31, జనవరి 2016, ఆదివారం
30, జనవరి 2016, శనివారం
29, జనవరి 2016, శుక్రవారం
28, జనవరి 2016, గురువారం
27, జనవరి 2016, బుధవారం
పావులూరి మల్లన సార సంగ్రహ గణితం లో పద్య రూపంలో వడ్ల గింజల లెక్క !
1 comments
జైశ్రీరామ్.
ఆర్యులారా!
పావులూరి మల్లన సార సంగ్రహ గణితం లో పద్య రూపంలో వడ్ల గింజల లెక్క ను
వివరించి చూపారు.
మీరూ చూడండి.
చదరంగం గళ్ళలో , మొదటి గడిలో ఒక వడ్ల గింజను ఉంచి, తర్వాతి గళ్ళలో రెట్టింపు చేసుకుంటూ పోతే, మొత్తం చదరంగంలో ఉండే 64 గళ్ళలో ఎన్ని వడ్ల గింజలు పెడతామో తెలుసా ! అనే లెక్క గురించి మనకి తెలిసిందే కదా ?
పావులూరి మల్లన సార సంగ్రహ గణితం లో పద్య రూపంలో యీ లెక్కనీ, దాని జవాబునీ యిచ్చాడు . చూద్దామా! ...
మొదలొకట నిల్పి, దానిం
గదియఁగఁదుది దాక రెట్టిగా గూడినచో
విదితముగ బల్కు మాకుం
జదరంగపు టిండ్ల కైన సంకలితమొగిన్
ఇదీ లెక్క. దీనికి జవాబు :
గదియఁగఁదుది దాక రెట్టిగా గూడినచో
విదితముగ బల్కు మాకుం
జదరంగపు టిండ్ల కైన సంకలితమొగిన్
ఇదీ లెక్క. దీనికి జవాబు :
శర శశి షట్క చంద్ర శర సాయక రంధ్ర వియన్నగాగ్ని భూ
ధర గగనాబ్ధి వేద గిరి తర్క పయోనిధి పద్మ జాస్య కుం
జర తుహినాంశు సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి
స్తరమగు రెట్టి రెట్టి కగు సంకలితంబు జగత్ప్రసిద్ధికిన్
ధర గగనాబ్ధి వేద గిరి తర్క పయోనిధి పద్మ జాస్య కుం
జర తుహినాంశు సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి
స్తరమగు రెట్టి రెట్టి కగు సంకలితంబు జగత్ప్రసిద్ధికిన్
ఇందులో కవి అంకెలకి బదులుగా కొన్ని సంకేత పదాలు ఉపయోగించాడు. వాటి అర్ధాలు తెలుసుకుని వరుసగా అంకెలు వేసుకుంటూ పోతే జవాబు వస్తుంది . ఐతే, అంకెలను వెనుక నుంచి, అంటే, కుడి నుండి ఎడమకు వేసుకుంటూ వెళ్ళాలి.
పద్యంలోని సంకేత పదాలకి సరైన అంకెలు ...
పద్యంలోని సంకేత పదాలకి సరైన అంకెలు ...
శరములు = సాయకములు = ఐదు
శశి =చంద్రుడు = తుహినకరుడు = ఒకటి
షట్కము = ఆరు
వియత్తు = గగనము = సున్న
వేదములు = నాలుగు
పద్మజాస్యుడు = నాలుగు ముఖములు గల వాడు =బ్రహ్మ = నాలుగు
రంధ్రములు = నవ రంధ్రములు = తొమ్మిది
అగ్నులు = మూడు
నగములు = భూ ధరములు = గిరులు = ఏడు
తర్కములు = ఆరు
కుంజరములు = అష్ట దిక్కులలో ఉండే ఏనుగులు = ఎనిమిది.
శశి =చంద్రుడు = తుహినకరుడు = ఒకటి
షట్కము = ఆరు
వియత్తు = గగనము = సున్న
వేదములు = నాలుగు
పద్మజాస్యుడు = నాలుగు ముఖములు గల వాడు =బ్రహ్మ = నాలుగు
రంధ్రములు = నవ రంధ్రములు = తొమ్మిది
అగ్నులు = మూడు
నగములు = భూ ధరములు = గిరులు = ఏడు
తర్కములు = ఆరు
కుంజరములు = అష్ట దిక్కులలో ఉండే ఏనుగులు = ఎనిమిది.
ఈ సంకేత పదాల అర్ధాలను అనుసరించి వెనుక నుండి అంకెలు వేసుకుంటూ పోతే జవాబు వస్తుంది !
అలా చేస్తే వచ్చే జవాబు చేంతాడంత !
ఇదిగో, చూడండి ...
ఈ లెక్ఖ ప్రకారం 18446744073709551615. వడ్లగింజలవతాయి.
జైహింద్.
26, జనవరి 2016, మంగళవారం
సర్వసత్తాక గణతంత్ర సామ్రాజ్య దినోత్సవము సందర్భముగా యావద్భారత జాతికీ నా శుభాకాంక్షలు.
0 comments
జైశ్రీరామ్
సర్వసత్తాక గణతంత్ర సామ్రాజ్య దినోత్సవము సందర్భముగా యావద్భారత జాతికీ నా శుభాకాంక్షలు.
Republic Day honors the date on which the Constitution of India came into force on 26 January 1950 replacing the Government of India Act (1935) as the governing document of India.[1]The Constitution was adopted by the India Constituent Assembly on 26 November 1949, and came into effect on 26 January 1950 with a democratic government system, completing the country's transition toward becoming an independent republic. 26 January was selected for this purpose because it was this day in 1930 when the Declaration of Indian Independence (Purna Swaraj) was proclaimed by the Indian National Congress.
It is one of three national holidays in India, the other two being Independence Day and Gandhi Jayanti.
జైహింద్.
25, జనవరి 2016, సోమవారం
అసాధారణ వ్యక్తి శంభాజీ భిడే భారత మాత ముద్దు బిడ్డ.
2 comments
జైశ్రీరామ్.
ఆర్యులారా! మన భారతమాతనిస్స్వార్థ సేవాతత్పరులైన అనేకమంది బిడ్డలను కూడా కన్న పవిత్ర మూర్తి. ఈమె కన్న ముద్దు బిడ్డలలో అసాధారణ ప్రతిభావంతుడైన శంభాజీ భిడే. వీరిది మహారాష్ట్ర. కాళ్ళకు చెప్పులైనా వేసుకోకుండా ఎంత దూరమైనా ప్రయాణం చేసే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగే మహా మనీషి.
ఇక్కడ మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రక్కన నిలబడి
అత్యంత సాధారణ వ్యక్తిలా కనిపిస్తున్న ఈయన సాధారణ వ్యక్తి కాదు.
MSc అటామిక్ పిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ ఈయన.
పూణే లోని పర్గూన్స్ కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేస్తూ
న్యూక్లియర్ పిజిక్స్ ను చాలా సంవత్సరాల పాటు బోధించారు.
ఆయన ప్రొఫెసర్ గా రిటైర్ అయిన తర్వాత సామాజిక సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేసి , మహారాష్ట్రలో విస్తృతంగా నిర్వహిస్తూ పది లక్షల మందికి పైగా యువతరం తనతో పాటు సేవలలో పాల్గొనేలా చేస్తున్నారు.
కాలి నడకకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే ఆయన ,
కాళ్ళకు చెప్పులు లేకుండా ఎంత దూరమైనా నడుస్తారు.
తెల్లటి ఖాదీ వస్త్రాలు మాత్రమే ధరిస్తూ అత్యంత నిరాడంబరంగా జీవిస్తున్నారు.
వారి వ్యక్తిత్వం , ఆలోచనా విధానాం అత్యంత అనుసరణీయమైనవి.
“ మనం పవిత్రమైన ఈ దేశంలో పుట్టాం.
ఈ గాలిని పీలుస్తూ
ఈ నీటిని తాగుతూ
ఈ నేలపై నడుస్తున్నాం.
మన ఊపిరి ఉన్నంతవరకు ఈ దేశానికి ఏదో విధంగా సేవ చేయడం మనందరి బాధ్యత “
అనే ఉన్నతమైన ఆశయంతో ఆయన ముందుకు పయనిస్తున్నారు.
అలాంటి గొప్ప వ్యక్తిని గురించి తెలుసుకోవడం, ఈ ప్రపంచానికి తెలియజేయడం, వారిని అనుసరించడం మనందరి బాధ్యత.
జైహింద్.
24, జనవరి 2016, ఆదివారం
23, జనవరి 2016, శనివారం
22, జనవరి 2016, శుక్రవారం
2వ ఉత్తమలిపి మన తెలుగు లిపిని గూర్చి మానసరెడ్డిగారి అభిప్రాయం.
1 comments
జైశ్రీరామ్
July 17, 2015 ·
TELUGU has been voted as the 2nd BEST SCRIPT in the WORLD by World Alphabet Olympics & International Alphabet Association.
1. When you listen to Telugu speaking people, you can hear ra, la, sa, ga musical words beautifully combined and makes great sound.
2. The language has got 56 (5 are missing in image) alphabets. Each letter has its own sound. It is a versatile language. And script looks gorgeous.
3. Telugu is the most sweetest without any doubt. This language sounds are available in alphabets completely rather than other languages
4. Telugu is one of the south Indian languages and also one of the ancient language.
5. Every letter of the language has its own style of its pronunciation, shape which is sweetly adaptable for every native or foreign tongues. Knows as "Italian Of The EAST" by the foreigners.
6. The sweetness of this language is evident by many non-Telugu poets praising and composing in Telugu.
7. Although the earliest body of Telugu literature that we can still access is Nannayya's 11th century, partial translation of the Mahabharata, the language itself precedes the work of many centuries, if not millennia. There are stone inscriptions from 525 CE by the Cholas, possible literary references to Telugu words in the Maharaashtri Praakrit work, Gaha Sattasai, a literary work written by a Satavahana king that dates to somewhere between 200 BCE to 200 CE, and inscriptions in Telugu at Bhattiprolu that date back to 400 BCE (Telugu is 2,400 years old, says ASI)
జైహింద్.
21, జనవరి 2016, గురువారం
సంస్కృతంలో ఫల, పుష్ప, జంతు, పక్షి, శరీరభాగ నామములు.
1 comments
జైశ్రీరామ్.
జైహింద్.
జైహింద్.
Labels:
ఆడియోస్ మరియు వీడొయోస్
20, జనవరి 2016, బుధవారం
19, జనవరి 2016, మంగళవారం
విజయ నామ సంవత్సర ఉగాదినాడు జరిగిన శ్రీకాంత్ బాల అష్టావధానము.
1 comments
జైశ్రీరామ్.
ఆర్యులారా! చిరంజీవి శ్రీకాంత్ అవధానమును అందించిన తెలుగు వన్ కు కృతజ్ఞతలు చెప్పుచూ, చిరంజీవి బాలావధానిని అభినందిస్తూ, ఆశీర్వాదములందుకొందాం.. ఇక వినండి.
జైహింద్.
ఆర్యులారా! చిరంజీవి శ్రీకాంత్ అవధానమును అందించిన తెలుగు వన్ కు కృతజ్ఞతలు చెప్పుచూ, చిరంజీవి బాలావధానిని అభినందిస్తూ, ఆశీర్వాదములందుకొందాం.. ఇక వినండి.
జైహింద్.
Labels:
ఆడియోస్ మరియు వీడొయోస్
18, జనవరి 2016, సోమవారం
17, జనవరి 2016, ఆదివారం
విజయాంబికే... అత్యద్భుత శ్రోత్రపేయమైన గానామృతమ్.
1 comments
జైశ్రీరామ్.
ఆర్యులారా! విజయాంబికే విమలాత్మజే గానామృతాన్ని గ్రోలండి.
సరస్వతీ నమస్తుభ్యమ్.
జైహింద్.
ఆర్యులారా! విజయాంబికే విమలాత్మజే గానామృతాన్ని గ్రోలండి.
సరస్వతీ నమస్తుభ్యమ్.
జైహింద్.
Labels:
ఆడియోస్ మరియు వీడొయోస్
16, జనవరి 2016, శనివారం
సంస్కృతములో సంభాషణము
1 comments
జైశ్రీరామ్.
ఆర్యులారా! చూడండి ఇద్దరు చిన్నారి తల్లులు సంస్కృతంలో ఎలా సంభాషించుకొంటున్నారో చూడండి.
ప్రయత్నిస్తే కాదేదీ అసాధ్యం.
జైహింద్.
ఆర్యులారా! చూడండి ఇద్దరు చిన్నారి తల్లులు సంస్కృతంలో ఎలా సంభాషించుకొంటున్నారో చూడండి.
ప్రయత్నిస్తే కాదేదీ అసాధ్యం.
జైహింద్.
Labels:
ఆడియోస్ మరియు వీడొయోస్
15, జనవరి 2016, శుక్రవారం
చూడగ మీ సరి మీరలే కదా! . . . మకర సంక్రాంతి శుభాకంక్షలు.
1 comments
జైశ్రీరామ్.
ఆర్యులారా! ఈ రోజు మకర సంక్రాంతి పర్వదినము. మీ అందరికీ నా శుభాకాంక్షలు.
శుభములనంత శోభలను చూపుత మీ గృహమందు నిల్చి, మీ
కభయదుడౌత శ్రీహరి ప్రకాశముఁ గొల్పుత మీ హృదిన్ సదా!
విభవముతోడ వర్ధిలుఁడు, విశ్వ విజేతగ గుర్తు పొందుచున్,
శుభగుణ శోభితుల్ తమరు. చూడగ మీ సరి మీరలే కదా!
జైహింద్.
14, జనవరి 2016, గురువారం
యావద్భారత జాతికీ భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
1 comments
జైశ్రీరామ్.
ఆర్యులారా! మన్మధ భోగి, మకర సంక్రమణ మహా పర్వ దినం సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.
మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
ఉ:-బంగరు కాంతులీను పురి పాకలు, మామిడి తోరణావళుల్
ముంగిట రంగవల్లుల నమోఘముగా విరచించు కన్యకల్
చొంగలు కార్చుచున్ కనెడి సోకుల రాయుల వేష భాషణల్
రంగుగ నద్దినట్టి చదరంగపు మ్రుగ్గుల మధ్య గొబ్బిళుల్,
జంగమ దేవరల్ కొలుపు చక్కని నాదములిచ్చు శంఖముల్
టింగరి వోలె చెట్లపయి డేకుచు నాడెడు కొమ్మ దాసరుల్
సాంగముగా హరిన్ కొలుచు సన్నుత శ్రీ హరి దాసరావళుల్
పింగళ వర్ణులౌ పగటి వేషపు గాండ్రును, పల్లె వాసులున్,
రంగుల వస్త్ర ధారణను రాజిలు ముంగిటి గంగిరెద్దులున్
హంగులకాశ చేసి వరహాలను జల్లెడి పెత్నదారులున్
నింగికినంటు యాశల మునింగియు నల్గెడి క్రొత్త యల్లుళున్
రంగులు పూసి బావలకు రాతిరి యక్కల దాచు చెల్లెళున్
బంగరు బావ గారనుచు వందలు గుంజెడి బావ మర్దులున్,
బెంగగ నుండు నప్పులిల పేరుకు పోవుచునున్న మామలున్.
భంగమునొంది జూదమున పళ్ళికలించెడి తోటి యల్లుళున్.
ఖంగని మ్రోగునట్టి గుడి గంటలు. మండెడి భోగి మంటలున్,
నింగికి నంటు సంతసము నివ్వటిలే సరి క్రొత్త జంటలున్,
బంగరు పళ్ళెరంబులను పంటికి నోటికి నచ్చు వంటలున్,
రంగుల నీను పల్లెలును రమ్యత నొప్పెడి పట్టణంబులున్,
యింగిత మున్నసత్కవుల కెల్ల మనోజ్ఞ ము సంకురాత్రులౌన్.
జైహింద్
13, జనవరి 2016, బుధవారం
మకర సంక్రాంతి శోభ. ఈ సందర్భంగా శుభాకాంక్షలు.
1 comments
జైశ్రీరామ్.
ఆర్యులారా!
మకర సంక్రాంతి సందర్భంగా మీరు సకుటుంబ బంధు మిత్ర పరివారముగా సుఖ సంతోషాలతో ఆనందసాగరంలో తేలియాడాలని మనసారా కోరుకొంటూ శుభాకాంక్షలు తెలిఅయఁ జేస్తున్నాను.
చ:-మకరమునందు సూర్యుఁడు విమానప్రదేశమునందు కూడగా
సకల జగమ్ము పుణ్య పరిసంభవ కాలముగా గణించుచున్
ముకుళిత హస్తులై తలచి పూర్వుల నెల్లర బ్రాహ్మణాళిలో.
సకల పదార్థముల్ గొనగ చక్కగ నిత్రు భుజింప భక్తితో.
ఉ:-పంట పొలాలలో విరగ పండిన పంటల లక్ష్మి బండ్లపై
నింటికి చేరి శోభిలగ, హేమ ప్రభా రమణీయ తేజసం
బంటిన రైతు బిడ్డ పరమాన్నము పంచును గాదె! పూజ్యులై
యింటికి వచ్చు వారలకు, నెంతటి పుణ్య పునీత మూర్తియో!
ఉ:-బంగరు కాంతులీను పురి పాకలు, మామిడి తోరణావళుల్
ముంగిట రంగవల్లుల నమోఘముగా విరచించు కన్యకల్
చొంగలు కార్చుచున్ కనెడి సోకుల రాయుల వేష భాషణల్
రంగుగ నద్దినట్టి చదరంగపు మ్రుగ్గుల మధ్య గొబ్బిళుల్,
జంగమ దేవరల్ కొలుపు చక్కని నాదములిచ్చు శంఖముల్
టింగరి వోలె చెట్లపయి డేకుచు నాడెడు కొమ్మ దాసరుల్
సాంగముగా హరిన్ కొలుచు సన్నుత శ్రీ హరి దాసరావళుల్
పింగళ వర్ణులౌ పగటి వేషపు గాండ్రును, పల్లె వాసులున్,
రంగుల వస్త్ర ధారణను రాజిలు ముంగిటి గంగిరెద్దులున్
హంగులకాశ చేసి వరహాలను జల్లెడి పెత్నదారులున్
నింగికినంటు యాశల మునింగియు నల్గెడి క్రొత్త యల్లుళున్
రంగులు పూసి బావలకు రాతిరి యక్కల దాచు చెల్లెళున్
బంగరు బావ గారనుచు వందలు గుంజెడి బావ మర్దులున్,
బెంగగ నుండు నప్పులిల పేరుకు పోవుచునున్న మామలున్.
భంగమునొంది జూదమున పళ్ళికలించెడి తోటి యల్లుళున్.
ఖంగని మ్రోగునట్టి గుడి గంటలు. మండెడి భోగి మంటలున్,
నింగికి నంటు సంతసము నివ్వటిలే సరి క్రొత్త జంటలున్,
బంగరు పళ్ళెరంబులను పంటికి నోటికి నచ్చు వంటలున్,
రంగుల నీను పల్లెలును రమ్యత నొప్పెడి పట్టణంబులున్,
యింగిత మున్నసత్కవుల కెల్ల మనోజ్ఞ ము సంకురాత్రులౌన్.
జైహింద్
శ్రీె. కె.శివప్రసాద్ గారి ఈలపాట.
0 comments
జైశ్రీరామ్
ఆర్యులారా! భోగి పండుగ శుభాకాంక్షలు.
శ్రీమాన్ కే. శివప్రసాద్ గారి ఈలపాటను విని ఆనందించండి.
జైహింద్.
ఆర్యులారా! భోగి పండుగ శుభాకాంక్షలు.
శ్రీమాన్ కే. శివప్రసాద్ గారి ఈలపాటను విని ఆనందించండి.
జైహింద్.
Labels:
ఆడియోస్ మరియు వీడొయోస్
12, జనవరి 2016, మంగళవారం
శ్రీ కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె ఇక మనకి లేరు.
2 comments
శివ శివా!
కీ.శే.కరణం బాల సుబ్రహ్మణ్యం పిళ్ళె..
తే. 27-12-2015 న శ్రీ కోడూరి ప్రభాకర రెడ్డి సాహితీ పీట్యం ద్వారా పురస్కారమునందుకొనిన శ్రీ కరణం బాల సుబ్రహ్మణ్యం పిళ్ళె నిన్న (11-01-2016) రాత్రి 8.00 గంటలకు గుండె పాటుతో స్వర్గస్థులయ్యారు. ఈ వార్త తెలియఁ జేయటానికి చింతిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
తే.13-010-2016. సాయంత్రం 5 గంటలకు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ బిల్డింగ్ వివేకానంద నగర్ కూకట్ పల్లిలో సంతాప సభ ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ గుత్తి(జోళదరాశి)చంద్రశేఖర రెడ్డి తెలియజేసియున్నారు.
ఓం నమశ్శివాయ.
జాతీయ యువజన దినోత్సవము
1 comments
జైశ్రీరామ్.
భారతీయ యువజనులారా! మీ అందరికీ నా శుభాకాంక్షకు.
మీరు శ్రీ స్వామీ వివేకానందునికి వారసులు.
మీకు లభించిన వారసత్వ సంపదను కాపాడుకోండి.
వివేకానందుని జీవిత చరిత్ర చదవండి.
చికాగోలో చేసిన అతని ఉఅపన్యాసాన్ని ఆకళింపు చేసుకోండి.
మీరు కూడా అత్యంత ఆదరణీయమైన భారతీయ యువకులుగా గుర్తింపు తెచ్చుకోండి.
మీరు చేయదలిస్తే మీకు తిరుగు లేదు. మీలో నిండి ఉంది అనంతమైన శక్తి.
ఆ శక్తితో మీరు మన తల్లి భారతమాత కీర్తి దశ దిశలా వ్యాపింపచెయ్యండి. ప్రపంచపటంలో భారత దేశం అత్యంత శక్తివంతమైన దేశం అనేలా చేయటం మీవల్లనే సాధ్యమౌతుందని మరువకండి.
మీ శక్తి సామర్ధ్యాలను అనవసర కార్యకలాపాలకు వెచ్చించకండి.
నాకు తెలుసు.వివేకానందుని నిజమైన వారసులుగా మీరు కీర్తి సంపాదించగలరని.
మీకు మరొక్కమారు నా అభినందనలు. మీకు ఆ పరమాత్మ నిత్యం తోడుగా ఉండాలని మనసారా కోరుకొంటున్నాను.
జైహింద్.
11, జనవరి 2016, సోమవారం
ఉచిత ప్లాష్టిక్ & గైనిక్ సర్జరీ.17 - 01 - 2016 నుండి 24 - 01 - 2016 వరకు.శ్రీకాకుళం జెమ్స్ హాస్పటల్ లో.
1 comments
భారతేతర దేశవాసులై ఉన్న తెలుగురచయితల కొఱకు నిర్వహిస్తున్న 21వ ఉగాదిఉత్తమరచనల పోటీ.
0 comments
జైశ్రీరామ్.
21వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
భారత దేశం మినహా ఉత్తర అమెరికా & ఇతర విదేశాల తెలుగు రచయితలకు ఆహ్వానం
(రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 15, 2016)
గత 20 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే "దుర్ముఖి " న ామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 8, 2016) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 21వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. భారత దేశం మినహా విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని కోరుతున్నాం. స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” రెండు విభాగాలు ఉన్నాయి.
ప్రధాన విభాగం
భారత దేశంలో తప్ప ఇతర దేశాలలో ఉన్న తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.
ఉత్తమ కథానిక: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: $116
ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: $116
“మొట్ట మొదటి రచనా విభాగం” -8వ సారి పోటీ నిర్వహణ
కథ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఎనిమిదవ సారి ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం లేకుండా, భారత దేశం మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ "పోటీ" లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం.
"నా మొట్ట మొదటి కథ": (ఉత్తమ కథ): $116
"నా మొట్టమొదటి కవిత": (ఉత్తమ కవిత): $116
అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు
· ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ ఒక ఎంట్రీ మాత్రమే పంపించవచ్చును. వ్రాత ప్రతిలో కథలు పదిహేను పేజీల లోపు,కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి.
· తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.
· రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. "మొట్టమొదటి కథ" మరియు "మొట్టమొదటి కవిత" పోటీ లో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలని హామీ పత్రంలో పేర్కొనాలి.
· బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది.నెట్ లోనూ, ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.
· విజేతల వివరాలు ఉగాది పండుగ నాడు (ఏప్రిల్ 9, 2016) కాని, అంతకు ముందు కానీ ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ తమవే అయినా, ఆ లోపుగా తమ ఎంట్రీలను రచయితల ఇంకెక్కడా ప్రచురించ కూడదు.
· విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.
Last Date to receive entries is: March 15, 2016
Please send entries by e-mail attachments only (PDF, JPEG or Unicode fonts)
భవదీయులు,
వంగూరి చిట్టెన్ రాజు, (అధ్యక్షులు) & శాయి రాచకొండ (సంపాదకులు)
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
హ్యూస్టన్ & హైదరాబాద్
Phone: 832 594 9054
E-mail: vangurifoundation@gmail.com
జైహింద్.
10, జనవరి 2016, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)