జైశ్రీరామ్.
81. ఓం వైశాఖ శుక్ల భూతోత్ధాయ నమః.
నవనందిని వృత్త గర్భ సీసము.
అనుపమానుఁడ! కమలాక్ష! నీ దయను క - మ్మని సుఖంబున్, పొంది మనఁగనుంటి.
హృదినున్న శ్రీ కమలేశ! నీ వలన గౌ - రవము కల్గున్ గదా! రమ్య చరిత!.
కుడిభుజంబై సుమకోమలా! మదిని చొ - క్కి మనవయ్యా! నీకు కేలు మోడ్తు.
ప్రఖ్యాతిగా సమ భావనన్ గనుమ చ - క్కఁగ మహాత్మా! కొల్తు గౌరవముఁగ.
గీ. కనగ నవనందినీ వృత్త ఘనుఁడ! నృహరి! - ఉర్వి *వైశాఖశుక్లభూతోత్థ*! రమణ!
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
81వ సీస గర్భస్థ నవనందిని వృత్తము. (స జ స న గగ .. యతి 9)
కమలాక్ష! నీదయను కమ్మని సుఖంబున్, - కమలేశ! నీ వలన గౌరవము, కల్గున్.
సుమకోమలా! మదిని చొక్కి మనవయ్యా! - సమ భావనన్ గనుమ చక్కఁగ మహాత్మా!
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నీయొక్క దయచేత చక్కనైన సుఖముతో మననుంటిని.
నా మదినున్న శ్రీపతీ! ఓ రమ్య చరితా! నీ వలన నాకు గౌరవము కలుగుచున్నది కదా. నవనందినీవృత్తరూప ఘనుడా! ఓ
వైశాఖశుక్లభూతోత్థ! రమణా!.! నీకు నమస్కరింతును. నాకు కుడిభుజంగా అన్నివిధాలా సహాయ పడుచు మనసులో
ఉండుము. సమభావనతో నన్ను ప్రఖ్యాతిగా చూడుము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.