గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, సెప్టెంబర్ 2008, మంగళవారం

శరన్నవరాత్రులను గూర్చిన కవితలకాహ్వానం

0 comments

"శరన్నవరాత్రులను గూర్చిన కవితలకాహ్వానం "
ప్రియ భగవద్ బన్ధువులారా ! వందనములు. శరన్నవరాత్రులలో మన ముంగిట కొలువై యుండెడి మన తల్లి దుర్గమ్మ
రోజు కొక స్వరూపంతో నలంకరింప బడడంలో గల ఆంతర్యం చదువరుల హృదయాలకు హత్తుకోనేలాగ ధ్వని ప్రధానంగా
పద్యాలలో ఆ యమ్మ ప్రత్యక్షం అవుతోందా అన్నట్లు వ్రాసి పంపగలందులకు మిమ్ములను ఆహ్వానిస్తున్నాను.

సీ:-శ్రీమన్ మహాభారతిన్ మానసంబందు-చింతించి పద్యాలు శ్రీకరముగ
వ్రాయంగ బూనుండు. ధ్యేయంబుపై చిత్త -మున్ నిల్పి శ్రీదుర్గ ముచ్చటలను
మీ భావనా లోకమున్ భక్తితో నిల్పి - మీ జ్ఞానమున్ జేర్చి,మేల్తరముగ
నాయమ్మ మాహాత్మ్య మాశ్చర్య మున్ గొల్ప- కావ్యాత్మ సంధించి ఘనతరముగ
గీ:-పద్యముల్ వ్రాసి పంపుడు ప్రతిభ జూప.
సద్యశంబును గనుడయ్య సహజ కవులు.
ఆంధ్ర కావ్యాత్మ ధ్వని యంచు నలర జేసి,
భక్తి నాంధ్రామృతంబిట్లు పంచుడయ్య !
సద్ విధేయుడు
చింతా రామ కృష్ణా రావు

28, సెప్టెంబర్ 2008, ఆదివారం

అన్నమాచార్య సంగీత పీఠం చోడవరం లో జాషువా సంస్మరణ సభ.

0 comments
శ్రీ గుఱ్ఱం జాషువా మహాకవి 28-9-1895వ తేదీన వినుకొండలో జన్మించారు.
తల్లిదండ్రులు :-లింగమాంబ, వీరయ్య.
రచనలు:-ఈయన రచించిన 7 ఖండ కావ్యాల్లో 200కు పైగా ఖండికలున్నాయి.అందు ముఖ్యమైనవి గబ్బిలము, పిరదౌసి, స్వప్నకథ, కొత్తలోకము, నేతాజీ, బాపూజీ, ముసాఫరులు, ముంతాజ్మహల్, కాందిశీకుడు, నాకథ, స్వయంవరం, రాష్ట్రపూజ, నాగార్జునసాగర్, క్రీస్తుచరిత్ర.
నవలికలలో చిన్ననాయకుడు.
నాటకాల్లో ధ్రువవిజయము, హిమదమార్కపరిణయము, చిదానందప్రభాతము, రుక్మిణీకల్యాణము, మీరాబాయి, తెరచాటు మొదలగునవి.
బిరుదులు:-నవయుగకవిచక్రవర్తి, కవికోకిల, మధురశ్రీనాధ, పద్మశ్రీ, కవితావిశారద, కవిదిగ్గజ, పద్మవిభూషణ, కళాప్రపూర్ణ. మొదలగు పెక్కులు గలవు.
సత్కారములు:-కనకాభిషేకము, గండపెడెరసత్కారము, పగలు దివిటీల మధ్య ఏనుగు అంబారీపై ఊరేగింపు మొదలగునవి.
ఈతని ప్రశస్థ ఖండ కావ్యము:- గబ్బిలము.
ఈరోజు జాషువా 113వ జయంతిని ఆంధ్ర పండితలోకం ఘనంగా జరుపుకొనివుంటుంది..
విశాఖపట్టణం జిల్లా, చోడవరం గ్రామంలో శ్రీ అన్నమాచార్య సంగీత పీఠం
నిర్వాహకులు శ్రీమతి సుబ్బ లక్ష్మి అక్కయ్య గారి ఆధ్వర్యవంలో అత్యద్భుతంగా యీ కార్యక్రమం జరిగింది. పలు దూర ప్రాంతాలనుండి కూడా పండితులు, కవితాపిపాస గలవారు వచ్చి పాల్గొన్నారు.
అపర గాంధీగా పేరు గడించిన శ్రీ దేవరపల్లి సన్యాసిరావుగారు మొదలుకొని డిగ్రీ చదువుతున్న విద్యార్థుల వరకు యీ కర్యక్రమంలో పాల్గొని కవితాగోష్టిలో పాలు పంచుకోవడం విశేషం. గుఱ్ఱం జాషువా కవిహృదయం సాక్షాత్కరింపజేశారు.
ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయినిగా బిరుదు పొందిన శ్రీమతి వి. గాయత్రి గారిని ఈ సంస్థ ఘనంగా సత్కరించింది. ఇట్టి కార్యక్రమాలు మనలోని చైతన్యాన్ని వెలికి తీస్తాయి. విద్యార్థిని రేవతి కూడా గోష్తిలో పాల్గొని అందరి మెప్పులూ పొందింది.
ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం ద్వార మహాకవుల రచనలలోని కవితా విశేషాలను తెలుసుకోవడమే కాక తద్వార ఉత్తేజాన్ని పొంది మనం కూడా మంచి కవిత్వం ద్వరా సమాజాభివృధికి తోడ్పడినవారమవుతాం.
మీ ప్రాంతంలో జరుపుకొనిన ఉత్సవాల్ని మాకు తెలియజేస్తే ఆంధ్రామృతం ద్వార పాఠక లోకానికి అందిచడానికి మాకు అవకాశంకల్పించినవారవుతారు.
నమస్తే
చింతా రామ కృష్ణా రావు.

23, సెప్టెంబర్ 2008, మంగళవారం

సర్వశిద్ధి రాయవరం గ్రామంలో గురజాడ 147 వ జయంతి

0 comments21-9-2008వ తేదీన సర్వసిద్ధి రాయవరం గ్రామంలో " ఉన్నత పాఠ శాల ప్రాత విద్యార్థి సంఘం మరియు ఫ్రెండ్స్ & ఫ్రెండ్స్" సంస్థల ఆధ్వర్యవంలో శ్రీ గురజాడ వెంకటప్పారావు 147వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖపట్ణం జిల్లాలో పలు గ్రామాలలో యీ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు.
యస్.రాయవరం గ్రామంలో జరిగిన సభలో ప్రముఖ విద్యావేత్త శ్రీ ప్రాత రాజశేఖర్ ప్రసంగించారు.ఈనాటి సమాజాన్ని 100 సంవత్సరాలక్రితం ఆనాడే గురజాడ గుర్తించి, దేశమును ప్రేమించుమన్నా అని ఉద్బోధిస్తూ వ్రాసిన దేశభక్తి గీతం మనకందించారన్నారు. అతని ముత్యాల సరాలలోని, కన్యాశుల్కంలోని,సామాజిక స్పృహను, సంభాషణ లోని చమత్కారాల్ని, వివరించి చెప్పి, పండిత పామరులను రంజింపజేశారు.శ్రీమతి వి.గాయత్రి, మున్నగు ప్రముఖులు తమ ప్రసంగాలతొ శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశారు.
అన్నిటికీ మించి యీ కార్యక్రమ నిర్వాహకులు అనేకమందిపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయదంతో పాటు, నిరుపేద మహిళలకు కుట్టు మిషనులందజేశారు.కారణ మేదైనా జరిపిన కార్యం మాత్రం అందరికీ హర్షణీయమే కదా! జైహింద్.

22, సెప్టెంబర్ 2008, సోమవారం

గుర్రం జాషువా కవితా వైభవము.

0 comments

28-9-2008 వ తేదీన చోడవరం గ్రామంలో శ్రీ అన్నమాచార్య సంగీత పీఠం ఆధ్వర్యవంలో " గుఱ్ఱం జాషువా" కవితా వైభవం గూర్చి చర్చించ బడును. శ్రీమతి మంగిపూడి సుబ్బలక్ష్మి వారి నివాస గృహంలో జరుపబడును. ఆసక్తి గల వారు తమ విశిష్ట వ్యాసములను ఆంధ్రామృతమునకు పంపినచో మీ తరపున చదువ బడును. ప్రతిభా పాటవాలు గలవారు నిర్వీర్యం కారాదు. అశ్రద్ధ చేయక తప్పక పంప గలరు.
చింతా రామ కృష్ణా రావు.

17, సెప్టెంబర్ 2008, బుధవారం

వర్దిపర్తి కోనకవి.

0 comments

వర్దిపర్తి కొనమరాట్ కవీంద్రుఁడిది సర్వసిద్ది గ్రామం.నెల్లూరు నెరజాణల కొంటె ప్రశ్నలకు తుంటరి సమాధానం చెప్పిన ఉద్దనులు ౧౯ వ శతాబ్దంనాటి సర్వసిద్ధి వాస్తవ్యులు. కవీంద్రుని సమాధానాలకి అచ్చెరువొందిన ఆ కాన్తామనులు ఒక మెట్టు దిగి, " సర్వసిద్ధి సరసులకు నెల్లూరు నేరజాణలు దాసోహం " అనిరి. అంతటి మహాకవి అంటే కాదు మహిమాన్విత కవి కూడా. ఈ కవి వేంకటేశ్వరోపాఖ్యానం, మహాలక్ష్మీ పరిణయం, మున్నగు గ్రంధాలు రచించాడు. ఇతని పెక్కు చాటువులు ఇప్పటికీ ఆ గ్రామంలోప్రజల నాల్కలపై నాట్యమాడుచుండుట విశేషం.
ఇతడు పెక్కు రచనలు చేసియుండెను. వీరు తమ రచనలలో చిత్ర కవితలు కూడా వెలయించి యుండిరి.

ఇతడు రచించిన ప్రశ్నోత్తర గూఢ చిత్ర రచనకు ఉదాహరణముగా ఇతడు రచించిన శ్రీ మహాలక్ష్మీ పరిణయం కావ్యం లోంచి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకొందాం.
క్షీర సముద్రుడు తన కుమార్తె వివాహానికి రమ్మని తనకు కాబోయే అల్లుడయిన
శ్రీమహావిష్ణువుకి ఆహ్వానం పంపుతూ శుభలేఖలో ఇలా వ్రాస్తాడు.
సీ:-
త్స్య స్వరూపక! నుజ కంఠీరవ! పురుషోత్తమ! త్రిశూల ధర ధనుర్వి
భంగ! కాకాసుర భంజన! విశ్వాత్మ! వామన! రి! మురవైరి! రక
శిక్ష! కుచేల సమ్రక్షక! ర్వజ్ఞ ! రిహయనుత! క్ర హస్త! ఘుకు
లాధిప! ర్వంసహాధీశ! మేఘ సన్నిభ గాత్ర! పనాబ్జ నేత్ర! మునిజ
గీ:-నాభి వందిత! గాధేయ యజ్ఞ పాల! రావణాంతక! శ్రీ యాది దేవ! యనుచు
బ్రతి పద ప్రథమాక్షర పంక్తి సంజ్ఞ తెలియగా వ్రాసె.శుభ లేఖ జలధి విభుడు.
తాత్పర్యం సుబోధకమేగదా!
" మమ పుత్రికా వివాహమునకు సహచర సమేతముగా రా ! శ్రీ యాది దేవ!  "
ఎంత చమత్కారంగా శుభలేఖ వ్రాయించాడో కవి చూచారా! ఇతని కావ్యాలన్నీకూడా చమత్కారాల సమాహారంగా చెప్పవచ్చు. సమయం చిక్కినప్పుడు మరో పద్యం గ్రహిచుదాం.
నమస్తే.

16, సెప్టెంబర్ 2008, మంగళవారం

"మాసే మాసే కవన విజయం."

0 comments

"మాసే మాసే కవన విజయం."
ఆంధ్రామృతాస్వాదనా తత్పరులారా ! అపరిమితానందాన్నందించే ఆంధ్ర భాషామతల్లి మీద కవి పండిత గాయకాళికి ఎనలేని మక్కువ. అమృతోపమయిన మన భాష, సంప్రదాయాలు ,జగజ్జేగీయమానంగా విరాజిల్లాలంటే మన వంతు కృషి మనం చేయాలి.
ప్రతీ నెలా మొదటి ఆదివారం మనకు అవకాశం కల్పించుకొని పదిమందీ ఓక చోట చేరి మరో పదిమందిని చేర్పించి గోష్టీ కార్యక్రమం నిర్వహంచడం , ప్రముఖ కావ్యాలనుగూర్చి, ప్రముఖ కవులను గూర్చి, చర్చా కార్యక్రమం నిర్వహించడం లాంటివి తప్పక చేయాలి. వండేటప్పుడు అన్నమైనా కలపకపోతే అడుగంటిపోతుందికదా! భాష విషయంలో కూడా అంతే.
విశాఖ జిల్లా పద్య కవితా సదస్సు " ఉప్మాక " గ్రామంలో 14-9-2008వ తేదీన జరింది. అంధ్ర రాష్ట్ర పద్యకవితా శాఖ అధ్యక్షులు శ్రీ కేశాప్రగడ సత్యనారాయణ గారు " పోతన భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానం " వివరించి చెప్పారు.
అనేకమంది కవులు " కలియుగ దైవం " అనే అంశంపై స్వీయ రచనలను వినిపించారు.జిల్లాపద్యకవితాధ్యక్షులు శ్రీ కొట్టే కోటారావు, డా. ఎం. వెంకటేశ్వరరావు. శ్రీమతి గాయత్రి,డా. యల్లెస్వైవి శర్మ మున్నగు కవి పండితులే కాక శ్రీ దేవరపల్లి సన్యాసి రావు వంటి స్వాతంత్ర్య సమర యోధులు కూడా పాల్గొన్నారు. అక్కడ నాకయితే తెలుగు భాషామతల్లికి వసంతోత్సవం జరుపుతున్నట్లనిపించింది. సుమారు 3 గంటలు జరిగింది. ఇదంతా ఎందుకు చెప్పుతున్నానంటే భాషాభిమానులు అంతా ఇలాంటి కార్యక్రమాల్ని జరుపవలసిన అవసరం ఎంతైనావుంది.
మీరు చేస్తున్న ప్రయత్నానికి ఈ నామాటలు ప్రోత్సాహాన్నిస్తాయని నమ్ముతున్నాను.
జై హింద్.
చింతా రామ కృష్నా రావు.
{ఆంధ్రామృతం బ్లాగ్}

జయ భారత మాతా! {దేశ భక్తి గీతం.}

0 comments
భారత మాతా ! జయ భారత మాతా !
శ్రీకర శుభకర గురుతర భగ్యవిధాతా భారత:::::: !

కథా కథన విధులలోన నిధి యని ధర పేరు గన్న
హరి కథకుడు ఆదిభట్ల నారాయణు గన్న తల్లి! భారత ::::::::: !

అధునాతన భావ కవితనందించిన గురజాడను
బహుముఖ ప్రజ్ఞాన్వితకవి విశ్వ నాధు గన్న తల్లి. భారత::::::: !

సంఘంబున క్రుళ్ళు బాప సద్రచనలు నవలలోన
రయమున వెలయించిన వీరేశలింగమును కంటివి. భారత ::::::: !

నీమహిమ యనన్యమమ్మ నీశక్తి యసాధ్యమమ్మ.
నీ కడుపున జన్మింపగనీయుమమ్మ యెన్నటికిని. భారత:::::::!

రచన:చింతా. రామకృష్ణా రావు.


12, సెప్టెంబర్ 2008, శుక్రవారం

నిన్నటి సమస్యాపూరణలో చిన్న మార్పు

0 comments

నిన్న నేనిచ్చిన సమస్యా పూరణలో చిన్న మార్పు. గమనించ గలరు.
సమస్య:-
శా :- ___రామా యన బూతు మాట యనుచున్ కాంతా మణుల్ తిట్టిరే.
నా పూరణ చూస్తారా?
శా:- చేరెన్ భక్తుడటంచు నమ్మి ముదితల్. శ్రీ కృష్ణ! శ్రీ పాండు రం
గా! రామా! యన. బూతు మాట యనుచున్ కాంతామణుల్ కొట్టి రే
తీరున్ బల్కగ రాని దౌష్ట్యములతో తిట్టన్. నిజంబే కదా!
చేరున్ సద్గుణు, భక్తి గొల్చు. చఱచున్. చీల్చున్ దురాత్మున్ బ్రజల్.

11, సెప్టెంబర్ 2008, గురువారం

సమస్యా పూరణ

1 comments

పాఠక శ్రేష్టులకు వందనాలు. తెలుగు పద్యాలలో గల మాధుర్యం మీ రచనలో కూడా చూడాలని వుండి.మీరు కూడా తప్పక ప్రయత్నించి పద్యం వ్రాస్తారనే గమ్పె డాశతోనున్నాను. మన ప్రయత్నానికో సమస్యాపూరణ.
శా:-__రామాయన బూతు మాట యనుచున్ కాంతల్ ప్రకోపించిరే! తప్పక ప్రయత్నించి పద్య పూరణ చేస్తారు కదూ?
నేనుకూడా యత్నిస్తాను. " యత్నే కృతే యది న సిద్ధ్యతి కో2త్ర దోషః ?మళ్ళీ కలుసుకొందాం. నమస్తే.
చింతా రామ కృష్ణా రావు .

10, సెప్టెంబర్ 2008, బుధవారం

వినాయక వర్ణన చేయండి.

1 comments

సర స్వతీ నమస్తుభ్యం.
సరస్వతీ మూర్తులు, పుంభావ సరస్వతీ మూర్తులు పెక్కురున్నారు. ఆంద్ర భాషామతల్లి సేవలోపునీతులవుతున్నారు.
వారిని చుసి మనం ఉప్పంగిపోతాం. మనకీ అనిపిస్తుంది వారిలాగా మాతాదాలనీ, వారిలాగా పద్యాలు వ్రాయాలని. .
" సాధనమున పనులు సమకూరు ధరలోన " అన్న వేమన పలుకు మనకి తెలియంది కాదు.ఐతే ప్రయత్నం చేయకుండా ఏదీ సాధ్యం కాదు. మనమూ ప్రయత్నిద్దాం.
ముందుగా కొన్ని అనుసరణీయాంశాలు. :-మనకి గద్యనయినా పద్యాన్నయినా అర్థస్ఫురణ కలిగేటట్టు చదువ గలగాలి.
ఆతరువాత సాధ్యమయినన్ని ఎక్కువ పద్యాలు చదవాలి. ఏ ఛందస్సులో వ్రాయాలనుకుంటే ఆ ఛందస్సులో గల పద్యాలు చదివినట్లయితే ఆ ఛందస్సులో సులభంగా వ్రాయవచ్చు. ప్రయత్నించి చూడండి.
నేటి మీ ప్రయత్నానికి నాన్డి పలుకుతారా ! ఐతే వినాయక నవరాత్రులు సందర్భంగా మనం వినాయకుని వర్ణిస్తూ మీకు వచ్చిన ఛందంలో వ్రాసి పోస్టు చేయండి.. ఎదురుచూడనామరి?
నేటి విషయం వినాయక వర్ణన నిర్విఘ్నమస్తు.
చింతా రామ కృష్ణా రావు. .

9, సెప్టెంబర్ 2008, మంగళవారం

గురజాడ అ(గి)డుగు జాడ .

0 comments

నమస్తే. రాబోతున్న 21-9-2008 తేదీనే గురజాడ జయంతి. జయంతి సందర్భంగా అతని జన్మ స్థలమైన సర్వసిద్ధిరాయవారంలో అతని జయన్తివేడుకలు జరుపుతున్నాం. ప్రజా కవి స్ఫూర్తితో మనం కూడా మన రచనలతో గురజాడ అడుగు జాడలలో నడిచే వారికి ప్రోత్సాహాన్నిద్దాం. " ఆధునిక కవితా వైతాళికుడు " మన గురజాడ.
ప్రాచీన సంప్రదాయానువర్తులు గేయాల్ని సంప్రదాయవిరుద్ధ రచనలుగా గణించి ఆదరిమ్పకున్దురుగాక. యదార్థానికి ప్రాచీన గ్రంధస్థ భాష పంచదార పానకంలాగా పరిమిత ప్రయోజనం కలది. వాడుక భాష మంచినీరులాగా బహుళ ప్రయోజనం కలది. సత్యాన్ని గ్రహించారు కాబట్టే గిడుగు, గురజాడ మున్నగువారు వ్యావహారిక భాషా ఉద్యమానికి నడుం కట్టారు.కృతకృత్యులయ్యారు. అలాగని వారు ఛందో బాహ్యంగా కవితలు చేసారనుకోవడం సరికాదేమో. గురజాడ గేయాలలో మాత్రా ఛందస్సు గోచరిస్తుంది. " దేశమును ప్రేమించుమన్నా.....మంచి అన్నది పెంచుమన్నా...... వట్టి మాటలు కట్టిపెట్టోయ్....... గట్టి మేల్ తలపెట్టవోయ్. ఇది పరిశీలిస్తే లయ బద్ధమయిన మాత్రా బద్ధత కనిపిస్తుంది. ఇది ఛందో బద్ధం కాదని యెలాగనగలమ్?దీనిని సంప్రదాయచందాల్లో " మత్తకోకిల " తో తైపారువేసి చూసుకోవచ్చు. .......
మత్త :-పుట్టి పుట్టడు నేడు దొంగిల బోయి మాయిలు సొచ్చి తా
నుట్టి యందక రోళ్ళు పీటల నొక్క ప్రోవిడి యెక్కి చే
పెట్టజాలక కుండక్రిందొక పెద్ద తూటొనరించి మీ
పట్టి మీగడ పాలు చేరల పట్టి ద్రావె తలోదరీ. ....................ఇది భాగవతం లోని పద్యం. ...కొంచం పరిశీలించి చుడండి. అంట వరకు ఎందుకు. ఛందో నిబద్దం కాని లేదా మాత్రానిబద్ధం కాని కవితలు ప్రజల నాల్కలమీద నర్తన రకంగా చేయగలవు? అంటే వాడుక భాషోద్యమం ఛందస్సుకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం కాదని, వాడుక భాషను బహుళ ప్రయోజనాన్ని ఆశించి నడిపిన ఉద్యమమని అనుకో వచ్చునేమో. .........అటు ప్రాచీనులకు విరుద్ధం కాని, ఇటు వ్యావహారిక విరుద్ధం కాని విధంగా వ్యవహారిక ఛందో బద్ధ కవిత్వం సముచితమనిపిస్తోంది. మరి మీరేమంటారు?
గురజాడ రచనల స్ఫూర్తితో వెలువడే మీ రచనలకై నేనెదురు చూడనా?మళ్ళీ కలుసుకొందాం. నమస్తే.
చింతా రామ కృష్ణా రావు.
ఆంధ్రామృతం.

8, సెప్టెంబర్ 2008, సోమవారం

21-9- 2008 గురజాడ147 వ జయంతి.

0 comments

గురజాడ వేంకట అప్పారావు
21-9-1862 -నుండి-30-11-1915

సీ:-ఆంధ్రామృతము గ్రోలనాసక్తి తో నున్న
అంధ్రులార! సుగుణ సాంద్రులార!
భువి సర్వసిద్ధిరాయవరము గ్రామాన
మాతామహులయింట మానితముగ
ప్రఖ్యాతమైనట్టి పద్ధెందివందల
యరువదిరెండులో నాంధ్రులలర
స్థిరముగ సెప్టెంబ రిరువ దొకటి నాడు
ప్రజల కవి గురజాడ జనియించె.
గీ:-ప్రజల భాషకు సాహితీ ప్రతిభ గొలిపె.
సంఘ సంస్కర్తగా పేరు సంతరించె.
మనము గురజాడ పుట్టిన దినమునాడు
గేయ కవితలనంజలి చేయ దగును.RAAGA - Telugu Devotional Songs

0 comments

telugu devotional geet mala

అక్షరాస్యత.

1 comments

తేది.౦౮-౮-౨౦౦౮.ఈ రోజును ప్రపంచ అక్షరాస్యతా దినంగా జరుపుకొంటున్న విషయం మనకు తెలియనిది కాదు. దాని
ప్రయోజనాన్ని గూర్చి ఆలోచించవలసిన అవసరం ఎంతైనావుంది.
క్షరము అంటే నాశనము. అక్షరము అంటే నాశనము లేనిది అని అర్థం. అక్షర స్వరూపుడు ఒక్క పరమాత్మమాత్రమే.క్షయమైపోయే ఈ దేహంలో అక్షయ స్వరూపుడగు పరమాత్మ స్థిరుడైయున్నాడు. ఆ పరమాత్మను చూడాలి అనుకొంటే జ్ఞాన చక్షువుతోనే సాధ్యం.ఆ అన్తఃచక్షువు తెరుచుకోవాలి అనుకొంటే బాహ్య చక్షువులనే ఆధారం చేసుకోవాలి.ముఖే ముఖే సరస్వతీ అన్నారు కదా! అలాంటప్పుడు అందరినీ కలిసి విద్య ఎలా సంపాదించగలం? ఒక్క లిపి ద్వారామాత్రమే సాధ్యం . అందుకే ఇహ పర జ్ఞానం పొందాలి అంటే అది అక్షరాస్యత వల్ల మాత్రమే సాధ్యం.మనకు తెలిసిన భాషలో ఆభాషాక్షరాలు సరిపోతాయి. ఐతే ప్రపంచంలో అనేక భాషలున్నాయి. ఉద్గ్రన్థాలూ వున్నాయి. అన్ని భాశలూ నేర్చుకోలేము కాని సంస్కృతం మనం నేర్చుకోడానికి ప్రయత్నిస్తే మిగిలిన భాషలు సులభ తర మవతాయి. కంప్యూటర్
పరిజ్ఞానం కుడా అత్యవసరం. ముందు అక్షర జ్ఞానం సంపాదించి, పిదప ఒక్కొక్కరు ఒక్కొక్కరిని అక్షరాస్యులను చేద్దాం.
క:-అక్షయ జ్ఞానామృతమది
అక్షర జ్ఞానంబుతోడనద్భుత ఫణితిన్
కుక్షిని నిలుచును గదయ్య!
శిక్షణ గొని నేర్పుడయ్య క్షేమము గొలుపన్.

చింతా రామ కృష్ణారావు .

7, సెప్టెంబర్ 2008, ఆదివారం

సంగీత సాహిత్యాలు.కవి పండిత గాయకాళి.

0 comments

సనాతన సంప్రదాయాలకు సంగీత సాహిత్యాలకు మనం వారసులం. మన పూర్వీకులైన మహర్షులు, కవులు, ఎంతో శ్రమించి వ్రాసిన వారి కావ్యాలలో నిక్షిప్తంచేసిమనకందించారు.
ఆ గ్రంథాలను చదవడం ద్వారా మన విజ్ఞానాన్ని పెంపొందించుకోవడమే కాక మనల్ని మనం సంస్కరించుకొంటున్నాం. ఐతే కాలక్రమేణా సమయాభావం వల్లనైతేనేమి అలసత్వం వల్లనైతేనేమి నేర్పే దక్షడులేకపోవడం వల్ల నైతేనేమి ఆనాటి సంగీత సాహిత్యాలు, నృత్యాలు మృగ్యమైపోతున్నాయి .ఇలాంటి సమయంలో వాటిలోని జీవ కళను వెలికి తీసేందుకు ఎందరో మహాను భావులు పరిశ్రమించడం మనకు కనిపిస్తుంది. వారిచే నెలకొల్పబడిన సంగీత పీఠాలు సాహిత్య పీఠాలు నెలకొల్పబడటం మనం చూస్తూనే వున్నాం. అలాంటి దే విశాఖపట్టణం జిల్లా చోడవరం లో శ్రీమతి మంగిపూడి సుబ్బలక్ష్మి గారు నెలకొల్పిన శ్రీ అన్నమాచార్య సంగీత పీఠమ్. ఈ సంస్థ గత సంవత్సరం నెలకొల్పబడింది.ఈ సంస్థలో ప్రతి ఆఖారి ఆదివారం ప్రాచిన, ఆధునిక కవులలో ఒక రిద్దరిని గూర్చి వారి కవితా విశేషా లను గూర్చీ గోష్టీ కార్యక్రమం జరుపుతున్నారు. ౩౧-౮-౨౦౦౮ వ తేదిన కవయిత్రి మొల్ల ,ముద్దుపళని లను గూర్చి పలు అంశాలు చర్చించి కవయిత్రులు నిక్షిప్తం చేసిన కవితామృతాన్ని తెల్లం జేశారు .మొల్ల చెప్పిన ఒక పద్యం చూడండి .
ఆ:-తేనె సోక నోరు తీయన యగురీతి - తోడ నర్థమెల్ల తోచకున్న
గూఢ శబ్దములను కూర్చెడి కవితలు - మూగ చెమిటి వారి ముచ్చటగును .
చూచారా! ఎంతటి తేట తెలుగు పదాలలో ఎంతటి తీయని భావం వుందో .
సాహితీ చర్చా గోష్టి మనలోని అంతర్గత శక్తులను వెలికి తీసి మన లో గల సత్ సంప్రదాయ పరిమళాలను వెలువరించి గుబాళింప జేస్తాయి .
సంగీత సాహిత్యాలు రెంటినీ హస్తగతం చేసుకొన్న పూజ్యురాలు శ్రీమతి మంగిపూడి సుబ్బలక్ష్మిలాగా సంగీత సాహితి వేత్తలు వాటి అభివ్రుద్దకి కృషి చేస్తుంటే మన " ఆంధ్రామృతం "దాస దిశలా అందరికీ ఆనందామృత మౌతుంది.
ఆ:-అమృత భావాల నెలవైన యాంధృలార !
అష్ట కష్టాలలోనేల యలమటింప?
అమృత భావాలు కవితలి యలరజేయ
యత్నమోనరించి వ్రాయుడు నూత్న గతుల.
నమస్తే.
చింతా రామ కృష్ణ రావు.
ఆంధ్రామృతం.

6, సెప్టెంబర్ 2008, శనివారం

ఉపాధ్యాయ దినోత్సవం

1 comments


ఉపాధ్యాయ
దినోత్సవం చాలా బాగా జరు పుకున్నారను కుంటాను . విద్యార్థుల భక్తిప్రపట్టులు ఉపాధ్యాయలోకాన్ని మంత్రముగ్ధులనుచేయడంతోపాటు వారిపైగలగురుతర గుర్తుచేసినవి .డిగ్రీకళాశాల చోడవరమ్లో అద్భుతంగా జరిపారు.
ముఖ్యంగా యువ మైత్రీ సంఘం, చోడవరం వారు మండలం లోని ఒక 20 మంది ఉపాధ్యాయులకు చేసిన పూజ ఆ ఉపాధ్యాయుల కళ్ళల్లో ఆనంద భాష్పాలు తెప్పించింది. వేద మంత్రోచ్చారణతో స్వాగతం పలికి, ఉచితాసనంపై కూర్చోపెట్టి, సభకు వారిని పరిచయం చేసి, వారి పాదాలను పళ్ళెంలో పెట్టి కడిగి, దైవాన్ని పూజించిన విధంగా పూజించి, దుశ్ శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి సూత్ర ధారి ఆ సమస్త కార్య దర్శి శ్రీమాన్ రేజేటి నరసింహాచార్యులు.
ఐతే సత్కారాలను పొందిన ఉపాధ్యాయ వర్గం వారి యోగ్యతను ఎలా నిరుపించుకొంటారో వేచి చూద్దాం.
చ:-గురుతరమైన బాధ్యతలు గుర్తును చేయుచు, మిత్ర సంస్థ సద్
గురువులటంచు కొందరికి కూర్మిని సత్కృతి చేసినార లా
గురువులు సద్ గురూత్తములు , కోరి భజిమ్పగ బోలనన్,మహిన్
గురువుల వర్తనల్ కలిగి, గొప్పగ రాజిల కాంక్ష సేయుదున్.
ఇట్లు
చింతా రామ కృష్ణా రావ్

4, సెప్టెంబర్ 2008, గురువారం

దోషాపహారోత్పల మాల.

2 comments

ఉ:-వేగిర పాటు కొంతయును, దృష్టికి లోపమదోక్క కొంత," యీ
రోగపు నెట్టు నన్ను మది రోయగచేయు" నదొక్క కొంత, నా
బ్లాగును దోషపంకిలము లంటగ జేసెను. ఇంకపైన నే
వేగిరపాటు వీడి, కను విందగునట్లుగ వ్రాయ బూనెదన్. .
.

శ్రీ గురుభ్యో నమః

2 comments

ఉపాధ్యాయ ప్రపంచానికి వందనాలు. ఆదర్శ ఉపాధ్యాయ వర్గానికి అభినందనలు. ఈ వృత్తి చేపత్తడం నిజంగాపూర్వ జన్మ సుకృత విశేష ఫలం. నిజమైన ఉపాధ్యాయుడు కలి యుగం లో కృతయుగం సృష్తించగలడు. కృతయుగం లో కలి యుగాన్ని సృష్తించ గలవాళ్ళూ సమాజం లో మనకు కనిపిస్తూ ఉంటారు. ఒక్క మాటలో గలది గురుస్థానం. చెప్పాలంటే సృష్తిని శాసించగల వాదు ఒక్క ఉపాధ్యాయుడే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సాక్షాత్తు ఆ శ్రీ కృష్ణ పరమాత్మే సాందీపుడనే గురువుని ఆశ్రయించి విద్యార్దిగా చేరి చదువుకొన్నాడు కదా. అంతటి వైశిష్యం
ఏ వృత్తినైనా చేపట్టిన వ్యక్తి తద్ద్వారా పొందే ప్రతిఫలాన్ని దృష్తిలో పెట్టుకోకుండా చేపట్టిన వృత్తికి అంకిత భావంతో పని చేచేయాలి. ఒక కాపలా కాసే వ్యక్తే వున్నాడనుకొందాం. జీతంతో ముడీ పెట్టకుండా అహర్నిశలూ తాను కాపలా కాసే సంస్తను కంటికి రెప్పలా కాపలా కాస్తాడు.. అతడే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఆ స్సంస్థకు రక్షణ లేకుండా పోతుంది.అతని వల్ల ఆ సంస్త మాత్రమే నాశనమౌతుంది. కాని ఒక ఉపాధ్యాయుని నిర్లక్ష్యం ఎన్ని తరాలమీద ప్రభావం చూపుతుందో ఊహించుకుంటేనే భయమేస్తోంది.
అందరి పల్లల తల్లిదండ్రులూ ఉపాధ్యాయులమీద ఎనలేని నమ్మకంతో వారి పిల్లల్ని ఉపాధ్యాయుల కప్పగిస్తారు. అట్టి విద్యార్థులు ఉపాధ్యాయులకడ గదిపే ప్రతీక్షణం ఎంతోవిలువైంది.బాధ్యతా యుతంగా మెలిగేఅతని రుణం తీర్చుకోలేనిది. బాధ్యతారహితుడికి ఏ శిక్షైనా తక్కువె.
సద్గురువు రుణం తీర్చుకోగలిగేదికాదు. లసత్ గురువులకు, జ్ఞాన విలసత్గురువులకు పాదాభివందనం చేస్తుందీసమాజం. నమస్తే.

3, సెప్టెంబర్ 2008, బుధవారం

వినాయక ప్రసాద సిద్ధిరస్తు. పద్య కవితాభివృద్ధిరస్తూ. .

2 comments

ఉ:- సిద్ధి వినాయకున్ గొలిచి, క్షేమము నొందెడి మిత్రులార! మీ
శ్రద్ధకు, భక్తికిన్ మురిసి, సజ్జన సంగతి గూర్చు మీకు నీ
సిద్ధి వినాయకుండు. వరసిద్ధులు బొందుచు మీరలింక న
శ్రద్ధను వీడి పద్యములు చాలగ వ్రాసి, సుఖింపుడిమ్మహిన్. . .

1, సెప్టెంబర్ 2008, సోమవారం

పూజాఫలం

2 comments

చూస్తున్నాడు మన గణపతి విగ్రహాల రూపంలో ఎప్పుడు పీఠమ్ ఎక్కుదామా అని. ఒక్క ౨ రోజులాగాలేకపోతున్నాడు.ఔనుకదామరి. భక్తుల హృదయాల్లో ఇన్నాళ్ళూతిష్ట వేసుకొని ఇప్పుడు ప్రత్యక్షంగా పూజలన్దుకోవాలని ఆరాట పడుతున్నాడు.భక్త జన సన్దోహమ్ పడుతున్న ఆరాటం చూసి, తానూ తెగ ఆరాట పడి పోతున్నాడు. అసలీపండుగల్లోని పరమార్థం తెలుసుకొని ఎంతమంది ఈ వ్రతాన్ని చేసుకొంటున్నారు?
తే:-కారణము లేక ఏ పూజ కలుగ లేదు.
యత్న మొనరించి పూజల నరసి చేయ,
భక్తీ భావము తోఢ సన్ ముక్తి తోడ
ఆయురారోగ్య సౌభాగ్యమంద జేయు.
భక్తీ, శక్తి, ముక్తి, మనకి కలగాలంటే పూజలో చెప్పబడ్డ విధానాన్ని పూర్తిగా నిశితంగా అధ్యనం చెయ్యాలి. అప్పుడే మనం చేసే పూజల్లో గల పరమార్థం నెరవేరుతుంది. తెలుసుకొనే ప్రయత్నం తప్పక చెస్తారుకదూ?