గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జులై 2012, సోమవారం

గృహస్థాశ్రమ ధర్మములు. శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రి

1 comments

జైశ్రీరామ్..
గృహస్థాశ్రమ ధర్మములు. 
రచన:- శ్రీ పిడపర్తి సుబ్బయ్య శాస్త్రి.
గృహస్థుడు భగవద్భక్తుడై యుండవలెను.
భగవద్ఙ్ఞానమే అతని జీవిత పరమావధి.
సదా కర్మ నిరతుడై తన విద్యుక్త ధర్మములను నిర్వహించుచు కర్మఫలముల నీశ్వరార్పణ మొనర్ప వలయును.
జీవనోపాధి నార్జించుట గృహస్థునికి మహా విద్యుక్త ధర్మము. కాని తత్కార్యమును కల్లలాడుటచేతనూ, పరులను మోసగించుటచేతనూ, పరద్రవ్యాదుల నపహరించుటచేతనూ మాత్రము చేయతగదు. మరియు ఈశ్వరసేవయూ  దీనజనసేవయూ తన జీవిత ధర్మములని యాతడు గుర్తింపవలయును.
తల్లిదండ్రులు సాక్షాద్భగవత్స్వరూపులని గ్రహించి గృహస్థుడు సదా సర్వవిధములను వారల సంతుష్టుల నొనర్పవలయును. ఎవ్వని తల్లిదండ్రులు సంతుష్టులో వానిచే భగవంతుడు సంతుష్టుడగును.
తల్లిదండ్రులతో పరుషవాక్యములాడని నందనుడు నిజముగా నందనుడు. తల్లిదండ్రుల యెదుట నెన్నడును పరిహాసము చేయరాదు. ఔధ్ధత్యమునుగాని, కోపమునుగాని, క్రోధమునుగాని చూపరాదు. తల్లిదండ్రుల యెదుట అవనతుడై నిలువవలయును. కూర్చుండ నాఙ్ఞాపితుడగువరకు కూర్చుండరాదు.
తల్లికిని, తండ్రికిని, బిడ్డలకును, భార్యకును, పేదలకునూ పెట్టనిదే గృహస్థుడు భుజింపరాదు. అటుల భుజించుట పాపకార్యము. ఈ శరీరమునకు తల్లిదండ్రులే కారణభూతులు కావున వారలకు హితమొనర్చుటకై మానవుడెన్ని కష్టములనైన అనుభవించుట కర్తవ్యము.
తన భార్య యెడలను ఆతని విధ్యుక్తధర్మ మిట్టిదే. భార్య నాతడు దూషింపరాదు. కేవలము తల్లిగా భావించి యామెను పోషింపవలెను. తానెంతటి మహా కష్టము లనుభవించినను భార్యపై కోపింపరాదు.
పరస్త్రీని గురించి చింతించువాడు__కేవలము మానసికంగా పరస్త్రీని స్పృశించిననూ__ఘోర నరకము పొందును.
స్త్రీల యెదుట అసభ్య సంభాషణ చేయరాదు. తన శక్తిసామర్ధ్యములను గూర్చి ప్రగల్భము లాడరాదు.
ధనముచే, వస్త్రములచే, ప్రేమచే, నమ్మికచే, మధుర వాక్కులచే గృహస్థుడు తన భార్యను సంతుష్ట నొనర్పవలయును. ఆమె మానసము క్షోభించు కార్య మెన్నడును చేయరాదు. పతివ్రతయగు భార్య యొక్క ప్రేమను బొందగల్గినవాడు సమస్త ధర్మములందును కృతకృత్యుడగుచున్నాడు. సమస్త సద్గుణముల నార్జించుచున్నాడు.
బిడ్డలయెడ గృహస్థు డవలంబింపవలసిన ధర్మము లేవన…
నాలుగేండ్లప్రాయము వచ్చువరకూ పుత్రుని ప్రేమానురాగాలతో పెంచుచూ, పదునారేండ్లవరకూ విద్యాబుధ్ధులను గరపవలెను. ఇరువదియేండ్లప్రాయమున నాతని నేదియో యొక యుద్యోగమున లేక కృషి యందు నియోగింపవలయును. తండ్రి యతని నప్పుడు ప్రేమతో తన సమానునిగా జూడవలయును. సరిగా నిదే విధముగా కుమార్తెను బెంచి విశేషశ్రధ్ధతో నామెకు విద్యాబుధ్ధులను గరపవలయును. వివాహసమయమున తండ్రి యామెకు నగలను ధనము నొసగవలెను.
ఇక నాతనికి తన అన్నదమ్ములయెడ అక్కసెల్లెండ్రయెడ పేదలైయున్నయెడ వారి బిడ్డలయెడ, మిగిలిన తన బంధువర్గమునెడ, స్నేహితులయెడ, సేవకులయెడ విధ్యుక్తధర్మములు కలవు. పిమ్మట తన గ్రామవాసుల యెడలను, బీదలయెడను, యెవరైన కానిండు- తన సాయము నర్ధించువారలయెడనూ గృహస్థునకు ధర్మము లేర్పడినవి.
తగినంత స్థితి నందుండియు గృహస్థుడు తన బందుగులకును పేదలకును బెట్టనియెడల నట్టివాడు మానవమాత్రుడు గాడనియూ, వట్టి పశువనియూ గ్రహింపుడు.
వస్త్రాహారములందు, శరీరపోషణమునందు, తలదువ్వుకొనుటయందు వ్యామోహము కూడదు. గృహస్థుడు పవిత్ర హృదయుడై పరిశుధ్ధ శరీరుడైయుండుటయేగాక కర్మపరాయణుడై యుండవలయును. మితాహారీ, మితభాషణుడూ, తగిన నిద్రకలవాడూ అయియుండవలెను.
శత్రువులయెడ గృహస్థుడు వీరుడై వర్తింప వలెను.శత్రువుల కతడు ప్రతీకారము చేయుట అతడి విధిగా గుర్తింపవలెను.
గురువులయెడను, బందుగులయెడను అతడు శాంతమూర్తియై మెలగవలెను.
దుర్మార్గులను గౌరవింపరాదు. మరియు గౌరవార్హులగు సజ్జనుల నవఙ్ఞ చేసిననూ తప్పు చేసినవాడగును.
స్నేహ మొనర్చుటలో మైమరిచి సంచరింపరాదు. తాను స్నేహము చేయదలచినవారి చర్యలను, పరులతో వారి వ్యవహార ధర్మములను కనిపెట్టి, వారిని గూర్చి పర్యాలోచించి మరీ వారితో స్నేహము చేయవలయును.
తన పేరుప్రఖ్యాతులను గురించి నలువురి యెదుటను సంభాషింపరాదు. తన శక్తిసామర్ధ్యముల గురించియు, సంపదను గూర్చియూ లేక తనకు రహస్యముగా దెలుపబడిన విషయముల గురించియూ ప్రసంగింపరాదు. ఈ మూడు విషయములని గురించియు గృహస్థుడు మాట్లాడరాదు.
తాను దరిద్రుడనని కాని భాగ్యవంతుడనని కాని చెప్పరాదు. తన సిరిసంపదలగూర్చి ప్రగల్భములు పలుకరాదు. ఇది యాతని పరమ ధర్మము. ఇటు లొనర్పనియెడల  ప్రజలాతని నధర్మవర్తనుడందురు.
అతడేదైన పొరపాటు చేసినప్పుడు కాని, దౌర్బల్యమున కధీనుడైనప్పుడు కాని నలువురి యెదుట తన గుట్టును వెల్లడించుకోరాదు. నేదేని యుద్యమము నారంభించినప్పుడు తన కందు జయము లభింపదని నిశ్చయముగా నెరిగినుండియూ దానిని వెల్లడింపరాదు.
విద్యాధనముల  నార్జించుటకై శక్తివంచన లేక ప్రయత్నించుట విద్యుక్తధర్మము. తన విధిని నెరవేర్పనిచో అతడు గృహస్థు డనిపించుకోజాలడు.
లోకులు తరచు తాను నెరవేర్ప సాధన సంపదలు లేని కార్యములలో దిగుచు స్వలాభమునకై పరులను వంచించుచుందురు. సర్వవిషయముల సాఫల్యమునకును కాలమనునది యొకటి యున్నది కదా! ఒక సమయమున అపజయముగా పరిణమించునదే వేరొక సమయమున దిగ్విజయమై పరిణమింపవచ్చును.
జనహితము నొనగూర్చినవియు, జనులకు ప్రీతికరములగు మాటలనుపయోగించుచు గృహస్థుడు మృదులమగురీతిని సత్య సంభాషణ మొనర్పవలెను. పరుల వ్యాపారముల గురించి అతడు పలుకరాదు.
చెరువులను త్రవ్వించుచూ, బాటల కిరువైపులా చెట్లు నాటించుచూ మానవులకునూ, జంతువులకునూ విశ్రాంతిమందిరములను నిర్మించుచూ, బాటలను వేయించుచు వంతెనలను గట్టించుచు గృహస్థుడు యోగింద్ర లభ్యమగు నుత్తమోత్తమగతిని బొందుచున్నాడు.
స్వదేశము కొరకుగాని, స్వధర్మము కొరకుగాని యుధ్ధరంగమున ప్రాణములనుబాయు గృహస్థుడు ధ్యానముచే యోగి పొందు పరమపదమునే పొందుచున్నాడు.
మహానిర్వాణతంత్రము
అష్టమోల్లాసము.
జైహింద్.

29, జులై 2012, ఆదివారం

విశ్వంభరుఁడైన "సి.నా.రె". గారికి 82వ జన్మ దిన శుభాకాంక్షలు.

1 comments

జైశ్రీరామ్.
విశ్వంభరుఁ డా.సి. నారాయణ రెడ్డి.
82 వ జన్మ దినోత్సవం జరుపుకొంటున్న మన విశ్వంభరుఁడు తన పాటల పరిమళాలను జగాన గుబాళింప చేసే కర్పూర వసంతరాయలు. 
అనన్య సామాన్య అసాధారణ ప్రతిజ్ఞా పాటవాలతో తెలుగు జాతికే వెలుగై నిలిచిన మహనీయ కవితా మూర్తి మన డా. సి.నారాయణ రెడ్డి. 
జ్ఞాన పీఠాన్ని చేజిక్కించుకొన్న మన నారాయణ రెడ్డి సజీవ తెలుగు సాహితీ స్వరూపానికి నిలువెత్తు  నిదర్శనం.
ఆ మహనీయునికి  జన్మదినం సందర్భంగా ఆంధ్రామృతం శుభాకాంక్షలందజేస్తోంది.
జైహింద్.

27, జులై 2012, శుక్రవారం

శ్రావణ శుక్రవారం సందర్భంగా పాఠకులకు శుభాకాంక్షలు.

1 comments

శ్రీ లక్ష్మీదేవీమ్ భజామ్యహమ్.
సాహితీ ప్రియ సోదరీ సోదరులారా!
ఈ రోజు పరమ పవిత్రమైన శ్రావణ శుక్రవారము. అష్టస్వరూపిణియైన ఆ జగన్మాత శ్రీ మహా లక్ష్మి అపార కరుణామృతాన్ని తనను సేవించు భక్తులపై పొంగించు రోజు. ఆ జగన్మాత యనుగ్రహం అపురూపమైనది.
ఆ కరుణాంతరంగిణి యొక్క అమృత దృక్కులు మీపైన, సహృదయులందరిపైనా అపారంగా ప్రసరించాలని మనసారా కోరుకొంటున్నాను.
కంద గీత గర్భ చంపకమాల:-
సురహిత కార్యముల్. సుగుణ శోభిత సన్మది, శుద్ధ వాక్కు, ప్రే
మ రస సుధన్, సదా సుజన మాన్యత, భక్తి, యశోగుణార్తియున్,
వర నుత భావనల్, విజయ వర్ధిత శక్తి, సువేద్య యిచ్చు ధీ
వర తమకున్ గృపన్, సుగుణ వర్ధిత లక్శ్మియశోగుణ్యాఢ్యయై.
క:- హిత కార్యముల్. సుగుణ శో
భిత సన్మది, శుద్ధ వాక్కు, ప్రేమ రస సుధన్,
నుత భావనల్, విజయ వ
ర్ధిత శక్తి, సువేద్య యిచ్చు ధీవర తమకున్
గీ:- సుగుణ శోభిత సన్మది, శుద్ధ వాక్కు, 
సుజన మాన్యత, భక్తి, యశోగుణార్తి
విజయ వర్ధిత శక్తి, సువేద్య యిచ్చు 
సుగుణ వర్ధిత లక్శ్మియశోగుణ్యాఢ్య!
జైశ్రీరామ్.
జైహింద్.


22, జులై 2012, ఆదివారం

స్వాతంత్ర్య భారతావనికి 13 వ రాష్ట్ర పతిగా ఎన్నికైన శ్రీ ప్రణబ్ ముఖర్జీ కి అభినందనలు.

1 comments

శ్రీ ప్రణబ్ ముఖర్జీ.
భావి భారత ఆశా కిరణంగా భారత దేశ 13వ ప్రథమ పౌరునిగాఎన్నికయి,  అఖండవిజయం సాధించిన మాన్యశ్రీ ప్రణబ్ ముఖర్జీ గారికి ఆంధ్రామృతం అభినందనలు తెలియఁ జేస్తోంది.
మన కన్న తల్లి భారతాంబ తన ముద్దు బిడ్డలను చూసుకొని ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. 
అదే సమయంలో తాను తన ముద్దు బిడ్డలు యావద్భారతావనినీ ఆశ్రయించి జీవిస్తున్న తోటి బిడ్డలను దృష్టియందుంచుకొని అందరికీ ఆనందం కలిగించే విధంగా ధర్మ యుతంగా మెలగాలని ఆకాంక్షిస్తోంది.
ఐతే నేడు అనంత దురంతాలతో ఒకరినొకరు మోసం చేసుకోవటమే కాక సహృదయులైనవారి కెందరికో బాధాకరంగా ప్రవర్తిస్తూ శిక్షలనుండి తప్పించుకొంటూ, ఒక వేళ శిక్షలు పడినా రాష్ట్రపతి నుండి క్షమాభిక్ష పొందుతూ నిర్లజ్జగా యధాపూర్వకంగా ప్రవర్తిస్తున్న దుష్ట సంతతిపట్ల కఠినాతికఠినంగా ప్రవర్తించే, న్యాయాన్ని నాలుగు పాదాలా నడప గలిగే బిడ్డలు తనకు ఉండాలని కోఱుకుంటోంది.
అన్ని విధాలా ఆదర్శవంతమైన సరళిని అనుసరిస్తూ, సామాజిక ఆర్థిక, వైయక్తిక  జీవన విధానంలో ఆదర్శవంతమైన ప్రథమ పౌరుఁడుగా మన ప్రణబ్ ముఖర్జీ యావద్భారతీయులకూ ఆదర్శమూర్తి కావాలనీ, యావద్భారతీయులూ, ఆదర్శ వంతులైనవారి ఆదర్శ జీవన మార్గాన్ని అనుసరించడం ద్వారా ఆదర్శవంతమైన జీవితం గడుపుట ద్వారా మన భారతాంబ కలలు పండించాలని మనసారా కోరుకొంటూ 
మరొక్క పర్యాయం 
13వ భారత రాష్ట్రపతిగా ఎన్నికైన మాన్యశ్రీ ప్రణబ్ ముఖర్జీని మనసారా అభినందిస్తున్నాను.
జైశ్రీరామ్.
జైహింద్.

16, జులై 2012, సోమవారం

నయాగరాలాగ చిందులు వేస్తున్న గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డి గారి కవితా స్రవంతి.

1 comments

జైశ్రీరామ్.
పై చిత్రాలపై క్లిక్ చెయ్యండి.
జైహింద్.

14, జులై 2012, శనివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 122. విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

1 comments

జైశ్రీరామ్.
శ్లో:-
విద్వత్వంచ నృపత్వంచ నైవ తుల్యం కదాచన.
స్వదేశే పూజ్యతే రాజా. విద్వాన్ సర్వత్ర పూజ్యతే.
గీ:- 
పాండితీ రాచరికములుభవ్యమిలను.
సాటి లేనివి. వాటికి సాటి అవియె.
రాజు తన రాజ్యమందునె రాణఁ గాంచ
పండితుండెల్ల చోటుల పడయు కీర్తి..
భావము:-
పాండిత్యము, రాజరికము సాటిలేనివి. రాజు స్వదేశములో పూజింపఁబడు చుండగా విద్వాంసుఁడు ఎక్కడైననూ పూజింపఁ బడును.
జైహింద్.

12, జులై 2012, గురువారం

మేలిమి బంగారం మన సంస్కృతి 121. నడవడిక ఎలాగుండాలంటే.

1 comments

జైశ్రీరామ్.
శ్లో:-
నాzనిష్టం ప్రవదేత్ కస్మిన్  న ఛిద్రం కస్య లక్షయేత్.
ఆజ్ఞా భంగస్తు మహతాం రాజ్ఞః కార్యః నవై క్వచిత్.
ఆ:- 
పలుకకు మితరులకు పరువు బాపెడి మాట.
ఎంచఁ బోకితరుల వంచనలను.
పెఅద్దవారి మాట పెడచెవి పెట్టకు.
రాజునాజ్ఞవుడువ రాదు.గనుమ.
భావము:-
ఎవరికినీ అపకారకమైన మాటలు పలుకకుము. ఇతరుల లోపములెంచ వలదు. మహాత్ముల యొక్క, రాజుల యొక్క మాటలను మీరి నడువకుము.
జైహింద్.

10, జులై 2012, మంగళవారం

యద్యదిష్టతమంలోకే....మేలిమి బంగారం మన సంస్కృతి 121.

2 comments

జైశ్రీరామ్.
శ్లో:-
యద్యదిష్టతమంలోకే యచ్చాస్యదయితం గృహే.
తత్తద్గుణవతే దేయం తదేవాzక్షయమిచ్ఛతా.
గీ:-
తనకు నెయ్యది యిష్టమో తలచి చూచి,
తన గృహంబున నెయ్యవి తనుపు తనను,
తనకు నక్షయంబుగ కోరు దాని నెంచి
యోగ్యులకునీయ పాడియౌ. భాగ్య మదియె.
భావము:-
లోకమున తనకేది మిక్కిలి యిష్టమో, వేటిని తన యింట ప్రియతమముగా చూసుకుంటారో, ఏయే ప్రియమైన వస్తువులు తనకు అక్షయంగా ఉండాలని కోరుకొంటారో, ఆయా వస్తువులను యోగ్యులకు ఇచ్చుచుండ వలెను.
మనకు నచ్చిన, ఇష్టమైన విగా ఏ వస్తువులుండునో అట్టి విశిష్టమైన వస్తువులనే యితరులకు ఈయ వలెను కాని, తనకక్కరలేని, ఇష్టము లేని, పనికిరాని వస్తువులను ఈయరాదు అని తాత్పర్యము.
జైహింద్.

9, జులై 2012, సోమవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 120. సత్ పుత్రః కుల దీపకః.

3 comments

జైశ్రీరామ్.
శ్లో:-
శ్రావయేత్ మృదులాం వాణీం సర్వదా ప్రియ మాచరేత్.
పిత్రో రాజ్ఞానుసారీస్యాత్.  సత్ పుత్రః కుల దీపకః.
గీ:-
కులదీపము సత్ పుత్రుఁడు .
తలిదండ్రుల మాట వినును. తనిపెడి మాటల్
పలుకుచు నా తలిదండ్రుల
తలచును దైవముగ నెపుడు ధన్యాత్ముఁడగున్. 
భావము:-
సత్ పుత్రుఁడే కులమునంతను పవిత్రమొనరించును. పుత్రుఁడు ఎల్లప్పుడూ తల్లిదండ్రులతో తియ్యని, చక్కని మాటలే ఆడ వలెను. వారికి ప్రియమునే చేస్తూ, పిత్రాజ్ఞా పాలన గావిస్తూ ఉండ వలెను.
జైహింద్.

5, జులై 2012, గురువారం

హనుమంతుని గుండెలలో నెలకొన్న సీతారాములకు ప్రతీకగా కంద గీత గర్భ ఉత్పలమాల పద్యము.

4 comments

జైశ్రీరామ్.
శ్రీ రామ భక్త హనుమాన్.
(హనుమంతునుద్దేశించి)
కంద గీత గర్భ ఉత్పల మాల:-
అంజన భాగ్యమై జన నిరంజన వర్ధన సల్పు వేల్ప! 
న్మంజులవాక్ సుధా మధుర మాన్య వదాన్య సమస్త సాక్షివై
రంజన రాడ్విభూసతి కిరణ్మణి సీత లసద్విరామ మా
తం జనవే కనన్? సుగుణ ధామ కృపన్ మముఁ జూడఁ గొల్తు నిన్!

(శ్రీరామునుద్దేశించి)
ఉత్పలమాల గర్భస్థ కందము:-
జన భాగ్యమై, జనని రం
జన వర్ధన సల్పు వేల్ప! సన్మంజుల వాక్ 
జన రాడ్విభూసతి కిర
ణ్మణి సీత లసద్విరామ మాతన్ జనవే !

(సీతామాతనుద్దేశించి) 
ఉత్పలమాల గర్భస్థ తేటగీతి:-
జనని రంజన వర్ధన సల్పు వేల్ప!
మధుర మాన్య వదాన్య సమస్త సాక్షి
సతి కిరణ్మణి సీత లసద్విరామ !
సుగుణ ధామ కృపం మముఁ జూడఁ గొల్తు.
జైహింద్.

4, జులై 2012, బుధవారం

మహనీయులకు ఘన నివాళులు.

4 comments

భారత దేశ జాతీయ పతాక నిర్మాత శ్రీ పింగళి వెంకయ్య.
ప్రియ భారతీయ సహోదరసహోదరీమణులారా! ఏ దేశానికైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా గౌరవింపఁ బడేది ఆదేశ జాతీయ పతాకము. ఆ పతాక నిర్మాత ఎవరో అతఁడు అత్యంత గౌరవ పాత్రుఁడు.
మన భారత దేశానికి చూడగానే కళ్ళల్లో మెఱిసే అతి మనోహరమైన త్రివర్ణ పతాకాన్ని నిర్మించిన మహానుభావుఁడు శ్రీ పింగళి వెంకయ్య. ఆ మహోదయుఁడు తన జీవిత కాలమంతా దేశ భక్తితోనే దేశం కోసమే జీవించాఁడు. ఐతే అటువంటి వ్యక్తి తేదీ. 02 - 8 - 1878 ని జన్మించగా   దివంగతుఁడైన రోజు తేదీ. 04 - 7 - 1963  అనగా ఈ రోజే తేదీ.04-7-2012. వారి వర్ధంతి.
" నా అంత్య దశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నాభౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక "
అని తన చరమ కాంక్షను తెలుపుకొన్నాఁడు మన వేంకయ్య.జాతీయ పతాకం నిర్మించి, తెలుగు జాతికే వన్నె తెచ్చిన మన వెంకయ్యగారి వర్ధంతి నాడైనా మన దేశం కాని, కనీసం మన తెలుగు జాతి కాని స్మరించుకోకపోవడం దురదృష్టకరం అనక తప్పదు. అతఁడు తెలుగువాఁడైన కారణంగానే దేశ స్థాయిలో పొంద దగినంత గౌరవం పొందలేకపోయి ఉండవచ్చుననుకుందామన్నా కనీసం మన  ప్రభుత్వం ఈ అంశాన్ని స్పృశించకపోవడం శోచనీయం కాదంటారా?
మహానుభావుఁడు వెంకయ్య  తన జీవిత చరమాంకంలో అత్యంత దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించాడంటే అది మనకిప్పుడు నమ్మలేని నగ్న సత్యం. 
జీవితాంతం దేశం కొకు స్వాతంత్ర్యం కొఱకు పోరాడిన వెంకయ్య చివరి రోజుల్లో తిండికి కూడా మొహం వాచి నానా అగచాట్లు పడినట్లు ' త్రివేణి ' సంపాదకులు డా. భావరాజు నరసింహారావుగారు పేర్కొన్నారు. అంతిమదశలో విజయవాడలో డా. కె.ఎల్.రావు, డా.టి.విఎస్.చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు మున్నగు పెద్దలు 15-1-1963 న వెంకయ్య గారిని సత్కరించి వారికి కొంత నిధిని అందించారు. ఆ సత్కారం తరువాత ఆరు నెలలకే వెంకయ్య దివంగతుడయ్యాడు. బ్రతికి ఉండగా ఎలా జీవించారో మనకు ప్రస్తుతం ప్రత్యక్షంగా తెలియకపోయినప్పటికీ, ఇప్పుడు సమాజం అతనిపట్ల చూపుతున్న నిర్లిప్తత అత్యంత బాధాకరంగా ఉంది. దేశభక్తులకు ఇదేనా మనసమాజం అందించే నివాళి? 
ఆ మహనీయునికి ఆంధ్రామృతం ఘనంగా నివాళులందిస్తోంది.
మరుగునపడిన మాణిక్య సన్నిభుఁడితడొకడే కాదు.
ఈ రోజు మన్యవీరుఁడు శ్రీ అల్లూరి సీతారామ రాజు యొక్క జయంతి.

మన్య వీరుఁడు అల్లూరి సీతారామరాజు.
ఇతడూ మన తెలుగు వీరుఁడే. భారత దేశ స్వాతంత్ర్య సమరంలో ఆంగ్ల ప్రభుత్వాన్ని గడగడ లాడించిన మన్య వీరుఁడు మన అల్లూరి సీతా రామ రాజు.
ఆ మహనీయుని జయంతి ఈ రోజే. ఆంధ్ర జాతికే గర్వ కారణమైన మన అల్లూరిని కన్న మన ఆంధ్ర మాత కడు ధన్యురాలు. 
మన్యవీరునికి ఘన నివాళులర్పిస్తున్నాను.
మరో మహనీయుఁడు శ్రీ స్వామీ వివేకానందుని వర్ధంతి కూడా నేడే.
స్వామీ వివేకానంద.
మన భారత జాతికే ఈ విశాల విశ్వంలో ఒక గుర్తింపు తెచ్చిన శ్రీ స్వామీ వివేకానంద భారత మాత పుణ్య గర్భాన పుట్టినది తేదీ.12 - 01 - 1863. కాగా ఆ పరమాత్మలో ఐక్యమైనది తేదీ. 04 - 7 - 1902. అంటే అతని వర్ధంతి నేడేనన్నమాట, 
యువతకు యావద్భాతీయులకు స్ఫూర్తిప్రదాత ఐన శ్రీ వివేకానందునికి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను.
జైశ్రీరామ్.
జైహింద్. 

శివ శివ యన రాదా? శివ నామము చేదా?

3 comments

ఓం నమశ్శివాయ!
జైశ్రీరామ్.
ప్రియ సుస్వభావులారా! 
శివ అను రెండక్షరముల ప్రాశస్త్యమును మనము గమనించినచో ఆశ్చర్యము పొందకమానము.
ఈ క్రింది శ్లోకాదులను చూడుఁడు.
శ్లో:-
విద్యాసు శ్రుతి రుత్కృష్టా. రుద్రైకాదశినీ శ్రుతౌ.
తత్ర పంచాక్షరీ, తస్యాం శివ ఇత్యక్షర ద్వయమ్.
గీ:- 
విద్యలందున మేలౌను వేద విద్య.
వేదముల రుద్రములు మేలు విశ్వమునను.
భద్ర పంచాక్షరియె మేలురుద్రములను.
"శివ"  యె పంచాక్షరిని మేలు శ్రియముఁ గొలుపు.
తా:- 
విద్యలన్నిటిలోను వేదములు ఉత్కృష్టమైనవి. వేదములందు ఏకాదశ రుద్రములుత్కృష్టము. అందు పంచాక్షరీ ఉత్కృష్టము. ఆ పంచాక్షరియందు " శివ " అను రెండక్షరములు ఉత్కృష్టమైనవిగా గ్రహింప వలెను.
ఇంతటి మహోత్కృష్టమైన శివ అను అమృతోపమానమైన రెండక్షరములను మనము నోరారా పలుకుట ఎంతటి సత్ఫలము నిచ్చునో గ్రహింపకపోలేము. మరెందుకు ఆలస్యము? భక్తి, శక్తి, యుక్తి, ముక్తి ప్రదమైన శివ నామమును నిరంతరము హృదయమున పలుకనలవడితిమేని, తత్ఫలము కూడా మనము పొందుదుమనుటలో సందేహము లేదు.
జైహింద్.

3, జులై 2012, మంగళవారం

శ్రీ గోపాలరావు సద్గురుభ్యో నమః

1 comments

శ్రీరస్తు                                           శుభమస్తు                           అవిఘ్నమస్తు.

    డా. ఏ. గోపాలరావు గురుదేవులు.
శ్రీ గురుభ్యోనమః.
1.కంద గీత గర్భ ఉత్పల మాల.
శ్రీ గురు దేవ మీ చరణ సేవ రహిం గనఁ జాల నేను.స
చ్ఛ్రీఁ గొలుపున్ గదా! సుజన సేవిత పాద! విశుద్ధ చిత్త! స
ద్ధీ గురు వంద్య! ఈ భువి సుధీవర! మీ కృపఁ బొందితేను. భ
వ్యా! గణనన్ సదా సుజన పాల! నమస్కృతి శుభ్ర తేజసా!

౧.ఉత్పల గర్భస్థ కందము:-
గురు దేవ మీ చరణ సే
వ రహిం గనఁ జాల నేను. సచ్ఛ్రీఁ గొలుపున్.
గురు వంద్య! ఈ భువి సుధీ
వర! మీ కృపఁ బొందితేను. భవ్యా! గణనన్. 

౨.ఉత్పల గర్భస్థ గీతము:-
చరణ సేవ రహిం గనఁ జాల నేను. 
సుజన సేవిత పాద! విశుద్ధ చిత్త!  
భువి సుధీవర! మీ కృపఁ బొందితేను. 
సుజన పాల! నమస్కృతి శుభ్ర తేజ!

2.ద్విపద - మత్త కోకిల - కంద గర్భ సీసము:-
ఓ దయామయ! జ్ఞాన మొప్పుగ నుండగా - మది నెంచుచున్, గురు మాన్య తమరు
బోధఁ గొల్పిరి మాదు పుణ్యము పొంగఁగా! - సుజనాళిలో మేము శోభిలంగ!
మీ దయాశ్రయ మేధ మేదిని మిన్నగా  - గన నొప్పునే కద! వినుతముగను.
మీదు పాద యుగంబు మిన్నగు మేలు కొల్తుము దేవరా! గోప ప్రముఖ నామ!
గీ:-
ప్రముఖ గురు దేవ మీ దయ యమలము తమ
జ్ఞాన సుధ మహాద్భుతమగును గాదె! మహిని.
సుజనులు పొగడన్ దమ బోధ సులభ గతిని
ముదముగ కనంగ నగునయ! మురియుచునిల.

౧.సీస గర్భస్థ ద్విపద:-
ఓ దయామయ! జ్ఞాన మొప్పుగ నుండ  
బోధఁ గొల్పిరి మాదు పుణ్యము పొంగ! -  
మీ దయాశ్రయ మేధ మేదిని మిన్న!  
మీదు పాద యుగంబు మిన్నగు మేలు! 

౨.సీస గర్భస్థ మత్తకోకిల:-
ఓ దయామయ! జ్ఞాన మొప్పుగ నుండగా  మది నెంచుచున్,
బోధఁ గొల్పిరి మాదు పుణ్యము పొంగగా! - సుజనాళిలో!
మీ దయాశ్రయ మేధ మేదిని మిన్నగాఁ  - గన నొప్పునే !  
మీదు పాద యుగంబు మిన్నగు మేలు కొల్తుము దేవరా!

౩.సీస గర్భస్థ కందము:-
ప్రముఖ గురు దేవ మీ దయ 
యమలము తమ జ్ఞాన సుధ మహాద్భుతమగును గా 
దె! మహిని. సుజనులు పొగడన్ 
దమ బోధ సులభ గతిని ముదముగ కనంగన్ !

3. నిరోష్ఠ్య ఆట వెలది:-
సరస! సకల శాస్త్ర సాన్నిధ్య సహృదయ! 
రస జగాన శిష్య రాజి నునిచి,
జగతి కీర్తి నెదిగి చక్కగా నిలిచిన
జ్ఞాన దాన నిరత! జయ నిధాన!

4. శ్రీ చక్ర బంధ తేట గీతి:-
సభలఁ దీపించు శ్రీకవిచంద్ర భాస!
ధరణి దేవుఁడ! శ్రీకర ధర్మ మోద!
విశ్వ కవి సేవ్య! శ్రీగోప! విద్మహత్వ!
సవిధ సేవిత సత్పద! సద్విభాస!

5. చతురంగ బంధ కందము:-  ( గురువరు - పదములు - సుకవికి - వరములు )
సుమ సమ మృదుల వర గురు ప
దములు ఘన రుచిని వరలు బుధ వరులు నవనిన్
తమ పదవికి విజయ మొదవు. 
తమ కవితలు ముదము వసుధ తనరును సతమున్.

సు   మ      స     మ     మృ      దు        ల         వ
ర      గు     రు     ప      ద         ము    లు       ఘ
న     రు      చి     ని       వ         ర         లు       బు
ధ     వ    రు     లు     న                   ని        న్
త     మ     ప     ద       వి         కి        వి        జ
య   మొ        వు.    త        మ         క         వి
త     లు ము     ద      ము     వ        సు         ధ 
త     న      రు     ను      స        త        ము        న్.

6. నక్షత్ర బంధ కందము:- ( సుగుణ వర వందనములు )
సుమ సహృదయ! మనమున ప్రా
ణముగా మములన్ నిలుప తనర కవిసత్ వం
శము దయఁ గని గుర్తించిరి
నమనమున విభవ! ప్రణతులు నయ వంశ శశీ!

7. క:- గురువర! మీ పాదాబ్జము
లరసి కొలువ కవిత ధార లసదృశ రీతిన్
పొరలుచు వచ్చును. నిజమిది.
కరుణనుఁ గను మిమ్ముఁ బోలు ఘను లిలఁ గలరే!

8. క:- దోషము లున్నను సైచెడి
మీ సము లెవరయ్య భువిని? మేల్తరమగు మీ
ధ్యాసను కలిగినవా రిల
భూషణులగు భారతికిని. పూజింపఁ బడున్.
స్వస్తి.
ఇట్లు
మీ ప్రియ శిష్యుఁడు 
చింతా రామ కృష్ణా రావు.
నక్షత్ర బంధ, చతురంగ బంధ,  శ్రీ చక్ర బంధ పద్యమ్య్కను ఆయా చిత్తరువులలో ఉంచి ప్రచురించ వలసి యున్నప్పటికీ నాకు ఆనిర్మాణ నైపుణ్యము కొరవడినందున ఆ విధముగ చేయలేకున్నందులకు క్షంతవ్యుఁడను. ఆయా పద్యములను ఆయా చిత్తరువులలో పొందుపరిచి నాకు పంపగలిగిరేని వారికి కృతజ్ఞుఁడనై యుందునని విన్నవించుకొనుచున్నాను.
అట్టివారెవరేని పంపినచో పై పత్రమున చేర్చగలను.
జైశ్రీరామ్
జైహింద్.

గురు పూర్ణిమ సందర్భముగా గురుదేవులందరికీ ప్రణుతులు.

1 comments

జైశ్రీరామ్.
ప్రియ సహృదయ రంజకులారా! గురుపూర్ణిమ సందర్భంగామీకు శుభాభినందనలు. ఈ గురు పూర్ణిమ సందర్భంగా మనం మన గురువులకు మన భక్తి భావాన్ని ప్రకటించుకోగలగడం మన అడ్రుష్టం. ముందుగా నేను మా గురువులకు నా నమ్రతను భక్తి భావాన్ని ప్రకటించుకొంటాను.
మా గురువులలో ఒకరైన శ్రీభాష్యం వేంకట నరసింహ భాష్యకారాచార్యుల వారు

పూజ్యపాదులైన మద్గురుదేవులారా! మీ అందరికీ వినమ్రతతో భక్తితో నమస్కరిస్తున్నాను. అజ్ఞానాంధకారంలో కన్ను గానని నాకు సుజ్ఞాన జ్యోతులత్ మార్గాన్ని చూపించి జీవిత గమనానికి చక్కని రాచబాట వెసిన మీ మహోన్నత కార్య దీక్షా దషతకు పరవశిస్తూ  నా హృదయ పూర్వక మృతజ్ఞతాజలులు మీకు సమర్పించుకొంటున్నాను.

ప్రకృతిలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనకు జ్ఞాన బోధ చేస్తున్న ప్రతీ మూర్తికీ మనం ఋణపడి ఉన్నాము. ఆఋణ విముక్తి కొఱకే మనము సంధ్యావందనము చేస్తూ తర్పణ చేస్తూ ఉంటాము. బ్రతికి ఉన్నంత కాలము ఈ ప్రకృతికి కృతజ్ఞతతో ఉండాలి. కృతజ్ఞతతో మనము ప్రకితిని పరిరక్షించ గలగడం మనచేతిలో ఉన్న పని. ప్రఋతిని అంతం చేసే కాలుష్య నివారణోపాయ మార్గంలో జీవనం సాగించే ప్రయత్నం చేయటము, పరిరక్షించటము మన విధి. ప్రకృతి మన కన్న తల్లి. మన గురువు. శత సహస్రాధిక వందనాలర్పిస్తున్నాను.
ఇక శ్రీ జీ. కన్నయ్య గారి వ్యాసం చూద్దాము.
Goda Kannaiah
గురు పౌర్ణమి 
వ్యాసాయ విష్ణు రూపాయ  వ్యాస రూపాయ  విష్ణవే  అని భీష్ముడు స్తుతించిన విధముగా వ్యాస మహర్షి పూజ  ఆషాడ  పౌర్ణమి రొజున చేస్తాము . వ్యాసుడు  పరాశర  మహర్షి కుమారుదు శక్తి  మహర్షి మనమడు,వసిష్టుని  ముమ్మనవడు.పరాశరడు త్రిలోక  పుజ్యుడు మద  మాత్సర్యములు లెకుండ మహా తపస్వి తెజోవంతుడు గుణ  సంపన్నుడు. ఒకపరి తీర్థయాత్రలకు బయలుదేరి యమున సమీపమునకు వచ్హి నది దాటుటకు మత్స్యగంధి నావలొ యెక్కెను. మత్స్యగంధి దాసరాజు కుమార్తె మత్స్య కులమునకు చెందినది. నావ యమున మధ్యకు వచ్హినది. ఫరశరునకు మత్స్య గంధి పైన మక్కువైనది అది తనకు తెలిపెను . తాను మత్స్య కులమునకు చెందినది అంటే పర్లేదు అనెను తన దేహము చాపల దుర్గంధముతొ ఉన్నది అంటె పరాశరడు తనను యొజన గంధిగా మార్చెను.తన కన్యాత్వము చెడును అంటె  కన్యాత్వాము చెడకుండా వుండెటట్లు వరము  ఇచ్హెను.  ఆప్పుడు  సూర్యుడు నడి నెత్తిన వుండటము  వల్ల తనకు సిగ్గుగా వున్నదన్నది అంటే పరాశరుడు  మంచుతొ ఒక ద్వీపమును యమున మధ్యలొ స్రుష్టించి తనతొ రమించి సధ్యొ గర్భము వల్ల ఒక కుమారుని ప్రసివింపచేసెను  . ఆ పిల్లవాడే  వ్యాసుడు పరాశరుడు సత్యవతిని చూసి ఆనందించి పిల్లవానిని చూసి మురిసిపొయి తన దొవన తాను వెల్లిపొయినాడు   వ్యాసుడు  చీకటి  ద్వీపమున జన్మించినందు వల్ల క్రిష్ణ ద్వైపాయనుడుగా పేరు కల్గెను.  అంతటితొ పరాశరుడు తన దారిలొ  వెల్లిపొయెను.  వ్యాసుడు తల్లికి నమస్కరించి తాను యెప్పుడు  తలచిన  తన వద్దకు వచ్హెదనని తపస్సుకై వెల్లిపొయెను. వ్యాసుడు మనకు పరాశరుని మూలముగా చెప్పవచ్హినది మనుజులు స్త్రీ సాంగత్యము కొరకు యెంత క్రిందికైన దిగజారుతారు తస్మాత్ జాగ్రత.  భారతము పంచమ వేదముగ వేద ఉపనిషత్తుల ధర్మ సాస్త్రములను సమీకరించి ఒక కథారూపమున అందించినాడు  మహాతపస్వి. ప్రతి పాత్ర ద్వారా మనకు ఒక సందేశము   అందించి మనకు మన సంస్క్రుతికి చాల గొప్ప సేవ  చేసిన మహానుభావుడు    ప్రతి పాత్రలొ మనకు అందించిన సందెశము   యెమిటొ  ముందుముందు చుద్దాము  మరి. మహనీయులు ప్రతిఫలా పేక్ష  లేకుండా  మంకు యెంతొ మేలు చెసారు.   
3rd july 2012 is guru pournami or vyaasa pournami.  Everyone of us has to worship vyaasa today.  Vyaasa is a great sage and made available to us the epic mahabharata duly combining the essence four vedas, upanishads, dharma sastras, smruties.  In mahabharata, the sage vyasa not only highlighted the characters but also through the characters he has highlighted the good and bad to us.
The sage vyasa is son of sage parasara and matsya gandhi later known as satyavati, the wife of king santanu, through whom the whole dynasty of mahabharata, i.e. the chandra vamsa was initiated.
Sage sakti is the grand father  and  sage vashishta is the great grand father of vyasa. The sage parasara is an eminent scholor in vedic studies and sastraas. Once he undertook the pilgrimmage to holy places and on his way he reached the Yamuna river.  In those days, to corss yamuna river, people used to undertake either swimming or by boats.  Dasa raja, is the fisherfolk king, and his daughter is matsya gandhi/sathya vati.  She used to undertake people to cross the river yamuna through boat riding.  The sage parasara also boarded the boat of satyavati.
When the boat is half way, the sage parasara interested in satyavati and he told her about his urge.  Satyavati initially resisted but on insisting of parasara, she told that she is of from low caste i.e. fisherfolk, but parasara said he has to objection.  Then she told that she is from fisherfolk and her body emanates bad smell always for this sage parasara made to smell scented the body of satyavati to a distance of 12 miles.  Then satyavati told that she is a virgin for this sage parasara told that she will not loose her virginity even after having  united with her. Then finally satyavathi told that already the sun is on mid of sky and she feels shy of joining him in open daylight.  For this parasara created on iceland in midst of yamuna river with heavy bushes so that no daylight passes inside the bushes.
Then parasara mingled with satyavati and through instant pregnancy they have a child and that child is none other than sage vyaasa.  Parasara was very much pleased with satyavati and seen vyaasa with pride and moved away from that place to further pilgrimmage.  The vyaasa, born with all qualities of a bramhachaari and immediataely bowed to his mother and prayed that he wanted to go to hermitage for doing tapas.  He also promised to his mother that whenever she think of him he will appear before her and fulfil the wishes of his mother. 
Through character of sage parasara, vyaasa wanted to educate the womanfolk of our country that people will go to extreme level in fulfilling there urge with a woman by providing all required but at the same they will move away without having any responsibility and the after effects whatsoever occur.
Sage vyaasa, in mahabharata epic through every character cautioned us how we should not act in the society to safeguard us.  Let us see each and every character in mahabharata and what sage vyaasa wanted to educate us through that character in the following positings.
చూచాము కదా! ఇంత చక్కగా అభిప్రాయ వ్యక్తీకరణ చేసిన కన్నయ్య గారికి ధన్యవాదములు.
జైహింద్.