!సుమ్మా!


కలత లార్పు వృత్తము,భ,న,ర,జ,జ,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-23218.


55..శ్రేయ మలరు వృత్తము,


                గండు పిల్లి తర్ము చుండ!గాసిలెండు!మూషికం బాయెన్!

                బండ నీతి యెండమావి!నీటి నెంచు!తృష్ణ తృష్ణేయౌ!

                కొండ ఱేడు చూ చు చుండ!కారు చిచ్చు రేగు కానాయెన్!

                ఛండ శాసనంబు మారి!సర్వ శ్రేయమందు!నే నాడో?

                           (కానాయెన్=అడవి యయెను)  


   శ్రేయ మలరు వృత్తము,ర,జ,ర,జ,ర,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-10923.


56.సరాగ వృత్తము,


          శిష్ట విశిష్ట శ్రేష్టిత!శివామృత ధారలు గ్రోలన్

         అష్ట దరిద్రుడైనను!హరాంఘ్రుల సేవ ఫలంబే?

         పుష్టి ఘటించు!భాసుర!పురోగతి గాంచుట!తథ్యమ్!

         స్రష్ట వినోద జీవన!సరాగత గూర్చు ప్రభూతిన్!


సరాగ వృత్తము,ర,ర,న,భ,భ,గగ,,,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-28115.


57.కాల మార్పు వృత్తము,


             ధనార్ధ పూర్ణ ధర్మమే!ధరిత్రి నేలె!సదా శివా!

             అనంత కోటి కాంతులే!కఠోర తేర్చె చరాయువై!

             అనంగు సాయకంబులే?హరించె జాతి వికాశమున్!

            అనాది కర్మచర్వణే?యడాశ నొందె?పరంతపా!


కాల మార్పు వృత్తము,జ,ర,జ,ర,స,లగ,గణము లుండును,

యతి,9..వ,యక్షరము,యతి,46422.


58.భారతీయతా వృత్తము,


              అన్నదాత వెన్నెముకై!యలరు భారతీయ జాతిన్!

              మిన్న పాడి పంటలచే!మెరిగె?మిన్న!విశ్వ ఖ్యాతిన్!

              చెన్ను నొందె!జన్నములన్!సరగె వేద జ్ఞాన  భూమై!

              కన్న తల్లి శోభ పెంప!!కలిసి రండు నేక త్రాటిన్!


భారతీయతా వృత్తము,ర,జ,జ,స,జ,,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-22379.


59.తీరు మారె,వృత్తము,,


               తరము మారె!తీరు మారె!తారతమ్య మెంచ రైరే!

               పరువు నిల్పు ధ్యాస లేదు!పాప డబ్బు చింత వింతన్!

               నరకమైన తక్కువంచు!నర్మ చర్య తప్పు గాదే?

               పరమనెండు !మాట తప్పు!భ్రష్ట నంగ నొప్ప రేలన్?


తీరు మారె వృత్తము,న,ర,జ,ర,జ,గగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-21758.


60.దేహమే దేవళమ్,వృత్తము,


               దేవళమే?దేహంబయ!దివ్యాత్మ!లింగంబు గదయ్యా!

               పోవగ నేయే తావుల!పుణ్యం బనంగన్?సరి యౌనే!

               నీ వరయం జాల వలె!నేర్మెంచి భక్తిం గను ముక్తిన్!

               భావనమే?శర్వం బయ!భద్రము కాంక్షిందుమ!జీవా!


దేహమే!దేవళమ్.వృత్తము,భ,మ,స,ర,భ,గగ,గణము లుడును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-26299.


61.నిర్వాక వృత్తము,


             కయ్యానికి కాలు ద్రువ్వ!కాలం బెల్ల!కాఠిన్యమేయౌ!

              నెయ్యం బది!నీతి నింపు!నిర్వాకంబు సర్వార్థ మౌచో?

              సై యందువు!జీవ మెల్ల!సాయుండౌచు!సజ్జీవనంబున్!

             అయ్యారె!యనంగ నొప్పు!హర్యక్షంపుధైర్యుండ,వౌచున్!


నిర్వాక వృత్తము,త,జ,ర,త,జ,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-23019.


62.విమర్శనా వృత్తము,


              విమర్శనా!తెల్వి యున్న!వివేక జన్మ మనదనే?

              సుమోద మాధుర్య తేజ!సునీతి నంట గనవయా!

             క్రమాన సజ్జీవనంబు!కలంచు నెంచ?దురితమౌ!

            తమంబు!తప్పౌను బాల!తదేక దీక్ష మను మిలన్!


విమర్శనా వృత్తము,జ,త,భ,ర,న,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-62996.


63.జ్ఞానతా వృత్తము,


             సుర పొత్త ముత్తమది!శుద్ధ సు చర్వణ గమ్యమై!

            వర దత్త జీవన ప్రభావ! విభూతిడు!చూడుమా!

           శర దిందు చంద్రికల!సారము. మీరును తెల్వి నిన్!

           వరదంపు! స్వచ్ఛతను!పట్టుమి!మానవ!జ్ఞానతన్!


జ్ఞనతా వృత్తము,ర,,జ,స,స,స,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-46808.


64.నేర్పు జీవన,వృత్తము,


               కోమల తత్వము గూర్చు!కూర్మి నిడు!గుంభన మేర్చున్!

              క్షేమత గోరుమి జ్ఞాన !సేవ నడు!సద్వరదానన్!

              ధీమహి!నుత్తమ మార్గ!దీపమయి!ధర్మము!నిల్పన్?

             నీమత నేర్చుమి!విద్య!నేర్పు గను!బాలుడ వౌమా!


నేర్పు జీవన,వృత్తము,భ,భ,ర,న,భ,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-50263.


65.తుది మజిలీ;వృత్తము,


             మగడు లేని ముసలమ్మ!మాట పోటు వేటు నొందున్!

             బిగువు లేదు పని చేయ!బెంగ తోడ!చావు కోరున్!

             తెగను తిట్టు సుతు జూచి!తిండి మాని రోధిలున్!

              గగన మౌను!జీవితంబు!!కన్న వారె! నిందిలంగన్!


తుది మజిలీ,వృత్తము,న,ర,జ,ర,జ,గగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-21848.


66.విషమ చింత,వృత్తము,


             మొల్చె!విషమ విత్తులే!ముదమొందె!కల్యుగంబునన్!

              కల్చె జనుల గుండియల్!కల్మ షాన కాటు వేయుచున్!

              కొల్చె పరుల ప్రాపునున్!కూర్మియంచు మాయ మోసతన్!

              తల్చ రవని సౌరులన్!ధర్మ మంచు మ్రింగ స్వార్ధులై!


విషమ చింత వృత్తము,భ,స,య,జ,ర,లగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-43625.


67.ఏమి బాధ్యతో వృత్తము,


             హక్కు లందు చూపు శ్రద్ధ!ఆచరణం శూన్యము నౌచో?

             తిక్క సంకటంబు గాదె?తేట పడెం కులాల టంచున్!

             అక్కజం బదంచు నెంచి!అంత సమం బటంచు బల్కన్

              చక్క నౌనె?సామ్య మెంచ!సర్వులకున్!మెరుంగు నౌనే?


ఏమి బాధ్యత వృత్తము,ర,జ,ర,స,త,గగ,గణము లుడును,

యతి,9.వ,యక్షరము,వృ,సం":-18091.


68.విద్య యనంతం వృత్తము,


           విద్యార్ణవ మావలెంచ!వీలు కాదు మానవాళికిన్!

           సద్యోగత సామరస్య!సర్వ మీశ్వరత్వమే?సుమీ!

           విద్యోత్తమ జీవ మర్మ!విద్వదాంశ!విశ్వ కర్మయే?

           ఆద్యంత మనంత కోటి!హర్ష మేర్చు శ్రీనివాసుడే!


విద్య యనంతం వృత్తము,త,జ,ర,జ,ర,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-43693.


69.సర్వం శూన్యమ్.వృత్తము,


             భూత ధాతు జఠరాగ్ని బుద్ధి సత్వ సర్వ మీశ్వరమ్!

             చేతనాల మిత ప్రజ్ఞ!సాకరంబు!విష్ణు మూర్తియే!

             త్రాత మెచ్చ తప దీక్ష!తారకుండు!సర్వ మాతడే!

             భూతి నిచ్చి కరుణించు!పుణ్య మూర్తి గొల్వ మోక్షమౌ!


సర్వం శూన్యమ్ వృత్తము,ర,న,ర,జ,ర,లగ గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-43707.


70.నయ జ్ఞాన వృత్తము,


              మిడి మిడి జ్ఞానానికే?మేటి వంచు విఱ్ఱ వీగుచో?

             చెడు వడ గర్వంబునన్!చేటు గల్గు జ్ఞాన శూన్యతన్!

             కడ గన విద్యా ర్ణవమ్!కాదు వీలు జన్మ మంతయున్!

             కడు వినయం గావలెన్?కల్మి విద్య!భద్ర మే? సుమా!


నయ జ్ఞాన వృత్తము,న,య,య,జ,ర,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-43504.


71.నేరని పని వృత్తము,


               దూరకు పర విషయాలన్!తొందర దగ దన్నిటన్!

                మీరకు గురు జ్ఞాన బోధల్!మోదిలు మిల నీతినిన్!

               నేరని పని కెడ మేగుమ్?నేర్పున జనుమీ?బాలకా!

               పోరును తలపకు మయ్యా?పూజ్యత నిడు!విద్యయే!


నేరని పని వృత్తము,భ,భ,మ,న,స,లగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-48695.


72.తృష్ణ విడు వృత్తము,


               అప్పుల కెగ బ్రాకకు!ఆస్థికె?ముప్పేర్చును తుదిన్!

               తప్పును సరి జేసుకొ?తత్తర పాటే!గన చెడౌ!

               గొప్పలు జనబోకుమ?కోర్కెలు తగ్గించుమ!వడిన్!

               అప్పడు కరుణించగ!అంతయు మేలేయగు భవిన్!


తృష్ణ విడు వృత్తము,భ,స,స,స,భ,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-25835.


73.నీరేర్చు వృత్తము,


             అభ్రమ విభ్రమ భ్రమ !యహర్నిశ జీవ జాగృతిన్! 

             శుభ్రత విస్తృత మవ!సుజీవనంబు!మేలగున్!

            విభ్ర మనోవికలన!వికారత మాయ!ముంచునే!

            భూభ్రమణం బఖిలము!పురోగతి నీరు నేర్చుగా!!


నీరేర్చు వృత్తము,భ,భ,న,భ,ర,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-44505.


74.పాటిడు, వృత్తము,


   1. కూటికి లోటు లేదిక!కూరిమి సర్వ సామ్య మనన్!

            మేటని చేటు వాటిలమీరుచు వర్ణ వ్యవ స్థ యనన్?

           వాటము గాని పాటగు!పట్టునె?సౌఖ్య మెల్లరకున్!

           ఓటను నాశ పాశము!యున్నతి కెంత?పాటిడునో?


2. పాటరి నీతి వాటము!పల్వురు మెచ్చు కొందు రొకో?

            చేటిడు వర్గ పెంపది!పట్టదె?ద్వేష భావ మిలన్!

            ఆటక తీరు చైదము!అమ్మకు హాని గూర్చు టగున్!

            మేటి విశేష ఖ్యాతది! మేలగు?భావి జీవనముల్!


పాటిడు వృత్తము,భ,ర,స,స,జ,లగ,గణము లుండును,   

యతి,9.వ,యక్షరము,వృ,సం:- 54999.


75. సర్వం స్వాహా వృత్తము,


                అండ పిండ బ్రహ్మాండాలు!నాడించే వాని గన నౌనే?

               నిండు నీతి లేనే!లేని!నిర్వాకం బెంత కేని?చింతే!

               కండ కావరానం దేలు!కాఠిన్యుల మార్చ నౌనె?భువిన్!

              ఛండ శాసనుండెంతైన?సర్వం స్వాహాను!కోర నెంచున్!


సర్వం స్వాహా వృత్తము,ర,య,ర,మ,జ,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-20519.


76.భ్రష్ట జీవనా వృత్తము,


               గోడ మీది పిల్లి వాటమ్!గోలుమాలు సర్వ శ్రేయంబౌ!

              పాడు గోరు భ్రష్టు జీవమ్!పాప భీతి నెంచ దేనాడున్?

              నీడ లేని చీడ జన్మమ్!నేడో?రేపో?రాలు దుస్థితిన్!

              పాడి గట్టి మోసే రొజున్!పజ్జ జేర నోప రెవ్వారున్!


భ్రష్ట జీవనా వృత్తము,ర,జ,మ,జ,,ర,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-10795.


77.మోసంమాపు వృత్తము,


               కర్మ మాని కర్త వౌచో?కాల్చు క్రియే?భీతోద్భాసానన్!

               ధర్మ మూన మాని యొప్పన్?దుర్మదంబే?గూర్చున్!

              మర్మ జీవనంబు మోసమ్?మాసెదులే?కాస్తం తెంచేవే?

             చర్మ రోగ క్లిష్ట జాఢ్యమ్?చావు గనన్!పీడార్తే!పాలౌ!


మాపు మోషమ్.వృత్తము,ర,జ,మ,స,మ,మ,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-1579.


78.సుఖ జీవన వృత్తము,


              ఉత్తమ మానవ జన్మమ్!ఒద్దుగ జీవింప మేలగున్!

             చిత్తము భక్తిని నిండన్!క్షేమత రాజిల్లు నీతిన్!

             మెత్తని రామ మ దెంచన్!మేథిని కీర్తిం గడించు మా!

             హత్తకు!మూర్ఖుల ఛాయన్!హాయిగజీవించు !బాలకా!


సుఖ జీవన వృత్తము,భ,భ,మ,స,ర,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-37551.


79.తృప్తిడు,వృత్తము,


               తృప్తి ఘటించు జీవన! తేజోమయ భాస్వకంబౌ?

              తప్తత గూర్చు శ్రీలకు!తామంబుకు దారి చూపున్!

             ఆప్తుల నొందగ నీకను!హర్షంబుకు దూర మేర్చున్!

              గుప్తపు జ్ఞానాంబుధీదను! కోర్కెంజను!కీర్తి నీదౌ!


తృప్తిడు వృత్తము, భ,త,మ,భ,ర,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-44061.


80.అతి తెల్వి వృత్తము,


          జంతు జన్మ కల్తీ జేసి!సత్సారమె!పెంపు యోచనై!

           పంతమూని సామ్యమంచు!ప్రాపేర్చగ సంకరంబే! యౌ!

           కుంచితాన తల్ప!కుండ్లు!గోళుల్!భరతంబునిండౌగా!

           పండు భిన్న తత్వజాతి!భ్రష్టం బగు!ఘోర యూహేనౌ!


నోరూ వాయి లేని జంతువులకు కల్తీ జన్మ కల్గించి మేలు పొందిన 

పొంద వచ్చును,కాని సత్సాంప్రదాయములు,సదాచారము ,

భిన్నత్వము నందేకత్వము గల భారత జాతిమనది,ఇవన్నీ మట్టు

పెట్టి సర్వ సామ్యమను పేర జాతుల నేకము జేసే!తలంపు

ఘోరాతి ఘోరము, పూర్వము సామ్యత లేదని చెప్పుటలో 

ఆంతర్యమేమిటో? బోధ పడుట లేదు,కుండులు ,గోళకులు

గల సర్వ సంకర,జాతిగా మార్చుట ముమ్మాటికి తప్పేమో? 

సత్వ ధృష్టిని, యోచించుడు,


అతి తెల్వి వృత్తము,ర,య,ర,ర,ర,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-42123.


81.కకావికల వృత్తము,


             బుకాయింపు!ధోరణదే?పూజ్య మయ్యె!కల్యు.! గంబునన్!

               వికారంపు మాటలకే?విశ్వ మెల్ల మెచ్చె నేలనో?

              చికా కేర్చు చేష్ట లవే?ఛిద్ర మేర్చె!సర్వ సామ్యమున్!            

              కొకారీల పోకడలే?కూల్చె నీతి!ధర్మ! సర్వమున్!


కకావికల వృత్తము,మ,జ,య,జ,ర,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-43625.


82.కాలం మారె,వృత్తము,


               ఏగానీల కాలమదే?యెంతొ?నీతి !నిండె!భారతిన్!

              రాగాలాప పైసలలో?ధర్మ మెల్ల! మాయ!నిండెనే!

              పోగాలాలు పెచ్చెగసెన్!పొంక మొప్ప! బింక మెంచెనే!

               సేగే లేని జీవితమున్!చిత్త ముత్త మంబు గానకన్!


కాని+దమ్మిడి=ఏగాని,సెగేలేని=మనో భేదములేని,


కాలం మారె వృత్తము,త,జ,య,జ,ర,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-43629.


83.నర నాడి వృత్తము,


            మంచి వినగ నోపరే?మండు నొడలెల్ల!కోపమున్!

           కొంచెము మది తర్కణమే!కూర్చుసుఖమన్న నమ్మరే!

          ఎంచగ జన నాడిదియే!యేల విన రయ్య?గర్వతన్!

          వంచితమగు!మాటలవే?భద్ర మన మోస పోదువే!


నర నాడి వృత్తము,భ,స,య,న,ర,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-54639.


84.రక్షేదీ వృత్తము,


           జోడెడ్ల బండి!సంసారమ్!చూడ లేక?నీర్ష్య పెంచిరే?

            పోడెంబు మాని! వేరేర్చన్?పూజ్య తంచు!విద్య నేర్పగా!

             నీడౌచు!తెల్వి!పెంపేర్చన్?నేర్పుగల్గు!మంచియే సుమా!

           పీడించు వార్ని దండింపన్.?ధర్మ గ్లాని! సంభవించెనే!


రక్షేదీ వృత్తము,త,ర,మ,జ,ర,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-43541.


85.మాతృమూర్తై,వృత్తము,


              అన్నపూర్ణ సదా పూర్ణ ఆది పరా శక్తి!యాడదే!

             కన్న తల్లి చిదా నంద!కాంతు నేపు గోరు సర్వదా!

             చెన్ను మీర!సదా చారి!జాతి మెరుం గెంచు!తల్లదే!

             మిన్న దీర్చు కుటుంభాన్ని!మెచ్చవలెన్?జాతి సర్వమున్!


మాతృ మూర్తి వృత్తము,ర,య,ర,స,ర,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-33625.


86.గణనీయతా వృత్తము,


            అర కొర జీవితాలు!అవధాన వ్యధా ప్రయాశన్!

           నిరతము రేపటూహె!నిరవద్య మిదే?కనంగన్!

           సురవరులార రండు!సు మనంబున బ్రోవ ధాత్రిన్

           కర మరుదైన జన్మ!గణనీయ తిడం?భజింతున్!


గణనీయతా వృత్తము,న,జ,భ,జ,జ,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-23473.


87.కన్న దోషమ్ వృత్తము,


           అనురాగమ్,ఆప్యాయత!అసలు శూన్య మిక్కలిలోన్!

           తను వెల్లం డబ్బాశయె?తగదు మంచి,పెద్దరికమ్!

           వినయంబౌ?స్వార్ధంబది!వెనుక వచ్చు!వడ్డనినన్!

           కను సత్యమ్?నిత్యంబిది!కనినదోష!పాప మిదే!

                 (కనిన దోషం=పుట్టుక నిచ్చిన తప్పు)


కన్న దోషమ్ వృత్తము,స,మ,న,స,జ,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-55146.


88.తుది బ్రతుకు వృత్తము,


              కలిని భార్య లేకున్న?కష్ట మెంచ భ్రష్టమే?యగున్!

             నిలువ నీరు నొక్కెడ?నెట్టి ఛీదరింతు రెంతయో!

             పలుక రారు యేమైన!పట్టి తిట్టి త్రోతు రావలన్!

            మలిన ప్రేమ జూపించి!మట్టి గల్ప జీవ మెంతురే!


తుది బ్రతుకు,వృత్తము,న,ర,ర,జ,ర,లగ,గణము లుండును,

యతి9.వ,యక్షరము,వృ,సం:-42674.


89.జీవ శైలి.వృత్తము,


            కూలి బ్రతుకు!కుండ కూడు!కూర్మి నీతి బ్రతికిరే!

            కాల భ్రమణ!కాసు లాశ!కంటి కున్కు కరువయెన్!

           నేల శ్రమకు పంటరాక!నింగి జూచు జనమయెన్.!

           శ్రీల జెలగు వారి చేత జిక్కె!దేశ! ప్రగతదే!


జీవ శైలి వృత్తము,భ,న,జ,ర,న,లగ,గణము లుండును,

యతి,యతి,10.యక్షరము,వృ,సం;-63615.


90.మిడిసి పడు,వృత్తము,


             కుడుచు తేనెం!రాణీగే?కూలి యీగలు కష్టిలంగన్?

            పడుచువారే!కూర్చుండన్!పట్టు నౌకరి!కూలి కేగా!

            గడుసు పెండ్లామ్!మొండైనా!పాటు భర్తదె!లోక మందున్!

             మిడిసి పాటే? రోగాలన్!మేలుమాపునుజీవ మార్చున్!


మిడిసి పడు వృత్తము,న,మ,మ,జ,జ,గగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-22548. 


91.తప్పుదిద్దుకో వృత్తము,


             తప్పుసరి జేసుకున్న!దివ్య తేర్చు!విశ్వ ఖ్యాతిలున్!

             చెప్పుకొను గొప్పలన్ని!చివ్వలందు నిల్వ జాలునే!

             అప్పు తగదెంచ గొప్ప!యాటకట్టు భావి జీవితమ్!

             తిప్ప లలమంగ నాడు!దిక్కుమాలు!గొప్ప లన్నియున్!


తప్పు దిద్దుకో వృత్తము,భ,జ,ర,జ,ర,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృసం:-39675.


9.2.మార్పు  నైజం వృత్తము,


                పుట్టు సారం!పెట్ట సారం!పొరలు పెంచు ధనాశతన్!

                గుట్టు చైదమ్!తృష్ణ దాహమ్!గుణపు దోష ప్రభావమే!

                తట్టి కొట్టే దైవ మైనన్!దరిని జేరగ వేధిలున్

               జెట్టు లైనమూర్ఖ జన్మమ్!సెగను జేర్చును!దైవమే?


మార్పు నైజం వృత్తము,ర,త,త,స,స,లగ,గణము లుండును,

యతిశ9.వ,యక్షరము,వృ,సం:-12115.


93.దుష్ట శిక్షణ వృత్తము,


                మ్రొక్కు బడుల సొమ్ములన్!ముష్టులట్ల మెక్కు చుండిరే!

               చక్క గనుచు తెల్విగా!సాక లేక పోతి వేలయా?

               చిక్కులలమ సర్వదా!ఛేదిలంగ న్యాయ మౌనొకో?

               త్రొక్కి నడువు వెంటనే!తుక్కు జేయ ముష్టి దుష్టులన్!


దుష్ట శిక్షణ వృత్తము,,భ,స,య,జ,ర,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-143615


94.శాంతి నిమ్మ వృత్తము,


             బంగారు ధర్మ ధాత్రికే?పట్టె పుట్ట కురుపు వ్యాధే!

             కంగారు లేని వైద్యులే!కాటికంప దలచినారే!

              మ్రింగంగ యాస్తి పాస్తులే?మేటి శక్తి తుడచ వేమో?

             కృంగేటి జీవ జాల మున్?కీడు మాపి బ్రతుక నిమ్మా!

    [పుట్ట కురుపు వ్యాధి=కేన్సరు రోగము].



శాంతి నిమ్మ వృత్తము,త,ర,య,జ,న,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-30407.


95.దుష్ట తంత్ర వృత్తము,


               అండ దండ లుండి కూడ!ఆత్మ వేధ నొంద తప్పేయౌ!

               బండ దుష్ట తంత్ర  జాతి!హద్దు మీరి!సంచ రించేరే!

               మెండు టాశ!వీడ దాయె!మిట్టి!బుద్ధిప్రీతి చేష్టాయెన్!

               కండ కావరంబు నిండె!కాని పోని కల్త లే?నిండై!


దుష్ట తంత్ర వృత్తము,ర,జ,ర,జ,ర,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృసం:-11823.


96.జగన్మిత్ర వృత్తము,


              జగన్మిత్ర పాప హర్త!సర్వ శ్రేయ!ధన్యు డీవెగా!

              తగం భక్తి తన్మయత్వ! సత్వ జీవరక్ష!దీక్షితా!

              ప్రగాఢంపు భావ సౌమ్య భద్ర రుద్ర!క్షేమ కాంక్షితా!

             జగం బెల్ల మంచి పెంచిచెడ్డ తృంచు!నీశ!రక్షమామ్!


జగన్మిత్ర వృత్తము,య,జ,ర,జ,ర,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-43680.


97.సాక్షాత్కార వృత్తము,


                రిపుల భీమ మేర్చుచున్!రిక్త జన్మ చేతు వీవయా!

                  విపుల ధర్మ మూర్తులన్!విద్య స్తుత్య మేర్తు వయా!

                  అపర రక్ష వీవె గా!యాడ తోడు నీడ వునై!

                   కుపిత భావ భంగిమన్!కాన  లము నిన్ను శివా! 

                                 (యాడ=అక్కడ,)   


సాక్షాత్కార వృత్తము,న,ర,య,జ,ర,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-13508.


98.కూర్మి జను వృత్తము,


              రూపు రేఖలు మారినా!రూఢి కీర్తే.!నిల్చు ధాత్రినిన్!

              చేపు నీతిని ధూమినిన్!శ్రీ వరంబే పెంచు!దైవమున్!

              పాపులం దునుమాడు నాడే!వరంబై నిల్చు!నీతిలన్!

             కోప మేలను?మానవా!కూర్మి జీవన!కోరు మోయీ!


కూర్మలు వృత్తము,ర,స,య,య,జ,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-25131.


99.బాగెంచు వృత్తము


             ఆటు పోటుల జీవితమ్!సాగరోదక తుల్యమే యౌ!

             నీటు గోటుల తత్వమే!నిమ్న మున్నతి దించి పెంచున్!

             కాటు వేయును కాలమే!కాన దేదిల మంచి తప్పన్?!

             పాటు తప్పదు జన్మకున్?బాగు నెంచుమి!జీవితాంతమ్!


బాగెంచు వృత్తము,ర,స,య,జ,జ,గగ,గణము లుండును,

యతి,9.వశయక్షరము,వృ,సం:-23131.


100.శివాశ్రయా వృత్తము,


            అంగజారి!చంద్ర మౌళి!అర్థ నారీశ్వరా!శంకరా!

            నింగి వారిధారి!భద్ర!నేర్మి!కూర్మెంచి రావేగతన్!

            జంగమార్య!గొల్తు భక్తి!సర్వ మీవంచు!రక్షింపవా!

           అంగ రంగ వైభవాన!నాదు కొమ్మా!మహీశా!హరా!


శివాశ్రయ వృత్తము,ర,జ,ర,య,య,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-37547.


101.కైవలదమ వృత్తమె,


                 గమ్యము చేరంగ నెంచు!కాలచక్ర భ్రమక మిదే?

                రమ్యము గాదెంచ జన్మ!రాలు పుట్టు చనును పదే!

                కామ్యత దైవంబు చేర!!కైవలంబు!నరయుదు వే!

                కామ్యత భక్తెంచి మించభద్ర మౌను!భవ హరతన్!


కైవలదమ వృత్తము,భ,త,ర,జ,న,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-64167.


102.ముదమొదవు వృత్తము,


                  సొద లొదవిన!దేహమ్!చుట్టు! రోగ పీడ ధాత్రినిన్!

                  మొదలు బెగులు గనున్!మేటి జన్మ సార హీనమై!

                  వదలక హరి గొల్వన్!భద్ర మౌను!సర్వ మున్నతిన్!

                 ముదము చెడిన జీవమ్!మోడు బారు వృక్షమే!నయా?


ముదమొదవు వృత్తము,న,న,మ,జ,ర,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-43584.


103.నయతా వృత్తము,


              పడి లేచు!కెరటమే!బ్రతుకు తీరని,తెల్యుమా!

             చెడు చేటని వడినిన్!శివత మోపను!మెల్గుమా!

             విడరాదు!శుభములన్!విలువ పెంచును మంచినిన్!

             నడు నీతి!జగతినిన్!నయత!గూర్చును!బాలకా!


నయతా వృత్తము,స,న,జ,స,స,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం:-46972.


103.విజ్ఞతా వృత్తము,


              కాలు గాలిన పిల్లివై!కద లాడబోకు!బాలకా!

              నీలి మేఘము కమ్మినన్?నిలు పెంచు!నీటి కోసమే!

              చీలె?మంచని పించినన్?నిలు నీతి!స్వేచ్ఛ భారతిన్!

             బేల గాకు విజ్ఞానతే?పెను మార్పు గూర్చు!భావినిన్!


 విజ్ఞతా వృత్తము,ర,స,ర,జ,ర,లగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-43 867.


104.జ్ఞాన వినోద వృత్తము,


              నీచ జన్ముల బాగోతమ్!నేల తీరును!మార్చ! నౌనే?

              వేచి చూడగ మంచే యౌ?విశ్వ రక్షకు!డండ నిల్వన్!

              పోటి జీవన!దౌర్ధాగ్యమ్!పెట్టు సారమె!తెల్వి యాయెన్?

              నాటి నాణ్యత!నేడేదీ?నర్మ జ్ఞాన వినోద విద్యన్!


జ్ఞాన వినోద వృత్తము,ర,స,మ,జ,జ,గగ,గణము లుండును,

యతి,9.వ,యక్షరము,వృ,సం;-23067.


105.కలత,మాపువృత్తము,


                  కుల మత రాజకీయ కుటిలాన్విత!భావ  మేలన్?

                  పలుచన జేయ సఖ్య సమితాన్విత!మేమి!యౌనో?

                 కలతల శాంతి లేక!ఘనతం విడి !పోవు! స్వేచ్ఛే?

                 ఫలదపు సామ్య మేర్చ!పరపాలన!యూహె మాయున్!


కలత మాపు వృత్తము,న,జ,భ,జ,జ,గగ,గణము లుండును

యతి,9.ర,యక్షరము,వృ,సం"-25472.



106.సీవార్థి వృత్తము,


                మాత్సర్య మీర్ష్య జుగుప్సలు!మంత్రాంగం!ఛిద్ర తౌ?భవిన్!

                 ఉత్సుక మొప్ప!నిధానత!యోట్లాట న్వీడ! మేలునౌ!

                తత్సమ తేజ విరాజిత !ధన్యంబౌ!ధర్మముం!జనన్!

               చిత్సుఖ మొంది! తరింపగ!సేవార్ధి వౌచు! శ్రేయతన్!


సీవార్ధి వృత్తము,భ,భ,భ,మ,ర,లగ,గణము లుండును,

యతి,10.వ,యక్షరము,వృ,సం:-41399.


17.అత్యష్టి ఛందము నందు 106.వృత్తములు మాత్రమే!

గ్రహింప బడినవి,

జైహింద్.