గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, సెప్టెంబర్ 2023, సోమవారం

తేనియల్ చిందు నాభాష తెలుఁగు భాష అనే మకుటంతో డా. నలవోలు నరసింహారెడ్డిగారు రచించిన తెలుగుభాషాశతక ఆవిష్కరణ చిత్రాలు

 జైశ్రీరామ్.

శ్రీరస్తు…..శుభమస్తు….అవిఘ్నమస్తు.
డా. నలవోలు నరసింహారెడ్డి.
తేనియల్ చిందు నా భాష తెలుగు భాష గ్రంథావిష్కరణ సందర్భముగా
అభినందనమందారమాల
రచన.  చింతా రామకృష్ణారావు

శా.  శ్రీమన్మంగళ తెల్గుభాష ప్రతిభన్ చిత్తంబులందొత్తగా
ప్రేమన్ శ్రీ నలవోలువంశ సుకవుల్  శ్రీనారసింహాఖ్యులే
ధీమంతుల్ గని మెచ్చునట్టులఁ బ్రశస్తిన్ వ్రాసినారిద్ధరన్
ధీమాన్యుల్ శతకంబువ్రాసి జగతిన్ తేజంబునే గొల్పిరే.

ఉ.  శ్రీశుఁడు మెచ్చు భాషయని, చిత్తమునన్ గని వీరు తెల్గు భా
షాశతకమ్ము వ్రాసిరి ప్రశస్తి తెలుంగున కల్గు దానినే
ధీశులు మెప్పులంది, గణుతిన్ గనినట్టి వెశేష సంపదల్
హే శశిశేఖరా! సుకవి హృద్వరపద్మమునుండి కావుమా.

ఉ.  వీరి ముఖారవిందమున వింతగ వాణి నటించుచుండుటన్
ధారగ సత్ప్రహేళికలు తాముగ వచ్చుచు వింతగొల్పునే
భూరిగ పద్యధారణ ప్రపూజ్యులు మెచ్చు విధంబు నొప్పుగా
పారును శ్రోత్రపేయముగ, వర్ధిలజేయ నృసింహుడీకవిన్.

సీ.  చక్కని శిక్షణ జాతీయ తెలుగు సాహిత్యపీఠమునందు హితకరులయి
నిచ్చుచున్ బెక్కురన్ మచ్చుతునకలైన కవుల నీ ధరణికిన్ గళగ జేయ,
ప్రఖ్యాత కవులుగా ప్రబలుచున్ వారలు వీరికీర్తిపతాకలై రహింతు
రింత చక్కని ఖ్యాతి నీధర పొందగ నింత సేవను చేయ నెవ్వడుండు?

తే.గీ.  నిట్టి మహనీయ నరసింహు డెట్టి కృతుల
నింకపైనను చేయనో పొంకమొదవ
తెలు భాషకు, జగతికే వెలుగు కొలుప?
వెలుగు శతవర్షముల్ వీరు తెలుగువోలె.

ఉ.  మంగళమూర్తియౌ నృహరి మంగళముల్ రచియించుగావుతన్
మంగళకార్యమగ్నుడగు మాన్యలసన్నరసింహరెడ్డికిన్
మంగళమౌతసత్కవులమండలికిన్ సతతంబునిద్ధరన్
మంగళమౌత శ్రీహరికి మంగముల్ మన భారతాంబకున్.

స్వస్తి🙏🏻

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.