జైశ్రీరామ్.
88. ఓం భగవతే నమః.
వసంతతిలక వృత్త గర్భ సీసము.
ప్రపవు ప్రాణప్రదుండ! పర ప్రస్ఫుట! పాప - నాశా! సుసంపత్ప్రకాశ! శ్రీశ!
సతము నీ నామమే జయమునే కరుణించు - దేవాదిదేవా! ప్రభావమీవ.
మహిత దీనావనా! మహిమఁ దేల్చుము దీప్తిఁ - గొల్పన్. మదిన్నిన్నె కొల్తుననఘ!
వెలసి ప్రాణాకృతిన్ నిలుము పావన పద్మ - నాభా! మహాదేవ! శోభనిమ్ము.
గీ. మహి వసంత తిలకగర్భ మహిత దీప్త - దివ్య సీసోజ్వల *భగవతే* నమామి.
భక్త జన పోష! భవశోష! పాపనాశ! - శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
88వ సీస గర్భస్థ వసంతతిలకవృత్తము. (త భ జ జ గగ .. యతి 8)
ప్రాణప్రదుండ! పర ప్రస్ఫుట! పాపనాశా!
నీ నామమే జయమునే కరుణించు దేవా!
దీనావనా! మహిమఁ దేల్చుము దీప్తిఁ గొల్పన్.
ప్రాణాకృతిన్ నిలుము పావన పద్మనాభా!
భావము.
భక్తులను పోషించువాఁడా! భవబంధములను నశింపఁజేయువాఁడా! పాపమును నశింపఁజేయువాఁడా!
ఆశ్రిత జనమున
ప్రకాశించువాఁడా!
ఓ యాదాద్రివాసుఁడవైన లక్ష్మీ నారసింహా! నీవు చలివేన్ద్రము. పరమున ప్రస్ఫుటమగువాఁడా!
పాపనాశకా! మంచి సంపదలందు ప్రకాశించుశ్రీశా! దీనులను కాచు ఘనుఁడా! వసంతిలక పద్యమున ప్రకాశించు
సీసపద్యమునఁ గల మహితుఁడా! నీ మహిమతో నన్ను భవాంధమునుండి తేల్చుము. నాకు దీప్తిని కొలుపుట
కొఱకు
మదిలో నిన్నే తలంతును. ప్రాణముగలస్వరూపముతో వెలసి నాముందు నిలుము. నాకు శోభ కల్పింపుము. ఓ భగవతా
నమస్కరించుచున్నాను.!
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.