గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, సెప్టెంబర్ 2010, బుధవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 104.

2 comments

శ్లోll
సత్యాను సారిణీ లక్ష్మీ - కీర్తి: త్యాగానుసారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా - బుద్ధి: కర్మాను సారిణీ.
గీll
లక్ష్మి సత్యానుసారిణి. లక్ష్మి లౌల్య. 
కీర్తి త్యాగానుసారిణి. క్షేమకరము. 
విద్య లభ్యాస ఫలములు ప్రీతి కరము.
బుద్ధి కర్మానుసారిణి పుడమిపైన.
భావము:-
లక్ష్మి నిత్యం సత్యాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగాన్ని అనుసరించి కీర్తి ఉంటుంది. ఎంతగా అభ్యాసం చేస్తే అంతగా విద్య పట్టువడుతుంది. మానవ బుద్ధి వారి కర్మను అనుసరించి ఉంటుంది. వాడి కర్మ ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది.
జైశ్రీరామ్.
జైహింద్.

28, సెప్టెంబర్ 2010, మంగళవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 103.

1 comments

శ్లోll
కృషితో నాస్తి దుర్భిక్షమ్ - జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి - నాస్తి జాగరతో భయమ్.
గీll
కృషిని చేసిన దుర్భిక్ష విషము తొలగు.
జపముఁ చేసిన పాతక చయము తొలగు.
మౌనముద్రను కలహంబు మాయమగును.
జాగ్రతన్భయ మొలయదు. సద్గుణాఢ్య!
భావము:-
వ్యవసాయము చేసినచో కఱవు ఉండదు. జపము చేసిన పాతకములుండవు. మౌనముగా నుండిన కలహము లుండవు. జాగ్రత్తగా నుండిన భయము ఉండదు.
జై శ్రీరామ్.
జైహింద్.

25, సెప్టెంబర్ 2010, శనివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 102.

1 comments

శ్లోll
క్షాంతిశ్చేత్ కవచేన కిం కిమరిభి: క్రోధో2స్తి చేద్దేహినాం,
ఙ్ఞాతిశ్చే దనలేన కిం యది సుహృద్దివ్యౌషధై: కిం ఫలం,
కిం సర్పైర్యది దుర్జనా: కిము ధనైద్విద్యా2నవద్యా
వ్రీడా చేత్ కిము భూషణై: సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్ ?
తే.గీll
క్షాంతి కలిగిన కవచంబుఁ గలుగ నేల?
కలుగ క్రోధము శత్రువు కలుగ నేల?
జ్ఞాతి కలిగిన యగ్నిని కలుగ నేల?
కలుగ సన్మిత్రు లౌషధి కలుగ నేల?
కలుగ దుష్టులు సర్పముల్ కలుగ నేల?
కలుగ సద్విద్య ధనములు కలుగ నేల?
కలుగ సిగ్గు సుభూషలు కలుగ నేల?
కవి జనాళికి రాజ్యంబు కలుగ నేల?
భావము:-
ఓర్పు కల వానికి వేరే కవచం అక్కర లేదు.
కోపం కల వానికి వేరే శత్రువులెవరూ ఉండనక్కర లేదు.
దాయాదులు ఉంటే వేరే అగ్ని అక్కర లేదు.
మంచి మిత్రులున్న వారికి వేరే గొప్ప ఔషధాలతో పని లేదు. 
దుష్టులు ఉండగా వేరే విష సర్పాలతో పని లేదు.
మంచి విద్య ఉన్న వారికి వేరే గొప్ప నిధులు అక్కర లేదు. 
లజ్జ కలిగిన వారికి వేరే ఆ భరణాలు అక్కర లేదు. 
కవితా శక్తి కల వారికి వేరే రాజ్య మక్కర లేదు. 
జైశ్రీరామ్.
జైహింద్.

17, సెప్టెంబర్ 2010, శుక్రవారం

శ్రీ వల్లభ వఝల నరసింహమూర్తి కవి కృత నక్షత్ర; శకట; షట్ గోపుర ద్వార బంధములు.

2 comments
ప్రియ పాఠక మహాశయులారా! 
శార్దూలమును నక్షత్ర బంధము చేసి; తదుపరి కందమును శకట బంధము చేసి; మరి యొక కందమును షడ్గోపుర ద్వార బంధము చేసిన కవి శార్దూలము మన శ్రీమాన్ వల్లభ వఝల నరసింహ మూర్తి సిద్ధాంతి కవి . 
వారి స్వ దస్తూరీతో మీకు చూపాలనే భావనతో యథా తథంగా మీ ముందుంచుతున్నందుకు ఆనందంగా ఉంది.
గుణ గ్రహణ పారీణులగు మీరు తప్పక రసాస్వాదన చేసి మీ ఆనందమును కవికి వ్యక్త పరచ గలరని ఆశించు చున్నాను.
జై శ్రీరాం.
జై హింద్.


11, సెప్టెంబర్ 2010, శనివారం

పాఠకాళికి వినాయక చతుర్థి శుభాకాంక్షలు.

3 comments

శ్రీకరమైన వినాయక చతుర్థి సందర్భముగా ఆంధ్రామృత పాఠకులకూ; యావత్సజ్జనాళికీ శుభాకాంక్షలు తెలియఁ జేస్తున్నాను.
జైహింద్.

10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

గణపతి పప్పా మోరియా !!!

0 commentsఅశ్వధాటి:-
శ్రీవిఘ్ననాయకుని; నా విఘ్న ఘాతకుని;   భావింతు నాదు మదిలో;
నేవిఘ్నముల్ గనక; సేవా ధురంధత  గావింపఁ జేయ కృతులన్; 
యావేశముల్; దురిత కావేశముల్ విడిచి; భావామృతంబు తొలకన్
జీవింపఁ జేయమని; సేవింపఁ జేయుమని; దేవీ సుతున్ గొలిచెదన్.
భావము:-
నాకు "సంభవించే విఘ్న వినాశకుఁ"డైన; మంగళ మూర్తి యైన విఘ్నేశ్వరుని  " నేను సేవా ధురంధరుఁడనై ఎట్టి విఘ్నములూ ఎదుర్కొనకుండా కృతులను గావింపఁ జేయ వలసినదిగా చేయుట కొఱకు "  నా మనస్సులో స్మరింతును. చెడ్డవైన ఆవేశ కావేశములు నా హృదయము నుండి విడిచిపెట్టి;  భావామృతము తొణికిసలాడు విధముగా జీవింపఁ జేయుమని ఆ పార్వతీదేవి సుతుడైన వినాయకుని కొలిచెదను. 
" భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయక చవితి సందర్భముగా " ఆంధ్రామృత పాఠకులందరికీ; సహృదయ భారతీయులందరికీ; నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.
జైగణేశా!
జైహింద్. 

6, సెప్టెంబర్ 2010, సోమవారం

డాll దేవగుప్తాపు సూర్య గణపతి రావు ఛత్ర బంధము.

1 comments

అత్యద్భుత విషయం ఏమిటంటే ప్రముఖ వైద్యులైన డా.సూర్య గణపతిరావు భిషగ్వరులే కాదు. ప్రముఖ కవి వరులు కూడా. ఈ విషయం పైన గల సీసపద్య గర్భిత ఛత్రబంధం తెలియఁ జేస్తుంది. 
వారికి అభినందనలు మరియు ధన్యవాదములు.
జైహింద్.

5, సెప్టెంబర్ 2010, ఆదివారం

సహృదయ పూజ్యులైన ఉపాధ్యాయు లందరికీ శుభాకాంక్షలు.

4 comments

Teachers' Day-1
సుజన మనోభిరామముగ శోభిల శిష్యుల తీర్చి దిద్దుచున్;
సృజనతఁ గొల్పు చుండి; గుణ శేముషి వెల్గ ప్రబోధఁ జేయుచున్;
ప్రజల హితంబునే వలచు ప్రాజ్ఞులు వెజ్జలు. వారి కెల్లెడన్
ప్రజల విశేష గౌరవము భక్తి ప్రపత్తులు గల్గు గావుతన్.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 
సహృదయ పూజ్యులైన ఉపాధ్యాయులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.
జై శ్రీరామ్.
జైహింద్.

2, సెప్టెంబర్ 2010, గురువారం

శ్రీ వల్లభ వఝల నరసింహ మూర్తి కవి గారి నక్షత్రబంధ త్రయము.

0 comments


జైశ్రీరామ్.
జైహింద్.

1, సెప్టెంబర్ 2010, బుధవారం

మానవాళికి జీవితానుభవ సారం.

1 comments

శ్లోll
క్షాంతిశ్చేత్ కవచేన కిం కిమరిభి: క్రోధో2స్తి చేద్దేహినాం,
ఙ్ఞాతిశ్చే దనలేన కిం యది సుహృద్దివ్యౌషధై: కిం ఫలం,
కిం సర్పైర్యది దుర్జనా: కిము ధనైద్విద్యా2నవద్యా
వ్రీడా చేత్ కిము భూషణై: సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్ ?
తే.గీll
క్షాంతి కలిగిన కవచంబుఁ గలుగ నేల?
కలుగ క్రోధము శత్రువు కలుగ నేల?
జ్ఞాతి కలిగిన యగ్నిని కలుగ నేల?
కలుగ సన్మిత్రు లౌషధి కలుగ నేల?
కలుగ దుష్టులు సర్పముల్ కలుగ నేల?
కలుగ సద్విద్య ధనములు కలుగ నేల?
కలుగ సిగ్గు సుభూషలు కలుగ నేల?
కవి జనాళికి రాజ్యంబు కలుగ నేల?
భావము:-
ఓర్పు కల వానికి వేరే కవచం అక్కర లేదు.
కోపం కల వానికి వేరే శత్రువులెవరూ ఉండనక్కర లేదు.
దాయాదులు ఉంటే వేరే అగ్ని అక్కర లేదు.
మంచి మిత్రులున్న వారికి వేరే గొప్ప ఔషధాలతో పని లేదు. 
దుష్టులు ఉండగా వేరే విష సర్పాలతో పని లేదు.
మంచి విద్య ఉన్న వారికి వేరే గొప్ప నిధులు అక్కర లేదు. 
లజ్జ కలిగిన వారికి వేరే ఆ భరణాలు అక్కర లేదు. 
కవితా శక్తి కల వారికి వేరే రాజ్య మక్కర లేదు. 
జైశ్రీరామ్.
జైహింద్.