గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

అన్నా కేశవ! మాధవా! నృహరి .... శ్రీమన్నారాయణ శతకము.. 4వ పద్యము .. రచన .. చింతా రామ కృష్ణారావు. గానం శ్రీమతి దోర్బల బాల సుజాత.

 జైశ్రీరామ్.

4. శా. అన్నా కేశవ! మాధవా! నృహరి! మోహాతీత! గోవింద! రా

మన్నా! కృష్ణుఁడ! వామనా! సకల ప్రేమాధార! విశ్వేశ! యే

మన్నన్ నీదు ప్రశస్తనామమగు. మోహాంధంబునే బాపు. శ్రీ

మన్నారాయణ! నీదు నామ మహిమన్ మమ్మున్ సుఖంబందనీ. 

భావము.

ఓ అన్నా. శ్రీమన్నారాయణా! కేశవా! మాధవా ! నరహరీ ! మోహాతీతుడా ! గోవిందుడా!

రామన్నా ! కృష్ణుడా! వామనా! సమస్తమైన ప్రేమాధారమైనవాడా! లోకేశా!

మేము ఏది పలికినప్పటికీ అది నీ యొక్క.పేరే యగును. మోహాంధకారమును

పోగొట్టును. నీ నామ మహీమచే మమ్ములను సుఖమునందనిమ్ము.

పోగొట్టెడివాడా. నీ నామ మహీమచే మమ్ములను సుఖమునందనిమ్ము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.