17, ఫిబ్రవరి 2025, సోమవారం
దిలీపుడు - సంతానయోగ్యత....శ్రీ క్రొవ్విడి వేంకటరాజారావు.
0
comments
16, ఫిబ్రవరి 2025, ఆదివారం
తులతూగు,చరితార్ధ,నెడ నెడ,జీవన కల,గర్భ"-పరార్ధతా"-వృత్తము,రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,
0
comments
జైశ్రీరామ్.
జైహింద్.
15, ఫిబ్రవరి 2025, శనివారం
యో యమర్థం ప్రార్థయతే. ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. యో యమర్థం ప్రార్థయతే - తదర్థం చేహతే క్రమాత్ |
అవశ్యం స తమాప్పోతి - న చేదర్ధాన్నివర్తతే || (యోగవాసిష్ఠం 2 - 4 - 12)
తే.గీ. కోరునది పొంద కృషీచేసుకొను నెవండు
వాఁడు మధ్యలో తన కృషి వదలకున్న
పొందు నద్దానిఁ దప్పక, బిధవరేణ్య!
మంచి పొందఁగ కృషి చేయు మాన్యులెపుడు.
భావము. ఎవడు ఏ ప్రయోజనాన్ని కోరుతున్నాడో, దాని కోసం అతడు అర్ధాంతరంగా
వదిలిపెట్టకుండా నిరంతరం కృషి చేస్తే, చివరికి దానిని తప్పకుండా సాధిస్తాడు.
జైహింద్.
14, ఫిబ్రవరి 2025, శుక్రవారం
మంచిపెంచు,మించకేగు,కుంచిత,కీర్తిదము,సత్కృప,కురచన,మెరుగులు,సుఖజీవన,పరమాత్మ,అరిషడులు,మితి మీరు,చెడుతలపు,మరచు,లోభత్వ,గర్భ"బ్రతుకు తీరు"వృత్తము. రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,
0
comments
జైశ్రీరామ్.
జైహింద్.
వరదాంగ,ఉజ్వల,కాంతిదా,ఆనందవర,ఝరీ,ఆనందకరీ.సాంభవా,సర్వేశ్వర,జీవాత్మ,పరమాత్మ,స్థిరణశప్రాసాద,సంస్తుత్య,సత్కృపా, గర్భ"కృపానంద"-వృత్తము.....రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,
0
comments
జైశ్రీరామ్.
జైహింద్.
విశ్వనాథ గళంలో రామాయణ కల్పవృక్ష శబరి పద్యాలు(కఠిన పద అర్థాలతో)-01వభాగం
0
comments
ఒక్క కందంలో మొదటి రెండు పాదాలలోనే దశావతారాల నిమిడ్చి చెప్పిన తిరుపతివేంకట కవులు.....శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు.
0
comments
జైశ్రీరామ్.
దశావతారాలు ...తిరుపతి వేంకటకవులు !
.
ఒకసారి తిరుపతి వేంకటకవులు వినుకొండలో అష్టావధానం చేస్తుండగా వర్ణన అనే ఒక అంశంలో భాగంగా ఒకాయన అడిగాడు, 'అయ్యా, దశావతారాలను గురించి వర్ణించండి'.
పది అవతారాలు. అలాగే దానికేం? వీళ్ళు ఏ ఉత్పలమాలో, చంపకమాలో లేకపోతే సీసపద్యంలో చెప్పుకోవచ్చు కదా అని మొదలు పెట్టాలనుకున్నారు. ఎందుకు? విస్తీర్ణం కలిగిన వృత్తాలు కదా!
'అయ్యా! అయితే ఒక చిన్న విన్నపం. కంద పద్యంలో చెప్పాలి' అన్నారు.
దశావతారాలు ఒకొటొకటి చెప్పుకుంటూ లెక్కపెట్టుకుంటేనే కందానికి ఎన్ని అక్షరాలు కావాలో ఆ అక్షరాలను దాటిపోతుంది.
సరే! వెంకటశాస్త్రి గారు 'జలచర ఢులి కిరి నరహరి' మొదలుపెట్టారు. ఒక పాదం అయిపోయింది నాలుగవతారాలతో. పృచ్ఛకుడు ఆపాడు. 'ఏమండోయ్ నా కోరిక ఇంకా మీరు పూర్తిగా వినలే'దన్నాడు. 'అయ్యా! దశావతారాలు కందపద్యంలో చెప్తున్నాము కదా, జలచర ఢులి కిరి నరహరి.. అర్థం చెప్తాము' అంటే, 'అయ్యా! ఆగండి. ఆ పద్యంలో మా అధ్యక్షుడు పరబ్రహ్మ శాస్త్రిగారి పేరు కూడా ఉండాలండి' చెప్పాడు పృచ్ఛకుడు. మళ్ళీ ఇదేం మెలిక అనుకుంటూ ‘ఏం పర్వాలేదులే చెప్పుకుందాం’అనుకున్నారు.
జలచర ఢులి కిరి నరహరి
కలిత వటు త్రివిధ రామ..
మూడు రామావతారాల గురించి 'త్రివిధ రామ' అని వచ్చింది. అరే వీళ్ళు దాటేసుకుంటున్నారే అనిపించింది పృచ్ఛకుడికి. జలచరం - మీనావతారం, ఢులి - కూర్మావతారం, కిరి - వరాహావతారం. నరహరి - నృసింహావతారం, నాలుగు అవతారాలను మొదటి పాదంలో పెట్టేశారు. మూడు గణాలలో. రెండవ పాదంలోకి వచ్చేటప్పటికి కలిత వటు, ఆయన ఎవరు? వామనావతారం. త్రివిధ రామః - రామో రామశ్చ రామశ్చ - పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు. మూడు రామావతారాలను 'త్రివిధరామ' లో ఇరికించారు. 'అయ్యా! మాట' అన్నాడు పృచ్ఛకుడు, మళ్ళీ చెయ్యెత్తి. 'దాన్లో మీ ఇద్దరి పేర్లు కూడా ఉండాలి'. సరే దానికేముందని,
క. జలచర ఢులి కిరి నరహరి
కలిత వటు త్రివిధ రామ కల్కులు బుద్ధుం
డిల తిరుపతి వేంకటశా
స్త్రులను పరబ్రహ్మశాస్త్రిఁ జూతురు పేర్మిన్.
అదీ వారి పాండిత్యం!
జైహింద్.
శ్రీమద్భాగవతలీలాకల్పద్రుమం. ... శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు.
0
comments
జైశ్రీరామ్.
శ్రీమద్భాగవతలీలాకల్పద్రుమం
ఏక శ్లోకాన్ని భాగవత ద్వాదశస్కంధాలలోని ఇతివృత్తాలుగ
వ్యాఖ్యానించిన గ్రంథం.
వ్యాసులవారి సంస్కృత ~ భాగవతపురాణం,ప్రథమస్కం, ప్రథమాధ్యాయం-౧
శ్లో. జన్మాద్యయస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞఃస్వరాట్
తేనేబ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః
తేజోవారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా
ధామ్నాస్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి.
ఈ శ్లోకాన్ని బమ్మెర పోతన ఇలా తెనిగించినాడు.
సీ.విశ్వ జన్మస్థితి-విలయంబు లెవ్వని
వలన నేర్పడు నను-వర్తనమున
వ్యావర్తనమున గా-ర్యములం దభిజ్ఞుడై
తాన రాజగుచు జి-త్తమున జేసి
వేదంబు లజునకు-విదితముల్ గావించె
నెవ్వడు బుధులు మో-హింతు రెవ్వ
నికి నెండమావులు-నీట గాచాదులు
నన్యోన్యబుద్ధి దా-నడరునట్లు
ఆ.త్రిగుణ సృష్టి యెందు-దీపించి సత్యము
భంగి దోచు స్వప్ర-భానిరస్త
కుహకు డెవ్వ డతని-గోరి చింతించెద
ననఘు సత్యు బరుని-నను దినంబు
-భాగవత కథాప్రారంభం(అవతారికతర్వాత)1స్కం,34
వ్యాసుని సంస్కృతభాగవతంలోని పై మొదటి శ్లోకానికి
వంశీధరశర్మ అనే విద్వన్మణి ప్రథమస్కంధంనుండి ద్వాదశస్కంధంవరకు
ఉండే వివిధ ఇతివృత్తాలుగల 134 అర్థాలు వచ్చేవిధంగా వ్యాఖ్యానం
రచించినాడు. అంటే
ఈ శ్లోకాన్ని 134 విధాలుగ వ్యాఖ్యానించినాడు.ఆ రచనకు శ్రీమద్భాగవత
లీలాకల్పద్రుమం అని పేరు. ఈ రచను తెలుగు అనువాదంతో 2011 లో
డా.తలముడిపి బాల సుబ్బయ్య ప్రచురించినారు.
పైశ్లోకానికి ప్రథమస్కంధం నుండి ద్వాదశస్కంధం వరకూ
ఉండే వివిధ ఇతివృత్తాలుగా అర్థం చెప్పడం విశేషం. సంస్కృత భాగవతంలోని
ఒకే శ్లోకానికి 134అర్థాలుగలశ్రీమద్భాగవతలీలాకల్పద్రుమం అరుదైన
విశేష గ్రంథం.
జైహింద్.
మాండవ్యోపాఖ్యానము...... శ్రీ క్రొవ్విడి వేంకట రాజారావు
0
comments
13, ఫిబ్రవరి 2025, గురువారం
సూర్య సూక్తం. డా. ఆముదాల మురళి. SURYA SUKTHAM BY DR AMUDALA MURALI
0
comments
స్రగ్విణీ, భుజంగప్రయాత, కంద గర్భ సీసము.. రచన శ్రీ గరిమెళ్ళ సోమయాజి శర్మ(1970లో)
0
comments
సర్వమంగళా! నా పద్య పంచకము.
0
comments
జైశ్రీరామ్.
చరాచర,పరంపర,నిరంతర,కెరటాల,పర్వం,శోకతా,తత్వం,సాకర,గురిత్వ,నినద,వనధి,పనుప,జీవజాల,తపనార్తి,గర్భ"వాగధీశ"-వృత్తము... రచన. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,
0
comments
జైశ్రీరామ్.
జైహింద్.
శివ భావనామృత తరంగిణి ... రచన ... శ్రీ వల్లభవఝల అప్పల నరసీంహ మూర్తి,
0
comments
జైశ్రీరామ్.
1.కం:-శ్రీవరు నామామృతమున
భావన బంగార మవగ!భాసుర లీలన్!
"మా-వరదాంబుధు లలరగ!
కావంగా హరి హరులను గానము సేతున్!
2,కం:-ఏకాగ్రత కావలె నయ
శ్రీకారము చుట్టు భక్తి సిద్ధాత్ముడవై!
ప్రాకారాంతర్గత శివు
సాకారము నొందె దీవు!సత్కృత తపతన్!
3.కం:-హితకరి మతకరి శుభకరి
గతికరి పతనాతప హరి!కామద హారీ!
స్తుతిమతి పశుపతి నుతమతి
నతులిత స్తుతిమంత గావు!హర హర శంభో!
4.కం:-అతి గతి జగతికి నీవే!
నుతమతి కరుణార్ద్ర దేవ!నావవు నీవై!
బ్రతుకుల సాగర తరణను
నతి వేగము చేయ రావె!నంబయు మెచ్చన్!
5,కం:-కర్తవు ధర్తవు భర్తవు
హర్తవు సర్వార్ధ మీవు!నార్యోత్తముడా!
నర్తన జగములు బ్రోచెడి
కర్తవ్యముగా దలంచి!కావగ రావే!
6.కం:-శివ నీ నామము నందే
నవ తారక శాంత ముండె!నాట్య కలాపా!
భవ బంధమోచ నంబున
కవితా సౌరభ్య మబ్బ కావగ రావే!
7,కం:-దయనీయ జీవితాలను
దయ తోడుత గావు నీవు!ధర్మాత్ముడవే!
భయమేల?మాకు నిలలో!
నియతను నుతియింతు మదిని!నిర్మల మూర్తీ!
8,కం;-హరి హర భేదము లేదని
నిరువురు నొకటే యటంచు!నిహము నుతింపన్!
పరి పరి విధముల భేదము
సరిగా దది పాప యుతము!సరిగను మదినిన్!
9,కం:-హాలాహల విజృంభణ
కోలాహలమును గని మరి కుత్తుక నిడితే!
ఫాలాక్ష సురల కోరిక
పాలించిన పరమ శివా!పద్ధతి నీదే!
10,కం:-వెన్నుడు సిరి గొని సుఖ పడె
మిన్నంటెడి కీర్తి గనగ మ్రింగితి విషమున్!
చెన్నగు లోకపు టుపకరి!
మన్ననగా కంఠమం దమరగ నిడితే!
11.కం:-నుదుటను వేడిమి నిడుకొని
ముదమున గరళంపు మంట ముచ్చట నౌనా?
గుది బండని యెంచని హర
పదిలంబుగ శిగను గంగ పరమం బేర్చెన్!
12.కం:-నిరుపమ విక్రమ క్రమత, మ
విరళ జన రక్ష దక్ష విభవము గూర్చెన్!
కరములు మోడిచి మ్రొక్కెద
కరుణించుమి పరమ శివా!కలుముల నెలమిన్!
13,కం:-భృకుటిని దృష్ఠిని నిలుపుచు
సకలము శివ మయ మటంచు!సన్నుతి సేయన్!
వికల మనస్కుల మార్చెదు
టక టక కట కటలు బాపి!ఢమరుక పాణీ!
14.కం:-ఢమరుక పాణీ!శశి ధర!
కమరా!నటరాజ భోజ!కారుణ్య మయీ!
మమతా సమతల దేవా!
సుమ దామా!కర్పూర కళిక!సోయగ దేహా!
15.కం:-మమకార జగతి మాయలు
కమనీయము కాదటంచు!కలి"వివరింపన్!
తమకము గమకము శివ మని
మము బ్రోవగ నిల్చి తీవు!మహిమాన్వితుడా!
16,కం:-సు రుచిర ఫలములు తినుటలు
పర మరుదగు శివ జపమును!వరదములు సుమా!
మరువకు శివ వశదములను
నరులకు నిలుపోపు నట్టి!న్యాయం బదియే!
17,కం:-లలితము కలితము చేయకు!
మలిదుల దరి జేర నీకు!మాలిన్య మగున్!
సు లలితుల సుందర మూర్తుల
చెలిమిని శివ నామ స్మరణ!చేయుమి భక్తిన్!
18,కం:-పర పేడన తగ దేరికి
పర హింసే పాప మనుచు పద్ధతి నడుమా!
నరులం నారాయణు గను!
నరకంబుకు దూర మౌదు!నమ్ముమి శివునిన్!
జైహింద్.
11, ఫిబ్రవరి 2025, మంగళవారం
బృహత్ శ్రీధరీయము గ్రంథావిష్కరణ సందర్భముగా డా. మహాదేవమణి దంపతులకు చేయుచున్న సత్కారం.
0
comments
జైశ్రీరామ్.
10, ఫిబ్రవరి 2025, సోమవారం
ముదమొదవు.మొదలెరుగు.మోదము.నిధిగదె.నిధన.వాదిలు.దీక్షారతి.నిజ కీర్తి.వరదంబు ,సొదలెడము.వరదీక్షా.పదిలము.పదపడు.పరమార్ధ,గర్భ"సురార్ధక"వృత్తము,.. రచన...శ్రీవల్లభ.
0
comments
జైశ్రీరామ్.
జైహింద్.