గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, డిసెంబర్ 2019, మంగళవారం

సౌందర్య లహరి మూడవ భాగము. ౪౧ నుండి ౬౦ వరకు.

0 comments

  జైశ్రీరామ్.

జైహింద్.

30, డిసెంబర్ 2019, సోమవారం

సౌందర్యలహరి ఐదవ భాగము. ౮౧ నుండి ౧౦౦ వరకు.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

29, డిసెంబర్ 2019, ఆదివారం

సౌందర్యలహరి కంఠస్థము చేయించుట.రెండవ భాగము. ౨౧ నుండి ౪౦ వరకు.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

28, డిసెంబర్ 2019, శనివారం

సౌందర్య లహరి కంఠస్థము చేయించుట.ఒకటవ భాగము. 1నుండి20 వరకు.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

27, డిసెంబర్ 2019, శుక్రవారం

6 సెప్టెం, 2016 3:18 AM ఏల్చూరి మురళీధరరావు గారికి.

0 comments

జైశ్రీరామ్.
6 సెప్టెం, 2016 3:18 AM

శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారికి వందనములు.

శారద ముద్దు బిడ్డలు నసాదృశ  భావ కవీంద్రులైన యే
ల్చూరి కులాబ్ధి చంద్ర! విన సొంపుగ పద్య సుమార్చనంబునన్
భారతరాష్ట్రనాథుఁడగు పండితుఁ జూపుచు నాంధ్రభూమికే
పేరును పెంచినారు సుకవీ! మురళీధర! సన్నుతాత్ముఁడా!

అభినందనలతో
మీ
చింతా రామ కృష్ణా రావు.  

పూజ్యతములు, సత్కవీంద్రులు శ్రీ చింతా రామకృష్ణార్యులకు
నమస్కారములతో,

పదసౌభాగ్యము, వాక్యగౌరవము, భవ్యప్రౌఢిమై మంగళా
స్పదమై దివ్యమహాద్భుతాశుకవితాప్రావీణ్యసంశోభి సౌ
హృద మొప్పారెడి మీ శుభాశిషము నర్థిం గొన్న పుణ్యంబునన్    
హృదయం బెంతయుఁ బొంగె సంతసముతో శ్రీ రామకృష్ణాభిదా!

సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు .
జైహింద్.

26, డిసెంబర్ 2019, గురువారం

గరికిపాటి... సింగినాదం కీలకఱ్ఱ

0 comments

25, డిసెంబర్ 2019, బుధవారం

గవాక్షబంధ కందము....రచన. శ్రీ గోరుగంతు రామచంద్రం

0 comments

జైశ్రీరామ్
జైహింద్.

24, డిసెంబర్ 2019, మంగళవారం

పిల్లల పెంపకం.

2 comments

 జై శ్రీరామ్
పిల్లలు చెడిపోవడానికి అసలు కారకులం మనమే..!!

పిల్లల్ని గరాబంగా చూసుకోవడం మంచిదే కానీ అది మరీ శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది. పిల్లల పట్ల మనం చూపిస్తున్న అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది. ఇది ముమ్మాటికీ నిజం. వారిని సుకుమారంగా చూసుకోవాలి అనే ప్రీతిలో మనమే వారిని సోమరులుగా మారుస్తున్నారు..

ఇప్పుడు తరం పిల్లలు.
వారి సాక్సులు ఉతుక్కోమంటే ఉతకరు.

లంచ్ బ్యాగ్ లు శుభ్రం చేసుకోవడంలేదు.

కనీసం లోదుస్తులు ఉతుక్కోమన్నా ఉతకడం లేదు.

గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు.

తిట్టితే వస్తువులను విసిరి కొడతారు.
ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే ఫైవ్ స్టార్ లు, ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, నూడుల్స్ ప్యాకెట్లు, కొనుగోలు చేస్తున్నారు.


ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు.

ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి.

అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడ ఉన్నారు.

డిగ్రీ చదువుతున్న ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు.

బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడలేని కోపం వీరికి,

కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింతపోకడలు వారిస్తే వెర్రి పనులు.

ఎందుకంటే మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు.
కానీ కారణం మనమే.
ఎందుకంటే మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి.
చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ నెస్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం.
గారభంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు.
వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది.
కష్టం గురించి తెలిసేలా పెంచండి అని.
కష్టాలు, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే. వారికి జీవితం విలువ తెలియదు.

ప్రేమతో, గరాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే. కొందరు యువత 15 ఏళ్లకే సిగరేట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్ లు, హత్యలు చేస్తున్నారు.

అభినయాలు కనపడం లేదు, అనుకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు.
ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ  చిన్న వయసు లోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్యాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు.

మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం.
కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, బాక్సు రైస్.

గర్భవతులు అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం
టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి.
అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు.
3వ తరగతి పిల్లాడికి సోదబుడ్డి లాంటి కళ్ళద్దాలు.
5వ తరగతి వారికి అల్సర్, బీపీ లు.
10 దాటేలోపు సకల రోగాలు ఒంట్లోకి వచ్చేస్తున్నాయి.

వీటన్నికి కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..
అందుకే తల్లిదండ్రులు మారాలి.

రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం..?

ఒక్క సారి ఆలోచన చేయండి.

సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి?

కేవలం గుడికి వెళ్లో, చర్చికి వెళ్లో మసీదుకు వెళ్ళో
పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే. అలా అనుకోవడం కొంత పొరపాటు.

పిల్లలకు.

బాధ్యత
బరువు
మర్యాద
గౌరవం
కష్టం
నష్టం
ఓర్పు
సహనం
దాతృత్వం
ప్రేమ
అనురాగం
సహాయం
సహకారం
నాయకత్వం
మానసిక ద్రృఢత్వం
కుటుంబ బంధాలు
అనుబంధాలు 
దైవం
దేశం

ఇవి సంప్రదాయాలు అంటే.

కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక పిల్లలకు అలవాటు చేయాలి.
ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం.

మనం కూడా మమేకమవుదాం.

భావి తరాలకు ఒక మానవీయ, విలువలతో కూడిన ,  సత్సాంప్రదాయ కుటుంబాలను కలిగిన సమాజానికై  బాటలు వేద్దాం.

సర్వేజనా సఖినో భవంతు.

బడిలో ఉన్నా అత్యాచారం
ఒడిలో ఉన్నా అత్యాచారం
నట్టింట్లో అత్యాచారం
నడిబజారులో అత్యాచారం
ఒంటరిగా ఉంటే అత్యాచారం
జంటగా ఉన్నా అత్యాచారం
బాలికపై అత్యాచారం
బాలింతపై అత్యాచారం
మత్తు ఎక్కితే అత్యాచారం
మగువ చిక్కితే అత్యాచారం
ప్రేమించకుంటే అత్యాచారం
ప్రేమించినా అత్యాచారం
పసిపిల్లపై అత్యాచారం
పండు ముసలిపై అత్యాచారం
పుట్టిన పిల్లపై అత్యాచారం
చచ్చిన శవంపై అత్యాచారం .
ఎవరిని మిగిల్చావురా చివరికి నీపై నీవే అత్యాచారం చేసుకోవడం తప్ప .
ఛీ ఏమిటీ సొసైటీ? మగవానిలో ఇలాంటి పైశాచికత్వం కాముకత్వం విచ్చలవిడితనం మొదలగునవి కలగటానికి కారణాలు ఏమైఉండవచ్చు అన్నప్పుడు, కొద్దిమంది చెప్పుచున్న జవాబులు ఏమిటంటే, సినిమాల్లో చుపెడుచున్న సెక్సీ మూమెంట్స్, అలాగే టివి లలో వచ్చుచున్న కొన్ని సీరియల్స్ సెల్ ఫోన్స్ లో ఫోర్నో గ్రఫీ కి సంబంధించిన వీడియోలు, దానికి తగ్గట్టుగా యువతులు అందాలను ఆరబోసి కున్నట్టుగా డ్ర స్సులు ఇలా ఎన్నో కారణాలు ఉండటం తో యువకులతో పాటు మద్యవయుస్కులలో కూడా మానసికముగ కోర్కెలు రగిలి, అది ఆడది అయ్యుంటేచాలు,ఒంటరిగా దొరికిందా పాపం ఆమెపై బలవంతంగా అత్యాచారం చేస్తమే కాక క్రూరంగా చంపేయ టానికి కూడా ఏమాత్రము వెనుకాడుటలేదు. దీ నికేదో మార్గం కనిపెట్టకపోతే మునుముందు ఇంకా ఎన్నో అనర్థాలు జరిగే అవకాశాలు లేవంటారా?

నాచేత ఆ పరమాత్మ వ్రాయించిన బాలభావన శతకమును పెద్దలు కంఠస్థము చేయుటతోపాటు చిత్తశుద్ధితో సహనముతో సాధన చేస్తే కొంత మార్పు ఉండవచ్చేమో ఆలోచించండి.

2. మద్యపానాన్ని మన దేశంలో పూర్తిగా లేకుండి చేయాలి.
ఈ పని ఒక్క ఎన్టీఆర్ మాత్రమే పూర్తిగా చేసినట్టున్నారు.
ఇది చెయ్యాలంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండిలి.

3. పౌరులందరూ బాధ్యతియుతంగి ప్రవర్తించిలి. ఈ సమాజంలో మనకు స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉన్నదంటే అది ఇతరుల హక్కుకు భంగం కలిగించకుండా, సమాజానికి ఎటువంటి కీడూ కలిగించకుండా మనం జీవించడానికి సమాజం ఎన్నో విధాల ప్రత్యక్షంగా పరౌక్షంగా కారణమగుచున్నందున అట్టి సమాజంయొక్క ఋణం కొంచెమయినా మనం తీర్చుకోడానికి ఏదో విధంగా సమాజ శ్రేయస్సుకు మనం చేతనైనట్టు తోడ్పడడం చేయఁగలిగితే మార్పు ఎలా రాకుండా ఉంటుందండీ.

4. పిల్లలను పాఠశాలలో వేసిన దగ్ఖరినుంచీ వారానికొక నీతి శ్లోకము అర్థ తాత్పర్యాలతో రోజూ చదివిస్తుంటే అవినీతి బీజాలెలా పడతాయండి వారిలో.

4. మానవుఁడు అనుకరణశీలి. అనుకరించకుండా పెరుగుట అసాధ్యం. కావున మన ప్రవర్తననే పిల్లలనుకరిస్తారన్న స్పృహను మనం కోల్పోకూడదు.
యద్యదా చరతి శ్రేష్టః.
అనేశ్లోకం తెలుసు కదా.
ముందుగా మనం తప్పుగా ప్రవర్తించకుండా ఉంటే  పిల్లలు ఎలా తప్పత్రోవపట్టగలరండీ.

5. పిల్లల మెదడును ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక మంచి మార్గంవైపు నిత్యం మళ్ళేలాగ ప్రేరేపించే సామర్ధ్యం మనకుండాలి. అప్పుడు వారికి తప్పుడుపని చేసే అవకాశమే ఉండదుకదా.
జైహింద్.

23, డిసెంబర్ 2019, సోమవారం

0 comments

జైశ్రీరామ్.
1. నిద్రలేవగానే.
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ
కరమూలే స్థితాగౌరీ ప్రభాతే కరదర్శనమ్
సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే

2. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః

3. బ్రహ్మా మురారిస్త్రిపురాంతకారీ
భానుశ్శశీ భూమిసుతో బుధశ్చ
గురుశ్చ శుక్రః శని రాహుకేతవః
కుర్వంతు సర్వే మమ సుప్రభాతమ్

4. కృష్ణాయ వాసుదేవాయ హరయేపరమాత్మనే
ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమోనమః

5. స్నానం చేయునప్పుడు.
గంగే చ యమునే కృష్ణే గోదవరి సరస్వతి
నర్మదే సింధు కావేర్యౌ జలేఽస్మిన్ సన్నిధిం కురు
గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి
ముచ్యతే సర్వ పాపాభ్యో విష్ణులోకం స గచ్ఛతి
అంబ త్వద్దర్శనాన్ముక్తిః న జానే స్నానజం ఫలమ్
స్వర్గారోహణ సోపానం మహాపుణ్య తరంగిణీం
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్
గంగే మాం పునీహి

6. సూర్యుని దర్శించునప్పుడు.
బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ 
సాయం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరమ్ 

7. విదియ [ద్వితీయ] చంద్రుని దర్శించునప్పుడు.
క్షీరసాగర సంపన్న లక్ష్మీప్రియ సహోదర 
హిరణ్యమకుటాభాస్వద్బాలచంద్ర నమోఽస్తుతే 

8. తులసీమాతకు నమస్కరిస్తూ.
యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహమ్ 
నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే 
నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయిని

9. తులసి దళములు గ్రహించునప్పుడు.
తులస్యమృతజన్మాసి సదా త్వం కేశవప్రియే 
కేశవార్థం లునామి త్వా వరదా భవి శోభనే

10. అశ్వత్థ వృక్షమునకు నమస్కరించునప్పుడు.
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే 
అగ్రతః శివరూపాయ వృక్షరాజాయతే నమః 

11. భోజనమునకు ముందు.
అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రితః 
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ 
బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ 
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా 

12. ఏకశ్లోకీ రామాయణం.
ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనమ్ 
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్ 
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్ 
పశ్చాద్రావణకుంభకర్ణహననం చేతద్ధి రామాయణమ్ 

13. ఏకశ్లోకీ భాగవతం.
ఆదౌ దేవకిదేవి గర్భజననం గోపీ గృహేవర్ధనం
మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణమ్ 
కంసచ్ఛేదన కౌరవాది హననం కుంతీసుతాపాలనం 
హ్యేతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతమ్ 

14. ఏకశ్లోకీ భారతం.
ఆదౌ పాండవధార్తరాష్ట్రజననం లాక్షాగృహేదాహనం 
ద్యూతశ్రీహరణం వనే విచరణం మత్స్యాలయే వర్తనమ్ 
లీలాగోగ్రహణం రణే విహరణం సంధిక్రియాజృంభణం 
భీష్మద్రోణసుయోధనాదిమథనం హ్యేతన్మహాభారతమ్ 

15. నాగస్తోత్రం.
నమస్తే దేవదేవేశ నమస్తే ధరణీధర 
నమస్తే సర్వనాగేంద్ర ఆదిశేష నమోఽస్తుతే 

16. యజ్ఞేశ్వర ప్రార్థన.
నమస్తే యజ్ఞభోక్త్రే చ నమస్తే హవ్యవాహన 
నమస్తే వీతిహోత్రాయ సప్తజిహ్వాయ తే నమః 

17. ఔషధమును సేవించునప్పుడు.
అచ్యుతానంద గోవింద నామోచ్ఛారణ భేషజాత్ 
నశ్యంతి సకలా రోగాస్సత్యం సత్యం వదామ్యహమ్ 
శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే 
ఔషధం జాహ్నవీతోయం వైద్యోనారాయణోహరిః 

18. ప్రయాణమునకు బయలుదేరుచునప్పుడు.
యశ్శివోనామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా 
తయోస్సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ 
నారాయణ నారాయణ నారాయణ 

19. దీపం వెలిగించిన పిదప.
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వ తమోఽపహమ్ 
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోఽస్తుతే
శుభం కరోతు కళ్యాణమారోగ్యం సుఖసంపదమ్
శత్రుబుద్దివినాశం చ దీప జ్యోతిర్నమోఽస్తుతే 

20. నిద్రకు ఉపక్రమించినపుడు.
రామం స్కందం హనూమంతం వైనతేయం వృకోదరమ్ 
శయనే యః స్మరేన్నిత్యం దుఃస్వప్నం తస్య నశ్యతి 
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా 
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర 
కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః 
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్ 

21. చెడు కల వచ్చినప్పుడు.
బ్రహ్మాణం శంకరం విష్ణుం యమం రామం దనుం బలిమ్ 
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం దుఃస్వప్నం తస్య నశ్యతి 

22. కలిదోష నివారణం.
కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ 
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్ 

23. శమీవృక్షమును దర్శించునప్పుడు.
శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ 
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ 

24. దారిద్ర దుఃఖ నివారణకు.
దుర్గేస్మృతా హరసి భీతిమశేషజంతోః 
స్వస్థైఃస్మృతామతిమతీవ శుభాం దదాసి 
దారిద్ర్యదుఃఖభయహారిణి కా త్వదన్యా 
సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా 

25. ఆపద నివారణకు.
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్

26. కలికల్మషనాశన మహామంత్రము.
హరే రామ హరే రామ రామ రామ హరే హరే 
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.
జైహింద్.

22, డిసెంబర్ 2019, ఆదివారం

అష్ట దిగ్గజములు....

0 comments

అష్ట దిగ్గజములు.
 🐘🐘🐘🐘🐘🐘🐘🐘

శ్లో. ఐరావతః పుండరీకో వామనః కుముదోఽఞ్జనః౹
పుష్పదంతః సార్వభౌమః సుప్రతీకశ్చ దిగ్గజాః౹౹

అష్ట దిగ్గజాలు అంటే (అష్ట + దిక్ + గజములు = "ఎనిమిది దిక్కుల ఉండే ఏనుగులు"). ఎనిమిది దిక్కులనూ కాపలా కాస్తూ ఎనిమిది ఏనుగులు ఉంటాయని చెబుతారు. ఇవే అష్టదిగ్గజాలు. అలాగే ఈ అష్టదిగ్గజాల భార్యల పేర్లు-దిక్కు- దిక్పాలకుని పేరు వరుసగా ఇవ్వబడినవి.

గజం పేరు- గజ భార్య- దిక్కు-పాలకుడు.*

1. ఐరావతం-అభ్ర-తూర్పు-ఇంద్ర

2. పుండరీకం-కపిల-ఆగ్నేయం-అగ్ని;

3. వామనం-పింగళ-దక్షిణం-యమ;

4. కుముదం-అనుపమ-నైఋతి-నిఋతి;

5. అంజనం-తామ్రపర్ణి-పశ్చిమం-వరుణ;

6. పుష్పదంతం-శుభ్రదంతి-వాయవ్యం-;

7. సార్వభౌమం-అంగన-ఉత్తరం-కుబేర;

8. సుప్రతీకం-అంజనావతి-ఈశాన్య-ఈశాన.

అదే విధంగా శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలోని ఎనిమిది మంది కవులను అష్టదిగ్గజాలు అని అంటారు. విజయ నగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని ఎనిమిది మంది కవులు అష్టదిగ్గజాలుగా తెలుగు సాహితీ సంప్రదాయంలో ప్రసిద్ధులయ్యారు.

1. అల్లసాని పెద్దన
2. నంది తిమ్మన
3. ధూర్జటి
4. మాదయ్యగారి మల్లన లేక కందుకూరి రుద్రకవి
5. అయ్యలరాజు రామభధ్రుడు
6. పింగళి  సూరన
7. రామరాజభూషణుడు (భట్టుమూర్తి)
8. తెనాలి రామకృష్ణుడు

🐘🐘🐘🐘🐘🐘🐘🐘

21, డిసెంబర్ 2019, శనివారం

బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శాస్త్రి గారి అష్టావధానము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

20, డిసెంబర్ 2019, శుక్రవారం

ఈ సంస్కృత శ్లోకం లో వొకే Line లో శివ , కేశవు లను స్తుతిస్తూ రాసిన అద్భుత శ్లోకం వినండి .

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

19, డిసెంబర్ 2019, గురువారం

ఒక ఉగాది కవిసమ్మేళనములో కీ.శే.మానాప్రగడ శేషశాయి గారి కవితా గానం.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

18, డిసెంబర్ 2019, బుధవారం

శ్రీ ఆముదాల మురళి గారి ౧౩౭వ అష్టావధానము.

0 comments

జైశ్రీరామ్
జైహింద్.

17, డిసెంబర్ 2019, మంగళవారం

తే. ౧౬ - ౧౧ - ౨౦౧౯ని. సిద్ధిపేట సివారు మిట్టపల్లి లలితా చంద్రమౌళేశ్వర దేవాలయంలో జరిగిన కవి సమ్మేళనము.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

16, డిసెంబర్ 2019, సోమవారం

గోదా శబ్దనిర్వచనం సూరన కవి కృతము

0 comments

జైశ్రీరామ్.
 గోదా శబ్దనిర్వచనం సూరన కవి కృతము

ఉ. ఆదట స్వర్గమిచ్చుట ౧, నఘౌఘమడంచుట ౨,మోక్షమిచ్చుటన్ ౩,
పాదుగ జన్మబంధముల బాపుట ౪ ,దివ్యవచః ప్రకాశక
శ్రీదయ ౫ ,సేయుటల్ ౬, ప్రకృతిజె౦డుట భూమిజనించుటల్ ౭,సువా
జ్మోదమొసంగుటల్౮,నయనము౦గలిగించుట రంగశాయికిన్ ౯,
గాదనకన్ ధరిత్రినిడగా దగుటన్ ౧౦,నిను దేశికోత్తముల్
గోద యటండ్రు సర్వ బుధకోటి నంతింపగ రంగనాయకీ!

వివరణ-
౧.  గో  స్వర్గం ద ఇచ్చునది - గోదా
౨.  గో  మోక్షం ద ఇచ్చునది - గోదా
౩.   గో  పాపం ద  పోగొట్టేది - గోదా
౪.  గో  పశుప్రాయ జన్మం ద ఖండించేది - గోదా
౫.  గో  కవన వాక్ఛక్తిని ద  కలిగించేది - గోదా
౬.  గో  అర్చిరాది మార్గం ద కటాక్షించేది - గోదా
౭.  గో  రంగనాథునికి నేత్రం ఇచ్చునది, అంటే వారి చూపు
        వీరి జన్మస్థలమందే ఉంచడం - గోదా
౮.  గో భూమిని ద  భేదించుకొని వచ్చినది - గోదా
౯.  గో తిరుప్పావై శ్రీసూక్తిని ద కల్పించినది - గోదా
౧౦.గో భూమండలం ద కృపసేయునది - గోదా
 జైహింద్.

15, డిసెంబర్ 2019, ఆదివారం

కీ.శే. మానాప్రగడ శేషశాయి మహనీయుని ఆశుధార.

1 comments

 జైశ్రీరామ్

జైహింద్

14, డిసెంబర్ 2019, శనివారం

మద్విరచిత గవాక్ష బంధ కందము.

1 comments

 జైశ్రీరామ్
జైహింద్.

13, డిసెంబర్ 2019, శుక్రవారం

డా. ఆర్.శంకర్ గారి సంస్కృత అష్టావధానము.

0 comments

జైశ్రీరామ్

జైహింద్.

12, డిసెంబర్ 2019, గురువారం

డా.వేంకటేష్ కులకర్ణి గారి అష్టావధానము.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

11, డిసెంబర్ 2019, బుధవారం

మ్డిట్టపల్లిలో ౧౭ . ౧౧ . ౨౦౧౯ని జరిగిన డా.జీ..యం.రామశర్మగారి అష్టావధానము.

0 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

10, డిసెంబర్ 2019, మంగళవారం

డా.మలుగు అంజయ్యావధాని అష్టావధానం.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

9, డిసెంబర్ 2019, సోమవారం

అమరము సాధనము ౨.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

8, డిసెంబర్ 2019, ఆదివారం

గీతా జయంతి సందర్భముగా శుభాకాంక్షలు.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులకు వందనములు.
నేడు శ్రీమద్గీతాజయంతి 
ఆ శ్రీకృష్ణపరమాత్మునకు మనపై ఉన్న అపార కరుణకు సాక్ష్యమే ఆ పరమాత్మ మనకందించిన  భగవద్గీత.
ఆ గీతను అవగాహనచేసుకొనుట సాధన చేయుట అనునవి సుకృతవిశేషముననే లభించును కాని ఊరకనే లభించవు.
గీత సాధన చేసి అనుసరించి మానవులు తమ నుదుటి వ్రాతను అనుకూలముగా మార్చుకొందురుగాక.
మీ అందరికీ గీతాజయంతి సందర్భముగా ఆపరమాత్మ కృపామృతం లభించాలని కోరుకొంటూ శుభాకాంక్షలను తెలియఁ జేయుచున్నాను.
జైశ్రీమన్నారాయణ.
జైహింద్.

అమరము సాధనచేయుట.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

6, డిసెంబర్ 2019, శుక్రవారం

శ్రీ కోట రాజశేఖర అవధానిగారి గ్రంథావిష్కరణ సభ.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

5, డిసెంబర్ 2019, గురువారం

పుష్పవిలాపము తెలుగు మూలము : కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు సంస్కృతానువాదము : వెంపటి కుటుంబ శాస్త్రి

0 comments

జైశ్రీరామ్.
పుష్పవిలాపము
తెలుగు మూలము : కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు
సంస్కృతానువాదము : వెంపటి కుటుంబ శాస్త్రి
చేతురారంగ నిన్ను పూజిన్చు కొరకు
కోడి కూయంగనే మేలుకొంటి నేను.
గంగలో మున్గి ధౌత వల్కలము గట్టి
పూలు గొనితేర నరిగితి పుష్పవనికి.
హస్తప్రీతి లతాన్త-సన్తతి-ముఖై స్త్వామర్చితుం చిన్తయన్
ప్రత్యూషే గృహ-కుక్కుట-ధ్వనిమను స్వాపం విహాయైకదా|
గాంగం స్నాన-విధిం విధాయ విహితం ధృత్వా చ ధౌతం శుచిర్-
భూత్వా పుష్పవనీ మయాసిష మహం చేతుం సుమాన్యాదరాత్||
నేనొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గో
రానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి “మా
ప్రాణము తీతువా” యనుచు బావురు మన్నవి క్రుంగిపోతి నా
మానసమందెదో తళుకు మన్నది “పుష్పవిలాప” కావ్యమై||
స్థిత్వా పుష్పతరో స్సమీప భువి తం భంక్త్వా ప్రతానం ముదా
యావన్మే నఖమాదధామి కలయన్ పుష్పావ చాయం తతః|
తావత్తా  స్సుమబాలికా స్సకరుణం వ్యాదాయ వక్త్రం జగుః
“కిం నః ప్రాణ మపాకరోషి? కిము తేఽస్మాభిః కృతం విప్రియమ్||
కావ్యం “పుష్పవిలాప”నామ హృది మే స్ఫూర్తం చ కించిత్ తదా||
జైహింద్.

4, డిసెంబర్ 2019, బుధవారం

దండక గర్భ హనుమత్ సీసమాలిక....

2 comments

జైశ్రీరామ్.
ఓం నమో నారాయణాయ.
రామభక్త హనుమంతా!
జయము. జయము.

దండక గర్భ హనుమత్ సీసమాలిక.

శ్రీ యాంజనేయుండ! శ్రీరామచంద్రుండు నీమానసంబందె నిరుపమముగ

వాసంబు చేయంగ భక్తాళికాస్వామి నేరీతిఁ గన్పించు హృద్యముగను?

నీ నామమున్ విన్న నిన్నే మదిన్ గన్న నీ యందె యున్నట్టి నిత్యుఁడయిన

శ్రీరాముఁడే మమ్ము సీతమ్మతో కూడి కాంచున్గదా తాను కరుణఁజూపి,

కావంగ రాఁడేమి కన్పించడా యేమి? మాదోషమేముండె మనసు లేదొ?

మాయందు తప్పున్న మాముందు తా నిల్చి మా తప్పులన్ జెప్పి మదికినెక్క

మంచిన్ బ్రబోధించి మించంగ సద్భక్తి, కుంచించు మాలోన కుదురుగాను

ధైర్యంబునే కొల్పి తప్పున్న మన్నించి తత్వంబు బోధించి ధాత్రిపైన

ధర్మప్రవృత్తిన్ సదా దైవ భక్తిన్ సు ధాపూర్ణ వాగ్ధాటి సరసమతిని

సద్భావనాశక్తి సత్కల్పనా యుక్తి సచ్ఛీల సంపత్తి సమధికమగు

దీనాళిపై రక్తి దేశంబుపై భక్తి దీపింపనీయంగ తేజమెలర

రాకుండుటేమయ్య? రక్షింప మమ్మింక రాముండు రాకున్న రమ్యమతిని

మాకేది దిక్కింక? శ్రీకాంతునాత్మన్ బ్రకాశింపఁగా దాచి మమ్ము మరచి

నీ తృప్తికై నీవు నిత్యంబు యోచింప నిర్భాగ్యులన్ గావ నిరుపమగతి

నెవ్వండు కల్గున్? మహేశుండవీవంచు నిన్నే మదిన్ నిల్పి  నేర్పుమీర

సేవించు భక్తాళి కీవేకదా దిక్కు రావేమి నీవైన రమ్య హృదయ!

రక్షించ మమ్మింక రాముండొ, కాకున్న రావచ్చు నీవైన ప్రముదముగను

ప్రార్థించు మమ్మున్  బరంధాముఁడారాముడో నీవొ మమ్మెన్ని యుద్యమించి

కావంగ వే రండు.గమ్యంబుచేర్చుండు.కారుణ్యమున్ జూపి.ఘనతరముగ

శ్రీయాంజనేయా! హసించున్ జనానీక మీవింక రాకున్న నీశతేజ!

నే రామకృష్ణుండ నీపైన భక్తిన్ మ హద్దండకంబేనుననుపమగతి

సీసంబులో నింపి యాశించితిన్ వ్రాసి నీదర్శనంబింక నిర్భయదుఁడ!

కన్పింపుమింకన్ బ్రకాశా ! నమస్తే న మస్తే నమస్తేనమః వనచర!

తే.గీ. దండకాన్విత సీసంబు ధరణినెవరు

భక్తితోడను పఠియించువారికిలను

హనుమ సత్కృప లభియించు ననుపమగతి

సుఖము సంతోషమును గల్గి శోభ కలుగు.
జైహింద్.

3, డిసెంబర్ 2019, మంగళవారం

కీ.శే.మానాప్రగడ శేషశాయి...పుట్టపర్తినారాయణాచార్యులవారిపై చేసిన ప్రసంగము.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

2, డిసెంబర్ 2019, సోమవారం

అమర పఠనము.

1 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

1, డిసెంబర్ 2019, ఆదివారం

అమరము ౧వ భాగము.

0 comments

 జైశ్రీరామ్.


జైహింద్.