జైశ్రీరామ్.
83. ఓం ఉదార కీర్తయే నమః.
కోమల వృత్త గర్భ సీసము.
తిరునాథ! నిరుపమ! ధీవర! నీరజ - నేత్రా! కృపం బ్రోచు నేతవీవు.
రమ్యాత్ముఁడ! నిరంత రంబు మదిని నిన్ ద - లంచెదన్. మాకు ప్రపంచ మీవె.
దయ నిహ పరమ హితంబు ప్రపంచముఁ - బొందన్ గఁ జేయుచున్ బూజ్యతఁ గను.
ఘన చరిత! వరంబుగానొసఁగుము భక్త - బాంధవా೭మృత దయా సింధు! నృహరి!
గీ. వినుత కోమల వృత్తస్థ! విశ్వ వేద్య - ధాత్రి వెల్గెద వీవె *యుదార కీర్తి* .
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
83వ సీస గర్భస్థ కోమల వృత్తము. (1.3.పాదములు న జ జ య .. యతి 8/
2.4 పాదములు, జ భ స జ గ .. యతి 9)
నిరుపమ! ధీవర! నీరజ నేత్రా! - నిరంత రంబు మదిని నిన్ దలంచెదన్.
పరమ హితంబు ప్రపంచముఁ బొందన్. - వరంబుగానొసఁగుము భక్త బాంధవా!
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! ఓ లక్ష్మీపతీ! సాటిలేని దీవరా! పద్మాక్షుఁడా! కృపతో
మమ్ము కాచు నేత వీవే కదా. ఓ రమ్యాత్ముఁడా! ఇహపరసుఖదుడవగుదువని, మమ్ములను గౌరవముగా చూచుదువని
ఎల్లప్పుడూ మదిలో నిన్ను తలంచెదను. నాకు దైవము నీవే కదా. భక్తబాంధవా! దయామృతసింధూ! ఘనసుచరితను
నాకు వరముగనొసగుము. కోమలవృత్తవాసా! విశ్వ వేద్యా! ఓ ఉదార కీర్తీ! విశ్వమున వెలిగెడెది నీవే కదా.!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.