గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, అక్టోబర్ 2019, గురువారం

సంస్కృత భాషాధ్యయనము ౧౩.

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

30, అక్టోబర్ 2019, బుధవారం

సంస్కృత భాషాధ్యయనము. ౧౧ మరియు ౧౨.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్..

29, అక్టోబర్ 2019, మంగళవారం

కార్తిక మాసం.....

0 comments

జైశ్రీరామ్
శ్లో.న కార్తికసమో మాసో
న కృతేన సమం యుగమ్| 
న వేదసదృశం శాస్త్రం
న తీర్థం గంగయా సమమ్.

కార్తిక మాసంతో సమానమైన మాసము, కృతయుగముతో సరియైన యుగము, వేద సదృశమైన శాస్త్రము, గంగా సమానమైన తీర్థము లేవు. కార్తికమాసములో చేసిన జప, హోమ, దానములు, శివాభిషేకములు, విష్ణుపూజలు విశేషఫలప్రదములు.

అటువంటి కార్తిక మాసము పాడ్యమి (29-10-2019) మొదలు, అమావాస్య (26-11-2019) వరకు ముప్పైరోజులు "
కార్తికమాసం అత్యంత విశేషవంతమైనది. శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తికమాసం. సంవత్సరంలో వచ్చే అన్ని మాసాలకన్నా విశిష్టమైన ఈ కార్తికమాసం అధికఫలదాయకమైంది.

కృత్తికల్లో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కనుక ఇది శివకేశవులిద్దరికీ ప్రీతికరం. ఈ కార్తిక మాస విశిష్ఠతను గూర్చి, వేద వ్యాసమహర్షి తన శిష్యుడైన సూతునికి, సూతముని శౌనకాది ఋషులకు తెల్పాడు.

పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి, అవసరమైన ద్రవ్యానికై వశిష్ఠమహర్షి, జనకమహారాజును అర్థించగా, జనకమహారాజు అందుకు అంగీకరించి, సంవత్సరంలోని సర్వమాసాల కంటే కార్తికమాసం అత్యంత మహిమాన్వితమైనదని చెబుతుంటారు కదా! అయితే ఆ సర్వపాపహరమైన ధర్మసూక్ష్మాన్ని తెలియజేయమంటాడు. అప్పుడు వశిష్ఠుడు విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని కార్తికమాసంలో సూర్యుడు తులా సంక్రమణలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాల యందు చేరుతుంది. ఇట్టి జలాశయాలలో విష్ణువు వ్యాపించి ఉంటాడు కనుక కార్తికస్నానం చేసినవారి పుణ్యం చెప్పనలవికాదు. వాపీకూప, నదీస్నాన, జపాదులను ఆచరించేవారు అక్షయమైన అశ్వమమేథయాగ ఫలాన్ని పొందుతారని వివరిస్తాడు.

స్త్రీలుగాని, పురుషులుగాని కార్తికమాసంలో తప్పనిసరిగా ప్రాతఃస్నానం ఆచరించాలనీ, కార్తికమాసపు సాయంకాలం శివాలయాలలోగానీ, వైష్ణ్వాలయాలలోగానీ యథాశక్తి దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం లభించడమే గాక, శివాలయ గోపురద్వార, శిఖరాలయందుగానీ, శివలింగసన్నిధిలోగానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించి పోతాయని, కార్తికంలో శివాలయంలో ఆవునేతితోగాని, నువ్వులనూనెతో గాని, ఆఖరికి ఆముదంతోగానీ దీప సమర్పణ చేస్తారో, వారు అత్యంత పుణ్యవంతులౌవుతారని, నెల పొడుగునా చేసినవాళ్లు జ్ఞానులై, తద్వారా మోక్షాన్ని పొందుతారని చెప్పబడింది. విష్ణు సన్నిధిలో ఎవరైతే భగవద్గీత పది, పదకొండు అధ్యాయాలను పారాయణ చేస్తారో, వారి పాపాలన్నీ తొలగిపోయి వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారని, తులసీదళాలతో, తెలుపు లేక నలుపు గన్నేరుపూలతోగాని శ్రీమహావిష్ణు పూజను చేస్తారో, వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలననుభవిస్తారని, కార్తికమాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే, పద్దెనిమిది పురాణాలలో ఏదైనా సరే ప్రవచించితే సర్వకర్మబంధ విముక్తులవుతారని వశిష్ఠ వచనం. వేదశాస్త్ర పురాణాలన్నీ మనకు అనేక ధర్మసూక్ష్మాలను అందిస్తున్నాయి.

ఈ ధర్మసూత్రాల వలన మనకు కొన్ని సమయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగానూ, స్వల్ప పుణ్యాలు గొప్పవిగానూ పరిణమిస్తుంటాయి.
పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తికవ్రతం వలన హరించుకుపోతాయి.

కార్తికంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవసించి, రాత్రి నక్షత్రదర్శనానంతరం భోజనం చేస్తూ - ఆ రోజంతా భగద్ధ్యానంలో గడిపేవాళ్లు తప్పక శివ సాయుజ్యాన్ని పొందుతారని సూత ఉవాచ. ఈ మాసంలో ఏకభుక్తం, నక్తభోజనం చేస్తారు. అయితే నక్తం ఉండలేనివారు ఒక కార్తికపౌర్ణమినాడైనా నక్తములున్నా పుణ్యమే. కార్తికమాసమంతా తెల్లవారుఝాముననే స్నానం చేయాలి. అప్పుడే అది కార్తికస్నానం.

కార్తిక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలను ఇస్తాయి. ఈ కార్తికమాస వ్రతాన్ని తులాసంక్రమణదాదిగా గాని, శుద్ధపాడ్యమి నుండి ప్రారంభించాలి. ఈ మాసంలో వస్త్రదానం, హిరణ్యదానం, సువర్ణదానం, కన్యాదానం, భూదానం చేస్తే విశేష ఫలితాలు పొందడమే కాకుండా, తేజస్సు , యశస్సు, కార్యసిద్ధి, జ్ఞానలబ్ధి సౌభాగ్యాలు కలుగుతాయి.

ఈ మాసంలో ఉదయం, సాయంత్రంవేళల్లో ఆవు నేతితో గాని, నువ్వులనూనెతో గానీ దీపారాధన చేసి, అభిషేక ప్రియుడైన ఈశ్వరునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అర్చనలు చేయడం వలన మహా పుణ్యం లభిస్తుంది.

ఈ కార్తికమాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులయితే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు. యజ్ఞయాగాదులకన్నా కార్తికవ్రతం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది. తీర్థయాత్రల వల్ల కలుగునటువంటి ఫలం కూడా కలుగుతుంది, ఈ కార్తికమాసంలో శ్రీ మహావిష్ణుని ఎక్కడైతే పూజిస్తారో, అక్కడ భూత, పిశాచ, గ్రహ గణాలు దూరంగా ఉంటాయి. శివుడికి ప్రీతికరమైన జిల్లేడుపూలతో పూజించితే దీర్ఘాయులై, మోక్షాన్ని పొందుతారు. శుద్ధ ద్వాదశినాడు శివునికి మారేడు దళాలతో, జిల్లేడుపూలతో, విష్ణువుకు తులసీ దళాలతో, జాజిపూలతో పూజించుట అత్యంత శ్రేష్ఠదాయకం.

జలంధరుని భార్యయైన బృందా చితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తలసి వృక్షాలు అవిర్భవించాయి. సరస్వతి - ఉసిరి రూపము, లక్ష్మీ - మాలతి రూపము, గౌరి - తులసి రూపంగా వెలసినారు.

కార్తికమాసం ద్వాదశి రోజున 'తులసి' వృక్షసన్నిధిలో దీపప్రజ్వలనం చేసి,
"నమస్తులసి సర్వజ్ఞే పురుషోత్తమ వల్లభే 
పాహిమాం సర్వపాపేభ్య
స్సద్వ సంపత్ప్రదాయినీ" 
అంటూ ధ్యానం చేస్తూ భక్తి శ్రద్ధలతో తులసిదేవిని పూజించాలి.
ధాత్రీదేవి నమస్తుభ్యం 
సర్వపాప క్షయంకరీ 
విద్యాంచ, పుత్ర పౌత్రాం, 
ఆయురారోగ్యంచ, సంపదాం 
మమదేహి మహాప్రాజ్ఞే 
యశోదేహి బలం చ మే
ప్రజ్ఞాం మేధాం చ సౌభాగ్యం
విష్ణు భక్తిం చ శాశ్వతీం, 
నీరోగం కురుమాం నిత్యం
నిష్పాపం కురుసర్వదా’ 
అనే స్త్రోత్రం చేస్తూ ఉసిరి (ధాత్రీ) చెట్టు క్రింద శ్రీమహావిష్ణువును పూజించి, ఉసిరి దీపారాధన చేసి, ఉసిరికాయలు నివేదన చేసి, పదకొండు ప్రదక్షిణలు చేస్తే, అఖండమైన అష్టైశ్వర్యప్రాప్తి, అనంత పుణ్యఫలం లభిస్తుంది.

ఉసిరిచెట్టు క్రింద శ్రీమహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యమునికి కూడ శక్తి చాలదట. ఉసిరి చెట్లు ఉన్నతోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి. ఉసిరి ఔషధీ గుణము కలది కనుక, వనభోజనాల వలన ఆరోగ్యం చేకూరుతుంది. ఉసిరిపూజ వలన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్లలో స్థిరనివాసం ఏర్పరుచుకుంటుందని, కార్తికమాసంలో స్నానాలు, దీపారాధన, జాగరణ, తులసి, ఉసిరి పూజల వలన, ధన, ఫల, భూదానాల వలన పుణ్యఫలం లభిస్తుందని, కార్తిక మాహాత్మ్యాన్ని విన్నా - పారాయణ చేసినా, సకల పాపాలు నశించిపోతాయని శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తికమహాత్మ్యం ద్వారా తెలుస్తుంది. ఈ కార్తికమాసంలో భక్తిశ్రద్ధలతో హరిహరులను ఆరాధిస్తే సమస్త శుభాలు కలుగుతాయి.
కార్తికమాసంలో ఆధ్యాత్మిక సాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ నెల మొత్తం తెల్లవారుజామున నదీతీరంలోగానీ, చెరువులు, కొలనులు, బావుల వద్ద గానీ స్నానం చేయాలి. స్నానానంతరం ఓంప్రభాకరాయనమః, ఓందివాకరాయనమః, ఓంప్రభాకరాయనమః, ఓంఅచ్యుతాయనమః, ఓంనమో గోవిందాయనమః అనే నామాలను స్తుతిస్తూ సూర్యభగవానునికి ఆర్ఘ్యం పోయాలి. ఈ నెల మొత్తం ఇంటి ముందున్న ప్రధాన ద్వారానికి రెండువైపులా దీపాలను వెలిగించాలి.

కార్తికపౌర్ణమి: 
కార్తికపౌర్ణమి పవిత్రమైనది. ఆ రోజు చేసే స్నానం, దానం, హోమాల వలన అనంతమైన పుణ్యం వస్తుందంటారు. ఆ రోజు గంగాస్నానం చేసి సాయం సమయంలో దీపారాధన చేయాలి. ఆ రోజు చేసే దీపారాధన వలన పది యజ్ఞాలు చేసిన ప్రతిఫలం పొందవచ్చు. కార్తికమాసంలో సత్యనారాయణ వ్రతం ఆచరించి సత్యనారాయణవ్రత కథను వినాలి. సాయంకాలం ఆలయాల్లో లేదా రావి చెట్టు, తులసిచెట్టు ఈమూడింటిలో ఎక్కడో ఒక చోట దీపారాధన వెలిగించాలి. కాశీలో ఈ రీతిని దేవదీపావళీ రూపంలో జరుపుతుంటారు. కార్తిక పౌర్ణమి చేసి జాగరణ చేస్తే కోరుకున్నవన్నీ నెరనేరతాయని చెబుతారు.

దీపారాధన: 
పౌర్ణమినాడు చేసే దీపారాధన చాలా విశిష్టమైంది, సాధారణంగా కృత్తిక నక్షత్రం కార్తిక పౌర్ణమి కలసి వస్తుంటాయి. తిథి కన్నా నక్షత్రంలో దీపారాధన చేయడంశ్రేష్ఠం. ఈ నక్షత్రంలో చేసే దీపారాధనకు కృత్తిక దీపం అనే పేరుకూడా ఉంది. పౌర్ణమినాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్లి దేవుని దర్శించిన అనంతరం, సాయంత్రం శుచిగా ఉసిరికాయతో దీపాలు వెలిగించాలి. బియ్యపిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనే కూడా వాడవచ్చు. కార్తికమాసంలో దీపదానం చేస్తే పుణ్యమని అంటారు. దీప దానం చేయాలనుకునే వారు పత్తితో స్వయంగా వత్తులు చేసుకోవాలి. బియ్యంపిండి లేదా గోధుమపిండితో ప్రమిదలు చేసిన అందులో ఆవునెయ్యితో తాము చేసిన వత్తులు వేసి వెలిగించాలి. బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ నెలలో వచ్చే నాలుగు సోమవారాలలో శివుని పూజించడంతో పాటు ఉపవాస వ్రతాలు చేస్తే మంచిది. ఈ నెలలో వచ్చే అమావాస్య నాడు దేవాలయాలలో రకరకాల దీపారాధనలతో అలంకరిస్తారు. ఎవరు ఎన్ని దీపాలు పెడితే అంత పుణ్యం వస్తుందని ప్రతీతి. కార్తికమాసంలో వెలిగించే దీపాలను దర్శించడం వలన మనుష్యులతో పాటు సమస్త జీవరాసులకు పునర్జన్మ ఉండదని పురాణాల్లో ఉంది. దేవాలయాలలో చేసిన దీపారాధన వలన పుణ్యలోకాలు లభిస్తాయని నమ్ముతారు. కార్తిక మాసంలో దీపదానం చేయడం వలన జన్మాంతర పాపాలు నశిస్తాయంటారు.

దీపప్రాముఖ్యత: 
భారతీయ సాంప్రదాయంలో దీపావళికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి శుభకార్యానికి ముందు జ్యోతిని వెలిగించడం మన సాంప్రదాయం, జ్ఞానానికి సాంకేతికంగా దీపాన్ని చెబుతారు.
ఆలయాల్లోనే కాకుండా గృహాలలో కూడా నిత్యం దీపారాధాన చేయడం ఎంతో కాలంగా వస్తున్న ఆచారం. తొలిసంధ్య నుండి మలిసంధ్య వరకు ఏ ఇంటిలో దీపం వెలిగితే ఆ ఇంట శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుందంటారు. సృష్టి, స్థితి, లయల్లో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపాన్ని త్రిముర్తులకు ప్రతీకగా పేర్కొంటారు. దీపంలో కనిపించే నీలకాంతి విష్ణుమూర్తికి,తెల్లనికాంతి పరమశివుడికి, ఎరుపు బ్రహ్మదేవునికి అర్థంగా చెబుతారు. అలాగే దీపకాంతి విద్యా, ఐశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీసరస్వతులకు   ప్రతీక. భగవంతునికి సమర్పించే షోడశోపచారాలలో దీప సమర్పణ ఒకటి. జ్యోతి స్వరూపంగా పిలువబడే దీపం సిద్ధిశక్తులను ప్రసాదిస్తుందని చెప్తారు.

కార్తిక మాస ప్రాధాన్యత : 
కార్తికమాసంలో చేసే దీపారాధన వలన గతజన్మ పాపాలతో సహా ఈ జన్మపాపాలు కూడా తొలగిపోతాయి. స్త్రీ ఈ దీపారాధన చేయడం వలన సౌభాగ్యాలు సిద్ధిస్తున్నాయి. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవలన్నదే ఈ దీపారాధన ఉద్దేశ్యం.

వనభోజనం: కార్తికమాసం అంటేనే వనభోజనాల మాసం అని చెప్పుకోవచ్చు. ఉసరిచెట్టుక్రింద శ్రీమహావిష్ణువు ఫోటో పెట్టి పూజించడంతో పాటు అదే చెట్టుక్రింద సహపంక్తి భజనాలు చేయాలి.

కార్తికమాస వ్రతాలు: 
అఖండమాస సౌభాగ్యవ్రతం గురించి ముందుగా తెలుసుకుందాం... వివాహితులు ఈ అఖండ సౌభాగ్యవ్రతం చేస్తారు. భర్త కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలంటూ చంద్రుని పూజించి వ్రతాన్ని పూర్తి చేస్తారు. కార్తిక చతుర్దశి నాడు చేసే ఈ వ్రతంలో స్త్రీలు శివపార్వతులను కార్తికేయుని, గౌరీదేవిని పూజించాలి. పాండవులు వనవాసం చేసే రోజులలో అర్జనుడు ఇంద్రకీలాద్రిపై తపస్సుచేయడానికి వెళ్లాడు. ఎంతకాలమైనా తిరిగి రాలేదు. అర్జునుడు రాకపోవడానికి కారణాలు తెలిపాక ద్రౌపది ఎంతో బాధపడింది. అర్జనుడు తిరిగి రావాలంటే సౌభాగ్యవ్రతం చేయాలంటూ కృష్ణుడు ద్రౌపదికి ఈ వ్రతమహాత్యం, వ్రతవిధానం వివరించాడు.

గోవత్స ద్వాదశి ఉత్సవం: 
ఈ మాసంలో వచ్చే కృష్ణ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఆ రోజు వ్రతం చేసుకునే వారు తెల్లవారుజామున లేచి నదీస్నానం చేయాలి. రోజుమొత్తంమీద ఒక్క పూట భోజనం చేయాలి.

గో త్రిరాత్రి వ్రతం: 
ఈ వ్రతాన్ని కార్తిక కృష్ణత్రయోదశనుండి అమవాస్య వరకు చేస్తారు. గోవర్ధనగిరిధారికి రెండు వైపులా రుక్ష్మిణి, సత్యభామలు, బాలచంద్రడు, యశోద తదితర ఫోటోలు పెట్టి పూజించి, తదుపరి గోమాతను పూజంచాలి. తెల్లవారుజామున లేచి స్నానంచేసి గాయిత్రి మంత్రంతో 110 పిడికిళ్లు నువ్వులను ఆహుతి ఇచ్చి వ్రతాన్ని పూర్తిచేయాలి. కార్తీక మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుదభ్రిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి అశుతోషుడు అన్న పేరు వచ్చింది.
 అభిషేక ప్రియః శివః శివునికి అలంకారాలతో రాజోపచారములతో, నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తినుంచుకుని శివుడ్ని ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగ చేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు, ఈతి బాధలు ఉండవు. శివునిని శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజించిన స్వర్గమున లక్ష సంవత్సరములు జీవించును.

ప్రదోషకాలంలో పరమేశ్వరుడు, ఏకకాలంలో రెండురూపాలని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనంచేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులగుదురు. శివాలయములో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్య కార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహా లింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమమైన అర్చన. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సర మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి.
విష్ణు సహస్రనామ పారాయణం: 
తులసి దళాలతో శ్రీమహావిష్ణుని కార్తికమాసంలో పూజిస్తే అది ముక్తిదాయకం అని శాస్త్ర వచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలవబడతాడు. కార్తిక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుదభ్రిషేకాలు చేయడం శ్రేష్ఠం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది. కార్తిక మాసంలో ఏమంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం. కార్తిక పురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయడం శుభకరం.
గౌరీదేవిని పూజిస్తే : 
ఈ మాసం మొదటినుండి సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తిక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్య తిథులలోనైనా స్నానం ఆచరించాలి. కార్తిక మాసం మొదలునుండే ఆకాశదీపం ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యలలో గృహమందు, పూజామందిరంలోను, తులసి సన్నిధిలోను, ఆలయమలలో దీపారాధన, ఇహ, పర సౌఖ్యాలను కలగచేస్తుంది. ఈ మాసం దీపారాధనకి ప్రశస్తం. దీపదానమందు ఆవునెయ్యి ఉత్తమం. మంచి నూనె మధ్యమము. ఏకాదశి అత్యంత విశేషమైనది. ఉత్థానైకాదశి కార్తిక శుద్ధ ద్వాదశి కార్తిక పౌర్ణమి లాంటి దినాలుప్రశస్తమైనవి.

చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో, ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తిక మాసమని పేరు. కార్తిక మాసమునకు సమానమైన మాసము, విష్ణుదేవునికంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్త్రములు, గంగకంటే పుణ్యప్రదములైన తీర్థములు లేవన్నది పురాణ వచనం.కార్తిక మాసం అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది. శివకేశవులకి ప్రీతికరమైన మాసం.
సర్వే జనాః సుఖినో భవంత
మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్.
జైహింద్.

సంస్కృత భాషాధ్యయనము ౧౦ లో ౨.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

28, అక్టోబర్ 2019, సోమవారం

సంస్కృత భాషాధ్యయనము. ౧౦ లో ౧.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

27, అక్టోబర్ 2019, ఆదివారం

సంస్కృత భాషాధ్యయనము ౯.

0 comments

 జైశ్రీరామ్

జైహింద్.

26, అక్టోబర్ 2019, శనివారం

సంస్కృత భాషాధ్యయనము ౭ మరియు ౮.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

25, అక్టోబర్ 2019, శుక్రవారం

సంస్కృత భాషాధ్యయనము ౫ మరియు ౬.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

24, అక్టోబర్ 2019, గురువారం

సంస్కృత భాషాధ్యయనము ౩. మరియు ౪.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

23, అక్టోబర్ 2019, బుధవారం

సంస్కృత భాషాధ్యయనము ౨.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

22, అక్టోబర్ 2019, మంగళవారం

సంస్కృత భాషాధ్యయనము ౧.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

21, అక్టోబర్ 2019, సోమవారం

శ్రీ మహావిష్ణు దండకము.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

20, అక్టోబర్ 2019, ఆదివారం

వద్దిపర్తి పద్మాకర్ అష్టావధానము.

0 comments

 జైశ్రీరామ్.

జైహింద్.

19, అక్టోబర్ 2019, శనివారం

ఆహ్వానం.

0 comments

 జైశ్రీరామ్.
జైహింద్.

18, అక్టోబర్ 2019, శుక్రవారం

శ్రీ సాయినాథునిపై దండకము.

0 comments

 జైశ్రీరామ్

జైహింద్.

17, అక్టోబర్ 2019, గురువారం

శ్రీ మసన చెన్నప్ప గారి మనోగతం

0 comments

  జైశ్రీరామ్.

జైహింద్.

16, అక్టోబర్ 2019, బుధవారం

అసాధారణ భారతీయతకు ఉదాహరణ సోదరి నివేదిత.భాగము 1.

0 comments

  జైశ్రీరామ్.

జైహింద్.

15, అక్టోబర్ 2019, మంగళవారం

ఉద్ధరేత్ ఆత్మ న్ ఆత్మానమ్ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో ఉద్ధరేత్ ఆత్మ న్ ఆత్మానమ్ ఆత్మానమ్ అవసాదయేత్
    ఆత్మైవ హి ఆత్మానో బంధుః ఆత్మైవ రిపుః ఆత్మనః

తే.గీ. తానె యుద్ధరించుకొనును తనను మనిషి.
తానె పతనహేతువగును తనకు చూడ.
తనకు మిత్రుఁడు చూడగ తానె యగును.
తనకు శత్రువు తానెగా తలచ మనిషి.

భావము.
మనిషి ఉద్ధరింపబడటానికి అధోగతి పాలుకావడానికి తనకు తానే కారణం. అందువలను తనను తానే ఉద్ధరించుకోవాలి. తన మనస్సే తనకు బంధువు మరియు శత్రువుకూడాను, మంచి కోరటం, ఆచరించటం వలన మనస్సు బంధువు గా, మన ని ఉద్ధరిస్తుంది. చెడ్డ పనులు ఆలోచనలు వలన మన మనస్సు శత్రువు గా మనలను అధోగతి పాలు చేస్తుంది.


జైహింద్.

14, అక్టోబర్ 2019, సోమవారం

ధర్మ ఏఏవో హతో హంతి......మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో. ధర్మ ఏవో హతో హంతి,
ధర్మో రక్షతి రక్షిత:.
తస్మాద్ధర్మో న హంతవ్యో,
మానో ధర్మో హతోవధీత్.

తే. ధర్మమును చంప ధర్మము చంపు మనను.
ధర్మమును కాయ కాచును ధర్మమేను.
ధర్మమునుచంపుటెన్న నధర్మమగును.
నాశనముకోరకోకున్న నయత నడుము.

భావము.
ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !
జైహింద్.

13, అక్టోబర్ 2019, ఆదివారం

పాత్రాపాత్ర వివేకోస్తి ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్.
శ్లో. పాత్రాపాత్ర వివేకోస్తి ధేనుపన్నగయోరివ
తృణాత్సంజాయతే క్షీరం క్షీరాత్సంజాయతే విషం.
గీ. పాత్రులకుఁ దానమీయంగ వలయు మనమ
పాత్రులకునీయ రాదిల. పట్టి చూడ
పసిరినొసగఁగ ధేనువు పాలనిచ్చు,
పాలు త్రాగియు విషమిడు పన్నగమిల.
భావము. మనం సహాయం చేసేటప్పుడు పాత్రత కలిగివున్న వారికే చేయాలి. అపాత్రదానం చేయకూడదు అంటారు. అలాంటి పాత్ర అపాత్ర వివేకాన్ని సుభాషితకారుడు ధేను పన్నగ యోరివ అంటాడు అంటే పాత్రత కలిగిన వాడిని ధేనువు (ఆవు) తోనూ లేనివాడిని పన్నగం (పాము) తోనూ పోలుస్తాడు. ధేనువు గ్రాసం (గడ్డి) తిని మనకు క్షీరం (పాలు) ఇస్తుంది. అదే పాము పాలు తాగి విషం కక్కుతుంది. పాత్రుడికి తృణం (చిన్న) దానం ఇచ్చినా ఆ సహాయం మరిచిపోకుండా పాల లాంటి మనస్సు తిరిగి ఇస్తాడు. అదే అపాత్రదానం పాలు (పెద్ద సహాయం) చేసినా సంతృప్తి పొందడు సరి కదా తిరిగి విషం కక్కుతాడు.
జైహింద్.

12, అక్టోబర్ 2019, శనివారం

నయద్వయ,యశోవిరాజి,షణ్ణగద్వయ,మృదుపాలక,చిరమ,అతిశోభా,నుతయుతి,గర్భ"-భద్రకాద్వయ"-వృత్తములు.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

జైశ్రీరామ్.
నయద్వయ,యశోవిరాజి,షణ్ణగద్వయ,మృదుపాలక,చిరమ,అతిశోభా,నుతయుతి,గర్భ"-భద్రకాద్వయ"-వృత్తములు.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                         
"-భద్రకా ద్వయ"-వృత్తములు.
ఉత్కృతిఛందము.న.న.న.న.న.న.న.న.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
అతి యుతి నుత మతివి!హర'కురు సుర వరద!అతులిత గుణ ధామా!
మతి నతి జతి యుతివి!మరువరు గురు చరణ!మతి స్తుతి గననిమ్మా!
చతురత గతి నిడుమి!చరమ రమ మమరను!సతి సుతులతి మెచ్చన్!
కుతుకత కలి తరుము!కురు తర తర సురభి!కుతల మతుల శోభన్!
2.
హర కురు సుర వరద!అతియుతి నుత మతివి!అతులిత!గుణధామా!
మరువరు గురు చరణ!మతి నతి జతి యుతిని!మతి స్తుతి గన నిమ్మా!
చరమ రమ మమరను!చతురత గతి నిడుమి!సతి సుతు లతి మెచ్చన్!
కురు తర తర సురభి!కుతుకత కలి తరుము!కుతల మతుల శోభన్?
1.గర్భగత"-నయ ద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.న.న.న.గణములు.వృ.సం.512.
ప్రాసనియమము కలదు.
1.అతి యుతి నుత మతివి!           2.హర కురు సుర వరద!
   మతి నతి జతి యుతివి!               మరువరు గురు చరణ!
   చతురత గతి నిడుమి!                  చరమ రమ మమరను!
   కుతుకత కలి తరుము!                 కురు తర తర సురభి!
2.గర్భగత"-యశోవిరాజి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.న.గగ.గణములు.వృ.సం.64.
ప్రాసనియమము కలదు.
అతులిత గుణ ధామా!
మతి స్తుతి గన నిమ్మా!
సతి సుతు లతి మెచ్చన్!
కుతల మతుల శోభన్!
3.గర్భగత"-షణ్ణగద్వయ వృత్తములు.
ధృతిఛందము.న.న.న.న.న.న.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.  అతియుతి నుత మతివి!హర కురు సురవరద!
     మతి నతి జత యుతివి!మరువరు గురు చరణ!
     చతురత గతి నిడుమి!చరమ రమ మమరను!
     కుతుకత కలి తరుము! కురు తరతర సురభి!

2.  హర కురు సురవరద!అతి యుతి నుతమతి!
     మరువరు గురు చరణ!మతినతి జత యుతిని!
     చరమ రమ మమరును!చతురత గతి నిడుమి!
     కురు తర తర సురభి!కుతుకత కలి తరుము!
4.గర్భగత"-మృదుపాలక"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.న.న.న.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
హర కురు సుర వరద!అతులిత గుణ ధామా!
మరువరు గురు చరణ!మతి స్తుతి గన నిమ్మా!
చరమ రమ మమరను!సతి సుతు లతి మెచ్చన్!
కురు తర తర సురభి!కుతల మతుల శోభన్!
5.గర్భగత"-చిరమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.న.న.న.త.న.న.లల.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
హర కురు సుర వరద!అతులిత గుణ ధామా!అతియుతి నుత మతివి!
మరువరు గురుచరణ!మతి స్తుతి గననిమ్మా!మతి నతి జత యుతిని!
చరమ రమ మమరను!సతి సుతు లతి మెచ్చన్!చతురత గతినిడుమి!
కురు తర తర సురభి!కుతల మతుల శోభన్!కుతుకత కలి తరుము!
6.గర్భగత"-అతిశోభా"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.త.న.న.లల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అతులిత గుణధామా!అతియుతి నుత మతివి!
మతి స్తుతి గన నిమ్మా!మతినతి జత యుతిని!
సతి సుతు లతి మెచ్చన్!చతురత గతి నిడుమి!
కుతల మతుల శోభన్!కుతుకత కలి తరుము!
7.గర్భగత"-నుతమతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.త.న.న.స.న.న.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అతులిత గుణధామా!అతియుతి నుత మతివి!హరి కురు సుర వరద!
మతి స్తుతి గననిమ్మా!మతినతి జత యుతిని!మరువరు గురు చరణ!
సతి సుతు లతి మెచ్చన్!చతురిత గతి నిడుమి!చరమ రమ మమరను!
కుతల మతుల శోభన్!కుతుకత కలి తరుముమి!కురు తరతర సురభి!
 స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

11, అక్టోబర్ 2019, శుక్రవారం

ప్రమాణీ,మత్తరజినీద్వయ,జారయా,రజినీకరప్రియ,కర్తృకర్మ,సుగంథినీద్వయ,సంవాదనాద్వయ,గర్భ"-సామ్యవాద"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

0 comments

 జైశ్రీరామ్.
ప్రమాణీ,మత్తరజినీద్వయ,జారయా,రజినీకరప్రియ,కర్తృకర్మ,సుగంథినీద్వయ,సంవాదనాద్వయ,గర్భ"-సామ్యవాద"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
                           
"-సామ్యవాద"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.ర.య.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18,
ప్రాసనియమము కలదు.వృ.సం.
నిజాయితీ పెరంజనన్!నింగినంటు దోష భాషణల్!నీతిగాన!శక్యమే?ధరన్!
సజాతికర్మ వీడుచున్!సంగమించు పాప మెంచకన్!జాతకాలు మార్ప శక్యమే
వజీరునంచు తృళ్ళగన్!భంగమంబు!భంగమేర్చదే!వాతదోషమంటి శల్యమౌ!
బజారుకుక్క లెక్కనౌ?పంగనామమౌను జీవితమ్!పాతిపెట్టు శర్వు డుగ్రతన్?
1,గర్భగత"-ప్రమాణీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.జ.ర.లగ.గణములు.వృ.సం.86.
ప్రాసనియమము కలదు.
నిజాయితీ!పెరంజనన్?
స జాతికర్మ వీడుచున్!
వజీరునంచు తృళ్ళగన్!
బజారు కుక్క లెక్కనౌ!
2.గర్భగత"-మత్తరజినీద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.
ప్రాసనియమము కలదు.
1.నింగి నంటు దోష భాషణల్!         2.నీతి గాన శక్యమే?ధరన్!
   సంగమించు పాప మెంచకన్?         జాతకాలు మార్ప శక్యమే?
   భంగమంబు భంగ మేర్పదే?           వాత దోషమంటి శల్యమౌ?
   పంగనామ మౌను!జీవితమ్!  ;        పాతి పెట్టు శర్వు డుగ్రతన్!
3.గర్భగత"-జారయా"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నిజాయితీ!పెరంజనన్?నింగినంటు!దోషభాషణల్?
సజాతి కర్మ వీడుచున్!సంగమించు!పాప మెంచకన్?
వజీరునంచు తృళ్ళగన్?భంగముబు భంగమేర్పదే?
బజారు కుక్క లెక్కనౌ?పంగనామ మౌను జీవితమ్!
4.గర్భగత"-రజినీకరప్రియ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నింగినంటు దోష భాషణల్!నీతి గాన శక్యమే?ధరన్!
సంగ మించు పాప మెంచకన్?జాతకాలు మార్ప శక్యమే?
భంగమంబు భంగ మేర్పదే?వాతదోష మంటి శల్యమౌ!
పంగనామ మౌను!జీవితమ్!పాతిపెట్టుశర్వు డుగ్రతన్!
5.గర్భగత"-కర్తృకర్మ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
నింగి నంటు దోష భాషణల్!నీతిగాన శక్యమే!ధరన్!నిజాయితీ పెరంజనన్!
సంగమించుపాప మెంచకన్?జాతకాలు మార్ప శక్యమే!సజాతికర్మవీడుచున్
భంగమంబు భంగమేర్పదే!వాతదోషమంటి శల్యమౌ!వజీరునంచు తృళ్ళగన్
పంగనామమౌను జీవితమ్!పాతిపెట్టు శర్వుడుగ్రతన్!బజారుకుక్క లెక్కనౌ!
6.గర్భగత"-సుగంధినీద్వయ"-వృత్తములు.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.

1.నీతిగాన శక్యమే!ధరన్!నిజాయితీ పెరం జనన్?
    జాతకాలు మార్ప శక్యమే!సజాతికర్మ వీడుచున్?
   వాతదోష మంటి శల్యమౌ!వజీరు నంచు తృళ్ళగన్!
  పాతిపెట్టు శర్వు డుగ్రతన్!బజారు కుక్క లెక్కనౌ?

2.నింగినంటు దోష భాషణల్!నిజాయితీ పెరం జనన్?
  సంగమించు పాప మెంచకన్!సజాతి కర్మ వీడుచున్!
  భంగమంబు భంగ మేర్పదే?వజీరునంచు తృళ్ళగన్!
  పంగనామ మౌను జీవితమ్!బజారు కుక్క లెక్కనౌ!
7.గర్భగత"-సంవాదనా ద్వయ"-వృతుతములు.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
నీతిగాన శక్యమే!ధరన్!నిజాయితీ పెరం జనన్!నింగి నంటు దోష భాషణల్!
జాతకాలు మార్ప శక్యమే!సజాతికర్మ వీడుచున్!సంగమించు పాపమెంచకన్
వాతదోషమంటి శల్యమౌ!వజీరునంచు తృళ్ళగన్!భంగమంబు!భంగమేర్పదే
పాతిపెట్టు శర్వుడుగ్రతన్!బజారుకుక్క లెక్కనౌ!పంగనామమౌను జీవితమ్!
2.
నింగినంటు దోష భాషణల్!నిజాయితీ పెరంజనన్!నీతిగాన శక్యమే ధరన్!
సంగమించు పాపమెంచకన్!సజాతికర్మ వీడుచున్!జాతకాలు మార్ప శక్యమే
భంగమంబు భంగమేర్పదే!వజీరునంచు తృళ్ళగన్!వాతదోషమంటి శల్యమౌ
పంగనామమౌను జీవితమ్!బజారు కుక్కలెక్కనౌ!పాతిపెట్టు శర్వు డుగ్రతన్!
 స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

10, అక్టోబర్ 2019, గురువారం

జరా రూపం హరతి........మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

జైశ్రీరామ్.

శ్లో. జరా రూపం హరతి ధైర్య మాశా,
మృత్యుః ప్రాణాన్ ధర్మచర్యా మసూయా.
కామో హ్రియం వృత్త మనార్యసేవా,
క్రోధః శ్రియం సర్వ మేవాభిమానః.

తే.గీ. ముసలితనమున రూపము పోవు. నాశ
వలన ధైర్యమణఁగు. మృతివలననుసురు
పోవు. ధర్మముననసూయపోవు. పోవు
లజ్జ కామమునను. దుష్టులవలనను
పోవు
మంచి నడత, కోపమునను మహిని ధనము,
గర్వమున్ బోవు సర్వము. గరుడగమన!

భావం.
ముసలితనము రూపాన్నీ , ఆశ ధైర్యమును , మృత్యువు ప్రాణాలను , అసూయ ధర్మప్రవృత్తినీ , కామము లజ్జను , దుష్టసేవ సత్ప్రవర్తనను , కోపము ఐశ్వర్యమును , గర్వము సర్వమును హరించివేస్తాయి .

మొదటిదాన్నీ మూడోదాన్నీ ఎలానూ తప్పించుకోలేం. కనుక మిగిలినవాటినైనా వదిలించుకొనే ప్రయత్నం చేద్దాం.
జైహింద్.

9, అక్టోబర్ 2019, బుధవారం

కాళిదాస కవితా సౌందర్యము. రచన : అష్టావధాని , సాహిత్య శిరోమణి డా.మాడుగుల అనిల్ కుమార్

2 comments

జైశ్రీరాం.
కాళిదాస కవితా సౌందర్యము.
రచన : అష్టావధాని , సాహిత్య శిరోమణి డా.మాడుగుల అనిల్ కుమార్

సంస్కృతమను భాష ఒకటుందని తెలిసిన వారెవరికైనా వాల్మీకి , వ్యాసుల తదనంతరం గుర్తుకు వచ్చేది కాళిదాసే. ఈయన పురాణాలనాధారంగా చేసుకొని కావ్యాలను జనరంజకంగా రచించాడు. 1. రఘువంశము 2. కుమార సంభవము 3. ఋతు సంహారము 4. మేఘ సందేశము అనే శ్రవ్య కావ్యాలను ; 1. మాళవికాగ్నిమిత్రము 2. విక్రమోర్వశీయము 3. అభిజ్ఞాన శాకుంతలము అనే దృశ్యకావ్యాలను మహాకవి కాళిదాసు రచించాడు. వీటిలో రఘువంశ , కుమార సంభవ కావ్యాలు రెండు కూడ సంస్కృత పంచమహాకావ్యాలలో చోటు సంపాదించుకున్నాయి. ఇవి కాక 1. శ్యామలా దండకము 2. కాళీ అష్టకము 3. గంగాష్టకము 4. మంగళాష్టకము 5. శృంగార తిలకము 6. నలోదయము 7. లంబోదర ప్రహసనము 8. పుష్పబాణ విలాసము 9. జ్యోతిర్విదాభరణము 10. చిద్గగన చంద్రిక 11. ఉత్తర కాలామృతము మొదలగు మఱి కొన్ని గ్రంథాలను కాళిదాసు కృతులుగా చెప్తున్నారు. వీటిలో శ్యామలా దండకము , శృంగార తిలకము , జ్యోతిర్విదాభరణము , పుష్పబాణ విలాసము , ఉత్తర కాలామృతము చాలా ప్రసిధ్ధిగాంచినవి. ఇవి తప్ప తక్కినవి కాళిదాసు రచనలు కావనే విమర్శ కూడ వుంది.
వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే ల్
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ల్ల్     ర.వం. 1-1
అను ఈ శ్లోకం ఎవరు వ్రాసినదీ అందరికీ తెలియక పోవచ్చు కానీ మంగళ శ్లోకంగా వివాహ ఆహ్వాన పత్రికలలో చోటు సంపాదించి బహుళ ప్రచారాన్ని పొందింది. సుందరమైన ఉపమాలంకారము , ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందటానికి చేసిన ప్రార్థన ప్రాధాన్యతను సంతరించుకోవడమే అందుకు కారణము. పార్వతీపరమేశ్వరులకు నమస్కారమనటంలో ఆ వాక్యానికి వచ్చే సౌందర్యమేమీ వుండదు. ‘ అర్థము , మాట ఒండొకటి కలిసియున్నట్లు కలిసియున్న , జగత్తునకు తలిదండ్రులైన పార్వతీపరమేశ్వరులకు నమస్కారము ‘ అనటంలో అత్యద్భుతమైన ఉపమాలంకార సౌందర్యం వుంది. ఇటువంటి సౌందర్యవంతమైన ఉపమాలంకారాన్ని ప్రయోగించే చాతుర్యం ఒక్క కాళిదాసుకు మాత్రమే వుంది. అందుకే ‘ ఉపమా కాళిదాసస్య ‘ అనే నానుడి కూడ యేర్పడింది. ఉపమాలంకారం కూడ కాళిదాసుకే అంకితమైంది. మహాకవి కాళిదాసు కూడ కవికుల గురువుగా కీర్తించబడినాడు.
జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః 
నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం భయమ్.
అని సూక్తి. రససిద్ధులైన కవులు జన్మిస్తూనే వుంటారు. వారి కీర్తిశరీరానికి ముదుసలితనము , చావు అన్న భయం వుండనే వుండదు. అట్టి వారిలో వాల్మీకి , వ్యాసుల తరువాత స్థానం కాళిదాసుదే. అందుకే –
పురా కవీనాం గణనా ప్రసంగే
కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసా.
అద్యాపి తత్తుల్య కవేరభావాత్
అనామికా సార్థవతీ బభూవ.
అని చెప్పారు పెద్దలు. సంస్కృతంలో చిటికెన వ్రేలును ‘ కనిష్ఠికా ‘ అంటారు. ఉంగరము వ్రేలును  ‘ అనామికా ‘ అంటారు. అనామికా అంటే పేరు లేనిది అను అర్థం కూడ వుంది. పూర్వమొకసారి ఎవరో మహాకవులెవరెవరని చిటికెన వ్రేలు వద్ద నుండి లెక్కిస్తూ ‘ కాళిదాసు ‘ అని వ్రేలు ముడుచుకున్నారు. ‘ అనామిక ‘ ( ఉంగరము వ్రేలు ) దగ్గరికి వచ్చు సరికి కాళిదాసు తరువాత అంతటి కవి ఎవరూ ఆయనకు ఊహకందలేదట. కాళిదాసు అంతటి కవి యిప్పటి వఱకు లేనందువలన ‘ అనామిక ‘ సార్థక నామధేయాన్ని పొందినది. అలాగే ఒకానొక సాహిత్య పిపాసి –
కాళిదాసకవితా , నవం వయో ,
మాహిషం దధి సశర్కరం పయః
ఐణమాంస , మబలా చ కోమలా
సంభవంతు మమ జన్మ జన్మని 
‘ ప్రతిజన్మలోను నాకు కాళిదాసు కవిత్వము , యౌవనము , బఱ్ఱె పెరుగు , చక్కర వేసిన పాలు, దుప్పి మాంసము , సుందరియగు యువతి అనునవి లభించాలి ‘ అని కోరుకున్నాడట. అంత సుందరమైనది కాళిదాస కవిత్వము. అది ఎంత సౌందర్యమంటే –
పుష్పేషు జాజి, పురుషేషు విష్ణుః
నారీషు రంభా, నగరీషు కాంచీ,
వీరేషు రామః, విమలీషు పూషా,
కావ్యేషు మాఘః, కవి కాళిదాసః.
‘ పూవులలో జాజిపూలు , పురుషులలో విష్ణువు , స్త్రీలలో రంభ , నగరములలో కంచి , వీరులలో రాముడు , నక్షత్రాలలో పూర్వాషాఢ , ఉత్తరాషాఢ , కావ్యములలో మాఘుడు రచించి మాఘము అని పిలువబడు శిశుపాల వధ మహాకావ్యము , కవులలో కాళిదాసు ‘ ఉత్తమములని ఒక కవి పేర్కొన్నాడు.
కాళిదాసుకు ప్రజలంటే చాల యిష్టం. వారి కోసమే సుమధురమై , సరళమైన కావ్యాలను రచించాడాయన. అందుకే విదేశీయులు కూడ కాళిదాసు కావ్యాల కోసం యెగబడుతున్నారు. అంత ప్రసిధ్ధి పొందినందుకే –
కవయః కాళిదాసాద్యాః కవయో వయమప్యమీ.
పర్వతే పరమాణౌ చ పదార్థత్వం వ్యవస్థితమ్.
‘ కవులంటే కాళిదాసు మొదలైన వారు. మేము కూడ కవులమే. పదార్థము అంటే పర్వతము పదార్థమే , పరమాణువూ పదార్థమే. పర్వతానికీ పదార్థానికీ ఎంత వ్యత్యాసముందో కాళిదాసాదులకు , ఇతర కవులమైన మాకు అంత వ్యత్యాసముంది ‘ అని కుమారిల భట్టు అనే ప్రఖ్యాత కవిపండితుడు , మీమాంసా శాస్త్ర ప్రవర్తకుడు సవినయంగా వక్కాణించాడు.
కాళిదాసు రచన చదువు కొలదీ యిష్టమైన పదార్థాన్ని జుఱ్ఱుకొంటున్నట్లుగా పాఠకులు మఱింత ఆస్వాదనాసక్తులౌతారు. మల్లినాథసూరి అనే గొప్ప సంస్కృత వాఙ్మయ వ్యాఖ్యాత మన ఆంధ్రీయుడే. ఆయన –
కాళిదాసగిరాం సారం కాళిదాసస్సరస్వతీ 
చతుర్ముఖోస్థవా సాక్షాత్ విదుర్నాన్యే తు మాదృశాః 
‘ కాళిదాసు మాటలలోని సారం కాళిదాసుకు , సరస్వతికి , బ్రహ్మదేవునికి మాత్రమే తెలుసు. మా వంటి వారికెట్లా తెలుస్తుంది ? ‘ అన్నాడు. అంతటి గొప్ప వ్యాఖ్యానకారుడే కాళిదాసు కావ్యాలలో అంతరార్థాలున్నాయి , నా వంటి వారికి కూడ తెలియదన్నాడంటే నామ మాత్రంగా తెలిసిన మనమెట్లు మెలగ వలెనో కదా !  మఱియొక అజ్ఞాత కవి నూటికి నూరు శాతం నిజమైన మాటను –
కవిరమరః కవిరమరుః కవిరభినందశ్చ కాళిదాసశ్చ 
అన్యే కవయః కపయః చాపలమాత్రం పరం దధతే .
‘ అమరకుడు , అమరసింహుడు , అభినందుడు , కాళిదాసు అనే కవులే కవులంటే. ఇతర కవులన్నచో కవులు కారు కపులు = కోతులు. అందువలననే కోతులకు చపలస్వభావము వున్నట్లు తాము కూడ కవిశబ్దవాచ్యులు కావలెనని కుప్పిగంతులు వేస్తున్నారు ‘ అని తెలియజేశాడు. ఇక్కడ ఒక విషయం లోతుగా ఆలోచించదగినది. మహాకవి , కవికుల గురువు అయిన కాళిదాసు వాల్మీకి , వేదవ్యాసుల విషయంలో వినయంగా వ్యవహరించాడు. ఇతర కవుల కావ్యాలలో జోక్యం చేసుకొని దోషైకభుక్కు కాలేదు. కాళిదాసు ఇతర కవులు , విద్వాంసుల యందు కనబరచిన వినయాన్ని పరిశీలిస్తే మనము ముక్కున వ్రేలు వేసుకొనవలసిందే.
ఆపరితోషాద్విదుషాం న సాధు మన్యే ప్రయోగ విజ్ఞానమ్.
బలవదపి శిక్షితానామాత్మన్యప్రత్యయం చేతః.        అ.శా. సూత్రధారుడు
‘ పండితులు చూసి మెచ్చుకొనునంత వఱకు నేను చేసిన ప్రయోగము సరియైనదని నమ్మను. పనిలో ఎంతటి నేర్పరియైనను తన పని మీద అతనికి సరిగా వున్నదను నమ్మకము(ఆత్మతృప్తి) కలుగదు. దానిని యితరులు చూసి మెచ్చుకొనినప్పుడే ఆత్మవిశ్వాసము కలుగుతుంది ‘ అని అభిజ్ఞాన శాకుంతలంలో సూత్రధారునితో పలికిస్తాడీ శ్లోకాన్ని కాళిదాసు.  అలాగే –
తం సంతః శ్రోతుమర్హంతి సదసద్వ్యక్తి హేతవః 
హేమ్నః సంలక్ష్యతేహ్యగ్నౌ విశుద్ధిః శ్యామికాపి వా .        ర.వం. 1-10
‘ గుణదోషముల వివేకము కలిగిన విద్వాంసులే నా కావ్యమును వినదగినవారు. బంగారము యొక్క స్వచ్ఛత లేక మాలిన్యము ( నైర్మల్యము లేక యితర లోహముల కలయిక ) బంగారమును నిప్పులలో వేసి కరగించినప్పుడే కదా తెలుస్తున్నది ‘ అని రఘువంశ మహా కావ్యంలో కాళిదాసు మిక్కిలి వినయంగా చెప్పాడు. ఇటువంటి జనరంజకమైన అర్థాంతర విన్యాసాలతో పాఠకుల హృదయాలను ఆకట్టుకొంటుంది కాళిదాస కవిత్వము. పై రెండు శ్లోకాలను వినయంగా విన్నవించుకొన్న కాళిదాసు కొన్ని సందర్భాలలో –
పురాణమిత్యేవ న సాధు సర్వం
న చాపి కావ్యం నవమిత్యవద్యమ్
సంతః పరీక్ష్యాన్యతరత్ భజంతే
మూఢఃపరప్రత్యయనేయబుద్ధిః           మాళవికాగ్నిమిత్రము.1-2
‘ కావ్యము ప్రాచీనమైనదైనచో అది మంచిదని , నవీనమైనదైనచో అది ఆదరింపరానిదని నిర్ణయించటం తగదు. కావ్యము ప్రాచీనమైనదైనను , నవీనమైనదైనను అందులోని గుణదోషాలను సమర్థులైన విద్వాంసులు పరిశీలించి నిర్ణయిస్తారు. మూర్ఖుడు యితరుల నిర్ణయాలను విని  దానినే ప్రమాణంగా స్వీకరిస్తాడు ’ అని ఆత్మవిశ్వాసాన్ని కూడ ప్రదర్శించాడు. కాళిదాస రచనలలో మాళవికాగ్నిమిత్రము మొదటి రచన అని పెద్దలమాట. తన మొదటి రచనలోని మొదటి శ్లోకములో విమర్శకులకు గడుసైన సమాధానం చెప్పాడు.  కుమారసంభవంలో –
అనంతరత్న ప్రభవస్య యస్య
హిమం న సౌభాగ్య విలోపి జాతమ్ 
ఏకో హి దోషో గుణ సన్నిపాతే
నిమజ్జతీందోః కిరణేష్వివాంకః               కు.సం. 1-2
‘ ఎన్నో రత్నరాశులకు , వృక్షరాజాలకు నిలయమైన హిమవత్పర్వతంలో మంచు నిండియుండటమనే ఒక దోషం లెక్కింప దగినది కాదు. అదెట్లంటే చంద్రునిలోని మచ్చ చంద్రుని తెల్లని కిరణాలతో కలసిపోయినట్లు మంచి గుణాల గుంపులో కలసిపోతుంది ‘ అని చెప్పాడు. ఎవరైనను మూర్ఖులు కావ్యంలోని ఏదేని ఒక దోషాన్ని వేలెత్తి చూపవచ్చు. అటువంటి దోషమెక్కడున్ననూ అనంత గుణరాశిలో లీనమౌతుందనే వ్యంగ్యార్థమిందులో మనకు కనిపిస్తుంది. అందుకు తగినట్లే దరిద్రాన్ననుభవిస్తున్న ఒకానొక అజ్ఞాత కవి –
ఏకో హి దోషో గుణసన్నిపాతే
నిమజ్జతీందోరితి యో బభాషే 
నూనం న దృష్టః కవినాపి తేన
దారిద్రదోషో గుణరాశి నాశీ 
‘ చంద్రునిలోని మచ్చ చంద్ర కిరణాలలో కలసిపోతుందని చెప్పిన కాళిదాసుకు దరిద్రమంటే ఏమో తెలియదు. దానిని ఆయన అనుభవించలేదు కాబట్టి అదియే ఆయనలోని దోషము ‘ అని కాళిదాసును వ్యాజస్తుతి చేశాడు.
ఉపమా కాళిదాసస్య భారవేరర్థ గౌరవమ్ 
దండినః పద లాలిత్యం మాఘే సంతి త్రయో గుణాః 
అను ప్రసిద్ధ శ్లోకముంది. కాళిదాస కవిత్వంలో ఉపమాలంకారాలు ఎక్కువగా వున్నాయి.  ఉపమాలంకారాన్ని కడుసుందరంగా మలచడంలో కాళిదాసు సిద్ధహస్తుడు. అలాగే భారవి అర్థానికి , దండి పదలాలిత్యానికి ప్రాధాన్యతనిచ్చారు.

సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ
యం యం వ్యతీయాయ పతింవరా సా 
నరేంద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే
వివర్ణ భావం స స భూమిపాలః                        ర.వం.6-67
‘ రాత్రి సమయంలో సంచరించు దీపపు శిఖ వలె రాజుల వరుసలో వరుని వరించు ఇందుమతి యే యే రాజులను వదలి వెళ్ళుచున్నదో ఆ రాజుల ముఖాలు  దీపపు శిఖ వెళ్ళిపోయిన తరువాత రాజమార్గంలో భవనాలు వెలవెల బోయినట్లు కాంతివిహీనాలైనాయి ’. ఇందుమతీ స్వయంవర సందర్భంలోనిదీ శ్లోకము. ఆ కాలంలో రాత్రులందు రాజవీధులలో నడిచేటప్పుడు దివిటీలు తీసుకువెళ్ళేవారు. అప్పుడు దీపపు కాంతి భవంతులపై పడి కాంతివంతాలయ్యేవి. దివిటీని ముందుకు తీసుకువెళ్ళిన తరువాత వెనుకనున్న భవంతులు వెలవెలబోయేవి. రాజుల ముఖాలను రాజమార్గంలోని భవంతులతోను , ఇందుమతిని దీపపు శిఖతోను పోలుస్తూ ఇంత అద్భుతమైన ఉపమానాన్ని చెప్పినందుకు కాళిదాసుకు “ దీపశిఖా కాళిదాసు “ అను బిరుదు వచ్చింది.
మఱియొక సుందరమైన ఒకే వర్ణన రఘువంశ , కుమార సంభవాలలో ప్రయోగించాడు కాళిదాసు.
బాలార్క ప్రతిమేవాప్సు వీచి భిన్నా పతిష్యతః 
రరాజ రక్షఃకాయస్య కంఠచ్ఛేద పరంపరా               ర.వం.12-100
‘ రక్తాన్ని కారుస్తూ నేలపై పడుతున్న రావణుని తలల వరుస మహానదులలో ప్రతిఫలించే బాలసూర్యుని ప్రతిబింబాల వలె ప్రకాశించింది ‘. నదులలో పెద్ద తరంగాలు వచ్చినపుడు  ఎఱ్ఱని బాలభానుని ప్రతిబింబాన్ని తరంగములు ఒకదాని వెంట మఱియొకటి తీసుకొనిపోతూ ఎఱ్ఱదనంతో ఉన్నట్లు ప్రకాశించినదని భావం. ఇదే వర్ణననే కాళిదాసు –
గగనాదవతీర్ణా సా యథా వృద్ధ పురస్సరా 
తోయాంతర్భాస్కరాళీవ రేజే ముని పరంపరా          కు.సం.6-49
‘ సప్తర్షులు శివునికి పార్వతినిమ్మని అడిగేందుకు హిమవంతుని దగ్గరకు వస్తున్నారు. ఆకాశం నుండి హిమవత్పర్వతము మీదకు దిగుతున్న మునుల వరుస నీటిలోని సూర్య బింబాల వలె ప్రకాశించింది ‘ అని కుమార సంభవంలో కూడ ఉపయోగించాడు. కాళిదాస కావ్యాలనన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే సౌందర్యవంతమైన వర్ణనలను ఒక కావ్యంలో వర్ణించిన దానిని మఱియొక కావ్యంలో వర్ణిస్తూ రసికులను ఆనంద సాగరంలో ముంచాడని స్పష్టమౌతుంది.
హృదయవిదారకమైన వర్ణనలను యథా తథంగా కళ్ళకు కట్టినట్లు వర్ణించటం కాళిదాసు నైజం. గ్రీష్మర్తువులో ఎండలకు తాళలేక ఆహారాన్ని సరిగా తీసుకొనలేక పోవడం మనకు అనుభవమే. ఎండవేడిమికి నోటి వద్దనున్న పామును తినలేని నెమలిని , ఎండవేడిమికి తాళలేక శత్రువును సైతమాశ్రయించిన పామును –
రవేర్మయూఖైరభితాపితో భృశం
విదహ్యమానః పథి తప్త పాంశుభిః 
అవాఙ్ముఖోస్ జిహ్మగతిః శ్వసన్ముహుః
ఫణీ మయూరస్య తలే నిషీదతి            ఋ.సం.1-13
‘ సూర్యకిరణాలు మొదట మాడ్చినాయి. తరువాత దారిలోని వేడి ధూళులు కాల్చినాయి.  ప్రాకడం మాని తలవంచి నిట్టూరుస్తున్న పాము నెమలి పురి నీడ క్రిందకు చేరుకొన్నది ‘ అంటూ కాళిదాసు అద్భుతంగా వర్ణించాడు. వైరి జంతువులు స్నేహంగా మెలగుతున్నాయని తెలిస్తే అదొక ఆశ్రమమని తలుస్తాము. కాని దారిలో ఎండవేడికి తట్టుకోలేక వైరి ప్రాణులు తమ శత్రుత్వాన్ని మఱచి మెలగినాయని సహజమైన ప్రకృతిని కండ్లకు కట్టినట్లు యిలా వర్ణించటం  కాళిదాసుకు మాత్రమే సాధ్యమైంది.
కుబేరుడు శివపూజకై పూలు తెమ్మని యక్షుని ఆదేశించాడు. ప్రియురాలిపై మనసు నిలిపిన యక్షుడు బాధ్యతను మరిచాడు. దీనిని తెలుసుకున్న కుబేరుడు ‘ సంవత్సర కాలం పాటు నీ ప్రియురాలిని యెడబాసెద ‘ వని యక్షుని శపించాడు. యక్షుడు ప్రియురాలి విరహమనుభవిస్తూ ఎనిమిది నెలలు చిత్రకూట పర్వతంపై గడిపాడు. ఆషాఢమాసంలో కొండ చరియలను క్రమ్ముకొని ఆయనకొక మేఘం కనిపించింది. యక్షుడా మేఘంతో ప్రియురాలికి సందేశాన్ని పంపుతాడు. ఇది ఎక్కడైనను సంభవమా ? అనే సందేహం మనకుదయిస్తుంది. ఇదే సందేహాన్నే కాళిదాసు కూడ వ్యక్తం చేస్తూ –
ధూమజ్యోతిస్సలిలమరుతాం సన్నిపాతః క్వ మేఘః
సందేశార్థాః క్వ పటుకరణైః ప్రాణిభిః ప్రాపణీయాః
ఇత్యౌత్సుక్యాదపరిగణయన్ గుహ్యకస్తం యయాచే
కామార్తా హి ప్రకృతి కృపణాశ్చేతనాచేతనేషు                మే.సం.1-5
‘ పొగ , నిప్పు , గాలి – అను వాటి సముదాయ రూపమైన మేఘమెక్కడ ? మనుషులచే పంపనగు సందేశమెక్కడ ? ప్రియురాలిపై అనురాగంతో యిటువంటి ఆలోచన చేయని యక్షుడు మేఘముతో ప్రియురాలికి సందేశం పంపాడు. ఈ పని తగినదే. ఎందుకంటే కాముకులకు చేతనమేది? అచేతనమేది అని ఆలోచించే పరిజ్ఞానముండదు ‘ అని సమాధానం చెప్పాడు.
ఈ ఒక్కమాటనాధారంగా చేసుకొని సందేశాన్ని వస్తువుగా స్వీకరించి నగరాలనన్నిటినీ పరిచయం చేయడం కాళిదాసు వర్ణనా నైపుణ్యానికి నిదర్శనంగా భావించవచ్చు. అంతే కాక సందేశ కావ్యాలలో మేఘ సందేశమే మొదటి కావ్యంగా గమనింపదగినది. అట్లే రామగిరి నుండి అలకా పట్టణానికి వెళ్ళు మార్గంలో ఉజ్జయినీ నగరము లేకపోయినను తనకిష్టమైన  స్థలమైనందుకు మేఘుని దారి మళ్ళించి ఉజ్జయినీ నగరం మీదుగా వెళ్ళమని చెప్పి ఆ నగర శోభను వర్ణించాడు.
వక్రః పంథా యదపి భవతః ప్రస్థితస్యోత్తరాశాం
సాధోత్సంగప్రణయవిముఖో మాస్మభూరుజ్జయిన్యాః
విద్యుద్ధామస్ఫురితచకితైర్యత్ర పౌరాంగనానాం
లోలాపాంగైర్యది న రమసే లోచనైర్వంచితః స్యాః          మే.సం.1-28
‘ ఓ మేఘుడా ! ఉత్తర దిశకు వెళ్ళుచున్న నీకు ఉజ్జయినీ మార్గము వంకరైనను ఉజ్జయినికి వెళ్ళుము. అచ్చట స్త్రీలు నీ మెఱుపులను చూసి భయపడెదరు. అప్పుడు వారి బెదురుచూపులు చాలా సుందరంగా ఉంటుంది. ఆ సౌందర్యాన్ని చూడనట్లైతే నీ జన్మ వ్యర్థమౌతుంది ‘ అని చెప్పి మేఘుని ఉజ్జయిని మీదుగా మళ్ళించాడు. దీనితో ఉజ్జయినిపై కాళిదాసుకున్న మమకారం వ్యక్తమౌతున్నది.
వేద , పురాణాలలోని కథలను మార్పు చేర్పులు చేసి కాళిదాసు కావ్యాలను రచించాడు. అట్లాగావించిన వాటిలోనే అత్యంత మనోహరమైన ‘ విక్రమోర్వశీయము ‘ అను త్రోటకము ( రూపక భేదాలలో మరొక ఉపభేదము ) ఒకటి. సంధ్యావందనం చేసుకొనుటకు వెళ్ళిన పురూరవుడు చిత్రలేఖ , ఊర్వశి అను అప్సరసల ఆక్రందనలను విని , కేశి అను రాక్షసుడు వారినపహరించుకుని పోతున్నాడని తెలిసికొని వాయవ్యాస్త్రముతో రాక్షసుని చంపి అప్సరసలను విడిపించాడు. అప్పుడు ఊర్వశీ పురూరవుల మధ్య అనురాగమావిర్భవించింది. విక్రమాన్ని చూపి ఊర్వశి హృదయం గెలుచుకొన్నందుకు ‘ విక్రమోర్వశీయము ‘ అను నామధేయమేర్పడింది. కాళిదాసు కావ్యాలలో సూక్తులు చాలా ప్రసిధ్ధి వహించాయి. అటువంటి సూక్తులు విక్రమోర్వశీయంలో అనేకంగా వున్నాయి.
యదేవోపనతం దుఃఖాత్ సుఖం తద్రసవత్తరమ్ 
నిర్వాణాయ తరుచ్ఛాయా తప్తస్య హి విశేషతః       విక్ర.3-21
‘ దుఃఖం తరువాత కలిగే సుఖం ఎంతో ఆనందాన్నిస్తుంది. ఎండలో మాడిన వానికే చెట్టు నీడ విలువ తెలుస్తుంది. ‘ పురూరవుని వద్దకు ఆలస్యంగా వచ్చిన ఊర్వశి అందుకు సంజాయిషీ యిచ్చుకుంటుంది. అప్పుడు పురూరవుడు ఊర్వశిననుయయిస్తూ ఈ మాటంటాడు. సందర్భానుసారంగా యిటువంటి సుందరమైన లోకోక్తులను గుప్పించడం మహాకవి కాళిదాసు కావ్యాల ప్రత్యేకత. అలాగే –
భవంతి నమ్రాస్తరవః ఫలోద్గమైః
నవాంబుభిర్దూర విలంబినో ఘనాః
అనుధ్ధతాః సత్పురుషాః సమృద్ధిభిః
స్వభావ ఏవైష పరోపకారిణామ్                అ.శా.5-13
‘ పండ్లు కాపుకు వచ్చిన తరువాత చెట్లు యితరులు వాటిని తీసుకోవడానికనుకూలంగా క్రిందకు వంగుతాయి. క్రొత్త నీటిని మోసుకొని వచ్చిన మేఘాలు మిక్కిలి క్రిందకు వంగుతూ అధికంగా వర్షాన్నిస్తాయి. కాబట్టి సత్పురుషులు యెంత సంపదలు లభించినా గర్వించక వినయంగా వంగి వుంటారు ‘ అనే సుప్రసిద్ధమైన ఈ సుభాషితం కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం లోనిదే.
కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతలా 
తత్రాపి చ చతుర్థోంస్కః తత్ర శ్లోక చతుష్టయమ్ 
అనే ప్రసిద్ధమైన శ్లోకమొకటుంది.’ సంస్కృత కావ్యాలలో నాటకం మనోహరమైనది. నాటకాలలో అభిజ్ఞాన శాకుంతలము , అందులోను  మరల నాలుగవ అంకము , దానిలో నాలుగు శ్లోకాలు రమ్యమైనవి ‘.  ఈ నాలుగు శ్లోకాలలో –
యాస్యత్యద్య  శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా
కంఠస్తంభిత బాష్పవృత్తి కలుషం చింతా జడం దర్శనమ్
వైక్లబ్యం మమ తావదీదృశమహో  స్నేహాదరణ్యౌకసః
పీడ్యంతే గృహిణః కథంను తనయా  విశ్లేష దుఃఖైర్నవైః      అ.శా. 4.5
అను శ్లోకం మొదటిది. ‘ ఈరోజు శకుంతల అత్తవారింటికి వెళ్ళునని నా హృదయం మిక్కిలి దుఃఖంతో కూడుకొన్నది. కన్నీటిని అణచుకొన్నందుకు గొంతు డగ్గుత్తికతో వుంది. చింత వలన చూపానటం లేదు.  పెంచిన అమ్మాయిని అత్తవారింటికి పంపుటకు అరణ్యవాసినైన నాకే  ప్రేమ వలన  యిట్టి అధైర్యము కలిగితే యిక గృహస్థులు , కని పెంచిన వారు తమ కుమార్తెను క్రొత్తగా భర్త యింటికి పంపుటకు యెంతటి వియోగ దుఃఖాన్ననుభవిస్తారో ‘ – ఇదీ శకుంతలను దుష్యంతుని వద్దకు పంపునపుడు ఆమె పెంపుడు తండ్రియైన కణ్వమహర్షి దుఃఖించిన తీరు. ఆయన ఒక చోట     ‘ వనౌకసః సంతోస్పి లోకజ్ఞా వయమ్ ‘ – అడవులలో తిరుగువారైనప్పటికీ మేము లోకం  తెలిసినవారమంటాడు. ఒక లౌకికమైన అమ్మాయి తండ్రి కూతురును భర్త యింటికి పంపునప్పుడు కన్నీరు మున్నీరయ్యే  బాధను తపస్వియైన , అరణ్యవసియైన కణ్వమహర్షి అనుభవించి చూపాడు.
మేఘ సందేశంలో యక్షుడు మేఘంతో సందేశం పంపాడు. ఇక్కడ కణ్వమహర్షి చెట్లతో మాట్లాడుతున్నాడు.
పాతుం న ప్రథమం వ్యవస్యతి జలం యుష్మాస్వపీతేషు యా
నాదత్తే  ప్రియమండనాపి భవతాం స్నేహేన యా పల్లవమ్
ఆద్యే  వః  కుసుమప్రసూతిసమయే యస్యా భవ త్యుత్సవః
సేయం యాతి శకుంతలా పతిగృహం సర్వైరనుజ్ఞాయతామ్     అ.శా. 4.8
నాల్గవ అంకంలోని నాలుగు శ్లోకాలలో యిది రెండవ శ్లోకం. కాళిదాసు తన కావ్యాలలో చెట్లకు చాలా ప్రముఖ్యతనిచ్చాడు. ఈ శ్లోకంలో కణ్వమహర్షి  చెట్లతో మాట్లాడుతూ – ‘ మీకు నీళ్ళు పోసి మీరు త్రాగిన తర్వాతనే శకుంతల నీరు త్రాగుతుంది. అట్లా కాక ఆమె ఒకరోజైనను నీరు త్రాగలేదు. ఆమెకు అలంకారాలంటే యెంత యిష్టమున్నను మీపై ప్రేమచే చిగురాకైనను కోయలేదు. మీకు తొలిపూత వచ్చినప్పుడు ఆమె గొప్ప పండుగ చేసుకొనేది. అటువంటి శకుంతల నేడు అత్తవారింటికి వెళ్ళుతున్నది.  కనుక మీరు ఆనతినివ్వండి ‘  అంటాడు. ఆశ్రమ వాసులకు చెట్లు , జంతువులతోనే కదా సాంగత్యము. ఆయన వాటితో అంత కలసిపోయాడు మఱి. అందుకే వాటితోనే తన బాధ వెళ్ళబోసుకుంటున్నాడు. అదే సహజత్వమంటే.
దుష్యంతునికి సందేశాన్ని పంపునపుడు కణ్వమహర్షి యెంతో హుందాగా వ్యవహరించాడు. ఒక వైపు ఆయన చక్రవర్తి. మఱియొక వైపు తనకు అల్లుడు. పెండ్లి ప్రత్యక్షంగా పీటలపై చేసినది కాదు. ఆయనకు తెలియకుండా శకుంతలను గాంధర్వ వివాహమాడి చూలాలిగా చేసి వెళ్ళాడు. అగ్నిహోత్రం వలన ఆ విషయం తెలుసుకొన్న కణ్వమహర్షి యోగ్యుడైన భర్తను పొందావని శకుంతలను అభినందిస్తాడు. అది ఆ విధంగా జరగవలసి వున్నదని తపస్సంపన్నుడైన ఆయనకు తెలిసే వుంటుంది. అలాగే దుష్యంతునికి సందేశాన్ని పంపుతూ –
అస్మాన్ సాధు విచింత్య సంయమధనానుచ్చైఃకులం చాత్మనః
త్వయ్యస్యాః  కథమప్యబాంధవకృతాం స్నేహ ప్రవృత్తిం చ తామ్
సామాన్య ప్రతిపత్తిపూర్వక మియం దారేషు దృశ్యా త్వయా
భాగ్యాయత్త మతఃపరం న ఖలు త ద్వాచ్యం వధూబంధుభిః     అ.శా.4.16
‘ నేను తపస్సే ధనముగా కలవాడను. నీవు ఉత్తమకుల సంజాతుడవు. బంధువులు కల్పించుకొనక నీవై నీవే ఈమెను ప్రేమించి పెళ్ళాడితివి. దీనినంతయు గుర్తుంచుకొనుము. ఈమెను తక్కిన నీ భార్యలయందొకతెగా చూసుకొనుము. అటుపై ఈమె అదృష్టాన్ని బట్టి వుండగలదు. అమ్మాయి వైపు వారు యింతకన్నను ఎక్కువ మాట్లాడరాదు ‘ అని విన్నవిస్తాడు. ఈ శ్లోకం ప్రసిద్ధ శ్లోక చతుష్టయంలో మూడవది. ఇందులో ఒకవైపు దుష్యంతుని భయపెట్టడం , మఱియొక వైపు మాకు తెలియకుండా వివాహమాడితివనడం , వినయంగా బ్రతిమాలడం వంటివన్నీ ద్వంద్వార్థంగా కనిపిస్తాయి. తపస్సంపన్నుడైన ఆయన  తలచుకుంటే ఒక్కసారి శపించగలడు. కాని కూతురు పరిస్థితి అడ్డు వస్తున్నది. ఇటువంటి పరిస్థితులు నేటి సమాజంలో అనేకంగా కనిపిస్తున్నాయి. నీవు ఉత్తమకుల సంజాతుడవనడంలో వ్యతిరేకంగా నడచుకొనవు అను వ్యంగ్యార్థం యిమిడి వుంది. బంధువులు కల్పించుకొనక ప్రేమించి పెండ్లాడావనడంలో మాకు చెప్పక మా అమ్మాయిని వలలో వేసుకొన్నావు అని యెత్తిపొడిచినట్లుంది. నీవీమెను ప్రత్యేకంగా చూడవలసిన పని లేదు , నీ యితర భార్యలలో ఒకతెగా చూడమనటంలో శకుంతలను ఆయనకు భార్యగా గుర్తింపు తెప్పించాలనే ఆరాటముంది. కన్య తండ్రి యింతకన్నను యెక్కువ మాట్లాడరాదు , తదుపరి ఈమె అదృష్టమనటంలో ‘ అన్నీ తెలిసి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ‘ కనిపిస్తుంది. లౌకిక జనులు పడే యింతటి మానసికాందోళన కణ్వమహర్షి కనబరుస్తాడు.
కణ్వమహర్షి శకుంతలకు తల్లి , తండ్రి కూడ తానై పెంచాడు. కూతురునత్తవారింటికి పంపునపుడు తల్లి మెట్టినింట్లో నడుచుకోవలసిన పద్ధతిని తెలియజేస్తుంది. ఆ మాటలను కణ్వమహర్షి యెంత సుమధురంగా చెప్పాడో –
శుశ్రూషస్వ గురూన్ , ప్రియసఖీవృత్తిం  సపత్నీజనే ,
భర్తుర్విప్రకృతాపి రోషణతయా మాస్మ  ప్రతీపం గమః ,
భూయిష్ఠం  భవ దక్షిణా పరిజనే , భాగ్యేష్వనుత్సేకినీ ,
యాంత్యేవం గృహిణీపదం యువతయో , వామాః  కులస్యాధయః    అ.శా.4-18
అనే ఈ శ్లోకంలో కనిపిస్తుంది. ఇది శ్లోక చతుష్టయంలో నాల్గవ శ్లోకము. ‘ అత్తమామలకు సేవలు చేయి. సవతులతో స్నేహంగా మెలగుము. భర్త నీకయిష్టమైన పని చేసినను కోపపడకుము. భర్తకు విరుద్ధంగా నడచుకొనవద్దు. పరిజనులతో దయకలిగి వుండుము. సంపదలు కలిగినందుకు పొంగిపోవద్దు. యువతులు ఈ విధంగా నడచుకొని మంచి ఇల్లాళ్ళని పేరు తెచ్చుకుంటారు. అట్లా నడచుకొనని యువతులు పుట్టినింటికి , మెట్టినింటికీ కూడ మనోవ్యథను కలిగిస్తారు ‘ అని కణ్వమహర్షి శకుంతలకుపదేశిస్తాడు. పై శ్లోకాలు చదివిన వెంటనే యెంతటి వారి గుండె అయినా ద్రవించి కంట నీరు కారవలసినదే. మెట్టినింటికి వెళ్ళు అమ్మాయికి ఇంత మధురంగా ఉపదేశం చేయడం నేటి వారికి సాధ్యమగునా ?. అది మహాకవి కాళిదాసు కణ్వమహర్షి నోట పలికించాడు.
దుష్యంతుడు శకుంతల చెలికత్తెలను పరిచయం చేసుకొని శకుంతలను గూర్చి తెలుసుకున్న తరువాత యిద్దరిలోనూ అనురాగామంకురించినది. రాజు శకుంతలను వదలిపెట్టి తన విడిదికి వెళ్ళబోతూ –
చ్ఛతి పురశ్శరీరం ధావతి పశ్చాదసంస్తుతం చేతః 
చీనాంశుకమివ కేతోః ప్రతివాతం నీయమానస్య       అ.శా.1-29
‘ రథానికి కట్టిన జెండా ఎదురుగాలికి ముందు భాగము వెనుకకు వుండునట్లుగా ఎగురుతుంది. అదే విధంగానే నా శరీరం ముందుకు వెళ్ళుచుండగా మనస్సు మాత్రము జెండా వలె వెనుకకు మల్లుచున్నది ‘ అని తలపోస్తాడు. దుష్యంతుని మనస్సు ఒకచోట , శరీరమొక చోట వుంది. శరీరమేమి చేస్తున్నదో తెలియక మనస్సు వెనుకకు మళ్ళుచున్నది. ఇచ్చట దుష్యంతుని మనస్సుకు జెండా కు చెప్పిన ఉపమానమెంతో సహజంగా వుంది.
ఒక కన్యను ఎన్ని రకాల మనోహరంగా వర్ణించవచ్చో మహాకవి కాళిదాసు యొక్క-
అనాఘ్రాతం పుష్పం , కిసలయమలూనం కరరుహై
రనావిద్ధం రత్నం మధునవమనాస్వాదితరసమ్
అఖండం పుణ్యానాం ఫలమివ చ తద్రూపమనఘం
న జానే భోక్తారం కమిహ సముపస్థాస్యతి విధిః   అ.శా,2-10
అనే శ్లోకంలో చూడవచ్చు. ‘ శకుంతల రూపం యింకనూ వాసన చూడని అప్పుడే పూసిన పూవు.  మాయని , గోటితో గిల్లని క్రొత్త చిగురు. ఇంకనూ రంధ్రము వేయని తీర్చిన ముత్యము. ఇంకనూ తీపు చవి చూడని క్రొత్త పూదేనె. మనోహరమైన , పరిపూర్ణమైన పుణ్యాలకు ఫలము. అటువంటి శకుంతలననుభవించడానికి బ్రహ్మ యెవరికి రాసి పెట్టాడో నాకు తెలియకున్నది ‘ అని  అంత వఱకు యెవ్వరునూ ముట్టనిది , ఎవరూ అనుభవించనిది , పుణ్యాలకు ఫలమైనది మొదలైన వాటికంతా మధురమైన ఉపమానాలను ఈ శ్లోకంలో కూర్చాడు కాళిదాసు. అంతేకాదు ‘ పుణ్యం కొద్దీ పురుషుడు ‘ అని తెలుగులో ఒక నానుడి వుంది. అట్లే ‘ పుణ్యం కొద్దీ స్త్రీ ‘ అని కూడ ఇక్కడ కాళిదాసు వర్ణనలో మనకు కనిపిస్తుంది. శకుంతలను పొందాలనుకొనువాడు అంత పుణ్యం చేసుకొని వుండాలని కాళిదాసు చెప్తున్నాడు.
మనము వెండితెరపై నాయకుడు ఒక్కొక్కమారు అభినయించే తొట్రుపాటును చూస్తుంటాము. అటువంటిదే కాళిదాసు దుష్యంతుని పాత్రలో చూపాడు. దుష్యంతుడు తాను శకుంతలయందనురక్తుడైన విషయాన్ని విదూషకునికి అంతకు ముందొకసారి తెలియజేశాడు. పరిస్థితిని బట్టి విదూషకుని అంతఃపురానికి పంపవలసివస్తుంది. అప్పుడు చపలుడైన విదూషకుడు అంతఃపుర స్త్రీలకు తన రహస్యాన్ని బహిరంగ పరుస్తాడనే భయంతో అంతకు ముందు శకుంతలను తాను ప్రేమిస్తున్నట్టు చెప్పిన విషయం అసత్యమని దుష్యంతుడు విదూషకునికి తెలియజేస్తూ –
క్వ వయం క్వ పరోక్ష మన్మథో
మృగశాబైస్సమమేధితో జనః 
పరిహాస విజల్పితం సఖే !
పరమార్థేన న గృహ్యతాం వచః                అ.శా.2-31
‘ మిత్రమా ! నీతో యింత వఱకు నేను చెప్పినదంతా తమాషాకు మాత్రమే , నిజం కాదు. నేనెక్కడ ? మన్మథుడెక్కడ ? జింక పిల్లల మధ్యలో పెరిగిన ఆమె ఎక్కడ ? ఇదంతయు నమ్మవద్దు ‘ అని చెప్తాడు. ఇందులో దుష్యంతుడు కనబరచిన తొట్రుపాటును కాళిదాసు కండ్లకు కట్టినట్టుగా వర్ణించాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే మహాకవి కాళిదాసు ప్రతి శ్లోకమూ గ్రాహ్యమే. ఆయనకు వివిధ శాస్త్రాలలో వున్న అభినివేశము అపారము. ఆలోచిస్తే వాల్మీకి , వేదవ్యాసులను విష్ణువు అవతారాలుగా పేర్కొన్నట్లు కాళిదాసు కూడ భగవదవతారాలలో ఒకడనిపిస్తుంది. అంతటి లోకజ్ఞానము , శాస్త్ర జ్ఞానము కాళిదాసు కవిత్వంలో కనిపిస్తుంది. అందుకే కాళిదాసు కవికుల గురువైనాడు. కాళిదాసు గుఱించి పేర్కొనే ప్రతి ఒక్కరూ గ్రంథ విస్తార భీతినెదుర్కొన వలసిందే. ఈ వ్యాసము కేవలము స్థాలీపులాక న్యాయముగా పొందుపరచినది మాత్రమే. అరగదీసిన కొలదీ గంధపు చెక్క సువాసనలను వెదజల్లుతుంది. మహాకవి కాళిదాసు కవితాసౌందర్యం కూడ అట్టిదే అనటంలో అతిశయోక్తి లేదు.
స్వస్తి.
సనాతన సాహిత్యం, సాహిత్యమున ప్రచురితము.
ఇంత వివరణాత్మకముగా కాళిదాసునావిష్కరించిన అవధాని డా.అనిల్ కుమార్ గారికి అభినందన పూర్వక ధన్యవాదములు.
జైహింద్. 

8, అక్టోబర్ 2019, మంగళవారం

*వి+జయ+దశ+మి* డా. మైలవరపు శ్రీనివాసరావు

0 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! మీకు విజయ దశమి సందర్భముగా శుభాకాంక్షలు.
*వి+జయ+దశ+మి* డా. మైలవరపు శ్రీనివాసరావు

ప్రాచీన ఋషులు ఏ పేరుని పెట్టినా అందులో గమనించాల్సిన అనేక రహస్యాలు– అక్షరాల్లో, పదాల్లో, పదాల విరుపుల్లో... ఇలా ఉండే ఉంటాయి. వాటిని తెలుసుకున్న పక్షంలో పండుగలలో దాగిన గొప్పదనం అర్థమై పదికాలాల పాటు మనం ఈ పండుగ సంప్రదాయాన్ని కొనసాగించగలిగిన వాళ్లం– ముందు తరం వాళ్లకి అందజేయగలిగిన వాళ్లం కూడా కాగలం. ఈ దృష్టితో చూస్తే ఈ పండుగ పేరు ‘జయదశమి’ కాదు. విజయ దశమిట.పైగా విజయ ‘దశ’మి ఏమిటి? పదిరోజులపాటు సాగే పండుగట ఇది. మంచిదే! పదిరోజుల పాటే ఉందుకు సాగాలి? సరే! పదిరోజులపాటూ పండుగ చేసుకోకుండా ‘10వ రోజునే ఎందుకు పండుగగా చేసుకోవాలి? ఈ పదిరోజుల్లోనూ మరి మూలా నక్షత్రం రోజున సరస్వతీ పూజా, దుర్గాష్టమి రోజున దుర్గాపూజా కూడా ఉంటూంటే, విజయంమాత్రం 10వ రోజునే వచ్చిందంటూ ‘విజయదశమి’ నాడే విశేష పూజని ఉదయం సాయంకాలాల్లో చేస్తారా? ఎందుకని? ఇలా ఎంతగా ఆలోచించడం మొదలెడితే అంతా ఆశ్చర్యంగానే ఉంటుంది కదా! లోపలికి వెళ్లి రహస్యాలని తెలుసుకుందాం!

జయం వేరు– విజయం వేరు
కేవలం మనకున్న అంగబలంతో (మనుష్యుల సహాయం) అర్ధ (దాడి చేయడానికి కావలసిన ధనం) బలంతో ఎదుటివారి మీదికి వెళ్లి గెలుపుని సాధించగలిగితే– గెలిస్తే దాన్ని ‘జయం’ అనాలంది శాస్త్రం. ఇలా సాధించిన ‘జయం’ ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. ఇది నిజం కాబట్టే ఈ యుద్ధంలో గెలుపుని సాధించిన రాజు పైసారి యుద్ధంలో గెలుపుని సాధించని సందర్భాలెన్నో కనిపిస్తాయి మనకి. అశాశ్వతమైన గెలుపుని ‘జయం’ అనాలంది ధర్మశాస్త్రం. అదే మరి ‘విజయ’ మైతే అది సంపూర్ణం శాశ్వతం కూడా. జయానికీ విజయానికీ మధ్యనుండే తేడా అనేది అంగ బలాన్నీ అర్ధబలాన్నీ మరింతగా సమీకరించుకున్న కారణంగా వచ్చేది కాదు. *‘జయం’* అంటే మనుష్య శక్తితో సాధించబడేదీ, సాధించుకునేదీ. అయితే విజయ మనేది మనకి రాబోతున్న గెలుపుకి భగవంతుని అనుగ్రహం తోడైతే లభించేది ఔతుంది.

మనకి కావలసిన అన్ని శక్తులూ ఉన్నా భగవంతుని అనుగ్రహం లేని పక్షంలో మనకి కలిగే గెలుపు సంపూర్ణం శాశ్వతం కానే కాదు. ఇది నిజం కాబట్టే అర్జునునికి ఉన్న పేర్లలో ఒకటి ‘విజయు’డనేది. అంటే ఎల్లకాలమూ అతనికి భగవదనుగ్రహం ఉంటూనే ఉంటుంది సుమా! అని తెలియజెప్పడమన్నమాట. ఆ కారణంగానే అర్జునుని కంటె గొప్పవాళ్లైన ఏకలవ్యుడూ కర్ణుడూ కూడా అతణ్ణి గెలవలేకపోయారు. పైగా ఏవేవో కారణాల వల్ల ఓడిపోయారు కూడా. మళ్లీ ఇదే అర్జునునికి, భగవదనుగ్రహమనేది ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని వీడి వెళ్లినప్పుడు (నిర్యాణమైనప్పుడు) ఉండే వీలే లేకపోయింది. ఆ కారణంగానే అంతఃపుర కాంతలందరికీ రక్షణగా ఉంటూ ఆ స్త్రీలని తెస్తూన్న సందర్భంలో దోవలు కొట్టేవాళ్లంతా అర్జునుని మీద తిరగబడి అర్జునుణ్ణి కావడి బద్దలతో మోదారు. అంటే ఏమన్నమాట? కృష్ణుడున్నంతకాలమే అర్జునునికి ఆ శక్తి ఉండి ‘విజయు’డయ్యాడు. ఆయన గతించాక అర్జునుడు కేవలం ‘పార్థునిగా’నే (కుంతీదేవి పుత్రునిగా మాత్రమే) అయిపోయాడు.

కాబట్టి జయమంటే గెలుపు– విజయమంటే భగవంతుని కృపానుగ్రహాల కారణంగా లభించిన గెలుపని అర్థమన్న మాట! అందుకే సంప్రదాయం తెలిసిన ఎవరికైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నామంటూ చెప్పి పాదాభివందనాన్ని చేస్తే– ‘జయోస్తు’ అనరు. ‘విజయోస్తు’ అనే ఆశీర్వదిస్తారు. ‘నీకు గెలుపు లభించుగాక! దానికి పరమేశ్వరుని అనుగ్రహం ఉండుగాక! ఆ కారణంగా నీది శాశ్వతమైన గెలుపుగా మారుగాక!’ అని దాని అర్థమన్నమాట.

తనంత తానుగా ఆ అమ్మే ఓ దేవత అవుతూంటే, మళ్లీ ఆమెకి గెలుపుకోసం మరో దేవతానుగ్రహం కావాలా? అప్పుడే కదా ఆమె జయం– విజయం– ఔతుంది? ఇదేమిటనిపిస్తుంది.
రాక్షసులూ దేవతలూ అనే ఇద్దరూ ఆయా స్థానాలని పొందింది కేవలం తమకి తాముగా ఆచరించిన తపస్సు వల్లనే. అంటే సాధించిన తపశ్శక్తి కారణంగానే.ఈ నేపథ్యం లో రాక్షసులు ఎక్కడ దేవతలని జయించలేమో? అనే దృష్టితో మరింత మరింత తపస్సుని చేశారు. వాళ్లు ఎంత స్థాయి తపస్సుని చేశారంటే– తానొక్కతే గాని వెళ్లి యుద్ధానికంటూ దిగితే చాలనంత. దాంతో ఆమె *గణపతి నుండి పాశాన్నీ, కుమారస్వామి నుండి శక్తి ఆయుధాన్నీ, తన భర్త శంకరుని వద్దనుండి శూలాన్నీ, శ్రీ మహావిష్ణువు నుండి చక్రాన్నీ...* ఇలా ఇన్నింటినీ ధరించి (8మంది దేవతల నుండి 8 తీరుల తపశ్శక్తిని ఆయుధాల రూపంలో స్వీకరించి అష్టభుజిగా) ఆమె రోజుకొక్క రాక్షసుణ్ణి చొప్పున వధించుకుంటూ వచ్చి  9 మంది రాక్షసులని వధించాక 10 రోజున 10వ రాక్షసుడైన మహిషుణ్ణి వధించింది. ఇలా 9 దాటి 10 వ వధ కాబట్టీ, విజయాన్ని సాధించిన 10వ రోజు కాబట్టీ ‘విజయదశమి’అయింది.
అది 10 (దశ)కున్న గొప్పదనం.
10 అనేది పూర్ణసంఖ్య. తన వెనుక 9 ఇంటిని అండగా కలిగిన సంఖ్య.

దిక్కుల సంఖ్య 10. తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తరాలు నాలుగూ, ఈశాన్య ఆగ్నేయ నిరృతి వాయవ్యమనే విదిక్కులూ (దిక్కుకీ దిక్కుకీ మధ్యన ఉండేవి) నాలుగు, పైనా కిందా అనే రెండూ కలిపి 10 మాత్రమే.
శ్రీ హరి ఈ లోకంలో ఉన్న అందరినీ (84 లక్షల జీవరాశుల్ని) రక్షించే నిమిత్తం ఎప్పటికి ఏది అవసరమో గమనించి అప్పటికి ఆ అవతారాన్నెత్తుతూ క్రమంగా మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ కృష్ణ అనే 9 అవతారాలని ముగించి ఇక తప్పదనే దృష్టితో ‘కల్కి’ అవతారాన్నెత్తి మొత్తం అందర్నీ సంహరించి యుగానికి ముగింపుని 10వ అవతారంతోనే చేశాడు.
పది తర్వాత అంకెలన్నిటిలోనూ పది అంకె ప్రవస్తావన ఉంటూనే ఉంటుంది. ఏకాదశి (1+10=11), ద్వాదశ (2+10=12) త్రయోదశ (3+10=13) చతుర్దశ (4+10=14)... ఈ తీరుగా ఉంటూనే ఉంటుంది.

వ్యక్తి శరీరం కూడా బాల్యం– బుద్ధిబలం– శరీరబలం – కంటిబలం తగ్గడం– శుక్రశక్తి తగ్గడం– రక్తం తగ్గడం– మానసిక ధైర్యం తగ్గడం– శరీరం స్పర్శనీ, కళ్లు చూపునీ, చెవులు వినికిడినీ, ముక్కు వాసననీ, నాలుక రుచినీ కోల్పోతుంది ప్రతి పదేళ్లకీ. (1 నుండి 10 వరకూ బాల్యం, 11 నుండి 20 వరకూ బుద్ధిబలం... ఇలా ఎదిగిన శరీరం తగ్గుదలవైపుకి వెళ్తూ 91 నుండి 100కి అన్ని అవయవాల దిగుదలకీ వ్యక్తి గురవుతూ ఉంటే ఇక్కడ కూడా ప్రాధాన్యం 10 కే కదా!

కేవలం ఓటమి అనేదే లేకపోవడం కాదు. పవిత్రత కూడా ఏమాత్రమూ చెడకపోవడం ఉంటుంది ఈ విజయదశమి రోజున. అమ్మవారు ఈ విజయదశమి రోజునజమ్మిచెట్టు నీడన ఉంటుంది. జమ్మిచెట్టునే సంస్కృతంలో శమీ అంటారు. లోకంలో ఎక్కడైనా అపవిత్రత అనేది ఉండే చోటుగా శ్మశానాన్ని చెప్తారెవరైనా. ఆశ్చర్యకరమైన అంశమేమంటే జమ్మిచెట్టు– అమ్మవారు ఈ విజయదశమి రోజున ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంటారో, అది అపరాజితాస్థలం. ఆ జమ్మిచెట్టు మాత్రమే శ్మశాన స్థలాన్ని కూడా పవిత్రీకరించగల శక్తి కలది.  ఈ కారణంగానే అమ్మవారు జమ్మిచెట్టు కింద కూర్చుని దర్శనమిస్తూ– అ– పరాజిత–నని తన గూర్చి మనకి అర్థమయ్యేలా అనుగ్రహిస్తారు అందర్నీ వీరు, వారు అనే భేదం లేకుండా!
ఇంత లోతు అర్థం కల 10వ తిథి అయిన దశమి నాడు అమ్మ రాక్షసులపై విజయాన్ని సాధించింది.అందుకే అపరాజిత ఇంతటి విజయాన్ని సాధించిందీ, 9 దాటి 10వ నాడు విజయ రహస్యాన్ని మనకందించిందీ అమ్మ కాబట్టే ఆమెకి ఈ విజయదశమి నాటి పేరు ఆమె చేసి నకృత్యాలని బట్టి– అ– పరాజిత– అని. పరాజయం (ఒటమి) అనేదే ఎరుగని తల్లి– లేని తల్లి. (న+ పరాజిత= అపరాజిత)
*తన్నో దుర్గిః ప్రచోదయాత్‌!*
స్వస్తి.
డా. మైలవరపు శ్రీనివాసరావు గారికి ధన్యవాదములు.
 జైహింద్.

7, అక్టోబర్ 2019, సోమవారం

మామామ మా మమేమా....ఏకాక్షరశ్లోక వివరణ.

0 comments

జైశ్రీరామ్.
ఏకాక్షర శ్లోకము వివరణ.

మామామ మా మమేమామా
మామూమామేమమేమమే |
మామామేమిమిమేమామ
మమోమామామమామమీ |

ప్రతిపదార్థాలు -
మమ = నా యొక్క
మా = బుద్ధి
ఇమాం మామ్ = ఈ లక్ష్మిని
ఆమ = పొందెను.
అమేం -
అమా = సహితురాలైన
ఈం = లక్ష్మి గల
అమ్ = నీ పాదాన్ని
ఆమామూము = ఆశ్రయించాము.
అమే = ఓ దుర్బుద్ధీ (జ్యేష్ఠాదేవీ)!
మే = నాకు
అమ = దూరంగా వెళ్ళు.
అమామ్ = లక్ష్మికంటె వేరైన దేవతను
మా + ఏమి = పొందను.
అమః = బంధరహితుడనై
మా = లక్ష్మి యొక్క
అమమ్ = ప్రాపును
మిమే = అపేక్షిస్తాను.
అమీ = ఈ మేము
మామ్ = ప్రమాణమైన శాస్త్రాన్ని
మా + అమామ = అతిక్రమింపము.
జైహింద్.

6, అక్టోబర్ 2019, ఆదివారం

స్వచ్ఛతా,రసయా,సింహరేఖా,నమ్రతా,రసరాజీ,,యెంపిక,రజితాసమ,ఉద్ధతిలక్షణా,ఒద్దుమీరు,గర్భ"-త్రికరణ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

0 comments

 జైశ్రీరామ్.
స్వచ్ఛతా,రసయా,సింహరేఖా,నమ్రతా,రసరాజీ,,యెంపిక,రజితాసమ,ఉద్ధతిలక్షణా,ఒద్దుమీరు,గర్భ"-త్రికరణ"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.                       

త్రికరణ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.మ.భ.ర.స,య.ర.జ.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఒకరి లక్ష్యము నాకేమని?ఒద్దుమీరి చరింప దోషమ్!ఉద్ధతే!వినాశకంబౌ!
వికట చర్యే!కాటేయగ!పెద్ద వౌదువె?పట్టి చూడన్!పద్ధతౌనె?శాపమేగా!
సుకర మౌనే?యెంచన్వలె!శుద్ధ బుద్ధిని మెల్గ సౌఖ్యమ్?శుద్ధు లేల? శోభిలంగన్!
త్రికరణ శుద్ధిన్!జీవించుమి!దిద్దు చర్యను!దైవచింతన్!త్రి ద్దివేశు లాల నంబున్?

ఉద్ధతి=గర్వము,త్రిద్దివేశులు=దేవతలు,త్రికరణశుద్ధి=మనోవాక్కాయ
కర్మలందు శు భ్రత,ఒద్దుమీరి=ఒందులీక మతిశయించి,
1.గర్భగత"-స్వచ్ఛతా"-వృత్తము.
బృహతీఛందము.న.మ.భ.గణములు.వృ.సం.392.
ప్రాసనియమము కలదు.
ఒకరి లక్ష్యము నాకేమని?
వికట చర్యే కాటేయగ!
సుకర మౌనే?యెంచన్వలె!
త్రికరణ శుద్ధిన్!జీవించుమి!
2.గర్భగత"-రసయా"-వృత్తము.
బృహతీఛందము.ర.స.య.గణములు.వృ.సం.91.
ప్రాసనియమము కలదు.
ఒద్దుమీరి చరింప దోషమ్!
పెద్ద వౌదువె!పట్టి చూడన్?
శుద్ధ బుద్ధిని మెల్గ సౌఖ్యమ్!
దిద్దు చర్యను!దైవచింతన్!
3.గర్భగత"-సింహరేఖా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గగ.గణములు.వృ.సం.43.
ప్రాసనియమము కలదు.
ఉద్ధతే!వినాశకంబౌ?
పద్ధతౌనే?పాపమేగా!
శుద్ధులేల?శోభిలంగన్!
త్రిద్దివేశు లాలనంబున్!
4.గర్భగత"-నమ్రతా"-వృత్తము.
ధృతిఛందము.న.మ.భ.ర.స.య.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఒకరి లక్ష్యము నాకేమని?ఒద్దుమీరి చరింప దోషమ్!
వికట చర్యే కాటేయగ!పెద్ద వౌదువె?పట్టి చూడన్!
సుకర మౌనే?యెంచన్వలె!శుద్ధ బుద్ధిని మెల్గ సౌఖ్యమ్?
త్రికరణాలంశుద్ధిన్!జీవించుమి! దిద్దు చర్యను!దైవచింతన్!
5.గర్భగత"-రసరాజీ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.య.ర.జ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఒద్దు మీరి చరింప దోషమ్?ఉద్ధతే!వినాశకంబౌ?
పెద్ద వౌదువె!పట్టి చూడన్?పద్ధతౌనే?పాపమేగా!
శుద్ధ బుద్ధిని మెల్గ సౌఖ్యమ్!శుద్దు లేల?శోభిలంగన్!
దిద్దు చర్యను దైవచింతన్!త్రిద్దివేశు లాలనంబున్!
6.గర్భగత"-యెంపిక"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.ర.జ.త.స.మ.లల.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఒద్దు మీరి చరింప దోషమ్?ఉద్ధతే!వినాశకంబౌ?ఒకరి లక్ష్యము నాకేమని?
పెద్ద వౌదువె!పట్టిచూడన్?పద్ధతౌనే?పాపమేగా!వికట చర్యే కాటేయగ!
శుద్ధ బుద్ధిని మెల్గ సౌఖ్యమ్!శుద్దు లెల్ల శోభిలంగన్!సుకరమౌనే!యెంచన్వలె!
దిద్దు చర్యను దైవచింతన్!త్రి ద్దివేశు లాలనంబున్!త్రికరణాలం!శుద్ధిం గను!
7.గర్భగత"-రజితాసమ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.త.స.మ.లల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమభు కలదు.వృ.సం.
ఉద్ధతే!వినాశకంబౌ?ఒకరి లక్ష్యము నాకేమని?
పద్ధతౌనే?పాపమేగా!వికట చర్యే!కాటేయగ?
శుద్దు లెల్ల శోభిలంగన్!సుకరమౌనే?యెంచన్వలె!
త్రిద్దివేశు లాలనంబున్!త్రికరణాలం!శుద్ధిం గను!
8.గర్భగత"-ఉద్ధతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.త.స.మ.స.జ.జ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియము కలదు.వృ.సం.
ఉద్ధతే!వినాశకంబౌ?ఒకరి లక్ష్యము నాకేమని?ఒద్దు మీరి చరింప దోషమ్?
పద్ధ తౌనే?పాప మేగా!వికట చర్యే?కాటే యగ!పెద్దవౌదువె? పట్టి చూడన్!
శుద్దు లెల్ల శోభిలంగన్!సుకరమౌనే?యెంచన్వలె!శుద్ధబుద్ధిని మెల్గ సౌఖ్యమ్!
త్రి ద్దివేశు లాలనంబున్!త్రి కరణాలం!శుద్ధిం గను!దిద్దు చర్యను దైవచింతన్!
9.గర్భగత"-లక్షణా"-వృత్తము.
ధృతిఛందము.ర.స.య.న.మ.భ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఒద్దుమీరి!చరింప దోషమ్?ఒకరి లక్ష్యము నాకేమని?
పెద్ద వౌదువె?పట్టి చూడన్?వికట చర్యే!కాటేయగ!
శుద్ధ బుద్ధిని మెల్గ సౌఖ్యమ్!సుకరమౌనే?యెంచన్వలె!
దిద్దు చర్యం!దైవచింతన్? త్రి కరణాలం శుద్ధిం గను?
10,గర్భగత"-ఒద్దు మీరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.న.మ.భ.ర.జ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఒద్దు మీరి చరింప దోషమ్?ఒకరి లక్ష్యము నాకేమని?ఉద్ధతే?వినాశకంబౌ!
పెద్ద వౌదువె?పట్టి చూడన్!వికట చర్యే!కాటేయగ?పద్ధతౌనే?పాపమేగా!
శుద్ధ బుద్ధిని మెల్గ సౌఖ్యమ్!సుకర మౌనే?యెంచన్వలె!శుద్దులెల్ల!శోభిలంగన్
దిద్దు చర్యం దైవచింతన్?త్రికరణాలం శుద్ధిన్గను?త్రి ద్దివేశు లాలనంబున్!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.

5, అక్టోబర్ 2019, శనివారం

అసారేఖలు సంసారే. సుఖభ్రాంతిః .....మేలిమిబంగారం మన సంస్కృతి.

1 comments

జైశ్రీరామ్.

శ్లో. అసారే ఖలు సంసారే
సుఖభ్రాన్తిఃశరీరిణామ్౹
లాలాపానమివాఙ్గుష్ఠే
బాలానాం స్తన్య విభ్రమః.

క. వ్రేలును చీకుచు తానది
పాలని భ్రమియించు బిడ్డ పగిదిని మనమున్
పేలవమగు సంసారమె
మేలనిభ్రమియింతుముకద మిధ్యాజగతిన్.

భావం:- ఎటువంటి సారమూ లేని ఈ ప్రపంచంలో ఏదో ఏదో సుఖం ఉందని
మానవులు భ్రాంతి పడుతూ  జీవితాన్ని వ్యర్ధం చేసుకుంటూ ఉంటారు .
అది ఎలాంటిది అంటే బొటనవేలు నోట్లో పెట్టుకుని తన లాలాజలాన్నే
చప్పరిస్తూ చనుపాలు తాగుతున్నాం అనుకునే పసిపిల్లవాడి భ్రాంతి వంటిది.
ఇక్కడ మెలిక ఏమిటంటే  ఆవిధంగా భ్రాంతి పడిన పిల్లవాడిని చూసి తల్లి
కాసేపటికి వాడి ఆకలి తెలుసుకుని పాలు ఇస్తుంది . కానీ  మానవుడు ఒకసారి
ఈ జన్మ వృధా చేసుకుంటే ఇక మానవ జన్మ అసంభవం.
జైహింద్.

4, అక్టోబర్ 2019, శుక్రవారం

🏻ఓం నమో నారాయణాయ

1 comments

జైశ్రీరామ్.
🏻ఓం నమో నారాయణాయ.
శా. కన్నా! పుట్టినరోజు నేడు. సుజనుల్ కాంక్షాళి నందీయ, నే
నిన్నున్ బ్రేమగ నిల్పి మానసమునన్ నేర్పున్ సదా పద్యముల్
క్రన్నన్ వ్రాసెడి శక్తి నాకు  కలుగున్ గల్యాణ సంధాయి! శ్రీ
మన్నారాయణ! మిత్రులందు నిలుమా. మన్నించి దీవింపుమా.

భావము.
కన్నా! మంగళములను కలిగించు ఓ శ్రీమన్నారాయణా! నేడు నా పుట్టిన రోజు.(ఖర...ఆశ్వయుజ శుద్ధ షష్టి) సుజనులు శుభాకాంక్షలను నాకందించినచో నేను నిన్ను ప్రేమతో నా మనస్సులో నిలిపి ఎల్లప్పుడూ నీపై పద్యములను సత్వరమే వ్రాయఁగలిగెడి శబ్ద శక్తిని నేను పొందుదును. నీవు నా హితుల మనస్సులలో నిలిచియుండి, నన్ను దీవింపుమని వేడుకొనుచున్నాను.

జై శ్రీమన్నారాయణ🙏.
బుధజన విధేయుఁడు
చింతా రామకృష్ణారావు.🏻
జైహింద్.

3, అక్టోబర్ 2019, గురువారం

కనకధారాస్తోత్రము. వ్యాఖ్య రచయిత. కీ.శే. వి.వి.యస్.శాస్త్రి గారు.

0 comments

జైశ్రీరామ్
కనకధారాస్తోత్రము. వ్యాఖ్య రచయిత. కీ.శే. వి.వి.యస్.శాస్త్రి గారు.
నేడు వారి జయంతి. ఈ సందర్భముగా వారికి నిబ్వాళులర్పిస్తూ,  వారికి సంబంధించిన ఈ కార్యక్రమమును ప్రచురించటం జరిగింది.

జైహింద్.  

2, అక్టోబర్ 2019, బుధవారం

విద్యాసు శ్రుతిరుత్కృష్టా .. మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జై శ్రీరామ్.
శ్లో. విద్యాసు శ్రుతిరుత్కృష్టా - రుద్రైకాదశనీ శ్రుతౌ 
తత్ర పఞ్చాక్షరీ తస్యాం - శివ ఇత్యక్షర ద్వయమ్. 
గీ. విద్యలందున వేదంబు, వేదమునను
రుద్రయేకాదశకమును, రుద్రమందు
ప్రముద పంచాక్షరియు, కన వానియందు
శివయనెడి రెండు వర్ణముల్,శ్రేష్టమెన్న.
భావము. విద్యలలో వేద విద్య ఉత్కృష్టమైనది. వేద విద్యలో ఏకాదశరుద్రములు శ్రేష్టమైనవి. వాటిలో శివ పంచాక్షరి, అందునా శివ అను రెండక్షరములు శ్రేష్టమైనవి.
జైహింద్. 

1, అక్టోబర్ 2019, మంగళవారం

ఓంకా పంజర శుకీమ్ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

0 comments

జైశ్రీరామ్
శ్లో. ఓంకార పంజర శుకీ ముపనిషదుద్యాన కేళి కలకంఠీమ్.
ఆగమ విపిన మయూరీ మార్యా మంత ర్విభావయే ద్గౌరీమ్.
తే.గీ. కలికి యోంకారపంజర చిలుక, యుపని
షద్వనవిహార కలకంఠి,సత్ప్రభాస,
ఆగమవిపిన యురగారి, యనుపమయుమ
అట్టి సజ్జన స్తుతగౌరికంజలింతు.  భావము. ఓంకారమనే పంజరములో ఉండే రాచిలుకకు, ఉపనిషత్తులను ఉద్యానవనములో ఆటలాడుకొను దివ్య సుందర స్వరగాత్రము గల జగన్మాతకు, ప్రపంచ సృష్టికార్యము కొరకు నిరంతరము చేయబడుచున్న కార్యమును విశదీకరించు శాస్త్ర సముదాయమైన మహారణ్యములో విహరించు మయూరమునకు, గొప్ప సంస్కారముగల మహనీయుల అంతరంగమందు సదా భావింపబడు మాతయగు గౌరీదేవికి నమస్కారము.
జైహింద్.