గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 58వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

58. వేదార్థ భాసివి, ప్రమోదంబు గొల్పుమిక, వాదేలనమ్మ జననీ 

బోధావహంబయిన  సాధారణార్థ గతి నేదారి నేర్పుదువొగా.

నాద ప్రియా! సుగుణ బోధప్రభాస రస వాదప్రియా కనుమికన్.

నీదారిలో నడిపి శ్రీదంబువై నిలుపుమా ధైర్య మబ్బగ సతీ!

భావము.

ఓ సతీ మాతా! వేదార్థములలో ప్రకాశించు తల్లివి. వాదులాడక్ ఇకపై మాకు 

నీ తలపులతో కలిగెడి ప్రమోదమును లభింపఁజేయుమమ్మా! బోధకు 

స్థానమయిన సాధారణమయిన అర్థగతిని ఏ మార్గమున నేర్పుదువో 

తల్లీ! నాద ప్రియవైన ఓ జగన్మాతా! సుగుణ బోధలో ప్రకాశించు 

రసవాదప్రియా! ఇంక నన్ను చూడుము. నీ మార్గములో నన్ను 

నడిపి లక్ష్మీప్రదవై ధైర్యము అబ్బు విధముగా నిలుపుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.