గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఏప్రిల్ 2017, ఆదివారం

ప్రజ - పద్యమ్ ౧౯. శ్రీ మాచర్ల మల్లేష్

0 comments

జైశ్రీరామ్.
తే.గీ తాగుబోతులఁ గూర్చి సంతతముఁ దలచి
సుకవి మల్లేషు మనసున ప్రకటితమగు
భావ పరిపూర్ణ పద్యముల్ వరలఁ జెప్పె.
మందు మానుదురే దుర్మదాంధులిలను?
జైహింద్.

నేడు శ్రీ శ్రీ 107 వ జయంతి.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఈ రోజు స్వర్గీయ శ్రీరంగం శ్రీనివసరావు అంటే మన మహాకవి శ్రీశ్రీ గారి 107 వ పుట్టినరోజు.
ఈ మహానుభావునికి 1970 ఫిబ్రవరి 1 వ మరియు 2 వ తేదీలలో విశాఖపట్టణంలో ష్ష్టి పూర్తి మహోత్సవం చాలా ఘనంగా జరిగింది.  అప్పుడు నేను విజయనగరం ప్రభుత్వ మహారాజా సంస్కృత కళాశాలలో భాషాప్రవీణ మొదటి సంవత్సరం విద్యార్థిని. షష్టిపూర్తి సభకు నేనూ నా మిత్రులు పంతుల జోగారావు, మంగిపూడి వేంకటరమణమూర్తి, P.V.B.శ్రీరామమూర్తి, దువ్వూరి పేరయ సోమయాజులు, బగ్గాం రామజోగారావు ఇంకా కొంతమంది వెళ్ళాము.. కవిసమ్మేళనంలో ఆఖరున నాకూ పాల్గొనే అవకాశం ఇచ్చారు.
ఆనాటి కార్యక్రమ వివరాలు.
షష్టిపూర్తి మహోత్సవం వార్తను ముందుగా ప్రకటించిన ప్రజారథం పత్రిక (శ్రీభాట్టం శ్రీరామమూర్తి)
వేదికపై ప్రజాకవులనుద్దేశించి ప్రసంగిస్తున్న శ్రీశ్రీ.  
మహాసభ జరిగుటకు ముందు సభలో ఉన్న శ్రీశ్రీ తెన్నేటి విశ్వనథం, తాపీ ధర్మారావు,
కే.వీ.రామలక్ష్మి, తూమాటి దొణప్ప, పురిపండా అప్పలస్వామి,
 రాచకొండ విశ్వనాథ శస్త్రి, కాళోజీ, 
రమణారెడ్డి, గోరా శాస్త్రి, దిగంబర కవులు, వరవరరావు, 
వెల్చేరు నారాయణరావు, ఆరుద్ర, మున్నగు మహనీయులు.
తాపీ ధర్మారావు తెన్నేటి విశ్వనాథం లమధ్య నించున్నది నేనే.
ఆ నాటి సభ నాకు జీవితములో మరపునకు రాని మ్హా ఘట్టము.
ఈనాడు ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారిని స్మరించుకొంటూ నివాళి అర్పిస్తున్నాను.
జైహింద్.

29, ఏప్రిల్ 2017, శనివారం

ప్రజ - పద్యమ్ ౧౧. శ్రీ మల్లప్ప శశికాంత్. రైతు బాధలు.

0 comments

 జైశ్రీరామ్.
తే.గీ. మహిని రైతు బాధ మల్లప్ప వివరించె
బాధలన్ని బాసి మోదమలరఁ
జేయుటకును ప్రభుత శ్రీకారమును జుట్టి
రైతు సుఖము చూచి, ఖ్యాతిఁ గనుత.
జైహింద్.

నూతన ఛందములలో గర్భ కవిత 40. . . . రచన . . . శ్రీ వల్లభ

0 comments

  జైశ్రీరామ్.
జైహింద్.

28, ఏప్రిల్ 2017, శుక్రవారం

ప్రజ - పద్యమ్ ౧౪. శ్రీ మఠం శివకుమార్.

0 comments

 జైశ్రీరామ్.
తే.గీ. మఠము శివకుమారుని పద్య పఠనమునను
చదువు చింతన పెరుగును, మదులు వెలుఁగు
జీవనము పండు, సజ్జన సేవనెఱుఁగు,
ముక్తి మార్గము కననౌను, భుక్తియునిడు.
జైహింద్.

27, ఏప్రిల్ 2017, గురువారం

ఆచార్య వియల్లెన్ భీమశంకరం గారి శివానంద రామాయణంపై ఆచార్య మలయవాసినిగారి సమీక్ష.

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

పద్య పక్షమ్. ఛందస్సు. (1)

15 comments

జైశ్రీరామ్.

ఛందస్సు
ఓం శ్రీ గురుభ్యో నమః.
ఆర్యులకు నమస్సులు.
శా. శ్రీలన్ దేల్చు మనోజ్ఞ భారతిని సచ్చీలంబుతోఁ గొల్చుచున్,
శీలోత్ప్రేరక సత్ కవిత్వ పథమున్ చిత్తంబునం గాంచు,
చ్చీలోద్భాసిత సత్కవీంద్ర తతికిన్ చేతున్ ప్రణామంబులన్.
మీలోనొక్కడ నేను కూడ, కనుదున్ మీతోడ ఛందోద్గతిన్.

మనలో అనేకులకు కవితాసక్తి ఎంతగానో ఉన్న మాట నిజం.  ఐతే వ్రాసే ధైర్యం మాత్రం అంతగా ఉండకపోవచ్చును. దీనికి అనేకమైన కారణాలు. ముఖ్యంగా మనం ఎంతగా శిక్షణ పొందినప్పటికీ ఇంకా ఏదో లోపం ఉండి ఉంటుందేమో, దోషాలు ఎక్కడేనా వస్తాయేమోనన్న అనుమానం.
ఈ అనుమానాలు తీరుటకు మనకున్న మార్గం ఛందశ్శాస్త్రం ఏం చెప్పిందో అది తెలుసులోవడం ఒక్కటే. మనకు సగం ధైర్యం పుంజుకుంటుంది.
నేనైతే ఒక్కటే సూచిస్తాను. మీకు వ్రాయాలనుందా? వ్రాసేయండి. చూచేవారే మీకు అందులో ఉండే గుణదోషాలను చెప్పుతారు. తద్వారా మీరు సుశిక్షితులౌతారు.
నేను ఛందస్సునకు సంబంధించిన ప్రాథమికాంశాలను తెలుసుకొనే ప్రయత్నంతో ఉండి, తెలుసుకొన్నవి మీ ముందుంచితే తప్పులుంటే మీరే సూచిస్తారు కాబట్టి నేను నేర్చుకొనే సదవకాసం కలుగుతుంది. ఒప్పులే ఐతే తెలుసుకొనేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంక ఆ జగన్మాత దయ. పచ్చని పద్యాన్ని ప్రేమిద్దాం.

1. శ్రీకారము  కృత్యాదిని కలిగినచో దాని ప్రభావము.
క. శ్రీకారము కృత్యాదిని - బ్రాకటముగనున్నఁ జాలు - బహుదోషములం
బోకార్చి శుభము లొసఁగును - బ్రాకృతముగ నినుముసోఁకు - పరుసము భంగిన్‌. (సు.ల.సారము 189)
కావ్యాది వర్ణశుద్ధి
తే. ఆదిపద్యాది శ్రీకారమైన, దేవ -  వాచకంబైన నప్పుడు వఱలు సిరులు
నాది పద్యాది మూఁడు గణాక్షరములు - చూడవలెఁ గాని యన్నియుఁ జూడవలదు.  (సు.ల.సారము 195)
భావము సులభ గ్రాహ్యమే కదా?

2. కృతి రచనకుఁ బ్రశస్త వారములు
గీ. శుక్ర గురు బుధ వారముల్‌ - సొంపు సేయు - సోమవారంబు సంపదల్‌ - సొరిది నిచ్చు
శనియు మంగళవారముల్‌ - చావుదెచ్చు - భానువారంబు సంగరం - బమరఁ జేయు. (సు..సారము 269)

భావము. బుధ వారము, గురువారము, శుక్రవారము, కృతి యారంభించిన గ్రంథముమనోహరంబయి యుండును. సోమవారమునాడు ఆరంభించిన సంపద కలుగును.శనివారము, మంగళ వారము ఆరంభించిన మృతి సంభవము. ఆది వారము ఆరంభించిన కలహము సంభవించును
గురులఘువులు. 
మాత్రయన నొక్క లఘువగు ( I ) -  మాత్రలు రెండైన గురువు ( U ).
గురు లఘువుల స్వరూపము
క. వివిధముగఁ జాఁపి పలికెడు - నవియును మఱి యూఁదిపలుకు నవియును గురువుల్‌
భువి నిలిపి పలుకు వర్ణము - లవియెల్లను లఘువులయ్యె నంబుధి శయనా! (అనంతుని ఛందము)
వివరణము.
హ్రస్వములు అనగా ఒక్క లిప్త (సెకెను) కాలము మాత్రము పలుకఁబడే 
----- లు, అచ్చులతో కూడిన హల్లు వర్ణములు లఘువులు.                                                           
అంతకన్న ఎక్కువ కాలము పలుకఁబడు వర్ణములు గురువులు. 
ఆ ఈ ఊ ౠ ఏ ఓ మొదలగునవి.

ఐ.ఔ అనేఅచ్చులు, వీటిమ్ని కలిగి ఉన్న హల్లులు గురువులు. కైకలో కై గురువు. కౌరవులులో కౌ గురువు.

సున్న, విసర్గలతో కూడిన అచ్చులు హల్లులు గురువులు. 
అంకము లో సున్నతో కూడిన అ గురువు 
దుఃఖము లో విసర్గముతో కూడియున్న దు అనే అక్షరము గురువు.

ద్విత్వ, సంయుక్త పొల్లు అక్షరములకు ముందున్న అక్షరములు గురువులు. 
అక్కర లో క్క కు ముందున్న అ గురువు. 
అక్షరము లో క్షకు ముందున్న అ గురువు. 
అతనిన్ లో న్ అనే పొల్లుకు ముందున్న ని అను అక్షరము గురువు.
అల్పారంభః క్షేమ కరః అని పెద్దల నానుడి. కబట్టి ఇప్పటికి స్వస్తి.
జైహింద్.

కృతి రచనకుఁ బ్రశస్త వారములు.

0 comments

జైశ్రీరామ్,.
కృతి రచనకుఁ బ్రశస్త వారములు
గీ. శుక్ర - గురు - బుధ వారముల్‌ - సొంపు సేయు 
సోమవారంబు సంపదల్‌ - సొరిది నిచ్చు
శనియు మంగళవారముల్‌ - చావుదెచ్చు 
భానువారంబు సంగరం - బమరఁ జేయు.        
(సులక్షణసారము 269)

భావము. బుధ వారము, గురువారము, శుక్రవారము, కృతి యారంభించిన గ్రంథముమనోహరంబయి యుండును. సోమవారమునాడు ఆరంభించిన సంపద కలుగును.శనివారము, మంగళ వారము ఆరంభించిన మృతి సంభవము. ఆది వారము ఆరంభించిన కలహము సంభవించును.
జైహింద్.

ప్రజ - పద్యమ్ ౩౨. కవయిత్రి మంథా భానుమతి. బీదలకు విద్యావకాశాలు.

0 comments

 జైశ్రీరామ్.
ఉ. బాలల కష్టముల్ తెలుపు భానుమతీ కవితాప్రభావమున్
బాలకులెల్ల మారుత. ప్రవర్ధన పొందఁగ బాల కార్మికుల్,
చేలను కూలినాలికయి చేరినవారును, పాఠ శాలలన్
మేలగు విద్యలందఁగ సమిష్టిగ చేరుత. వృద్ధి పొందుతన్.
జైహింద్.

నూతన ఛందములలో గర్భ కవిత 39. . . . రచన . . . శ్రీ వల్లభ

0 comments

  జైశ్రీరామ్.
  జైహింద్.

26, ఏప్రిల్ 2017, బుధవారం

ప్రజ - పద్యమ్ ౨౬. శ్రీ భళ్ళమూడి శ్రీరామ శంకర ప్రసాద్.

0 comments

 జైశ్రీరామ్.
తే.గీ. భల్లమూడి సుకవి ప్రకృతి ధర్మమునిల్పి
లోకమెల్ల సుఖములో మునుంగ
వలయుననుచు తలచి పద్యముల్ వ్రాసిరి.
కవి వెలుంగుఁ గాత! ఘనతరముగ.
జైహింద్.

25, ఏప్రిల్ 2017, మంగళవారం

ప్రజ - పద్యమ్ ౧౨.కవయిత్రి బల్లూరి ఉమాదేవి. - ధనము.

0 comments

 జైశ్రీరామ్.
క. ధన సంపాదన వరమని.
ధనమును వెచ్చింప దాన ధర్మములందున్
ఘనమని ఉమ తెలిపిరి..మన
మనమున నిజమెంచి మసల మంచియె జరుగున్.
జైహింద్.

24, ఏప్రిల్ 2017, సోమవారం

ప్రజ - పద్యమ్ ౩. శ్రీ కొనకళ్ళ ఫణీంద్రరావు. ... పర్యావరణము.

0 comments

 జైశ్రీరామ్.
గీ. వ్యష్టి సంస్కార వాదము ప్రబలఁ జేసి.
పరిసరాదుల శుభ్రత వరలఁ జేయ
కంకణము కట్టె కొనకళ్ళ ఘనడు సుకవి.
తేటగీతుల రచనలో మేటి యనగ.
��.

గీ. వ్యష్టి సంస్కార వాదము ప్రబలఁ జేసి.
పరిసరాదుల శుభ్రత వరలఁ జేయ
కంకణము కట్టె కొనకళ్ళ ఘనడు సుకవి.
తేటగీతుల రచనలో మేటి యనగ.
��.

గీ. వ్యష్టి సంస్కార వాదము ప్రబలఁ జేసి.
పరిసరాదుల శుభ్రత వరలఁ జేయ
కంకణము కట్టె కొనకళ్ళ ఘనడు సుకవి.
తేటగీతుల రచనలో మేటి యనగ.
��.

గీ. వ్యష్టి సంస్కార వాదము ప్రబలఁ జేసి.
పరిసరాదుల శుభ్రత వరలఁ జేయ
కంకణము కట్టె కొనకళ్ళ ఘనడు సుకవి.
తేటగీతుల రచనలో మేటి యనగ.               ��.

గీ. వ్యష్టి సంస్కార వాదము ప్రబలఁ జేసి.
పరిసరాదుల శుభ్రత వరలఁ జేయ
కంకణము కట్టె కొనకళ్ళ ఘనడు సుకవి.
తేటగీతుల రచనలో మేటి కనగ.
జైహింద్.

23, ఏప్రిల్ 2017, ఆదివారం

ప్రజ - పద్యమ్ ౨౦. శ్రీ పొలిమేర మల్లేశ్వరరావు. - చరవాణి.

0 comments

 జైశ్రీరామ్.
క. చరవాణి వలన కలిగెడి 
పొరపాటులు తెలిపినారు పొలిమేరజుఁడీ
ధర వరల దలచు జనులిక
చరవాణిని వాడుదురవ సరమునకు తగన్.
జైహింద్.

నూతన ఛందములలో గర్భ కవిత 39. . . . రచన . . . శ్రీ వల్లభ

0 comments

   జైశ్రీరామ్.
  జైహింద్.