గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2023, గురువారం

శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ శతకము 30వ పద్యము .... రచన. చింతా రామకృష్ణారావు. గానం. శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

30. ఓం ప్రతాపనాయ నమః.

తాండవజవ వృత్త గర్భ సీసము.

నడిపించు కరుణామయుఁడవుకద, నను కా - వఁగ నిల లేవా ప్రభావమెలయ.

జయసింహ! భరమా? సుజనుల నిలుపఁగఁ బ్రా - ర్థన విని రావా! సురక్షకుఁడుగ.

ప్రకటిత పరిపాలక! కని నిలుపఁగ బా ధ్యుఁడవిటఁ గావా! మధు ప్రహార!

పొసఁగును నిరపాయము నినుఁ దలచిన ని - త్య! నృహరి దేవా! మహా ప్రభావ!  

గీ. సచ్చిదానంద సామ్రాజ్య సాధనమున, - దుష్ట చిత్త *ప్రతాపనా*! తోడు నిలుమ

భక్త జన పోషభవశోషపాపనాశ! - శ్రితజనోద్భాసయాదాద్రి శ్రీనృసింహ!

30 సీస గర్భస్థ తాండవజవము. ( .. యతి 12)

కరుణామయుఁడవుకద, నను కావగ నిల లేవా

భరమా! సుజనుల నిలుపఁగఁ బ్రార్థన విని రావా!

పరిపాలక! కని నిలుపఁగ బాధ్యుఁడవిటఁ గావా!

నిరపాయము నినుఁ దలచిన నిత్య! నృహరి దేవా!

భావము.

భక్తులను పోషించువాఁడా! భవమును నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా! ఆశ్రితజనమున

ప్రకాశించువాఁడా! యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! లోకములను నడిపించు కరుణాపూర్ణుఁడవే కదా. నీ

ప్రభావము వ్యక్తమగునట్లుగా నన్ను కాపాడుటకయి నీవు నిలబడలేవా?. జయసింహా! మంచివారిని నిలుపుట నీకు

బరువా యేమి?మా ప్రార్థన విని మంచిని రక్షించువాడిగా రావా? ఓ మధుసూదనా! ప్రకటిత పాలకుడా! మమ్ములను

చూచి నిలుపుటకు బాధ్యుడవు నీవే.నిత్యుఁడవైన నరహరీ!  గొప్ప ప్రభావము కలవాడా! నిన్ను తలచినచో నిరపాయము

పొసగును.సచ్చిదానంద సామ్రాజ్య స్థాపనము విషయమున దుష్ట చిత్తులను మిక్కిలి తపింపచేయువాడా! మాకు తోడుగా

నిలఁబడుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.