గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

పున్నెంబే కద పేద సాదలకుఁ.... శ్రీమన్నారాయణ శతకము .12వ పద్యము. రచన చింతా రామ కృష్ణారావు. గానం శ్రీమతి దోర్బల బాల సుజాత

 జైశ్రీరామ్.

12. శా. పున్నెంబే కద పేద సాదలకుఁ బ్రాపుం గొల్ప నీవున్నచో.

మన్నింపంబడు దీవెగా? దయను రామా! కావు మమ్మంచు వా

రున్నం గానవు, నీకు నొప్పగునొ? కాదో పాపమిట్లున్న? శ్రీ

మన్నారాయణ! శ్రీరమా రమణ! ప్రేమం జూపుమా వారిపై

భావము.

శ్రీమన్నారాయణా! నీవున్నట్లైనచో పేదసాదలకు ఆధారము 

కల్పించితివేని అది నీకు పుణ్యమేకదా. వారిచేత నీవేకదా గౌరవింపఁబడుదువు

రామా దయతో మమ్ము కాపాడుమయ్యా అనుచు పేదలు నిన్ను 

ప్రార్థించుచున్నను నీవు చూడవుకదా. ఇది నీకు సముచితమగునాయేమి?

విధముగ చేసిన నీకు పాపమంటదా? రమారమణా! నీవు అట్టి వారిపై 

ప్రేమను చూపుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.